Sunday, November 17, 2024

ఈ టాలీవుడ్ హీరో మనసు బంగారం.. పేద ప్రజల కోసం ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న చేస్తున్న స్టార్..

సాధారణంగా సినీ పరిశ్రమలోని స్టార్ నటీనటులు సామాజిక సేవ చేయడంలో ముందుటారన్న సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోలు ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్నారు.

కొందరు సొంతంగా ఫౌండేషన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆర్థికంగా సహయం చేస్తున్నారు. అలాగే కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. సామాజిక సంక్షేమం కోసం అగ్రకథానాయకులు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులకు చికిత్సకు సహాయం అందిస్తున్నారు. అలాగే కరోనా మహామ్మారి నుంచి సోనూ సూన్ ప్రజలకు అండగా నిలబడ్డారు. అలాగే విజయ్ దళపతి, సూర్య, గోపిచంద్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ ఓ హీరో మాత్రం చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఏడాదికి రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. అతడు మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ అందుకున్న మహేష్.. అలాగే ఎంతో మంది పేదలకు జీవితాన్ని అందించారు. ఇప్పటివరకు 48 ల్లో నటించిన మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇలాగే ఈ సూపర్ స్టార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తున్నాయి.

మహేష్ బాబు నికర విలువ రూ.135 కోట్లు. హైదరాబాద్ లో రూ.30 కోట్లు విలువైన బంగ్లా ఉంది. అలాగే 7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉంది. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో ఈ వ్యాన్ ను కొనుగోలు చేశాడు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు. ఇప్పటివరకు వెయ్యికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. అలాగే ఏపీలో రెండు గ్రామాలను దత్త తీసుకుని రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలతో సహా అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు. చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్, కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం.. దత్తత తీసుకున్న గ్రామాలకు సదుపాయాలు కల్పించడం..ఇలా అనేక సామాజిక సేవలతో ఏటా రూ.20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట మహేష్ బాబు. ఇప్పుడు ఈ విషయం తెలిసి మహేష్ మంచి మనసు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

‘పోల్డబుల్‌ ఐఫోన్‌’ వచ్చేస్తోంది.. మార్కెట్లోకి ఎప్పుడో తెలుసా?

దేశంలో, ప్రపంచంలో ఫోల్డబుల్ ఫోన్‌ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. యూజర్లు ఫోల్డబుల్ ఫోన్‌లను కూడా ఇష్టపడుతున్నారు. Samsung, Motorola, Huawei వంటి ఇతర మొబైల్ తయారీ కంపెనీల ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ సిరీస్‌లో, ఆపిల్ కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని ఒక నివేదిక వచ్చింది. అయితే దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐఫోన్‌ నుంచి ఏదైనా ఫోన్‌ విడదలకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. 2026 ప్రారంభంలో ప్రపంచంలో ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయవచ్చని కంపెనీ అంచనాల ద్వారా తెలుస్తోంది. చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ తీసుకురావాలని వినియోగదారుల నుండి డిమాండ్ కూడా ఉంది.

ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై పని చేస్తోంది

నివేదికల ప్రకారం, ఫోల్డబుల్ ఫోన్ పని ఆలోచన దశను దాటి ముందుకు సాగింది. ఇది కాకుండా, ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉపయోగించే భాగాల కోసం కంపెనీ ఆసియాలోని సరఫరాదారులను కూడా సంప్రదించింది. ఇది కాకుండా, కంపెనీ ఈ ఉత్పత్తి కోసం V68 అనే ఇంటర్నల్‌ కోడ్‌ను కూడా సృష్టించింది. ఆపిల్ ఎప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ని విడుదల చేసినా శాంసంగ్‌ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లతో దానికి ప్రత్యక్ష పోటీ ఉంటుంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి 2019లో ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఫోన్‌ను విడుదల చేసిన మొదటి సంస్థ శాంసంగ్‌. అప్పటి నుండి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరగడం ప్రారంభమైంది.

ఫోల్డబుల్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది

జూలై ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2024లో Samsung Galaxy Z Fold, Z Flip AI ఫీచర్లతో పరిచయం చేసింది. Samsung దీన్ని తేలికగా, సన్నగా ఉండేలా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో చైనా మొబైల్ కంపెనీలు Honor, Huawei కూడా ఈ విభాగంలో ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో 49% వృద్ధి చెందింది. ఆరు త్రైమాసికాలలో దాని అత్యధిక వృద్ధి రేటు, హువావే శామ్‌సంగ్‌ను అధిగమించి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం, రాయిటర్స్ దీని గురించి ఆపిల్‌ను అడగగా, ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి వారి వైపు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

రీ ఎంట్రీకి సిద్ధమైన ప్రపంచకప్ విజేత.. ఛాంపియన్ జట్టులోకి ఆగయా?

Yuvraj Singh: టీమ్ ఇండియాకు 2 ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్‌లో పునరాగమనం చేయబోతున్నాడు.
మీడియా కథనాల ప్రకారం, యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ కావచ్చని సమాచారం.

టీమిండియాకు 2 ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం, యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నివేదికల ప్రకారం, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ విక్రమ్ సోలంకి 2025 IPL మెగా వేలానికి ముందు జట్టు నుంచి వైదొలగవచ్చు అని తెలుస్తోంది. అందుకే, ఖాళీని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ యువరాజ్ సింగ్‌ను సంప్రదించినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం యువరాజ్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా రిటైర్డ్ ప్లేయర్స్ లీగ్‌లలో పాల్గొంటున్నాడు. అయితే, ఇప్పుడు కోచ్ పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువరాజ్ సింగ్‌కు ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం కూడా ఉంది.

ఐపీఎల్‌లో యువరాజ్ 132 మ్యాచ్‌లు ఆడి 2750 పరుగులు చేశాడు. వీటిలో 13 అర్ధసెంచరీలు ఉన్నాయి. యువరాజ్ పంజాబ్, హైదరాబాద్, పుణె వారియర్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు.

ఒకవేళ యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన కోచ్ అయితే భారీ మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రాకు ఒక్కో సీజన్‌కు రూ.3.5 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు యువరాజ్ ఈ స్థానానికి వస్తే అతని జీతం పెరగడం ఖాయం.

యువరాజ్ సింగ్‌తో పాటు, ఇటీవలే భారత జట్టు ప్రధాన కోచ్‌గా వైదొలిగిన రాహుల్ ద్రవిడ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా మారవచ్చు.

ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో ద్రవిడ్‌ని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అలాగే, ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.

ఓటీటీలోకి కమల్ హాసన్ భారతీయుడు 2.. అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్..

విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ భారతీయుడు 2. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ 28 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన భారతీయుడు కు సీక్వెల్.

దీంతో ఈమూవీపై ముందు నుంచి భారీ అంచనాలను నెలకొనగా.. జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈమూవీ అంతగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. దీంతో ఈ అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అటు ఈ మూవీ థియేట్రికల్ రన్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ను ఆగస్ట్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే టాక్ నెట్టింట వినిపిస్తుంది. రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ ను గత ఆరేళ్ల క్రితమే స్టార్ట్ చేయగా.. అనుహ్య కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ .. ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ లో కమల్ హాసన్ యాక్టింగ్ అదరగొట్టినప్పటికీ శంకర్ మార్క్ మాత్రం మిస్సైందంటూ అసహనం వ్యక్తం చేశారు అడియన్స్. ఇప్పటివరకు ఇండియన్ 2 కేవలం రూ.100 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పెద్దగా వసూళ్లు రావడం.

28 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన భారతీయుడు కు సీక్వెల్ గా రూపొందించిన ఈచిత్రానికి మరో కొనసాగింపుగా భారతీయుడు 3 కూడా రూపొందించారు.ఈ కు సంబంధించిన ట్రైలర్ ను ఇండియన్ 2 చిత్రానికి అటాచ్ చేయగా.. పార్ట్ 3పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలంటూ కోరుతున్నారు. ఈ లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ కీలకపాత్రలు పోషించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్‌లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్‌ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్..

బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేసింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నిధుల కేటాయింపులపై ప్రధాని మోదీకి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన కేంద్రం, అవసరమైతే మరింతగా పెంచుతామని చెప్పడం సంతోషకరమన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని నెరవేర్చాలన్న సంకల్పం మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇది శుభపరిణామమన్నాుు. రాష్ట్ర పుననిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రధానమంత్రి మోదీకి ఏపీ ప్రజల తరుఫున కృతజ్ఞతలని ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ పురోగతి వైపు దూసుకుపోతుందన్నారు పవన్ కల్యాణ్. రాజధాని కోసం ఏపీ ప్రజల ఆవశ్యకతను గుర్తించడంలో, పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో, వెనుకబడిన ప్రాంతాలకు సహాయం చేయడంలో మోదీ మద్దతు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల దూరదృష్టితో నిధులు కేటాయించడం, ఇది ఎన్డీయే సర్కార్‌కు ఉన్న నిబద్ధత అన్నారు. మోదీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మరింత విశ్వాసాన్ని పెంపొందించిందన్నారు. ఏపీ రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి మోదీ ప్రయత్నాలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు పవన్ కల్యాణ్.

ఈ ఆర్ధిక సంవత్సరంలో వరల్డ్‌ బ్యాంక్‌ సాయంతో అమరావతికి 15వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కూడా కేంద్రానిదేనని తెలిపారు. అటు.. రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు, ప్రకాశం లాంటి వెనుకబాటు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామన్నారు నిర్మలా సీతారామన్‌. విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రాయలసీమ మీదుగా హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లు మంజూరు చేయడంతో పాటు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.

మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషించింది. ఎన్డీయే కూటమి ఎక్కువ సీట్లు గెలవడంతో మోదీ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో టీడీపీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర నేతలు పంతం పట్టారు. కానీ వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పడటానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు.

పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందేనంటోన్న రంగమ్మత్త..

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు ల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ లన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి.

పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత షూటింగ్స్ పూర్తిచేస్తానని.. ఆలస్యమవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ లపై మరింత హైప్ పెంచగా.. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది నటి, యాంకర్ అనసూయ. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన అప్డేట్ రివీల్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ అసలు విషయం చెప్పేసింది. “ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను.. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను.. నేను పవన్ సర్ తో ఒక బ్యూటీఫుల్ డాన్స్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది” అంటూ హింట్ ఇచ్చేసింది అనసూయ. అయితే ఏ లో అనేది మాత్రం క్లారిటీ రాలేదు. పవన్ లో అనసూయ పాట అందులోనూ మోత మోగిపోద్ది అని చెప్పడంతో అది కచ్చితంగా స్పెషల్ సాంగ్ అయ్యింటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

గతంలోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించింది అనసూయ. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ తో స్పెషల్ సాంగ్ చేయనుండడంతో ఆ సాంగ్ పై ఓ రేంజ్ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ ల విషయానికి వస్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా హరిహర వీరమల్లు లో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాలను కంప్లీట్ చేయనున్నారు.

సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

అసలు దేశ వ్యాప్తంగా వర్షాలు దించికొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఎఫెక్ట్‌ ఇంకా చూపుతోంది.

దీంతో భారీ వర్షాల ధాటికి కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా పాఠశాలలు మూసివేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ మంగళవారం ఈ సమాచారాన్ని అందించారు. అయితే కన్వర్ యాత్ర మార్గంలో వచ్చే అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలను మాత్రమే జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉత్తారఖండ్‌లో కూడా వర్షాలు బాగానే ఉన్నాయి.

ఈ ఏడాది కన్వర్ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు. హరిద్వార్‌లోని వివిధ వాహనాల్లో ప్రధాన రహదారుల గుండా గంగాజలాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో శివ భక్తులు ఇక్కడికి వస్తారు. అన్ని కన్వార్ రూట్లలో ఇంత రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ నలుమూలల నుండి లక్షలాది మంది కన్వర్ యాత్రికులు గంగాజల్‌ను సేకరించడానికి హరిద్వార్‌కు వస్తారు. సహారన్‌పూర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బాగ్‌పట్, ముజఫర్‌నగర్‌తో సహా అన్ని జిల్లాల రోడ్లపై కన్వర్ యాత్రికుల జాతర ఉంది. కన్వర్ ఫెయిర్ దృష్ట్యా, ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, మీరట్ హైవేతో సహా అన్ని రోడ్లపై రూట్ డైవర్షన్ కూడా చేశారు.

కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?

కడప జిల్లా పోలీసుల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ తో గన్‌మెన్లను కుదించడంపై మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ ఉన్న గన్‌మెన్‌లను సైతం వెనక్కి పంపారు ఎమ్మెల్యే మాధవి.

కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి గన్‌ మెన్‌ల తొలగింపు ఇష్యూ .. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాధవిరెడ్డి భర్త తెలుగు దేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి నిన్నటి వరకూ ఉన్న వన్‌ ప్లస్ వన్‌ గన్‌మెన్‌లను తొలగించారు కడప పోలీసులు. వారిని వెనక్కి రావాలని పిలిచారు. అదే క్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఉన్న టూ ప్లస్ టూ గన్ మెన్లను వన్ ప్లస్ వన్‌కు కుదించారు. వారిని వెనక్కి రావాలంటూ పిలిచారు.

అయితే ఎలాంటి ఇన్ఫర్మెషన్‌ లేకుండా తనకు సెక్యూరిటీ కుదించడంపై పోలీసుల తీరుపై ఆగ్రహించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కనీసం సెక్యూరిటీని వన్‌ ప్లస్‌ వన్‌కి తగ్గిస్తున్నట్లు తనతో ఒక్క మాటన్న చెప్పకుండా.. సెక్యూరిటీకి కాల్ చేసి రమ్మనడంపై ఎమ్మెల్యే మనస్థాపం చెందారు. తమకు ఎలాంటి థ్రెట్ లేదని.. షో తనకు వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కూడా అవసరం లేదంటూ ప్రజెంట్ ఉన్న వారిని వెనక్కి పంపించారు ఎమ్మెల్యే. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు సైతం సెక్యూరిటీ లేకుండా హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి.

గన్‌ మెన్ల ఇష్యూ జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో తనకు కడప వైసీపీ అభ్యర్థి తమ్ముడి నుంచి థ్రెట్ ఉందంటూ మాధవిరెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటి ఎస్పీ ఆమెకు గన్‌మెన్లను కేటాయించారు. ఆమె భర్తకు వన్‌ ప్లస్ వన్ ఇచ్చారు. ఇప్పుడు సెడన్‌గా విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ లేకుండా గన్‌మెన్‌లను తొలగించారనేది ఎమ్మెల్యే వర్షన్‌. దీనిపై మాత్రం జిల్లా పోలీసులు ఇప్పటివరకూ స్పందించలేదు. సెక్యూరిటీ కుదించడంపై జిల్లా పోలీసులు ఏం చెప్తారనేదానిపై ఉత్కంఠగా నెలకొంది.

ఇక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడపలో పోటీ చేసిన మాధవిరెడ్డి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై భారీ మెజార్టీతో గెలిచారు. ఏకంగా మాజీ సీఎం ఇలాకాలో టీడీపీ జెండా ఎగురువేసి.. మాటల తూటాలతో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం తాను అంజాద్‌ బాషాపై కాదు.. జగన్‌పైనే గెలిచానంటూ కీలక కామెంట్స్ చేశారు మాధవిరెడ్డి. అలాంటి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తగ్గించడం కలకలం రేపుతోంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?

డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు లెర్నింగ్ లైసెన్స్ గురించిన గురించి చెప్పబోతున్నాము. ఇది డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందు ఇచ్చే లైసెన్స్.

దాన్ని పొందిన తర్వాత మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఆర్టీవో సహాయం లేకుండా లైసెన్స్ జారీ అవుతుంది.

మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఆలోచిస్తున్నారా ? అయితే ఇందుకు సంబంధించి కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దాని సహాయంతో మీరు RTO-కి వెళ్లకుండానే లైసెన్స్ పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు మీరు RTO వద్ద డ్రైవింగ్ టెస్ట్ చేయించుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే మీకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. అందుకే మీరు కూడా దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లెర్నింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?

లెర్నింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం. ఎందుకంటే ఇందులో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ముందు మీరు ఆన్‌లైన్ పరీక్ష చేసుకోవాలి.

టెస్ట్‌ ఏమిటి ?

ఈ టెస్ట్‌లో మీ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు అడుగుతారు. మీరు రహదారి సాధారణ నియమాల గురించి అడగబడతారు. అలాగే, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి మీరు సమాధానం చెప్పాలి.

