రెగ్యులర్ ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడితే కలిగే లాభాలివే

www.mannamweb.com


నల్ల ఉప్పులో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. హిమాలయన్ బ్లాక్ సాల్ట్, బ్లాక్ లావా సాల్ట్, బ్లాక్ రిచ్యువల్ సాల్ట్. ఈ మూడింటిలో ఒక్కొక్కటి ఒక్కో గుణం కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

హిమాలయ నల్ల ఉప్పు..
ఈ ఉప్పుని చాలా మంది వాడతారు. కాలా నమక్ అని పిలిచే ఈ ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఘాటైన, రుచికరంగా ఉండే ఈ ఉప్పుని చాలా మంది వంటల్లో వాడతారు. దీనిలో గుడ్డులో వచ్చే సల్ఫరస్ వాసన లాంటిది ఉంటుంది. దీంతో వెజ్ ఐటెమ్స్‌కి నాన్‌వెజ్ టచ్‌ని ఇచ్చే వంటల్లో ఎక్కువగా వాడతారు.

బ్లాక్ లావా సాల్ట్..
ఈ బ్లాక్ లావా ఉప్పుని హవాయి బ్లాక్ సాల్ట్ అంటారు. ఎందుకంటే, ఇది హవాయి నుండి వస్తుంది. ఇది చూడ్డానికి కాస్తా పింక్, క్రీమ్ కలర్‌లో ఉంటుంది. ఇది కాస్తా మట్టి రుచిని అందిస్తుంది. వంట చేశాక చివర్లో ఈ ఉప్పు చల్లాలి. దీంతో వంటకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ ఇష్టపడేవారు దీనిని హ్యాపీగా తినొచ్చు.

బ్లాక్ రిచువల్ సాల్ట్..
ఇది చూడ్డానికి నల్లగా ఉంటుంది. కాస్తా బూడిద రంగులో ఉంటుంది. దీనిని వంటల్లో వాడతారు. దీని వల్ల మంచి రుచి వస్తుంది. కాబట్టి, దీనిని కూడా ఇష్టంగా వాడతారు.

హెల్త్ బెనిఫిట్స్..
సాధారణంగా టేబుల్ సాల్ట్ కంటే ఈ నల్ల ఉప్పుని వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుంది.
వీటిని మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని తీసుకుని వాడొచ్చు.
ఇందులో రెగ్యులర్ ఉప్పుకంటే తక్కువ సోడియం ఉంటుంది.
సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గుతుంది.
ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి.
ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.
అంతేకాదు, చర్మం, జుట్టు సమస్యలని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది.
అయితే, ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్‌ని అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదే విధంగా, తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.