Saturday, November 16, 2024

మేఘాల కొండపై అటవీశాఖ కన్ను

మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మేఘాల కొండకు బ్రేక్ పడింది…

మేఘాల కొండ.. ఇది ఇప్పుడు ఫేమస్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ మేఘల కొండను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మేఘాల కొండ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మేఘాల కొండకు అనుకోని కష్టం వచ్చింది. మేఘాల కొండపై అటవీ శాఖ కన్నుపడింది. ఇటీవల దేశవ్యాప్తంగా పర్యాటకపరంగా ఫేమస్ కావడంతో అరకులోయ మండలం మాడగడ మేఘాలకొండకు అటవీశాఖ బ్రేక్ వేసింది. మాడగడ ప్రాంతం తమ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉందని ఇతరులు ప్రవేశించరాదని అటవీశాఖ బోర్డు పెట్టేసింది.

మాడగడ కొండకు టూరిస్టుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని రూ.16 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణ పనులను ఇటీవలే పాడేరు ఐటీడీఏ మొదలుపెట్టింది, అయితే ఇంతలోనే అడవి శాఖ మాడగడ మేఘాల కొండ ప్రాంతం తనదంటూ బోర్డు పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజు వందల వాహనాలు, వేల జనంతో కిటకిటలాడే మేఘాలకొండ ఈరోజు(శనివారం) ఉదయం వెలవెల పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ హఠాత్పరిణామంతో మేఘాల కొండను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మాడగడ గ్రామస్తులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. ఈ స్థలం రెవెన్యూ శాఖలోనే ఉందని సర్వేనెంబర్ 84, 85, 86 ప్రకారం తమకే చెందుతుందని రెవెన్యూ శాఖ వారు నిన్న (శుక్రవారం) సబ్ కలెక్టర్ హయాంలో సర్వే అనంతరం వెల్లడించారు. అటవీ శాఖ ఈ దుందుడుకు చర్యను మాడగడ గ్రామ సర్పంచ్ జ్యోతి తీవ్రంగా ఖండించారు.

మేఘాల కొండ అందాలు…

కాగా.. మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. అరకులోయ మండలం లంతంపాడు సమీపంలో ఉన్న కొండపై నుంచి చూస్తే తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. వేకుజామునే ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరలివస్తుంటారు. ఇంతటి అందమైన దృశ్యాలకు అటవీ శాఖ బ్రేక్ వేయడంపై పర్యాటకులు కూడా ఆశ్చపోతున్నారు. ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేఘాల కొండను చూసేందుకు అనుమతించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు

బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే.

అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.

అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి దీనికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).

నడక హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజు. అంటే దీని వల్ల తక్కువ వ్యవధిలోనే కెలొరీలు అత్యధిక స్థాయిలో ఖర్చవుతాయి. వ్యక్తుల బరువు, నడుస్తున్న ప్రాంతం, నడక వేగాన్ని బట్టి గంటకు 600 నుంచి 1000 వరకూ కెలోరీలు ఖర్చవుతాయి. దీంతో, సులువుగా బరువుతగ్గుతారు.

వివిధ రకాల ఉపరితలాలపై నడకతో కాళ్లు, శరీరంలోని వివిధ రకాల కండరాలు బలోపేతం అవుతాయి. అంతిమంగా ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

కడుపు చుట్టూ ఉన్న కొవ్వు అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. అయితే, నడకతో ఉదరభాగంలో కొవ్వు సులువుగా కరిగిపోతుంది. ఆరోగ్యం వేగంగా మెరుగవుతుంది.

నడకతో మానసిక ఆరోగ్యం కూడా మెరగవుతుంది. రోజూ నడిచే వారిలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మానసికోల్లాసం కలిగిస్తుంది. ఉత్సాహంగా పని చేస్తూ లక్ష్యాలు చేరుకునేలా చేస్తుంది.

వేగంగా నడిస్తే జీవక్రియలు వేగవంతం అవుతాయి. నడక తరువాత కూడా జీవక్రియల వేగంగా అలాగే కొనసాగి కొవ్వు సులువుగా కరిగిపోతుంది.

ఇక నిపుణులు చెప్పేదాని ప్రకారం, రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి, జిమ్‌లల్లో కసరత్తులు చేసినా చేయకపోయినా నడక మాత్రం కొనసాగించాలని నిపుణులు మరీ మరీ చెబుతున్నారు. దీంతో, అపారమైన ప్రయోజనాలను సులువుగా పొందొచ్చని అంటున్నారు.

ఏపీలో రోడ్లకు మహర్ధశ

కూటమి ప్రభుత్వంలో ఏపీలో రోడ్లకు మహర్ధశ కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. యలమంచిలి మండలం అడవిపాలెం వద్ద పాలకొల్లు- దొడ్డిపట్ల ప్రధాన రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ… వచ్చే సంక్రాంతి నాటికి రూ. 600 కోట్లతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు. జగన్ పాలనలో మ్యాప్‌ని చూసి కాకుండా గుంతల రోడ్లను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించే స్థాయికి జగన్ దిగజార్చారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు.

ఏపీవ్యాప్తంగా గుంతలులేని రహదారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయo తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పూర్ణ మార్కెట్ రామకృష్ణ థియేటర్ వద్ద, గుంతల పూడ్చివేత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ , ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… గతంలో రోడ్ల కోసం జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసిందని చెప్పారు. వైసీపీ కారణంగా ఈరోజు రోడ్లు గుంతలు పూడ్చుకునే స్థాయికి దిగజారాల్సి వచ్చిందని అన్నారు. ప్రజల సురక్షితవంతమై

జగన్ హయాంలోనే యురేనియం నిర్ధారణ తవ్వకాలకు అనుమతిచ్చారని కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. యురేనియం నిర్ధారణ తవ్వకాలపై దేవనకొండ మండల ప్రజల నిరసనల పట్ల స్పందించారు. ఇవాళ(శనివారం) కర్నూల్ జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ… యురేనియం నిర్ధారణ కోసం ఇంకా తవ్వకాలు జరపడం లేదని.. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. యురేనియం నిర్ధారణపై ఇప్పుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు నెపం వేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతవరకు ప్రజలు సంయమనం పాటించాలని అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని తిక్కారెడ్డి స్పష్టం చేశారు.

బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే.

విల్లా కొంటే రూ.4 కోట్ల లాంబోర్గినీ కారు ఫ్రీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారి బంపరాఫర్

ఏ బిజినెస్ పెట్టినా అందులో మార్కెటింగ్, ప్రమోషన్స్, యాడ్స్ చాలా ముఖ్యం. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే.. ప్లాట్లను, ఇళ్లను, విల్లాలను అమ్మేందుకు.. జనాలను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్లాట్లలో అయితే వివిధ రకాల చెట్లు.. ఇళ్లు, విల్లాల విషయానికి వస్తే గిఫ్ట్‌లు, ఇంటీరియర్ సహా అనేక సదుపాయాలను కల్పిస్తారు. అయితే ఈ ఖర్చులన్నీ ఆ ప్లాట్లు, ఇళ్లు, విల్లాలలో కలిపినా.. మనకు మాత్రం ఉచితంగా ఇస్తున్నట్లు చూపిస్తారు. అయితే ఇలాగే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ.. తమ వద్ద ఉన్న విల్లాలను అమ్ముకునేందుకు ఒక పెద్ద ఐడియా వేసింది. తమ వద్ద విల్లాలను కొనుగోలు చేస్తే.. అవి కొన్న వారికి ఒక్కొక్కరికీ రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని ఉరుస్ కారును ఉచితంగా అందించనున్నట్లు ఆఫర్ పెట్టారు. దీనికి సంబంధించి ఓ ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టగా.. అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది. తమ వద్ద లగ్జరీ విల్లా కొన్నవారికి లాంబోర్గిని ఉరుస్‌ కారును ఉచితంగా ఇస్తామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. తమ తాము విక్రయించే రూ.26 కోట్ల విలువైన అల్ట్రా-ప్రీమియం విల్లాలను కొనుగోలు చేసే వారికి లాంబోర్గిని ఉరుస్‌ కారును ఫ్రీగా ఇస్తామని పేర్కొంది.

అంతేకాకుండా ఈ విల్లాల్లో ఉండే వారికి ఇతర విలాసవంతమైన సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లు తెలిపింది. పార్కింగ్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, థియేటర్‌, క్లబ్‌ మెంబర్‌షిప్‌, గోల్ఫ్ కోర్స్ కోసం ఈ రూ.26 కోట్లకు అదనంగా మరో రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని జేపీ గ్రీన్స్ సంస్థ స్పష్టం చేసింది. రూ.30 లక్షలు పార్కింగ్‌కు.. రూ. 7.5 లక్షలు కరెంట్ జనరేటర్‌కు.. మరో రూ.7.5 లక్షలు క్లబ్ మెంబర్‌షిప్ కోసం చెల్లించాలని తెలిపింది.

