Friday, November 15, 2024

కొండ నాలుక వచ్చిందా.. ఈ టిప్స్‌తో చిటికెలో పోగొట్టవచ్చు..

ఒక్కోసారి గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఏం తిన్నా త్వరగా దిగదు. మంచి నీళ్లు తాగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు దగ్గర ఏదో అడ్డబడినట్టు ఉంటుంది.

అదే కొండ నాలుక.. దీని గురించి వినే వింటారు. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. శరీరంలో ఇది కూడా ఒక భాగం. మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లేలా కొండ నాలుకు చేస్తుంది. అదే విధంగా స్వర పేటిక సరిగా మాట్లాడేలా కూడా కొండ నాలకు హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఒక్కోసారి విపరీతంగా దగ్గు వస్తుంది. ఎన్ని మందులు వేసినా దగ్గదు. ఇందుకు కారణం కొండ నాలుక. కొండ నాలుక పొడి బారడం కారణంగా ఈ దగ్గు వస్తుంది. ఈ కొండ నాలుక ఎండిపోకుండా చూసుకోవాలి. అందుకే నీటిని తాగుతూ ఉండమని చెబుతూ ఉంటారు.

ఈ కొండ నాలుక కూడా వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటుంది. గొంతు నొప్పి, విపరీతంగా దగ్గు రావడం, గొంతు ఎర్రగా మారడం, కొండ నాలుక వాపుగా అవడం జరుగుతూ ఉంటాయి. మరికొందరిలో కొండ నాలుక పొడుగ్గా మారుతుంది. గుటక వేయడం కూడా కష్టంగా మారుతుంది. ఇది కొండ నాలుక సమస్యగా గుర్తించి.. వైద్యుల్ని సంప్రదించాలి. పలు చిట్కాల ద్వారా కూడా కొండ నాలుక సమస్యలను తగ్గించుకోవచ్చు.

అల్లం రసం:

కొండ నాలుక వాపు, ఇన్ఫెక్షన్‌కి గురైనా, పొడవుగా పెరిగినా ఈ సమస్యలను తగ్గించడంలో అల్లం రసం చక్కగా పని చేస్తుంది. అల్లం రసంతో కొద్దిగా తేనె కలిపి.. తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల త్వరగా కొండ నాలుక సమస్య నుంచి బయట పడొచ్చు. అల్లం, తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తులసి రసం:

తులసి ఆకుల రసం తాగినా కూడా కొండ నాలుక సమస్యల నుంచి బయట పడొచ్చు. తులసి ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కూడా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది కూడా కొండ నాలుకకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

పసుపు నీరు:

గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి తీసుకున్నా.. గొంత నొప్పి, కొండ నాలుక సమస్యలను తగ్గిస్తుంది. పసుపు నీటిని రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా కొండ నాలుక వాపు, ఇన్ఫెక్షన్ నుంచి బయట పడొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

రేపే మెగా డీఎస్సీ విడుదల.. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షలకు సరికొత్త ప్లాన్‌తో వస్తున్న విద్యాశాఖ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెట్ ఫలితాలను సోమవారం విడుదల చేసిన విద్యాశాఖ ఇక మెగా డీఎస్సీ ప్రకటనకు సన్నద్ధమవుతుంది.

బుధవారం (నవంబర్‌ 6వ తేదీన) మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. మొత్తం నెల రోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

దాదాపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 వరకు పోస్టులు ఉండనున్నాయి. రేపు వెలువడనున్న నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల సంఖ్య కూడా మారే ఛాన్స్ లేకపోలేదు. కర్నూలు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.

అయితే టెట్ పరీక్షల మాదిరిగానే డీఎస్సీ పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక విడతల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు పోటీ పడేవారు అధికంగా ఉండటంతో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్‌ చేసి విడుదల చేయాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని కోణంలో విద్యా శాఖ యోచిస్తోంది. ఇది ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సరికొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే..!

కేంద్ర ప్రభుత్వంలో సిబ్బంది కొరత.. ప్రతి 4 పోస్టులకు ఒకటి ఖాళీ

కేంద్ర ప్రభుత్వం సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఇందుక్కారణం పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడమే. ప్రతి 4 పోస్టులకు 1 ఖాళీగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వేతనాలు, భత్యాలు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2023 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 24% పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మంజూరైన పోస్టుల సంఖ్య కూడా క్రమేణా తగ్గిపోతుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 40 లక్షల సాధారణ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఇవి కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ పరిధిలో ఉన్న సాయుధ బలగాల పోస్టులతో సంబంధం లేనివి. వీటిలో 9.7 లక్షల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. అంటే మొత్తం పోస్టులు 40 లక్షలతో పోల్చితే దాదాపుగా నాలుగో వంతు.

ఈ ఖాళీల్లో అత్యధికంగా గ్రూప్-C (నాన్ గెజిటెడ్) కేటగిరీలో 33 శాతానికి పైగా ఖాళీలు ఉండగా, గ్రూప్-B (గెజిటెడ్)లో 16% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడడానికి కారణాలను నివేదికలో ప్రస్తావించినప్పటికీ.. నియామక ప్రక్రియలో జాప్యమే ఖాళీల సంఖ్య పెరగడానికి ముఖ్య కారణమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పదవీ విరమణల కారణంగా ఏర్పడుతున్న ఖాళీలను ఆ మేరకు భర్తీ చేయకుండా, ఆ పని చేసేందుకు వివిధ ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ ఇవ్వడం కూడా ఒక కారణమని ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కొందరిని తీసుకుంటున్నాయి. ఈ విధానం ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాయి. మరోవైపు రోజువారీ ప్రభుత్వ కార్యాకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ పేరుతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అలా నియమించినవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించారు. ఇలా ఇప్పటి వరకు 13 రోజ్‌గార్ మేళాలను నిర్వహించగా.. చివరి మేళాలో 51,000 మందికి నియామక పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది.

కీలక విభాగాలు

కేంద్ర ప్రభుత్వంలో సాయుధ బలగాలను మినహాయించి సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక సంఖ్యలో సిబ్బందిని కలిగిన శాఖలు 5 ఉన్నాయి. వాటిలో మొదటి స్థానం రైల్వేదే. ఆ తర్వాత రక్షణ శాఖ (సివిల్), హోంశాఖ, పోస్టల్, రెవెన్యూ విభాగాలున్నాయి. ఈ 5 విభాగాలు కలిపి మొత్తం సిబ్బంది సంఖ్యాబలంలో 92% ఉన్నాయంటే ఇవి ఎంత పెద్ద విభాగాలో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి 10 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు 4 ఉద్యోగాలు రైల్వే రైల్వే ఒక్కటే అందిస్తుంది. గణాంకాల ప్రకారం రైల్వే శాఖలో మొత్తం 14.89 లక్షలకు పైగా పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఉన్న సిబ్బంది 11.73 లక్షలు మాత్రమే. అంటే ఒక్క రైల్వే శాఖలోనే 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు హోం మంత్రిత్వ శాఖలో 11.12 లక్షల పోస్టులు ఉండగా.. ప్రస్తుత సంఖ్య 9.84 లక్షల వరకు ఉంది. ఈ లెక్కన ఈ శాఖలో దాదాపు 1.28 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రక్షణశాఖలో ఉన్న సివిలియన్ పోస్టులు 5.77 లక్షలు ఉండగా.. వీటిలో 2.44 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే మాదిరిగా పోస్టల్, రెవెన్యూ విభాగాల్లోనూ ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

కేంద్రంపై ఆర్థిక భారం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీతం మరియు భత్యం (బోనస్, తాత్కాలిక బోనస్, గౌరవ వేతనం, సంపాదించిన సెలవులు మరియు ట్రావెలింగ్ అలవెన్స్‌లు మినహా) మొత్తం వ్యయం 7 శాతానికి పైగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.56 లక్షల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడగా.. ఇప్పుడు అది రూ. 2.75 లక్షల కోట్లకు చేరుకుంది. వీటిలో 80% మేర నాలుగు మంత్రిత్వ శాఖలు – రైల్వేలు, రక్షణ (సివిల్), హోం వ్యవహారాలు మరియు పోస్టల్ విభాగాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇదిలా ఉంటే.. విద్యావ్యవస్థలో ఖాళీలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖలో.. ముఖ్యంగా దేశంలోని 46 సెంట్రల్ యూనివర్సిటీల్లో 27 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వుడు వర్గాల పోస్టులే ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ.. 2014 నాటికి సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 37 శాతం పోస్టులు ఖాళీలు ఉన్నాయని, అది ఇప్పుడు 26.8% కు చేరుకుందని తెలిపారు. అంటే యూపీఏ హయాంలోనే ఎక్కువ ఖాళీలు ఉండగా.. తాము వాటిని భర్తీ చేస్తూ ఖాళీల సంఖ్యను గణనీయంగా తగ్గించామని వివరించారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు.. ఏకంగా క్లాస్‌రూమ్‌లో

‘మాతృదేవో భవ’.. ‘పితృదేవో భవ’.. ‘ఆచార్య దేవోభవ’అన్నారు మన పెద్దలు. విద్యార్థులను సన్మార్గంలో నడిపి బతుకు పాఠాలను నేర్పే గురువుకు మన సమాజంలో తల్లిదండ్రులతో సమానంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడే దారితప్పితే ఏమంటారు..?

సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలోని ప్రాథమిక పాఠశాలలో గత మూడేళ్లుగా ఎస్జిటి టీచర్‌గా ఉపేందర్ పనిచేస్తున్నాడు. ఈ టీచర్ కు మద్యం లేనిదే పూట గడవదు. ప్రతిరోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడు. మద్యం ఒకటే కాదు స్కూల్లోనే పిల్లల ముందే సిగరేట్ వెలిగించి విద్యార్థులు చూస్తుండగానే కాలుస్తున్నాడు. తాగిన మైకంలో పాఠశాల గదుల్లోనే నిత్యం పుష్టిగా పడుకోవడం చేస్తున్నాడు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎంత చెప్పినా నిత్యం ఇదే తంతు కొనసాగిస్తున్నాడు.

దీంతో విద్యార్థులకు పుస్తకంలోని పాఠాల కన్నా ఈ తాగుబోతు మాస్టారు తాగుడు పాఠాలే ఎక్కువైపోయాయి. ఈ ఉపాధ్యాయుడితో విద్యార్థులకు ప్రతిరోజు దినదిన గండంలా గడుస్తోంది. దీంతో విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచరే ఇలా అయితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ‘ఎప్పుడు మారతారు మా సారు’ అంటూ వారిలో వారే మదనపడుతున్నారు. ఈ క్రమంలో ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, విద్యార్థులు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తోటి ఉపాధ్యాయురాలికి గ్రామస్థులు, విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు.

సూపర్ లుక్‌లో టాటా నెక్సాన్ కార్లు..సన్ రూఫ్ అప్‌డేట్ తీసుకువచ్చిన కంపెనీ

టాటా కార్లలో నెక్సాస్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు నెక్సాస్ ఎస్ యూవీని టాటా నవీకరించింది.

ఫియర్ లెస్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ మోడళ్లకు సన్ రూఫ్ ను ఏర్పాటు చేసింది. ఐసీఎన్ జీ వెర్షన్ కు ఇప్పడు క్రియేటవ్ ప్లస్ పీఎస్ ట్రిమ్ లో ఈ ఫీచర్ ను అందిస్తుంది. ఈ అప్ డేట్ వేరియంట్ ధర రూ.12.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా మోటార్స్ తన నెక్సాన్ కారును ఆధునీకరించింది. పెట్రోలు, డీజిల్ పవర్ ట్రెయిన్ లలో పనోరమిక్ సన్ రూఫ్ తో కొత్త టాప్ స్పెక్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సింగిల్ పాన్ సన్ రూఫ్ ను పొందటానికి ఫియర్ లెస్ ట్రిమ్ ను కూడా అప్ డేట్ చేసింది. అలాగే ఐసీఎన్ జీ ఇంధన వెర్షన్ మిడ్ స్పెక్ క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో ఐచ్చిక సన్ రూఫ్ అందుబాటులో ఉంది. సన్ రూఫ్ ఉన్న కార్ల విక్రయాలు మన దేశంలో జోరందుకున్నాయి. అనేక కుటుంబాలు ఇలాంటి వాహనాలనే ఇష్టపడుతున్నాయి. దీంతో టాటా మోటార్స్ సన్ రూఫ్ తో కూడిన అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఇలాంటి ఆధునిక ఫీచర్ ఉన్న కార్ల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్లు

నిర్బయ ప్లస్ పీఎస్ (పెట్రోలు)

కొత్త ఫియర్ లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో మాన్యువల్ ట్యాన్స్ మిషన్ ఏర్పాటు చేశారు. దీని పెట్రోలు వెర్షన్ రూ.13.59 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే డ్యూయల్ క్లబ్ ట్రాన్స్ మిషన్ తో కూడిన వేరియంట్ రూ.14.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.

నిర్బయ ప్లస్ పీఎస్ (డీజిల్)

ఫియర్ లెస్ ప్లస్ పీఎస్ డీజిల్ వేరియంట్ లోనూ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.14.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో ఏఎంటీ తో వేరియంట్ కు రూ.15.59 లక్షల వరకూ వెచ్చించాలి.

క్రియేటివ్ ప్లస్ పీఎస్ (ఐసీఎన్ జీ)

పనోరమిక్ సన్ రూఫ్ కలిపిన క్రియేటివ్ ప్లస్ పీఎస్ లోని ఐసీఎన్ జీ వేరియంట్ రూ.12.79 లక్షలకు అందుబాటులో ఉంది. దీనిలోనే డ్యూయల్ టోన్ వేరియంట్ కోసం రూ.12.99 లక్షల నుంచి మొదలవుతోంది.

ఇంజిన్ ఎంపికలు

టాటా నెక్సాన్ ఎస్ యూవీ పెట్రోలు, డీజిల్, ఐసీఎన్ జీ తదితర మూడు రకాల ఇంధన ఎంపికలతో అందుబాటులోకి ఉంది. పెట్రోలు, ఐసీఎన్ జీ వెర్షన్లకు 1.2 లీటర్ల టర్బో చార్జ్ రివోర్ట్రన్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. డీజిల్ వెర్షన్ మాత్రం 1.5 లీటర్ల టర్బో చార్జ్ రివోటార్క్ ఇంజిన్ అమర్చారు.

ఈ 125 సీసీ బైక్‌లు రెండూ తోపులే.. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలివే

ప్రస్తుతం 125 సీసీ ఇంజిన్ వాహనాలపై యువత ఆసక్తి చూపుతున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ 125, హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ మోటారు సైకిళ్లు ముందు వరుసలో ఉన్నాయి.

అమ్మకాలలో ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ధర, ప్రత్యేకతలు, తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంజిన్, మైలేజ్

బజాజ్ పల్సర్ ఎన్ 125 బైక్ లో 124.88 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 11.83 హెచ్ పీ, 11 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. ఈ ఇంజిన్ కు ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. లీటర్ కు దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
హీరో ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ బైక్ లోని 124.7 సీసీ ఇంజిన్ నుంచి 11.4 హెచ్ పీ, 10.5 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. ఐదు స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంది. సుమారు 66 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

సస్పెన్షన్, బ్రేకులు

బజాజ్ పల్సర్ ఎన్ 125 బైక్ వెనుక మోనోషాక్ సెటప్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు ఏర్పాటు చేశారు. ముందు చక్రానికి 240 ఎంఎం డిస్క్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఉంది. దీనిలో ఏబీఎస్ సిస్టమ్ లేదు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది.
హీరో ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ వెనుక వైపు హైడ్రాలిక్ షాక్, ముందు వైపు సంప్రదాయ ఫోర్కులు ఉన్నాయి. ముందు 276 ఎంఎం డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకులు ఏర్పాటు చేశారు. దీనిలోని టాప్ వేరియంట్ లో సింగిల్ చానల్ ఏబీఎస్ ఉంది.

