కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. కొత్తగా అప్లై చేసేవాళ్లు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది.
రేషన్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు ఎంత అవసరమో ఇది కూడా అంతే. రేషన్ కార్డు ఆధారంగానే చాలా వరకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతుంటాయి. ఎందుకంటే చాలా పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల కోసమే కాకుండా ఇతర ప్రయోజనాల కోసం చాలా మంది రేషన్ కార్డు కోసం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో రేషన్ కార్డు విషయంలో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం. ఈ విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ప్రస్తుతం ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నడుస్తోంది. అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డులు ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసేందుకు ఇకపై వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు. కొత్తగా పెళ్లయినవారు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పించాలనే నిబంధన ఇప్పుడు లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెళ్లి జరిగినట్టు ఏదైనా ఆధారం ఉంటే సరిపోతుంది. కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డుల్లో కొత్తగా సభ్యుల్ని చేర్చడం లేదా మార్పులు చేసే ప్రక్రియ నడుస్తోంది.
































