Sunday, November 17, 2024

ఇండియన్ నేవీలో లక్షల జీతంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ఇండియన్ నేవీలో లక్షల జీతంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

Indian Navy Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇదో పెద్ద శుభవార్త.ఈ ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 741 పోస్టులను భర్తీ చేయనుంది.

ఈపోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.కాబట్టి మీ అర్హతలను బట్టి ఇండియన్ నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే పోస్టులు ఇవే..

ఇండియన్ నేవీలో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ B (NG), జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ C, ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ట్రేడ్స్‌మెన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం నేవీ రిక్రూట్‌మెంట్ విడుదల చేయబడింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

741 పోస్టులు భర్తీ..

ఈ ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 741 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులపై పనిచేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి.

రిక్రూట్‌మెంట్ జరిగే పోస్టులు ..

జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘బి (NG) – 33 పోస్టులు

జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’ – 2 పోస్టులు

ఫైర్‌మెన్ – 444 పోస్టులు

ఫైర్ ఇంజన్ డ్రైవర్ – 58 పోస్టులు

ట్రేడ్స్‌మెన్ మేట్ – 161 పోస్టులు

పెస్ట్ కంట్రోల్ వర్కర్ – 18 పోస్టులు

కుక్ – 9 పోస్టులు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది – 16 పోస్టులు

మొత్తం – 741 పోస్ట్‌లు

ఇండియన్ నేవీలో జాబ్ కోసం ఏజ్ లిమిట్..

చార్జ్‌మెన్ (అమ్యూనిషన్ వర్క్‌షాప్), చార్జ్‌మెన్ (ఫ్యాక్టరీ) – 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు

చార్జ్‌మెన్ (మెకానిక్), సైంటిఫిక్ అసిస్టెంట్ – 30 సంవత్సరాల

డ్రాఫ్ట్స్‌మన్ (కన్‌స్ట్రక్షన్) – 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల

ఫైర్‌మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ – 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల

ట్రేడ్స్‌మన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు

ఎంపిక చేసే విధానం ఇదే..

ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ భర్తీ చేయబోయే పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేయబడతారు.

అప్లికేషన్ ఫామ్ ఛార్జ్..

ఈ ఇండియన్ నేవీ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు. వారు నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా పరీక్ష రుసుము 295 చెల్లించాలి. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులు లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది.

జీతం అలవెన్స్ వివరాలు..?

జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘బి’ (NG) – రూ. 35400 నుండి రూ. 112400

జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’ – రూ. 25500 నుండి రూ. 81100

ఫైర్‌మెన్- రూ. 19900 నుండి రూ. 63200

ఫైర్ ఇంజన్ డ్రైవర్ – రూ. 21700 నుండి రూ. 69100

ట్రేడ్స్‌మన్ మేట్ – రూ. 18000 నుండి రూ. 56900

పెస్ట్ కంట్రోల్ వర్కర్ – రూ. 18000 నుండి రూ. 56900

కుక్ – రూ. 19900 నుండి రూ. 63200
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – రూ. 18000 నుండి రూ. 56900

Visakhapatnam: మేనమామ లేనిలోటు తీర్చేందుకు..విగ్రహం తో కార్యక్రమము

పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తోంది.

పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తోంది. కాలం కలిసిరాక మేనమామ దూరమైనా.. ఆ లోటు తెలియకుండా అనకాపల్లిలో ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అనకాపల్లి గవరపాలేనికి చెందిన పెంటకోట కిరణ్‌ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవారు. 2020లో విద్యుతాఘాతానికి గురై మృతిచెందారు. ఈయన అక్క మాధవి కుమార్తె లాస్య పుష్పవతి వేడుకలు అనకాపల్లిలో ఆదివారం నిర్వహించారు.

పుట్టింటి నుంచి లాంఛనాలను మాధవి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ సమయంలో తన తమ్ముడు కిరణ్‌ విగ్రహాన్ని తల్లిదండ్రులకు చూపించి సోదరుడిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారామె. మేనమామ చేతులమీదుగా పుట్టింటి లాంఛనాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో ముంబయిలో విగ్రహాన్ని తయారు చేయించినట్లు మాధవి తెలిపారు. మేనమామ చేతుల మీదుగానే పుట్టింటి నుంచి వచ్చిన వస్తువులను లాస్యకు అందజేసేలా చేయాలన్న ప్రయత్నం కుటుంబ సభ్యులందరినీ సంతోష పెట్టింది.

చాయ్ వాలా కూతురు సీఏ పాసైంది.. ఆ తండ్రి కళ్లల్లో ఆనందం చూశారా?

టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తున్న ఓ తండ్రి తన కుమార్తెను సీఏ చదివించాడు. సీఏ సాధించిన కూతురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంటే ఆ కన్నతండ్రి కళ్లు చెమ్మగిల్లాయి.

మురికివాడలో జీవనం. టీ బండి నడిస్తే కానీ, కదలని బతుకు బండి. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా కుమార్తెను చదివించటం శక్తికిమించిన పనే. చేతికి అందివచ్చిన కుమార్తెను పనిలో పెడితే చేదోడువాదోడుగా ఉంటుందని అనుకుంటారు. కానీ, దిల్లీ (Delhi) శివార్లలో జీవనం సాగించే అమిత ప్రజాపతి (Amita Prajapati) తల్లిదండ్రులు మాత్రం అలా ఆలోచించలేదు. ఎలాగైనా తన కుమార్తెను ప్రయోజకురాలిని చేయాలనుకున్నారు. ఉండటానికి ఇల్లు లేకపోయినా.. ప్రతి రూపాయి కూడబెట్టి ఆమెను చదివించారు. అమిత కూడా సీఏ (CA) పూర్తి చేయడానికి ఓ యుద్ధమే చేసింది. పట్టు వదలకుండా 10 ఏళ్లపాటు సాగిన ఆమె పోరాటం ఫలించింది. తాజాగా సీఏ పూర్తి చేసేసరికి వారి ఆనందానికి అవధుల్లేవు. సీఏలో ఉత్తీర్ణత సాధించిన కూతురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంటే పుత్రికోత్సాహంతో ఆ కన్నతండ్రి కళ్లు చెమర్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఉచిత ఇంటర్నెట్.. ప్రైవేట్ బిల్లు పరిశీలనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. !

ఉచిత ఇంటర్నెట్.. ప్రైవేట్ బిల్లు పరిశీలనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. !

Free Internet in India: దేశంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాల ప్రజలకు సమాన ప్రాప్యత కల్పిస్తూనే ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కును కల్పించడానికి ఉద్దేశించిన‌దే ఈ ఉచిత ఇంట‌ర్నెట్ బిల్లు. ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఉచిత ఇంటర్నెట్‌పై ప్రైవేట్ సభ్యుల బిల్లు.. “ఎవ‌రైనా ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు లేదా ఖర్చులను దేశంలోని ఏ పౌరుడు చెల్లించాల్సిన అవసరం లేదు” అని ప్రతిపాదించింది.

