Friday, November 15, 2024

గాడిద పాలకు టైమొచ్చింది.. లీటర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే రేటు

సీన్‌ చూశారుగా..అచ్చం ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిని ముంచేశాడు..తమిళనాడులోని తిరునన్‌వేలికి చెందిన ఓ కేటుగాడు. లో ఈము పక్షులో పేరుతో కోట్లు కొట్టేస్తే..ఇక్కడ మాత్రం గాడిదల ఫామ్‌ ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని కొంతమందిని నమ్మించాడు.

ఒక్కొక్కరి నుంచి పెట్టుబడి పేరుతో 90 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. వాళ్లు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు.. ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెట్టుబడి పేరుతో 80 నుంచి వందకోట్లు వరకూ మోసపోయామని వాపోతున్నారు..గాడిదఫామ్‌ బాధితులు.

“కడివెడైననేమి ఖరము పాలు..” అనేది ఎప్పుడో వేమన కాలం నాటి పాత మాట. గంగిగోవు పాలను మించిన డిమాండ్‌ ఇప్పుడు గాడిదపాలకు ఉంది. గ్రామాలతో పాటు నగరాల్లోనూ వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం తరచూ కనిపించే దృశ్యమే. ఐదారు స్పూన్ల గాడిద పాలకు..మూడు వందల వరకూ వసూలు చేస్తుంటారు. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గుకు గాడిదపాలు ఔషధంగా పనిచేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందుకే వీటికి అంత రేటన్నమాట.

గాడిదపాలకు ఉన్న ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అమాయకులను ముంచేస్తున్నారు..కేటుగాళ్లు. గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులనుంచి ఇటీవలే కోట్ల రూపాయలు కొట్టేశాడు ఏపీకి చెందిన ఓ కిలాడీ గాడు. సుమారు 200 మంది రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.గాడిద పాల వ్యాపారం సంగతి అటుంచితే..లక్షల పోసి కొన్న గాడిదలను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు.

అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం జెన్నీ మిల్క్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని హోస్పేట్‌లో హంగూ, ఆర్భాటాలతో గాడిద పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాడిద పాల వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని చుట్టూ జనాన్ని నమ్మించాడు. అయితే ముందుగా తమ సంస్థకు డిపాజిట్‌ కింద రూ. 3లక్షలు చెల్లించాలని షరతు పెట్టాడు. డిపాజిట్‌ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు. వాటిని పెంచి, పోషించి పాలు పితికి ఇస్తే లీటర్‌కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మిన సుమారు 2వందల మంది రైతులు రూ. 3లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు. లక్షలు పోసి గాడిదలను తీసుకెళ్లారు.

లక్షలు పోసి కొన్న గాడిదలను దట్టంగా మేపిన యజమానులు..తమ నుంచి గాడిద పాలను కొనమని జెన్నీ మిల్క్‌ సంస్థను కోరటం మొదలు పెట్టారు. అయితే ఇదిగో అదిగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయటం మొదలు పెట్టాడు తప్ప..ఏ ఒక్కరి నుంచి గ్లాస్‌ పాలు కూడా కొనలేదు. దీంతో ఎక్కడో తేడా కొట్టిందని అనుమానించిన ఓవ్యక్తి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. అధికారులు జరిపిన తనిఖీలో గాడిద పాల వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేవని బయటపడింది.దీంతో జెన్నీ మిల్క్‌ సంస్థ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. అధికారులు సంస్థను మూసేయడంతో దాని నిర్వాహకుడు నూతలపాటి మురళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయని, ముఖ్యంగా పిల్లలు, ఆస్తమా బాధితులకు ఔషధంగా గాడిద పాలను ఉపయోగిస్తారని జెన్నీ మిల్క్‌ సంస్థ మాయమాటలెన్నో చెప్పింది. అంతేగాకుండా సబ్బులు, క్రీములు వంటి వస్తువుల తయారీలో కూడా గాడిద పాలను వినియోగిస్తారని నమ్మించినట్టు తెలిసింది. మూడు ఆడ గాడిదలు, మూడు మగ గాడిదలను ఒక యూనిట్‌గా పేర్కొన్నారు నిర్వాహకులు. చాలా మంది బాధితులు ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో..ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు కొన్నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. 20 నుంచి 30 వేల ధర కూడా పలుకని జత గాడిదలను లక్ష రూపాయలకు అంటగట్టాడని తెలుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. పదుల సంఖ్యలో ఉన్న గాడిదలను ఏం చేసుకోవాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. గాడిద పాలకున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కోట్లు కొట్టేసిన కేటుగాడు రాత్రికే రాత్రే జంప్‌ అయితే..బాధితులు మాత్రం “పోయాం మోసం” అంటూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరి పరారైన ఆ అడ్డగాడిద పట్టుబడతాడో లేదో చూడాలి.

హానర్‌ నుంచి కిరాక్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే మీరూ ఇదే అంటారు..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. హానర్‌ ఎక్స్‌9సీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ అమ్మకాలు ఇప్పటికే మలేషియాలో ప్రారంభమయ్యాయి.

త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ధర విషయానికొస్తే హానర్‌ ఎక్స్‌9సీ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 28,700కాగా.. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ ఏరియంట్‌ ధర రూ. 32,500గా నిర్ణయించారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1,224 x 2,700 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ పోన్‌ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ మ్యాజిక్ ఓఎస్ 8.0తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

హానర్‌ ఎక్స్‌ 9సీ స్మార్ట్‌ ఫోన్‌లో 66 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6600 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను సియాన్‌, టైటానియం బ్లాక్‌, టైటానియం పర్పుల్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ65 రేటింగ్‌ను ఇచ్చారు.

క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన పీవీ సింధు.. బ్యాడ్మింటన్ అకాడమీకి భూమిపూజ

విశాఖ తోటగరువులో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు భూమి పూజ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమె భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ..

ఏడాదిలోపు అకాడమీ ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నామని, నైపుణ్యం గల క్రీడాకారుల కోసం అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాడమీ ఏర్పాటు ప్రభుత్వం అన్ని అనుమతులతో భూమి కేటాయించిందని, అకాడమీకి కేటాయించిన స్థలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు.

గత ప్రభుత్వం 2021 జూన్‌లో పీవీ సింధుకు విశాఖపట్నం రూరల్ మండలం చినగదిలి మండలంలో రెండు ఎకరాలు భూమిని కేటాయించింది. అక్కడ బ్మాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని ఇచ్చారు. అక్కడ 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన మూడు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించారు. ఈ మేరకు అప్పుడే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాల భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించింది.

ఈ గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

గుమ్మడి గింజలు.. వీటిని క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి 2, ఫోలేట్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి.

ఇవన్నీ కూడా మన బాడీకి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే భయంకరమైన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుండె సమస్యల నుంచి తప్పించుకునేందుకు గుమ్మడిగింజల్లోని మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి గుమ్మడిగింజలు చక్కని వరం. ఎందుకంటే, ఈ గింజల్లో ట్రిప్టోఫాన్, అమైనో యాసిడ్స్ మంచి నిద్రని అందిస్తాయి. వీటితో పాటు ఇందులోని కాపర్, జింక్, సెలీనియం నిద్ర నాణ్యతను పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఈ గుమ్మడి గింజల్లో పుష్కలంగా మెగ్నీషియం ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. ఈ రెండు సమస్యలున్నవారికి గుమ్మడిగింజలు హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

బరువు తగ్గించడంలో ఫైబర్ కీ రోల్ పోషిస్తుందని అందరికీ తెలిసిందే. దీనికోసం కూరగాయలు, ఆకుకూరలు తింటారు. అయితే, వాటిని తినలేని వారు ఈ చిన్ని గింజల్ని తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, కడుపు నిండుగా ఉండి త్వరగా బరువు తగ్గుతారు. ఈ గింజలు రెగ్యులర్‌గా తింటే స్ట్రోక్, గుండె సమస్యలతో మరణాల ప్రమాదం తగ్గుతుంది. గుమ్మడిగింజల్లో పీచు, పిండి పదార్థాలు బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తాయి. దీంతో పాటు రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి. దీనికోసం రెగ్యులర్‌గా గుమ్మడి గింజల్ని తీసుకోవడం మంచిదని గుర్తుపెట్టుకోండి. గుమ్మడిగింజల్లో సహజంగానే జింక్, ఫాస్పరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల్ని బలంగా చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సంబంధిత సమస్యల్ని దూరం చేసుకోవడానికి గుమ్మడిగింజలు తీసుకోవడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. మొట్టమొదటి గ్యాస్ ఇన్సులెటెడ్ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

ఇప్పుడు అరడజనుకు అటూ ఇటూ మాత్రమే నిర్మాణాలున్న అమరావతి.. రాబోయే రోజుల్లో కొత్తకొత్త ఐకానిక్ బిల్డింగ్స్‌తో బిజీయెస్ట్ ప్లేస్‌గా మారబోతోంది. అందుకే..

