Sunday, November 17, 2024

జియో నుంచి అంబానీకి మూడు నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?

అంబానీ కుటుంబం ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వార్తల్లో నిలిచింది. ముంబైలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. విదేశీ అతిథులు రావడం విశేషం. వివిధ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహానికి దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది.

ఈ రూ.5000 కోట్లు నిజానికి ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తుల్లో 0.05 శాతం మాత్రమేనని పలువురు లెక్కలు వేశారు. ఈలోగా రిలయన్స్ జియో లాభాల లెక్క బయటకు వచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల లాభాల లెక్క ఇది. ఐతే అనంత్-రాధికల పెళ్లి తర్వాత అంబానీ ఫ్యామిలీకి సంతోషకరమైన వార్త వచ్చిందని చెప్పొచ్చు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మొదటి త్రైమాసిక ఫలితాలు గత ఏడాది కంటే లాభం చాలా ఎక్కువ అని తేలింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ. 4,863 కోట్లు. ఇక ఈసారి లాభం 5,445 కోట్లకు పెరిగింది. అంటే గతేడాదితో పోలిస్తే నికర లాభం 12 శాతం పెరిగింది.

రిలయన్స్ ఈ టెలికాం కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. 2016లో జియో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి సంస్థ క్రమంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్. జియో కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా మొబైల్ పరికరాలు, జియో ఎయిర్‌ ఫైబర్‌, వివిధ యాప్‌లతో సహా బహుళ సేవలను కలిగి ఉంది. రిలయన్స్ జియో ఇటీవలి టారిఫ్ పెంపు వినియోగదారుల నుండి చాలా విమర్శలను అందుకుంది. అయితే విశ్లేషకుల ప్రకారం, టెలికాం విభాగం రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ పెరుగుతూనే ఉంది. జూన్ త్రైమాసికంలో 9 మిలియన్లు అంటే 90 లక్షల మంది వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు.

కళ్లకు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఏం జరిగిందో తెలుసా?

దృష్టి సమస్యలు అధిగమించేందుకు, చూపు స్పష్టంగా ఉండేందుకు చాలా మంది కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మంది గ్లాసెస్ ను ధరించడానికి ఇష్టపడరు.

వీటి బదులు లేటెస్ట్ ట్రెండ్ కాంటాక్ట్ లెన్స్ వాడుతారు. అయితే వీటిని ఉపయోగించడం అంత సులభమేమీ కాదు. వీటి నిర్వహణలో నిత్యం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు కూడా లెన్స్ ఉపయోగించడంపై తరచూ పలు జాగ్రత్తలు సూచిస్తారు. లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోతే ఒక్కోసారి కంటి చూపు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇప్పుడు తనకు కళ్లు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన జాస్మిన్ బాసిన్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగులో ‘దిల్లున్నోడు’ ‘వేట’, ‘లేడీస్ & జెంటిల్మన్’ మూవీస్ లో నటించిందీ అందాల తార. అలాగే పలు కన్నడ, మలయాళ, తమిళ ల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతకు ముందు హిందీ బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే లెన్స్ ఉపయోగించడం కారణంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతోంది జాస్మిన్ బాసిన్. ‘జూలై 17న ఒక ముఖ్యమైన పని కోసం ఢిల్లీలో ఉన్నాను. ప్రోగ్రాంకు రెడీ అవుతున్న టైంలో కళ్లకు లెన్స్ పెట్టుకోగానే ఎందుకో చాలా నొప్పిగా అనిపించింది. ఆతర్వాత ఆ నొప్పి మరింత ఎక్కువైపోయింది. దీంతో ఆ ఈవెంట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేశాను. అయితే ఒకానొక సమయంలో నాకేం కనిపించలేదు. అంత చీకటిగా అనిపించింది. ఎలాగోలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. కానీ ఈ నొప్పి తగ్గడానికి కనీసం 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా సరిగా పట్టడం లేదు’ అని జాస్మిన్ బాసిన్ వాపోయింది. ప్రస్తుతం ఆమె కళ్లకు వైట్ బ్యాండేజీతో కనిపిస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారు జాస్మిన్ లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు వీరే.. ఎందుకు తెలుసా?

భారతదేశంలో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రులు సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తే.. ప్రధాన మంత్రులు సైతం ఆ బాధ్యతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను సమర్పిస్తారు. వివిధ కారణాల వల్ల ప్రధానులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఫిబ్రవరిలో వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. అయితే ప్రధాన మంత్రులు సైతం బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర మనకు ఉంది. వారి వివరాలు తెలుసుకుందాం..

ముంద్రా కుంభకోణం ఆరోపణల తర్వాత 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి డిడి కృష్ణమాచారి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో అప్పటి ప్రధాని నెహ్రూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటికే విదేశీ వ్యవహారాలు, అణు ఇంధన శాఖలను నిర్వహించిన నెహ్రూ 1958 ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతతో బడ్జెట్‌ను సమర్పించారు.

నెహ్రూ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాక ప్రతి సంవత్సరం పూర్తి బడ్జెట్, 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

ఆ తర్వాత 1970లో ప్రధానిగా ఉన్న నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1969లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఇందిరా గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. ఇందిరా గాంధీ తన హయాంలో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

1987-89లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో ఆర్థిక మంత్రిగా వీపీ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీకి సన్నిహితులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వి.పి. సింగ్ ఆ కేసుల దర్యాప్తులో రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

పీవీ నరసింహారావు హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ 1991 నుండి 1996 వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1991 నాటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా బడ్జెట్ రూపొందించబడింది. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొత్త బాట పట్టింది. భారతదేశ చరిత్రలో 1991 బడ్జెట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.

 

రాయల్​ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 వేరియంట్లు- వాటి ఫీచర్స్, ధరలు​..

రాయల్ ఎన్​ఫీల్డ్​ తన లేటెస్ట్ మోడల్ గెరిల్లా 450ని కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించింది. ఇది పట్టణ రైడర్లను ఆకర్షించడానికి రూపొందించిన స్ట్రీట్-ఫోకస్డ్ మోటార్ సైకిల్. అడ్వెంచర్ ఓరియెంటెడ్ రాయల్ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 450ని ఈ కొత్త బైక్​ పోలి ఉంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 ప్రత్యేక స్టైలింగ్​ని కలిగి ఉంది. 452 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్​తో నడిచే ఈ బైక్​.. పర్ఫార్మెన్స్​, రిఫైన్​మెంట్​పై ఎక్కువగా ఫోకస్​ చేసింది. గెరిల్లా 450తో యువతను ఆకర్షించి మరింత డైనమిక్ కస్టమర్ బేస్​ని రూపొందించుకోవాలని రాయల్​ ఎన్​ఫీల్డ్​ భావిస్తోంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. అనలాగ్, డాష్, ఫ్లాష్. అనలాగ్ చాలా సింపుల్​గా ఉంటుంది డాష్, ఫ్లాష్ మోడళ్లు మరింత ఆధునిక అంశాలను పొందాయి. బేస్ వేరియంట్ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 మిడ్-సైజ్ బైక్​ సెగ్మెంట్​లో ఆధిపత్యమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 బైక్ 17 ఇంచ్​ చక్రాలతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ బైక్​లోని మూడు వేరియంట్ల విశేషాలను ఇక్కడ చూద్దాము..

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: అనలాగ్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 లైనప్ ఎంట్రీ పాయింట్, అనలాగ్ వేరియంట్ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇతర వేరియంట్లతో ప్రధాన భాగాలను పంచుకున్నప్పటికీ, సింపుల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​తో వస్తుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350, రాయల్ ఎన్​ఫీల్డ్​ సూపర్ మెటియోర్ 650 బైకుల్లోని సెమీ డిజిటల్ యూనిట్​ ఈ కొత్త బైక్​లోనూ కనిపిస్తుంది. కానీ బ్లూటూత్ కనెక్టివిటీ లేదు. దాని బదులు రైడర్లు టర్న్-బై-టర్న్ నేవిగేషన్​ కోసం అదనపు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్​ని ఎంచుకోవచ్చు. స్మోక్ సిల్వర్, ప్లేయా బ్లాక్​లలో ఈ బైక్​ లభిస్తుంది.

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: డాష్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 డాష్ వేరియంట్​.. బేస్ అనలాగ్ వేరియంట్​తో పోలిస్తే మరింత సాంకేతికంగా అధునాతన ప్యాకేజీని అందిస్తుంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 450లో కనిపించే టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ దీని ప్రత్యేకత.

 

ఈ ఆధునిక డిస్ప్లే గూగుల్ మ్యాప్స్ ద్వారా నావిగేషన్​ సహా స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీని అందిస్తుంది. రైడింగ్ అనుభవాన్ని పెంచుతుంది. రూ .2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన డాష్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ప్లేయా బ్లాక్, డ్యూయెల్-టోన్ గోల్డ్ డిప్.

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: ఫ్లాష్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 శ్రేణి టాప్​ ఎండ్​ వేరియంట్​ ఈ ఫ్లాష్​. డాష్​తో పోల్చితే ఈ ఫ్లాష్​ వేరియంట్​ ధర రూ .15,000 ఎక్కువ. ఇది స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీతో అదే టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ని పంచుకున్నప్పటికీ, రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 ఫ్లాష్ నిజంగా దాని కలర్ ప్యాలెట్​తో ప్రత్యేకతను కలిగి ఉంది.

