Sunday, November 17, 2024

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టి కొన్నింటిని అమలు చేస్తోంది.

తాజాగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పొదుపు సంఘాల్లోని మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా.. బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్‌ రుణాలతో పాటు.. పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి లక్ష రూపాయల నుంచి రూ.5లక్షల వరకు రుణంగా అందించున్నట్లు తెలిసింది. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా ఇలాంటి రుణం ముగ్గురు తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాల కింద రూ.2వేల కోట్లు అందించాలని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి రూ.లక్ష.. 15వేల మందికి రూ.5లక్షల రుణాలను అందించాలని చూస్తున్నారు. అంతేకాదు.. లబ్ధిదారులకు మరింత ఆసక్తి ఉంటే.. యూనిట్‌ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా భవిష్యత్‌లో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర పథకాలైన పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ దీనికి అనుసంధానించనున్నారు. అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నవారికి.. తీసుకున్న బ్యాంకు రుణంలో 35 శాతం రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.35 వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిప మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీగా వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు.

8వ తరగతితో స్కూలుకు టాటా.. పదిహేనేళ్లకే స్టార్టప్‌ కంపెనీ

Kerala: 8వ తరగతితో స్కూలుకు టాటా.. పదిహేనేళ్లకే స్టార్టప్‌ కంపెనీ

కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఉదయ్‌ శంకర్‌ పదిహేనేళ్ల వయసుకే కృత్రిమమేధ (ఏఐ) కంపెనీని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు ఏఐ యాప్‌లు, తొమ్మిది కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్, సుమారు 15 రకాల గేమ్‌లను శంకర్‌ డిజైన్‌ చేశాడు. అతడి పేరు మీద మూడు పేటెంట్లు ఉన్నాయి. మరో నాలుగింటికి దరఖాస్తు చేశాడు. గతేడాది ఏపీజే అబ్దుల్‌ కలాం ఇగ్నైటెడ్‌ మైండ్‌ చిల్డ్రన్‌ క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు అందుకొన్నాడు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఐఐటీ కాన్పుర్‌ల నుంచి ఏఐ సర్టిఫికెట్‌ కోర్సులు చేశాడు. మరోవైపు.. దూరవిద్య ద్వారా టెన్త్‌ పూర్తి చేశాడు. ఉదయ్‌ శంకర్‌ నాలుగో తరగతిలోనే రోబోటిక్స్‌ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్లో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నాడు. టెక్నాలజీపై ఉన్న మక్కువతో 8వ తరగతిలో చదువును మధ్యలోనే ఆపేసి ఏఐకి సంబంధించిన పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఉరవ్‌ అడ్వాన్స్‌డ్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, దానికి చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సీటీవో)గా ఉన్నట్లు తెలిపాడు. ఏఐ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, గేమ్‌ డెవలప్‌మెంట్‌ వంటి కోర్సుల్లో శంకర్‌ ఇప్పుడు ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు.

ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..నాకు ప్రాణభయం ఉంది పోలీసుస్టేషన్‌లో డీఈవో ఫిర్యాదు

జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్‌, స్కూల్‌ అసిస్టెంట్లు బాలయ్య, ఓమాజీలు తరచూ తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని డీఈవో ఆరోపించారు. తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.

ఈ విషయమై ఈనెల 1న తాను నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయినప్పటికీ, తనపై పత్రికల ద్వారా, సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శల వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, సదరు ఉపాధ్యాయుల నుంచి తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో డీఈవో పేర్కొన్నారు. తనకు ఏదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో కొంతమంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, క్యామ్‌ స్కానర్‌ పేరుతో అక్రమాలు జరిగాయని విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్‌, ఇతర ఉపాధ్యాయులు పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు.

హార్దిక్ పాండ్యాకు షాక్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే..

భారత్-శ్రీలంక మధ్య జూలై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు.

అదే సమయంలో రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఈ పర్యటనలో రెండు సిరీస్‌లకు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..

Viral Video : ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని ఝబ్రేదాలో ఓ క్రూరమైన తల్లి తన బిడ్డను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇలా ఇంత దారుణంగా కొట్టగలదన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

వాస్తవానికి ఒక తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఆపద ఎదురైనా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. కానీ ఈ వీడియోలో తల్లి తన 12 ఏళ్ల చిన్నారిని ప్రాణాలు పోయేలా కొట్టడం చూసి అందరూ నీలో ఎంత క్రూరత్వం దాగుంది అంటూ తిట్టిపోస్తున్నారు.

