Saturday, November 16, 2024

అద్దాలపై పడ్డ మరకలను ఇలా ఈజీగా పోగొట్టేయండి.

ఇంటిని ఎంత నీటిగా ఉంచినా ఒక్కోసారి అంతా గందరగోళంలా తయారవుతుంది. ఆఫీసుకు హడావిడిగా వెళ్లే క్రమంలో లేదా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా.. పండుగలు ఉన్నా..

అద్దాలపై మరకలు పడుతూ ఉంటాయి. అలాగే కప్ బోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, విండోస్, ఫర్నీచర్స్‌పై మరకలు పడుతూ ఉంటాయి. వాటిని వెంటనే క్లీన్ చేస్తే త్వరగా వచ్చేస్తాయి. కానీ అలా వదిలేస్తే మాత్రం మొండి మరకలుగా ఉండిపోతాయి. దీంతో వీటిని క్లీన్ చేసేందుకు మహిళలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ వీటిని కూడా ఎంతో ఈజీగా సింపుల్‌గా వదిలించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే కచ్చితంగా పోతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెనిగర్ – నిమ్మరసం:

బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. వెనిగర్ సహాయంతో ఇంటిని ఎంతో శుభ్రంగా, నీటిగా ఉంచుకోవచ్చు. అదే వెనిగర్‌తో ఇప్పుడు మనం అద్దాలు, ఇంట్లో ఫర్నీచర్‌పై పడ్డ మరకలను కూడా వదిలించుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్, నిమ్మరసం కలిపి మరకలపై చల్లండి. ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత మంచి క్లాత్‌తో క్లీన్ చేస్తే త్వరగా వదిలిపోతాయి.

బేకింగ్ సోడా:

బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా బేకింగ్ సోడా కూడా పని చేస్తుంది. ఎలాంటి మరకలు, మచ్చలను తొలగించి ఇంటిని పరిశుభ్రంగా మార్చుతుంది. ఈ క్రమంలోనే గాజు వస్తువులు, అద్దాలు, ఫర్నీచర్‌పై ఉండే మరకలను కూడా తొలగించుకోవచ్చు. ముందుగా బేకింగ్ సోడాలో నీటినిక లిపి మరకలపై రాయండి. ఆ తర్వాత తడి క్లాత్‌తో తుడిస్తే సింపుల్‌గా పోతాయి.

డిష్ వాష్ లిక్విడ్:

డిష్ వాష్ లిక్విడ్ సహాయంతో కూడా అద్దాలు, గాజు వస్తువుల, ఫర్నీచర్‌పై ఉండే మరకలను తొలగించి.. తెల్లగా మిలమిల మెరిసేలా చేయవచ్చు. కొద్దిగా నీటిని తీసుకుని అందులో డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. ఆ తర్వాత తడి క్లాత్‌ సహాయంతో మరకలు ఉన్న చోట తుడిస్తే పోతాయి.

రబ్బింగ్ ఆల్కహాల్:

రబ్బింగ్ ఆల్కహాల్‌తో కూడా మరకలను వదిలించుకోవచ్చు. ఇది మురికిని, క్రిములను దూరం చేస్తుంది. రబ్బింగ్ ఆల్కహాల్‌ను మురికి ఉన్న చోట స్ప్రే చేసి ఆ తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేస్తే చాలు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

క్రెడిట్‌కార్డు హోల్డర్లకు ఆ బ్యాంకు షాక్.. చార్జీల బాదుడు

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల నిబంధనలను మార్చింది. వివిధ క్రెడిట్ కార్డ్‌లపై ప్రోత్సాహకాలను తగ్గించింది. బీమా, ఆహార కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, ఇందన సర్‌చార్జ్ మినహాయింపు, లేట్ పేమెంట్ జరిమానాలు వంటి సేవలపై తాజా నిబంధనలు ప్రభావం చూపుతాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు మార్పుల గురించి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసింది. ముఖ్యంగా యుటిలిటీ ఖర్చుల కోసం రివార్డ్ పాయింట్లను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.80000 రివార్డ్ పాయింట్‌ల పరిమితిని ప్రస్తుతం రూ.40,000కు తగ్గించారు. అలాగే కిరాణా & డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ల కోసం నెలకు రూ.40,000 వరకు రివార్డ్ పాయింట్‌లను పొంవచ్చని చెబుతున్నారు. అయితే కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ల కోసం నెలకు రూ.20,000 వరకు ఖర్చు చేసే రివార్డ్ పాయింట్‌లను ప్రస్తుత సంపాదన రేటు ప్రకారం పొంవచ్చు.

ప్రభుత్వ సంబంధిత ఖర్చులు మినహా ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డే ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై మీరు రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చని ఐసీఐసీఐ తాజా నోట్‌లో పేర్కొంది. ఇంధనంపై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు నెలకు రూ. 50,000కు మాత్రమే పరిమిం చేసింది. అలాగే రూ. 100కు మించిన ఖర్చులకు ఇంధన సర్‌చార్జి మినహాయింపు ఉండదు. అలాగే స్పా యాక్సెస్ అందించే డ్రీమ్ ఫోక్స్ కార్డుపై ఇక ఆ సేవలు అందుబాటులో ఉండవు. వార్షిక రుసుము రివర్సల్, ప్రయోజనాల కోసం ఖర్చు థ్రెషోల్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన అద్దె, విద్యా చెల్లింపులను మినహాయిస్తుంది. వార్షిక రుసుముకు సంబంధించిన రివర్సల్ కోసం ఖర్చు థ్రెషోల్డ్ రూ.లఓకు సవరించారు. మీ క్రెడిట్ కార్డ్ నుండి అంతర్జాతీయ విద్యా చెల్లింపులతో సహా పాఠశాల లేదా కళాశాలకు నేరుగా చేసిన చెల్లింపులకు రుసుము వసూలు చేయరు. అయితే, థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్య చెల్లింపులకు లావాదేవీ మొత్తంలో 1 శాతం రుసుము వసూలు చేస్తారు.

ఇంధన లావాదేవీకి రూ.10 వేలుకు మించి చేస్తే 1 శాతం రుసులు వసూలు చేస్తారు. అలాగే యాడ్ ఆన్ కార్డులకు వార్షిక రుసుము కింద రూ. 199 వసూలు చేస్తారు. లేట్ పేమెంట్స్ చార్జీలను కూడా పేమెంట్ బకాయికు అనుగుణంగా రూ.100 నుంచి రూ.1100 వరకు పెంచారు. అలాగే విమానాశ్రయాల్లో దేశీయ లాంజ్ యాక్సెస్ కోసం త్రైమాసికానికి కచ్చితంగా రూ.75 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయం కోసం రిటైల్ లావాదేవీలు, నగదు అడ్వాన్స్‌లు నెలకు 3.75 శాతానికి సవరించారు.

హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు షాక్.. రెండు రోజుల పాటు యూపీఐ సేవల నిలిపివేత

హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రకటన ప్రకారం నవంబర్ నెలలో రెండు పాటు యూపీఐ సేవలను నిలిపేస్తామని పేర్కొంది. అవసరమైన సిస్టమ్ అవసరాలను అప్‌డేట్ చేసేందుకు నవంబర్ 5న, 23న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది.

నవంబర్ 05న అర్ధరాత్రి 12 గంట నుంచి రెండు గంటల వరకు, నవంబర్ 23న కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకు కస్టమర్లకు యూపీఐ సేవలను అందుబాటులో ఉండవు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని ఉపయోగించి బ్యాంక్ ఖాతాదారులందరికీ హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, జీ పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఆర్థిక, ఆర్థికేతర యూపీఐ లావాదేవీల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొనుగోలు చేసిన వ్యాపారులకు అన్ని యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనేది ప్రత్యేకమైన యూపీఐ ఉపయోగించి డబ్బును చెల్లించడానికి/ స్వీకరించడానికి పాల్గొనే బ్యాంక్ కస్టమర్ల కోసం స్మార్ట్ ఫోన్ న్ ఎనేబుల్డ్ ఫండ్ బదిలీ ఆప్షన్‌గా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే మీరు ఈ యూపీఐ చెల్లింపులు ట్రాన్స్‌యాక్షన్ హిస్టరీ ట్యాబ్‌లో గత లావాదేవీలను వీక్షించవచ్చు.

