OTTలో.. సీట్ ఎడ్జ్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్! క్లైమాక్స్‌ అయితే మైండ్ బ్లాంకే.. డోంట్‌మిస్‌

క‌న్న‌డ‌లో మార్చి 8న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన బ్లింక్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. మొద‌ట‌ త‌క్కువ స్క్రీన్ల‌లోనే విడుద‌లైన ఈ సినిమా ఆ త‌ర్వాత‌ మౌత్‌టాక్‌తో అంత‌కంత‌కు స్క్రీన్ల సంఖ్య‌ను పెంచుకుంటూ పోయారు. ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ బ్లింక్ (Blink) సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్ష‌కులను కూడా బాగా థ్రిల్ చేస్తోంది. మ‌న‌వాళ్లు కూడా ఇలాంటి సినిమా తీశారా అనిపించేలా చేసింది.


ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం యాక్ష‌న్‌,సెంటిమెంట్, ల‌వ్, రివేంజ్‌, ఫిక్ష‌న్, టైమ్ లూప్‌ అంటూ ఇలా దాదాపు 10, 15 ర‌కాల జాన‌ర్ల‌లో సినిమాలు చూసి ఉంటాం. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే సినిమా అలాంటి ఓ జానర్‌కు చెందిందే కానీ ఇంత గ్రిప్పింగ్‌గా, ఆస‌క్తిక‌రంగా తీస్తారా అనేది ఈ సినిమా చూసేదాక తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు. ఆ సినిమా పేరు బ్లింక్ (Blink). క‌న్న‌డ‌లో మార్చి 8న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. మొద‌ట‌ త‌క్కువ స్క్రీన్ల‌లోనే విడుద‌లైన ఈ సినిమా ఆ త‌ర్వాత‌ మౌత్‌టాక్‌తో అంత‌కంత‌కు స్క్రీన్ల సంఖ్య‌ను పెంచుకుంటూ పోయారు. ఇటీవ‌లే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ బ్లింక్ (Blink) సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్ష‌కులను కూడా బాగా థ్రిల్ చేస్తోంది. మ‌న‌వాళ్లు కూడా ఇలాంటి సినిమా తీశారా అనిపించేలా చేసింది.

తెలుగులో నాని క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన ద‌స‌రా సినిమాలో రెండో హీరోగా చేసిన క‌న్న‌డ న‌టుడు దీక్షిత్ షెట్టి (Dheekshith Shetty) హీరోగా మ్యూజిక‌ల్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ బ్లింక్ (Blink) చిత్రం తెర‌కెక్కింది. చైత్ర ఆచార్ (Chaithra J. Achar), మందార బత్తలహళ్లి (Mandara Battalahalli), గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే (Gopalkrishna Deshpande) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు పైగా ఇండియాలోనే ఈ జాన‌ర్‌లో రూపొందిన మొట్ట‌మొద‌టి సినిమా ఇదే అవ‌డం విశేషం. శ్రీనిధి బెంగ‌ళూరు (Srinidhi Bengaluru) ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయ‌డ‌మే కాక క‌థ, స్క్రీన్‌ప్లే అందించ‌డం గ‌మ‌నార్హం. మ‌నంద‌రికీ తెలిసిన టైం ట్రావెలింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే..

అపూర్వ (దీక్షిత్ షెట్టి ) సిటీలో పీజీ (MA) చ‌దువుతూ ఉంటాడు. త‌ను అందులో ఫెయిల్ అయిన విష‌యం త‌ల్లి ద‌గ్గ‌ర‌ దాచి ఇంటి అర్థిక అవ‌స‌రాల కోసం పార్ట్ టైం జాబ్‌ల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఈక్ర‌మంలో త‌న గ‌ర్ల్‌ప్రెండ్ స్వ‌ప్న సాయం తీసుకుంటాడు. అంతేగాక ఓ డ్రామా కంపెనీలో మెంబ‌ర్స్ అవ‌డంతో త‌రుచూ ఇద్ద‌రు అక్క‌డ రిహార్స‌ల్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈక్ర‌మంలో ఉన్న‌ట్టుండి ఓ మ‌ధ్య వ‌య‌స్కుడు, అచ్చం త‌న‌లాగే ఉండే మ‌రో మ‌నిషి అపూర్వ‌కు మాత్ర‌మే రెండు మూడు సార్లు క‌నిపించి మాయ‌మైపోతారు. దీంతో త‌న‌కు ఏదో అవుతుంద‌నే డిఫ్రెష‌న్‌లోకి వెళ‌తాడు.

