బెంగళూరు సిటీ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది స్టాఫ్ట్‌వేర్ బూమ్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కేంద్రాలలో ఒకటి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బెంగళూరు సిటీ కేంద్రంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు, అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డెవలపర్‌లు, టెస్టర్‌లు , ఇతర IT నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం అధికంగా ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యువత బీటెక్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ వెళ్లేది బెంగళూరుకే.అయితే ప్రస్తుతం బెంగళూరుతో పనిచేస్తున్న తెలుగు టెక్కీలు మారిపోతున్న పరిస్థితులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా కన్నడిగులనే ఉద్యోగాల్లో నియమించుకోవాలనే రగడ కొనసాగుతోంది. కన్నడ రాష్ట్రంలో కన్నడ ప్రజలను ఉద్యోగాల్లో నియమించుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద చర్చకు దారితీశాయి.
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి చేసిన పోస్ట్ “కన్నడిగ వర్సెస్ అవుట్‌సైడర్స్” రచ్చ రచ్చ అవుతోంది. అతడు తన పోస్టులో కర్ణాటకలోని వ్యాపార యజమానులు ఇతర ప్రాంతాల ప్రజల కంటే స్థానిక ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రధాన్యం ఇవ్వాలని తన పోస్టు ద్వారా కోరాడు. ఈ క్రమంలో ఒక్కసారి మయూర వర్మ పేరుతో ఉన్న వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్టు చూసిన తెలుగు టెక్కీలు ఆందోళనకు గురవుతున్నారు. పోస్టులో ఉన్న విషయాన్ని పరిశీలిస్తే.. ప్రియమైన కన్నడిగులారా మీరు ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే స్థాయిలో పనిచేస్తున్నట్లయితే కచ్చింతంగా కన్నడిగులను నియమించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వండని సూచించాడు. కన్నడ ప్రజలు నైపుణ్యం కలిగినవారు. అయితే వారు కలిసిగట్టుగా ఉంచే గ్రూపులు లేకపోవటమే కారణంగా పేర్కొన్నాడు. ఇంకా ఎన్నాళ్ల పాటు కన్నడిగులు ఉద్యోగాల కోసం వీధుల్లో గొడవలు పడాలి. మన సొంత నగర వీధుల్లోనే మనం ఉద్యోగాల కోసం పోరాడటం మానాలని, నిర్థాక్షణ్యంగా నియామకాల్లో కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని పోస్ట్ చేశాడు.
దీనిపై సోషల్ మీడియాలో వ్యక్తుల స్పందనను పరిశీలిస్తే.. వెల్డింగ్, సీఎన్‌సీ, మిల్లింగ్, ఎలక్ట్రికల్ వర్క్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లేకనే బయటి ప్రజలకు డిమాండ్ పెరుగుతోందని ఒకరు కామెంట్ చేశారు. ఇదే క్రమంలో మరొకరు స్పందిస్తూ.. ఒరాకిల్, ఐబీఎం వంటి టాప్ కార్పొరేట్ కంపెనీలో బెంగళూరులోని కళాశాలల నుంచి ఉద్యోగులను నియమించుకోకుండా మారుమూల జిల్లాల్లోని తమిళులకు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఐటీ పరిశ్రమ లాబీయింగ్ కారణంగా ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లు విషయంలో వెనక్కి తగ్గిందన్నారు.
మరో వ్యక్తి కామెంట్ చేస్తూ కన్నడ ప్రజలు పొగరుబోతులని, ఉన్నత స్థాయిల్లో పనిచేయనప్పటికీ సీఈవో మాదిరిగా దబాయిస్తుంటారని పేర్కొన్నారు. బయటి ప్రాంతాల వ్యక్తులు పద్ధతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే మరోసారి కన్నడిగులకు ఉద్యోగాల చర్చ తెరమీదకు రావటంతో బెంగళూరులో నివసిస్తున్న తెలుగు టెక్కీల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.