2023 డిసెంబర్‌లో సీపీఐ(ఎం) సభ్యుడు వి.శివదాసన్ రాజ్యసభలో దేశంలో ఉచిత ఇంట‌ర్నెట్ బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఎగువ సభ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రపతికి తెలియజేసినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తెలియజేశారు. దీంతో ఈ బిల్లును పరిశీలించాలని స‌భ‌కు సిఫారసు చేసింది. ప్రభుత్వ ఖజానాకు ఖర్చుతో కూడిన ప్రైవేట్ సభ్యుల బిల్లులను సభ పరిగణించవచ్చా అనే దానిపై సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి అనుమతి అవసరం కావ‌డంతో ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉంటుందనీ, పౌరులందరికీ ఇంటర్నెట్‌కు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారిస్తూ, దేశంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకు చెందిన పౌరులు ఈ సేవ‌లు అందించ‌డానికి తగినంత‌గా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బిల్లు పేర్కొంది. ఇంటర్నెట్ అందరికీ స‌మానంగా యాక్సెస్ చేసేలా ఉండాల‌నేది దీని ప్ర‌ధాన ఉద్దేశం. అందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలోని పౌరులందరికీ ఇచ్చిన వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కు పరిధిని విస్తరించేందుకు బిల్లు ప్రయత్నిస్తుంది. సమాజంలో డిజిటల్ విభజనను తొలగించాలని కూడా బిల్లు భావిస్తోంది.

రాజ్యాంగం పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా చేసిందనీ, అందువల్ల వారు భావవ్యక్తీకరణ, అభిప్రాయ స్వేచ్ఛ, ఇతర ప్రాథమిక మానవ హక్కులను వినియోగించుకోవడానికి ఇంటర్నెట్‌ను కూడా యాక్సెస్ చేయగలగాలి. పౌరులందరికీ ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా కేంద్ర ప్రభుత్వం నేరుగా పౌరులందరికీ దీనిని అందించాలని లేదా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ అందించే సేవలకు పూర్తిగా సబ్సిడీ ఇవ్వాలని పేర్కొంది. చట్టంలోని నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా రాష్ట్రాలకు కేంద్రం నిధులను రాబడుల గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా అందించాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.

AP Rains: విద్యార్థులకు అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

AP Rains: విద్యార్థులకు అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

AP Rains:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా ఏపీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతుడటం..భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరింది.

ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మహేశ్ కుమార్. గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరో జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాలో రెండురోజులపాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సోమవారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాడేరు డివిజన్ లో మాత్రం సోమవారం నుంచి విద్యాసంస్థలు కొనసాగుతాయి. భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు మరికొన్ని జిల్లాలో కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది.

Tulsi Leaves: షుగర్ సహా ఆ వ్యాధులకు దివ్యౌషధం తులసి.. రోజుకు ఎన్ని ఆకులు తినాలో తెలుసా?

Tulsi Leaves For Diabetes:ప్రస్తుతకాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది మధుమేహాన్ని సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి తులసి దివ్య ఔషధం.. వాస్తవానికి తులసి మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి.. రోజూ 5-7 తులసి ఆకులను క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

తులసి ఆకులు కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. వీటిలోని ఔషధ గుణాలు.. పలు సమస్యలను వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయి.. అందుకే వీటిని దివ్యౌషధంగా పరిగణిస్తారు..

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది..
తులసి ఆకులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను కూడా నియంత్రించగలదు. తులసిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తులసి ఆకుల సారం బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రక్తపోటు నియంత్రణ: తులసిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే ఈ ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తులసిలోని యూజినాల్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు తగ్గుతాయి..

మానసిక ఆరోగ్యం: ఆయుర్వేద వైద్యంలో తులసి మూలిక లాంటిది.. ఈ ఆకులు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి.

చర్మ సమస్యలు: తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, శ్వాసకోశ సమస్యలు, కడుపు, మూత్ర సంబంధిత రుగ్మతలు, కడుపు పూతల, చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ – బరువు నియంత్రణ: తులసి ఆకులను తీసుకోవడం వల్ల కడుపుకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తులసి సగటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

కావున.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 3 నుండి 8 తులసి ఆకులను తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Cholesterol: చపాతి చేసేటప్పుడు పిండిలో ఇది కలపండి.. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది!

ఈ రోజుల్లో వృద్ధుల నుండి యువకుల వరకు కూడా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం దీనికి ఒక కారణం.రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలలో ఒకటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత జీవనశైలి. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మీరు తినే వాటిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం…

ఈ రోజుల్లో వృద్ధుల నుండి యువకుల వరకు కూడా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం దీనికి ఒక కారణం.

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలలో ఒకటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత జీవనశైలి. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మీరు తినే వాటిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి చాపాతిలు తయారు చేసేటప్పుడు ప్రతిరోజూ పిండితో ఈ ప్రత్యేక పదార్థాన్ని కలపండి. ప్రయోజనాలు ఉంటాయి.

రొట్టె తయారు చేసేటప్పుడు ప్రతిరోజూ గోధుమ పిండితో ఓట్ పిండి లేదా ఓట్స్‌ పౌడర్ కలపండి. ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

వోట్ పిండిలో ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమస్యలను దూరం చేస్తుంది. అందుకే ఓట్స్‌ కలిసిన రొట్టె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఓట్‌మీల్‌లో ఫైబర్‌తో పాటు బీటా-గ్లూకోన్ కూడా ఉంటుంది. ఫలితంగా దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ శరీర బరువుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

చాలామంది చాపాతి, లేదా రొట్టెకు బదులుగా పాలు లేదా పెరుగుతో కలిపి ఓట్స్ తింటారు. ఉదయం అల్పాహారంలో కూడా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు అందులో పండ్ల ముక్కలను కూడా జోడించవచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్ నుండి శరీర బరువును నియంత్రించడానికి ఇది ఉత్తమమైన ఆహారం.

ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిళ్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిళ్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఛత్తీస్‌గడ్ – తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. దట్టమైన అడవిలో కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లలేని దయనీయ స్థితిలో గుట్టపై ఈ గ్రామం ఉంటుంది. వాజేడు నుండి పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యలో మూడు వాగులు దాటాలి రెండు గుట్టలు ఎక్కి దిగాలి. పెనుగోలు గ్రామంలో గత కొద్దిరోజుల నుండి గిరిజనులు విష జ్వరాలు, అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది.

AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు అంటే, ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. గవర్నర్‌ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశ పెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్‌ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది.

సందర్శకులకు అనుమతి లేదు
శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్దఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకూ ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలకు సందర్శకులను వెంట తీసుకురావద్దని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇక, శాసనసభ మీడియా పాయింట్‌ను ఐదేళ్ల తర్వాత పునరుద్ధరించారు.

పసుపు దుస్తులతో అసెంబ్లీకి
అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెదేపా శాసనసభాపక్షం రాజధాని వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించనుంది. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరుకానున్నారు. వీరంతా పసుపు రంగు దుస్తులు, కండువా ధరించనున్నారు. తొలిరోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ నంబర్‌ హాలు-1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.

పంతం నెగ్గించుకున్న గంభీర్‌.. టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌గా కేకేఆర్ మాజీ పేసర్!

