ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది క్యాన్సర్ మహమ్మారితో ఇబ్బంది పడుతున్నారు.
మరీ ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా లంగ్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా సమస్య నుంచి బటయపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లంగ్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కనిపించే ప్రాథమిక లక్షణం దగ్గు. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతుంటే లంగ్ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలి. నెల రోజులుగా దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇక రక్తంతో కూడుకున్న దగ్గు మరీ ప్రమాదకరం ఇలాంటి లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. శ్వాస తీసుకునే సమయంలో ఛాతీలో నొప్పి రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతంగా చెప్పొచ్చు.
వీటితో పాటు అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, గొంతులో మార్పు రావడం, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉండడం కూడా లంగ్ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని చెబుతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో గుండెలో మంట కూడా క్యాన్సర్‌కు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గుండెలో మంటకు అసిడిటీ కారణంగా చెబుతుంటారు. కానీ ఇది కూడా లంగ్ క్యాన్సర్‌కు సంకేతమని అంటున్నారు. పైన తెలిపిన లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇదిలా ఉంటే భవిష్యత్తులో లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్, బీడీలు వంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉండాలి. అలాగే స్మోకింగ్ చేసే వారికి దగ్గరల్లో ఉండకూడదు. దీనిని పాసివ్ స్మోకింగ్ అంటారు. దీనివల్ల మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాయామాలను చేయాలి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేయాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.