Monday, November 18, 2024

Income Tax: మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది? నిపుణులు ఓటు దేనికంటే..

Income Tax: మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది? నిపుణులు ఓటు దేనికంటే..

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశ ప్రగతికి అనుగుణంగా వివిధ రంగాలకు కేటాయింపులు జరిపారు. వివిధ వర్గాలకు రాయితీలు అందించారు. దానిలో భాగంగా పన్ను చెల్లింపు దారులకు కూాడా కొన్ని ప్రయోజనాలు కల్పించారు.

కొత్త పన్ను విధానంలో మార్పులు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని పెంచారు. దీనివల్ల ఈ విధానంలో పన్ను చెల్లించేవారికి మునుపటి కంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. అయితే తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాలి.

చెల్లింపుదారులదే నిర్ణయం..
పాత, కొత్త విధానాలలో ఏ పద్దతి ద్వారా ఆదాయపు పన్ను చెల్లించాలనే విషయంపై పన్ను చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాలి. ఏ విధానంలో చెల్లిస్తే ప్రయోజనాలు కలుగుతాయో అధ్యయనం చేయాలి. మీకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. కేంద్ర బడ్జెట్ లో చేసిన మార్పులను అనుసరించి పాత, కొత్త విధానాలలో దేనిని ఎంచుకోవాలో తెలుసుకుందాం.

ఆదాయం తక్కువగా ఉంటే..
మీరు సంపాదిస్తున్న ఆదాయం తక్కువగా ఉంటే మీకు కొత్త పన్ను విధానం వల్ల ప్రయోజనం కలుగుతుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెరిగింది. మీరు గృహ రుణ వడ్డీపై రూ. 2 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయకుంటే లేదా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)కు అర్హత పొందకపోతే కొత్త సరళీకృత పన్ను వ్యవస్థకు మారడం బాగుంటుంది.

కొత్త విధానంలో పన్ను లెక్కింపు..
కొత్త పన్ను విధానంలో లెక్కింపు ఇలా ఉంటుంది. 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు. 3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం, 7 నుంచి 10 లక్షల వరకూ పది శాతం, 10 నుంచి 12 లక్షల వరకూ 15 శాాతం, 12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం, 15 లక్షలకు పైబడి 30 శాతం విధిస్తారు.

ఆదాయం ఎక్కువైతే..
ఆదాయం ఎక్కువగా వచ్చే వారికి పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రూ. 3,93,750 కంటే ఎక్కువ తగ్గింపులను క్లెయిమ్ చేసే రూ. 11 లక్షల ఆదాయం కలిగిన జీతం పొందిన ఉద్యోగికి పాత పన్ను విధానంలో మరింత ఆదా చేసే అవకాశం కలుగుతుంది. పాత పన్ను విధానం ఆరోగ్య బీమా ప్రీమియాలు, పిల్లల స్కూల్ ఫీజులు, సెక్షన్ 80 సీ కింద పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ, ఇంటి అద్దెపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అనుమతి లభిస్తుంది. కాబట్టి మీ ఆదాయం ఎక్కువగా ఉంటే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.

ఏది ప్రయోజనం..
పాత, కొత్త పన్ను విధానాలు రెండూ మంచివి. తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా వీటిని పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవాలి. ముఖ్యంగా పన్ను మినహాయింపులే వీటి మధ్య వ్యత్సాసాన్ని కలిగిస్తాయి. పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు లభిస్తాయి. వాటిని పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో అలాంటి మినహాయింపులు ఉండవు. పన్ను చెల్లింపుదారులకు రూ.75 వేల డిడిక్షన్ తో పాటు ఎన్ పీఎస్, ఆరోగ్య బీమా ప్రీమియాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

తల్లికి వందనం ఒక బిడ్డకేనా – తేల్చేసిన మంత్రి లోకేష్.

ఏపీలో పథకాల అమలు పైన చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ బిడ్డకు రూ 15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.

ఈ పథకం అమలు విషయం లోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక బిడ్డకే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందనే వార్తలు వినిపించాయి. ఈ పథకం అమలు..లబ్దిదారుల ఖరారు గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. కీలక అంశాలను వెల్లడించారు.

పథకం అమలుపై

తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అందరికీ రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు పైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్దిదారుల ఆధార్ కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో, ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

అందరికీ అందిస్తాం

ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకం అమలు గురించి క్లారిటీ ఇచ్చారు. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ 15 వేలు చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేసారు. ఎలాంటి కోతలు లేకుండా రూ 15 వేలు ఇస్తామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతీ విద్యార్ధికి అమలు చేస్తామని చెప్పారు. తల్లి తంద్రులు, మేధావులతోనూ చర్చలు చేసిన తరువాత విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వ్యతిరేకం కాదు

ఇక, ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేసారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. మూడో తరగతి నుండి ,పదవ తరగతి వరకు ,విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ,పరీక్షలు వల్ల పిల్లల పై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నారు. టోఫెల్ శిక్షణ లో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వ హించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. నాడు నేడు లో ,పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.

YSRCP: ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

YSRCP: ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై చెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. గుర్తింపు దక్కలేదని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. కొందరు వ్యక్తుల సొంత నిర్ణయాలతోనే వైసీపీ పార్టీ నడుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీకి మోసం చేసిన కొందరు వ్యక్తులకు పిలిచి మరీ పట్టం కట్టారని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను చేరదీసిన వాళ్లు.. ఇవాళ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో కలియతిరిగి.. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా.. పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన బాధను వ్యక్తపరిచారు. సమాజంలో విలువ లేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారన్నారు రోషయ్య. అన్ని విధాలా తాను పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎంతో అనుభవం ఉందని.. అన్ని అర్హతలు ఉన్న ఆయనకు కాకుండా.. మరో వ్యక్తికి… మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఇచ్చారన్నారు రోశయ్య. ఈ వరస పరిణామాలతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గుంటూరు జిల్లాలో వై‌సీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి..ఇటీవలే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కిలారి రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశమైంది.. అయితే రోశయ్య జనసేన పార్టీలోకి వెళతారని అనుచరుల ద్వారా తెలిసింది.

TGSRTC ఉచిత ప్రయాణం.. పురుషులకు గొప్ప శుభవార్త!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ని ఓడించి ఘన విజయం సాధించింది కాంగ్రెస్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినపుడు తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు తప్పని సరి నెరవేరుస్తామని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం అయినప్పటి నుంచి మగవాళ్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పురుషులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు చెందిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు. అప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిపోయింది. దీంతో పురుషులకు కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. దాదాపు బస్సుల్లో 60 శాతం పురుషులు నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన వెంటనే చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఎంత రద్దీ ఉన్న కూర్చొని ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. 3035 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఉగ్యోగ కల్పన జరుగుతుందని.. పురుషులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే ఆర్టీసీలో పురుషులకు నిలబడి ప్రయాణించే కష్టాలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగులకు TGS RTC గుడ్ న్యూస్ ! తగ్గనున్న జర్నీ టైమ్

నిత్యం ఎంతో మంది వివిధ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవస్థను వినియోగించుకుని ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు జర్నీ పెట్టిన తరువాత కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాక ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటే ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ న్యూస్ ఏంటి, ఆ వివరాలు ఏమిటో, ఇప్పుడు చూద్దాం..

