Saturday, November 16, 2024

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లపై కీలక అప్టేడ్..ఇకపై మూడో నెలలో అయినా మొత్తం చెల్లిస్తారు

ఏపీలో సామాజిక పెన్షన్ల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పలు కారణాలతో వరుసగా రెండు నెలలు పెన్షన్‌ తీసుకోలేకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి మొత్తం చెల్లిస్తారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడిన వారికి ఊరట కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల చెల్లింపులో కీలక నిర్ణయం తీసుకుంది. రకరకాల కారణాలతో కి పెన్షన్లు అందించడంలో నిబంధనలు అడ్డంకిగా మారుతుడంటంతో వారికి ఉపశమనం ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా పెన్షనర్ వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి చెల్లించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక పెన్షన్ల చెల్లింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటి వద్ద పెన్షన్ల చెల్లింపుకు అందుబాటులో లేకపోతే మరుసటి నెలలో బకాయితో కలిపి అందుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఒక నెలలో పెన్షన్ తీసుకోపోతే రెండో నెలలో చెల్లిస్తారు. వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోపోతే మూడో నెలలో మొత్తం మూడు నెలల పెన్షన్ అందిస్తారు. ఎవరైనా రెండు నెలలు వరుసగా పెన్షన్ అందుకోకపోతే మూడో నెలల రూ.12వేలు కలిపి చెల్లిస్తారు. డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.

పెన్షన్ల చెల్లింపుపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 2014-19లో కూడా సామాజిక పెన్షన్ల చెల్లింపులో ఈ విధానం ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఏ నెల పెన్షన్ అదే నెలలో తీసుకోవాలని నిబంధన తెచ్చారు. తాజాగా డిసెంబరు నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేం దుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.

నవంబరు నెలలో పెన్షన్‌ అందుకోలేని వారికి డిసెంబరు 1న రెండు నెలల పెన్షన్‌ కలిపి చెల్లిస్తారు. నవంబరు నెలలో దాదాపు 45 వేల మంది వివిధ కారణాలతో పింఛను తీసుకోలేదు. ఏపీలో ప్రస్తుతం 64.14 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లను అందిస్తున్నాయి.

వారికి ఊరట దక్కేనా…

మరోవైపు సామాజిక పెన్షన్ల చెల్లింపులో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను జగన్‌ ప్రభుత్వం మినహాయించింది. అప్కోస్ ద్వారా ద్వారా వేతనాలు అందుకునే వారి కుటుంబ సభ్యుల్ని పెన్షన్ల నుంచి మినహాయించారు. ఇలా దాదాపు మూడు లక్షల మందికి పైగా పెన్షన్లను జగన్ ప్రభుత్వం తొలగించింది. ఏ కుటుంబంలో అయినా ప్రభుత్వం ద్వారా కనీస వేతనం అందుకున్నా వారికి పెన్షన్లు రావని స్పష్టం చేశారు.

గ్రామాల్లో ఉండే వృద్ధులు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయారు. రేషన్ కార్డులను విభజించకపోవడంతో లక్షలాది మంది పెన్షన్లకు దూరం అయ్యారు. కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబీకులకు పెన్షన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. రూ.25వేల లోపు వేతనం ఉన్న వారి కుటుంబ సభ్యులకు పెన్షన్లను చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
అనర్హుల ఏరివేత ఎప్పుడు?

వైసీపీ ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు మంజూరయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం కోటి 48లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కుటుంబాల్లో ఐదారు శాతం మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవు.ప్రధానంగా వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే రేషన్ కార్డులకు దూరం అయ్యారు. ఈ క్రమంలో రాజకీయ పలుకుబడి ఉన్న వారు, వాలంటీర్ల అండతో పెద్ద సంఖ్యలో అక్రమ రేషన్ కార్డులు జారీ అయ్యాయనే ఆరోపణలుఉన్నాయి.

ప్ర‌కాశం జిల్లాలో ఘోరం, విద్యార్థినిపై ట్యూష‌న్ మాస్ట‌ర్ లైంగిక దాడి… పోక్సో కేసు న‌మోదు

ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విద్యార్థినిపై ట్యూష‌న్ మాస్ట‌ర్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్న ట్యూష‌న్ మాస్ట‌ర్‌పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోక్సో కేసు న‌మోదు చేశారు.

ప్రకాశం జిల్లాలో విద్యార్థినిపై ట్యూషన్‌ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో వేట‌పాలెం మండ‌లం ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ట్యూష‌న్‌కు వెళ్లిన విద్యార్థినిపై ట్యూష‌న్ మాస్ట‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్ఐ ఎం. వెంక‌టేశ్వ‌ర్లు ఆదివారం తెలిపారు. చ‌ల్లారెడ్డి పాలెం గ్రామానికి చెంద‌ని ఆవుల వెంక‌ట ప్ర‌సాద్ జాండ్ర పేట హైస్కూల్ దగ్గ‌ర‌లో ట్యూష‌న్ న‌డుపుతున్నాడు. ఈ ట్యూష‌న్‌కి దేశాయి పేట పంచాయ‌తీకి చెందిన ఓ ఆటో డ్రైవ‌ర్ కుమార్తెలు ఇద్ద‌రు వెళ్తుంటారు.

అయితే చిన్న కూతురితో ట్యూష‌న్ మాస్టార్ నెల రోజులుగా అస‌భ్యంగా మాట్లాడుతూ శ‌రీరంపై చేతులు వేస్తూ వేధింస్తున్నాడు. ఆదివారం కూడా ఇలాగే చేస్తూ ఎవ‌రికైనా చెబితే చంపుతాన‌ని బెదిరించాడు. దీంతో బాలిక భ‌యాందోళ‌న‌కు గురైంది. ఏం చేయాలో తెలియ‌క ఈ విష‌యాన్ని త‌న అక్క‌కు, తోటి బాలిక‌ల‌కు తెలిపింది. అంద‌రూ క‌లిసి ట్యూష‌న్ మాస్టార్‌ను నిలదీశారు. ఇంటికి వెళ్లి త‌ల్లిదండ్రుల‌కు జ‌రిగిన విష‌యాన్ని వివ‌రించారు. దీంతో బాలిక తండ్రి వేట‌పాలెం పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ట్యూష‌న్ మాస్టార్ ఆవుల వెంక‌ట ప్ర‌సాద్‌పై పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్ఐ ఎం. వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు.

త‌ల్లి మంద‌లించింద‌ని 20 ఏళ్ల కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పెందుర్తిలో పెందుర్తి గాంధీన‌గ‌ర్‌లో త‌ల్లి మంద‌లించింద‌ని 20 ఏళ్ల కుమారుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మ‌ళ్ల అప్పారావు, రూప దంప‌తుల కుమారుడు భాను ప్ర‌కాష్ (20) చ‌దువు మ‌ధ్య‌లో ఆపేశాడు. పూర్ణా మార్కెట్‌లో పూల దుకాణం నిర్వ‌హిస్తున్న త‌ల్లి రూప‌కు స‌హాయంగా ఉండేవాడు. అయితే ఇటీవ‌ల భాను ప్ర‌కాష్ జులాయిగా తిర‌గ‌డంతో త‌ల్లి త‌ర‌చూ మందలిస్తుండేది.

శ‌నివారం రాత్రి కూడా కుమారుడిని మంద‌లించింది. ఈ నేప‌థ్యంలో గ‌దిలోకి వెళ్లిన భాను ప్ర‌కాస్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేర‌కుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. సీఐ కేవి స‌తీష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌తో త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. మంద‌లించ‌డమే త‌ప్పైందా?, ఇలాంటి ప‌నికి ఒడిగ‌డ‌తాడ‌నుకుంటే మందలించేదాన్నే కాదంటూ తల్లి రోద‌న‌లు మిన్నంటాయి.

కార్తీక మాసంలో ఏం చేస్తే మంచిది.. భ‌క్తుల విశ్వ‌ాసం ఏంటీ?

కార్తీక మాసం హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన‌ది. హ‌రి (విష్ణువు), హ‌రుడు (శివుడు)కి అతి ప్రీతి పాత్ర‌మైన మాసంలో ఉప‌వాస దీక్ష‌లు, నిష్ట‌తో పూజ‌లు, ఆల‌యాల ద‌ర్శ‌నాలు చేస్తే కైలాసాన్ని చేరుకుంటార‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. దేవ‌తాస్నానం చేస్తే యాగ‌ఫ‌లం సిద్ధిస్తుంద‌ని న‌మ్మకం.

కార్తీక మాసంలో.. కార్తీక స్నానం, ఆల‌య ద‌ర్శ‌నం, దాన ధ‌ర్మాలు, ఉప‌వాస దీక్ష‌లు, వ‌న భోజ‌నం, దీపారాధ‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఎలా నిర్వ‌హించాలి? వాటి ఫ‌లితం ఎలా ఉంటుందో శ్రీముఖ‌లింగం అర్చ‌కులు వివ‌రించారు.

