Sunday, November 17, 2024

రోజుకో గంట చదివితే… రూ.34లక్షల జీతం!

‘ నెల తిరిగేసరికి ఇంటి అద్దె కట్టడానికి నాన్న పడుతున్న కష్టాన్నీ’… ‘ఇద్దరమ్మాయిలే.. ఎలా నెట్టుకొస్తామో ఈ జీవితాన్ని’.. అని అమ్మ పడుతున్న ఆవేదనను కళ్లారా చూసింది.

‘ నెల తిరిగేసరికి ఇంటి అద్దె కట్టడానికి నాన్న పడుతున్న కష్టాన్నీ’… ‘ఇద్దరమ్మాయిలే.. ఎలా నెట్టుకొస్తామో ఈ జీవితాన్ని’.. అని అమ్మ పడుతున్న ఆవేదనను కళ్లారా చూసింది. కోచింగ్‌ ఊసే లేకుండా… నాలుగేళ్లపాటు రోజుకో గంట సాధన చేసి కోడింగ్‌పై పట్టు పెంచుకుంది. పే-పాల్‌ కంపెనీలో రూ.34లక్షలకుపైగా వార్షిక వేతనానికి ఎంపికయింది. కన్నవాళ్ల కలల్నీ, ఇబ్బందుల్నీ తీర్చాలనుకుంటోంది. ఆమే హుజూరాబాద్‌కి చెందిన యాల్ల కృష్ణవేణి.

పేదింటి ఆడబిడ్డని… అమ్మానాన్నల కష్టాలు చూస్తూ పెరిగా. ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి ఎలాగైనా మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకోవాలన్నది నా లక్ష్యం. దాన్ని సాధించగలిగా. అయితే, ఈ విజయం అంత సులువుగా మాత్రం రాలేదు. మాది హనుమకొండ జిల్లా పెంచికల్‌పేట. నాకు ఊహ తెలిసేనాటికే అమ్మానాన్నలు ఉపాధి కోసం హుజూరాబాద్‌కు వచ్చేశారు. నాన్న సదిరెడ్డి ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఉద్యోగి. అమ్మ అంజలి గృహిణి. చెల్లె హరిప్రియ మెడిసిన్‌ చదువుతోంది. అమ్మానాన్నలు మాకోసం ఎంతో కష్టపడుతున్నారని చిన్నప్పుడే అర్థమైంది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే చదువు తప్ప మరో దారి లేదని భావించా. అందుకే, ఏ తరగతైనా నేనే ఫస్ట్‌. బీటెక్‌ హనుమకొండ సమీపంలోని ఎస్సార్‌ కళాశాలలో సీఎస్‌ఈలో చేరాను.

ఆ భయం వెంటాడటంతో…
ఓ పక్క ఇంజినీరింగ్‌ పూర్తయినా ఉద్యోగాలు దొరక్క ఇబ్బందిపడుతోన్న సీనియర్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తే, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేని నాన్న స్థితి కలవరపెట్టింది. దీంతో అందరికంటే భిన్నంగా చదివితేగానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేనని అర్థమైంది. అందుకే, చదువుతో పాటు ఇతర నైపుణ్యాలపైనా పట్టు తెచ్చుకోవాలనుకున్నా. ఇందుకోసం రోజూ ఒక గంటపాటు కోడింగ్‌పై పట్టు పెంచుకోవడం ఆరంభించా. మధ్యమధ్యలో సినిమాలు, రీల్స్‌.. వంటి వాటి గురించి స్నేహితులు చెప్పినా… నాకు మాత్రం నా లక్ష్యమే గుర్తొచ్చేది. అవి చూస్తే కాసేపు ఆనందంగా అనిపించొచ్చు కానీ, నేను ఎంచుకున్న పంథాలో విజేతగా నిలిస్తే ఎప్పటికీ సంతోషమే నా వెంట ఉంటుందని నాకు నేను సర్దిచెప్పుకొనేదాన్ని.

ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా..
ఇలా బీటెక్‌ మొదటి ఏడాది నుంచి ఫైనల్‌ ఇయర్‌ వరకు రోజూ కచ్చితంగా ఫోన్, ల్యాప్‌టాప్‌లను కేవలం కోడింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యాల్ని నేర్చుకునేందుకే వాడా. తాజాగా వచ్చిన చాట్‌జీపీటీలో ప్రతిభ చూపించి మూడునెలల పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకున్నా. తరవాత జరిగిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో పే-పాల్‌ కంపెనీలో రూ.34.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా. అంటే నెలకు సగటున 2.86లక్షల జీతాన్ని అందుకోబోతున్నా. నాన్న ఇప్పటికీ రూ.15 వేల కోసం పడుతున్న కష్టం చూసి.. నా శ్రమ ఫలించిందనే సంతోషం ఇప్పుడు మనస్ఫూర్తిగా కలుగుతుంది. ఎవరికైనా నేనొకటే చెబుతా… ఎంత కష్టమైనా ఇష్టమైన దాని కోసం కష్టపడితే కచ్చితంగా విజయం సాధించగలమనడానికి నేనే ఓ ఉదాహరణ.

తుమ్మల శ్రీనివాస్, కరీంనగర్‌

TG News: తెలంగాణలో పాఠశాలల వేళల్లో మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 4.45కి బదులుగా 4.15 గంటలకు పని వేళలు ముగుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులోఉ న్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల నుంచి 20 వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని తీసుకుంటామని ప్రకటించింది. ఫ్రెషర్స్ కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ని నిర్వహించనున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్ లో మొత్తం 3,15,332 మంది ఉద్యోగులు ఉండగా.. తాజాగా ఈ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2 వేల మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లడంతో జూన్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 3,15,332కి చేరింది. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ సంఖ్య బాగా తగ్గింది. ఈ ఏడాది ఏకంగా 20,962 మంది ఉద్యోగులు తగ్గారు.

ఈ క్రమంలో కొత్తగా వచ్చే గ్రాడ్యుయేట్స్ ని 15 వేల మంది నుంచి 20 వేల మంది వరకూ తీసుకునేందుకు చూస్తున్నామని కంపెనీ తెలిపింది. తాము చూసే ఎదుగుదలను బట్టి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటామని వెల్లడించింది. 85 శాతం ఉద్యోగులు ఉన్నారని.. ఇంకా మిగిలి ఉన్న ఖాళీలను ఫిల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. మేము వృద్ధిని చూడడం ప్రారంభించినప్పుడు నియామకాలను పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా అన్నారు. గత కొన్ని త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ చురుకైన నియామకానికి చేరిందని అన్నారు.

ఫ్రెషర్స్ ని తీసుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించిన తాజా ప్రకటనతో.. ఇటీవల చదువు పూర్తి చేసిన ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ కి, అలానే చదువు పూర్తై ఐటీ ఉద్యోగాలు దొరక్క ఆశగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక భరోసా వచ్చింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025 ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్స్ ని నియమించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో 11 వేల మంది ట్రైనీలను తీసుకున్నారు. అయితే ఈ మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కంపెనీలో 1908 మంది ఉద్యోగులు తగ్గారు. దీనికి విరుద్ధంగా టీసీఎస్ కంపెనీ మాత్రం నికర మొత్తంలో 5,452 మంది ఉద్యోగులను నియమించుకుంది. మార్చి పీరియడ్ తో పోలిస్తే టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 1759 కి పడిపోయింది. హెచ్సీఎల్ కూడా మొదటి త్రైమాసికంలో 8080 ఉద్యోగుల తగ్గుదలతో క్షీణతను చూసింది. దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల క్షీణతను చూస్తున్న క్రమంలో ఇన్ఫోసిస్ కంపెనీ 15 వేల నుంచి 20 వేల ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధపడుతుంది.

 

ఈ వారం OTTలో థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే 5 హాలీవుడ్ మూవీస్ ఇవే.. ఎక్కడంటే?

సినీ ప్రేక్షకులకు హారర్ జోన్ కు సంబంధించిన సినిమాలంటే.. ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెబుతారు. ముఖ్యంగా అది ఏ భాషాల్లో అయిన సరే కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు.. భయపడుతూ మరి చూసేస్తారు. అందుకే ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఆదరణ అనేది ఓ రేంజ్ లో ఉంటుంది. పైగా ఇలాంటి సినిమాలను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఈ హారర్ సినిమాల్లో వచ్చిన కొన్ని కొన్ని సీన్స్ చూస్తే గుండేల్లో వణఉకు పుడతుందనే చెప్పవచ్చు. అంతాలా థ్రిల్లింగ్ గా ఉండటమే కాకుండా.. మంచి ఎంటర్టైరన్మెంట్ పొందుతుంటారు.

ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి, ఓటీటీలోకి ఎన్నో రకాల హారర్ సినిమాలు అలరిస్తున్నాయి. అయితే వీటిలో చిన్న సినిమాలుగా తెరకెక్కినవి కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సినిమాలు గా నిలుస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఈ తరహా హారర్ సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి మనకి తెలిసినవి చాలానే ఉన్నాయి. కానీ, ఇంక మనకి తెలియకపోయినవి, చూడకపోయిన సినిమాలు చాలనే మిగిలి ఉంటాయి. అందుకే ఈ వరం హాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన పలు హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇంతకి ఆ థ్రిల్లింగ్ కాన్సెఫ్ట్ లతో రూపొందిన సినిమాలేవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నయో ఆ వివరాలను తెలుసుకుందాం.

ది వాచ‌ర్స్: అమెజాన్ ప్రైమ్‌, బుక్ మై షో

ది వాచ‌ర్స్.. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ  అనేది 2024లో విడుదలైంది. కాగా, ఈ భయంకరమైన చిత్రాన్ని ఇషానా నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో ఓ యువతి అడవిలో ఎలా బందిగా మారిది? ప్రాణాల‌ను కాపాడుకోవ‌డం కోసం వింత జీవుల‌తో ఎలాంటి పోరాటం చేసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అయితే మూవీ ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షోలో శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ది బోటు:

ది బోటు.. ఇది ఒక మాల్టీస్ బ్రిటీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం. కాగా, దీనిని 2018లో విన్‌స్టన్ అజోపార్డి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ఇక ఇందులో జో అజోపార్డి మాత్రమే నటీనటులు. అయితే ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీలో బోట్‌లో టూర్‌కు వెళ్లిన ఓ జంట ఎలా ప్ర‌మాదంలో ప‌డ్డార‌నే పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కించారు. కాగా, ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది.