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సహాయక సిబ్బందిని ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే శ్రీలంక టూర్‌కు జట్టులో ఎంపిక తన మార్క్‌ చూపించిన గంభీర్.. సహాయక సిబ్బంది విషయంలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడు. తాను సూచించిన వారినే కోచింగ్‌ స్టాఫ్‌లో భాగం చేయాలని బీసీసీఐని కోరాడు. బౌలింగ్‌ కోచ్‌ కోసం ఆర్‌.వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్‌ బీసీసీఐకి సూచించాడు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఫార్మాలిటీస్‌ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అవి త్వరలో పూర్తవుతాయని ఆశిస్తున్నాము. శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నీ మోర్కెల్‌ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది’’ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మోర్కెల్‌, గంభీర్ గతంలో కలిసి ఆడారు. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గంభీర్‌ సారథ్యంలో టైటిల్‌ సాధించింది. అప్పుడు మోర్నీ మోర్కెల్ కేకేఆర్‌ జట్టులో ఉన్నాడు. గంభీర్ లఖ్‌నవూకు మెంటార్‌గా ఉన్న సమయంలో మోర్కెల్ లఖ్‌నవూ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. మోర్కెల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలంపాటు పాకిస్థాన్‌ జట్టుకు అతడు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌తో పాటు నెదర్లాండ్స్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టెన్‌ డస్కాటే గంభీర్‌ బృందంలోకి అసిస్టెంట్‌ కోచ్‌లుగా రానున్నట్లు సమాచారం.

తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్‌!
శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం ఆతిథ్య జట్టుతో టీమ్‌ఇంండియా ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, భారత బౌలింగ్‌ కోచ్‌ నియమాకం ఇంకా పూర్తి కాలేదు. దీంతో శ్రీలంక పర్యటనకు భారత మాజీ ఆటగాడు సాయిరాజ్‌ బహుతులేని తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. సాయిరాజ్‌ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

Joe Biden: బైడెన్‌ వైదొలగెన్‌..ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు ట్రంప్‌తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్‌.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది 59 ఏళ్ల హారిస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమే సురక్షిత అభ్యర్థి అవుతారనేది వారి అంచనా. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్జ్‌కెర్‌ బరిలో నిలిచే అవకాశముంది. మిషిగన్‌ గవర్నర్‌ విట్మర్‌ పేరు తెరపైకి వచ్చినా తాను పోటీలో లేనని ఆమె ప్రకటించారు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు.‘రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని నాకు గట్టి కోరిక ఉన్నా పార్టీ, దేశ ప్రయోజనాల కోసం వైదొలగుతున్నా. అధ్యక్షుడిగా నా బాధ్యతలను పూర్తి చేయడంపై దృష్టి పెడతా’ అని లేఖలో బైడెన్‌ పేర్కొన్నారు. 81 ఏళ్ల బైడెన్‌ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతోపాటు ట్రంప్‌తో జరిగిన చర్చలో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం కొవిడ్‌తో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95శాతం డెమోక్రాట్‌ ప్రతినిధులు బైడెన్‌కు మద్దతు పలికారు. ఆయన అనూహ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి రావొచ్చు. వాస్తవానికి ఇలా అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చేయాలన్న విషయంపై ఎవరికీ అవగాహన లేదు. ఇదే తొలిసారి కావడంతో ఏం చేయాలన్న దానిపై రానున్న కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్‌ నామినీగా బైడెన్‌ వైదొలిగిన అనంతరం ఆయన స్పందించారు. కమలా హారిస్‌ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని స్పష్టం చేశారు.

బైడెన్‌ లేఖలో ఏముందంటే..
‘దేశ నిర్మాణం కోసం చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నాం. వృద్ధులకు చౌకగా ఔషధాలను అందించడం, అమెరికన్లకు వైద్య చికిత్సలను అందుబాటులోకి తేవడం, గత 30 ఏళ్లలో తుపాకుల నుంచి రక్షణకు చట్టాన్ని చేయడం, సుప్రీంకోర్టుకు మొదటి అఫ్రో అమెరికన్‌ను నియమించడం, వాతావరణ మార్పులపై చట్టం తేవడం మన విజయాలు. మీ సహకారంతోనే కరోనాపై విజయం సాధించాం. ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. వచ్చే వారం జాతినుద్దేశించి ప్రసంగిస్తా. నాతోపాటుపని చేసిన కమలా హారిస్‌కు కృతజ్ఞతలు’ అని బైడెన్‌ లేఖలో పేర్కొన్నారు. బైడెన్‌ ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో అందరి దృష్టి కమలా హారిస్‌పైనే పడింది. పైగా అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలకడం ఉత్కంఠకు కారణమవుతోంది. బైడెన్‌ అంగీకరించగానే హారిస్‌ అభ్యర్థి కాబోరు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి నిర్ణయమవుతారు. 4,700 మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతోపాటు సూర్‌ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్‌ కూడగట్టుకోవాల్సిందే.

‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ సహాయ కమిషనర్‌ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు

విజయసాయిరెడ్డిపై ట్వీట్‌ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం ..సహాయ కమిషనర్‌ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు

అమరావతి: ‘దేవాదాయశాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్‌మోహన్‌ అని పేర్కొన్నారు.

సర్వీస్‌ రిజిస్టర్‌లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్‌ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి’ అంటూ సస్పెన్షన్‌లో ఉన్న సహాయ కమిషనర్‌ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ తాఖీదు జారీ చేశారు. ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్‌ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.

కొత్త అభియోగాలు ఇవి..

విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్‌ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా, దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు.
కమిషనర్‌ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు.
‘ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్‌. మీరు పార్టీకి వెన్నెముక’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్‌ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్‌లోని మరో ప్లాట్‌లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు.
శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో.. అనకాపల్లిలో సిద్ధేశ్వరస్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్డేంజ్‌ రెస్ట్‌హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్‌ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్‌ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు.
వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు.
ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ

శాంతి సహాయ కమిషనర్‌గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు? భూములు, దుకాణాల లీజులలో ఏం చేశారు? ఆలయాల భూములు పరాయిపరం చేసేలా ఎన్వోసీల జారీకి సిఫార్సులు చేశారా? అనేవి పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు.

హైదరాబాద్‌ అపార్ట్‌మెంట్‌లో ఘోరం.. బాత్‌రూంలో ముగ్గురి మృతదేహాలు

అపార్ట్ మెంట్ లో ఘోరం జరిగింది. ఇంట్లో కరెంట్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులోని 204 ఫ్లాట్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్నాయి. మృతదేహాలను సాయంత్రం కాలనీవాసులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆర్.వెంకటేష్ (55), మాధవి (50), హరి(30)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

AP EHS EMPLOYEE HEALTH CARD DOWNLOAD

AP Govt has launched new employes health cards with new NTR vidya seva trust name

Download you family Health Cards with your Treasury ID only. No login needed to download your Health Card. Here is the software to download your family members all health cards at one place with just your Treasury ID..