సాఫ్ట్ వేర్ రంగాన్నికి పెట్టింది పేరు హైదరాబాద్. బెంగళూరు, పూణే వంటి నగరాల తరువాత అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉంది భాగ్యనగరంలోనే. ఇక నగరంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగులు నిత్యం బైక్, కార్ల , బస్సుల ద్వారా హైటెక్ సిటీ ప్రాంతానికి చేరుతుంటారు. చాలా మంది నగరం శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటారు. అలాంటి వారు..హైటెక్ సిటికి చేరుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇలా కేవలం సమయమే కాకుండా వారు చాలా రిస్క్ తో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో నగర శివారులో ఉండే ఉద్యోగుల కోసం తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక తాజాగా టీజీ ఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఐటీ ఉద్యోగులకు చాలా మేలు జరగనుంది. ఐటీ కంపెనీలు అన్నీ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో చాలా మంది హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో నివాసం ఉంటారు. ఇక అక్కడి నుంచి హైటెక్ సిటీకి చేరుకోవాలంటే.. చాలా టైమ్ తీసుకుంటుంది. హైదరాబాద్ శివారు నుంచి హైటెక్ సిటీకి రావాలంటే సికింద్రాబాద్, కోఠి, పంజాగుట్ట, అమీర్ పేట్, మెహిదీ పట్నం వంటి తదితర బస్టాప్ ల మీదుగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అలానే ఆఫీసుకు వెళ్లే సమయంలో 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండే ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు.ఇప్పటికే ఘట్ కేసర్ నుంచి హైటెక్ సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్ లలోనూ ఈ విధంగా సేవలు అందించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. ఇక టీజీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే..టైమ్ ఆదా అవ్వడంతో పాటు బస్సులు మారే బాధ నుంచి విముక్తి లభించినట్లు అవుతుంది.

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. రానున్న 3 రోజులు కుండపోత వానలు

గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు వల్ల ఏపీ, తెలంగాణలో జూన్‌ నెల ప్రారంభం నుంచే వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో మరో మూడ్రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధికారులు, జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కొనసాగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

నేడు తెలంగాణలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడమే కాక ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
ఏపీలో 3 రోజులు కుండపోత..

రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని.. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న మూడు రోజుల పాటు ఈదురు గాలులు, ఉరములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు అసలు వెళ్లరాదని సూచించారు.

ఘోర ప్రమాదం.. భారీ వానలకు 229 మంది మృతి!

ఇటీవల కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలోనే నదులు, వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర భారత దేశంలో కూడా వానలు విజృంభిస్తొన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి 229 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఇథియోపియా దేశంలోఈ ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు ఇరిగి పడటంతో 229 మంది మృతి చెందారు. దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లాలో సోమవారం ఈఘటన చోటు చేసుకంది. ఇటీవలే కురుస్తున్న భారీ వానల కారణంగా సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసే చర్యలు ప్రారంభించారు.

ఇదే సమయంలో అక్కడ జనం భారీగా గుమిగూడారు. ఈ క్రమంలోనే మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సహయక చర్యలు చేస్తున్న, గుమిగూడిన జనంపై కొండచరియలు పడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో తొలుత 50 మృతి చెందినట్లు స్థానిక అధికారులు చెప్పగా… తాజాగా ఆ సంఖ్య 229 చేరింది. మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానిక పోలీసులు ఉన్నారని అధికారులు తెలిపినట్లు ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదించింది. సోమవారం గోఫా జోన్‌లోని కెంచో-షాచా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 148 మంది పురుషులు, 81 మంది మహిళలు మరణించినట్లు సమాచారం. అలానే చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారుల చెబుతున్నారు.

ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విపత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు ఫెడరల్ డిజాస్టర్ ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్‌ని రంగంలోకి దింపామని, ఎక్స్‌పై జరిగిన ఘోర నష్టంపై ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ చీఫ్ మౌసా ఫకీ మహమత్ బాధితుల కుటుంబాలకు, ఇథియోపియన్ ప్రభుత్వానికి ఎక్స్ లో తన సంతాపాన్ని, సంఘీభావాన్ని అందించారు. ఇదే సమయంలో ఇక్క శిథిలాల్లో చిక్కుకున్న వారిని కనుగొనడానికి, గాయపడిన వారికి సాయం చేయడానికి రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఇలానే జరిగి.. ఏకంగా ఓ గ్రామమంతా సమాధిగా మారింది.

సామాన్యులకు భారీ షాక్.. 100కు చేరిన టమాటా!

గత కొంత కాలంగా సామాన్య ప్రజానికానికి నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు, ఉప్ప నుంచి మొదలు చికెన్, మటన్, కూరగాల వరకు రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్ లో సంచి తీసుకుని వెళ్తే వంద రూపాయలకు సంచి సగం వచ్చేవని.. కానీ ఇప్పుడు రెండు మూడు ఐటమ్స్ రావడమే కష్టంగా మారిందని వినియోగదారులు బాధపడుతున్నారు. ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతిదీ కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతుంది. మొన్నటి వరకు కిలో రూ.40 నుంచి రూ.60 ఉన్న టమాటా ఇప్పుడు కిలో రేటు వందకు చేరింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణాంగా రవాణా వ్యవస్థ ఇబ్బందులు, పంట నష్టాల ప్రభావం వెరసి కూరగాయల ధరపై పడుతుంది. చికెన్, మటన్ తో పోటీ పడుతూ కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతీ కూరగాయ 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే టమాటా ధరలు కిలో వందకు చేరుకున్నాయి. రైతు బజార్లో కిలో టమాటా రూ.70 కి లభిస్తే.. రిటైల్ మార్కెట్, తోపుడు బండ్లపై అమ్మేవారు కిలో రూ.100 రూపాయల వరకు అమ్ముతున్నారు. డిమాండ్ కి తగ్గట్టు సరఫరా లేకపోవడం వల్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయని అంటున్నారు. టమాటాతో ఉల్లిపాయ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

ధరల పెరుగుదలతో సామాన్యులు కిలో కొనేవారు అర్థకిలో, పావు కిలో కొనే పరిస్థితికి చేరుకుంది. గత సంవత్సరం టమాటా కిలో ఏకంగా రూ.150 కి పైగా అమ్ముడు పోయాయి. ఈ ఏడాది కూడా కిలో రూ.200 చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. టమాటాతో పాటు మిర్చి కూడా రూ.100 చేరుకుంది. గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నదని రైతులు అంటున్నారు. ఇంట్లో వంట చేయాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి. ఇవి ఉంటే మిగతా కూరగాయలు లేకున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, మిర్చీ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు లబో దిబో అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత మండిపోతే ఎలా ఎదుర్కొవాలో అర్థంకాని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారు.

BSNL నుంచి 2 ధమాకా ప్లాన్స్‌.. డేటాతో పాటు 35 రోజుల వ్యాలిడిటీ.. రూ.110 లోపే

ప్రైవేటు టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియో, వీఐలు జూలై నెల ప్రారంభంలో తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్‌ మీద 11-25 శాతం వరకు టారిఫ్‌ రేట్లను పెంచాయి. ఈ పెంపుపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాక బ్యాన్‌ జియో.. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఘర్‌వాప్సి అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచిన నాటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. కస్టమర్లకు అతి తక్కువ ధరలో.. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది.

ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలు ప్లాన్‌ రేట్లను పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లోనే రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందిస్తోంది. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ 110 రూపాయాల లోపే రెండు బెస్ట్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో ఒక దాని రేటు 108, మరొకటి 107 రూపాయలు మాత్రమే. పైగా ఒక ప్లాన్‌ వ్యాలిడిటీ ఏకంగా 35 రోజులు కావడం గమనార్హం. ఆ వివరాలు..
రూ.108 ప్లాన్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ తెచ్చిన అతి చౌకైన ప్లాన్‌లో ఒకటి రూ.108 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 28జీబీ డేటాను అందిస్తుంది. అంటే రోజుకు ఒక జీబీ డేటా అందిస్తుంది. అంతేకాక ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ సౌకర్యాలను పొందవచ్చు.
రూ.107 ప్లాన్‌..

బీఎస్ఎన్ఎల్ తెచ్చిన మరో చౌకైన ప్లాన్‌ రూ.107. ఇది వినియోగదారులకు 3 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్టీడీ కాల్స్‌కి 200 నిమిషాలు ఉచితంగా ఇస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులు కావడం దీనికున్న మరో అదనపు ప్రయోజనం. వీటితో పాటు వినియోగదారులు 35 రోజులపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. మొత్తం మీద ధర, వాలిడిటీ పరంగా బీఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్‌కు పోటీ ఇచ్చేది.. మిగతా కంపెనీల్లో లేదు.

వీటితో పాటు అత్యంత తక్కువ ధరల్లో 30 రోజుల రీఛార్జ్ ప్రణాళికను కూడా అందిస్తుంది. దీని కోసం రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 60జీబీ డేటాను అందిస్తుంది. అంటే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ సదుపాయాలు కూడా అందిస్తోంది.

వాహనదారులు ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి! లేకుంటే అంతే సంగతులు!

దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో సెఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వాహనదారులు రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ద్విచక్ర వాహనాలు నడిపేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీసులు. ఇటీవల సిటీలో ఒకరు మరణిస్తే.. మరో నలుగురు తీవ్రంగా గాయపడుతున్నారు. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఇతర వాహనదారులు, పాదాచారులు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. వీటన్నింటిని అరికట్టేందుకు కఠిన నియమాలు అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రహదారుల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెల్ దరించి వాహనాలు నడపాలని రూల్ తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతేకాదు ఇకపై వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ నగర (ట్రాఫిక్) ఏడీసీపీ శ్రీనివాస రావు అన్నారు.

విశాఖ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు విశాఖ నగర పరిధిలో హెల్మెట్ ధరించడం అవసరం లేదని.. కానీ ఇప్పుడు వరుస ప్రమాదాల దృష్ట్యా సిటీలో హెల్మెట్ ధరించాలని కొత్త రూల్ తెచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విశాఖ నగరంలో ప్రధాన కూడలి అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం ప్రమాదాలను నియంత్రణకు హై కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే ప్రాణాంతకం
ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి
BIS సర్టిఫికేషన్ హెల్మెట్లనే వాడాలి
బైక్ నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తిగాని ఇద్దరిలో ఎవరు హెల్మెట్ పెట్టుకోకున్నా రూ.1035 చలానా విధించబడుతుంది
హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపి ప్రమాదానికి కారణం అయితే డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలె సస్పెండ్ అవుతుంది

తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..

Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆ పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పెద్ద ఎత్తున వైఫల్యం చెందిందని ఆరోపించారు. గతపాలకుల అసమర్థత వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు 72వేల మంది తగ్గారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న విద్యావిధానానికి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని వివరించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి విద్యావ్యవస్థలో మంచి విధివిధానాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ Bank జాబ్స్ కు ఇంకా అప్లై చేయలేదా? డిగ్రీ ఉంటే చాలు.. నెలకు లక్షన్నర జీతం

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. ప్రముఖ బ్యాంక్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. డిగ్రీ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమైతే వెంటనే అప్లై చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 జాబ్స్ ను భర్తీ చేయనున్నారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు:

195

పోస్టుల వివరాలు:

డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్.

విభాగాలు:

ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్
ఫారెక్స్ అండ్ ట్రెజరీ
ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ
క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

అర్హత:

అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960, స్కేల్-3కు రూ.85,920 – రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300-రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940-రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500-రూ.1,56,500.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. ఇతరులకు రూ. 1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్ మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం:

11-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

26-07-2024

పాఠశాలలకు 233 రోజులు పనిదినాలు..అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం

Andhra News: 233 working days for schools..Government made academic calendar

Andhra News: పాఠశాలలకు 233 రోజులు పనిదినాలు

అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించింది. టోఫెల్‌ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెల్లడించనుంది. దీన్ని కొనసాగించడమా? లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకడమిక్‌ క్యాలెండర్‌కు తుదిరూపు ఇచ్చింది.

పాఠశాల విద్య పరీక్షల షెడ్యూలు ఇదీ..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది.

ఫార్మెటివ్‌-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా.. ఫార్మెటివ్‌-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి.
సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్‌-3 వచ్చే జనవరి 2-6 వరకు నిర్వహిస్తారు.
పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి. ఫార్మెటివ్‌-4 పరీక్షలు మార్చి 3-6, సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 7-18 వరకు నిర్వహిస్తారు.
సెలవులు: దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.

క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.

బడ్జెట్‌లో సామాన్యులకు శుభవార్త.. ఇక నుంచి రూ. 20 లక్షలు

కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడో సారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. వారి కోసం అనేక రాయితీలు, పథకాలు తీసుకువచ్చారు. అలానే గతంలో ఉన్న వాటి నిధులను కూడా పెంచారు. ఇక బడ్జెట్‌లో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై వారికి 20 లక్షల రూపాయల ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గతంలో పది లక్షల రూపాయలుగా ఉన్న దీన్ని.. ఇప్పుడు ఏకంగా డబుల్‌ చేసింది. దీని వల్ల సామాన్యులకు భారీ ఊరట కలగనుంది. ఆ వివరాలు..

ఈ ఏడాది బడ్జెట్‌లో రైతులు, మహిళలు, విద్యార్ధులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇక, బడ్జెట్-2024లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ముద్రా యోజనను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా.. 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్‌ ఇస్తుంది ప్రభుత్వం.

అయితే తాజా బడ్జెట్‌లో ఈ రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంటే.. ఇకపై రూ.20 లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం యువతను వ్యాపార వేత్తలుగా మలిచేందుకు ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువతకు అండగా ఉంటామని నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము అన్నారు. వారు స్వయం ఉపాధి పొందేలా చేయడం కోసం ప్రభుత్వం లోన్లు ఇస్తుందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10లక్షల వరకూ రుణం లభిస్తుంది. అదే ఇప్పుడు ఆ లిమిట్ రూ. 20 లక్షలకు పెంచినట్లు చెప్పుకొచ్చారు.
ఇక, గ్రామీణ అభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించారు. ఇక మహిళలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. అలానే మోడల్ స్కిల్లింగ్ లోన్ స్కీమ్ కింద ఇకపై రూ. 7.5 లక్షల వరకు రుణ సదుపాయం పొందొచ్చు. అలాగే 30 లక్షల మంది యువతకు ఒక నెల పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయనున్నారు.

కేంద్ర బడ్జెట్ 2024..భారీగా తగ్గనున్న వీటి ధరలు!