సాధారణంగా యూపీఐ పిన్ తప్పుగా ఎంటర్ చేసినా, అకౌంట్‌లో తగినంత సొమ్ము లేకపోయినా యూపీఐ లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయి. అయితే బ్యాంకులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లావాదేవీలను నిలిపేసిన సమయంలో కూడా యూపీఐ లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయి. అందువల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సమయంలో లావాదేవీలను నిలిపేయాలని బ్యాంకులు కోరుతూ ఉంటాయి. అలాగే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, యాక్టివ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న ఎవరైనా యూపీఐ సేవలను ఉపయోగించవచ్చు.

పంచాయతీ సమరానికి సై.. క్లియర్‌కట్‌ సిగ్నల్ ఇచ్చేసిన తెలంగాణ సర్కార్

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఇప్పుడు మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నాయి.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జాతరకు.. త్వరలోనే తెరలేవబోతోంది. కొత్త సంవత్సరంలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు డిసెంబర్ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు వస్తారంటూ మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని 12 వేల 751 గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించకపోవటంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,800 కోట్ల నిధులు కేంద్రవద్దే ఉండిపోయాయి. దీంతో సత్వరమే ఎన్నికలను నిర్వహించి, ఆ నిధులను తెచ్చుకోవాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ. 2025లో నిర్వహించబోయే అన్ని ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రూపొందించింది. మరోవైపు ఈనెల ఆరు నుంచి సమగ్ర కుల గణన ప్రారంభం కానుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను త్వరలోనే ఎంపిక చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. దీన్నిబట్టి పంచాయతీ నగరాకు అధికార పార్టీ ఇప్పటికే సన్నద్ధమయినట్టు కనిపిస్తోంది.

రాష్ట్రంలో బీసీల లెక్క తేలాల్సిందే.. వాళ్లకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే అని ఎన్నికలకు ముందునుంచీ చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే సమగ్ర కులగణన చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన నవంబర్ 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార పార్టీ..భారీ సంఖ్యలో తన మద్దతుదారులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది.

రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీ ఎన్నికల్లో కలిసొస్తాయన్న ధీమాతో ఉంది అధికారపార్టీ. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లోనూ పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో సత్తాచాటిన కారుపార్టీ.. పంచాయతీ ఎన్నికల్లో విజయంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి భారాన్ని ఈ ఎన్నికల్లో దించుకోవాలన్న వ్యూహంతో ఉంది ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీకి కూడా పంచాయతీ, స్థానిక సంస్థలు సవాలుగా మారబోతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ బలం ఉందని నిరూపించుకోవాలంటే స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకరికిద్దరు కేంద్రమంత్రులున్నా పార్టీ రాష్ట్ర సారథిపై నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు కావటంతో త్వరగా కొత్త అధ్యక్షుడెవరో తేలిస్తే ఎన్నికలకు సిద్ధంకావచ్చంటోంది ఆ పార్టీ కేడర్‌. మొత్తానికి 11 నెలల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాబోతోంది. గల్లీదాకా పార్టీజెండా ఎగిరే ఎన్నికలు కావటంతో మూడు ప్రధానపార్టీలకూ అత్యంత కీలకం కాబోతున్నాయి.

మూడు లక్షల పెట్టుబడితో ముచ్చటైన రాబడి.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై అదిరే వడ్డీ

పెట్టుబడిదారులు సరైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎంచుకోవడం వల్ల మీ పొదుపుపై ​​గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు పోటీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

పెట్టుబడిదారులు వారి ఆర్థిక లక్ష్యాలు, వయస్సు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉండడంతో పాటు స్థిరమైన రాబడిని అందిస్తాయి. కాలక్రమేణా మీ పొదుపులను పెంచడంలో సహాయపడతాయి. అయితే పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారులు తెలివిగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో మూడు సంవత్సరాల కాలానికి రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో? ఓ సారి చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 6.75 శాతం వడ్డీ అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.25శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.66,718 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 72,164 రాబడి వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో సమానంగా వడ్డీ రేటును అందిస్తుంది. అందువల్ల మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.

రుషికొండ భవనాలను ఏం చేయాలి..? ప్రభుత్వ ఆలోచన ఇదేనా

విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్‌ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు.

ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు.

వైసీపీ హయాంలో రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్‌ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు రుషికొండ భవనాలను ఏపీ రాష్ట్ర మ్యూజియంగా మార్చాలంటోంది..బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటక్షన్ కమిటీ. ఉత్తరాంధ్రలో లభించిన బౌద్ధ అవశేషాలను భవనాల్లో ప్రదర్శనకు ఉంచాలని చెబుతోంది. జాతీయ-అంతర్జాతీయ సెమినార్ల కోసం పరిశోధకులకు కావలసిన సాంకేతిక సౌకర్యాలు కల్పించేలా భవవాలను వాడుకోవాలని ప్రభుత్వానికి ఆ సంస్థ సూచిస్తోంది.

గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం రుషికొండలో భవనాలను నిర్మించినట్టు ప్రచారం జరిగింది. అయితే జగన్‌ ప్రభుత్వం ఓటమిపాలవడంతో.. ఇప్పుడు వాటిని కూటమి సర్కార్‌ ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రుషికొండలో భవనాలను చూసి ఆశ్చర్యపోతున్న చంద్రబాబు.. అమరావతిలో అలాంటి భవనాలు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నిస్తోంది..వైసీపీ. రుషికొండలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది.

నిర్వహణపరంగా చూస్తే రుషికొండ భవనాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఈ భవనాలను ఏం చేయాలి? ఏ విధంగా ఉపయోగించాలి? అనే విషయాలపై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టిపెట్టింది. మరోవైపు భవనంపై వివిధ సంఘాలు పలు సూచనలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. మరి దీనిపై కూటమి సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.

షావోమి 15 వచ్చేసింది

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి షావోమీ 15ని లాంచ్ చేసింది. సేల్స్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయనే విషయంపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

షావోమీ 15లో 6.36 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 15 హైపర్‌ ఓఎస్‌ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌ డ్రాన్‌ 8 ఎలైట్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్‌ రేట్‌ ఈ ఫోన్‌ స్క్రీన్ సొంతం. ఇందులో 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ కెసాసిటీ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌ తీసుకొచ్చారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 52,000కాగా.. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 58,000గా నిర్ణయించారు. అసకుసా గ్రీన్, బ్రైట్ సిల్వర్ ఎడిషన్, బ్లాక్, లిలాక్, వైట్ షేడ్స్ లో తీసుకొచ్చారు.

చేతివేళ్లు అస్తమానూ విరిస్తే.. అర్థరైటిస్ వస్తుందా?

చేతి వేళ్లను అప్పుడప్పుడూ విరిస్తూ ఉంటారు. ఇలా విరవడం చాలా మందికి సంతోషంగా ఉంటుంది. పిల్లలకు దిష్టి తీసే సమయంలో కూడా ఇలా విరుస్తూ ఉంటారు. ఏమీ తోచనప్పుడు..

ఏదో ఆలోచిస్తూ కూడా ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇలా విరవడం వల్ల ప్రమాదమని.. అర్థరైటిస్ వచ్చే కీళ్ల నొప్పులు ఉందని అంటారు.

అయితే పలు అధ్యయనాల ప్రకారం నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఇలా చేతులు విరవడం వల్ల.. అర్థరైటిస్ రావడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలా మొటికలు విరవడం వల్ల కీళ్ల నొప్పులు రావని, చేతి వేళ్లు కూడా ఫ్రీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

చేతి వేళ్లను విరవడం వల్ల అర్థరైటిస్ వస్తుందని అనుకుంటే అది పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని పలు సార్లు అధ్యయనాల్లో తేలింది. ఈ విషయాన్ని 2011లో మెడికల్ న్యూస్ టుడేలో పబ్లిష్ అయింది.

కానీ పదే పదే చేతి వేళ్లు విరవడం వల్ల ఒత్తిడి ఎక్కువై నొప్పిగా వస్తుందట. ఎక్కువగా చేతులు మొటికలు విరవడం వల్ల నొప్పితో పాటు చేతుల్లో ఉండే గ్రిప్‌ కూడా పోతుందట. కాబట్టి ఎక్కువగా చేతులు విరవకూడదు.