ఓ తల్లి తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు వీడియోను షేర్ చేసి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో, విషయం పోలీసులకు చేరింది. వారు తల్లిని సంప్రదించారు. తల్లి, తన బిడ్డను ఎందుకు ఇంత దారుణంగా కొట్టిందని ప్రశ్నించారు. ఈ రెండు నిమిషాల వైరల్ వీడియోలో ఒక మహిళ తన 12 ఏళ్ల బిడ్డను దారుణంగా కొట్టడం కనిపిస్తుంది. ఆ మహిళ అతడిని దారుణంగా కొట్టడమే కాకుండా అతని ఛాతీపై కూర్చొని తన తలను నేలపై కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తుంది, తన తల్లి కొట్టిన దెబ్బతో బాధపడిన పిల్లవాడు పదే పదే నీరు అడిగాడు, కానీ ఆ స్త్రీ నీరు ఇవ్వడానికి బదులుగా అతడిని మరింత కొట్టింది.

చిన్నారిని కొడుతున్న సమయంలో మరొకరు వీడియో తీశారు. ఆ మహిళ ఝబ్రేదాలోని బట్టల దుకాణంలో పని చేస్తుంది. వీడియోతోపాటు ఆమె పేరు, చిరునామా కూడా తెలిసింది. ఝబ్రేదా పోలీసులు విచారణ కోసం మహిళ వద్దకు చేరుకున్నప్పుడు, ఆమె వీడియో చూసి ఆశ్చర్యపోయింది. ఝబ్రేదా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అంకుర్ శర్మ మాట్లాడుతూ. విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్లినప్పుడు తల్లి ఇల్లు ఝబ్రేదాలో ఉందని.. తనకు దేవబంద్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని తేలింది. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. దాడి గురించి పోలీసులు మహిళను అడగగా.. మహిళ తన ముగ్గురు పిల్లలతో ఝబ్రేదాలో నివసిస్తుంది. పిల్లల ఖర్చుల కోసం తన భర్త నుండి డబ్బు కావాలని, అతను ఇవ్వడం లేదని వెలుగులోకి వచ్చింది. పిల్లల ఖర్చుల కోసమే తల్లి కొడుకును కొడుతున్న వీడియోను భర్తకు పంపింది. భర్త ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు.

ఈ కేసును చైల్డ్ వెల్ఫేర్ పర్యవేక్షణలో ఉంచుతామని, అందుకే చైల్డ్ వెల్ఫేర్‌కు పంపామని పోలీసులు తెలిపారు. చిన్నారిని మహిళ ఈ విధంగా కొట్టడంతో.. మహిళకు కౌన్సెలింగ్ అవసరమని పోలీసులు తెలిపారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఎంత కోపం ఉన్నప్పటికీ ఓ తల్లి ఇంతలా బిడ్డను కొట్టలేదని, ఇలాంటి కసాయి తల్లిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Hardik-Natasa: హార్దిక్-నటాసా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య!

Hardik-Natasa: హార్దిక్-నటాసా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య!

Hardik Pandya: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు.

నటాసా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

ఇది కఠినమైన నిర్ణయమే..
గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్ల ఊహాగానాల మధ్య చివరకు హార్దిక్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు తెలిపాడు. ‘4 సంవత్సరాలపాటు కలిసి ఉన్న నటాసా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసివుండటానికి మా వంతు ప్రయత్నం చేసాము. చివరికి విడిపోవాలనే ఫిక్స్ అయ్యాం. ఇది మా ఇద్దరికీ మేలు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఇది కఠినమైన నిర్ణయమే. మేము కలిసి ఆనందించిన క్షణాలు, పరస్పర గౌరవం, సాహచర్యం అన్నింటితో కలిపి మేము ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. మేము అగస్త్యునితో ఆశీర్వదించబడ్డాం. అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా కొనసాగుతాడు. అతని ఆనందం కోసం మనం చేయగలిగినదంతా చేస్తాం. అతనికోసం మేము సహ-తల్లిదండ్రులుగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు పాండ్య.

దేవాదాయశాఖలో.. ‘శాంతి’ లీలలు!

నిబంధనలకు విరుద్ధంగా లీజులు నివేదికలు పంపిన జిల్లా అధికారులు

ఈనాడు, విశాఖపట్నం: దేవాదాయశాఖలో సహాయ కమిషనర్‌ కె.శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

వైకాపా పాలనలో ఆమె హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాదాయశాఖలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. ఆమెకు మొదటి పోస్టింగు విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్‌ 24 నుంచి 2022 జూన్‌ 30 వరకు సహాయ కమిషనర్‌గా చేశారు.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆమెపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికలో విస్తుపోయే అంశాలున్నాయి.

అప్పట్లో జరిగిన ఉల్లంఘనలపై దేవాదాయశాఖ కమిషనరుకు జిల్లా శాఖ నుంచి నివేదిక సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్‌రోడ్డులో సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్‌ రెస్ట్‌ హౌస్, పాయకరావుపేటలో పాడురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినోళ్లకు కట్టబెట్టారు.

సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్‌ పుష్పవర్థన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతని మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది.
లంకెలపాలెం వద్ద దేవాదాయశాఖకు చెందిన స్థలాన్ని.. ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.

దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసేవారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది.
నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
గతంలో ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనరుగా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశమైంది. తరువాత విచారణలో ఇది నిజమని తేల్చారు.

Ananth Ambani : వివాహమైన మూడు రోజులకే వివాదంలో కూరుకుపోయిన అనంత్ అంబానీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Ananth Ambani : సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీని ఆధారంగానే కొత్త కొత్త యాప్స్ రూపొందుతున్నాయి. అయితే వీటిని మంచికి వాడుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు.

కానీ వీటి ద్వారా కొంతమంది చెడు పనులు చేస్తున్నారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు.. ఆ తరహా వ్యక్తులు యాప్స్ తో చెత్త పనులు చేస్తూ సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులను బదనాం చేస్తున్నారు. అందులో అనంత్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ ఆదాని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఉండడం విశేషం.

ఇంతకీ ఏం జరిగిందంటే..

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొంతమంది మాయగాళ్లు దానిని ఉపయోగించి చెత్త పనులు చేస్తున్నారు. ఆ పనులకు సమాజంలో పేరు పొందిన వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారు. వారికి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ.. వారి వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలగజేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. పైగా వాటిని ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఏవియేటర్ అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి పై వ్యక్తులు ఎలాంటి ప్రకటనల్లో కనిపించరు. పైగా సామాన్యుల జేబులు గుల్ల చేసే గేమింగ్ యాప్స్ ను అస్సలు ప్రమోట్ చేయరు. కానీ కొంతమంది మాయగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అనంత్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ అదాని, యోగి ఆదిత్యనాథ్ ముఖాలను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. ఆ వీడియోలో వారి ద్వారా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటనలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇలా వెలుగులోకి..

కొన్ని సోషల్ మీడియా వేదికలలో అనంత్ అంబానీ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి అది ఫేక్ వీడియో అయినప్పటికీ.. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోను రూపొందించడంతో.. అది నిజమైన వీడియో లాగానే అనిపించింది. అచ్చం అనంత్ అంబానీ ముఖాన్ని, అతడి గొంతును సృష్టించారు. గేమింగ్ యాప్ ను అతడు ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోను సృష్టించి.. సామాన్యుల జేబులను కొల్లగొట్టారు. అనంత్ అంబానీ పేరును ఉపయోగించుకొని.. దొడ్డిదారిన సొమ్ము చేసుకున్నారు.

అనంత్ అంబానీ మాత్రమే కాదు..

అనంత్ అంబానీ మాత్రమే కాదు.. అతడి తల్లి నీతా అంబానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆదాని గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ లతో కూడా ఇలాంటి వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారితో కూడా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నట్టు వీడియోలను సృష్టించారు.. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అవి నిజమైన వీడియో లాగా కనిపిస్తున్నాయి. పై వాళ్లంతా సమాజంలో పేరుపొందిన వ్యక్తులు కావడంతో.. ఆ ప్రకటనలు చూసిన వారంతా ఆ గేమింగ్ యాప్స్ లో బెట్టింగ్ కాసి.. జేబులు గుల్ల చేసుకున్న ఘటనలు పెరిగిపోయాయని తెలుస్తోంది. పోలీసులకు ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో వారు సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి సారించారు.

కేసుల నమోదు

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఐడీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలు పెడుతున్న వ్యక్తులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరలో గుర్తిస్తామని చెబుతున్నారు. ఈ తరహా మోసాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని.. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి గేమింగ్ యాప్ లు మోసపూరితమైన వని.. ప్రజలెవరూ అందులో బెట్టింగ్ కాయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రకటనలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తే.. వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

స్మార్ట్ ఫ్లవర్ పాట్.. వర్క్ స్టేషన్ లో పెట్టుకోడానికి మంచి ఛాయస్!

అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు చాలా మక్కువ చూపిస్తున్నారు. అయితే స్మార్ట్ గ్యాడ్జెట్ అంటే కేవలం ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ మాత్రమే కాదండోయ్.. ఇంకా చాలానే గ్యాడ్జెట్స్ ఉంటాయి. అవి మీ డైలీ లైఫ్ ని ఎంతో ఈజీ చేస్తూ ఉంటాయి. ఇంకొన్ని మాత్రం మీకు గ్రేట్ కంపానియన్ లా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి కేటగిరీకి చెందిన ఒక స్మార్ట్ ఫ్లవర్ పాట్ ని అయితే మీకోసం తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి పూల కుండీ కాదు. చాలా బుజ్జిగా క్యూట్ గా ఉండే బాగా తెలివైన పూల కుండీ అనమాట. కేవలం మొక్కని పెంచుకోవడం మాత్రమే కాదు.. ఇంకా చాలా రకాలుగా ఈ బుజ్జి కుండీ అయితే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్క్ ప్లేస్ కి బాగా సూట్ అవుతుంది.