ది డీప్ డార్క్:  బుక్ మై షో

ది ది డీప్ డార్క్.. ఇది ఒక ఫ్రెంచ్ మూవీ. దీనిని ఫిబ్రవరి 16,2018లో విడుదల చేశారు. అయితే ఈ మూవీలో  ఓ ప‌రిశోధ‌న నిమిత్తం చాలా ఏళ్లుగా మూత‌ప‌డిన గ‌నిలోకి వెళ్లిన కొంద‌రు సైంటిస్ట్‌ల‌కు అక్క‌డ ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న‌ది హార‌ర్ అంశాల‌తో భ‌య‌పెట్టేలా ద‌ర్శ‌కుడు ఈ మూవీలో చూపించాడు. ఇకపోతే ఈ మూవీ బుక్ మై షోలో స్ట్రీమింగ్ యాప్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది.

గుడ్‌బై:

గుడ్ బై మూవీ.. ఇది ఒక సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన చిత్రం. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు ఊహించని  ట్విస్టులతో అలరిసిస్తుంది. కాగా, ఇందులో మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే కిల్ల‌ర్ కార‌ణంగా ఓ ప్రేమ జంట ఎలా ప్ర‌మాదంలో ప‌డింద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ బుక్ బై షో స్ట్రీమింగ్ యాప్ ద్వారా ఇటీవ‌లే విడుద‌లైంది.

ఆర్కాడియ‌న్ ల‌య‌న్స్: గేట్ ప్లే

ఆర్కాడియ‌న్ ల‌య‌న్స్ గేట్ ప్లే.. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో నికోల‌స్ కేజ్ హీరోగా నటించాడు. అయితే ఇందులో కొన్ని అదృశ్య శ‌క్తుల‌తో తండ్రి, అత‌డి కొడుకులు సాగించిన యుద్ధం నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కింది.  కాగా, ఈ మూవీ గేట్ ప్లే ఓటీటీ రిలీజ్ కానుంది.

గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఈ మార్గంలో దూసుకుపోనున్న వందే భారత్ స్లీపర్ రైలు

భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు గొప్ప వార్త అందించింది. స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో నాగ్‌పూర్ -మరియు పూణే మధ్య నడపనున్నారు. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వేలోని నాగ్‌పూర్ డివిజన్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, సికింద్రాబాద్ లైన్‌కు నాన్ స్లీపర్ వందే భారత్ రైలు ప్రతిపాదన కూడా వచ్చింది. ఇప్పటికే నాగ్‌పూర్-పూణే మార్గంలో గరీబ్ రథ్, అజ్నీ-పూణే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్-పూణె ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెరుగుతున్న ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్లీపర్ వందే భారత్‌ను అమలు చేసే ప్రణాళిక ఉంది.

నాగ్‌పూర్-పూణే మార్గంలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉండటం తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మనం వందే భారత్ గురించి మాట్లాడినట్లయితే, ప్రస్తుతం ఈ రైలు నాగ్‌పూర్-బిలాస్‌పూర్, నాగ్‌పూర్-ఇండోర్ మార్గాల్లో నడుస్తుంది. అయితే వాటిలో కేవలం చైర్ కార్ కోచ్‌లు మాత్రమే ఏర్పాటు చేశారు. స్లీపర్ బెర్త్‌ల కోసం ఎటువంటి నిబంధన లేదు. భారతీయ రైల్వే ప్రస్తుతం స్లీపర్ వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రైల్వే తన విమానాలను ఆధునికీకరించడానికి సహాయపడుతుంది.

ముంబైలో భారీ వర్షం, రైల్వే ట్రాఫిక్‌పై ప్రభావం

మరోవైపు ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రైలు, బస్సు సర్వీసులు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వర్షం కారణంగా కొన్ని రోడ్లు, రైల్వే ట్రాక్‌లు జలమయం కావడంతో రవాణా సేవల వేగం మందగించింది. సబర్బన్ రైలు సర్వీసులు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు తెలిపారు. భారీ వర్షాలు, సముద్రంలో అలలు ఎగసిపడటంతో హార్బర్ లైన్‌లోని చునా భట్టి వద్ద రైలు పట్టాలపై నీరు చేరిందని రైల్వే అధికారి తెలిపారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది.

చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..? నిబంధనలు తెలిస్తే షాకవుతారు

భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. ఏ పనికైనా ఆధార్ కార్డు ఆధారమైందని చెబితే అతిశయోక్తి కాదేమో. ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాలన్నా, హోటల్‌లో చెక్ ఇన్ చేయాలన్నా, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీకి గుర్తింపు ప్రూఫ్ చూపించాలన్నా ఇలా అన్ని చోట్లా ఉపయోగపడుతుంది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది. ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఆధార్ మోసగాళ్ల చేతిలో పడితే అది దుర్వినియోగం కావచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితిని నివారించడానికి, ఆధార్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డును ఏం చేయాలో? ఎప్పుడైనా ఆలోచించారా? మరణించిన వారి ఆధార్ కార్డును సరెండర్ చేయాలా? లేదా డీయాక్టివేట్ చేయాలా? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ చేస్తారు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా మూసివేయడం గురించి ఇంకా ఎటువంటి నియమాలు రూపొందించలేదు. అంటే కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత, మీరు అతని ఆధార్ కార్డును సరెండర్ చేయలేరు లేదా రద్దు చేయలేరు. అయితే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి యూఐడీఏఐ అందించే ఆధార్ లాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మీకు కావాల్సిన వారి ఆధార్ సురక్షితంగా ఉంచడమే కాకుండా దానిని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. ఆధార్ కార్డును దానిని ఉపయోగించడం కష్టం అవుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అతని/ఆమె ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు.

 

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో లోపం.. ఇండిగోకు భారీ దెబ్బ.. ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో ఏర్పడిన లోపం ప్రభావం ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా కనిపించింది. విమానయాన సంస్థలపై అత్యధిక ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానయాన సంస్థల షేర్లలో క్షీణత నెలకొంది. ఇక భారతదేశం గురించి మాట్లాడినట్లయితే, దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో పెద్ద క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీకి దాదాపు రూ.5300 కోట్ల నష్టం వాటిల్లింది.

వారాంతాల్లో కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఇండిగో స్పష్టం చేసింది. తర్వాత విమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కానీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తనిఖీ చేయాలని కంపెనీ ప్రయాణికులను కోరింది. ప్రయాణీకుల ఫ్లైట్ రద్దు చేయబడితే, అతను ప్రత్యామ్నాయ విమానం లేదా పూర్తి రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే నిన్న అర్థరాత్రి దాని X హ్యాండిల్‌పై సమాచారం ఇస్తున్నప్పుడు, సమస్యలకు కారణమైన గ్లోబల్ అవుట్‌టేజ్ దాదాపుగా పరిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు విమానయాన సంస్థ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి. వారాంతంలో కూడా కస్టమర్‌లు ఇంకా ఆలస్యం, షెడ్యూల్ అంతరాయాలను ఎదుర్కోవచ్చని కంపెనీ సూచించింది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే ముందు తమ ఫ్లైట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవాలని కస్టమర్లందరినీ కంపెనీ అభ్యర్థించింది. తద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది.

కంపెనీ షేర్లలో క్షీణత

బిఎస్‌ఇ డేటా ప్రకారం, శుక్రవారం ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. అలాగే కంపెనీ షేర్లు రూ. 137.25 నష్టంతో రూ.4,278.95 వద్ద ముగిశాయి. అయితే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు కూడా రోజు దిగువ స్థాయి రూ.4,251కి చేరాయి. అయితే కంపెనీ షేర్లు రూ.4,415 వద్ద ప్రారంభమయ్యాయి. జూన్ 10న కనిపించిన కంపెనీ 52 వారాల గరిష్టం రూ.4,610.

రూ.5300 కోట్లు కంపెనీ మార్కెట్ క్యాప్ ను తుడిచిపెట్టేసింది:

షేర్ల పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,70,539.48 కోట్లుగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఇది రూ.1,65,239.33 కోట్లకు చేరుకుంది. అంటే శుక్రవారం కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.5,300.15 కోట్ల నష్టం వచ్చింది.

ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా..? చెడిపోయిందని తెలుసుకోవడం ఎలా..

ప్పు .. భూమిమీద ఉన్న జీవుల మనుగడకు కావలసిన ముఖ్య లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది.

ఆహారంలో ఇది చాలా ప్రధానమైనది. దీనిని సముద్రపునీటిని ఇంకించి తయారు చేస్తారు. వాస్తవానికి వంట ఏమీ లేకుండా చేయవచ్చు.. కానీ ఉప్పు లేకుండా తయారు చేయడం అసాధ్యం.. ఉప్పు తప్పనిసరి. ఉప్పు వేయకుండా ఎన్ని మసాలాలు వేసినా రుచి రాదు.. దీంతోపాటు.. ఉప్పు శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.. ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు..

అయితే.. ఉప్పుడు చెడిపోతుందా..? ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా..? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఎల్లప్పుడూ కలుగుతుంటాయి. అయితే.. ఉప్పు చెడిపోవడం గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఏం లేదు.. దీనికి గడువు అంటూ ఉండదు కానీ.. కొన్ని సందర్భాల్లో ఉప్పు కలుషితమైందని అర్థం చేసుకోవాలి..

ఉప్పు చెడిపోయిందో లేదో తెలుసుకోవడం ఎలా?

సాధారణంగా ఉప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.. కానీ ఎంతసేపు నిల్వ ఉంచినా అది ఎలా చెడిపోతుందనేది చాలా మందికి తెలియదు. దాన్ని ఎలా గుర్తించాలంటే.. ఆహార భద్రత పరంగా.. టేబుల్ ఉప్పు, తెరవని ప్యాకేజీలను నిరవధికంగా నిల్వ చేయవచ్చు. అయితే తెరిచిన ప్యాకేజీలను రెండు నుండి మూడు సంవత్సరాల తర్వాత పడేయడం బెటర్..

ఇంకా ఉప్పులో మచ్చలు కనిపించినా.. రంగు మారినా ఉప్పు కలుషితమైందని అర్థం. తాజా ఉప్పు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లగా ఉంటుంది. అలాగే ఉప్పులో ఎలాంటి వాసన ఉండకూడదు. ఉప్పు తడిగా ఉంటే అది తక్కువ గ్రేడ్ ఉప్పు.. ఉప్పు పొడిగా ఉంటే అది ముద్దలు లేకుండా ఉంటే అది స్వచ్ఛమైన ఉప్పుగా పరిగణిస్తారు.

