Sunday, December 14, 2025

ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా రేషన్ కార్డు..

పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలను అందించడంలో కీలకమైన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.

గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేది. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సులభంగా సేవలు పొందేందుకు వీలు కల్పించింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పుల కోసం ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ సహాయకులకు అప్పగించారు.

కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డు కాగా పెళ్లైన జంటలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు పెద్ద తతంగం లేదు. కొన్న డాక్యుమెంట్స్ ఉంటేనే సరిపోతుంది. భార్యాభర్తల ఆధార్ కార్డు వివరాలు, భర్త పాత రేషన్ కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రం ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సమీపంలోని సచివాలయానికి వెళ్లి డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వారు వెబ్‌సైట్‌లో మ్యారేజీ స్ల్పిట్‌ ఆప్షన్‌ కింద వివరాలు నమోదు చేస్తారు. నమోదు తర్వాత ఈకేవైసీ పూర్తి చేసి, స్థానిక వీఆర్వో, తహసీల్దారు పరిశీలన అనంతరం కొత్త కార్డు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పిల్లల పేర్ల నమోదు పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా చాలా సులభమైంది. పిల్లల ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలతో సచివాలయంలోని డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వీఆర్వో, తహసీల్దారు అనుమతి రాగానే రేషన్ కార్డులో కొత్త పేర్లు చేరుస్తారు.

చిరునామా మార్పు, ఇతర సేవలు కొత్త కార్డులు, పేర్ల నమోదుతో పాటు రేషన్ కార్డులలో చిరునామా మార్పునకు కూడా ప్రభుత్వం సచివాలయాల ద్వారా అవకాశం కల్పించింది. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను నిరంతరం చేసినప్పటికీ కార్డులు జారీ చేయడానికి సమయపాలన నిర్ణయించింది. జనవరి – జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జులై నెలలో కొత్త బియ్యం కార్డులు అందిస్తారు. జులై – డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.

పొగమంచు ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం

శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లMý ు ఇరువైపులా పొగమంచు హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులోగానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేయడం మధురానుభూతి కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉందన్నది డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్‌ బస్సు లోయలోపడి ప్రమాదానికి గురికావడంతో 9మంది దుర్మరణం చెందడంతోపాటు 37మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పొగమంచును బస్సు డ్రైవర్‌ సరిగా అంచనా వేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది.

అందుకే శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్‌ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్‌ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్‌లీ హిల్స్‌ వంటి ఘాట్‌ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

చేయాల్సినవి…
» లో బీమ్‌ హెడ్‌లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్‌ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
» పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్‌లైట్లు ఆన్‌ చేయాలి.
» టైల్‌ ల్యాంప్స్‌ను క్లీన్‌గా ఉంచాలి. స్పష్టంగా కనిపించేట్టుగా ఉండాలి.
» బ్రేక్‌ లైట్లు కచ్చితంగా పనిచేసేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు గుర్తించగలరు.
» వాహనంలో టూల్‌ కిట్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
» రోడ్లపై ఉన్న లైన్‌ మార్కింగ్‌లను గమనిస్తూ.. తదనుగుణంగా డ్రైవింగ్‌ చేయాలి. రోడ్డుకు కుడి, ఎడమ చివర్లో ఉన్న లైన్లను దాటి వెళ్లకూడదు. ఒక లైన్‌ నుంచి మరో లైన్‌లోకి మారేటప్పుడు వెనుక, పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతే లైన్‌ మారాలి.
» వాహనం వైపర్లు సరిగా పని చేసేట్టుగా చూసుకోవాలి.
» వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే… రోడ్డుకు ఎడమవైపు లైన్‌లోనే నిలపాలి.
» ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని
నడపాలి.
» రోడ్డు సరిగా కనిపించడంలేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్‌ ప్రదేశాలు, సమీపంలోని దాబాలు, పెట్రోల్‌ బంకులు, టోల్‌ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్‌ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి.
» విండ్‌ షీల్డ్‌ క్లీన్‌గా ఉండాలి. యాంటీ ఫాగింగ్‌(డీ ఫాగర్‌) మోడ్‌లో వాహనం ఉంచి నడపాలి.

చేయకూడనివి…
» మితివీురిన వేగంతో ప్రయాణించవద్దు. పరి మిత వేగంతోనే డ్రైవింగ్‌ చేయాలి. వాహనం ఎప్పుడూ డ్రైవర్‌ నియంత్రణ ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి.
»దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓవర్‌ టేక్‌ చేయకూడదు.
» క్రూయిజ్‌ కంట్రోల్‌ మోడ్‌లో వాహనాన్ని నడపకూడదు.
» డ్రైవింగ్‌ చేస్తున్నపుడు డ్రింక్స్‌ తాగడం గానీ ఏమైనా తినడంగానీ చేయకూడదు. పొగ తాగకూడదు.
» ఎదురుగా వాహనం వస్తుంటే హైబీమ్‌ లైట్లను ఫ్లాష్‌ చేయ కూడదు.
» డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు హజార్డ్‌ (త్రికోణాకృతి)లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌ చేయకూడదు. వాహనాన్ని పార్క్‌ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్‌ లైన్లను ఆన్‌ చేసి ఉంచాలి.

అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే మూడు పెళ్లిళ్లు ఒక సహజీవనం

తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 650కి పైగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీ.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆయా సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే.. కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా తమ సినిమాల్లో టిపికల్‌ క్యారెక్టర్‌ వుంటే దానికి లక్ష్మీనే సంప్రదించేవారు. ఆమె కూడా అలాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడేవారు.

ఎందుకంటే స్వతహాగా లక్ష్మీ ఒక టిపికల్‌ క్యారెక్టర్‌. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మగా, అక్కగా, వదిగా.. ఇలా ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు.

ఇప్పటికీ తనకు తగిన క్యారెక్టర్‌ వస్తే చేస్తున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సరసన ఎంతో వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని నటనకుగాను స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డును అందుకున్నారు లక్ష్మీ. 1952 డిసెంబర్‌ 13న వై.వి.రావు, రుక్మిణి దంపతులకు మద్రాస్‌లో జన్మించారు లక్ష్మీ.

ఆమె పూర్తి పేరు యారగుడిపాటి వెంకట మహాలక్ష్మీ. తండ్రి వై.వి.రావు నటుడు, దర్శకుడు. తల్లి రుక్మిణి కూడా పలు సినిమాల్లో నటించారు. అలా లక్ష్మీకి కూడా సినిమాలపై ఆసక్తి కలిగింది.

1968లో విడుదలైన ‘జీవనాంశం’ అనే తమిళ సినిమాలో తొలిసారి నటించారు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆ సినిమాలోని నటనకు ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సంవత్సరం ఎస్‌.వి.రంగారావు దర్శకత్వంలో వచ్చిన ‘బాంధవ్యాలు’ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యారు.

ఇక ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ స్పీడ్‌ను చూసి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1969లో భాస్కరన్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. అతను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసేవారు.

వీరిద్దరి సంతానమే ఐశ్వర్య. తర్వాతి కాలంలో ఆమె కూడా నటిగా కొన్ని సినిమాల్లో నటించారు. కొన్నాళ్లపాటు భాస్కరన్‌, లక్ష్మీ వైవాహిక జీవితం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 1974లో విడాకులు తీసుకున్నారు.

అదే సంవత్సరం ఆమె మలయాళంలో నటించిన ‘చట్టకారి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలోని జూలీ పాత్ర ఆమెకు విపరీతమైన పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డుతోపాటు, కేరళ స్టేట్‌ అవార్డు కూడా ఆమెను వరించింది. ఈ చిత్రాన్ని లక్ష్మీతోనే ‘జూలీ’ పేరుతో హిందీలో రీమేక్‌ చేసింది విజయ ప్రొడక్షన్స్‌ సంస్థ.

హిందీలో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఉత్తమనటిగా మరోసారి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు లక్ష్మీ. ‘చట్టకారి’ చిత్రం చేస్తున్న సమయంలోనే అందులో హీరోగా నటించిన మోహన్‌శర్మ ప్రేమలో పడ్డారు లక్ష్మీ. ఒకరోజు ఒక హోటల్‌కి అతన్ని ఆహ్వానించి తను ప్రేమిస్తున్న విషయం చెప్పారు.

అతను కూడా ఓకే చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం పెళ్లి చేసుకోవాలని కోరింది. వెంటనే నుదుటిపై బొట్టు పెట్టి లక్ష్మీని భార్యగా స్వీకరించారు మోహన్‌. అంతేకాదు, తమ శోభనం కూడా తక్షణమే జరిగిపోవాలని కూడా చెప్పడంతో అదే హోటల్‌లో శోభనం జరుపుకున్నారు. చిన్నతనం నుంచి ముక్కు సూటిగా వుండే మనస్తత్వం లక్ష్మీది.

ఎవరినీ లెక్క చేసేవారు కాదు. ఒకరి గురించి తన జీవితాన్ని మార్చుకునే మనస్తత్వం కాదు. తనకు నచ్చినట్టు ఉండడానికే ఇష్టపడేవారు. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసేసుకునేవారు.

అలా తీసుకున్న నిర్ణయమే మోహన్‌తో పెళ్లి. రెండో భర్తతో కూడా ఎక్కువ కాలం ఆమె కాపురం చేయలేకపోయారు. లక్ష్మీ స్పీడ్‌కి మోహన్‌శర్మ తట్టుకోలేకపోయారు. ఫలితంగా మనస్పర్థలు రావడంతో 1980లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

1987 వరకు ఒంటరిగానే ఉన్న లక్ష్మీ.. తమిళ దర్శకుడు శివచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక పాపను వీరు దత్తత తీసుకున్నారు. ఆమె పేరు సంయుక్త.