కొనుగోలుదారులు అద్భుతమైన ట్రిపుల్-టోన్ ఎల్లో రిబ్బన్ లేదా అధునాతన డ్యూయెల్-టోన్ బ్రావా బ్లూ నుంచి ఎంచుకోవచ్చు. ఈ విలక్షణమైన కలర్ ఆప్షన్లు, బైక్ మొత్తం డిజైన్​తో కలిపి, బలమైన విజువల్ ఇంపాక్ట్​ని సృష్టిస్తుంది.

ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు

వివిధ నైపుణ్యాలున్న ఉద్యోగులపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంపై అనిశ్చితి నెలకొంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కొత్తతరం టెక్నాలజీలు ఉత్పాదకతను పెంచుతాయని, అయితే కొన్ని రంగాల్లో ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వే అంచనా వేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ వేగవంతమైన పని, సౌలభ్యం పరంగా సాటిలేనిది, కానీ రాబోయే కాలంలో ఇది పని విధానంలో పెద్ద మార్పును చూపించగలదని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అన్ని స్థాయిల్లోని కార్మికులపై దాని ప్రభావంపై పడుతుందని సమీక్ష పేర్కొంది.

భవిష్యత్తులో పని చేసే విధానంలో అతిపెద్ద మార్పు కృత్రిమ మేధలో వేగవంతమైన పెరుగుదల అని సర్వే చెప్పింది. వాస్తవానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెద్ద ఎత్తున మార్చే స్థితిలో ఉంది. ఈ మార్పునకు భారత్ అతీతం కాదు. కృత్రిమ మేధకు విద్యుత్, ఇంటర్నెట్ వంటి సాధారణ ప్రయోజనాలు ఉంటే.. పని సులభంగా చేసేస్తుంది. కానీ ఉద్యోగ రంగంపై మాత్రం భారీగా ప్రభావం పడనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థ స్మార్ట్‌గా మారుతున్నందున, దాని ఆమోదం పెరుగుతుంది. పని విధానం మారుతుంది. అన్ని రంగాల్లో దీని వాడకం పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని, కానీ కొన్ని ప్రాంతాలలో ఇది ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్థిక సర్వే అంటోంది.

కస్టమర్ సర్వీస్ సహా రోజువారీ పనుల్లో అధిక స్థాయిలో ఏఐ వాడకం పెరిగే అవకాశం ఉందని సర్వే తెలిపింది. సృజనాత్మక రంగాలు ఫోటో, వీడియో సృష్టికి కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించడాన్ని చూడవచ్చు. అదే సమయంలో కృత్రిమ మేధ ఉపాధ్యాయ విద్యను పునర్నిర్మించగలదు. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మందుల ఆవిష్కరణను వేగవంతం చేస్తుందని సర్వే పేర్కొంది.

ప్రభుత్వం, పరిశ్రమల చురుకైన ప్రయత్నాలు భారతదేశాన్ని AI యుగంలో కీలకంగా మార్చగలవని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్మికులు, ఉద్యోగార్ధులకు ప్రాథమిక కమ్యూనికేషన్, సహకారానికి మించిన నైపుణ్యాలు అవసరమని తెలిపింది. వీటిలో విశ్లేషణాత్మక ఆలోచన, ఆవిష్కరణ, సంక్లిష్ట సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, నిరంతర అభ్యాసం, సాంకేతిక రూపకల్పన, ప్రోగ్రామింగ్‌లాంటివి ఉన్నాయి.

 

సొంత బాబాయ్ ను హత్య చేసినప్పుడు దిల్లీలో ధర్నా చేయలేదే? – జగన్ కు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న

YS Sharmila : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచారన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై దిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. బాబాయ్ ను చంపిన వారితోనే కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వినుకొండ ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని, రాజకీయ హత్య కాదన్నారు. వర్షాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రజలు ఆదుకోవాలన్నారు.

ఏపీలో వర్షాలు బీభత్సా్న్ని సృష్టించాయని వైఎస్ షర్మిల అన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన రైతన్నలను వర్షాలు మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేకపోవడం… గేట్లు ఊడిపోయిన సందర్భాలు చూశామన్నారు. ఇటీవల వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేసి వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఒక్కొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పు ఉందని, ఏపీలో రైతులకు రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఏపీ ఎంపీలు అందరూ బీజేపీకే మద్దతు పలుకున్నారని, కానీ పదేళ్లుగా బీజేపీ ఏపీకి ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేంద్ర బడ్జె్ట్ లో ఏపీకి ఎప్పుడూ మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ ఏడాదైనా ఏమైనా మార్పుంటుందేమో చూడాలన్నారు. రాజధానికి కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుందని, రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ విషయంలో ఇన్నాళ్లు వైసీపీ , బీజేపీ నాటకాలు ఆడాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ స్పెషల్ ప్యాకేజీలు, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా ఈ హామీలను కేంద్రం ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని వైఎస్ షర్మిల అన్నారు.

“వినుకొండలో జరిగిన హత్య పొలిటికల్ నేపథ్యం కానే కాదు. వ్యక్తగత కారణాలతో జరిగిందంటున్నారు. వైసీపీ, టీడీపీ మద్దతు మీడియా చెప్పిన విషయాలు కాకుండా… న్యూట్రల్ మీడియాతో స్థానికంగా విచారణ చేస్తే వినుకొండ ఘటన వ్యక్తిగత మర్డర్ అని తెలిసింది. మొన్నటి వరకూ హత్య చేసినవాళ్లు, హత్యకు గురైన వాళ్లు వైసీపీతోనే ఉన్నారు. అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకు దీన్ని పొలిటికల్ మర్డర్ అనే ముద్ర వేసి దిల్లీ వెళ్లి ధర్నా చేస్తారంట. జగన్ గతంలో హత్యా రాజకీయాలు చేశారు. అధికారంలో ఏం పట్టించుకోని జగన్ ఇప్పుడు కార్యకర్తలను చంపేస్తున్నారని దిల్లీలో ధర్నా చేస్తారా? అసెంబ్లీలో ఉండి ప్రశ్నించకుండా దిల్లీలో ఏం చేస్తారు. ” – వైఎస్ షర్మిల

 

బిగ్‏బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. అసలు విషయం చెప్పేసిన హోస్ట్ నాగార్జున.. 1d3 shares

బుల్లితెరపై బిగ్‏బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ.. చూసే అడియన్స్ మాత్రం తగ్గడంలేదు.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈషోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తెలుగులో మాత్రం మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి బిగ్‏బాస్ షోకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇన్నాళ్లు ఉన్న బిగ్‏బాస్ షో రూల్స్, హోస్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని సీజన్ 7 నుంచి మార్చేశాడు నాగార్జున. ముఖ్యంగా సీజన్ 7లో హోస్టింగ్ అదరగొట్టేశాడంటూ అడియన్స్ పొగడ్తలు కురిపించారు. సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీజన్ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొన్నాళ్లుగా సీజన్ 8 ప్రారంభం, కంటెస్టెంట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 గురించి అప్డేట్ ఇచ్చాడు నాగార్జున. ఈ షో ముందు నుంచే వెరైటీ ప్రమోషన్లతో హడావుడి స్టార్ట్ చేశాడు.

తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 కొత్త లోగో రివీల్ చేస్తూ అసలు ప్రోమో రిలీజ్ చేశాడు నాగార్జున. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభమనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున. తాజాగా విడుదలైన కొత్త లోగో కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా కంటెస్టెంట్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వినిపిస్తున్నాయి.

ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని, యూట్యూబర్స్ ను కూడా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయితే ఈ సీజన్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‏బాస్ షో స్టార్ట్ చేయనున్నారు. తాజాగా నాగార్జున షేర్ చేసిన బిగ్‏బాస్ సీజన్ 8 ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

 

ధవళేశ్వరంలో పదిలక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి వరద ప్రవాహం,మొదటి హెచ్చరిక జారీ

Godavari warning: గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. వరద ఉధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో 5SDRF, 4NDRF బృందాలు పాల్గొంటున్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46.7అడుగులకు చేరింది. పోలవరం వద్ద 12.5 మీటర్లకు నీటిమట్టం దాటేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.50 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఇది మరింత పెరగనుంది.

ఆదివారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు,వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్స్ కు మొత్తంగా 21.50కోట్లు నిధులు మంజూరు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1కోనసీమ, 1తూర్పుగోదావరి, 1అల్లూరి), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు అధికారులు తెలిపారు.

సహాయక బృందాల వెంట ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో అద్భుత ఆఫర్లు

ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థ డెల్‌ కంపెనీకి చెందిన డెల్‌ 15 ఇంటెల్‌ ఐ5 ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ల్యాప్‌ టాప్‌ అసలు ధర రూ.

67,457కాగా సేల్‌లో భాగంగా కేవలం రూ. 41,490కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

హెచ్‌పీ 15 ఎస్‌ ఇంటెల్‌ ఐ5 12 జెన్‌ ల్యాప్‌టాప్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌ట్యాప్‌ 16 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 68,223 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 45,490కే సొంతం చేసుకోవచ్చు. ఇక అసుస్‌ వివో బుక్‌ 14 ఇంటెల్‌ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 56,990 కాగా సేల్‌లో భాగంగా రూ. 29,990కి సొంతం చేసుకోవచ్చు.

అలాగే లెనోవో ల్యాప్‌టాప్‌పై కూడా మంచి ఆఫర్‌ లభిస్తోంది. లెనోవో స్లిమ్ 3 ఇంటెల్ ఐ5-12 జెన్ 16జీబీ ర్యామ్ వేరియంట్‌ అసలు ధర రూ. 70,090కాగా డిస్కౌంట్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.45,990కే సొంతం చేసుకోవచ్చు.