How to download Health Cards:
Just click on this link to enter site
Enter your Treasury ID and submit
A new window will open like ‘Download your health cards’
Click on that link and you will get all your family members Health Cards
Download all your family Health Cards and save the copies for further use

Click here to download your Health Card

 

టోఫెల్ విధానాన్ని రద్దు చేయండి

ప్రచురణార్ధం తేదీ : 20/7/24

టోఫెల్ విధానాన్ని రద్దు చేయండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న టోఫెల్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మూడో తరగ తిలో ఐఐటీ బోధన ఎంత అసంబద్ధమో టోఫెల్ విధానమూ అంతేనని వివరించారు. తూతూ మంత్రంగా వాట్సప్ లో టోఫెల్ విధానం లో పదాలు పంపడం వాటిని ఫోన్ ద్వారా పిల్లలకు వినిపించడం అంతా ఒక నిరూపయోగ ప్రక్రియ అని ఈ విధానాన్ని రద్దు చేయడమే ఉత్తమమన్నారు. ప్లస్ టూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యా బలంలేని వాటిని సమీక్షించాలని సూచించారు. జీవో 117, మరియు పాఠశాల లలో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో బోధన పై త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
TNUS -Telugu Nadu Upadhyaya Sangham- TNUS - TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-
#APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP
#TNUS
#MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu
NTA AP - Noble Teachers Association - Nobel Trachers Association

TNUS -Telugu Nadu Upadhyaya Sangham- TNUS - TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-
#APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP
#TNUS
#MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu
NTA AP - Noble Teachers Association - Nobel Trachers Association

YS Jagan: ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

YS Jagan: ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

YS Jagan: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు..

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించిన ఆయన.. వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. నుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.. రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌.. వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోందని.. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు.. మా కొడుకు ఏం తప్పుచేశాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్‌ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

ఇక, కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయి. దీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారు. ఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.. వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది అని మండిపడ్డారు వైఎస్‌ జగన్.. స్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు.. టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారు. తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి.. 15 సంవత్సరాలుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉంది.. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరన్నారు.. జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకు డిమండ్‌ చేయాలని సూచించారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్న ఆయన.. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరస తెలుపుతాం.. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారు.. బుధవారం నాడు నిరసన తెలుపుతాం అన్నారు వైఎస్‌ జగన్‌.

రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాం అన్నారు వైఎస్‌ జగన్.. ఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలి.. జరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా? ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు.. ప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలన్నారు. అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి.. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.. ప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి.. బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలని ఎంపీలకు సూచించారు.. పార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలి.. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.. ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు వైఎస్‌ జగన్.

వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఇదే చెపుతా – విజయసాయి రెడ్డి

గత వారం రోజులుగా మీడియా లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే.

విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలను శాంతి తో పాటు విజయసాయి ఇప్పటికే ఖండించినప్పటికీ..మదన్ మాత్రం విజయసాయి ని DNA టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరారు.

తాజాగా మరోసారి విజయసాయి ఈ ఇష్యూ ఫై స్పందించారు. తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెప్తానని ట్వీట్ చేశారు. ‘శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను’ అని పేర్కొన్నారు.

Chandrababu: అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్‌ దిల్లీ డ్రామాలు: చంద్రబాబు

అమరావతి: అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్‌ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. ఆయన పెంచిపోషించిన గంజాయి, డ్రగ్స్‌ సంస్కృతి వల్లే అనర్థాలు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైకాపా నేతలే ఒప్పుకొన్నారు. శాంతిభద్రతల అంశంలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలి. వైకాపా అబద్ధపు విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం. ఒకట్రెండు కార్పొరేషన్లకే జగన్‌ నిధులు మళ్లించారు. ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకొని పనిచేద్దామని ఎంపీలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

TG News: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

TG News: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. జులై 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ఈనెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీలు కొలిక్కి రాలేదు. దీతో బదిలీల ప్రక్రియను ఈనెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని రామకృష్ణరావు పేర్కొన్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద – తాాజా పరిస్థితి ఇదే…!

కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. 

 కృష్ణా ఉపనదులైన ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్రతో మరికొన్ని పాయలు సైతం పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.

ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. ఇవాళ ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు కాగా ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం ఉంది.

జురాల నుంచి నీటి విడుదలతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 57,171 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 811.50 అడుగులకు చేరింది.  వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డ్యామ్ వద్ద ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరింత వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది.

మరోవైపు సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.

 

ఇదుంటే హెల్మెట్ మీద వర్షం నీరు నిలవదు.. ధర 400 రూపాయలే!

బైక్ లేదా స్కూటీ మీద వెళ్తున్నప్పుడు వర్షం పడితే ఆ బాధ వర్ణనాతీతం. హెల్మెట్ గ్లాస్ తెరిస్తే బురద నీరు, వర్షం నీరు మొఖానికి కొడుతుంది. పోనీ గ్లాస్ క్లోజ్ చేసి డ్రైవ్ చేద్దామంటే రోడ్డు స్పష్టంగా కనబడదు. కారు వైపర్ లా చేత్తో అస్తమానూ హెల్మెట్ ని తుడుచుకుంటూ ఉండాలి. దీని వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది మీ దగ్గర ఉంటే వర్షం పడినా టెన్షన్ పడక్కర్లేదు. బండి మీద జాలీగా వెళ్ళచ్చు. కార్లకు అంటే వర్షం నీరు పడినా తుడవడానికి వైపర్స్ ఉంటాయి. బైకుల కోసం హెల్మెట్స్ కి కూడా వైపర్లు ఉన్నాయి కానీ అవి 6 వేలు పైనే ఉన్నాయి. అయితే 400 రూపాయలకే వర్షం నీటిని నిలవనివ్వని యాంటీ రెయిన్ ఫిల్మ్ ని మీరు సొంతం చేసుకోవచ్చు.

పృథ్వీజ్ యాంటీ రెయిన్, యాంటీ ఫాగ్ ఫిల్మ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాటర్ ప్రూఫ్, యాంటీ గ్లేర్, యాంటీ ఆయిల్, హై డెఫినిషన్, యాంటీ మిస్ట్, యాంటీ రిఫ్లెక్షన్, యాంటీ స్క్రాచ్, యాంటీ డస్ట్ మెటీరియల్ గా పని చేస్తుంది. ఒకే ఫిల్మ్ లో 8 బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని హెల్మెట్ కి అతికించుకుంటే వర్షం పడినా వర్షం నీరు హెల్మెట్ మీద నిలవదు. అలానే పొగమంచు, దుమ్ము వంటివి అంటుకోవు. హెల్మెట్ కి గీతలు పడవు. దీని వల్ల రోడ్డు స్పష్టంగా కనబడుతుంది. దీని అసలు ధర రూ. 1499 కాగా ఆఫర్ లో దీన్ని మీరు రూ. 699కే పొందవచ్చు. ఇలాంటి ఫిల్మ్స్ 2 వస్తాయి.

ఆటోబ్రాండ్ కంపెనీకి చెందిన హెల్మెట్ క్లియర్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ ఒకటి ఉంది. ఇది యూనివర్సల్ హెల్మెట్ ఫిల్మ్. ఎలాంటి హెల్మెట్స్ కైనా సెట్ అవుతుంది. ఫుల్ పేస్ హెల్మెట్స్ కి, హాఫ్ పేస్ హెల్మెట్స్ కి సెట్ అవుతుంది. వర్షం నీటిని నిలవనియ్యదు. వర్షాకాలంలో అలానే చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 1299 కాగా ఆఫర్ లో రూ. 499గా ఉంది.