ఈ స్మార్ట్ కుండీ పేరు.. స్మార్ట్ ప్లాంట్ ఐవీ. ఇందులో చాలానే ఫీచర్స్ అండ్ యూజ్ ఫుల్ విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది మీ వర్క్ ప్లేస్ కి చాలా సూటబుల్ పాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆఫీసుల్లో డెస్కుల దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ ని పెట్టుకుంటున్నారు. అలాంటి మినీ ప్లాంట్స్ ఈ స్మార్ట్ ఐవీ పాట్ లో పెట్టుకోవచ్చు. ముందు మీరు ఇందులో నీళ్లు పోసి అందులో మొక్కని పెట్టాలి. ఆ తర్వాత అందులో ఎలాంటి మొక్క పెట్టారో ఐవీ యాప్ లో అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఈ మొక్క గురించి మాత్రమే కాకుండా.. చుట్టూ ఉన్న వాతావరణం గురించి కూడా ఈ ఐవీ పాట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది.

ఐవీ ఫీచర్స్:

స్మార్ట్ ప్లాంట్ పాట్ మొక్కకు నీళ్లు కావాలి అంటే ముందుగానే చెప్పేస్తుంది. వాటర్ కావాలి అని ఇండికేట్ చేస్తుంది. అలాగే తనకు వేడిగా ఉన్నా.. చల్లగా ఉన్నా చెప్పేస్తుంది. దానిని బట్టి మనం ఆ కుండీని ప్లేస్ ఛేంజ్ చేసుకోవచ్చు. మీరు మొక్కకు నీళ్లు పోస్తున్నప్పుడు డిస్ ప్లే మీద క్యూట్ క్యూట్ రియాక్షన్స్ వస్తాయి. అలాగే మీరు ఆ స్మార్ట్ కుండీని పట్టుకున్నప్పుడు కితకితలు పెట్టినట్లు రియాక్ట్ అవుతుంది. మీరు ఈ స్మార్ట్ పాట్ లో కేవలం డేట్, టైమ్ మాత్రమే కాకుండా ఉష్ణోగ్రత వివరాలు, గాలిలో ఉండే తేమ శాతం (హ్యూమిడిటీ) వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇందులో పోమోడోరో టైమర్ కూడా ఉంటుంది. మీరు మీకు కావాల్సినంత టైమ్ సెట్ చేసుకుని మీ సమయాన్ని ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. అలాగే ఇందులో చాలానే క్యూట్ యానిమేషన్స్ ఉంటాయి. ఇది టైప్ సీ ఛార్జర్ తో వస్తుంది.

ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ పెట్టే రోబో.. ధర చాలా తక్కువ! ఇల్లాలికి చాలా అవసరం

ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంట్లో రోజూ రెండు సార్లు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెడుతుంటారు. సోఫా కింద, డైనింగ్ టేబుల్ కింద, మంచం కింద, బీరువాల కింద వంగి ఊడవాలన్నా, తడిగుడ్డ పెట్టాలన్నా చాలా కష్టం. దీని వల్ల నడుము నొప్పి సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మీ ఇంట్లో ఆడవాళ్లు కష్టపడకూడనదు అని మీరు అనుకుంటే కనుక ఈ పరికరం బహుమతిగా ఇవ్వండి చాలు. జస్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తే చాలు.. అదే మొత్తం ఇల్లు ఊడ్చేస్తుంది. అంతేనా ఇల్లంతా తడిగుడ్డ కూడా పెట్టేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఇల్లాలి ఇంట్లో ఉండాల్సిన వస్తువు.

ఎకోవాక్స్ డీబాట్ వై1 ప్రో 2 ఇన్ వన్ రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది 2024లో కొత్తగా లాంఛ్ అయిన ప్రాడెక్ట్ ఇది. 6500 పీఏ పవర్ ఫుల్ సక్షన్ తో, 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 3500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది పని చేస్తుంది. అంటే ప్రతీ గదిలో మూల మూలల్లో ఉన్న చెత్తను శుభ్రం చేయడమే గాక తడిగుడ్డ కూడా పెట్టేస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ నావిగేషన్ టెక్నాలజీ, ట్రూ మ్యాపింగ్ ఫీచర్ ఉండడం చేత స్మార్ట్ ఫోన్ లో యాప్ తో ఈజీగా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని పనితీరు అత్యధికంగా 320 నిమిషాలు ఉంటుంది. అంటే 5 గంటల పైనే కంటిన్యూగా పని చేస్తుంది. చెక్క, మార్బుల్, టైల్, కార్పెట్ ఇలా ఎలాంటి నేలల మీదయినా పని చేస్తుంది.