అయితే మధ్యలో కన్నడ నటుడు అనంత్‌నాగ్‌తో కొన్నాళ్లు సహజీవనం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన లక్ష్మీ వైవాహిక జీవితం ఇన్ని మలుపులు తిరగడానికి ఆమె తీసుకునే తొందరపాటు నిర్ణయాలే కారణమని చెబుతుంటారు. ఆమెకు జరిగిన పెళ్లిళ్ల క్రమాన్ని చూస్తే అది అర్థమవుతుంది.

శబరిమల వద్ద ట్రాక్టర్ ప్రమాదం.. తొమ్మిది మంది భక్తులకు గాయాలు

 శబరిమల (Sabarimala) సన్నిధానం వద్ద శనివారం సాయంత్రం 6:10 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. కొండ దిగుతున్న భక్తుల గుంపుపైకి వ్యర్థాలను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది.

ఈ ఊహించని ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం తొమ్మిది మంది భక్తులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు గాయపడిన భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది మంది గాయపడినప్పటికీ, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ భక్తులు ఎంత మంది గాయపడ్డారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శబరిమల యాత్రికుల రద్దీ సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలయ భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీసింది.

గుండెపోటుతో క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన పదో తరగతి విద్యార్థిని

ఏపీలో దారుణం జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సిరి గుండెపోటుతో మృతిచెందింది.

క్లాస్‌రూమ్‌లో పాఠాలు వింటుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

ఇది గమనించిన టీచర్లు, ఇతర సిబ్బంది హుటాహుటిన సిరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆమె మరణించినట్లుగా వైద్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచంలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగవేమో – ఉత్తరకొరియాలో కిమ్ జాంగ్‌ పార్టీకి 99.91 శాతం ఓట్లు

ఉత్తర కొరియా రాజకీయాల్లో మరోసారి ‘పర్ఫెక్ట్’ ఫలితాలు నమోదయ్యాయి. కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (WPK) ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 99.91% ఓట్లతో విజయం సాధించింది.

ఓ రకంగా ఆయనపై వ్యతిరేకత కించిత్ పెరిగిందని అనుకోవాలి. గత ఎన్నికల్లో ఎన్నికల్లో 100% ఓట్లు పొందారు. ఈ సారి 0.09 శాతం వ్యతిరేకత వచ్చింది. ఈ ఫలితాలు నార్త్ కొరియా మీడియాలో ప్రకటించారు.

ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి చెందిన ఈ ఎన్నికలు గత వారంలో దేశవ్యాప్తంగా జరిగాయి. అధికారికంగా, 99.99% ఓటర్లు పాల్గొన్నారు, . WPK అభ్యర్థులకు దాదాపు అందరూ మద్దతు తెలిపారు. “ఇది ప్రజల స్వచ్ఛమైన మద్దతు” అని కిమ్ జాంగ్ ఉన్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. 0.09% మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది 2023 మార్చ్ ఎన్నికల్లో 100% మద్దతు పొందాు.

ఉత్తర కొరియా ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఒక అసాధారణ దృశ్యం. అభ్యర్థులు ముందుగానే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఓటర్లకు ‘అవును’ లేదా ‘కాదు’ అనే ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. 2014 ఎన్నికల్లో WPKకు 100% ఓట్లు వచ్చాయి. 2019లో 99.99% టర్నౌట్ రికార్డు. 2023లో మొదటిసారిగా ‘దిసెంటింగ్ వోట్స్’ ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్య ఇమేజ్ను పెంచడానికి మాత్రమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలు దేశంలోని ఆర్థిక సంక్షోభాల మధ్య జరిగాయి. కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకారం, ఓటర్లు ప్రియమైన నాయకుడు కిమ్ జాంగ్ ఉన్కు అచంచల మద్దతును” చూపారు. అయితే, అంతర్జాతీయంగా ఈ ఫలితాలు హాస్యాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో “అరుదైన 0.09% డిసెంట్” అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతోంది. ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ ఫలితాలను ప్రజల స్వేచ్ఛా ఎంపిక గా ప్రజల్లో ప్రచారం చేస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు దీన్ని ఎన్నికలు కాదని అంటున్నాయి.

ప్రతి నియోజకవర్గంలో ఒకే ఒక అభ్యర్థి మాత్రమే ఉంటాడు. ఈ అభ్యర్థులను ముందుగానే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు కలిసిన ‘డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది రీయూనిఫికేషన్ ఆఫ్ కొరియా’ ఎంపిక చేస్తాయి. ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కొరియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, చొండోయిస్ట్ చొంగు పార్టీ అవి కూడా WPKకు లోబడి ఉంటాయి. ఎవరూ పోటీ చేయడానికి అవకాశం లేదు. 17 ఏళ్లు పైబడిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు రహస్యంగా ఉంటుందని రాజ్యాంగం చెప్పినప్పటికీ, వాస్తవంగా అలా కాదు. బ్యాలెట్ పేపర్లో ఒకే పేరు ఉంటుంది. ‘అవును’ అంటే దాన్ని మడతపెట్టి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ‘కాదు’ అంటే పేరును గీత క్రాస్ చేసి వేయాలి. కానీ ఇలా చేయడానికి ప్రత్యేక బూత్ ఉంటుంది. అక్కడికి వెళ్లడం వల్ల పరిశీలకులు గమనిస్తారు. దీని వల్ల వ్యతిరేక ఓటు వేసినవారికి కఠిన శిక్షలు పడతాయి.గతంలో క్రాస్ చేయడం ద్వారా వ్యతిరేకత చూపేవారు. కానీ 2023లో ఎన్నికల చట్టం సవరణ తర్వాత కొన్ని స్థానిక ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్ బాక్స్లు ప్రవేశపెట్టారు.

90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!

ధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్‌ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది.

దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్‌ గో అనే ఫిట్‌నెస్ కోచ్ ఇన్‌స్టా పోస్ట్‌ నెట్టింట ఇంట్రిస్టింగ్‌ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?

సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్‌ చేశారు.

 

 

నడక వేగం
ఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్‌ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.

విశ్రాంతి హృదయ స్పందన రేటు
లో రెస్టింగ్‌ హాట్‌ బీట్‌ రేట్‌ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్‌గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.

కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్ష
డాన్‌ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్‌సైజ్‌ చేయగలరు.

బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)
దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్‌ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్‌గా ఉన్నట్టు.

ఒక మైలు పరుగు సమయం
ఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్‌నెస్ స్థాయికి స్నాప్‌షాట్‌ లాంటిది. ఎంత ఫిట్‌గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.

నోట్‌ : ఆరోగ్య , ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం.

ఇంటర్‌ పరీక్షల్లో భారీ మార్పులు

సిలబస్‌కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన

అన్ని పేపర్లు 100 మార్కులకు ఉండేలా కూర్పు

సైన్స్‌ సబ్జెక్టులకు 85 మార్కులకు పేపర్, రెండో ఏడాదిలో 30 మార్కులకు ప్రాక్టికల్స్‌

బోటనీ 43, జువాలజీ 42 మార్కులకు వేర్వేరు పేపర్లు

సిలబస్‌ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్‌

తొలిసారి ఒక్క మార్కుల ప్రశ్న విధానం

ఈసారికి ఇంటర్‌ రెండో ఏడాదికి పాత పరీక్షా విధానమే అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యలో 2025-26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను అమలు చేసిన బోర్డు.. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. ప్రశ్నల సరళి, మార్కుల కూర్పు సైతం మారనుంది. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, పరీక్షలకు సీబీఎస్‌ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్‌ సిలబస్‌లో ఈ ఏడాది మార్పులు చేశారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సిలబస్‌ మారిన సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు.

సిలబస్‌ మారని సబ్జెక్టులకు 24 పేజీల బుక్‌లెట్‌ ఉంచారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్‌ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్‌ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు.

అమల్లోకి ఐదు సబ్జెక్టుల విధానం
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, మూడు మెయిన్‌ సబ్జెక్టులు (మొత్తం ఐదు) ఉన్నాయి. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, 4 మెయిన్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ తప్పనిసరి.

రెండో లాంగ్వేజ్‌ని ‘ఎలక్టివ్‌’ (ఆరో సబ్జెక్టు)గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్‌ లేదా 23 మెయిన్‌ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్‌ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే, ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరిగా పాసవ్వాలి.

» సైన్స్‌ లేదా ఆర్ట్స్‌ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి.
» గతంలో ఎంపీసీలో ‘మ్యాథ్స్‌-ఏ, బి’ పేపర్లు (ఒక్కో పేపర్‌ 75 మార్కులు) ఉండగా, ఇప్పుడు ఒక్క పేపర్‌ మాత్రమే ఉంటుంది.
» బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా ఒక్క ప్రశ్నపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బోటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జవాబులు రాసే బుక్‌లెట్స్‌ రెండింటికీ వేర్వేరుగా ఇస్తారు. వేర్వేరుగా జవాబులు రాయాలి.
» ఆర్ట్స్‌లో సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచి్చన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు.
» కామర్స్‌లో కామర్స్‌ పార్ట్‌-ఏ 50 మార్కులకు, అకౌంటెన్సీ పార్ట్‌-బి 50 మార్కులకు పేపర్‌ ఉంటుంది.
మార్కుల్లో మార్పులు
» మొదటి ఏడాది ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సైన్స్‌ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్‌ 30 మార్కులకు ఉంటుంది. అంటే రెండేళ్లకు రాత పరీక్ష 170 (85+85) మార్కులకు, ప్రాక్టికల్స్‌ 30 మార్కులు.. మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
» గతేడాది వరకు మ్యాథమెటిక్స్‌-ఏ, బి పేపర్లుగా 150 మార్కులకు ఉండగా, వాటిని కూడా రద్దు చేసి ఒకటే పేపర్‌ 100 మార్కులకు కుదించారు.
» ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులకు తప్పనిసరి చేశారు. అంటే సైన్స్‌ సబ్జెక్టుల్లో రెండేళ్లకు కలిపి 59 మార్కులు రావాలి. సైన్స్‌ ప్రాక్టికల్స్‌ రెండేళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
» ఒకటి రెండు సబ్జెక్టుల్లో అధిక మార్కులు, మరో రెండు, మూడు సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు సాధించినా ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అన్ని సబ్జెక్టుల్లోనూ సరాసరి 35 శాతం మార్కులు తప్పనిసరి. అయితే, ఈ అవకాశం మొదటి ప్రయత్నంలో పరీక్షలు రాసేవారికి మాత్రమే వర్తిస్తుంది.
» ఈసారి పరీక్షల్లో అర, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అర, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ”ఛాయిస్‌” విధానం అమల్లోకి తెచ్చారు.
» ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంటర్‌ విద్యార్థులకు పాత సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు చేయలేదు.

ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు
» పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్‌ రూపొందించారు. అయితే, హోలీ (మార్చి 3), రంజాన్‌ (మార్చి 20) తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ తేదీల్లో జరిగే పరీక్షలను మరుసటి రోజు నిర్వహించేలా టైంటేబుల్‌లో మార్పులు చేసి, ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే మార్పులతో కూడిన టైంటేబుల్‌ను ఇంటర్‌ విద్యా శాఖ వెల్లడించనుంది.

గతంలో ఒక్కో సబ్జెక్టు ఒక్కో తీరుగా మార్కుల విధానం..
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో గతంలో భాషా పేపర్లు 100 మార్కులకు ఉండేవి. సబ్జెక్టులకు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో తీరుగా ప్రశ్నలు, మార్కుల కేటాయింపు ఉండేది. ఆర్ట్స్‌ గ్రూపులకు మొత్తం 5 పేపర్లు 500 మార్కులు ఉండేవి. ఎంపీసీకి 470 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. మ్యాథమెటిక్స్‌లో రెండు పేపర్లు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు, సైన్స్‌ గ్రూప్‌లో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పేపర్లు ఉండేవి.

రెండో ఏడాదిలో మ్యాథ్స్‌ మినహా మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ మార్కులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్‌ గ్రూపులు మినహా, సైన్స్‌ సబ్జెక్టులకు ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపులో మార్పులు చేశారు. మొదటి ఏడాది ఎంపీసీలో మొత్తం మార్కులు యథావిధిగా 470 మార్కులే ఉండగా, బైపీసీలో గతంలో 440 మార్కులు ఉండగా, కొత్త విధానంలో 455 మార్కులకు పెరిగాయి.

టర్కీని నాశనం చేస్తున్న రాకాసి గుంతలు.. ఊర్లూ, రోడ్లూ, పంటపొలాలను మింగేస్తున్న సింక్ హోల్స్.. ఎందుకిలా..?

దేదో ఆకాశం నుంచి ఉల్కలు, గ్రహశకాలు పడి ఏర్పడిన భారీ గుంతల మాదిరగా పెద్ద పెద్ద గుంతలు. ఒకటి కాదు రెండు కాదు.. దేశ వ్యాప్తంగా ఏకంగా 700 లకు పైగా మహాబిలాలు..

ఉన్నట్లుండి సడెన్ గా గ్రామాలు, పంటపొలాలు, రోడ్లు ఇలా వేటిని వదలకుండా ఏర్పడుతున్న గుంతలతో టర్కీ దేశం భవిష్యత్ పై తీవ్రమైన భయాందోళనలో మునిగిపోయింది. దేశ మనుగడకే ప్రశ్నార్థకం అయిన రాకాసి గుంతల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ధాన్యాగారంగా పేరున్న టర్కీ కొన్యా ప్రాంతంలో వందల కొద్ది గుంతలు (సింక్ హోల్స్) ఏర్పడటంతో.. ఆ దేశ వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అత్యధికంగా పండే గధమ పంటపొలాలను లాగేసుకుంటూ ఏర్పడుతున్న భారీ గుంతలు ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి దారితీశాయి.

డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తే కొన్యా సమీప జిల్లాల్లోనే 684 గుంతలు.. గుండెకు చిల్లులు పడిన మాదిరిగా.. టర్కీ భూములను మింగేస్తున్నాయి. దీనికి కారణం దారుణమైన కరువు, టర్కీ పంటపొలాల కింద ఉన్న భూముల స్వభావం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ శాతం గుంతలు కొన్యా బేసిన్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.

కారణం ఇదే:

టర్కీలో చాలా వరకు భూమి పొరలు కార్బోనేట్, జిప్సం కలయికతో ఏర్పడ్డాయి. అంటే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సున్నపురాళ్లతో కూడిన నేలలు ఎక్కువ. ఇవి మెల్లగా కురుగుతూ ఉంటాయి. దీనికి తోడు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో.. ఈ భూములకు కింది నుంచి సపోర్ట్ తగ్గిపోవడంతో.. పొరల పటుత్వం తగ్గిపోయి.. పగుళ్లు వచ్చి.. మీటర్ల లోతుల్లోకి పడిపోతున్నాయి. దీంతో సింక్ హోల్స్ ఏర్పడుతున్నాయి.

కొన్యా భూభాగంలో 2000వ సంవత్సరానికి ముందు వేలితో లెక్కపెట్టే అన్ని గుంతలు మాత్రమే ఉండేవంట. కానీ గత ఇరవై ఏళ్లుగా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైన కరువుతో బోరు బావుల ద్వారా భూగర్భ జలాలను విపరీతంగా తోడుతుండటంతో.. భూమిలోపల నీరు లేక.. సున్నపు రాతి పైభాగం పట్టు కోల్పోయి పెద్ద పెద్ద బిలాలుగా పడుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2021 నుంచి గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని .. ముందు ముందు ఇంకా ఎన్ని సింక్ హోల్స్ ఏర్పడుతాయోనని భయాందోళనలో ప్రజలున్నారు. 1970 తర్వాత ఒక్కో ఏరియాల్లో దాదాపు 60 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయినట్లు అధికారులు తెలిపారు.

డేంజర్ జోన్లో పట్టణాలు, పంటపొలాలు:

పెరుగుతున్న సింక్ హోల్స్ కారణంగా టర్కీలోని పట్టణాలు డేంజర్ జోన్ లో పడిపోయాయి. ఎప్పుడు గుంతలు పడతాయోననే భయాందోళనలో ప్రజలు గడుపుతున్నారు. టర్కీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (AFAD) లెక్కల ప్రకారం కేవలం కొన్యా బేసిన్ లోనే 684 సింక్ హోల్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరప్నార్ జిల్లా నుంచి కరమాన్, అక్సరాయ్ జిల్లాల వరకు ఈ సింక్ హోల్స్ ఏర్పడ్డాయి. కనీసం 30 మీటర్ల లోతుల్లో ఉండే గుంతలు.. పంటపొలాలను మింగేస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ వినియోగంపై కచ్చితమైన నిబంధనలు అమలు చేయకుంటే.. బ్రెడ్ బాస్కెట్ గా పేరున్న టర్కీ.. పూర్తిగా విధ్వంసం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గుడ్‌న్యూస్‌ చెప్పిన SBI.. హోమ్‌ లోన్‌ తీసుకోవాలి అనుకుంటున్నవారికి పండగే

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత తన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, దీని వలన ప్రస్తుత, కొత్త రుణగ్రహీతలకు రుణాలు చౌకగా మారాయి.

ఈ తాజా రేటు తగ్గింపుతో SBI బాహ్య బెంచ్‌మార్క్ లింక్డ్ వడ్డీ రేటు (EBLR) 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.90 శాతానికి చేరుకుంటుంది. సవరించిన రేట్లు డిసెంబర్ 15, 2025 నుండి అమలులోకి వస్తాయని SBI ఒక ప్రకటనలో తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఈ సంవత్సరం నాలుగోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని RBI గత వారం తీసుకున్న నిర్ణయం తరువాత ఈ వడ్డీ రేటు తగ్గింపు జరిగింది.

  • బ్యాంక్ అన్ని కాలపరిమితులపై MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మార్పుతో ఒక సంవత్సరం మెచ్యూరిటీలకు MCLR ప్రస్తుత 8.75 శాతం నుండి 8.70 శాతానికి తగ్గుతుంది.
  • డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చేలా బేస్ రేటు/BPLR ను ప్రస్తుతమున్న 10 శాతం నుండి 9.90 శాతానికి తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటించింది.
  • డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చే కనిష్ట మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి తగ్గించింది. అయితే డిపాజిట్ సేకరణపై ఒత్తిడిని సూచిస్తూ, ఇతర మెచ్యూరిటీ పథకాలపై బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చలేదు.
  • 444 రోజుల ప్రత్యేక పథకం అయిన అమృత్ వర్షితి వడ్డీ రేటు డిసెంబర్ 15 నుండి 6.60 శాతం నుండి 6.45 శాతానికి సవరించబడింది.

IOB కూడా..

మరో ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కూడా డిసెంబర్ 15, 2025 నుండి తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ తన EBLR – ముఖ్యంగా రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) -ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, ఇది 8.35 శాతం నుండి 8.10 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు అందజేస్తున్నట్లు IOB ఒక ప్రకటనలో తెలిపింది. అదనంగా, మూడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు అన్ని కాలపరిమితి గల MCLRలో 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును బ్యాంక్ ఆమోదించింది.

అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..? నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఇదే.

కొలెస్ట్రాల్ శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన జిగట పదార్థం. అయితే, కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగితే, దానిని చెడు కొలెస్ట్రాల్ లేదా అధిక కొలెస్ట్రాల్ అంటారు.

