బిర్యానీ ఆకులతో చుండ్రు సమస్యను పోగొట్టుకోండిలా

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు కారణంగా జుట్టు బలహీన పడి.. ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల చిట్కాలు ట్రై చేసే ఉంటారు.

మీకు తెలిసిన షాంపూలు, నూనెలు, వంటింటి చిట్కాలు ఉపయోగించే ఉంటారు. వీటితో కొంత మందికి రిలీఫ్ వచ్చినా.. ఇంకొంత మంది ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు ట్రై చేయవచ్చు. మన వంటింటిలో లభ్యమయ్యే బిర్యానీ ఆకుతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. బిర్యానీ ఆకుతో కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మరి బిర్యానీ ఆకుతో చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ ఆకు హెయిర్ మాస్క్:

బిర్యానీ ఆకు ఉపయోగించడం వల్ల తలపై ఉండే వాపు, దురద, దద్దుర్లు, పొడి బారడం, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ముందుగా ఓ ఐదు లేదా ఆరు బిర్యానీ ఆకులను తీసుకుని అందులో కొద్దిగా నీటిని వేసి ఉడకబెట్టాలి. ఆకులు బాగా ఉడికా.. స్టవ్ ఆఫ్ చేసి.. చల్లార్చి మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా వేప ఆయిల్ ఉంటే వేసి కలపండి. అలోవెరా జెల్, ఉసిరి పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. ఓ ఐదు నిమిషాలు మసాజ్ చేసి.. పావు గంట సేపు అలానే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే బెటర్.

బిర్యానీ ఆకుల రసంతో:

బిర్యానీ ఆకుల రసంతో కూడా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. నాలుగు లేదా 5 బిర్యానీ ఆకుల్ని నీటిలో మరిగించాలి. చల్లారాక కొద్దిగా కొబ్బరి నూనె రాసి.. తలకు బాగా పట్టించాలి. ఇన్ ఫెక్షన్లు, మొటిమలు, డ్రైనెస్ వంటివి దూరమవుతాయి. చుండ్రు తగ్గి.. జుట్టు మూలాలు కూడా బలంగా ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించినా హెయిర్ కండిషనర్‌గా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)