చేతి వేళ్లు విరవడం వల్ల శబ్దం ఎలా వస్తుందనే డౌట్ అందరిలో ఉంటుంది. చేతి వేళ్లను వెనక్కి లాగినప్పుడు.. కీళ్ల గుజ్జులో పీడనం తగ్గి.. వాయువు కరిగి బుడగలు ఏర్పడాయి. వీటిని విరిచినప్పుడు బుడగలు పలిగి శబ్దం వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

రూ. 500లో బెస్ట్ స్మార్ట్‌ వాచ్‌లు.. అదిరిపోయే ఫీచర్లు.

Bouncefit D20 Y68: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా 84 శాతం డిస్కౌంట్‌తో రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్లడ్‌ ప్రెజర్‌ మానిటర్‌, వర్కవుట్‌ మోడ్స్‌ వంటి ఫీచర్లను అందించారు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

M I D18 Round Fitness Band: ఈ స్మార్ట్‌ వాచ్‌ను రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల హెల్త్‌ ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌పై అమెజాన్‌లో ఏకంగా 84 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇందులో వాటర్‌ ప్రూఫ్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

M I D18 Round Fitness Band: ఈ స్మార్ట్‌ వాచ్‌పై 84 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బీపీ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకర్‌, వర్కవుట్‌ మెమోరీ, కేలరీ ట్రాకర్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో రౌండ్ డయల్‌ను ఇచ్చారు.

M I D116 Fitness: ఈ స్మార్ట్‌వాచ్‌ అసలు ధర రూ. 2999కాగా అమెజాన్‌లో 85 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే లభిస్తోంది. ఈ వాచ్‌లో సింగిల్‌ టచ్‌ ఇంటర్‌ఫేస్‌, వాటర్‌ రెసిస్టెంట్‌, వర్కవుట్‌ మోడ్స్‌, క్విక్‌ ఛార్జ్‌ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో బ్లడ్‌ ప్రెజర్‌ మానిటర్‌, యాక్టివిటీ ట్రాకర్‌, కేలరీ ట్రాకర్‌ వంటి ఫీచర్లను అందించారు.

mi New Smart ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 1199కాగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో హార్ట్‌రేట్‌ మానిటర్‌, ఎస్‌పీఓ2 మానిటర్‌, వాటర్‌ ప్రూఫ్‌, డస్ట్‌ ప్రూఫ్‌, టచ్‌ డిస్‌ప్లేత పాటు అన్ని రకాల నోటిఫికేషన్స్‌ పొందొచ్చు. అలారమ్‌ క్లాక్‌, స్టాప్‌వాచ్‌, ఫైండ్‌ ఫోన్‌ వంటి ఫీచర్లను అందించారు.

బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..? ఇలా జుట్టుకు వాడి చూడండి

వెంట్రుకల అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్‌ అనే ఒక కార్బోహైడ్రేట్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఈ కార్పొహైడ్రేట్‌ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో వాష్‌ చేసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా మెరుస్తూ మృదువుగా మారుతుంది.

బియ్యం కడిగిన నీరు మీ జుట్టు మూలాల్లో సరైన విటమిన్ల లోపాన్ని పూరిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.

జుట్టు పెరుగుదలలో బియ్యం నీరు పరోక్ష పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టుకు అదనపు మెరుపును అందిస్తుంది. కాబట్టి, మీరు మీ హెయిర్‌కేర్‌ రోటీన్‌లో కూడా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు. కావాలంటే, మీరు రైస్ వాటర్ హెయిర్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది మీ జుట్టు మీద రక్షణ పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి ఎటువంటి హానికరమైన పదార్థాలు మీ జుట్టును నేరుగా ప్రభావితం చేయవు.

అలాగే, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని కలపండి. ఇందులో కొన్ని చెంచాల బియ్యం నీటిని కలపాలి. చిక్కటి మిశ్రమం తయారు చేసుకుని, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు.

జుట్టును వాష్‌ చేయడానికి ఉపయోగించడం వల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఇది మీ జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి ఒక్క బియ్యం నీరే వందపాళ్లు ఉపయోగపడుతుంది. కాబట్టి, బియ్యం కడిగిన నీటిని జుట్టు మూలాల్లోకి పట్టించి స్మూత్‌గా మసాజ్ చేయండి. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేస్తుంది.

కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీకు మీ జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, అందుకు చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి పాటించే ముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

Andhra News: 2 లక్షల మంది బడి మానేశారు

వైకాపా ప్రభుత్వంలో అమలు చేసిన అడ్డగోలు విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఈ సంఖ్యను తగ్గించి చూపేందుకు అడ్డదారులు తొక్కారు. బడి బయట పిల్లలుంటే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను బెదిరించారు. డ్రాప్‌ బాక్సుల్లో ఉన్న వారిని వెంటనే బడిలో ఉన్నట్లు చూపాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అప్పట్లో బడి బయట ఉన్న పిల్లలందర్నీ బడిలోనే ఉన్నట్లుగా లెక్కలు చూపారు. నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలు వంద శాతం పాఠశాలలకు వెళ్తున్నట్లు ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వాస్తవాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఏకంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరూ ఎక్కడున్నారో తెలుసుకొని, తిరిగి పాఠశాలల్లో చేర్పించాలంటూ ఆదేశాలిచ్చింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా.. ఇందులో పదో తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు గుర్తించారు. పదో తరగతి పూర్తి చేసినందున వారిని మినహాయించి, 1-10 తరగతుల్లో చదువు మానేసిన 2.02 లక్షల మందిని గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

బడి మానేసిన పిల్లల సంఖ్యలో మొదటి మూడు స్థానాల్లో కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కర్నూలు మొదటి స్థానంలో ఉండగా.. పార్వతీపురం మన్యం చివరి స్థానంలో ఉంది. కర్నూలులో 18,261 మంది బడికి దూరమయ్యారు. ఇక్కడ పనుల కోసం వలసలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. వైకాపా ప్రభుత్వం హయాంలో సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తమతోపాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లిపోయారు. మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగొచ్చినా.. పిల్లలు బడికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల వివరాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.

డ్రాప్‌ బాక్సు అంటే..
విద్యార్థి పాఠశాలకు వరుసగా రెండు, మూడు నెలలు రాకపోయినా.. మధ్యలో చదువు మానేసినా అతని పేరును డ్రాప్‌బాక్సులో పెడతారు. టీసీ తీసుకుని వెళ్లిపోయిన వారి పేర్లు కూడా డ్రాప్‌బాక్సులో పెడతారు. కొత్తగా వేరే బడిలో చేరితే ప్రధానోపాధ్యాయుడు అక్కడ చేరినట్లు డ్రాప్‌బాక్సు నుంచి తీసుకుంటారు.

దొంగ లెక్కలతో దాచేసి..

వైకాపా ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబరులో 1,73,416 మంది బడి మానేసినట్లు అధికారులు గుర్తించారు. వారిని మళ్లీ బడుల్లో చేర్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌కు సూచించారు. వాలంటీర్లతో సర్వే చేయించారు. చాలామంది ఆచూకీ లభించలేదు. వాలంటీర్లపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో వీరు ఎక్కడో చోట చదువుతున్నట్లు, దూర విద్య అభ్యసిస్తున్నట్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు రాసేసి, ముగించారు.

2023-24 విద్యా సంవత్సరంలోనూ బడి బయట పిల్లల సంఖ్య వెలుగు చూసింది. గతేడాది సెప్టెంబరు 4 లోపు బడి ఈడు పిల్లలు బడి బయట ఉంటే రాజీనామా చేస్తానంటూ అప్పట్లో ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రకటన చేశారు. బడి నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను రిజిస్టర్‌లో రాయాలంటూ ప్రైవేటు పాఠశాలలపై ఒత్తిడి తీసుకొచ్చారు. డ్రాప్‌ బాక్సులో పిల్లల సంఖ్య ఉంటే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో పిల్లలు బడి నుంచి వెళ్లిపోయినా.. ఉన్నట్లే లెక్కలు చూపారు. ఇలా.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపారు.

పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ బిగ్ షాట్

తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటూ నాలుగున్నర దశాబ్దాల రాజకీయాన్ని పూర్తి చేసుకున్న విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఇక తన రాజకీయ జీవితం చాలు అనేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయను అని స్పీకర్ గా ప్రస్తుతం కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా వయసు పెరుగుతోందని అన్నారు. తాను సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశాను అన్నారు.