అయితే ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని తెలిపింది. తమ వద్ద విల్లాలు రూ.51 లక్షల నుంచి రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 3 BHK, 4 BHK, 5 BHK, 6 BHKలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గౌరవ్ గుప్తా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

చిన్న సిప్ ట్రిక్‌తో ఇలా చేతికి కోట్లు.. నెలకు 5 వేలు చాలు.. ఎన్నేళ్లు పడుతుందంటే

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు కాస్త రిస్క్ అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రిస్క్ తగ్గించుకునేందుకు.. దీనికి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇందులో చాలా స్కీమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి. పాస్ట్ రిటర్న్స్ ఆధారంగా ఏ స్కీమ్.. వార్షిక ప్రాతిపదికన ఎంత రాబడి ఇచ్చిందనేది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఇక్కడ కూడా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. రిస్క్ లేకుండా రిటర్న్స్ అందుకోవచ్చు. వీటిల్లో కూడా లంప్ సమ్ లేదా సిప్ విధానంలో పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ అంటే నెలనెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి అన్న మాట. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ కాస్త కష్టంగానే ఉంటుంది. దీంతో సిప్‌పై ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక్కడ మీ పెట్టుబడి, కాల వ్యవధి, వార్షిక రాబడి అంచనా .. ఇవన్నీ మీ రిటర్న్స్ ఎంత అనేది నిర్దేశిస్తాయి. ఇక్కడ ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే.. అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ముఖ్యంగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగానే సంపద ఏటా పెరుగుతూ పోతుంటుంది. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు సగటున ఏడాదికి 12-15 శాతం చొప్పున రాబడి అందిస్తున్నాయి. ఇప్పుడు మనం రూ. 5 వేలు, రూ. 10 వేల సిప్ ద్వారా రూ. కోటి నిధి సృష్టించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకుందాం.

వార్షిక ప్రాతిపదికన మనం సగటున 12 శాతం రిటర్న్స్ అంచనా వేస్తూ.. ప్రతి సంవత్సరం సిప్ మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ పోతే ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం. నెలకు రూ. 10 వేల సిప్ చేస్తూ.. 10 శాతం పెంచుకుంటూ పోతుంటే.. 16 సంవత్సరాల్లోనే రూ. కోటికిపైగా సంపాదించొచ్చు. ఇక్కడ పెట్టుబడి రూ. 43.13 లక్షలు కాగా.. వడ్డీ రూపంలో రూ. 60.06 లక్షలు వస్తుంది. మొత్తం కోటికిపైగా సంపాదించొచ్చు.

ఇంకా రూ. 5 వేల సిప్ చేస్తూ పోతే ఏటా 10 శాతం సిప్ మొత్తం పెంచితే.. 21 సంవత్సరాల్లో 12 శాతం వార్షిక రిటర్న్స్ లెక్కన కోటి సంపాదించొచ్చు. దీంట్లో పెట్టుబడి మొత్తం రూ. 38.40 లక్షలు అవుతుంది. వడ్డీ రూపంలోనే ఇక్కడ రూ. 77.96 లక్షలు అవుతుంది. ఇలా మొత్తంగా రూ. కోటికిపైగా అందుతుంది. నెలకు రూ. 1000, 2 వేలు, 3 వేలు ఇలా తోచినంత కూడా పెట్టుబడి పెడుతూ పోవొచ్చు. దీనిపైనా ఏటా సిప్ మొత్తం పెంచుకోవచ్చు.

మహిళలకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. వారందరికీ రూ.8 లక్షలు

మహిళలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త అందించింది. కొత్తగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించనుంది. వ్యవసాయ రంగంలో పురుగుమందులను పిచికారీ చేసేందుకు మహిళా సంఘాలకు చేయూతను అందించనుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కో మహిళా స్వయం సహాయక బృందానికి గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

2024-25 నుంచి 2025-26వ ఆర్థిక సంవత్సరం వరకు ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.1261 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘానికి ఆర్థికంగా సహాయం చేయనుంది. అయితే డ్రోన్‌ ధరలో గరిష్ఠంగా 80 శాతం గానీ.. లేదంటే రూ.8 లక్షలు కానీ ఆర్థిక సాయంగా అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీ రాయితీతో స్వయం సహాయక సంఘాల క్లస్టర్‌ స్థాయి సమాఖ్యలు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

ఈ పథకం ప్రధాన ఉద్దేశం.. మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించి వారి కాళ్లపై వారు ఆధారపడేలా చేయడమే కాకుండా వ్యవసాయ రంగంలో అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ ఏడాది డ్రోన్లు అందించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహిళా సంఘాలకు అధికంగా ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు డ్రోన్ల పంపిణీ చేయనున్నారు.

ఇక రాష్ట్రాలకు డ్రోన్లు పంపిణీ చేయడానికి ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో గరిష్ట సాగు భూమి, చురుకైన మహిళా స్వయం సహాయక బృందాలు, నానో ఎరువుల వినియోగం ఆధారంగా డ్రోన్లను అందించనున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్రోన్ ప్యాకేజీ ధర సుమారు రూ. 10 లక్షలు ఉండగా.. ఈ డ్రోన్ కోసం.. సహాయక బృందాలకు రూ. 8 లక్షలు అంటే 80 శాతం సబ్సిడీ అందించనున్నారు. మిగిలిన రూ. 2 లక్షలు అంటే 20 శాతం అప్పు ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక బృందాల్లో చేరారు.

ఇందులో డ్రోన్‌తోపాటు నాలుగు ఎక్స్‌ట్రా బ్యాటరీలు, ఛార్జింగ్ హబ్, ఛార్జింగ్ కోసం జెన్‌సెట్, డ్రోన్ బాక్స్‌ ఉంటాయి. అంతేకాకుండా డ్రోన్‌ను కంట్రోల్ చేసేందుకు మహిళకు డ్రోన్ పైలట్‌ ట్రైనింగ్ కూడా ఇస్తారు. డ్రోన్ డేటా విశ్లేషణ, మెయింటెనెన్స్ కోసం మరో మహిళకు కో-పైలట్‌గా 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారు.

హైదరాబాద్ నగరంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా గాలి నాణ్యత తగ్గింది. కేవలం గంటల వ్యవధిలోనే పొల్యూషన్ పెరిగిపోయింది. కొన్ని ఏరియాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగినట్టు సీపీసీబీ వెల్లడించింది. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ.. అనుకోని అతిథిని తీసుకువచ్చాయి. దీపావళి బాణసంచా కారణంగా ప్రమాదకరమైన స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆకాశంలో పటాకుల ఉద్గారాలు నిండిపోవడంతో గాలి నాణ్యత తగ్గిందని వివరిస్తున్నారు. దీనివల్ల పర్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రత గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. కొంపల్లిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయి దాటింది. ఈ స్థాయికి వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోయి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయని అంటున్నారు. అటు సోమాజిగూడలోను ఇదే పరిస్థితి ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది.

గచ్చిబౌలి, కోకాపేట్, సనత్‌నగర్‌లోనూ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ అయినట్టు వెల్లడించింది. వాయు కాలుష్య పెరుగుదలకు బాణసంచా ప్రధాన కారణం అయినప్పటికీ.. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌తో సహా ఇతర కాలుష్య కారకాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి.

నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో గాలి నాణ్యత 171గా నమోదైంది. ఇది తీవ్రస్థాయి కాలుష్యం అని నిపుణులు చెబుతున్నారు. మలక్‌పేట్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 335గా నమోదైంది. దీపావళి టపాసుల వల్ల ఏమేర వాయు కాలుష్యం జరిగిందో దీన్నిబట్టి అర్థం అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6 వేల మందికి పైగా మరణించినట్టు నివేదికలు చెప్తున్నాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యం వల్ల 1,597 మంది మరణించారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. 2వ స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగళూరు, 4వ స్థానంలో పూణె, ఐదో స్థానం చెన్నై నగరాలు ఉన్నాయి.

దీపావళికి టపాసుల్లా పేలిన మూవీస్

మూవీ లవర్స్ కు పండుగలు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రతి పండుగకు ఎదో ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది తెలుగులో పెద్ద పెద్ద పండగలేవి ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేకపోయాయి. సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా.. వాటిలో హనుమాన్ బాగా ఆడింది. ఇక దసరాకు నాలుగు సినిమాలు రిలీజ్ కాగా ..వాటిలో ఒక్కటీ కూడా మెప్పించలేకపోయింది. కానీ దీపావళికి మాత్రం వచ్చిన ప్రతి మూవీ థౌసండ్ వాలా రేంజ్ లో భారీ రీసౌండ్ చేస్తున్నాయి. ఈ దీపావళికి తెలుగు నుంచి ‘లక్కీ భాస్కర్’.. ‘క’ లాంటి రెండు క్రేజి మూవీస్.. తమిళం నుంచి ‘అమరన్’, కన్నడ నుంచి ‘బఘీర’ రేసులో నిలిచాయి. సాధారణంగా ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు రిలీజ్ అయితే.. వాటిలో ఎదో ఒకటి మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఈసారి మాత్రం రేసులో పాల్గొన్న నాలుగు సినిమాలు విజయాన్ని సాధించాయని చెప్పి తీరాల్సిందే.

వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ గురించి.. సాధారణంగా ఏ హీరో అయినా హిట్ కొడితే ఆ హీరో అభిమానులు మాత్రమే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పొచ్చు . గత కొంత కాలంగా సక్సెస్ చూడని కిరణ్ అబ్బవరంకు .. ‘క’ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీమియర్ , ఫస్ట్ షోస్ నుంచే పాజిటివ్ , హిట్ టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా మూవీ క్లైమాక్స్ లో లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ , హీరో ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కటి ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. కలెక్షన్స్ విషయం పక్కన పెట్టేస్తే..కథలో కంటెంట్ ఉన్న మూవీ ‘క’. ఓవరాల్ గా ఈ మూవీ ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీ.. తెలుగులో దుల్కర్ సల్మాన్ తీసిన సినిమాలు తక్కువే. అయినా కూడా ఈ హీరోకు ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. దానితో పాటు సినిమా థీమ్ అండ్ డిజైన్ , దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అందరిని మెప్పించింది. ఈ మూవీ అంతా కూడా స్టాక్ మార్కెట్ అండ్ బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమాలో కూడా క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ గేమ్ అదరగొట్టేశాడని చెప్పొచ్చు.

ఈ రెండు కాకుండా తమిళం నుంచి రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ మూవీ.. అమరన్. ఈ మూవీ రిలీజ్ కు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ జర్నీకి అద్దం పట్టిన ఈ సినిమా.. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ , క్లైమాక్స్ అందరిని మరింత భావోద్వేగానికి గురి చేస్తాయని చెప్పి తీరాల్సిందే. ఇక సాయి పల్లవి , శివ కార్తికేయన్ తమ పాత్రలలో నటించారని చెప్పడం కంటే.. జీవించారని చెప్పొచ్చు. ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఇక కన్నడ నుంచి వచ్చిన సినిమా బఘీర. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మాస్, యాక్షన్, థ్రిల్లర్‌, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ ఇది. క్లైమాక్స్ లో ఆఖరి 20 నిమిషాలు ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీమురళీ పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెసెన్స్ అందరిని మెప్పిస్తుంది. ఓవరాల్ ఈ మూవీ ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్. ఇలా ఈ దీపావళికి వచ్చిన నాలుగు సినిమాలు కూడా ఒక దానితో ఒకటి కంపారిజన్ లేకుండా దేనికదే స్పెషల్ గా నిలిచాయి.

November 1 నుంచి కొత్త రూల్స్.. వారికి గట్టి షాకే

అక్టోబర్ నెల అయిపోయింది. నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాము. ఇక నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వచ్చేశాయి. మామూలుగా కొత్త నెల స్టార్ట్ కాగానే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలులోకి వస్తాయి. అదే విధంగా కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ కూడా కొత్త నెల తొలి రోజు నుంచే అమలు చేస్తుంటారు. అదే క్రమంలో ఈ నవంబర్ నెల స్టార్ట్ అయ్యాక కొన్ని రూల్స్ అమలులోకి వచ్చేశాయి. ఈసారి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. ఇవి మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపవచ్చు. మరి ఆ రూల్స్ ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎస్‌బీఐ కార్డ్స్ వాడే వారికి షాక్ అనే చెప్పాలి. ఇందుకు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అమలులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలు పెరిగాయి. నవంబర్ 1 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీగా 3.75 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అన్‌సెక్యూర్డ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు నెలకు 3.75 శాతానికి పెరిగాయి. ఇక బిల్లింగ్ పిరియడ్‌లో యుటిలిటీ పేమెంట్స్ కనుక రూ.50,000 దాటితే 1 పర్సెంట్ ఎక్కువ ఛార్జ్ పడుతుంది. అయితే ఈ ఛార్జి వసూలు మాత్రం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎల్‌పీజీ గ్యాస్, వంటి యుటిలిటీ బిల్లుల పేమెంట్స్ రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లిస్తే 1 పర్సెంట్ సర్ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫీజు విషయంలో, క్రెడిట్ కార్డ్ రివార్డ్ విషయంలో కొన్ని చేంజెస్ చేసింది. ఈ చేంజెస్ ఇన్సూరెన్స్, కిరాణా కొనుగోళ్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్యూఎల్ సర్‌ఛార్జ్ బెనిఫిట్స్, లేట్ పేమెంట్ ఫీజులు వంటి సర్వీసెస్ కి సంబంధించినవి. నవంబర్ 15 నుంచి ఈ ఛేంజెస్ అమల్లోకి వస్తాయి. ఇక స్పా బెనిఫిట్స్ నిలిపివేత, రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చులకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ బెనిఫిట్ తీసి వేయడం, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్‌లు తొలగింపుతో పాటు థర్డ్ పార్టీ మార్గాల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజులు పే చేస్తే 1% ఛార్జీలు పెరుగుతాయి.

ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 30, 2024గా ఉంది. ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 300 డేస్’ స్పెషల్ ఎఫ్‌డీలో జనరల్ పబ్లిక్‌కు కూడా 7.05 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు అయితే 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం వడ్డీ వస్తుంది. ఇక 400 రోజుల ఎఫ్‌డీపై జనరల్ పబ్లిక్‌కు 7.25 శాం, సీనియర్‌ సిటిజన్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం వడ్డీ రేట్లనేవీ అప్లై అవుతాయి. ఇక అలాగే అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ వ్యాలిడిటీని తగ్గిస్తున్నట్లు ఇండియన్ రైల్వే ఇంతకముందే ప్రకటించింది. గతంలో 120 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ బుకింగ్ పీరియడ్‌ను 60 రోజులకు తగ్గించింది. దీంతో 2 నెలల ముందు మాత్రమే అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడదు. వాళ్ళకు పాత రూలే అప్లై అవుతుంది.

ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 1 నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు (DMT) సంబంధించి కొత్త రూల్‌ని పెట్టింది.అన్నీ ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్స్, కంపెనీలు ఆర్థిక చట్టాలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ సేఫ్టీని పెంచేలా ఆర్బీఐ ఈ రూల్స్‌ను పెట్టింది. 24 జూలై 2024న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల అవైలబులిటీ మరింత పెరగుతుంది. అంతేకాదు మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన పేమెంట్స్ సిస్టమ్స్ కూడా బాగా మెరుగవుతాయి. కేవైసీ పనులు మరింత ఈజీగా అవుతాయి.ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను మారుస్తూ ఉంటాయి. ఇక ఈ నవంబర్ 1న నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచింది. హైదరాబాద్‌లో రూ.855కు పెంచింది. అలాగే ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే చాలా మంది సైబర్ మోసగాళ్లు ఫేక్ కాల్స్, మెసేజ్ ల ద్వారా ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.ఈ నవంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. మన ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను టెలికాం ఆపరేటర్లు ముందే స్క్రీనింగ్ చేస్తారు. స్పామ్ కాల్‌లు, మెసేజీలు వెంటనే బ్లాక్ చేసేస్తారు. ఇదీ సంగతి. ఇవి నవంబర్ 1 నుంచి అమలయ్యే ముఖ్యమైన రూల్స్.

Google కి పోటీగా ChatGPT నుంచి సూపర్ ఫీచర్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఒక రేంజిలో డెవలప్ అయ్యింది. ఇంకా డెవలప్ అవుతుంది కూడా. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది. చాలా రంగాల్లో ఏఐ దూసుకుపోతుంది. కొన్ని రంగాలలో అయితే AI వినియోగం అనివార్యంగా మారింది. ఎలా అంటే అసలు AI లేకపోతే పనులేమి జరగవు అన్నట్టుగా డెవలప్ అయ్యింది. అయితే ఇంతలా ఏఐ ఫేమస్ అవ్వడానికి కారణం చాట్‌జీపీటీ. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఓపెన్‌ ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ.. సెర్చ్‌ ఇంజన్‌లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. అసలు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా దానికి వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ యొక్క స్పెషాలిటీ.

అయితే ఒక్క ఫీచర్ మాత్రం ఇందులో ఉండదు. అదేంటంటే గూగుల్‌లో ఉన్నట్లు వెబ్‌ లింక్స్‌ చాట్‌ జీపీటీలో ఉండవు. ఇప్పటిదాకా మనం అడిగిన ప్రశ్నకు కేవలం ఒకే సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఓపెన్‌ ఏఐ సూపర్ డెసిషన్ తీసుకుంది. సేమ్ గూగుల్‌ లాగానే ఇకపై చాట్‌ జీపీటీలో కూడా వెబ్‌ లింక్స్‌ ని సజెక్ట్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా యూజర్లు ఇకపై ఇన్స్టంట్ గా, అంటే చాలా త్వరగా వెబ్‌ లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్‌ ఇన్ఫర్మేషన్ చూడవచ్చని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఇంతకు ముందు అయితే కేవలం సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా మాత్రమే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇకపై ఆ అవసరం ఉండదని తెలిపింది. ఇందుకోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ హోమ్‌ పేజీలో కొత్తగా సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్‌ చేయొచ్చు.