ఎప్పుడైనా సరే కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టే సమయంలో అందరి ఆసక్తి దానిపైనే ఉంటుంది. ఆ సందర్భంలో ఆర్థిక మంత్రి ప్రకటించే అంశాలపై ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఏ ఏ రంగాలకు ఎంత మేర నిధులు కేటాయిస్తారు. అలానే విద్యా, వైద్యం, ఉపాధి రంగానికి ఏ విధంగా నిధుల కేటాయింపులు, అలానే పన్నుల అంశంపై ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి ఉంటుంది. ఇదే సమయంలో బడ్జెట్ ప్రకటనతో వేటి ధరలు తగ్గాయా?, వేటి ధరలు పెరుగుతాయి అనే విషయం తెలుస్తోంది. అలానే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. క్రమంలో ఈసారి కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు…

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.​ ఈ క్రమంలోనే పార్లమెంట్ లో తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పుడు నిర్మల సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. తాజాగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏడోవది. ఈ సారీ బడ్జెట్ లో మహిళలకు, పేదలకు, యువతకు, నిరుద్యోగులకు భారీగా నిధులు కేటాయించారు.

ఇదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. మందులు, వైద్య పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి. అలానే దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సీ ఫుడ్ , లెదర్, టైక్సెటైల్ లోని చెప్పులు, షూస్ , దుస్తులు, బ్యాగుల ధరలు తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు విద్యుత్ వైర్‌లు, ఎక్స్ రే యంత్రాలు చౌకగా లభిస్తాయి. మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ఇదే సమయంలో ఆదాయపు పన్నుపై కూడా ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు. బడ్జెట్ 2024లో కేంద్రం పట్టణాభివృద్ధికి నిధులు బాగా కేటాయించారు.

అలానే యువతకు కూడా భారీ వరాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలతోపాటు 10 వేల బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు, ఉపాధి, నైపుణ్యాల కోసం 3 పథకాలు తీసుకురానుంది. 5 సంవత్సరాల్లో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాల్లో అభివృద్ధి చేసేలా 5 పథకాలు తీసుకొస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రధాన మంత్రి పేరుతో ప్యాకేజీ రూపంలో ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు. ఇలా ఈసారీ బడ్జెట్ కాస్తా భిన్నంగానే ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా తాజాగా కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో త్వరలో వాటి ధరలు తగ్గనున్నాయి.

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్

ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా చదువుకు దూరమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోవాలన్నా కోరికను చంపుకుంటున్నారు. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లేది కేవలం విద్య మాత్రమే. మరి అంతటి ప్రాధాన్యత ఉన్న విద్య అందరికి అందాలని.. ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. స్టూడెంట్స్ ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు లోన్ అందించనున్నట్లు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు. విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు వారికి లోన్స్ అందించేందుకు కీలక ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ. 10 లక్షల వరకూ లోన్ అందిస్తామని ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో ఉన్నత విద్యానభ్యసించాలనుకునే వారికి భారీ ఊరట లభించినట్లైంది. లక్షలాది మంది విద్యార్థులకు లబ్థి చూకూరనున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ రంగాలకు చేయూతనిచ్చే విధంగా ప్రత్యేక పథకాలను ప్రకటించారు.

విద్యార్థులకు లోన్ అందించేందుకు మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ లో సవరణలు చేశారు. ప్రతి సంవత్సరం అర్హులైన విద్యార్థులకు లోన్స్ అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది దేశీయ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు 3 శాతం వడ్డీతో రూ. 10 లక్షల లోన్ అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా విద్యార్థులకు లోన్స్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

3డీ కర్డ్వ్‌ డిస్‌ప్లేతో వివో కొత్త ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో వి40 సిరీస్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఇందులో భాగంగా వివో40, వివో ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

వివో వి40 స్మార్ట్‌ ఫోన్‌లో 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను ప్రత్యేకంగా అందించారు. ఇక ఈ రెండు ఫోన్‌లలోనూ 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇందులో ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ సెటప్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఆగస్టులో భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఫోన్స్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించానున్నారు. 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్‌, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో ఈ స్క్రీన్‌ ఉండనుంది.

ఈ ఫోన్‌ను వాటర్‌ ప్రూఫ్‌ రెసిస్టెంట్‌తో తీసుకొచ్చారు. వివో వి40 స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఈ ఫోన్‌ సొంతం. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందించారు

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన మెయిన్‌ కెమరాతో పాటు 50 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ను అందించారు.

బడ్జెట్‌కు 35 నిమిషాల ముందు రూ.19,000 కోట్లు కోల్పోయిన ముఖేష్ అంబానీ.. షాకింగ్‌లో ఇన్వెస్టర్లు

బడ్జెట్ ప్రకటించడానికి ముందు స్టాక్ మార్కెట్ దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.

సెన్సెక్స్ వరుసగా రెండో రోజు పతనమవుతోంది. కంపెనీ షేర్లు రూ.3000 దిగువన ట్రేడయ్యింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం లాగా పెద్ద పతనాన్ని చూడవచ్చు. ఒకరోజు క్రితం రిలయన్స్ షేర్లు మూడున్నర శాతం పతనంతో ముగియగా, కంపెనీ వాల్యుయేషన్ రూ.73 వేల కోట్లకు పైగా క్షీణించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనమయ్యాయి

బడ్జెట్‌కు కొద్ది నిమిషాల ముందు స్టాక్ మార్కెట్‌లో దేశంలోని అతిపెద్ద కంపెనీ షేర్లలో క్షీణత నమోదైంది.కంపెనీ షేర్లు 0.90 శాతం అంటే రూ.26.85 పతనంతో రూ.2975.20 వద్ద ట్రేడయ్యాయి. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు కూడా రోజు దిగువ స్థాయి రూ.2,973కి చేరాయి. అయితే, కంపెనీ షేర్లు ఉదయం రూ.3004.95తో సానుకూల ఫ్లాట్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. ఒకరోజు క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో 3.50 శాతం క్షీణత కనిపించింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు రూ.3001.10 వద్ద ముగిశాయి.

భారీ పతనం

ఇక కంపెనీ వాల్యుయేషన్ గురించి మాట్లాడితే బడ్జెట్ ప్రారంభానికి 35 నిమిషాల ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19 వేల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. ఒకరోజు క్రితం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ విలువ రూ.20,30,488.32 కోట్లు. జూలై 23న కంపెనీ షేర్లు రోజు కనిష్ట స్థాయి రూ.2,973కి చేరుకోగా, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20,11,476.38 కోట్లకు చేరుకుంది. అంటే బడ్జెట్‌కు 35 నిమిషాల ముందు కంపెనీ వాల్యుయేషన్‌ రూ.19,011.94 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టం

మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన లక్షల మంది పెట్టుబడిదారులు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలను చవిచూశారు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుంటే.. ఒక ఇన్వెస్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 10 వేల షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ.28.1 పతనంతో రూ.2.81 లక్షల నష్టం వచ్చింది. ఇది చిన్న నష్టం అని చెప్పలేం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో పెద్ద క్షీణత కనిపించవచ్చు.

బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం..

బిర్యానీలో ఉపయోగించే దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయలో కూడా రకాల పోషకాలు ఉంటాయి. జాజికాయను ఉపయోగించి ఎన్నో రకాల సాధారణ, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు.

జాజికాయలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, విటమిన్లు బి1, బి6 వంటివి లభిస్తాయి.

జాజికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జాజికాయలో రిలాక్సింగ్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పాలల్లో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగితే చాలా మంచిది.

జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేవి బాగా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వస్తుంది. అంతేకాకుండా వైరస్, ఇన్ ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

అంతే కాకుండా జాజికాయలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచతాయి. మతి మరుపును దూరం చేస్తాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ నుంచి కూడా బయట పడతారు.

జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర నొప్పులను నివారించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ తీసుకుంటే మంచిది.

గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే..

యాసర్ ఈడీ270 ఆర్ ఎస్3 ఆర్కర్వ్డ్ మానిటర్.. ఈ గేమింగ్ మానిటర్ లో హెచ్ డీ 27 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి అంశం స్పష్టంగా చూడవచ్చు.

దీనిలో హెచ్ డీ ఎమ్ఐ 2.0 పోర్ట్‌లు, ఒక డిస్ప్లేపోర్ట్‌ ఉన్నాయి. కంటి ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే సుదీర్ఘ గేమింగ్ సెషన్లను సౌకర్యవంతంగా పూర్తి చేస్తుంది. చేస్తుంది. జీరో ఫ్రేమ్ డిజైన్, వెసా వాల్ మౌంట్, ఏఎమ్ డీ సాంకేతికత అదనపు ప్రత్యేకతలు. 3.900 కిలోల బరువు ఉండే ఈ మానిటర్ ధర రూ.12,699.

సామ్సంగ్ 27 అంగుళాల ఎమ్5 ఎఫ్ హెచ్ డీ స్మార్ట్ మానిటర్.. ఎల్ఈడీ బ్యాక్ లిట్ వీఏ ప్యానెల్ తో అధిక రిజల్యూజన్ కలిగిన డిస్‌ప్లే దీని ప్రత్యేకత. గేమింగ్ ను మరింత మెరుగుపరుస్తుంది. హెచ్ డీఆర్ 10 కలర్, కాంట్రాస్ట్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే కళ్లకు హాయినిస్తుంది. దీనిలో 10 వాట్ల ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉన్నాయి. బాహ్య పరికరం లేకుండా ఆడియో అవుట్‌పుట్‌ను సమర్థంగా అందజేస్తుంది. సమస్యలు లేని గేమింగ్ తో పాటు కంటి ఒత్తిడిని తగ్గించే ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉంది. 3.600 కిలోల ఈ మానిటర్ ధర రూ.15,599

బెన్ క్యూ జీడబ్ల్యూ2780టీ మానిటర్.. ఎక్కువ సమయం గేమింగ్ కు ఈ 27 అంగుళాల మానిటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇండోర్ వినియోగానికి చక్కగా సరిపోతుంది. యాంటీ గ్లేర్ కోటింగ్ రిఫ్లెక్షన్‌లను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే సౌకర్యవంతమైన గేమింగ్ అనుభవం ఇస్తుంది. దీనిలోని తక్కువ బ్లూ లైట్ మోడ్ వల్ల కంటికి అలసట ఉండదు. ఎక్కువ గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగిచుకోవచ్చు. వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ కోసం డిస్ప్లే పోర్ట్‌ ఏర్పాటు చేశారు. 6.600 కిలోల బరువైన ఈ మానిటర్ రూ.13,490కు అందుబాటులో ఉంది.

జెబ్రోనిక్స్ 27 అంగుళాల మానిటర్.. జెబ్రోనిక్స్ విడుదల చేసిన ఈ 27 అంగుళాల గేమింగ్ మానిటర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. స్క్రీన్ పై చిత్రాలను చాాలా స్పష్టంగా చూడవచ్చు. ఆల్ట్రా సిమ్ డిజైన్ తో డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. దీనిలోని ఇన్ బిల్ట్ స్పీకర్లు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందజేస్తాయి. ఈ మానిటర్ కు హెచ్ డీఎమ్ఐ,యూఎస్ బీ, హెడ్‌ఫోన్ జాక్ వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. 3.500 కిలోల బరువైన ఈ మానిటర్ ను రూ.11,499కు కొనుగోలు చేయవచ్చు.

ఎల్ జీ అల్ట్రాగేర్ ఐపీఎస్.. ఆటల కోసం ప్రత్యేకంగా హెచ్ డీ డిస్ ప్లేతో ఈ మానిటర్ ను రూపొందించారు. పైగా ఎల్ జీ వంటి నమ్మకమైక బ్రాండ్ నుంచి విడుదల కావడంతో దీనికి ఆదరణ బాగుంది. ఎక్కువ గంటలు పనిచేయడంతో పాటు సమస్యలు లేని గేమింగ్ కోసం ఉపయోగపడుతుంది. దీనిలోని డిస్ ప్లే హెచ్ డీఆర్ 10కు మద్దతు ఇస్తుంది. రిచ్ కలర్స్, కాంట్రాస్ట్‌తో చూడడానికి చక్కగా ఉంటుంది. ఈ మానిటర్ సాధారణం వినియోగంతో పాటు వృత్తిపరమైన గేమర్లను అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.11,499.

నిర్మలమ్మ పద్దులో తీపి కబురు.. వాహనదారులకు శుభవార్త..అదేంటంటే!

లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించింది.

ఇది లిథియం-అయాన్ బ్యాటరీల ధరలను తగ్గించడానికి దారి తీస్తుంది. తత్ఫలితంగా ఈవీలు లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించవచ్చు. ఇది మొత్తం వాహన ధరలో ప్రధాన భాగం.

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. అణుశక్తి, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం, రక్షణ, టెలికమ్యూనికేషన్స్, హైటెక్ వంటి రంగాలకు లిథియం, కాపర్, కోబాల్ట్ వంటి ఖనిజాలు, అరుదైన భూమి మూలకాలు కీలకం. ఎలక్ట్రానిక్స్ 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని, వాటిలో రెండింటిపై బీసీడీని తగ్గించాలని ప్రతిపాదిస్తున్నానని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇది అటువంటి ఖనిజాల ప్రాసెసింగ్, శుద్ధీకరణకు ప్రధాన పూరకాన్ని అందిస్తుంది. అలాగే వ్యూహాత్మక, ముఖ్యమైన రంగాలకు వాటి లభ్యతను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందని అన్నారు. అయినప్పటికీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, తయారీని పెంచడానికి 2024 బడ్జెట్ నుండి ఆటోమొబైల్ రంగం ఎదురుచూసే FAME IIIపై ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

అయితే, శుభవార్త ఏమిటంటే, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకం ఫాస్టర్ అడాప్షన్, తయారీ (FAME) పథకం మూడవ దశపై ప్రభుత్వం పని చేస్తోంది. ఇది సమీప భవిష్యత్తులో అమలు చేసే అవకాశం ఉంది.

నెలకు రూ. 37తో రూ. 2లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలీదు. ఈక్షణం కనిపించిన వారు.. మరు క్షణంలో మాయమైపోయే జీవితాలు మనవి.

ఇలాంటి పరిస్థితుల్లో మనపై ఆధారపడిన వ్యక్తుల భద్రత చాలా కీలకం. అనుకోని సంఘటనలో మనకేదైనా జరిగితే.. మనపై ఆధారపడిన వారు ఆర్థికంగా కుదేలైపోతారు. వారు బతకడం కూడా కష్టమైపోతుంది. అందుకే జీవిత బీమా(లైఫ్ ఇన్సురెన్స్)కి ప్రాధాన్యం పెరుగుతోంది. అందరూ ఏదో ఒక సంస్థలో చిన్న మొత్తంలో అయిన జీవిత బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా కొన్ని బీమా పాలసీలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన(పీఎంజేజేబీవై)పేరుతో ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. ఇది దేశంలో ఆర్థిక భద్రతను పెంపొందించడానికి తీసుకొచ్చిన పథకం. దీనిలో ఖాతా ఎలా ప్రారంభించాలి? ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

పీఎంజేజేబీవై పథకం ఇది..