ఉప‌వాసం ఎప్పుడు చేయాలి?

ప్ర‌ధానంగా సోమ‌వారాలు, ఏకాద‌శి, శ‌నివారంతో పాటు ఇత‌ర రోజుల్లో కూడా ఈ నెల రోజులు అన్నీ పుణ్య దినాలేన‌ని అర్చకులు చెబుతున్నారు. కార్తీక సోమ‌వారం ఆచ‌రించే వారు మ‌ర‌ణం త‌రువాత కైలాసంలో శివ స‌న్నిధిని చేరుకుంటార‌ని వివరిస్తున్నారు. ఇదే నెల‌లో ఏ సోమ‌వారాన్ని ఆచ‌రించినా వేయి ఆశ్వ‌మేధాల యాగా ఫ‌లాన్ని పొందుతార‌ని అన్నారు.

అందువ‌ల్ల ఈ మాసంలో ఉప‌వాసం చేస్తే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. భ‌క్తులు కార్తీక సోమ‌వారం ప‌గ‌లంతా ఉపవాస దీక్ష‌లో ఉండి, సాయంత్రం శివుడికి అభిషేకం చేస్తారు. మంత్ర జ‌పం తెలియ‌ని వారు, ఉపవాస దీక్ష‌లు చేయ‌లేని వారు నువ్వుల‌ను బ్రాహ్మ‌ణుల‌కు దానం చేస్తే పుణ్యంఫ‌లం క‌లుగుతుంది. ఉప‌వాసం దీక్ష‌లు చేయ‌లేనివారు, ఉద‌యాన్నే స్నానం చేసి, ఆల‌యాల ద‌ర్శ‌నం త‌రువాత మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి రాత్రికి అల్పాహారం తినొచ్చు.
కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి?

కార్తీక మాసంలో న‌దుల్లో స్నానాలు చేస్తే మంచిది. అవ‌కాశం లేనివారు కాలువ‌లు, ఇంటి వ‌ద్ద ప్రాతఃకాల సాన్నాలు చేసి దేవాల‌యాలు సంద‌ర్శిస్తే ఎంతో మంచిది. క‌నీసం కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్క రోజైనా శివుడిని, విష్ణువుని దర్శించుకుంటే మంచింది. అవ‌కావం లేనివారు శుక్ల‌, పాడ్య‌మి, పౌర్ణ‌మి, అమావాస్య దినాల్లో దేవతా స్నానం (వేకువ‌జాము) చేస్తే పుణ్య‌ఫ‌లం క‌లుగుతుంది.

కార్తీక మాసంలో ఇష్ట దైవ‌మైన శివుడు, విష్ణువు త‌దిత‌ర దేవుళ్లుకు పూజ‌లు చేయ‌డం ఎంతో మంచింది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధ‌న చేయ‌డం ఎంతో శ్రేష్టం. అలాగే దీపం కింద భాగం బ్ర‌హ్మ‌గా, స్తంభం విష్ణువు ప్ర‌తిరూపంగా, ప్ర‌మిద‌ను శివునిగా పురాణాల్లో చెబుతారు. న‌దులు, జ‌లాశ‌యాలు, చెరువులు, కాలవ‌ల్లో దీపాలు వ‌ద‌ల‌డం వ‌ల్ల పాపాలు స‌మిసి పోతాయని భ‌క్తులు న‌మ్మ‌కం. కార్తీక మాసంలో రోజూ దీపాలు వ‌ద‌ల‌డం ద్వారా శాంతి, సుఖం, సౌఖ్యం క‌లుగుతుంద‌ని అర్చ‌కులు చెబుతున్నారు.

ఉసిరి చెట్టు ఉన్న తోట‌లో..

బ్ర‌హ్మ ముహూర్తంలో ఉద‌యం నాలుగు గంట‌ల‌కు లేచి, స్నాన‌మాచ‌రించి, సంధ్యోపాస‌న చేసి కార్తీక పురాణం పారాయ‌ణం చేయాలి. అలాగే అన్ని ర‌కాల వృక్షాల‌తో పాటు ఉసిరి చెట్టు ఉన్న తోట‌ల్లో వ‌న భోజ‌నం చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతారు. కార్తీక దామోద‌రుడైన విష్ణుమూర్తి అనుగ్ర‌హం పొంద‌వచ్చు.
అయ్య‌ప్ప మాల‌లు..

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అయ్య‌ప్ప మాల‌లు కూడా ధ‌రిస్తారు. 41 రోజుల దీక్ష‌ అనంత‌రం ఇరిముడితో శ‌బ‌రిమ‌ల వెళ్లి మాల తీస్తారు. క‌న్య స్వాములు (తొలిసారి మాల వేసిన వారు) త‌ప్ప‌ని స‌రిగా శ‌బ‌రిమ‌ల వెళ్తారు. మిగ‌తా స్వాముల్లో అధిక భాగం శ‌బ‌రిమ‌ల వెళ్తారు. అలాగే కొంత మంది స్వాములు ఇరిముడితో ద్వార‌పూడి వెళ్లి అక్క‌డ మాల తీస్తారు. కార్తీక మాసం మొత్తం అయ్య‌ప్ప స్వాములు దీక్ష‌తో పూజలు, దేవ‌తాస్నానాలు, ఉప‌వాసాలు వంటి వాటిని ఆచ‌రిస్తారు.

పర్యాటక రంగంలో మరో అద్భుతం.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌.. 8 కీలక అంశాలు

ఏపీ పర్యాటక రంగంలో మరో అద్భుతం జరగబోతోంది. ఇందుకు బెజవాడ వేదిక కానుంది. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 9న పున్నమిఘాట్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ సర్వీస్‌ నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో మరో అద్బుతాన్ని ఆవిష్కరించబోతోంది. ఇందుకు విజయవాడ వేదిక కానుంది. ఇటీవల జాతీయ స్థాయి డ్రోన్‌ సమిట్‌ నిర్వహించిన ఏపీ సర్కారు.. ఇప్పుడు సీ ప్లేన్‌ ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. సీ ప్లేన్ ప్రయోగానికి సంబంధించిన 8 కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్‌లో విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు.

2.డీ హవిల్లాండ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.

3.విజయవాడ- శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్‌ నడిపేందుకు ఉన్న అవకాశాలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే.. రెగ్యులర్‌ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు.

4.కృష్ణా నదిలో పున్నమి ఘాట్‌ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ జెట్టీకి పర్యాటక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్‌ బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది.

5.శ్రీశైలం లోని పాతాళ గంగ బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న పాత జెట్టీపై దిగేందుకు అధికారులు త్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

6.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నాయి.

7.బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు.

8.ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవంతం అయ్యాక.. రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే.. ఏపీ పర్యాటక రంగానికి మంచి బూస్ట్ అవుతుందని అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ ప్రయోగానికి ఎన్నో ఛాలెంజ్‌లు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

రేపు విజయవాడలో జాబ్ మేళా, రూ.12-35వేల వేతనంతో ఉద్యోగావకాశాలు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్‌డిఎ – సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ “ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు.

ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

నవంబర్ 5 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు వివరించారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాకు తమ రెజ్యూమె- బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Electric Vehicle వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే రిపేర్లు తప్పవు

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చలామణి అవుతున్నాయి. కొత్త టెక్నాలజీతో పాటు స్ట్రాంగ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి గుండె లాంటిది. అంతేగాక అత్యంత ఖరీదైన పార్ట్ కూడా. కాబట్టి కచ్చితంగా బ్యాటరీని సరిగ్గా వాడాలి. ఎలా పడితే అలా వాడితే బ్యాటరీ త్వరగా పాడు కావచ్చు. అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు బ్యాటరీని దెబ్బతీస్తాయి. మీ ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే కొన్ని తప్పులు చేయడం మానేయాలి. మీరు ఈ తప్పులు చేయడం మానేయకపోతే, బ్యాటరీ కచ్చితంగా పాడైపోవచ్చు లేదా బ్యాటరీ లైఫ్ టైమ్ ఈజీగా తగ్గిపోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్ వాడేటప్పుడు మనం చేస్తున్న తప్పులు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్న వారు ఎక్కువగా చేస్తున్న తప్పు ఏంటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్.. కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ వాడతారు. అలా వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుంది. మనకు అర్జెంట్ అయినప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా వేడిని జనరేట్ చేస్తుంది. ఓవర్ హీట్ క్రమంగా బ్యాటరీ పని తీరుని తగ్గిస్తుంది. కాబట్టి మనకు అవసరం అయితే తప్ప ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ని తగ్గించండి. ఎప్పుడైనా కానీ బ్యాటరీని చార్జ్ చేస్తున్నప్పుడు 20:80 రూల్ ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ అయినా, ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే, బ్యాటరీ 20 శాతానికి తగ్గకుండా, 80 శాతానికి మించకుండా చార్జ్ చేయకూడదు. అయితే చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓవర్‌ఛార్జ్‌ కాకుండా ఛార్జింగ్ లిమిట్ ఆప్షన్‌ ని కలిగి ఉంటాయి. కొన్నింటిలో ఈ ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఆ ఆప్షన్ లేకుంటే ఓవర్ చార్జ్ జరిగినప్పుడు బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం జరుగుతుంది.