ఈ సరికొత్త ఫీచర్‌ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. కేవలం డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవ్వనుంది. చాట్‌జీపీటీ ప్లస్‌, టీమ్‌ యూజర్లు, సెర్చ్‌ జీపీటీ వెయిట్‌ లిస్ట్‌ యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఎంటర్‌ప్రైజెస్‌, ఎడ్యుకేషనల్‌ యూజర్లకు కొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. అలాగే చాట్‌ జీపీటీని ఫ్రీగా వాడుతున్న వారికి మాత్రం ఈ ఫీచర్‌ రావడానికి కొంత టైమ్ పడుతుందని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో చాట్ జీపీటీ గూగుల్ కి కచ్చితంగా పోటీ ఇవ్వడం ఖాయం.

ప్రభాస్ కెరీర్ లో టచ్ చేయని క్యారెక్టర్..! సందీప్ మాస్టర్ ప్లాన్

సాధారణంగా సందీప్ కథలలోని పాత్రలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అతను చెప్పాలనుకున్న కంటెంట్ ను బలమైన క్యారెక్టర్స్ తో స్క్రీన్ మీద చూపిస్తాడు. ఆల్రెడీ అర్జున్ రెడ్డి , యానిమల్ సినిమాలలో సందీప్ వర్క్ ఏంటో అందరికి అర్థమైంది. మొదట హీరోలను చాలా సింపుల్ గా చూపించినా కూడా.. కథ ముందుకు తీసుకువెళ్లే కొద్దీ.. వారి క్యారెక్టర్ స్లో గా ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టరైజషన్ కారణంగానే సినిమా ఆడియన్స్ కు స్లో పాయిజన్ లా ఎక్కేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే స్పిరిట్ విషయంలోనూ ఇదే జరగబోతుంది. ఆల్రెడీ స్పిరిట్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూ వస్తున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ అని.. ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడని అనే విషయాలు తెలిసిందే. అదంతా నిజమే ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ గానే కనిపిస్తాడు. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ.. అందులోని ట్విస్ట్ ల కారణంగా ప్రభాస్ క్యారెక్టర్ గ్యాంగ్ స్టర్ గా మారుతుందట. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి పాత్రను టచ్ చేయలేదు. పోలీస్ గా ప్రభాస్ ను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. అలాంటిది ఇప్పుడు గ్యాంగ్ స్టర్ రేంజ్ అంటుంటే.. ఇది ఖచ్చితంగా థియేటర్స్ తగలపడిపోయే న్యూస్ అని చెప్పాల్సిందే.

దీనితో ఈ న్యూస్ ఇప్పుడు సినిమాపై ఇంకాస్త అంచనాలను పెంచేసింది. పైగా ఇప్పటివరకు సందీప్ తీసిన సినిమాలకు మించిన వైలెన్స్ ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. సినిమా అంతా కూడా గ్యాంగ్స్ , గన్స్ , డ్రగ్స్ నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది. అసలే ఆరడుగుల కట్ అవుట్ .. సరిగ్గా నుంచుంటే స్క్రీన్ కూడా సరిపోదని టాక్.. పోయి పోయి సందీప్ చేతికి చిక్కాడు. అక్కడ స్క్రిప్ట్స్ అన్నీ కూడా వైలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక మధ్యలో ఇలాంటి హీట్ ఎక్కించే అప్డేట్స్. ఇవన్నీ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరూ కలిసి చేసే విధ్వంసం కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ అందరికి పూనకాలు తెప్పిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ను స్క్రీన్ మీద చూడడం కొత్తేమి కాదు.. కానీ సందీప్ రెడ్డి ఏ రేంజ్ లో చూపిస్తాడా అనే దానిమీదే ఇప్పుడు ఆడియన్స్ కంప్లీట్ ఫోకస్ పెట్టారు.

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు రూ. 333 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. 17 లక్షలు మీవే

అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఆ ధైర్యమే వేరు. డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా డబ్బు అవసరం. అందుకే ప్రతి ఒక్కరు మనీ సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. డబ్బును సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. డబ్బు సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తూ ఆదాయం పొందొచ్చు. డబ్బును డబ్బే సంపాదిస్తుంది. మీరు ఈ రోజు పొదుపు చేస్తే రేపటి రోజున అది మిమ్మల్ని కాపాడుతుంది. మీ భవిష్యత్ ఆర్థికావసరాలను తీరుస్తుంది. పెట్టుబడి పెట్టగా వచ్చిన సొమ్ముతో పిల్లల చదువులు, పెళ్లిల్లు, సొంతింటి కల ఇలా ఏదైనా నెరవేర్చుకోవచ్చు.

పెట్టుబడికోసం స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు అందుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ నుంచి మతిపోగొట్టే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే రికరింగ్​ డిపాజిట్ స్కీమ్. ఇందులో రోజుకు రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏకంగా 17 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. మీరు ఈ స్కీమ్​లో చేరి 17 లక్షల రూపాయలు పొందాలనుకుంటే.. పెట్టుబడి నెలకు రూ. 10 వేలు పెట్టాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్​ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కాబట్టి ఈ సమయానికి మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.7 లక్షల 13వేలు అవుతుంది. అయితే మీరు మరో 5 సంవత్సరాలు పొడిగించారని అనుకుంటే అప్పుడు 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై వచ్చే వడ్డీ రూ. 5 లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు పొందొచ్చు.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో జాబ్స్.. నెలకు 55 వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

దేశంలో పట్టాభద్రుల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. స్కిల్స్ డెవలప్ చేసుకుని ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, ఈకామర్స్ సంస్థల్లో, పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే ప్రైవేట్ సెక్టార్ లో శాలరీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాలమాదిరిగా ఉంటాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అందుకే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీ ఉంటుంది.

శాలరీతో పాటు సౌకర్యాలు కూడా పొందొచ్చు. అందుకే ప్రభుత్వ కొలువులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ట్రైనీ ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 77 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 49, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 28 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోటీపడేవారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

అభ్యర్థుల వయసు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు, మూడో ఏడాది రూ.40 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.40 వేలు, రెండో ఏడాది రూ.45 వేలు, మూడో ఏడాది రూ.50 వేలు నాలుగో ఏడాది రూ.55 వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 9 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం bel-india.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

రేపే యమవిదియ.. అన్నాచెల్లెళ్ల బంధానికి అద్దంగా నిలిచే భగిని హస్తభోజనం.. శుభ సమయం ఎప్పుడంటే

రాఖీ పండగ వలెనే అన్నా చెల్లెళ్ళ పండగ కూడా సోదర-సోదరి బంధానికి అంకితం చేయబడింది. ఈ ఏడాది భాయ్ దూజ్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండగను నవంబర్ 3న జరుపుకోనున్నారు. ఈ రోజు సోదరి తన సోదరుడికి తిలకం దిద్ది తన సోదరుడు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటుంది. అన్నా చెల్లెళ్ళ పండగ రోజున ప్లేట్‌లో ఏ వస్తువులు ఉంచాలి? సోదరుడికి తిలకం ఎలా దిద్దలో ఈ రోజు తెలుసుకుందాం..

ఐదు రోజుల దీపాల పండుగ ప్రతి సంవత్సరం ధన త్రయోదశి నుండి ప్రారంభమవుతుంది. కాగా ఐదు రోజుల దీపావళి పండుగలో అన్నా చెల్లెల పండగ కూడా ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు అంకితం చేయబడింది. ఎందుకంటే ఈ పండుగ అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నం. ఈ రోజున సోదరీమణులందరూ తమ సోదరులకు తిలకం దిద్ది భోజనం పెడతారు. తరువాత సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. తన సోదరిని కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈసారి దీపావళి పండుగ తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. దీంతో దీపావళి తర్వాత వచ్చే పండుగల తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. అయితే ఈ ఏడాది అన్నా చెల్లెళ్ళ పండుగను నవంబర్ 3న జరుపుకోనున్నారు.

చాలా ప్రాంతాల్లో ఈ అన్నాచేలేళ్ళ పండగను యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున వ్యాపారస్తులు చిత్రగుప్తుని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఈ పండుగ యమధర్మ రాజు అతని సోదరి యమునల మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. మీరు కూడా అన్నా చెల్లెళ్ళ పండగ రోజున మీ సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టనున్నట్లు అయితే మీ సోదరుడికి ఎలా తిలకం దిద్దాలి.. ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
యమ ద్వితీయ తేదీ 2024

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం రెండవ తిది విదియ తిధి శుక్ల పక్షం నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి నవంబర్ 3 రాత్రి 7:52 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈసారి అన్నా చెల్లెళ్ళ పండగను నవంబర్ 3న జరుపుకుంటారు.

అన్నా చెల్లెళ్ళ పండగకు అనుకూలమైన సమయం

అన్నా చెల్లెళ్ళ పండగ రోజున పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం నవంబర్ 3వ తేదీ ఉదయం 11:45 నుండి 1:30 వరకు ఉంటుంది.