అధిక కొలెస్ట్రాల్ శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది రక్త నాళాలలో పేరుకుపోయి వాటిని అడ్డుకుంటుంది. రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు సరైన రక్త సరఫరాను అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, గుండె సమస్యలు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభించినప్పుడు శరీరం ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించాలో, అది పెరగకుండా నిరోధించడం ఎలాగో తప్పక తెలుసుకుని ఉండాలి..

అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు:

రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొద్ది పని చేసినా కూడా శరీరం అలసిపోతుంది. చేతులు, కాళ్ళకు రక్తం సరిగ్గా అందకపోతే, నొప్పి మొదలవుతుంది. మీ చేతులు, కాళ్ళలో జలదరింపు అనిపించవచ్చు. వెరికోస్ వెయిన్స్ ఒక సమస్య కావచ్చు. దీనివల్ల కాళ్ళపై నీలం-ఊదా రంగు చారలు కనిపిస్తాయి.

కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?:

అధిక కొవ్వు పదార్ధాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ధూమపానం లేదా పొగాకు సేవించడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది. దీని కారణంగా శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కు ఒక కారణం చురుకైన జీవనశైలి లేకపోవడం. ఎక్కువగా కదలకుండా ఒకేచోట ఉన్నవారిలో ఊబకాయం పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు.

అధిక కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి:

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. మీ ఆహారంలో ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోండి.

బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఊబకాయం కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొవ్వు పదార్ధాలను ముఖ్యంగా వేయించిన ఆహారాలను వదిలివేయడం చాలా ముఖ్యం.

రోజూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. వారానికి 3-4 రోజులు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి.

మీ ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయండి. డీటాక్స్ వాటర్ తాగండి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంటి నివారణలు:

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పచ్చి వెల్లుల్లిని తినడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పచ్చి వెల్లుల్లిని తినవచ్చు. ప్రతిరోజూ 1-2 లవంగాల పచ్చి వెల్లుల్లి తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. దీని శోథ నిరోధక లక్షణాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూర్ణం చేసిన పచ్చి వెల్లుల్లిని తినేటప్పుడు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

తెలుగు రాజకీయాల్లో విషాదం.. మాజీ MP కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ MP కుసుమ కృష్ణమూర్తి(Kusuma Krishna Murthy) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో కుసుమ కృష్ణమూర్తి జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

కాంగ్రెస్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు విజయం సాధించారు.. ఉత్తమ ఎంపీగా పేరు కూడా తెచ్చుకున్నారు.

1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. 1980-82 నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. కుసుమ కృష్ణమూర్తి ‘దళిత వేదం’ పేరుతో బుక్ కూడా రాశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉంది.. అయితే కుసుమ కృష్ణమూర్తి చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

IIT, NIT , IIIT మధ్య తేడా ఏంటి?.. ఎక్కడ చదివితే మంచి ప్యాకేజీ వస్తుంది?

ఇంజినీరింగ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల మనసుల్లో తరచుగా వచ్చే ప్రశ్న ఏమిటంటే IIT, NIT, IIITల మధ్య అసలు తేడా ఏమిటి? అంతేకాదు, ఈ మూడు సంస్థల్లో ఏది ఎలాంటి ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు అందిస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

వాస్తవానికి ఇవన్నీ దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలే. అయితే నేటి కాలంలో కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా, మంచి ప్లేస్‌మెంట్‌, కెరీర్ వృద్ధి కూడా ఎంతో ముఖ్యమయ్యాయి. అందుకే సరైన సంస్థను ఎంచుకోవడం భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో IIT, NIT, IIITల మధ్య తేడాలు ఏమిటో, అలాగే ఏ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాల ప్యాకేజీలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institutes of Technology – IIT)

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లను దేశంలో ఇంజినీరింగ్ విద్యకు శిఖరంగా భావిస్తారు. ఇక్కడ ప్రవేశాలు JEE అడ్వాన్స్‌డ్ ద్వారా జరుగుతాయి. ఇది దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందింది. IITల్లో పరిశోధన, వినూత్న ఆలోచనలు (ఇన్నోవేషన్), ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌కు అద్భుతమైన వాతావరణం ఉంటుంది. ప్యాకేజీల విషయానికి వస్తే, ఇక్కడ సగటు వార్షిక జీతం రూ. 18 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటుంది. అలాగే, టాప్ ప్యాకేజీలు (అంతర్జాతీయ ఆఫర్లతో కలిపి) రూ. 1 కోటి కంటే ఎక్కువగా కూడా ఉంటాయి.

IIT బాంబే, IIT ఢిల్లీ, IIT మద్రాస్, IIT కాన్పూర్ వంటి పాత IITలు ప్లేస్‌మెంట్ల విషయంలో ముందంజలో ఉంటాయి. ఇక్కడి నుంచి పాస్ అయిన విద్యార్థులను గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి ప్రముఖ సంస్థలు నియమించుకుంటాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institutes of Technology – NIT)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITలు) కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ప్రతిష్టాత్మక సంస్థలు. ఇక్కడ ప్రవేశాలు JEE మెయిన్ ద్వారా జరుగుతాయి. దేశవ్యాప్తంగా మొత్తం 31 NITలు ఉన్నాయి. వాటిలో తిరుచిరాపల్లి (త్రిచీ), సురత్‌కల్, వరంగల్ వంటి పాత NITలు ఎంతో పేరొందాయి. ప్లేస్‌మెంట్ ధోరణి విషయానికి వస్తే, ఇక్కడ సగటు వార్షిక జీతం రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. టాప్ ప్యాకేజీలు రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు కూడా లభిస్తాయి.

NITల్లో బోధనా స్థాయి చాలా మంచి స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉండటంతో ఇండస్ట్రీలో విద్యార్థులకు బలమైన గుర్తింపు లభిస్తుంది. కోర్ బ్రాంచ్‌లు, ఐటీ రంగం రెండింటిలోనూ మంచి అవకాశాలు ఉంటాయి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (Indian Institutes of Information Technology – IIIT)

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IIITలు) ప్రధానంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్‌పై దృష్టి సారిస్తాయి. దేశంలో కొన్ని IIITలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, మరికొన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో పనిచేస్తాయి. ఇక్కడ కూడా ప్రవేశాలు JEE మెయిన్ ద్వారానే జరుగుతాయి. IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు వంటి సంస్థలు తమ అద్భుతమైన కోడింగ్ సంస్కృతి, పరిశోధనకు ప్రసిద్ధి చెందాయి. స్టార్టప్‌లు, ప్రొడక్ట్-బేస్డ్ కంపెనీల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.

IIITల్లో సగటు వార్షిక జీతం రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. టాప్ ప్యాకేజీలు సుమారు రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు లభిస్తాయి.

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. ఒక్క రోజు ముందే.. రెడీగా ఉండండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది.

లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. జనవరి నెల పింఛన్‌ను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 31వ తేదీనే అందించనున్నట్లు సమాచారం.

జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:00 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పింఛన్ మొత్తా్న్ని అందించనున్నట్లు సమాచారం. జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరోవైపు గతేడాది కూడా ఇలాగే మార్పులు చేశారు. జనవరి నెల పింఛన్‌ను డిసెంబర్ 31వ తేదీనే అందించారు. అలాగే ఏవైనా సెలవు రోజులు వంటి పరిస్థితులు వస్తే.. ఆయా పరిస్ధితులకు అనుగుణంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా 2026 జనవరి పింఛన్లను ఒకరోజు ముందే అందించనున్నట్లు సమాచారం.

మరోవైపు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు , పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి 15 వేల రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు పది వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు.

గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించేవారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం మార్చారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

7 నిమిషాలు ఆగిపోయిన హృదయ స్పందన, ఆపై అకస్మాత్తుగా ప్రాణం తిరిగొచ్చింది; మృత్యువు నుండి తిరిగి వచ్చిన 22 ఏళ్ల యువతి కథ

రణం తర్వాత జీవితం కథ: ఈ ప్రపంచంలో ఎవరు జన్మించినా, ఒక రోజు చనిపోవడం ఖాయం అని భగవద్గీతలో చెప్పబడింది. కానీ ఒక యువతికి పెద్ద అద్భుతం జరిగింది.

ఆమె మరణించిన తర్వాత తిరిగి బ్రతికింది.

సుమారు 7 నిమిషాల పాటు ఆమె శరీరం ఒక నిర్జీవమైన శవంగా మారిపోయింది, మరియు ఆమె చనిపోయిందని అందరూ అనుకున్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఆమె శరీరంలో ప్రకంపనలు వచ్చి, గుండెలో స్పందన తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆ యువతి తన భయంకరమైన అనుభవాన్ని ప్రపంచంతో పంచుకుంది. ఆ 7 నిమిషాలలో మరణం తర్వాత తనకేం జరిగిందో ఆమె చెప్పింది. మరణించి తిరిగి బ్రతికిన ఈ యువతి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

వ్యసనాలకు దూరం, రోజూ 10 వేల అడుగులు నడుస్తుంది
డైలీ మిర్రర్ యూకే నివేదిక ప్రకారం, బ్రిటన్‌లోని డెర్బీషైర్‌లోని ఇల్కెస్టన్‌లో నివసించే 22 ఏళ్ల కోర్ట్నీ స్టాక్స్ (Courtney Stocks) డాగ్ గ్రూమింగ్ పని చేస్తుంది. ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడం వల్ల, ఆమె రోజూ దాదాపు 10,000 అడుగులు నడుస్తుంది. అలాగే స్మోకింగ్, వేపింగ్ మరియు మద్యం నుండి కూడా దూరంగా ఉంటుంది.

