Bigg Boss సీజన్ 8 గ్రాండ్ లాంచ్ డేట్, టైం చెప్పేసిన నాగార్జున

www.mannamweb.com


బిగ్ బాస్ రియాల్టీ షో.. దీని గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశ వ్యాప్తంగా వివిధ భాషాల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ షో కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని భాషలతో పాటు తెలుగులోనూ ఈ షో సందడి చేస్తుంది. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని..త్వరలో ఎనిమిదవ సీజన్ లోకి అడుగు పెట్టనుంది. బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారంకి సంబంధించి ఇప్పటికే కీలక అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా మేకర్స్ మరో వీడియోను రిలీజ్ చేశారు. అందులో బిగ్ బాస్ 8 ప్రారంభం గురించి కింగ్ నాగార్జున క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

తాజాగా బుల్లితెర ప్రేక్షకలను, బిగ్ బాస్ ఫ్యాన్ ను బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ప్రారంభోత్సవానికి కింగ్ నాగార్జున్ ఆహ్వానించారు. “బిగ్ బాస్ హౌస్ గృహ ప్రవేశం, ఇంకా మూడు రోజుల్లోనే, తప్పకుండా రండి” అంటూ నాగ్ చెప్పిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ

వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభోత్సవాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మీద చాలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెర ఫ్యాన్స్ ఈసారి సీజన్ 8 నుంచి చాలానే ఊహించుకుంటున్నారు. వారికి తగినట్లుగా బిగ్ బాస్ మేకర్స్ కూడా గట్టిగానే ప్లా చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్ అందరికీ మంచి హోప్ ఇచ్చింది. అదే విధంగా తగినట్లుగానే ఈసారి కూడా ఉల్టాపుల్టాలు, ప్రేక్షకుల అంచనాలకు అందని టాస్కులు, నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈసారి బిగ్ బాస్ హౌస్ డిజైన్ ని చాలా కొత్తగా ప్లాన్ చేశారు అని తెలుస్తోంది.

హౌస్ లోని గదుల విషయంలో మాత్రం సీజన్ 7 స్ట్రాటజీనే వాడుతున్నారు అని టాక్. గత సీజన్ లో ఆ బెడ్ రూమ్ కాన్సెప్ట్ వల్ల గ్రూపులు ఏర్పడటం.. హౌస్ లో గొడవలు బాగా జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే వాడే ఛాన్సులు ఉన్నాయి. ఈసారి కూడా యాక్టివిటీ రూమ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రోమోల ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 గురించి క్లారిటీ ఇచ్చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుందో కూడా క్లారిటీ వచ్చింది. ఆ సమాచారం గురించి ఇప్పటికే మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు సంబంధించి విడుదలైన తాజా వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.