ఇక అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ డీల్స్‌లో లెనోవో ఐడియా పాడ్ గేమింగ్ 4 ర్యేజెన్ 5 ఒకటి. ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 77,990కాగా సేల్‌లో భాగంగా రూ.39,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఏసర్‌ అస్పైర్‌ లైట్ ఇంటెల్‌ ఐ3 12 జెన్‌ అసలు ధర రూ. 52,990కాగా సేల్‌లో భాగంగా రూ. 25,990కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఎంఎస్ఐ థిన్ 15 ఇంటెల్ ఐ5 -12 జెన్ ల్యాప్‌టాప్‌పై కూడా మంచి ఆఫర్‌ లభిస్తోంది. ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 70,990 కాగా సేల్‌లో భాగంగా రూ. 44,990కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఏసర్‌ కంపెనీకి చెందిన ఏఎల్జీ ఇంటెల్ ఐ5 12 జెన్, ఆర్టీఎక్స్ 2050 జీపీయూ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 89,990 కాగా సేల్ భాగంగా రూ. 48,470కే సొంతం చేసుకోవచ్చు.

భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం కూడా..!

దేశ ఆర్థిక స్థితి అనేది ఆయా దేశం వద్ద ఉన్న విదేశి మారక నిల్వల ఆధారంగా ఉంటుంది. దీంతో అన్ని దేశాలు విదేశీ మారక నిల్వల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి.

భారతదేశం విషయంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 12తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 9.699 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు పెరిగాయి. ఇది 666.854 బిలియన్ల యూఎస్‌ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత వారంలో ఈ నిల్వలు 5.158 బిలియన్ల యూఎస్‌ డాలర్లుగా ఉన్నాయి. జూన్ 7తో ముగిసిన వారంలో నమోదు చేసిన 655.817 బిలియన్ల యూఎస్‌ డాలర్ల గరిష్ట స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వల విషయంలో వివరాలను తెలుసుకుందాం.

జూలై 12తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ ఆస్తులు నిల్వలలో అతిపెద్ద భాగం 8.361 బిలియన్ల డాలర్లకు పెరిగి 585.47 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. డాలర్ పరంగా వ్యక్తీకరించిన ఈ ఆస్తులు రిజర్వ్‌లలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్‌యేతర కరెన్సీల విలువ లేదా తరుగుదల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి.

బంగారం నిల్వలు ఇలా

బంగారం నిల్వలు కూడా 1.231 బిలియన్ల యూఎస్‌ డాలర్లకు పెరిగాయి. అంటే మొత్తం 58.663 బిలియన్ల యూఎస్‌ డాలర్లుగా ఉన్నాయి. అదనంగా ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 76 మిలియన్ల యూఎస్ డాలర్లు పెరిగి 18.111 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో భారతదేశానికి సంబంధించిన రిజర్వ్ స్థానం 32 మిలియన్ల యూఎస్ డాలర్లకు పెరిగి 4.609 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకుంది.

గృహ రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. అది ఆర్థికంగా చాలా భారమైనది కావడంతో చాలా మందికి కలగానే మిగిలిపోతోంది.

అయితే ఇటీవల కాలంలో చాలా మంది హోమ్ లోన్(గృహ రుణం)లను ఆశ్రయిస్తున్నారు. సులభ వాయిదాలలో ఈ లోన్లు చెల్లించుకునే వెసులుబాటు ఉండటం, తక్కువ వడ్డీ రేటు ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే ఇది జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఒకసారి పెద్ద మొత్తం హోమ్ లోన్ తీసుకుంటే.. దాని కోసం ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకునే లోన్ పై వడ్డీరేటు, మీరు నిర్ణయించుకున్న కాల వ్యవధి ఆధారంగా ఒక్కోసారి మీరు చెల్లించే మొత్తం మీరు రుణంగా తీసుకున్న మొత్తం కంటే రెట్టింపు అవుతుంది. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోవాలి. వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీల గురించి వాకబు చేయాలి. పైగా అన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ రేట్లు ఒకేలా ఉండవు. ముందుగానే అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద మీ రుణానికి సంబంధించిన రేట్ల వివరాలను తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..

ప్రభుత్వ రంగ బ్యాంకులు..

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై 8.35 శాతం నుంచి 10.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్లపై 8.4 శాతం నుంచి 10.90 శాతం వరకూ వడ్డీ రేట్లు విధిస్తోంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.4 శాతం నుంచి 10.25 శాతం వరకూ వడ్డీరేట్లకు హోమ్ లోన్లను అందిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.4 శాతం నుంచి 10.85 శాతం వరకూ ఉంది.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.45 శాతం నుంచి 9.80 శాతం వరకు ఉంది.

ఈ రేట్లు మీరు తీసుకునే రుణ మొత్తం, మీ సిబిల్ స్కోర్, మీరు నిర్ణయించుకున్న టెన్యూర్ ఆధారంగా మారుతుంటుంది. అందరికే ఒకే రకమైన రేట్లు ఉండవు.

ప్రైవేట్ రంగ బ్యాంకులు..

  • కర్ణాటక బ్యాంకులో హోమ్ లోన్లపై 8.50 శాతం నుంచి 10.62 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.
  • హెచ్ఎస్బీసీ బ్యాంక్ హోమ్ లోన్లపై వడ్డ రేటు 8.50 శాతంగా ఉంది.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్లో హోమ్ లోన్లపై 8.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • సౌత్ ఇండియన్ బ్యాంక్లో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.70 శాతం నుంచి 11.70 శాతం వరకు ఉంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్లపై 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఈ రేట్లు కూడా మీరు తీసుకునే రుణ మొత్తం, మీ సిబిల్ స్కోర్, మీరు నిర్ణయించుకున్న టెన్యూర్ ఆధారంగా మారుతుంటుంది. అందరికే ఒకే రకమైన రేట్లు వర్తించవు.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు..

  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రేటు హోమ్ లోన్లపై 8.50 శాతం నుంచి 10.75 శాతం వరకు ఉంది.
  • బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో హోమ్ లోన్లపై 8.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో హోమ్ లోన్లపై 8.55 శాతం వడ్డీ రేటు ఉంది.
  • ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలో హోమ్ లోన్లపై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • టాటా క్యాపిటల్ సంస్థ 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 8.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
  • మ్మాన్ క్యాపిటల్ (గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్) 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

అవయవ దానాన్ని ప్రోత్సహించేలా భారతీయ రైల్వే చర్యలు.. అసలు విషయం ఏంటంటే..?

వయవ దానం చేయడం అంటే మనం ఇంకో ప్రాణం నిలబెట్టినట్టేనని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తూ భారతదేశంలో అవయవదానమంటే భయపడుతూ ఉంటారు.

కానీ, కావాల్సిన వారికి కష్టం వస్తే ఏదైనా చేసి బతికించాలనే తలంపుతో తమ సొంత వారికి కిడ్నీ, లివర్ వంటి వాటిని దానం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారతీయ రైల్వే అవయవదానం చేసిన ఉద్యోగులకు ప్రోత్సహించేలా కీలక చర్యలు తీసుకుంది. అవయవదానం చేసిన వారికి 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అవయవాలను దానం చేసే రైల్వే ఉద్యోగులు 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్‌కు అర్హులని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తీసుకున్న తాజా చర్యల గురించి వివరాలను తెలుసుకుందాం.

గత సంవత్సరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి అవయవ దాతలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరుకు సంబంధించి సూచనలను జారీ చేసింది. దాత నుంచి అవయవాన్ని తొలగించడం ఒక పెద్ద శస్త్రచికిత్స అని ఆసుపత్రిలో చేరడంతో పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా కోలుకోవడానికి సమయం అవసరమని డీఓపీటీ తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని పొడిగిస్తూ అవయవ దానం మరొక మానవునికి సహాయం చేయడానికి ఒక గొప్ప కార్యకలాపం కాబట్టి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రజా ప్రయోజనాల కోసం ఒక సంక్షేమ చర్య అని రైల్వే బోర్డు పేర్కొంది. గత వారం జారీ చేసిన ఉత్తర్వులో డాక్టర్ సిఫారసుపై దాత అవయవాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స రకంతో సంబంధం లేకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని రైల్వే శాఖ ఉద్యోగులకు సమాచారం అందించింది. అయితే అవయవ మార్పిడి శస్త్రచికిత్స రైల్వే ఆసుపత్రిలో లేదా ఎంపానెల్ చేయబడిన ప్రైవేట్ సంస్థలో జరిగిన షరతుకు ఈ సౌకర్యం లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

మానవ అవయవాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం సమర్థ వైద్య అధికారం ద్వారా దాత విరాళం కోసం సక్రమంగా ఆమోదిస్తే అన్ని రకాల జీవన దాతలకు సెలవు మంజూరు చేస్తామని పేర్కొంది. స్పెషల్ క్యాజువల్ లీవ్ శస్త్రచికిత్సకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితుల మినహా మరే ఇతర సెలవులతో కలిపి ఉండకూడదని పేర్కొంది. భారతీయ రైల్వేలో ప్రస్తుతం దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం వారందరిలో అవయవదానంపై అవగాహన కలుగజేస్తుంది. అయితే మరణించిన అవయవ దాతల బంధువులను గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అధికారిక వర్గాల ప్రకారం ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ ఒక కమ్యూనికేషన్‌లో మరణించిన అవయవ దాతలందరికీ, అతని/ఆమె కుటుంబ సభ్యునికి శాలువా, ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్ ఇచ్చి అవయవ దాత చిత్రపటం వద్ద నివాళులర్పించవచ్చని పేర్కొంది. సంబంధిత స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌లోని ఇద్దరు సిబ్బంది లేదా ప్రభుత్వ వైద్య కళాశాల/ఆసుపత్రికి చెందిన స్థానిక ప్రతినిధులు దాత ఆసుపత్రి/ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సత్కరించాలని సూచించారు. మరణించిన అవయవ దాతకు సంబంధించిన గౌరవప్రదమైన అంత్యక్రియల ఖర్చులను కవర్ చేయడానికి జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం మార్గదర్శకాల రూ.10,000 మంజూరు చేస్తారు.