ఎలాంటి నేల అయినా సరే దుమ్మును క్లీన్ చేస్తుంది. దీని మీద కంపెనీ ఏడాది పాటు వారంటీ ఇస్తుంది. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ లో సైడ్ బ్రష్, మెయిన్ రోలర్ బ్రష్, హెపా ఫిల్టర్, రీయూజబుల్ మాపింగ్ క్లాత్ అంటే తడిగుడ్డ పెట్టే క్లాత్ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా 24 గంటల్లో కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. 1800 258 8085 నంబర్ కి కాల్ చేస్తే కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ అందుతుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కంపెనీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది నలుపు రంగులో లభిస్తుంది. 30 సెంటీమీటర్ల పొడవు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 11 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా చిన్నదిగా ఉండడం వల్ల దీన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు.

దీని బరువు కూడా 5 కిలోల లోపే ఉంటుంది. దీనికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 1,19,900 ఉండగా 75 శాతం తగ్గింపుతో రూ. 29,900కే అందుబాటులో ఉంది. ఏకంగా 90 వేలు తగ్గుతుంది. ఎంపిక చేసినటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల మీద అదనంగా 1750 రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు. ఇంతకంటే బెటర్ డీల్ మరొకటి ఉండదేమో. దీని ధర ఎక్కువ అని ఆలోచిస్తే.. హాస్పిటల్ బిల్లు అంతకంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 1,19,990 రూపాయల రోబో వాక్యూమ్ క్లీనర్ 30 వేలకే వస్తున్నప్పుడు ఆలోచించకుండా కొనేయడం బెటర్. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇంకా తక్కువలో కావాలా?:

ఇందులోనే మరొక కంపెనీ రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దాని పేరు డ్రీమ్ మోవ ఎం1 రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది కూడా మాప్ తో వస్తుంది. అంటే ఇల్లు ఊడవడమే కాకుండా తడిగుడ్డ పెట్టేస్తుంది. దీన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో యాప్ తో కంట్రోల్ చేసుకోవచ్చు.  వంటగది, బెడ్రూమ్, హాల్ ఇలా అన్ని చోట్ల ఇది ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేస్తుంది. ఇది 7.6 సెంటీమీటర్ల ఎత్తుతో వస్తుంది. 32.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇరుకుల్లో కూడా ఊడ్చి తడిగుడ్డ పెడుతుంది. ఈ ప్రాడెక్ట్ కొనుగోలు చేస్తే ఒక రోబో, ఒక ఛార్జింగ్ డాక్, ఒక ఛార్జర్, ఒక క్లీనింగ్ టూల్, ఒక యూజర్ మాన్యువల్ వస్తున్నాయి. దీని బరువు కూడా రెండున్నర కిలోలు మాత్రమే. ఇది 4500 పీఏ సక్షన్ పవర్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 26,999 ఉండగా.. 48 శాతం తగ్గింపుతో దీన్ని మీరు రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ఖరీదు ఇది. కాబట్టి ఇది ఇల్లాలికి బహుమతిగా ఇస్తే ఇంతకంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు.

 

ఆగస్టు తొలి వారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. త్వరలో షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ కౌన్సెలింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయాత్తం అవుతోంది.

ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. అయితే న్యాయ విద్య అందించే ఆయా కాలేజీలకు ఇంకా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. జులై నెలాఖరులోపు బీసీఐ అనుమతులు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది. అంతా అనుకన్నట్లు జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది.

ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మూడేళ్లు ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో రాష్ట్రంలోని పలు న్యాయ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికార వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తెలంగాణ సీపీగెట్‌ పరీక్షకు 64,765 మంది హాజరు.. నెలాఖరులోపు ఫలితాల వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పీజీ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 88.31 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీపీగెట్‌ పరీక్షలు జులై 6వ తేదీ నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 73,342 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 64,765 మంది పరీక్షలు హాజరయ్యారు. మొత్తం 51 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అందులో 45 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరిపామని సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ జులై 20వ తేదీలోపు వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరులోపు సీపీగెట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నట్లు కన్వినర్ పేర్కొన్నారు.

వేణుస్వామితో సముద్రఖని ప్రత్యేక పూజలు.. ప్రసాదంగా చేపల కూర, మటన్.. వీడియో వైరల్

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన.

ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వేణు స్వామి తో పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా చేరిపోయారు. ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు సముద్ర ఖని. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు వేణు స్వామి. పూజలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆయన ‘కామాఖ్య దేవాలయంలో ఈరోజు స్పెషల్ పూజ అనంతరం మహా ప్రసాదంలో భాగంగా చేపల కూర, మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు కామాఖ్య దేవాలయంలో దర్శకులు, నటులు సముద్రఖని గారి పూజ కూడా చాలా వైభవంగా జరిగింది’ అని రాసుకొచ్చారు.