దానికి తగ్గ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్.. ముఖ్యంగా అమరావతిలో విద్యుత్‌ సరఫరా విషయంలో కీలక చర్యలు చేపట్టింది. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా 400/220 కేవీ గ్యాస్ ఇన్సులెటెడ్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

తాళ్లాయపాలెంలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రరప్రదేశ్‌ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఈ GIS.. రాష్ట్రంలోనే మొట్టమొదటిది. అమరావతికి ఇప్పటివరకూ తాడికొండ సబ్‌స్టేషన్‌ నుంచి పవర్‌ సరఫరా అయ్యేది. కానీ.. అమరావతి విస్తరణ తర్వాత రాజధానిలోని అన్ని ప్రాంతాలకు డిమాండ్‌కు సరిపడా విద్యుత్ తాజాగా నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ అందజేస్తుంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు గుంటూరు, ఎన్టీయార్ జిల్లాల్లోని పరిశ్రమల అవసరాలు కూడా తీరే ఛాన్సుంది.

తాళ్లాయపాలెం GISతో పాటు.. బేతంచర్ల, పెనుగొండ, గోరంట్ల, హంసవరం, మైలవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 11 సబ్‌స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. 6 వేల 98 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులన్నీ ఏడాదిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్లలో అమరావతిని ఎడారిగా మార్చేశారని, ఇకపై నెంబర్ వన్ సిటీగా తయారుచేయడానికి కంకణం కట్టుకున్నామని చెప్పారు.

అటు.. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ సైతం అమరావతి మీద ఫోకస్ పెట్టి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గతంలో కొన్ని అనుమానాలు, భయాలతో కొందరు రైతులు ల్యాండ్‌పూలింగ్ విషయంలో వెనక్కు తగ్గారు. దీంతో రాజధాని డిజైనింగ్, నిర్మాణాలకు కొంతమేర ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మంత్రి నారాయణ స్వయంగా రంగంలో దిగి రైతుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో రైతు అనుమోలు గాంధీ నివాసానికి వెళ్లారు. రాజధాని ఆవశ్యకతను, అందుకోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. టోటల్‌గా అమరావతి 2.0ను స్పీడప్ చేయడానికి చంద్రబాబు అండ్ కో నాన్‌స్టాప్ ఎక్సర్‌సైజ్ కొనసాగుతోందన్నమాట..

వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం

అక్టోబర్ చివరి వారం నుంచి ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. దీని ప్రభావం NCR – నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో కనిపిస్తుంది.

ఢిల్లీ, నోయిడాలోని పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి సెలవుల తర్వాత తెరిచిన పాఠశాలలు మళ్లీ మూతపడే అవకాశం ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు.

అక్టోబరు-నవంబర్‌లో ఢిల్లీ వాసులకు ఇది పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ రెండు నెలల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. చాలా ప్రాంతాలలో AQI 300 కంటే ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఈ సంఖ్య 400 కూడా దాటింది. పిల్లలు లేదా పెద్దలు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. స్కూళ్లను కూడా మూసేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని చాలా పాఠశాలలకు అక్టోబర్ 30 నుండి దీపావళి సెలవులు ప్రకటించారు. దీని తర్వాత, పాఠశాలలు నవంబర్ 4న ఓపెన్‌ అయ్యాయి. నవంబర్ 7న ఛత్ పూజ 2024 సందర్భంగా చాలా పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఛత్ పూజ ప్రత్యేక సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఢిల్లీలోని పరిస్థితిని ఏక్యూఐని కొద్దిరోజుల పాటు పర్యవేక్షిస్తారని, దీని తర్వాత కనీసం వారం రోజుల పాటు పాఠశాలలను మూసి ఉంచేలా నిర్ణయం తీసుకోవచ్చు.

‘ఠాగూర్’ సీన్ రిపీట్.. మృతదేహానికి రోజంతా ట్రీట్‌మెంట్! రూ.4లక్షలు కట్టాలంటూ డిమాండ్

చిరంజీవి ‘ఠాగూర్‌’ మువీలో ఆస్పత్రి సీన్‌ గుర్తుందా? అందులో అవినీతికి అలవాటు పడ్డ డాక్టర్లు.. డెడ్‌ బాడీకి ట్రీట్‌మెంట్‌ చేస్తారు.

ఆనక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు లక్షల డబ్బు డిమాండ్‌ చేస్తారు. డెడ్ బాడీ కావాలంటే పూర్తి డబ్బు కట్టాల్సిందేనని ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. జడలు విప్పుకున్న దెయ్యంలా ఆ ఆస్పత్రిలో అవినీతి విలయతాండవం చేస్తుంది. అనారోగ్యంతో మరణించిన జూనియర్‌ డాక్టర్ మృతదేహంతో శ్మశానంలో రాబందుల్లా చుట్టుముట్టారు. అనంతరం కుటంబ సభ్యులకు ఆ డెడ్‌ బాడీ ఇచ్చేందుకు లక్షల్లో బేరసారాలు చేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్‌లో వెలుగులోకి వచ్చింది.

నాగప్రియ అనే జూనియర్ డాక్టర్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్‌కి వచ్చారు. అయితే అక్కడ ఆమె వైద్యం చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులను వెంటనే రూ.3 లక్షలు కట్టాలని, డబ్బు కడితేనే ట్రీట్‌మెంట్ చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో నాగప్రియ తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం రూ.3 లక్షలు కట్టారు. అయితే కాసేపటికే నాగప్రియ చనిపోయిందంటూ వైద్యులు తెలిపారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం కూడా లేకుండా, మృత దేహంతో కూడా బేరసారాలకు దిగారు. నాగప్రియ డెబ్ బాడీ కావాలంటే రూ.4 లక్షలు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ. 3 లక్షలు చెల్లించామని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కళ్లావేళ్లాపడ్డా.. ఆసుపత్రి యాజమాన్యం కనికరించలేదు. డబ్బు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో నాగప్రియ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో తమ గోడు చెప్పుకుని బావురుమన్నారు. అరికెపూడి గాంధీ కాల్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో తీరు మారలేదు.

డబ్బు కట్టేంత వరకూ తమ బిడ్డ మృతి చెందిన విషయం చెప్పలేదని, డబ్బు తెచ్చేంత వరకూ నాగప్రియకు వైద్యం ఆపేయడం వలనే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెడికోవర్‌ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. నాగప్రియ నిన్న రాత్రే చనిపోయిందని, డబ్బు కోసం ఆ వార్త చెప్పకుండా ఈ రోజు ఉదయం డబ్బు కట్టిన తర్వాత చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న మెడికవర్ హాస్పిటల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద నిరసన కొనసాగుతుంది.

మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది

భారతదేశ విశిష్ట సంస్కృతి ప్రపంచం నలుమూలలో ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష, ఆహారం, దుస్తులు, ప్రత్యేకతలు ఉంటాయి.

