Sunday, November 17, 2024

GOAT Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. వీటిపై ఊహకందని ఆఫర్స్..

GOAT Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. వీటిపై ఊహకందని ఆఫర్స్..

GOAT Sale: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈనెల 20,21 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా భారీ ఆఫర్లను ప్రకటించాయి. అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు, గృహోపకరణాలపై కూడా భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. ఇదిలా ఉంటే అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ సైతం సేల్‌ను నిర్వహిస్తోంది. గోట్‌ పేరుతో జూలై 19 నుంచి 23 వరకూ ఐదురోజులపాటు సేల్ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ సైతం భారీ ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల వస్తువుల కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తున్నారు. ఇక వీటితో పాటు కొన్ని రకాల స్మార్ట్‌ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న కొన్ని బెస్ట్‌ డీల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈ సేల్‌లో భాగంగా లండనకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌2పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 33,999 కాగా, సేల్ భాగంగా రూ.28,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.

* ఐఫోన్‌ 14 ప్లస్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.55,999కాగా బ్యాంకు ఆఫర్లతో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి ఈ సేల్‌లో భాగంగా రూ. 53,999కి సొంతం చేసుకోవచ్చు.

* గూగుల్ పిక్సెల్‌ 8పై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 61,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో కేవలం రూ. 47,999కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ పొదొచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో మోడల్ పై కూడా తగ్గింపు ధర అందుబాటులో ఉంది. మార్కెట్ ధర 55,999 రూపాయలు కాగా 50,999 రూపాయలకు లభించనుంది.

* ఇక మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌పై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 29,999 కాగా, సేల్‌లో భాగంగా రూ. 28000కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆర్లలో భాగంగా రూ 2 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది.

Fix Deployed: మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య క్లియర్.. కంపెనీ సీఈఓ

Fix Deployed: మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య క్లియర్.. కంపెనీ సీఈఓ

Fix Deployed: క్రౌడ్‌స్ట్రైక్ ‘ఫాల్కన్ సెన్సార్’ అప్‌డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.

ఈ ఎర్రర్ వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలపై, స్టాక్ ఎక్స్ఛేంజీలపై, సూపర్ మార్కెట్లు, విమాన సేవలపై ప్రభావం చూపింది. విండోస్‌ స్క్రీన్‌పై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్య తలెత్తింది. దీని వలన సిస్టమ్ షట్ డౌన్, రీస్టార్ట్ అయింది.

CrowdStrike CEO జార్జ్ కర్ట్జ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు.. Windows హోస్ట్‌ల కోసం ఒకే కంటెంట్ అప్‌డేట్‌ చేయడంతో ఈ ఎర్రర్ ఏర్పడిందని అయితే Mac, Linux లతో పనిచేసే సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. దీనిపై ఆయన క్లియర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. “సమస్య గుర్తించబడింది, పరిష్కారించబడింది. వినియోగాదారులు విండోస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కంపెనీ పోర్టల్‌ను గమనించమని చెప్పారు.

“అధికారిక ఛానెల్‌ల ద్వారా వారు క్రౌడ్‌స్ట్రైక్ ప్రతినిధులతో కమ్యూనికేట్ చేస్తున్నామని, వారు చెప్పే పద్దతిని ఉపయోగించి సమస్య పరిష్కించుకోవాలని చెప్పారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పింది.. ” ఈ సమస్యన పరిష్కరించడానికి అందరము కష్టపడుతున్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నాము దీనికోసం మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లు పనిచేస్తున్నాయంది. ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కింది పద్ధతిని ఉపయోగించి సమస్య నుంచి బయటపడొచ్చు అని తెలిపింది.

– విండోస్‌ను సేఫ్ మోడ్‌లోకి బూట్ చేయండి లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్‌మెంట్ C:\Windows\System32\drivers\CrowdStrike డైరెక్టరీకి నావిగేట్ చేయండి “C-00000291*.sys” సరిపోలే ఫైల్‌ను గుర్తించి, దాన్ని తొలగించండి. అని పేర్కొంది.

కేవలం 21 రోజులు.. వాకింగ్‌.. గాఢ నిద్ర.. ఇలా బరువు తగ్గిన మాధవన్‌

కేవలం 21 రోజులు.. వాకింగ్‌.. గాఢ నిద్ర.. ఇలా బరువు తగ్గిన మాధవన్‌

సినిమా, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు పలువురు నటులు. అలాంటి వారిలో మాధవన్‌ (R Madhavan) ఒకరు.

ఇటీవల కాలంలో ఆయన ఎంచుకునే కథలు, పాత్రలు వైవిధ్యంగా ఉంటున్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఇందులో వయసు మళ్లిన నంబి పాత్ర కోసం పొట్ట కూడా పెంచారు. మళ్లీ ఫిట్‌నెస్‌తో కనపడటానికి తాను పాటించిన డైట్‌ వివరాలను తాజాగా మాధవన్‌ పంచుకున్నారు. ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండా కేవలం సాధారణ ఆహారం, వాకింగ్‌తోనే బరువు తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇంతకీ మాధవన్‌ చెప్పిన డైట్‌ ఏంటో తెలుసా?

”బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (intermittent fasting) పాటించా. ఆహారాన్ని తినేటప్పుడు 45-60 సార్లు నమిలి తినేవాడిని. చివరి మీల్‌ను సాయంత్రం 6.45 గంటలకే ముగిసేది. కేవలం వండిన ఆహారాన్నే మాత్రమే తీసుకునేవాడిని. పచ్చి ఆహారం ఏది తీసుకోవాలనుకున్నా మధ్యాహ్నం 3 గంటల కన్నా ముందే ముగించేవాడిని. రాత్రి వీలైనంత త్వరగా నిద్ర పోవడమే కాదు, కలత నిద్ర లేకుండా చూసుకునేవాడిని. ఉదయాన్నే ఎక్కువ సమయం నడవటానికి కేటాయించాను. రాత్రి పడుకునే 90 నిమిషాల ముందే సెల్‌, టీవీ చూడటం మానేశా. ద్రవాహారం ఎక్కువగా తీసుకునేవాడిని. మరీ ముఖ్యంగా ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలను భాగం చేయడం ద్వారా శరీరంలోని మెటబాలిజం పెరిగి ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోలేదు” అని తన 21 రోజుల డైట్‌ గురించి చెప్పారు.

నంబి పాత్ర కోసం మాధవన్‌ మారిన తీరును ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. ‘ఉపవాసం చేయడం మంచిదే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి’ అని ఒక నెటిజన్‌ అభిప్రాయపడగా, ‘నిరంతరం ఆకలితో ఉండటం నిజంగా కఠినమైన చర్యే. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు’, ‘సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు’ అని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. ‘షైతాన్‌’ మూవీతో బాలీవుడ్‌లో భయపెట్టిన మాధవన్‌ ప్రస్తుతం ‘అమ్రిక్‌ పండిట్‌’, ‘అదృష్టశాలి’, ‘టెస్ట్‌’, ‘శంకర’, ‘దే దే ప్యార్‌దే 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

YS Jagan: వినుకొండలో పరామర్శ తర్వాత జగన్ సంచలన ప్రకటన

అమరావతి/పల్నాడు జిల్లా: వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన..

పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కోర్టుకు వెళ్తాం..!

రషీద్‌ హత్యకేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రాజకీయ కక్షలతోనే రషీద్‌ హత్య జరిగిందని.. అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని మీడియాకు వివరించారు.

ఏమైనా చేయొచ్చా..?

‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. లా అండ్ ఆర్డర్ లేదు. తెలుగుదేశం వాళ్లు ఎవరినైనా కొట్టచ్చు.. చంపొచ్చా..? వాళ్లు ఏ అరాచకం చేసినా పోలీసులు పట్టించుకోరా..? పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 45 రోజుల్లో 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు. 490 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవికాక వెయ్యికిపైగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నవి ఇవే. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. టీడీపీ నేతలు దాడులు, హత్యలు చేస్తున్నారు. అందరి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు’ అని కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలే చేశారు.