సరసమైన ప్రీమియంతో వ్యక్తులకు జీవిత బీమా కవరేజీని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన(పీఎంజేజేబీవై)ని 9 మే, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఒక-సంవత్సరం జీవిత బీమా పథకం. ఏ కారణం చేతనైనా బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే కవరేజీని నామినీకి అందిస్తుంది.

పీఎంజేజేబీవై అర్హత..

సేవింగ్స్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా కలిగి ఉన్న 18-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పథకం కింద నమోదు చేసుకోవడానికి అర్హులు. 50 ఏళ్లు పూర్తి కాకుండానే పథకంలో చేరిన వ్యక్తులు ప్రీమియం చెల్లించిన తర్వాత 55 ఏళ్ల వయస్సు వరకు బీమాని కొనసాగించవచ్చు.

పీఎంజేజేబీవై ప్రయోజనాలు..

ఏదైనా కారణం వల్ల బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే రూ. 2 లక్షల జీవిత బీమా వస్తుంది. పథకంలో 30-రోజుల తాత్కాలిక లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే దీని ద్వారా నమోదు చేసుకున్న తేదీ నుంచి మొదటి 30 రోజులలో ఏవైనా సంఘటనలో వ్యక్తి మరణిస్తే ఆ క్లెయిమ్ లు చెల్లించరు. అయితే ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తే మాత్రం ఇది 30 రోజుల లాకిన్ పీరియడ్ వర్తించదు.

ప్రీమియం ఎంతంటే..

ఈ పథకంలో వార్షిక ప్రీమియం వసూలు చేస్తారు. ఇది ప్రతి ఏడాది మే నెల 31తేదీలోపు మీరు ఎంచుకున్న ఆప్షన్ ఆధారంగా మీ సేవింగ్స్ ఖాతాను ఆటో డెబిట్ అవుతుంది. దీని ప్రీమియం ఏడాది రూ. 436. ఏటా ఇది మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఒకేసారి డెబిట్ అవుతుంది.

పీఎంజేజేబీవై నమోదు ఇలా..

ఈ పథకం కింద ఎన్‌రోల్‌మెంట్‌లను ఖాతాదారుడి బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా కూడా చేసుకోవచ్చు. ఖాతాదారుడి నుంచి వన్-టైమ్ మ్యాండేట్ ఆధారంగా ఈ పథకం కింద ప్రీమియం ఏటా చందాదారుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో-డెబిట్ అవుతుంది.

గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్..!

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తరువాత అక్కడి లాబీలో భట్టి మీడియా చిట్ చాట్‎లో మాట్లాడారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్‎ను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

అయితే అందులో అంగన్వాడీ ఉద్యోగుల సపరేటు, 3 వరకు చెప్పే టీచర్లు సపరేటుగా నియమిస్తామన్నారు. ఈ అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి మేధావులతో చర్చించారన్న సంగతి గుర్తు చేశారు. 4 నుంచి 12 వరకు సెమీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూల్స్‎కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్‎తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మండలానికి 3 చొప్పున సెమీ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. మొన్న జరిగిన బాసర ఐఐఐటీ ఘటన దురదృష్టకరం అన్నారు. బాసరలో ఐఐటీలో మత్తు పదార్థాలు అదుబాటులోకి రావడాన్ని ఖండిస్తున్నానన్నారు. కేంద్ర బడ్జెట్‎లో ప్రాధాన్యత ఇవ్వాలని తాము అడిగామని.. కేంద్రం మొండి చెయ్యి చూపిందన్నారు.

మార్కెట్‌ను శాసిస్తున్న మానవ నిర్మిత వజ్రాలు.. పెరుగుతున్న వినియోగం..

ప్రపంచంలోనే అత్యంత విలువైనది వజ్రం. బంగారానికి మించిన విలువ దీనికి ఉంటుంది. భూమిలో వందల కిలోమీటర్ల లోతులో ఇవి దొరకుతాయి. వాటిని కనిపెట్టి, వెతికి తీయడం కూడా పెద్ద ప్రయత్నమే.

ఇంత అరుదుగా దొరుకుతుంది కాబట్టే వజ్రానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వీటిని కొనడం అనేది తీరని కలే.

సహజ వజ్రాలు..

భూమిలో దొరికే వజ్రాలను సహజ వజ్రాలు అంటారు. ఇవి తయారు కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. వీటి ధర కూడా కోట్లలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఎల్జీడీ) తెరమీదకు వచ్చాయి. వీటిని ల్యాబ్ లలో తయారు చేస్తారు. గట్టిదనం, నాణ్యత విషయంలో సహజ వజ్రాల మాదిరిగానే ఉంటాయి. కానీ ల్యాబ్ లలో తయారు చేసే అవకాశం ఉండడంతో ధర ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్..

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొన్ని వారాలలోనే తయారవుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్బాలలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంకొంచెం ఉన్నతంగా ఉండాలనుకునే వారు వజ్రాభరణాలను ఎంచుకుంటున్నారు. వారికి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనుకూలంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన ఉంగరాలు, ఆభరణాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.

ధర తక్కువ..

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ధర తక్కువగా ఉండడం వల్ల దేశంలో వినియోగం పెరుగుతుందని, అలాగే ఎగుమతులు కూడా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 9 శాతం పెరిగి 1,500 నుంచి 1,530 మిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సహజంగా తవ్విన వజ్రాల ధర కోట్లలో ఉండడంతో వాటికి డిమాండ్ మందకొడిగా ఉంటోంది. కేవలం ధనికులు మాత్రమే వాటిని కొనగలుతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలకు ల్యాబ్ గ్రోన్ డైమండ్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి మార్కెట్ పెరుగుతోంది.

పెరుగుతున్న వినియోగం..

మానవ నిర్మిత వజ్రాల ధర తక్కువ కావడంతో దేశీయంగా వినియోగం, ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. ఎల్జీడీ ఎగుమతులు 7 నుంచి 9 శాతం పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక మార్పులు జరుగుతున్నాయి. రత్నాలు, ఆభరణాల పరిశ్రమలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్జీడీ విక్రయాలతో లోటును భర్తీ చేసుకోనున్నాయి.

డిమాండ్ పెరిగే అవకాశం..

ఇటీవల ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎగుమతులు క్షీణించాయి. ఏవై 2024లో దాదాపు 16.5 శాతం క్షీణత కనిపించింది. దీంతో ఏవై 2025లో ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. సహజంగా తవ్విన వజ్రాలకు డిమాండ్ మందగించే అవకాశం ఉన్నందున, ఎల్జీడీకి ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు.

మన దేశంలో..

మన దేశం ఏడాదికి ల్యాబ్ లో మూడు మిలియన్ల వజ్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో 15 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. మనతో పాటు చైనా, యూఎస్ఏ, సింగపూర్, రష్యా వంటి దేశాలు కూడా ల్యాబ్ గ్రోన్ వజ్రాలను తయారు చేస్తున్నాయి. మన దేశం నుంచి వీటి ఎగుమతులు 2023లో 1,680.22 మిలియన్ల యూఎస్ డాలర్లు కాగా, 2024లో 1,402.30 మిలియన్ల డాలర్లకు పడిపోయాయి.

