Sunday, November 17, 2024

AP:ఏపీ ఫైబర్ నెట్ లో అరాచకం..950 కోట్లు ఏమయ్యాయి?

AP:ఏపీ ఫైబర్ నెట్ లో అరాచకం..950 కోట్లు ఏమయ్యాయి?

Andhrapradesh New Govt Seized Ap Fibernet Office For Corrpution Allegation
జగన్ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో ఉంది టీడీపీ. అప్పట్లో టీడీపీ పై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపడం తెలిసిందే. ఇప్పుడు జగన్ పాలనలో లూప్ హోల్స్ వెతుకుతోంది టీడీపీ. అప్పట్లో వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడు అధికార హోదాలో ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అక్రమాలు వెలికితీస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఫైబర్ నెట్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అతి తక్కువ ధరలకే..

మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలకే ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు ఇంట్లోనే వీక్షించే విధంగా సేవలందించేందుకు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) ప్రవేశపెడుతున్నామని ఎంతో ఆర్భాటంగా ఈ పథకాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ప్యాకేజీలతో సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం తీసుకొచ్చిన ఈ పథకం కింద వసూలు చేసిన నిధులన్నీ దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో తెలుగుదేశం ప్రభుత్వం అప్రమత్తమయింది. రూ.950 కోట్ల అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల వివరాలు సేకరించారు. వాళ్లందరినీ ఇళ్లకు పంపించేశారు. సిబ్బందితో సహా కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. పూర్తిగా పోలీసుల భద్రతతో , నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఉద్యోగులంతా రికమెండేషన్ అభ్యర్థులే

దాదాపు 1500 మంది దాకా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వాళ్లకు జీతాలు కూడా లక్షల్లో ఇచ్చారు. వీళ్లందరికీ రాజకీయ నేతల సపోర్టు కూడా ఉంది. వాళ్ల రికమెండేషన్ తో లక్షల శాలరీని పొందుతూ ఎంజాయ్ చేశారు ఉద్యోగులు. దాదాపు 10 లక్షల కనెక్షన్లు ఉండేవి మొదట్లో. క్రమంగా నాలుగు లక్షల యాభై వేలకు పడిపోయాయి కనెక్షన్లు. తక్కువ రేటుకే ఇంటర్నెట్, సినిమాలు, ఫోన్ సదుపాయం ఉండటంతో ఆకర్షితులయ్యారు కస్టమర్లు. అయితే ఆ తర్వాత వారు ఊదరగొట్టినట్లుగా సేవలను అందించలేకపోవడంతో అనూహ్యంగా కనెక్షన్లు తగ్గిపోవడం ప్రారంభం అయింది. ఇక ఫైబర్ నెట్ సంస్థకు సంబంధించి సెట్ టాప్ బాక్స్ లు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలోనూ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు చెబుతున్నారు.

సంస్థ ఎండీ పాత్ర

ప్రస్తుతం పోలీసు వలయంలో ఫైబర్ నెట్ సంస్థ ఉంది. సంస్థ ఎండీ పాత్ర ఏమిటి? ఆయన వెనక ఉన్న రాజకీయ నేతలు ఎవరు? ఇందులో వాళ్ల వాటా ఎంత? తదితర అంశాలపై త్వరలో విచారణ జరుపనున్నారు. ఆలస్యం అయితే కీలక సాక్ష్యాలు మాయం అవుతాయని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా ఫైబర్ నెట్ అక్రమాలపై దర్యాప్తు ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నారు.సంస్థ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. దర్యాప్తులో నిజమేనని తేలితే..దాని పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయని భావిస్తున్నారు. అల్పాదాయ వర్గాలపై ప్రేమ కురిపిస్తున్నామని చెబుతూ వారి నుంచి సంవత్సర చందాలను కట్టించుకుని ఆ డబ్బులతో జల్సాలు చేసిన జగన్ సర్కార్ కు ఇక చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.

ఎయిర్‌టెల్ విశ్వరూపం.. ఇక నుంచి నెలకు రూ.167 మాత్రమే.. 1 సంవత్సరం వాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్.. డేటా ఆఫర్!

ఎయిర్‌టెల్ విశ్వరూపం.. ఇక నుంచి నెలకు రూ.167 మాత్రమే.. 1 సంవత్సరం వాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్.. డేటా ఆఫర్!

సిమ్ యాక్టివ్ మరియు అపరిమిత వాయిస్ కాల్‌లను మాత్రమే కోరుకునే ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం, 365 రోజుల చెల్లుబాటుతో ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు కేవలం రూ.167తో ప్రారంభించబడింది.

అదేవిధంగా, వాయిస్ కాల్ ప్లాన్‌లు 28 రోజులు, 30 రోజులు, 77 రోజులు, 84 రోజుల చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయి. డేటా అస్సలు లేదని చెప్పలేము, డిమాండ్‌పై డేటా అలవెన్స్ కూడా ఇవ్వబడుతుంది. ఈ పథకాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ వివరాలు: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లతో కూడిన ప్రాథమిక ప్లాన్. ఈ ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీ ఇవ్వబడింది. ఈ చెల్లుబాటు రోజులలో అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ చేయవచ్చు.

మీరు రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. డేటా ఆఫర్‌ను పరిశీలిస్తే, 28 రోజుల పాటు 2GB మొత్తం డేటా అందుబాటులో ఉంటుంది. ఈ డేటా తర్వాత 1 MBకి 50 పైసా చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. అలాగే వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ ప్లాన్ రోజుకు రూ.7 ధరతో లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 219 ప్లాన్ వివరాలు: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. మీరు అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 300 SMS ఆఫర్ మరియు 3GB మొత్తం డేటా ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు టాక్‌టైమ్ మరియు వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ ఆఫర్ రూ.5కి అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ వివరాలు: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ రోజుల్లో ఇది అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 600 SMS ఆఫర్లతో వస్తుంది. 6GB మొత్తం డేటా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 509 ప్లాన్ వివరాలు: మీరు ఈ ప్లాన్ కోసం 84 రోజుల వాలిడిటీని పొందవచ్చు. ఈ రోజుల్లో ఇది మునుపటి ప్లాన్‌ల మాదిరిగానే అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్‌లతో వస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 100 SMSలు చేయవచ్చు.

ఇప్పటివరకు 6 GB లంప్-సమ్ డేటాను అందిస్తోంది. ఇది మూడు నెలల అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్‌తో కూడా వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 6 GB డేటా తర్వాత, మీకు 1 MBకి 50 పైసా ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్ నెలవారీ ధర రూ.170తో లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 1999 ప్లాన్ వివరాలు: ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌కు ప్రత్యేక ఆఫర్‌లు లేవు. డేటా కాకుండా, ఇతర ఆఫర్‌లు ఒక్కొక్కటిగా అందించబడతాయి. అంటే అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ వాయిస్ కాల్ ఆఫర్ 365 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.

కస్టమర్‌లు రోజుకు 100 SMSలు పంపగలరు. మొత్తం 24 GB లంప్-సమ్ డేటా ఆఫర్ అందుబాటులో ఉంది. మునుపటి ప్లాన్‌ల మాదిరిగా ప్రీ పోస్ట్ డేటా ఆఫర్ లేదు. అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ ఆఫర్ రాబోతోంది. నెలకు రూ.167 ఖర్చుతో లభిస్తుంది.

దోమలు ఎక్కువగా కుడుతున్నాయా? కారణాలు ఇవే.. ఈ టిప్స్ ఫాలో అయితే

దోమలు ఎక్కువగా కుడుతున్నాయా? కారణాలు ఇవే.. ఈ టిప్స్ ఫాలో అయితే

Are You a Mosquito Magnet : కొందరిని దోమలు విపరీతంగా కుడతాయి. ఈ సమస్య వర్షాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దోమలు పెరగడానికి వర్షాకాలం చాలా అనువైన సమయంగా చెప్తారు. నీరు ఎక్కువగా.. ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోవడం వల్ల దోమలవ్యాప్తి సులువుగా పెరుగుతుంది. దోమల పెరుగుదల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. అందుకే దోమలు కుట్టుకుండా జాగ్రత్తలు(Tips to avoid mosquito bites in Rainy Season) తీసుకోవాలి.