సంచలన ప్రకటన..

రషీద్ హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని.. పనికిమాలిన కారణాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తామని మాజీ సీఎం ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు.

ఎస్‌బీఐలో 1040 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి 60 లక్షల వరకు జీతం

SBI SO Recruitment: ఎస్‌బీఐలో 1040 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి 60 లక్షల వరకు జీతం

SBI SO Notification: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి జులై 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1040 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో రెగ్యులర్ పోస్టులు 833కాగా.. బ్యాక్లాగ్ పోస్టులు 207 ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 19 నుంచి ఆగస్టు 8 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తుల షార్ట్లిస్ట్ంగ్, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.

వివరాలు..

* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1040 (బ్యాక్లాగ్-207, రెగ్యులర్ 833)

పోస్టుల కేటాయింపు:జనరల్-348, ఈడబ్ల్యూఎస్-82, ఓబీసీ-270, ఎస్టీ-129, ఎస్సీ-211.

సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 02 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం/సీఏ/సీఎఫ్ఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 30 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 61 లక్షలు.

సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (సపోర్ట్): 02 పోస్టులు
అర్హత: డిగ్రీ/పీజీ డిగ్రీ (కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్/మేనేజ్మెంట్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 25 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 20.50 లక్షలు.

ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 01 పోస్టు
అర్హత: ఎంబీఏ/ఎంఎంఎస్/పీజీడీఎం/ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్/పీజీడీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 25 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 30 లక్షలు.

ALSO READ:
పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు – టెన్త్ అర్హత చాలు, ఎలాంటి పరీక్ష లేదు

ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 02 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 30 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 30 లక్షలు.

రిలేషన్షిప్ మేనేజర్: 273
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 23 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 30 లక్షలు.

వైస్ ప్రెసిడెంట్(వీపీ)-వెల్త్: 643
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు 60 శాతం మార్కులతో ఎంబీఏ(బ్యాంకింగ్/ఫైనాన్స్/మార్కెటింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 26 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 45 లక్షలు.

రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 32 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 28 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 52 లక్షలు.

రీజినల్ హెడ్: 06 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 12 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 35 – 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 66.50 లక్షలు.

ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 30 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి. NISM సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 28 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 44 లక్షలు.

ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్: 49 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి. NISM సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 28 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: ఏడాదికి 26.50 లక్షలు.

దరఖాస్తు ఫీజు:రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్లిస్ట్ంగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 18.07.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.07.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 08.08.2024.

Notification

Online Application

Website

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం..

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్‌ని గౌరవ అతిథిగా ప్రకటించింది.

ఈ వేడకకు రామ్‌చరణ్ అతిథిగా వెళ్లడమే కాదు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డును సైతం ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

మీ అందరికి ఓ శుభవార్త. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. దీనిపై మెగాపవర్ స్టార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో తాను ఓ భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ విజయం చిన్నది కాదని, విశ్వవ్యాప్తం అని అన్నారు. మెల్‌బోర్న్‌లో ఆడియెన్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు.

ఐఎఫ్ఎఫ్ఎమ్‌ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు జరగనుంది.

అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి.. రూ. 51 నుంచి ప్లాన్లు ప్రారంభం..

Bharati Airtel: అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి.. రూ. 51 నుంచి ప్లాన్లు ప్రారంభం..

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటై భారతీ ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్లను ప్రారంభించింది. ఇప్పటి వరకూ కేవలం 2జీబీ కన్నా ఎక్కువ రోజువారీ డేటాను ప్లాన్లకు మాత్రమే పరిమితం చేసిన 5జీ డేటా యాక్సెస్ ను ఇప్పుడు అంతకన్నా తక్కువ డేటా ప్లాన్లు వినియోగదారులకు అందించేందుకు ఈ కొత్త డేటా బూస్టర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త డేటా బూస్టర్ల సాయంతో 1జీబీ, 1.5జీబీ రోజు వారీ డేటా ప్లాన్లు ఉన్న కస్టమర్లు కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త డేటా బూస్టర్ల ప్యాక్లు రూ. 51, రూ. 101, రూ. 151కి అందుబాటులో ఉన్నాయి. ఈ పాక్ లు 3జీబీ, 6జీబీ, 9జీబీ డేటాను అందిస్తాయి. ఇవి కేవలం డేటా బూస్టర్లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలి. దీని వ్యాలిడిటీ ఇప్పటికే వినియోగిస్తున్న 5జీ బేస్ ప్లాన్ ఆధారంగానే ఉంటుంది. వినియోగదారులు నిరంతరాయంగా ఇంటర్నెట్ ను వినియోగించేందుకు వీలుగా ఈ డేటా బూస్టర్ ప్యాక్ లను తీసుకొచ్చినట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.

డేటా బూస్టర్ ప్లాన్ల వివరాలు ఇవి..
ఎయిర్ టెల్ రూ. 51 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 3జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది. ఎయిర్ టెల్ రూ. 101 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 6జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది. ఎయిర్ టెల్ రూ. 151 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 9జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది.

మరికొన్ని ప్లాన్లు..
ఎయిర్ టెల్ 5జీ సేవలను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ డేటా బూస్టర్లు ప్రవేశపెట్టింది. వీటికి అదనంగా మరికొన్ని 5జీ డేటా ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. రూ. 249 నుంచి ఈ ప్లాన్లను ప్రారంభిస్తోంది. వీటిల్లో కొన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి రూ. 449 నుంచి ప్రారంభమవుతున్నాయి.

రిలయన్స్ జియోతో పోటీ..
మన దేశంలో టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ టెల్ ఈ డేటా బూస్టర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి ఈ 5జీ డేటా బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. 1జీబీ, 1.5జీబీ రోజువారీ మొబైల్ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లకు యాడ్ ఆన్ గా ఈ డేటా బూస్టర్లను అందిస్తోంది. వీటి ధరలు రూ. 51, రూ. 101, రూ. 151 ధరతో ఈ ప్లాన్లు జియో వెబ్ సైట్ లేదా యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసగా 3జీబీ, 6జీబీ, 9జీబీ యాడ్ డేటాను అందిస్తాయి. రూ. 479, రూ. 1899 ప్రీపెయిడ్ బేస్ ప్లాన్ యాక్టివ్ లో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ డేటా బూస్టర్లు జియో అందిస్తోంది.

Calcium Rich Foods: పాలంటే ఇష్టంలేదా? .. వీటిద్వారా కూడా క్యాల్షియం పొందొచ్చు

Calcium Rich Foods: పాలంటే ఇష్టంలేదా? .. వీటిద్వారా కూడా క్యాల్షియం పొందొచ్చు

ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కాల్షియం స్థాయిలపై ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందికి లాక్టోస్ సరిపడా ఉండదు. అందువల్ల వారు పాలు తాగితే కడుపులో ఎక్కువసేపు నిలవవు. వెంటనే వాంతులు అవ్వడం జరుగుతుంది. అయితే పాలు తీసుకోకపోతే శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది? అని అనుకుంటున్నారా? మరేం పర్వాలేదు.. ఈ ఆహారాల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అలసందలు చాలా మందికి ఇష్టమైన గింజలు. వీటితో తయారు చేసిన వంటకాలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. కొందరు అలసందలతో టోఫు కూడా తయారు చేస్తుంటారు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. టోఫు అనేది చీజ్ లాగా కనిపించే ఒక రకమైన ఆహారం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

బాదంపప్పులో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే శరీరంలో క్యాల్షియం లోటు ఉండదు. అలాగే బ్రోకలీలో కూడా కాల్షియం తక్కువేమీ కాదు. ఇది ఎంతో రుచికరమైన కూరగాయ. దీన్ని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

సాల్మన్ చేపలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ డి అద్భుతమైన మూలం. ఈ సముద్ర చేప కాల్షియం శోషణకు కూడా సహాయపడుతుంది.

కాలే ఆకులు కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ కూరగాయ శరీరానికి కాల్షియం అందించడమే కాకుండా, కణాల నష్టాన్ని నివారిస్తుంది.

