Friday, November 15, 2024

పోస్టాఫీస్ మతిపోయే పాలసీ.. రోజుకు రూ. 2 పొదుపుతో.. రూ. 15 లక్షలు పొందే ఛాన్స్

కుటుంబం అంతా ఇంటి పెద్ద సంపాదనపై ఆధారపడి జీవిస్తుంది. అతనికి అనుకోని ఆపద సంభవిస్తే మాత్రం ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలంటే ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవడం బెటర్. ఆపద సమయంలో బీమా సొమ్ము కుటుంబానికి అండగా నిలుస్తుంది. అప్పుల ఊబిలోంచి బయటపడేస్తుంది. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బీమా పాలసీలను అందిస్తున్నాయి. అదిరిపోయే ప్రయోజనాలతో ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొస్తున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ కూడా దేశ ప్రజల కోసం సేవింగ్ స్కీమ్స్ తో పాటు ఇన్సూరెన్స్ పాలసీలను కూడా అమలు చేస్తున్నది. ఇటీవల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలైన హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ స్కీమ్స్ లాంచ్ చేసింది. ఈ పథకాల కాల వ్యవధి ఒక సంవత్సరం. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వారు హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పాలసీల్లో చేరొచ్చు. తక్కువ ప్రీమియంతోనే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ప్రమాదాల భారిన పడినప్పుడు వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. బీమా పాలసీలు ఉన్నట్లైతే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఏడాదికి రూ.755 కడితే చాలు రూ.15 లక్షలు పొందొచ్చు. అంటే రోజుకు రూ. 2 పొదుపు చేస్తే చాలు రూ. 15 లక్షల బీమా సొమ్ము మీ సొంతం చేసుకోవచ్చు.

పోస్టాఫీసు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రూ. 15 లక్షల బీమా పొందాలంటే.. సంవత్సరానికి రూ. 755 చెల్లించాలి. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. అలాగే శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.15 లక్షలు అందుతాయి. పాలసీదారు మరణిస్తే పిల్లల చదువులకు రూ.1 లక్ష, పిల్లల పెళ్లి కోసం మరో రూ.1 లక్ష అదనంగా చెల్లిస్తుంది పోస్టల్ శాఖ. పాలసీదారు బతికి ఉంటే వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి రోజుకు రూ.1000, ఐసీయూలో చేరితే రోజుకు రూ.2 వేలు ఇస్తారు. చేయి లేదా కాలు విరిగినట్లయితే రూ.25 వేలు అందుతాయి. ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ లో మరో పాలసీ ఉంది.

ఇందులో సంవత్సరానికి రూ.555 చెల్లించాలి. ఈ పాలసీ ద్వారా రూ. 10 లక్షలు వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబానికి 100 శాతం రక్షణ కూడా అందించబడుతుంది. చివరకు దహన సంస్కారాల ఖర్చు దాదాపు రూ. 5,000 పొందవచ్చు. అలాగే మృతుల పిల్లల చదువు కోసం రూ. 50,000 అందుబాటులో ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే మరో పాలసీలో సంవత్సరానికి రూ. 355 చెల్లిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. ఈ పాలసీ ద్వారా వ్యక్తి ప్రమాదంభారిన పడినప్పుడు.. మరణించినా, శాశ్వత అంగ వైకల్యం పొందినా 100 శాతం సమ్ ఇన్‌ష్యూర్డ్ అందిస్తారు.

అలాగే పిల్లల పెళ్లి కోసం రూ.50 వేల వరకు చెల్లిస్తారు. అలాగే ఎముకలు విరిగినట్లయితే రూ.25 వేలు ఇస్తారు. హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ లో ఏడాదికి రూ.555 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో రూ.10 లక్షల బీమా పొందొచ్చు. పాలసీదారు మరణించినా, శాశ్వత అంగవైకల్యం చెందినా 100 శాతం చెల్లిస్తారు. ఎముకలు విరిగినప్పుడు రూ.25 వేలు ఇస్తారు. అంత్య క్రియల కోసం రూ.5 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువు కోసం రూ.50 వేల వరకు పొందవచ్చు. పోస్టల్ బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ పాలసీలను తీసుకోవచ్చు.

EMI, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తక్కువ వడ్డీకే లోన్ కావాలా? ప్రభుత్వ సంస్థ నుంచి బంపర్ ఆఫర్!

ప్రస్తుతం బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్ అంటే కష్టమే. ఎందుకంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి నెలా ఈఎంఐలు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. లోన్ శాంక్షన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ప్రాసెసింగ్ ఫీ కూడా కట్టాల్సి వస్తుంది. దీంతో మనకు పర్సనల్ లోన్ విషయంలో ఎక్కువ ఎక్కువ భారం పడుతుంది. అయితే ఇవన్నీ ఏం లేకుండా, నచ్చినప్పుడు లోన్ తిరిగి చెల్లించే అవకాశం భారం అనేది ఉండదు. అలాంటి సూపర్ అవకాశం కూడా ఒకటి ఉంది. ఈఎంఐలు బెడద, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నచ్చినప్పుడు మనం లోన్ తీర్చుకోవచ్చు. ఆ అవకాశాన్ని ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇస్తుంది. ఇక LIC ఆఫర్ చేస్తున్న ఈ లోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే దానిపై ఈజీగా లోన్ తీసుకోవచ్చు. ఇలా పాలసీపై తీసుకున్న రుణాలకు అసలు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇందులో వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ లోన్ ని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తిరిగి చెల్లించవచ్చు. మీ పాలసీ టెన్యూర్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడైనా తిరిగి కట్టవచ్చు. ఇందులో వడ్డీని ఏడాదికి ఓసారి లెక్కిస్తారు. ఎల్ఐసీ పాలసీ పైన తీసుకునే లోన్లు చాలా సేఫ్. ఇవి సెక్యూర్డ్ లోన్స్ పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ లోన్లపై వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే, మీరు మీ పాలసీకి కట్టిన ప్రీమియంని బట్టి మీకు ఎంత లోన్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ లోన్లు అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ కూడా తక్కువ ఉంటుంది. కేవలం 3-5 రోజుల్లోనే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. అలాగే ఈ లోన్ తీసుకుంటే మీరు కట్టే పాలసీపై ఎఫెక్ట్ పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీ పాలసీ బెనిఫిట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. అంటే ఇక్కడ మీరు రెండు బెనిఫిట్స్ పొందుతారు.

ఈ లోన్ కి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేయరు. ఈ లోన్ టెన్యూర్ 6 నెలల నుంచి మీ పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటుంది. మీరు మూడు విధాలుగా లోన్ తిరిగి కట్టవచ్చు. ఒకేసారి అసలు వడ్డీ కలిపి కట్టొచ్చు లేదా ప్రతి ఏడాది వడ్డీ చెల్లిస్తూ అసలు తరువాత కట్టవచ్చు లేదా పాలసీ మెచ్యూరిటీ సమయంలో క్లెయిమ్ డబ్బుతో పాటు అసలు కూడా సెటిల్ చేసుకోవచ్చు. అంటే అసలు పోగా మీకు రావలసిన మిగిలిన డబ్బులు మీకు ఇస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు LIC ఆఫీసులో కానీ, లేదా LIC ఏజెంట్ ని సంప్రదించి కానీ తెలుసుకోవచ్చు.