అయితే కొందరిని దోమలు ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. అయస్కాంతం పెట్టినట్లు దోమలన్నీ వారిని కరిచేస్తాయి. అయితే ఇలా దోమలు మీకు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నాయంటే దానికి కొన్నికారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏంటి? దోమలు కుట్టుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దోమలను ప్రభావితం చేసే అంశాలు
ఆడ దోమలు వ్యాధులను వ్యాప్తి చేస్తూ.. కుడుతూ ఉంటాయి. బ్లడ్ గ్రూప్, వేసుకునే దుస్తులు, శరీరం నుంచి వెలువడే శ్వాస, చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా.. ఇలా వివిధ కారణాల వల్ల దోమలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతాయంటున్నారు నిపుణులు. ఈ కారణాలతో దోమలు మనుషులపై ఎటాక్ చేసి.. సంతానోత్పత్తికి అవసరమైన ప్రోటీన్​ను మానవ రక్తంద్వారా సేకరిస్తాయి. అయితే ఈ దోమల బెడదను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

వారి తలపై దోమలు ఎక్కువగా తిరుగుతాయట
కొన్ని రకాల బ్లడ్​గ్రూప్స్​ను దోమలు ఇష్టపడతాయని పలు పరిశోధనలు తేల్చాయి. O గ్రూప్, AB గ్రూప్ అంటే దోమలకు ఎక్కువ ఇష్టముంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రక్తం రకంతో సంబంధం లేకుండా కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశముంది. అలాగే శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కూడా దోమలను ఆకర్షిస్తుందట. దీనివల్ల దోమలకు వారి తలపై ఎక్కువగా తిరుగుతూ కుడతాయట. ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి కూడా దోమకాటు ఎక్కువగా ఉంటుంది.

ఆడదోమలు వేడికి త్వరగా వస్తాయట. వర్షాకాలం, వింటర్​లో చలిగా ఉందని ఎక్కువ మంది రూమ్​ హీటర్లు, స్వెట్టర్లు వంటివి వేసుకుంటారు. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అయితే ఈ తరహా పనులు దోమలను కూడా ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయట. చెమట కూడా దోమలను ఆకర్షిస్తుంది. స్కిన్​పై బ్యాక్టీరియా ఉంటే చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. ఇది దోమలను ఎట్రాక్ట్ చేస్తుంది. బీర్, ఆల్కహాల్ తాగేవారిని కూడా దోమలు కుడతాయి.

దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీపి, మసాలా, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దోమలు ఎక్కువగా కుడతాయని ఓ పరిశోధన తేల్చింది. కాబట్టి వీలైనంత లైట్ ఫుడ్​ని తీసుకోవాలి. ఇవి దోమలను దూరం చేయడంతో పాటు ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ముదురు రంగు దుస్తులు కూడా దోమలను ఆకర్షిస్తాయని పరిశోధనలు తేల్చాయి. కాబట్టి లైట్ కలర్ డ్రెస్​లు వేసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు దుస్తులు నిండుగా ఉండేలా చూసుకోవాలి. డ్రెస్​లకు ఓడోమస్ వంటి క్రీమ్​లు రాసుకుంటే దోమలు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి.

దోమల వ్యాప్తి పెరగకూడదంటే ఇవి ఫాలో అవ్వాలి..
దోమల వ్యాప్తి పెరగకుండా మొక్కల దగ్గర నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పల వంటి వాటిలో కూడా దోమలు తమ సంతానం అభివృద్ధి చేస్తాయి. కాబట్టి.. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో చలిగా ఉంటుందని కొందరు స్నానం చేయరు. కానీ ఉదయం, సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్​గా ఉంటే దోమల బెడద తగ్గుతుంది. ఇంట్లోపలికి దోమలు రాకుండా నెట్స్, బెడ్ కర్టెన్స్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

ఈ ఎక్స్ ట్రా డీల్స్ అస్సలు మిస్ కావొద్దు!

ప్రస్తుతం ఇ-కామర్స్ వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ నుంచి ప్రైమ్ డే సేల్ క్లోజ్ అయ్యింది. జులై 20, 21న ఈ సేల్ నడిచింది. వినియోగదారులు అద్భుతమైన డీల్స్ ని సొంతం చేసుకున్నారు. ఇంకా ఫ్లిప్ కార్ట్ సేల్ మాత్రం నడుస్తూనే ఉంది. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ జులై 25 వరకు కొనసాగనుంది. అయితే ఇంకా ఈ సేల్ లో ఎలాంటి ప్రొడకట్స్ పై ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయి? ఈ సేల్ లో ఏ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి? అనే విషయాలపై యూజర్స్ కి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ క్రేజీ డీల్స్ అయితే లైవ్ లోనే ఉన్నాయి. వాటిలో మీకోసం కొన్ని ఎక్స్ ట్రా డీల్స్ తీసుకొచ్చాం. వీటిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అంటున్నారు టెక్ నిపుణులు. మరి.. ఆ డీల్స్ ఏంటో చూద్దాం.

బోట్ 10000mah పవర్ బ్యాక్:

ఎంత స్పీడ్ ఛార్జర్లు, స్పీడ్ వూక్ ఛార్జెస్ వచ్చినా కూడా.. ట్రావెలింగ్ లో మాత్రం పవర్ బ్యాంక్స్ అవసరం ఉంటూనే ఉంటుంది. పైగా ఇప్పుడు అన్నీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అయిన నేపథ్యంలో దాని అవసరం మరింత పెరిగింది. అలా మీరు ఒక మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తుంటే మాత్రం ఈ హోట్ 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ మంచి ఎంపిక అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ 22.5 వాట్స్ అవుట్ పుట్ కెపాసిటీతో వస్తోంది. అలాగే అదిరిపోయే కలర్స్, డిజైన్స్ తో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,999కాగా కేవలం రూ.949కే అందిస్తున్నారు.

ఒప్పో ఎన్కో బడ్స్ 2:

ఇప్పుడు ఇయర్ బడ్స్ అనేవి అందరికీ అవసరంగా మారిపోయింది. అలాంటి వారికి ఈ డీల్ బెస్ట్ ఛాయిస్. ఒప్పో ఎన్కో బడ్స్ 2 28 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. ఈ ట్రూ వైర్ లెస్ బడ్స్.. డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ తో వస్తున్నాయి. వీటి లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,999 కాగా కేవలం రూ.1,499కే అందిస్తున్నారు.

వైర్ లెస్ కీబోర్డ్- మౌస్ కాంబో:

ఇప్పుడు కేవలం పీసీలకు మాత్రమే కాకుండా.. ల్యాప్ ట్యాప్స్ కి కూడా కీబోర్డ్స్ వాడుతున్నారు. అందులోనూ వైర్ లెస్ కీబోర్డ్స్ అయితే ఇంకా బెటర్ గా ఉంటాయి. అయితే మీకోసం వైర్ లెస్ కీబోర్డు మాత్రమే కాదు.. వైర్ లెస్ మౌస్ కాంబో తీసుకొచ్చాంది. అది కూడా HP కంపెనీవి. వీటి ఎమ్మార్పీ రూ.1,999 కాగా కేవలం రూ.999కే అందిస్తున్నారు.

శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈ:

ఆండ్రాయిడ్ వాడే వాళ్లు.. యాపిల్ వాచ్ ను కొనుగోలు చేయలేరు. అలాంటి వారికోసం శాంసంగ్ నుంచి ఒక అదిరిపోయే వాచ్ అందుబాటులో ఉంది. అది కేవలం ఆండ్రాయిడ్ కే కంపాటిబుల్ గా ఉంటుంది. పైగా ఇది ఆండ్రాయిడ్ కి యాపిల్ వాచ్ లాంటింది. దీనిలో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.42,999 కాగా కేవలం రూ.9,499కే అందిస్తున్నారు.

శాంసంగ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ:

32 ఇంచెస్ లో ఒక మంచి స్మార్ట్ టీవీ తీసుకోవాలి అనుకునే వారికి శాంసంగ్ నుంచి ఒక స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టైజన్ టీవీ. బేజల్ ఫ్రీ డిజైన్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18,990 కాగా కేవలం రూ.13,990కే అందిస్తున్నారు.

టీసీఎల్ ఫాల్కన్ 43 ఇంచెస్ స్మార్ట్ గూగుల్ టీవీ:

43 ఇంచెస్ స్మార్ట్ గూగుల్ టీవీ ఒకటి ఆఫర్స్ లో అందుబాటులో ఉంది. ఇది డాల్బీ ఆటమ్స్ విషన్ తో వస్తోంది. మంచి డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇన్ బిల్ట్ యాప్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.59,990 కాగా కేవలం రూ.22,999కే అందిస్తున్నారు.

శాంసంగ్ 7 కేజీ వాషింగ్ మెషిన్:

శాంసంగ్ వాషింగ్ మెషిన్ పై క్రేజీ డీల్ ఉంది. 7 కిలోల కెపాసిటీతో ఉంది. ఈ డైమండ్ డ్రమ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్. దీని ఎమ్మార్పీ రూ.19,800 కాగా.. రూ.15,490కే అందిస్తున్నారు.

ఆ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. రోజుకు 14 గంటలు పని చేయాల్సిందే..!