కోర్ట్నీ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 16న ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఆమె తల్లిదండ్రులు ఆమెను కలవడానికి వచ్చారు. ఆమె సోఫాలో తల్లిదండ్రులతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె తండ్రికి కాల్ రావడంతో, వారు మాట్లాడటానికి బయట తోటలోకి వెళ్లారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమె వారిని కలవడానికి బయటకు వెళ్ళింది, అకస్మాత్తుగా తోటలో కింద పడిపోయింది.

తండ్రి వెంటనే సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించారు
కుమార్తె కింద పడిపోవడం చూసిన వెంటనే తండ్రి క్రిస్ వాచర్న్ పరుగెత్తుకు వచ్చారు. అతను నాడి మరియు గుండె స్పందనను పరీక్షించగా, అవి పూర్తిగా ఆగిపోయాయి మరియు కోర్ట్నీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. భయపడిన తండ్రికి ఏం చేయాలో తోచక వెంటనే సీపీఆర్ (CPR) ఇవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో తల్లి వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసింది.

తండ్రి నిరంతర సీపీఆర్ కారణంగా, 7 నిమిషాల తర్వాత ఆమె గుండెలో మళ్లీ నెమ్మదిగా స్పందన మొదలైంది. అప్పటికే అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న కోర్ట్నీని వెంటనే రాయల్ డెర్బీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత కార్డియాక్ వార్డుకు మార్చారు.

పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది
పరీక్షల సమయంలో, కోర్ట్నీ పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. ఈ వ్యాధిని శాస్త్రీయ భాషలో మైట్రల్ యాన్యులర్ డిస్జంక్షన్ (Mitral Annular Disjunction) అని అంటారు. ఇది గుండె యొక్క నిర్మాణాత్మక లోపం, ఇది కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది. ఆమెకు మళ్లీ అలాంటి సమస్య రాకుండా నివారించడానికి, ఆమెకు ఇంప్లాంటబుల్ డిఫైబ్రిలేటర్ (Implantable Defibrillator) అమర్చారు.

ఈ మరణానికి ముందు తనకు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని కోర్ట్నీ చెప్పింది. అయితే, గత కొన్ని వారాలుగా గుండె దడ మరియు మైకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నానని తెలిపింది. కానీ ఆమె దానిని ఆందోళన (Anxiety)గా భావించి పట్టించుకోలేదు. ఇదే కారణంగా ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురైందని వైద్యులు చెప్పారు.

నాన్న వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నాను – కోర్ట్నీ
మృత్యువు అంచు నుండి తిరిగి వచ్చిన కోర్ట్నీ ఇప్పుడు తన అనుభవాన్ని ప్రపంచానికి చెబుతోంది. ఆమె ఇలా అంటోంది, “నాకు పుట్టుకతోనే ఈ వ్యాధి ఉంది, కాబట్టి ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితి రావాల్సిందే. కానీ ఒత్తిడి (Stress) దానిని సమయం కంటే ముందే ప్రేరేపించింది. నేను చాలా ఒత్తిడికి గురవుతాను. చిన్న చిన్న విషయాలు కూడా నన్ను చాలా బాధ పెడతాయి. ఇది ఇంత తీవ్రంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.”

తన తండ్రిని దేవుడి రూపంగా అభివర్ణిస్తూ కోర్ట్నీ, “నాన్న వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నాను. ఆయన అప్పుడు ఇంట్లో లేకపోతే, నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. నేను చనిపోయేదాన్ని” అని చెప్పింది.

కోర్ట్నీ ఇప్పుడు ఈ అనుభవం నుండి గుణపాఠం నేర్చుకుని, ప్రపంచానికి తన ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తోంది. తండ్రి వెంటనే సీపీఆర్ ఇవ్వడమే ఆమె ప్రాణాలను కాపాడిన కీలక అంశం అని కోర్ట్నీ కుటుంబం మరియు వైద్యులు చెబుతున్నారు.

30 రోజులు మాంసం మానేస్తే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే మార్పులు..

నలో చాలా మంది మాంసాహారాలు ఉన్నారు. వారికి మటన్‌, చికెన్‌, చేపలు వంటి ఆహారాలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. మాంసం ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది పూర్తి ప్రోటీన్ మూలం. శరీరానికి అంతర్గతంగా, బాహ్యంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, చాలా మంది మాంసం తినడం మానేయాలని కోరుకుంటారు. కానీ, అలాంటి వారు ఉన్నట్టుండి దానిని వదులుకోవాలా వద్దా అని ఖచ్చితంగా తెలియదు. కాబట్టి, మీరు క్రమం తప్పకుండా మాంసం తినేవారై 30 రోజులు లేదా ఒక నెల పాటు మాంసం తినకుండా ఉంటే మీ శరీరంపై దాని ప్రభావాలు ఎలా ఉంటాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

30 రోజులు మాంసం తినకపోతే ఏమవుతుంది?

వాపును తగ్గిస్తుంది – ప్రాసెస్ చేసిన మాంసాలు, ఎర్ర మాంసాలలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. మాంసం క్రమం తప్పకుండా తినడం వల్ల వాపు వస్తుంది. మీరు మాంసం తీసుకోవడం తగ్గించడం వల్ల వాపు తగ్గుతుంది.

శక్తి తగ్గవచ్చు – మాంసం తినడం మానేయడం వల్ల మీలో శక్తి తగ్గుతుంది. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించవచ్చు. కాబట్టి మీరు మరో విధంగానైనా ప్రోటీన్ తీసుకోవడం పెంచాలి. మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే శాఖాహార ఆహారాలను చేర్చుకోవడం ద్వారా మీరు దీన్ని భర్తి చేయవచ్చు.

పేగు ఆరోగ్యంపై ప్రభావం – మీరు మాంసాన్ని మానేసి, మీ ఆహారంలో ఎక్కువ తృణధాన్యాలు చేర్చుకుంటే, మీ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొక్కల ఆధారిత ఆహారాలు ఆరోగ్యకరమైన పేగు బాక్టీరియాను నిర్వహిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది.

మీరు బాత్రూంలో ఎక్కువసేపు కూర్చోవలసి రావచ్చు – మాంసాన్ని వదులుకోవడం ద్వారా మీరు తృణధాన్యాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతారు. ఇవి ఎక్కువ ఫైబర్‌ను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ప్రమాదాలు కూడా ఉండవచ్చు:

మీరు సడెన్‌గా మాంసాన్ని తగ్గించుకుంటే సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం ముఖ్యం. అసమతుల్య ఆహారం ప్రోటీన్ లోపానికి దారితీస్తుంది. సమతుల్య ఆహారం లేకపోవడం ఎముకలను బలహీనపరుస్తుంది. ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంలో మాంసం లేకపోవడాన్ని భర్తీ చేసే ఆహారాలను చేర్చడం చాలా అవసరం.

మగవారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. లైట్ తీసుకుంటే ప్రాణమే..

టీవలి కాలంలో క్యాన్సర్‌తో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలా మంది తమ ఆరోగ్యంలో వచ్చిన మార్పులను లేదా లక్షణాలను గమనించినా వాటిని విస్మరిస్తున్నారు.

నిద్రలేమి, ఒత్తిడి, ధూమపానం, పెరిగిన బొడ్డు కొవ్వు వంటి రోజువారీ జీవనశైలి అలవాట్లే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. RGCIRCలోని మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ వినీత్ తల్వార్.. పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఐదు ప్రధాన అలవాట్ల గురించి వివరించారు.

ధూమపానం – పొగాకు వాడకం

క్యాన్సర్‌కు అతిపెద్ద కారణాలలో ధూమపానం, పొగాకు వాడకం ప్రధానమైనవి. దేశంలో దాదాపు 42 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకం వల్లనే సంభవిస్తున్నాయి. సిగరెట్లు లేదా అప్పుడప్పుడు ధూమపానం కూడా ఊపిరితిత్తులు, గొంతు, నోరు, మూత్రాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుంది. నిరంతర దగ్గు, నోటి పూతల, ఆకస్మిక బరువు తగ్గడం, తినడానికి ఇబ్బంది పడటం.

మద్యం సేవించడం

క్రమం తప్పకుండా ఆల్కహాల్ సేవించడం కాలేయం, నోరు, అన్నవాహిక, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ధూమపానంతో కలిపి ఆల్కహాల్ సేవించినప్పుడు, క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. తరచుగా అలసట, కడుపు నొప్పి, జీర్ణక్రియలో మార్పులు లేదా అప్పుడప్పుడు ఆమ్లత్వం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి తోసిపుచ్చవద్దు.

దీర్ఘకాలిక ఒత్తిడిని

పురుషులు తరచుగా పని, కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడిని అనుభవిస్తారు. అయితే ఈ దీర్ఘకాలిక ఒత్తిడిని సాధారణంగా తీసుకోవడం ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత, వాపు, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతుంది. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదానికి దోహదపడతాయి.

పెరిగిన బొడ్డు కొవ్వు – ఊబకాయం

ఆధునిక జీవనశైలి మార్పుల వల్ల వచ్చే ఊబకాయం, చాలా మంది పురుషులు అనుకున్నదానికంటే ఎక్కువ హానికరం. ఊబకాయం ఉన్నప్పుడు శరీరంలో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్, కాలేయ క్యాన్సర్‌లకు కారణమయ్యే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థలో మార్పులు, ఉబ్బరం, ప్రేగు అలవాట్లలో మార్పులు.