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి..

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి..

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్‌ ఖాతాపై అవగాహన ఉండే ఉంటుంది. ఉద్యోగికి వచ్చే జీతంలో కొత్త మొత్తాన్ని ప్రతీ నెల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అకౌంట్‌కు జమ చేస్తుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మధ్యలో ఏవైనా అత్యవసర ఆర్థిక పరిస్థితులు వచ్చినా పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఇంతకీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉంది.? ప్రతీ నెల అసలు ఎంత అమౌంట్ యాడ్‌ అవుతుంది.? లాంటి వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. పీఎఫ్‌ బ్యాలన్స్‌తోపాటు ఎంత అమౌంట్‌ యాడ్‌ అవుతుంది లాంటి వివరాలు తెలుసుకునేందుకు 4 మార్గాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రతీ ఉద్యోగికి పీఎఫ్‌ అకౌంట్‌ కచ్చితంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా పీఎఫ్ అకౌంట్‌కి మీ మొబైల్ నంబర్‌ను లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.

* ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇందుకు ముందు మీ ఫోన్‌ నెంబర్‌ UANతో రిజిస్టర్ అయి ఉండాలి. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 7738299899కి EPFOHOUANENG అని ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. దీంతో వెంటనే మీ ఈపీఎఫ్ అకౌంట్ సహా అందులోని బ్యాలెన్స్ వివరాలు మీకు మెసేజ్‌ రూపంలో వస్తాయి.

* ఇక మిస్డ్‌ కాల్‌ ద్వారా కూడా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 9966044425కు మిస్డ్ ఇస్తే చాలు. వెంటనే మీకు పీఎఫ్‌ బ్యాలన్స్‌ వివరాలతో కూడిన మెసేజ్‌ వస్తుంది.

* వెబ్‌సైట్‌ ద్వారా కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.inలోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌ పేజీలో సర్వీసెస్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని For Employessపై క్లిక్‌ చేయాలి. తర్వాత పాస్‌బుక్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మీ UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. దీంతో మీ పీఎఫ్‌ అమౌంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు సవివరంగా కనిపిస్తాయి. మీరు గతంలో పనిచేసిన సంస్థలకు సంబంధించిన పీఎఫ్‌ అమౌంట్‌ కూడా కనిపిస్తుంది.

* ఉమంగ్ మొబైల్ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ అకౌంట్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌ లేదా యాపిల్ స్టోర్‌ నుంచి UMANG యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేసి EPFOపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత View Passbook ఆప్షన్ ఎంచుకొని.. మీ UAN నంబర్, పాస్‌వర్ ఎంటర్‌ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క కాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

Amla Health Benefits:పోషకాల గని ఉసిరి.. దీనిలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. ఆమ్లాను విటమిన్ సి పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఉసిరిని అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా పేర్కొంటారు. అనేక వ్యాధులను నయం చేయడానికి ఇప్పటికీ ఆయుర్వేదంలో ఉసిరిని వినియోగిస్తారు. ఉసిరి రుచి పుల్లగా వగరుగా ఉన్నప్పటికీ.. ఇది అద్భుతమైనదని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు. రోజూ ఉసిరికాయ తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి, ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి జలుబు, జ్వరం, ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదనంగా, ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

రోజూ ఒక్క ఉసిరికాయ తినడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. దీన్ని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇంకా వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే.. పరగడుపున దీనిని తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు..

రోజూ ఒక్క ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఉసిరిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా మలబద్ధకం సమస్యను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఉసిరిలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కళ్ళకు చాలా ముఖ్యమైనది. ఉసిరికాయను రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.. కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జుట్టు మందంగా – మెరిసేలా చేస్తుంది: ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి. అంతేకాకుండా, ఇది జుట్టును మందంగా, బలంగా, మెరిసేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: ఆమ్లా కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇందులోని పీచు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. ఇంకా ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది.. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయను ఎలా తినాలి?
ఉసిరికాయను అనేక రకాలుగా తినవచ్చు. మీకు కావాలంటే పచ్చిగా తినవచ్చు. లేదా జామ్, చట్నీ లేదా జ్యూస్ తయారు చేసుకోని తీసుకోవచ్చు.. అయినప్పటికీ, గరిష్ట ప్రయోజనాల కోసం పచ్చి ఉసిరి తినడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

Personality Test: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

Personality Test: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

ప్రపంచ నలుమూలల ‘ఫేస్ రీడింగ్’ నిపుణులు చాలామందే ఉన్నారు. వీరంతా కూడా మీ ముఖం ఆకృతిని బట్టి.. మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంటారు. అలాగే మీ ముఖం చూసి.. మీ ఆలోచనలు చెప్పొచ్చునన్నది ఇంగ్లీష్ సామెత. అవునండీ.! మీ జీవితంలో మీరు ఎదుర్కునే సవాళ్లను సైతం మీ ముఖం ఆకృతిని బట్టి తెలుసుకోవచ్చునట. జీన్ హానర్ అనే ఫేస్ రీడింగ్ ఎక్స్‌పర్ట్.. ముఖం ఆకారాన్ని బట్టి.. వారి లక్షణాలు చెప్పొచ్చునని తెలిపారు. దానితో వారి వ్యక్తిత్వాన్ని కూడా చెప్పేయొచ్చునట. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

గుండ్రని ముఖం:

మీది గుండ్రని ముఖం అయితే.. మీరు ఎంతో దయతో, ఉదారంగా ఉంటారట. అలాగే ఇతరులకు మీరు ఎంతగానో విలువనిస్తారు. ఇతరులను చెప్పేది వింటూ.. వారిని నొప్పించకుండా.. వారితో చాలా సున్నితంగా మాట్లాడతారట. అమాయకంగా, ఏది ఆశించకుండా ఉండే మీ గుణాల వల్ల.. అప్పుడప్పుడూ ఇతరుల చేతిలో మీరు మోసపోతుంటారు

హార్ట్ ఫేస్:

వీరిది చాలా క్రియేటివ్ మైండ్. అలాగే స్ట్రాంగ్ మెంటాలిటీ. సామాజికంగా చురుగ్గా ఉండటమే కాకుండా.. లీడర్‌షిప్ క్వాలిటీలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ విషయంలోనూ లోతుగా ఆలోచిస్తారు. అలాగే సరికొత్త థాట్స్‌ను గ్రహించడంలో మీరే ముందుంటారు.

కోల మొహం:

వీరు చాలా తెలివైనవారు, ఆచరణాత్మకంగా, పద్దతిగా ఉంటారు. ఒకటి అనుకుంటే.. అది సాధించేవారు విడిచిపెట్టరు. మీకు ఐక్యూ ఎక్కువ. అలాగే ఇతరులను ఈజీగా ఆకర్షించుకుంటారు.

చతురస్రాకార మొహం:

వీరు ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎలప్పుడూ పోటీపడే స్వభావంతో ఉంటారు. అలాగే మీలో బిజినెస్‌మెన్ లక్షణాలు చాలా ఎక్కువ. మీలో తెలివి ఎక్కువ. ఒత్తిడిలో ఉన్నా.. మీరు కూల్‌గా పని చేయగలరు.

అమెరికా నుంచి వచ్చాక ఈ బాగోతం బయటపడింది: శాంతి భర్త మదన్‌మోహన్‌

అమెరికా నుంచి వచ్చాక ఈ బాగోతం బయటపడింది: శాంతి భర్త మదన్‌మోహన్‌

విజయవాడ: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతితో తనకు చట్టబద్ధంగా విడాకులు కాలేదని ఆమె భర్త మదన్‌మోహన్‌ తెలిపారు. గత రెండేళ్లుగా అమెరికాలో ఉన్నానని.. జనవరిలో తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చాక బాగోతం బయటపడిందన్నారు. ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మదన్‌మోహన్‌ మాట్లాడారు.