ఉద్యోగుల పని గంటల పెంపు మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల పని వేళలపై కొన్ని ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు గతంలో అనేక సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పని గంటలు పెంచాలని అభిప్రాయపడ్డారు. వారిలో చైనా అలీబాబా కంపెనీ హెడ్‌ జాక్‌ మా మొదలు మన ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల పని గంటల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..

ఉద్యోగుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎక్కడంటే.. కర్ణాటకలో. ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోటా బిల్లుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని గంటలను పెంచేందుకు రెడీ అవుతోంది. వర్కింగ్‌ అవర్స్‌ని ఏకంగా 14 గంటలకు పెంచేలా బిల్లును సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఎంఎన్‌సీలు, ఇతర కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీలు.. పని గంటలను పెంచమని కోరుతూ.. ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు పంపడంతో.. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు రెడీ అవుతోందని సమాచారం.

ఐటీ ఉద్యోగుల పని సమయాన్ని 14 గంటలకు పెంచుతూ కర్ణాటక షాప్స్‌ అండ్ కమర్షియల్‌ ఎస్టాబ్లి‌ష్‌మెంట్‌ బిల్లు-2024 (సవరణ)ను తీసుకొచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. దీనిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవోలో ఉద్యోగుల పని గంటలను 12 నుంచి 14 గంటలకు పెంచాలని కర్ణాటక కార్మికశాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయా రంగాల్లో 10 గంటల వర్కింగ్‌ అవర్స్‌‌తో పాటు 2 గంటలు ఓవర్‌ టైం (ఓటీ).. మొత్తం 12 గంటలు పని సమయం అమల్లో ఉంది.

అయితే, దీనిని 12 గంటల వర్కింగ్‌ అవర్స్‌, 2 గంటల ఓవర్‌టైం ఉండేలా ప్రతిపాదించగా.. ఈ పని గంటలు వరుసగా 3 నెలల్లో 125 గంటలకు మించరాదని తాజాగా రూపొందించిన బిల్లులో పేర్కొన్నారు. అంతేకాక రెండు గంటల అదనపు సమయానికి వేతనం చెల్లించరు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మూడు షిఫ్టుల స్థానంలో రెండు షిఫ్టుల విధానం వస్తుందని పేర్కొంది. దీంతో ఐటీ రంగంలో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఉద్యోగుల శారీరక సమస్యలతో పాటుగా మానసికంగా కూడా ఇబ్బంది పడతారని.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వ్యతిరేకత నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పని వేళల పెంపు బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు మరోసారి చర్చిస్తామని మంత్రి లాడ్‌ తెలిపారు. ఇటీవల ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని, పలు దేశాల్లో ఇదే అమలు అవుతోందని కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మరి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. రోజుకు 14 గంటలు పని చేయాల్సిందే..!

ఉద్యోగుల పని గంటల పెంపు మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల పని వేళలపై కొన్ని ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు గతంలో అనేక సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పని గంటలు పెంచాలని అభిప్రాయపడ్డారు. వారిలో చైనా అలీబాబా కంపెనీ హెడ్‌ జాక్‌ మా మొదలు మన ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల పని గంటల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..

ఉద్యోగుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎక్కడంటే.. కర్ణాటకలో. ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోటా బిల్లుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని గంటలను పెంచేందుకు రెడీ అవుతోంది. వర్కింగ్‌ అవర్స్‌ని ఏకంగా 14 గంటలకు పెంచేలా బిల్లును సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఎంఎన్‌సీలు, ఇతర కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీలు.. పని గంటలను పెంచమని కోరుతూ.. ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు పంపడంతో.. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు రెడీ అవుతోందని సమాచారం.

ఐటీ ఉద్యోగుల పని సమయాన్ని 14 గంటలకు పెంచుతూ కర్ణాటక షాప్స్‌ అండ్ కమర్షియల్‌ ఎస్టాబ్లి‌ష్‌మెంట్‌ బిల్లు-2024 (సవరణ)ను తీసుకొచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. దీనిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవోలో ఉద్యోగుల పని గంటలను 12 నుంచి 14 గంటలకు పెంచాలని కర్ణాటక కార్మికశాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయా రంగాల్లో 10 గంటల వర్కింగ్‌ అవర్స్‌‌తో పాటు 2 గంటలు ఓవర్‌ టైం (ఓటీ).. మొత్తం 12 గంటలు పని సమయం అమల్లో ఉంది.

అయితే, దీనిని 12 గంటల వర్కింగ్‌ అవర్స్‌, 2 గంటల ఓవర్‌టైం ఉండేలా ప్రతిపాదించగా.. ఈ పని గంటలు వరుసగా 3 నెలల్లో 125 గంటలకు మించరాదని తాజాగా రూపొందించిన బిల్లులో పేర్కొన్నారు. అంతేకాక రెండు గంటల అదనపు సమయానికి వేతనం చెల్లించరు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మూడు షిఫ్టుల స్థానంలో రెండు షిఫ్టుల విధానం వస్తుందని పేర్కొంది. దీంతో ఐటీ రంగంలో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఉద్యోగుల శారీరక సమస్యలతో పాటుగా మానసికంగా కూడా ఇబ్బంది పడతారని.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వ్యతిరేకత నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పని వేళల పెంపు బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు మరోసారి చర్చిస్తామని మంత్రి లాడ్‌ తెలిపారు. ఇటీవల ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని, పలు దేశాల్లో ఇదే అమలు అవుతోందని కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మరి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

భారతీయుడు 2పై రజినీకాంత్ కామెంట్స్! మీరు ఊహించలేరు..

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘వేట్టయాన్’, ‘కూలి’ మూవీలు చేస్తున్నాడు. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్, లోకేశ్ కనగరాజ్ తో కూలి చిత్రాలు రానున్నాయి. ఈ రెండు చిత్రాల అప్డేట్స్ తో పాటుగా కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సూపర్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్, లోకేశ్ కనగరాజ్ తో కూలి సినిమాలను థియేటర్లలోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాల అప్డేట్, వేట్టయాన్ వాయిదా గురించి తాజాగా మాట్లాడాడు రజినీ. కేరళలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా.. విమానాశ్రయంలో మీడియాతో ముచ్చటించాడు. రజినీ మాట్లాడుతూ..

“వేట్టయాన్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక కూలి మూవీ స్పీడ్ గా షూటింగ్ చేసుకుంటోంది. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ చాలా బాగుంది. వేట్టయాన్ లో తన భాగం షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. కాగా.. గతంలో వేట్టయాన్ దసరాకు రానున్నట్లు రజినీ చెప్పాడు. అయితే కంగువా నిర్మాత వేట్టయాన్ వాయిదా పడుతుంది కాబట్టి.. కంగువాను దసరాకు విడుదల చేస్తున్నాం అని ప్రకటించాడు. దాంతో వేట్టయాన్ విడుదలపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఇండియన్ 2 మూవీ నిరాశపరచగా.. సూపర్ స్టార్ ఏంటి చాలా బాగుందని అంటున్నాడు? అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వర్షాకాలంలో బట్టలు ఆరడం లేదా? ఐతే ఇది ట్రై చేయండి.. నిమిషాల్లో ఆరిపోతాయి!

వర్షాకాలం వచ్చిందంటే బట్టలు అస్సలు ఆరవు. ఇక అపార్ట్మెంట్లలో నివసించే వారి పరిస్థితి అయితే మరీ ఘోరం. ఉన్న మేడ మీద ఆరబెడదామంటే బోరున వర్షం.. బాల్కనీలో ఆరబెడదామంటే అక్కడ ఎన్నో బట్టలు పట్టవు. కొంతమందికైతే అసలు బట్టలు ఆరబెట్టుకోవడానికి బాల్కనీలే ఉండవు. దీంతో చాలా మంది బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సరికొత్త క్లాత్స్ డ్రైయర్. దీంతో మీరు మీ దుస్తులను ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. మీరు టైంకి ఆఫీసులకు, పిల్లలు స్కూల్ కి వెళ్లిపోవచ్చు. క్షణాల్లో బట్టలు ఆరిపోతాయి.