పదవులు అధికారాలు ఎవరికీ శాశ్వతం కావని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తమ పదవీ కాలంలో చేసిన మంచి పనులే వారిని చిరస్థాయిగా ఉంచుతాయని ఆయన అన్నారు. తాను 2029 లోగా చేయాలనుకున్న మంచి పనులు ప్రజలకు చేస్తాను అన్నారు.

ఈ విషయంలో ఒళ్ళు దాచుకునే ప్రసక్తి లేదని అన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనకు నాలుగేళ్ల ఎనిమిది నెలల పదవీ కాలం ఉందని, ఈ పదవీ కాలాన్ని తాను ప్రజా సంక్షేమం కోసమే పూర్తి స్థాయిలో వినియోగిస్తాను అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు విశాఖలో ఉన్న వేళ అదే జిల్లాకు చెందిన నేత, బాబు కంటే టీడీపీలో ముందు నుంచి ఉన్న అత్యంత సీనియర్ నాయకుడు అయిన అయ్యన్న ఈ విధంగా ప్రకటన చేయడం పట్ల చర్చ సాగుతోంది. అయ్యన్న పాత్రుడు నిజానికి ఈ మాటను ఇపుడే కొత్తగా చెప్పడం లేదు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని చెప్పేశారు.

అయితే అవి టీడీపీకి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి అధినాయకత్వం ఆయననే పోటీకి పెట్టింది. ఇక 2024లో కూడా తన కుమారుడికే టికెట్ ఆయన అడిగినట్లుగా కూడా ప్రచారం సాగింది. కానీ హై కమాండ్ మాత్రం అయ్యన్న పోటీలో ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో ఆయన పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలిచారు

ఇక అయ్యన్న మంత్రి పదవిని ఆశించారు అని అంటారు. కానీ ఆయనకు రాజ్యాంగ బద్ధమైన పదవి లభించింది. స్పీకర్ గా అయ్యన్న తన వంతుగా హుందాతనాన్ని పాటిస్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగా ఆయన ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు అయితే చేయడం లేదు.

ఈ క్రమంలో అయ్యన్న తన పెద్ద కుమారుడు విజయ్ ని రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో అయ్యన్న కుమారుడే టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంటారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే అయ్యన్న చేసిన ఈ ప్రకటన మాత్రం టీడీపీ వర్గాలలో చర్చకు తెర లేపనుంది. ఇంకా 2029 ఎన్నికలు ఎంతో దూరంలో ఉండగా అయ్యన్న ఎందుకు ఇపుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా అంతటా చర్చగా సాగుతోంది. మంత్రి పదవి లభించలేదన్న అసంతృప్తి ఏమైనా ఆయనకు ఉందా అన్నది కూడా హాట్ డిబేట్ గా ఉంది.

అయితే రాజకీయంగా ముందు చూపు వ్యూహాలు కలిగిన అయ్యన్న పాత్రుడు అన్నీ ఆలోచించిన మీదటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మంత్రివర్గం మరో రెండేళ్ల తరువాత అయినా విస్తరిస్తారు అని అంటున్నారు. అప్పటికి అయినా మంత్రిగా పనిచేయాలన్న ప్లాన్ ఏదైనా అయ్యన్నకు ఉందా అన్నది కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి చూస్తే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా చెప్పని అయ్యన్న ఇపుడే సరైన సమయం అన్నట్లుగా ప్రకటిచిందడం అంటే దాని వెనక ఏమి వ్యూహాలు ఉండి ఉంటాయన్న చర్చకు అయితే తెర లేస్తోంది.

Thalambrala Mokka : ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Thalambrala Mokka : మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. కానీ, మనం వాటిని తేలికగా తీసి పారేస్తూ ఉంటాము. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా, మన చుట్టూ చాలా ఉంటాయి.

కొన్ని కొన్ని మొక్కలని, మనం చూసి ఎందుకు పనికిరావు అని అనుకుంటూ ఉంటాము. కానీ తెలియకుండా అవి పనికిరావని తేలికగా తీసేయకూడదు. కొన్ని మొక్కల వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. తలంబ్రాలు మొక్క గురించి చాలామందికి తెలియదు. ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా కనపడుతుంది. రోడ్డు పక్కన, పొలాల గట్ల మీద కూడా ఈ మొక్క ఉంటుంది. ఎక్కువగా గ్రామాలలో ఈ మొక్కలు మనకి కనపడుతూ ఉంటాయి. కాలువలకి ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే, చాలా మందికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియదు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది.

ఒకవేళ కనుక ఈ మొక్క దొరికితే, ఈ లాభాలు ని పొందవచ్చు. ఈ మొక్క కి సంబంధించి మొత్తం 150 జాతులు వరకు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుని లంబాడి చెట్టు, గాజు కంపా అని కూడా పిలుస్తారు. చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా, ఈ మొక్క బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా గజ్జి, తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో కూడా దీనిని వాడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడడం జరుగుతుంది. క్రిమినాశక మరియు యాంటీ మైక్రోబెల్ లక్షణాలు వలన గాయాలని నయం చేయడానికి, ఇది సహాయం చేస్తుంది.

పల్లెల్లో ఉన్న వాళ్ళు, ఈ మొక్క ఆకుల్ని నలిపి కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వయసు సంబంధం లేకుండా, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వంటివి వేసుకోవడం కంటే, ఈ ఆకుల్ని ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకుని, నొప్పి ఉన్నచోట రాసుకుని ఒక క్లాత్ గట్టిగా కట్టేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది.

నొప్పి నుండి ఉపశమనం వెంటనే కలుగుతుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు, మీరు ఈ ఆకుల పేస్ట్ ని రాసుకోవచ్చు. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు వంటివి తగ్గిపోతాయి. దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ తలంబ్రాలు చెట్టు ఆకుల్ని ఎండబెట్టుకుని పొగ కింద వేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

70 ఏళ్లు దాటితే ₹5 లక్షల ఉచిత బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి?

AB-PMJAY | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అందుబాటులోకి వచ్చింది.

తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న పథకాన్ని పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద ఏడు పదులు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇంతకీ ఈ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి? ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి?

ఎవరు అర్హులు..?

భారత్‌లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకం కింద అర్హులే. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ పథకం కింద వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరుంటే తలా రూ.2.50 లక్షల వైద్య సాయం పొందొచ్చు. ఇందులో మూడు రోజులపాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు తదితర సేవలు పొందొచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి.

ఎలా చేరాలి? ఏమేం కావాలి?

ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌లో చేరాల్సిన వారు ఆయుష్మాన్‌ భారత్ వెబ్‌సైట్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌ ద్వారా చేరొచ్చు. ముందు www.beneficiary.nha.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్యాప్చా, మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ రాష్ట్రం ఎంచుకున్నాక అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకుంటే.. ఆధార్‌ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఇదివరకే కేవైసీ పూర్తయ్యి ఉంటే.. నేరుగా ‘ఆయుష్మాన్‌ వయ వందన’ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వృద్ధుల తరఫున వారి కుటుంబ సభ్యులు సైతం వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో ఈ ప్రక్రియ చేయొచ్చు. లేదా ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రికి వెళ్లి కూడా నమోదు చేయించొచ్చు.

క్యూలైన్లలో నిల్చొని నిల్చొని పుట్టుకొచ్చిన ఆలోచనే.. జొమాటో!

ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల జాబితా తెలుసుకోవడం ఎలా?

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద సుమారు 30 వేల ఆస్పత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల జాబితా dashboard.pmjay.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా ఎంచుకుంటే ఆస్పత్రి వివరాలు కనిపిస్తాయి.

ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి?

ఈ పథకం కింద 70 ఏళ్లు వయసు దాటిన వారికి ఆస్పత్రులు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం చెబుతోంది. చికిత్స విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ ఫిర్యాదులు ఉంటే.. పైన పేర్కొన్న వెబ్‌సైట్‌, యాప్‌లో గానీ లేదా నేషనల్‌ కాల్‌ సెంటర్‌ 14555ను సంప్రదించొచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యను పరిష్కారం లభిస్తుంది.

ఇతర హెల్త్‌స్కీముల్లో ఉన్న వారి మాటేంటి?

సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు.. వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని (AB-PMJAY) గానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు మాత్రం ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.