వైద్య పరీక్షలను ఆలస్యం చేయడం

పురుషులలో అత్యంత ఆందోళనకరమైన అలవాట్లలో మరొకటి సాధారణ ఆరోగ్య చెకప్‌లను చేయించుకోకపోవడం. ఏదైనా లక్షణం కనిపించినా వైద్య పరీక్షలను ఆలస్యం చేయడం తరచుగా క్యాన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి దారితీస్తుంది. ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, నిద్ర నాణ్యత గురించి అవగాహన పెంచుకోవడం, అలాగే సకాలంలో ఆరోగ్య తనిఖీలు చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం.. ఈ నెలలో 3 పనులు అస్సలు చేయకండి

 హిందూ ధర్మంలో ఏ చిన్న పని తలపెట్టినా పంచాంగం చూసి, మంచి ముహూర్తంలోనే మొదలుపెట్టడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే..
కాలచక్రంలోనూ గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఒకటుంటుంది. ఉత్తరాదిన దీన్ని ‘ఖర్మాస్ (Kharmas)’ అని పిలిస్తే, మన తెలుగు నాట ‘ధనుర్మాసం’ అంటారు. దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైన సమయమే అయినా, శుభకార్యాలకు మాత్రం నిషిద్ధం. 2025 ఏడాది చివరలో రాబోతున్న ఈ రోజుల గురించి, ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.

ధనుర్మాసం ప్రారంభం…

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ‘ధనుర్మాసం’ మొదలవుతుంది. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు, సూర్య భగవానుడి శక్తి, ప్రభావం కాస్త తగ్గుతుందని, అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టడం వల్ల అడ్డంకులు రావచ్చని పండితులు చెబుతారు.

ఈ ఏడాది ధనుర్మాసం 2025, డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:27 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే 2026, జనవరి 14 మధ్యాహ్నం 3:13 గంటల వరకు ఈ సమయం కొనసాగుతుంది. సంక్రాంతి పండుగతో మళ్లీ శుభ ఘడియలు మొదలవుతాయి. అయితే ఇంటి ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కోసం ధనుర్మాసం పూర్తయ్యే వరకూ 3 రకాల పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అవేంటంటే..

1. గృహ ప్రవేశాలు, నిర్మాణాలు వద్దు….

ఈ నెల రోజుల్లో గృహ ప్రవేశాలు (Housewarming) అస్సలు చేయకూడదు. అలాగే కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం, ఇల్లు రినోవేషన్ లేదా పెద్ద రిపేర్లు చేయించడం వంటి పనులు పెట్టుకోవద్దు. ఈ సమయంలో చేసే పనులు కుటుంబంలో అశాంతిని కలిగిస్తాయని నమ్మకం. అంతేకాదు, ఇంట్లో కొత్తగా దేవుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా ఈ సమయంలో మంచిది కాదు.

2. కొత్త బిజినెస్, పెట్టుబడులకు బ్రేక్ వేయాలి…

మీరు ఏదైనా కొత్త వ్యాపారం (Business) స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సంక్రాంతి వరకు ఆగడమే మంచిది. ఖర్మాస్ సమయంలో కొత్త వెంచర్లు మొదలుపెడితే అనుకోని అడ్డంకులు ఎదురై, ఆర్థిక ఇబ్బందులు లేదా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాల కోసం చేసే ప్రయాణాలు, అలాగే ఉపనయనం వంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో చేయకూడదు.

3. పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లు నిషిద్ధం…

జీవితంలో ముఖ్యమైన వేడుకలైన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు (Engagement), నామకరణం (బారసాల) వంటి శుభకార్యాలన్నీ వాయిదా వేసుకోవాలి. సూర్యుడి ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ వేడుకలకు విఘ్నాలు కలగవచ్చు. అలాగే కొత్త వాహనాలు, ఆస్తి కొనుగోళ్లు, బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులు కొనడానికి ఇది సరైన సమయం కాదు. వీటిని కొనడం వల్ల ఆ వస్తువులతో పాటు ప్రతికూల శక్తి ఇంటికి వస్తుందని భావిస్తారు.

మరి ఈ సమయంలో ఏం చేయాలి?

కొత్త పనులకు ఇది మంచి సమయం కాకపోయినా, దైవారాధనకు మాత్రం ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా సూర్య భగవానుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. రోజూ సూర్యుడి ద్వాదశ (12) నామాలను జపించడం వల్ల దోషాలు పోయి, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.

పఠించాల్సిన 12 సూర్య నామాలు ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం రవయే నమః, ఓం పూష్ణే నమః, ఓం దినేశాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం ఉషకరాయ నమః, ఓం భానవే నమః, ఓం దినమనయే నమః, ఓం మార్తాండాయ నమః. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ, దైవచింతనతో గడిపితే ధనుర్మాసం కూడా మీకు శుభప్రదంగానే మారుతుంది.

వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు నుంచి’ స్పెషల్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్‌ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నేడు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఓ వీడియోను షేర్ చేశారు మూవీటీమ్.

అందులో.. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్.. హ్యాపీ బర్త్‌డే వెంకటేష్ గారు’ అంటూ అనిల్ రావిపూడి చేసిన వీడియో క్రేజీగా ఉంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే విక్టరీ వెంకటేష్ మాస్‌ లుక్‌లో కనిపిస్తుండగా.. వెనక హెలికాఫ్టర్ ఆగి ఉంటే అతని వెనక గన్ మెన్స్ నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.

 

కాఫీ రూ.350.. పాప్‌కార్న్ రూ.600: మండిపడ్డ శివాజీ

టికెట్ రేట్ల గురించి డిబేట్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. దాని కంటే ఎక్కువగా… థియేటర్లలో తినుబండారాలపై జరుగుతున్న దోపిడీ గురించి నిర్మాతలు గళం ఎత్తుతున్నారు.

సగం జనం ఈ రేట్లకు భయపడే థియేటర్లకు రావడం లేదన్నది వాళ్ల వాదన. ఇందులో నూటికి నూరుశాతం నిజం వుంది. తాజాగా నటుడు, నిర్మాత శివాజీ థియేటర్లలో జరుగుతున్న దోపిడీ గురించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దోపిడీని వ్యవస్థలే నివారించాలని, న్యాయస్థానాలు కలగజేసుకోవాలని కోరారు.

మల్టీప్లెక్స్ లో కాఫీ మూడొందల యాభై రూపాయలకు అమ్ముతున్నారని, పాప్ పార్న్ పేరుతో ఆరొందలు గుంజుతున్నారని, ఆ మూడొందల యాభైతో మూడు రోజులు ఇంటిల్లిపాదీ కాఫీ తాగొచ్చని, ఈ దోపిడీలో నిర్మాతలకు భాగం లేదని, కేవలం మల్టీప్లెక్స్ యజమానులే లాభపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ లాంటి నటుడే.. థియేటర్లో రేట్లకు ఇలా భయపడిపోతోంటే సామాన్యుల సంగతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీలా… చిత్రసీమ మొత్తం ఈ దోపిడీ గురించి గొంతు విప్పాల్సిన అవసరం వుంది. ‘అమరావతి గురించి ఉద్యమం చేసినట్టు.. థియేటర్లో జరుగుతున్న దోపిడీ గురించి కూడా ఉద్యమం చేయొచ్చు కదా’ అని పాత్రికేయులు అడిగితే… శివాజీ నవ్వుతూ సమాధానం దాటేశారు. ‘మీరంతా ఉన్నారు కదా.. మీతో పాటు నేను కూడా జై కొడతా’ అని లైట్ తీసుకొన్నారు. ఆమధ్య ఐబొమ్మ రవి గురించి కూడా శివాజీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐబొమ్మ రవి తెలివితేటల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలని ఆయన సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో శివాజీ స్టేట్మెంట్లు వైరల్ అయ్యాయి. వివాదానికి కారణమయ్యాయి. దీనిపై మరోసారి పాత్రికేయులు ప్రశ్నలు సంధిస్తే శివాజీ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ‘జై బాలయ్య’ అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు.

కల్తీ తేనెను ఎలా గుర్తించాలి? తప్పక తెలుసుకోండి..

ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనె శక్తి అందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో తలనొప్పి కూడా తగ్గిస్తుంది. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ తేనె అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగిస్తే ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి, మీరు నిజమైన తేనెను గుర్తించడం చాలా ముఖ్యం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

నీటి పరీక్ష

స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి సులభమైన మార్గం దానిని నీటితో పరీక్షించడం. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె కలపండి. ఐదు నిమిషాల తర్వాత, స్వచ్ఛమైన తేనె గట్టిపడి ముద్దగా ఏర్పడుతుంది. నకిలీ తేనె చక్కెర లేదా నీరు కలపడం వల్ల త్వరగా కరిగిపోతుంది.

వెనిగర్ పరీక్ష

వెనిగర్ పరీక్ష అనేది ఒక సాధారణ ఆమ్లత్వ పరీక్ష. ఒక గ్లాసు వెనిగర్‌కు కొన్ని చుక్కల తేనె కలపండి. చుక్కలు వేసిన వెంటనే బుడగలు ఏర్పడితే, తేనె కల్తీ అయి ఉండవచ్చు.

రంగులో మార్పు

తేనె రంగును పరిశీలించండి. స్వచ్ఛమైన తేనె బంగారం రంగులో కనిపిస్తుంది. కల్తీ తేనె లేత రంగులో ఉంటుంది. స్వచ్ఛమైన తేనె మందంగా, జిగటగా ఉంటుంది.

వాసన

నిజమైన తేనె విలక్షణమైన పూల సువాసనను కలిగి ఉంటుంది. అయితే నకిలీ తేనె కృత్రిమ సువాసనను కలిగి ఉంటుంది.

టిష్యూ పేపర్ టెస్ట్

టిష్యూ పేపర్ తీసుకుని దానిపై చుక్క తేనె వేయండి. తేనె స్వచ్ఛమైనదైతే టిష్యూ పేపర్ వెంటనే దానిని పీల్చుకోలేదు. కొంత సమయం తీసుకుంటుంది. పైగా తేనె మరకలు కూడా కనిపించవు. అదే కల్తీ తేనె అయితే వెంటనే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.