ఇంధన ట్యాంకు సామర్థ్యం

పల్సర్ బైక్ ఇంధన ట్యాంకు సామర్థ్యం 9.5 లీటర్లు. అలాగే సీటు ఎత్తు 795 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 198 ఎంఎం. దీనిలోని డిస్క్ బ్రేక్ వేరియంట్ బరువు 127.5 కిలోలు ఉంటుంది.
హీరో ఎక్స్ ట్రీమ్ విషయానికి వస్తే ఇంధన ట్యాంకు సామర్థ్యం 10 లీటర్లు, సీటు ఎత్తు 794 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం.

ఫీచర్లు

పల్సర్ ఎన్ 125లో ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే మోనోక్రోమ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. దీని ద్వారా కాల్స్ ను అంగీకరించడం, తిరస్కరించడం చేయవచ్చు. మిస్ట్ కాల్స్, మెసేజ్ లను ఎప్పటికప్పుడు చూడవచ్చు.
ఎక్స్ ట్రీమ్ లోని డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కి మద్దతు ఇవ్వదు. దీనిలోనూ ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.

ధర

పల్సర్ బైక్ రూ.94,707 నుంచి రూ.98,707 (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ అందిస్తున్నారు.
ఎక్స్ ట్రీమ్ ధర రూ.95 వేలు (ఎక్స్ షోరూమ్) కాగా, దీనిలోని టాప్ వేరియంట్ రూ.99,500 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. దీనిపై ఐదేళ్లు లేదా 70 వేల కిలోమీటర్ల వరకూ వారంటీ అందిస్తున్నారు.

ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌

ఏఐ, మెషిన్ లెర్నింగ్.. వంటి వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు అక్టోబర్ నెలలో పుంజుకున్నట్లు నౌక్రి జాబ్‌స్పీక్ ఇండెక్స్ తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మందగమనంగా సాగిన ఫ్రెషర్స్ నియామకాలు కూడా అక్టోబర్ నాటికి భారీగా పెరిగినట్లు తెలిపింది..

ఏఐ, మెషిన్ లెర్నింగ్ (AI/ML) వంటి నూతన టెక్నాలజీతో అక్టోబర్‌లో వైట్ కాలర్ జాబ్స్‌ 10 శాతం పెరిగాయని నౌక్రి జాబ్‌స్పీక్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ & గ్యాస్ (18%), ఫార్మా & బయోటెక్ (12%), FMCG (8%), IT (6%).. ఈ నాలుగింటిలో గత ఏడు నెలల్లో ఐటీ ఉద్యోగ నియామకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. .

AI/ML రంగాల్లో అసాధారనంగా 39% వార్షిక, 2% నెలవారీ వృద్ధిని సాధించాయి. వైట్ కాలర్ నియామకాల్లో 28% పెరుగుదలతో IT యునికార్న్స్ అద్భుత పనితీరును ప్రదర్శిస్తున్నాయి. మొత్తంమీద గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలు) 17% వార్షిక పెరుగుదలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ GCCలలో కోల్‌కతా 68.46% వృద్ధి, అహ్మదాబాద్ 47.68% వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న సెంటర్లుగా నిలిచాయి. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తున్నాయని తాజా సూచీలు నిర్ధారిస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో డేటా-సెంట్రిక్ రోల్స్ నియామకాలు అక్టోబర్‌లో వృద్ధికి దారితీశాయని ఇండెక్స్ హైలైట్ చేసింది. 24% వార్షిక వృద్ధితో తమిళనాడు అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో 16 శాతంతో తెలంగాణ, 12 శాతంతో కర్ణాటక, 9 శాతంతో ఆంధ్రప్రదేశ్, 7 శాతంతో కేరళ నిలిచాయి. హైదరాబాద్, చెన్నై రీసెర్చ్ అండ్‌ అనలిటిక్స్ ఇండస్ట్రీ నియామకాల్లో అగ్రగామిగా ఉన్నాయి. ఇవి వరుసగా 51%, 50% ఆకట్టుకునే రీతిలో వృద్ధిని కొనసాగిస్తున్నాయి. కొచ్చిన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్‌ ఇన్సూరెన్స్ (BFSI) 40 శాతం వార్షిక పెరుగుదలను సూచిస్తుంది. 2024లో మందగమనంలో సాగుతున్న ఫ్రెషర్స్ నియాయకాలు అక్టోబర్‌లో 6% వార్షిక పెరుగుదలతో సానుకూలంగా మారింది.

ఆర్కిటెక్చర్ అండ్‌ ఇంటీరియర్ డిజైన్‌లో 57%, KPO & అనలిటిక్స్ 39%, అగ్రికల్చర్ & డైరీ 36% రంగాలు ఫ్రెషర్స్‌ నియామకాల్లో పెరుగుదలకు దోహదం చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్రెషర్స్ నియామకాల్లో వేగం వ్యాపార విస్తరణకు బలమైన సూచికని, రాబోయే గ్రాడ్యుయేట్‌లకు మరిన్ని అవకాశాలను అందిస్తుందని నౌక్రి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు.

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా

రాత్రి వేళలో చేసే కొన్ని పనుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతోందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్య యువకలుల్లో కూడా హార్ట్ ఎటాక్స్ అటాక్ పెరిగిపోతున్నాయి. నిద్ర మనకు చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మంచిగా నిద్ర పోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తాజా పరిశోధన ప్రకారం, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యను ప్రేరేపిస్తున్నట్లు తేలింది. అది క్రమేణా గుండెపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఏడు గంటల కంటే తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ నిద్రపోతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన తెల్లవారుజాముననే నిద్రలేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నిద్ర వల్ల స్త్రీల గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఏడు శాతం పెరుగుతుందని, నిద్ర వ్యవధి ఐదు గంటల కంటే తక్కువ ఉంటే 11 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.

ఆరోగ్యకరమైన గుండెకు ఏడెనిమిది గంటల నిద్ర ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తరచుగా నిద్రలో మేల్కొనడం, పేలవమైన నిద్ర అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ అధ్యయనం ప్రకారం ఎంత తక్కువ నిద్రపోతారో, భవిష్యత్తులో మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మారిన బ్యాంకు లాకర్‌ నిబంధనలు.. కొత్త ఛార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత..?

వివిధ బ్యాంకులలో లాకర్‌ నిబంధనలు మారాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకులు లాకర్‌ రూల్స్‌, ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే బ్యాంకు లాకర్‌ను తీసుకునే వారికి వివిధ రకాల ఛార్జీలు ఉంటాయి. లాకర్‌ ఛార్జీలు మీమీ ప్రాంతాన్ని బట్టి ఉంటాయని గుర్తించుకోండి..

బ్యాంక్ లాకర్‌కు సంబంధించిన సౌకర్యాల అద్దె, భద్రత, నామినేషన్‌కు సంబంధించిన కొన్ని నియమాలు మారాయి. దేశంలోని పెద్ద బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. ఈ అన్ని బ్యాంకుల మధ్య ఛార్జీల వివరాలను, ఇప్పుడు ఎంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

వ్యక్తిగత కస్టమర్‌లు, భాగస్వామ్య సంస్థలు, పరిమిత కంపెనీలు, క్లబ్‌లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్‌లకు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను బ్యాంకులు అందిస్తాయి. అయితే మైనర్‌ల పేరుతో బ్యాంకులు లాకర్లను కేటాయించడం లేదు. వార్షిక అద్దె ప్రాతిపదికన లాకర్ సేవలను అందిస్తూ, బ్యాంకులు తమ వినియోగదారులకు ఒక రకమైన అద్దెదారుగా వ్యవహరిస్తాయి.

భద్రత పరంగా, బ్యాంకులు ఖాతాదారుల విలువైన వస్తువులను వారి రుసుము కంటే చాలా సురక్షితమైనవని హామీ ఇస్తున్నాయి. బ్యాంకులో నగదును ఉంచినప్పుడు, దాని భద్రతకు బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అదే విధంగా లాకర్లకు కూడా భద్రత ఉంటుంది.

లొకేషన్‌ను బట్టి ఛార్జీలు

ET నివేదిక ప్రకారం, SBI, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, PNB లాకర్ అద్దె బ్యాంకు శాఖ, స్థానం, లాకర్ పరిమాణంపై ఆధారపడి మారవచ్చు. బ్యాంకులు కొత్త రేట్లను విడుదల చేశాయి.