ఈ రోజున సోదరునికి తిలకం పెట్టే శుభ సమయం నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది.
అన్నా చెల్లెళ్ళ పండగ రోజున థాలీలో ఏమి ఉంచాలంటే

సిందూరం- తిలకం రక్షణ , శ్రేయస్సును సూచిస్తుంది.
అక్షతలు – అక్షతలు లేని తిలక ధారణ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
చందనం – మీరు థాలీలో కూడా చందనాన్ని ఉంచవచ్చు.
దారం – సోదరుని మణికట్టు మీద కట్టుకునే ఎరుపు రంగు దారం ఉండటం కూడా ముఖ్యం.
దీపం – తిలకం దిద్దే సమయంలో పళ్ళెంలో దీపం వెలిగించాలి.
తమలపాకు – తిలకం సామాన్లు పెట్టె ప్లేట్‌లో తమలపాకును ఉంచండి. అది గణేశుని చిహ్నం.
వెండి నాణెం – ఈ థాలీలో వెండి నాణెం ఉంచాలి.
కొబ్బరి కాయ – థాలీలో కొబ్బరికాయను కూడా ఉంచాలి.
స్వీట్లు – తిలక ధారణ అనంతరం సోదరుడికి మిఠాయిలు తినిపించడం కూడా సంప్రదాయంలో ఒక భాగం.
అరటి పండ్లు – బృహస్పతి గ్రహానికి సంబంధించినది కాబట్టి అరటిపండును ఈ థాలీలో తప్పనిసరిగా ఉంచాలి.

సోదరుడికి ఎలా తిలకధారణ చేయాలంటే

అన్నింటిలో మొదటిది ఉదయం నిద్రలేచిన తర్వాత సోదరీమణులు, సోదరులు స్నానం చేయాలి.
దీని తరువాత సోదరి.. తన దరుడికి తిలకం దిద్దడానికి ఒక ప్లేట్ సిద్ధం చేయండి.
ప్లేట్‌లో పండ్లు, పూలు, స్వీట్లు, అక్షతలు, కుంకుమ వంటివి తీసుకోండి.
శుభ సమయంలో సోదరునికి తిలకం దిద్దండి
ఈ సమయంలో సోదరీమణులు తమ సోదరుడిని స్టూల్‌పై కూర్చోబెట్టాలి.
దీని తరువాత సోదరి తన సోదరుడి తలపై ఎర్రటి రుమాలు వేయాలి.
తర్వాత సోదరి, సోదరుల చేతుల్లో ఎండు కొబ్బరిని ఇవ్వండి.
సోదరి తన ఉంగరపు వేలితో సోదరుడి నుదుటిన చందనం తిలకంగా దిద్దండి.
కావాలంటే సోదరుడి మణికట్టుకి ఎర్రటి దారాన్ని రక్షగా కట్టవచ్చు.
తిలకం పెట్టిన అనతరం అక్షతలు వేయండి.
దీని తరువాత సోదరి తన సోదరుడికి స్వీట్లు తినిపించండి
ఆ తర్వాత సోదరి.. తన సోదరులకు హారతిని ఇవ్వండి.
అప్పుడు సోదరి తన సోదరుడి దీర్ఘాయువును కోరుకోవాలి.
సోదరుడు తన సోదరికి ఏదైనా బహుమతిని ఇవ్వండి
చివరగా సోదరుడు తన సోదరిని ఎల్లవేళలా కాపాడతానని వాగ్దానం చేయాలి.

దేవర ఓటీటీకి రంగం సిద్ధం.. స్ట్రీమింగ్

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర భారీ విజయాన్ని అందుకుంది. దేవర ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే మొదటి భాగం విడుదలై ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇక ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక దేవర ఓటీటీ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. దేవర నుంచి ఒకొక్క వీడియో సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో దేవర ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ ను ఇప్పటికే థియేటర్స్ లో ఎగబడి చూశారు జనాలు. ఇప్పుడు ఈ ఓటీటీలోకి రానుందని తెలిసి. ప్రేక్షకులు ఆనంద పడుతున్నారు.

దేవర తో దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హిట్ అందుకున్నారు. మొదటి రోజు రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న దేవర అయిదు వారాలు పూర్తి అయ్యేప్పటికి రూ.400 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది.ఇక ఈ ను మరోసారి చూడటానికి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈగర్ గా ఎదుచూస్తున్నారు. దేవర ఓటీటీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా లు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దేవర మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌ కాలేదు. త్వరలోనే దేవర ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. కాగా దేవర ను నవంబర్‌ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

శీతాకాలంలో గ్రీన్ టీ తాగడం మంచిదే.. తాగే సమయంలో ఈ తప్పులు చేస్తే అనారోగ్యానికి వెల్కం చెప్పినట్లే..

గ్రీన్ టీ తాగే ట్రెండ్ ఇప్పుడు బాగా పెరిగింది. ఫ్యాటీ లివర్ లేదా స్కిన్ గ్లో చికిత్స అయినా.. గ్రీన్ టీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్మకం.

దీంతో ఎక్కువ మంది గ్రీన్ టీని తాగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రప్రంచ వ్యాప్తంగా గ్రీన్ టీ ప్రసిద్ది చెందినా.. దీని చరిత్ర భారతదేశంలో కూడా చాలా పాతది. ఎక్కువ మంది ఈ పానీయం బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఇది జీవక్రియ రేటును సరిచేయడం ద్వారా మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రోజూ సరైన మోతాదులో తీసుకుంటేమ ఈ టీని తాగిన ప్రభావం ముఖంలో మెరుపు రూపంలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కూడా ప్రతిరోజూ ఈ హెల్తీ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు.

గ్రీన్ టీ వినియోగానికి సంబంధించి ప్రజల మనస్సులో చాలా ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఖచ్చితంగా ఉత్పన్నమయ్యే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే అది తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. అయితే ఈ గ్రీన్ టీని తాగేటప్పుడు చాలా మంది తప్పులు పునరావృతం చేస్తారని మీకు తెలుసా? గ్రీన్ టీ తాగడానికి సంబంధించిన కొన్ని తప్పులు.. ముఖ్యమైన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

నిపుణులు ఏమని చెప్పారంటే.. జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా టీవీ9తో ప్రత్యేక సంభాషణలో గ్రీన్ టీ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. గ్రీన్ టీ వంటివి తాగే ముందు శరీర స్థితిగతులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరి స్వభావంలోనైనా వాత లేదా కఫ దోషాలు ఉన్నట్లు అయితే.. ఈ గ్రీన్ టీ వినియోగం అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో దీన్ని తాగడం మంచిది. అయితే పొరపాటున కూడా ఎక్కువ మోతాదులో తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ తప్పులు చేయవద్దు.. గ్రీన్ టీని వేసవిలో ఎక్కువగా తాగడం వల్ల ముక్కు నుంచి రక్తం లేదా ఆరోగ్యానికి ఇతర హాని కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

చలికాలంలో కూడా దీన్ని ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే తాగమని సూచిస్తున్నారు. కొంతమంది ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ఎక్కువ కప్పులు తాగుతారు. దాని కారణంగా వారికి జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

కొంతమంది రోజు మొత్తంలో టీ, కాఫీలతో పాటు గ్రీన్ టీని తాగుతుంటారు. ఆయుర్వేద నిపుణులు ఈ అలవాటును పెద్ద తప్పుగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి లాభానికి బదులు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్నవారు పొరపాటున కూడా గ్రీన్ టీని తాగకూడదు. ఇలా చేయడం వల్ల పొట్ట ఆరోగ్యం పాడవుతుంది. ఇండిజేషన్ ఉన్న వ్యక్తులు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.

గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే.. గ్రీన్ టీ తాగే విషయంలో సరైన విషయాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టీని తీసుకుంటే.. అతిపెద్ద ప్రయోజనం మన బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు చెప్పారు. జీవక్రియను పెంచడం ద్వారా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఎందుకంటే పొట్ట ఆరోగ్యం బాగోలేకపోతే శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది.

నెల రోజుల పాటు రోజూ గ్రీన్ టీ తాగితే దాని ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుందని డాక్టర్ గుప్తా చెబుతున్నారు. ముఖం రంగు మెరుగుపడుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

గ్రీన్ టీ ద్వారా బ్లడ్ షుగర్ ను కూడా అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ లేదా నిపుణుడి సలహా మేరకు మాత్రమే గ్రీన్ టీని రోజూ తాగాలని సూచిస్తున్నారు.

తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36 వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని నియమించింది ప్రభుత్వం.

సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటనే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి. తర్వాత కులగణనకు ఇంటింటికి వెళ్లాలి.

ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదన్నారాయన. సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామన్నారు. కరీంనగర్‌లో ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది.

బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయినా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్‌కు లేదు కాబట్టే నామ్‌కేవాస్త్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు కుల సంఘాలు కూడా కులగణన, బీసీ కమిషన్‌పై పెదవి విరుస్తున్నాయి. లెక్కలు పక్కాగా రాకపోతే ఊరుకునేది లేదంటున్నాయి. మరోవైపు విపక్షాలు, కులసంఘాల ఆరోపణలను విమర్శలను పట్టించుకోకుండా కులగణనకు అన్నిఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించాలని నిర్ణయించింది. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని డెడ్‌ లైన్ విధించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది

రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయబోతోంది. అలాగే వాటిలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు మొదటి స్క్రాంబ్లర్ బైక్ కూడా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రాబోయే మోటార్‌సైకిల్‌కు బేర్ 650 అని పేరు పెట్టింది కంపెనీ. దాని లీకైన టీజర్ కూడా బయటకు వచ్చింది. 650 cc సెగ్మెంట్ ఈ రాబోయే మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 తేలికపాటి, ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వెర్షన్‌గా పరిగణిస్తున్నారు. ఇది గొప్ప లుక్స్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 లుక్, ఫీచర్ల గురించి .. నియో-రెట్రో డిజైన్‌తో ఉన్న ఈ మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కాంపాక్ట్ రియర్ డిజైన్, రెట్రో లుకింగ్ ఇండికేటర్‌లు, సింగిల్ పీస్ సీట్ సెటప్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు స్టీల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, సింగిల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 5 అంగుళాల ట్రిప్పర్ డాష్ ఉంటాయి. బేర్ 650లో గూగుల్ మ్యాప్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు. రాబోయే రోజుల్లో ఈ బేర్ 650 గురించి సమాచారం వెల్లడి కానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఇంజన్, పవర్ గురించి చెప్పాలంటే, కంపెనీకి చెందిన ఇతర 650 సిసి మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఇది 648 సిసి ప్యారలల్ ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుందిజ ఇది గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ని, 52 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండనుంది. ఈ బైక్ సింగిల్, డ్యూయల్ టోన్ వంటి రెండు రంగుల్లో లభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి కాసుల పంట.. అక్టోబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు

భారత్‌లో వస్తు, సేవల పన్నుల పంట కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో ప్రభుత్వానికి రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ ట్యాక్స్‌ వచ్చింది. గత ఆరు నెలల్లో వసూలు చేసిన జీఎస్టీలో ఇదే అత్యధికం.

గత ఎనిమిది నెలల నుంచి ప్రతి నెలా కనీసం 1.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం విశేషం.

సెప్టెంబర్ 2024లో GST వసూళ్లు రూ. 1,73,240 కోట్లు. అక్టోబర్ 2023 నెలలో GST రూ. 1.72 లక్షల కోట్లు వసూలు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నెలకు జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగింది. సంవత్సరానికి శాతం. 8.9 శాతం పెరిగింది.

ఏప్రిల్ 2024లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.1 లక్షల కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తొలి త్రైమాసికంలో సగటు పన్ను వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లు.

రెండో త్రైమాసికంలో జూలై-సెప్టెంబర్ మధ్య నెలవారీ సగటు పన్ను వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లకు పడిపోయాయి. అయితే, గత ఎనిమిది నెలలుగా ప్రతి నెలా కనీసం రూ.1.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవుతోంది.

పండుగల సీజన్‌లో భారీ వ్యాపార కార్యకలాపాల కారణంగా జీఎస్టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బెండకాయతో చర్మం, జుట్టు సమస్యలకు బైబై చెప్పేయండి..

బెండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. బెండకాయ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చని పలు పరిధనలు కూడా వల్లడించాయి.

ముఖ్యంగా కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. బెండకాయలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెండకాయను అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఉపయోగించే వారు. బెండకాయతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మంచి క్లియర్ స్కిన్ కావాలంటే బెండకాయ బెస్ట్. అదే విధంగా జుట్టును కూడా హెల్దీగా చేయవచ్చు. మరి బెండకాయతో ఎలాంటి చర్మ, జుట్టు సమస్యలను నయం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోయింగ్‌:

బెండకాయ తినడం వల్ల కాదు బెండకాయను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో ఇతర పోషకాలతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి స్కిన్‌ డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.

క్లియర్ స్కిన్:

క్లియర్ స్కిన్ కావలంటే బెండకాయ పేస్ట్‌ను ట్రై చేయండి. బెండకాయలో ఉండే గుణాల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలను దూరం చేస్తుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

స్కిన్ హైడ్రేట్‌:

బెండకాయ ఫేస్ మాస్కులు వేసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా తయారవుతుంది. బెండకాయలో హైడ్రేటింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని పొడి బారకుండా.. హైడ్రేట్‌గా ఉంచుతుంది.

కొల్లాజెన్ ఉత్పత్తి:

బెండకాయతో చేసిన కూరలు తిన్నా.. బెండకాయ పేస్ట్ ముఖానికి రాసుకున్నా.. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ఎప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.

డ్యాండ్రఫ్ మాయం:

బెండకాయ రసం లేదా పేస్టును తలకు రాయడం వల్ల డ్యాండ్రఫ్ అనేది మాయం అవుతుంది. డ్యాండ్రఫ్ తగ్గడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. డ్యాండ్రఫ్ సమస్యతో బాధ పడేవారు బెండకాయ గుజ్జు తలకు పట్టించండి.

హెయిర్ గ్రోత్:

తలకు బెండకాయ పేస్టు రాయడం కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. బెండకాయలను నీటిలో వేసి మరిగించిన నీటిని తాగినా, జుట్టుకు పట్టించిన కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

రూ.85,000 విలువైన Samsung Galaxy S22 5G రూ.36,567కే!

మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయకపోతే, చౌక ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో కూడిన ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మీకు ఇంకా మంచి అవకాశం ఉంది.

ఈ గొప్ప డీల్‌లోవేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. Samsung Galaxy S22 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో 57 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది.

భారతదేశంలో Samsung Galaxy S22 5G ధర: Samsung బ్రాండ్ ఈ ఫోన్ 8 GB RAM / 128 GB స్టోరేజ్ వేరియంట్ వినియోగదారుల కోసం 72 వేల 999 రూపాయలకు ప్రారంభించింది. అయితే ఇప్పుడు లాంచ్ ధర నుండి రూ.36 వేల 432 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ మీకు రూ.36 వేల 567కి లభిస్తుంది.

ఈ ఫోన్ అసలు ధర అంటే MRP ధర రూ.85,999. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, మీరు 32 వేల 650 రూపాయల అదనపు తగ్గింపు ప్రయోజనం పొందుతారు.

Samsung Galaxy S22 5G స్పెసిఫికేషన్స్: ఈ Samsung స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంటుంది. ఇది కాకుండా, Qualcomm Snapdragon 8 Generation 1 చిప్‌సెట్‌తో వస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ (వైడ్ యాంగిల్), 12 మెగాపిక్సెల్ (అల్ట్రా వైడ్ యాంగిల్), 10 మెగాపిక్సెల్ (టెలిఫోటో కెమెరా) సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. ఇక ఇందులో3700 mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంటుంది.

రూ.40000 లోపు 5G మొబైల్‌లు: Samsung Galaxy M22 5G కాకుండా, మీరు రూ. 40 వేల బడ్జెట్‌లో OnePlus 12R 8 GB RAM / 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను కూడా పొందవచ్చు. OnePlus బ్రాండ్‌కు చెందిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 37 వేల 999కి అమ్ముడవుతోంది.

వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?

రోడ్లపై ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లు కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నలుపు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి.

ఇలాంటి రంగుల నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి కలర్స్‌లో నంబర్ ప్లేట్స్‌ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

నెంబర్ ప్లేట్లలో రకాలు:

తెలుపు రంగు
ఆకుపచ్చ రంగు
పసుపు రంగు
ఎరుపు రంగు
నీలం రంగు
నలుపు రంగు
బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్

తెల్లని నంబర్ ప్లేట్

సాధారణ పెట్రోల్, డీజిల్‌తో కూడిన ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ వైట్ నంబర్ ప్లేట్‌లను జారీ చేస్తుంది. తెలుపు నంబర్‌ ప్లేటుపై నలుపు అక్షరాలు ఉంటాయి. ఈ నంబర్లు వ్యక్తిగత వినియోగ వాహనాలు, బైక్‌లు, స్కూటర్‌ల కోసం ఉపయోగిస్తుంటారు.

ఆకుపచ్చ నంబర్ ప్లేట్

ఈ రంగు నంబర్ ప్లేట్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం ఈ రంగు నంబర్ ప్లేట్‌లను రిజర్వ్ చేసింది. దేశంలో రిజిస్టర్ అయిన అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్లు మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల ప్లేట్లు తెలుపు రంగులో ఉంటాయి. వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి.

పసుపు నంబర్ ప్లేట్:

ఆటో రిక్షాలు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు, జెసిబిలు వంటి వాణిజ్యపరంగా ఉపయోగించే వాహనాలపై ఈ రంగు నంబర్ ప్లేట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే, పసుపు నంబర్ ప్లేట్‌లతో వాహనాలను నడపడానికి, డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కోసం వాడే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్‌ను ఇస్తారు.

నలుపు నంబర్ ప్లేట్

బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఇతర వాహనాల కంటే తక్కువగా కనిపిస్తాయి. ఈ వాహనాలను వాణిజ్యపరంగా కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వాహనాలు నడపడానికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. విలాసవంతమైన హోటల్‌ రవాణాకు నల్లటి నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలను వినియోగిస్తున్నారు.