కళ్లు తిరుగుతున్నట్టు తరచుగా అనిపిస్తుందా.. ఇదే లోపం!

రీరం ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కావాలి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ వంటివి అన్నీ అందితేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించగలం.

వీటిలో ఏది తక్కువైనా.. ఎక్కువైనా సమస్యలు తప్పవు. చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. రక్త హీనత సమస్యను నివారించడంలో ఐరన్ ఖచ్చితంగా కావాలి. అదే విధంగా అవయవాలు మెరుగుగా పని చేయాలన్నా ఐరన్ ఖచ్చితంగా అవసర పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్షణాలు ఇవే:

శరీరంలో ఐరన్ తగ్గింది అనడానికి ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలసట, బలహీనత, చిన్న పనులకే అలిసి పోవడం, తల తిరుగుడం, తల నొప్పి, పసుపు చర్మ వంటివి ఐరన్ తగ్గింది అనడానికి సూచనలు.

బెల్లం తినండి:

బెల్లంలో ఐరన్ అనేది అధిక శాతంలో లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపంతో ఉండేవారు త్వరగా రికవరీ అవడంలో బెల్లం ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ చిన్న ముక్క బెల్లం తింటే రక్తం అనేది బాగా పడుతుంది. దీంతో రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా బెల్లం తినడం వల్ల కండరాలు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

బీట్ రూట్:

బీట్ రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క బీట్ రూట్‌తో ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కాబట్టి వారంలో ఒక్కసారైనా బీట్ రూట్ తింటూ ఉండండి. ఐరన్ లోపంతో బాధ పడేవారు బీట్ రూట్ తింటే చక్కగా రక్తం పడుతుంది. అంతే కాకుండా మీ చర్మం కూడా గ్లో అవుతుంది. చాలా మందికి బీట్ రూట్ తినడం ఇష్టం ఉండదు. బీట్ రూట్ తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

పాలకూర:

ఆకు కూరల్లో పాల కూర కూడా ఒకటి. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ఐరన్ లోపంతో బాధ పడేవారు కూడా పాల కూర తీసుకుంటే.. ఈ సమస్య దూరమవుతుంది. ఐరన్ లోపంతో బాధ పడేవారు పాలకూరను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

డ్రై ఫ్రూట్స్:

ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఎన్నో సమస్యలకు పెట్టొచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి ఐరన్‌ లోపంతో ఉండే వారు.. మీ డైట్‌లో వీటిని యాడ్ చేసుకోండి. ముఖ్యంగా గుమ్మడి గింజలు తింటే మరింత మంచిది.

విటమిన్ సి ఫుడ్స్:

ఐరన్ లోపంతో బాధ పడేవారు విటమిన్ సీ ఫుడ్స్‌ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శరీరం ఐరన్‌ గ్రహించేలా చేయడంలో విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, ఆహారం తీసుకోండి. అంతే కాకుండా రెడ్ మీట్, ఉల్లిపాయలు, బచ్చలి కూరలు, కూరగాయలు తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఇంట్లోనే వెల్వేట్‌ పెన్సిల్స్‌ తయారీ.. వేలల్లో ఆదాయం, నష్టం లేని వ్యాపారం.

మారిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను సైతం పెంచుకోవాల్సి పరిస్థితి ఉంది. దీంత చాలా మంది సైడ్ ఇన్‌కమ్‌ కోసం చూస్తున్నారు. దీంట్లో వ్యాపారానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

ఇంట్లోనే ఉంటూ చేసుకునే వ్యాపారాల కోసం ప్లాన్‌ చేస్తున్నారు. అయితే మనలో చాలా మంది వ్యాపారం అనగానే పెట్టుబడి, లాభనష్టాల గురించి వెనకాముందు అవుతుంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాలను తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. అంతేనా మంచి లాభాలను కూడా ఆర్జించవచ్చు.

కాలంతో సంబంధం లేకుండా నిత్యం డిమాండ్‌ ఉండే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. పెన్సిల్స్‌ వాడకం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుల్లో ఉండే వారికి వరకూ ప్రతీ ఒక్కరూ పెన్సిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పెన్సిల్స్‌లో తయారీలో కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. తాజాగా వెల్వెట్‌ పెన్సిల్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వీటిని ఇంట్లోనే తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పెన్సిల్స్‌ను ఎలా తయారు చేయాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్వెట్ పెన్సిళ్ల తయారీకి ఒక మిషన్‌ కావాల్సి ఉంటుంది. అలాగే ముడి సరుకు కూడా అవసరపడుతుంది. వెల్వెట్ పెన్సిల్ తయారీ మిషన్‌ ధర సుమారు రూ. లక్షపైనే ఉంటుంది. దీంతో పాటు ఎలాంటి కలర్‌ లేని పెన్సిల్స్‌ అలాగే గమ్‌, ఒక క్యూబ్‌ అవసర పడుతుంది వీటితో పాటు పెన్సిల్స్‌కు అప్లై చేయడానికి కలర్‌ కూడా కావాలి. వీటన్నింటినీ మార్కెట్‌లో పలు సంస్థలు అందిస్తున్నాయి. ఇక తయారీ విషయానికొస్తే ముందుగా క్యూబ్‌ తీసుకొని దానికి నాలుగు పెన్సిల్స్‌ను అమర్చాల్సి ఉంటుంది. అనంతరం ఒక మిషిన్‌లో కలర్‌ పౌడర్‌ను పోసి ఈ నాలుగు పెన్సిల్స్‌ను అందులో పెట్టాలి.

అనంతరం మిషిన్‌ను ఆన్‌ చేయగానే కలర్‌ మొత్తం పెన్సిల్‌కు అంటుకుంటుంది. వీటిని పక్కన పెట్టి కలర్‌ ఆరేంత వరకు ఉంచాలి. అనంతరం వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో మార్కెట్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో బౌ బ్యాక్‌ పేరుతో కూడా కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలకు డబ్బులు చెల్లించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్‌.

ఈ రసాలు తాగితే.. ఒక్క రోజులోనే డెంగ్యూ మాయం..

ర్షా కాలంలో ఎక్కువగా వినిపించే వాటిల్లో జ్వరాలు కూడా ఒకటి. సీజ్ మారిందంటే ముందుగా ఎటాక్ చేసేది జ్వరం. ఈ జ్వరాల్లో డెంగ్యూ ఫీవర్ కూడా ఒకటి. దోమల కుట్టడం వల్ల వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్.

ఈ ఫీవర్ వచ్చిందంటే.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఈ జ్వరం వచ్చిన వారిలో తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. అలాగే ప్లేట్ లేట్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ఆహారం పట్ల మరింత కేర్ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్ల, కూరగాయల రసాలు కూడా తీసుకుంటూ ఉండాలి. వీటి వలన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం వచ్చినవారు ఖచ్చితంగా ఈ డ్రింక్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే పేషెంట్లు కోలుంటారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సొరకాయ రసం:

సొరకాయలతో చేసిన కూర అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఈ కూరగాయతో చేసిన రసం తాగితే డెంగ్యూ ఫీవర్ అనేది తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జ్వరం కారణంగా వచ్చే రక్త పోటుని తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచతాయి. ప్లేట్ లేట్స్ పెరుగుతాయి.

ద్రాక్ష రసం:

డెంగ్యూ జ్వరం ఉన్నవాళ్లు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల బలహీనత, నీరసం అనేవి తగ్గుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బల పరిచి.. డెంగ్యూతో పోరాడే శక్తిని ఇస్తాయి. రక్త పోటు పెరగకుండా చేస్తుంది. రక్తం పడుతుంది. అంతే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది.

నారింజ రసం:

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీర నొప్పులు అనేవి అధికంగా ఉంటాయి. కండరాల నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. నారింజ రసం తాగడం వల్ల కండరాల నొప్పులు అనేది తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. బలహీనతను దూరం చేస్తుంది. జ్వరాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుంది. ప్లేట్‌ లెట్స్ పెరుగుతాయి.

బొప్పాయి రసం:

డెంగ్యూ జ్వరాన్ని కంట్రోల్ చేయడంలో బొప్పాయి ఆకులు, బొప్పాయి పండు ఎంతో హెల్ప్ చేస్తుంది. డెంగ్యూ జ్వరంలో ఉన్నవాళ్లు బొప్పాయి పండు జ్యూస్ తాగితే చాలా రిలీఫ్ వస్తుంది. తగ్గిన ప్లేట్ లేట్స్ పెరుగుతాయి. రక్తం కూడా పడుతుంది. శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

దేవర తొందర.. అనిరుద్‌ ఆలస్యం. తెగేదెప్పుడు ??