ఎలక్ట్రిక్ వాహనానికి కచ్చితంగా సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సకాలంలో ఈవీకి సర్వీసింగ్‌ కనుక అందించకపోతే సరిగ్గా పని చేయదు. కాబట్టి కచ్చితంగా సర్వీసింగ్ చేయించండి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ ఈవి బ్యాటరీ సేఫ్ గా ఉంటుంది. బ్యాటరీ సేఫ్ గా ఉంటే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగవు. కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు తగలబడి పోతూ ఉంటాయి. దానికి కారణం బ్యాటరీ విషయంలో చేసే ఈ తప్పులే. కాబట్టి కచ్చితంగా ఇలాంటి తప్పులు చేయకుండా బ్యాటరీ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఈవీని మంచి కండిషన్లో సేఫ్ గా ఉంచుకోండి.

లోకేష్ కథకు ప్రభాస్ ఫిదా..! LCU లో డార్లింగ్ ఎంట్రీ

ఓ సాదా సీదా స్టార్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మొదలు పెట్టి.. బడా హీరోలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు లోకేష్ కనగరాజ్. తీసింది చాలా కొద్దీ సినిమాలే. అయినా సరే ఈ దర్శకుడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లోకేష్ కాన్సెప్ట్స్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు సైతం షేక్ అయ్యారు. ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఓ సెన్సేషన్ అని చెప్పి తీరాల్సిందే. ఖైదీ , విక్రమ్ సినిమాలలో కథను చూపించిన తీరు బట్టి.. ఈ దర్శకుడు వర్క్ ఏంటో ప్రూవ్ అయిపోయింది. ఖైదీ , విక్రమ్ సినిమాలకు లింక్ ఉందని విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో చూపించాడు. దీనితో ఇప్పుడు తర్వాత ఏమౌతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో చాలానే సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి.

కూలి, ఖైదీ 2, విక్రమ్ 2 , రోలెక్స్ లాంటి కిక్ ఇచ్చే ప్రాజెక్ట్స్ రానున్నాయి. దాదాపు వచ్చే ఏడాది ఖైదీ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత రోలెక్స్ మూవీ రాబోతుంది. ఇదంతా సరే.. ఇప్పుడు LCU లో కొత్తగా తెలుగు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ , ప్రభాస్ తో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేశారట మేకర్స్. ఎన్టీఆర్ సంగతి తెలియదు కానీ.. డార్లింగ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అసలే ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా సరే లోకేష్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట డార్లింగ్. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా గతంలో ఓ సారి వెల్లడించారు లోకేష్. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఒకే చెప్పడంతో.. ప్రేక్షకులలో ఎక్కడలేని ఉత్సాహం మొదలైంది. దాదాపు ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ అయితే 2026 ఆఖరి వరకు బిజినే.. ఆపైన ఇంకా సమయం పట్టినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అటు లోకేష్ కూడా అదే తరహాలో బిజీగా ఉన్నాడు. మరి ప్రభాస్ ఫ్రీ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా.. లేక లోకేష్ ఖైదీ , కూలి సినిమాల తర్వాత ఈ సినిమాను తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పైగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయబోతున్నాడట. అసలు ప్రభాస్ కట్ అవుట్ కి.. లోకేష్ మేకింగ్ ని యాడ్ అయితే మాత్రం కచ్చితంగా చరిత్ర సృష్టించినట్లే. ఇప్పటికే ప్రభాస్ చేతిలో గంపెడు ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. వీటిని చూసే ఇండస్ట్రీ అంతా నోటి మీద వేలు వేసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్స్ గురించి ప్రోపర్ అప్డేట్స్ రాకముందే.. ఇప్పుడు ప్రభాస్ మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 10 రోజులు వానలే వానలు.!

నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీ సహా తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్‌ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని IMD ప్రకటించింది.. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

తాజాగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో.. తీర ప్రాంతాల అధికారులు అలర్టయ్యారు. ఇదిలాఉంటే.. తమిళనాడుకు మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 48 గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. మొత్తం 19 జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు1 కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.

మీ ఆయుష్షును 8 ఏళ్లు అధికం చేసే ఆహారాలు ఇవే.. తప్పక తీసుకోండి

కూరగాయల కంటే మాంసాహారం మరింత రుచిగా ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యాన్ని తర్వగా నాశనం చేస్తుంది. అందుకే శాఖా హారులకంటే మాంసాహారుల ఆయుష్షు తక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా కాకుండా సుధీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఈ కింది ఆరు రకాల కూరగాయలు తినాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ వాల్టర్ విల్లెట్ అధ్యయనం ప్రకారం.. మాంసం తినడం రేడియేషన్ లాంటిదని, మాంసాహారుల కంటే శాఖాహారులు ఎనిమిదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించింది.

ముఖ్యంగా ఆహారంలో ఈ 6 రకాల కూరగాయలు తీసుకుంటే దీర్ఘాయువు మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. వీటినే ఉత్తమమైన ఆహారంగా నిపుణులు సైతం చెబుతున్నారు. అవేంటంటే.. పాలకూర, క్యాబేజీ, టర్నిప్ ఆకుకూరలు (ఆకుపచ్చ కూరగాయలు), చార్డ్ (ఆకుపచ్చ కూరగాయలు), కొల్లార్డ్స్ (క్యాబేజీ లాంటి కూరగాయలు), దుంపలు. ఈ ఆకుకూరలు మధుమేహం, కొలెస్ట్రాల్ వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ రాకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

పాలకూరలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఇది కణాలను దెబ్బతీయకుండా కాపాడుతుంది.

టర్నిప్ ఆకులలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉంటాయి. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రక్తహీనత, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

దుంపలు తినడం వల్ల నరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రించే నైట్రేట్ ఇందులో ఉంటుంది. ఇది మీ స్టామినాను మెరుగుపరుస్తుంది. ఇవి మంచి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.

రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం ఎన్ని గంటల తర్వాత తింటే ప్రమాదం

చాలా సార్లు మనం ఫ్రిజ్‌లో ఒక వారం పాటు పండ్లు, కూరగాయలను స్టోర్‌ చేస్తుంటాము. ఎక్కువ కాలం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు, పండ్లు వాటి పోషక విలువలను కోల్పోతాయి. వాటిని తినడం వల్ల మీకు మంచి కంటే హాని ఎక్కువ. కూరగాయలు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉంటుంది. చాలా మంది మిగిలిపోయిన ఆహారం గానీ, ఇతర పదార్థాలు కూడా ఫ్రిజ్‌లోనే ఉంచేస్తున్నారు. ఉప్పుడున్న బిజీ లైఫ్‌లో తాజాగా వండుకునేందుకు సాధ్యం కావడం లేదు. అందుకే వివిధ రకాల పదార్థాలు ముందస్తుగానే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటున్నారు. ఆహారం త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, ఎక్కువ సేపు పాడైపోకుండా ఉండేందుకు చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేసుకుంటున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి ఈ రిఫ్రిజిరేటర్లు ఉపయోగపడుతున్నాయి. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం పాడైపోకుండా కాపాడుతుంది.