నికవి మోటార్ సైకిల్ హెల్మెట్ విజర్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ ఒకటి ఉంది. ఇది కూడా హెల్మెట్ మీద పొగమంచుని గానీ వర్షపు నీటిని గానీ నిలవనీయదు. ఇది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలానే హెల్మెట్ మీద స్క్రాచెస్ పడవు. రోడ్డు స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఈజీగా హెల్మెట్ కి అతికించుకోవచ్చు. ఇది క్లీనింగ్ కిట్ తో పాటు వస్తుంది. ఆన్ లైన్లో దీని ధర రూ. 398 గా ఉంది.

యాంటీ రెయిన్ ఫిల్మ్ ని హెల్మెట్ కి అతికించడం ఎలా?:

  • ముందు హెల్మెట్ ని శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి అనేది ఉండకూడదు.
  • ఆ తర్వాత ఒక పొడి గుడ్డతో లేదా ఫిల్మ్ తో పాటు వచ్చిన వైప్ క్లాత్ తో తుడవాలి.
  • పొడిగా ఉన్న తర్వాత ఫిల్మ్ స్టిక్కర్ ని హెల్మెట్ కి కరెక్ట్ ప్లేస్ లో అతికించాలి.
  • ఎలాంటి ముడతలు లేకుండా బాగా అతికించుకోవాలి.

రెండు రోజుల్లోనే ఇంటిని నిర్మించేస్తుంది.. ఈ టెక్నాలజీకి మైండ్ బ్లాకే..

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. అంటే ఇల్లు కట్టడం అనేది పెద్ద పని. చేతిలో డబ్బులున్నా గానీ ఇల్లు కట్టాలంటే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఈలోపు అద్దె ఇళ్లలో ఉండాల్సిందే. దీని వల్ల ఎంత అద్దె వేస్ట్ అవుతుందో. పైగా కార్మికుల శ్రమతో కూడుకున్న పని. కార్మికుల కొరత ఉంటే ఇక అంతే సంగతులు. ఏడాది అనుకున్న సమయం కాస్తా రెండేళ్లకి పెరుగుతుంది. మరి ఇంత కాలం ఆగలేకనేమో ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీతో రెండే రెండు రోజుల్లో ఇల్లు పూర్తైపోతుంది. ఒకరోజులు ఇంటికి సంబందించిన గోడలను కట్టేసి.. ఆ తర్వాత మిగతా పనిని మరుసటి రోజులో పూర్తి చేస్తుంది. అంటే కేవలం రెండు రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భలే ఉంది. ఎక్కడ అమలు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?

ఎఫ్బీఆర్ అనే రోబోటిక్స్ కంపెనీ హ్యాడ్రియాన్ ఎక్స్ పేరుతో ఒక ట్రక్కును తయారు చేసింది. ఇది ఒక ఇంటిని రెండు రోజుల్లో నిర్మించగలుగుతుంది. గత ఏడాది అమెరికా స్టైల్లో గంటకు 500 ఇటుకలను పేర్చి ఇంటిని నిర్మించింది. దీన్ని అమెరికాలో అతి పెద్ద కాంక్రీట్ బ్లాక్ సప్లై కంపెనీల్లో ఒకటైన సీఆర్హెచ్పీఎల్సీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎఫ్బీఆర్, సీఆర్హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ కంపెనీలు సంయుక్తంగా ఆస్ట్రేలియా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి తీసుకొచ్చాయి. ఇది 105 అడుగుల ఎత్తు ఉంటుంది. టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన అతి పెద్ద రోబోటిక్ ట్రక్ ఇది. భారీ సంఖ్యలో ఇటుకలను ప్యాలెట్ లో పెట్టి ట్రక్ లో లోడ్ చేస్తే.. దాని కన్ స్ట్రక్షన్ ఆర్మ్ భవన నిర్మాణ పనిని మొదలుపెడుతుంది. ప్యాలెట్ లోంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది.

అక్కడ సిమెంట్ లాంటి క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఈ క్విక్ డ్రై మిశ్రమం ఒక్కో ఇటుకకు అంటుకుని ఉంటుంది. ఒక్కో ఇటుకను రోబో ఆర్మ్ వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రోబోటిక్ ఆర్మ్ పొడవు ఎక్కువగా ఉండడం వల్ల మూడు అంతస్తుల భవనాన్ని కూడా అలవోకగా నిర్మించగలదు. పైగా పనిలో గానీ, బిల్డింగ్ మెటీరియల్ విషయంలో గానీ వేస్ట్ అనేది జరగదు. దీన్ని 3డీ క్యాడ్ మోడల్ ద్వారా కంప్యూటర్ లో ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేస్తే.. అచ్చం దానిలానే ఈ రోబోటిక్ ట్రక్ నిర్మించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లో ఒక ఫెసిలిటీలో సైట్ యాక్సెప్టెన్స్ టెస్టులో భాగంగా బిల్డింగ్ ని నిర్మించాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే కనుక 5 నుంచి 10 అంతస్తుల భవనాలను నిర్మించేందుకు హ్యాడ్రియాన్ ఎక్స్ కి అనుమతి వస్తుంది.

ఈ రోబోలతో అమెరికాలో తొలిసారిగా ఇళ్లను నిర్మించేందుకు 300 హ్యాడ్రియాన్ ఎక్స్ రోబోలను తీసుకొచ్చారు. ఒక్కో హ్యాడ్రియాన్ ఎక్స్ రోబో విలువ 2 మిలియన్ డాలర్స్. అంటే మన కరెన్సీ ప్రకారం 16 కోట్ల 73 లక్షల 80 వేలు. దీన్ని బట్టి ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఈ టెక్నాలజీని భారత్ సహా ఇతర దేశాలకు కూడా వస్తుందా? లేదా? లేదంటే ఇంతకంటే తక్కువ ధరకు మనవాళ్ళు ఇళ్లను నిర్మించే టెక్నాలజీని తీసుకొస్తారా? అనేది చూడాలి.

 

10 నాణేలు తీసుకోని వారికి జైలు శిక్ష.. RBI కొత్త రూల్స్!

ఇటీవల భారత దేశంలో చిరు వ్యాపారులు పది రూపాయల నాణేలను తీసుకోవడానికి జంకుతున్నారు. ఎందుకంటే మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని పుకార్లు పుట్టుకు వచ్చాయి. దీంతో చాలా మంది వ్యాపారస్తులు 10 రూపాయ నాణేలను తీసుకోవడం లేదు. అలాగే వినియోగదారులు కూడా ఎవరైన పది కాయిన్ ఇస్తే తీసుకోవాడానికి జంకుతున్నారు. వాస్తవానికి పది రూపాయణ కాయిన్ పై వస్తున్న రూమర్లు నమ్మవొద్దని బ్యాంకులు చెబుతున్నాయి.కానీ జనాల్లో నాటుకుపోయిన అవిశ్వాసాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశ కరెన్సీకి 10 నాణెం చలామణిపై కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో పెరిగిపోతున్న నల్లధనం, నకిలీ కరెన్సీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. కొత్తగా రూ.500, రూ.2000 వేల నోట్లను చలామణిలోకి తీసుకువచ్చింది. నల్లధనం చెలామణిలో రెండు వేల రూపాల నోటుల దుర్వినియోగం అవుతుందని భావించి 2023లో ఆ నోటును రద్దు చేశారు. ప్రస్తుతం దేశంలో రూ.1,2,5,10,20 నాణేలు అమల్లో ఉన్నాయి.ఇటీవల నాణేల చలామణిపై కొన్ని రూమర్లు పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా రూ.10, 20 నాణేల వాడకం పై వినియోగదారులకు గందరగోళంలో పడ్డారు.వ్యాపారులు ఈ నాణేలను తీసుకోకపోవడంతో వాటి వాడకంపై ప్రజలకు కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది దుకాణ యజమానులు పెద్ద మొత్తంలో ఈ నాణేలను నిల్వ ఉంచారు.. అలాగే వినియోదారుల పరిస్థితి కూడా అలేగా ఉది. ఇదిలా ఉంటే.. రూ.10, రూ.20 నాణేలు చట్టబద్దమైనవి, అన్ని లావాదేవీల్లో ఇవి ఆమోదించబడతాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. వీటి చలామణిలో అభ్యంతరం చెప్పినా.. తీసుకోమని వ్యతిరేకించినా వారికి భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 124ఎ ప్రకారం, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆయా నాణేలను స్వీకరించడానికి నిరాకరించే వ్యాపారులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది.