వేణు స్వామి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్త్ఉన్నారు. చేపల కూర, మటన్ కూర ప్రసాదమని చెప్పడంపై చాలా మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి. ‘ఈరోజు కొండపైన కామాఖ్య దేవాలయంలో మానసా దేవి పూజ. వారాహి నవరాత్రిలో భాగంగా.. 16, 17, 18, 19 ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైన రోజులు. మానసా దేవి పూజ కాబట్టి.. ఫిష్ కర్రీ చేశారు. రెగ్యులర్‌గా ఇక్కడ మటర్ కర్రీ నైవేద్యంగా పెడుతుంటారు. మెయిన్ టెంపుల్ అమ్మ వారికి నైవేద్యంగా పెట్టిన మటన్ కూర దొరకడం అంటే భోగం అనే చెప్పాలి. ఇది సాధారణంగా బయటకు రాదు. మాకు అమ్మవారి దయవల్ల.. సముద్రఖని గారికి భాగ్యం ఉంది కాబట్టి తినేయోగం ఉంది కాబట్టి ఇది లభించింది’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. మార్చి ఒకటి, జూన్‌లో మరొకటి! త్వరలో అధికారిక ప్రకటన

విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర విద్యాశాఖ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేసేందుకు సమాయాత్తమవుతోంది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలను మార్చిలో ఒకసారి, జూన్‌లో రెండోసారి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మే నెలలో ఫలితాలను విడుదల చేశాక.. విద్యార్థులు తమ స్కోర్‌ను మెరుగుపరచుకోడానికి ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ‘సప్లిమెంటరీ’ పరీక్షకు హాజరు అయ్యేందుకు అవకాశం ఇస్తున్నారు. మేలో ఫలితాలు వెలువడిన తర్వాత ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

కొత్త పరీక్షల విధివిధానాలను సిద్ధం చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ బోర్డును కోరింది. దీనిలో భాగంగా ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఇటీవల సీబీఎస్‌ఈ విస్తృత సంప్రదింపులు జరిపింది. ఎప్పటిలాగే ఫిబ్రవరి-మార్చిలో 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత జూన్‌లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సిఫార్సులనే కేంద్ర విద్యాశాఖ దృష్టికి బోర్డు తీసుకెళ్లింది. కొత్త విధానం అమల్లోకి వస్తే.. మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్‌లో మరోసారి అన్ని పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే కానీ తప్పనిసరేం కాదట.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యా విధానంపై మాట్లాడుతూ.. విద్యార్థులకు 2025-26 అకడమిక్ సెషన్ నుంచి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది నూతన జాతీయ విద్యా విధానం, 2020 అమలులో భాగంగా అమలులోకి వస్తుంది. 21వ శతాబ్దపు లక్ష్యాలకు అనుగుణంగా దేశంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త విధానం విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాన్ని చేరుకోవడానికి నిర్మాణాత్మకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ 2023లో ‘న్యూ కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF)’ పేరుతో ప్రకటించింది. దీని ద్వారా విద్యార్థులు స్కోర్ చేసిన ఉత్తమ మార్కును నిలుపుకోవడానికి అనుమతిస్తుంది. రెండోసారి పరీక్షలు రాసేవారు అన్ని పరీక్షలు కాకుండా తమకు మార్కులు తక్కువ వచ్చిన ఒకటో రెండో పరీక్షలు రాసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందట. దీనిపై త్వరలో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ఈ విద్యా సంస్కరణలు 2047 నాటికి భారతదేశాన్ని ‘విక్షిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది వంద సంవత్సరాల స్వాతంత్ర్యానికి గుర్తుగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యం. ముఖ్యంగా ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యా రంగానికి రూ. 73,498 కోట్లు కేటాయించారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో విద్యారంగానికి కేటాయించిన దాఖలాలులేవు.

మరోసారి కరోనా బారినపడ్డ జో బైడెన్.. జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడి!

మెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్-19 సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్ -19 లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది.

81 ఏళ్ల జో బైడెన్ బుధవారం (జూలై 17) కోవిడ్ పాజిటివ్ పరీక్షించారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్‌లోని తన బీచ్ హౌస్‌కు వెళ్లారు. దీనికంటే ఒక రోజు ముందు, లాస్ వెగాస్‌లో జరిగిన నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్ పాల్గొన్నారు.

యుఎస్ ప్రెసిడెంట్ పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారని, కోవిడ్ -19 బూస్టర్ డోస్ కూడా పొందారని వైట్ హౌస్ తెలిపింది. ఇటీవలి బూస్టర్ మోతాదు సెప్టెంబర్ 2023లో అందించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కూడా అతనికి కోవిడ్‌ సోకింది. అయినప్పటికీ, కోవిడ్ లక్షణాలు చాలా తేలికపాటివిగా ఉన్నట్లు, త్వరలోనే కోలుకుంటారని వైట్ హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు కోవిడ్ సోకినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. ‘కోవిడ్ -19 బారిన పడ్డాను, కానీ నేను క్షేమంగా ఉన్నాను, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఈ వ్యాధి నుండి కోలుకునేందుకు ఒంటరిగా ఉంటాను. ఈ సమయంలో కూడా అమెరికన్ ప్రజల కోసం పని చేస్తాను.’ తాను స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యానని బైడెన్ మరో ట్వీట్‌లో తెలిపారు.