(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే హెల్తీ స్నాక్స్ ఇవే..

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా మనం తరచూ జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఈ సీజన్‌లో మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా శీతాకాలంలో మనకు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే స్నాక్స్ కూడా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పల్లి పట్టి

శీతాకాలంలో పల్లీలు బెల్లంతో తయారు చేసే పల్లి పట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇందులో మైక్రో మినరల్స్ ఎక్కువగా ఉంటాయని, విటమిన్స్, పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. పల్లీలు బెల్లంతో కలిపి తింటే శరీరానికి మంచి చేసే కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. పల్లి పట్టి ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిదని చెబుతున్నారు. పిల్లలకు ఈ స్నాక్స్ ఇస్తే బోలెడు పోషకాలు శరీరానికి అందుతాయని అంటున్నారు.

1 కప్పు పల్లీలను వేయించి తొక్కలు తీసి దంచాలి. బెల్లాన్ని పాన్‌లో కరిగించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. అందులో దంచిన పల్లీలు వేసి కలపాలి. చేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న ఉండలుగా లేదా ప్లేట్‌లో పరచాలి. గట్టిపడగానే ముక్కలుగా కట్ చేస్తే రుచికరమైన పల్లి పట్టి సిద్ధమవుతుంది.

నువ్వుల లడ్డు:

నువ్వులలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, ఇ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు మన కళ్ళు, కాలేయం, ఇతర ప్రధాన అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల లడ్డూల కోసం వాడే బెల్లం పాకు మనకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని అంటున్నారు. చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోకుండా, బెల్లం పాకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు. ఇది తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.

1 కప్పు నువ్వులను పాన్‌లో తేలికగా వేయించి చల్లారాక పొడిగా దంచాలి. బెల్లాన్ని కరిగించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఆ పాకంలో దంచిన నువ్వుల పొడి వేసి కలపాలి. చేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్లుగా చేసుకుంటే రుచికరమైన నువ్వుల లడ్లు సిద్ధమవుతుంది. శీతాకాలంలో ఈ హెల్తీ స్నాక్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, బయట షాపులలో వీటిని తీసుకోవడం కంటే ఇంట్లోనే తయారుచేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: పై సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

 

వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్. భద్రాచలం నుంచి రాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనదారులకు ఆంక్షలపై ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది.

ప్రజా భద్రత కోసం ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యలో ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రయాణంపై ఆంక్షలు ఉండనున్నాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీ సర్కార్ సూచించింది.

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో నిన్న(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గుండె చుట్టూ నీరు చేరితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, నిర్లక్ష్యం వద్దు మిత్రమా

ఈ రోజుల్లో చాలా మంది గుండెకి సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. గుండెపోటుతో పాటు ఇంకో డేంజర్ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అదే పెరికార్డియల్ ఎఫ్యూషన్. ఈ పరిస్థితిలో గుండె చుట్టూ ద్రవం పేరుకుపోతుంది. అసలు పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో డాక్టర్ చెప్పారు.

శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైన భాగం. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో గుండెదే కీలకపాత్ర. అయితే, ఈ రోజుల్లో గుండెపోటుకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యువత కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఏదైనా గుండె సమస్య మరణానికి కూడా దారి తీయవచ్చు.

అందుకే గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక, గుండెకి సంబంధించిన ఇంకో సమస్య గురించి చాలా మందికి తెలియదు. అదే గుండె చుట్టూ ద్రవం లేదా నీరు పేరుకుపోవడం. ఈ సమస్య గురించి చాలా మందికి అవగాహన లేదు.

గుండె చుట్టూ ద్రవం చేరడం అనేది తీవ్రమైన పరిస్థితి. దీనిని వైద్యపరంగా పెరికార్డియల్ ఎఫ్యూషన్ అని పిలుస్తారు. ఈ స్థితిలో కనిపించే లక్షణాల్ని చాలా మంది గుర్తించరు. దీంతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. పెరికార్డియల్ ఎఫ్యూషన్ సమస్య ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమన్ దేవిదత్తా చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.

పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటే ఏంటి?

పెరికార్డియల్ ఎఫ్యూషన్ లేదా గుండె చుట్టూ ద్రవం చేరడం అనేది ఒక తీవ్రమైన పరిస్థితి అని డాక్టర్ అంటున్నారు. ఈ పరిస్థితిలో గుండె చుట్టూ ఉన్న ప్రాంతంలో ద్రవం చేరడం జరుగుతుంది. గుండెలో ద్రవం పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.ఈ సమస్య ఇన్ఫెక్షన్,గాయం లేదా అనారోగ్యం వల్ల సంభవించవచ్చు.దీని లక్షణాల్ని ముందుగానే గుర్తిస్తే ప్రాణాంతక పరిస్థితుల్ని నివారించవచ్చు.

పెరికార్డియల్ ఎఫ్యూషన్ లక్షణాలు ఎలా ఉంటాయి?

గుండె చుట్టూ ద్రవం పేరుకుపోవడం వల్ల దానిపై ఒత్తిడి పెరుగుతుంది.గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది.గుండెలో ద్రవం పేరుకుపోవడం వల్ల రక్త ప్రసణపై కూడా ప్రభావం పడుతుంది. పెరికార్డియల్ ఎఫ్యూషన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే

  • తీవ్రమైన గుండె నొప్పి లేదా ఛాతీ నొప్పి
  • శ్వాసకోశ ఇబ్బంది అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ఛాతీలో భారం, ఒత్తిడి
  • పెరిగిన హృదయ స్పందన రేటు
  • తలనొప్పి, తలతిరగడం
  • కొన్ని సందర్భాల్లో మూర్చపోవడం
  • ఆహారం తినడానికి ఇబ్బంది
  • ఆందోళన, గందరగోళం
  • చిన్న చిన్న పనులకే అలసట, బలహీనత
  • చెమటలు ఎక్కువగా పట్టడం
  • డాక్టర్ చెప్పిన లక్షణాలు ఏంటంటే..

  • పెరికార్డియల్ ఎఫ్యూషన్ కారణాలు

  • పెరికార్డియల్ ఎఫ్యూషన్ ఇన్ఫెక్షన్, గుండె గాయం,గుండె జబ్బులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల రావచ్చు.పెరికార్డియల్ ఎఫ్యూషన్ లేదా గుండెలో ద్రవం పేరుకుపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
    • ​వైరల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్లు
    • క్యాన్సర్, క్యాన్సర్ కణితులు
    • థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు
    • గుండె గాయం లేదా శస్త్రచికిత్స లోపం
    • హార్మోన్ల అసమతుల్యత
    • పెరికార్డియల్ ఎఫ్యూషన్ నివారించడానికి చిట్కాలు

    • ​ఈ సమస్యను నివారించడానికి వైద్యుణ్ని సంప్రదించండి. ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్ చేయించుకోండి.
    • ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటించండి.ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని చేర్చుకోండి. రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయండి. కనీసం వాకింగ్ చేయండి.
    • ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం యోగా, ధ్యానం వంటి వాటిని జీవనశైలిలో భాగం చేసుకోండి.
    • తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.
  • పెరికార్డియల్ ఎఫ్యూషన్ లేదా గుండెలో ద్రవం పేరుకుపోవడంకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి. ఇది తీవ్రమైన పరిస్థితి. దాని లక్షణాల్ని విస్మరించడం వల్ల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. వైద్యుడు పరీక్షలు చేసి.. రోగ నిర్థారణ తర్వాత తగిన చికిత్స అందిస్తారు. దీంతో, తీవ్రమైన పరిస్థితిని నివారించవచ్చు.
    గమనిక
    ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

3 ఏళ్ల వయసు నుంచే పిల్లలను స్కూల్‌కు పంపించాలి: సుధామూర్తి

చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) కొన్ని సూచనలు చేశారు. ప్రీ ప్రైమరీ విద్యపై తల్లిదండ్రులు, ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. ‘‘చిన్న వయసులోనే బ్రష్‌ చేసుకోవడం, స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం వంటివి నేర్పించాలి. పాఠశాలకు వెళ్లే అలవాటు త్వరగా ప్రారంభం కావాలి. ఇదంతా చదువు ఒత్తిడి పెంచడం కోసం కాదు. వారికంటూ ఒక దినచర్య ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ అలవాటవుతుంది. చిన్నారి జీవితంలో ఈ ప్రారంభ రోజులే.. నేర్చుకోవడం, ఆలోచనా శక్తి, ఈ ప్రపంచంతో మమేకమవడం వంటి వాటిని తీర్చిదిద్దుతాయి. చిన్న వయసులో నేర్చుకున్న ఈ అలవాట్లు తర్వాత శాశ్వతంగా ఉండిపోతాయి’’ అని ఆమె సూచనలు చేశారు.

రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు వారికే ప్రభుత్వం ఉచితవిద్య అందించాల్సి ఉంటుంది. మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా ఈ హక్కు ఉండాలని ఆమె పార్లమెంట్‌ వేదికగా కోరారు. ఆ సమయంలోనే ఆమె చేసిన సూచనలు వైరల్ అవుతున్నాయి. ‘‘పిల్లలు మన భవిష్యత్తు. వారు ఉదయించే సూర్యుడివంటివారు. ఈ ప్రారంభ విద్య (Early education) వారి జీవితానికి ఉపయోగపడుతుంది’’ అని ఆమె మాట్లాడారు. మూడేళ్ల నుంచే అది అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు తగ్గట్టుగా రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు గల కారణాన్ని వివరించారు. పిల్లల మెదడులో 85 శాతం ఎదుగుదల ఆరేళ్లకు ముందే జరుగుతుందని, అందుకే ఈ వయసు కీలకమన్నారు.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆదివారం నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌ ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాలని సూచించింది.