New Ration Cards : జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనీ ఏపీ సర్కార్ కసరత్తులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులను (New Ration Cards ) జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నూతన సంవత్సర (New Year Gift) కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ కొత్త రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి, అలాగే కొత్తగా వివాహమైన జంటలకు అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను సరికొత్త డిజైన్‌లో రీడిజైన్ చేసి, పాత మరియు కొత్త లబ్ధిదారులందరికీ అందజేయనున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వివిధ డిజైన్లను పరిశీలిస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫీచర్లతో ఉండే అవకాశం ఉంది. తద్వారా కార్డులను ఉపయోగించడం మరింత సులభం అవుతుంది. పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రకారం, ఈ కొత్త డిజైన్ ద్వారా రేషన్ డేటాను మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చు. పాత కార్డులను సరికొత్త డిజైన్తో ప్రతిరూపం చేసి అందించడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు సులభం అవుతుంది. ఇది రేషన్ సరఫరా వ్యవస్థలో లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా భద్రపరచడమే కాకుండా, అవినీతి నిరోధక చర్యలలో ఒక కీలకభాగం అవుతుందని భావిస్తున్నారు.

AP Govt:’పేద వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్’.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని పేదవారికి కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో నగరాల్లో నిర్మించే 100 గజాల(100 yards) లోపు గృహాలకు ప్లాన్ మంజూరు ప్రక్రియను ప్రభుత్వం మినహాయించింది. సొంతిల్లు కట్టుకోవాలని భావించే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. అంటే రెండు సెంట్ల లోపు ఇళ్ల నిర్మాణం(Construction of houses) చేసుకునే వారు ప్లాన్ మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

ఇళ్ల నిర్మాణాని(Construction of houses)కి సంబంధించిన నిబంధనలలో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వంద గజాల(100 yards)లోపు స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ప్లాన్ మినహాయింపుతో పాటు 300 గజాల(300 yards)లోపు నిర్మాణాలకు సంబంధించి మరింత సులభతరంగా ప్లాన్ మంజూరు దిశగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టుల పురోగతిపైనా అధికారులతో చర్చించామని, పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌ రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, మెట్రోరైలు డీపీఆర్, టిడ్కో గృహాల(Tidco Homes) పురోగతి తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రి నారాయణ(Minister Narayana) పేర్కొన్నారు.

ఏ వయసులో ఎంత బరువు ఉండాలో తెలుసా? ఇక్కడ చార్ట్ చూడండి!

బరువు మన జీవితంలో శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. అధిక బరువు సమాజంలో మరియు మన ప్రియమైనవారిలో కూడా కళంకాన్ని సృష్టిస్తుంది.

ఊబకాయం మాత్రమే కాదు, తక్కువ బరువు కూడా ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు.

ఈ సమస్య మహిళల్లో కనిపిస్తే, అది గర్భధారణకు ఆటంకం కలిగిస్తుంది. మీకు కావలసిన పర్ఫెక్ట్ బాడీ షేప్ లోనే కాకుండా ఫిట్ గా మరియు స్ట్రాంగ్ గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మీ బరువు సంఖ్య మారుతుంది. ఇది ఊహించబడింది.

ఈ రోజు మనం మీ కుటుంబంలో చిన్న పిల్లల నుండి తాతయ్యల వరకు ఎవరిని తూలనాడాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాము.? బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ముందు, మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, కాబట్టి నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మీ వయస్సుకి మీ ఆదర్శ బరువు ఎలా ఉండాలో అర్థం చేసుకోండి.

పురుషులు మరియు స్త్రీల సగటు బరువు ఎంత ఉండాలి? ఈ చార్ట్ చూడండి!
వయసు మగ బరువు ఆడ బరువు
నవజాత శిశువు 3.3 కిలోలు 3.3 కిలోలు
2 నుండి 5 నెలలు 6 కిలోలు 5.4 కిలోలు
6 నుండి 8 నెలల వరకు 7.2 కిలోలు 6.5 కిలోలు
9 నెలల నుండి 1 సంవత్సరం 10 కిలోలు 9.5 కిలోలు
2 నుండి 5 సంవత్సరాల వరకు 12. 5 కిలోలు 11. 8 కిలోలు
6 నుండి 8 సంవత్సరాల వరకు 14-18.7 కిలోలు 14-17 కిలోలు
9 నుండి 11 సంవత్సరాల వరకు 28- 31 కిలోలు 28- 31 కిలోలు
12 నుండి 14 సంవత్సరాలు 32- 38 కిలోలు 32- 36 కిలోలు
15 నుండి 20 సంవత్సరాల వరకు 40-50 కిలోలు 45 కిలోలు
21 నుండి 30 సంవత్సరాల వరకు 60-70 కిలోలు 50-60 కిలోలు
31 నుండి 40 సంవత్సరాల వరకు 59-75 కిలోలు 60-65 కిలోలు
41 నుండి 50 సంవత్సరాల వరకు 60-70 కిలోలు 59- 63 కిలోలు
51 నుండి 60 సంవత్సరాల వరకు 60-70 కిలోలు 59- 63 కిలోలు

ఇంతలో, పై చార్ట్ ప్రకారం, మీరు ఈ సమయంలో సరైన స్థాయిలో లేకపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ చార్ట్ మీ వ్యక్తిగత ఆరోగ్యం ఆధారంగా మీరు బరువు పెరగవచ్చా లేదా తగ్గించుకోవాలా అనే ఆలోచనను అందిస్తుంది.

Heavy Rains Alert:రాష్ట్రంలో మరో అల్పపీడనం.. ఆ తేదీ నుంచి భారీ వర్షాలు

 

 రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో(నవంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.
సెక్యూరిటీ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సీఎం వారించారు. ఆమె ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా చంద్రబాబు కూడా అలా చూస్తూ ఉండిపోయారు కొంచెం దూరం జరిగిందుకు ప్రయత్నించారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో జరిగిన సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన తర్వాత అధికారులతో కలిసి వెళ్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి చంద్రబాబును కలిసి పుష్ఫగుచ్చం అందించారు.

ఆ తర్వాత సీఎంతో ఫోటో దిగి.. ఒక్కసారిగా ఆయనకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది.

కంప్యూటర్ సేవకుడు వచ్చేస్తున్నాడు.. పనులన్నీ చిటికెలో ఫినిష్

ప్రస్తుతం గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వెబ్ బ్రౌజర్ లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించే ఒక రహస్య ప్రాజెక్టుపై గూగుల్ పనిచేస్తుంది.

దానికి ప్రాజెక్టు జార్విస్ అనే పేరు పెట్టింది. ఉత్పత్తులను కొనుగోలు చేయడం, పరిశోధనను సేకరించడం, విమానాల టికెట్లను బుక్ చేయడం వంటి వాటిని ఈ కొత్త ఏఐ సిస్టమ్ చాలా సులభంగా చేయగలరు. గూగుల్ విడుదల చేసే కొత్త వెర్షన్ లో ప్రాజెక్టు జార్విస్ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా గూగుల్ క్రోమ్ లో పనిచేసేలా సర్దుబాటు చేస్తారు. దీని ఏఐ ఏజెంట్ గా పిలవొచ్చు. యూజర్ తరఫున అనేక విధులను నిర్వహించడానికి సహాయ పడుతుంది. వెబ్ ఆధారంగా చేసే రోజు వారీ పనులను ఆటోమేటిక్ గా నిర్వహిస్తుంది.

ఉదాహరణకు మీరు విమానం టిక్కెట్ బుక్ చేయాలనుకున్నారు. ముందుగా ఆ వెబ్ సైట్ ను ఎంచుకుంటారు. ఆపై మీరు ఎక్కే ఫ్లైట్ గురించి వెతుకుతారు. ధర వివరాలను తెలుసుకుని, ఇతర వెబ్ సైట్లను సందర్శిస్తారు. ఎక్కడ టిక్కెట్ ధర అనుకూలంగా ఉంటే అక్కడ బుక్ చేసుకుంటారు. ప్రాజెక్టు జార్విస్ లోని ఏఐ సాధనం ఈ పనులన్నింటినీ ఆటోమేటిక్ గా చేసేస్తుంది. మీకు అనుకూలమైన ఉత్తమ ఎంపికలను అందజేస్తుంది. గూగుల్ రూపొందిస్తున్న ఏఐ ఏజెంట్ మీ కంప్యూటర్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. అంటే మీ బదులు అన్ని పనులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఎటువంటి అనర్థాలు కలగవు. ఐరన్ మ్యాన్ లలో జార్విస్ క్యారెక్టర్ నుంచి ఈ పేరును తీసుకున్నారు. ప్రాజెక్టు జార్విస్ అనేది వినియోగదారు ఫేసింగ్ ఫీచర్ గా గూగుల్ క్రోమ్ లో పనిచేస్తుంది. రోజు వారీ వెబ్ ఆధారిత పనులను ఆటోమేటిక్ నిర్వహిస్తుంది.