Google Mapsలో అదిరిపోయే AI ఫీచర్స్.. ఇక అవి తెలుసుకోవడం చాలా ఈజీ

గూగుల్‌ మ్యాప్స్‌ వాడకం ప్రస్తుతం చాలా ఎక్కువయ్యింది. ఈరోజుల్లో అందరికీ అనివార్యంగా మారింది. తెలిసిన అడ్రస్​ను కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో చూస్తూ వెళ్తున్న పరిస్థితులు వచ్చేశాయి. జర్నీకి ఎంత టైమ్ పడుతుంది? ఏవైనా షార్ట్‌కర్ట్స్‌ ఉన్నాయా? లాంటి వివరాలను తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యింది. ఇలా వెళ్లేందుకే గూగుల్ మ్యాప్స్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు.అయితే గూగుల్ మ్యాప్స్ యాప్​ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తూ గూగుల్ కొంతకాలం నుంచి కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుంటుంది. తమ యూజర్ల కోసం ఎన్నో కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తున్నామని గూగుల్ ఇటీవల తెలిపింది. వాటి ద్వారా కొత్త ప్రాంతాలకి టూర్ కి వెళ్ళడం మరింత కంఫర్ట్ కానుంది. ఇంతకీ ఆ ఫీచర్స్ ఏంటంటే? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మామూలుగా మనం ఓ ఫేమస్ రెస్టారెంట్​కు వెళ్లాలనుకుంటే ఏం చేస్తాం? దాని పేరును మ్యాప్స్​లో సెర్చ్ చేసి అది చూపించిన రూట్ ద్వారా వెళ్లిపోతాం. ఇక కొత్త ఫీచర్ సాయంతో మనం ఎప్పుడైనా కొత్త ప్లేస్ కి వెళ్లినప్పుడు మ్యాప్స్​లో రెస్టారెంట్స్ లేదా డేట్ నైట్ స్పాట్స్ అని సెర్చ్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న బెస్ట్​ ఔట్​లెట్స్​ ని చూడవచ్చు. మీరు గ్రూప్ డిన్నర్​కు వెళ్లాలనుకన్నా కూడా సజెస్ట్ చేస్తోంది. రెస్టారెంట్‌లు, కేఫ్‌లను ఈజీగా పిన్ చేసి మంచి రూట్ చూపిస్తుంది.ఇంకా అంతే కాకుండా మీకు ఏం చేయాలో తెలియకపోయినా ఇకపై గూగుల్ మ్యాప్స్ సహాయం చేస్తుంది. చలికాలంలో మనం వెళ్లబోయే ట్రిప్​లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ఏంటి? ఏ ప్లేసెస్ కి వెళ్తే సరదాగా గడపవచ్చు? బాగా ఎంజాయ్ చేయవచ్చు? ఒకవేళ వర్షం పడుతుంటే ఏం చేయాలి? వంటి క్వశ్చన్స్ కి గూగుల్ మ్యాప్స్ సమాధానాలు ఇస్తుంది. మీరు వెళ్లే ఛాన్స్ ఉన్న ప్లేసెస్ ని సజెస్ట్ చేస్తుంది.

మామూలుగా గూగుల్ లో రివ్యూలను చూసి ట్రిప్​కి ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవుతాం. అన్నీ చెక్ చేసుకొని ఫిక్స్ అవుతాం. అయితే ఇకపై గూగుల్ మ్యాప్స్​ వందల రివ్యూస్​ను సమ్మరైజ్ చేస్తుంది. ఓ చిన్న పేరాగ్రాఫ్​లో చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఫీచర్ వల్ల మీ టైమ్ సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ ప్లేసెస్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.కొన్ని టూరిస్ట్ స్పాట్​లలో క్లైమేట్ అనుకూలంగా లేకుంటే మనం ఎంజాయ్ చేయలేం. ఇకపై గూగుల్ మ్యాప్స్​లో క్లైమేట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. దాని బట్టి మనం టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనం వెళ్లాలనుకునే ప్లేస్ లో క్రౌడ్, ట్రాఫిక్ ఉందో లేదో కూడా గూగుల్ మ్యాప్స్ ఈజీగా చెప్పేస్తుంది. ఇలా మనకు ఉపయోగపడే చాలా ఫీచర్స్​ను గూగుల్ తీసుకొస్తుంది.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఉల్లంఘిస్తే రూ. 2 వేల జరిమానా

గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు లక్షలాది మంది వలస వస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. రోడ్లపైకి వేలాది వాహనాలు వస్తుండడంతో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు, అలాగే ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచిస్తున్నప్పటికీ.. రూల్స్ అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఇకపై వాహనదారులు ఇలా బండి నడిపారో రూ. 2 వేలు కట్టాల్సిందే. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొంతమంది వాహనదారులు అర్జెంట్ వర్క్ ఉందనో, యూటర్న్ లాంగ్ ఉందనో, లేక ఇక్కడే కదా అని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంటారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇలాంటి తప్పిదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రెడీ అయ్యారు.

వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, రాంగ్ రూట్ లో వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానాను పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మీరు ట్రాఫిక్ రూల్స్ ను లైట్ తీసుకుంటే మీ జేబుకు చిల్లు పడ్డట్టే. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయమయ్యే ప్రమాదాన్ని 70 శాతం, మరణాల ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని అడిషినల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఎడ్యుకేషన్, అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారని విశ్వప్రసాద్ తెలిపారు. మరి మీరు సేఫ్ గా ఉండి తోటి ప్రయాణికులను సేఫ్ గా ఉండేలా చేయాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారుల నుంచే మార్పు ప్రారంభం కావాలి.

కేంద్రం గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ బియ్యం కేజీ రూ. 34కే.. ఎక్కడ కొనాలంటే?

పేద, మధ్య తరగతి ప్రజలు మూడు పూటలా తినడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పూట తిండి దొరక్క పస్తులుండే వారు ఎంతో మంది ఉన్నారు. చాలీ చాలనీ జీతాలతో కుటుంబమంతా కడుపునిండా తినలేని పరిస్థితి. నేటి రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా తయారయ్యింది. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఆహారంగా రైస్ తీనే వారే ఎక్కువ. రైస్ తో రకరకాల వంటకాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిదాపరించింది. వర్షాలు, చీడపీడల వల్ల ఆహార పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

దీనికి తోడు పంటలు సరిగా పండకపోవడంతో బియ్యం దిగుబడులు తగ్గి ధరలు పెరుగుతున్నాయి. వంట గ్యాస్, ఆయిల్, పప్పు దినుసులే కాదు బియ్యం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. క్వాలిటీ బట్టి కేజీ రైస్ 50, 100 ఉంటుండడంతో కొనలేని పరిస్థితి దాపరించింది. మార్కెట్ లో బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద వారికి చౌక ధరలో బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన రైస్ అందించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం భారత్ బ్రాండ్ రైస్ పేరిట తక్కువ ధరకే కేజీ రైస్ అందించేందుకు చర్యలు చేపట్టింది.

ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్తను అందించింది. తక్కువ ధరకే క్వాలిటీ రైస్ ను అందించేందుకు రెడీ అయ్యింది. భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకంలో భాగంగా కేవలం రూ. 34కే భారత్ బ్రాండ్ బియ్యాన్ని అందించనున్నది. ఈ పథకం రెండో విడతలో భాగంగా బియ్యం, గోధుమ పిండి విక్రయాలను సెంట్రల్ గవర్నమెంట్ మంగళవారం ప్రారంభించింది. బియ్యాన్ని కేజీ రూ. 34కు, గోధుమ పిండిని రూ. 30కి విక్రయించాలని నిర్ణయించింది. ఇవి 5,10 కేజీల బ్యాగుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని నాఫెడ్, ఎన్ సీసీఎఫ్, కేంద్రీయ భాండార్, ఈ కామర్స్ వేదికల్లో కొనుగోలు చేయొచ్చు.

ఈ విక్రయాల కోసం మొబైల్ వ్యాన్లను ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రారంభించారు. గతంలో భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం ద్వారా కేజీ బియ్యం రూ. 29కి, గోధుమ పిండిని రూ. 27కు కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే బియ్యం లభిస్తుండడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే వారికి, కార్మికులకు భారత్ బ్రాండ్ రైస్ భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం ప్రయోజనకరంగా ఉండనున్నది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 592 జాబ్స్.. రాత పరీక్ష లేదు

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ తీసుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తారు. బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. హాలిడేస్, మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధుల కారణంగా బ్యాంక్ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇటీవల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. పలు బ్యాంకులు జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సీరియస్ గా ట్రై చేస్తే మీరు కలలు కన్న బ్యాంక్ జాబ్ ను మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురందించింది.

బీఓబీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 592 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ 140, డిజిటల్ గ్రూప్ 139, రిసీవబుల్ మేనేజ్ మెంట్ 202, ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ 31, కార్పోరేట్, క్రెడిట్ విభాగం 79, ఫైనాన్స్ 1, ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీ పోస్టుల్లో రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఈ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 22 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష రాయకుండానే బ్యాంక్ జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్య్వూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.bankofbaroda.in వెబ్‌సైట్‌ ను సందర్శించాల్సి ఉంటుంది. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.

పదో తరగతి చదివితే చాలు.. నెలకు లక్ష సంపాదించవచ్చు

ఈరోజుల్లో చదువుకునేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అయితే పెద్ద పెద్ద డిగ్రీలతో పని లేకుండా కేవలం పదో తరగతి విద్యార్హత ఉన్నా చాలు.. లక్షలు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఇంతకీ అలాంటి పని ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ పైలెట్.. మీరు కేవలం ఐదు రోజుల్లోనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలట్‌ అయితే ఇక మీకు తిరుగుండదు అనే చెప్పాలి. చాలా మందికి దీని గురించి అవగాహన ఉండదు కానీ దీని వల్ల మంచి సంపాదన ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తుంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. అందువల్ల డ్రోన్ అవసరం చాలా రంగాలకు ఉంటుంది. దీనికి కాస్త ట్రైనింగ్ తీసుకుంటే చాలు.. మీ సొంత ఊరిలోనే వ్యవసాయ పనుల్లో డ్రోన్‌ సేవలను అందించవచ్చు. దీని ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా ఆదాయాన్ని పొందవచ్చు.

మంచి నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల అవసరం పెరుగుతోంది. అందుకే చాలా రంగాలలో డ్రోన్ పైలట్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండీడ్, నౌక్రి, లింక్డ్‌ఇన్ వంటి వెబ్‌సైట్‌లలో మనం డ్రోన్ పైలట్ జాబ్స్ వెతుకోవచ్చు. బోట్స్ & డ్రోన్స్ ఇండియా, డ్రోన్ డెస్టినేషన్ వంటి వెబ్‌సైట్‌లలో జాబ్స్ చూసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని డ్రోన్ కంపెనీలు ఉద్యోగుల కోసం యాడ్స్ ఇస్తుంటాయి. సినిమా, మీడియా రంగాలకు కూడా డ్రోన్ పైలట్లు అవసరం. కొన్నిస్పెషల్ ఏరియల్ షాట్‌లను క్యాప్చర్ చేయడానికి సినిమా, మీడియా రంగంలో అవకాశాలు ఉంటాయి. అలాగే వంతెనలు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్‌ల వంటి వాటిని చెక్ చేయడానికి డ్రోన్ పైలట్లు అవసరం. సైబర్‌ సెక్యూరిటీ రంగంలోనూ డ్రోన్లను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.

2030నాటికి డ్రోన్‌ ఇండస్ట్రీ మార్కెట్‌ రూ.92,500 కోట్లకు (11 బిలియన్‌ డాలర్లు) పెరగనుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రాబోయే పదేళ్లలో డ్రోన్‌ రంగంలో ఇండియా కచ్చితంగా గ్లోబల్‌ లీడర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో 400కు పైగా డ్రోన్‌ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు స్టార్టప్‌లు ఉన్నాయి. కార్గో, అగ్రికల్చర్, సర్వీస్ , సర్వే-మ్యాపింగ్‌ వంటి రంగాల్లో ఇప్పటికే డ్రోన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక గవర్నమెంట్, అకడమిక్, ప్రైవేటువీ కలిపి దేశంలో మొత్తం 120 సర్టిఫైడ్‌ శిక్షణ సంస్థలున్నాయి. డ్రోన్ పైలట్‌ కోర్సు కి ట్రైనింగ్​ 5 రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఫీజు ఉంటుంది. మనం డ్రోన్లను ఆన్‌లైన్‌లో గవర్నమెంట్​ రూల్స్ ప్రకారం రిజిస్టర్‌ చేయాలి. ఎందుకంటే ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేసే పైలట్‌కు కచ్చితంగా లైసెన్స్‌ కావాలి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కూడా ఉండాలి.

డిఫెన్స్ రంగానికి కి చెందిన రెడ్‌ జోన్‌స్, విమానాశ్రయాలకు 12 కి.మీ.ల పరిధిలో తప్ప మిగిలిన గ్రీన్‌ జోన్‌లో ఎక్కడైనా ఎలాంటి పోలీసుల పర్మిషన్ అవసరం లేకుండా 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ఆపరేట్‌ చేయవచ్చు. దేశంలో 90శాతం ఎయిర్‌స్పేస్‌ గ్రీన్‌జోన్‌గానే ఉండడం డ్రోన్‌ సెక్టార్​కు మంచి ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఇదీ సంగతి. ఇలా మీరు కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు డ్రోన్ పైలట్ గా మారి లక్షలు సంపాదించవచ్చు.

ఇండియన్ ఆయిల్ లో జాబ్స్.. రాత పరీక్ష లేదు.. మంచి జీతం

ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ కు కాంపిటీషన్ హెవీగా ఉంది. మంచి జీతంతో కూడిన ఉద్యోగం కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పెషల్ స్కిల్స్ కూడా ఉండాల్సిందే. ఇటీవల రైల్వే, రక్షణ సంస్థల నుంచి భారీగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. జాబ్ కొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? డిగ్రీలు, పీజీలు చేసి ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? జాబ్ కోసం వెతికి విసిగిపోయారా? ఎంత వెతికినా జాబ్ దొరకడం లేదా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్.

చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురును అందించింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే జాబ్ సొంతం చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీకానున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.

అప్రెంటిస్ శిక్షణ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనూ అందించబడుతుంది. అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణ అందిస్తారు. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ/బీసీఏ/బీబీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ కోసం మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిప్లొమా (టెక్నీషియన్) అభ్యర్థులకు నెలకు రూ.10,500, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.11,500 స్టైఫండ్ చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి గల వారు నవంబరు 29 తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం IOCL అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న గుండె జబ్బులు.. నెల రోజుల ముందే కన్పించే లక్షణాలివే

వయసుతో సంబంధం లేకుండా నేటి కాలంలో ప్రతి ఒక్కరి గుండె మొరాయిస్తుంది. సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తుంది. అయితే ఇలా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనీసం 30 రోజుల ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి..

నేటి కాలంలో గుండెపోటు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. ఇది ప్రాణాంతకమైన సమస్య. అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలి. తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు. ఇందులో మూడొంతులు గుండెజబ్బుల వల్లనే మరణిస్తున్నారట. కాబట్టి గుండె పోటు గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతైన అవసరం. చాలా మంది గుండెపోటు సడెన్ గా వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవం పూర్తిగా భిన్నమైనది. సాధారణంగా గుండెపోటు రాకముందే కొన్ని రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. దీన్ని గుండెపోటుకు మొదటి సంకేతం అంటారు. తాజా అధ్యయనంలో 7 లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

NCBIలో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. గుండెపోటు లక్షణాలు ఒక నెల ముందుగానే కనిపిస్తాయి. 243 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారంలో ఇది తేలింది.
నెల రోజులు ముందుగా కనిపించే లక్షణాలు ఇవే

ఛాతీ నొప్పి
గుండెల్లో భారంగా ఉండటం
వేగవంతమైన హృదయ స్పందన
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీ నొప్పి
అలసట
నిద్ర సమస్య

గుండెపోటు ప్రారంభ లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజా అధ్యయనం ప్రకారం 50 శాతం మంది మహిళలు గుండెపోటుకు ముందు నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పురుషులలో 32 శాతం మంది మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. 2022 అధ్యయనం ప్రకారం ఛాతీ నొప్పి.. గుండెపోటు ప్రధాన లక్షణం. ఇది పురుషులు, స్త్రీలలో దాదాపు సమానంగా సంభవిస్తుంది. ఈ లక్షణం 93 శాతం మంది పురుషులలో, 94 శాతం మంది స్త్రీలలో కనిపించింది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను వెంటనే సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌

రైల్వేలో ఉద్యోగం పొందాలనేది ఎందరికో కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏడాదంతా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. తాజాగా విడుదలైన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు మరో 20 రోజులు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందుగానే రైల్వే శాఖ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటికి హాజరైతే ఆన్‌లైన్‌ పరీక్షలు సులువుగా ఉంటాయి..