అంతే కాదు పర్వతాలు, నదులు, సరస్సులు, జలపాతాలు, లోయలు, సముద్రాలు.. ప్రకృతి అందాల విషయంలో కూడా మన దేశం విదేశాలకు ఏ మాత్రం తీసిపోదు. అంతేకాదు భారతదేశం గొప్ప చరిత్రకు కూడా ప్రసిద్ది చెందింది. విదేశీ పర్యాటకులు కూడా మన దేశాన్ని సందర్శించాలను కోవడానికి ఇదే కారణం. ప్రస్తుతం మనం భారతదేశంలోని ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని పిలవబడే నగరాల గురించి తెలుసుకుందాం.. ఈ నగరాలను సందర్శించడం ఎవరికైనా ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది.

ప్రకృతి అందాల గురించి చెప్పాలంటే మన భారతదేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ‘సిటీ ఆఫ్ లేక్’ అని పిలువబడే నగరాలు గురించి తెలియజేస్తున్నాం.. మీరు కూడా ఇక్కడ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు.

నైనిటాల్: మన దేశంలో సరస్సుల నగరం గురించి మాట్లాడినట్లయితే.. ముందుగా గుర్తుకొచ్చే పేరు నైనిటాల్. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఏడు ప్రధాన సరస్సులు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద సరస్సు భీమ్‌తాల్. అంతేకాదు నౌకుచియాటల్, లోకం తాల్, హరిష్టల్, నలదమయంతి తాల్, మాల్వా తాళాలు, పూర్ణ తాల్ మొదలైన సరస్సులు ఉన్నాయి. ఇక్కడి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ తో పాటు స్నేహితులు, జంటలతో ఇక్కడ సందర్శించడం మంచి గమ్యస్థానం.

ఉదయపూర్: రాజస్థాన్ చారిత్రక కోటలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఉదయపూర్ నగరాన్ని ‘సరస్సుల నగరం’ అని పిలుస్తారు. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ సరస్సు పిచోలా సరస్సు, ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఉదయపూర్‌లో సాగర్ సరస్సు, ఫతేసాగర్ సరస్సు, దూద్ తలై సరస్సు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడికి రావడం కూడా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

శ్రీనగర్: కాశ్మీర్ భారతదేశంలో భూతల స్వర్గం. ఈ నగర అందాన్ని మాటల్లో వర్ణించడం ఎవరికైనా కష్టం. జీలం నది ఒడ్డున ఉన్న శ్రీనగర్ నగరాన్ని సరస్సుల నగరం అని పిలుస్తారు. దాల్ సరస్సు గురించి అందరికీ తెలుసు. ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ సరస్సులో బోటింగ్ ను ఆనందించాలనుకుంటున్నారు. అంతేకాదు నిజీన్ సరస్సు కూడా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. దాల్ సరస్సుతో పోలిస్తే ఇక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చాలా అందమైన సరస్సులు ఉన్నాయి. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మోతియా తలాబ్, మున్షీ హుస్సేన్ ఖాన్ సరస్సు, ఛోటా తలాబ్, బడా తలాబ్, ఎగువ సరస్సు, దిగువ సరస్సు, షాపురా సరస్సు, భోజ్తాల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాదు భోపాల్‌లోని భీంబేట్కా గుహలు, వాన్ విహార్ నేషనల్ పార్క్, సాంచి స్థూపం, రాణి కమలాపతి ప్యాలెస్ మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు.

షిల్లాంగ్: భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్న షిల్లాంగ్ అందాలు చూడదగ్గవి. దీనిని సరస్సుల నగరం అని కూడా అంటారు. ఇక్కడ మానవ నిర్మిత సరస్సు ఉంది. దీనిని ఉమియం సరస్సు అని పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకే కాదు, సాహస ప్రియులకు కూడా గొప్ప అనుభూతిని ఇస్తుంది. అంతేకాదు అన్ని వైపులా పర్వతాలతో చుట్టుముట్టబడిన వార్డుల సరస్సు ఉంది. ఇక్కడ కాఫీని ఆస్వాదించవచ్చు. బోటింగ్ కూడా చేయవచ్చు. అంతేకాదు ఎలిఫెంట్ ఫాల్స్‌కు వెళ్లి చిరపుంజీని సందర్శించవచ్చు, ఇక్కడ కిన్రెమ్ జలపాతం, డైన్త్లెన్ జలపాతం కాకుండా అనేక జలపాతాలు ఉన్నాయి, ఈ నగర అందం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు షిల్లాంగ్ శిఖరాన్ని సందర్శించడం జీవితాంతం గుర్తుండిపోతుంది.

పక్కా నిజం..ఈగలు హత్యకేసు హంతకుడ్ని పట్టించాయ్

హత్య చేసి తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈగలు కారణంగా అతను పోలీసులకు అడ్డంగా చిక్కాడు. అదెలా అనుకుంటున్నారా?. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.

మధ్యప్రదేశ్‌ జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో అక్టోబరు 30న ఓ మర్డర్ జరిగింది. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడ్ని చంపేశారు దుండగులు. ఊరు చివరనున్న పంట పొలాల్లో మనోజ్ డెడ్‌బాడీని గ్రామస్థులు గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. మృతదేహం పడి ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ అనూహ్య ఘటన జరిగింది. అక్కడ గుమిగూడిన జనంలో ఉన్న యువకుడు ధరమ్ ఠాకూర్ శరీరంపై విపరీతంగా ఈగలు వాలడాన్ని పోలీసులు గమనించారు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతీపై రక్తపు మరకలు కనిపించాయి. దాంతో తమదైన శైలిలో విచారించగా.. మనోజ్‌ను తానే హత్య చేసినట్లు ధరమ్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్‌లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాఫ్తులో తెలిసింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ధరమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రాష్ట్రాల్లో అంటే

ఛత్ పూజ 2024 సమీపిస్తున్న కొద్దీ అనేక రాష్ట్రాల్లోని బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఇది బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వినియోగదారులపై ప్రభావం చూపుతుంది.

బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేయడం చాలా అవసరం. ఛత్ పూజ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ అధికారిక బ్యాంక్ సెలవు షెడ్యూల్ ప్రకారం, భారతదేశం అంతటా పలు ప్రాంతాలలో నవంబర్ 7, 8 తేదీలలో సెలవు ప్రకటించింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ సెలవుల రాష్ట్రాల వారీగా జాబితాను అందిస్తుంది. అదనంగా, భారతదేశం అంతటా బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో ప్రభుత్వ సెలవులను పాటిస్తాయి. ఛత్ పూజ అనేది సూర్య భగవానుని ఆరాధించడానికి అంకితం చేసే నాలుగు రోజుల పండుగ. భక్తులు ఉపవాసం, ఉదయించే, అస్తమించే సూర్యుడికి ప్రార్థనలు చేయడం, పవిత్ర స్నానాలు చేయడం, నీటిలో నిలబడి ధ్యానం చేయడం వంటి వివిధ ఆచారాలలో పాల్గొంటారు. అందుకే ఈ ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.

నవంబర్ 7: ఛట్ పూజ సందర్భంగా అసోం, ఛత్తీస్‌గడ్, బీహార్, ఝార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 8: వంగల పండగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 9: రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
నవంబర్ 10: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 12: ఎగాస్ బగ్వాల్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు బంద్‌.
నవంబర్ 15: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ, ఒడిశా, చండీగఢ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఢిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 17: ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 18: కనకదాస జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులు బంద్‌.
నవంబర్ 22: లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో సెలవు.
నవంబర్ 23: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.
నవంబర్ 24: ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.

రోజూ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ఇన్ని లాభాలా? జ్ఞాపకశక్తి రెట్టింపవుతుందట.

కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. ఎందుకంటే ఈ చెట్టు నుండి లభించే వస్తువులన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ చెట్టు నుంచి వచ్చే కాయ, దాని నుంచి వచ్చే నూనె, కాయలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

కొబ్బరి నూనెను మనం చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. ఈ నూనెలో అధిక పోషకాలు ఉంటాయి. జుట్టు చక్కగా పెరగడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే కొబ్బరి నూనె పోషకాల సంపద అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుంటారు.