నీలం రంగు నెంబర్ ప్లేట్:

నీలం రంగు నెంబర్ ప్లేట్.. దాని మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటే అది విదేశీ దౌత్యవేత్తల వాహనం అని అర్థం. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వ్యక్తులు కోసం ఈ వాహనాలను వాడతారు. CC- కాన్సులర్ కార్ప్స్, UN- యునైటెడ్ నేషన్స్, DC- డిప్లొమాటిక్ కార్ప్స్ వంటి వాళ్లకి ఈ రంగు నంబర్ ప్లేట్‌లను ఇస్తారు.

బాణం నంబర్ ప్లేట్

సైన్యానికి చెందిన వాహనాల్లో మాత్రమే ఈ తరహా నంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. రక్షణ వాహనాల నంబర్ ప్లేట్‌లు పైకి చూపే బాణం కలిగి ఉంటాయి. ఇలాంటి నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలకు టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎరుపు రంగు నెంబర్ ప్లేట్:

జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్.. రాష్ట్ర గవర్నర్ ఉపయోగించే వాహనాలకు ఈ విధమైన నంబర్ ప్లేట్ ఉంటుంది. ఒకవేళ జాతీయ చిహ్నం బంగారు రంగులో ఉన్నట్టయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం అని అర్థం.

జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..? కొత్త నిబంధన తెలుసుకోకుంటే ఇబ్బందే

జీఎస్టీ రిటర్న్స్ అంటే అమ్మకాలు, కోనుగోళ్లపై చెల్లించిన పన్నులు, వ్యాపారం ద్వారా అందించిన ఉత్పత్తి లేదా సేవ అమ్మకాాలపై స్వీకరించిన పన్నుల గురించి వివరాలు తెలిపే రికార్డు అని చెప్పవచ్చు.

కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు జీఎస్టీ రిటర్న్ లను తప్పనిసరిగా సమర్పించాలి. దీని వల్ల వ్యాపార లావాదేవీల రికార్డు స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక, ఆడిట్ లు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. జీఎస్టీ చట్టం కింద నమోదు చేసిన ప్రతి వ్యాపార సంస్థ రిటర్న్స్ అందజేయాలి. అలాగే ఇ-కామర్స్ ఆపరేటర్లు, జీఎస్టీలో నమోదు చేయబడిన నాన్ రెసిసెంట్ ఎంటీటీలు కూడా దాఖలు చేయాలి. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీ రిటర్న్ లను పన్నుదారులు వీలైనంత త్వరగా దాఖలు చేయాలి.

అలాగే పెండింగ్ ఫైలింగ్ ను నిర్ణీత గడువులోగా అందజేయాలి. మూడేళ్ల లోపు ఫైలింగ్ దాఖలు చేయాలని నిబంధన విధించిన నేపథ్యంలో ఆ గడువు దాటితే పన్ను ఎగవేత దారులుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారీగా జరిమానాలు కట్టాల్సి రావచ్చు. దానితో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త నిబంధనలపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మూడేళ్ల తర్వాత జీఎస్టీ రిటర్స్స్ ఫైలింగ్ చేయడాన్ని నిషేధించడంపై సానుకూలంగా స్పందించారు. దీనివల్ల డేటా విశ్వసనీయత మెరుగుపడుతుందన్నారు. సకాలంలో ఫైలింగ్ జరగడానికి తోడ్పడడంతో పాటు రిటర్న్ ల బ్యాక్ లాగ్ ను విపరీతంగా తగ్గిస్తుందన్నారు. అలాగే పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సత్వరమే రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు.

జీఎస్టీ రిటర్న్ లను సకాలంలో అందజేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జరిమానాలను, ఆలస్య రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. రుణాలు, టెండర్లు, పెట్టుబడిదారులను ఆకట్టుకునే అవకాశం కలుగుతుంది. వ్యాపార పనితీరును విశ్లేషించడానికి, మెరుగుపర్చుకోవడానికి, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వీలుంటుంది. అయితే పర్యవేక్షణ, సంబంధిత పత్రాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ కారణంగా జీఎస్టీ రిటర్న్ లను దాఖలు చేయని వారిపై కొత్త నిబంధనతో తీవ్ర ప్రభావం పడుతుంది. ఏది ఏమైనా గడువు తేదీ నుంచి మూడేళ్ల లోపు రిటర్న్ లను ఫైలింగ్ చేయడానికి అవసరమైన సమాచారం దగ్గర ఉంచుకోవాలి.

ఎవర్‌ గ్రీన్‌ స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..

ఫీచర్స్‌ ఫోన్‌లకు పెట్టింది పేరు నోకియా. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫీచర్‌ ఫోన్‌లకు అప్పట్లో ఫుల్‌ క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నోకియా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు ఫోన్‌లను తీసుకొస్తోంది. నోకియా క్లాసిక్‌ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తుండడం విశేషం. నోకియా 108, 125 పేరుతో ఈ రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లలోనూ వైర్‌లెస్ FM రేడియో, MP3 ప్లేయర్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. హెచ్‌ఎమ్‌డీ కంపెనీ ఈ ఫోన్‌లను రూపొందిచింది. గతంలో తీసుకొచ్చిన HMD 105 4G, Nokia 110 4G రీబ్రాండ్‌ వెర్షన్స్‌గా తీసుకొస్తున్నారు. నోకియా 108 4G ఫోన్‌ను బ్లాక్‌, సియాన్‌ రంగుల్లో తీసుకొచ్చారు. అదేవిధంగా నోకియా 125 4G ఫోన్‌ను బ్లూ, టైటానియం కలర్స్‌లో లాంచ్‌ చేశారు.

ఇక ఈ ఫోన్స్‌లో 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా అదనంగా స్టోరేజ్‌ని విస్తరించుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలోనూ 2 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. వైర్డ్‌, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియో ఫీచర్‌ను ఇచ్చారు. ఇ ఈ రెండు ఫోన్స్‌లో 2000 కాంటాక్టులను సేవ్‌ చేసుకోవచ్చు. ఇంటర్నల్‌గా MP3 ప్లేయర్‌ను అందించారు.

ఇక ఈ రెండు ఫోన్లు కూడా నానో సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే నోకియా క్లాసిక్‌ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే వీటిలో 1450 ఎమ్‌ఏహెచ్‌ కెసాపిటీ గల బ్యాటరీని అందించారు. ఈ ఫోన్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 15 రోజుల స్టాండ్‌బై ఇస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్‌ ధరకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీని వర్షాలు వదలట్లేదు.. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఆ వివరాలు ఇలా..

సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్లు మధ్య విస్తరించి, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా..

శుక్రవారం:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శని, ఆదివారాల్లో:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:- ———–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, ఎంత మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి టీ తాగారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అదే వీధిలో మరో ఒంటరి మహిళకు పెన్షన్ పంపిణీ చేశారు.

అంతకు ముందు.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ దగ్గర బస్సులో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు

తొలి ఏడాది ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి 2684 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తొలి విడత కోసం 894కోట్ల రూపాయల చెక్‌ను పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారులు అందిస్తుందని పేర్కొన్నారు. తాను తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని.. అలాగని రాజకీయ కక్షసాధింపులకు పోనని తెలిపారు. అనంతరం శ్రీకాకుళంలో జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్నారు చంద్రబాబు.. రేపు విజయనగరం జిల్లాలో రోడ్ల మరమ్మతు పనులకు శ్రీకారం చుడతారు. గజపతినగరం మండలం పురిటిపెంట దగ్గర రోడ్డుపై గుంతలను పూడ్చే పనుల్లో స్వయంగా పాల్గొంటారు సీఎం. రేపు సాయంత్రం భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పురోగతిని పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

తిరుమలలో ఇకపై ఆ దందాకు చెక్.. సిఫారసు లేఖల విషయంలో కొత్త పాలక మండలి నిర్ణయం ఏంటి..?

