రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్..

రాష్ట్రంలోని రద్దీగా ఉంటే స్టేషన్లలో కాజీపేట, వరంగల్ కూడా ఉన్నాయి. కాజీపేట,వరంగల్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు నడుస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు.


అయితే ఈ రూట్స్ లో ప్రయాణించే ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది అని చెప్పొచ్చు. ఈ నెల 10 నుంచి కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాజీపేట-విజయవాడ మధ్య ఇంటర్ లాకింగ్ వర్క్ బ్లాక్ కారణంగా ఈనెల 10 నుంచి కాజీపేట జంక్షన్ నుంచి వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్లు, వరంగల్ కాజీపేట మీదుగా నడిచే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దు అయ్యాయి. పలు రైళ్లు దారి మల్లింపు కూడా చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్(67765) పుష్ ఫుల్, డోర్నకల్-కాజీపేట(67766) పుష్ ఫుల్, దోర్నకల్-విజయవాడ(67767)పుష్ ఫుల్, విజయవాడ-భద్రాచలం(67215) సింగరేణి ప్యాసింజర్, భద్రాచలం-విజయవాడ(67216) సింగరేణి ప్యాసింజర్, గుంటూరు-సికింద్రాబాద్(17201) రైళ్లు రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు సికింద్రాబాద్-గుంటూరు(17202)ఎక్స్ ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్(17234) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 10,11,15, 18,19,20వ తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్(12705) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు(12706) ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా రద్దు అయ్యాయి.

ఇక ఫిబ్రవరి 11,14,16,18,19, 20వ తేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్(12713) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ(12714) ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- LTT ముంబయి(18519) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు LTT ముంబై-విశాఖపట్నం(18520) ఎక్స్ ప్రెస్, ఈ నెల 18న మచిలీపట్నం-సాయి నగర్ షిరిడి(17208) ఎక్స్ ప్రెస్, 19న కాకినాడ పోర్టు-సాయినగర్ షిరిడి(17206) ఎక్స్ ప్రెస్, 20న సాయి నగర్ షిరిడి- కాకినాడ పోర్టు(17205) ఎక్స్ ప్రెస్ లు రద్దు అయినట్లు సమాచారం.