ఎస్‌బీఐ లాకర్ అద్దె:

చిన్న లాకర్: రూ. 2,000 (మెట్రో/అర్బన్), 1,500 (సెమీ-అర్బన్/రూరల్)
మీడియం లాకర్: రూ. 4,000 (మెట్రో/అర్బన్), రూ. 3,000 (సెమీ-అర్బన్/రూరల్)
పెద్ద లాకర్: రూ. 8,000 (మెట్రో/అర్బన్), రూ. 6,000 (సెమీ-అర్బన్/రూరల్)
అదనపు పెద్ద లాకర్: రూ. 12,000 (మెట్రో/అర్బన్), రూ. 9,000 (సెమీ-అర్బన్/రూరల్).

ICICI బ్యాంక్ లాకర్ అద్దె:

గ్రామీణ ప్రాంతాలు: రూ.1,200 నుండి రూ.10,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 2,000 నుండి రూ. 15,000
పట్టణ ప్రాంతాలు: రూ. 3,000 నుండి రూ. 16,000
మెట్రో: రూ.3,500 నుంచి రూ.20,000
మెట్రో+ స్థానం: రూ. 4,000 నుండి రూ. 22,000

HDFC బ్యాంక్ లాకర్ ఛార్జీలు

మెట్రో శాఖలు: రూ.1,350 నుంచి రూ.20,000
పట్టణ ప్రాంతాలు: రూ. 1,100 నుండి రూ. 15,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ.1,100 నుండి రూ.11,000
గ్రామీణ ప్రాంతాలు: రూ.550 నుండి రూ.9,000

PNB లాకర్ ఛార్జీలు

గ్రామీణ ప్రాంతాలు: రూ. 1,250 నుండి రూ. 10,000
పట్టణ ప్రాంతాలు: రూ. 2,000 నుండి రూ. 10,000
కస్టమర్‌లకు 12 సార్లు ఉచితంగా మీ లాకర్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు లాకర్‌ను చూసుకోవడానికి రూ. 100 రుసుము వసూలు చేస్తారు.

BSNL సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా

పట్టణాలకే పరిమితమైన BSNL 4జీ సేవలు ఇక నుంచి గ్రామాలకు చేరనున్నాయి. ఇంతకాలం 2జీ, 3జీ సేవలతో నత్తనడకన సాగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీకి మారడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారు చేసిన స్పెక్ట్రం పరికరాలతో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అంతా BSNL జపం చేస్తున్నారు.

కొన్నాళ్లుగా ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఇష్టారీతిన టారిఫ్‌లు పెంచుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సగటున 250 రూపాయల నుంచి 300 రూపాయలు రీఛార్జి చేస్తేనే ఆ నెల ఇంటర్నెట్, టాక్‌టైమ్‌ ఉంటుంది. మూడు నెలల రీఛార్జికి కనీసం 700 నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇది వినియోగదారుడికి తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం ప్రధానంగా రెండు ప్రైవేటు కంపెనీల నెట్‌వర్క్‌ పరిధిలోనే ఎక్కువ కనెక్షన్లున్నాయి. గతేడాది నుంచి వారు టారిఫ్‌లు పెంచుతున్నా ప్రత్యామ్నాయం లేక కొనసాగించాల్సిన పరిస్థితి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే మూడు నెలలకు 3 వేల రూపాయల వరకు రీఛార్జీలకే ఖర్చవుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 150 రోజులకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌కు రూ.397 టారిఫ్‌ ఉండటంతో వినియోగదారులు పోర్టబులిటీ పెట్టుకుంటున్నారు. గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సిమ్‌ల కోసం పోటీ నెలకొంది. ప్రస్తుతం నెట్‌వర్క్‌ బలోపేతం పనులు కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో 4జీ టవర్స్‌ రానున్నాయి. త్వరలోనే BSNL దేశంలో టాప్‌ టెలికాం కంపెనీగా నిలిచే అవకాశం ఉంది.

టూవీలర్ల అమ్మకాల టాప్ గేర్.. అక్టోబర్‌లో రికార్డుస్థాయి అమ్మకాలు

ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అక్టోబర్ లో ద్విచక్ర వాహన రంగం టాప్ గేర్ లో పరుగులు తీసింది. దేశంలో టూ వీలర్ల అమ్మకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. పండగ సందర్భంగా వాహనాలను కొనుగోలు చేయడం భారతీయుల సంప్రదాయం. దానికి అనుగుణంగానే ద్విచక్ర వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. దీంతో ఆ రంగానికి దీపావళి పండగ సీజన్ బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ధన్ తేరాస్ సందర్భంగా చాాలా మంది జోరుగా కొనుగోళ్లు జరిపారు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారులైన టీవీఎస్ మోటారు కంపెనీ, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ ఫీల్డ్ దేశీయ విక్రయాల్లో 13 నుంచి 26 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే బజాజ్ ఆటో మాత్రం ఈ విషయంలో క్షీణతను చవి చూసింది. పండగ సీజన్ అన్ని కంపెనీలకు ఉత్సాహాన్ని కలిగించగా, బజాజ్ ఆటో మాత్రం వెనుకబడింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ లో ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా జరిగాయి. చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ దేశీయ అమ్మకాల్లో (వైఓవై) 13 శాతం పెరుగుదలను సాధించింది. ఈ కంపెనీ 390,489 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 344,957 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదిలో పోల్చితే ఈసారి విక్రయాల్లో మంచి వృద్ధి నెలకొంది. అలాగే టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోనూ ముందంజలో దూసుకుపోతోంది. దాదాపు 45 శాతం మేర అమ్మకాలను పెంచుకుంది. దేశ ప్రజలకు టీవీఎస్ వాహనాల మీదు నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటాకార్ప్ కూడా పండగ సమయంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది. దేశీయ విక్రయాల్లో 17.4 శాతం వృద్ధి ని నమోదు చేసింది. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్టు ప్రచారం ద్వారా ఈ అక్టోబర్ లో 657,403 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా ధన్ తేరాస్ లో జోరుగా విక్రయాలు జరిగాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా హీరో మోటాకార్ప్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా 100 సీసీ, 125 సీసీ సెగ్మెంట్ వాహనాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. రాయల్ ఎన్ ఫీల్ద్ కూడా పండగ సందర్భంగా విక్రయాలను పెంచుకుంది. దాదాపు 26 శాతం వృద్ధి ని సాధించింది. అక్టోబర్ నెలలో 101,886 యూనిట్ల అమ్మకాలు జరిగింది. గతేడాది ఇదే నెలలో 80,958 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో ఈ దీపావళి ఆ కంపెనీకి ఉత్సాహం కలిగించింది. క్లాసిక్, కొత్త మోడళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది.

బజాజ్ ఆటో కంపెనీకి మాత్రం దీపావళి కలిసి రాలేదు. ఈ సంస్థ వాహనాల విక్రయాలు 8 శాతం తగ్గిపోయాయి. కేవలం 255,909 యూనిట్లను మాత్రమే అక్టోబర్ నెలలో విక్రయించగలిగింది. దేశంలోని ద్విచక్ర తయారీదారులు అక్టోబర్ లో ఎగుమతుల్లో గణనీయమైన ప్రగతి సాధించారు. టీవీఎస్ కంపెనీ అయితే వాహనాల ఎగుమతుల్లో 16 శాతం వృద్ధితో 87,670 యూనిట్లకు చేరింది. హీరో మోటోకార్ప్ 43 శాతం వైవై పెరుగుదలను చూసింది. దీని మోడళ్లకు ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. రాయన్ ఎన్ ఫీల్డ్ కూడా 150 శాతం పెరుగుదలను సాధించింది. దక్షిణాసియా, లాటిన్ అమెరికాలో ఈ బ్రాండ్ విస్తరించింది. బజాజ్ అమ్మకాలు దేశంగా తగ్గినప్పటికీ ఎగుమతుల్లో పెరుగుదల నమోదైంది. దాదాపు 24 శాతం వృద్ధి సాధించింది.