లెర్నింగ్ లైసెన్స్ ఎందుకు?

మీరు డ్రైవింగ్ పరీక్షకు సిద్ధం కావడానికి లెర్నింగ్ లైసెన్స్ జారీ అవుతుంది. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మీరు ట్రాఫిక్ చలాన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే వాహనంపై ఎల్‌ అని రాసి ఉంచి ఆ తర్వాతే వాహనం నడపాలి. అయితే లెర్నింగ్‌ లైసెన్స్‌ ఇచ్చిన నెల తర్వాత మీరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు లైసెన్స్‌ వస్తుంది.

బంగారం నిల్వలున్న టాప్‌-20 దేశాలు.. భారత్‌ ఎన్నో స్థానం అంటే..

దేశాలు బంగారం నిల్వలను ఎందుకు ఉంచుకుంటాయి? ఎందుకంటే బంగారం నిల్వలు ఒక దేశం ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో విశ్వసనీయమైన విలువ గల స్టోర్‌గా పనిచేస్తాయి.

1970లలో అధికారికంగా రద్దు చేయబడినప్పటికీ, అనేక దేశాలు బంగారు నిల్వలను నిర్వహిస్తాయి. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం నిల్వలకు డిమాండ్ పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్‌లు మరోసారి బంగారానికి ప్రాధాన్యతనిచ్చే సురక్షిత ఆస్తిగా మొగ్గు చూపుతున్నాయి.

ఇందులో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 20 దేశాల గురించి తెలుసుకుందాం. దేశాలవారీగా బంగారు నిల్వల ర్యాంకింగ్‌ను పరిశీలిద్దాం.

బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ సీజన్‌లో అయినా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం అనేది పెట్టుబడులో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తాయి. ఫోర్బ్స్ ప్రకారం, దేశాలు తమ కరెన్సీ, నిర్దిష్ట పరిమాణంలో బంగారం మధ్య స్థిరమైన మారకపు రేటును నిర్ణయించడం ద్వారా తమ కాగితం కరెన్సీ విలువను బంగారంతో ముడిపెట్టాయి . ముఖ్యంగా జారీ చేసిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంలో సమానమైన విలువను కలిగి ఉంది.

అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన టాప్ 20 దేశాల జాబితా:

1వ స్థానంలో USA ప్రపంచంలో అత్యధికంగా 8,1336.46 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.
2వ స్థానంలో జర్మనీ ఉంది. ఇక్కడ 3,352.65 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
3వ స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ 2,451.84 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
4వ స్థానంలో ఫ్రాన్స్‌. ఇక్కడ 2,436.88 టన్నుల బంగారం నిల్వల ఉన్నాయి.
5వ స్థానంలో రష్యా. ఇక్కడ 2,332.74 టన్నుల బంగారం నిల్వలు.
6వ స్థానంలో చైనా ఉంది. ఇక్కడ 2,262.45 టన్నుల బంగారం నిల్వలు
7వ స్థానంలో స్విట్జర్లాండ్‌ ఉంది. ఇక్కడ 1,040.00 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి
8వ స్థానంలో జపాన్‌. ఇక్కడ 845.97 టన్నుల బంగారం నిల్వలు.
9వ స్థానంలో భారత్‌ ఉంది. మన దేశంలో 822.09 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
10వ స్థానంలో నెదర్లాండ్స్‌. ఇక్కడ 612.45 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
11వ స్థానంలో టోక్యో. ఇక్కడ 570.30 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
12వ స్థానంలో తైవాన్‌ ఉంది. ఇక్కడ 423.63 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
13వ స్థానంలో పోర్చుగల్‌. ఇక్కడ 382.63 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
14వ స్థానంలో పోలాండ్‌ ఉంది. ఇక్కడ 359.89 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
15వ స్థానంలో ఉబ్బెకిస్థాన్‌. ఇక్కడ 357.69 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
16వ స్థానంలో సౌదీ ఆరేబియా ఉంది. ఇక్కడ 323.07 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
17వ స్థానంలో ఖాజాకిస్థాన్‌ ఉంది. ఇక్కడ 310.62 టన్నుల గోల్డ్‌ నిల్వలున్నాయి.
18వ స్థానంలో యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) ఉంది. ఇక్కడ 310.29 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
19వ స్థానంలో లెబనాన్‌ ఉంది. ఇక్కడ 286.83 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
20వ స్థానంలో స్పెయిన్‌ ఉంది. ఇక్కడ 281.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి.

దేశాలు బంగారం నిల్వలను నిర్వహించడానికి ఒకటి కాదు, అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదట బంగారం ఒక స్థిరమైన, ఆధారపడే విలువ గల స్టోర్‌గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో బంగారాన్ని నిల్వ చేయడం ద్వారా దేశాలు తమ ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి.

అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాలు ఏవి?

అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న మొదటి 3 దేశాలలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది. అలాగే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉన్న తదుపరి మూడు దేశాలలో కలిపి మొత్తంగా దాదాపుగా ఎక్కువ నిల్వలను కలిగి ఉంది.

బంగారు నిల్వలలో భారతదేశం ర్యాంకింగ్ ఏమిటి?

గ్లోబల్ గోల్డ్ రిజర్వ్‌లలో భారతదేశం గణనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 9వ స్థానంలో ఉంది. బంగారం పట్ల గొప్ప సాంస్కృతిక అనుబంధం, బంగారం చరిత్ర సంప్రదాయ విలువలు, భారతదేశం బంగారు నిల్వలు దాని ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఉచిత గ్యాస్‌ సిలిండర్ పథకంపై మంత్రి నాదెళ్ల కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి.

అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.

వాటర్ హీటర్ ఎంత డేంజరో మీకు తెలుసా..? మీరు ఇంకా ఉపయోగాస్తున్నారా..?

వాటర్ హీటర్ ఎంత డేంజరో మీకు తెలుసా..? మీరు ఇంకా ఉపయోగాస్తున్నారా..?

ఒకప్పుడు కట్టెలపొయ్యిని ఎక్కువగా స్నానానికి నీళ్లను వేడి చేసుకోవడానికి ఉపయోగించేవారు. తరువాత గ్యాస్ స్టవ్‌పైన పెట్టుకొని ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ హీటర్లను వాడుతున్నారు.

అయితే ఇలా ఎలక్ట్రిక్ హీటర్ల వల్ల నీళ్ల వేడిచేసి స్నానం చేసుకుంటే చాలా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. హీటర్‌లో ఉండే హీటింగ్ ఎలిమెంట్ ఒక ఎలక్ట్రిక్ రెసిస్టర్, ఇది జూల్ హీటింగ్ సూత్రంపై పనిచేస్తుంది. ఈ రెసిస్టర్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుతుంది. ఇలా కావడం వల్ల చాలా ప్రమాదాలు నష్టాలు వున్నాయ్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు

ఎలక్ట్రిక్ హీటర్ల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయ్. సరిగ్గా నీళ్లల్లో పెట్టి స్విచ్ ఆన్ చేయకపోతే అది షాట్ సర్క్యూట్ కి దారితీసే ప్రమాదం ఉంది. ప్రాణాలు పోయిన సంఘనలు కూడా గతంలో చాలా ఉన్నాయ్. హీటర్ వల్ల నీళ్లు త్వరగా వేడి అవతాయ్. ఇలాంటి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. దురద, పొక్కులు, చర్మం ఊడిపోవడం లాంటివి జరగవచ్చు.

హీటర్ ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సౌడ్ లాంటి హానికరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలు పెరుగుతాయ్. ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా వస్తాయ్. ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల విద్యుత్తు ఖర్చుకూడా ఎక్కువగానే ఉంటుంది. కరెంట్‌ను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల కరెంట్ బిల్ పెరుగుతుంది.

ఎలక్ట్రిక్ హీటర్లు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, రిపేర్లు కూడా ఎక్కువగా వస్తాయ్. చాలా హీటర్లను రిపేర్ చేసే పరిస్థితులు ఉండవు. వాటిని పారవేసి కొత్తవి కొనుక్కోవాలి. ఇలా పర్యావరణాన్ని పాడుచేసే పరిస్థితి వస్తుంది. పనికిరాని హీటర్ ఎలిమెంట్ల వల్ల వ్యర్థాల్లో విషపదార్ధాలు పెరిగిపోతాయ్. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోవాలి.