ఆర్‌బీఐ తీసుకు వచ్చిన కొత్త రూల్స్ :
వ్యాపారస్తులు, వినియోగారులు లావాదేవీల్లో రూ.10, రూ.20 నాణేలను అంగీకరించారలి
ఈ నాణేలను స్వీకరించడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలకు దారి తీస్తుంది.
రూ.10, రూ.20 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
రూ.10, రూ.20 నాణేలను చెలామణి గురించి ఆర్‌బీఐ ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ కృషి చేస్తుంది.
ప్రజలు, వ్యాపారుల్లో రూ.10, రూ.20 నాణేలను చలామణిపై అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచారాలు నిర్వహించబడతాయి.

 

డైరెక్ట్ గా OTT లోకి మరో తెలుగు కామెడీ మూవీ.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు.

కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమాలు తగ్గిపోయాయని చెప్పి తీరాలి. అన్ని యాక్షన్, రొమాన్స్ , హర్రర్ లేదా వాచ్ ఎలోన్ మూవీస్ ఏ వస్తున్నాయి. చక్కాగా ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని చూసే సినిమాలంటే.. అవి కామెడీ మూవీస్ , ఎమోషనల్ డ్రామాస్ మాత్రమే. ఇక ఈ మధ్య ఓటీటీ లో కామెడీ మూవీస్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. గత కొన్ని వారాలుగా కనీసం వారానికి ఒక కామెడీ మూవీ అయినా రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “వీరాంజనేయులు విహార యాత్ర”. ఈ సినిమాకు సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీడకోలా ఫేమ్ రాగ్ మయూర్ , ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ‘మా బేబీ కనిపించడం లేదు.. మీకేమైనా కనిపించిందా’ అంటూ.. అలాగే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన నరేష్ ఏడుస్తూ పోస్ట్ చేసిన ఓ

 వీడియో.. ఇలా వెరైటీగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ స్ట్రీమింగ్ డేట్ ను సదరు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “అందరూ మెచ్చిన 90’s వెబ్ సిరీస్ తర్వాత మరో ఫ్యామిలీ డ్రామాకు సిద్ధంగా ఉండండి. తెలుగులో తొలి ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ అడ్వెంచర్ ఆగస్ట్ 14న ప్రారంభం అవుతుంది. కేవలం ఈటీవీ విన్ లోనే” అంటూ అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ కామెడీ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీ లో సందడి చేయనుంది.

కాగా ఈ సినిమాలో నరేష్ తో పాటు.. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కానీ.. ట్రైలర్ కానీ రిలీజ్ కాలేదు. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఎప్పుడు గొడవలు పడే ఓ ఫ్యామిలీ అంతా కలిసి.. పాత కాలం నాటి వ్యాన్ లో.. గోవా వెళ్లాలని అనుకుంటారు. ఈ క్రమంలో వెళ్లే దారిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి.. అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. సో ఒక రోడ్ ట్రిప్ తో నవ్వించడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ.. ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విశ్వంభర మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్

ఇప్పుడు ప్రేక్షకులంతా తారక్ , చరణ్ , బన్నీ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. చిరు సినిమా కోసం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసిన టైమ్ లో చిరు మూవీ కోసం చేస్తున్న వర్క్ అవుట్

 వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ లేదు అనుకునే సమయానికి క్రేజి అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. సాధారణంగా సెలెబ్రిటీల బర్త్ డే సంధర్బంగా .. వారి మూవీస్ కు సంబంధించిన ఎదో ఒక అప్ డేట్ ను రిలీజ్ చేస్తున్న సంగతు తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా… “విశ్వంభర” తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా త్రిష నటిస్తుంది. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో చిరు నుంచి ఎలాంటి ఫాంటసీ మూవీ రాలేదు. మరి ఈ మూవీ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి. ఈ మూవీలో త్రిష తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజి అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆగష్టు 22 న చిరంజీవి బర్త్ డే సంధర్బంగా.. విశ్వంభర మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. దీనితో చిరు ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అలాగే విశ్వంభర మూవీని.. 2025 జనవరి 10 న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెల్సిందే. మరి ఎంతవరకు అనుకున్న ప్రకారం అవుతుందో చూడాలి.

ఇక విశ్వంభర మూవీ విషయానికొస్తే… ఇప్పటికే ఈ మూవీ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఆగష్టు నెలాఖరుకు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డబ్బింగ్ , ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో పద్దెనిమిదేళ్ల తర్వాత త్రిష, చిరు జోడిగా నటిస్తున్నారు. మరి ఈసారి ఈ జంట ప్రేక్షకుల నుంచి ఎలాంటి మెప్పు పొందుతారో వేచి చూడాలి. చెప్పాలంటే ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగానే కొనసాగుతున్నాయని చెప్పి తీరాలి. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాపై కొనసాగుతున్న హైప్ ఎలా ఉంటుంది అనే దానికోసం వెయిట్ చేయాల్సిందే. మరి విశ్వంభర మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్.. లక్షా 20 వేల టీవీ 34 వేలకే! ఇంకా మరెన్నో తక్కువ ధరకే!

ప్రస్తుతం అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా హోమ్ అప్లయన్సెస్ మీద, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, మొబైల్ ఫోన్స్, వాటి యాక్ససరీస్ మీద, పలు రకాల ఉత్పత్తుల మీద డిస్కౌంట్ నడుస్తుంది. పలు రకాల స్మార్ట్ టీవీలపై కూడా డిస్కౌంట్ నడుస్తుంది. ఎల్జీ, శాంసంగ్, సోనీ, యాసర్, షావోమీ, సోనీ, ఐఫాల్కన్ బ్రాండ్స్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. మీరు కనుక టీవీ కొనాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం.

ఎల్జీ టీవీ:

ఎల్జీ 32 అంగుళాల హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ అసలు ధర రూ. 21,990 కాగా ఆఫర్ లో రూ. 13,490 పడుతుంది. ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రెగ్యులర్ ధర రూ. 13,999 పడుతుంది. ఏడాది పాటు వారంటీ ఇస్తున్నారు. ఎల్జీ టీవీ 10 వాట్ స్పీకర్లతో, 720 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది.