నిమ్మకాయా మజాకా.. ఈ పవర్‌ఫుల్ సీక్రెట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.. మారుతున్న సీజన్లలో దీని వినియోగం మరింత ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా వానకాలం, చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది.. దీని కారణంగా జలుబు, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు దాడి చేయడం ప్రారంభిస్తాయి. అందుకే.. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.. నిమ్మకాయ మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం.. దీనిని వివిధ రకాలుగా తింటారు. అయితే. మారుతున్న సీజన్లలో దాని వినియోగాన్ని కొద్దిగా పెంచాలి.. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. అయితే, మారుతున్న కాలంతోపాటు నిమ్మకాయను ఎందుకు తీసుకోవాలి.. దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నిమ్మకాయ విటమిన్ సి గొప్ప మూలంగా పరిగణిస్తారు. ఇది మన శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మారుతున్న సీజన్‌లో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో విటమిన్ సి సహాయపడుతుంది. ఈ సీజన్‌లో నిమ్మరసం తీసుకుంటే వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

కంటి చూపు పెరుగుతుంది: విటమిన్ సి తో పాటు, నిమ్మకాయలో విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఇవి మన కళ్ళకు చాలా ముఖ్యమైనవి. ఇవి కళ్లకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందించి దృష్టిని మెరుగుపరుస్తాయి. కాబట్టి, మారుతున్న సీజన్‌లో నిమ్మకాయ వినియోగం కళ్లకు కూడా మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది: నిమ్మకాయ పొటాషియానికి చాలా మంచి మూలం.. ఇది గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పొటాషియం సహాయంతో అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. ఇది కాకుండా, నిమ్మకాయలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మారుతున్న వాతావరణంలో నిమ్మకాయను ఎలా తినాలి?: నిమ్మరసాన్ని సాధారణంగా తీయడం ద్వారా తీసుకుంటారు.. మీరు దానిని నిమ్మరసం, నిమ్మకాయ చట్నీ, తేనె లేదా సలాడ్ రూపంలో కలపడం ద్వారా తినవచ్చు. అయినప్పటికీ, నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవద్దు.. ఎందుకంటే విటమిన్ సి అధికంగా ఉదర సమస్యలను కలిగిస్తుంది. అయితే.. ఉదయాన్నే నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు

శ్రీవారి భక్తులకు రిలీఫ్.. బిగ్ ప్లాన్ సిద్ధం చేసిన టీటీడీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు కలిగితే చాలన్నది కోట్లాది మంది భక్తుల ఆశ. ఇందులో భాగంగానే దేశంలోని నలు మూలలా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారు.

సంపన్నుడి నుంచి సామాన్యుడి దాకా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటుంది. ఈ నేపధ్యంలో క్యూలైన్ మేనేజ్మెంట్ విషయంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది టీటీడీ. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టిటిడి పేర్కొంది.

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినట్లు కొత్త విధానాన్ని తెరమీదికి తెచ్చింది. వారాంతపు రోజుల్లో శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లో నడవాల్సిన పని లేకుండా సర్వీస్ లైన్ ను వినియోగించింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షించిన టీటీడీ సిబ్బంది. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేసిన టీటీడీ భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది. దీంతో సర్వీస్ లైన్ సామాన్య భక్తుడికి నడక సమయాన్ని సేవ్ చేసింది. ఎక్కువ సమయం క్యూలైన్ లో ఉండకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది.

గతంలోనూ వారాంతపు రోజులు, పర్వదినాల్లోనూ 90 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమలలో రద్దీ ఉండే రోజులు, వారాంతపు సెలవు దినాలు, పర్వదినాల్లో టీటీడీ ఎక్కువమంది భక్తులకు గతంలోనూ దర్శన అవకాశం కల్పించింది. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు, విఐపి సిఫారసు లేఖలు, శ్రీవాణి టికెట్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టైం స్లాటెడ్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారిని దర్శించుకునే భక్తులు రోజుకు 90 వేల దాకా కూడా దర్శించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు టిటిడి క్యూలైన్ మేనేజ్మెంట్ చేసింది.

ఇప్పుడు సర్వీస్ లైన్ సహకారంతో రెండు రోజులకు లక్ష 70 వేల మంది భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ రెండు రోజులకు దాదాపు 1.80 లక్షల మందికి పైగానే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించింది. వారాంతపు రోజుల్లో ప్రోటోకాల్ మినహా సిఫారసు లేఖలను అనుమతించక పోవడం, శ్రీవాణి ట్రస్ట్ కింద టికెట్ల జారీని పరిమితం చేయడం లాంటి నిర్ణయాల ద్వారా సామాన్య భక్తులకు అదనంగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు అదనపు సమయం లభించడం తో ఎక్కువమంది దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడింది.

ఇందులో భాగంగానే గంటకు నాలుగున్నర వేల నుంచి 5వేల మంది భక్తులు శ్రీవారిని సర్వదర్శనం చేసుకునే అవకాశం దక్కుతోంది. గత శని, ఆదివారాలు రెండు రోజులు టీటీడీ సర్వీసు లైన్ లో భక్తుల్ని అనుమతించడం ద్వారా నడక సమయం భక్తులకు కలిసి రాగా అదనంగా దాదాపు 5 నుంచి 10 వేల మంది వరకు భక్తులకు శ్రీవారిని సర్వ దర్శనం చేసుకునే అవకాశం కలిగింది.

‘ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంపు’ సీఎం చంద్రబాబు

రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన నూతన స్పోర్ట్స్‌ పాలసీపై సోమవారం (నవంబర్‌ 4) సమీక్ష జరిగింది. ఏపీ కొత్తగా తీసుకువస్తున్న స్పోర్ట్స్‌ పాలసీ విధానం దేశంలోనే ఉత్తమ క్రీడా విధానంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేయాలి. స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్, నర్చర్‌ టాలెంట్, స్పోర్ట్స్‌ ఎకో సిస్టం, గ్లోబల్‌ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించాలి. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. శాప్‌లో గ్రేడ్‌ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్‌ మెడల్స్‌ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఒలింపిక్స్‌ విజేతలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం

ఒలింపిక్స్‌లో బంగారు పతకానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 లక్షలు ఇస్తుండగా.. దానిని రూ.7 కోట్లకు పెంచారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏషియన్‌ గేమ్స్‌ బంగారు పతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. అదే విధంగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్, వరల్డ్‌ కప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు.. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ విధానంతో నూతన క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా పడే ఛాన్స్! కారణం ఇదే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను ఇటీవల కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అయితే జనవరి 5న జరుగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. నేడో రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే జనవరి 5న గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలియజేస్తూ అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్‌ 2 వాయిదా వేస్తే ఏప్రిల్‌ లేదా మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలుంటుంది. ఏప్రిల్‌ వరకు పరీక్ష కేంద్రాలన్నీ బిజీ ఉంటాయి. కాబట్టి మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. అయితే డీఎస్సీ రాత పరీక్షల తేదీలు అనుసరించి గ్రూప్‌ 2 తేదీ మార్చాలా.. వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి.

మరోవైపు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీలు డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, లక్ష్మణరావులతో కలిసి ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధకు సోమవారం వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే డీవైఈఓ పరీక్ష కటాఫ్‌ మార్కులు కూడా తగ్గించాలని కోరారు. ఈ మేరకు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు.

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నేరాల విషయంలో అధికారుల తీరుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన వ్యాఖ్యలపై హోం మంత్రి అనితతోపాటు, ఇతర మంత్రులు స్పందించడం ఆసక్తిగా మారింది.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ మాటలను పాజిటివ్‌గా తీసుకుని, బాధ్యతగా పనిచేస్తానని అనిత అన్నారు. ఇప్పటికే అయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షి్ంచేదీ లేదన్నారు హోంమంత్రి అనిత. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన బాధాకరమని, ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదీ కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయట పడ్డారు.. మేము పడలేదు. లా అండ్‌ ఆర్డర్‌ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

ఈ ఘోరాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు కావాలన్న హోంమంత్రి, ఈ అంశాలంటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరిట కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ ఆవేదనతో అలా మాట్లాడారని అనిత వివరించారు. అంతేకాదు, తాను సోషల్‌ మీడియా బాధితురాలినే అన్నారు హోంమంత్రి అనిత.

ఇదిలావుంటే, నిన్న పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీనికి హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు పవన్.

ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు! ఎప్పటి వరకంటే

2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.