కొన్ని హీటర్ల ఆన్ చేసినప్పుడ పెద్ద శబ్దం చేస్తాయ్. ఇవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయ్. ఒక వేల మనం నిద్రపోతుంటే ఆటంకాన్ని కలగజేస్తాయ్. కొన్ని సందర్భాల్లో హీటర్ల పేలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇంట్లో అగ్నిప్రమాదం కూడా చోటుచేసుకోవచ్చు.

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే హీటర్ల వాడకపోవడం మంచిది. ఎందుకంటే పిల్లలకు హీటర్ అని తెలియక దాని దగ్గరకు వెళ్తే ప్రమాదం ఉంది. హీటర్ల చాలా ఉష్ణోగ్రతతో ఉంటాయ్. హీటర్‌కు చేయితాకితే చర్మం లేచి వస్తుంది. కాబట్టి హీటర్లు వాడకపోతే కలిగే నష్టా చాలా తక్కువగా ఉంటుంది.

హీటర్లకు బదులుగా గ్యాస్ స్టవ్‌పైన నీళ్లు వేడి చేసుకోవడం మంచిది. రోజూ వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చలికాలంలో మాత్రమే వేడినీళ్లతో స్నానం చేయాలి. మిగతా కాలంలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఏ నష్టం ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు హీటర్‌తో వేడి చేసిన నీళ్లను ఉపయోగించకూడదు. హీటర్‌ వాడకాన్ని తగ్గించినా, పూర్తిగా ఆపేసినా మీకు ఎలాంటి నష్టం జరగదు.

volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా..? పక్కన పెడుతుందా..? అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం (రూ.10 వేలు) ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు లేదు పలుకు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి క్రమంగా నేరవేర్చకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్‌పై సంధిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయస్వామి ఆన్సర్ ఇచ్చారు.. ”ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని. వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపైన కసరత్తు చేస్తున్నాం’ అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి వీరాంజనేయస్వామి క్లారిటీతో గత కొంత కాలంగా నెలకొన్న సంధిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల విద్య పరీక్షల షెడ్యూలు ఇదీ. సెలవుల వివరాలు ఇవే

💥పాఠశాల విద్య పరీక్షల షెడ్యూలు ఇదీ..

🌻అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది.

• ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా..

▪ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి.

• సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు.

▪పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి.

▪ ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 3-6,

▪సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు.

♦సెలవులు: దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.

• క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.

జూలై 24న ఆకాశంలో అద్భుత దృశ్యం! 18 ఏళ్ల తరువాత! అస్సలు మిస్ కావద్దు!

ఈ విశ్వం అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. ఇందులో సౌర కుటుంబం కూడా ఒక చిన్న భాగం. దీని చుట్టూ భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా తిరుగుతుంటాయి. ఇలా వీటి భ్రమణ క్రమంలో, ఇతర సందర్భల్లో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. అలానే మరికొన్ని ఏళ్ల సంవత్సరాలకు ఒక్కరిసారి ఏర్పడుతుంటాయి. తాజాగా శని గ్రహం కారణంగా దాదాపు 18 ఏళ్ల తరువాత ఆకాసంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. అది కూడా మన ఇండియాలోనే కనిపించనుంది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మనం సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం గురించి ఎక్కువగా వింటాము. ఇది భూమి, చంద్రుల భ్రమణాల కారణంగా ఏర్పడుతుంటాయి. అలానే సౌరకుటుంబంలోని వివిధ గ్రహాలు తమ పరిభ్రమణ సమయంలో ఇతర గ్రహాల సమీపంలోకి చేరడంతో అరుదైన దృశ్యాలు కనువిందు చేస్తాయి కొన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. మరికొన్ని దృశ్యాలను టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా సూర్య, చంద్ర గ్రహణం లాంటిదే. కానీ వీటికి మాత్రం కాదు. అదే తరహాలో శనిగ్రహం ఓ అద్భుత దృశ్యం ఏర్పడేందుకు కారణం అవుతోంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం 18 ఏళ్ల తర్వాత ఇండియాలో కనిపించనుంది.

ఈ అరుదైన ఘటన భారతదేశంలో జూలై 24వ తేదీ నుంచి జూలై 25వ తేదీ అర్ధరాత్రి కనిపిస్తుంది. ఈ సమయంలో శని గ్రహం చంద్రుని వెనుకు వెళ్తుంది. తన పరిభ్రమణ క్రమంలో శని గ్రహం అలా చంద్రుని చాటుకు వెళ్తోంది. దీంతో శని గ్రహానికి ఉండే వలయాలు చంద్రుని వైపు నుండి మనకు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిని అధ్యయనం చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనినే శని చంద్రగ్రహణం అని పిలుస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని మనం కళ్లతో నేరుగా వీక్షించవచ్చు.

ఈనెల 24 బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఆకాశంలో ఈ అద్భుతం కనివిందు చేయనుందని పరిశోధకులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1.44 గంటలకు శని గ్రహం పూర్తిగా చంద్రుడి వెనక్కి వెళ్తుంది. జూలై 25 తేది తెల్లవారుజామున 2.25 గంటలకు శని గ్రహం చంద్రుని వెనుక నుండి బయటకు రావడం కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు ఈ ఖగోళ దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యం ఇండియాలో కూడా కనిపించనుంది. భారత్ తో పాటు శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్‌లలో కూడా ఈ దృశ్యాన్ని వేర్వేరు సమయాల్లో కనువిందు చేయనుంది. ఈ రెండు వేగంగా కదులుతున్నప్పుడు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు శని గ్రహం పైకి లేచినట్లు కనిపిస్తుంది. శని వలయాలు ముందుగా కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. శని గ్రహ వలయాలను చూడాలంటే చిన్న టెలిస్కోప్ ఉపయోగించాల్సి ఉంటుంది.

లోకేశ్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్! రజినీ మూవీలో విలన్ గా నాగ్!

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలాగే హీరో అండ్ విలన్ కాంబోకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వీరి కాంబోకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. డైెరెక్టర్లు సైతం హీరోను ఢీకొట్టడానికి బలమైన విలన్ నే ఎంచుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ బీభత్సంగా వైరల్ అవుతోంది. అదేంటంటే? రజినీకాంత్ మూవీలో టాలీవుడ్ మన్మథుడు విలన్ గా నటిస్తున్నాడట. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

లోకేశ్ కనగరాజ్.. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. కార్తీతో తీసిన ‘ఖైదీ’ మూవీతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ తీసి ఎక్కడికో వెళ్లిపోయాడు. లోకీ సినిమాటిక్ యూనివర్స్ ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది లోకేశ్ యూనివర్స్ కు భిన్నంగా సాగే కథ అన్నారు. ఇక ఈ మూవీలో రజినీకాంత్ ను ఢీ కొట్టేందుకు విలన్ గా నాగార్జునను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

కాగా.. గతంలో ఓ బాలీవుడ్ మూవీలో విలన్ గా నటించాడు నాగ్. ఈ వార్త నిజమైతే.. ఇప్పుడు మరోసారి విలన్ గా తన విశ్వరూపం చూపించనున్నాడు. అయితే ఇందుకు సంబంధించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సూపర్ స్టార్ కు విలన్ గా నాగ్ నటించబోతున్నాడు అంటూ బలంగా చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగ్ ధనుష్ మూవీ కుబేరలో కూడా నటిస్తున్నాడు. ఏ పాత్రలో అయినా అదరగొట్టే సత్తా నాగ్ సొంతం. అందుకే అతడిని విలన్ గా తీసుకోవాలని లోకేశ్ భావిస్తున్నాడు. మరి రజినీ మూవీలో నాగ్ విలన్ గా నటిస్తే చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు?

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. ఒక్కసారి 5 లక్షలు కడితే చాలు.. వడ్డీతోనే లక్షల్లో లాభం పక్కా!

డబ్బు సంపాదించడం ఓ కల. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తుంటారు. చేతిలో సరిపడా డబ్బుంటే లైఫ్ లో ఆ కిక్కే వేరు. ఈ రోజుల్లో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నది. అందుకే అంతా డబ్బుకు ప్రియారిటీ ఇస్తున్నారు. డబ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి? ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు కూడా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడిపెడితే వడ్డీ రూపంలోనే లక్షల్లో లాభం అందుకోవచ్చు.

పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీస్ అందించే పథకాల్లో అధిక వడ్డీ అందిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందొచ్చు. ప్రభుత్వ పథకం కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. కాగా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వడ్డీ రూపంలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి.

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 7.0. శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,149 పొందొచ్చు. అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే రూ. 2,24,974 చేతికి అందుతుంది. ఈ మొత్తాన్ని తీయకుండా మరో ఐదేళ్లు పొడిగించుకున్నట్లైతే పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీతో కలిపి 10 లక్షల వరకు అందుకోవచ్చు.

బడ్జెట్ ఎఫెక్ట్.. రూ.3000 తగ్గిన బంగారం ధర! కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి పద్దును ప్రవేశపెట్టి రికార్డును సృష్టించారు. 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ. 48, 20, 512 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత మందికి ఊరట.. మరికొంత మందికి నిరాశను కలిగించాయి. వేతన జీవులకు కొన్ని శ్లాబులు సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళ, పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించింది. అలాగే కొన్నింటిపై కస్టమ్స్ డ్యూటీలు పెంచడంతో పాటు తగ్గించింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్లపై బేసిక్ డ్యూటీని 1.5 శాతానికి పెంచింది. అలాగే బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించింది.

ఈ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ముఖ్యంగా మహిళలకు ఊరటనిచ్చినట్లు అయ్యింది. గతంలో బంగారం, వెండిపై సుంకం 15 శాతం ఉండగా.. అది 6 శాతానికి తగ్గించింది. ఇందులో బేసిక్ కస్టమ్ డ్యూటీ 10 శాతం నుండి 5 శాతానికి గ్గించారు. అలాగే అభివృద్ధి సెస్ 5 శాతం నుండి 1 శాతానికి తగ్గింది. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతాయని, డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, బడ్జెట్‌లో బంగారం, కస్టమ్స్ పై సెస్ తగ్గించగానే.. ఇక్కడ గోల్ట్ అండ్ సిల్వర్ ధరలు కూడా ఢమాల్ అన్నాయి. ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం ధర 3 నుండి 4 వేల వరకు పడిపోయింది. ఇటు సిల్వర్ బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి.

మొన్నటి వరకు భయపెట్టిన గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు బడ్జెట్ ఎఫెక్ట్‌తో మరింత తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు వేల వరకు ధర తగ్గింది. స్వచ్ఛమైన పసిడి గ్రాము ధర 7,385 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 299 ధరలు తగ్గి.. రూ. 7,086 వద్ద స్థిర పడింది. పది గ్రాముల బంగారం ధర రూ. 70, 860గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం గ్రాముపై రూ. 275 తగ్గగా.. పది గ్రాములపై 2750 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 64, 950కి చేరింది. మొన్నటి వరకు లక్ష మార్క్ చూసిన సిల్వర్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. కేజీపై రూ. 3, 500 వరకు తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 88 వేలుగా చూపిస్తుంది. కస్టమ్స్ డ్యూటీ రేట్ తగ్గుదల దీనికి కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇది బంగారం కొనాలనుకునేవారికి మంచి సమయం అంటున్నారు

డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఇవే! హీరోలు తొందరపడుతున్నారా?

సంక్రాంతి.. టాలీవుడ్ కు కలిసొచ్చిన పండుగ, పైగా సెంటిమెంట్ కూడా. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను ఈ పండక్కి బరిలోకి దింపాలని చూస్తుంటారు. సినిమా ప్రారంభం అయినప్పుడే సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించిన సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అయితే ఇప్పుడు సంక్రాంతి పండగ టాలీవుడ్ లో కాస్త ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే? భారీ చిత్రాలన్నీ డిసెంబర్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వార్ తప్పనట్లు కనిపిస్తోంది. అయితే విడుదల విషయాల్లో హీరోలు తొందరపడుతున్నారా? ఆ వివరాలు..

టాలీవుడ్ స్టార్ హీరోలు డిసెంబర్ ను టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో మెుదటి ప్లేస్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 విడుదల తేదీ ప్రకటించినప్పుడు బన్నీకి సోలో రిలీజ్ దొరికిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ నెలలో భారీ చిత్రాలు రాబోతున్నాయి. అయితే వాటికి కాస్త గ్యాప్ ఉండటం సంతోషించదగ్గ విషయం. అయితే నాగచైతన్య-చందు మెుండేటిల ‘తండేల్’, నితిన్ ‘రాబిన్ హుడ్’ ఒకే రోజున అంటే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇక లేటెస్ట్ గా శంకర్-రామ్ చరణ్ ల ‘గేమ్ ఛేంజర్’ కూడా క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అదీకాక.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ను డిసెంబర్ లోనే తీసుకొస్తున్నానని మంచు విష్ణు ట్వీట్ చేసిన సంగతి తెలియనిది కాదు. వీటితో పాటుగా కీర్తి సురేష్-వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్, ముసాఫా ది లయన్ కింగ్, అమీర్ ఖాన్, జెనీలియాల సితారే జమీన్ పర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ జరగనుంది. అయితే ఇలా అన్ని సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఇండస్ట్రీకి అంతక మంచిది కాదన్నది సినీ పండితుల అభిప్రాయం. ఎందుకంటే? వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో.. ఏ మూవీ చూడాలో అర్థం కాదు. ఫ్యాన్స్ అయితే కంపల్సరి చూస్తారు అది వేరే విషయం.

కానీ సగటు సినీ ప్రేక్షకుడు వరుసగా సినిమాలు చూడాలంటే.. ఆర్థికంగా లెక్కలు వేసుకోవాల్సిందే. దాంతో ఎంపిక చేసుకున్న సినిమాలనే అతడు చూసే అవకాశం ఉంది. అదే వారం గ్యాప్ లో విడుదల చేస్తే.. వీకెండ్ కు ఒకటి చొప్పున అన్ని సినిమాలు చూసే ఛాన్స్ ప్రేక్షకుడికి కల్పించినట్లు అవుతుంది. అయితే నిన్నటి దాక గేమ్ ఛేంజర్ క్రిస్మస్ బరిలో లేదు. కానీ తాజాగా దిల్ రాజు ప్రకటనతో ఏ సినిమా మేకర్స్ అయినా వెనక్కి తగ్గుతారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇలా ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయడంలో హీరోలు తొందరపడుతున్నారంటూ సినీ లవర్స్, పండితులు కామెంట్స్ చేస్తున్నారు.

లక్షాధికారిని చేసే LIC పాలసీ.. నెలకు 10 వేల పెట్టుబడితో చేతికి 18 లక్షలు

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం అద్భుతమైన పాలసీలను తీసుకొస్తుంది. ఈ పాలసీల్లో పొదుపు చేయడం ద్వారా బీమా కవరేజీతో పాటు గ్యారంటీ రిటర్న్స్ ను అందుకోవచ్చు. ఎల్ఐసీ కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. ఎల్ఐసీ పాలసీల్లో పొదుపు చేస్తే మీ డబ్బుకు భద్రత ఉంటుంది. ప్రజల కోసం ఎప్పటికప్పుడు నూతన పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎల్ ఐసీలో పొదుపు చేయాలనుకునే వారికి అదిరిపోయే పాలసీ అందుబాటులో ఉంది. ఆ పాలసీనే ఎల్ఐసీ బీమా జ్యోతి పాలసీ. ఇందులో పొదుపు చేస్తే లక్షాధికారి అయిపోవచ్చు. నెలకు రూ. 10 వేలు పొదుపు చేస్తే చేతికి ఏకంగా రూ. 18 లక్షలు వస్తాయి.