సూప్ వాక్స్ కంపెనీకి చెందిన పోర్టబుల్ క్లాత్స్ డ్రైయర్ అప్ గ్రేడెడ్ మినీ డ్రైయర్ ఒకటి ఈ వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది 600 వాట్ పవర్ అవుట్ పుట్ తో.. స్మార్ట్ టైమర్ ఫీచర్ తో వస్తుంది. చిన్న చిన్న బట్టలు, బేబీ దుస్తులు, ఇన్నర్ వేర్స్ వంటి వాటిని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. దుస్తుల మీద చిన్న చిన్న సూక్షజీవులు ఉంటే తొలగిస్తుంది. ముక్కు వాసన రాకుండా ఆపుతుంది. అంతేకాదు ముడతలను కూడా తొలగిస్తుంది. చిన్న చిన్న దుస్తులను అయితే వెంటనే ఆరబెడుతుంది. అయితే చొక్కాలు, ప్యాంట్లు వంటివి మాత్రం ఆరడానికి సమయం పడుతుంది. సిల్క్, వూల్, రియల్ సిల్క్, డౌన్ ఫెదర్ వంటి దుస్తులు ఆరడానికి 60 నుంచి 180 నిమిషాల సమయం పడుతుంది. అదే కాటన్, హెస్సేన్, నైలాన్, చిన్లాన్ వంటి దుస్తులను ఆరబెట్టేందుకు 180 నుంచి 300 నిమిషాల సమయం పడుతుంది. 360 డిగ్రీల వేడి గాలి ప్రసరణతో ఇది పని చేస్తుంది. త్రీ డైమెన్షనల్ స్పీడ్ డ్రైయింగ్ ఫీచర్ తో వస్తుంది.

ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఊర్లు వెళ్ళినప్పుడు వెంట తీసుకుని వెళ్ళవచ్చు. దీనికొక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లో దుస్తులను పెట్టాలి. ఆ తర్వాత ఈ డ్రైయర్ ని ఆన్ చేస్తే మీ దుస్తులను ఆరబెడుతుంది. ప్యాంటు, షర్టు వంటివి ఆరబెట్టడానికి సమయం పట్టినా గానీ అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో ఇన్నర్ వేర్స్ తడిగా ఉంటే వెంటనే ఆరబెట్టుకోవచ్చు. పై బట్టలు బైక్ మీద వెళ్తున్నప్పుడు గాలికైనా ఆరతాయ్ కానీ లోదుస్తులు అంత త్వరగా ఆరవు. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడం లేదని బాధపడేవారికి ఈ మెషిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 5,249 కాగా ఆఫర్ లో మీరు దీన్ని రూ. 3,498 కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 500 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.

జోటిమో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వార్మర్ మెషిన్ ఉంది. ఒకేసారి 8 బట్టలను ఆరబెట్టుకోవచ్చు. 10 కేజీల కెపాసిటీతో వస్తుంది. క్విక్ డ్రై, డెలికేట్ ఫీచర్స్ ఇచ్చారు. క్విక్ డ్రై ఫీచర్ తో 20 నిమిషాల్లో 9 దుస్తులను ఆరబెడుతుంది. రిమోట్ తో ఆపరేట్ చేసేలా ఇంటిలిజెంట్ రిమోట్ కంట్రోల్ ని ఇచ్చారు. ఇది హ్యాంగర్ తో పాటు వస్తుంది. దీని అసలు ధర రూ. 5,999 ఉండగా ఆఫర్ లో రూ. 3,499కే అందుబాటులో ఉంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద రూ. 500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ మెషిన్ ని కప్ బోర్డులో లేదా ఎక్కడైనా ఒక స్టాండ్ కి తగిలించుకుని దాని హ్యాంగర్ కి దుస్తులు తగిలించి మెషిన్ ఆన్ చేస్తే చాలు బట్టలు వేగంగా ఆరిపోతాయి.

కోస్టార్ మ్యాటర్ హ్యాంగబుల్ అండ్ ఫోల్డబుల్ వార్మర్ మెషిన్ ఒకటి ఉంది. ఇది ఒక బ్యాగ్ తో పాటు వస్తుంది. ఈ బ్యాగ్ లో దుస్తులను పెట్టుకుని ఆరబెట్టుకోవచ్చు. దీని అసలు ధర రూ. 3,999 కాగా ఆఫర్ లో రూ. 2,554కే అందుబాటులో ఉంది. ఇది గంటలో 6 దుస్తులను ఆరబెడుతుంది.

 

రవ్వ పొంగలి ఈ స్టైల్‌లో చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ..

వ్వతో సాధారణంగా ఉప్మా లేదంటే స్వీట్లు తయారు చేస్తారు. కానీ పొంగలి కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్‌గా ఈ బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం.

రాత్రి పూట లైట్‌గా తినాలి అనుకునేవారు ఈ పొంగలి డిన్నర్‌గా కూడా తినవచ్చు. చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. లేదంటే నేరుగా ఉత్తిది అయినా తినవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. కొద్దిగా నెయ్యి, జీడిపప్పు తగిలిస్తే ఆహా ఇల్లంతా ఘమఘమల వాసనే. మరి ఈ రవ్వ పొంగలి ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రవ్వ పొంగలికి కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, జీడిపపపు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి.

రవ్వ పొంగలి తయారీ విధానం:

ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాక.. మిరియాలు వేయాలి ఇవి కూడా వేగాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ అల్లం తురుము వేసి నీళ్ళు పోయాలి.

ఇందులో ఉప్పు వేసి రుచి చూసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి ఒక ఉడుకు ఉడికా.. ఉడికించిన పెసర పప్పు వేసి కలుపుకోవాలి. పొంగలి బాగా ఉడికాక.. దించేసి కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రవ్వ పొంగలి సిద్ధం. ఎంతో సింపుల్‌గా అయిపోతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ 13 ప్రో పేరుతో ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రోతో పాటు, రియల్‌మీ 13 ప్రో+ ఫోన్‌లను విడుదల చేయనున్నారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో సోనీ ఎల్‌వైటీ 600 లెన్స్‌ను ఇస్తున్నారు. ప్రపంచంలో ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.

1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 1 టిగా బైట్‌ స్టోరేజ్‌ ఇవ్వనున్నారు. రియల్‌ మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్‌ ఫోన్‌ ఇదే. హైపర్ ఇమేజ్+ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‫ను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 5050 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇస్తున్నారు. కలిగి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సమాచారం మేరకు ఈ ఫోన్ అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్ మీ 13 ప్రో+, రియల్ మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

 

మిత్రమా గడువు సమీపిస్తోంది.. ఈ పని నెలాఖరులోగా చేయకపోతే రూ.5,000 జరిమానా!

మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు జూలై 31, ఈ పని చేయడానికి మీకు 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే, వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ఈసారి గడువును పొడిగించే ఆలోచనలో ఆదాయపు పన్ను శాఖ లేదు. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారు పెనాల్టీగా భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మీరు ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి.

3 కోట్లకు పైగా రిటర్న్ ఫైళ్లు:

ఆదాయపు పన్ను ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డ్యాష్‌బోర్డ్‌లో ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 10 లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. వాటిలో 2 కోట్ల 90 లక్షలకు పైగా రిటర్నులను పన్ను చెల్లింపుదారులు ధృవీకరించారు. వాటిలో 94.53 లక్షల రిటర్నులను కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది.

దాఖలు చేయనందుకు జరిమానా ఏమిటి?

ప్రస్తుత ఆదాయపు పన్ను రిటర్న్ నిబంధనల ప్రకారం, ఈ సీజన్‌లో డిసెంబర్ 31 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం 31 జూలై 2024 వరకు ఉచితం. గడువు ముగిసిన తర్వాత ఆలస్యమైన రిటర్న్‌ను దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. అయితే దాని కోసం పన్ను చెల్లింపుదారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పెనాల్టీ మొత్తం పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆలస్యమైన రిటర్న్ ఫైల్‌పై అతను రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పన్ను చెల్లింపుదారు తన పన్ను మొత్తంపై వడ్డీని కూడా చెల్లించాలి.

గడువు ఎందుకు పొడిగించాలి?

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు జూలై 31. గడువు సమీపిస్తుండటంతో రిటర్నుల దాఖలులో వేగం పెరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ ఫైలింగ్ పోర్టల్‌లో రద్దీ పెరగడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియాలో నిరంతరం రాస్తూనే ఉన్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పోర్టల్ స్లోగా ఉండటం, మధ్యలో చిక్కుకుపోవడం వల్ల గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కాకుండా, పాస్‌వర్డ్ రీసెట్, ఓటీపీ, వెరిఫికేషన్‌లో కూడా పన్ను చెల్లింపుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 