ఇది డిసెంబర్ నాటికి సిద్ధం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రాజెక్టు జార్విస్ తో యూజర్లు తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. దీని ఆధారంగా చాలా సులువుగా పనులను నిర్వహించుకోవచ్చు. అదే సమయంలో ఏఐపై ఎక్కువగా ఆధారపడడం వల్ల స్వయంగా కనుగొనే సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? బాబోయ్.! ప్రాణాలు పోతాయ్.. బీ కేర్‌ఫుల్

దేశంలో హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ స్ట్రీట్ ఫుడ్ అభిమానులే.

అయితే తాజాగా బయటపడుతున్న కొన్ని సంచలన విషయాలు స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా జరుపుతున్న దాడుల్లో కీలక అంశాలు బయటపడుతున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫుడ్ తిని ఒక మహిళ మరణించిన ఘటన కూడా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

అసలు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేవి కొన్ని మాత్రమే. వాటిలో ఇరానీ చాయి, షవర్మా, పానీపూరీలు గుర్తొస్తాయి. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు స్ట్రీట్ ఫుడ్‌కు ఉన్న క్రేజ్ బడా రెస్టారెంట్లకు సైతం ఉండదు. అలాంటి స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇటీవల బంజారాహిల్స్‌లో స్ట్రీట్ ఫుడ్ తిని రేష్మ అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే.

బంజారాహిల్స్‌లోని వారాంతపు సంతలో మొమోస్ కౌంటర్ ఏర్పాటు చేశారు. తన బంధువులతో సహా అక్కడికి వెళ్లి మోమోస్ తిన్న రేష్మ అపస్మారక పరిస్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతూ నిమ్స్ హాస్పిటల్లో మరణించింది. ఆమెతోపాటు momos తిన్న మరో 50 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ మోమోస్ తయారు చేసిన వ్యక్తులను బంజారా హిల్స్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ దగ్గర ఉన్న చింతల బస్తీలో ఒక చిన్న రూమ్‌ని అద్దెకు తీసుకొని momosను తయారు చేస్తారు. వీటి తయారీకి నాసిరకం పదార్థాలు వినియోగించడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో ఇలాంటి స్టాల్స్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ఇటీవల కొద్ది రోజుల క్రితం షవర్మా తిని దాదాపు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్టోబర్ 22న యూసఫ్ గూడాలోని మండి రెస్టారెంట్‌లో ఈ తనిఖీలు నిర్వహించారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మరో చోట అల్వాల్‌లో షవర్మా తిని మరి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.ఇలా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఫేమస్‌గా లభించే స్ట్రీట్ ఫుడ్‌లు తిని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

హోండా యాక్టివా ఈవీ విడుదలకు అంతా రెడీ.. ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందంటే..?

ప్రస్తుతం మార్కెట్ ను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు శాసిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి విడుదల కానుంది.

హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ (హెచ్ఎంఎస్ఐ) 2011 లో యాక్టివా ను ఆవిష్కరించింది. దీనికి లభించిన ఆదరణతో స్కూటర్ మార్కెట్ ఊపందుకుంది. ఎందరో వినియోగదారులకు ఫేవరెట్ వాహనంగా మారింది. అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా ఇప్పడు ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేయనుంది.

ఎలక్ట్రిక్ విభాగంలోకి మిగిలిన కంపెనీలతో పోల్చితే హెచ్ఎంఎస్ఐ ఆలస్యంగా వస్తోంది. అయినా వినియోగదారులు ఈ బండి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కంపెనీ సీఈవో సుట్సుమి ఓటాని.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇది ఏడాది పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2025 మార్చిలో ఈ వాహనం రోడ్లపై పరుగులు పెట్టనుంది. యాక్టివా ఎలక్ట్రిక్ గురించి ఆ కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బ్యాటరీ ప్యాక్ కు అనుగుణంగా రూపొందించిన కొత్త ప్లాట్ ఫాంను ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా మాస్ మార్కెట్ కస్టమర్లను ఆకట్టుకునేలా బండిని తీర్చిదిద్దారు. రిమూవబుల్ బ్యాటరీని బదులుగా స్థిరమైన దాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రిక్ బ్లూ టూత్ కనెక్టివీటి ద్వారా యాక్సెస్ చేయగలిగే వివిధ స్మార్ట్ ఫంక్షన్లతో కూడిన టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ను ఏలుతున్న ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టాతో యాక్టివా పోటీ పడనుంది. ప్రస్తుతం ఐసీఈ విభాగంలో యాక్టివా 110 దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతోంది. కానీ ఈవీ విభాగంలో ఓలా, టీవీఎస్, బజాజ్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. దీంతో ఆ విభాగంలోనూ తన స్థానాన్ని నిలుపుకోవాలని యాక్టివా భావిస్తోంది. మరో నాలుగు, ఐదు నెలలో యాక్టవా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం రహదారులపై పరుగులు పెట్టనుంది. జపాన్ లో డెవలప్ చేసిన ఈ స్కూటర్ ను మన దేశంతో పాటు ఆసియాలోని కొన్ని మార్కెట్లలో విడుదల చేస్తారు.

జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్‎తో మీ కార్ సేఫ్.

జీరో డిప్రిసియేషన్ పాలసీలో నష్టానికి సంబంధించి పూర్తీ మొత్తం కవర్ అవుతుంది. ఎటువంటి తరుగుదల తీసివేయరు. పూర్తి క్లెయిమ్ పొందవచ్చు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తో పోలిస్తే జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ కాస్త భిన్నంగా ఉంటుంది.

జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్రహేన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ లో ఇన్సూరెన్స్ కంపెనీలు వాహనం ప్రస్తుత విలువ అంచనా వేసి క్లెయిం మొత్తాన్ని ఇస్తాయి.

అంటే తరుగుదలను తీసివేసి విలువ కడతాయి. ఈ విధానంలో క్లెయిమ్ 75% మాత్రమె వస్తుంది. అదే జీరో డిప్రిసియేషన్ పాలసీలో నష్టానికి సంబంధించి పూర్తీ మొత్తం కవర్ అవుతుంది.

ఎటువంటి తరుగుదల తీసివేయరు. పూర్తి క్లెయిమ్ పొందవచ్చు. అయితే, దీనికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సాధారణ కవర్ కంటే 20-25% ఎక్కువ ఉంటుంది.హై-ఎండ్, మిడ్-సిగ్మేంట్ కార్లకు ఈ పాలసీ మంచిది.

అలాగే చాలామంది ఈ రెండూ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారుఇది పేరుకే తప్ప.. ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వదువీలైనంత వరకూ జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పొందడం అంత సులభం కాదు.. బ్యాంకులు కీలక నిర్ణయం

గత కొన్నేళ్ల నుంచి క్రెడిట్‌ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా అధిక మొత్తంలో క్రెడిట్‌ కార్డులను జారీ చేశాయి. కానీ ఇప్పుడు క్రెడిట్‌ కార్డుల వల్ల సమస్య ఏర్పడటంతో కార్డుల జారీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

చాలా మంది క్రెడిట్ కార్డులు డిఫాల్ట్‌గా మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ఇటీవలి డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో కొత్త క్రెడిట్ కార్డ్‌లను జోడించే వేగం గణనీయంగా తగ్గింది. ఇది ఆగస్టులో 9.2 లక్షల కొత్త కార్డుల నుండి సెప్టెంబర్‌లో 6.2 లక్షలకు పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 64% భారీ క్షీణతను సూచిస్తుంది. మొత్తం క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 106 మిలియన్లకు చేరుకుంది.