ఆమే విజయసాయిరెడ్డి పేరు చెప్పారు
‘‘బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశమిది. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపారు. నేను షాక్‌ అయ్యాను. ఐవీఎఫ్‌ చేయించుకోవాల్సిన అవసరమేంటని నిలదీశాను. ఈ క్రమంలో పలుమార్లు మా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఓసారి ఆమే స్వయంగా విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. ఆయనే తనకు డోనర్‌ అని.. ఆయన ద్వారానే ఐవీఎఫ్‌ చేయించుకున్నట్లు చెప్పారు. నాకు ఆమెతో ఇప్పటికే ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని శాంతిని కోరా. విడాకుల కోసం ఆమె చాలా బెదిరించింది. కుమార్తెలు ఉన్నందున సమాధానం చెప్పాలని నిలదీశా’’

ఆ బాబుకు తండ్రి ఎవరో తేలాలి
‘‘విశాఖలోని ఓ ఆస్పత్రికి వెళ్లి అడిగితే వివరాలు ఇచ్చారు. అక్కడి కేస్‌ షీట్‌లో పోతిరెడ్డి సుభాష్‌ పేరు ఉంది. ఆ తర్వాత కొన్ని వివరాలు సేకరిస్తే సుభాష్‌ వైకాపా హయాంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది అని తెలిసింది. సుభాష్‌తో మాట్లాడితే బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంతి మాత్రం తన భర్త సుభాషే అని ఫొటోలు చూపిస్తున్నారు. ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్‌లో అది మహావృక్షమై కూర్చొంటుంది. అందుకే దీన్ని పరిష్కరించాలి. నాతో పాటు విజయసాయిరెడ్డి, సుభాష్‌లకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించాలి. ఏడాది బాబుకు న్యాయం జరగాలి. ఆ చిన్నారికి తండ్రి ఎవరో తెలియాలి. భవిష్యత్‌లో స్కూల్‌లో చేర్పిస్తే తండ్రి స్థానంలో ఎవరి పేరు రాయాలి?ఇంతవరకు శాంతి కూడా ఆ బాబు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదు’’

అది ఫేక్‌ డాక్యుమెంట్‌
‘‘2016లో నేను విడాకుల డాక్యుమెంట్‌పై సంతకం చేసినట్లు ఆమె ఆరోపిస్తోంది. అది ఫేక్‌ డాక్యుమెంట్‌. కావాలంటే దాన్ని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించవచ్చు. డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి తండ్రి ఎవరో తేల్చాక రాతపూర్వకంగా ఓ డాక్యుమెంట్‌ ఇవ్వడమే దీనికి శాశ్వత పరిష్కారం. అలా చేస్తే నాకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయంపై ఏపీ హోంమంత్రి, డీజీపీని కలిశాను. నిజానిజాలను తేలుస్తామన్నారు’’ అని మదన్‌మోహన్‌ తెలిపారు.

అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్నితింటేసరి

అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్నితింటేసరి

అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. సాధారణ గ్యాస్-గుండె మంటతో కడుపులో విపరీతమైన నొప్పి బాధిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. యాంటాసిడ్లు ప్రతిసారీ తీసుకోలేం. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే పండిన బొప్పాయిని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..

పండిన బొప్పాయిని రోజూ తింటే ఎలాంటి హాని జరగదు. బదులుగా ఈ పండు ఏవైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. పండిన బొప్పాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్‌లను చిన్న పెప్టైడ్‌లు, అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఇవి ఆహారం సులభంగా జీర్ణమై పోషకాలను శరీరం గ్రహించేందుకు ఉపయోగపడతాయి.

పండిన బొప్పాయిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు అధికమొత్తంలో ఉంటాయి. ఈ పండు మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పండిన బొప్పాయిలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో మంటను తగ్గించి, అల్సర్, గ్యాస్ట్రైటిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.

పండిన బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి హైడ్రేషన్ చాలా అవసరం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో, దాని నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. బొప్పాయికి ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను సాధారణీకరించడంలో సహాయపడుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, గొంతు చికాకు వంటి సమస్యలను నివారిస్తుంది.

పండిన బొప్పాయిలో కోలిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలుగా పనిచేస్తాయి. పండిన బొప్పాయి తినడం వల్ల పేగు మంట తగ్గుతుంది. అదనంగా అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

Salt : ఉప్పులో 8 రకాలు ఉన్నాయి తెలుసా. వీటిలో ఏది బెస్ట్.!

Salt : ఉప్పులో 8 రకాలు ఉన్నాయి తెలుసా. వీటిలో ఏది బెస్ట్.!

Salt : ఉప్పు లేకుండా వంట చేయటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.సాధారణంగా తెల్ల ఉప్పును వంటలలో ఎక్కువగా వాడతారు. దీనిని టేబుల్ సాల్ట్ అని పిలుస్తారు.

ఇవి మాత్రమే కాక ఇంకా కొన్ని రకాల ఉప్పులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే అవి పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు ఇలా ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి. సాధారణంగా పింక్ సాల్ట్ మరియు బ్లాక్ సాల్ట్ లను సలాడ్లు మరియు స్నాక్స్ లాంటి వాటిలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అసిడిటీని నియంత్రించడానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వైట్, పింక్, బ్లాక్ ఉప్పులు మాత్రమే కాదు మొత్తం ఎనిమిది రకాల ఉప్పులు మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు వైట్ సాల్ట్,పింక్ సాల్ట్,బ్లాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్, అల్లాయ్ సాల్ట్, కొషర్ సాల్ట్, స్మోక్ డ్ సాల్ట్,పార్సీ సాల్ట్ ఇలా ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే విషయంలో చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉన్నది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Salt టేబుల్ సాల్ట్

టేబుల్ సాల్ట్ అనేది ఎంతో ఈజీగా దొరికే మరియు సాధారణంగా వాడే ఉప్పు. దీనిలో ఎలాంటి మలినాలు అనేవి ఉండవు. దీనిలో ఆహారం కూడా ఎంతో బాగుంటుంది. దీనిని ఎన్నో ప్రక్రియల తర్వాత తయారు చేయడం జరుగుతుంది. అందుకే ఈ ఉప్పు అనేది చాలా పొడిగా మరియు వదులుగా కూడా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే టేబుల్ సాల్ట్ లో అధిక భాగం అయోడిన్ తో కలిపి ఉంటుంది. ఇది థైరాయిడ్ లాంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఎంతో సహాయం చేస్తుంది. అలాగే పిల్లల్లో ఎంతో మెరుగైన మెదడు అభివృద్ధి కి ఈ అయోడిన్ అనేది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే…

బ్లాక్ సాల్ట్ : ఇది హిమాలయన్ ఉప్పు. సాధారణంగా దీనిని బ్లాక్ సాల్ట్ అని అంటారు. ఈ ఉప్పును తయారు చేసేటప్పుడు దీనిలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మరియు విత్తనాలు, మొక్కల బెరడును వాడతారు. ఈ బ్లాక్ సాల్ట్ ను ఎక్కువ కాలం పాటు నిప్పులో ఉడికించి తయారు చేస్తారు. అందుకే ఇది నలుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఈ ఉప్పు కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం, అసిడిటీ ఇతర సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుంది.

పింక్ సాల్ట్ : పింక్ సాల్ట్ అనగా రాక్ సాల్ట్ అని అర్థం.ఈ ఉప్పు గనులు అనేవి పాకిస్తాన్ లోని హిమాలయాల ఒడ్డున ఉంటాయి. ఈ ఉప్పు అనేది ఎంతో స్వచ్ఛమైనది మరియు ఉత్తమమైనదిగా చెబుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిలో దాదాపుగా 84 ముఖ్యమైన ఖనిజాలనేవి ఉంటాయి. ఈ ఉప్పును మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో రకాల శారీరక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ పింక్ సాల్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ ఉప్పుతో ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది…

IT News: ఉద్యోగాల బాజా మోగించిన ఇన్ఫోసిస్.. సంతోషంలో టెక్ ఫ్రెషర్స్..

IT News: ఉద్యోగాల బాజా మోగించిన ఇన్ఫోసిస్.. సంతోషంలో టెక్ ఫ్రెషర్స్..