అక్టోబర్ 28వ తేదీ నుంచి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. తాజాగా ఆ గడువును పొడిగించినట్లు ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి మరో ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024-25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్‌ 18వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్‌ 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 వరకు, రూ.500 ఆలస్య ఫీజుతో డిసెంబర్‌ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ లో స్కూల్‌ లాగిన్‌లో విద్యార్ధుల ఫీజు చెల్లించాలని డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులు తమ ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లిస్తే.. వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తారు. నామినల్‌ రోల్స్‌ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్‌ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్‌ జారీకి ముందు ఎడిట్‌ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్‌ దేవానందరెడ్డి వివరించారు. పదో తరగతిలో అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి అయితే రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 చెల్లించాలి. వొకేషనల్‌ విద్యార్థులు అదనంగా మరో రూ.60, నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్సించవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఏపీ టెట్‌ 2024 ఫలితాల్లో మెరిసిన యువతి.. 150కి 150 మార్కులు

ఏపీ జులై సెషన్‌ టెట్‌ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని నూరు శాతం మార్కులు సాధించారు. పేపర్‌ 1ఏ (ఎస్జీటీ)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. దీంతో టెట్ వెయిటేజీ మార్కులు 20కి 20 సాధించినట్లైంది. 2014-16 మధ్య డైట్‌ పూర్తి చేసిన ఆమె డీఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని చెబుతుంది. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో టెట్‌ ఫుల్ సాధించగలిగానని ఆమె తెలిపారు.

రూ.2000 నోట్లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌

రూ.2000 నోట్లు ప్రస్తుతం కనుమరుగైపోయాయి. పెద్దనోట్లను ఉపసంహరించుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఏడాది కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ నోట్లకు సంబంధించి మరో విషయాన్ని వెల్లడించింది. రూ.2000 నోట్లలో 98.04 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయని, కేవలం రూ.6,970 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. మే 19, 2023న రూ.2000 బ్యాంకు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

మే 19, 2023న బ్యాంకింగ్‌ వేళలు ముగిసే సమయానికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 31, 2024న ట్రేడింగ్ ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.6,970 కోట్లుగా ఉంది. మే 19, 2023 వరకు చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.04 శాతం తిరిగి వచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంక్ శాఖలలో అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.

సెంట్రల్ బ్యాంక్ రూ. 2000 బ్యాంకు నోట్లను చెలామణి నుండి తీసివేసినప్పుడు 7 అక్టోబర్ 2023 వరకు ప్రజలకు సమీపంలోని ఏదైనా బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీని తరువాత ప్రజలు 19 ప్రాంతీయ కార్యాలయాలు, ఆర్బీఐ పోస్ట్‌ల ద్వారా నోట్లను మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఇవీ ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వివరాలు:

గత ఏడాది మే 19 నుండి రిజర్వ్ బ్యాంక్ 19 ప్రాంతీయ కార్యాలయాలలో కూడా రద్దు చేసిన రూ.2,000 బ్యాంక్ నోటును మార్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది. అయినప్పటికీ అక్టోబర్ 9, 2023 తర్వాత ఈ కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి రద్దీ పెరిగింది. అప్పటి నుంచి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రూ.2000 నోట్లను కూడా స్వీకరిస్తున్నారు.

దేశంలోని పోస్టాఫీసుల ద్వారా ప్రజలు రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలకు కూడా పంపుతున్నారు. ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడి పనులు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి.

1 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై ప్రైవేట్‌ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే!

మనిషి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన అంశం. పొదుపు పథకాల్లో మదుపు చేయడం వల్ల సురక్షితమైన భవిష్యత్తుతోపాటు ఆర్థిక కొరత లేని జీవితాన్ని గడపవచ్చు.

ప్రతి ఒక్కరూ పొదుపు తప్పనిసరి చేయాలి. ప్రజల పొదుపు కోసం అనేక పొదుపు పథకాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అటువంటి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. నవంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫైనాన్సింగ్ పథకాలకు ప్రైవేట్ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు అందిస్తాయో వివరంగా చూద్దాం.

ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు:

Axis బ్యాంకు

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.70 శాతం వడ్డీ.
3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.10 శాతం వడ్డీ.
5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.

Bandhan బ్యాంక్

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 8.05 శాతం వడ్డీ.
3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 8.05 శాతం వడ్డీ.

DCP బ్యాంక్:

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.10 శాతం వడ్డీ.
3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.55 శాతం వడ్డీ.
5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.40 శాతం వడ్డీ.

HDFC బ్యాంక్:

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.60 శాతం వడ్డీ.
3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.
5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.

IndusInd Bank బ్యాంక్:

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.75 శాతం వడ్డీ.
3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.25 శాతం వడ్డీ.

YES బ్యాంక్:

1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.

ఏపీ పింఛన్‌ దారులకు గుడ్‌న్యూస్.. ఇకపై 3 నెలల పింఛన్ ఒకేసారి పొందొచ్చు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్లకు సంబంధించి ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్‌లను మంజూరు చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నవంబర్‌ నుంచే కొత్త పింఛన్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో ఈ దరఖాస్తుల్ని పరిశీలించి జనవరిలో కొత్త పింఛన్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సామాజిక భద్రత పింఛన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరుసగా 2 నెలలు పింఛను తీసుకోకపోయినా 3వ నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని, వచ్చే డిసెంబరు నెల నుంచే మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే వెసులు బాటును అమల్లోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భర్త చనిపోయిన వితంతువులకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన మరుసటి నెల నుంచే వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు అయినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలని అధికారులను కోరారు. తనిఖీల్లో పింఛన్‌లకు అనర్హులైన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపి క్షేత్రస్థాయిలో మరోమారు సమీక్షించాలని అదేశించారు. ఈ దశలో కూడా అనర్హులుగా నిర్ధారణయితే పింఛన్‌ నిలిపివేయాలని తెలిపారు. ఒకవేళ అర్హుల పింఛన్లు తొలగిస్తే గ్రామసభల్లో ఫిర్యాదులు తీసుకుని.. నిబంధనల మేరకు పింఛను కొనసాగించాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎస్‌వోపీని తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు

ఆయుష్మాన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? ఈ టిప్స్‌తో క్షణాల్లో కార్డు జారీ

ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. సాధారణంగా 70 ఏళ్లు నిండిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

కొత్త పథకం ద్వారా వారందరూ కవరేజీ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. దాదాపు రూ.5 లక్షల విలువైన వైద్యం ఆయా ఆస్పత్రుల్లో అందజేస్తారు. ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు కోసం ఈ కింద తెలిపిన పద్ధతులలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొబైల్ యాప్

మొబైల్ యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్ ను ఉపయోగింగించి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
లబ్దిదారుడిగా లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
ఆధార్ నంబరు, ఇతర వివరాలను పూర్తి చేయాలి.
పిన్ కోడ్, కుటుంబ సమాచారం, అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
దీంతో మీరు దరఖాస్తు చేసుకోవడం పూర్తవుతుంది. దాన్ని ఆమోదించిన తర్వాత ఆయుష్మాన్ వయో వందన కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి.

వెబ్ సైట్

ముందుగా బెనిఫిషరీ.ఎన్ హెచ్ఏ.ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
మొబైల్ నంబర్, క్యాప్చాను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
70 ఏళ్లు పైబడిన వారికోసం సీనియర్ సిటిజన్ ఎన్ రోల్ మెంట్ ఎంపికపై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబరు, ఇతర వివరాలను నమోదు చేయాలి.
దరఖాస్తును సమర్పించిన తర్వాత ఆమోదం అనంతరం 15 నిమిషాల్లో కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ ఆధారిత ఈ కేవైసీ మాత్రమే అవసరమవుతుంది. సీనియర్ సిటిజన్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్డును డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.

మార్కెట్‌ను ఏలుతున్న బెస్ట్ కార్లు ఇవే.. మారుతీ సుజుకీ బాలెనోకి ప్రత్యామ్నాయం

ప్రస్తుతం మారుతీ సుజికీ బాలెనోపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు 2015లో విడుదలైంది. అప్పటి నుంచి విక్రయాల్లో దూసుకుపోతోంది. దీనిలోని 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ నుంచి 88 బీహెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది.