రైల్వే ఉద్యోగాలకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న అభ్యర్ధులకు రైల్వే శాఖ మాక్‌ టెస్ట్‌లు విడుదల చేసింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టెస్ట్‌లు రాయవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను ఆర్‌ఆర్‌బీ రూపొందించింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే వివిధ పేపర్ల మాక్‌ టెస్టులు వినియోగించుకోవచ్చని సూచించింది. మాక్‌ టెస్టులు రాయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. కాగా దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు గత జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 వరకు పోస్టులున్నాయి. నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 కంప్యూటర్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 నియామక కంప్యూటర్‌ పరీక్షకు సంబంధించిన తేదీ విడుదలైంది. నవంబరు 10న పరీక్ష నిర్వహిస్తున్నట్లు మెడికల్, హెల్త్‌ సర్వీసెస్‌ నియామక బోర్డు బోర్డు ప్రకటించింది. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బోర్డు సూచించింది. పరీక్ష రోజున మధ్యాహ్నం 1.30కు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 2.45 గంటలకు గేటు మూసేస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 7416908215 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని తెల్పింది.
బీఎస్సీ నర్సింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నర్సింగ్‌ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 7 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు 9,690 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటాకు సంబంధించి 8,084 సీట్లు అందుబాటులో ఉంచగా.. వాటిల్లో 6,664 సీట్లు తొలి విడతలో భర్తీ అయ్యాయి. ఇందులో మిగిలిన సీట్లతో పాటు ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. సబ్సిడీకి వంట నూనె, కంది పప్పు, పంచదార..

ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కందిపప్పు, పంచదారను సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించింది. పామాయిల్ కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు అందించనుంది.. ధరల స్థిరీకరణ కోసం 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.

ఏపీలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలపై ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్‌ అమ్మకాలను చేపట్టనుంది. ఈ మేరకు సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరల పరిస్థితిని మంత్రులు, అధికారులు సమీక్షించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించింది కమిటీ. టమాటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది.

పెరిగిన వంటనూనె ధరలు సామాన్యులకు భారంగా మారినట్టు మంత్రుల కమిటీ గుర్తించింది. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ 110 రూపాయలకు ప్రజలకు అందించనుంది.

రైతు బజార్‌తో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్ల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసరాల అమ్మకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార అర కేజీ 16 రూపాయలకు అందించనుంది.

ధరల స్థిరీకరణ కోసం 500 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గత నెలలో సబ్సిడీలో టమాటా, ఉల్లిపాయలు అమ్మడంతో ధరలు దిగివచ్చాయని అధికారులు చెబుతున్నారు.

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఈ నెలాఖరుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగియనుండడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనున్నట్లు నోటీఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అదే సమయంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌-1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై స్పెషల్‌ ఫోకస్‌ చేయబోతోంది ఏపీ మంత్రివర్గం. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణదారులపై కేసుల నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని.. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉండడం షాకిస్తోంది. ప్రస్తుత చట్టంతో భూఆక్రమణదారులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. దాని స్థానంలో కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే.. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982ను రద్దు చేసి.. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు-2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. దానిపై కేబినెట్‌ భేటీలో చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే.. లా అండ్‌ ఆర్డర్‌ను కూడా మరింత పటిష్టం చేసే ప్రతిపాదనలపైనా చర్చించనుంది ఏపీ కేబినెట్‌.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ

మరోవైపు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చ జరగనుంది. దానిలో భాగంగా.. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం-2019ని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయంచింది. దానికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77ను కూడా రద్దు చేసి.. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకాలకు ప్రాతిపదికగా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విజన్‌-2047, కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచే ప్రతిపాదనపై చర్చించనుంది. ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 7 కోట్లకు పెంచాలనే అంశంపై ఫోకస్‌ చేయనుంది. ఇక.. పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూ కేటాయింపులపై ఏపీ కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు పలువురు ఉన్నతాధికారులు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. పోలవరం పనులు ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. అయితే.. కేబినెట్‌ సమావేశానికి ముందు పోలవరంపై చర్చించిన సీఎం చంద్రబాబు.. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అన్నది ఆసక్తి రేపుతోంది. అటు.. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. స్థానిక ప్రజల్ని భయపెట్టి భూములు లాక్కున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్‌లో చర్చిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో సరస్వతి భూముల అంశం చర్చకు వస్తుందా?.. లేదా అన్నది కూడా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. మొత్తంగా.. పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌లో ఆమోద్ర ముద్ర పడబోతోంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ).. విజయవాడ, కర్నూలు జోన్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 606 ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో నవంబర్‌ 20, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఆయా ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం అప్రెంటిస్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో 295 అప్రెంటిస్ ఖాళీలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి.
కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

కృష్ణా జిల్లాలో ఖాళీలు: 41
ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీలు: 99
గుంటూరు జిల్లాలో ఖాళీలు: 45
బాపట్ల జిల్లాలో ఖాళీలు: 26
పల్నాడు జిల్లాలో ఖాళీలు: 45
ఏలూరు జిల్లాలో ఖాళీలు: 24
పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీలు: 31
కర్నూలు జిల్లాలో ఖాళీలు: 47
నంద్యాల జిల్లాలో ఖాళీలు: 45
అనంతపురం జిల్లాలో ఖాళీలు: 53
శ్రీసత్యసాయి జిల్లాలో ఖాళీలు: 37
కడప జిల్లాలో ఖాళీలు: 65
అన్నమయ్య జిల్లాలో ఖాళీలు: 48

ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 06, 2024 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 20, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, సీనియార్టీ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.118 చెల్లించాలి.

ధ్రువపత్రాల పరిశీలించే చిరునామాలు..

ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్‌, విద్యాధరపురం, విజయవాడ.
ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

క్యాట్ 2024 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) 2024 పరీక్ష మరో 20 రోజుల్లో జరగనుంది.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాగాజా విడుదలయ్యాయి. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్‌ 24న క్యాట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా ఐఐఎంలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఇతర కాలేజీల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.

క్యాట్ 2024 అడ్మిట్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ‘ఎడిట్ ఆప్షన్’.. రాత పరీక్ష ఎప్పుడంటే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకోడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను జారీ చేసింది. కానిస్టేబుల్‌ నియామక పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్‌ నవంబర్‌ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తుది గడువులోగా తమ దరఖాస్తులో మార్పుచేర్పులు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌, హిందీ భాషలతోపాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదా.. 60 ఏళ్లకు వచ్చే జబ్బులు 20ఏళ్లకే

మతిమరుపు అనేది వృద్ధాప్య సమస్యగా పరిగణించబడుతుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు కొంతమంది అల్జీమర్స్ వ్యాధికి గురవుతారు. ఈ వ్యాధి కారణంగా మెదడు పనితీరు తగ్గుతుంది.

అయితే ఇప్పుడు పెరుగుతున్న వయస్సుతో మతిమరపు అనేది ఆహారపు అలవాట్లతో కూడా ముడిపడి ఉంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ మాంసం, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వ్యక్తులు వయస్సు పెరిగే కొద్దీ మతిమరుపుకు గురవుతారు. ఈ కొత్త పరిశోధన ప్రకారం ఆహారం, మద్యపాన అలవాట్ల ప్రభావం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. అందుకే ఆహారం, మద్యపానం మనిషి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్శిటీ పరిశోధకులు 438 మందిపై జరిపిన పరిశోధనలో మనిషి ఆహారపు అలవాట్లకు జ్ఞాపకశక్తికి ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది. ఈ పరిశోధనలో.. పరిశోధన సమయంలో అంతకు ముందు అధికంగా మాంసం, ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న 108 మందికి అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. మిగిలిన 330 మంది తమ ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారు.