Infosys Hiring: దేశీయ ఐటీ రంగంపై అలుముకున్న అస్థిర మబ్బులు వీడుతున్నట్లు ప్రస్తుత త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫలితాలను ప్రకటించిన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి.

ఈ క్రమంలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న జాబ్ మార్కెట్లో పెద్ద కోలాహలం కొనసాగుతోంది.

దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ అంచనాలకు మించి బలమైన లాభదాయకతను కంపెనీ నమోదు చేసింది. అలాగే వ్యాపారంలో కొనసాగిన గడ్డు పరిస్థితులతో క్యాంపస్ హైరింగ్ నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే 2025 సంవత్సరంలో కొత్తగా ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ణయించింది.

2025 ఆర్థిక సంవత్సరానికి 15,000-20,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు తెలిపింది. దీంతో రాబోయే కళాశాల గ్రాడ్యుయేట్‌లకు ఆశలను కలిగిస్తోంది. వాస్తవానికి క్యాంపస్ హైరింగ్ నిర్వహించటానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర మార్గాల్లో ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11,900 మంది ఫ్రెషర్‌లను నియమించుకుంది. దీనికి ముందు FY23లో 50,000 మంది ఫ్రెషర్‌ల నుంచి 76 శాతం క్షీణత కనిపించింది. గడచిన కొన్ని త్రైమాసికాలుగా తాము చురుకైన హైరింగ్ బేస్‌కి మారినట్లు జూలై 18న జరిగిన కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా వెల్లడించారు.

జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 2000 మంది ఉద్యోగుల క్షీణతను చూసింది. వాస్తవానికి ఇది అంతకు ముందలి త్రైమాసికం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 85 శాతం మందిని వివిధ ప్రాజెక్టుల్లో వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే వ్యాపార వృద్ధికి అనుగుణంగా కొత్త హైరింగ్స్ ఉంటాయని జయేష్ సంఘ్‌రాజ్కా పేర్కొన్నారు. తాము వృద్ధిని ఎలా చూస్తాము అనేదానిపై ఆధారపడి ఈ సంవత్సరం 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించాలని చూస్తున్నట్లు వెల్లడించారు.

ఇదే క్రమంలో భారత ఐటీ సేవల రంగంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ FY25లో దాదాపు 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మెుదటి త్రైమాసికంలో దాదాపు 11,000 మంది ట్రైనీలను నియమించుకున్నట్లు కంపెనీ ఇటీవల తన క్యూ1 ఆర్థిక ఫలితాల్లో ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస్ హెడ్ కౌంట్ వరుసగా ఆరో త్రైమాసికంలో గతంతో పోల్చితే 1908 మేర తగ్గుదలను చూసింది. అయితే మార్చి కాలంతో పోలిస్తే టీసీఎస్ మొత్తం హెడ్‌కౌంట్ 1,759 వరుసగా పడిపోయింది. HCLTech హెడ్‌కౌంట్ వరుసగా 8,080 తగ్గగా, LTIMindtree 284 మంది ఉద్యోగులను క్యూ1లో కొత్తగా జోడించింది.

జగన్‌ కు బిగ్‌ షాక్‌. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు !

జగన్‌ కు బిగ్‌ షాక్‌. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు !

వర్షాలు కురుస్తునందున రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు జగన్. అయితే.. ఈ తరుణంలోనే… వై ఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు.

వై ఎస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరారు మాజీ మంత్రులు, ఎంపీలు,.ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఎక్కడికక్కడ నేతల కార్లు వై ఎస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు.

తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు లో పార్టీ నేతల వాహనాలు ఆపేపారు పోలీసులు. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు పోలీసులు. సరిగ్గా నడవని బీపీ వాహనం ఇచ్చారు పోలీసులు. వాహనం బాగోకపోవడం తో ప్రయివేటు వాహనం లో వినుకొండ వెళ్తున్నారు వై ఎస్ జగన్. పోలీసులు తీరుపై మండి పడుతున్నారు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాగా, బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

”చైల్డ్ పోర్నోగ్రఫీ” చూడటం నేరం కాదు..

Karnataka High Court: ”చైల్డ్ పోర్నోగ్రఫీ”ని చూడటం నేరం కాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది నేరాన్ని ఆకర్షించదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

పిల్లల అశ్లీల వెబ్‌సైట్‌ని 50 నిమిషాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌పై అశ్లీల వెబ్‌సైట్ చూశాడని ఆరోపణలు వచ్చాయి. ”కోర్టు దృష్టిలో IT చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం వాటిని ప్రసారం చేయడం, షేర్ చేయడం నేరం. దీనికి మించి పిటిషన్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవు. 2008లోని సెక్షన్ 67B ప్రకారం వాటిని వీక్షించడం నేరం కాదు” అని జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ కేసు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉపశమనం కలిగించింది.

బెంగళూర్ హోసా కోట్‌కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇనాయతుల్లా ఎన్, మార్చి 23, 2022న పిల్లల అశ్లీల వీడియోలను వీక్షించాడని ఆరోపించారు. ఈ సంఘటనని సైబర్ టిప్‌లైన్ గుర్తించింది. ఇనాయతుల్లా మొబైల్ నంబర్ ఐపీ అడ్రస్‌ని ట్రాక్ చేసిన తర్వాత మే 3, 2023న అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయబడింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67B కింద క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించింది. అయితే, ఈ కేసు ఈ చట్టం కిందకు వస్తుందా..? లేదా..? అనేదానిపై కోర్టు విచారించింది. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, ప్రచురించడం నేరం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలాంటి కంటెంట్‌ని ప్రసారం చేయడం లేదా ప్రచురించడం చేయలేదని, కేవలం వీక్షించాడని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం నాగప్రసన్న, ఐటీ చట్టంలోని 67బీలో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఆరోపణలు లేవని తేల్చారు. ఈ చట్టం ద్వారా అశ్లీల వీడియోలు ప్రసారం లేదా ప్రచురించే వారిని మాత్రమే టార్గెట్ చేస్తుందని, వీక్షించే వారిని కాదని కోర్టు పేర్కొంది.

బిగ్ షాక్ : విడాకులు తీసుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. పోస్ట్‌తో క్లారిటీ!

బిగ్ షాక్ : విడాకులు తీసుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. పోస్ట్‌తో క్లారిటీ!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ, అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్ మధ్య అభిషేక్ బచ్చన్ విడాకులకు సంబంధించిన పోస్టు పై స్పందించడంతో కొందరు నిజంగానే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు, దానికి క్లారిటీ ఇదే అంటూ ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళ్లితే.. ఇన్‌స్టా గ్రామ్‌లో గ్రే డైవోర్స్ కు సంబంధిచిన ఓ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు. పోస్టులో ఏమున్నదంటే? విడాకులు ఎవరికీ అంత సులభం కాదు, వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకొని ఉన్న వీడియోలు మన మనసును కదిలిస్తాయి. కొంత మంది అలాంటి కలలు కనేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వలన వారు తమ బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.

విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది. వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు గ్రే విడాకులు అంటే ? సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి, తర్వాత వివాహం రద్దు చేసుకొని విడాకులు తీసుకోవాలనుకునే వారు, వారికి సంబంధించిన నిబంధనలు, వారు విడాకులు తీసుకోవడానికి గల కారణాల అంశాలు ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి. కాగా, ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకున్నారు, దానికి క్లారిటీ ఇదే అంటూ కొందరూ ప్రచారం చేస్తున్నారు.

Home loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..ఆ లోన్ ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఇవే!

Home loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..ఆ లోన్ ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఇవే!

సొంతిల్లు అనేది నేడు ప్రతి ఒక్కరి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించే ఆదాయం, ఖర్చులపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆ కల సాకారం అవుతుంది.