సుమారు 23 నుంచి 31 కిలోమీటర్ల మధ్య మైలేజీ వస్తుంది. దీనిలో సీఎన్ జీ వేరియంట్ కూడా విడుదలైంది. ఈ కారు రూ.6.66 లక్షల నుంచి రూ.9.83 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. అయితే బాలెనో కు ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న కార్లు ఇవే.

టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజాలో 1.2 లీటర్ పెట్రోలు, నాలుగు సిలింజర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 88 బీహెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీని ధర రూ.6.86 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఉంది. బాలెనోతో పోల్చితే కొన్ని చిన్న తేడాలున్నాయి. గ్లాంజాలో ప్రత్యేకంగా ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, స్పెషల్ టెయిల్ లైట్లు అమర్చారు. ఈ కారుకు మూడేళ్ల లేదా లక్ష కిలోమీటర్ల వరకూ వారంటీ ఉంది. దాన్ని పంచవర్ష ప్రణాళిక ద్వారా 2.20 లక్షల కిలోమీటర్లకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ బాలెనో వారంటీ రెండేళ్లు లేదా 40 వేల కిలోమీటర్లకు పరిమితమైంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్

బాలెనోకి మరో ప్రత్యామ్నాయంగా స్విఫ్ట్ ను పరిగణించాలి. మంచి స్లైల్, కొత్త ఫీచర్లు, సరికొత్త ఇంజిన్ తో మారుతీ స్విఫ్ట్ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం స్విఫ్ట్ జెడ్ సిరీస్ 1.2 లీటర్ మూడు సిలిండర్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. దాని నుంచి 80.46 బీహెచ్ పీ, 111.7 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఐదు స్పీడ్ ఏటీఎం ఎంపికలు, గేర్ షిప్టుల కోసం హైడ్రాలిక్ క్లబ్ లు ఏర్పాటు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్టానిక్ స్టెబిలీటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ),ఏటీస్ తదితర ఫీచర్లతో భద్రతకు ఢోకా లేదు. హిల్ హూస్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ తదితర ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల మధ్య ఉంది.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ కారు మూడు రకాల ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు, 1.2 లీటర్ టర్బో పెట్రోలు, 1.5 లీటర్ డిజిన్ ఇంజిన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ కారు రూ.6.50 లక్షల నుంచి 10.85 లక్షల మధ్య అందుబాటులో ఉంది. టాటా ఇటీవలే ఆల్ట్రోజ్ రేసర్ ను పరిచయం చేసింది. ఈ కారు ఇంజిన్ 118 బీహెచ్ పీ , 172 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్టియర్ వేరియంట్ ప్రత్యేక స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20 కారు వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు, 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ 82 బీహెచ్పీ, 115 ఎన్ఎం టార్కును విడుదల చేస్తుంది. ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను జత చేశారు. ఈ కారు ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్య పలుకుతుంది. అలాగే హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కూడా మార్కెట్ లోకి విడుదలైంది. ఈ కారు రూ.9.99 లక్షల నుంచి రూ.12.52 లక్షల మధ్య అందుబాటులో ఉంది. స్లైలిష్ ఎలిమెంట్స్, స్పోర్టియర్ డైవ్ కోసం స్పెషల్ సస్పెన్షన్, 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈఎస్సీ తదితర ప్రత్యేకతలున్నాయి.

అటల్ పెన్షన్ స్కీమ్ గురించి మీకు తెలుసా? ప్రయోజనాలు ఏంటంటే.

అటల్ పెన్షన్ పథకం భారతదేశ పౌరులకు పెన్షన్ పథకం. అనధికారిక రంగ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద లబ్ధిదారుల సహకారం ఆధారంగా 60 ఏళ్ల వయస్సులో కనీసం రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ లభిస్తుంది.

పైన పేర్కొన్న విధంగా ఈ పథకం అసంఘటిత రంగ కార్మికుల కోసం. ఒక్కో చందాదారునికి కనీసం రూ.1000 నుంచి రూ.5000 వరకు అందుతుంది. ఇది వారి 60 సంవత్సరాల తర్వాత మరణించే వరకు చెల్లిస్తారు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్లు నిండి ఉండాలి. ఈ పెన్షన్ వారి 60 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులో బ్యాంక్ సేవింగ్స్ ఖాతా లేదా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ఉండాలి. సబ్‌స్క్రైబర్‌లు పథకంలో చేరినప్పటి నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు నిర్ణీత మొత్తంలో కంట్రిబ్యూషన్‌ను చెల్లించాలి.

ఈ పథకం కింద కనీస పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. చందాదారుడు మరణిస్తే, అతని జీవిత భాగస్వామి మరణించే వరకు చందాదారునికి సమానంగా పెన్షన్ మొత్తం లభిస్తుంది.

చందాదారుడు, అతని జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే, చందాదారుని నామినీ ఈ పెన్షన్‌ను అందుకుంటారు. అటల్ పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ చేయబడిన డబ్బు సెక్షన్ 80 CCD(1) ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి పన్ను ప్రయోజనాలకు అర్హమైనది. 60 ఏళ్ల తర్వాత చందాదారులకు స్థిర ఆదాయాన్ని అందించడానికి ఈ పథకం రూపొందించారు.

ఫ్యాన్స్ కి పవన్‌ సలహా.! ఒక్క దెబ్బతో కంగారుపడుతున్న మేకర్స్

పవర్‌స్టార్‌ ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో మాట్లాడుతున్నా.. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఎప్పుడూ ఆయన లే గుర్తుకొస్తుంటాయి.. ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరుస్తుంటే..
అలా కాదు అనాల్సింది అంటూ పవన్‌ కల్యాణ్‌ ఓ సలహా ఇచ్చారు. ఫ్యాన్స్ కి ఆ సలహా ఎలా అనిపించినా.. ఆయనతో లు తీస్తున్న నిర్మాతలకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ విషయమేంటి.? బ్రో.. మళ్లీ ఎప్పుడు బ్రో..

పవర్‌స్టార్‌ ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో మాట్లాడుతున్నా.. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఎప్పుడూ ఆయన లే గుర్తుకొస్తుంటాయి.. ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరుస్తుంటే.. అలా కాదు అనాల్సింది అంటూ పవన్‌ కల్యాణ్‌ ఓ సలహా ఇచ్చారు.

ఫ్యాన్స్ కి ఆ సలహా ఎలా అనిపించినా.. ఆయనతో లు తీస్తున్న నిర్మాతలకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ విషయమేంటి.?

బ్రో.. మళ్లీ ఎప్పుడు బ్రో.. అని ఇష్టంగా ఎదురుచూస్తున్న వారికి వచ్చే ఏడాది మార్చిలో అని ఆల్రెడీ ఆన్సర్‌ ఇచ్చేశారు పవర్‌స్టార్‌. హరిహరవీరమల్లు ను వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామని చెప్పేశారు.

ఆల్రెడీ కొన్నాళ్ల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. హరిహరవీరమల్లు సెట్స్ లో ఉండటం చూసి ఓజీ టీమ్‌ కూడా షూటింగ్‌ని స్టార్ట్ చేసేసింది. త్వరలో మా హీరో సెట్స్ కి వచ్చేస్తారంటూ ఓపెన్‌గా చెప్పేసింది.

ఆయన లేని సీన్స్ షూట్‌ చేయడం షురూ చేసింది. ఓజీ కూడా సెట్స్ మీదుందని తెలిసి.. ఓజీ వస్తుంది చూద్దురుగానీ అని గతంలో పవన్‌ అన్న మాటలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్.. పదే పదే ఓజీని గుర్తుచేసుకుంటున్నారు.

రీసెంట్‌ మీటింగ్‌లోనూ జనాలు ఓజీ ఓజీ అంటూ అరవడం మొదలుపెట్టేశారు. దానికి పవర్‌స్టార్‌ ఏమన్నారో తెలుసా.? అదీ మాట. ఓజీ ఓజీ అంటే ఏం వస్తుంది.. భగవన్నామస్మరణ చేసుకోండి. ముందు కడుపు నిండితే.. ఆ తర్వాతే సరదాలు.. లూ అనేశారు పవర్‌స్టార్‌.