వాస్తవానికి చెడిపోవడానికి, ఆహార విషానికి దారితీసే సూక్ష్మజీవులు పెరగడానికి నీరు అవసరం. కానీ స్వచ్ఛమైన ఉప్పులో నీరు ఉండదు, అంటే అది ఎప్పుడూ చెడ్డది కాదు. కానీ ఉప్పు గడువు ముగియకపోవడానికి మరొక కారణం ఉంది .. ఇది చాలా సూక్ష్మజీవులకు విషపూరితమైనది.

ఉప్పుకు గడువు ఉండదు అనేది ఇందుకోసమే.. అయితే.. స్వచ్ఛమైన ఉప్పు ఐదు సంవత్సరాల వరకు గరిష్ట స్థితిలో ఉంటుందని.. పేర్కొంటున్నారు. ఎందుకంటే.. సహజ లవణం.. సరస్సు, సముద్ర బాష్పీభవనం ద్వారా మిగిలిపోయిన ట్రేస్ ఖనిజాల నుంచి సేకరించిన ముతక రకం.. ఇది శాశ్వతంగా ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్నీ పోషకాలు సమానంగా ఉండాలి. ఉప్పులో మంచి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అతిగా తీసుకుంటే ప్రమాదం కూడానూ.. అందుకే.. కావాల్సినంత తీసుకోవడం చాలా ముఖ్యం..

దక్షిణ భారత్‌లోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..

క్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రోడ్-కమ్-రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభమైంది. బెంగళూరులోని రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో ట్రయల్‌ ఆపరేషన్‌ కోసం డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ జూలై 17న ప్రారంభించారు.

రూ.449 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ రాగిగుడ్డ నుండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సిఎస్‌బి) జంక్షన్ (సిల్క్ బోర్డ్ జంక్షన్)కి కలుపుతుంది.

ఈ డబుల్ డెక్కర్-ఫ్లైఓవర్ ఎగువ డెక్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ఉంటే. దిగువ డెక్‌లో వాహనాల రాకపోకలకు ఎలివేటెడ్ రోడ్డు ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఎలివేటెడ్ రోడ్డుపై మెట్రో లైన్ ఉన్న మొదటి ఫ్లైఓవర్ ఇది.

ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పై రాకపోకలు సాగనున్నాయి. అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మారేనహళ్లి రోడ్డులో 31 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్‌ను నిర్మించగా, రెండో దశలో ఆర్‌వి రోడ్డు-బొమ్మసంద్ర మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేశారు.

ఫ్లైఓవర్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డు జంక్షన్ వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఉద్యోగులు ట్రాఫిక్ జామ్ నుండి ఉపశమనం పొందుతారు. 3.3 కి.మీ వరకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఉంటుంది. అందుకే మీరు ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత, 3.3 కి.మీ వరకు ఎక్కడా దిగడానికి అనుమతి లేదు.

రెండు వైపులా యు-టర్న్‌లు చేయడానికి అనుమతి ఉంది. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు పేరుగాంచిన CSB జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్ సహాయపడుతుంది.

ఫ్లైఓవర్ లూప్‌లు, ర్యాంప్‌ల నిర్మాణం M/s ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడింది. రాగిగుడ్డ నుండి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహన వినియోగదారులు సి ర్యాంప్ మీదుగా ఎ ర్యాంప్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ మీదుగా హోసూర్ రోడ్‌కు చేరుకుంటారు.

బీటీఎం వైపు నుండి ఔటర్ రింగ్ రోడ్డు, హోసూర్ రోడ్‌లను యాక్సెస్ చేయడానికి గ్రౌండ్ లెవెల్‌లో B రాంప్ A రాంప్‌కి కలుపుతుంది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ నుండి వచ్చే వారు ర్యాంప్ ఎ, ర్యాంప్ డి మీదుగా రాగిగుడ్డ వైపు ఎల్లో లైన్ మెట్రో లైన్ మీదుగా చేరుకుని, డౌన్ ర్యాంప్ ఇతో కొనసాగి బిటిఎమ్ లేఅవుట్‌లోకి ప్రవేశించవచ్చు.

అమ్మకానికి గుజరాత్ టైటాన్స్.. కన్నేసిన అదానీ గ్రూప్.. డీల్ ఎన్ని కోట్లంటే?

Gujarat Titans Stake Sale: మూడేళ్ల క్రితం, ఐపీఎల్‌లో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఆఫర్ చేసింది. ఇందుకోసం అదానీ గ్రూప్ 5,100 కోట్లు బిడ్డింగ్ చేసింది.
కానీ, సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ రూ.5625 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగలిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్‌కు చెందిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌లో మూడు సీజన్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మెజారిటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించగా, అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను కలిగి ఉంది. అలాగే గతంలో ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తామని ఆఫర్ చేసినా.. బిడ్డింగ్ లో మాత్రం విఫలమైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు తన షేర్లను విక్రయిస్తున్నందున అదానీ గ్రూప్ ఐపీఎల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

2021లో, CVC క్యాపిటల్ పార్టనర్స్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత జట్టు యాజమాన్యంలో మెజారిటీని అమ్మేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

దీని ప్రకారం, మూడేళ్ల గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ దాదాపు 1.5 బిలియన్లుగా చెప్పవచ్చు. దీంతో గుజరాత్ టైటాన్స్ షేర్లను ఎవరు కొనుగోలు చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే కొత్త జట్లకు వాటాను విక్రయించడానికి ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే సమయం ఉంది. దీనికి ముందు, అదానీ గ్రూప్, టోరెంట్ గ్రూప్ డీల్ క్లోజ్ చేయడానికి CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్‌తో చర్చలు జరిపాయి.

అదానీ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే, జట్టు పేరు మారే అవకాశం ఉంది. ఎందుకంటే అదానీ గ్రూప్ మహిళల ప్రీమియర్ లీగ్, లెజెండ్స్ క్రికెట్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లలో గుజరాత్ జెయింట్స్ పేరుతో జట్లను కలిగి ఉంది. కాబట్టి గుజరాత్ టైటాన్స్ అదానీగా మారితే ఆ జట్టు పేరు గుజరాత్ జెయింట్స్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కలవర పెడుతున్న కోవిడ్ KP.3 కొత్త వేరియంట్.. భారత్‌కు వ్యాపించేనా..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

కోవిడ్ KP.3 కొత్త వేరియంట్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. గత కొన్ని వారాలుగా ఈ వేరియంట్‌తో సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

జపాన్‌లో ఈ వేరియంట్‌ వేగంగా సంక్రమణ కేసులు పెరిగుతున్నాయి.జపాన్‌లో కోవిడ్ 11 వ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో జపాన్‌ తోపాటు అమెరికాలో కూడా కరోనా వేరియంట్ FLiRT కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలో ఉంది. అయితే జపాన్, అమెరికా కోవిడ్ రకాలు భారతదేశంలో వ్యాప్తి చెందుతుందా అన్న ప్రశ్న తలెత్తోంది. ప్రజలకు సోకే ఈ కొత్త వేరియంట్ KP.3 అంటువ్యాధి. ఈ వేరియంట్ కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతోంది. KP వేరియంట్ 3 లక్షణాలు మునుపటి వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. వీటిలో అధిక జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, విపరీతమైన అలసట, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ వేరియంట్ గురించి పెద్దగా ఏమీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.

అటు కేపీ.3 వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ ​కొత్త వేరియంట్‌ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్‌ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అమెరికా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది.

తాజాగా జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారు.. ఆయనలో ఈ కరోనా కేపీ.3 వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా కేపీ.3 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. వేరియంట్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

మొదట్లో కోవిడ్ చైనాలోని వుహాన్‌లో మొదలై క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చాలావరకు నియంత్రణలో ఉన్నప్పటికీ, కొత్త వేరియంట్‌ల వల్ల కరోనా వేవ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దేశంలో ఈ వేరియంట్ కేసులు కనిపిస్తే, వాటిని సకాలంలో నియంత్రించాల్సి ఉంటుంది. దీనితో, ఈ వేరియంట్ కనీస సంఖ్యలో వ్యక్తులకు సోకుతుంది. కోవిడ్ కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని నివారించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు.

గోవా వెళ్లొద్దామా.? తక్కువ బడ్జెట్‌లో తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ..

గోవాకు వెళ్లాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువతకు గోవా ఒక డ్రిమ్‌. అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే చారిత్రత్మక కట్టడాలతో రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటుంది గోవా.

అయితే తొలిసారి గోవా వెళ్లేవారికి ఎక్కడ స్టే చేయాలి.? ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుంది.? ఏయే ప్రాంతాలు సందర్శించాలి.? లాంటి సందేహాలు ఉంటాయి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి గోవాకు ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. గోవా ప్యాకేజ్‌ టూర్‌- ఇటెనరరీ పేరుతో ట్రిప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* తొలిరోజు బషీర్‌బాగ్‌ నుంచి మధ్యాహ్నాం 2 గంటలకు గోవాకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత మరుసటి రోజు గోవాకు చేరుకుంటారు.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కలంగుట్ చేరుకొని, హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం ఫ్రెష్‌ అప్‌ అయిన తర్వాత నార్త్‌ గోవాలోని మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్‌ అగుడా, బాగా బీచ్‌, కలంగుట్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. రాత్రి బస అక్కడే ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం సౌత్‌ గోవా సందర్శన ఉంటుంది. ఇక్కడ డోనా పౌలా బీచ్, మిరామార్ (గాస్పర్ డయాస్ బీచ్), ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌ల సందర్శన ఉంటుంది. సాయంత్రం పాన్‌జిమ్‌లో క్రూజ్‌బోట్‌లో జర్నీ ఉంటుంది. తిరిగి రాత్రి నైట్‌ కలంగుట్‌ చేరుకుని.. అక్కడే స్టే చేస్తారు.

* నాల్గవ రోజు ఉదయం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 11 గంటలకు కలంగుట్‌ నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత ఐదవ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల విషయానికొస్తే..

ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 11,999గా నిర్ణయించారు. అలాగే పిల్లలకు రూ. 9599గా నిర్ణయించారు. సింగిల్‌ ఆక్యూపెన్సీకి మాత్రం రూ. 14,900 చెల్లించాల్సి ఉంటుంది. హోటల్‌, భోజనం ఛార్జీలు ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. పాన్‌జిమ్‌లో క్రూజ్‌ బోట్‌ జర్నీకి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతీ సోమవారం ఈ టూర్‌ ప్యాకేజీ ఆపరేట్‌ చేస్తున్నారు.

సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ.. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందిగా..!

భారతదేశంలో ఇటీవల కాలంలో స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు స్కూటర్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూటర్ల మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాల హవాతో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లను కంపెనీలు రిలీజ్ చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి.

దాదాపు మూడునాలుగు సంవత్సరాలుగా సరిగ్గా ఓ కొత్త మోడల్ పెట్రోల్ స్కూటర్ రిలీజ్ కాలేదంటే ఈవీలపై కంపెనీలు ఎంత ఆసక్తి చూపుతున్నాయో? అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రముఖ కంపెనీ సుజుకీ పెట్రోల్ వాహనాల పరిధిని విస్తరిస్తూ ఆ కంపెనీకు సంబంధించిన రెండు స్కూటర్లను సరికొత్త రంగులతో లాంచ్ చేసింది. సుజుకీ బర్గ్ మాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 స్కూటర్లను సరికొత్త రంగులతో అందుబాటులోకి తీసుకుంది. నయా కలర్స్‌తో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్లు కచ్చితంగా స్కూటర్ ప్రియులను ఆకట్టుకుంటాయని సుజుకీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుజుకీ బర్గ్ మాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 స్కూటర్ల గురించి వివరాలను తెలుసుకుందాం.

సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ అద్భుతమైన కొత్త కలర్‌లో అందుబాటులో ఉంది. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్‌లో ఆప్రాన్, సైడ్ ప్యానెల్స్‌పై కాంట్రాస్టింగ్ మెరూన్ ప్యానెల్స్‌తో ప్రధానంగా మాట్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ఈ స్టైలిష్ అప్డేట్ బర్గ్ మాన్ స్ట్రీట్‌కు సంబంధించిన ప్రస్తుత మెకానికల్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక పెప్పీ, ఇంధన సమర్థవంతమైన 124సీసీ, సీవీటీతో జత చేసి వచ్చే ఎయిర్ కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. విశాలమైన సీటు, విశాలమైన లెడ్రూమ్, 21.5 లీటర్ బూట్, యూఎస్‌బీ సాకెట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు రైడర్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. బర్గ్మన్ స్ట్రీట్ మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ 125కు పోటీగా ఉంటుంది.

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మెటాలిక్ సోనోమా రెడ్ / పెర్ల్ మిరాజ్ వైట్ పెయింట్ కలర్‌లో వస్తుంది. ఈ బోల్డ్ కాంబినేషన్లో ఆఫ్-వైట్ ప్యానెల్స్, టాన్ సీట్ కవర్‌తో కూడిన థిక్ రెడ్ కలర్‌తో ఆకట్టుకుంటుంది. 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో ఎల్ఈడీ లైటింగ్, సీబీఎస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి పీచర్లు ఆకట్టుకుంటాయి. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ స్కూటర్ ప్రత్యేకత. 8.5 బీహఎచ్‌పీ, 10ఎన్ఎం ఉత్పత్తి చేసే 124 సీసీ ఇంజన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, సింగిల్ రియర్ స్ప్రింగ్, డిస్క్-డ్రమ్ లేదా డ్రమ్-డ్రమ్ బ్రేకింగ్ సెటప్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. కొత్త కలర్ వేరియంట్ ధర రూ. 90,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సుజుకీ ప్రతినిధులు చెబుతున్నారు.

సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం!

జూలై 19న, ఉదయం వేళకు, ఎయిర్‌లైన్స్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్‌తో సహా పలు పెద్ద కంపెనీల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మధ్యాహ్నానికి ఈ సమస్య పరిష్కారమైంది. అయితే, ఇది కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచం మొత్తం పెద్ద సాంకేతిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఢిల్లీ, ముంబై సహా విదేశాల్లో విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి.

  • సర్వర్లు అంటే ఏమిటి?
  • అవి ఎలా పని చేస్తాయి?
  • అవి ఎలా తగ్గుతాయి?
  • అవి డౌన్ అయినప్పుడు అవి ఎలా పని చేయవు?

సర్వర్‌లు అంటే ఏమిటి?

నెట్‌వర్క్ ద్వారా ఇతర కంప్యూటర్‌లలో డేటా, సేవలు లేదా ప్రోగ్రామ్‌లను అమలు చేసే ప్రత్యేక కంప్యూటర్. సర్వర్‌కు కనెక్ట్ చేయబడిన కంప్యూటర్లు, మొబైల్‌లను సర్వర్ క్లయింట్లు అంటారు. అంటే, సర్వర్ అటువంటి కేంద్ర యంత్రంగా మారుతుందని చెప్పవచ్చు. ఇది మొత్తం నెట్‌వర్క్‌లో పనిచేసే కంప్యూటర్‌లకు అవసరమైన అన్ని డేటా లేదా ప్రోగ్రామ్‌లను స్టోర్‌ చేస్తుంది. ఈ కారణంగా మొత్తం డేటా పని ఆ నెట్‌వర్క్‌లో నిజ సమయంలో అందుబాటులోకి తెచ్చేలా వస్తుంది. మొత్తంమీద సర్వర్‌లు నెట్‌వర్క్ పనులను చేయడం, క్లయింట్ అభ్యర్థనలకు ప్రతిస్పందించడం, అవసరమైన సమాచారం లేదా కార్యాచరణను అందించడం ద్వారా సమర్థవంతంగా సర్వీస్‌ చేయడానికి రూపొందించి ఉన్నాయి. మెరుగైన డేటా నిర్వహణ, కమ్యూనికేషన్‌ను ప్రారంభించడం ద్వారా నెట్‌వర్క్ పరిసరాలలో సర్వర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

సర్వర్లు ఏం చేయగలవు:

సర్వర్‌లు వెబ్‌సైట్‌లను హోస్ట్ చేయడం (వెబ్ సర్వర్లు), ఇమెయిల్ (మెయిల్ సర్వర్లు), ఫైల్‌లను నిల్వ చేయడం (ఫైల్ సర్వర్లు), రన్నింగ్ అప్లికేషన్‌లు (అప్లికేషన్ సర్వర్)తో సహా అనేక రకాల పనులను చేయగలవు.

ఎన్ని రకాల సర్వర్లు ఉంటాయి?

సర్వర్లు చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు వెబ్ సర్వర్‌లను నిర్వహించడానికి రూపొందిస్తారు. లేదా ప్రోగ్రామ్ చేసి ఉంచుతారు.

ఫైల్ సర్వర్ – నెట్‌వర్క్ వినియోగదారుల కోసం ఫైల్‌లను సేకరిస్తుంది. అలాగే దాని నిర్వహణ కొనసాగిస్తుంది.

డేటాబేస్ సర్వర్ – వివిధ రకాల పని కోసం డేటాబేస్ సేవలను అందిస్తుంది.

హార్డ్‌వేర్ పనులను నిర్వహించే, సర్వర్‌లు, క్లయింట్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే విండోస్ సర్వర్ ఉంటాయి. లైనక్స్ వంటి ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సర్వర్లు ఏ విధమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పని చేస్తాయి? ప్రాజెక్టులను కేంద్రీకరించడం ద్వారా, సమర్థవంతమైన డేటా నిర్వహణ, కమ్యూనికేషన్‌ను ప్రారంభించడం ద్వారా నెట్‌వర్క్ పరిసరాలలో సర్వర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

సర్వర్‌లు ఎలా పని చేస్తాయి?

  • మీరు మీ బ్రౌజర్‌లో URLని టైప్ చేసినప్పుడు, మీ కంప్యూటర్ ఆ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేస్తున్న సర్వర్‌కి అభ్యర్థనను పంపుతుంది.
  • సర్వర్ అభ్యర్థనను స్వీకరిస్తుంది. అలాగే మీ కంప్యూటర్‌కు అవసరమైన డేటాను పంపడం ద్వారా ప్రతిస్పందిస్తుంది. అది మీకు అవసరమైన వెబ్‌పేజీని తీసుకువస్తుంది.

సర్వర్ భాగాలు ఏంటి? హార్డ్‌వేర్‌ను ఎలా తయారు చేస్తారు ?

సర్వర్లు సాధారణంగా చాలా డేటాను నిర్వహించడానికి, వేగవంతమైన పనితీరును నిర్ధారించడానికి RAID కాన్ఫిగరేషన్‌లో బహుళ హార్డ్ డ్రైవ్‌లను ఉపయోగిస్తాయి. వారు ఒకేసారి బహుళ అభ్యర్థనలను నిర్వహించడానికి తగినంత RAM, CPUని కలిగి ఉంటాయి.

సాఫ్ట్‌వేర్ – సర్వర్‌లు వెబ్ సర్వర్లు (Apache, Nginx, మొదలైనవి), డేటాబేస్‌లు (MySQL, PostgreSQL, మొదలైనవి), ఇతర సేవల వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్‌లను అమలు చేస్తాయి.

కమ్యూనికేషన్ – సర్వర్‌లు HTTP వంటి ప్రోటోకాల్‌ల ద్వారా క్లయింట్‌లతో (కంప్యూటర్‌లు, పరికరాలు) కమ్యూనికేట్ చేస్తాయి. ఇది సర్వర్ నుండి డేటాను అభ్యర్థించడానికి, స్వీకరించడానికి బ్రౌజర్‌లను అనుమతిస్తుంది.

సర్వర్ డౌన్ కావడానికి గల కారణాలు:

విద్యుత్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వల్ల మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఉండవచ్చు. సర్వర్‌లు ప్రభావితం కావడానికి, వాటి పనితీరు ప్రభావితం కావడానికి గల కారణాలను తెలుసుకోండి.