 

తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్

సుమ కొడుకు రోషన్ కనకాల… మోగ్లీ నిమాతో ప్రజల ముందు ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. మోగ్లీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సుమ, రాజీవ్ విడాకుల విషయం గురించి కూడా వివరించాడు.

రోషన్ కనకాల ఏం చెప్పాడంటే…

తెలుగులో టాప్ యాంకర్ అంటే సుమ పేరే గుర్తొస్తుంది. ఆమె వారసుడిగా రోషన్ కనకాల సినీ అరంగేట్రం ఇచ్చాడు. బబుల్ గేమ్ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా సుమ, రాజీవ్ కనకాల మధ్య విడాకుల విషయంలో ఏం జరిగిందో కూడా వివరించి చెప్పాడు. ఆ సమయంలో తాము ఇలా ఎమోషనల్ దాడికి గురయ్యామో కూడా వివరించాడు.

చదువు ఇష్టం లేదు

ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల, నటుడు రాజీవ్ కనకాల కొడుకుగా రోషన్‌కు ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపు ఉంది. అయితే తనకు తాను సొంతంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. చిన్నప్పటినుంచి చదువుపై కాకుండా సినిమా పైనే దృష్టి ఉండేదని చెప్పాడు రోషన్. అందుకే అతి కష్టం మీద ఇంటర్ వరకే కాలేజ్ కు వెళ్లానని, ఆపైన అమ్మ బలవంతం మీదే డిస్టెన్స్లో బీకాం పూర్తి చేసినట్టు వివరించాడు. తన తాత దేవదాసు కనకాల దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నానని వివరించాడు. ఎవరు తనను ఎన్ని విధాలుగా విమర్శించిన వినీ విననట్టు వదిలేస్తానని చెప్పాడు.

అమ్మానాన్న ఆ సమయంలో…

ఇక తల్లిదండ్రులు సుమ, రాజీవ్ ల మధ్య మూడేళ్ల క్రితం విడాకులు అయ్యాయన్న వార్తలు గురించి ప్రశ్నించగా… అవి తాను కూడా విన్నానని ఆ సమయంలో ఇంట్లో అంతా ఎమోషనల్ అయ్యారని చెప్పాడు రోషన్. తల్లి సుమ కూడా చాలా ఎమోషనల్ అయ్యారని.. కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు మాత్రమే తెలుసు అని అన్నాడు రోషన్. బయట వారు ఇలా పుకార్లు ఎందుకు పుట్టిస్తారో.. తమకు తెలియదని, నిజానికి ఆ సమయంలో అమ్మానాన్న ఇద్దరు కలిసే ఉన్నారని ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పాడు రోషన్. అప్పట్లో ఎవరిని కలిసినా మొదట ఇదే విషయం తనను అడిగేవారని.. ఏం చెప్పాలో తెలిసేది కాదని అన్నాడు. ఆ తర్వాత అలవాటైపోయిందని అన్నాడు యువ నటుడు రోషన్ కనకాల. ఇలాంటి పుకార్లు పుట్టించే వారు కర్మ ఫలితాన్ని కచ్చితంగా పొందుతారని.. తిరిగి వారు కూడా అలాంటి బాధను అనుభవించే రోజులు వస్తాయని అన్నాడు రోషన్.

మోగ్లీ సినిమా విడుదల

రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండో చిత్రం మోగ్లీ. ఇది డిసెంబర్ 13వ తారీకున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇందులో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్ నటిస్తుండగా, సరోజ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. వీరి ముగ్గురు మధ్య మొగ్లీ కదా తిరుగుతుందని చెబుతున్నారు మేకర్లు. ఇది మనసుకు హత్తుకునే ప్రేమ కథ అని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం కీరవాణి కొడుకు కాలభైరవ అందించాడు. ఇక సినిమాను దర్శకత్వం వహించింది సందీప్ రాజ్.

 

బ‌ర్త్ డే పార్టీ: దువ్వాడ మాధురి అరెస్ట్‌!

వైసీపీ నాయ‌కుడు, వివాదాస్ప‌ద‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు శుక్ర‌వారం ఉద‌యం అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది. గురువారం ఆమె పుట్టిన రోజు కావ‌డ‌తో మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో మాధురి బ‌ర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనికి ప‌లువురు వైసీపీ నాయ‌కులు, ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు కూడా హాజ‌ర‌య్యారు.

అయితే.. ఈ పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమ‌తులు తీసుకోక‌పోవ‌డం.. మ‌ద్యం తాగి చిందులు వేయడం, ఆర్కెస్ట్రా, డీజేలు పెట్ట‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్ర‌వారం తెల్ల‌వారు జామునే ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్ర‌న‌గ‌ర్ ఎస్ వోటీ పోలీసులు.. మాధురి స‌హా ప‌లువురిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇదేస‌మ‌యంలో పార్టీలో వినియోగించిన మ‌ద్యం సీసాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

బ‌ర్త్ డే పార్టీలో స్మ‌గుల్డ్ విదేశీ మ‌ద్యాన్ని వినియోగించిన‌ట్టు తెలిసింది. ఆ సీసాల‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహించుకున్నార‌ని పోలీసులు తెలిపారు. దీనిపై త‌మ‌కు ఫిర్యాదులు అందాయ‌ని వెల్ల‌డించారు. ఇక‌, పార్టీలో మ‌త్తు ప‌దార్థాల వినియోగంపైనా దృష్టి పెట్టారు. అయితే.. అలాంటివేవీ లేద‌ని తెలిసింది.

వైసీపీ నాయ‌కుడైన దువ్వాడ శ్రీనివాస్.. మాధురిని రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తీవ్ర వివాదాలు కూడా జ‌రిగాయి. 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురి నిపెళ్లి చేసుకున్న శ్రీనివాస్‌.. విడిగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఆమె బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు.

సూప‌ర్ మ్యాన్.. చెల్లి వ‌స్తోంది! గెట్‌ రెడీ.. తెలుగు ట్రైల‌ర్ అదిరింది

ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాలీవుడ్ సినీ అభిమానుల‌ను అల‌రించేందుకు ఓ కొత్త సూప‌ర్ హీరో సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ఈ యేడు వ‌చ్చిన థండర్‌ బోల్ట్స్‌, సూప‌ర్‌ మ్యాన్ వంటి భారీ సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌వ‌గా తాజాగా అదే కోవ‌లో సూప‌ర్ మ్యాన్ సోద‌రి సూప‌ర్ గ‌ర్ల్ (Supergirl) థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. సూప‌ర్ మ్యాన్‌పై సెటైర్లు వేస్తూ, అంతా ఈజీగా, ఫ‌న్నీగా తీసుకుని ప‌ని పూర్తి చేసే సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న గ‌ర్ల్‌గా మిల్లీ ఆల్కాక్ (Milly Alcock) అద‌ర‌గొట్టింది. యాక్ష‌న్ సీన్స్ కూడా గ‌త చిత్రాల ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉన్నాయి. DC స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (Warner Bros Pictures) నుంచి వ‌స్తున్న ఈ చిత్రానికి అనా నోగ్వేరా (Ana Nogueira)స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా జూన్ 26, 2026న ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ రిలీజ్ అవ‌నుంది.

ఇదిలాంటే నాలుగు నెల‌ల క్రితం వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన సూప‌ర్ మ్యాన్ సినిమాలో ఓ స‌న్నివేశంలో అత‌ని చెల్లి సూప‌ర్ గ‌ర్ల్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌గా మంచి హైప్ వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ క్యారెక్ట‌ర్‌తో పూర్తి స్తాయి సినిమానే వ‌స్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

కృష్ణ మనవడి.. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మనవడు, రమేశ్‌ బాబు (Rameshbabu) తనయుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి కృష్ణ నట వారసుడిగా ఆయన పెద్దకుమారుడు రమేశ్‌ బాబు చిత్రసీమలోకి హీరోగా పరిచయం అయ్యాడు. మహేశ్ బాబు (Mahesh Babu) బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చినా… కృష్ణ తన పెద్ద కొడుకు రమేశ్ బాబు మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగా అతనితో కొన్ని సినిమాలు తీశాడు. అయితే నటన మీద పెద్దంత మక్కువ లేని రమేశ్‌ బాబు తెర చాటుకు వెళ్ళిపోగా, మహేశ్ బాబు ‘రాజకుమారుడు’ (Rajakumarudu) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే రమేశ్‌ బాబు మరణానంతరం అతని కుమారుడు జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకుని ఇప్పుడు జనం ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో జెమినీ కిరణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్.ఎక్స్. 100’ (RX 100) ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. జీవీ ప్రకాశ్‌ (GV Prakash) దీనికి సంగీతం అందిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అశ్వనీదత్ ఓ గ్రేడ్ అప్ డేట్ ను అందించారు. కృష్ణతో పాటు మహేశ్ బాబుతోనూ సినిమాలను నిర్మించిన అశ్వనీదత్ ఇప్పుడు ఘట్టమనేని వంశంలో మూడో తరం హీరోతో సినిమా చేస్తున్నారు. గతంలోనూ ఆయన నందమూరి, అక్కినేని కుటుంబాలకు సంబంధించి మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించారు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను కృష్ణ జయంతిని పురస్కరించుకుని 2026 మే నెలాఖరులో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కృష్ణ జయంతి మే 31. 2026 లో మే 31 ఆదివారం వచ్చింది. సో… దానికి రెండు రోజుల ముందు మే 29, శుక్రవారం నాడు ‘శ్రీనివాస మంగాపురం’ జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది.

Health

సినిమా