ఎల్ఐసీ బీమా జ్యోతి పాలసీతో రెండు విధాల ప్రయోజనాలను పొందొచ్చు. బీమా కవరేజీతో పాటు పెట్టుబడికి అవకాశం కల్పిస్తోంది, డెత్ కవరేజీ అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి ప్రాథమిక డిపాజిట్‌లో 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు ముట్టచెప్తుంది. 90 రోజుల వయసుగల పసి పాప నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు ఈ పాలసీలో చేరొచ్చు. ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ కనీసం హామీ మొత్తం రూ.1 లక్షగా ఉంది. గరిష్ఠ పరిమితి లేదు. ఎల్ఐసీ ద్వారా లాభాలు పొందాలనుకునే వారు ఈ పాలసీలో పొదుపు చేయడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.
10 వేల పెట్టుబడితో.. చేతికి 18 లక్షలు

ఎల్ ఐసీలో పొదుపు చేయాలనుకునే వారు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ లో నెలకు రూ. 10 వేలు పొదుపు చేస్తే లక్షల్లో లాభం పొందొచ్చు. కేవలం 10 సంవత్సరాలు పొదుపు చేస్తే సరిపోతుంది. అంటే 10 ఏళ్లపాటు నెలకు రూ. 10వేల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీ పెట్టుబడి మొత్తం రూ. 12 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడి సొమ్ముపై వార్షికంగా 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మెచ్యూరిటీ సమయానికి అంటే 15 ఏళ్ల తర్వాత మీకు 17 లక్షల 90 వేల వరకు చేతికి అందుతాయి. అయితే మీరు ఈ పాలసీలో పొదుపు చేసి 5 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి అన్ని వివరాలను పొందొచ్చు.

నెలకు 8 వేల కంటే ఎక్కువ అద్దె కడుతున్నారా? ఈ రూల్ తెలుసుకోవాలి.. లేదంటే రిస్కే!

ప్రతి ఏటా పన్ను పరిధిలోకి వచ్చే వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. కొంతమంది ఉద్యోగులు పన్ను మినహాయింపులు కూడా పొందుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది ఫేక్ రెంట్ రిసీప్టులు చూపించి పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఇంతకు ముందు అంటే రెంట్ ఎక్కువ కడుతున్నట్లు చూపించి పన్ను మినహాయింపు పొందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తప్పుడు రెంట్ రశీదులు పెట్టి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసేవారిని ఐటీ శాఖ గుర్తించింది. ఒకవేళ మీరు కనుక అద్దె ఎక్కువ చెల్లిస్తున్నట్లు ఫేక్ రెంట్ రశీదులు ఐటీ రిటర్న్స్ లో దాఖలు చేస్తున్నట్లైతే కనుక ఈ విషయం తెలుసుకోండి. లేదంటే చాలా నష్టపోతారు.

ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్టు ఐటీ రిటర్న్స్ లో చూపిస్తే ఎక్కువ మొత్తంలో రిఫండ్ పొందవచ్చునని కొంతమంది పన్ను చెల్లింపుదారులు నకిలీ రెంట్ రసీదులు సమర్పించేవారు. అయితే ఇలా ఎప్పుడూ చేస్తున్నట్టు ఈసారి చేస్తే దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే గతంలో చెల్లించిన అద్దె వివరాలు పాన్ కార్డు ద్వారా నమోదు అయి ఉంటాయి. అవి వార్షిక సమాచార నివేదికలో నమోదవుతాయి. ఈ వివరాలను ఆదాయపు పన్ను శాఖ చూస్తుంది. మీరు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ లో రెంట్, వార్షిక సమాచార నివేదికలో ఉన్న గత రెంట్ వివరాల్లో తేడా కనిపెడుతుంది. దీని వల్ల దొరికిపోతారు. అలా దొరికిన వారికి ఐటీ నోటీసులు వస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పన్ను చెల్లించే వ్యక్తి ఇంటి అద్దె ఏడాదికి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే కనుక ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులు చెల్లించే అద్దె వార్షిక సమాచార నివేదికలో నమోదవుతుంది. అద్దె ఏడాదికి లక్ష రూపాయలు దాటితే కనుక ఇంటి యజమాని ఆదాయంలో అద్దెకుండే వ్యక్తి రెంట్ వివరాలను నమోదు చేయాలి. ఆ వివరాలను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తుంది. ఎక్కువ ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లు ఐటీ రిటర్న్స్ లో దాఖలు చేస్తే కనుక దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 270ఏ ప్రకారం భారీ జరిమానాతో పాటు చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన పన్నులో 200 శాతం వరకూ జరిమానా ఉండవచ్చు. కాబట్టి ఫేక్ రెంట్ రశీదులు ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏడాదికి లక్ష రూపాయల కంటే ఎక్కువ అద్దె చెల్లించేవారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అధిక కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. రాజధాని కోసం రూ.15 వేల కోట్లు కేటాయించినందుకు.. పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సామాన్య ప్రజలకు బలం చేకూర్చింది: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

దేశంలోని సామాన్య ప్రజలకు బలం చేకూర్చే పని ప్రభుత్వం చేసిందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు. ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. బడ్జెట్‌లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపారు. 15 వేల కోట్ల ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజలు, రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలని కేంద్రమంత్రి కోరారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం: నాదేండ్ల

కేంద్ర బడ్జెట్‌పై జనసేన నేత నాదెండ్ల ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేశారు.. జనసేన తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇది అమరావతికి కూటమి పూర్వ వైభవం తెస్తుందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని.. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలుగా సాకారం: పురంధేశ్వరి

బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులపై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణం కేంద్రం తీసుకున్నట్టేనని.. దీనిలో భాగంగా అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్గం సుగుమం చేసిందని.. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలుగా సాకారం లభించిందని పురంధేశ్వరి వివరించారు.

ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్: సీఎం రమేష్

బడ్జెట్‌లో ఏపీకి పోలవరం, రాజధాని, ఇండస్ట్రియల్ కారిడార్‌ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్ కేటాయించనందుకు ఆనందంగా ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదాను కేంద్రం పట్టించుకోలేదు.. సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి: షర్మిల

బడ్జెట్‌లో ప్రత్యేకహోదా సహా ఏపీప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలకు పరిమితమయ్యిందన్నారు షర్మిల.అమరావతికి రూ 15 వేల కోట్లు విదిల్చిందని.. దీనికి పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‎పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రధాన మంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై వివరించామన్నారు. తమ రాష్ట్రంపట్ల పెద్దన్న పాత్ర పోషించమని కోరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అనవసరమైన బేషజలకు తాముపోలేదన్నారు.

బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం.. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించింది. కేంద్రంతో ఫ్రెండ్లి‎గా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు. వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తోందన్నారు. మొదటి నుండే ప్రధాని తెలంగాణ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాకు మాత్రం అన్ని విధాలుగా నిధులు ఇచ్చారని తెలిపారు. అయితే దానికి తాము ఎలాంటి విమర్శలు చేయడంలేదన్నారు. అదే సందర్భంగా పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ఇచ్చే పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ ఇది అని విమర్శించారు. తెలంగాణకు నిధులు కేటాయింపులో పూర్తిగా విఫలం అయినందుకు కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రానికి నిధులు తేనప్పుడు 8మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. బడ్జెట్‎ను మరోసారి సవరించి తెలంగాణకు నిధులు విడుదల చేయాలన్నారు. నిధులు విడుదల చేసేంత వరకూ కాంగ్రెస్ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. దీనికి ఎంఐఎం సహకరించాలని కోరారు.

ఊరిస్తున్న సిట్రోయిన్.. కొత్త బసాల్ట్‌కు సంబంధించిన మరో టీజర్.. కీలక అంశాలు బహిర్గతం..

మన దేశంలో ఆటోమోటివ్ మార్కెట్ విస్తృత స్థాయిలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు, అభిరుచికి అనుగుణంగా కొత్త తరహా వాహనాలు లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కూపే ఎస్‌యూవీలు ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మోడళ్లో టాటా కర్వ్ లాంచ్ కు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ఇది భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పడు ఇదే కూపే ఎస్‌యూవీ వెర్షన్లో సిట్రోయిన్ కూడా కొత్త కారును తీసుకొస్తోంది. సిట్రోయిల్ బసాల్ట్ పేరుతో దీనిని ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ను ఇప్పుడు సిట్రోయిన్ విడుదల చేసింది. కారు ఇంటీరియర్ ఎక్స్ టీరియర్ వివరాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ మాదిరిగానే.

ఈ కొత్త కూపే ఎస్‌యూవీ సిట్రోయిన్ బసాల్ట్ సీ3 ఎయిర్ క్రాస్ ప్లాట్ ఫారంపైనే రూపొదించారు. దీనిలో సిట్రోయిన్ సిగ్నేచర్ డిప్పింగ్ రూఫ్ లైన్ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటుంది. ఎస్‌యూవీ లైక్ పర్సనాలిటీ ఉంటుంది. డిజైన్ వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.

సిట్రోయిన్ బసాల్ట్ ఇంటీరియర్..