అయితే మీకు తెలుసా..? కొబ్బరి నూనెను టానిక్‌గా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐదు శక్తివంతమైన ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నూనె శరీరానికి శక్తిని ఇస్తుంది. సాధారణంగా చలికాలంలో శరీరం డల్ గా ఉంటుంది. కాబట్టి రోజూ ఒక చెంచా కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. ఉదయాన్నే కొబ్బరినూనె తాగడం వల్ల శరీరం బలహీనపడదు.
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తాగడం వల్ల శరీరంలోని కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరినూనె మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరి నూనె జీవక్రియను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఇది గుండెకు కూడా మంచిది.
కొబ్బరి నూనెలో బరువు తగ్గడానికి సహాయపడే పదార్థాలు ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. అలాగే ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కొబ్బరినూనె తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అందాన్ని పెంచుతుంది. ఇది ముఖంపై మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన విషయాలు సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణులను సంప్రదించవచ్చు.

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ఈ సందర్భంగా తన విజయం ఖాయమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు నన్ను యూఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. ఎవరూ ఊహించలేని విధంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఫలితాలను ట్రంప్‌ స్పందించారు. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నామని ట్రంప్‌ అన్నారు. నా జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువస్తాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని అన్నారు. నా గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతోందని,

ట్రంప్‌ రాజకీయ చరిత్ర:

ఇదిలా ఉండగా, అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. 79 ఏళ్ల ట్రంప్‌కి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం రెండోసారి. ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని ఫ్రెడ్ ట్రంప్ , మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్‌లకు దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. ట్రంప్ 1968లో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు. తొలుత వ్యాపారవేత్తగా రాణించిన ట్రంప్‌ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు కూడా డెమోక్రటిక్‌ పార్టీ మహిళా అభ్యర్ధి కమలహారిస్‌పై
గెలుపొందారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఓడిపోయినప్పటికి ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఎంతో పట్టుబట్టి మళ్లీ ఈసారి అదే పార్టీ నుంచి అభ్యర్ధిగా బరి లోకి దిగారు. 1885లో ట్రంప్‌ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు . రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇండియాలోని ముంబై, పుణెల్లోనూ రియల్ వెంచర్లు ప్రారంభించాడు.

రియల్‌ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, అందాల పోటీలు.. ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు. ఆయన సంపద 5 ట్రిలియన్ డాలర్లు. ట్రంప్‌ గ్రూప్‌తో పాటు ట్రంప్‌ ఎంటర్‌టైనమెంట్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యాడు. ట్రంప్ భార్య మెలినియా ట్రంప్‌. డొనాల్డ్ ట్రంప్ తన రెండవ భార్యకి విడాకులు ఇచారు. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ 2022 జులై 14న చనిపోయారు.

ట్రంప్‌ అనేక పార్టీలు మారారు. తొలుత ఆయన రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రిఫార్మ్‌ పార్టీకి మారారు. మూడేళ్ల తర్వాత ఆయన డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమొక్రాట్‌గా కొనసాగారు. తర్వాత ఆయన జాన్‌ మెక్‌కెయిన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చారు. ఆయన రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చే ముందు ఐదు నెలలపాటు తటస్థంగా ఉన్నారు. మొత్తం ఆరుగురు డెమొక్రటిక్‌, నలుగురు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు. వీరిలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన రిపబ్లికన్లకు దగ్గరయ్యారు.

ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా.. ఈ వ్యాధి రావడం ఖాయం

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ లేకుండా అన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఎంతో గర్వంగా చెబుతూ ఉంటారు. కానీ ఇలా ప్రతి రోజూ నాన్ వెజ్ తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెలీదు.

ప్రతి రోజూ నాన్ వెజ్ ఐటెమ్స్ తినే వారిలో ఖచ్చితంగా ఈ వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు.. శరీర ఆరోగ్యం మీదనే కాకుండా.. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రోజూ ఫాస్ట్ ఫుడ్స్, లేదా మాంసం తినే వారిలో సాధారణంగా డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలే కాకుండా మతి మరుపు కూడా వచ్చే అవకాశం ఉందట. ప్రతిరోజూ మాంసం తినే వారిలో వయసు పెరిగే కొద్దీ మతిమరుపుతో బాధ పడతారట. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక మందిపై పరిశోధనలు..

ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్శిటీలో 438 మంది వ్యక్తులపై ఆరోగ్య నిపుణులు పరిశోధన చేశారు. వారి ఆహారపు అలవాట్లతో పాటు అది వారి జ్ఞాపకశక్తిపై ఎలా పని చేస్తుందో తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, మాంసం తినే 108 మందికి అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. దీని ప్రకారం ఎక్కువగా నాన్ వెజ్ తింటే వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం ఖాయం. దీని వలన ఇంట్లో మనుషుల్ని కూడా గుర్తించడం కష్టం అవుతుందని పరిశోధికులు తేల్చారు.

అంతే కాకుండా ప్రతిరోజూ మాంసం తినేవారిలో అధిక బరువు, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, బీపీ, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, మరికొంత మందిలో కనిపించాలని వెల్లడిచంారు.

నరాల సమస్య..

కేవలం పైన చెప్పిన సమస్యలే కాకుండా.. ప్రతి రోజూ నాన్ వెజ్ తినే వారిలో నరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. రోజూ పండ్లు, కూరలు, గింజలు తినే వారిలో నరాలకు సంబంధించిన సమస్యలు లేవని పరిశోధనలో వెల్లడించారు. మాంసాహార ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే నరాల సమస్యలు వస్తాయని తెలిపారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు.. ప్రధాని మోదీ విషెస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ చరిత్రాత్మక విజయం సాధించారని X లో ట్విట్ చేశారు.

తమ మైత్రి వల్ల భారత్‌-అమెరికా బంధం బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల జీవితాలు మెరుగుపరుద్దమని, ప్రపంచ శాంతి, సుస్థితర, శ్రేయస్సు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయ దుందుభి మోగిస్తున్నారు. ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270 దాటేశాడు.. స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ సత్తా చాటారు. ఈ ఫలితాలపై ట్రంప్ కూడా స్పందించాడు. తన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాకు పూర్వవైభవం తెస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తానని, తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందన్నారు.

స్వింగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెపుకొచ్చారు. తనకు 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెనెట్‌తో పాటు కాంగ్రెస్‌లో కూడా తమకే ఆధిక్యమని ఉందన్నారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి తమకు ఇబ్బందులు లేవని, అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని చెప్పారు. అసాధ్యాన్ని అమెరికా ప్రజలు సుసాధ్యం చేశారన్నారు. ఎవరైనా చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని, సరిహద్దులను నిర్ణయిస్తామన్నారు. మస్క్ సహా తన విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయంలో ఎలాన్ మస్క్‌దే కీలకపాత్ర ఉందని, అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని కొనియాడారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తనకు సరైన ఛాయిస్ అని చెప్పుకొచ్చారు.

మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌

మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ వార్త మీ కోసమే. డిసెంబర్ 1 నుండి క్రెడిట్ కార్డ్ నియమాలు మారబోతున్నాయి. బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్స్‌ ప్రయోజనాలకు రెండు ప్రధాన మార్పులు చేసింది.

వీటిలో రివార్డ్ పాయింట్లు, రిడెంప్షన్, లాంజ్ యాక్సెస్‌కి సంబంధించిన నియమాలలో మార్పులు ఉన్నాయి.

రివార్డ్ పాయింట్లు:

డిసెంబర్‌ 1 నుంచి విమానాలు, హోటళ్ల కోసం రీడీమ్ చేయగల రివార్డ్ పాయింట్‌ల సంఖ్యపై బ్యాంక్ పరిమితులను విధిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు మొత్తం బిల్లులో 70 శాతం లేదా గరిష్ట నెలవారీ పరిమితి (ఏది తక్కువైతే అది) కవర్ చేయడానికి తమ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించవచ్చు.