విడుదలై పాటలు హిట్‌ అయ్యాక యూనిట్‌ అందరూ కలిసి చార్ట్ బస్టర్‌ సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ రన్నింగ్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్‌ డైరక్టర్‌ ట్యూన్స్ ఆలస్యం చేయడం వల్ల షెడ్యూల్స్ డిలే అవుతున్నప్పుడు కెప్టెన్‌ పడే పాట్లు ఎవరికి అర్థం అవుతాయి?
ఇప్పుడు ఈ లైన్లు కొరటాల వింటే భలే ఖుషీ అవుతారేమో… దేవర మూవీకి సేమ్‌ టు సేమ్‌… ఆయన ఇలాంటి ఇబ్బందే ఫేస్‌ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్‌.విడుదలై పాటలు హిట్‌ అయ్యాక యూనిట్‌ అందరూ కలిసి చార్ట్ బస్టర్‌ సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ రన్నింగ్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్‌ డైరక్టర్‌ ట్యూన్స్ ఆలస్యం చేయడం వల్ల షెడ్యూల్స్ డిలే అవుతున్నప్పుడు కెప్టెన్‌ పడే పాట్లు ఎవరికి అర్థం అవుతాయి? ఇప్పుడు ఈ లైన్లు కొరటాల వింటే భలే ఖుషీ అవుతారేమో… దేవర మూవీకి సేమ్‌ టు సేమ్‌… ఆయన ఇలాంటి ఇబ్బందే ఫేస్‌ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్‌.

దేవర ఓపెనింగ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్స్ లో అనిరుద్‌ అప్పియరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలిచ్చేస్తే పండగ చేసుకుంటామని అనుకున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్‌ చేసిన సింగిల్‌ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఎన్ని సార్లు విన్నా పెద్దగా ఎక్కలేదు ఈ పాట జనాలకు.

పోనీ నెక్స్ట్ పాటలైనా బావుంటాయా? అని అంటే… ఇప్పటిదాకా నెక్స్ట్ సింగిల్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనే విషయం మీదే క్లారిటీ లేదు. దీనికి రీజన్‌ అనిరుద్‌ ఇంకా ట్యూన్స్ ఇవ్వకపోవడమే అనే మాట వినిపిస్తోంది.

తారక్‌లాంటి మ్యాసివ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ప్యాన్‌ ఇండియా స్టార్‌ కే అనిరుద్‌ ఇలా చేస్తే ఎలా? తెలుగు లంటే ఆయనకు చిన్న చూపా? లేకుంటే తెలుగు హీరోల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఆయనతో పనిచేయించుకోవడం కొరటాలకు చేత కావడం లేదా? తెలుగు, తమిళ్‌ అనేతేడా లేదు… అనిరుద్‌ తీరే అంత.. డైరక్టర్లను తెగ తిప్పించేసుకుంటారు అంటూ గతంలో నెల్సన్‌ విడుదల చేసిన ప్రాంక్‌ వీడియో వైరల్‌ చేస్తున్నారు అభిమానులు.

మ్యూజిక్‌ డైరక్టర్‌ లాస్ట్ మినిట్‌లో సాంగ్స్ ఇవ్వడం వల్ల షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడమే కాదు, క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ కూడా దెబ్బతింటుందని, ప్రతి డిపార్ట్ మెంటూ… డెడ్‌లైన్‌ మీట్‌ కావాలనే అర్జంటులో చుట్టేసే కార్యక్రమం మొదలుపెట్టేస్తారని, దానిని వల్ల క్వాలిటీ మిస్‌ అవుతుందన్నది అందరిలోనూ టెన్షన్‌ పెంచుతున్న విషయం. ఇదే టెన్షన్‌ కంటిన్యూ అయితే అనిరుద్‌ని తెలుగు జనాలు… వా.. నువ్వు కావాలయ్యా అని మాత్రం అనుకోరు.

ఓరి బాబోయ్.. ఇదెక్కడి షాట్ భయ్యా.. కొడితే స్టేడియం పైకప్పు పగిలిపోయిందిగా.. వైరల్ వీడియో

Shamar Joseph SIX ప్రస్తుతం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇరుజట్లు ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. దీంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే, మూడో రోజు ముగిసే సరికి ఇంగ్ండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అయితే, వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 11వ ర్యాంక్‌లో బ్యాటింగ్‌ చేసిన షమర్‌ జోసెఫ్‌ విండీస్‌ ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి బ్యాటర్‌గా వచ్చిన జోసెఫ్ 33 పరుగులు చేశాడు. జోసెఫ్ తన ఇన్నింగ్స్‌లో 2 భారీ సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ రెండు సిక్సర్లలో ఒకటి సిక్సర్ స్టేడియం పైకప్పు పలకలను ధ్వంసం చేసింది. ఇప్పుడు దాని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

విరిగిపోయిన టైల్స్..

విండీస్‌ ఇన్నింగ్స్‌ 107వ ఓవర్‌లో ఈ సీన్ కనిపించింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ గుస్ అట్కిన్సన్ వేసిన ఈ ఓవర్ రెండో బంతికి షమర్ జోసెఫ్ అద్భుతమైన సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి పరుగు రాలేదు. కానీ, జోసెఫ్ నాలుగో బంతికి మరో సిక్స్ కొట్టగలిగాడు. బంతి డీప్ బ్యాక్‌వర్డ్ దిశలో బౌన్స్ అయి స్టేడియం పైకప్పుపై పడింది. బంతి పైకప్పుకు తగలడంతో పైకప్పుపై ఉన్న పలకలు శిథిలమయ్యాయి. పల్వరైజ్డ్ టైల్స్ ముక్కలు కింద కూర్చున్న ప్రేక్షకులపై పడ్డాయి. అయితే, లక్ బాగుండడంతో ఎవ్వరికీ ఏం కాలేదు.

అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జోసెఫ్..

షమర్ జోసెఫ్ తొలి ఇన్నింగ్స్‌లో భీకరంగా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 122.22 స్ట్రైక్ రేట్‌తో 33 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో జాషువా డిసిల్వా కూడా అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 122 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. జాషువా, షమర్‌లు 10వ వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యం సాధించింది.

రికార్డుల వర్షం..

జాషువా సిల్వా, షమర్ జోసెఫ్ మధ్య 71 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు వెస్టిండీస్ రెండవ అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2012లో ఎడ్జ్‌బాస్టన్‌లో దినేష్ రామ్‌దిన్, టినో బెస్ట్ 143 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్ మూవీలో నటించిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగులో నటించింది తక్కువ లే అయినా.. అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ తోనే తెలుగులో ఆమెకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత చిత్రాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తనే అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 1980లో హీరో, మేరీ జంగ్, దామిని వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా అపద్బాంధవుడు లో నటించింది. ఈ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మీనాక్షి శేషాద్రి.

అపద్భాంధవుడు కుగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అంతకు ముందు తెలుగులో జీవన పోరాటం లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించింది. తెలుగులో కొన్ని లు చేసిన మీనాక్షి శేషాద్రి.. ఆ తర్వాత హిందీలో పలు లు చేసింది. అందం, అభినయంతో మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో లకు గుడ్ బై చెప్పేసింది.

1995లో మీనాక్షి శేషాద్రి..మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం ఉన్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. కథానాయికగా వెండితెరపై అలరించిన మీనాక్షి శేషాద్రి.. ఇప్పుడు అమెరికాలో ఓ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి భారతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించింది. ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా తన ఇంట్లో చేసిన బొమ్మల కొలువు సందర్భంగా స్వయంగా పాట పాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మీనాక్షి శేషాద్రి టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన బజాజ్ కంపెనీ.. ఇకపై ఆన్‌లైన్‌లో కూడా బైక్స్ ఆర్డర్ షురూ

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ-కామర్స్ సైట్స్ ద్వారా అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్‌ను నిర్వహించడంతో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన బజాజ్ ఆటో భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి పనిచేసినట్లు ప్రకటించింది. ఫలితంగా బజాజ్ మోటార్‌సైకిళ్ల మొత్తం శ్రేణి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రారంభ దశలో ఈ సదుపాయం భారతదేశంలోని 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే కంపెనీ క్రమంగా దాని పరిధిని విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బజాజ్ బైక్ ఆన్‌లైన్ డెలివరీ గురించి వివరాలను తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇకపై వినియోగదారులు ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ ధరకే బజాజ్ బైక్స్‌ను అందిస్తామని ప్రకటించింది. అయితే ఆన్‌లైన్ విక్రయాలను పెంచేందుకు బజాజ్ ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.5,000 తక్షణ తగ్గింపుతో పాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంకు కార్డుల ఆఫర్లను అందిస్తుంది.

బజాజ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో భారతదేశంలో వివిధ రకాల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీతో నడిచే మోటార్‌సైకిల్ ఫ్రీడమ్‌ను ఇటీవల బజాజ్ విడుదల చేసింది. బజాజ్ లైనప్‌లోని ఇతర బైక్‌లలో ప్లాటినా 100 నుంచి డొమినార్ 400, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ వంటి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు వంటి సరసమైన ధరలక ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే బజాజ్ కంపెనీకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫ్లిప్ కార్ట్‌లో విక్రయించనుంది. ప్రస్తుతం ఈ-చేతక్ ధరలు రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతున్నాయి.

మార్కెట్‌లో ఆ ఫోన్స్‌కు అత్యధిక డిమాండ్.. తక్కువ ధరకే మెంటలెక్కే ఫీచర్లు

భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ-4 ప్రారంభించినా వినియోగదారులు నార్డ్ సీఈ-3, నార్డ్ సీఈ-3 లైట్‌ను ఇంకా ఇష్టపడుతున్నారు. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌తో వచ్చే ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్ానరు.

సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. 6.7 అంగుళాల ఎమోఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ.16,849గా ఉంది.