బైడెన్‌కు శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడి అధికారిక వైద్యులు వెల్లడించారు. జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. శ్వాస రేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. COVID-19 పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్ వచ్చిందని. CDC మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కాగా, జో బైడెన్ చివరిసారిగా జూలై 2022లో కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలావుంటే, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, దేశంలో ఇటీవలి కాలంలో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. గత వారంతో పోల్చితే జూలై 6తో ముగిసిన వారంలో 23.5 శాతం ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయని తాజా డేటా చూపుతోంది.

జోరుగా వానలు.. పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు, లక్షణాలు ఏమిటి? ఎన్ని రోజులకు వెలుగులోకి వస్తుందంటే?

వేసవి నుంచి ఉపశమనం ఇచ్చే వర్షాకాలం లో అడుగు పెట్టాం.. వర్షాలు వస్తూనే సీజనల్ వ్యాధులను కూడా తెస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలతో పాటు వైరల్ జ్వరం బారిన ఎక్కువ మంది పడతారు.

రోగనిరోధక శక్తి తక్కువగా వారిలో వైరల్ జ్వరం సాధారణం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగం నుంచి అయినా అంటే ప్రేగులు, ఊపిరితిత్తులు మొదలైన వాటి ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. ఇన్ఫెక్షన్ ఫలితంగా జ్వరం వస్తుంది. అధిక జ్వరం, కళ్ళు మంట, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.

అయితే కొన్ని సార్లు జ్వరం వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ సొంత వైద్యం తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు కొన్ని సార్లు సొంతంగా తీసుకునే యాంటీబయాటిక్స్ వైరస్లను చంపలేవు. అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే కడుపు పనితీరుపై ప్రభావం చూపుతుంది, మంచి గట్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, ఆమ్లతను కలిగిస్తుంది. ఒకొక్కసారి కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

వైరల్ జ్వరం ఎలా వస్తుంది?

వైరల్ ఫీవర్ ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, వారి శరీరం నుంచి వచ్చే చిన్న చిన్న ద్రవాల్లోని బ్యాక్టీరియా సమీపంలో ఉన్న వ్యక్తీ శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా మారడానికి 16 గంటల నుండి 48 గంటల వరకు సమయం పడుతుంది.

లక్షణాలు ఏమిటి? ఎన్ని రోజులకు వెలుగులోకి వస్తుందంటే?

ఎవరికైనా అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, చలి, తలనొప్పి, బాడీ పెయిన్స్, విపరీతమైన అలసట, నీరసం అనిపించవచ్చు.

కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కొన్ని జాతులు దోమల వలన లేదా వ్యాధి సోకిన వ్యక్తి రక్తం లేదా వీర్యం ద్వారా వ్యాపించవచ్చు.

వైరస్ సోకిన తర్వాత కొన్ని రకాల వైరల్ ఫీవర్ అభివృద్ధి చెందడానికి 21 రోజులు పట్టవచ్చు.

ఎలుక మలం లేదా మూత్రం స్మెల్ పీల్చినప్పుడు కొన్ని రకాల వైరల్ బ్యాక్టీరియా కూడా మానవ శరీరంలోకి ప్రవేశించే ఆకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైరల్ ఫీవర్‌ ఎవరికీ ఎక్కువగా సోకే అవకాశం ఉందంటే..?

అప్పటికే వైరల్ ఫీవర్ సోకిన రోగికి దగ్గరగా ఉన్నవారికి సోకే ప్రమాదం ఉంది.
ఒక నిర్దిష్ట వైరల్ జ్వరం ప్రబలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం వలన కూడా
వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో నివసిస్తున్న వారికి కూడా వైరల్ ఫీవర్ వ్యాపించే అవకాశం ఉంది.
జబ్బుపడిన వారితో కలిసి పని చేస్తున్న వారికి కూడా సోకే ప్రమాదం ఉంది
కొన్ని రకాల జంతువులకు సమీపంలో ఉన్నా.. లేదా వైరస్ సోకినా వారిని తిన్నా, వాటిని వధించినా వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులకు వైరల్ ఫీవర్‌కు గురయ్యే అవకాశం ఉంది.

వైరల్ జ్వరం యొక్క లక్షణాలు ఏమిటి? వైరల్ జ్వరం ఎలా నిర్ధారణ అవుతుంది?