కార్ లోన్ తీసుకుంటున్నారా? వీటి గురించి ముందు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..

దేశంలో కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. వివిధ కంపెనీల నుంచి అనేక కొత్త కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటి ధరలు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.

విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణం తదితర అవసరాల కోసం కారు తప్పనిసరిగా మారింది. కారు కొనుగోలు చేసే సామర్థ్యం ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే మాత్రం రుణాల మీద ఆధారపడాల్సిందే. సాధారణంగా కొత్త కార్ల కొనుగోలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. ఆ తర్వాత నెలవారీ వాయిదాల రూపంలో రుణాన్ని వడ్డీతో సహా తీర్చాలి. రుణ కాలవ్యవధి మూడు నుంచి ఏడేళ్ల వరకూ ఉంటుంది.

గమనించాల్సిన అంశాలు..

కారు కొనుగోలు చేయడానికి రుణం తీసుకునే ముందు వివిధ అంశాలను ఆలోచించాలి. మీ ఆదాయం, ఖర్చులను లెక్కవేసుకోవాలి. ముఖ్యంగా ఈఎమ్ఐలను సక్రమంగా చెల్లించడం చాలా అవసరం. లేకపోతే జరిమానా రూపంలో అదనపు ఖర్చు పడుతుంది.

నష్టాలు ఇవే..

మీకు నిర్ణీత ఆదాయం ఉంటే కారు కొనుగోలు చేయడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను త్వరగానే మంజూరు చేస్తాయి. అయితే వాటిని తీసుకోవడం వల్ల అన్ని నష్టాలు కూడా కలుగుతాయి. వాటిని ముందు పరిశీలించడం చాలా అవసరం.

రుణ భారం.. రుణం తీసుకోవడం వల్ల మీపై ఆర్థిక భారం పెరుగుతుంది. మీ ప్రణాళికపై గణనీయ ప్రభావం చూపుతుంది. మీరు సమయానికి ఈఎమ్ఐ చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై నెగెటిక్ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో రుణం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

వడ్డీ.. తీసుకున్న రుణానికి వడ్డీ విధిస్తారు. రుణంతో పాటు వడ్డీని కలిసి ఈఎమ్ఐలుగా చెల్లించాలి. ఇది అదనపు భారంగా మారుతుంది. చివరకు కారు ధరను గణనీయంగా పెంచుతుంది. దీర్ఘకాలిక రుణంపై వడ్డీ మొత్తం కారు ధర కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇబ్బందులు.. లోన్ పై కారు కొనుగోలు చేసిన తర్వాత దానిని సులభంగా విక్రయించలేదు. అత్యవసర సమయంలో అమ్మాలంటే లోన్ చెల్లించిన తర్వాత సర్టిఫికెట్ ఉండాలి. కారును కొనుగోలు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా దాన్ని పరిశీలిస్తారు.

ఖర్చులు పెరిగే అవకాశం.. కారు తీసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కు ఖర్చు అవుతుంది. అలాగే బీమా ను కూడా తీసుకోవాలి. వీటి కోసం కొంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎమ్ఐకి ఇవి అదనంగా ఉంటాయి. తద్వారా మీకు ఖర్చులు పెరుగుతాయి. వీటికి అనుగుణంగా మీ ఆదాయం ఉండకపోతే బయట అప్పులు చేయాల్సి ఉంటుంది.

రీసేల్ విలువ.. లోన్ తీసుకుని కారు కొంటే మీరు చెల్లించే ఈఎమ్ఐలు దాని ధర కంటే బాగా ఎక్కువ అవుతాయి. ఎందుకుంటే వడ్డీ రూపంలో మీకు అదనపు భారం పడుతుంది. అలాగే మీరు కారును అమ్మివేయాలనుకున్నప్పుడు దాని ధర బాగా తగ్గిపోతుంది.

ప్రణాళిక లేకుంటే.. ఏది ఏమైనా కారును తీసుకోవాలంటే మీకు పక్కా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఆదాయాన్ని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల అనుకోని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే.. మిస్ చేయకుండా ఇవ్వండి!

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. కేవలం పెద్దలే కాకుండా పిల్లలు కూడా అనారోగ్య పాలవుతారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

సరైన శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలకు వైరల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందులోనూ పిల్లలకు ఇమ్యూనిటీ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పెట్టే ఫుడ్‌పై చాలా శ్రద్ధ చూపాలి. మారుతున్న కాలం కాబట్టి వారికి ఫుడ్ ఇవ్వాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా నింపాలి. అప్పుడే సీజనల్ వ్యాధులు వచ్చినా తట్టుకుంటారు. వర్షంలో తడవడం, బయట ఫుడ్ తినడం వల్ల కూడా పిల్లలు అనారోగ్యం చెందుతారు. ఈ సమయంలో దోమలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటివి వస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా పాడవుతుంది. మరి వర్షా కాలంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవ్వాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

సీతాఫలం:

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా వస్తాయి. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ అలర్జీ, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

పసుపు పాలు:

వర్షా కాలంలో పెద్దలు, పిల్లలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిల్లో పసుపు పాలు కూడా ఒకటి. పసుపు పాలు శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా వీటిలో యాంటీ అలర్జీ గుణాలు ఉంటాయి. ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచి.. అంటు వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

కూరగాయలు – ఆకు కూరలు:

వర్షా కాలంలో కూరగాయలు, ఆకు కూరలు కూడా పిల్లలకు పెడుతూ ఉండాలి. వీటిని తినడం వల్ల శరీరం మొత్తానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి.

డ్రై ఫ్రూట్స్:

సీజన్ ఏదైనా సరే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లలను శక్తివంతంగా తయారు చేస్తాయి. పిల్లలకు శక్తిని అందిస్తాయి. త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంచతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

నీట్ పరీక్ష రద్దుపై ముగిసిన విచారణ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది. బీహార్‎లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది. 155 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్‎తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమని సీబీఐ దర్యాప్తు సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పేపర్‌ లీకేజ్ ద్వారా లబ్ధిపొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని.. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని ధర్మాసనం అభిప్రాయ పడింది. మళ్లీ పరీక్ష పెడితే ఇప్పటి వరకూ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయంపడింది. వారిలో అనేకమంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు వెళ్లి నీట్ ఎగ్జామ్‌ రాసారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు.

ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లోనీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరి కొందరు నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.5.40కోట్లు కాజేసిన సైబర్‌ గ్యాంగ్‌.. చివరికి.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీకి తగ్గట్లుగా అప్‌డేట్‌ అవుతూ అమాయక ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు.

తాజాగా.. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో 5కోట్ల రూపాయల ఘరానా మోసం వెలుగులోకి రాగా.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి కోటి రూపాయలు పోగొట్టుకోవడం కలకలం రేపుతోంది.