ప్రజాప్రతినిధులు, విఐపిల సిఫారసు లేఖలతో దర్శనం టికెట్ల అమ్మకం.. మరోవైపు దళారీల ఏరివేతపై టీటీడీ పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. పిఆర్ఓల పేరుతో కొనసాగుతున్న దర్శనం టికెట్లు అమ్మకం దందాపై విజిలెన్స్ కొరడా.. ఝుళిపిస్తోంది.. ఇదిలా ఉంటే మరోవైపు అసలు విఐపి సిఫారసు లేఖలపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.. సిఫారసు లేఖలు తీసుకోవాలని కొందరు, రద్దు చేయాలని మరి కొందరు వాదిస్తున్న తరుణంలో కొత్త పాలక మండలి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టిటిడి పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు పీఆర్వోలు, పీఏలుగా వ్యవహరిస్తున్న కొందరు దళారీలతో చేతులు కలిపి వెంకన్న దర్శనంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇలా శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం టికెట్లు, వసతి గదులు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రక్షాళన పై దృష్టి సారించడంతో తిరుమలలో దళారీల దందా కు కళ్లెం వేసేలా నిఘా పెరిగింది. టీటీడీ విజిలెన్స్ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా దృష్టి సారించి దళారీలను ఏరి వేసే పని ప్రారంభమైంది. సి ఆర్ ఓ ఆఫీస్, జేఈవో కార్యాలయం, ఎంబీసీ 34, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ల వద్ద నిఘా పెరిగింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్న విజిలెన్స్ వింగ్ దళారీ వ్యవస్థలో అసలు సూత్రధారుల పాత్రలను బయటపెడుతోంది. గత ఐదేళ్లుగా తిరుమలలో కొనసాగిన దళారీల దందాపై నమోదైన కేసులను పరిశీలిస్తోంది. 2019లో 50, 2020లో 34, 2021లో 46, 2022 లో 72, 2023లో 57, 2024లో ఇప్పటిదాకా 38 కేసులు నమోదయినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4నెలల్లో 18 కేసులు నమోదు కాగా దళారులు, ఇతర మోసగాళ్ళ మోసాలపై 64 వరకు ఫిర్యాదులు విజిలెన్స్ కు వచ్చాయి. ఈ మధ్యనే వైసీపీ ఎమ్మెల్సీ పిఏ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ. 65 వేలకు విక్రయించినట్లు తిరుమల వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు అయింది. పుదుచ్చేరి సీఎం కార్యాలయం నుంచి సిఫారసు లేఖను పొందిన దళారీ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయించి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం అతిథి గృహాల్లోనూ దళారీల దందా కొనసాగుతున్నట్లు విజినెస్ గుర్తించింది. లాకర్లు తీసుకునే భక్తులను బురిడీ కొట్టించిన ఆన్ లైన్ మోసగాడి వ్యవహారం కూడా వెలుగు చూసింది. ఆదార్ తో శ్రీవారి దర్శనం గదులను తరచూ తీసుకునే వారిని గుర్తించేందుకు టీటీడీ ఆధార్ సీడింగ్ ను కూడా ప్రారంభించబోతుంది. ఈ మేరకు అనుమతులు తీసుకున్న టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే పూర్తిస్థాయిలో ఆధార్ డేటాతో దళారులను గుర్తించే పని చేపట్టనుంది. దళారీలను ఏరివేసేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి టీటీడీ తీసుకురాబోతోంది. దళారులను గుర్తించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18004254141 ను కూడా అందుబాటులోకి తెచ్చింది టీటీడీ విజిలెన్స్.

ఒక్కొక్కరిది ఒక్కో వాదన

ఇక విఐపి సిఫారసు లేఖలే దళారీల దందా కు ఆదాయ వనరుగా మారిపోగా మరోవైపు సిఫారసు లేఖలపై ఒక్కొక్కరిది ఒక్కో వాదనగా మారిపోయింది. తెలంగాణ నుంచి వచ్చే విఐపి సిఫారసు లేఖలను అనుమతించని టీటీడీ వైఖరి పై ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల డిమాండ్ ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు స్వయంగా వస్తే దర్శనం అవకాశం కల్పిస్తున్న టీటీడీ సిఫారసు చేస్తే అనుమతించని పరిస్థితి ఉంది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ టీటీడీ తమ సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోంది.
తెలంగాణ నేతల అభ్యర్థనపై..

ఇలా సిఫారసు లేఖల వ్యవహారంపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల వార్నింగ్ ను పట్టించుకోని టీటీడీ ఇప్పటిదాకా దీనిపై ఏ నిర్ణయము తీసుకోలేదు. అయితే సిఫారసు లేఖలపై కొందరు స్వామీజీల వాదన మరోలా ఉంది. అసలు విఐపి సిఫారసు లేఖలనే రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.. శ్రీవారి దర్శనంలో అందరూ సమానులే అని ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు పేర్కొంటున్నారు.

ఇలా సిఫారసు లేఖల పై ఎవరి వాదన ఎవరిది కాగా, తిరుమలలో సిఫారసు లేఖలే కొందరు దళారీలకు పెట్టుబడిగా మారిపోయింది. దీంతో సిఫారసు లేఖల వ్యవహారం పై ఏపీ సర్కార్ నిర్ణయం ఏంటి, కొత్త పాలక మండలి ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతోందన్నదే సవాలుగా మారబోతోంది.

పలమనేరు డీఎస్పీ ఎదుట హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

పుంగనూరు అల్లర్ల కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బెయిల్ షరతుల ప్రకారం పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు షూరిటీలు సమర్పించారు. మిథున్ రెడ్డితో పాటు మరికొందరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డీఎస్పీ ముందు హాజరు కావాలన్న షరతు ఉంది.

చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందిన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. శుక్రవారం పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మిధున్ రెడ్డి.. బెయిల్ లోని షరతులు ప్రకారం షూరిటీలు సమర్పించారు. గత జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్ పై రెండు కేసులు నమోదయ్యాయి.. మిథున్ తో పాటు 29 మంది కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే పుంగనూరు అల్లర్ల కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందిన మిథున్.. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్ ఉంది. మూడు నెలలు వరకు అమలులో ఉన్న ఈ కండిషన్ మేరకు మిథున్ ఈ రోజు పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. రెండు కేసుల్లోనూ ఏ 1 ముద్దాయిగా ఉన్న మిథున్ ఈ రోజు రెండు కేసుల్లో బెయిల్ పొందారు. ఇందులో భాగంగా జామీనుదారులతో కలిసి డీఎస్పీని ఎంపీ మిధున్ రెడ్డి కలిశారు.

పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పలమనేరుకు చేరుకున్నారు. చిత్తూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మిథున్ కు వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా డి.ఎస్.పి కార్యాలయానికి చేరుకున్న మిథున్.. ముందస్తు బెయిల్ పై కోర్టు ఆర్డర్, కోర్టు ఉత్తర్వు మేరకు షూరిటీ లను సమర్పించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు స్టేషన్ బైయిల్ మంజూరు చేశారు విచారణ అధికారి డీఎస్పీ ప్రభాకర్ రావు..

అనంతరం మీడియాతో మాట్లాడకుండా మిథున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిథున్ డిఎస్పీ కార్యాలయానికి వస్తారని తెలిసి పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఈ 5 తెల్లటి పదార్థాలు విషంతో సమానం.. తినడం బంద్ చేస్తే సగానికి పైగా రోగాలు తగ్గుతాయట

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే, మీ ఆరోగ్యంలో ఆటంకాలు ఏర్పడటానికి అతి పెద్ద కారణం ఆహారం… అటువంటి పరిస్థితిలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వెంటనే మీ ఆహారం నుంచి ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరం చేయాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఉరుకులు పరుగుల నేటి కాలంలో.. చాలామంది పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తింటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినా.. ఆహారం విషయంలో మాత్రం రాజీ పడకుడదంటున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా తినడానికి ముందు ఆరోగ్యంపై దాని ప్రభావాల గురించి ఆలోచించకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచికరంగా ఉండవచ్చు.. కానీ ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదంటున్నారు. ఈ 5 వైట్ ఫుడ్స్ ను దూరం చేస్తే సగానిపైగా సమస్యలు దూరమవుతాయని.. ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అటువంటి 5 వైట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి..

తెల్ల చక్కెర: శరీరంలో మంట, కేలరీలు, లిపిడ్లు, చక్కెర స్థాయిని పెంచడానికి తెల్ల చక్కెర బాధ్యత వహిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

తెల్ల రొట్టె: వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఇందులో ఫైబర్ లేదు, ఇది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ కూడా పెరుగుతుంది.

తెల్ల బియ్యం: తెల్ల బియ్యం, ముఖ్యంగా పాలిష్ చేయడం వల్ల చాలా పోషకాలు కోల్పోతాయి. ఇందులో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

తెల్ల ఉప్పు: అధిక మోతాదులో తెల్ల ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. బదులుగా, సముద్రపు ఉప్పు లేదా పింక్ ఉప్పును ఉపయోగించండి.. ఇవి మరింత సహజమైనవి..

తెలుపు వెన్న: వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండెకు హానికరం. బదులుగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హెల్దీగా రాజ్మా పులావ్.. కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ..

నవంబర్ 2వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది.. ఒక నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా ఆ కైలాస నాథుడికి పూజలు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులు ఇలా కొత్తగా, రుచిగా, హెల్దీగా చేసుకుంటే.. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బోర్ కొట్టకుండా ఉంటుంది. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రాజ్మా నేరుగా తినలేని వారు ఇలా పులావ్‌డగా చేసుకుని కూడా తినవచ్చు. మరి ఈ రాజ్మాతో పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాజ్మా పులావ్‌కు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన రాజ్మా, బాస్మతీ రైస్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, పులావ్ దినుసులు, ఉప్పు, కారం, పసుపు, శీరా కల్లు.

రాజ్మా పులావ్ తయారీ విధానం:

ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రాజ్మా కూడా నానబెట్టి 80 శాతం ఉడికించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాస్మతీ రైస్ శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాక.. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. ఇవి కూడా వేగాక పుదీనా కొత్తిమీర, శీరాకల్లు, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.

ఆ తర్వాత రాజ్మా, బాస్మతీ రైస్, రైస్ ఉడకడానికి తగినంత నీరు వేసి మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజ్మా పులావ్ సిద్ధం. దీన్ని ఏ కర్రీతో తిన్నా.. రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. టేస్టీగా, హెల్దీగా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా, లంచ్‌గా, డిన్నర్‌గా కూడా తినవచ్చు. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Health

సినిమా