మెడ మీద నలుపుతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి

www.mannamweb.com


పండగ, శుభకార్యాలు ఏమైనా సరే మహిళలు తమ నగలు, బట్టలు, అలంకరణపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మెహందితో చేతుల అందం పెరుగుతుంది. నగలతో మగువ అందం మరింత పెరుగుతుంది.

అయితే చాలా మంది స్త్రీలు మెడ నల్లదనాన్ని పట్టించుకోరు. మెడ మీద ఉన్న ఈ నలుపు కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేజర్ లేదా ఖరీదైన చికిత్స ద్వారా మెడ నలుపుని చాలా వరకు తగ్గించవచ్చు. అయితే మెడ మీద నలుపుని పూర్తిగా తొలగించడం అందరికీ సాధ్యం కాదు. మెడపై ఉన్న ఈ నలుపుని కొన్ని వంటింటి చిట్కాల ద్వారా తగ్గించవచ్చు లేదా తొలగించవచ్చు.

మెడపై నలుపుతో ఇబ్బంది పడుతుంటే.. దాన్ని తగ్గించే కొన్ని చర్మ సంరక్షణ హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. కనుక వాటిని ఉపయోగించడం వలన ఏదైనా అలెర్జీ వచ్చే భయం ఉంది. కనుక మెడ నలుపు పోగొట్టుకోవడానికి ఈ హోం రెమెడీస్ తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇవ్వగలవు. వాటి గురించి తెలుసుకుందాం..

నలుపు ఎందుకు వస్తుంది?

మెడ, మోచేతులు, మోకాళ్లపై చర్మం ముదురు రంగులో ఉంటుంది. తెల్లగా ఉన్నాసరే ఈ ప్రాంతంలో నల్లటి చర్మం ఉంటుంది. దీనికి గల కారణం కొంతమందికి తెలియదు. శరీరంలోని కొన్ని భాగాల్లో మెలనిన్ ఎక్కువగా ఉంటుందని..అందుకే ఆ ప్రాంతంలోని చర్మం ఇతర ప్రాంతాల కంటే కాస్త నల్లగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన రంగు మెలనిన్ ద్వారా నిర్ణయించబడుతుంది. భారతీయులలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన దేశంలో చాలా మంది ప్రజలు ముదురు రంగులో ఉంటారు.

ఇలా మెడ మీద నలుపును పోగొట్టడం ఎలా అంటే

బంగాళాదుంప రసం

చర్మంపై టానింగ్ లేదా డార్క్‌నెస్ ఉంటే దాన్ని వదిలించుకోవడానికి బంగాళాదుంప రసాన్ని అప్లై చేయాలి. బంగాళాదుంప రసంలో ఉండే స్టార్చ్ చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేస్తుంది. అంతేకాదు స్కిన్ మెరిసేలా చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంప రసాన్ని ఒక గిన్నెలో తీసుకుని మెడ, మోచేతులు లేదా ఇతర నల్లటి చర్మం ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయండి. ఈ రసం ఆరిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. కావాలంటే ఈ రసాన్ని ముఖం మీద అప్లై చేయడం ద్వారా టానింగ్ తగ్గించుకోవచ్చు. అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.

బేకింగ్ సోడా నిమ్మకాయ

మెడ మీద నలుపుని తగ్గించడానికి బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో అర నిమ్మకాయ రసాన్ని తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలపండి. ఈ రెండింటిలో అసిడిక్ గుణాలు ఉండటం వల్ల చర్మంపై నల్లదనాన్ని తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని మెడ మీద నలుపు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత దీనిని తొలగించండి.

కాల్గేట్‌లో నిమ్మ, పసుపు, బేకింగ్ సోడా

మెడ లేదా మోచేతులపై నలుపుని తగ్గించడానికి కోల్గేట్ టూత్‌పేస్ట్ కూడా ఉత్తమ ఎంపిక. చర్మాన్ని శుభ్రం చేయడానికి కోల్గేట్ క్లీనింగ్ హక్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి కోల్గేట్, నిమ్మకాయ, పసుపు, బేకింగ్ సోడాతో కూడినది. ఒక గిన్నెలో కొంచెం కోల్గేట్ తీసుకుని అందులో నిమ్మరసం, పసుపు, బేకింగ్ సోడా వేయాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి వాడిన నిమ్మతొక్కతో మసాజ్ చేయాలి. ఈ టిప్ ప్రభావం క్షణాల్లో కనిపిస్తుంది.

పసుపు వంటకం నిమ్మరసం

పసుపుతో మీ చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్ ఏజెంట్. పసుపులో ఉండే మూలకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అర టీస్పూన్ పసుపులో నిమ్మరసం మిక్స్ చేసి నలుపు ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లాగా పూయండి. ఆరిన తర్వాత ఆ మాస్క్ ను తొలగించడానికి సాధారణ నీటిని ఉపయోగించండి. చివర్లో మాయిశ్చరైజర్ అప్లై చేయడం మరచిపోవద్దు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )