Saturday, July 27, 2024

కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. మూడేళ్ళ చిన్నారికి నిర్ధారణ

కేరళలో మళ్లీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చింది. కన్నూరులోని తాలిపరానికి చెందిన మూడున్నరేళ్ల బాలుడికి అమీబిక్ మెదడువాపు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం చిన్నారి కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. పుదుచ్చేరిలోని ల్యాబ్‌లో నిర్వహించిన పీసీఆర్‌ పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయింది. పరియారం వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో చిన్నారి అమీబిక్ మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. అయితే చిన్నారి మందులకు రెస్పాండ్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి?

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్, అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిని కలిగించే అమీబా నీటిలో నివసిస్తుంది. నీటిలో నివసించే అమీబా ముక్కులోని సన్నని పొర ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా ప్రభావితం చేసి వ్యాధికి కారణమవుతుంది.

అమీబా మెదడులోకి ప్రవేశించినప్పుడు..మెదడు మెదడు కణాలను తీవ్రంగా ప్రభావితం చేతుంది. ఎడెమా అభివృద్ధి చెందుతుంది. తీవ్రంగా మారుతుంది. చివరికి మరణానికి దారితీస్తుంది. జపనీస్ జ్వరం, నిపా వంటి వ్యాధులలోలా.. ఇది మెదడువాపుగా మారుతుంది. అయితే అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అరుదైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒక వారం తర్వాత మాత్రమే లక్షణలు కనిపిస్తాయని అంటున్నారు.

వ్యాధి లక్షణాలు

వ్యాధి సోకిన తర్వాత తొమ్మిది రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడను తిప్పడంలో ఇబ్బంది. తరువాత, పరిస్థితి తీవ్రంగా మారిన్నప్పుడు మూర్ఛ, స్పృహ కోల్పోవడం , జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వెన్నుపాము నుండి ద్రవాన్ని తీసుకుని పరీక్ష చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.

ఎలా రక్షించుకోవాలి?

స్విమ్మింగ్ పూల్స్ లేదా చెరువులకు వెళ్లేటప్పుడు సురక్షితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
వీలైనంత వరకు సరస్సులు, నదులు, నీటి బుగ్గలలో ఈత కొట్టడం మానుకోండి.
కొలనులు, బావులను క్లోరినేట్ చేయాలి. ఈ బ్యాక్టీరియా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది కనుక ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్ ధరించడానికి ప్రయత్నించండి.
నీటిలో ఎక్కువసేపు మునిగి ఉండవద్దు.
ఈత కొట్టిన తర్వాత శుభ్రంగా స్నానం చేయడం మర్చిపోవద్దు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా అనుసరించి చికిత్స తీసుకోండి. స్వీయ వైద్యం చేయవద్దు.

గమనిక: ఇది కేవలం పాటకుల జాగ్రత్త కోసం ఇచ్చిన సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే వైద్య నిపుణులను సంప్రదించి సలహా అనుసరించండి.

నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ఆగస్టు 12 నుంచి తరగతులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ రోజు (జులై 26) నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ ఉమామహేశ్వరిదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జులై 26 నుంచి ఆగస్టు 1 వరకు జరుగుతాయి. ధ్రువపత్రాల పరిశీలన జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 2న నిర్వహించనున్నారు.

కోర్సులు, కళాశాలల ఎంపికకు ఆగస్టు 4 నుంచి 8 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 8న ఐచ్ఛికాలు మార్పు చేసుకోవచ్చు. ఆగస్టు 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఆగస్టు 12 నుంచి 16వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది. ఇక ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఏపీ ఐసెట్ 2024 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు

నేటి నుంచి తెలంగాణ పాలిసెట్‌ 2024 ప్రత్యేక విడత ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి జులై 26న నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. జులై 26 స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని, జులై 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని అన్నారు. ఇక జులై 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, జులై 31న సీట్ల కేటాయింపు ఉంటుందని ఆమె వివరించారు.

బోయే 3 రోజులు ఏపీలో వెదర్ ఎలా ఉంటుంది.. ఇదిగో రిపోర్ట్

షియర్ జోన్ ఇప్పుడు భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టం నకు 5.8 & 7.6 కి.మీ ఎత్తు మధ్య సుమారుగా 18° ఉత్తర అక్షాంశం వెంబడి వ్యాపించి, ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణం వైపు వంగి ఉన్నది.

మరోవైపు రుతుపవనాల ప్రభావం కూడా రాష్ట్రంపై బాగా ఉంది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శుక్రవారం, శనివారం:– తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

శుక్రవారం, శనివారం, ఆదివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఫోన్ స్పీకర్ సౌండ్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌

ఈ రోజుల్లో మనం కాల్స్ చేయడానికి, సందేశాలు పంపడానికి, వీడియోలు చూడటానికి, సంగీతం వినడానికి, అనేక ఇతర విషయాలకు ఫోన్‌లను ఉపయోగిస్తాము. అయితే ఫోన్ సౌండ్ సరిగ్గా పని చేయడం చాలా ముఖ్యం.

కానీ కొన్నిసార్లు ఫోన్ స్పీకర్ సౌండ్‌ తగ్గుతుంతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. ఫోన్‌లో సౌండ్ సరిగ్గా రాకుంటే స్పీకర్‌ సౌండ్‌లో సమస్య ఉన్నట్లయితే. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటే, మీరు ఇంట్లో దాన్ని పరిష్కరించవచ్చు.

ఫోన్ స్పీకర్ వాల్యూమ్ తక్కువ కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. స్పీకర్‌లో దుమ్ము లేదా ధూళి పేరుకుపోవడం లేదా ఎలక్ట్రానిక్ భాగం దెబ్బతినడం వల్ల స్పీకర్ సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఫోన్ స్పీకర్ వాల్యూమ్ తగ్గిపోయినట్లయితే, మీరు కొన్ని సాధారణ పద్ధతులతో దాన్ని పరిష్కరించవచ్చు.

స్పీకర్ క్లీనర్ యాప్ : మీ ఫోన్ స్పీకర్ పని చేయక పోతే ఫోన్‌లో నీరు చేరడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటే, అటువంటి పరిస్థితిలో మీరు స్పీకర్ క్లీనర్ యాప్ సహాయం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తున్నాయి. మీ ఫోన్ నీటి నిరోధకత లేకుంటే, స్పీకర్ క్లీనర్ యాప్‌ని ఉపయోగించి మీరు స్పీకర్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం.

డిస్టర్బ్ చేయవద్దు : మీ ఆండ్రాయిడ్ ఫోన్ యాక్టివ్ డోంట్ డిస్టర్బ్ మోడ్‌ (DND)లో ఉన్నట్లయితే స్పీకర్ ఇన్‌కమింగ్ కాల్‌లు, నోటిఫికేషన్‌లతో పని చేయదు. అలాంటప్పుడు, మీరు DND మోడ్‌ను ఆఫ్ చేయాలి.

మొబైల్ స్పీకర్‌ను శుభ్రం చేయండి: కొన్నిసార్లు ఫోన్ స్పీకర్‌లో దుమ్ము పేరుకుపోవడం వల్ల సౌండ్ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో మొబైల్ నిపుణుల ప్రకారం, మెరుగైన పనితీరు కోసం స్పీకర్ క్లీనింగ్ అవసరం. మీరు మీ ఫోన్ స్పీకర్‌ను శుభ్రం చేయాలి. దీని కోసం మీరు మృదువైన టూత్ బ్రష్ లేదా స్పీకర్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. స్పీకర్‌ను చాలా గట్టిగా రుద్దకూడదని గుర్తుంచుకోండి. అది స్పీకర్‌ను దెబ్బతీస్తుంది.

ఫోన్ సెట్టింగ్‌ల నుండి సౌండ్‌ సమస్య పరిష్కారం: కొన్నిసార్లు ఫోన్ సెట్టింగ్‌లు స్పీకర్‌తో సమస్యలను కూడా కలిగిస్తాయి. స్పీకర్‌ని క్లీన్ చేసిన తర్వాత కూడా సౌండ్ బాగా లేకుంటే, ఫోన్ సెట్టింగ్‌లను మార్చడానికి ప్రయత్నించండి. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సౌండ్‌లు, వైబ్రేషన్‌లపై నొక్కండి. ఇక్కడ మీరు మీడియా, రింగ్‌టోన్, అలారం మొదలైన వాటి వాల్యూమ్‌ను పూర్తిగా సెట్ చేసుకుని చూడండి. దీని తర్వాత సౌండ్‌ ప్లే చేయండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: చాలా సార్లు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం కూడా స్పీకర్‌లో సమస్యలను కలిగిస్తుంది. అందుకే సాఫ్ట్‌వేర్‌ను సమయానికి అప్‌డేట్‌ చేయండి. ఇది అనేక ఫోన్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పద్ధతులన్నీ ఫోన్ స్పీకర్‌ను సరిచేయకపోతే ఫోన్‌ను మొబైల్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా

ప్రతి నెలా డబ్బుకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. ఆగస్టు నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది.

ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర కూడా నెల మొదటి తేదీన నిర్ణయించబడుతుంది. కొత్త నియమాలను గురించి తెలుసుకుందాం.

LPG గ్యాస్ సిలిండర్ ధర: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన మార్పు ఉంటుంది. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరలను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు: ఛార్జీ చెల్లింపు చేయడానికి CRED, Cheq, MobiKwik, Freecharge, ఇతర సేవలను ఉపయోగించే కస్టమర్‌లకు లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ చేయబడుతుంది. ప్రతి లావాదేవీకి ₹3000 మాత్రమే పరిమితం చేయబడింది. ఒక్కో లావాదేవీకి రూ.15,000 కంటే తక్కువ ఇంధన లావాదేవీలకు ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే, రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలకు మొత్తం మొత్తంపై 1% ఛార్జ్ చేయబడుతుంది. ఒక్కో లావాదేవీకి రూ.3,000కి పరిమితం చేయబడింది.
లావాదేవీలు: రూ.50,000 కంటే తక్కువ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ విధించరు. రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీలకు మొత్తం మొత్తంపై 1% ఛార్జ్ చేయబడుతుంది. కళాశాల లేదా పాఠశాల వెబ్‌సైట్‌లు లేదా వారి POS మెషీన్‌ల ద్వారా నేరుగా చేసిన చెల్లింపులు ఛార్జ్-రహితంగా ఉంటాయి. అయితే, CRED, Cheq, MobiKwik, ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలకు 1% ఛార్జీ విధించబడుతుంది. ఆలస్య చెల్లింపు ఛార్జ్ ప్రక్రియ రూ.100 నుండి రూ.1,300 వరకు ఉన్న బకాయి మొత్తం ఆధారంగా సవరిస్తారు. ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో సులభమైన-EMI ఎంపికను పొందడంపై రూ.299 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు విధిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పైన పేర్కొన్న అన్ని ఛార్జీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లలో ఆగస్టు 1, 2024 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఆగస్ట్ 1, 2024 నుండి, టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు టాటా న్యూ యుపిఐ ఐడిని ఉపయోగించి చేసిన అర్హత గల యుపిఐ లావాదేవీలపై 1.5% న్యూకాయిన్‌లను పొందుతారు.
Google Map నియమాలను మార్పు: Google Maps భారతదేశంలోని దాని నియమాలలో ముఖ్యమైన మార్పులను చేసింది. ఇది ఆగస్టు 1, 2024 నుండి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కంపెనీ భారతదేశంలో తన సేవలకు 70 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది. దీంతో ఇప్పుడు గూగుల్ మ్యాప్ తన సేవల కోసం డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలలో డబ్బు తీసుకోనుంది. అయినప్పటికీ, ఈ మార్పు సాధారణ వినియోగదారులపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించరు.

టిక్కెట్ లేకపోతే రైల్వే చర్యలు.. జరిమానాతో పాటు జైలు శిక్ష

భారతదేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ టక్కున గుర్తుచ్చేది రైలు. రైల్వే ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా మారింది. రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు.

అయితే ఈ స్థాయిలో ప్రయాణికుల్లో మనం ఏ పాటి అనే చందాన చాలా మంది టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వీరి వల్ల రైల్వేకు కోట్లల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా రైళ్లల్లో జరిగే దొంగతనాలకు చాలా వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారే కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లెస్ ప్రయాణాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఎదుర్కోవాల్సిన ఇబ్బందుల గురించి వివరాలను తెలుసుకుందాం.

అధికారిక నిబంధనల ప్రకారం భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే జరిమానా విధిస్తుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి లేదా స్టార్టింగ్ స్టేషన్ నుండి అదనంగా రూ.250 ఛార్జీతో సాధారణ సింగిల్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో పాటు మొత్తం రైల్వే టిక్కెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు. అలాగే మోసపూరిత ప్రయాణానికి రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. అలారం చైను లాగితే 12 నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. వికలాంగ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లో సాధారణ ప్రయాణీకుడు ప్రయాణిస్తే వారికి 3 నెలల జైలు, రూ. 500 జరిమానా లేదా రెండూ పొందవచ్చు. అలాగే రైలు పైకప్పుపై ప్రయాణం చేస్తే 3 నెలల జైలు లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ విధిస్తారు.

భారతీయ రైల్వేలు భద్రత పై ఎక్కువ ఖర్చు చేయనుందని, ఈ మేరకు రైల్వే మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్ ద్వారా ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే రూ. 2.62 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయంలో దాదాపు సగం ఖర్చు చేయాలని యోచిస్తోంది. సాధారణ, నాన్-ఏసీ ప్రయాణీకుల కోసం కోచ్‌లను అందుబాటులో తీసుకొస్తామని రైల్వే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ, టోఫెల్‌ మంచి చెడులపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ, టోఫెల్‌ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసిందని, అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధంగా లేరని ఆయన గురువారం విలేకరులతో తెలిపారు. ఈ నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి మంచి చెడులపై అధ్యయనం చేశాకే ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. అనంతరం తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధివిధానాలను పరిశీలిస్తామని మంత్రి లోకేష్‌ చెప్పుకొచ్చారు.

ఏపీ సర్కార్ కీలక ప్రకటన.. పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా సీట్ల తగ్గింపు

నీట్‌ పీజీ ద్వారా ఇన్‌సర్వీస్‌ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్‌-క్లినికల్‌ కేటగిరీ విభాగాల్లో 30 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులను 2024-25 విద్యా సంవత్సరంలో అమలుచేస్తామని వివరించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్పెషాలిటీల వారీగా భర్తీ చేసే సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. క్లినికల్‌ విభాగంలో 15 శాతం, నాన్‌-క్లినికల్‌ విభాగంలో 30 శాతం మించకుండా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. అలాగే పీజీ పూర్తిచేసిన అభ్యర్ధులు పదేళ్లపాటు విధిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారంగా వ్యవహరించని వైద్యుల అర్హత సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం యూనివర్సిటీకి ఉంటుందని, అంతేకాకుండా అటువంటి వారికి రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.

మీ ఫోన్ పోయిందా.. ఇలా చేస్తే అప్పటిలోగా తిరిగి పొందొచ్చు..

గతంలో ఫోన్ పోయినా.. చోరీకి గురైనా.. ఇక అది చేతికి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పోలీసులు టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో గంటల వ్యవధిలోనే ట్రాక్ చేస్తున్నారు.

తాజాగా సైబరాబాద్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన 345 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ ఫోన్లు అన్నింటిని కేవలం 30 రోజుల్లోనే రికవరీ చేయడం విశేషం. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఐటీ సెల్ వింగ్ 30 రోజుల్లో 345 ఫోన్లను రికవరీ చేయగలిగింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను గురువారం క్రైమ్స్ డీసీపీ కె.నరసింహ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రైమ్స్ డీసీపీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు మన లైఫ్‌లో కీ రోల్స్ పోషిస్తున్నాయని.. ఎన్నో జ్ఞాపకాలతో పాటు ఎంతో ముఖ్యమైన సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుందన్నారు. దొంగలు ఎప్పుడు, ఎలా.. చోరీకి పాల్పడతారో తెలియదన్నారు. అందుకే అందరూ అలెర్ట్‌గా ఉండాలన్నారు.

అలాగే ఫోన్ల రికవరీ విషయంలో పోలీసుల అశ్రద్దగా వ్వవహరించకుండా.. పట్టుదలగా వ్యవహరించాలన్నారు. చాలా మంది చదువుకున్నవాళ్లకి కూడా.. చోరీకి గురైన ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఎలా నిరోధించాలో తెలియదన్నారు. కొద్దిమందికి మాత్రమే దానిపై అవగాహన ఉన్నట్లు చెప్పారు. NCRP పోర్టల్, CEIR పోర్టల్ లేదా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అందుబాటులో ఉన్న 1930 నేషనల్ హెల్ప్ లైన్ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ వివరాలు చెప్పాలని డీసీపీ పౌరులకు సూచించారు. సెల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసిన పోలీసు బృందాలను క్రైమ్స్ డీసీపీ అభినందించారు.

నెలకి 35,000 జీతం తో హై కోర్ట్ లో క్లర్క్ ఉద్యోగాలు..

గౌరవనీయ న్యాయమూర్తులకు సహాయం చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పన్నెండు (12) లా క్లర్క్‌ల నియామకం కోసం మార్గదర్శకాలలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలను నెరవేర్చే అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

A.P ప్రభుత్వం A.P హైకోర్టు, గెజిట్ నోటిఫికేషన్ నెం.88, తేదీ 18.07.2020, గెజిట్ నోటిఫికేషన్ నం.63, తేదీ 21.06.2023 మరియు గెజిట్ నోటిఫికేషన్ నం.58, 28.02.2024 తేదీ ప్రకారం’

Total Posts: 12

Salary: గౌరవ వేతనం నెలకు రూ.35,000/- (ముప్పై ఐదు వేలు మాత్రమే)

Job type: Contract

అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ

దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024 (by 5.00PM)

వయస్సు, విద్యార్హతలకు సంబంధించిన రుజువుకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్ల అటెస్టెడ్ కాపీలతో పాటు సక్రమంగా పూరించిన దరఖాస్తులను పంపవలసిన చిరునామా:

రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్),
A.P. హైకోర్టు, A.P,
అమరావతి, నేలపాడు,
గుంటూరు జిల్లా,, పిన్ కోడ్ – 522239.

ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..!

ముఖం అందంగా, కాంతి వంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, నేటి వాతావరణం పరిస్థితులు, కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే చాలా మందిలో జుట్టు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో బ్యూటీపార్లర్లు, మార్కెట్లో దొరికే చాలా రకాల కెమికల్ ప్రొడక్ట్స్ కొనేసి వాడేస్తున్నారు చాలా మంది. అలాగే, మరికొంత మంది ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ రాస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సరైనది.. విటమిన్‌ ఈ క్యాప్సిల్స్‌ ముఖానికి రాయచ్చా.. రాస్తే ఏమవుతుంది..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ ఈ ముఖానికి చాలా మంచి గ్లో ఇస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్ల కారణంగా చిన్న వయసులోనే వచ్చిన ముడుతలను విటమిన్-ఇ తొలగిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

విటమిన్ ఈ క్యాప్సూల్ చర్మానికి తేమను అందిస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముఖ్యంగా డీహైడ్రేట్ చేయబడిన లేదా పొడి చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మానికి శోథ నిరోధక లక్షణాలను కూడా అందిస్తుంది, చర్మానికి ఓదార్పు ప్రభావాలను ఇస్తుంది. విటమిన్ ఈ క్యాపిల్స్ డైరెక్ట్ గా రాస్తే.. చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

విటమిన్‌ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల.. ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మాన్ని చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉండేలా మారుస్తుంది.

ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి రాసేయటం కంటే..ఈ క్యాప్సూల్‌ను ఫేస్ ఆయిల్ లేదా టోనర్‌లో మిక్స్‌ చేసుకుని వాడుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ చర్మానికి సరిపోయే మంచి ఫేస్ ఆయిల్ లేదా రోజ్ వాటర్ వంటి సహజమైన ఫేషియల్ టోనర్‌తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దానికంటే.. ముందు.. ముఖాన్ని మంచి క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఫేస్ మాస్క్‌లో కూడా విటమిన్-ఇ క్యాప్సూల్స్‌ను వాడొచ్చు. ఇది మీ చర్మానికి మరింత పోషణను అందిస్తుంది. అలోవెరా జెల్, ముల్తానీ మిట్టి లేదా పెరుగు వంటి ఏదైనా సహజమైన ఫేస్ మాస్క్‌లో విటమిన్‌ ఈ క్యాప్సూల్స్‌ను కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లో బాగా మిక్స్ చేసి ముఖానికి సమానంగా అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మాల్దీవులే కాదు ఈ ప్రాంతాలకు కూడా చాలా చవకగా తిరిగేయచ్చు, లక్ష రూపాయలుంటే చాలు

Honeymoon Places: విదేశాల్లో హనీమూన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలి, మాల్దీవులు వంటి ప్రాంతాలే. ఈ రెండే కాదు హనీమూన్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇతర దేశాలకు కూడా వెళ్లవచ్చు. అలా లక్ష రూపాయల ఖర్చుతో వెళ్లి వచ్చేసే దేశాలు ఇవిగో.

పెళ్లితో పాటూ హనీమూన్ కూడా ప్లాన్ చేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువే. ఎన్నో జంటలు విదేశాల్లో హనీమూన్ నిర్వహించుకోవాలని అనుకుంటారు. నిజానికి పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలోనే నూతన భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారని చెబుతుంటారు. వైవాహిక జీవితంలో అలసట, ఒత్తిడిని దూరం చేసుకోవడం కూడా ఇది చాలా అవసరం.

హనీమూన్ ప్లాన్ చేయడంలో ఫ్లైట్స్ బుక్ చేయడం, హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ట్రిప్పులు ప్లాన్ చేయడం వంటివి ఉంటాయి. కాబట్టి ముందుగానే చేస్తే ప్రయాణం సులువవుతుంది. అయితే, మొదట మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హనీమూన్ ప్రదేశం అనగానే బాలి, మాల్దీవులు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రదేశాలు బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్లి రావచ్చు. చేతిలో లక్ష రూపాయలు ఉన్నా కూడా ఈ రెండు ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. కేవలం ఈ రెండు ప్రాంతాలే కాదు… మరో అయిదు ప్రదేశాలకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు.
న్యూజిలాండ్

భారతదేశం వెలుపల అత్యంత హ్యాపీ హనీమూన్ గమ్యస్థానాలలో న్యూజిలాండ్ ఒకటి. ఇక్కడ బంగీ జంప్ లతో మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇక్కడ మీరు లగ్జరీ క్రూయిజ్ లో కూడా వెళ్ళవచ్చు. తిరగడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి వాతావరణానికే మీ గుండె ఉత్తేజితమైపోతుంది.
స్విట్జర్లాండ్

మంచుతో కప్పిన పర్వతాలు, ప్రకాశవంతమైన రంగులలోని వృక్షసంపద చూడాలంటే స్విట్జర్లాండ్ వెళ్లండి. ఆ దృశ్యాలను మీరు వాస్తవంగా చూస్తే పరవశించిపోతారు. మీరు మీ భాగస్వామితో కలిసి స్విట్జర్లాండ్ వెళితే అది మరపురాని ప్రయాణంగా మారిపోతుంది. ఇక్కడ మీరు మీ భాగస్వామితో చిరస్మరణీయమైన రొమాంటిక్ క్షణాలను గడపవచ్చు.

శ్రీలంక

శ్రీలంక భారత్ కు అతి సమీపంలో ఉంది. భాగస్వామితో కలిసి హనీమూన్ కోసం ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు. శ్రీలంకలోని నువారా ఎలియా ప్రాంతానికి వెళ్లి మీ భాగస్వామితో కలిసి ఒక కప్పు టీని ఆస్వాదించండి. అందమైన జలపాతాలు, తేయాకు తోటలు, పాత భవనాలను చూడాలనుకుంటే హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లండి.
థాయిలాండ్

భారతదేశం వెలుపల ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలలో థాయ్ లాండ్ ఒకటి. ఇక్కడ అందమైన కోహ్ ఫిఫి ద్వీపం ఒక ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం. బీచ్ లో సేదతీరాలన్నా, స్నార్కెలింగ్ ఎంజాయ్ చేయాలన్నా థాయ్ లాండ్ వెళ్లొచ్చు. దీనికి కూడా పెద్దగా ఖర్చు కాదు.
టర్కీ

ఈ దేశం శతాబ్దాల చరిత్ర కలిగినది. టర్కీలో మీరు భాగస్వామితో కలిసి ఎయిర్ బెలూన్ లో ప్రయాణం చేయచ్చు. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ప్రయాణం మీకు అందమైన మధుర క్షణాలను అందిస్తుంది.

ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ – సీఎం చంద్రబాబు

AP Assembly Session Updates 2024: ఏపీ ఆర్థిక పరిస్థితులపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రూ.76 వేల కోట్ల ఆదాయం దెబ్బతినే విధంగా.. జగన్ రెడ్డి అసమర్ధ పాలన కొనసాగిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సభలో వీడియోల ద్వారా లెక్కలను వివరించారు.

White Paper On AP Financial Status : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… తాము రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని గుర్తు చేశారు. కానీ పాలసీ మార్చి తమకు కావాలసిన వారికి వైసీపీ ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఇవి చాలా ఆలస్యం అయ్యాయని తెలిపారు. వైసీపీ పాలన కారణంగా… రాష్ట్రానికి రూ.76,795 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పుకొచ్చారు.

అమరావతి అభివృద్ధి కొనసాగి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి చెంది ఉంటే రూ.3లక్షల కోట్ల ఆస్తి వచ్చేదని పేర్కొన్నారు.

విభజన తరువాత, అధికారం చేపట్టి 2014-2019 మధ్య అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టటమన్నారు చంద్రబాబు. పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి తీసుకుని వచ్చామని గుర్తు చేశారు.

“2019లో రాష్ట్రం ఒక అసమర్ధుడి చేతిలోకి వెళ్ళింది. 2014-2019తో పోల్చుకుంటే, 2019- 2024 మధ్య వ్యవసాయంలో 5.7% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. సర్వీస్ సెక్టార్ 2% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. ఓవరాల్ గ్రోత్ రేట్ 3% తగ్గిపోయింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

కేవలం అసమర్ధ, తుగ్లక్ నిర్ణయాలు, అవినీతితో… గత 5 ఏళ్ళలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందన్నారు చంద్రబాబు. రూ.76 వేల కోట్ల ఆదాయం దెబ్బతినే విధంగా.. గత జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధ పాలన కొనసాగిందని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి చేసిన ఘనకార్యంతో తలసరి ఆదాయం తగ్గి, తలసరి అప్పు రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు.

“ప్రజలపై రకరకాల పన్నులు వేసి, ఆ మొత్తం జేబులో వేసుకుని, మళ్ళీ అప్పులు చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ. 33 సంస్థల నుంచి.. వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో రూ.1.35 లక్షల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మొత్తం బాకీలు పెట్టి… దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు.

పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయంలో పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లు కూడా టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేవని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని మార్చామని… కానీ వైసీపీ పాలనలో ఎలాంటి పెట్టుబడులు లేకుండా పోయాయని దుయ్యబట్టారు.

“జగన్ రెడ్డి పాలన ఎంత అధ్వానం అంటే.. భవిష్యత్తులో 15 ఏళ్ళ పాటు వచ్చే మద్యం ఆదాయం చూపించారు.వాటిపై అప్పులు తెచ్చుకున్నాడు. విభజన వల్ల జరిగిన నష్టం కన్నా.. జగన్ వల్ల జరిగిన నష్టమే రాష్ట్రానికి ఎక్కువ. జూన్, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు( దాదాపు పది లక్షల కోట్లు). వీటిలో ఇంకా కార్పోరేషన్ రుణాలు, ఇతర శాఖల నుంచి రావలిసిన సమాచారం ఇంకా ఉంది” అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు : రూ.9,74,556 కోట్లు (పది లక్షల కోట్లు)

ప్రైవేట్ వ‌ర్శిటీల్లో బీఎస్సీ ఆన‌ర్స్‌, బీటెక్ కోర్సుల‌ ప్రవేశాలు – నోటిఫికేష‌న్ విడుద‌ల

ANGRAU Admissions 2024: రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివ‌ర్శిటీల్లో బీఎస్సీ (ఆన‌ర్స్‌) అగ్రిక‌ల్చ‌ర్‌, బీటెక్ (ఫుడ్ టెక్నాల‌జీ) కోర్సుల కోసం ఆచార్య‌ ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆగ‌స్టు 2 తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది.

బీఎస్సీ, బీటెక్‌ కోర్సుకు సంబంధించి 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివ‌ర్శిటీల్లో అడ్మిష‌న్ కోసంద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్‌ యూనివ‌ర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగ‌స్టు 2వ తేదీని తుది గడువుగా నిర్ణ‌యించింది.

అద‌న‌పు రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చేసుకోవ‌డానికి ఆగ‌స్టు 12 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/register పై క్లిక్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
యూనివర్శిటీలు…సీట్లు

రాష్ట్రంలో మొత్తం రెండు ప్రైవేట్ యూనివ‌ర్శిటీల్లో బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సు ఉంది. భార‌తీయ ఇంజ‌నీరింగ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ యూనివ‌ర్శిటీ (బీఈఎస్‌టీఐయూ-స‌త్య‌సాయి జిల్లా)లో 175 సీట్లు ఉన్నాయి. మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీ (ఎంబీయూ-తిరుప‌తి)లో 63 సీట్లు ఉన్నాయి. ఈ రెండు యూనివ‌ర్శిటీలు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన‌వి. ఎన్‌జీ రంగా యూనివ‌ర్శిటీతో ఎటువంటి సంబంధం లేదు. కాక‌పోతే ఈ రెండు యూనివ‌ర్శిటీల్లో గ‌వ‌ర్న‌మెంట్ కోటా (క‌న్వీన‌ర్ కోటా) సీట్ల భ‌ర్తీకి అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ మాత్రం ఎన్‌జీ రంగా యూనివ‌ర్శిటీ ఇస్తుంది.

అడ్మిష‌న్ల ప్ర‌క్రియ పూర్తి అయిపోతే, ఎన్‌జీ రంగా యూనివ‌ర్శిటీ జోక్యం మ‌రి ఉండ‌దు. గ‌వ‌ర్న‌మెంట్ కోటా సీట్ల‌పై ఎటువంటి ఫిర్యాదులపై ఈ రెండు ప్రైవేట్ యూనివ‌ర్శిటీల‌కు బాధ్య‌త ఉండ‌దు. రెండు ద‌శ‌ల కౌన్సిలింగ్ పూర్తి అయిన త‌రువాత మిగిలిన సీట్ల‌ను ఈ రెండు యూనివ‌ర్శిటీలు స్వాధీనం చేసుకుంటాయి.

అర్హతలు….

రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్‌ పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. లేక‌పోతే దానికి స‌మాన‌మైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ‌ల నుంచి పిజిక‌ల్ సైన్స్‌, బ‌యోల‌జీ, నేచుర‌ల్ సైన్స్ గ్రూపుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. 2024 డిసెంబ‌ర్ 31 నాటికి జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థులు 17-22 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 2003 జ‌న‌వ‌రి 1-2007 డిసెంబ‌ర్ 31 మ‌ధ్య పుట్టిన‌వారై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 17-25 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 2000 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టిన‌వారై ఉండాలి. దివ్యాంగుల‌కు అభ్య‌ర్థుల‌కు 17-27 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 1998 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టిన‌వారై ఉండాలి.

వ్యవ‌సాయ, గ్రామీణ ప్రాంత కుటుంబాల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థుల‌కు రైతు కోటా ఉంటుంది. 40 శాతం సీట్లు వ్యవ‌సాయ కుటుంబాల‌కే కేటాయించారు. అభ్య‌ర్థి క‌నీసం నాలుగేళ్లు నాన్ మున్సిప‌ల్ ప్రాంతం (గ్రామీణ‌)లో చ‌ద‌వి ఉండాలి. ఒక ఎక‌రా కంటే త‌క్కువ భూమి ఉన్న అభ్య‌ర్థులు అర్హులు కాదు. అభ్య‌ర్థి, త‌ల్లిదండ్రుల పేరు మీద భూమి ఉండాలి. తాత‌, నాన్న‌మ్మ‌, గార్డియ‌న్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎవ‌రి పేరు మీద భూమి ఉన్న అర్హులు కాదు.

ఓపెన్ కేట‌గిరిలో 41 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేట‌గిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేట‌గిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేట‌గిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే విక‌లాంగు (పీహెచ్) కేట‌గిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్ల‌ల కేట‌గిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేట‌గిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేట‌గిరీకి 0.5 శాతం, స్కౌట్స్‌, గైడ్స్ కేట‌గిరీలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ కింద 10 శాతం సీట్లు కేటాయించారు.
ఎంపిక విధానం

బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు ఏపీ ఈఏపిసెట్-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూనివర్శిటీ కాలేజీ, అనుబంధ కాలేజీల్లో సీట్లను 85 శాతం లోకల్ సీట్లు కాగా, అందులో ఆంధ్రాయూనివ‌ర్శిటీ, శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ ప్రాంత అభ్య‌ర్థుల‌కు 42ః22 నిష్ప‌త్తిలో కేటాయిస్తారు. 15 శాతం సీట్లు అన్ రిజర్వ‌డ్‌, ఏయూ, ఎస్‌వీయుతోపాటు ఏపీఈఏపీసెట్‌-2024 ర్యాంకు సాధించిన ఉస్మానియా యూనివ‌ర్శిటీ అభ్య‌ర్థులు కూడా సీట్ల‌కు పోటీ ప‌డొచ్చు.

అప్లికేష‌న్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.500 కాగా, ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1,000 నిర్ణ‌యించారు. అప్లికేష‌న్ దాఖ‌లకు గ‌డువు ఆగ‌స్టు 2న ముగిసిన త‌రువాత మ‌రో మూడు రోజులు అద‌న‌పు ఫీజుతో ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ అభ్య‌ర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సు ఫీజులు ఎలా ఉంటాయి?

భార‌తీయ ఇంజ‌నీరింగ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ యూనివ‌ర్శిటీ (బీఈఎస్‌టీఐయూ-స‌త్య‌సాయి జిల్లా)లో ఏడాది ఫీజు రూ.99,000 ఉంటుంది. మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీ (ఎంబీయూ-తిరుప‌తి)లో ఏడాది ఫీజు రూ.1,03,000 ఉంటుంది. ఈ రెండు యూనివ‌ర్శిటీల‌కు సంబంధించి అద‌న‌పు స‌మాచారం కోసం బీఈఎస్‌టీఐయూ అధికారిక వెబ్‌సైట్‌ https://bestiu.edu.in/ , ఎంబీయూ అధికారిక వెబ్‌సైట్ mbu.asia ను సంప్ర‌దించాలి.

అడ్మిష‌న్ స‌మ‌యంలో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు తీసుకుపోవాలి. ఇంట‌ర్మీడియ‌ట్‌ మార్కుల జాబితా, ఏపీ ఈఏపీసెట్‌-2024 హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు. ప‌దో త‌ర‌గ‌తి లేదా ప‌దో ఎస్ఎస్‌సీకి స‌మాన ప‌రీక్ష స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్‌ వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, రెసిడెన్స్ స‌ర్టిఫికేట్‌, టీసీ, ఫార్మ‌ర్ కోటా కింద చేరే విద్యార్థులైతే రూర‌ల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిప‌ల్ ఏరియా స్ట‌డీ స‌ర్టిఫికేట్, భూమికి సంబంధించిన అడంగ‌ల్‌, 1 బీ అద‌న‌పు స‌ర్టిఫికేట్లు తీసుకురావాలి. విక‌లాంగు విద్యార్థులైతే పిహెచ్ స‌ర్టిఫికేట్‌, డిఫెన్స్ పిల్ల‌లైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్య‌ర్థులైతే ఎన్‌సీసీ స‌ర్టిఫికేట్‌, స్పోర్ట్ అభ్య‌ర్థులైతే స్పోర్ట్స్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి. ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌న్నీ అడ్మిష‌న్ స‌మ‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఇత‌ర వివ‌రాల కోసం ఈ క్రింద ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5ః30 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. బీఈఎస్‌టీఐయూకి సంబంధించి 7989171905, 8977808389, 9885262362, 6310194071, 9492725055 ఫోన్ నెంబ‌ర్లు, ఎంబీయూకి సంబంధించి 9469465946, 7997970324 ఫోన్ నెంబ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త ఫీచర్స్, ట్రెండీ టెయిల్ లైట్ తో 2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ లాంచ్

Hero Xtreme 160R 4V: హీరో మోటోకార్ప్ (hero motors) ఇటీవల భారత మార్కెట్లో తన ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ 4విని అప్ డేట్ చేసింది. 160 సీసీ సెగ్మెంట్ గత కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం పొందింది. 150 సీసీ కమ్యూటర్ ను కొనుగోలు చేయడానికి బదులుగా, ప్రజలు మరింత రోడ్ ప్రజెన్స్, మెరుగైన పవర్ ఉన్న బైక్స్ కు మొగ్గు చూపుతున్నారు. దాంతో, 160 సీసీ సెగ్మెంట్ లో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది.

2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వి: అప్ డేటెడ్ గ్రాఫిక్స్, కొత్త కలర్ స్కీమ్

2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) ఒరిజినల్ డిజైన్ లోనే ఉంటుంది. కానీ, కొత్తగా ఇప్పుడు నలుపు, బ్రాంజ్ యాక్సెంట్స్ తో కెవ్లార్ బ్రౌన్ పెయింట్ స్కీమ్ తో వస్తుంది. ఈ బైక్ కొత్త బాడీ గ్రాఫిక్స్ ను కూడా కలిగి ఉంది. అయితే మునుపటి కలర్ ఆప్షన్లైన నియాన్ షూటింగ్ స్టార్, మ్యాట్ స్లేట్ బ్లాక్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వి: కొత్త ఫీచర్లు

2024 ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, పానిక్ బ్రేక్ అలర్ట్ సిస్టమ్, డ్రాగ్ టైమర్ వంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అదనంగా, 2024 మోడల్ లో మెరుగైన పిలియన్ సౌకర్యం కోసం సింగిల్-పీస్ సీటు ఉంటుంది. ఇది మునుపటి వెర్షన్లలో ఉన్న స్ప్లిట్ సీట్లకు భిన్నంగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ ముందు భాగంలో యూఎస్డీ ఫోర్క్ లు, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంటుంది. రెండు వైపులా డిస్క్ బ్రేక్ లను అమర్చారు. ఈ మోటార్ సైకిల్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఎక్స్ ట్రీమ్ 160ఆర్ టూ వాల్వ్ వేరియంట్

ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ టూ వాల్వ్ వేరియంట్ ఎప్పుడూ ఒకే సీటును కలిగి ఉండటం గమనార్హం. 2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V లో మెరుగైన విజిబిలిటీ కోసం 300% పెరిగిన బ్రైట్ నెస్ తో కొత్త స్పీడోమీటర్ ఉంది. అలాగే, హెచ్-మోటిఫ్ తో రీడిజైన్ చేసిన టెయిల్ లైట్ ఉంటుంది. ఇందులో 163.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 16.6 బీహెచ్పీ, 14 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
2024 హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ ధర

2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ కొత్త కలర్ ధర రూ.1,38,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. దీంతో ధర రూ.4,000 పెరిగింది. ఇది ఇప్పుడు ‘ప్రీమియం’ అనే సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులో ఉంది.

ఐటీఆర్ ఫైలింగ్ గడువు ఆగస్టు 31 వరకు పెంచారా?.. ఐటీ అధికారులేమంటున్నారు

ITR deadline: ఐటీఆర్ రిటర్నుల గడువుకు సంబంధించిన ఫేక్ వార్తలపై ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల క్లిప్పింగ్ ఫేక్ అని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31 అని ఐటీ శాఖ తెలిపింది.

సోషల్ మీడియా వార్తలు ఫేక్

“ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని పొడిగించడానికి సంబంధించి సందేశ్ న్యూస్ వారి న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ / పోర్టల్ లోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి’’ అని ఐటీ శాఖ స్పష్టం చేసింది..
ఆదాయపు పన్ను రిఫండ్స్ స్కామ్

ఆదాయ పన్ను (income tax) రిఫండ్స్ కు సంబంధించి జరుగుతున్న కుంభకోణం గురించి కూడా పన్ను చెల్లింపుదారులను పన్ను శాఖ హెచ్చరించింది. ‘‘రీఫండ్స్ కోసం ఎదురు చూస్తున్న వారిలో కొత్త తరహా కుంభకోణం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సెమ్మెస్, మెయిల్ పంపడం ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేందుకు స్కామర్లు ట్యాక్స్ రీఫండ్స్ ముసుగును ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మెసేజ్ లను నమ్మవద్దు’’ అని హెచ్చరించింది.
4 కోట్లకు పైగా ఐటీఆర్ ల ఫైలింగ్

2024 జూలై 22 వరకు 4 కోట్లకు పైగా ఐటీఆర్లు (ITR) దాఖలయ్యాయని, గత ఏడాది ఇదే సమయంలో దాఖలు చేసిన రిటర్న్ లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ పేర్కొంది. జూలై 16 నాటికీ రోజువారీగా దాఖలైన ఐటిఆర్ల సంఖ్య 15 లక్షలు దాటింది. 2024 జూలై 31 గడువు తేదీ సమీపిస్తున్నందున రోజువారీగా దాఖలయ్యే ఐటీఆర్ ల సంఖ్య ప్రాతిపదికన మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇవే టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ నంబర్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కోటి ఐటీఆర్ ల (ITR) దాఖలు మైలురాయి 2024 జూన్ 23న చేరుకోగా, జూలై 7వ తేదీన 2 కోట్ల మైలురాయిని, జూలై 16 వ తేదీన 3 కోట్ల మైలురాయిని సాధించింది. 4 కోట్ల మైలురాయిని జూలై 22 న సాధించింది. ITR ఫైలింగ్ కు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులు ఐటీ శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ నంబర్లను (1800 103 0025 లేదా 1800 419 0025) లేదా Efilingwebmanager@incometax.gov.in సంప్రదించవచ్చు.

గుండెపోటుకు బై బై..వందేళ్లు హాయ్‌ హాయ్‌

గుండెజబ్బుల నివారణకు సరికొత్త మందు భారత మార్కెట్లోకి వచ్చింది

Inclisiron ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది

ఇది LDL స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు

హైదరాబాద్: గుండెపోటు రాకుండా నూరేళ్లు జీవించాలనుకుంటున్నారా? గుండె సమస్యలను నివారించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసం మార్కెట్లో కొత్త మందు వచ్చింది. ఔషధం గుండెపోటు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దాని పేరు ఇంక్లిసిరాన్.. అపోలో హాస్పిటల్ మరియు నోవార్టిస్ సంయుక్తంగా మార్కెట్లోకి ఒక మందును తీసుకొచ్చాయి. ఈ మందుతో గుండెపోటు రాకుండా వందేళ్లు జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండెపోటులు రెట్టింపు అయ్యాయి ..

భారతదేశంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గుండె సమస్యల కారణంగా ఏటా 20 శాతం మరణాలు పురుషులు మరియు 17 శాతం స్త్రీలు. గత 30 ఏళ్లలో గుండె జబ్బుల వల్ల మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, భారతదేశంలో గుండె సంబంధిత సమస్యలు పదేళ్ల ముందే వస్తుంటాయి. ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగింది. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి, కానీ చాలా వరకు గుండెపోటులు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (LDL) వల్ల సంభవిస్తాయి.

అసలేంటీ మందు..?

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇన్‌క్లిసిరాన్ అనే మందు కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి స్టాటిన్స్ చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి, అయితే ఇన్‌క్లిసిరాన్ వాటి కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది. ఇంజక్షన్ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్ లాగా తీసుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ ఇంజక్షన్ తీసుకుంటే గుండెపోటు రాదని పేర్కొంటున్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?

Inclisiron (ఒక సింథటిక్ siRNA) సాధారణంగా కొవ్వుల తయారీ ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది. సబ్‌టిలిసిన్ కెక్సిన్-9 (PCSK9), ప్రొప్రొటీన్ కన్వర్టేజ్, ప్లాస్మాలో తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)ని నియంత్రించే సెరైన్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది PCSK9 మెసెంజర్ RNAతో బంధిస్తుంది మరియు PCSK9 ప్రోటీన్‌ను తయారు చేయకుండా నిరోధిస్తుంది. ఇది ప్లాస్మాలోని LDL ను గణనీయంగా తగ్గిస్తుంది మరియు కాలేయం రక్తంలోని LDL ను గ్రహించేలా చేస్తుంది. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. 200 స్థాయిని కూడా 40కి తగ్గించేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఔషధాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఆల్కహాల్ మరియు సిగరెట్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయినప్పటికీ, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవారిలో ఈ ఔషధం తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. – శ్రీనివాస్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్

ఎవరు ఉపయోగించగలరు?

కార్డియోవాస్కులర్ సమస్యలు సాధారణంగా అన్ని వయసుల వారికి వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉంటే వారందరూ చిన్నవయసులోనే ఈ మందు వేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్నవయసులో అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు, 40 ఏళ్లు పైబడిన వారు ఈ మందు తీసుకుంటే గుండెపోటు రాకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. గుండెలో స్టెంట్ వేసిన వారు కూడా ఈ ఇంజెక్షన్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

అనుమతులు పొందారా?

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ ఇప్పటికే ఈ ఔషధానికి అనుమతి మంజూరు చేయగా, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కార్యాలయం 6 నెలల కిందటే భారతదేశంలో అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం ఇటీవల మార్కెట్లోకి వచ్చింది.

CM చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు

సీఎం చంద్రబాబు: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లా మంత్రులు వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని చెప్పారు.

వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.3 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టం వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

ముఖం పంది.. శరీరం చేప.. నెట్టింట జోరుగా వైరల్..

సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట షికారు చేస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి.

కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని బాధ పెట్టిస్తాయి. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా కొన్ని జంతువులు చాలా వింతగా కనిపిస్తాయి. అలాంటి వాటికి సంబంధించిన న్యూస్ కూడా క్షణాల్లో వైరల్‌గా మారతాయి. తాజాగా సోషల్ మీడియాలో పంది రూపంలో ఉండే ఓ చేప ఫోటోలు సందడి చేస్తున్నాయి. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా? అని అనుమానం పడుతున్నారు.

ఈ జంతువు చూడటానికి చేపలా కనిపిస్తుంది. కానీ ముఖం ఆకారం మాత్రం పందిలా ఉంది. ఊపిరి పీల్చుకోవడం కూడా వరాహంలాగానే పీల్చుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో @gofishingindonesia అనే ఇన్స్టాగ్రామ్ తన ఖాతా షేర్ చేసింది. ఈ ఇన్ స్టా ఖాతాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి.

ఈ వీడియోలో చేప రూపాన్ని చూసిన వాళ్లు.. నిజంగానే ఇలాగే ఉందా? అని సందేహ పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇది ఫేక్ అని.. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారని అంటున్నారు. మరికొందరు మాత్రం కాదు ఇది నిజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో, ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.

కేవలం రూ.49తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో అదిరిపోయే ప్లాన్స్‌

జియో నుండి ఎయిర్‌టెల్ వరకు పెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా భారతదేశంలో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నారు. వారి రీఛార్జ్ ప్లాన్‌లలో వివిధ OTT సబ్‌స్క్రిప్షన్‌లు కూడా అందిస్తున్నాయి.

అంటే, వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మాత్రమే చెల్లించడం ద్వారా బహుళ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా చూసే అవకాశాన్ని పొందుతారు. ఈ అదనపు ప్రయోజనం భారతీయ వినియోగదారులకు అదనపు ఆకర్షణ. ఇటీవల దాదాపు అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను భారీగా పెంచాయి. దీంతోపాటు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చాలా కాలం తర్వాత మళ్లీ నిలదొక్కుకుంది. రూ.15000 కోట్ల విలువైన టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం, సర్వీస్ నెట్‌వర్క్‌ని అమలు చేయడానికి 4G BSNL సహాయం చేస్తుంది. దీన్ని తర్వాత 5Gకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది కాకుండా, BSNL రీఛార్జ్ ప్లాన్‌లు కూడా చాలా సరసమైనవి. అందుకే బీఎస్‌ఎన్‌ఎల్‌కి ఆదరణ పెరుగుతోంది.

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలను వదిలి బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్ తీసుకునే అలవాటు వినియోగదారులలో మొదలైంది. అయినప్పటికీ, చాలా మంది OTT సబ్‌స్క్రిప్షన్‌లను పరిగణనలోకి తీసుకోవడానికి వెనుకాడతారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందించే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాలు ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో అందుబాటులో ఉంటాయా? కానీ, జియో, ఎయిర్‌టెల్ లేదా మరేదైనా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఉపయోగిస్తున్న వారు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ZEE5, SonyLIV, YuppTV, Disney+Hotstar, Shemaroo కూడా ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. Hungama, Lionsgate Play, EPIC ON వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సభ్యత్వాన్ని సులభతరం చేస్తుంది.

ఇది కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓటీటీ ప్లాన్‌లను స్వతంత్ర ప్లాన్‌లుగా కూడా పొందవచ్చు. అంటే, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేకుండా కేవలం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అవసరమైన వారు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ సేవ పేరు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లస్. ఈ సర్వీస్ ప్లాన్ కనీసం 49 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అత్యధిక ప్లాన్ తీసుకోవడానికి రూ.250 వరకు పడుతుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఏ ఒక్కటీ ఇలాంటి స్టాండ్ అలోన్ ప్లాన్‌లను కలిగి లేవు.

BSNL , ప్రయోజనాలు:

ఇది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేని స్వతంత్ర సేవ
వ్యక్తిగత కంప్యూటర్/ల్యాప్‌టాప్, మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీతో సహా ఏ పరికరంలోనైనా ఎప్పుడైనా సేవను యాక్సెస్ చేయవచ్చు.
G5, Sonylive, YapTV, Disney+Hotstar, Shimaru, Hungama, Lancet Play, Epic On – ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

రూ.49 మూవీ ప్లస్ ప్లాన్:

ఈ ప్లాన్ ధర రూ.49
ఇది నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రాప్యతను కలిగి ఉంది. షిమారు, హంగామా, లయన్స్‌గేట్ ప్లే, ఎపిక్ ఆన్.

మూవీ ప్లస్ ప్లాన్ రూ.119

ఈ ప్లాన్ ధర రూ.119
G5 ప్రీమియం, SonyLive ప్రీమియం, YapTV మరియు Disney+Hotstar యాక్సెస్‌ని కలిగి ఉంటుంది.

మూవీ ప్లస్ ప్లాన్ రూ.249

ఈ ప్లాన్ ధర రూ. 249
G5 ప్రీమియం, సోనీలైవ్ ప్రీమియం, iPTV, షిమారు, హంగామా, లయన్స్‌గేట్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటుంది.

రూ. 10 లక్షల ఆదాయంపైనా నో టాక్స్.. పక్కా ప్లాన్‌తో ఇలా చేస్తే చాలు.. బెటర్ ఆప్షన్

New Tax Regime vs Old Tax Regime: 2024 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేందుకు సులభతరం చేస్తూ నిర్ణయాలు ప్రకటించింది. దీని కింద కొత్త పన్ను విధానంలోనే స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచింది. ఇంకా పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. గతంలో రూ. 3-6 లక్షల వరకు టాక్స్ శ్లాబ్ ఉండగా.. దీనిని రూ. 7 లక్షల వరకు పెంచింది. అదే విధంగా రూ. 6-9 లక్షలకు ఒక శ్లాబ్ ఉండగా.. దీనిని రూ. 7-10 లక్షలకు చేసింది. దీంతో రూ. 6-7 లక్షలు, రూ. 9-10 లక్షల ఇన్‌కం బ్రాకెట్‌పై టాక్స్ తగ్గించుకోవచ్చు. అధిక ఆదాయంపైనా టాక్స్ తగ్గుతుంది. ఈ విధానంతో కొత్త ఆదాయపు పన్ను విధానం కింద గరిష్టంగా రూ. 7.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే ఇదే సమయంలో రూ. 10 లక్షల ఆదాయంపై కొత్త పన్ను విధానంలో అంతకుముందు రూ. 52,500 వరకు టాక్స్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు మార్పుల తర్వాత రూ. 42,500 కు తగ్గింది. అంటే రూ. 10 వేలు ఆదా అవుతుంది. ఇక్కడే పాత పన్ను విధానం ఎంచుకుంటే రూ. 10 లక్షల ఆదాయంపై రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

కొత్త పన్ను విధానంతో పోలిస్తే పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగానే ఉన్నప్పటికీ.. పన్ను తగ్గించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు కల్పించే పెట్టుబడులు ఇందుకు కారణం.
ముందుగా రూ. 10 లక్షల ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు తీసేస్తే రూ. 9.50 లక్షలవుతుంది. దీనిపై పన్ను లెక్కిద్దాం.

సెక్షన్ 80c- పీపీఎఫ్, ఈపీఎఫ్, ELSS సహా ఇతర టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. ఐదేళ్ల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఇందులోకి వస్తాయి. అప్పుడు రూ. 9.50 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు తీసేస్తే.. రూ. 8 లక్షలవుతుంది.

సెక్షన్ 80CCD (1B) – సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షలు మినహాయించిన తర్వాత.. దీనికి అదనంగా NPS టైర్-1 ఖాతాకు కాంట్రిబ్యూషన్ల ద్వారా ఈ సెక్షన్‌తో అదనంగా రూ. 50 వేలు పన్ను మినహాయింపు పొందొచ్చు. అప్పుడు రూ. 50 వేలు మినహాయించిన తర్వాత ఆదాయం రూ. 7.50 లక్షలవుతుంది.

హోం లోన్ వడ్డీ- సెక్షన్ 24B ద్వారా హోం లోన్ వడ్డీ మినహాయించుకోవచ్చు. గృహ యజమానులు ఈ సెక్షన్ కింద హోం లోన్‌పై చెల్లించిన వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది పన్ను భారాన్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. అప్పుడు రూ. 7.50 లక్షల నుంచి రూ. 2 లక్షలు తీసేస్తే రూ. 5.50 లక్షలవుతుంది.

మెడికల్ ఖర్చులు- సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం ద్వారా పన్ను మినహాయింపునకు అర్హులు. మీరు, మీ లైఫ్ పార్ట్‌నర్‌కు, మీపై ఆధారపడిన పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని రూ. 25 వేల వరకు తగ్గించుకోవచ్చు. మీరు లేదా మీ జీవిత భాగస్వామి సీనియర్ సిటిజెన్ అయితే అదనంగా మరో రూ. 25 వేలు మినహాయింపు పొందొచ్చు. ఇలా మీ ఆదాయం రూ. 5 లక్షల దిగువకు చేరుతుంది.

ఇక పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయంపై సెక్షన్ 87A కింద టాక్స్ రిబేట్ వర్తిస్తుంది. దీంతో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. అయితే ఇవన్నీ మినహాయింపులు పొందితేనే టాక్స్ ఆదా చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ మినహాయింపులు మాత్రం లేవు.

తిరుపతి ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. ఆ రెండు ఎయిర్‌పోర్ట్‌లకు కూడా, కేంద్రమంత్రి ప్రకటన

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
మూడు ఎయిర్‌పోర్టు పేర్లపై ప్రతిపాదన
తిరుపతి ఎయిర్‌పోర్ట్ పేరు మార్పుకు

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి (రేణిగుంట) ఎయిర్‌పోర్ట్‌ పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్‌పోర్టుకు శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌.. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో మరో రెండు ఎయిర్‌పోర్టుల పేర్లను సూచిస్తూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విజయవాడకు నందమూరి తారక రామారావు, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ అన్నారు. దర్చంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్‌ కోరిందని చెప్పారు.. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నట్లు లోక్‌సభలో వివరాలను ప్రస్తావించారు. మరి ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరోవైపు విజయవాడ ఎయిర్‌పోర్టులో వచ్చే ఏడాది జూన్‌కల్లా కొత్త టెర్మినల్‌ భవనం, దాని అనుబంధ పనులు పూర్తవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. 2022 నాటికే పూర్తి కావాల్సిన ఈ పనులు ఇప్పటివరకు ఎందుకు పూర్తికాలేదని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న అడిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సమాధానం ఇచ్చారు.

2020 మార్చిలో రూ. 611.80 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు పీఐబీ (పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు) ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం అదే ఏడాది జూన్‌లో ఆమోదముద్ర వేసిందని.. ఈ ఏడాది జూన్‌ నాటికి 48.5% పనులు జరిగాయని తెలిపారు. రూ. 279.93 కోట్లు ఖర్చు చేయగా.. ఇసుక, ఇతర నిర్మాణ వస్తువుల లభ్యత లేకపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయన్నారు. వెంటనే ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి 2025 జూన్‌కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాదు విజయవాడ నుంచి కోల్‌కతా, వారణాసి, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, ఢిల్లీ నుంచి విశాఖ, విజయవాడలకు విమాన సర్వీసులు నడపాలని ఎంపీ బాలశౌరి కోరగా.. ఈ అంశంలో తమ శాఖ ప్రమేయం ఉండదని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్‌ పథకం కింద వేలానికి ఏపీలో బొబ్బిలి, దొనకొండ, ఏలూరు ఎయిర్‌ స్ట్రిప్స్‌ అందుబాటులో ఉన్నట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలియజేశారు. బాపట్ల టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏపీకి మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు మంజూరుచేస్తే.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు 2021 మార్చి నుంచే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయన్నారు. రూ.293 కోట్లతో దగదర్తి ఎయిర్‌పోర్టును మంజూరు చేసినట్లు తెలిపారు. విస్తారా విమాన టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులపై డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. టికెట్ల బుకింగ్‌లో తరచూ లోపం జరుగుతోందని.. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు ఒక ధర, బుకింగ్‌ తర్వాత మరో ధర వస్తోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా.. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని మంత్రి రామ్మోహన్‌నాయుడికి సూచించారు.

‘రాయన్’మూవీ రివ్యూ

ధనుష్ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. 3 మూవీ నుంచి ఇక్కడ ధనుష్‌కు మంచి క్రేజ్ ఏర్పడగా.. రఘువరన్ బీటెక్‌తో ధనుష్ తెలుగు హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ధనుష్ సినిమాలను తెలుగు వారు ఆదరించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన రాయన్ చిత్రం థియేటర్లోకి వచ్చింది. జూలై 26న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి సమీక్షచూద్దాం.

కథ
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు (సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషార విజయన్) కోసమే బతుకుతుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై.. తమ్ముళ్లు, చెల్లిని ఎంతో కష్టపడి పెంచుతాడు రాయన్. శేఖర్ (సెల్వ రాఘవ) వీరికి ఆశ్రయం కల్పిస్తాడు. రాయన్ నివసించే ఏరియా దురై (శరవణన్) చేతి కింద ఉంటుంది. ఇక సేతు (ఎస్ జే సూర్య) ఆ ఏరియాపై పట్టు సాధించాలని అనుకుంటాడు. సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ (ప్రకాష్ రాజ్) రౌడీ గ్యాంగ్‌లను ఏరిపారేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రాయన్ పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్)కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాయన్ ఏం చేశాడు? చివరకు రాయన్‌కే తన తమ్ముళ్లు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? ఆఖరికి రాయన్ చెల్లి దుర్గ ఏం చేసింది? రాయన్ కథ చివరకు ఏం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

రాయన్ సినిమా కథ ఓవరాల్‌గా చూస్తే కొత్తదేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కథే ఇది. కానీ ధనుష్ ఇలాంటి పాత కథను కాస్త పాలిష్ చేసి తన స్టైల్లో తెరకెక్కించాడు. సినిమా అంతా ఒకే టోన్‌లో కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తుంటే.. రాయన్‌కు ఏదో పెద్దగా బాషాలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకుంటాం. కానీ అదేమీ చూపించడు. రాయన్ అంటే అవతలి వాడు భయపడాల్సిందే అన్నట్టుగా చూపించేశాడు.

తమ్ముళ్లు, చెల్లి కోసం బతికే అన్న కథే ఈ రాయన్. ఇక ఇలాంటి కథలో కావాల్సినంత ఎమోషన్‌ను పెట్టుకోవచ్చు. తమ్ముళ్లు, చెల్లి సెంటిమెంట్‌ను వాడుకుని ఎన్నో కథలను ఇప్పటి వరకు తయారు చేశారు. ఈ రాయన్ కూడా అలాంటి పాయింట్లతోనే ఉంటుంది. కానీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ సినిమా అంతా కూడా నెక్ట్స్ సీన్ ఏంటో చెప్పేసేలా ఊహకందేలానే సాగుతుంది. అదే ఈ చిత్రానికి కాస్త మైనస్ అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాదా సీదాగా సాగుంది. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా రాయన్ పాత్ర కూడా అలానే సాగుతుంది. ఇంటర్వెల్‌కు సినిమా పీక్స్‌కు వెళ్తుంది. ఆ తరువాత రాయన్ కొద్ది సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ హాస్పిటల్ సీన్‌తో అదిరిపోతుంది. అక్కడ దుషార హైలెట్ అవుతుంది. అయితే సెకండాఫ్‌లో మరింత ఎమోషనల్ సీన్స్‌కు స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ధనుష్ ఆ యాంగిల్‌ను తీసుకోలేదు. అలా తీసుకుంటే మళ్లీ రొటీన్ అనే ఫీలింగ్ వస్తుందని అనుకున్నాడో ఏమో. కానీ రాయన్‌ను ఎలా చూసుకున్నా కూడా కొత్తగా అనిపించదు. కథ, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కూడా పాత పద్దతిలోనే సాగినట్టుగా అనిపిస్తుంది.

కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, పడిన ఎలివేషన్ షాట్స్ అదిరిపోతాయి. రాయన్ కాదు రావణ్ అనేలా తెరపై కనిపిస్తుంది. అయితే ధనుష్ తన పాత్రకు మాత్రమే స్పేస్, స్కోప్ ఇవ్వలేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా అన్ని పాత్రల కోణాల్లోంచి ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. సందీప్ కిషన్‌కు చాలా లెంగ్తీ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. కొన్ని చోట్ల దుషార కారెక్టర్ మెప్పిస్తుంది. అలా అన్ని యాంగిల్స్‌లో రాయన్ కథను బాగానే రాసుకున్నాడు. దర్శకుడిగా ధనుష్ మరోసారి సత్తా చాటుకున్నాడు. అయితే ఈ రాయన్ మన తెలుగు వాళ్లకి అంతగా ఎక్కుతుందా? అంటే చెప్పలేం. కాస్త స్లోగా, బోరింగ్‌గా, నిరాసక్తంగా సాగుతుంది. కానీ ఒక్కసారి రాయన్ కారెక్టర్‌కు కనెక్ట్ అయితే మాత్రం ఇవేవీ గుర్తుకు రావు.

టెక్నికల్ టీంని ధనుష్ అద్భుతంగా వాడుకున్నాడు. సినిమా మూడ్ చెప్పేలా కెమెరాను ముందే సెట్ చేసుకున్నాడనిపిస్తుంది. సినిమా అంతా ఓ బాధ, నివురు గప్పిన నిప్పుని చూపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తాయి. రెహ్మాన్ ఇచ్చిన పాటలు అంతగా గుర్తుండవు. కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. సెట్ వర్క్ నేచురల్‌గా ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి రా అండ్ రస్టిక్ కారెక్టర్లు అంటే మరింతగా రెచ్చిపోతాాడు. అసురన్‌లో ధనుష్ అగ్రెసివ్ నటనను చూసేశాం. రాయన్‌లోనూ ధనుష్ అలాంటి ఓ పాత్రనే పోషించాడు. ఇక ఇందులో ధనుష్ ఒకే రకంగా అనిపిస్తాడు. లుక్, ఎక్స్‌ప్రెషన్స్ సినిమా అంతా ఒకేలా అనిపిస్తుంది. సందీప్ కిషన్‌కు మంచి పాత్ర దొరికింది. అపర్ణా బాలమురళీకి సరిపడే పాత్ర అయితే లభించలేదనిపిస్తుంది. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఎస్ జే సూర్య ఎప్పటిలానే అదరగొట్టేశాడు. ఈ సినిమాకు దుషార విజయన్ కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది. ఇలాంటి కారెక్టర్ దొరకడం కూడా కష్టమే. దొరికిన పాత్రని దుషార దుమ్ములేపేసింది. సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. వరలక్ష్మీ శరత్ కుమార్‌ స్థాయికి తగ్గ కారెక్టర్ దక్కలేదనిపిస్తుంది. ఏ కారెక్టర్‌కి మేకప్ వేయకుండా సహజంగా చూపించాడు ధనుష్.

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. డిపాజిట్లపై అత్యధిక లాభం.. దేంట్లో ఎంతో లిస్ట్ ఇదే.

Bank FD Rates: ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపై 20 బేసిస్ పాయింట్ల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అత్యధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తూ ఎస్‌బీఐ అమృత్ వృష్టి అనే పథకం లాంఛ్ చేసింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అధిక వడ్డీ రేటుతో కూడిన బీఓబీ మాన్సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇతర ప్రముఖ దిగ్గజ బ్యాంకులు కొన్ని కూడా గత నెల్లోనే వడ్డీ రేట్లను సవరించడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంకుల్లో డిపాజిట్ వడ్డీ రేట్లను పోల్చుకొని చూద్దాం.

>> వడ్డీ రేట్లను పెంచిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 55 నెలలు లేదా నాలుగేళ్ల 7 నెలల డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.40 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.90 శాతం వడ్డీ అందుతుంది. జులై 24 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
>> ఎస్‌బీఐ కొత్త స్కీమ్ అమృత్ వృష్టిని 444 రోజుల టెన్యూర్‌తో ప్రవేశపెట్టింది. దీని కింద రెగ్యులర్ సిటిజెన్లకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీం జులై 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

>> ఐసీఐసీఐ బ్యాంకులో 15 నుంచి 18 నెలల డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.20 శాతం, సీనియర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. జులై 25 నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి.
>> యాక్సిస్ బ్యాంకులో చూస్తే 17-18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.20 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. జులై 1 నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి.

>> పంజాబ్ నేషనల్ బ్యాంకులో 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. జూన్ 10 నుంచి ఇది అమల్లో ఉంది.
>> బ్యాంక్ ఆఫ్ బరోడాలో 399 రోజుల మాన్సూన్ స్పెషల్ డిపాజిట్‌పై అత్యధికంగా వరుసగా 7.25 శాతం, 7.75 శాతం వడ్డీ అందుతుంది. జులై 15 నుంచి ఇది వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, ప్రయాణ సమయం తగ్గుతుంది

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
తగ్గనున్న ప్రయాణ సమయం

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్రంం ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది.. ఈ కొత్త లైన్‌కు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. ఈ నూతన రైలు మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరగబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు.

2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈ లైన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. ఈ కొత్త లైన్ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా అవుతుందంటున్నారు. ఇప్పటికే నరసాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, విజయవాడ, గుంటూరు, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్, నాగర్‌సోల్‌, బెంగళూరు, హుబ్లికి రాకపోకలు జరుగుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలవాసులు స్వాగతిస్తున్నారు. ఈ లైన్‌కు సంబంధించి త్వరలోనే సర్వే కూడా నిర్వహించబోతున్నారు.

బ్రిటిష్‌ హయాంలోనే మచిలీపట్నం-నరసాపురం మార్గాన్ని రైల్వే రూట్‌లో కలపాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో 69 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌కు పలుచోట్ల ఉప్పుటేర్లపై వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.. అందుకే భారీగా వ్యయం అవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదన పెండింగ్ పడింది. ప్రస్తుతం రైలులో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ వెళ్లి అక్కడి నుంచి రైలు మారాల్సి వస్తోంది. అదే నరసాపురం నుంచి మచిలీపట్నం రైలు మార్గం కనుక పూర్తి చేస్తే.. మొగల్తూరు, బంటుమిల్లి మీదుగా వెళ్లిపోవచ్చు.. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

అంతేకాదు ఈ కొత్త మార్గంతో కోస్తా తీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుంది. కోటిపల్లి రైల్వేలైన్‌ వల్ల ఇప్పటికే కాకినాడ నుంచి నరసాపురం వరకు రైలు మార్గం వచ్చిన సంగతి తెలిసిందే.. ఇటు మచిలీపట్నం పూర్తిచేస్తే సముద్ర తీరం వెంబడి రైళ్లు పరుగులపెట్టనున్నాయి. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో సర్వే పనులు మొదలుపెట్టనున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వినియోగించి ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచుతామంటున్నారు అధికారులు. ఈ కొత్త రైల్వేలైన్‌ 51 కిలోమీటర్ల మేర చేపడుతుండగా.. కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలుకు రైలు మార్గం అందుబాటులోకి రానుంది. అలాగే విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్‌లైన్‌లో ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గుతుంది అంటున్నారు. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌లో మూడు భారీ బ్రిడ్జిల నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. భూసేకరణ కూడా 75 శాతం పూర్తికాగా.. నిధులు పూర్తి స్థాయిలో ఉంటే ట్రాక్‌ పనులు వేగవంతం కానున్నాయి.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే… భారతదేశ స్థానం ఎంతో తెలుసా

Powerful Passports: ప్రపచంలో ప్రతీ దేశం ఆ దేశ పౌరులు కోరుకుంటే పాస్‌పోర్టు జారీ చేస్తుంది. ఇది ఏ దేశ పౌరుడై మరొక దేశానికి వెళ్లాలంటే తప్పనిసరి. పాస్‌పోర్టు అనేది దేశ పౌరుడిగా ఇచ్చే గుర్తింపు పత్రం. ఈ పాస్‌పోర్ట్‌ తోనే ఆ వ్యక్తి ఎవరు? ఏ దేశానికి చెందినవాడు, ఎక్కడ నుంచి వచ్చాడు? తదితర విషయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుంది. కరోనా ముందు వరకు వీసా ఆధారంగానే చాలా దేశాలు అనుమతి ఇచ్చేవి. అయితే కరోనాతో పర్యాటకరంగం బాగా దెబ్బతిన్నది. దీంతో కోవిడ్‌ తర్వాత చాలా దేశాలు పర్యాటకరంగం కోలుకోవడానికి వీసా నిబంధనలను సడలించాయి. వీసా లేకపోయినా విమానం టికెట్‌ కొనుక్కొని వస్తే వెల్‌కమ్‌ చెబుతున్నాయి. ఇలాంటి దేశాల్లో సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో జారీ చేసే వీసాలు కూడా రకాలు ఉన్నాయి. కొన్ని పాస్‌పోర్ట్‌లు వ్యక్తుల స్టేటస్‌ను తెలియజేస్తాయి. అంతేకాకుండా సాధారణ పాస్‌పోర్ట్‌ హోల్డర్ల కంటే కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఈ పాస్‌పోర్ట్‌లలో కొన్ని తమ హోల్డర్‌లకు వీసా రహిత ప్రయాణం, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కలిగి ఉంటాయి. సెక్యూరిటీ చెకింగ్‌ ఉండదు. ఇక ఇండియాలో పాస్‌పోర్ట్‌ జారీలకు సంబంధించిన ప్రక్రియలన్నీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు అనుంబంధంగా పనిచేసే వీసా, పాస్‌ పోర్ట్‌ కౌన్సిలర్‌ డివిజన్‌ పర్యవేక్షిస్తుంది. 1967 పాస్‌పోర్ట్‌ చట్టం ప్రకారంగా వీటిని జారీచేస్తారు. ఇండియన్‌ పాస్‌పోర్టు పొందేందుకు దేశవ్యాప్తంగా 93 ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా సహాయక కేంద్రాలు, ప్రపంచ వ్యాప్తంగా 160కు పైగా డిప్లోమాటిక్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇండియాలో మూడు రకాల పాస్‌పోరుట్లు జారీ చేస్తున్నారు.

Also Read: చందమామపై నీటి జాడలు.. గుర్తించిన చైనా.. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే జాబిల్లి టూర్‌

శక్తివంతమైన పాస్ట్‌ పోర్టు ఉన్న దేశాలు..
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఇందులో గతంలో పోలిస్తే భారత్‌ ర్యాంకు మూడుస్థానాలు మెరుగుపడింది. ఈ జాబితాలో మన పాస్‌పోర్టు ర్యాంకు 82. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 85వ స్థానంలో ఉంది. సెనెగెల్, తజకిస్థాన్‌ దేశాల పాస్‌పోర్టులు కూడా 85వ స్థానంలో ఉన్నాయి.

58 దేశాలకు వీసా లేకుండా..
ఇదిలా ఉంటే.. మన పాస్‌పోర్టుతో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి 58 దేశాలక వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. గతంలో ఈ సంఖ్య 59 ఉండేది. ఇప్పుడు ఒక దేశం తగ్గింది. ఇక ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని నివేదిక తెలిపింది.

శక్తివంతమైన వీసాలు ఇలా..
ఇక శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో సింగపూర్‌ మొదటి స్థానంలో ఉండగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్‌ వీసాలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశా పాస్‌పోర్టు ఉన్నవారు 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఆ తర్వాత ఆప్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్‌ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోరుట్తో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక అగ్రరాజ్యం అమెరికా పాస్‌పోర్టు ర్యాంకులో 8వ స్థానంలో ఉంది. యూఎస్‌ పాస్‌పోర్టు ఉన్నవారు 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్‌ పాస్‌పోర్టు ర్యాంకు 100. ఆదేశ పాస్‌పోర్టుతో 33 దేశాలకు వెళ్లొచ్చు. ఇక జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 26 దేశాలకు మాత్రమే వెళ్లొచ్చు

నాన్ వెజ్ తినని వారు ఈ పండ్లను తినండి.. ప్రొటీన్లు ఎక్కువ

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రొటీన్లు అవసరం
మాంసం.. గుడ్లు.. చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు
నాన్ వెజ్ తిననివారు పండ్లలో ప్రొటీన్లు పొందవచ్చు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అవసరం. అంతేకాదు.. మంచి డైట్ కూడా పాటించాలి. శరీరంలో కణాలు.. కండరాలను నిర్మించడంలో ప్రొటీన్లు సహాయపడుతుంది. ప్రొటీన్లు.. దంతాల నుంచి మొదలుపెడితే గోర్లు వరకు అవసరం. ప్రొటీన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన ఆహారంలో ప్రొటీన్లు అవసరం. అయితే.. మాంసం, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే నాన్ వెజ్ తిననివారి కోసం వారు మాంసాహారం ద్వారా ఏవైతే కోల్పోతున్నారో వాటిని కొన్ని పండ్ల ద్వారా పొందొచ్చు. ప్రొటీన్ లోపంతో బాధపడేవారు ఈ పండ్లను తింటే.. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి.

అవకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం ఉన్న ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 20 కంటే ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి.. ఇది తింటే శరీరానికి చాలా మంచిది.

దానిమ్మ
పాలీఫెనాల్స్‌తో నిండిన దానిమ్మలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. వీటిలో ఫైబర్.. ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

జామ
విటమిన్ సి, పొటాషియం.. ఫైబర్ పుష్కలంగా ఉన్న జామ చాలా ప్రోటీన్ కలిగిన పండ్లలో ఒకటి. ఇందులో కొవ్వు.. కేలరీలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ పండు తినడం వల్ల బరువు తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

నేరేడు పండ్లు
ఈ పండ్లలో ప్రోటీన్‌తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి.. బి6 ఉంటాయి. అధిక ఫైబర్, ప్రొటీన్‌తో కూడిన నేరేడు పండు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. ఈ పండులో తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు.. బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు ఈ పండు అద్భుతమైన ఎంపిక.

కివి పండు
కివి పండులో అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. కివాలిన్.. కిస్పర్ అనే ప్రత్యేక ప్రోటీన్లు ఇందులో కనిపిస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

శ్రీ రామునికి ఓ సోదరి ఉందన్న విషయం మీకు తెలుసా?. నేటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఆలయం

హిందువుల పవిత్ర గ్రంథాలలో రామాయణం ఒకటి
రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణమే ప్రామాణికం
వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు
అలాంటి గాథే రాములవారి అక్క గురించిన కథ
దశరథ రాజు.. కౌసల్యకు శాంత అనే పేరుగల కుమార్తె

రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించే ఇతిహాసం. రాముడిని ఆదర్శపురుషుడిగా కొలుస్తారు. చిన్నప్పటి నుంచి వింటున్న రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, భరతుడు, దశరథుడు, కౌసల్య, శబరి ఇలా ఎన్నో పాత్రల గురించి తెలిసే ఉంటుంది. చాలా మందికి తెలియని మరోపాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి ఘట్టాలు మూల రామాయణంలో లేవని చెబుతుంటారు. అలాంటి మరో గాథే రాములవారి అక్క గురించిన కథ!

శ్రీ రాముడు దశరథ రాజు, కౌసల్య కుమారుడు. కానీ రామునితోపాటు దశరథుడు కౌసల్యకు ఒక కుమార్తె ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామాయణ ఇతిహాసంలో రాముడి సోదరి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. రాముడికి శాంత అనే సోదరి ఉంది. ఆమె నలుగురు సోదరుల కంటే పెద్దది. ఆమె దశరథ రాజు మరియు కౌసల్య దేవి కుమార్తె. శాంత చాలా తెలివైనది.. అలాగే వేదాలు, కళలు మరియు చేతివృత్తులలో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాకుండా.. ఆమె కూడా చాలా అందంగా ఉండేది. ఆమెను దత్తత ఇచ్చినట్లు నమ్ముతారు. ఇది రామాయణంలో కూడా కనిపిస్తుంది.

శాంత గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి అంగదేశ రాజు రోంపద్ తన భార్య రాణి వర్షిణితో కలిసి అయోధ్యకు వచ్చాడని చెబుతారు. వర్షిణి కౌసల్య సోదరి. వారిద్దరికీ పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడే వారు. ఈ విషయం దశరథ రాజుకు తెలియడంతో.. అతను తన కుమార్తె శాంతను దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దశరథ రాజు ఈ మాటలు విన్న రోమపాద మరియు వర్షిణి చాలా సంతోషించారు. దత్తత తీసుకున్న తర్వాత ఆమె శాంతను ఎంతో ప్రేమతో పెంచింది. శాంత అంగ దేశానికి యువరాణి అయింది.

శ్రీరాముని అక్క శాంత శృంగ మహర్షిని వివాహం చేసుకుంది. దీని వెనుక ఒక కథ ఉంది. ఒక రోజు రాజు రోంపాడ్ తన కుమార్తె శాంతతో మాట్లాడుతుండగా.. ఓ బ్రాహ్మణుడు అతని ఇంటి వద్దకు వచ్చి పొలాలను దున్నడంలో రాజ దర్బారు నుంచి కొంత సహాయం కోరాడు. కానీ రాజు తన కుమార్తె శాంతతో మాట్లాడటంలో చాలా బిజీగా ఉన్నాడు. అతను బ్రాహ్మణుడు చెప్పినదానిని పట్టించుకోలేదు. దీంతో అతడు నిరాశతో వెనుదిరిగాడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రదేవుని భక్తుడు, అతని స్థితిని చూసి ఇంద్రదేవుడు కోపించి అంగదేశంలో వర్షం పడకుండా చేశాడు. దీంతో రాష్ట్రంలో కరువు నెలకొంది. అప్పుడు రాజు శృంగ మహర్షిని పిలిచి వర్షం కురిపించడానికి యజ్ఞం చేయిస్తాడు. యాగం ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. అప్పుడు రాజు సంతోషించి తన కుమార్తె శాంతను శృంగ మహర్షికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు.

కులు లోని దేవీ శాంత ఆలయం
నేటికీ హిమాచల్ ప్రదేశ్ లోని కులులోని శృంగ రుషి ఆలయంలో శ్రీరాముని అక్క శాంతాదేవిని పూజిస్తారు. ఈ ఆలయం కులు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శాంతా దేవి విగ్రహం ఉంది. శాంత దేవిని, ఆమె భర్త శృంగను కలిసి పూజిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. దసరా పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇండియా కూటమి వైపు జగన్..టార్గెట్ షర్మిల.. పునరాలోచనలో కాంగ్రెస్

Ys jagan: ఈ ఎన్నికల్లో జగన్ కు దారుణ పరాజయం ఎదురయింది. వై నాట్ 175 అన్నారు జగన్. కానీ ఏపీ ప్రజలు మాత్రం కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపిని గెలిపించారు. అయితే ఇంతటి ఓటమికి కారణం ఏంటనేది వైసిపి విశ్లేషించుకుంది. పెద్ద ఎత్తున సమీక్షలు చేసింది. తరుణంలో షర్మిల రూపంలో జరిగిన డ్యామేజ్ అధికమని గుర్తించింది. ఎన్నికల్లో నష్టం చేకూర్చిన షర్మిల.. ఎన్నికల తరువాత కూడా జగన్ పై టార్గెట్ చేశారు. జగన్ ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అందుకే వైసీపీని పూర్తిగా లేకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే జగన్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించారు. చంద్రబాబు, పవన్ తో పాటు షర్మిల కూడా తనకు శత్రువుగా భావిస్తున్నారు. అందుకే ముగ్గురిని టార్గెట్ చేసుకుని పావులు కదపడం ప్రారంభించారు. గత ఐదేళ్లుగా బిజెపితో సన్నిహితంగా మెల్లి గారు జగన్. ఇప్పుడు అదే బిజెపికి దగ్గరయ్యారు చంద్రబాబు. దీంతో బీజేపీతో స్నేహం కుదిరే పని కాదు జగన్ కు. అందుకే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పక్షాలన్నీ హాజరయ్యాయి. సంఘీభావం తెలిపాయి. ఇండియా కూటమిలోకి ఆహ్వానించాయి. తద్వారా తనకు జాతీయ పార్టీల మద్దతు ఉందని జగన్ సంకేతాలు పంపించగలరు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగడానికి కూడా సిద్ధమయ్యారు. తద్వారా ఏపీలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నోరుమూయించే అవకాశాన్ని తెచ్చుకున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పగ్గాల నుంచి తప్పించాలని కూడా ప్రయత్నాలు చేస్తారు.అంటే ఏకకాలంలో చంద్రబాబు,పవన్, షర్మిలను దెబ్బ కొట్టే వ్యూహం అమలు చేస్తున్నారన్నమాట.

* కాంగ్రెస్ ను వంచించిన జగన్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జగన్ దారుణంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన ఆయన బలవంతంగా ఆ పార్టీని లాక్కున్నారు. అందుకే జగన్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక రకమైన కోపం ఉంది. షర్మిలకు పగ్గాలు అప్పగించారు అందులో భాగమే. కాంగ్రెస్ కు మించి కోపం ప్రదర్శించారు షర్మిల. ఈ ఎన్నికల్లో వైసీపీని దారుణంగా దెబ్బతీశారు. భారీగా డామేజ్ చేశారు. అయితే జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ వాయిస్ మారే అవకాశం ఉంది. జగన్ బిజెపిని విడిచిపెట్టి.. ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే మాత్రం కాంగ్రెస్ పునరాలోచించే అవకాశం ఉంది.

* షర్మిలను లాక్ చేసే ఉద్దేశం
ఒకవేళ జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గుచూపితే.. కాంగ్రెస్ పార్టీ షర్మిలను కొంత నియంత్రించే అవకాశం ఉంది. మునుపటిలా వైసీపీని టార్గెట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇండియా కూటమిలోకి జగన్ వస్తే.. భాగస్వామ్య పార్టీగా గుర్తించాల్సి ఉంటుంది. 2029 ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీతో.. జాతీయస్థాయిలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిలో ఉంది. ఏపీపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం విశేషం.

* ఆ స్వేచ్ఛ ఇక ఉండదు
ఇప్పటివరకు షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. అందుకే ఆమె జగన్ ను టార్గెట్ చేసుకోగలిగారు. వైసిపి ఓడిపోయిన తరువాత కూడా ఆమె వెంటాడుతున్నారు. ఎటువంటి అంశాలకైనా వైసిపి వైఫల్యాలను అంటగడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉండనుంది పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిలకు లాక్ చేసేందుకు జగన్ చేసిన వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2029కి నియోజకవర్గాల పునర్విభజన లేనట్టే.. తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. వీళ్ల ఆశలన్నీ అడియాసలే

Redistribution Of Constituencies: తెలుగు రాష్ట్రాల్లో 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదు. కేంద్ర బడ్జెట్లో జన గణనకు సంబంధించి కేటాయింపులు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. జన గణన పూర్తయితే గానీ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఉండదు. చివరిసారిగా దేశంలో 2011లో జనగణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2021లో జనగణన చేయలేదు. కరోనా తో పాటు ఇతరత్రా కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత చేపట్టేందుకు సైతం ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. అటు కేంద్ర బడ్జెట్లో సైతం జన గణన ప్రక్రియకు అంతంత మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2006 నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. సకాలంలో పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న లోక్ సభ స్థానాలను భారీగా పెంచుతూ పునర్విభజన చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని విభజన చట్టంలో పేర్కొన్నారు. దీంతో అందరూ 2029 ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనగణన జరగలేదు. కుల గణన ముందుకెళ్లలేదు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. కానీ వివిధ రాజకీయ పార్టీల నేతలు మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పై ఆశలు పెట్టుకున్నారు.

* రెట్టింపు అసాధ్యం
దేశవ్యాప్తంగా543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజనతో ఇవి రెట్టింపు అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 52 కి, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 39కి పెరుగుతాయి అన్నది చర్చ. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏపీలో ఉన్న 175 సీట్లు కాస్త 225, తెలంగాణలో ఉన్న 119 సీట్లు కాస్త 153 అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది చర్చ.2014లో రాష్ట్ర విభజన సమయంలో..దేశంలో ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన చేపడుతామని విభజన చట్టంలో పొందుపరిచారు. 2026 తర్వాత పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

* జాడలేని జనగణన
అయితే ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో జనగణన చేపట్టలేదు. కుల గణన పూర్తి కాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జన గణనకు కేంద్రం కేవలం రూ. 1309 కోట్లు మాత్రమే కేటాయించింది.2021-22 రెండులో అయితే జనగణనకు కేంద్రం 3768 కోట్లు కేటాయించింది. ఇప్పుడు అందులో సగం కూడా కేటాయించలేదు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా లేదని తెలుస్తోంది. జనగణనకు ఈ మొత్తం చాలదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

* విభజన చట్టంలో పేర్కొన్నా
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతుంది. 2029 నాటికి 15 సంవత్సరాలు గడుస్తాయి.కానీ విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన పెంపు మాత్రం జరగలేదు. కొద్ది రోజుల క్రిందట లిఖితపూర్వకంగా చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అనేది దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏపీ మద్యం స్కాం.. జివిఎల్ చుట్టూ ఉచ్చు.. ఖాతాలోకి రూ.40 కోట్ల కథేంటి

AP Liquor scam: గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో వైసిపి సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. వైసీపీకి రాజకీయంగా సహకారం అందింది.జాతీయస్థాయిలో అవసరమైనప్పుడల్లా వైసిపి బిజెపికి మద్దతు ఇచ్చింది.2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు బిజెపిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు.కేంద్ర పెద్దలు పట్టించుకోలేదు. ఇందుకు రాష్ట్రంలో సోము వీర్రాజు, జివిఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారే కారణమని టిడిపి అనుమానించింది. చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. కానీ ఈ ఎన్నికల ముంగిట నాటకీయ పరిణామాల మధ్య టిడిపి, బిజెపి కలిసిపోయాయి. కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి రాగలిగాయి. ఉమ్మడి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఏపీలో జగన్ విధ్వంసం పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టారు. జగన్ పాలన వైఫల్యాలను బయటపెడుతున్నారు. అవినీతిని శ్వేత పత్రాల రూపంలో వెల్లడిస్తున్నారు. మద్యం పాలసీలో 30 వేల కోట్ల రూపాయల దందా నడిచిందని తేల్చారు. అయితే అందులో అనూహ్యంగా బిజెపి నేత జీవీఎల్ పేరు బయటపడటం విశేషం. మాజీ ఎంపీ జివిఎల్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు ఏపీ, ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్వాకం పై ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి చేరాయని.. సిఐడి కి వెళ్లాయని కూడా తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలకు చేరినట్లుగా చెబుతున్నారు. మరో వైసీపీ ఎంపీ తో కలిపి ఈ దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. బిజెపిలో ఉంటూ వైసీపీకి ఫేవర్ చేసినందుకు ఈ మొత్తం అందుకున్నట్లు సమాచారం.

* ఆ కమీషన్ మాటేంటి
చంద్రబాబు నిన్నటి సభలో వైసీపీ సర్కార్ మద్యం విధానం పై శ్వేత పత్రం విడుదల చేశారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజిలో తనక పెట్టి రెండుసార్లు రుణం తీసుకున్నారు. ఇందుకు గాను సలహాదారులను సైతం నియమించుకున్నారు. 1.44 శాతం కమిషన్ గా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ సలహాదారుల ద్వారా దాదాపు పదివేల కోట్ల వరకు సమీకరించారు. అయితే ఆ సలహాదారులకు చెల్లించాల్సిన దానికంటే 20 కోట్లు అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు సలహాదారులు జీవీఎల్ తో పాటు మరో ఎంపీకి చెరో 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నది ఇప్పుడు వచ్చిన ఆరోపణ.

* వైసీపీకి అనుకూలంగా
వైసీపీ సర్కార్ హయాంలో జీవీఎల్ పాత్ర అనుమానంగా ఉండేది. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్. కానీ జీవీఎల్ మాత్రం టిడిపిని టార్గెట్ చేసుకునేవారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో.. చివరిగా టిడిపి తో పాటు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చేవారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి కలవదని తేల్చి చెప్పేవారు. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసేవారు. అయితే అలా ప్రవర్తించడానికే వైసిపి మద్యం కమీ షన్ల రూపంలో చెల్లింపులు చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది.

* ఎన్నికల్లో దక్కని సీటు
ఈ ఎన్నికల్లో విశాఖ నుంచి జీవీఎల్ పోటీ చేయాలని భావించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలం నుంచి సన్నాహాలు ప్రారంభించారు. విశాఖలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రకాల కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఎక్కడా ఎకామిడేట్ చేయలేదు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పురందేశ్వరి ఆ సీటును దక్కించుకున్నారు. అయినా సరే జివిఎల్ మౌనంగా ఉండి పోయారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే వైసిపి హయాంలో తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టిన జీవీఎల్.. ఇప్పుడు మద్యం అవకతవకల్లో అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన విషయంలో తేలిగ్గా వదలకూడదని చంద్రబాబు సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరి దీని నుంచి జివిఎల్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Health

సినిమా

//