చాలా మంది క్రెడిట్‌ కార్డులు డిఫాల్ట్‌గా మారుతుండటంతో ఇక నుంచి కార్డులు జారీ చేసే విషయంలో బ్యాంకులు జాగ్రత్త పడుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం కార్డుల జారీ విషయంలో వెనుకడుగు వేస్తున్నాయి. పెరుగుతున్న నష్టాల కారణంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంలో బ్యాంకులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త కార్డుల జారీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్‌లు ముందున్నాయని, అయితే సమీప భవిష్యత్తులో క్రెడిట్ కార్డ్ పంపిణీ వేగం మందగించే అవకాశం ఉందని ఐడిబిఐ క్యాపిటల్ అనలిస్ట్ బంటీ చావ్లా చెప్పారు.

నివేదిక ఏం చెబుతోంది?

ఆర్బీఐ ఇటీవల రిస్క్ ప్రమాణాలను మార్చింది. క్రెడిట్‌ కార్డులు డిఫాల్ట్‌గా మారుతుండటంతో వ్యక్తిగత రుణాలకు, ఇతర రుణాలపై ప్రభావం పడుతోంది. క్రెడిట్ కార్డ్, ఇతర రక్షణ లేని రుణ విభాగాలలో పెరుగుతున్న నష్టాలను నియంత్రించడం దీని లక్ష్యం. సెప్టెంబర్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 4.3 లక్షల కొత్త కార్డులను జారీ చేయగా, ఎస్‌బిఐ కార్డ్ 1.4 లక్షలు, యాక్సిస్ బ్యాంక్ 53,000 కార్డులను జారీ చేశాయి.

ఎవరి కార్డులు డిఫాల్ట్‌గా మారుతున్నాయి?

Macquarie Capital నివేదిక ప్రకారం, బ్యాంకుల క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోలో డిఫాల్ట్ రేట్లు ఇప్పుడు 6%కి దగ్గరగా ఉన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగానికి ఆందోళన కలిగించే విషయం. మధ్య ఆదాయ సమూహంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ రేటు ఎక్కువగా ఉందని ఆర్థిక సేవల పరిశోధన విభాగం అధిపతి సురేష్ గణపతి నివేదికలో తెలిపారు. ఆర్‌బిఐ వ్యక్తిగత రుణాల పరిధిని ఎత్తివేసిన తర్వాత మధ్యతరగతి వారికి బకాయిలు చెల్లించడానికి పరిమిత ఎంపికలు మిగిలిపోయాయని, ఇది పట్టణ ప్రాంతాల్లో మాంద్యం ఏర్పడిందని గణపతి చెప్పారు.

పండుగల సమయంలో వినియోగదారుల ఖర్చు పెరిగింది:

ఆగస్టులో 1.6% ఉన్న లావాదేవీల వృద్ధి రేటు సెప్టెంబర్‌లో 0.5%కి తగ్గిందని ఆర్‌బిఐ డేటా చూపుతోంది. అయితే, పండుగ సీజన్‌లో వినియోగదారుల వ్యయం పెరిగింది. ఫలితంగా మొత్తం క్రెడిట్ కార్డ్ ఖర్చు ఆగస్టులో రూ. 1.69 లక్షల కోట్ల నుండి సెప్టెంబర్‌లో రూ. 1.77 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఏడాది ప్రాతిపదికన 23.8% పెరుగుదల.

డిఫాల్ట్ ఎందుకు పెరుగుతోంది?

యువత తరచుగా వారి మొత్తం క్రెడిట్ పరిమితిని ఉపయోగించుకుంటాయి. ఫలితంగా డిఫాల్ట్‌లు పెరుగుతాయని, అనేక ఖాతాలు నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPAలు)గా మారుతాయని నిపుణులు అంటున్నారు. అన్‌సెక్యూర్డ్ కన్స్యూమర్ లోన్‌లు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలను ఆర్‌బిఐ ఇటీవల ఆదేశించింది.

సినిమా చూస్తూ నాకు కన్నీళ్లు ఆగలేదు.. అమరన్ సినిమాపై రజినీకాంత్ రివ్యూ.

రెక్షన్ చాలా అందంగా ఉంది. సైన్యం గురించి చాలా లు తీశారు. కానీ ఈ ఇలాంటి డైరెక్షన్ చూడలేదు. కెమెరా మేన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ మెప్పించారు. అతడి కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి అవుతుంది. ఇక సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఈ చూడటం పూర్తయ్యాక నాకు ఏడుపు ఆగలేదు.

చూస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం ఏమిటంటే, నా రెండవ సోదరుడు నాగేశ్వరరావు గైక్వాడ్ 14 సంవత్సరాలు సైన్యంలో పనిచేశాడు. చైనాతో యుద్ధంలో వెన్నులో కాల్పులు జరిపారు. దీంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. అందరూ తప్పక చూడాల్సిన అమరన్. సైనికులంతా ఎన్ని కష్టాలు పడుతున్నారు.. సరిహద్దుల్లో మనల్ని ఎలా రక్షిస్తున్నారు అనేది ఈ లో అద్భుతంగా చూపించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటున్నారా

నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. పుల్లటి రుచితో ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. నిమ్మకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి..

దీనిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. విటమిన్ సీ తోపాటు.. అనే పోషకాలున్న నిమ్మకాయను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి అవసరాలను తీర్చడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పోషకం.. దీంతో మీరు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ వ్యాధులను నివారించవచ్చు. అయితే.. నిమ్మకాయ తీసుకోవడం చాలామంచిదే, కానీ మీరు నిమ్మకాయను పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు బదులు చెడు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, నిమ్మకాయ ప్రతికూల ప్రభావాలేంటో తెలుసుకోవడం ఉత్తమం.. నిమ్మకాయ లేదా నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి.

నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

దంత సమస్యలు: నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వస్తాయి. నిమ్మకాయ ఆమ్ల స్వభావం దంతాల ఎనామెల్ దెబ్బతినడం, సున్నితత్వం పెరగడం వంటి దంత నష్టాన్ని కలిగిస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలు: నిమ్మరసం జీర్ణక్రియకు ఉత్తమమైనదిగా పరిగణించినప్పటికీ.. మీరు నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

చర్మ సమస్యలు: నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం మొద్దుబారడంతోపాటు పొడిబారుతుంది.. ఇది చర్మాన్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ఇది సూర్యకాంతి, UV రేడియేషన్‌ను తట్టుకోగల చర్మం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

బరువు పెరిగే ప్రమాదం: నిమ్మకాయను పరిమిత పరిమాణంలో తీసుకుంటే.. అది బరువును తగ్గిస్తుంది. కానీ ఎక్కువ నిమ్మకాయను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. మీరు ఎక్కువ ఆహారం తీసుకుంటే, మీ బరువు క్రమంగా పెరుగుతుంది.

నొప్పి – వాపు: నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు విటమిన్ సి ఏర్పడుతుంది. ఇది కీళ్లలో నొప్పి-వాపును పెంచుతుంది. కాబట్టి, నిమ్మకాయను పరిమితుల్లో మాత్రమే తీసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

‘సాగర్‌ టూ శ్రీశైలం’.. కృష్ణా నది అలలపై అందాల ప్రయాణం మొదలైంది.

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణ నదిలో బోటులో ప్రయాణం.. చుట్టూ ప్రకృతి అందాలు, చల్లటి గాలి ఊహించుకోవడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ అద్భుత క్షణం రానే వచ్చేసింది.

పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బోటు ప్రయాణం అందుబాటులోకి వచ్చేసింది.

తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని ప్రారంభించింది. కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకొని అధికారులు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి గడిచిన కొన్నేళ్ల నుంచి ఈ బోటును నడిపించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే కరోనా, ఆ తర్వాత సరైన వర్షాలు లేని కారణంగా బోటు ప్రయాణం వీలుపడలేదు. అయితే తాజాగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీరు అందుబాటులో ఉండడంతో బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది.

సుమారు 120 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం ఉంటుంది. నాగార్జున సాగర్‌లో ప్రారంభమయ్యే ఈ బోటు ప్రయాణం నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాతాల మీదుగా ఉంటుంది. ఇక మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు.

ప్యాకేజీ వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. బోటు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని అధికారులు తెలిపారు. అయితే.. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నేరుగా హైదరాబాద్ నుంచి కూడా టూర్ ఆపరేట్ చేస్తున్నారు.