వాటే ఐడియా మేడమ్‌.. ఉచిత బస్సులో ఊరికే వెళ్లకుండా.. భలేగా టైమ్‌ సేవ్‌ చేస్తున్నారే..!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు బాగా కలిసొచ్చింది. ఆడవారి కోసం సీఎం రేవంత్ సర్కారు బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని పెద్ద సంఖ్యలో ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీబస్‌ జర్నీతో మహిళా ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. కానీ, ఉచిత బస్సు పుణ్యామా.. అని ప్రతిరోజు ఏదో ఒకచోట వింత వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం, ఎగబడి కొట్టుకోవటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు అవసరం ఉన్నా.. లేక పోయినా ఉచిత బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకొందరు బస్సులో ప్రయాణిస్తూ ఇంటికి అవసరమైన పనులు చేసుకుంటున్నారు. అలాంటి వీడియో తరచూ నెట్టింట వైరల్‌ కావటం మనం చూస్తున్నాం. తాజగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉచిత సదుపాయంతో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. షాపింగ్‌ల పేరిట కొందరు, పుణ్యక్షేత్రల దర్శనార్థం చాలా మంది ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇక ఫ్రీ బస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ వెల్లుల్లి పొట్టు తీస్తుండగా బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు అదంతా వీడియో తీశారు. ఈ ఘటన హన్మకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న బస్సులో చోటు చేసుకుంది. బస్‌ జర్నీ చేస్తూనే ఆమె ఏంచక్కా వెల్లుల్లీ పొట్టు తీసుకుంటోంది. కొందరు ఆమె చేస్తున్న నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తవైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇదేంది నాయన ఫ్రీబస్సు సదుపాయాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటారా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఒకప్పుడు రైలు, బస్సులో ప్రయాణిస్తూ బిస్కట్లు, పల్లీ బఠాణీలు, ఇతర స్నాక్స్‌ వంటివి తినేవాళ్లు. కానీ ఇప్పుడు మహిళలు మాత్రం.. తమకు ఇంటి వద్ద టైమ్‌ సరిపోవటం లేదని..ఇలా బస్‌ జర్నీ చేస్తు ఇంటి పనులతో టైమ్ పాస్ చేస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఫ్రీ బస్‌ జర్నీ ఆడవారికి బాగానే కలిసొచ్చిందని చెబుతున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది.. కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది. గోదావరి మహోగ్రంగానే ఉరకలేస్తోంది. ఇప్పటికే వందల TMCల నీరు వృధాగా సముద్రం పాలయ్యింది. అటు కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా జలకళ వస్తోంది.

ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో మరో మూడ్రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు.

తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సిటీలో మళ్లీ ముసురు కొనసాగుతోంది. పలుచోట్ల మోస్తరు వర్షం పడుతోంది.

 

ఊహించని సీన్… జగన్‌-రఘురామకృష్ణరాజు మాటామంతి

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీసీ అధినేత జగన్‌ దగ్గరకు వెళ్లి పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలపాటు మాటామంతీ జరిగింది. ఇరువురి భేటీ.. ఆసక్తికర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తన కేసులో ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయో గూగుల్‌ టేక్‌అవుట్‌ వివరాలు సేకరించాలని పోలీసు శాఖను ఆయన కోరుతున్నారు. గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉండి.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఉండి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటివరకు కూడా జగన్‌పై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ స్వయంగా జగన్ వద్దకే వెళ్లి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వ లక్ష్యాలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్లేలా ప్రభుత్వ కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్‌. అటు.. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఆ ప్రసంగం నిరసిస్తూ YCPఎమ్మెల్యేల వాకౌట్ చేశారు.

 

ఆవాల నూనెతో వంట చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

వాలను పూర్వం నుంచి కూడా ఆహారంలో ఒక భాగం చేశారు. ఆవాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాల పిండితో పులిహార చేసినా, ఆవకాయ పెట్టినా ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఆవాలను కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఆవాల నుంచి తయారు చేసిన నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడంటే వంట నూనెలో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ ఇంతకు ముందు ఎక్కువగా ఆవాల నూనెతో వంటలు తయారు చేసేవారు. ఆవాల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఉంటాయి. మరి ఆవాల నూనెతో వంట తయారు చేసి తినడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొవ్వును తగ్గిస్తుంది:

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల చెడు కొవ్వు అనేది తగ్గుతుంది. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, అధిక బరువు నుంచి రిలీఫ్ పొందుతారు.

రక్త పోటు కంట్రోల్:

మస్టర్డ్ ఆయిల్‌తో వంటలు చేయడం వల్ల శరీరంలో రక్త పోటు కూడా తగ్గుతుంది. కాబట్టి హైబీపీతో బాధ పడేవారు ఆవ నూనె వంటల్లో ఉపయోగించడం మంచిది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

ఫ్రీ రాడికల్స్‌ నశిస్తాయి:

ఆవ నూనెను వంటకు ఉపయోగించడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నశిస్తాయి. ఆవనూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు సహాయం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్.. కణాలకు నష్టాన్ని కలిగించి క్యాన్సర్ కు దారి తీస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది:

ఆవనూనెతో తయారు చేసిన వంటలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

వాపులు, నొప్పులు తగ్గుతాయి:

ఆవనూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయ పడుతుంది. అలాగే చర్మ, జుట్టు సమస్యలు తగ్గి అందంగా కనిపిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..

న వస్తువులను ఇతరులతో పంచుకోవడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతరులకు ఇస్తే ఆర్థికంగా, ఆరోగ్యంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

కొన్ని రకాల వస్తువులను ఇతరులతో పంచుకుంటే మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పండితులు చెబుతోన్న దాని బట్టి ఇతరులతో పంచుకోకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పండితుల అభిప్రాయం ప్రకారం చెప్పులు, బూట్లను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ పంచుకోకూడదు. కాళ్లు శని దేవుడి స్థానంగా చెబుతుంటారు. అందుకే ఒకరి చెప్పులను మరొకరు ధరించడం వల్ల శని దోషాన్ని ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. దీని వల్ల పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

* ఇక ఇతరులతో పంచుకోకూడని మరో వస్తువు ఆభరణాలు. ముఖ్యంగా బంగారం అభరణాలను మరొకరికి ఇవ్వడం వల్ల మీ సంపద వారికి ఇచ్చినట్లవుతుందని పండితులు చెబుతున్నారు.

* పండితుల అభిప్రాయం మీ పెన్నును ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. మీ జేబులోని పెన్నును పక్కనివారికి ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని చెబుతుంటారు.

* ఇక మొక్కలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంట్లో పెరుగుతున్న మొక్కలను ఇతరులకు ఇస్తే మీ ఇంట్లోని శక్తిని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే వీలైనంత వరకు నర్సరీల్లో కొనుగోలు చేసుకోవడమే బెటర్‌. అయితే ఇలా మొక్కలను తీసుకున్న వారికి కూడా మంచిది జరగదని నిపుణులు చెబుతున్నారు.

* ఇంట్లోని ఉప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లో పక్కని వారికి అరువుగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. కాబట్టి ఉప్పును కానీ పసుపును కానీ ఎవరికీ ఇవ్వకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..! మెంటలెక్కిస్తున్న నయా ఫీచర్లు

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీస్థాయిలో ఉంది. అయితే బడ్జెట్ ఫోన్స్‌తో పాటు ప్రీమియం ఫోన్స్ వాడే వారి సంఖ్య ప్రస్తతం బాగా పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో టాప్ కంపెనీలు తమ ప్రీమియం ఫోన్స్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్స్‌కు సంబంధించి ఆ సంస్థ క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఆగస్టు 13న నిర్వహించే గూగుల్ ఈవెంట్లో ఈ స్మార్ట్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఈ రెండు ఫోన్లకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. అయితే గూగుల్ అధికారికంగా ఈ రెండు ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ పేర్కొనకపోయినా లీకు వీరులు మాత్రం ఫీచర్స్‌ ఇవేనంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్‌గా గూగుల్ నయా ఫోన్స్ ఫీచర్స్ గురించి వివరాలను తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్

ఈ ఫోన్ డ్యూయల్ పిల్ షేమ్ కెమెరా కటౌట్‌లతో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. అలాగే కెమెరాలు వెనుక ప్యానెల్‌కు సంబంధించిన రెక్ట్‌యాంగులర్ షేప్‌లో ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌కు ఎడమ వైపున పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉంటుందని పుకార్లు షికారు చేస్తున్నారు. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ అబ్సిడియన్, పింగాణీ రంగు ఎంపికలలో అందుబాటులో ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 1,68,900గా ఉంటుందని, అలాగే 512 జీబీ వేరియంట్ ధర సుమారు సుమారు రూ. 1,80,500 ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో

గూగుల్ పిక్సెల్ 8 ప్రో మాదిరిగానే గూగుల్ 9 ప్రో ఉందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఫ్లాష్, లేజర్ ఆటోఫోకస్‌తో కూడిన చిన్న కెమెరా డెకోతో వస్తుంది. అయితే నివేదికల ప్రకారం పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్స్‌లో కూడా ట్రిపుల్ 50 ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అయితే ఈ రెండు ఫోన్లకు స్క్రీన్ పరిమాణంతో బ్యాటరీ సామర్థ్యంలో తేడా ఉంటుంది. పిక్సెల్ 9 ప్రో అబ్సిడియన్, పింగాణీ, హాజెల్ (సేజ్ గ్రీన్), పింక్ నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టోరేజ్ ఆప్షన్‌లు, వాటి అంచనా ధరలను చూస్తే 128 జీబీ రూ. 97,500, 256 జీబీ రూ. 1,06,400, 256 జీబీ రూ. 1,18,000గా ఉండవచ్చని నిపుణుల అంచనా. ఆగస్ట్ 13న గూగుల్ హార్డ్‌వేర్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ వాచ్-3ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా ఫ్యూజులు అవుట్‌

ప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కలిగిస్తుంటాయి. అసలు ఎలా జరిగాయో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది. వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత కడుపులో దూది మర్చిపోవడం, కత్తెర మర్చిపోవడం లాంటి సంఘటనలు మనం అడపాదడపా చూశే ఉంటాం.

అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన వైద్యులనే షాక్‌కి గురి చేసింది.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలోని ఖుజరహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించాడు. ఛతుర్పుర్‌ జిల్లా ఆసపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎక్స్‌రే నిర్వహించిన డాక్టర్‌ నంద్‌ కిషోర్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. యువకుడు కడుపులో ఒక సొరకాయ ఉన్నట్లు గుర్తించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేసి సొరకాయను బయటకు తీశారు.

సొరకాయ కారణంగా యువకుడు పెద్ద పేగు నలిగిపోయింది. ఈ కారణంగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం యువకుడి పరిస్థితి కొంద ఆందోళన కరంగానే ఉందని చికిత్స కొససాగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇక యువకుడి శరీరంలో ఈ సొరకాయ మల మార్గం నుంచి వచ్చిన వైద్యులు భావిస్తున్నారు. అయితే సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా.? అసలు కారణం ఏంటన్న విషయం తెలియాలంటే సదరు వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే సదరు వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.

అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్‌!

పీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమయ్యింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.

గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున, మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

ఈ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు వరదలు, రైతులకు సంబంధించిన అంశాలు, నీటిపారుదలతోపాటు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. మరోవైపు వైసీపీ పాలనపై చంద్రబాబు ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేశారు. మరో మూడు శ్వేత పత్రాలైన శాంతిభద్రతలు, ఎక్సైజ్‌, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు. ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ కూడా ఫాలో కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు ఉదయం ఎనిమిదిన్నరకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు.

అసెంబ్లీలో అమీతుమీకి సిద్ధమైన వైసీపీ

ఇక అసెంబ్లీ సమావేశాలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది వైసీపీ. అసెంబ్లీ వేదికగా కుటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయింది. మాజీ సీఎం జగన్‌ కూడా సభకు హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, దాడులకు సంబంధించిన కీలకమైన అంశాలను లేవనెత్తనున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అసెంబ్లీలోనే గవర్నర్‌కు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తమ ఎమ్మెల్యేలు అడ్డుకుంటారని జగన్‌ చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.

వెదర్ ఎఫెక్ట్.. నగరంలో మొక్కజొన్న పొత్తులకు పెరిగిన డిమాండ్

దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నిత్యవసర సరుకులు, కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే ఉల్లి ఆఫ్‌ సెంచరీ కొట్టగా.. టమోట సెంచరీ రీచ్ అయింది.

ఇదే బాటలో మొక్కజొన్న పొత్తుల రేట్లు పెరిగాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, చలి తీవ్రత పెరగడంతో వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తినేందుకు ఇష్టపడుతున్నారు నగరవాసులు. దీంతో తెలంగాణలో మొక్కజొన్న పొత్తులకు భారీ డిమాండ్ ఏర్పడింది. నిన్న మొన్న వరకూ పదిరూపాయాలు పలికిన మొక్కజొన్న పొత్తు రేటు డబుల్ అయింది.

వర్షాల కారణంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి అయ్యే మొక్కజొన్న పొత్తులు రాకపోవడంతో ఒక్కసారి సుమారు 20 రూపాయలకు చేరింది. నగరానికి సరిఫడా దిగుమతి రావడం లేదని చెబుతున్నారు వ్యాపారులు. మరోవైపు నగరంలో జాఫ్రానీ చాయ్‌కి డిమాండ్ బాగా పెరిగింది. వర్షాలు కారణంగా చలి నుంచి తట్టుకునేందుకు జాఫ్రానీ చాయ్‌ తాగేందుకు నగర వాసులు టీ షాపులకు క్యూ కడుతున్నారు. మట్టి గ్లాసులో గంటల తరబడి కాచిన పాలు, డికాషన్ తో పాటు కుంకుమ పువ్వు వేసి తయారు చేస్తారు ఈజాఫ్రానీ చాయ్. ఈ చాయ్‌ ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు టీషాపు యాజమానులు.

‘మైక్రోసాఫ్ట్‌ సమస్య’ చైనాపై ఎందుకు ప్రభావం చూపలేదు.. అసలు కారణం ఇదే..

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా, హాస్పిటల్‌ మొదలు విమానయాన రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.

ప్రపంచంలోని చాలా దేశాల్లో విమాన సేవలపై దీని ప్రభావం పడింది. విమాన సంస్థలు పలు సేవలను రద్దు చేశాయి కూడా. క్రౌడ్‌ స్ట్రైక్‌ అనే సెక్యూరిటీ అప్‌డేట్‌లో తలెత్తిన సమస్య కారణంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్ కనిపించిన విషయం తెలిసిందే.

ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సెక్యూరిటీ కోసం ఈ క్రౌడ్‌ స్ట్రైక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని దేశాలపై ఈ ప్రభావం పడినా చైనాపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దేశంలో విమాన రంగంపై కానీ మరే ఇతర రంగాలు ప్రభావితం అయినట్లు ఎలాంటి రాలేదు. దీంతో ప్రపంచమంతా ఊగిపోయిన తరుణంలో చైనాపై మాత్రం పెద్దగా కనిపించలేవు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా.?

క్రౌడ్‌ స్ట్రెక్‌ అనేది అమెరాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు పలు ఐటీ సంస్థలకు ఈ సంస్థ సెక్యూరిటీని అందిస్తుంది. అయితే చైనాలో మాత్రం చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. చైనాలో పనిచేస్తున్న కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే క్రౌడ్‌ స్ట్రైక్‌ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే చైనాలోని మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన 21 వయానెట్‌ నిర్వహిస్తోంది. చైనాలో గ్లోబల్ క్లౌడ్‌ సర్వీసులను ఆ దేశంలోని సంస్థలే నిర్వహించాలనే నిబంధన ఉంది.

ఈ కారణంగానే చైనాలో ఈ సేవలను 21 వయానెట్‌ ఈ బాధ్యతలను చూస్తోంది. అందుకే మైక్రోసాఫ్ట్‌లో నెలకొన్న సమస్య ప్రభావం చైనాపై పెద్దగా పడకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రపంచ దేశాలతో పోల్చితే చైనాలో మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయి. అందుకే మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన టెక్నికల్ సమస్యలు ఆ దేశంలో విండోస్‌ ఉపయోగిస్తున్న వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.

పర్సనల్‌ కంప్యూటర్లపై ఎందుకు ప్రభావం పడలేదు..

ఇదిలా ఉంటే వ్యక్తిగత కంప్యూటర్లు ఉపయోగిస్తున్న వారిలో ఈ సమస్య ఎందుకు రాలేదనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఇంట్లో, ఆఫీసుల్లో ఉపయోగించే కంప్యూటర్స్‌ యథావిధిగా పనిచేశాయి. దీనికి కారణం క్రౌడ్‌ స్ట్రైక్‌ సెక్యూరిటీని ఎక్కువగా సైబర్‌ దాడుల నుంచి సంరక్షించుకునేందుకు గాను కొన్ని ఐటీ, ఎయిర్‌ లైన్స్‌, బ్యాంకింగ్ వంటి సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ సేవలను ఉపయోగించుకుంటున్న కంపెనీలపై మాత్రమే ఈ ప్రభావం పడింది.

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..

రామ్‌ చరణ్‌ తుదపరి చిత్రం గేమ్‌ ఛేంజర్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఎప్పుడు విదలవుతుందా.? అని అభిమానులతో పాటు యావత్‌ ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ట్రిపులార్‌ తర్వాత వస్తోన్న చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాత దిల్‌రాజ్‌ కీలక ప్రకటన చేశారు.

తాజాగా ‘రాయన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్‌ రాజ్‌ గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై స్పందించారు. స్టేజ్‌పై మాట్లాడుతున్న దిల్‌ రాజును అభిమానులు గేమ్‌ ఛేంజర్‌ విడుదల ఎప్పుడంటూ అడిగారు. దీనికి బదులిస్తూ.. గేమ్‌ ఛేంజర్‌ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీకి సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశతో ఉన్నారు.