యాసర్ టీవీ:

యాసర్ 40 అంగుళాల ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 29,999 కాగా ఆఫర్లో రూ. 16,499 పడుతుంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రూ. 16,840 పడుతుంది. యాసర్ టీవీ 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 30 వాట్ డాల్బీ స్పీకర్లు ఇచ్చారు. ఇది 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇందులోనే 43 అంగుళాల టీవీ కూడా ఉంది. ఇది రూ. 20,999 పడుతుంది. మీకు నచ్చిన సైజ్ ని ఎంచుకోవచ్చు.

శాంసంగ్ టీవీ:

44,990 విలువైన శాంసంగ్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని ఆఫర్ లో రూ. 28,990కే సొంతం చేసుకోవచ్చు. 55 అంగుళాల సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 99,900 కాగా ఆఫర్ లో రూ. 54,990కే పొందవచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి అయితే రూ. 56,120 పడుతుంది. శాంసంగ్ 4కే స్మార్ట్ టీవీ 2జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇందులో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు ఇలా వివిధ సైజుల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా సైజుని బట్టి మారుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆఫర్ లో భాగంగా డిస్కౌంట్ నడుస్తుంది.

షావోమీ టీవీ:

44,999 విలువైన 50 అంగుళాల షావోమీ 4కే డాల్బీ విజన్ సిరీస్ స్మార్ట్ గూగుల్ టీవీ రూ. 32,999కే అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం రూ. 33,680 పడుతుంది.

సోనీ బ్రేవియా:

99 వేల రూపాయల విలువైన సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఆఫర్ లో రూ. 54,990కే అందుబాటులో ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్ కి రూ. 56,120 పడుతుంది.

ఐఫాల్కన్ టీవీ:

1,19,990 రూపాయల విలువ చేసే 55 అంగుళాల ఐఫాల్కన్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇప్పుడు రూ. 33,999కే అందుబాటులో ఉంది. ఇందులోనే 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 22,999, 50 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 31,999, 65 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 48,999 పడుతుంది.

తోషిబా టీవీ:

44,999 రూపాయల విలువ చేసే తోషిబా 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇప్పుడు ఆఫర్ లో రూ. 24,999కే అందుబాటులో ఉంది.

 

బెస్ట్ బడ్జెట్ వేడి నీళ్ల గీజర్స్.. ధర 3 వేలే.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు

వర్షాకాలం, చలికాలంలో స్నానం చేయాలంటే వణుకు పుడుతుంది. పొద్దున్న ఎలాగోలా మేనేజ్ చేసినా రాత్రి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత స్నానం చేయాలంటే గజగజ వణకాల్సిందే. అందులోనూ వర్షంలో తడిచి వస్తే ఇక అంతే సంగతులు. అదే ఇంట్లో ఒక వాటర్ గీజర్ ఉంటే వేడి నీటి స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. వాటర్ హీటర్ తక్కువ ధరకే దొరుకుతుంది కానీ దీని కోసం ఒక 20, 30 నిమిషాల పాటు బకెట్ లో నీళ్లు నింపి హీటర్ పెట్టి హీట్ ఎక్కేవరకూ వెయిట్ చేయాలి. పైగా బాత్రూం బయట గదిలో పెట్టాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే లేనిపోని టెన్షన్. అందుకే వాటర్ హీటర్ కంటే కాస్త ఎక్కువ ధరకే బడ్జెట్ లో వాటర్ గీజర్ వస్తున్నప్పుడు ఎందుకు ఇంకా వణుకుతూ చన్నీళ్ళ స్నానం చేయడం. మీ కోసం బెస్ట్ బడ్జెట్ వాటర్ గీజర్స్ ని తీసుకురావడం జరిగింది.

హావెల్స్ 3 లీటర్ గీజర్:

హావెల్స్ కంపెనీకి చెందిన 3 లీటర్ కెపాసిటీ కలిగిన ఇన్స్టంట్ వాటర్ గీజర్ ఇప్పుడు ఆఫర్ లో బడ్జెట్ ధరకే అందుబాటులో ఉంది. 3 వేల వాట్స్ తో వస్తున్న ఈ గీజర్ అసలు ధర రూ. 4,640 కాగా ఆఫర్ లో రూ. 2900కే అందుబాటులో ఉంది. ఇందులో స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంక్ ని ఇచ్చారు. రస్ట్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. ఆటోమేటిక్ కటాఫ్ టెక్నాలజీతో వస్తుంది.

హావెల్స్ 10 లీటర్ గీజర్:

హావెల్స్ మోంజా ఈసీ 10 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగిన వాటర్ హీటర్ అసలు ధర రూ. 12,890గా ఉంది. ఆఫర్ లో రూ. 6,464కే అందుబాటులో ఉంది. లోపల ట్యాంక్ మీద ఏడేళ్ల వారంటీ ఇస్తున్నారు. హీటింగ్ ఎలిమెంట్ మీద నాలుగేళ్ల వారంటీ, హీటర్ మీద రెండేళ్ల వారంటీ ఇస్తుంది.

క్రామ్టన్ అమిక వాటర్ హీటర్:

ఇది 15 లీటర్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. సుపీరియర్ గ్లాస్ లైన్ కోటెడ్ ట్యాంక్ ని ఇచ్చారు. 2 వేల వాట్ల హీటింగ్ ఎలిమెంట్ తో వస్తుంది. అడ్వాన్స్డ్ 3 లెవల్ సేఫ్టీతో వస్తుంది. దీని అసలు ధర రూ. 12 వేలు కాగా ఆఫర్ లో రూ. 6,899కే పొందవచ్చు. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద 1250 రూపాయల వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఆరా వాటర్ హీటర్:

ఇది 5.9 లీటర్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంక్ ని ఇస్తున్నారు. షాక్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. ట్యాంక్ పై ఐదేళ్ల వారంటీ ఇస్తున్నారు. దీని అసలు ధర రూ. 7,990 కాగా ఆఫర్ లో రూ. 3,099కే లభిస్తుంది.

పైన చెప్పిన వాటర్ హీటర్ లేదా వాటర్ గీజర్ ధరలకు సంబంధించి డిస్కౌంట్లు లిమిటెడ్ టైం మాత్రమే ఉంటాయి. అలానే నాన్ ప్రైమ్ మెంబర్స్ తో పోలిస్తే ప్రైమ్ మెంబర్స్ కి తక్కువ ధరకు లభిస్తున్నాయి. కొనేముందు స్టోరేజ్ కెపాసిటీ, బడ్జెట్, వారంటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొనుక్కోండి.

