ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్. కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీసుల వల్ల చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రతి ఒక్కరి ఫోన్‌లో దాదాపు డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే ఉండే ఉంటుంది. దాదాపు బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఫోన్‌లో ఫోన్‌పే యాప్ వాడుతూ ఉంటారు. మీరు కూడా ఫోన్‌పే వాడుతూ ఉండొచ్చు. ఇలా ఫోన్‌పే వాడే వారికి అదిరే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భారీ ఊరట కలుగనుంది. మనీ ట్రాన్స్‌ఫర్ మరింత సురక్షితం కానుంది.
దిగ్గజ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే కొత్తగా ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ భద్రతా సౌకర్యాన్ని ప్రారంభించింది. మోసాల లావాదేవీల నుండి ఫోన్‌పే వాడే వారికి రక్షణ కల్పించడం దీని లక్ష్యం. ఈ వినూత్న సాధనం అనుమానాస్పద నంబర్లకు డబ్బు పంపకుండా హెచ్చరిస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ అప్రమత్తత సందేశం కనిపిస్తుంది. భద్రతా కారణాల వల్ల తిరస్కరించిన లావాదేవీల రిస్కులను సైతం ఇది వివరిస్తుంది. దీని వల్ల ఫోన్‌పే వాడే వారికి అవగాహన పెరుగుతుంది.
‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ పనితీరు – ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ సౌకర్యం టెలికమ్యూనికేషన్స్ శాఖ DoT అనుమానాస్పదంగా గుర్తించిన నంబర్లకు లావాదేవీలను గుర్తించి నిరోధిస్తుంది. ఇది DoT వారి ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ FRI సాధనం ద్వారా సాధ్యమవుతుంది. ఫోన్‌పే సిస్టమ్ ఇంటెలిజెన్స్ చెల్లింపుల సమయంలో ఈ రిస్కులను గుర్తిస్తుంది. వాడేవారు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రియల్ టైంలో నోటిఫికేషన్ల రూపంలో హెచ్చరికలు అందిస్తుంది.
DoT FRI ని ముందుగా స్వీకరించిన వేదిక ఫోన్‌పే. ఈ సౌకర్యాన్ని ఉపయోగించి చాలా ఎక్కువ FRI ఉన్న మొబైల్ నంబర్ల లావాదేవీలను నిరాకరించింది. తెరపై అప్రమత్తతను ప్రదర్శించింది. మీడియం FRI నంబర్ల విషయంలో లావాదేవీకి అనుమతి ఇచ్చే ముందు యాప్ చురుకైన హెచ్చరికను ఇస్తుంది. 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపించారు. FRI వంటి AI ఆధారిత సాధనాలను ఉపయోగించి సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో ఫోన్‌పే కృషికి గుర్తింపు లభించింది.
ఈ కొత్త సౌకర్యంతో చెల్లింపు భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఫోన్‌పే ట్రస్ట్ సేఫ్టీ హెడ్ అనుజ్ భన్సాలీ స్పష్టం చేశారు. “భద్రత ప్రతి లావాదేవీలో సజావుగా ఉండే ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనే మా దృష్టికోణాన్ని ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ తెలియజేస్తుంది” అని ఆయన అన్నారు. భారతదేశంలో సురక్షిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించడంలో, ఫోన్‌పే వాడేవారికి సురక్షిత సజావు అనుభవాన్ని అందించడంలో ఈ సౌకర్యం వారి పెద్ద ప్రయత్నంలో భాగం.
































