వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఇవాళ(ఆదివారం) నోటీసులు ఇచ్చారు.
పీడీపీపీ యాక్ట్ (ప్రజా ఆస్తికి నష్ట నిరోధక చట్టం) క్రింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ , డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ర్యాలీ , డీజే సౌండ్ ఏర్పాటు చేసి ప్రజలకు, స్కూల్స్ , ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించటంపై వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మాజీ మంత్రులు విడుదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బోల్లా బ్రహ్మానాయుడు , కాసు మహేష్ రెడ్డి , గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాష్, తదితర నేతలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు రావడంతో పోలీస్ స్టేషన్‌కి వైసీపీ నేతలు అన్నా బత్తుని శ్రావణ్, గజ్జల బార్గవ్ రెడ్డి వచ్చారు.
