నెలవారీ పరిమితులు

ప్రైవేట్ ప్రైమ్ కార్డ్‌లు: 6,00,000 పాయింట్లు
మార్క్యూ కార్డ్: 3,000 పాయింట్లు
రిజర్వ్ కార్డ్: 2,000 పాయింట్లు
యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు: 1,00,000 పాయింట్లు

రిడీమ్‌పై ఈ పరిమితి ఇప్పటికే ఉన్న పరిమితికి అదనంగా ఉంటుంది. ఇది గిఫ్ట్‌ వోచర్‌లు, స్టేట్‌మెంట్ క్రెడిట్ కోసం అందుబాటులో ఉన్న పాయింట్‌లలో 50% మాత్రమే ఉపయోగించడానికి కార్డ్ హోల్డర్‌లను అనుమతిస్తుంది.

లాంజ్ యాక్సెస్:

యస్‌ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్‌లపై కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం ఖర్చు పరిమితులను కూడా పెంచుతోంది. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి. యెస్ మార్క్యూ కింద 6, యెస్ రిజర్వ్ కార్డ్ కింద 3 లాంజ్ విజిట్ కోసం రూ. 1 లక్ష వరకు లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. మొదటి బిజినెస్‌ కార్డ్‌ల క్రింద 2 లాంజ్ విజిట్‌కు రూ. 75,000. యస్‌ బ్యాంకు ఎలైట్+, సెలెక్ట్, BYOC, వెల్‌నెస్ ప్లస్, యస్‌ ప్రోస్పెరిటీ బిజినెస్ కార్డులకు 1 లేదా 2 లాంజ్ విజిట్‌ కోసం రూ. 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఒక్క ఫార్ములాతో మీరే కోటీశ్వరుడు.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో కళ్లు చెదిరే లాభాలు

పెట్టుబడిదారుల్లో చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు మంత్రం జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలున్న వాళ్లు వారు చదువుకు లేదా వారి భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి మార్గం ఎంచుకుంటూ ఉంటారు.

అయితే పిల్లల ఉన్నత చదువులకు వచ్చేసరికి మన కోటి రూపాయలు ఉంటే ఎలా ఉంటుంది? వారిని మంచి కాలేజ్‌లో జాయిన్ చేసి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడానికి ఆ సొమ్ము చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రుణం అవసరం లేకుండా పిల్లలను చదివించాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లో ఓ ఫార్ములా ద్వాారా పెట్టుబడి పెడితే కోటి రూపాయాలు మీ సొంతం అవుతాయి. 21 X 10 X 21 ఫార్ములా దారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది గొప్ప మార్గం.

ఈ ఫార్ములా ద్వారా పెట్టుబడి పెట్టి మీరు ఈ వ్యూహాన్ని అనుసరిస్తే మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై 12 శాతం వార్షిక రాబడిని సంపాదించవచ్చు. అంటే మీ పిల్లలకు 21 సంవత్సరాలు నిండినప్పుడు మీరు రూ. 1 కోటి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫండ్‌ని పొందవచ్చు. 21 X 10 X 21 ఫార్ములా ఫార్ములా ప్రకారం, మీ బిడ్డ పుట్టినప్పుడు మీరు వారి పేరుతో నెలవారీ రూ.10,000తో ఎస్ఐపీను ప్రారంభించవచ్చు. దానిని మీరు 21 సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఈ 21 ఏళ్లలో మీరు 12 శాతం వార్షిక రాబడిని పొందాలి. ఇది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్‌లో కనిపిస్తుంది. గత దశాబ్దంలో, నిఫ్టీ 50 ఇండెక్స్ 14 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. కాబట్టి 12 శాతం రాబడిని అంచనా వేయవచ్చు.

21 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.25,20,000 అవుతుంది. 12 శాతం వార్షిక రాబడి ప్రకారం మీ దీర్ఘకాలిక మూలధన లాభం రూ. 88,66,742గా ఉంటుంది. అంటే మీకు ఇది మీకు మొత్తం రూ. 1,13,86,742 (సుమారు ₹ 1.14 కోట్లు) ఇస్తుంది. రూ.కోటి కార్పస్ పొందడానికి, మీరు ప్రతి నెలా రూ. 10,000 కచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. 50:30:20 నియమం ప్రకారం మీ జీతంలో కనీసం 20 శాతం ఆదా చేయాలి. కాబట్టి మీ జీతం రూ.50,000 అయితే మీరు ప్రతి నెలా రూ.10,000 (20 శాతం) ఆదా చేయాల్సి ఉంటుంది.

జియో చౌకైన ప్లాన్‌.. రూ.175తో 10 జీబీ డేటా, 11 ఓటీటీ యాప్స్‌

ఇటీవల ప్రైవేట్‌ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల టారీఫ్‌ ప్లాన్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే రీఛార్జ్‌ ధరలు పెరిగిన తర్వాత వినియోగదారులు ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు.

ఇక వినియోగదారులను నిలపుకొనేందుకు రిలయన్స్ జియో చర్యలు చేపడుతోంది. వివిధ రకాల ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఎక్కువగా వినియోగదారులున్నది జియోకే. అందుకే కారణం లేకపోలేదు. జియో నెట్‌వర్క్ ప్రతిచోటా అందుబాటులో ఉండడమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు రిలయన్స్ జియోకి కనెక్ట్ అయి ఉన్నారు.

జియో తన వినియోగదారుల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. జియో తన కస్టమర్లను నిలుపుకోవడం కోసం ప్రతిరోజూ కొత్త ఆఫర్లను తీసుకువస్తూనే ఉంది. మీరు జియోతో ఒక నెల వాలిడిటీ నుండి ఒక సంవత్సరం వాలిడిటీ వరకు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

రిలయన్స్ జియో అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా, ఉచిత SMS అందిస్తుంది. దీనితో పాటు, జియో తన ప్లాన్‌లో కస్టమర్లకు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఇది OTT యాప్‌లకు సభ్యత్వాలను కూడా అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో జియో అనేక OTT యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని, చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం డేటాను అందిస్తుంది. ఈ జియో ప్లాన్ ధర రూ. 175 మాత్రమే.

రిలయన్స్ జియో రూ.175 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు మొత్తం 28 రోజులకు 10GB పొందుతారు. మీకు అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్న డేటాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో జియో వినియోగదారు మొత్తం 11 OTT యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందుకుంటారు.

వీటిలో సోనీ లివ్, జీ5, జియో ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్‌ఎక్స్‌టి, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, జియో టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. మీరు వెబ్ సిరీస్‌లు, లు లేదా టీవీ షోలను చూడటానికి ఇష్టపడితే ఈ ప్లాన్‌ బాగుంటుంది. ఈ జియో ప్లాన్‌లో SMS, యాక్సెస్ చేయగల కాలింగ్ సౌకర్యాలు అందుబాటులో లేవని గుర్తించుకోండి.

క్రెడిట్ కార్డుతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం భారతదేశంలో అనుమతించరని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ బ్రోకర్లు కస్టమర్‌కు సంబంధించిన సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్రమే డబ్బును స్వీకరించాలని సెబీ ఆదేశించింది.

సెబీ నిబంధనలు పెట్టుబడిదారులను రక్షించడానికి, ప్రమాదకర ఆర్థిక పరిస్థితులను నిరోధించడానికి రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డ్‌లు లేదా పర్సనల్ లోన్‌ల నుంచి నగదు ఉపసంహరణ వంటి అరువు తీసుకున్న నిధులను పెట్టుబడి కోసం ఉపయోగించడం వల్ల అధిక వడ్డీ రేట్లు, మార్కెట్ అస్థిరత కారణంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలకు దారితీయవచ్చు. ఎవరైనా అలా చేయడానికి ఒక మార్గాన్ని అందించాలని క్లెయిమ్ చేసినప్పటికీ అలాంటి పద్ధతులు నియంత్రణ ప్రమాణాలకు విరుద్ధమని గుర్తించడం చాలా ముఖమని చెబుతున్నారు.