కొందరు సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే, మరికొందరు అప్పు తీసుకుని కట్టుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిన తర్వాత సొంతిల్లు సమకూర్చకోవడం దాదాపు సాధ్యంగానే మారింది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు అపార్టుమెంట్లను కట్టి వాటిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. వాటికి బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆ రుణం ద్వారా ఫ్లాట్ ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంకుల ప్రతినెలా ఈఎంఐ రూపంలో వాయిదాలు చెల్లించవచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ముందుగా కొంత డబ్బును డౌన్ పేమెంట్ గా కట్టాలి. మిగిలిన దానిని బ్యాంకు రుణంగా ఇస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో హోమ్​ లోన్ తీసుకున్న వ్యక్తి బకాయిలు పూర్తిగా చెల్లించకముందే చనిపోతే ఆ లోన్ ఎవరు చెల్లించాలి? ఈ విషయంలో బ్యాంక్​ రూల్స్​ ఎలా ఉంటాయనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి రుణం పూర్తిగా చెల్లించకముందే మరణిస్తే.. ఆ లోన్​ తిరిగి చెల్లించే బాధ్యత హోమ్ లోన్ కో అప్లికెంట్ లేదా చట్టపరమైన వారసులపై ఉంటుంది. ఒకవేళ రుణానికి కో అప్లికెంట్ ఉంటే వారు లోన్​ చెల్లించడానికి చట్టపరంగా బాధ్యత వహిస్తారు. ఒకవేళ కో అప్లికెంట్ లేనప్పుడు లోన్​ ఇచ్చిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ EMI చెల్లింపుల కోసం చట్టపరమైన వారసులను సంప్రదిస్తుంది. ఆ మొత్తాలను వారసులు తిరిగి చెల్లించాలి. వారు కూడా లోన్​ చెల్లించడంలో విఫలమైతే బకాయిలను తిరిగి పొందడానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి రుణం అందించిన సంస్థ లేదా బ్యాంకుకి హక్కు ఉంటుంది.

ఇన్సూరెన్స్​

చాలా మంది హోమ్ లోన్స్ తీసుకునే సమయంలోనే లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీలను ఎంచుకుంటారు. అలా పాలసీ తీసుకున్న వ్యక్తుల లోన్ మెుత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. బకాయిలు చెల్లించకుండా లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే బకాయి ఉన్న లోన్ మొత్తాలను ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో బీమా కంపెనీ హోమ్ లోన్ మొత్తాన్ని బ్యాంక్ లేదా లోన్ ఇచ్చిన సంస్థతో సెటిల్ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది. కాగా దీని కోసం కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను వారసులు లోన్ అందించిన సంస్థకు అందించాలి.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌

అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో కేవలం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకుంటే.. ఆ క్లెయిమ్‌ మొత్తం నామినీ అకౌంట్​లో డిపాజిట్​ అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ తర్వాత వారసుడికి ఈ క్లెయిమ్‌ మొత్తం అందుతుంది. అయితే, బ్యాంకు రుణ బకాయి వసూలుకు ఇక్కడ ఒక సమస్య ఉంది. టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని బ్యాంకు రుణ బకాయి కింద తీసుకోలేదు. అంటే ఈ టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు వారసుడికి మాత్రమే ఉంటుంది. గృహ రుణ బీమా లేనప్పుడు రుణానికి కో అప్లికెంట్, చట్టపరమైన వారసుడు నుంచి బ్యాంకు బకాయి మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని లోన్​ బకాయికి బ్యాంకు అడ్జెస్ట్ చేసుకుంటుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు ఇలాంటి రూల్స్ తెలుసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు హోమ్ లోన్ తీసుకునే సమయంలో దానికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం బెటర్.

Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ మోసాలకు పాల్పడుతున్నాయి.

వంద శాతం వసూలు పేరిట రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా నగరంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగు చూసింది. జీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ రూ.120 కోట్ల పైగా మోసానికి పాల్పడింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీగా వసూల్లు చేసిన..జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఛైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు.

మరో ఇద్దరు డైరెక్టర్లు పరారులో ఉన్నారు. వీరంతా కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. విల్లాల పేరుతో భారీగా డబ్బులు కలెక్షన్ చేసి మొహం చాటేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, సీసీఎస్లో జీఎస్ఆర్పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తో పాటు శివార్ ప్రాంతంలో ఫ్లాట్లు వెళ్లాలా ఫ్రీ లాంచ్ ఆఫర్ల మోసానికి పాల్పడ్డారు. భూమి లేకపోయినా ఉన్నట్టు చూయించి వసూళ్లు చేశాడు సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు. ఇతరుల భూమిని తమ భూమిగా చూపెట్టి ఆఫర్లు పెట్టాడు. నమ్మిన జనం మోసపోయారు.

UPI Payment New Rules: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. కొత్త రూల్ వచ్చింది..!

UPI Payment New Rules: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. కొత్త రూల్ వచ్చింది..!

మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ సర్వ సాధారణం అయిపోయాయి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, బ్యాంకు ఖాతా ఉన్న మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతుండటంతో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి.

ఛాయ్ దుకాణాల నుంచి బంగారం దుకాణాల దాకా ”ఫోన్ తీయ్.. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయ్” అనే రీతిలో ట్రాన్షాక్షన్స్ నడుస్తున్నాయి. లిక్విడ్ క్యాష్ వాడకం తగ్గించి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయం తెలిస్తే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో చాలామంది చింతలు తీరిపోయినట్టే.

ఇంతకీ.. విషయం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ చేసే సందర్భాల్లో యూజర్లు కొన్నిసార్లు డబ్బును పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు. ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఇకపై.. ఆ తిప్పలు కాస్తంత తగ్గించుకునే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఒక టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.

పొరపాటున డబ్బును ఒకరికి పంపబోయి మరొకరికి పంపి ఉంటే వెంటనే18001201740 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి వారికి ఎదురైన సమస్యను తెలియజేయాలి. ఈ ఫిర్యాదు అందుకున్న 48 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు లేదనుకుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు. కానీ బ్యాంకులో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. తిరిగి డబ్బు ఖాతాలోకి రావడానికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ సంబంధిత సమస్యలపై త్వరితగతిన స్పందించకపోవచ్చు. రోజువారీ పనుల్లో తలమునకలై పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అందువల్ల.. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. యూపీఐ మోడ్లో పేమెంట్స్ చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి విషయం ఇది అని చెప్తే 48 గంటల్లోగా రిఫండ్ పొందే సదుపాయం అందుబాటులోకి రావడం హర్షనీయం.

Hemoglobin:కేవలం 5 రూపాయిల ఖర్చుతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు

Hemoglobin:కేవలం 5 రూపాయిల ఖర్చుతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు

Hemoglobin:కేవలం 5 రూపాయిల ఖర్చుతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అనేది శరీరం అంతట ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి, జీవక్రియ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఎర్ర రక్త కణాల్లో కనిపిస్తుంది. రక్తం ఎర్రగా ఉండటానికి హిమోగ్లోబినే కారణం. హీమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్ ను రక్త కణాల నుండి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. మనం ఊపిరి వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది.

నువ్వులను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. నువ్వులలో ఐరన్, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కాపర్‌ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారిలో నీరసం,అలసట కనిపిస్తుంది. నువ్వులు,బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని రోజుకి ఒకటి తింటే సరిపోతుంది.

ఈ మధ్య కాలంలో మిల్లెట్స్‌ వాడకం చాలా ఎక్కువ అయింది. మిల్లెట్స్ లో ఒకటైన ఊదలను ఆహారంలో బాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఊదలలో కెలొరీలు తక్కువ, ఫైబర్‌, ప్రొటీన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని చాలా తొందరగా పెంచుతుంది.

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. రోజుకి 5 ఎండుద్రాక్షను తింటే సరిపోతుంది. ఇలా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు

ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు

కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్షీల్డ్పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, అంతరాయం ఏర్పడుతోంది.

ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్స్క్రీన్పై ఫాస్టాగ్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయని, ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారితీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ’ను (ఎస్వోపీ) జారీ చేసింది.