త‌ర్వాత కొద్ది రోజుల‌కు త‌న‌కు ఓ జాబ్ ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డికి వెళ్లగా త‌న‌కు అంత‌కుముందు క‌నిపించి మాయ‌మైన‌ మ‌ధ్య వ‌య‌స్కుడు క‌నిపిస్తాడు. నేనే నిన్ను ఇక్క‌డ‌కు ర‌ప్పించాన‌ని నీ తండ్రి గురించి తెలుసా.. అత‌ను ఎలా మ‌ర‌ణించాడో తెలుసుకోవాలంటే నేను చెప్పిన ప‌ని చేయాల‌ని డ‌బ్బులు ఇస్తాన‌ని చెబుతాడు. మొద‌ట అంగీక‌రించ‌ని అపూర్వ త‌ర్వాత ఒకే చెప్ప‌డంతో అ మ‌ధ్య వ‌య‌స్కుడు ఓ ఐ డ్రాప్స్ , ఓ వాచ్ ఇచ్చి వీటితో నువ్వు టైం ట్రావెల్ చేయాల‌ని చెబుతాడు. డ్రాప్స్ వేసుకున్నాక కండ్లు బ్లింక్ చేయ‌కుండా ఎంత‌సేపు ఉండ‌గ‌ల‌వో అంత సేపు అక్క‌డ ఉండొచ్చ‌ని బ్లింక్ చేస్తే తిరిగి ప్ర‌జెంట్ డేకు వ‌స్తావ‌ని చెబుతాడు.

దీంతో అపూర్వ టైం ట్రావెల్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు.. ఇక ఆ త‌ర్వాత ఎలాంటి విష‌యాలు తెలిశాయి, ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నేదే అస‌లు క‌థ‌. అపూర్వ టైం ట్రావెల్ చేసి వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదో కొత్త విష‌యం బ‌య‌ట ప‌డి ప్రేక్ష‌కుల‌ను షాక్ గురి చేస్తుంటాయి. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌నిపించిన త‌న‌లాగే ఉన్న‌ యువ‌కుడెవ‌రు, ఆ మ‌ధ్య వ‌య‌స్కుడు ఎవ‌రు, అపూర్వ‌కు వారితో ఉన్న‌ సంబంధమేంటి, తండ్రిని ర‌క్షించుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్ట‌డం ఖాయం. ముఖ్యంగా చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. చివ‌ర‌కు హీరో చేసిన ప‌ని కూడా అలోచింప‌చేస్తుంది. సంగీతం ఈ చిత్రానికి చాలా ఫ్ల‌స్ కాగా బ్లింక్ (Blink) సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే.. మొద‌టి ఫ్రేం నుంచి ఎక్క‌డా మిస్ చేయ‌కుండా చూస్తేనే ఈ సినిమాను అర్ధ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. లేకుంటే చాలామంది క‌న్ప్యూజ్ అవ‌డం మాత్రం గ్యారెంటీ. ఈ బ్లింక్ (Blink) సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా కేవ‌లం క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. తెలుగు వారికి కాస్త ఇబ్బందైనా ఇంగ్లీష్ స‌బ్‌టైటిల్స్ ఉండ‌డంతో సినిమా చూస్తున్నంత సేపు లాంగ్వేజ్ ఇష్యూ అనిపించ‌దు. మంచి థ్రిల్ల‌ర్‌, సైన్స్ ఫిక్ష‌న్ చూడాల‌నుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయ‌కండి.