మాంసం తినడం వల్ల నరాల సమస్యలు

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నరాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు క్రమం తప్పకుండా మాంసం, సాసేజ్‌లు, హామ్, పిజ్జా, హాంబర్గర్‌లు, ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు మొదలైన వాటిని తినే వ్యక్తులు ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం చాలా తక్కువ. మాంసాహారం తినడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని ఈ పరిశోధన పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న నేటి యువతరం ఈ రకమైన ఆహారం తినడం వలన చాలా నష్టాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. నేడు యువతలో చాలా మంది ఇలాంటి ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు. దీని వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ వ్యాధులకు తోడు అల్జీమర్స్ పేరు కూడా చేరిపోయింది.

నిపుణులు ఏమి చెప్పారంటే

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే వ్యాధి అల్జీమర్స్ అని ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దల్జీత్ సింగ్ చెప్పారు. ఆహారపు అలవాట్లు, అల్జీమర్స్ గురించి భారతదేశంలో ఇంకా పరిశోధనలు జరగలేదు. అయితే తమ వద్దకు చికిత్స కోసం అల్జీమర్స్ పేషెంట్లలో ఎక్కువ మంది వృద్ధులే. ఈ వ్యాధి నరాల అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది. ప్రస్తుతం మాంసం తినడానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నామని చెప్పారు. అయితే ఆస్ట్రేలియా పరిశోధనలో వెల్లడైన విషయాలపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ వ్యాధిని ఎలా నివారించాలంటే

ఆహారపు అలవాట్లను మార్చుకోండి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు మొదలైన వాటిని తినండి. బయటి ఆహారానికి బదులుగా ఇంటి ఆహారాన్ని తినండి.
రోజూ అరగంట వ్యాయామం చేయండి లేదా నడవండి.
బరువును అదుపులో ఉంచుకోవాలి.
రోజూ 7-8 గంటల పాటు తగినంత నిద్ర తీసుకోండి.
రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి.
ఒత్తిడి తగ్గించుకునే విధంగా ప్రయత్నించండి.

అఖిల్ , పూరిజగన్నాథ్ కాంబోలో సినిమా

చాలా కాలంగా అక్కినేని కుర్ర హీరో అఖిల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా లు చేసినా కూడా అఖిల్ కు హిట్ మాత్రం దక్కడం లేదు. అఖిల్ అనే తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

యాక్షన్ డైరెక్టర్ వీవీ వినాయక్ అఖిల్ ను హీరోగా పరిచయం చేశాడు. కానీ ఆ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆతర్వాత వరుసగా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ లు చేశాడు. కాగా వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అఖిల్ బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పటివరకు కొత్త ను అనౌన్స్ చేయలేదు అఖిల్. అయితే అఖిల్ ఎవరితో చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఎట్టకేలకు అఖిల్ ఇప్పుడు చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. అఖిల్ ఓ స్టార్ డైరెక్టర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆ దర్శకుడు ఎవరో కాదు.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఈ స్టార్ డైరెక్టర్ కూడా హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరి. ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ భారీ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆతర్వాత రామ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ చేశాడు. ఈ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు హిట్ కొట్టి మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు పూరిజగన్నాథ్. ఇక ఇప్పుడు అఖిల్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ కోసం పూరి ఇప్పటికే అదిరిపోయే స్టోరీని రెడీ చేశారని తెలుస్తోంది. ఈ తో అటు పూరి.. ఇటు అఖిల్ ఇద్దరూ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అయ్యా.. అయ్యా ఒక్క హిట్ కొట్టండయ్యా..! అంటూ కామెంట్స్ చూస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది..

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం చాలా సులభం.. పెన్షనర్లు ఈ పద్దతులు పాటిస్తే చాలంతే

80 ఏళ్ల లోపు వారందరూ ఆ సమయంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి. బ్యాంకులు, పోస్టాఫీసులు, మరికొన్ని చోట్ల వీటిని అందిాంచాలి. నవంబర్ లో అందజేయకపోతే డిసెంబర్ నుంచి పెన్షన్ రావడం ఆగిపోతుంది.

ఈ క్రింద తెలిపిన పద్ధతులు పాటిస్తే చాలా సులువుగా పని జరుగుతుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి నాలుగు రకాల పద్దతులను అనుసరించవచ్చు. జీవన్ ప్రమాణ్ పోర్టల్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్ బీ) ఏజెంట్, పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలు, బ్యాంకులలో అందజేసే అవకాశం ఉంది. వీటిలో తమకు వీలైన విధానంలో పెన్షనర్లు సర్టిఫికెట్లను అందజేయవచ్చు.

ఆన్ లైన్ లో సమర్పించే విధానం

జీవన్ ప్రమాణ్, ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ ద్వారా ముఖం, వేలిముద్ర, ఐరిష్ గుర్తింపుతో సహా బయోమెట్రిక్ సాంకేతికతతో పెన్షనర్లు తమ గుర్తింపును సమర్పించవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధాఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
పెన్షనర్ గురించి దానిలో అడిగిన సమాచారం పూర్తి చేయాలి.
ఫోటో తీసిన తర్వాత, సమాచారాన్ని సబ్మిట్ చేయాలి, మీ ఫోన్ నంబర్ కు జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేయడానికి లింక్ తో ఎస్ఎంఎస్ వస్తుంది.

ఆఫ్ లైన్ విధానంలో..

ఆఫ్ లైన్ విధానంలో అందజేయాలనుకునే వారు నేరుగా పోస్టాఫీసులు, బ్యాంకులు, ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. అక్కడ ఉన్న సిబ్బందికి తమ వివరాలు అందజేయాలి.

చివరి తేదీ

పెన్షన్ దారులలో 80 ఏళ్ల లోపు వారందరూ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడానికి నవంబర్ 30వ తేదీ వరకూ గడువు ఉంది. అంతకంటే ఎక్కువ వయసున్న వారు అక్టోబర్ 1 నుంచే అందజేసే అవకాశం ఉంది. వారికి కూడా నవంబర్ 30వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అంటే 80 ఏళ్లు దాటిన వారికి రెండు నెలలు, ఆలోపు వారికి ఒక నెల గడువు ఉంటుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం కల్పించింది. కాాగా. గడువు లోపు సర్టిఫికెట్ అందజేయకపోతే డిసెంబర్ నుంచి పింఛన్ ఆగిపోతుంది.

ఈ ఆకు మధుమేహానికి మందు.. రెగ్యూలర్‌గా తీసుకుంటే ఈ సమస్యలన్నీ దూరం

మెంతులు ఆరోగ్యానికి ఎంత మంచివో మెంతి కూర కూడా అంతే ప్రయోజనకరమైంది. మెంతికూరలో ఉండే ఫైబర్ కారణంగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ముఖ్యంగా ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి. దీని వల్ల ఇమ్యూనిటీ పెరిగి హెల్దీగా ఉంటాం. మెంతికూర తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇందులో బాడీకి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ అందుతుంది. మెంతిఆకులలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ముఖ్యంగా మెంతిఆకుల ఆహారం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

మెంతి కూరలోని పోషకాలు శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపించడంలో దోహదం చేస్తాయి. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మెంతికూరలోని పోషకాలు చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో మెంతికూర అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యల్లో కూడా మెంతికూర ఉపశమనం కల్గిస్తుంది.

మెంతికూరలో ఉండే ఫైబర్ కారణంగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. క్రమంగా బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారికి మెంతి కూర దివ్యౌషధంగా భావిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మంచిది.

ఆ గ్రామంలో మగబిడ్డ పుడితే దేశానికే అంకితం.. అగ్నిపథ్ వచ్చిన తగ్గేదెలే

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని మాధవరంలో గ్రామంలో ఆర్మీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అగ్నిపథ్ పథకం వచ్చిన భయాందోళనకు గురికాకుండా సైన్యం రిక్రూట్‌మెంట్ కోసం గ్రామ యువకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్మీలో ఎలాగైనా చేరాడని దాదాపు మూడు సంవత్సరాలుగా కసరత్తు చేస్తున్నారు. మాధవరం గ్రామంలోకి ముందు ఎంటర్ అవ్వగానే మొదట భారీ హనుమంతుని విగ్రహం దర్శనమిస్తుంది. మిలటరీ మాధవరంగా ఆ గ్రామం పాపులర్ అయింది. ప్రస్తుతం ఆర్మీలో పని చేస్తున్న లేదా రిటైర్డ్ అయిన గ్రామంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఆర్మీ సిబ్బంది అయినా ఉంటారు.