ముసురు పట్టిన ఈ రోజుల్లో బయట వాటర్ తాగుతున్నారా? డేంజర్ అని తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి ముసురు వాన కురుస్తోంది. దీంతో రోడ్లపై, ఎక్కడపడితే అక్కడ వాన నీరు కనిపిస్తుంది. ఇలా వర్షాలు పడుతున్నా కూడా మనం వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్తుతుంటాము. ఇదే సమయంలో దాహం వేసినప్పుడు చాలా మంది బయట నీళ్లు తాగుతుంటారు. అయితే ఇలా ఎడతెరపిలేకుండా వానాలు కురుస్తున్న సమయంలో ఎక్కడపడితే అక్కడ వాటర్ తాగితే చాలా డేంజర్ లో పడినట్లే. అలా తాగడం ఎంత డేజంరో తెలిస్తే… అసలు బయటి నీళ్లు ముట్టుకోరు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వానాలు కురుస్తున్న వేళ నీరు కలుష్యతం అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అప్పటికే కలుషితమైన వాటర్..పొరపాటున మనం తాగడానికి వినియోగించే నీటిలో కలిసిపోతుంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో వివిధ కుళాయల వద్ద కూడా వర్షపు నీరు కలుస్తాయి. అలానే పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేస్తే..వాటర్ ట్యాంకులు కూడా కలుష్యతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కొన్ని ప్రాంతాల్లో తాగే నీటి పరికరాలపై మూతలు లేకపోవడంతో వర్షం నీరు పడుతుంది.

ఈక్రమంలోనే దాహం అవుతుంది కదా అని ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగితే.. చాలా డేంజర్ లో పడుతారని వైద్యులు చెబుతున్నారు. శుభ్రత చూసుకోకుండా ఇలాంటి నీటిని తాగడం వల్ల దాహం తీరడం అటుంచితే..రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానతో కలిసిన వాటర్ తాగడం వల్ల అమీబియాసిస్ తో పాటు అతిసార, టైపాయిడ్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలానే అతిసారంతో నీళ్ల విరేచనాలు, వాంతులు ఎక్కువగా అవుతాయి. అలానే కలుషిత నీటని తాగడం వలన వివిధ రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ను మనకు తెలియకుండానే మన శరీరంలోకి వెళ్తాయి.

దీంతో పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నోటీకి, జీర్ణాశయంకి సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలానే కొన్ని రకాల డేజంరస్ వైరస్ లు కలుషిత నీటిలో చేరడం, అలాంటి వాటర్ ను తాగితే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా వర్షాకాలం నీటిని గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిదని చెబుతున్నారు. అలా చేయడం వలన ఏమైన బ్యాక్టీరియాలు ఉంటే చనిపోయే అవకాశం ఉంది. ఇలానే ఇంట్లో మంచినీళ్లు పట్టుకునే సమయంలో వడకట్టుకోవడం ఉత్తమం. అలా చేయడం వలన వివిధ రకాల మళినాలను శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి. మొత్తంగా వర్షకాలంలో బయట నీళ్లు తాగకపోవడం మంచిదని, మనమే సొంతంగా వాటర్ ను క్యారీ చేయడం ఉత్తమమని నిపుణులు చూస్తున్నారు.

 

ఇంటి మేడపై చేపలు పెంపకం! లక్షలు కురిపిస్తున్న కొత్త వ్యాపారం!

ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా వ్యాపారం చేయాలని రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలైతే తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో తపన పడుతుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో విధంగా బిజినెస్ ఐడియాల గురించి వెతుక్కుంటారు. కానీ, ఎలాంటి బిజినెస్ ను ప్రారంభించాలనుకున్న అది కాస్త బడ్జెట్‌ తో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఎక్కువ పెట్టుబడితే వ్యాపారం చేసే స్థోమత అందరికి ఉండకపోవచ్చు. అందుకోసమే రిస్క్, లాస్ లేని బిజినెస్ లను మొదలుపెట్టాలని ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది మహిళలు కూరగాయలు, పూలు పండ్లు వంటివి పండిస్తూ.. వాటిని విక్రయించి లాభాలను ఆర్జిస్తుంటారు.

పైగా వీటి కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తుంటుంది. ఇప్పటికే ఇంటి దగ్గరే ఉండి ఇలా పండ్లు, కూరగాయలు, పూలు పండించుకుంటూ లాభాలను ఆర్జించే మహిళలను చూసే ఉంటాం. కానీ, ఎక్కడైనా ఇంటి మిద్దెలపై చేపల పెంపకం చేసి బిజినెస్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా ? వినగానే ఇలా కూడా చేస్తారా అనే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, నిజంగానే కొంతమంది మహిళలు ఇంటి మిద్దే మీదే చేపలు పెంపకం చేసి రూ.2.50 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

తెలంగాణ రాష్ట్రంలోని భూంపల్లికి చెందిన కొంతమంది మహిళలు ఇంటి మిద్దెలపై చేపలు పెంచుతూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇంటి మిద్దెలతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపడుతున్నారు. పైగా వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారం కూడా అందిస్తోంది. అయితే ఈ చేపల పెంపకం కోసం మహిళలు వారం రోజులు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. ఇక ఇందులో లాభం ఉంటుదని తెలిసే ఈ చేపల బిజినెస్ ను ప్రారంభమించమని ఆ మహిళలు తెలిపారు. ఇక ఈ చేపల పెంచే యూనిట్ ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కామరెడ్డి డీఆర్‌డీవో సాయన్న మాట్లాడుతూ.. ఇంటి మిద్దెలపై తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేందుకు ఈ చేపల పెంపకం యూనిట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

పైగా ఈ స్కీం ద్వారా ఇంటి మిద్దెలపై సుమారు వెయ్యి చేపలు పెంచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ పెంచిన కొర్రమీను చేపలు ఒక్కొటి కేజీ వరకు బరువు తూగుతుందని తెలిపారు. ఇకపోతే ఈ చేపలు మార్కెట్ లో కేజీ రూ. 350 పలుకుతుందని, దీని వల్ల రూ. 3.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇకపోతే ఇక్కడ పెంచిన చేపలు ఒక కేజీ పెరిగే వరకు కేజీన్నర ఫీడ్ తింటుదని వెల్లడించారు. కనుక చేపలు పెంచే మహిళలకు ఈ ఫీడ్ ఖర్చ రూ. లక్ష తీసియగా.. రూ. 2.50 లక్షల ఆదాయం మిగులుతుందని పేర్కొన్నారు. మరి, ఇంటి మిద్దేల పై చేపల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తున్న మహిళ కొత్త బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Sri Reddy : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి పై కేసు

Sri Reddy : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి పై కేసు

Case filed on Sri Reddy: చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రీరెడ్డి మీద కేసు నమోదయింది. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ కి వీరాభిమానిగా తనను తాను చెప్పుకునే శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దూషించిన కారణంగా ఆమె మీద కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రులు నారా లోకేష్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కొన్ని వీడియోలను సమర్పించడంతో ఆమె మీద కేసు నమోదు చేశారు. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఎత్తున టాలీవుడ్ లో కలకలం రేపిన శ్రీరెడ్డి తర్వాత తన మకాం చెన్నై మార్చిన సంగతి తెలిసిందే.

అయితే వైసీపీ మద్దతు రాలిగా ఉంటూ వస్తున్న ఆమె ఆ పార్టీకి మద్దతుగా పలు వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తోంది. అయితే ఆ వీడియోలలో టిడిపి నేతలను అసభ్యకరంగా దూషించడంతో రాజు యాదవ్ ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం నేతలను మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోందని ఈ సందర్భంగా రాజు యాదవ్ పేర్కొన్నారు. ఇలా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదని, కేవలం విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని ఆయన అన్నారు. ఆమెను ఆదర్శంగా చేసుకుని మిగతా వాళ్ళు కూడా తమ భాషను అసభ్యకరంగా మార్చుకోక ముందే ఇలాంటివారిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

Health

సినిమా