దీంతో ఫాస్టాగ్లను సరిచేసుకోని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్షీల్డ్పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేన్లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ను సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది. ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్టాగ్లను బిగించుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్లిస్ట్లో చేర్చవచ్చునని పేర్కొంది.

ఏపీ వాలంటీర్లపై త్వరలో కీలక నిర్ణయం..?

ఏపీలో ఎన్డీయే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. అయినా కీలకమైన వాలంటీర్ల వ్యవస్ధ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఓ వెలుగు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం రెట్టింపు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై మల్లగుల్లాలు పడుతున్న కూటమి సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 2.67 లక్షల వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించగా.. అందులో లక్ష మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసేశారు. దీంతో మిగిలిన లక్షన్నర మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుుకోవాల్సి ఉంది. వీరిలో చాలా మంది ఇప్పటికే స్ధానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు విన్నవించారు. దీంతో గతంలో బలవంతంగా రాజీనామాలు చేసిన వారితో పాటు వీరిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వారికి విద్యార్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఈ మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వీటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో వేడి ఉండదు – కొత్త మంచు పర్వతాలు ఏర్పడతాయి!

భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో వేడి ఉండదు – కొత్త మంచు పర్వతాలు ఏర్పడతాయి!

ఆహ్ ! ఇది నిజం! భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో హిమాలయాల వంటి మంచుతో కప్పబడిన శిఖరాలు ఏర్పడే అవకాశం ఉంది.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లు సంవత్సరానికి 7 మిల్లీమీటర్ల చొప్పున భారతదేశం వైపు కదులుతున్నాయి.

మడగాస్కర్ మరియు సోమాలియా ప్లేట్లు భారతదేశం వైపు వెళ్లి అరేబియా సముద్రంలో కూలిపోయినప్పుడు హిమాలయాల వంటి నిర్మాణం ఏర్పడుతుంది. తద్వారా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు హిమాలయాల్లో కాశ్మీర్‌, హిమాచల్‌ వంటి శీతల ప్రాంతాలుగా మారనున్నాయి!

భవిష్యత్తులో చెన్నైలో ఎండలు ఉండవు

ఆఫ్రికన్ ఖండం ఆఫ్రికన్ మరియు సోమాలి ప్లేట్‌లతో రూపొందించబడింది. ఇందులో సోమాలి ప్లేట్ నెమ్మదిగా కదులుతోంది మరియు భారతదేశంలోని గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మరియు తమిళనాడులను ఢీకొట్టబోతోంది. ఆ భౌగోళిక సంఘటన జరిగినప్పుడు, హిమాలయాల వంటి మంచు పర్వతాలు ఏర్పడతాయి. అంతే కాకుండా చెన్నైలో ఉష్ణోగ్రత కూడా -5 డిగ్రీలకు పడిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో తమిళనాడులో వేడి ఉండదు.

సోమాలియాలో కొత్తగా ఏర్పడిన పర్వతాలు

ఆఫ్రికా కొమ్ములో తూర్పు-ఆఫ్రికన్ దేశం సోమాలియా మరియు హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ భారతదేశాన్ని ఢీకొని మంచుకొండలను సృష్టిస్తాయని ఒక అధ్యయనం తెలిపింది. పరిశోధనలో పనిచేసిన నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఉట్రెచ్ట్‌కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం, తాకిడి అతిపెద్ద పర్వత శ్రేణి, సోమాలి పర్వతాలు ఏర్పడటానికి దారితీస్తుంది. టెక్టోనిక్ ప్లేట్లలో నాటకీయ మార్పు హిమాలయాల శిఖరాలను మరియు ముంబై పైన ఉన్న సోమాలియా టవర్ పర్వతాలను జ్ఞాపకశక్తికి తగ్గిస్తుంది. ఆ సమయంలో, రెండు వేర్వేరు ఖండాలకు చెందిన దేశాలు ఒకే సూపర్ ఖండాన్ని పంచుకుంటాయి.

నెమ్మదిగా కదులుతున్న సోమాలియా ప్లేట్

డచ్ జియాలజిస్ట్ ప్రొ. డౌ J. జె. ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయంలో వాన్ హింజ్‌బెర్గెన్ మరియు అతని బృందం గ్రహం యొక్క భౌగోళిక చరిత్రను గుర్తించడానికి గత టెక్టోనిక్ ప్లేట్ కదలికలను పునర్నిర్మించారు. భవిష్యత్తులో పర్వతాలను అంచనా వేయడానికి అతను మరియు అతని బృందం యొక్క పునర్నిర్మాణాలను ఉపయోగించవచ్చా అని విలేకరులు కొన్నిసార్లు హిన్స్‌బెర్గెన్‌ను అడిగినప్పుడు, అతను అవును అని సమాధానం ఇచ్చాడు. శాస్త్రవేత్తల ప్రకారం, సోమాలియా ప్లేట్ సంవత్సరానికి 7 మిల్లీమీటర్ల చొప్పున భారతదేశం వైపు కదులుతోంది.

హిమాలయాల వంటి బలమైన మంచు పర్వతాలు ఏర్పడతాయి

భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం, టెక్టోనిక్ ప్లేట్లు అన్ని సమయాలలో కదులుతూ మరియు ఢీకొంటాయి – సంవత్సరానికి రెండు నుండి మూడు అంగుళాలు. టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొని ఉపఖండాలను ఏర్పరుస్తాయి. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక టెక్టోనిక్ ప్లేట్ క్రింద కదులుతున్నప్పుడు, ఆ ప్రక్రియను ప్లేట్ సబ్డక్షన్ అంటారు. ఢీకొనే సమయంలో, తాకిడి నుండి తప్పించుకోలేని ప్లేట్లు దానిని ఇతర ప్లేట్ కింద చేసి, పర్వతాలను ఏర్పరుస్తాయి. దీని ప్రకారం, దక్షిణ భారతదేశంలో హిమాలయాల వంటి బలమైన మంచు పర్వతాలు ఏర్పడతాయి.

ఎప్పుడు ఏర్పడుతుంది?

భారతీయ ప్లేట్‌తో సోమాలి ప్లేట్ ఢీకొనడం అనేది ప్లేట్ టెక్టోనిక్స్ అని పిలువబడే ఒక పెద్ద భౌగోళిక ప్రక్రియలో భాగం. టెక్టోనిక్ ప్లేట్‌ల మధ్య ఘర్షణలు తరచుగా భూమిని పైకి లేపుతాయి మరియు పర్వత శ్రేణుల ఏర్పాటుకు దారితీస్తాయి. ఈ సందర్భంలో, భారతీయ ప్లేట్ ప్రమేయం ఉన్నట్లయితే, అది హిమాలయన్ లేదా ప్రక్కనే ఉన్న శ్రేణుల మరింత ఉద్ధరణకు దోహదం చేస్తుంది.

‘భవిష్యత్తు మంచు పర్వతాలు’ చూడటానికి మనలో ఎవరూ సజీవంగా ఉండరు ఎందుకంటే ఇది జరగడానికి 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది!

అరగంటసేపు డివైడర్ పైనే తిష్ట.. వణికిపోయిన స్థానికులు

Srisailam: అరగంటసేపు డివైడర్ పైనే తిష్ట.. వణికిపోయిన స్థానికులు

నంద్యాల జిల్లా శ్రీశైలం… పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాత మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుత పులి చాలాసేపటి వరకు సుమారు అర్ధగంట సేపు డివైడర్ వద్ద అటూ ఇటూ తిరిగిన దృశ్యాల్ని స్థానికులు తమ సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. చాలాసేపు డివైడర్‌పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్ళిపోయింది చిరుత. జనావాసం ఉన్న ప్రాంతంలో చిరుత పులి బయటకు రావడంతో పాత మెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత పులి సంచరించగా అప్పట్లో అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో తర్వాత దాని జాడ కనిపించలేదు. కానీ మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇప్పుడు కూడా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులి నివాస ప్రాంతాలలోకి రాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అయితే స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇటు మహానంది ఆలయాన్ని కూడా చిరుత టెన్షన్ వదలడం లేదు. బుధవారం కూడా చిరుత ఆలయ శివారులో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నెల రోజుల వ్యవధిలో 20 సార్లు పైగా చిరుత ఆలయం చుట్టూ తిరిగి వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి చిరుతలు ఆలయాల పరిసరాల్లోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Lotus Seeds Benefits: తామర గింజలు ఇలా రోజూ తింటే.. క్యాన్సర్‌ సహా అనేక వ్యాధులకు దివ్యౌషధం..!