మాధవరంలో బిగువైన శరీరాలు, విశాలమైన ఛాతీ, దట్టమైన మీసాలతో ఉన్న పురుషులు కనబడుతూ ఉంటారు. సుమారు 6,500 జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం దాదాపు 320 మంది సైన్యంలో పనిచేస్తున్నారు. దాదాపు 1800 మంది పురుషులు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసి మాధవరంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సహా అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగగా, మాధవరం నుండి ఒక్క వ్యక్తి కూడా హింసలో పాల్గొనలేదు. సైన్యంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ, చాలా మంది యువకులు సైన్యంలో చేరాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ, ఎవరూ ఎలా నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కొత్త పథకంపై సందిగ్ధత, భయాందోళనలు ఉన్నప్పటికీ సైన్యంలో సేవ చేయాలనే స్ఫూర్తిని ఈ గ్రామ యువకుల్లో తగ్గించలేదని చెప్పవచ్చు.

కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమాను పొందవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ చాలా మందికి తెలియదు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది. రైలు ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ పథకం భారతీయ పౌరులకు మాత్రమే, ఇ-టికెట్ల ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులు మాత్రమే పొందుతారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ బీమా IRCTC ద్వారా ఇ-టికెట్లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే. అయితే విదేశీ పౌరులు, ఏజెంట్లు లేదా ఇతర ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని పొందలేరు. సీటు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ బీమాలో చేర్చలేదు. కానీ 5-11 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ బుక్ చేసినట్లయితే ఈ బీమా అందుబాటులో ఉంటుంది.

సమ్ అష్యూర్డ్, బెనిఫిట్స్ – ఇన్సూరెన్స్ పాలసీ కింద బీమా డబ్బు నాలుగు వర్గాలుగా విభజించారు.
మృతదేహం తరలింపు: రైలు ప్రమాదం లేదా ఇతర సంఘటనల తర్వాత మృతదేహాన్ని తరలించడానికి రూ.10,000 వరకు బీమా ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
గాయం కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులు: ఈ ప్లాన్‌లో రైలు ప్రమాదంలో గాయాలు అయినప్పుడు ఆసుపత్రిలో చేరే ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం ఉంటుంది.
పాక్షిక వైకల్యం: బీమా ప్రయోజనంలో 75% అందిస్తారు. ఇది రూ.7,50,000 వరకు ఉండవచ్చు.
శాశ్వత మొత్తం వైకల్యం: ప్రమాదం జరిగినప్పుడు శాశ్వతంగా వైకల్యం చెందినట్లయితే 100% బీమా మొత్తం అందుతుంది. ఇది రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
మరణం: ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమా మొత్తంలో 100% లభిస్తుంది. అంటే రూ.10 లక్షల వరకు లభిస్తుంది.

బీమా పొందడం ఎలా?

రైల్వే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు SMS, ఇమెయిల్ ద్వారా ప్రయాణికుడికి బీమా సమాచారం అందుతుంది. ప్రయాణికులు వారి టిక్కెట్ బుకింగ్‌లో పాలసీ నంబర్, ఇతర సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ వివరాలను పూరించాల్సి ఉంటుంది. నామినేషన్ సమాచారం నింపకపోతే క్లెయిమ్ విషయంలో చట్టపరమైన వారసులకు చెల్లింపు ఉంటుంది. ఈ బీమా పాలసీ ధృవీకరించిన, RAC (Reservation Against Cancellation) టిక్కెట్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదాలు లేదా అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించేందుకు ఈ పాలసీని రూపొందించారు.

కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

గత పదిహేళ్లుగా ఇండియా డిజిటల్ కరెన్సీ వైపు వేగంగా వెళుతుంది. ఇదిఇది ఒక్కందుకు మంచిదే అని చెప్పాలి. దీన్ని ద్వారా ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గిపోతుంది.

కరెన్సీతో దేనినైనా కొనొచ్చు. కానీ ఆ కరెన్సీ ప్రింట్ చేయాలంటే కూడా కొంత ఖర్చు అవుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. క్వాలిటీ పేపర్ వాడాలి. అన్నింటితో పాటు ఫేక్ కరెన్సీకి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిజిటల్ కరెన్సీతో వాటన్నిటికీ చెక్ పెట్టడంతో పాటు కరెన్సీ ముద్రణ ఖర్చును కూడా భారీ ఎత్తున మిగుల్చుకోవచ్చు. అసలు మన కరెన్సీ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

రూ.500 నోటును ప్రింట్ చేయడానికి రూ.2.29 పైసలు ఖర్చు అవుతుంది. రూ.200 రూపాయల నోట్ ప్రింట్ చేయడానికి రూ. 2.37 ఖర్చవుతుంది. రూ.50 నోటుకు ఇంచుమించు ఇంతే.. ఇక 20 రూపాయలు, పది రూపాయలు అయితే ఒక్కో నోటుకు రూ.98 పైసలు చొప్పున ప్రింట్‌కు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇక కాయిన్స్ కోసం చేసే వ్యయం రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం దాదాపుగా కాయిన్స్ తయారు చేయడం నిలిపివేసినట్లు తెలుస్తుంది.

కొత్త నోట్ల తయారీ కాకుండా, పాడైన, చిరిగిపోయిన, ప్రమాదాల్లో కాలిపోయిన నోట్లను మళ్లీ ముద్రించడానికి ఇంకా అదనపు ఖర్చు అవుతుంది. ఇలా అత్యధిక జనాభా ఉన్న భారత దేశంలో కరెన్సీ ముద్రణ వ్యయం కొన్ని వేల కోట్లు అవుతుంది. ఇందుకోసమే డిజిటల్ వైపే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆరంభంలో డిజిటల్ కొంత ఇబ్బందైనా.. తర్వాత ప్రజలు డిజిటల్‌కి అలవాటైపోయారు.

ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలి. చాలా మంది ఇదే ఆలోచనతో ఉంటారు. అయితే ఎలాంటి బిజినెస్‌ను ప్రారంభించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు.

ఏ బిజినెస్‌తో లాభాలు వస్తాయో తెలియక వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బనానా పౌడర్‌ బిజినెస్‌ ప్రస్తుతం ఉన్న ట్రెండీ బిజినెస్‌లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అరటి పండు పొడి వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అరటి పండ్లతో పాటు బనానా డ్రయర్‌ మిషిన్స్‌, మిక్సర్‌ మిషన్‌ కావాల్సి ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ మిషిన్స్‌ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. మీకు అరటి తోట ఉంటే మరీ మంచిది. లేదంటే.. మార్కెట్లో హోల్‌ సేల్‌గా వాటిని కొనుగోలు చేయొచ్చు.

ఇందుకోసం ముందుగా అరటి పండ్లను సేకరించి సోడియం హైపో క్లోరైడ్‌తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తొక్కలను ఒలిచి అరటి గుజ్జును సిట్రిక్‌ యాసిడ్‌లో కాసేపు ఉంచి తర్వాత అరటి గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటిని ఒక రోజు పాటు 66 డిగ్రీల సెల్సియస్ గాలి వద్ద ఆరబెట్టాలి. ఇది డ్రయర్ మిషిన్ పని. ముక్కలు బాగా ఆరిన తర్వాత తీసి గ్రైండ్ చేయాలి అంతే.. బనానా పౌడర్ రడీ అయినట్లే.

అనంతరం పొడిని కవర్‌ లేదా సీసాల్లో నింపి విక్రయించాలి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అరటి పొడి ధర రూ. 800 నుంచి రూ. 1000 మధ్య ఉంది. పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లలో, ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. ఇక అరటి పొడిని ఏం చేసుకుంటారని ఆలోచిస్తున్నారు. అరటి పౌడర్‌ను పాలలో కలుపుకొని తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు బనానా పౌడర్‌తో చెక్‌ పెట్టొచ్చు. కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ చేసుకుంటే లాభాలు భారీగా పొందొచ్చు.

ఆకర్షణీయమైన డిజైన్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరు- ఫ్లయింగ్ ఫ్లీ FF-C6.. మిలన్‌లో EICMA మోటార్‌సైకిల్ షోలో దీన్ని లాంచ్ చేశారు.

భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ‘ ఫ్లయింగ్ ఫ్లీ ‘ బ్రాండ్ కింద రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ ఎలక్ట్రిక్ బైక్ C6 ఆధారంగా రూపొందించబడింది. కానీ వాహన తయారీదారులు ఈ బైక్‌లో అనేక కొత్త భాగాలను చేర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో కూడా స్టైల్‌ విషయంలో రాజీపడలేదు. ఫ్లయింగ్ ఫ్లీ FF-C6 డిజైన్‌ను ఆకర్షణీయంగా చేసింది. ఈ రెట్రో డిజైన్‌తో బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రియర్ వ్యూ మిర్రర్‌లను అమర్చారు. దీనితో పాటు, TFT డ్యాష్‌బోర్డ్ కూడా రౌండ్ ఆకారంతో వస్తుంది. ఇందులో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్తో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 సీటు ఎత్తు తక్కువగా ఉంటుంది. రైడర్ సౌకర్యవంతంగా ప్రణయాన్ని ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. మునుముందు రెండు సీట్ల వెర్షన్లు కూడా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో మడ్‌గార్డ్‌ను టైర్ కంటే కొంచెం ఎత్తులో ఉంచారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ ఆకారం మునుపటి బైక్ లాగా ఉంది. ఇది టీఎస్టి డిస్ప్లేతో రానుంది.

ఈ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా కొత్త బ్రాండింగ్‌తో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు భారతీయ బైక్ బ్రాండ్ ధృవీకరించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 మోడల్ రివీల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. పూర్తి ఫీచర్ల వివరాలు, ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. Flying Flea C6 బ్యాటరీ ప్యాక్, రేంజ్ మరియు ఛార్జింగ్ సమయానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా షేర్ చేయలేదు. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్‌తో పాటు స్క్రాంబ్లర్ తరహా ఎఫ్‌ఎఫ్ ఎస్6ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను 2026 ప్రారంభంలోనే విడుదల చేయవచ్చు.

మందు బాబులకు అలర్ట్.. ఆల్కహాల్ కిడ్నీలను ఎలా గుల్ల చేస్తుందో తెలుసా

మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఈ అలవాటు అన్ని రకాలుగా గుల్ల చేస్తుంది. మద్యం తాగేవారిని.. అతని మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.

ఆల్కాహాల్ మన శరీరానికి అత్యంత హాని కలిగిస్తుందంటే.. గుండె, కాలేయం, మెదడుతో సహా అనేక అవయవాలు దీని బారిన పడతాయి.. అంతేకాకుండా మద్యం వల్ల మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మూత్రపిండాలు మనకు చాలా ముఖ్యమైన అవయవం.. దాని పని శరీరం నుండి విష పదార్థాలను ఫిల్టర్ చేయడం.. తద్వారా వ్యాధులు సంభవించవు.

ఆల్కహాల్ తీసుకోవడం శరీరంలోని అన్ని భాగాలకు హానికరం.. అయినప్పటికీ, ఇది కిడ్నీలను కూడా చెడుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల కిడ్నీలు సక్రమంగా పని చేయలేక, ఆ తర్వాత కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా తాగడం వల్ల మన కిడ్నీలు ఎలా పాడవుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

మద్యం వల్ల కిడ్నీ ఎలా దెబ్బతింటుందో తెలుసా..

కిడ్నీ పనితీరుపై ప్రభావం: ఆల్కహాల్ తాగడం వల్ల కిడ్నీలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది.. అటువంటి పరిస్థితిలో, మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. ఒక్కసారి మీ కిడ్నీలు చెడిపోతే, మీరు అనేక వ్యాధుల బారిన పడవచ్చు.

కిడ్నీలో వాపు: మద్యపాన అలవాట్లను నియంత్రించుకోని వారి కిడ్నీలో వాపు పెరుగుతుంది. దీని తరువాత, మూత్రపిండాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది కొన్నిసార్లు భరించలేనిదిగా మారుతుంది.

కిడ్నీలు చెడిపోయే ప్రమాదం: ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా మీరు మద్యం సేవించడం మానేయకపోతే, దీర్ఘకాలికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు చెడిపోయిన వారు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది.

మూత్రపిండాలను ఎలా కాపాడుకోవాలంటే..

కిడ్నీలు మనకు చాలా విలువైనవి.. అవి లేకుండా జీవితం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ అవయవాన్ని కాపాడుకోవడం మన స్వంత బాధ్యత. అన్నింటిలో మొదటిది మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

కిడ్నీల పనితీరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజంతా 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి.

ఇది కాకుండా, మీరు నిమ్మ నీరు – కొబ్బరి నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాల ద్వారా మూత్రపిండాలను శుభ్రం చేయవచ్చు.

అంతేకాకుండా.. మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం లాంటివి చేయాలి..

ఏమైనా కిడ్నీలకు సంబంధించిన సమస్యలుంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ప్యాసింజర్ రైళ్ల నుంచి లగ్జరీ రైళ్ల వరకు, దేశ రైల్వే వ్యవస్థలో ఉన్న అనేక రైళ్లు ప్రయాణీకులను ప్రతీ రోజూ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న రైలులో మీరు ప్రయాణించాలంటే..

ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు ఇది. ఇందులో ప్రయాణీకులను రాజుల్లా చూసుకుంటారు. మరి టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. గురించి ఎప్పుడైనా విన్నారా. అందులో ప్రయాణించే ప్రయాణికులను రాజుల్లా చూసుకుంటారు. ఇది ఏ రైలు మరియు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోండి.

అదే మహారాజా ఎక్స్‌ప్రెస్.. 2010లో ప్రారంభించిన ఈ రైలు భారతదేశంలో అత్యంత ఖరీదైనది మాత్రమే కాదు.. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలుగా కూడా పేరొందింది. ఈ లగ్జరీ రైలు ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులోని ప్రయాణికులకు ఫైవ్ స్టార్ సర్వీస్ లభిస్తుంది. ఈ రైలులో ప్రయాణించాలంటే మీ జేబులోంచి వేలు కాదు లక్ష కాదు.. ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో ప్రయాణీకులు తాజ్ మహల్, ఖజురహో టెంపుల్, రణథంబోర్ లాంటి పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.

ఫతేపూర్ సిక్రి, వారణాసి లాంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ఖరీదైన రైలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రతి కోచ్‌లో బాత్‌రూమ్‌లు, రెండు మాస్టర్ బెడ్‌రూమ్‌లు ఉంటాయి. అలాగే ప్రయాణికుల కోసం ప్రతి కోచ్‌లో మినీ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా, లైవ్ టీవీ, ఎయిర్ కండీషనర్, ప్రకృతిని ఆస్వాదించేందుకు బిగ్ విండోలు ఉన్నాయి. మీరు మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

టెక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి సామ్‌సంగ్ ఏ56 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

1080 x 2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఫోన్‌లో ఏకంగా 280 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారి తెలుస్తోంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 62 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ప్రైమరీ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను చిత్రీకరించవచ్చు.

అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ అనుభవాన్ని ఇచ్చేలా ఈ కెమెరాను డిజైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ లైటింగ్ ఉన్న కండిషన్స్‌లో కూడా క్లారిటీ ఫొటోలను ఈ కెమెరా అందించనుందని తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్‌లో బ్యాటరీకి కూడా పెద్ద పీట వేయనున్నారని తెలుస్తోంది. సామ్‌సంగ్ ఏ56లో ఏకంగా 7600 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారి తెలుస్తోంది. లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందని చెబుతున్నారు.