కూరగాయలు, పండ్లు పాడవకుండా ఉండటం ద్వారా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కానీ అన్ని ఆహారాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం, పండ్లు, కూరగాయలు ఎంత సమయం తర్వాత తినకూడదో నిపుణులు వివరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వండిన అన్నం 1 రోజులోపు తినడం ఉత్తమం. ఆ తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే అది తక్కువ సమయంలో దాని పోషక విలువలను కోల్పోతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, అన్ని వండిన ఆహార పదార్థాలు కేవలం 6 గంటల పాటు పోషకాహారాన్ని అందిస్తుంది. ఆ తర్వాత దానిలోని పోషకాలు కోల్పోతాయి. అందుకే ఏ పదార్థాలు ఎంత సేపు ఫ్రిజ్‌లో ఉంచాలన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బ్రెడ్‌ ఫ్రిజ్‌లో ఉంచితే..
ఇక మీరు బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే అది తయారు చేసిన 12 నుండి 14 గంటలలోపు తినాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే, అందులో ఉన్న పోషకాలు పోతాయి. ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచిన బ్రెడ్‌ను తిన్నట్లయితే మీకు కడుపు నొప్పి రావచ్చంటున్నారు. మీరు మీ భోజనంలో మిగిలిపోయిన పప్పును చెడిపోకుండా ఉండటానికి మీరు ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, దానిని 2 రోజులలోపు తినండి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన పప్పును 2 రోజుల తర్వాత తింటే, కడుపులో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

చాలా సార్లు మనం ఫ్రిజ్‌లో ఒక వారం పాటు పండ్లు, కూరగాయలను స్టోర్‌ చేస్తుంటాము. ఎక్కువ కాలం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు, పండ్లు వాటి పోషక విలువలను కోల్పోతాయి. వాటిని తినడం వల్ల మీకు మంచి కంటే హాని ఎక్కువ. కూరగాయలు, పండ్లు కోయకుండా 3 నుండి 4 రోజులు ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు తరిగిన పండ్లను ఉంచినట్లయితే కేవలం 6 గంటలలోపు తినాలి. లేకుంటే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బియ్యం, పప్పు, రోటీ లేదా రోటీ పిండి వంటి ఏదైనా రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత అన్ని వస్తువులను పూర్తిగా పాత్రతో కప్పి, వండిన ఆహారాన్ని 24 గంటల్లోపు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ మొబైల్‌లో డేటా వేగంగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్‌ మార్చండి

ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారు. కానీ ఇంటర్నెట్ లేకుండా ఎవ్వరు కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఫోన్‌లో ఇంటర్నెట్‌ లేకుంటే కేవలం కాల్స్‌ మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఫోన్‌లో వీడియోలను చూడలేరు. అయితే కొందరి ఫోన్‌లలో డేటా త్వరగా అయిపోతుంటుంది..

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం వేగంగా పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెలికాం కంపెనీలు కూడా డేటా ప్యాకేజీలపై ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. మొబైల్‌లో డేటా లేనివారంటూ ఉండటం లేదు. కానీ కొందరి మొబైల్‌లలో డేటా త్వరగా అయిపోతుంటుంది. కొన్ని సెట్టింగ్స్‌ను మారిస్తే డేటా త్వరగా అయిపోకుండా ఉంటుంది.

డేటా సేవర్: ఫోన్‌లోని డేటాను నియంత్రించడానికి, ఫోన్ బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. దీని తర్వాత డేటా సేవర్ లేదా సేవ్ డేటా మోడ్‌ను ఆన్ చేయండి.

పిక్చర్ సెట్టింగ్ ఆఫ్: దీని తర్వాత బ్రౌజర్ సెట్టింగ్‌లలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఎంపికను ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల వెబ్ పేజీ ఫోటోను డౌన్‌లోడ్ చేయడానికి సమయం పడుతుంది. కానీ డేటా వినియోగం తగ్గుతుంది. బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

డేటా కంట్రోల్: స్మార్ట్‌ఫోన్‌లో డేటా వినియోగాన్ని నియంత్రించడానికి మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. దీని తర్వాత నెట్‌వర్క్, ఇంటర్నెట్ ఎంపికకు వెళ్లండి. మొబైల్ నెట్‌వర్క్‌కి వెళ్లి తక్కువ డేటా వినియోగ ఎంపికను ఎంచుకోండి. ఇది డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫోన్‌లోని డేటాను నియంత్రించడానికి మరో సెట్టింగ్‌ను చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. దీని తర్వాత మీరు సెర్చ్‌లో యాప్ కోసం సెర్చ్ చేసి, ఆపై యాప్ ఆప్షన్‌లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లకు వెళ్లి యాప్‌ను క్లోజ్ చేయాలి.

ఆటో ప్లే వీడియోను ఆఫ్ చేయండి: ముందుగా మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై డేటా సేవర్ మోడ్‌ను సెర్చ్ చేయాలి. దీని తర్వాత ఆటో ప్లే వీడియో ఎంపికను ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో వీడియోను స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో ప్లే కాదు. చాలా ఫోన్‌లలో యాప్ అప్‌డేట్ ఆటో మోడ్‌లో పనిచేస్తుంది. ఈ ఎంపికను కూడా ఆఫ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్ అప్‌డేట్ ఆప్షన్‌కు వెళ్లి ఆటో అప్‌డేట్‌ను ఆఫ్ చేయండి.

మీ కారు మైలేజీ ఎక్కువగా రావాలా? అయితే ఈ పొరపాట్లు చేయకండి!

కొన్ని చిన్న పొరపాట్లు కూడా మీ వాహనం మైలేజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కారు డ్రైవింగ్‌పై పూర్తి క్లారిటీ ఉండటం ముఖ్యం. ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తే మైలేజీ కూడా తక్కువగా ఇస్తుంది. మీ కారు మైలేజీని పెంచడానికి, పొరపాట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఈ చిట్కాలను పాటించండి..

కారు, బైక్, ఏ రకం వాహనం కొనుగోలు చేసినా ముందుగా మనం ఆలోచించేది మైలేజీ గురించి. మంచి మైలేజీ, భద్రత వాహనం అత్యంత ముఖ్యమైనవి. కొన్ని కార్లు మంచి మైలేజీని ఇస్తాయని కంపెనీ వారు చెబుతున్నప్పటికీ అవి వాడే విధానాన్ని బట్టి మైలేజ్ ఉంటుందని గుర్తించుకోవాలి. ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే మైలేజీ ఇవ్వవని గుర్తించుకోండి. కారు మైలేజీని పెంచడానికి సరైన విధానం, డ్రైవింగ్ చాలా ముఖ్యమైనవి. కొన్ని చిన్న పొరపాట్లు కూడా మీ వాహనం మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కారు డ్రైవింగ్ విషయంలో పూర్తి క్లారిటీ ఉండటం ముఖ్యం.

వాహనం నడిపే విధానంలో మార్పు ఉంటే మైలేజీ తక్కువగా ఇస్తుంది. అంతేకాదు ఇంధనం ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీ కారు మైలేజీని పెంచడానికి, పొరపాట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు పాటించండి.

సమయానికి సర్వీసింగ్‌: ఇంజిన్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయడం మంచిది. ఇలా సమయానుకూలంగా వాహనం సర్వీసింగ్‌ చేయడం వల్ల మంచి మైలేజీ ఇస్తుంది. సర్వీసింగ్‌లో జాప్యం ఇంజిన్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఇంధన వినియోగం పెరుగుతుంది. అందుకే సమయానికి సర్వీసింగ్‌ చేయడం, వాహనంలో అన్ని పార్ట్స్‌ను చెక్‌ చేయించడం తప్పనిసరి.
టైర్ నిర్వహణ: టైర్‌లోని గాలి పరిమాణం చాలా ముఖ్యం. టైర్‌లో గాలి తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఒత్తిడి టైర్‌ను నెమ్మదిస్తుంది. తక్కువ లేదా అధిక టైర్ ఒత్తిడి ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. దీంతో మైలేజీ కూడా తగ్గుతుంది.
స్మూత్ డ్రైవింగ్: కారును సగటు వేగంతో నడపడం చాలా ముఖ్యం. ఓవర్ స్పీడ్, సడన్‌ బ్రేకింగ్ వంటి క్రమరహిత డ్రైవింగ్ ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. దీని కారణంగా కూడా మైలేజీని తగ్గిస్తుంది.
కారులో అనవసరమైన బరువు: కారు బరువు తక్కువగా ఉంటే, దానికి తక్కువ శక్తి అవసరం. ఇది మైలేజీని పెంచుతుంది. అనవసరమైన వస్తువులను తీసుకెళ్లడం వల్ల కారు బరువు పెరుగుతుంది. అలాగే కారులో ప్రయాణించేవారికంటే ఎక్కువ మంది ఉంటే కూడా మైలేజీ తక్కువ ఇస్తుంది. ఇలాంటివి ఇంజిన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతాయి.
సరైన గేర్‌ని ఉపయోగించండి: సరైన గేర్‌లో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్ RPM అదుపులో ఉంటుంది. ఇది ఇంధన వినియోగం తగ్గిస్తుంది. తప్పుడు గేర్‌లో నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంధన వినియోగం పెరుగుతుంది.
AC వినియోగం: అవసరం లేనప్పుడు AC స్విచ్ ఆఫ్ చేయండి. ఇది ఇంధన వినియోగం తగ్గిస్తుంది. ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. ఇది మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
కారు వేగాన్ని నియంత్రించండి: గంటకు 50-60 కి.మీ వేగంతో నడపడం వల్ల ఎక్కువ మైలేజీ వస్తుంది. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వలన అధిక ఇంధన వినియోగం, మైలేజీ తగ్గుతుంది.
ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు. ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. చిన్న పొరపాటు మైలేజీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా, సరిగ్గా డ్రైవ్ చేయండి.