భారతీయ మొబైల్ తయారీ సంస్థకు సంబంధించిన లావా అగ్ని 2 5జీ తక్కువ ధరలో గ్లాస్ బ్యాక్, కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 ఎంపీఐ డెప్త్, మాక్రో సెన్సార్‌తో సహా క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. కెమెరా సిస్టమ్ వివిధ లైటింగ్ పరిస్థితుల్లో సమర్థంగా పని చేస్తుంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ ధర రూ.16999గా ఉంది.

రియల్‌మీ 12 5జీ కెమెరాల లవర్స్‌ను ఆకర్షిస్తుంది. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా 3 ఎక్స్ లాస్‌లెస్ జూమ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌తో తీసినపోర్ట్రెయిట్ షాట్స్‌ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అధునాతన మల్టీ-ఫేస్ రికగ్నిషన్, ఫేషియల్ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్‌తో వచ్చే ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.15,228గా ఉంది.

ఇటీవల విడుదలైన ఐక్యూ జెడ్ 9 లుక్స్ పరంగా యువతను అమితంగా ఆకర్షిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ 2.8 జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌తో మల్టీ టాస్కింగ్ విధులు సమర్థంగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ గేమర్లు అధికంగా ఇష్టపడుతున్నారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.19,998గా ఉంది.

ఎక్కువ ఖర్చు లేకుండా మల్టీ టాస్క్ చేయాలనుకునే యువతను రియల్ మీ నార్జో 70 ప్రో 5 జీ ఫోన్ అధికంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేక వీసీ కూలింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ఫోన్‌ గేమర్లు బాగా ఇష్టపడుతున్నారు. 6.67 అంగుళాల డిస్‌ప్లేతో 8 జీబీ + 128 జీబీ వేరియంట్, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.17,998గా ఉంది.

బంగారంపై సులభంగా రుణాలు.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులివే..

భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగలు, శుభకార్యాలు తదితర సమయాలలో బంగారు ఆభరణాలను ధరించడం ఆనవాయితీ. ముఖ్యంగా మహిళలు బంగారంపై ఎంతో ఇష్టం పెంచుకుంటారు.

వారు చేసిన పొదుపులో చాలా మొత్తం దీనిపైనే వెచ్చిస్తారు. అలాగే బంగారు ఆభరణాలు మనల్ని అత్యవసర సమయంలో ఆదుకుంటాయి. వాటిపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అతి తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలను అందజేస్తున్న బ్యాంకులు వివరాలు తెలుసుకుందాం.

బంగారంపై రుణాలు..

మిగిలిన రుణాలతో పోల్చితే బంగారం రుణాలు చాలా త్వరగా మంజూరవుతాయి. మన అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. బంగారం విలువలో దాదాపు 75 శాతం వరకూ రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.75 వేలకు చేరింది. ధర పెరగడంతో బంగారం రుణాల పరిమాణం పెరిగింది. ఎక్కువ బంగారం కలిగి ఉన్న వినియోగదారులు తమ ఆభరణాలను మానిటైజ్ చేస్తారని తెలిసింది. ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ బంగారాన్ని తాకట్టు పెట్టాలనుకునే వారికి గోల్డ్ లోన్లు చాలా ఉపయోగంగా ఉంటాయి.

బంగారు రుణాలపై వడ్డీరేట్లు..

బంగారు రుణాలపై వడ్డీరేటు ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం కాల వ్యవధిపై రూ.5 లక్షల రుణాన్ని 8.8 శాతం నుంచి 9.15 శాతం మధ్య వడ్డీతో మంజూరు చేస్తున్నాయి.

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.8 శాతం వడ్డీ విధిస్తుంది. అన్ని బ్యాంకులకన్నా అతి తక్కువ రేటు ఇదే. రుణానికి సంబంధించిన ఈఎమ్ఐ (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా) రూ. 43,360గా ఉంటుంది.
  • ఇండియన్ బ్యాంక్ కూడా ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై 8.95 శాతం వడ్డీ విధిస్తుంది. నెలవారీ వాయిదా రూ. 43,390 చెల్లించాలి.
  • కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. ఇవి కూడా ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షలకు 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ బ్యాంకులలో నెల వాయిదా రూ. 43,400గా ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రతినెలా రూ.43,430 ఈఎంఐ చెల్లించాలి.
  • యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లలో ఏడాది కాల పరిమితితో రూ.5 లక్షల రుణానికి 9.25 శాతం వడ్డీ విధిస్తారు. రుణం తీసుకున్నవారు ప్రతినెలా ఈఎమ్ ఐ గా రూ.43,450 కట్టాలి.
  • ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ప్రతి నెలా రూ.43,615 ఈఎమ్ఐ చెల్లించాలి.
  • యాక్సిస్ బ్యాంక్ ఏడాది కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 17 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఈఎమ్ఐ రూ.44,965 గా ఉంటుంది.

ఆ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అస్సలు వాడకూడదు.. ఇది తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..

మార్కెట్లో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అందరూ ఏదో ఒక కంపెనీ కార్డును కలిగి ఉంటున్నారు. వాటి ద్వారా వచ్చే రివార్డులు, క్యాష్ బ్యాక్స్ ల వంటి ఇతర ప్రయోజనాలతో ఎక్కువశాతం మంది వాటిని వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఎక్కువగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు, పెట్రోల్ బంకులలో క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడుతున్నారు. అయితే అన్ని ప్రదేశాల్లో క్రెడిట్ కార్డు వాడటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులు తమ క్రెడిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచుకుంటూనే దానిని వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా అసురక్షిత వెబ్‌సైట్‌లలో, అవిశ్వసనీయ వ్యాపారుల వద్ద మీ క్రెడిట్ కార్డును వాడటం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని, మోసాలకు ఆస్కారం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయే సందర్భాల్లో క్రెడిట్ కార్డు వాడకూడదు? ఎక్కడ క్రెడిట్ కార్డు వాడితే ఇబ్బందులు ఎదురవుతాయి? ప్రత్యామ్నాయంగా ఏది ఉపయోగించాలి? తెలుసుకుందాం రండి..

అసురక్షిత వెబ్ సైట్లు.. ఎస్ఎస్ఎల్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ బ్రౌజర్ లేదా వెబ్‌సైట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ ఫర్ సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉందని నిర్ధారిస్తుంది. ఈ ఎన్‌క్రిప్షన్ లేకుండా, మీరు నమోదు చేసే ఏదైనా డేటాను హ్యాకర్‌లు దొంగలించగలరు. దీని కారణంగా, అసురక్షిత వెబ్‌సైట్‌లో మీ ప్రాథమిక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. హ్యాకర్లు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దొంగిలించి, అనధికారిక కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు లేదా డార్క్ వెబ్‌లో విక్రయించవచ్చు. అందుకే మీరు లావాదేవీలు జరిపే వెబ్‌సైట్‌లు యూఆర్ఎల్ ప్రారంభంలో ప్యాడ్‌లాక్ లేదా ట్యూన్ ఐకాన్ (క్రోమ్ లో)తో “https://” ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు అసురక్షిత వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న డీల్‌ను పొందవలసి వస్తే, డిస్పోజబుల్ క్రెడిట్ కార్డ్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి ప్రయత్నించండి.

పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. విమానాశ్రయాలు లేదా హోటళ్లలో ఉన్న పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు చాలా ప్రమాదకరమైనవి. ఇవి సైబర్ నేరస్థులకు ప్రధాన లక్ష్యాలుగా మారతాయి. ఈ నెట్‌వర్క్‌ల ద్వారా హ్యాకర్‌లు సులభంగా డేటాను దొంగిలిస్తారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, పబ్లిక్ నెట్‌వర్క్‌లలో మీ ప్రాథమిక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకుండా ఉండండి. మొబైల్ డేటా ఎప్పుడూ సురక్షితం.

షేర్డ్ కంప్యూటర్ కూడా వద్దు.. అదే విధంగా పబ్లిక్ వైఫైతో పాటు పబ్లిక్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కేఫ్‌లు, పాఠశాలల్లోని షేర్డ్ కంప్యూటర్‌లు తగిన భద్రతను కలిగి ఉండవు. ఎవరైనా ఈ పరికరాలను ఉపయోగించవచ్చు. వాటిల్లో ఏదైనా సమాచారం దొంగిలించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకే అక్కడ కూడా క్రెడిట్ కార్డులను వాడకపోవడం మేలు.

షాపింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. అవిశ్వసనీయ వ్యాపారులు లేదా దుకాణాలు, లేదా అన్ అథరైజ్డ్ షాపింగ్ యాప్స్ లో షాపింగ్ చేయడం వలన నకిలీ ఉత్పత్తిని అందుకోకపోవడం లేదా తక్కువ-నాణ్యత గల వస్తువులను స్వీకరించడం వంటి ప్రమాదాలు ఎల్లప్పుడూ ఎదురవుతాయి. అంతేకాక ఆయా దుకాణాలలో మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వలన వారు మీ సమాచారాన్ని నేరుగా యాక్సెస్ చేయగలరు, వారు థర్డ్ పార్టీలకు మీ సమాచారాన్ని విక్రయించే అవకాశం ఉంది. అలాంటి చోట్ల క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తే వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి. అదే స మయంలో ఆ యాప్, యజమాని గురించి రివ్యూలు చూడండి.