సామ్‌సంగ్ ఏ56 స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మీ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రకరకాల మొబైల్స్ ఉన్నాయి. మడతపెట్టే ఫోన్ల నుంచి కీప్యాడ్ మొబైల్స్ వరకు అన్నీ కొంటారు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరలకు సులువుగా లభిస్తున్నందున అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

చాలా మంది మొబైల్ డిస్‌ప్లేలు దెబ్బతినడం చూసే ఉంటారు. అలాగే స్క్రీన్ కవర్‌ని వాటిపై గీతలు పడటం లాంటివి చూసే ఉంటారు. ఇలా మీ ఫోన్‌లోని స్క్రాచ్‌ను సులభంగా తొలగించవచ్చు. అది ఎలాగో చూద్దాం.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా గీతలు తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గిన్నెలో నీరు, బేకింగ్ సోడా కలపండి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ని ఉపయోగించి స్క్రాచ్‌ను తొలగించండి. అలాగే మార్కెట్లో అనేక కార్ స్క్రాచ్ రిమూవల్ క్రీమ్‌లు ఉన్నాయి. వాటిలో దేనినైనా ఉపయోగించి మీ ఫోన్ డిస్‌ప్లే స్క్రాచ్‌ని తీసివేయవచ్చు.

ఎగ్ వైట్: మీరు ఫోన్ స్క్రాచ్‌లను తొలగించడానికి గుడ్డులోని తెల్లసొన, పొటాషియం సల్ఫేట్‌ను ఉపయోగించవచ్చు. రెండింటినీ కలపండి. ఈ మిశ్రమంతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను తుడవండి. బేబీ పౌడర్‌తో డిస్‌ప్లే స్క్రాచ్‌లను కూడా తొలగించవచ్చని మీకు తెలుసా? ఒక గిన్నెలో నీరు, బేబీ పౌడర్ కలపండి. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ క్లాత్‌ని ఉపయోగించి గీతలు పడిన ప్రదేశంలో అప్లై చేయండి. ఇలా చేసినా స్క్రీన్‌పై పడిన గీతలు తొలగిపోతాయి.

కొంచెం తడిగా ఉన్న గుడ్డ లేదా పత్తితో శుభ్రం చేయడం సులభమయిన పద్ధతి. మెత్తటి గుడ్డతోగానీ, కాటన్‌తో గానీ కోసం తడిగా ఉంచి గీతలు ఉన్న స్క్రీన్‌పై మెల్లగా రప్‌ చేయడం ద్వారా కూడా మీ ఫోన్‌ స్క్రీన్‌పై పడిన గీతలు తొలగిపోతాయి.

పెట్రోలియం జెల్లీ సహాయం తీసుకోండి: చాలా గృహాలలో (వాసెలిన్ పెట్రోలియం జెల్లీ) ఉంటుంది. దాని సహాయంతో మీరు మీ ఫోన్ స్క్రీన్‌ను ఫ్లాష్ చేయవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై వాసెలిన్‌ను రాసుకుని శుభ్రమైన గుడ్డతో తుడవడం వల్ల స్క్రీన్ మెరుస్తూ గీతలు పోతాయి

టూత్‌పేస్ట్ కూడా మంచి ఎంపిక: ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి దంతాల శుభ్రం కోసం ఉపయోగించే టూత్‌పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. మీరు టూత్‌పేస్ట్‌ను కాటన్‌పై అప్లై చేసి డిస్‌ప్లేపై రుద్దాలి. ఈ ట్రిక్ స్క్రీన్‌పై అన్ని రకాల గీతలు కనిపించకుండా చేస్తుంది. దీని కోసం మీరు తెల్లటి టూత్‌పేస్ట్‌ను మాత్రమే అప్లై చేయాలి.

397తో 150 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన చౌక రీఛార్జ్ ప్లాన్‌లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు టెన్షన్‌ పుట్టిస్తోంది. కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

త్వరలో 5G సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అటువంటి అనేక చౌక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులకు ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు 28 రోజుల ప్లాన్‌ను అందిస్తే, కంపెనీ 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

150 రోజుల రీఛార్జ్ ప్లాన్:

BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ రూ. 397కి వస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 150 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత SMS వంటి అనేక ప్రయోజనాలు వినియోగదారులకు అందిస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబర్‌ను సెకండరీ సిమ్‌గా ఉంచే వినియోగదారుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు మొదటి 30 రోజులలో దేశవ్యాప్తంగా ఏదైనా మొబైల్ నెట్‌వర్క్‌కి అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. 30 రోజుల తర్వాత వినియోగదారులు 40kbps వేగంతో ఇంటర్నెట్ ప్రయోజనాన్ని పొందడం కొనసాగిస్తారు. అదే సమయంలో వినియోగదారులు ప్రతిరోజూ 100 ఉచిత SMS ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్రయోజనం మొదటి 30 రోజులకు కూడా అందుబాటులో ఉంటుంది.

BSNL 4G సేవ త్వరలో ప్రారంభం

BSNL ఇటీవల తన కొత్త లోగోను విడుదల చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 24 ఏళ్ల తర్వాత తన లోగోను మార్చింది. ఇది కాకుండా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 7 కొత్త సేవలను కూడా ప్రారంభించింది. BSNL త్వరలో దేశవ్యాప్తంగా వాణిజ్యపరంగా 4G సేవను ప్రారంభించబోతోంది. ఇది కాకుండా, కంపెనీ వచ్చే ఏడాది జూన్‌లో 5G సేవను కూడా ప్రవేశపెట్టవచ్చు. BSNL తన మొబైల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి 1 లక్ష కొత్త మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించింది. వాటిలో 35 వేలకు పైగా టవర్లు ఏర్పాటు అయ్యాయి.

ఇంగువ తీసుకుంటే గుండె సమస్యలు రానే రావు..

ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇంగువ దాదాపు అందరికీ తెలుసు. అనేక రకాల వంటల్లో ఇంగువను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సాంబార్‌, పప్పు తాళింపులో ఇంగువ వేస్తే ఆహా..

ఆ రుచి, సువాసనే వేరు. వంటలకు కూడా రుచి వస్తుంది. ఇంగువను కేవలం వంటల రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఇంగువతో వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. పెద్దలు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. పురాతన కాలం నుంచి కూడా వంటల్లో ఇంగువను ఉపయోగించే వారు. ఇంగువను రెగ్యులర్‌గా వంటల్లో ఉపయోగించడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడొచ్చు. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. రోజూ ఇంగువను తీసుకుంటే ఏం జరుగుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్వాసకోశ సమస్యలు మాయం:

ఇంగువ తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. కఫం, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వంటి సమస్యలు ఉన్నవారు ఇంగువను తీసుకుంటే కంట్రోల్ అవుతాయి. కఫాన్ని తొలగించాలంటే గోరు వెచ్చని నీటిలో ఇంగువ కలఅిపి తీసుకోవాలి. దీని వల్ల కఫం బయటకు పోతుంది. మంచి ఉశమనం లభిస్తుంది.

నెలసరి సమస్యలు:

ఇంగువను రెగ్యులర్‌గా తీసుకుంటే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంుగవలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిరి, నొప్పిని తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.

గుండె సమస్యలు మాయం:

రెగ్యులర్‌గా ఇంగువ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంగువ.. రక్త సరఫరా సరిగా జరిగేలా చేస్తుంది. రక్తం గడ్డలు కట్టకుండా ఆపుతుంది. అలాగే బీపీని అదుపులో ఉంచుతుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు రాకుండా ఆపుతుంది. కాబట్టి ఇంగువను తీసుకుంటే గుండె సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

జీర్ణ సమస్యలు చెక్:

ఇంగువ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మలబద్ధకం, గ్యాస్, కడుపులో అజీర్తి, కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇంగువ తీసుకుంటే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మతిమరుపుకు అల్లంతో చికిత్స.. ఎలా తీసుకోవాలంటే

అల్లం సహజ ఔషధం. అందుకే అనేక రోగాల నివారణకు ఆయుర్వేద ఔషధంగా దీనిని వినియోగిస్తుంటారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పచ్చిగా నమలవచ్చు లేదంటే దీని రసాన్ని కూడా సేవించవచ్చు.

అల్లం టీ కూడా తయారు చేసి తాగవచ్చు. అల్లంలోని జింజెరాల్ అనే సమ్మేళనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

అల్లంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది. అల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు సహజంగా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెరిసేలా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును తగ్గించడంలో సహకరిస్తాయి.

అల్లం జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లం తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ రోగులకు అమృతంలా పనిచేస్తాయి. అల్లం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను నివారిస్తాయి.

Health

సినిమా