రోడ్డు రోలర్ ఎక్కిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతల రోడ్లను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మిషన్ పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ పేరుతో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పూజ చేసి, గుంతల్లో కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడ ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తన పర్యటనను అనకాపల్లి జిల్లాకు మార్చుకున్నారు. పరవాడ మండలం వెన్నెల పాలెం ప్రధాన రోడ్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం షెడ్యూల్ ఆకస్మికంగా మారడంతో అనకాపల్లి జిల్లా అధికారులు పరుగులు పెట్టారు. రాత్రికి రాత్రే ఏర్పాట్లు పూర్తి చేసి.. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయానికి అంతా సిద్ధం చేశారు అధికారులు.

కాలినడకన రోడ్డు పరిశీలించి..

శ్రీకాకుళం జిల్లా పర్యటన నుంచి హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఫార్మాసిటీ హెలిపాడ్‌లో హెలికాప్టర్ దిగి.. అక్కడ నాయకులు కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు. అక్కడ నుంచి బస్సులో వెన్నెల పాలెం బయలుదేరారు. వెన్నెల పాలెంలో చంద్రబాబుకు భారీగా స్వాగతం పలికారు స్థానికులు. భారీ క్రేన్ తో గజమాలతో స్వాగత సత్కారం చేశారు. అక్కడ కాన్వాయ్ దిగిన చంద్రబాబు.. గుంతలో పూడ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రాంతానికి కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా రోడ్డు గుంతలను పరిశీలిస్తూ ముందుకు సాగారు.

పారపట్టి కాంక్రీట్ పోసి..

అక్కడ మిషన్ పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి.. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారపట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు సిమెంటు కాంక్రీట్ మిక్స్ను రోడ్డుపై ఉన్న గుంతల్లో పోశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభాస్థలికి వెళ్లి ప్రసంగించారు. దాదాపు గంటసేపు మాట్లాడి.. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు లేకుండా సిద్ధం కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, అధికారులకు ఆదేశించారు. రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని, రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్రాంతికి ఇతర ప్రాంతం నుంచి ఏపీకి వచ్చేవాళ్లు ఇక్కడ రోడ్లు చూసి గర్వపడేలా ఉండాలని సూచించారు. డ్రోన్లు పంపించి రోడ్లను పరిశీలిస్తాం అంటూ చమత్కరించారు చంద్రబాబు.

రోడ్డు రోలర్ డ్రైవ్ చేసిన చంద్రబాబు

వెన్నెల పాలంలో సభ ముగిసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా గోతులతో ఉన్న రోడ్ల ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు అధికారులు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు బయలుదేరే ముందు.. రోడ్డు గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన రోడ్ రోలర్ వైపు వెళ్లారు చంద్రబాబు. రోడ్ రోలర్ పైకి ఎక్కారు. డ్రైవర్ సీట్ లో కూర్చుని.. రోడ్డు రోలర్ ను నడిపారు. గుంతలు ఉన్న రోడ్లలో పోసిన కాంక్రీట్ సిమెంట్ పైనుంచి రోడ్డు రూలర్‌ను పోనిచ్చారు. చంద్రబాబుతో పాటు హోం మంత్రి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి వాహనం పైనే ఉన్నారు. పక్కనే ఉన్న డ్రైవర్ రమణ తో మాట్లాడారు. రోడ్ రోలర్ ఆపరేట్ గురించి వివరాలు అడిగారు. సీఎం స్వయంగా రోడ్డు రోలర్ నడిపారు. చాలా తృప్తిగా ఉంది. రోడ్లన్నీ బాగుపడతాయి.. అంత పెద్దాయన అటువంటి కార్యక్రమాన్ని చేయడం, రోడ్డు రోలర్ స్వయంగా డ్రైవ్ చేయడం గర్వంగా ఉంది.’ అని చెప్పానరు రోడ్ రోలర్ డ్రైవర్ రమణ.

అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో నేరుగా విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లారు. పరవాడ ఫార్మాసిటీ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో ఋషికొండ కు బయలుదేరారు.

పెంపుడు కుక్కలను పెంచుకుంటే పన్ను చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం

మనుషులు, కుక్కల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వందల ఏళ్ల నుంచి కుక్కలు మనుషులు కలిసి జీవిస్తున్నాయి. అత్యంత విశ్వాసం ఉన్న జంతువుగా భావించే శునకాలను పెంచుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

విదేశాల్లో ఈ ట్రెండ్ కొన్ని వందల ఏళ్ల నుంచే అమల్లో ఉంటే ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ ఎక్కువవుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో కచ్చితంగా శునకాలను పెంచుకుంటారు.

శునకాలకు, మనుషులకు మధ్య ఉండే ఎమోషన్‌ బాండ్ కూడా అలాంటిదేనని చెప్పాలి. అయితే భారత్‌లో శునకాలను పెంచుకోవడానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో శునకాలను పెంచుకోవాలంటే ప్రభుత్వాలకు కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. కొన్ని దేశాలకు ఈ పన్నుల రూపంలో వేల కోట్లు ఆదాయం వస్తుందంటే మీరు నమ్ముతారా.? కానీ నిజం ఇంతకీ ఏయే దేశాల్లో ఈ పన్ను వసూలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

జర్మనీ ప్రజలు శునకాలను పెంచుకోవాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. ఈ పన్నును స్థానిక భాషలో ‘హుండెష్టోయర్’గా పిలుస్తారు. అయితే ప్రభుత్వం పన్ను విధిస్తున్నా జర్మనీలో కుక్కలను పెంచుకునే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. ప్రజలు కుక్కలను పెంచడం ద్వారా జర్మన్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. ఓ అంచనా ప్రకారం 2023లో కుక్కల యజమానుల నుంచి జర్మన్ ప్రభుత్వం వసూలు చేసిన పన్ను దాదాపు 421 మిలియన్ యూరోలు. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ. 3వేల కోట్లు కావడం గమనార్హం. 2013, 2023 మధ్య డాగ్‌ కీపింగ్ ట్యాక్స్‌ ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 41 శాతం పెరిగింది.

కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి 6 నెలలు బంద్.. కారణమిదే..

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కేదార్‌నాథ్ ధామ్(Kedarnath temple) ఆలయ తలుపులు రేపు మూసివేయనున్నారు. అయితే శీతాకాలం వస్తున్న నేపథ్యంలో తగిన ఆచారాలతో బంద్ చేస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులు అందుకుంటారు. శతాబ్దాలుగా అనుసరిస్తున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. భాయ్ దూజ్ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దీద్ది వారి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

కారణమిదే..

శీతాకాలం కారణంగా నిబంధనల ప్రకారం లార్డ్ కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలల పాటు మూసివేస్తారు. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

భాయ్ దూజ్ పండుగ

క్యాలెండర్ ఆధారంగా ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను నవంబర్ 3, 2024 ఆదివారం జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమరాజ్ తన సోదరి యమునాజీని కలవడానికి వచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు.

ఈ శుభ సమయంలో తిలకం పెట్టడం సోదరులకు అదృష్టాన్ని తెస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. భాయ్ దూజ్‌లో తిలకం వేయడానికి అనువైన సమయం నవంబర్ 3న ఆదివారం. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:51 నుంచి 5:43 వరకు, మధ్యాహ్నం ముహూర్తం: మధ్యాహ్నం 1:10 నుంచి 3:22 వరకు, విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:54 నుంచి 1:54 వరకు, తిలకం ప్రధాన శుభ సమయం: మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇందులో సోదరీమణులు తమ సోదరులకు తిలకాన్ని వేయవచ్చు.

ప్రత్యేక పూజలు

కేదార్‌నాథ్ ఆలయ పూజారి శివశంకర్ లింగ్‌తో పాటు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ, తీర్థ పురోహిత్ సమాజ్, పంచపాండ కమిటీ అధికారులు ఇప్పటికే భైరవనాథ్ ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత భుకుంత్ భైరవనాథ్ జలాభిషేకం తరువాత, అన్నదానం, ప్రార్థనలు సమర్పించి హవన యాగం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబరు 1న బాబా కేదార్‌నాథ్‌ ధామ్‌లో లక్ష్మీ పూజలతో పాటు దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసారి కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్న యాత్రికుల సంఖ్య 15.5 లక్షలు దాటింది. ఈ రోజుల్లో దర్శనం కోసం ప్రతిరోజూ సుమారు 19 నుండి 20 వేల మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌ చేరుకున్నారు.

Health

సినిమా