ట్రయల్ సబ్‌స్క్రిప్షన్స్.. చాలా కంపెనీలు పరిమిత సమయం వరకు ఉచిత యాక్సెస్ వాగ్దానంతో ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి. అయితే ట్రయల్‌ని యాక్టివేట్ చేయడానికి తరచుగా క్రెడిట్ కార్డ్ అవసరం. ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత, మీ కార్డ్ పూర్తి సభ్యత్వం కోసం స్వయంచాలకంగా చార్జ్ చేయబడుతుంది. మీరు గడువు కంటే ముందు ట్రయల్‌ని రద్దు చేయడం మర్చిపోతే, అది స్వయంచాలకంగా చెల్లింపు సభ్యత్వంగా మార్చబడుతుంది. అంతేకాక కొన్ని కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ట్రయల్‌ని రద్దు చేయడాన్ని కష్టతరం చేస్తాయి. అది ఊహించని ఖర్చులకు దారి తీస్తుంది. ఆ సమస్యలను నివారించడానికి, ట్రయల్‌ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించడం మేలు.

మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై టికెట్‌ పొందడం మరింత సులువు..

హైదరాబాదీల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ అందుబాటులోకి వచ్చింది మెట్రో. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభించడంతో హైదరాబాదీలు మెట్రోవైపు మొగ్గు చూపుతూ వచ్చారు.

ఇక కాలక్రమేణా మెట్రో టికెట్‌ బుకింగ్స్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జరగుతూ వస్తున్నాయి. ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసే నేపథ్యంలో సేవలను తీసుకొస్తున్నారు.

ఇప్పటికే మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌తో పాటు పలు బుకింగ్స్‌ యాప్స్ ద్వారా మెట్రో టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ బైక్‌ షేరింగ్ యాప్‌ ర్యాపిడో ద్వారా కూడా మెట్రో రైల్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే ర్యాపిడో ద్వారా మెట్రో రైల్‌ టికెట్‌ను బుక్‌ చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు మెట్రో యాజమాన్యం ఇప్పటికే ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది.

ఈ సేవలతో ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో మెట్రో టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎల్‌ & టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. ఈ విషయమై కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని పెంపొందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌ & టీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ చిప్లుంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాపిడో ద్వారా 15శాతం మెట్రో టికెట్లు బుక్‌ అవుతాయని అంచనా వేస్తున్నారు. ర్యాపిడో యాప్‌లోకి వెళ్లిన తర్వాత మెట్రో ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంచుకొని పేమెంట్ చేస్తే ఈ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టికెట్‌ను స్కాన్‌ చేస్తే మెట్రోలోకి ఎంటర్‌ అవ్వొచ్చు.

ఎర్రబంగారంలా మారిన టమాటా..? కిలో ధర అంత పలుకుతుందా..!

ర్నూలు జిల్లాలో టమోటా రేట్లు భారీగా పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులలో కిలో టమోటా 30 రూపాయలు నుండి 80 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు టమోటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 రూపాయలు ఉన్న కిలో టమోటా రెండు రోజులలో 80 రూపాయలకు పెరిగింది.

మరో రెండు, మూడు రోజుల్లో 100 రూపాయలకి చేరే అవకాశం ఉందంటున్నారు మర్కెట్ యాజమాన్యం. గత సంవత్సరం ఇదే ఖరీఫ్ సీజన్లో కిలో టమోటా 200 రూపాయలు పెరిగి రికార్డు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు.

గతంలో టమోటా పంటకు మంచి రేట్లు ఉన్నాయని రైతులు ఎక్కువ టమోటా పంటను సాగుచేశారు. ఖరీఫ్ సీజన్లో కిలో టమోటా 200 రూపాయల నుండి రెండు రూపాయలు పడిపోయి భారీ స్థాయిలో నష్టపోయారు రైతులు.

అయితే ఈ టమోటా పంటను తక్కువ స్థాయిలో సాగు చేయడం.. వేసిన పంట వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతాయని అంటున్నారు. మరో వారం రోజులు వర్షాలు కురిస్తే టమోటా పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు రైతులు. తద్వారా రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

డైలీ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు స్ట్రాంగ్..

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఉదయం లేదా సాయంత్రం రోజులో ఏదో ఒక పూట వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు.

వంద రకాల రోగాలను కూడా వాకింగ్ చేసి నయం చేసుకోవచ్చు. చాలా మంది అధిక బరువు, ఊబకాయం తగ్గించుకోవడానికి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకెంత మంది ఫిట్ నెస్ కోసం కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా కండరాలు, ఎముకలు కూడా బలంగా తయారవుతాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ కనీసం ఓ గంట పాటు అయినా వాకింగ్ చేయాలని చెబుతూ ఉంటారు. మరి వాకింగ్ చేయడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి. భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు వాకింగ్ చేయడం వల్ల ఎముకలు బలహీన పడి త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో కూడా వాకింగ్ చేయించడం మొదలు పెట్టండి.

కండరాలు ఆరోగ్యంగా:

ఇప్పుడున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కండరాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కండరాలు నొప్పుల వలన ఎలాంటి పనులు చేయలేం. కండరాల నొప్పులను పట్టించుకోక పోతే అవే దీర్ఘకాలిక సమస్యల్ని తెచ్చి పెడతాయి. కాబట్టి ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

వెయిట్ లాస్:

వాకింగ్ చేయడం వల్ల ముఖ్య ప్రయోజనం ఏంటంటే.. వెయిట్ లాస్. డైలీ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బరువుగా ఉండటం వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌గా కూడా ఉంటారు. అంతే కాకుండా ఊబకాయం కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది.

షుగర్ లెవల్స్ కంట్రోల్:

వాకింగ్ డైలీ చేయడం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.. డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. మీరు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ.. చక్కగా డైట్ మెయిన్‌టైన్ చేస్తే.. కొద్ది రోజుల్లోనే మీలో మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

డైలీ నడక వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏంటంటే.. రక్త పోటు అనేది నార్మల్‌గా ఉంటుంది. అంతేకాకుండ చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. కాబట్టి గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

16 వేలది 4800కే.. ఈ సేల్ లో సౌండ్ బార్స్ పై క్రేజీ డీల్స్..!

వీలకు వచ్చే సౌండ్ అంత మంచి ఫీల్ ని ఇవ్వదు. ఒక మంచి మూవీ చూడాలి అంటే దానికి తగినట్లుగా మంచి సౌండ్ బార్స్ ఉండాల్సిందే. అయితే సౌండ్ బార్స్ ధర అంత తక్కువేం కాదండోయ్. ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి అంటే మీరు కచ్చితంగా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు స్పెషల్ సేల్ నడిపిస్తున్న విషయం తెలిసందే. అయితే ఇప్పుడు ఈ సేల్ లో మీకు రూ.15 వేల సౌండ్ బార్ కేవలం రూ.7 వేలకే వస్తోంది. అలాగే ఇంకా చాలానే ఆఫర్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్స్ ని గనుక మీరు కొనుగోలు చేస్తే.. మీ ఇల్లు కచ్చితంగా మినీ థియేటర్ అయిపోతుంది. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బోట్ అవంటే బార్ 610:

బోట్ కంపెనీ నుంచి బడ్జెట్ సౌండ్ బార్ ఇది. కాకపోతే ఇది కేవలం 25 వాట్స్ కెపాసిటీతో మాత్రమే వస్తోంది. ఇది 2.0 ఛానల్ తో వస్తోంది. ఇందులో డ్యూయల్ పాసివ్ రేడియేటర్స్ ఉన్నాయి. 7 గంటల వరకు ప్లే బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.5,990 కాగా 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,798కే అందిస్తున్నారు.

బోట్ మిస్టిక్ సౌండ్ బార్:

బోట్ నుంచి టీవీ కోసం మరో బడ్జెట్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది 100 వాట్స్ అవుట్ పుట్ కెపాసిటీతో వస్తోంది. 2.1 ఛానల్ సౌండ్ బార్ వైర్డ్ సబ్ వూఫర్ తో వస్తోంది. ఇందులో బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్, ట్రెబిల్ కంట్రోల్ వంటి మోడ్స్ ఉన్నాయి. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. రూ.15,990 సౌండ్ బార్ మీకు కేవలం రూ.4,798కే వస్తోంది.

జేబీఎల్ సినిమా ఎస్బీ241:

సౌండ్ బార్స్, స్పీకర్స్ అంటే జేబీఎల్ కంపెనీ పెట్టింది పేరు. అయితే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కాస్త కాస్ట్లీ అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ జేబీఎల్ సినిమా ఎస్బీ241 సౌండ్ బార్స్ పై క్రేజీ డీల్ నడుస్తోంది. ఇది డాల్బీ డిజిటల్ సౌండ్ బార్. దీనికి డీబ్ బేస్ కోసం వైర్డ్ సబ్ వూఫర్ వస్తుంది. 2.1 ఛానల్ హోం థియేటర్. దీనికి రిమోట్ కూడా ఉంటుంది. బ్లూటూత్, ఆప్టికల్ కనెక్టివిటీ, హెచ్డీఎంఐ ఏఆర్సీ ఉన్నాయి. ఇది 110 వాట్స్ కెపాసిటీతో వస్తోంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని డిజిటల్ సౌండ్ తో థియేటర్ గా మార్చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.14,999 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,998కే అందిస్తున్నారు.

సోనీ హెచ్ టీ- ఎస్20ఆర్:

సోనీ కంపెనీ నుంచి ఒక క్రేజీ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. ఇది పెడితే థియేటర్ ఫీల్ కాదు.. ఇల్లు థియేటర్ అయిపోతుంది. కాస్త కాస్ట్ అయినా పర్వాలేదు. నాకు మంచి థియేటర్ ఫీల్ రావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సోనీ హెచ్ టీ- ఎస్20ఆర్ రియల్ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఇది. ఇది సబ్ వూఫర్ మాత్రమే కాకుండా.. కాంపాక్ట్ రేర్ స్పీకర్స్ తో వస్తున్నాయి. 400 వాట్స్ పవర్ అవుటుపుట్ కెపాసిటీతో వస్తున్నాయి. ఇందులో యూఎస్బీ, బ్లూటూత్, హెచ్డీఎంఐ, ఆప్టికల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ డిజైన్ కూడా చాలా స్లీక్ మోడల్ లో ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ ధర రూ.23,990 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.14,989కే అందిస్తున్నారు.