దేశంలో సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. అమాయక జనాలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటుగాళ్లు వారిని కోట్లలో దోచేస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లతో లాభాల ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కానీ.. సైబర్‌ మోసాల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. సైబర్‌ మాఫియా బెండు తీస్తున్నారు. తాజాగా.. దుబాయ్‌ సైబర్‌ మాఫియా గుట్టురట్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. దానిలో భాగంగా.. సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మహ్మద్‌ ఇలియాస్‌, రిజ్వాన్‌, సయ్యద్‌ గులాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. 5.40కోట్లు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. మనీలాండరింగ్‌ కేసులో డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు భయపెట్టి.. బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇందుకోసం ఈ ముగ్గురు నిందితుల బ్యాంక్‌ ఖాతాలనే సైబర్‌ నేరగాళ్లు వినియోగించగా.. ముగ్గురి దగ్గర మొత్తం 17 బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో జమ అయిన డబ్బును విత్‌డ్రా చేసి.. దుబాయిలో ఉన్న కీలక నిందితుడు ముస్తఫాకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపుతున్నట్లు తేల్చారు. అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో కోటి కొట్టేసిన గ్యాంగ్‌

ఇదిలావుంటే.. ఇటీవల ఆన్‌లైప్‌ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల మోసాలు కూడా మరింత పెరిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి కోటి రూపాయలు కాజేసింది ఓ కిలాడీ. పటాన్‌చెరుకు చెందిన బెజవాడ నాగార్జున్ అనే వ్యక్తిని.. వాట్సాప్ ద్వారా పరిచయమైన మహిళ.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని ప్రోత్సహించింది. మంచి లాభాలు ఉంటాయని ఆశచూపింది. ఆ మహిళ వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ స్టాక్ మార్కెట్ మేసేజ్ లింక్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసింది. దాంతో.. నాగార్జున దశలవారీగా 99 లక్షల 78వేల 526 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తీరా పెట్టుబడి డబ్బులు, కమిషన్ అడగ్గా కాంటాక్ట్ కట్ చేసింది. దాంతో.. మోసపోయానని తెలుసుకున్న నాగార్జున్.. పోలీసులను ఆశ్రయించడంతో.. చాకచాక్యంగా వ్యవహరించి సుమారు 24 లక్షల రూపాయల అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారు. మిగతా దానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ ఖాతా నుంచి రూ. 5లక్షలు స్వాహా

మరోవైపు… మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి 5లక్షల రూపాయలు పోగొట్టుకుంది. తూప్రాన్‌ మున్సిపాలిటీకి చెందిన యువతికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ వచ్చిందని సమాచారం ఇచ్చారు. దాంతో నిజమేనని నమ్మిన ఆ యువతిని.. సైబర్‌ నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టారు, ఆమె అకౌంట్‌ నుంచి ఐదు లక్షలు కాజేయడంతో లబోదిబోమని మొత్తుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా.. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ బూచోళ్లు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో.. అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పతకాలే కాదు.. సంపాదనలోనూ తెలుగు తేజం తగ్గేదేలే.. స్టార్ క్రికెటర్లకే షాక్ ఇస్తోన్న నెట్‌వర్త్?

PV Sindhu Net Worth: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రస్తుతం గోల్డెన్ గర్ల్ పేరుతో ఫేమస్ అయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన సింధుకు దేశం ఈ పేరు పెట్టారు.

భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన క్రీడలతో పాటు సంపాదన పరంగా నిరంతరంగా ఎదుగుతూనే ఉంది. పద్మశ్రీ నుంచి పద్మభూషణ్ వరకు, సింధు తన విజయాలకు అనేక ప్రధాన అవార్డులను అందుకుంది. భారత్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు పేరుగాంచింది. సింధు చాలా కాలంగా అద్భుతంగా ఆడుతూ, సంపదలోనూ దూసుకెళ్తోంది. అసలు సింధు మొత్తం సంపద ఎంతో తెలుసా?

పీవీ సింధు సంపాదన విషయంలో క్రికెటర్ల కంటే తక్కువేమీ కాదు..

ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తున్న పీవీ సింధు నికర విలువ ఈరోజు 7.1 మిలియన్ డాలర్లు అంటే 2022 నాటికి రూ.59 కోట్లు అన్నమాట. 2022 సంవత్సరంలో, ఫోర్బ్స్ అత్యధిక వార్షిక సంపాదన కలిగిన మహిళా క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పీవీ సింధు 12వ స్థానంలో నిలిచింది. టాప్ 25లో ఉన్న ఏకైక భారత మహిళా క్రీడాకారిణి పీవీ సింధు. సింధు తన ఎండార్స్‌మెంట్‌ల ద్వారా తన ఆదాయాన్ని ఎక్కువగా సంపాదిస్తుంది. ఆమె బ్యాక్ ఆఫ్ బరోడా, బ్రిడ్జ్‌స్టోన్, JBL, పానాసోనిక్, ఇతర అనేక పెద్ద బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తోంది. సింధు భారతదేశంలో అత్యంత మార్కెట్ చేయగల మహిళా క్రీడాకారిణిగా ఫోర్బ్స్ పేర్కొంది.

పీవీ సింధు జులై 5, 1995న హైదరాబాద్‌లో జన్మించింది. పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. సింధు తల్లిదండ్రులిద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. సింధుకు ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు పీవీ దివ్య. పీవీ సింధు తండ్రి 1986 సియోల్ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. అదే సమయంలో, సింధు తల్లి పి విజయ కూడా ప్రొఫెషనల్ వాలీబాల్ క్రీడాకారిణి. సింధు ఎనిమిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది.

ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు..

సింధు ఇప్పటి వరకు 2 ఒలింపిక్ పతకాలు సాధించింది. 2016లో జరిగిన రియో ​​ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం సాధించింది. దీని తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో సింధు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తద్వారా వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఈసారి కూడా పతకం సాధించాలనే ఉద్దేశ్యంతో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. నిజానికి ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా మూడుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించలేదు.

కేవలం రూ.100తోనే నెల రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌

BSNL: దేశంలో Jio, Airtel, Vodafone Idea, BSNL టెలికాం సేవలను అందిస్తున్నాయి. ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్ ఛార్జీలను భారీగా పెంచింది.

ఇది కాకుండా వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా రీఛార్జ్ ఛార్జీలను దాదాపు 26 శాతం పెంచాయి. దీని గురించి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారికి కొంత ఉపశమనం కలిగించడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ వివిధ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.

ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందిస్తోంది. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చుకుంటున్నారు. ఇటీవలి సర్వే ప్రకారం, చాలా మంది ప్రజలు మొబైల్ నంబర్‌ను ఇతర నెట్‌వర్క్‌ల నుండి బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టడం, తగ్గించడం వలన నెలవారీ ప్లాన్ ఏమిటో చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత తక్కువ ధరల్లో 30 రోజుల రీఛార్జ్ ప్రణాళికను కూడా అందిస్తుంది. రూ.199 రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో అందించబడుతుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 60GB డేటాను అందిస్తుంది. రోజుకు 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్‌లను ఉచితంగా అందిస్తుంది. రూ.108 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 28జీబీ డేటాను అందిస్తుంది. రోజుకు ఒక జీబీ డేటా. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్‌లను ఉచితంగా ఉంటాయి. దీనితో మీరు 100 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక నెల పాటు టెన్షన్‌ లేకుండా తక్కువ ధరల్లో పొందవచ్చు.

జియో, ఎయిర్‌టెల్ సంగతేంటి?: జియో రూ. 249 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ రోజుకు ఒక జీబీ డేటాతో వస్తుంది. రూ.299 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది. ఇందులో రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. రూ.349 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో మొత్తం నెలకు 56GB డేటాను అందిస్తుంది. రోజుకు 2GB డేటా అందుతుంది.

అదేవిధంగా ఎయిర్‌టెల్ రూ. 249 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో అందుతుంది. ఈ ప్లాన్ రోజుకు ఒక జీబీ డేటాను అందిస్తుంది. రూ.299 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

Health

సినిమా