బాలీవుడ్‌పై ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ కామెంట్స్.. వారిని తొక్కేస్తున్నారంటూ.

దక్షిణాదిలో త‌మిళం, తెలుగు, క‌న్నడ‌తో పాటు మ‌ల‌యాళం చిత్ర ప‌రిశ్రమ‌లు అభివృద్ధి చెందుతున్నాయని… ఉత్తరాదిలో కేవలం బాలీవుడ్ ఆధిపత్యం నడుస్తోందని ఆరోపించారు.

బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ అధిపత్యంపై నిప్పులు చెరిగారు. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను తొక్కేసి.. కేవలం హిందీ సినిమాలకు మాత్రమే ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇది భారతీయ సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదన్నారు. దక్షిణాదిలో త‌మిళం, తెలుగు, క‌న్నడ‌తో పాటు మ‌ల‌యాళం చిత్ర ప‌రిశ్రమ‌లు అభివృద్ధి చెందుతున్నాయని… ఉత్తరాదిలో కేవలం బాలీవుడ్ ఆధిపత్యం నడుస్తోందని ఆరోపించారు.

ఇతర భాషలైన మ‌రాఠీ, బిహారి, భోజపురి, హర్యానా, గుజరాత్ భాషల సినిమాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ తొక్కేస్తుందని మండిపడ్డారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు కనీసం సొంత చిత్ర పరిశ్రమలే లేవని.. ఈ స్థానంలో హిందీ సినిమాలకు ప్రాధాన్యత ఎక్కువైందన్నారు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలం అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశాలు ఉన్నాయన్నారు.

మరోవైపు హిందీ భాషకు తమిళనాడు ఏ మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఉదయనిధి స్టాలిన్.. తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. బలవంతంగా భాషను రుద్దడానికి వ్యతిరేకంగానే ద్రవిడ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. జాతీయవాదం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతం చేశారని అందుకే వారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని అన్నారు. 1930ల్లో, 1960ల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కొందరు ‘జాతీయవాదులు’ ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.

మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్‌ 4) విడుదలకానున్నాయి. ఈ రోజు మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేయనున్నారు.

గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 2వ తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సిఉండగా.. తుది కీ విడుదలలో జాప్యం చోటు చేసుకోవడం వల్ల ఫలితాల వెల్లడి వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం టెట్‌ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ వెల్లడైన విషయం తెలిసిందే.

కాగా ఏపీ టెట్‌ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28% మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్‌ మార్కులకు డీఎస్సీ పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌ స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్‌ ఫలితాల కోసం అభ్యర్ధులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

టెట్‌ ఉత్తీర్ణత శాతం కమ్యూనిటీ వారీగా వేరువేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఓసీ(జనరల్‌) కేటగిరీలో 60 శాతం మార్కులు ఆపైన వస్తే ఉత్తీర్ణత పొందినట్లు అవుతుంది. ఇక బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ సర్వీస్‌మెన్‌ కేటగిరీలో 40 శాతం మార్కులు ఆపైన మార్కులు పొందిన వారు మాత్రమే టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తారు.

గేట్‌ 2025 దరఖాస్తులో మార్పులకు అప్లికేషన్‌ విండో ఓపెన్‌.. ఇంతకీ పరీక్ష ఎప్పుడంటే

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది.

గేట్‌ దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు చోటు చేసుకుని ఉంటే అటువంటి వారు తమ వివరాలు సవరించు కోవడానికి అవకాశం లభించింది. ఈ మేరకు దరఖాస్తు సవరణ చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ వెల్లడించింది. నిర్ణీత ఫీజు చెల్లించి అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఎగ్జామ్‌ సిటీ, జెండర్‌ తదితర విషయాల్లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం నవంబర్‌ 10వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ముగింపు సమయంలోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఐటీ రూర్కీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా గేట్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 11వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే గేట్‌ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు నేరుగా కల్పిస్తాయి.

గేట్‌ 2025 దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

నవంబర్‌ 19, 20 తేదీల్లో సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 5, వీఆర్వో-గ్రేడ్‌ 1, 2, ఇతర ఉద్యోగులకు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని నవంబరు 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా ఓ ప్రకటన జారీచేసింది.

నవంబర్‌ 9వ తేదీన ఐబీపీఎస్‌ ఎస్‌వో ప్రిలిమ్స్‌ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్‌-XIV) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్‌ అడ్మిట్‌కార్డులను IBPS విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి, అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నవంబర్‌ 9వ తేదీన ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబరులో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 896 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ నవంబర్‌ 2024) నోటిఫికేషన్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌ సర్కార్.. ఆ మేరకు ఈ ఏడాది రెండో సారి టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. ఈ ఏడాది ఇచ్చిన తొలి టెట్‌ నోటిఫికేసన్‌కు సంబంధించి మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని ఆగస్టులో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ఏడాది ఇవ్వనున్న రెండో టెట్‌కు జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే జరిగిన టెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల మంది అభ్యర్ధులు హజరయ్యారు. వారిలో 1.09 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. అయితే ఇటీవల డీఎస్‌సీ నియామక ప్రక్రియ పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టెట్‌కు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నందున కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు బుక్‌ చేసుకోవల్సి ఉంటుంది. అందువల్ల జనవరిలో సంక్రాంతికి ముందా? ఆ తర్వాతా? అన్నది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.

కాగా టెట్‌ పేపర్‌ 1 పరీక్షకు డీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే వివిధ పాఠశాలల్లో ఎస్జీటీలు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలని హుకూం జారీ చేయడంతో వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు 9 సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరిలో 10వ సారి పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని 6 సార్లు టెట్‌ పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తోంది. అయితే ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్షలు జరిపినా డీఎస్సీలో అరకొర పోస్టులతో ప్రకటనలు ఇవ్వడం అభ్యర్ధులను నిరాశకు గురి చేస్తుంది. దీనిపై రాష్ట్ర సర్కార్‌ దృష్టి సారిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్‌కు భారీ షాక్.. సెర్చ్ ఇంజిన్‌గా చాట్ జీపీటీ

ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని గూగుల్‌తో ప్రత్యక్ష పోటీలో ఉంచుతుంది. అలాగే , స్పోర్ట్స్ స్కోర్‌లు, ఇతర సమయానుకూల సమాచారాన్ని కోరుకునే ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జిపిటి చెల్లింపు వినియోగదారులకు సెర్చ్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

అయితే చివరికి దీనిని చాట్‌జిపిటి వినియోగదారులందరికీ విస్తరింపజేస్తామని తెలిపింది. ఇప్పటికే స్మాల్ గ్రూప్ వినియోగదారులు, పబ్లిషర్స్‌కు జూలైలో ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేసింది. 2022లో విడుదలైన చాట్ జీపీటీకు సంబంధించిన అసలైన సంస్కరణ, ఆన్‌లైన్ టెక్స్ట్‌లకు సంబంధించిన భారీ ట్రోవ్‌లపై శిక్షణ పొందింది. అయితే దాని శిక్షణ డేటాలో లేని తాజా ఈవెంట్‌ల గురించిన ప్రశ్నలకు ప్రతిస్పందించలేకపోయింది.

ఏఐ రూపొందించిన రాతపూర్వక సారాంశాలతో గూగుల్ మేలో దాని సెర్చ్ ఇంజిన్‌ను మెరుగుపరిచింది. ఇప్పుడు శోధన ఫలితాల ఎగువన తరచుగా కనిపిస్తుంది. సారాంశాలు వినియోగదారుడికి సంబంధించిన సెర్చ్ క్వశ్చన్‌కు త్వరగా సమాధానం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా వారు మరింత సమాచారం కోసం లింక్‌ను క్లిక్ చేసి మరొక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. గూగుల్‌కు సంబంధించిన మేక్ఓవర్ వినియోగదారులకు స్మాల్ గ్రూప్స్‌కు ఒక సంవత్సరం పరీక్ష తర్వాత వచ్చింది. అయితే చాట్ జీపీటీ గూగుల్ అంత అక్యూరేట్‌గా ఫలితాలను చూపించడం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ప్రొఫెషనల్ జర్నలిస్టులు సేకరించిన వార్తలను వారి చాట్‌బాట్‌లు అందించాలని ఏఐ కంపెనీలు చేసిన పివోట్ కొన్ని వార్తా మీడియా సంస్థలను అప్రమత్తం చేసింది. కాపీరైట్ ఉల్లంఘన కోసం ఓపెన్ ఏఐ, దాని వ్యాపార భాగస్వామి మైక్రో సాఫ్ట్‌పై దావా వేసిన అనేక వార్తా కేంద్రాల్లో న్యూయార్క్ టైమ్స్ ఒకటి. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ పబ్లిషర్ న్యూస్ కార్ప్ అక్టోబరులో మరో ఏఐ సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీపై దావా వేసింది. అసోసియేటెడ్ ప్రెస్, న్యూస్ కార్ప్‌తో సహా వార్తా భాగస్వాముల సహాయంతో దాని కొత్త సెర్చ్ ఇంజన్ నిర్మించామని ఓపెన్ ఏఐ ఇటీవల ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇది , బ్లాగ్ పోస్ట్‌ల వంటి మూలాలకు లింక్‌లను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. చాట్‌బాట్ అందించిన సమాచారానికి అసలు మూలానికి లింక్‌లు సరిపోతాయో లేదో స్పష్టంగా తెలియరాలేదు.

మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ (DSC Notification) మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనుంది.

ఇప్పటికే నవంబరు 6వ తేదీన ఉద్యోగ ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ ప్రటకన విడుదల చేసింది. ఆ లోపు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి. ఇక టెట్‌ ఫలితాలు ఈ రోజు మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదగా వెలువడనున్నాయి. దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు ఈ సారి టెట్‌కు హాజరయ్యారు. ఎంత మంది ఉత్తీర్ణత పొందుతారనేది వేచి చూడాలి. ఇక జగన్‌ సర్కార్ హయాంలో జరిగిన టెట్‌ పరీక్షతో పోల్చితే ఇటీవల జరిగిన టెట్ పరీక్షలు మరింత కఠినంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత మంది ఉత్తీర్ణత సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.

టెట్‌ ఫలితాలు వచ్చాక 2వ రోజే డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నవంబర్‌ 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్‌ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. నోటిఫికేషన్‌ వెలువడిన 4 నెలల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు: 543
విజయనగరం జిల్లాలో పోస్టులు: 583
విశాఖపట్నం జిల్లాలో పోస్టులు: 1,134
తూర్పుగోదావరి జిల్లాలో పోస్టులు: 1,346
పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టులు: 1,067
కృష్ణా జిల్లాలో పోస్టులు: 1,213
గుంటూరు జిల్లాలో పోస్టులు: 1,159
ప్రకాశం జిల్లాలో పోస్టులు: 672
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోస్టులు: 673
చిత్తూరు జిల్లాలో పోస్టులు: 1,478
వైఎస్సార్‌ కడప జిల్లాలో పోస్టులు: 709
అనంతపురం జిల్లాలో పోస్టులు: 811
కర్నూలు జిల్లాలో పోస్టులు: 2,678

వీటితో పాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..

నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం చోటుచేసుకుంది. రామాంజనేయులు అనే మోసగాడు క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేసి మోసం చేశాడు.

కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 300 పైగా బాధితులు ఉన్నారు. ఈ మోసగాన్ని 45 రోజులుగా డోన్ పోలీసులు విచారణ పేరుతో నిందితుడిని తమ అదుపులో ఉంచుకొని విచారణ చేసిన ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాము పెట్టుబడులు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.

రామాంజనేయులు డోన్‌లో 2021 నుండి కేవలం ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయమై అందరిని నమ్మించిన కేటుగాడు, కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని 300 మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. గతంలో అనంతపురంలో రూ.90 లక్షలకు పైగా ప్రజల నుండి వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తుంది. మోసగాడు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు వస్తున్నాయని లక్షకు నెలకు పదివేల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తానని నమ్మించి బాధితుల నుండి దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేశాడు.

ఈ నెల 16న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం

మంత్రి వీఎన్ వాసవన్ చేసినట్లు తెలిపారు. వార్షిక పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తుది దశ ఏర్పాట్లను పరిశీలించిందని చెప్పారు. తీర్థయాత్ర సందర్భంగా శబరిమలలో 13,600 మంది పోలీసు అధికారులు, 2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించనున్నారు. యాత్రికులు చేరుకునే అన్ని ప్రాంతాలకు సరిపడా తాగునీటి సరఫరా అయ్యేలా జలమండలి విస్తృత ఏర్పాట్లు చేసింది.

పంబ, అప్పాచిమేడు, సన్నిధానం, సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్డియాలజీ చికిత్స సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఎవరైనా అనుకోని విధంగా పాము కాటుకు గురైతే వారికి యాంటీ-వెనమ్ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో 1,500 మంది ఎకో-గార్డులు, ఏనుగు స్క్వాడ్‌లను కూడా నియమించనున్నారు. గత ఏడాది 15 లక్షల మందికి అన్నదానం (ఉచిత భోజనం) అందించగా.. ఈ ఏడాది 20 లక్షల మంది అయ్యప్ప భక్తులకు సన్నిధానంలో అన్నదానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

అయ్యప్ప ఆలయంతో పాటు కేరళలోని దక్షిణ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, రెండు నెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో… శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.

సిప్‌లో రూ.1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటి రూపాయల రాబడి

దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక గొప్ప ఎంపిక. ఇతర మ్యూచువల్ ఫండ్‌లతో పోలిస్తే కస్టమర్‌లు పెట్టుబడి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిప్‌ ఉత్తమ అంశం.

మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా సమయం గురించి చింతించకుండా క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి SIP మిమ్మల్ని అనుమతిస్తుంది. సిప్‌ పద్ధతి ప్రతి నెలా మీ ఖాతా నుండి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేయడం. మీరు ఈ మొత్తాన్ని ఎప్పుడైనా మార్చవచ్చు. సిప్‌కి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డబ్బు స్వయంచాలకంగా డెబిట్ అవుతుంది.

సిప్‌ ప్రత్యేకత ఏమిటంటే మీరు రూ.100 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సిప్‌లు రూ.100 నుండి వివిధ మొత్తాలలో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని SIPలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మంచి రాబడిని అందుకోవచ్చు.

ప్రతి నెలా 1000 రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యక్తి దీర్ఘకాలిక పెట్టుబడి అయితే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు పొదుపు చేయవచ్చు.రూ.1000, రూ.3000, రూ.5000 SIPలు మీకు కాలక్రమేణా కోటి వరకు పొదుపు చేస్తాయి. సాధారణంగా దాదాపు అందరికీ రూ.1000 SIP ఉంటుంది. అందుకే మీరు 1 కోటి రూపాయలను ఎన్ని సంవత్సరాలు ఆదా చేయగలరో చూద్దాం.

మీరు 35 సంవత్సరాల వ్యవధిలో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెట్టి, 14% వడ్డీని పొందినట్లయితే, మీరు రూ. 1.12 కోట్లు ఆదా చేయవచ్చు. గత సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా ఆర్జించిన ఆదాయ అంచనాల ఆధారంగా ఈ మొత్తం లెక్కిస్తారు. ఒక వ్యక్తి 35 ఏళ్లలో మొత్తం రూ.4,20,000 పెట్టుబడి పెడతారు. కానీ చక్రవడ్డీని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు పొందిన మొత్తం రూ.1,08,12,486. మీ చేతికి అందే మొత్తం రూ.1,12,32,486 అవుతుంది.

నెలకు రూ.3,000 పెట్టుబడి పెట్టే వ్యక్తి కేవలం 27 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించవచ్చు. మీరు మీ పెట్టుబడిపై 14 శాతం రాబడిని పొందినట్లయితే 99,19,599 వడ్డీ అవుతుంది. మొత్తం పెట్టుబడి రూ.9,72,000. ఈ విధంగా మొత్తం 1,08,91,599 అందుకోవచ్చు.

అలాగే ఇప్పుడు మీరు రూ.5,000 సంపాదిస్తే 23 ఏళ్లలో లక్షాధికారి అవుతారు. రూ. 5000 పెట్టుబడి 23 సంవత్సరాల తర్వాత రూ.13,80,000 అవుతుంది. ఆపై మీ 14% వడ్డీ రూ.88,37,524 అవుతుంది. మీరు 23 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 1,02,17,524 పొందుతారు. ఇలా మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌, మెచ్యూరిటీ ఆధారంగా రాబడి పొందుతారు.

మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవాలని ఉందా.? ఏఐతో సాధ్యమే

పుట్టుక, చావు.. ఈ రెండు ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. మీ పుట్టిన తేదీ ఎప్పుడంటే మీ దగ్గర సమాధానం ఉంటుండొచ్చు కానీ మీరు ఎప్పుడు చనిపోతారన్న దానికి మాత్రం సమాధానం ఎవరి దగ్గర ఉండదు.