ఈ కారు లోపల ఫీచర్లకు సంబంధించిన కొన్ని అప్ డేట్లు విడుదల అయ్యాయి. సీ3 ఎయిర్ క్రాస్ కు మించిన రీతిలో ఇంటరీయర్ ఉంటుందని చెబుతున్నారు. ముందు, వెనుక ఆర్మ్ రెస్ట్స్, కప్ హోల్డర్లు, స్మార్ట్ ఫోన్ హోల్డర్ ఉంటుంది. 10.2 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఉంటుంది. ఇవి కాక మరిన్ని అధునాతన ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.
సిట్రోయిన్ బసాల్ట్ ఇంజిన్ వివరాలు..

ఈ కారులో 1.2 లీటర్ మూడు సిలెండర్ల ప్యూర్ టెక్ 110 ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంటుంది. అత్యధిక పనితీరు కలిగి ఉంటుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యూదాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టోయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. ఈ కారుపై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కారు లాంచ్ డేట్ గురించి కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇంకా తేదీ చెప్పలేదు.

మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. ఆ పని చేసి పోలీసులకు సారి చెప్పింది.. కానీ..!

సోషల్ మీడియా పుణ్యమా అని అశ్లీల డ్యాన్స్ వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వాళ్లకు కొదవలేకుండా పోయింది.లైకులు, వ్యూస్‌ కోసం కొత్త కొత్త మార్గాలలో ఇది ఒకటి.

అయితే, చాలా మంది బహిరంగ ప్రదేశాలు, రైలు, మెట్రో, పార్క్‌లలో అశ్లీల నృత్యాలు చేస్తూ..తోటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వారిలో మార్పు రావటం లేదు. తరచూ ఏదో ఒక చోట ఇలాంటి డాన్సులు, రీల్స్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. తాజాగా, ఢిల్లీ మెట్రోకు చెందిన ఇలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో పోలీసులకు క్షమాపణలు చెప్పిన ఓ యువతి ఢిల్లీ మెట్రోలో మళ్లీ అశ్లీల నృత్యం చేసింది.

వైరల్ వీడియోలో ఒక అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటపై డ్యాన్స్ చేస్తోంది. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు అమ్మాయి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో మహిళా కోచ్‌లో తీసినట్టుగా తెలుస్తోంది. మెట్రోలో జనాలు ఎవరూ లేరు. కాబట్టి ఈ అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో చివర్లో ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తూ కనిపించింది. ఇంటర్‌నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మెట్రో అశ్లీల డెన్‌గా మారుతోందని సోషల్ మీడియా యూజర్‌ ఒక రాశారు. డిఎంఆర్‌సి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఢిల్లీ మెట్రోకు వెళ్లాలంటే భయంగా ఉందని ఒకరు రాశారు. మెట్రో ప్రయాణికులు స్వయంగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని ఒకరు రాశారు. ఇలాంటి అమ్మాయిలను పట్టుకుని కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలని, బహుశా అలా చేస్తేనే వారిలో మార్పు వస్తుందేమోనని అంటున్నారు. ఇది అమ్మాయి తప్పు కాదని, ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు ఇలాంటి వారు ఏదైనా చేస్తారని మరొక యూజర్‌ రాసుకొచ్చారు.

ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు మనీషా డాన్సర్. ఇటీవల, ముంబైలో కూడా ఇలాగే అశ్లీల డాన్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేసింది. రైళ్లు, స్టేషన్లలో ఇదే పద్ధతిలో డ్యాన్స్ రీల్స్‌ చేస్తుండగా ముంబై RPF ఈ అమ్మాయిపై చర్య తీసుకుంది. దాంతో ఆమె వారిని క్షమాపణ కోరి తప్పించుకుంది. ఇప్పుడు, ఢిల్లీ మెట్రోలో అదే సీన్‌ రిపీట్‌ చేసింది. ఒకసారి పోలీసులకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాపిల్‌కు పోటీగా జియో ఎయిర్ ట్యాగ్ లాంచ్.. ధర తెలిస్తే షాక్..!

రిలయన్స్ ఇటీవల భారతదేశంలో జియోట్యాగ్ ఎయిర్ అనే కొత్త అసెట్ ట్రాకర్‌ను ప్రారంభించింది. ఈ పరికరం ఇప్పుడు అమెజాన్‌లో రూ. 1,499 పోటీ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ లాంచ్ ఆపిల్‌కు సంబంధించిన ఎయిర్‌ట్యాగ్‌కి మరింత సరసమైన ప్రత్యామ్నాయంగా జియోట్యాగ్ ఎయిర్‌ను ఉంచింది. దీని ధర ప్రస్తుతం రూ. 2,889గా ఉంది. జియో ట్యాగ్ ఎయిర్ అనేది ఒక కాంపాక్ట్ పరికరం. ఇది వినియోగదారులు తమ విలువైన వస్తువులైన కీస్, ఐడీ కార్డ్‌లు, వాలెట్‌లు, పర్సులు, సామాను, పెంపుడు జంతువులను గుర్తించడంలో, ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ అంశాలకు జియో ట్యాగ్ ఎయిర్‌ని జోడించడం ద్వారా వినియోగదారులు వారి స్థానాన్ని పర్యవేక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జియో ట్యాగ్ ఎయిర్ గురించి వివరాలను తెలుసుకుందాం.

జియో ట్యాగ్ ఎయిర్‌ రెండు ప్రధాన ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా పని చేస్తుంది. యాపిల్ ఫైండ్ మై నెట్ వర్క్, జియో థింగ్స్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. అయితే వినియోగదారులు దాని ట్రాకింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ఒకేసారి ఒక యాప్‌ని ఎంచుకోవాలి. యాపిల్ వినియోగదారుల కోసం జియో ట్యాగ్ ఎయిర్ ఐఫోన్, ఐ ప్యాడ్‌లు, మ్యాక్‌లలో అందుబాటులో ఉండే యాపిల్ ఫైండ్ మై మై యాప్‌నకు సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఎకోసిస్టమ్‌ని ఉపయోగించకూడదని ఇష్టపడే వారి కోసం జియో ట్యాగ్ ఎయిర్‌ను ట్రాక్ చేయడం, నిర్వహించడం కోసం జియో థింగ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. జియో ట్యాగ్ ఎయిర్‌కు సంబంధించిన యాపిల్‌కు సంబంధించిన యాపిల్ ఫైండ్ మై యాప్ ద్వారా ట్యాగ్ చేసిన అంశాలను ఇతర యాపిల్ వినియోగదారులతో పంచుకునే సామర్ధ్యం ఉంటుంది.

అలాగే జియో ట్యాగ్ ఎయిర్ పరికరం 90-120 డీబీ వరకు సౌండ్‌ను విడుదల చేస్తుంది. ఇది సమీపంలోని ట్యాగ్ చేసిన అంశాలను త్వరగా గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. వినియోగదారులు తమ విలువైన వస్తువులను వదిలిపెట్టకుండా ఉండేలా చూసుకోవడానికి ట్యాగ్ చేసిన వస్తువు పరిధి బయట ఉన్నప్పుడు జియో ట్యాగ్ ఎయిర్ డిస్‌కనెక్ట్ హెచ్చరికలను అందిస్తుంది. అదనంగా యాపిల్ ఫైండ్‌ మై నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యాపిల్ పరికరాలను ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. నెట్‌వర్క్‌లో పోయిన వస్తువు కనుగొన్నప్పుడు ఆటోమేటిక్ నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి వినియోగదారులు లాస్ట్ మోడ్‌ని కూడా ప్రారంభించే సదుపాయం ఉంది. జియో ట్యాగ్ ఎయిర్ అదనపు బ్యాటరీ, బాక్స్‌లో లాన్యార్డ్ కేబుల్‌తో వస్తుంది. రీప్లేస్‌మెంట్ అవసరం లేకుండానే రెండు సంవత్సరాల వరకు వినియోగాన్ని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కొత్త రంగులు అంటే గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం: బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేంటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఏపీలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ.. సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులను కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామక కారిడార్‌కు నిధులు చేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం

ఉద్యోగాలు – నైపుణ్యాలు
ఐదు పథకాల కోసం పీఎం ప్యాకేజీ విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు

అప్పటి వరకూ కూటమి కలిసే ఉంటుంది.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..

అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని తెలిపారు. అందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేంద్రం పోలవరం పూర్తిచేస్తామనడం అభినందనీయం అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు

జూన్ 4న వచ్చిన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమికి 93శాతం స్ట్రైక్ రేట్.. 57శాతం ఓట్లు వచ్చాయన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి ఫలితాలు రాలేదన్నారు. భవిష్యత్ తరాల కోసం బాధ్యతతో ఓటేశారని ఓటర్లను కొనియాడారు. టీడీపీ, జనసేనకు బీజేపీ తోడవడంతో ఎన్నికల ఫలితాల్లో సునామీ వచ్చిందని చెప్పారు. అలాగే సామాజిక బాధ్యతతో పవన్ ముందుకు వచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, రాష్ట్రంలో అప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనించి పవనే ముందు పొత్తును ప్రకటించారన్నారు. బీజేపీ కూడా కలిసిరావడంతో భారీ విజయం సాధించామన్నారు సీఎం చంద్రబాబు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‎ను ఉద్దేశిస్తూ చురకలు అంటించారు. ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. గతంలో ఏమైనా మంచి పనులు చేసి ఉంటే చెప్పేందుకు ధైర్యం ఉంటుందన్నారు. అయితే గతంలో ఏమీ చేయలేదు కాబట్టి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆనందించారు. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంతోపాటూ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నందుకు అభినందించారు.

నిపా వైరస్ సోకితే 48 గంటల్లోనే కోమాలోకి.. మొదట లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కేరళను నిఫా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. మల్లాపురం జిల్లాలో నిఫా వైరస్‌ సోకి 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వైరస్‌ సోకిన గంటల్లోనే ఆ బాలుడు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.

బాలుడి కుటుంబాన్ని ఐసోలేషన్‌కు తరలించారు. నిఫా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అధికారులు కోజికోడ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈనెల 24 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాండిక్కాడ్ నగరానికి చెందిన బాలుడు ఆదివారం ఉదయం 10:50 గంటలకు గుండెపోటుతో బాధపడ్డాడని.. ఆ తర్వాత మరణించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మరో నలుగురికి నిఫా వైరస్‌ నిర్ధారణ యిందని.. మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ ఇన్ఫెక్షన్ మృతి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘మల్టీ-మెంబర్ జాయింట్ అవుట్‌బ్రేక్ రెస్పాన్స్ టీమ్’ని మోహరించింది.. అంటువ్యాధికి వైరస్ సంబంధాన్ని గుర్తించడమే కాకుండా, కేంద్ర బృందం సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది. చివరిసారిగా 2023లో కోజికోడ్ జిల్లాలో ఈ వైరల్ వ్యాప్తి కనిపించింది. అప్పుడు కూడా పలువురు మరణించారు.. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిపా వైరస్ చరిత్రను పరిశీలించినట్లయితే.. మలేషియాలో పందుల పెంపకందారులలో మొదటిసారిగా 1999లో అంటువ్యాధి నిపా వైరస్ ను గుర్తించారు. అయితే, ఆ తర్వాత మలేషియాలో కొత్త వ్యాప్తి లేదు. 2001లో బంగ్లాదేశ్‌లో అంటువ్యాధి కేసులు నమోదయ్యాయి.. అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం ఆ దేశంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ వ్యాధి తూర్పు భారతదేశంలో కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. కంబోడియా, ఘనా, ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌తో సహా అనేక దేశాలలో వైరస్ (ప్టెరోపస్ బ్యాట్ జాతులు), అనేక ఇతర గబ్బిలాల వాహకాలు కనుగొనబడినందున అనేక ఇతర ప్రాంతాలు కూడా సంక్రమణ ప్రమాదంలో ఉండవచ్చు. నిపా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వైరస్‌ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుంది.

మానవులలో నిపా వైరస్ లక్షణాలు: WHO ప్రకారం.. నిపా వైరస్ మానవులలో తేలికపాటి ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణకు కారణమవుతుంది. అనేక సందర్భాల్లో మెదడువాపు వ్యాధి ప్రాణాంతక స్థాయికి చేరుకుంటుంది. వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. దీని తరువాత, మైకము, మగత, స్పృహ లేకపోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ను సూచించే నరాల లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది వ్యక్తులు వైవిధ్యమైన న్యుమోనియా, తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలను కూడా అభివృద్ధి చేయవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, ఎన్సెఫాలిటిస్, మూర్ఛలు సంభవిస్తాయి. 24 నుంచి 48 గంటల్లో కోమాకు చేరుకుంటారు.. ఇలా తీవ్రమైన లక్షణాల అనంతరం చనిపోయే ప్రమాదం ఉంది..

కోవిడ్ మరణాల రేటు 2 నుండి 3 శాతం ఉండగా, నిఫా మరణాల రేటు 40 నుండి 70 శాతం వరకు ఉంది.. కేరళలో నిపా వైరస్​ వ్యాప్తిచెందడం.. 2018 నుంచి ఇది నాలుగోసారి. కేరళలోని ఒక్క కొజికోడ్​ జిల్లాలోనే నిపా వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది..దీంతో అక్కడ కొవిడ్​ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. కర్నాటక, తమిళనాడు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. దీంతోపాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

నిఫా వైరస్‌లో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్టమాటిక్‌గా ఉంటుందని.. తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిపా వైరస్‌కు కచ్చితమైన వైద్యమంటూ ఏమీలేదు. ఇప్పటివరకు అనుమతి పొందిన ఏ ఔషధమూ అందుబాటులోకి రాలేదు. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి తగినంత నీరు అందించడం.. రోగి లక్షణాలకు చికిత్స చేయడం వంటివి మాత్రమే చేస్తారు.

ఉద్యోగులకు ఆ టాప్ టెక్ కంపెనీ షాక్.. ఆ రోజుల్లో కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందే..!

2020లో భారతదేశంలో కరోనా సృష్టించిన విలయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అంటే ఉలిక్కిపడతారు. ముఖ్యంగా లాక్‌డౌన్ అంటే ఎలా ఉంటుందో?

ప్రజలు ఆ సంవత్సరంలోనే చూశారు. అయితే కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పని విధానాన్ని నేర్పింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని టాప్ టెక్ కంపెనీలన్నీ అనుసరించాయి. ఈ విధానం ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ కరోనా తగ్గుముఖం పట్టినా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కోరుకుంటున్నారు. ఆఖరికి కంపెనీలు ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గి మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని టాప్ టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేశాయి. మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సర్దుబాటు చేస్తూ హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్ హైబ్రిడ్ విధానాన్ని సవరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా హెచ్‌సీఎల్ తీసుకున్న నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలోని మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అయిన హెచ్‌సీఎల్ టెక్, ఉద్యోగి సెలవులను వారి కార్యాలయ హాజరుతో అనుసంధానించే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి మూడు రోజులు, కనీసం నెలలో 12 రోజులు ఆఫీసు నుండి పని చేయాలి. ఈ రూల్‌ను ఉద్యోగులు బ్రేక్ చేస్తే వారు హాజరుకాని రోజుల్లో జీతంలో కోతపడనుంది హెచ్‌సీఎల్ టెక్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ తాజాగా నిర్ణయంతో ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి మూడు రోజులు కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది. హెచ్‌సీఎల్ హెచ్ఆర్ విభాగం ఈ అప్‌డేట్ గురించి ఉద్యోగులకు ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా ఈ విషయం తెలియజేయడం ప్రారంభించింది.

ప్రస్తుతం హెచ్‌సీ టెక్ మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు కంపెనీలో ఉన్న ఉద్యోగులకు 18 వార్షిక సెలవులు, ఒక వ్యక్తిగత సెలవును అందిస్తుంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పదవీకాలం ఉన్నవారు దాదాపు 20 వార్షిక సెలవులు, రెండు వ్యక్తిగత సెలవులను పొందుతారు. హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం మధ్య, సీనియర్ స్థాయి మేనేజ్‌మెంట్‌లోని వ్యక్తులు వారానికి 3 రోజుల పనిని కార్యాలయం నుంచి చేయాల్సి ఉంటుందని, ఉద్యోగులందరికీ ఈ విధానమే అమల్లో ఉంటుందని హెచ్‌సీఎల్ ప్రతినిధులు చెబుతున్నారు. గత వారం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం సంవత్సరానికి 20.45 శాతం పెరిగి రూ.4,257 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-జూన్ 2024లో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం 6.69 శాతం పెరిగి రూ. 28,057 కోట్లకు చేరుకుంది.

Health

సినిమా