అరువు తెచ్చుకున్న డబ్బుతో పెట్టుబడి పెట్టడం అనేది సహజంగానే ప్రమాదకరమనే విషయాన్ని నిపుణులు హైలేట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల అధిక వడ్డీ రేట్లతో పాటు జరిమానాల కారణంగా ఈ రిస్క్‌లు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు ద్వారా పెట్టుబడితో ఎంత మేరకు నష్టపోతామో? ఓసారి చూద్దాం.

అధిక వడ్డీ రేట్లు

భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు 13 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటాయి. ఇది పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలను త్వరగా తగ్గించవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తమ బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించడంలో విఫలమైతే వారు గణనీయమైన వడ్డీ ఛార్జీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లోన్ టెన్యూర్

పెట్టుబడులకు రాబడి సరిగ్గా రాకపోతే అప్పుల్లో చిక్కుకు పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు రూ. 100 విలువైన స్టాక్‌లను క్రెడిట్‌పై కొనుగోలు చేసి వాటి విలువ రూ. 60కి పడిపోతే వారు పెట్టుబడిపై నష్టాన్ని చవిచూడడమే కాకుండా అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి రావడంతో అప్పులు పాలు కావాల్సి వస్తుంది.

క్రెడిట్ స్కోర్‌

క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

ఢీల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం.. అమిత్‌షాతో కీలక భేటీ.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. నేడు సాయంత్రం గం.7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటి కానున్నారు.

ఈ సమావేశంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేయమని కేంద్రమంత్రి పవన్‌ను కోరనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను పవన్ కేంద్రమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమిత్‌షాతో భేటి అనంతరం పవన్ విజయవాడకు తిరిగి రానున్నారు.

ఉపముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సందడి నెలకొంది. తన యాత్రకు ముందు కళ్యాణ్ మంగళవారం సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములను పరిశీలించారు, భూసేకరణ ప్రక్రియకు సంబంధించి విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత, ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చే ముందు అక్కడ కాసేపు గడిపేందుకు పవన్ కళ్యాణ్ ఏపీ భవన్‌కు వెళతారు. తిరిగి రాత్రి 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని తన కార్యాలయానికి చేరుకుంటారు.

ఎక్కడికీ వెళ్లకుండా మీ ఇంటికే ఆధార్ కార్డు.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయడం చాలా ఈజీ

మీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో పీవీసీ కార్డును ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు స్పీడ్ పోస్ట్ ఖర్చుతో సహా రూ.50 మాత్రమే చెల్లించాలి. యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) కార్డును జారీ చేస్తోంది.

ముందుగా మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత ‘మై ఆధార్ సెక్షన్’లో ‘ఆర్డర్ ఆధార్ పివిసి కార్డ్’పై క్లిక్ చేయండి.

మీరు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే, మీరు 12 అంకెల ఆధార్ నంబర్, వర్చువల్ ఐడీ లేదా ఈఐడీని పూరించాలి. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను పూరించి, దీని తర్వాత కింద ఉన్న ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి చివరగా పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రూ.50 చెల్లించాలి

పేమెంట్ పూర్తయ్యాక మీకు ఆర్డర్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అంతే పది నుంచి పదిహేను రోజుల్లో మీ ఆధార్ అడ్రస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది.

ఈ మడత ఫోన్లకు భలే మంచి క్రేజ్

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పోర్టబుల్ ఫోన్ రూ.49,999కి విడుదలైంది. ఈ విభాగంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్ ఇదే. అలాగే మోటోరోలా రేజర్ 50 పోర్టబుల్ ఫోన్ రూ.64,999కు అందుబాటులో ఉంది.

ఇక సామ్సంగ్ విడుదల చేసిన ఫోన్ రూ.90 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పోర్టబుల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి మోటారోలా, ఇన్ఫినిక్స్ మోడళ్లు అనుకూలంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ధర, ఇతర వ్యత్యాసాలను తెలుసుకుందాం.

బరువు, డిజైన్

మోటోరోలా రేజర్ 50 ఫోన్ 188 గ్రాముల బరువు, 7.25 ఎంఎం మందం ఉంటుంది. అంచులు, మూలాలు గుండ్రంగా ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ బరువు 195 గ్రాములు, మందం 7.25 ఎంఎం. దీని అంచులు ప్లాట్ గా ఉంటాయి. రెండూ తెలికపాటి ఫోన్లే కావడంతో సులభంగా ఉపయోగించవచ్చు.

ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ లో 3.64 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. అదే మోటోరోలా కు 3.63 అంగుళాల ఓలెడ్ ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే అమర్చారు. ఈ రెండింటిలో విజువల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. క్యాలెండర్, కెమెరా, వెదర్ తదితర వాటిని పరిశీలించుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ తదితర యాప్ లను చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ రెండు ఫోన్లలోనూ 120 హెచ్ జెడ్ రిఫ్రెస్ రేటుతో 6.9 అంగుళాల అంతర్గత డిస్ ప్లే ఆకట్టుకుంటోంది.

ర్యామ్ సామర్థ్యం

ఇన్ఫినిక్స్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఎక్స్ వోఎస్ 14పై పనిచేస్తుంది. అలాగే 15, 16 వెర్షన్ కు కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక మోటోరోలా విషయానికి వస్తే మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తుంది.

బ్యాటరీ

ఇన్ఫినిక్స్ ఫోన్ లో 4720 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 70 వాట్ చార్జర్ తో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మోటోరోలాలో 33 వాట్ చార్జర్ కు మద్దతు
ఇచ్చే 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కెమెరా

ఇన్పినిక్స్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రైమరీ, 50 మెగా పిక్సల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఏర్పాటు చేశారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో మరో 50 మెగా పిక్సల్ కెమెరా అమర్చారు. మోటోరోలాలో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 32 మెగా పిక్సల్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు.

365 రోజుల రీఛార్జ్ ప్లాన్

టెలికాం రంగంలో పోటీ నెలకొంది. జియో, ఎయిర్‌టెల్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. వినియోగదారులను పెంచుకునేందుకు రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి.

ఎయిర్‌టెల్ ఇటీవల తన 350 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్‌ణు ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం (365 రోజుల) చెల్లుబాటును అందిస్తుంది. అలాగే అపరిమిత 5G ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఫలితంగా ఇది Jio, BSNLకు దీర్ఘకాలిక వ్యాలిడిటీ పోటీని అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ నుండి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2GB రోజువారీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం సంవత్సరం మొత్తం మీద 720GB లభిస్తుంది. ఈ గణనీయమైన డేటా ఆఫరింగ్‌తో పాటు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనంతో పాటు దేశవ్యాప్తంగా ఏదైనా టెలికాం నెట్‌వర్క్‌కి వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇంకా ఈ ప్లాన్ రోజువారీ 100 ఉచిత SMSలను కూడా అందిస్తుంది. 5G కవరేజీ ప్రాంతంలో ఉన్న 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ధర రూ. 3,599.

అదనంగా ఎయిర్‌టెల్ మూడు కొత్త డేటా రీఛార్జ్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వినియోగదారులు వారి రోజువారీ డేటా అయిపోయిన తర్వాత కూడా ప్రయోజనాలను అందిస్తూనే ఉంటుంది. రూ. 161,రూ.181, రూ.351 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్‌లు 50GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తాయి.

అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు పేరుంది. అందుకే ఈ దేశ అధ్యక్షుడికి అత్యంత శక్తిమంతుడి హోదా కూడా వస్తుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అమెరికాలో ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ దేశంలో అధ్యక్షుడి పదవీకాలం 4 సంవత్సరాలు. అమెరికా కొత్త అధ్యక్షుడు జనవరి 20, 2025న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈసారి ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదు.

అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరు ఉండటంతో ఇక్కడి అధ్యక్షుడికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. జీతంతో పాటు, అమెరికన్ ప్రెసిడెంట్‌కి మొదటిసారిగా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే సమయంలో పన్ను రహిత ఖర్చులు, వినోద ఖర్చులతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

అమెరికా అధ్యక్షుని వార్షిక ఆదాయం:

జీతం: రూ. 3.36 కోట్లు
ఖర్చులకు అదనపు భత్యం: రూ. 42 లక్షలు (50000 వేల డాలర్లు)
పన్ను రహిత వ్యయం: రూ. 84 లక్షలు ($100,000)
వినోదం కోసం ఖర్చులు: 42 లక్షల రూపాయలు (50000 వేల డాలర్లు)
వైట్ హౌస్‌లో మొదటిసారిగా ఇచ్చిన భత్యం: రూ. 84 లక్షలు ($100,000)
అన్ని ఇతర సౌకర్యాలు కూడా ఉచితం

వార్షిక జీతం, అలవెన్సులతో పాటు అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్ లో అన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. దీనితో పాటు, వారు ఇతర దేశాలకు ప్రయాణించడానికి/పర్యటనలకు ఒక లిమోసిన్ కారు, ఒక మెరైన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ వన్ అనే విమానం కూడా పొందుతారు. దీనితో పాటు, వారి భద్రతను కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 2001 నుంచి అమెరికాలో అధ్యక్షుడి జీతం పెరగలేదు. అమెరికాలో అధ్యక్షుడి జీతం చివరిసారిగా జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారంలోకి వచ్చినప్పుడు పెరిగింది. అంతకు ముందు అమెరికాలో అధ్యక్షుడి జీతం 200,000 డాలర్లు. అమెరికాలో 1789 తర్వాత, 1873, 1909, 1949, 1969, 2001లో జీతాలు పెరిగాయి.

గుండెపోటు వచ్చే 2 గంటల ముందు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

ప్రస్తుత కాలంలో సైలెంట్ కిల్లర్ ‘గుండెపోటు’ ప్రాణాంతకంగా మారుతోంది.. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా, పెద్దా..

అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. దీని గురించి అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం.. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి.. 2-3 నిమిషాల్లో నొప్పి వేగంగా పెరుగుతుంది. అయితే.. ఈ రోజుల్లో గుండెపోటు ఏ వయసు వారికైనా రావచ్చంటున్నారు వైద్య నిపుణులు.. గుండెపోటు అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి.. గుండెపోటు సంభవించినప్పుడు, రోగి సాధారణంగా తీవ్రమైన ఛాతీ నొప్పి, దవడ నొప్పి – వెన్నునొప్పిని అనుభవిస్తారు.

అయితే.. గుండెపోటుకు కొన్ని గంటల ముందు, శరీరం కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపడం ప్రారంభిస్తుంది. అయితే. ఇలాంటి లక్షణాలను చాలా మంది విస్మరిస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జఠిలం అయి.. ప్రాణాలు తీసే ప్రమాదం పెరుగుతుంది. మీరు ఈ లక్షణాలపై శ్రద్ధ వహిస్తే, మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. కాబట్టి ఈరోజు మనం గుండెపోటుకు రెండు గంటల ముందు శరీరంలో సంభవించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

గుండెపోటుకు 2 గంటల ముందు శరీరంలో కనిపించే లక్షణాలు..

గుండెపోటుకు కొన్ని గంటల ముందు రోగికి ఛాతీలో లేదా ఛాతీ మధ్యలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఛాతీ కాకుండా, శరీరం అకస్మాత్తుగా ఒత్తిడి లేదా నొప్పి అనిపిస్తుంది. ఈ రకమైన నొప్పి అకస్మాత్తుగా సంభవిస్తే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
గుండెపోటు వచ్చే ముందు శరీరంలోని కొంత భాగంలో ఒత్తిడికి లోనైన అనుభూతి. ఎడమ వైపు, భుజం, మెడ -వెనుక భాగంలో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి క్రమంగా ఉదరం వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు.
గుండెపోటు సంభవించే ముందు, రోగికి ఊపిరి ఆడకపోవడమే కాకుండా, తేలికపాటి శారీరక శ్రమ కూడా శ్వాస లోపం కలిగిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
గుండెపోటుకు రెండు గంటల ముందు, రోగికి అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతాయి.. అయితే.. శారీరక శ్రమ లేకుండా కూడా చెమటలు పట్టడం చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించాలి.
గుండెపోటుకు కొన్ని గంటల ముందు, రోగికి అకస్మాత్తుగా తల తిరగడం – స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇవి తరచుగా సంభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

గుండెపోటుకు ముందు శరీరంలో కనిపించే లక్షణాలు వ్యక్తిని బట్టి వేర్వేరుగా ఉంటాయి.. ముఖ్యం కాబట్టి పై లక్షణాలు కనిపిస్తే భయపడకుండా వైద్యులను సంప్రదించాలి.. దీంతో తగిన వైద్యం పొంది.. ప్రాణాలను కాపాడుకోవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

భారతీయ పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా

ఢిల్లీ భారతదేశానికి రాజధాని మాత్రమే కాదు. ఇది చరిత్ర, ఆధునికత కలయికతో కూడిన పురాతన నగరం. ఎర్రకోట, కుతుబ్ మినార్, తాజ్ మహల్, కరోల్ బాగ్, సరోజినీ నగర్, లజపత్ నగర్, చాందినీ చౌక్, సౌరీ బజార్, యాన్ మార్కెట్, ప్రశాంత లోధి గార్డెన్స్, అద్భుతమైన స్మారక చిహ్నాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ముంబై: కలల నగరంగా పేరొందిన ముంబై విదేశీ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన నగరాల్లో రెండో స్థానంలో ఉంది. భారతదేశం ఆర్థిక రాజధానిగా, ఇది బాలీవుడ్, లైఫ్ స్టైల్‌, ఫ్యాక్టరీ నిర్మాణాలకు కొలువైనది.

బెంగళూరు: భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు అందమైన వాతావరణం, ఉద్యానవనాలు, సరస్సులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. బెంగళూరులో బన్నెరఘట్ట నేషనల్ పార్క్, నంది హిల్స్, లాల్ బాగ్, కబ్బన్ పార్క్, బెంగుళూరు ప్యాలెస్, విధాన సౌధ, స్నో సిటీ, బెంగుళూరు ఫోర్ట్, కమర్షియల్ స్ట్రీట్ వంటి అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి.

జైపూర్,హైదరాబాద్‌: భారతదేశంలోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్ రాజస్థాన్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రవేశ ద్వారం. ఇది ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. అలాగే దేశ, విదేశాల నుండి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే హైదరాబాద్‌లోని ప్రదేశాలను కూడా సెర్చ్‌ చేసినట్లు నివేదిక చెబుతోంది.

చెన్నై: దేవాలయాలు, బ్రిటీష్ కాలం నాటి మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, దక్షిణ భారత సంస్కృతిని గొప్పగా చెప్పుకునే ప్రసిద్ధ మెరీనా బీచ్ చెన్నైకి ప్రధాన ఆకర్షణలు. విదేశీ పర్యాటకులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్ఛ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

హంపి: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపి కర్ణాటకకు గర్వకారణం. ఇది బలమైన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎక్కువగా విదేశీయులను ఆకర్షిస్తుంది. దీనిని కూడా ఇంటర్నెట్‌లో ఎక్కువ సెర్చ్‌ చేసినదానిలో ఉంది.

మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ

హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.. అయితే టికెట్లు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

మెట్రో ప్రయాణికులకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ గూగుల్ వాలెట్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆర్‌సీఎస్ చాట్‌తో మెట్రో టికెట్స్ కొనుగోలు చేయడానికి గూగుల్ వాలెట్ ద్వారా స్కాన్ చేసే వీలు కల్పిస్తున్నారు. ఈ కొత్త గూగుల్ వ్యాలెట్ టికెటింగ్ సర్వీస్‌ను మెట్రో ఎన్వీఎస్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల తాకిడి నేపథ్యంలో ఈ టికెటింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎలాంటి యాప్ అవసరం లేకుండా గూగుల్ వ్యాలెట్ ద్వారా ఒక్క మెసెజ్‌తో మెట్రో టికెట్స్ బుక్ చేసుకొవచ్చని తెలిపారు.