ఆయన చెప్పిన సలహాను ఫ్యాన్స్ సిన్సియర్‌గా తీసుకున్నా, మేకర్స్ గుండెలో మాత్రం గుబులు మొదలైంది. సార్‌.. సెట్స్ కి ఎప్పుడు వస్తారా? ల షూటింగులు ఎప్పుడు పూర్తి చేస్తారా? ఎప్పుడు రిలీజులు చూస్తామా? అని వెయిట్‌ చేస్తున్నారు మేకర్స్… మరి పవర్‌స్టార్‌ ప్లానింగ్‌ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.!

కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10 వేలలో ఇవే బెస్ట్‌ ఫోన్స్‌..

Itel color pro 5g: ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 9,490కి లభిస్తోంది. ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో..

ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ కకెపాసిటీ గల బ్యాటరీని అందించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఆఫర్‌ లభిస్తోంది.

realme NARZO N61: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 10,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 8498కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 90 హెచ్‌జెడ్‌తో కూడిన ఐ కంఫర్ట్‌ డిస్‌ప్లేను అందించారు. ఐపీ54 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌ ఈ ఫోన్‌ సొంతం. మీడియాటెక్‌ హీలియో ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Redmi 13C 5G: రూ. 10 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్‌ ఫోన్‌ ఇది. ఈ ఫోన్‌ అమెజాన్‌లో రూ. 8,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందింఆచరు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌ను అందించారు.

Samsung Galaxy M05: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా అమెజాన్‌లో రూ. 7999కి లభిస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

TECNO POP 9 5G: ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48 ఎంపీతో కూడని సోనీ ఏఐ కెమెరాను అందించారు. 5జీ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ NFCకి సపోర్ చేస్తుంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లను అందించారు.

మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!

మెంతి కూరను పోషకాలు పుట్ట అని చెబుతూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మెంతి కూరను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డకోవచ్చు. మెంతికూర తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. మెంతులు, మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. చికెన్, మటన్, కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణ కావడమే కాకుండా.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా సహాయ పడతాయి. వారంలో రెండు, మూడు సార్లు ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. మెంతి కూరను వారంలో రెండు సార్లు అయినా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు అన్నీ మెంతి కూరలో లభిస్తాయి. మెంతి కూర తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మెంతి కూరలో ఉండే పోషకాలు:

క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:

బ్యాడ్ కొలెస్ట్రాల్‌తో బాధ పడేవారు ఖచ్చితంగా మీ డైట్‌లో మెంతి కూర ఉండేలా ప్లాన్ చేసుకోండి. మెంతి కూర తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నగా కరిగి పోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

జీర్ణ సమస్యలు:

మెంతి కూరలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కంట్రోల్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి, మల బద్ధకం, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడకుండా చేస్తుంది.
వెయిట్ లాస్:

బరువు తగ్గాలి అనుకునే వారు కూడా మెంతి కూరను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు బరువును అదుపులో ఉంచుతాయి. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.
డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్‌తో బాధ పడే వారు కూడా మెంతి కూరను ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం మెంతి కూర దివ్యౌషధంగా పని చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చర్మ సమస్యలు అన్నీ కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

‘నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటా..’ పవన్ సంచలన కామెంట్స్

హోంమంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పారు. ఏపీలో జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండదు. రేప్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా? అధికారులు ఏం చేస్తున్నారు.. క్రిమినల్స్‌ను వదిలేయమని చట్టం చెప్తోందా అని ప్రశ్నించారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దని పవన్ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కీలకమైనది. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. మేము ఎవరినీ వెనకేసుకు రావడం లేదు.. మీరు కూడా వెనకేసుకు రావద్దన్నారు పవన్.

హోం మంత్రి అనిత కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. తాను హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వాడిని నేను. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు.. అలాగని చేతగాని ప్రభుత్వం కాదు. అధికారులు అలసత్వం వహిస్తే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కూటమి పార్టీల్లోని నేతల తీరుపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిని ఎవరు చెడగొట్టలేరని, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే తమను ఏమీ చేయలేరన్నారు. తాను, చంద్రబాబు క్లారిటీతో ఉన్నామన్న పవన్ కళ్యాణ్.. ఈ పొత్తు స్థిరమైందని.. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమ పొత్తును దెబ్బతీయలేవన్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.. ఆ పథకం గెలిస్తే రూ.7 కోట్ల ప్రోత్సాహకం

రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. క్రీడలకు ప్రోత్సాహం, క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పల్లెల్లో క్రీడా స్థలాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్ లో గ్రేడ్ 3 కోచ్ ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా…..ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహలు ప్రతిపాదించారు.

పతకాలు సాధించే క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆటలు ఆడేవాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా…దీన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా…..ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ ఫిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పథకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు. అదే విధంగా స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విజయనగరం క్రీడా పాఠశాల గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ లీగ్స్ లో ఏపీ నుండి జట్లు ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నారు. ఏపీకి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయని…మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్ప్రోర్ట్, నేచర్ ఫోటో గ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని…అన్ని ఆటలను ప్రోత్సహించాలని సిఎం అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని…ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని సిఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన విధానాల కారణంగా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారని…వారు ఒలంపిక్స్ లో కూడా సత్తా చాటారని సిఎం అన్నారు. పిపిపి విధానంతో పాటు….స్వచ్చంధంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MLC దువ్వాడ పుట్టినరోజు.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మాధూరి.. ఏంటో తెల్సా

ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తెలు ఆయనకు దూరంగా ఉన్నారు. దివ్వెల మాధురితో కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ విషయంలో ఎవరు ఏమన్నా తగ్గడం లేదు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా దువ్వాడకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు దివ్వెల మాధురి.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రస్తుతం నెట్టింట మంచి ట్రెండింగ్‌లో ఉన్న నేమ్స్. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటూ గత కొన్ని రోజులుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట ప్రవర్తన కాస్త వివాదాస్పదం అయింది కూడా. ఎవరేమన్నా, ఏదేమైనా మా ప్రేమను ఆపలేరు.. మమ్మల్ని విడదీయలేరు అంటూ వారు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం తమ భాగస్వాములతో విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉందని.. అది తేలిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామంటూ కుండబద్దలు కొట్టారు.

తాజాగా దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. దివ్వెల మాధురితో కలిసి… దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఇక దువ్వాడ పుట్టినరోజు సందర్భంగా దివ్వెల మాధురి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన వాచీ అందించారు. ఈ వాచ్ ఖరీదు సుమారుగా రూ.2 లక్షలు వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.

ఇక ఇటీవల ఈ జంట తిరుమల పర్యటన వివాదాస్పదమైంది. అనంతరం తిరు మాఢ వీధుల్లో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. దీంతో విజిలెన్స్‌ అధికారులతో పాటు పలు సంఘాలు ఇద్దరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవిత్రమైన మాఢవీధుల్లో ఫోటో షూట్లు చేయడం, తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి…… 41ఏ నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమల రావాలని ఆదేశించారు.

రియల్‌మీ నుంచి సూపర్బ్‌ ఫోన్‌.. భారత్‌లో ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే

రియల్‌మీ మార్కెట్లోకి కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. ఓవైపు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్న మరోవైపు ప్రీమియం ఫోన్‌లను సైతం లాంచ్‌ చేస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా భారత్‌లోకి రియల్‌మీ జీటీ 7 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి వస్తుండగా తాజాగా కంపెనీ ఈ ఫోన్‌ లాంచింగ్‌ కుసంబంధించి అధికారిక ప్రకటన చేసింది. నవంబర్‌ 26వ తేదీన ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్‌ అవుతోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడ విశేషం. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్లను అందించనున్నారు. ఏమో మోడ్‌ డీబ్లర్‌, ఏఐ టెలిఫొటో అల్ట్రా క్లారిటీ, ఏఐ గేమ్‌ సూపర్‌ రిజల్యూషన్‌ వంటి ఫీచర్లను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఎకో2 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అల్ట్రా సోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.

ఈ ఫోన్‌ను 128, 256, 512, 1టీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో పాటు 8జీబీ, 16జీబీ, 24 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఐపీ68/69 సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశాలుఉన్నాయి

Health

సినిమా