Lotus Seeds Benefits: తామర గింజలు ఇలా రోజూ తింటే.. క్యాన్సర్‌ సహా అనేక వ్యాధులకు దివ్యౌషధం..!

పూల్‌ మఖానా దీనినే లోటస్ సీడ్స్ గురించి చాలా మందికి తెలియదు. వీటిని వేయించి పాప్ కార్న్ లాగా తింటారు. ఈ ఆసక్తికరమైన విత్తనాలు పురుషుల సంతానోత్పత్తిని పెంచడం నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

లోటస్ గింజలు పోషకాల పవర్‌హౌస్. వాటిలో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల సమస్యలు, దీర్ఘకాలిక విరేచనాలు, అధిక ల్యుకోరోయా వంటి వివిధ వ్యాధుల చికిత్సకు ఇది చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. మఖానాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతుంది. ఈ విత్తనాలు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఎముకలను బలపరుస్తుంది. మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముక, మృదులాస్థి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఈ విత్తనాలు చర్మం ముడతలు, జుట్టు రాలడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.

నెయ్యిలో వేయించిన తామర గింజలు అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌గా పనిచేస్తుంది. ఇందులోని తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కంటెంట్ బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తుంది.
మఖానాను నెయ్యిలో వేయించడం వల్ల వెన్నతో కూడిన రుచి వస్తుంది. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. విటమిన్లు A, D, E, K వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. మఖానాను నెయ్యిలో వేయించడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ ఆహారం సమతుల్యమైన, పోషకమైన చిరుతిండిని అందిస్తుంది.

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. తామర గింజలను నెయ్యిలో వేయించి తింటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది చాలా మంచిది. పైగా ఆకలిని నియంత్రిస్తుంది. మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. నెయ్యి శక్తిని అందిస్తుంది. అందులో మఖానాను వేయించడం వల్ల త్వరగా, స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందుకే ఉపవాస సమయాల్లో దీన్ని అల్పాహారంగా ఆస్వాదిస్తారు. నెయ్యిలో వేయించిన మఖానా తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు

మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు

గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. తమ టీచర్‌కు తెలుగు చెప్పడం రావడంలేదని తక్షణమే ఆయనను మార్చి కొత్త తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సబ్జెక్టుపై పట్టులేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ పాఠశాలలను ఏ పరిస్థితికి తీసుకొచ్చరోనని జనం వాపోతున్నారు. టీచర్లకే తెలుగు రాకపోతే ఇక విద్యార్ధులకు ఏం నేర్పిస్తారని మండిపడుతున్నారు.

గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. తమ టీచర్‌కు తెలుగు చెప్పడం రావడంలేదని తక్షణమే ఆయనను మార్చి కొత్త తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సబ్జెక్టుపై పట్టులేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ పాఠశాలలను ఏ పరిస్థితికి తీసుకొచ్చరోనని జనం వాపోతున్నారు. టీచర్లకే తెలుగు రాకపోతే ఇక విద్యార్ధులకు ఏం నేర్పిస్తారని మండిపడుతున్నారు. జిల్లాలోని పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్ కు తెలుగు చెప్పడమే రావడం లేదంటూ విద్యార్ధులు తమ తల్లిదండ్రులను వెంటపెట్టుకొని కలెక్టర్‌లో ఫిర్యాదు చేశారు. HM కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్ధినిలు. తమకు తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు తెలుగు రావడంలేదని, అక్షరాలను తప్పుగా రాయిస్తున్నారంటూ వాపోయారు. తక్షణం తెలుగు టీచర్‌ నాగేశ్వరరావును మార్చి తమకు తెలుగు తెలిసిన టీచర్‌ను అపాయింట్ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! అవేంటో తెలిస్తే

పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్‌ అంటే ఇష్టపడతారు. అయితే, డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చునని పోషకాహర నిపుణులు చెబుతున్నారు.

డార్క్ చాక్లెట్.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా డార్క్‌ చాక్లెట్‌ మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. డార్క్ చాక్లెట్లను తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డార్క్ చాక్లెట్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్‌లో ఉండే అధిక మొత్తంలో మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ను క్రమం తప్పకుండా మోతాదులో తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది.

డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. డార్క్ చాక్లెట్ ను తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ చాక్లెట్ గట్ లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే థియో‎బ్రోమిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్-ఎసిల్ ఇథనోలమైన్స్ ఫెనిలేథైలమైన్ ఇవన్నీ కూడా డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డార్క్ చాక్లెట్‎లో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్‌ అంటే ఇష్టపడతారు. అయితే, డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చునని పోషకాహర నిపుణులు చెబుతున్నారు.

హాయిగా నిద్రపోవాలనుకుంటే మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

Eating Habits for Sleep: ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. విపరీతమైన ఆలోచనలు, వయసుకు మించిన ఒత్తిడి, భవిష్యత్తుపై భయాందోళనలు, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వలన నిద్రపై ప్రభావం పడుతుంది. అయితే, మీరు రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆ తర్వాతి ఉదయం తాజాదనంతో మేల్కోంటారని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

నిద్ర అనేది రోజూ సమస్యగా మారితే.. అది మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నో రోగాలు, ఇన్ఫెక్షన్లు మనల్ని ఎప్పటికప్పుడు వేధిస్తాయి. దృష్టిలోపం అనేది నిద్ర సమస్యలను కలిగించే మరొక సమస్య. దీని వల్ల కళ్లు పొడిబారడంతోపాటు కంటి నొప్పి కలుగుంది. నిద్ర సమస్యలు ఉన్నవారిలో కనిపించే మరో లక్షణం అధిక ఆకలి. మీరు సాధారణం కంటే ఆహారం పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమి సమస్య ఉన్న వ్యక్తులు బరువు విషయంలో తరచుగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించుకోవాలి. రెగ్యులర్ గా సరైన నిద్ర లేని వారు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది మీరు గమనించాలి. అధిక ఒత్తిడి కూడా మిమ్మల్ని నిద్రలేమికి దారితీస్తుంది. అధిక ఒత్తిడికి కూడా నిద్ర లేకపోవడం కారణం అంటున్నారు నిపుణులు.

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలై మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుంది. నిద్రలేమివల్ల మలబద్దకం, డిప్రెషన్, కోపం, చిరాకు ఎక్కువవుతాయి. ఇది చివరికి ఎనిమీయాకు దారి తీస్తుంది. ఆకలి మందగించడం ఇతర సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి నిద్రలేమికి యోగా, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సిగరెట్, అల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండడం మంచిది. మనిషికి మంచినిద్ర చాలా చాలా అవసరం. నిద్ర కరువైతే శరీరం రోగాలకు నిలయమవుతుంది. నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకం.

రాత్రుళ్లు నిద్రపోయే సమయానికి కనీసం రెండు, మూడు గంటల ముందుగానే మీ భోజనాన్ని పూర్తి చేయాలి. అంటే డిన్నర్ చేసిన 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. తినగానే నిద్రపోకూడదు, ఆలస్యంగా తినకూడదు. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి నిద్రపడుతుంది. అలాగే, హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా మంచి నిద్రకు అవసరం. ఇందుకోసం పగటిపూట తగినంత నీరు తాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉంటారు. రాత్రి పడుకునే ముందు క్యామోమైల్ లేదా వలేరియన్ రూట్‌తో చేసిన హెర్బల్ టీని తాగడం వల్ల మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. లేదా గోరువెచ్చని పాలు తాగటం కూడా మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

Health

సినిమా