అయితే ప్రస్తుత ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో అది కూడా సాధ్యమే అని నిపుణులు అంటున్నారు.

మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా చెప్పేసే టెక్నాలజీ వచ్చేస్తోంది. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఖాయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. సైన్స్ భాషలో, ఈ టెక్నాలజీని AI డెత్ కాలిక్యులేటర్‌గా పిలుస్తున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

లాన్సెట్‌ డిజిటల్ హెల్త్ ప్రచురించిన ఈ అధ్యయనంలో AI డెత్ కాలిక్యులేటర్ గురించి ప్రస్తావించారు. AI సహాయంతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు అని ఇందులో పేర్కొన్నారు. ఈ కాలిక్యులేటర్ ట్రయల్‌ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన రెండు ఆసుపత్రుల్లో త్వరలోనే ప్రారంభించనున్నారని పరిశోధకులు తెలిపారు. ఇక ఇక ఏఐ డెత్ కాలిక్యుటేలర్‌ అసలు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్.

ఇది మీ గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది. మీ గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఎప్పుడు ఆగిపోతుందో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్‌ చెబుతుందన్నమాట. అంటే మీకు సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న విషయాన్ని ఇది అంచనా వేయగలుగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆసుపత్రుల్లో వేలాది మంది ఈ ట్రయల్‌లో పాల్గొంటున్నారు. ప్రజలు దీనికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులు సులభంగా గుర్తించలేని వ్యాధుల గురించి కూడా ఈ AI డెత్ కాలిక్యులేటర్ చెబుతోంది.

ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఈ కాలిక్యులేటర్ 78 శాతం కరెక్ట్‌గా చెబుతోంది. ఈ AI డెత్ కాలిక్యులేటర్‌ను రూపొందిస్తున్న సంస్థ.. 11.60 లక్షల మంది రోగులకు ECG రిపోర్ట్‌లను సేకరించింది. వీటిని విశ్లేషించడం ద్వారా వారి గుండె ఎపపుడు ఆగిపోతుందన్న వివరాలను ప్రచురించారు.

భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్‌ ఏంటి

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉండగా, అందులో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి.

ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. ఈ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద భార్యాభర్తలిద్దరూ విడివిడిగా రూ.6000 ప్రయోజనం పొందవచ్చా? నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రజల కోసం వివిధ పథకాలను రూపొందించింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలో రైతుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం రైతుల కోసం కూడా పథకాలు తీసుకువస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు రూ.2000 చొప్పున మూడు విడతలు అందిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 13 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే భార్యాభర్తలిద్దరూ ఈ పథకాన్ని పొందలేరు.

భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిషన్ యోజన కింద ఒక రైతు కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే పథకం కింద ప్రయోజనాలు అందుతాయి. ఆ నియమం ప్రకారం, భార్యాభర్తలు ఒకే కుటుంబానికి చెందినవారు. అటువంటి పరిస్థితిలో ఇద్దరికి ప్రయోజనం ఉండదు. ఒకరు మాత్రం ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా, ఇద్దరు సోదరులు ఒకే కుటుంబంలో నివసిస్తుంటే వారిలో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అయితే అన్నదమ్ములిద్దరూ విడివిడిగా నివసిస్తుంటే, అలాగే వేరువేరు కుటుంబాలు కలిగి ఉంటే ఇద్దరూ వేర్వేరు ప్రయోజనాలను పొందవచ్చు.

ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు, వారి పేరు మీద సాగు భూమి ఉన్నవారు ప్రయోజనాలకు అర్హులు. అలాగే 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద పేద రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జిలేబి తినాలని ఉందా.? ఇంట్లోనే రుచికరంగా తయారు చేసుకోండిలా

జిలేబి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, 1 టేబుల్‌ స్పూన్‌ శనగ పిండి, 1 కప్పు తాజా పెరుగు, 1 కప్పు చక్కెర, 4 కప్పుల నీళ్లు, ఒక కప్పు నెయ్యి

ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టౌవ్‌ మీద పాన్‌ పెట్టి పంచదార వేయాలి.

పంచదారలో నీరు పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ వేడి చెయ్యాలి. దీంట్లోకి అవసరమైతే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఫుడ్‌ కలర్‌ కలపడం వల్ల అచ్చంగా మార్కెట్లో దొరికే జిలేబిల్లా వస్తాయి.

తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్‌ కవర్‌లో నింపి నెమ్మదిగా జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేయాలి.

రెండు వైపుల గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేగించాలి. చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.

మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా? ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి!

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం చాలా పెరిగింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు నగరాలతో పాటు గ్రామాలలో కూడా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.

మీరు క్రెడిట్ కార్డ్‌లో ఎక్కువ లావాదేవీలు చేస్తే, ఎక్కువ రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్ పొందుతారు. అందుకే చాలా మంది తమ క్రెడిట్ కార్డ్‌లను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే క్రెడిట్ కార్డ్ వాడటంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తప్పులు చేయకూడదు? తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డుతో ఎప్పుడూ నగదు తీసుకోకండి:

మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నుండి డబ్బు తీసుకోవచ్చు. ఇది చాలా మంచి సదుపాయం అని బ్యాంకు చెబుతోంది. కానీ మీరు క్రెడిట్ కార్డ్ సహాయంతో ATM నుండి డబ్బు విత్ డ్రా చేసుకుంటే, మొదటి రోజు నుండే 2.5 నుండి 3.5 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అంటే మీరు విత్‌డ్రా చేసుకునే డబ్బుపై సంవత్సరానికి 30 నుంచి 42 శాతం వడ్డీని వసూలు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ బిల్లును చెల్లించడానికి మీకు ఒక నెల సమయం ఇస్తారు. కానీ ఈ సమయం తర్వాత మీరు గడువు తేదీ ముగిసినప్పుడు వడ్డీని చెల్లించాలి. మరోవైపు, మీరు క్రెడిట్ కార్డ్ సహాయంతో విత్‌డ్రా చేసుకునే డబ్బుపై మొదటి రోజు నుంచే వడ్డీని చెల్లించాలి.

అంతర్జాతీయ లావాదేవీలు ఖరీదైనవి:

విదేశాల్లో కూడా క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. చాలా మంది క్రెడిట్ కార్డ్ ఈ ఫీచర్ చాలా మంచిదని భావిస్తారు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా విదేశాల్లో బిల్లు చెల్లిస్తే ట్రాన్సిషన్ ఛార్జీ చెల్లించాలి. మీరు విదేశాల్లో క్రెడిట్ కార్డుకు బదులుగా ప్రీపెయిడ్ కార్డును ఉపయోగించాలి.

బ్యాలెన్స్ బదిలీల కోసం..

అనేక క్రెడిట్ కార్డులు బ్యాలెన్స్ బదిలీ ఎంపికను అందిస్తాయి. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఒక క్రెడిట్ కార్డ్ బిల్లును మరొక క్రెడిట్ కార్డ్ సహాయంతో చెల్లించవచ్చు. కానీ ఈ బ్యాలెన్స్ బదిలీ సౌకర్యం ఉచితం కాదు. ఈ ఫీచర్ కోసం బ్యాంక్ రుసుము వసూలు చేస్తుంది. ఇది మీకు భారీ నష్టాలను కలిగిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో బ్యాలెన్స్ బదిలీ ఎంపికను ఉపయోగించడంలో ఎటువంటి సమస్య లేదు. కానీ మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగించిన ప్రతిసారీ మీరు రుసుముగా చాలా డబ్బు చెల్లించవలసి ఉంటుంది.

ట్రెండింగ్‌ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. లక్షల్లో ఆదాయం పక్కా..

పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. తాము ఆదాయం పొందుతూనే మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఆశిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో చాలా మంది వ్యాపారం మొదలు పెట్టాలనే ఆసక్తి ఉన్నా..

వెనుకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలాంటి కాంపిటేషన్‌ లేని ఒక క్రేజీ బిజినెష్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో బీఎస్‌6 వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాహనాల్లో డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్లూయిడ్‌ (DEF)ను ఉపయోగించాల్సి ఉంటుంది. పొల్యుషన్‌ను తగ్గించేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఆటో మొబైల్ షాప్స్‌లో ఈ డీఈఎఫ్‌లు 10 లీటర్ల బాటిల్స్‌ చొప్పున అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా పొల్యుషన్‌ తగ్గడంతో పాటు ఇంజన్‌ను కాపాడుతాయి. ఈ డీఈఎఫ్‌ను తయారు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

ఈ ఫ్లూయిడ్‌ను తయారు చేయడానికి నీటితో పాటు, టెక్నికల్ గ్రేడ్‌ యూరియా అవసరపడుతుంది. ఇక ఆర్‌ఓ మిషిన్‌ అవసరం ఉంటుంది. ఆర్‌ఓ మిషన్‌ ద్వారా తయారు చేసిన నీటిని.. డీఎమ్‌ ప్లాంట్ అనే మిషిన్‌లో పోయాలి. వెంటనే డీఎమ్‌ వాటర్‌ బయటకు వస్తాయి. ఇక చివరిగా ఈ డీఎమ్‌ నీటిని డీఈఎఫ్‌ మిషిన్‌లో వేసి.. టెక్నికల్‌ గ్రేడ్ యూరియాను వేసి కలపాలి. ఒక గంటపాటు ప్రాసెస్‌ జరిగిన తర్వాత డీఈఎఫ్‌ బయటకు వస్తుంది. వీటిని క్యాన్స్‌లో నింపి ఆటో మొబైల్‌ దుకాణాలకు అందించవచ్చు.