  1. విద్యుత్తు అంతరాయం – భౌతిక యంత్రం శక్తిని కోల్పోతే లేదా విద్యుత్ సరఫరాలో వైఫల్యం ఉంటే సర్వర్ డౌన్ కావచ్చు.
  2. హార్డ్‌వేర్ వైఫల్యం – హార్డ్ డ్రైవ్, నెట్‌వర్క్ కార్డ్ లేదా సీపీయూ వంటి భాగాల వైఫల్యం కారణంగా సర్వర్ కూడా డౌన్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్ సమస్యలు:

  1. ఆపరేటింగ్ సిస్టమ్ సమస్యలు – సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు కారణం కావచ్చు. ఉదాహరణకు, పాడైన ఫైల్ సిస్టమ్ లేదా లోపాలతో కూడిన అప్లికేషన్ సర్వర్ క్రాష్‌కు కారణం కావచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.
  2. నెట్‌వర్క్ కార్డ్ సమస్యలు – నెట్‌వర్క్ కార్డ్ లేదా నెట్‌వర్క్ కనెక్షన్ సమస్యలు ఇతర పరికరాలతో కమ్యూనికేట్ చేయకుండా సర్వర్‌ను నిరోధించవచ్చు.
  3. రూటర్, కేబుల్ సమస్యలు – తప్పు రూటర్లు లేదా కేబుల్ కట్‌లు సర్వర్ నెట్‌వర్క్ కనెక్టివిటీకి అంతరాయం కలిగించవచ్చు.
  4. నెట్‌వర్క్ సమస్యలు: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) సమస్యలు – ISPతో సమస్యలు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యే సర్వర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
  5. భద్రత, సైబర్‌ భద్రత: మాల్‌వేర్, వైరస్‌లు – చాలా సార్లు మాల్‌వేర్, వైరస్‌లు సాఫ్ట్‌వేర్ సర్వర్‌ను ప్రభావితం చేస్తాయి. దీని వలన అది పనిచేయకపోవడం లేదా యాక్సెస్ చేయలేనిదిగా మారుతుంది. సైబర్ దాడులు సర్వర్‌ను కూడా దెబ్బతీస్తాయి.

అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి.. రూ. 51 నుంచి ప్లాన్లు ప్రారంభం..

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటై భారతీ ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్లను ప్రారంభించింది. ఇప్పటి వరకూ కేవలం 2జీబీ కన్నా ఎక్కువ రోజువారీ డేటాను ప్లాన్లకు మాత్రమే పరిమితం చేసిన 5జీ డేటా యాక్సెస్ ను ఇప్పుడు అంతకన్నా తక్కువ డేటా ప్లాన్లు వినియోగదారులకు అందించేందుకు ఈ కొత్త డేటా బూస్టర్లను తీసుకొచ్చింది.

ఈ కొత్త డేటా బూస్టర్ల సాయంతో 1జీబీ, 1.5జీబీ రోజు వారీ డేటా ప్లాన్లు ఉన్న కస్టమర్లు కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త డేటా బూస్టర్ల ప్యాక్లు రూ. 51, రూ. 101, రూ. 151కి అందుబాటులో ఉన్నాయి. ఈ పాక్ లు 3జీబీ, 6జీబీ, 9జీబీ డేటాను అందిస్తాయి. ఇవి కేవలం డేటా బూస్టర్లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలి. దీని వ్యాలిడిటీ ఇప్పటికే వినియోగిస్తున్న 5జీ బేస్ ప్లాన్ ఆధారంగానే ఉంటుంది. వినియోగదారులు నిరంతరాయంగా ఇంటర్నెట్ ను వినియోగించేందుకు వీలుగా ఈ డేటా బూస్టర్ ప్యాక్ లను తీసుకొచ్చినట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.

డేటా బూస్టర్ ప్లాన్ల వివరాలు ఇవి..

ఎయిర్ టెల్ రూ. 51 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 3జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది.
ఎయిర్ టెల్ రూ. 101 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 6జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది.
ఎయిర్ టెల్ రూ. 151 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 9జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది.

మరికొన్ని ప్లాన్లు..

ఎయిర్ టెల్ 5జీ సేవలను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ డేటా బూస్టర్లు ప్రవేశపెట్టింది. వీటికి అదనంగా మరికొన్ని 5జీ డేటా ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. రూ. 249 నుంచి ఈ ప్లాన్లను ప్రారంభిస్తోంది. వీటిల్లో కొన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి రూ. 449 నుంచి ప్రారంభమవుతున్నాయి.

రిలయన్స్ జియోతో పోటీ..

మన దేశంలో టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ టెల్ ఈ డేటా బూస్టర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి ఈ 5జీ డేటా బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. 1జీబీ, 1.5జీబీ రోజువారీ మొబైల్ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లకు యాడ్ ఆన్ గా ఈ డేటా బూస్టర్లను అందిస్తోంది. వీటి ధరలు రూ. 51, రూ. 101, రూ. 151 ధరతో ఈ ప్లాన్లు జియో వెబ్ సైట్ లేదా యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసగా 3జీబీ, 6జీబీ, 9జీబీ యాడ్ డేటాను అందిస్తాయి. రూ. 479, రూ. 1899 ప్రీపెయిడ్ బేస్ ప్లాన్ యాక్టివ్ లో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ డేటా బూస్టర్లు జియో అందిస్తోంది.

ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు.. వేలల్లో పెట్టుబడితో లక్షల్లో రాబడి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేవి భారతదేశంలో పెట్టుబడిదారులు పదవీ విరమణ పథకాలుగా ఉపయోగించే రెండు గ్యారెంటీ రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లుగా ఉన్నాయి.

అయితే ఈ పథకాలకు సుదీర్ఘ లాక్-ఇన్ పీరియడ్స్ ఉన్నాయి. ప్రతి పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాలు రెండూ ఈఈఈ కేటగిరీలో వస్తాయి. ఇక్కడ పెట్టుబడి, సంపాదించిన పన్ను, మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. అలాగే ఈ రెండు పథకాల్లో పెట్టుబడిపై స్థిర వడ్డీ రేట్లను అందిస్తాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాల్లో రూ. 10,000 నెలవారీ పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ పథకం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తున్న పథకం 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. కనీస బేసిక్ జీతం రూ.15,000 పొందే ఉద్యోగులు ఈపీఎఫ్ సభ్యులు కావచ్చు. ఉద్యోగికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాలో ఖాతాదారు, ఉద్యోగి ఇద్దరూ సహకారం అందించాల్సి ఉంటుంది. కనీస సహకారం నెలకు రూ. 1,800 కాగా, గరిష్ట సహకారం ప్రాథమిక వేతనం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 12 శాతంగా ఉంది. అలాగే యజమాని నుంచి వచ్చే 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ పింఛన్ ఖాతాకు వెళ్తే, 3.67 శాతం వారి ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కి వెళ్తుంది. మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం కాబట్టి ఈ రిటైర్‌మెంట్ పథకం అనేది భారతదేశంలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చే పథకంగా మారింది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పీపీఎఫ్ అనేది పోస్టాఫీసు, బ్యాంకులు నిర్వహించే చిన్న పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌లో 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‌లో కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 చెల్లించకపోతే, పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతాను నిలిపివేయవచ్చు. అలాగే ఖాతా వ్యవధిని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు.

రూ.10 వేల పెట్టుబడితో

ఈపీఎఫ్‌లో మీ నెలవారీ సహకారం రూ. 10,000 లెక్కన మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఆ కాల వ్యవధిలో మీ పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. 8.25 శాతం చక్రవడ్డీతో మీ మొత్తం కార్పస్ రూ. 35,96,445.50 అవుతుంది. మీరు పోస్టాఫీసు పీపీఎఫ్ ఖాతాలో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే 7.1 శాతం వార్షిక వడ్డీతో, 15 సంవత్సరాలలో మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 32,54,567 అవుతుంది. తద్వారా మీరు ఈపీఎఫ్‌లో రూ. 3,41,878.5 ఎక్కువగా పొందవచ్చు. అయితే పీపీఎఫ్ పెట్టుబడి అనేది మీరు 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఈపీఎఫ్ అనేది రిటైర్‌మెంట్ పథకం, మెచ్యూరిటీ వయస్సు 60గా ఉంది. అయితే ఈ రెండు పథకాలు పాక్షిక ఉపసంహరణల ఎంపికను అందిస్తాయి.

టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా? ఇక బాదుడే.. రైల్వే కొత్త రూల్స్‌

న్ఫర్మ్ టిక్కెట్లు లేని వ్యక్తులు రిజర్వేషన్ కోచ్‌లోకి ప్రవేశించి అక్కడి ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

స్లీపర్ కోచ్‌లో వేరొకరు బుక్ చేసిన సీటులో కూర్చోవడం, అక్కడే నిలబడటం మొదలైన సంఘటనలు రైలు ప్రయాణాన్ని చికాకు పెడతాయి. దీన్ని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనను రూపొందించింది. వెయిటింగ్ టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులు టిక్కెట్‌ను ధృవీకరించకుండా రిజర్వ్ కోచ్‌లోకి ప్రవేశించరాదని మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొనబడింది.

వెయిటింగ్ టికెట్ హోల్డర్ రిజర్వ్ కోచ్‌కి వెళితే ఏమవుతుంది?

మీ వెయిటింగ్‌ టికెట్స్‌ హోల్డర్లు రిజర్వేషన్‌ కోచ్‌లోకి వెళ్లలేరు. అలా వెళ్లినట్లయితే వారికి జరిమానా విధిస్తారు టీటీ. పెనాల్టీ మొత్తం కనీసం రూ. 440 ఉంటుంది. రైలు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు చేయవచ్చు. టిక్కెట్లను కౌంటర్‌లో ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. కౌంటర్‌లో టికెట్ తీసుకునేటప్పుడు కన్ఫర్మ్ టికెట్ లేకపోతే, వెయిటింగ్ టికెట్ పొందే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేస్తున్నప్పుడు కూడా, కన్ఫర్మ్ సీట్ లేకపోతే, మీరు వెయిటింగ్ టికెట్ పొందవచ్చు. రైలు ప్రయాణం రోజున కూడా ఈ వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆ డబ్బు తిరిగి పొందుతారు.

ఈ వెయిటింగ్ టిక్కెట్లను నివారించేందుకు రైల్వే శాఖ ప్లాన్ ఏంటి?

భారతీయ రైల్వే ఒక రోజులో 10,754 రైలు ట్రిప్పులను నడుపుతోంది. అంటే రైళ్లు ఎన్నిసార్లు తిరుగుతాయి.. ఒక సంవత్సరంలో ప్రజలు చేసిన మొత్తం రైలు ప్రయాణం 700 కోట్లు. అయినా కూడా వెయిటింగ్ టికెట్ సమస్య వేధిస్తోంది. అంటే రైళ్ల సంఖ్య పెరగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. అలాగే, మూడేళ్లలో 3,000 కొత్త రైళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. వెయిట్‌లిస్టింగ్ సమస్యను పరిష్కరించడంలో ఇది సహాయపడవచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతేడాది కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇది 30% పెరిగితే, వెయిట్‌లిస్టింగ్ దాదాపు సున్నా అవుతుంది. బుక్ చేసిన దాదాపు అన్ని టిక్కెట్లు కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లు ఉంటాయి. వెయిటింగ్ టికెట్ అనే సమస్య ఉండకుండా పోతుందని రైల్వే భావిస్తోంది.

వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..

కప్పుడు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అంటే పెద్ద తతంగం ఉండేది. కొనుగోలు మొదలు ఇన్‌స్టాలేషన్ వరకు అదొక పెద్ద ప్రాసెస్‌. ధర కూడా రూ. వేలల్లో ఉండేది.

అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తక్కువ ధరలోనే సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేనా ఇన్‌స్టాలేషన్‌ కూడా చాలా సులువుగా మారిపోయింది. ఇంట్లో కేవలం వైఫై కనెక్షన్‌ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ఇంట్లో ఏం జరుగుతుంతో తెలుసుకోవచ్చు.

దొంగల బెడద, ఇంట్లో చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లినా.? దుకాణాల్లో సైతం సీసీటీవీల ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో చాలా కంపెనీలు సీసీ టీవీలను తీసుకొస్తున్నాయి. అయితే ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి ప్రస్తుతం రూ. 1500 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీసీటీవీ కెమెరాలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

CP PLUS 2MP: ఈ సీసీటీవీ ధర రూ. 1449గా ఉంది. అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 360 డిగ్రీల్లో కెమెరా రొటేట్‌ అవుతుంది. 128 జీబీ వరకు స్టోరేజ్‌ చేసుకునేందుకు వీలుగా ఇందులో ఎస్‌డీకార్డును అందించారు. మోషన్‌ అలర్ట్‌, నైట్ విజన్‌, అలెక్సా, గూగుల్ సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 1080 పిక్సెల్స్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ వీడియోను వీక్షించొచ్చు. ప్రైవెసీ మోడ్‌ సహాయంతో కెమెరాను బ్లాక్‌ కూడా చేసుకోవచ్చు.

IMOU 360° 1080P Full HD Security Camera: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ సీసీ కెమెరాల్లో ఇదీ ఒకటి. అమెజాన్‌లో సీసీటీవీ రూ. 1299కి అందుబాటులో ఉంది. ఇందులో హుమన్‌ డిటెక్షన్‌, మోషన్‌ ట్రాకింగ్‌, 2 వే ఆడియోతో పాటు నైట్ విజన్‌, డోమ్‌ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. 256 జీబీ వరకు ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్ చేస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్‌ కమాండ్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది.

Tapo TP-Link C200 360°: 360 డిగ్రీల రొటేట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చిన ఈ సీసీటీవీ కెమెరా ధర అమెజాన్‌లో రూ. 1599గా ఉంది. ఇందులో 1080పిక్సెల్‌ ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. 2వే ఆడియో, నైట్ విజన్‌, మోషన్‌ డిటెక్షన్‌, సౌండ్ అండ్‌ లైట్‌ అలారమ్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు.

Wi-Fi Camera CCTV Camera 1080p Wireless PTZ Bulb Shape: చూడ్డానికి అచ్చంగా బల్బ్‌ ఆకారంలో ఉండే ఈ సీసీటీవీ కెమెరా రూ. 1199కి లభిస్తోంది. ఇందులో 360 డిగ్రీలు రొటేట్ అయ్యే కెమెరాను అందించారు. మోషన్‌ సెన్సార్‌ ఎల్‌ఈడీ లైట్‌తో కూడిన కెమెరాను ఇందులో అందించారు. నెలకు రూ. 100 ఈఎమ్‌ఐ చెల్లించి కూడా దీనిని సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Mi Wireless Home Security Camer: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమీకి చెందిన ఈ సీసీటీవీ ధర కాస్త ఎక్కువే అయినా ఫీచర్స్‌ మాత్రం బాగున్నాయి. దీని ధర రూ. 1999గా ఉంది. ఇందులో 360 డిగ్రీల వ్యూను అందించారు. అలాగే ఇందులో ఏఐ పవర్డ్‌ మోషన్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను ఇచ్చార. నైట్ విజన్‌తో పాటు, టాక్‌ బ్యాక్‌ వంటి అధునాతన ఫీచర్‌ను ఇచ్చారు. 1080 పిక్సెల్స్‌తో కూడిన వీడియోను చూడొచ్చు.

క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు.. సర్వేలో ఆసక్తికర అంశాలు..

దేశంలోని యువత నేడు ఉద్యోగ, వ్యాపార రంగాలలో దూసుకువెళుతున్నారు. అలాగే స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు. స్వయం ఉపాధికి సంబంధించి ఎక్కువగా మోటారు రంగంపై ఆధారపడ్డారు.

ముఖ్యంగా పట్టణాల్లో మనకు క్యాబ్ లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని నడుపుతూ చాలామంది జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ సంస్థ క్యాబ్ డ్రైవర్ల ను సర్వే చేసి అనేక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను తెలియజేసింది. ప్లాట్ ఫాం కంపెనీలలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించింది.

క్యాబ్ డ్రైవర్ల కష్టాలు..

కార్లలో తిరగడానికి మనందరం ఇష్టపడతాం. కానీ ఖర్చు కొంచెం ఎక్కువ కావడంతో బస్సులలో ప్రయాణిస్తాం. అత్యవసర సమయంలో, తొందరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యాబ్ లను బుక్ చేసుకుని ప్రయాణం సాగిస్తాం. ఎప్పుడూ కార్లలోనే తిరిగే క్యాబ్ డ్రైవర్లను చూసి వీరి ఉద్యోగం చాలా బాగుంటుందని భావిస్తాం. కానీ 70 శాతం మంది క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంలో దాదాపు 60 గంటలు పనిచేసినా సరైన ఆదాయం రాక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

మూడు నగరాల్లో సర్వే..

దేశవ్యాప్తంగా మూడు నగరాల్లో దాదాపు 1200 మంది క్యాబ్ డ్రైవర్లను సర్వే చేసిన తర్వాత ఆ సంస్థ ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం..

  • ప్రతి వారం 60 గంటలకు పైగా పనిచేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని 70 శాతం క్యాబ్ డ్రైవర్లు తెలియజేశారు.
  • అధిక పని గంటల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడ్డామని 60 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు.
  • క్యాబ్ పై వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని 50 శాతం మంది తెలిపారు. దీంతో రుణాలు పెరిగిపోతున్నాయన్నారు.
  • క్యాబ్ లు రోజురోజుకూ పెరిగిపోవడంతో వీరి మధ్య పోటీ నెలకొని డిమాండ్ తగ్గిపోతోంది. కొన్ని నగరాల్లో డ్రైవర్లు ఖర్చుల తర్వాత గంటకు రూ. 250 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు.
  • డ్రైవర్లలో 75 శాతం మంది ప్లాట్‌ఫారం కంపెనీల ద్వారా దోపిడీకి గురవుతున్నట్లు భావిస్తున్నారు.

కారణాలు ఇవే..

క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక ఇబ్బందులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం.

  • డ్రై రన్‌లు, ఎక్కువ సేపు పికప్‌లు, ట్రాఫిక్ జాప్యాలు, వేచి ఉండటం, కస్టమర్ రద్దు తదితర కారణాలతో నష్టం కలుగుతోంది. వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసే ప్రధాన కారణాలలో వీటిని ప్రధానంగా చెప్పవచ్చు.
  • అధిక వాహన నిర్వహణ ఖర్చులు, భారీ ప్లాట్‌ఫారమ్ కమీషన్లు (30 శాతం), గతేడాది 20 శాతం పెరిగిన ఇంధన ధరలు కూడా డ్రైవర్ల నికర ఆదాయాన్ని తగ్గించాయి.
  • ప్లాట్‌ఫారమ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలతో 30 శాతం డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు నోటీసు, గడువు ప్రక్రియ లేకుండా తొలగించడంతో ఆకస్మికంగా ఆదాయాన్ని కోల్పోతున్నారు.

పరిష్కార మార్గాలు..

  • క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆ సంస్థ పలు అంశాలను సూచించింది. వాటిని అమలు చేయడం వల్ల వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపింది.
  • డ్రై రన్‌లు, ఎక్కువ కాలం పికప్‌లు, పనిలేకుండా ఉండే సమయం, రద్దు తదితర వాటికోసం పరిహారాన్ని అమలు చేయాలి. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం దాదాపు 20 శాతం పెరుగుతుంది.
  • స్టాండర్డ్ మీటర్, కమీషన్ విధానం అమలు చేయాలి. చార్జిలో కనీసం 80 శాతం డ్రైవర్‌కు అందేలా చూడాలి.
  • ఒప్పందాలు సరళంగా ఉండాలి. వాటిని డ్రైవర్లకు అర్థమయ్యేలా స్థానిక భాషల్లో ఉండేలా చూడాలి.
  • ఆరోగ్య బీమా, భద్రతా చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ఐడీ డీయాక్టివేషన్ వంటి చర్యలకు ముందు న్యాయమైన విచారణల కోసం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • పని గంటలను తగ్గించాలి. రోజుకు పది గంటలు మాత్రమే పని చేసేలా చూడాలి.

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌

ద్యోగం, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో లైఫ్‌ బిజీగా మారిపోయింది. దీంతో ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్‌ చేసుకునే పరిస్థితి ఉంది.

ఇక వారాలకు వారాలు లీవ్స్‌ పెట్టడం కూడా కష్టంతో కూడుకున్న విషయం. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని డైలీ శ్రీశైలం టూర్‌ పేరుతో ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 1 రాత్రి, 2 పగళ్లు కొనసాగుతుంది. ప్రతీరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండడం విశేషం. ఇంతకీ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంతలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* తొలి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రయాణం మొదలవుతుంది. పర్యాటక భవన్‌ నుంచి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి బషీర్‌బాగ్‌ వెళ్తుతుంది, బషీర్‌బాగ్‌లో ప్రయాణికులు వచ్చిన తర్వాత 9 గంటలకు శ్రీశైలం జర్నీ మొదలవుతుంది.

* మార్గ మధ్యంలోనే భోజనం ఉంటుంది. అనంతరం శ్రీశైలం చేరుకున్న తర్వాత తొలుత. సాక్షి గణపతి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం కొండపైకి చేరుకుంటారు. తర్వాత హోటల్‌లో చెకిన్‌ కావాల్సి ఉంటుంది. రాత్రి బస శ్రీశైలంలోనే ఉంటుది.

* రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కాగానే హోటల్‌లో చెక్‌ అవుట్‌ అవుతారు. తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది.

* ఇందులో భాగంగా పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం.. తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

టికెట్‌ ధరల విషయానికొస్తే ఏసీ బస్‌ ప్యాకేజీలో పెద్దలకు రూ. 2400, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 1920గా నిర్ణయించారు. ఇక నాన్‌ ఏసీ విషయానికొస్తే పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600గా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్‌, హోటల్‌లో బస వంటివి ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. అయితే ఫుడ్‌, దర్శనం టికెట్లతో పాటు ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..

ర్షాకాలం మొదలైంది. నీటిలో అతిగా పాదాలను తడుపుతూ ఉంటారు. దీనికారణంగా అనేక చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలు వేళ్ల సందుల్లో దద్దుర్లు, ఎర్రబడటం, పొట్టుపొట్టు రాలిపోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి.

వీటిని సహజమైన పద్దతుల ద్వారా ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మామూలుగా అయితే వేడినీళ్లలో ఉప్పు వేసి, డెటాయిల్ వేసి శుభ్రపరుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటుందంటున్నారు.

దీంతోపాటూ పెట్రోలియం జెల్లీలు పూసి కాసేపు మర్ధనా చేయడంవల్ల డ్రై స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. క్రమంగా దురదలు తగ్గుముఖం పడుతుంది. పెప్పర్‎మెంట్ నూనె పూయడం వల్ల కూడా దద్దుర్లు, మంట తగ్గుముఖం పడుతుంది. గోరు వెచ్చని నీటిలో రెండు లేదా మూడు చుక్కల పెప్పర్ మింట్ నూనె వేసి బాగాకలపాలి.

పాదాలు మునిగేవరకు10 నిమిషాలపాటూ అలాగే ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంతేకాకుండా బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, వైట్ వెనిగర్, పుదీనా రసంను ఉపయోగించుకోవచ్చ.

ఈ చర్మవ్యాధులను నిర్లక్ష్యం చేస్తే పొక్కులు ఏర్పడి పెద్ద నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇలాంటివి దరిచేరకూడదంటే వర్షాకాలంలో ఎక్కువ సేపు షూ, సాక్సులు ధరించకుండా ఉండటమే మంచిదంటున్నారు. పాదాలకు గాలి తగులుతూ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

అలా చేయకుండా ఉండాల్సింది.. ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా వెండితెరపై సందడి చేసింది ఆర్తి అగర్వాల్. అందమైన రూపం.. కలువల్లాంటి కన్నులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

మొదటి తోనే అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ ఎప్పటికీ సినీ ప్రియుల మనసులలో చెరగని అందమైన రూపం. విక్టరీ వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తొలి తోనే బారీ విజయాన్ని అందుకున్న ఆర్తికి.. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. చేతినిండా లతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్‏గా మెప్పించడమే కాదు.. విలన్ గానూ అదరగొట్టింది.

చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. అమే మానసిక ఒత్తిడిలో 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏడాది మెట్లపై నుంచి పడిపోయింది. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఇటు ల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి.

కొన్నాళ్లలకు రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదు. అప్పటికే బరువు ఎక్కువగా పెరగడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బరువు తగ్గేందుకు తీసుకున్న చిన్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది. స్థూలకాయం, శ్యాసకోస సమస్యలతో బాధపడిన ఆర్తి.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అందమైన రూపం.

మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రత్యేకతలు ఏమున్నాయంటే..

మారుతీ సుజుకీ కార్లకు దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వారి జీవితాలలో ఈ కార్లు భాగమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి విడుదల కానున్న మారుతీ సుజుకి ఈవీక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

తొలి ఎలక్ట్రిక్ కారు..

మారుతీ సుజుకీ ఈవీక్స్ (ఎలక్ట్రిక్) కారును ఇప్పటికే అనేక ఆటో షోలలో చాలా సార్లు ప్రదర్శించారు. మారుతీ సుజుకీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం కూడా ఇదే కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారు సంచలనం రేపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ కొత్త కారుకు ఎస్కుడో అని పేరు పెట్టవచ్చని జపనీస్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ అయిన హటేనా బ్లాగ్ వెల్లడించింది.

నివేదికల ప్రకారం..

మారుతీ సుజకీ కొత్త కారుకు సంబంధించి అనేక నివేదికలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం.. ఈ కారులో విభిన్న అవసరాలను తీర్చడానికి రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లను అమర్చారు. ఒకటి 40 కేడబ్ల్యూహెచ్, రెండోది 60 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. వాటిలో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం మన దేశంలో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునే వారికి 60 కేడబ్ల్యూహెచ్ వీలుగా ఉంటుంది. ఈ వాహనం అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా.

భాగస్వామ్యం..

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడానికి సుజుకీ కంపెనీ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముందుగా సుజుకి ఎస్కుడో (మారుతీ సుజుకీ ఈవీక్స్)తో రానుంది. అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాటరీ, అభివృద్ధి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

ఆకట్టుకునే డిజైన్..

కొత్త సుజుకి ఎస్కుడో డిజైన్ చాలా ఆకట్టుకుంటోంది. బయట డిజైన్ లో కొత్త ట్రై ఏరో ఎల్ఈడీ డీఆర్ ఎల్, స్లీక్ హెడ్ లైట్లు, అప్ డేటెడ్ ఓఆర్వీఎమ్, స్పోర్ట్ బంపర్ ఏర్పాటు చేశారు. సైడ్ ప్రొఫల్ లో ప్రోమినెంట్ వీల్ ఆర్చ్, అల్లాయ్ వీల్స్, ఫ్లస్ టైప్ డోర్ హ్యాండిల్ అమర్చారు.

2025లో విడుదలయ్యే అవకాశం..

సుజుకి ఎస్కుడో మన దేశంతో పాటు యూరోప్, జపాన్లలో అందుబాటులో ఉంటుంది. 2025 జనవరి లో మన మార్కెట్ కు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కారుకు ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇలా చేస్తే మీరు కట్టే ట్యాక్స్ అమాంతం తగ్గిపోతుంది.. ఒకసారి ట్రై చేసి చూడండి..

రిమితికి మించిన ఆదాయం కలిగిన వారందరూ ఆదాయం పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ముందుగా ఆదాయపు పన్నుశాఖకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అనంతరం మీరు పన్ను కట్టాల్సిన ఆదాయంపై అవగాహన కలుగుతుంది.

అయితే ఆదాయపు పన్ను చెల్లింపుల ద్వారా కూడా రివార్డులు, క్యాష్ బ్యాక్ లు పొందే అవకాశం ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్నును చెల్లించి వీటిని పొందవచ్చు. అలాగే ఆదాయపు పన్నుచట్టంలోని వివిధ సెక్షన్ల ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. వీటినన్నింటినీ అనుసరించడం ద్వారా ఆదాయపు పన్ను ను ఆదా చేసుకోవచ్చు.

16 శాతం వరకూ క్యాష్ బ్యాక్..

మన దేశంలో కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఆదాయపు పన్నుపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. హెచ్ డీఎఫ్ సీ బిజ్ బ్లాక్, హెచ్ డీఎఫ్ సీ బిజ్ పవర్ తదితర క్రెడిట్ కార్డుల నుంచి ఈ అవకాశం ఉంది. వీటి ద్వారా ఆదాయపు పన్ను, జీఎస్ టీలను చెల్లించి 16 శాతం నుంచి 8 శాతం వరకు రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి.

మరికొన్ని రివార్డులు..

ఎస్ బీఐ విస్తారా, ఐడీఎఫ్ సీ విస్తారా తదితర క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఇలాంటి రివార్డులు పొందే అవకాశం ఉంది. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుపై మైల్‌స్టోన్ రివార్డులు అందజేస్తాయి.

ఐటీఆర్ కు జూలై 31 వరకూ గడువు..

2023 – 24 (ఏవై 2024-25) ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఆ గడువు దాటితే జరిమానా విధిస్తారు. జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేేసే అవకాశం డిసెంబర్ 31 వరకూ ఉంటుంది.

పన్ను ఆదాకు మార్గాలివే..

ఆదాయపు పన్నును ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీరు కొంత పన్నుభారాన్ని తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ద్వారా ఇవి అమలవుతున్నాయి. పూర్తి చట్టబద్ధత కలిగినవి కూడా.

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) తదితర పన్ను పొదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టండి. ఆ పెట్టుబడికి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • వైద్య, విద్య ఖర్చులకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. వాటిని క్లెయిమ్ చేసుకోవడం వల్ల పన్ను ఆదా అవుతుంది. ఆ ఖర్చులను సంబంధించిన బిల్లలు, రశీదులను భద్రపర్చుకోవాలి.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపులు లభిస్తాయి. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఈఎల్ఎస్ఎస్ తదితరవాటిలో పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది.
  • సెక్షన్ 80డీ కింద కూడా మినహాయింపులు అందజేస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియాలను ఇందులో క్లెయిమ్ చేయవచ్చు.
  • సెక్షన్ 80 టీటీఏ కింద పొదుపు ఖాతాలపై గరిష్టంగా రూ. పదివేల వరకూ వడ్డీపై తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.
  • మీ పెట్టుబడి మార్గాలను పరిశీలించండి. కొన్నింటికి చట్ట ప్రకారం మినహాయింపులు లభిస్తాయి. వాటికి అనుగుణంగా తగ్గింపులను క్లెయిమ్ చేసుకోండి.
  • ఐటీఆర్ ను సకాలంలో ఫైల్ చేయండి. అనంతరం దాన్ని ధ్రువీకరించుకోండి. తద్వారా జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మీకు రీఫండ్స్ కూడా త్వరతగతిన అందుతాయి.

ఏపీకి వాయుగుండం ముప్పు.. ఇక ఫుల్‌గా వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు

ఎండి సూచనల ప్రకారం వాయువ్య ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత క్రమంగా వాయుగుండం బలహీనపడనుందన్నారు. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ1 ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు తెలిపారు.

ఎగువ నుంచి వస్తున్న వరద, రాష్ట్రంలోని భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ప్రైమ్‌డే సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌.. ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో ఆఫర్స్‌ అందించనున్న విషయం తెలిసిందే. కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్ జులై 20,21వ తేదీల్లో అందుబాటులోకి రానుంది.

