ఏపీ ప్రజలకు బిగ్ షాక్.. ఆ నిర్మాణాల కూల్చివేత!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ల విషయంలో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణకు జనవరి 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని భావించిన క్రమంలో, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను, అదనపు అంతస్తులను కూల్చివేయడానికి ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఇచ్చింది.


ప్రధాన నగరాలలో అనధికార నిర్మాణాలు.. వారికి షాక్ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఏపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ మార్గదర్శకాలు వెలువడక ముందే ప్రధాన నగరాలలో కొందరు అనధికార నిర్మాణాలను చేపట్టారు. ఈ క్రమంలో 2025 ఆగస్టు 31 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలను గుర్తించి, వాటిని తొలగించాలని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.

అనధికార నిర్మాణాల తొలగింపుకు ఆదేశం పురపాలక, నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు వీటి తొలగింపు విషయంలో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చి ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలను వెంటనే సేకరించాలని, అవి కట్ ఆఫ్ డేట్ తర్వాత నిర్మించారా లేదా అనేది గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ డేట్ తర్వాత నిర్మించిన వాటి క్రమబద్దీకరణకు నో ఛాన్స్ 2025 ఆగస్టు 31 తర్వాత చేపట్టిన అనధికార నిర్మాణాలను బిపిఎస్ లో క్రమబద్దీకరించే అవకాశం లేదని, కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు వారి పరిధిలోని అనధికారిక నిర్మాణాలను గుర్తించి వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో అనధికార నిర్మాణాలు జరగకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో వారిలో ఆందోళన ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆగస్టు 31 2025 తర్వాత చేపట్టిన అనధికారిక నిర్మాణాలను చేసిన యజమానులు వణికిపోతున్నారు. బి పి ఎస్ లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కూడా లేదని చెప్పడంతో ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి అనధికారిక లే అవుట్లను రెగ్యులరైజ్ చేసుకుంటున్న క్రమంలో, ఆగస్టు 31 తర్వాత కట్టిన వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం వీలు కాదని చెప్పడం వాటిని తొలగించాలని చెప్పడం వారికి నిజంగా షాక్ అనే చెప్పాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.