బీల్ ఈజీ, రూట్ మొబైల్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్ మెట్రో సంస్థతో కలిసి ఈ యూనిక్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు సంస్థ ప్రతినిధులు.. ముందుగా గూగుల్ లెన్స్‌లోకి వెళ్లి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన లింక్ ద్వారా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలని అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఈ టికెట్ 15 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఫోన్ పే ద్వారా మెట్రో టికెట్లను తీసుకుంటున్నారు ప్రయాణికులు.. అయితే ఈ సిస్టం అందుబాటులోకి వస్తే చాలా సులభంగా ఎలాంటి యాప్ లేకుండా టికెట్లను పొందే సౌలభ్యం ప్రయాణికులకు ఉంటుంది. నూతన టెక్నాలజీతో ప్రయాణికులు మరింత సౌలభ్యంగా మెట్రోలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

తిరుమల క్షేత్రంలో కొలువైన కొత్త పాలక మండలి.. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు

టీటీడీ కొత్త పాలకమండలి కొలువైంది. బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఛైర్మన్‌గా మరో 15 మంది సభ్యులుగా ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 5 నెలల తర్వాత టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.

తిరుమల ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ స్వామిని ముందుగా దర్శించుకున్న బీఆర్ నాయుడు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలకగా ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో శ్యామల రావు ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ధర్మకర్త మండలి ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు

టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా టీటీడీ ఈవో శ్యామల రావు స్వామి వారికి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం పాలకమండలి సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంతి, ఎమ్మెస్ రాజు, నర్సిరెడ్డి, పూర్ణ సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ఆనంద సాయి, జానకి దేవి, దర్శన్, శాంతారాం, నరేష్ కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్‌లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులకు ఆలయ పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులకు శ్రీవారి చిత్రపటంతో పాటు డైరీలు క్యాలెండర్లను అధికారులు అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించిన సీఎం చంద్రబాబుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నీరు అమృతంతో సమానం.

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంతో వయసుతో సంబంధం లేకుండా వచ్చే స్థూలకాయం ఒకటి.

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి మంచి ఆహారం, వ్యాయామమే మార్గం. అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల బరువు తగ్గొచ్చని మన పెద్దలు చెబుతున్నారు. బరువు తగ్గడానికి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే..

నిమ్మ, తేనె:

ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ, ఒక చెంచా తేనె, చిటికెడు ఎండుమిర్చి వేసి తినాలి. నల్ల మిరియాలలో పైపెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కొత్త కొవ్వు కణాలు పేరుకుపోవడానికి అనుమతించదు. నిమ్మకాయలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరం నుండి విషపూరిత మూలకాలను తొలగించడంలో సహాయపడుతుంది.

సోంపు నీరు:

6-8 సోంపు గింజలను ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాలు మరిగించాలి. దీన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో వేడి వేడిగా తాగాలి. ఇది అధిక ఆకలి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మురికిని శుభ్రపరుస్తుంది. మూత్రవిసర్జన, చెమట అధికంగా వచ్చేలా ప్రేరేపిస్తుంది.

జీలకర్ర నీరు:

జీలకర్ర నీటిని తాగడం వల్ల స్థూలకాయం త్వరగా తగ్గుతుంది. ఇందులో క్యుమినాల్డిహైడ్, థైమోక్వినోన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్ , కీళ్ల నొప్పులు వంటి పరిస్థితులు ఉంటే, చికాకు, వాపును తగ్గించడంలో జీలకర్ర నీరు ప్రభావవంతంగా ఉంటుంది.

మెంతి గింజల నీరు:

మెంతి నీరు తాగడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో మెంతులు సహకరిస్తాయి. మెంతి నీటిని తయారు చేయడానికి, ముందుగా 1 టీస్పూన్ మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. దీని తరువాత, ఉదయం నిద్రలేచిన తర్వాత, ఈ నీటిని వడపోసి ఖాళీ కడుపుతో తాగాలి.

ఉసిరి రసం:

ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచడంలో, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఊరిస్తున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.! మనల్ని ఎవడ్రా ఆపేది.. ఇదే ట్రెండ్.!

పవర్‌స్టార్‌ ఆల్రెడీ మేకప్‌ వేసుకున్న లు మూడు. అందులో ఆల్రెడీ రెండు సెట్స్ మీదున్నాయి. ఇంకోటి ఎక్కడుంది అంటే నిన్న మొన్నటిదాకా ఆన్సర్‌ చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్‌.. ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతోంది.

పవర్‌స్టార్‌ ఆల్రెడీ మేకప్‌ వేసుకున్న లు మూడు. అందులో ఆల్రెడీ రెండు సెట్స్ మీదున్నాయి. ఇంకోటి ఎక్కడుంది అంటే నిన్న మొన్నటిదాకా ఆన్సర్‌ చాలా మందికి తెలియకపోవచ్చు.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్‌.. ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.

హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతోంది. గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీష్‌ కాంబోలో స్టార్ట్ అయిన కావడంతో ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.

ఎన్నికలకు ముందు బ్రో ఎంత హల్‌చల్‌ చేసిందో, ఎన్నికల సమయంలో ఉస్తాద్‌ అప్‌డేట్లు కూడా అంతే హల్‌చల్‌ చేశాయి.

తమిళంలో విజయ్‌ నటించిన తెరి కు రీమేక్‌గా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ని తెరకెక్కిస్తున్నారనే చాన్నాళ్లుగా వైరల్‌ అవుతున్నాయి. ఆ కీ, ఈ కీ పోలిక ఉండదని చెబుతూనే ఉన్నారు హరీష్‌.

ఇప్పుడు అదే విషయాన్ని మరో సారి కన్‌ఫర్మ్ చేశారు రైటర్‌ దశరథ్‌. అటు హరిహరవీరమల్లు, ఇటు ఓజీ రెండు ల షూటింగులూ పూర్తి కాగానే ఉస్తాద్‌ మీద ఫోకస్‌ చేస్తారు పవర్‌స్టార్‌.

ఆయన కాల్షీట్లు అందుబాటులోకి వచ్చేసరికి, ఉస్తాద్‌ టీమ్‌ పక్కా స్క్రిప్టుతో రెడీ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాట.

ఠాగూర్‌ 2.0కు రెడీ అవుతున్న చిరు.! సెకండ్ ఇన్నింగ్ లోను చిరుదే హవా..

ప్రజెంట్ విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేయబోయే ఏంటన్నది ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి.
బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు. విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది.

ప్రజెంట్ విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేయబోయే ఏంటన్నది ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి. బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు.

విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి.

చిరు కోసం మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మెసేజ్‌ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్‌ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఆలోచనలో పడ్డారు చిరు.

ఆల్రెడీ చిరు హీరోగా ఠాగూర్‌, ఖైదీ నెంబర్ 150 లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరు ఇమేజ్‌ను డీల్ చేయటంతో పాటు..,

తెలుగు ఆడియన్స్‌ పల్స్‌ కూడా పర్ఫెక్ట్‌గా తెలిసిన కమర్షియల్ డైరెక్టర్‌ కాబట్టి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళ దర్శకుడు మోహన్‌రాజా పేరు కూడా వినిపిస్తోంది.

గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరు మరో మూవీ చేస్తారన్న టాక్ గట్టిగా వినిపించింది. గాడ్ ఫాదర్‌ విషయంలో ఫుల్‌ హ్యాపీగా ఉన్న చిరు..,

నెక్ట్స్ మూవీకి మోహన్‌రాజా పేరు కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఠాగూర్‌ 2.0 అన్న రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న ఈ కు సంబంధించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది.

Health

సినిమా