 

మూవీ లవర్స్ కి షాక్.. సినిమా టికెట్లు, OTT సబ్ స్క్రిప్షన్ ధరల పెంపు!

ప్రస్తుతం జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సినిమాలు ప్రధానమైనవి. థియేటర్, ఓటీటీ వంటి వాటి వేదికగా సినీ లవర్స్ ఎంటర్ టైన్ అవుతుంటారు. వారం వారం కొత్త కొత్త సినిమాలను చూస్తేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..సినిమా రేట్ల వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు తరచూ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని సినీ ప్రియులకు శుభవార్తలుగా ఉంటే మరికొన్ని మాత్రం షాకిచ్చేవిలా ఉంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం  తీసుకోనున్నా ఓ నిర్ణయం సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమా టికెట్ల ధరలు, ఓటీటీ సబ్ స్క్రీప్షన్ ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మూవీ లవర్స్ కు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైంది. సినీ,సాంస్కృతి కళకారులను ఆదుకునేందుకు సినిమా టికెట్ల, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచేందుకు సిద్దపడింది. ఈమేరకు వీటిపై కొత్త పన్ను విధించాలనే కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. ఈ రెండిటిపై 1 నుంచి 2 శాతం వరకు సెస్ విధించాలనే ఆలోచనల కర్ణాటక ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలే సినీ, సాంస్కృతిక కార్మికుల బిల్లును శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

కొత్తగా పెంచిన పన్నుల ద్వారా వచ్చే అదనపు నిధులను సినీ, సాంస్కృతిక కళాకారులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్టు ఆ బిల్లులో పేర్కొన్నారు. కళాకారుల పిల్లకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. సినిమా టికెట్లు, సబ్​స్క్రిప్షన్​ ఫీజులు, ఇతర రెవెన్యూలపై సెస్​ని విధిస్తామని, దీనిని సినీ- సాంస్కృృతిక కార్యకర్తల సంక్షేమ సెస్​గా పిలుస్తామని, అలానే సెస్ 2శాతానికి మించదని, అదేవిధంగా ఒక శాతం కన్నా తక్కువ ఉండదని బిల్లు స్పష్టం చేసింది.

ఈ బిల్లు చట్టంగా మారితో అమల్లోకి వస్తే..సినీ ప్రియులపై భారం పడనుంది. ఇప్పటికే మూవీ బట్టి టికెట్​ రేట్లు మారిపోతున్నాయి. ఇప్పటికే బెంగళూరు వంటి నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్ణయం కన్నడ సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావంత చూపనుందో, థియేటర్, వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు ఎంత వరకూ ఆమోదిస్తారో చూడాలి. ఇప్పటికే ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రతిపాదనను కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులకే  సినిమా టికెట్లు, ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ చోటు చేసుకోవడం గమనార్హం.

Jio నుంచి కొత్త యాప్‌.. ఏడాది పాటు ఉచితంగా సేవలు.. ఏంటంటే..

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో.. ఇప్పటికీ తన ప్రభంజనం కొనసాగిస్తూ వస్తోంది. అప్పటికే ఈ రంగంలో దిగ్గజాలుగా ఉన్న మిగతా టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చింది. ఉచితంగా సిమ్ములతో పాటుగా డేటా ఇవ్వడంతో కస్టమర్లు.. అటు వైపు మారారు. ఇన్నాళ్లు టెలికాం రంగంలో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ వస్తోన్న జియో.. తన తాజా నిర్ణయంతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అందుకు కారణం ఇన్నాళ్ల పాటు ఎంతో చౌకగా డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యాలు అందించిన జియో.. జూలై నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మిగతా టెలికాం కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తూ.. ప్లాన్స్‌ రేట్లను పెంచాయి. దాంతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా జియో సరికొత్త యాప్‌ను లాంఛ్‌ చేసింది. ఏడాది పాటు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

ప్రస్తుతం

 వీడియో కాల్స్‌, మెసేజ్‌లు, ఫొటోలు పంపించడానికి వాట్సాప్‌ను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా జియో వాట్సాప్ లాంటి కొత్త చాట్ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు జియోసేఫ్.  వీడియో కాల్ చేయడానికి ఈ యాప్ మరింత సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని అని జియో వెల్లడించింది. మొదటి ఏడాది పాటు.. ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది. ఆ తర్వాత ఇది 199 రూపాయల నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఉన్న మైనస్‌ పాయింట్‌ ఏంటి అంటే.. జియోసేఫ్ అప్లికేషన్‌ను 5జీ నెట్‌వర్క్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. అంటే 4జీ నెట్‌వర్క్‌లలో లేదా జియో సిమ్‌ లేని వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించలేరు. అంతేకాక ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జియోసేఫ్‌ యాప్ మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైన యాప్. దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరని వారు చెప్పుకొచ్చారు. ఫీచర్లను బట్టి చూస్తూ.. జియోసేఫ్‌ ఇది మెటా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తుందనే చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక సంవత్సరం ఉచితంగా ఉపయోగించుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు నెలవారీ సబ్‌స్క్రీప్షన్‌ కోసం 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

జియోసేఫ్ సేఫ్టీ అనేది జియో 5జీ క్వాంటం సెక్యూర్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 256 బిట్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారుల వివరాలను గోప్యంగా ఉంచడానికి సబ్‌స్క్రైబర్ కన్సీల్డ్ ఐడెంటిటీ (ఎస్‌సీఐ) సాంకేతికతను ఉపయోగిస్తుంది. మరి జియోసేఫ్‌ను కస్టమర్లు ఏమేర ఆదరిస్తారో చూడాలి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

 

మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన

నేటి కాలంలో మద్యం సేవించని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మద్యన్ని సేవించడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా బర్త్ డే పార్టీ లు, వెడ్డింగ్ సెలబ్రేషన్స్, చివరికి చావు కార్యక్రమాల దగ్గర కూడా చుక్క లేనిదే బందువులు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఒక రకంగా చెప్పలంటే ఏ కార్యక్రమాల్లో అయిన మందు తీర్ధం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక అది లేకపోతే ఏదో వెలుతుగా ఉన్నట్లు ఫీలు అవుతారు.

ఈ క్రమంలోనే మద్యం ప్రియులకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వైన్ షాపు వద్ద పరుగులు పెడుతుంటారు. అలాంటి ఈ మధ్య కాలంలో మద్యం ప్రియులకు వరుసగా బాడ్ న్యూస్ లతో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని మందు బాబులకు అయితే మద్యం విషయంలో ఏదైనా వార్త వినిపిస్తే చాలు గుండె భారంగా మారిపోతుంది. మరి, అలాంటి మద్యం ప్రియుల కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్ ఇచ్చే శుభవార్త అందింది. ఇంతకి అదేమిటంటే..

రాష్ట్రంలో ఈ మధ్య మందుబాబులకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు ఫుల్ కిక్ నిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో టిన్ బీర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఉత్పాదన యూనిట్ పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో ఈ యూనిట్ పెడితే సుమారు 500 మంది కి ఉపాధి లభిస్తుందని కూడా మంత్రి తెలిపారు. ఈ మేరకు బాల్ ఇండియా కార్పోరేట్ వ్వవహారాల అధిపతి గణేశన్ ఆదివారం మంత్రితో సమావేశమయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయి. కానీ, ఇది 2 శాతం లోపలే ఉందని మంత్రి తెలిపారు. అలాగే  కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకుందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.  ఇకపోతే 500 మి.లీ పరిమాణంలో గల బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోనే అల్యూమినియం టిన్నులు తయారైతే ఇకపై టిన్ బీర్లు అన్ని వైన్ షాప్స్‌లో అందుబాటులోకి వస్తుందని మందుబాబులు భావిస్తున్నారు. కానీ, ఈ విషయం పై ప్రభుత్వం ఇంక అధికారిక ప్రకటన ఇచ్చినంత వరకు వేచి ఉండాలి. మరి, త్వరలోనే రాష్ట్రంలో టిన్ బిర్ లు అందుబాటులోకి తీసుకురావలని నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

ఇండస్ట్రీ షేకయ్యే న్యూస్.. చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా మూవీ?

ఇండస్ట్రీలో కొంత మంది తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటారు. ఆ లిస్ట్ లో ముందువరుసలో ఉంటాడు అర్జున్ రెడ్డి డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగా. చేసింది ముచ్చటగా మూడు సినిమాలే అందులో ఒకటి రీమేక్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ఇక తన నెక్ట్స్ మూవీ ప్రభాస్ తో చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ షేకయ్యే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో సందీప్ ఓ మూవీ చేయనున్నాడనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఏం చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ హ్యూజ్ ఫ్యాన్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే?

ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ పార్క్ ను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో చెప్పాడు. అయితే చిరుతో సందీప్ రెడ్డి మూవీ చేస్తే చూడాలని ఆరాటపడుతున్నారు మెగా ఫ్యాన్స్. కానీ దానికి కొంచెం టైమె పట్టేలా ఉంది. మరి హ్యూజ్ కాంబినేషన్ గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Health

సినిమా