వైసీపీకి మరో గట్టి షాక్ తగలనుంది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలక నేతలందరూ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో..
ఆ పార్టీ సంక్షోభంలో ఉంది. తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా పార్టీని వీడనుండడం.. ఆ పార్టీకి గట్టి దెబ్బగానే భావిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి, విధానాలు నచ్చకే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అవంతి ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా అవంతి శ్రీనివాస్ ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు. వైసీపీ హయంలో అవంతి శ్రీనివాస్ పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. వైసీపీ ఏపీలో ఓడిన ఇలాంటి నేపథ్యంలో అవంతి పార్టీ వీడడంపై చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన, లేదా బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.
గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా వ్యవహరించారు. అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత గంటాతో కలిసి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే సీటు ఆశించినా ఎంపీ సీటు ఇవ్వటంతో అయిష్టంగానే పోటీ చేసారు. ఎంపీగా గెలిచారు. గంటా 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో అవంతి వైసీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రి అయ్యారు.