ఇదిలా ఉంటే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ లో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, ఎస్‌. జె. సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోలేకపోవడంతో గేమ్‌ ఛేంజర్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ మాట్లాడుతూ.. గేమ్‌ ఛేంజర్‌ విడుదల ఇటీవల ఉండదనే హింట్‌ ఇచ్చారు. అయితే తాజాగా దిల్‌ రాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక శంకర్‌ తెలుగులో తెలుగులో తెరకెక్కిస్తున్న తొలి మూవీ గేమ్ ఛేంజర్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు తమిళంలో తెరకెక్కిన లు తెలుగులో డబ్‌ అవుతూ వచ్చాయి. అయితే తొలిసారి శంకర్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. ఇదే విషయమై శంకర్‌ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభించిందని, అందుకే తెలుగులో ఓ తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో తన కల నెరవేరబోతోందని శంకర్‌ చెప్పుకొచ్చారు.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు ముందు ఎందుకు సమర్పిస్తారు?

రోజు బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉంది.

ఈ సర్వేను ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్‌గా చూస్తారు. ఈ నివేదిక ద్వారా ప్రభుత్వం గత ఒక సంవత్సరం పనిని సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. బడ్జెట్‌కు ముందు దీన్ని ఎందుకు సమర్పి్స్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?

పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇది బడ్జెట్ ప్రధాన ఆధారం, ఇది ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని ఇస్తుంది. గత ఆర్థిక సంవత్సరం సమీక్ష ఆధారంగా తయారు చేయబడింది. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితి గురించి ప్రభుత్వం చెబుతుంది. ఏడాది పొడవునా అభివృద్ధి ట్రెండ్, ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగంలో CAN-సీ పథకాలు ఎలా అమలు చేశారు..వంటి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది.

ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమైనది?

ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మెరుగైన చిత్రాన్ని అందజేస్తుంది. ఇందులో పని, ఉపాధి, జీడీపీ గణాంకాలు, బడ్జెట్ లోటు, గత ఏడాది ద్రవ్యోల్బణం వంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం నమోదు చేయబడుతుంది. దీని ద్వారా దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు సర్వేను సిద్ధం చేస్తారు.

ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక పత్రం. ఇందులో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. దేశం ఎక్కడ లాభపడిందో, ఎక్కడ నష్టపోయిందో ఈ సర్వే తెలియజేస్తోంది. ఈ సర్వే ఆధారంగా వచ్చే సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అవకాశాలు కనిపిస్తాయో నిర్ణయించనున్నారు.

సర్వే నివేదికను ఎవరు సిద్ధం చేస్తారు?

ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం రూపొందిస్తుంది. ఇది ప్రధానంగా ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో తయారు అవుతుంది. ఈ ఏడాది ఈ ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది.

ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది:

1. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ చిత్రాన్ని వెల్లడిస్తుంది. దీంతో దేశంలోని ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం వరకు లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది.

2. దీని వల్ల ప్రభుత్వ భవిష్యత్తు విధానం, రోడ్‌మ్యాప్ గురించి సామాన్యులకు తెలుస్తుంది.

3. ఆర్థిక సర్వేలో వివిధ రంగాల పనితీరు గురించి, పెట్టుబడి, పొదుపు విషయంలో దేశం ఎంత అభివృద్ధి చేసింది అనే దాని గురించి కూడా సమాచారం ఇవ్వబడింది.

మాన్‌సూన్‌ డిప్రెషన్‌ అంటే ఏంటీ.? దీని లక్షణాలు ఎలా ఉంటాయి.?

ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేకుండా వనాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అయితే సాధారణంగా వాతావరణం ఇలా మారితే వ్యాధులు వస్తాయనే విషయం తెలిసిందే.

అయితే ఇలా వర్షాలు కురవడం, వాతావరణం చల్లాగా మారడం వల్ల శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే మాన్‌సూన్‌ డిప్రెషన్‌గా చెబుతుంటారు. ఇంతకీ ఈ సమస్యలో కనిపించే లక్షణాలు ఏంటి.? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వర్షాకాలంలో సూర్యరక్ష్మి పూర్తిగా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో ఉదయం లేవడానికి బద్ధకిస్తుంటాం. అలాగే మనలో ఉత్తేశాన్ని నింపే సూర్యరక్ష్మి లేకపోవడం వల్ల డల్‌గా ఉంటుంది. ఎక్కువ కాలం సూర్యకాంతి లేని కారణంగా డిప్రెషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. సూర్యరక్ష్మి పడని కారణంతో శరీరంలో సెరోటోన్‌ స్థాయిలను నియంత్రణ జరగదు. సెరోటిన్ ఉత్పత్తికి అంతరాయం జరిగితే మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది.

ఇక సూర్యకాంతి లేని కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్‌ డీ కూడా సరిపడ లభించదు. దీంతో డిప్రెషన్‌, ఆందోళన వంటి లక్షణాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వర్షం పడుతుండడం వల్ల శారీరక కార్యకలాపాలు కూడా తగ్గుతాయి. ఇది కూడా మానిసక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వర్షం కారణంగా బయటకు వెళ్లడం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురితో కలిసి ఉండకపోవడం వల్ల కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలా బయటపడాలంటే..

ఈ మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతోందన్న కారణంగా వ్యాయామం చేయడాన్ని ఆపకూడదు ఇంట్లోనైనా కనీసం 15 నుంచి 20 నిమిషాలు కచ్చితంగా వర్కవుట్స్‌ చేయాలి. ఇక రాత్రి సరైన నిద్రలేక పోతే రోజంతా దాని ప్రభావం ఉంటుంది. ఇది కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కచ్చితంగా రాత్రుళ్లు సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇక శారీరకంగా ఇతరులతో కలిసే వీలు లేకపోయినా వర్చువల్‌గా అయినా మాట్లాడాలి. రోజులో కొద్ది సేపైనా ఇతరులకు ఫోన్‌ చేసి మాట్లాడడం మర్చిపోకూడదు. ఇలాంటివి చేయడం వల్ల మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

Jagan warning to police officer: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

Jagan warning to police officer: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఓ పోలీసు అధికారికి జగన్ వార్నింగ్ ఇచ్చా రు. నల్ల కండవాలు ధరించి ప్లకార్డ్స్‌తో అసెంబ్లీకి వస్తున్నారు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు పోలీసులు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. నేతలు నల్ల కండవాలు ధరించి ప్లకార్డ్స్‌ పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్లకార్డులను సభలోకి అనుమతించేది లేదని రిక్వెస్ట్‌గా పోలీసులు చేప్పారు. శాసనసభ సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మీదన్నారు.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురయ్యారు మాజీ సీఎం జగన్. మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ మదుసూధన్ అనే పోలీసు అధికారిపై చిందులేశారు. మధుసూదన్‌రావు.. గుర్తు పెట్టుకో.. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటూ హెచ్చరించారు. తాము తీసుకొస్తున్న పేపర్స్ చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. టోపీకి ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా? అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టాలన్నారు.

FCI రిక్రూట్‌మెంట్: 5000 AGM ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

FCI రిక్రూట్‌మెంట్: 5000 AGM ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

FCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ వాచ్‌మన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, క్లాస్ III, వివిధ పోస్టుల కోసం రిక్రూట్ చేయబోతోంది.

FCI రిక్రూట్‌మెంట్ 2023కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త.

FCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. FCI రిక్రూట్‌మెంట్ 2024 పోస్ట్‌ల నోటిఫికేషన్ ఆమోదాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. FCI రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ఫారమ్ త్వరలో ప్రారంభమవుతుంది. FCI రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అర్హత ఏమిటి, ఇవన్నీ మేము ఈ కథనం (ప్రభుత్వ ఉద్యోగాలు) ద్వారా సమాచారాన్ని అందిస్తాము.

FCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ వాచ్‌మన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, క్లాస్ III, వివిధ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. FCI రిక్రూట్‌మెంట్ 2023కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీలోపు పూరించవచ్చు, దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి. FCI ఖాళీలు 2024 వివరాలు: దరఖాస్తు తేదీ సెప్టెంబర్ 2024, అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/

FCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ – వయో పరిమితి: గరిష్టంగా 25 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు – నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము: రూ. 250/- SC/ ST/ PWBD, మహిళా అభ్యర్థులు: Nil. చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.

FCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ – అర్హత అర్హత: అభ్యర్థులు డిగ్రీ (సంబంధిత సబ్జెక్ట్) డిప్లొమా, డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్ విభాగం) కలిగి ఉండాలి. అభ్యర్థులు 08వ (ఇంటర్మీడియట్) ప్రామాణిక ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

FCI రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పూరించాలి?: FCI రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించడానికి, ముందుగా మనం అధికారిక వెబ్‌సైట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్‌ను తెరవాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ ఆప్షన్ బటన్‌పై క్లిక్ చేయండి . సిఫార్సు ఎంపిక బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, ఖాళీ లింక్ కూడా మన ముందు అందించబడుతుంది. లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ ఎంపిక బటన్‌ను చూస్తాము, బటన్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, మన ముందు ఒక ఫారమ్ తెరవబడుతుంది, అందులో మన పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని నమోదు చేసి, ఫారమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

ఆ తర్వాత లాగిన్ బటన్‌కు వెళ్లి, లాగిన్ ఫారమ్‌కు ఐడి పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ఫారమ్‌లో లాగిన్ అయిన తర్వాత, ఫారమ్‌లో ఇచ్చిన మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించాలి, ఫారమ్‌ను పూర్తిగా చదివిన తర్వాత, ఫైనల్ సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో రుసుమును చెల్లించడం చివరి దశ, ఆన్‌లైన్ ఫారమ్ చెల్లింపును స్వీకరించిన తర్వాత, ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్‌ను తీసుకొని భవిష్యత్తు సూచన కోసం దానిని ఉంచుకోవాలి.

మీకు అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 మధ్యలో మెలుకవ వస్తుందా..? ఐతే ఇదే సంకేతం..!!

మీకు అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 మధ్యలో మెలుకవ వస్తుందా..? ఐతే ఇదే సంకేతం..!!

కొంతమందికి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలుకవ వస్తుంది. ఇలా మెలుకవ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయ్. ఇది భగవంతుడు ఇస్తున్న సందేశం.

ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు. ఇలా మీకు మెలుకవ రావడం వెనక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు. ఇలా మెలుకవ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయ్. అసలు మూడు గంటల నుంచి 5 గంటల మధ్య మెలుకవ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం.

మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి కచ్ఛితమైన సమాధానాలను చెబుతుంది. చాలా మందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంగా వారు నిద్రలేవలేరు. వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు. ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ద మందికి మాత్రమే లభిస్తుంది. ఇది దేవుడు నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థంచేసుకోవాలి.

3 గంటల నుంచి 5 గంటల మద్య కాలాన్ని ఉదయం బ్రహ్మముహూర్తం అని అంటారు. ఇది చాలా మహత్తరమైన కాలం. దీనికి అమృతకాలమని పేరు కూడా ఉంది. పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షన ఉంటుంది. వీరికి ఎలాంటి రోగాలూ రావు.

వీరు చాలా నిజయితీగా ఉంటారు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఏపని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచేవారికి రాగద్వేశాలు ఉండవు. కపటులు కూడా వీరికి నచ్చరు. ఎవ్వరి మనసును కూడా బాధపెట్టరు. ఎవ్వరితో కఠినంగా కూడా మాట్లాడరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు. జీవితభాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ గుణాలు వున్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలుకవ వస్తుంది.

సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరనివాసం చేస్తుంది. సూర్యోదయానికి ముందే లేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయ్. సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఎవరిమీదైతే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది. సూర్యుడిని కామధేనువుతో శాస్త్రాల్లో పోల్చారు. సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. మీ జీవతంలో కష్టాలు తొలగిపోయి, సుఖసంతోషాలు రానున్నట్లని అర్థం చేసుకోవచ్చు. సర్యోదయానికంటే ముందే లేచి గోమాత దర్శనం అయిన వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రపంచం మాయలో పడి చాలా మంది భగవంతుడికి దూరమౌతారు. పూజలు కేవలం చూపించడానికి మాత్రమే చేస్తారు. మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకవ వస్తుందంటే మీరు అప్పుడే లేచి ఈ కులదైవాన్ని పూజించినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది.

1 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు “ఆధార్ కార్డ్” రూపొందించడానికి కొత్త నిబంధనలు

1 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు “ఆధార్ కార్డ్” రూపొందించడానికి కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు మరియు సూచనలను మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్లో పిల్లలు ఉంటే, ఇప్పుడు మీరు వారికి కూడా ఆధార్ కార్డ్ పొందడం తప్పనిసరి.

నేటి కాలంలో, పాఠశాలలు లేదా విద్యాసంస్థల్లో చేరడం లేదా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదా పొదుపు ఖాతా తెరవడం లేదా పిల్లల గుర్తింపు కార్డు తయారు చేయడం వంటివి ఏవైనా, ఆధార్ కార్డు అత్యధికంగా ఉపయోగించే ఏకైక గుర్తింపు కార్డు మరియు ఇది నేటి కాలంలో ఉత్తమమైన పత్రం. దీని సహాయంతో, ప్రజలు మీ పిల్లల కోసం ఆన్‌లైన్ మీడియా ఆధార్‌లో చాలా పనులు చేయగలుగుతారు, కార్డును ఎలా తయారు చేయవచ్చో చూద్దాం

పిల్లల కోసం ఆధార్ కార్డు పొందడానికి, మీకు జనన ధృవీకరణ పత్రం, ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా పాఠశాల ID కార్డ్ లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ అవసరం.

మీకు మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే, ఇప్పుడు మీరు వారి ఆధార్ కార్డును తయారు చేయాలి, ఇప్పుడు మీరు మొదటి బిడ్డ పుట్టిన సర్టిఫికేట్ మరియు మీ స్వంత పని లేదా తండ్రి గుర్తింపు కార్డును ఉపయోగించే పత్రాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి, మీరు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేయలేరు, మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ పిల్లల ఆధార్ కార్డును పొందండి, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, పిల్లల ఫోటోలు మాత్రమే తీయబడతాయి మరియు అన్ని ఇతర సమాచారం ఇవ్వబడుతుంది. తండ్రి లేదా తల్లి ప్రకారం ఆధార్ కార్డులో, తండ్రి లేదా తల్లి వేలిముద్ర మరియు అధునాతన పరిశోధన స్కానర్ ఉంటుంది. మరియు 5 నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు, చాలా పరిశోధన స్కానర్ యొక్క ఫోటో, వేలిముద్ర మరియు బయోమెట్రిక్ డేటా కూడా అవసరం మరియు 15 సంవత్సరాల తర్వాత, పిల్లలు బయోమెట్రిక్ డేటాను మళ్లీ అప్‌డేట్ చేయాలి.

Backing Soda:బెడ్ పై బేకింగ్ సోడా చల్లితే ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా..?

Backing Soda:బెడ్ పై బేకింగ్ సోడా చల్లితే ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా..?

Backing Soda:బెడ్ పై బేకింగ్ సోడా చల్లితే ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా.. హాయి నిద్రతోనే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అలాగే రోజులోని 24 గంటల సమయంలో మూడో వంతు అంటే 8 గంటలు మనం బెడ్ పైన్నే ఉంటాం..

ఆ బెడ్ పై ఉండే పరుపును క్లీన్ చేసుకోవడం అంటే కేవలం నీట్ గా కనిపించడానికే అనుకుంటాం.

కాని దానిపై కంటికి కనిపించని దుమ్మూ దూళి, పురుగులు, బ్యాక్టీరియా, చర్మానికి సంబంధించిన మృత కణాలు వంటి సూక్ష్మ క్రిములు లక్షల్లో చేరి ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సైతం దారితీసే ప్రమాదం ఉంది. అందుకే పరుపును పూర్తిగా శుభ్రం చేసుకునే గొప్ప ప్రక్రియను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

200 గ్రాముల బేకింగ్ సోడా తీసుకోవాలి. దానిని ఓ చిల్లుల గిన్నెలో పోసి బెడ్ పై అంతటా పొడి పడేలా చిలకరించాలి.30 నిముషాల పాటు అలాగే వదిలేసి వ్యాక్యూమ్ తో లేదా హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్ తో బెడ్ పై ఫోర్స్ గా గాలి తగిలేలా చేయాలి.ఇలా చేస్తే సోడాతో సహా బ్యాక్టీరియా మొత్తం పరుపును వదిలి శుభ్రం అవుతుంది.

పరుపును ఇంతకుముందు శుభ్రం చేసి చాలా కాలం అయితే గనుక మరోసారి బేకింగ్ సోడాను చల్లుకుని వాక్యూమ్ తో క్లీన్ చేయాలి.పరుపు క్లీన్ కావడంతో పాటుగా సువాసన వస్తుంది. బెడ్ పై ప్రశాంతమైన నిద్ర వాతావరణం ఏర్పడుతుంది. ఈ చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

Minister Achchennaidu: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

Minister Achchennaidu: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఖరీఫ్ సీజన్‌ కోసం 1321 సహకార సంఘాల్లో విక్రేయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఎరువుల విక్రయాల జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. ఈ మేరకు ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు ఆంధ్రప్రదేశ్ పూర్తి సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Health

సినిమా