ఒక లీటర్‌ డీఈఎఫ్‌ లిక్విడ్‌ తయారు చేయడానికి దాదాపు రూ. 20 ఖర్చవుతుంది. లీటర్ లిక్విడ్‌ను హోల్‌సేల్‌గా రూ. 40 వరకు విక్రయించవచ్చు. అంటే ఒక్క లీటర్‌ లిక్విడ్‌కు సుమారు రూ. 10 లాభం వస్తుంది. రోజుకు వెయ్యి లీటర్ల లిక్విడ్‌ను తయారు చేసినా తక్కువలో తక్కువ రోజుకు రూ. 10వేలు సంపాదించవచ్చు. దీంతో ఎంత కాదన్న నెలకు లక్షల్లో ఆదాయం ఏటూపోదు. పెట్టుబడి విషయానికొస్తే మొత్తం సెటప్‌కు.. సుమారు రూ. 7 లక్షల పెట్టుబడి అవసరపడుతుంది.

పుల్లటి చింతపండుని లైట్ తీసుకొంటున్నారా.? ఎన్నో ఔషద గుణాలు మూలం..

చింతపండులో మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది.

చింతపండు తీసుకొంటే వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందట. బరువు తగ్గాలనుకొంటే తప్పకుండా ప్రతిరోజూ దీని తీసుకోండి.

చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనితో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయవచ్చో తెలుసా?

భారతదేశంలో వివిధ ప్రయోజనాల కోసం అనేక విభిన్న పత్రాలు జారీ చేస్తుంటారు. వీటిలో చాలా పత్రాలు గుర్తింపు కార్డులుగా ఉపయోగిస్తుంటారు. గుర్తింపు పత్రాల్లో అతి ముఖ్యమైనది ఆధార్‌.

ప్రస్తుతం ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. అనేక ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తుంటాము. భారతదేశ జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డు ఉంది. ప్రతిరోజూ ఏదో ఒక పనికి ఆధార్ కార్డు కావాలి. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవావాలన్నా మీ ఆధార్ కార్డును రుజువుగా అందించాలి.

చాలా సార్లు ప్రజలు ఆధార్ కార్డులో తప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంటారు. పొరపాట్లను సరి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు UIDAI ద్వారా ఉన్నాయి. మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

ఇదిలా ఉంటే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. అలాగే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి పరిమితి లేదు. ఎన్ని సార్లైనా అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే మీరు మీ ఆధార్ కార్డ్‌లోని మీ నంబర్‌ను మీకు కావలసినన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం ప్రతిసారి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి చూద్దాం.

ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి అప్‌డేట్ ఫారమ్ తీసుకోవాలి. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఫారమ్‌ను టిక్ చేయాలి. ఆ తర్వాత మీరు కొత్త మొబైల్ నంబర్ సమాచారాన్ని నమోదు చేయాలి. ఇందు కోసం కొంత రుసుము చెల్లించాలి. దీని తర్వాత నంబర్ అప్‌డేట్‌ అవుతుంది.

గోంగూర తింటే రేచీకటి మాయం.. ఇంకా ఎన్నో లాభాలు

ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మంచి గోంగూర అయితే.. ఇంకొకటి కొండ గోంగూర. ఎక్కువగా చాలా మంది పుల్లగా ఉన్న కొండ గోంగూరను తింటూ ఉంటారు.

ఈ గోంగూరతో నిల్వ పచ్చళ్లు కూడా పెడుతూ ఉంటారు. దీని రుచి చాలా ఎంతో బాగుంటుంది. గోంగూరతో ఇంకా ఎన్నో వెరైటీలు చేస్తూ ఉంటారు. చికెన్, మటన్, రొయ్యలతో కలిపి వండితే ఆ రుచే వేరు. గిన్నెలు కూడా నాకేసేంత టేస్ట్ వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదు.. ఈ ఆకుకూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గోంగూరను తరచూ తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మరి ఆ సమస్యలేంటే ఇప్పుడు చూద్దాం.

రేచీకటి కంట్రోల్:

గోంగూర తినడం వల్ల రేచీకటి సమస్య కంట్రోల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది రేచీకటితో బాధ పడుతున్నారు. రేచీకటి వంటి దృష్టి లోపంతో బాధ పడేవారు గోంగూర తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తరచూ గోంగూరను మీ భోజనంలో భాగం చేసుకోండి. అలాగే గోంగూర పువ్వులను దంచి వాటి నుంచి రసాన్ని తీసి పాలతో కలిపి తీసుకోవడం వల్ల రేచీకటి నుంచి ఈజీగా బయట పడొచ్చు.

వాపు సమస్యలు మాయం:

గోంగూర తింటే శరీరంలోని వాపులు, బోదకాలు, శరీరంలో ఉండే గడ్డలను, వ్రణాలను తగ్గించడంలో కూడా గోంగూర దివ్యౌషధంగా పని చేస్తుంది. గోంగూరను, వేపాకును కలిపి దంచి ఆ మిశ్రమాన్ని బోదకాలుపై కట్టు కట్టడం వల్ల త్వరగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అలాగే వాపులు ఉన్న చోట కూడా ఇలాగే చేయండి.

విరేచనాలు తగ్గుతాయి:

గోంగూరతో విరేచనాలను కూడా తగ్గించుకోవచ్చు. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగడం వల్ల విరేచనాలను తగ్గించుకోవచ్చు. అలాగే మిరపకాయలు వేయకుండా ఉప్పుల ఊరవేసిన గోంగూరను అన్నంతో కలిపి తిన్నా విరేచనాలు తగ్గుతాయి.

శ్వాస కోశ సమస్యలు:

చలికాలంలో శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. తుమ్ములు, దగ్గు, ఆయాసం వంటి శ్వాస కోశ సమస్యలను కూడా గోంగూరతో కంట్రోల్ చేయవచ్చు. తరచూ గోంగూర తినడం వల్ల శ్వాస కోశ సమస్యలు కంట్రోల్ అవుతాయి. గోంగూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. వివిధ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలను తీసుకువస్తుంది.

ఈ పథకాలు చాలా వరకు పేద ప్రజల కోసమే. దేశంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. వారి అవసరాలను తీర్చుకోవడానికి రోజువారీ కూలీగా పని చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది చాలా చిన్న ఉద్యోగాలు చేస్తారు. ఈ కూలీల ఆదాయం స్థిరంగా ఉండదు. అలాగే వారికి ఎలాంటి పెన్షన్‌ కూడా అందదు. అలాంటి కూలీల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని కూడా ప్రారంభించింది. దీని కింద ప్రభుత్వం కార్మికులకు పెన్షన్ ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్ కోసం కార్మికులు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో చూద్దాం.

కార్మికులకు ప్రతి నెలా పింఛన్:

భారత ప్రభుత్వం ముఖ్యంగా దేశంలోని పేద వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భారత ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 3000 రూపాయల పెన్షన్‌ను అందిస్తుంది.

ప్రభుత్వం 18 నుంచి 40 ఏళ్లలోపు కార్మికులకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాల పాటు కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి కూలీలు ఎంతగానో సహకరిస్తారో ప్రభుత్వం కూడా అంతే సహకారం అందజేస్తుంది.

పథకం కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి?

భారత ప్రభుత్వం ఈ పీఎం శ్రామ్ యోగి మంధన్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ నగరంలోని ఏదైనా సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఆపరేటర్ తన ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ సమాచారాన్ని అందించాలి. పథకాన్ని పొందేందుకు మీ మొబైల్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి. దీని కోసం మీరు ప్రీమియం మొదటి విడత నగదు రూపంలో చెల్లించాలి. మీరు చెక్కు లేదా నగదు ద్వారా డిపాజిట్ చేయవచ్చు. దీని తర్వాత ప్రీమియం మొత్తం మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది. మీకు 60 వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి పెన్షన్‌ అందుతుంది.

Health

సినిమా