పెట్రోల్ బంకుల్లో కార్డు స్వైప్ చేసేవారికి బిగ్ షాక్.. ఈ బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే

 జూలై 1, 2025 నుండి పలు బ్యాంకుల్లో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. క్రెడిట్ కార్డులు, థర్డ్-పార్టీ వాలెట్లు, IRCTC, ATM ఛార్జీలపై మార్పులు చేర్పులు చేపట్టారు. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

HDFC, ICICI బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారికి ఇది ముఖ్యమైన వార్త. వచ్చే నెల (జూలై 1, 2025) నుండి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఈ రూల్స్ మీ బ్యాంక్ అకౌంట్లపై డైరెక్ట్ గా ప్రభావం చూపనున్నాయి. కాబట్టి, జూలై 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే కీలక మార్పుల (New rules in banks) గురించి ఇప్పుడు తెలుసుకందాం.


జూలై 1, 2025 నుండి HDFC, ICICI బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల వాడకం, థర్డ్-పార్టీ వాలెట్ లావాదేవీలు (third party wallet transactions), IRCTC లావాదేవీలు, ATM ఛార్జీలకు సంబంధించిన ఈ నియమాలు మారుతాయి. దీని ఫలితంగా వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది.

థర్డ్-పార్టీ వాలెట్లలో (Third Party Wallet) రూ. 10,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1 శాతం ఛార్జీలు విధిస్తారు. అంతేకాకుండా.. రూ.15,000 కంటే ఎక్కువ ఇంధన లావాదేవీలపై (Card Swipe In petrol bunks) అదనంగా 1 శాతం ఛార్జీ ఉంటుంది. దీంతో పెట్రోల్ బంకులకు వెళ్లి.. క్రెడిట్ కార్డును స్వైప్ చేసి.. డబ్బు తీసుకునేవారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశం.

వీటితో పాటు మరికొన్ని మార్పులు జరగనున్నాయి. రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులపై (Utility Bill Payments) 1 శాతం అదనపు ఛార్జీ కూడా విధించబడుతుంది. లావాదేవీ పరిమితి (Transaction Limit) ముగిసిన తర్వాత ATMలలో కూడా అదనపు ఛార్జీలు విధించబడతాయి. ఆన్‌లైన్ చెల్లింపులతో పాటు.. ATM ఉపసంహరణలు కూడా నిషేధించబడతాయి.

నిన్నటివరకు ATMలలో 3 లావాదేవీల పరిమితిని దాటితే.. అదనంగా రూ. 21 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఛార్జీని రూ. 23కి పెంచారు. దీంతో, ATM నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కూడా కాస్త ఇబ్బందిగా మారనుంది.

ICICIలో తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా బాహ్య లావాదేవీలకు, లావాదేవీ మొత్తంపై ఆధారపడి ఛార్జీలు విధిస్తారు. రూ. 1,000 వరకు ఉన్న లావాదేవీలకు, ప్రతి లావాదేవీకి రూ. 2.50 ఛార్జ్ ఉంటుంది. రూ. 1,000 కంటే ఎక్కువ, రూ. 1,00,000 వరకు ఉన్న లావాదేవీలకు రూ. 5 రుసుము ఉంటుంది. రూ. 1,00,000 కంటే ఎక్కువ, రూ. 5,00,000 వరకు ఉన్న లావాదేవీలకు, ప్రతి లావాదేవీకి రుసుము రూ. 15 గా నిర్ణయించబడింది.

ఇక.. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ బ్యాంకు లావాదేవీల్లో పలు కీలక మార్పులను తీసుకొచ్చింది. ఇటీవలే SBIతో సహా HDFC, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరో 6 బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీని తగ్గించాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.