అయితే ఈ ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌ శుక్రవారం అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, అన్ని రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లు అమ్మకానికి రానున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్స్‌ లభించయనున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ లభిస్తోంది. వీటికి అదనంగా అమెజాన్‌ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఓఎల్‌ఈడీ స్క్రీన్‌, యాపిల్‌ బయోనిక్‌ ఏ15 చిప్‌తో ఉన్న ఈ ఫోన్‌ ప్రస్తుత ధర రూ. 52 వేలు ఉండగా. సేల్‌లో భాగంగా రూ. 48,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో వెయ్యి రూపాయాలు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 47,799కి పొందొచ్చు. ఇదిలా ఉంటే అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌4, శాంసంగ్‌ ఎం35, మోటోరొలా రేజర్‌ 50 అల్ట్రా, హానర్‌ 200 సిరీస్‌, లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్స్‌ తొలిసారి సేల్‌ ప్రారంభంకానున్నాయి.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి చెందిన వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.64,999 కాగా.. సేల్‌లో భాగంగా బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 అల్ట్రా ఫోన్‌ ధర రూ.74,999, ఐకూ నియో 9 ప్రో ధర రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 రూ.21,999, రెడ్‌మీ 13సి రూ.9499కే సొంతం చేసుకోవచ్చు.

పచ్చి బఠాణీని రోజు తింటే ఏమవుతుందో తెలుసా..?

చ్చి బఠానీలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.. ఇది తక్కువ GI స్థాయిని కలిగి ఉంటుంది. ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు శీతాకాలంలో పచ్చి బఠానీలను తినవచ్చు.

పచ్చి బఠానీలలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను రోజూ తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చి బఠానీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందులో తగినంత ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా, పచ్చి బఠానీలలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ మరియు ఫాస్పరస్ ఉన్నాయి. పచ్చి బఠానీలు కండరాల బలాన్ని ప్రోత్సహిస్తాయి.

బఠానీలలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శీతాకాలంలో పచ్చి బఠానీలను తినవచ్చు. పచ్చి బఠానీల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు తగ్గుతుంది.

బరువు తగ్గాలంటే పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పచ్చి బఠానీలు ఫైబర్ మంచి మూలం. శక్తి కోసం శరీరానికి ఫైబర్, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి అవసరం. పచ్చి బఠానీలను తీసుకోవడం వల్ల రోజువారీ ఫైబర్ అవసరాలు తీరుతాయి. శీతాకాలంలో ప్రత్యేకంగా లభించే పచ్చి బఠానీలలో విటమిన్ ఎ, బి, సి, ఇ, కె మరియు మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాటెచిన్ మరియు ఎపికాటెచిన్ వంటి ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి.

ట్రెండ్‌లో బాలయ్య, చిరు, మహేష్‌.. ఇదే లిస్ట్ లోకి చేరిన రామ్‌

ట్రెండ్‌లో ఉండటం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే బాలయ్యని, చిరుని, మహేష్‌ని, లేటెస్ట్ గా రామ్‌నీ అడిగితే తెలుస్తుంది కదా… అని అంటున్నారు సినీ జనాలు.
ఇంతకీ సీనియర్స్ టు యంగ్‌స్టర్స్ అంతగా ట్రెండ్‌లో ఉండే పనులు ఏం చేశారనేగా? చూసేద్దాం వచ్చేయండి…. సొసైటీలో కుర్రకారు ఏం అంటున్నారు? ఏం వింటున్నారు? కాస్త జాగ్రత్తగా గమనిస్తే… ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు. హిట్‌ కొట్టేయొచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్‌.ట్రెండ్‌లో ఉండటం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే బాలయ్యని, చిరుని, మహేష్‌ని, లేటెస్ట్ గా రామ్‌నీ అడిగితే తెలుస్తుంది కదా… అని అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ సీనియర్స్ టు యంగ్‌స్టర్స్ అంతగా ట్రెండ్‌లో ఉండే పనులు ఏం చేశారనేగా? చూసేద్దాం వచ్చేయండి….

సొసైటీలో కుర్రకారు ఏం అంటున్నారు? ఏం వింటున్నారు? కాస్త జాగ్రత్తగా గమనిస్తే… ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు. హిట్‌ కొట్టేయొచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్‌. ప్రయోగాలకు కేరాఫ్‌ గా అందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ … ఇచ్చి పాడ్‌.. అంటూ భగవంత్‌ కేసరిలో ట్రెండ్‌ని ఫాలో అయిపోయారు.

భోళా శంకర్‌లో జామ్‌ జామ్‌ జామ్‌ జామ్‌ జజ్జనక్క సాంగ్‌ విన్నారా… అందులోనూ ఇలాంటిదే ఓ ఫేమస్‌ మాట ఉంటుంది. అదేంటో ఓసారి వినేయండి… డీటైల్డ్ గా మాట్లాడుకుందాం…

మనకు బాగా అలవాటైన ఆ మాట… మీకూ వినిపించిందా? యస్‌.. అదేనండీ నస్సబెల్లీ అంటూ… చిరు అండ్‌ గ్యాంగ్‌ స్టెప్పులేస్తూ యమాగా ఎంజాయ్‌ చేశారు కదా… పాపులర్‌ పదాల పట్టుబట్టు.. కుర్రకారు అటెన్షన్‌ పట్టు… అంటూ మెగాస్టార్‌ కూడా ట్రెండ్‌లో జాయిన్‌ అయ్యారు. గుంటూరు కారం చిత్రంలో కుర్చీమడతబెట్టి సాంగ్‌ వచ్చినప్పుడు జరిగిన రచ్చ చూడాలి. సోషల్‌ మీడియాలో వేరే రకంగా వైరల్‌ అయిన మాటను.. అలా ఎలా వాడేస్తారంటూ ఒకటే రచ్చ… అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పదగినంతే తీసుకున్నామంటూ వాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు మేకర్స్. కుర్చీ మడత పెట్టికి లైకులు, వ్యూస్‌ రికార్డు రేంజ్‌లో రావడం గమనార్హం.

రీసెంట్‌గా డబుల్‌ ఇస్మార్ట్ పాటలను విన్నవారు … కేసీఆర్‌ పాపులర్‌ డైలాగ్‌ని ఎంత బాగా వాడారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా మాస్‌గా సాగే డబుల్‌ ఇస్మార్ట్ లోని మార్‌ ముంత చోడ్‌ చింత సాంగ్‌లో ఏం జేద్దాం అంటావ్‌ మరి… అనే లైన్‌ వచ్చినప్పుడు కుర్రకారులో హై మామూలుగా లేదు… ఈ తరహా పాటలు రీసెంట్‌ టైమ్‌లో ఇంకేం వచ్చాయా? అంటూ సెర్చ్ మొదలుపెట్టేశారు.

దిగిచ్చొన Jio.. మళ్లీ పాత ప్లాన్‌ అమలుకు రెడీ

దిగిచ్చొన Jio.. మళ్లీ పాత ప్లాన్‌ అమలుకు రెడీ

అడుగుపెడుతూనే టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది జియో. ప్రారంభంలో ఉచితంగా.. ఆ తర్వాత చాలా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఇంటర్నెట్‌ డేటాను కస్టమర్లకు అందిస్తూ..

తన వైపు తిప్పుకుంది. జియో దెబ్బకు అప్పటి వరకు ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌ మిగతా కంపెనీలకు భారీ షాక్‌ ఇచ్చింది. జియో దెబ్బకు అవి కూడా దిగి వచ్చాయి. తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక జియో ఎంట్రీ నుంచి ఈ ఏడాది జూలై వరకు దేశ ప్రజలు అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటాను ఎంజాయ్‌ చేశారు. కానీ తాజాగా జియో తన రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే ఒక్కో ప్యాక్‌ ధర మీద 12-25 శాతం వరకు పెంచి.. కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టింది. ఆ తర్వాత మిగతా టెలికాం కంపెనీలు అనగా.. ఎయిర్‌టెల్‌, వీఐ కూడా తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచాయి.

రీఛార్జ్‌ ప్లాన్‌ ధరల పెంపుతో.. యూజర్ల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న రిలయన్స్‌ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. పాత ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఇంతకు అది ఏది అంటే.. రూ.999 ప్లాన్‌. కస్టమర్లను శాంతింపజేయడానికి జియో.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ని మళ్లీ తిరిగి ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది రీచార్జ్‌ చేసుకునే రూ.999 ప్లాన్‌ ధరను జూలై 3న రూ.1,199కి పెంచింది. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో.. పాత ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్‌లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది జియో.

కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్‌లో ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. అయితే కొత్త ప్లాన్‌లో రోజువారీ డేటాను తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్‌ రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.

దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్‌టెల్‌ తీసుకువచ్చిన 979 ప్లాన్‌లోని అదనపు ప్రయోజనం ఏమిటంటే దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. 56 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా పొందవచ్చు

కాలి మడమల్లో కనిపించే ఈ లక్షణాలు.. డయాబెటిస్‌కు సంకేతం కావొచ్చు

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే డయాబెటిస్‌ ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది.

మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే వ్యాధి నియంత్రణ సులభమవుతుందని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో డయాబెటిస్‌ వచ్చిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే పసిగడితే వ్యాధిని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అలాంటి ఓ ముందస్తు లక్షణాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* మధుమేహం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుందని తెలిసిందే. ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో చర్మం పొడిబారుతుంది. దీని ప్రభావం మడమలపై పడుతుంది. మడమల్లో చీలికల కారణంగా నొప్పి గణనీయంగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.

* డయాబెటిస్‌ కారణంగా మడమలో వాపు, నొప్పి సమస్య వెంటాడుతుంటాయి. దీనివల్ల నడవడానికే కాకుండా నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాళ్లలో సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల కణజాలం బలహీనంగా మారుతుంది.

* డయాబెటిస్‌ కారణంగా కాళ్ల నరాలు బలహీనపడతాయి. దీంతో మడమల్లో జలదరింపు, తిమ్మిరి, సూదితో కుచ్చుకున్నట్లు భావన కలుగుతుంది. అలాగే పాదాలు లేదా చీలమడంలో గాయాలై త్వరగా నయం కాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మడమ లేదా పాదంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. పాదాలను నిత్యం శుభ్రంగా ఉండాలి. సౌకర్యవంతమైన, సరైన సైజు బూట్లు మాత్రమే ధరించాలి. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి. మధుమేహాన్ని కంట్రోల్‌ చేసుకోవాలంటే నిత్యం తగినంత నీరు తాగాలి. స్వీట్లకు దూరంగా ఉండాలి. సమయానికి మందులు తీసుకోండి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. రోజూ వ్యాయాయం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.

Health

సినిమా