జ్వరం (ఒకొక్కసారి తీవ్ర జ్వరం, అంతలోనే జ్వరం తగ్గడం), అలసట,మైకము,బలహీనత,చలి,తలనొప్పి,కండరాలు శరీరం కీళ్ల నొప్పులు,టాన్సిల్స్ వాపు, జలుబు, ముక్కు దిబ్బెడ, ఛాతీ బరువుగా ఉండడం, గొంతు మంట, కళ్ళలో మంట, దగ్గు,చర్మం దద్దుర్లు,అతిసారం,వికారం,వాంతులు వంటివి కనిపిస్తాయి.

వైరల్ వ్యాధి నిర్ధారణ

వైరల్ జ్వరం లక్షణాలు చాలా వ్యాధులకు సాధారణం కనుక వైరల్ ఫీవర్ కు సంబందించిన నిర్దిష్ట రూపాన్ని నిర్ధారించడం కష్టం. రోగనిర్ధారణ నిర్ధారణ కొరకు డెంగ్యూ , మలేరియా , చికున్‌గున్యా , టైఫాయిడ్ మొదలైన ఏదైనా వ్యాధి వచ్చే అవకాశం ఉంది కనుక. వైద్యుల సలహా తో వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకోవాలి.

జేఎన్‌టీయూ హాస్టల్‌ ఫుడ్‌లో మొన్న ఎలుక.. నిన్న పిల్లి.. నేడు పురుగులు! ఇలాగైతే ఎలా చదివేది?

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న విద్యార్ధుల భోజనంలో ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది.

ఇక నిన్నేమో విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రల్లోకి వెళ్లి పిల్లి ఒక్కో ఐటెం ను రుచి చూస్తోంది. ఈ రోజు భోజనంలో పురుగులు ప్రత్యక్ష మయ్యాయి. ఇలా రోజుకో వివాదం తెరపైకి రావడంతో జేఎన్‌టీయే హాస్టల్‌ విద్యార్ధులు అష్టకష్టాలు పడుతున్నారు.తాజాగా గౌతమి వసతిగృహంలో బుధవారం భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు విద్యార్థుల ప్లేట్లలో రెండు పురుగులు కనిపించాయి. దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు. జూన్‌ 15న అన్నం, మజ్జిగ పాత్రల్లో పిల్లి మూతిపెట్టిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ జేఎన్టీయూ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటికి వస్తున్నా.. జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో హాస్టల్ మెయింటెనెన్స్‌పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు హాస్టల్‌ ఫుడ్‌లో పురుగులు కనిపించాయి. మెస్‌ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై విద్యార్ధులు పలుమార్లు యాజమన్యానికి ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదంటూ వాపోతున్నారు.

తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జేఎన్టీయూ కూకట్‌పల్లి హాస్టల్‌లో తనిఖీలు చేయగా.. అక్కడి క్యాంటీన్ నిర్వహణ పరమ చెత్తగా ఉందని తేల్చారు. వంటగదిలో ఎక్కడిపడితే అక్కడ కూరగాయల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్ధులకు నాణ్యతలేని ఆహారం ఇవ్వడంలేదనీ, హాస్టల్ గదుల్లోకి క్రిమి కీటకాలు రాకుండా నిరోధించే ఎలాంటి ఏర్పాట్లు లేవని గుర్తించారు. FSSAI లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూస్తున్నా అధికారుల్లో మాత్రం ఇసుమంతైనా మార్పురాకపోవడం విశేషం. దీంతో ఆధికారులు తమ గోడు వినే నాథుడులేక, పురుగుల భోజనం తినలేక నానాయాతన పడుతున్నారు.

మన దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు.. బాలికలకు బలవంతం పెళ్ళిళ్ళు. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

నిషి ఆధునిక కాలంలో జీవిస్తున్నాడు. ఆకాశాన్ని తరచి చూస్తున్నాడు.. జాబిలమ్మ మీద అడుగు పెట్టాడు.. సముద్రం లోతులు కొలుస్తున్నాడు. అయినప్పటికీ కొన్ని మూఢాచారాలను నేటికీ కొనసాగిస్తున్నాడు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని కొత్త చట్టాలను తీసుకోస్తున్నా తాము నమ్మిన దానిని కొంతమంది అమలు చేయడంలో ఎటువంటి వెనకడుగు వేయడం లేదు. ఆలాంటి మూఢాచారాల్లో ఒకటి బాల్య వివాహం. మన దేశంలో ప్రతి నిమిషానికి ముగ్గురు ఆడపిల్లలకు బలవంతంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దేశంలో జరిగే బాల్య వివాహాల గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బలవంతపు పెళ్ళిళ్ళ విషయంలో 2022 లెక్కల దేశవ్యాప్తంగా రోజుకు మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందని కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది. పౌర సమాజ సంస్థల ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ నెట్‌వర్క్‌లో భాగమైన ‘ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్’ రీసెర్చ్ టీమ్ చేసిన కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (2019-21) డేటాను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018 నుంచి 2022 మధ్య సంవత్సరాల్లో 3,863 బాల్య వివాహాలు జరిగినట్లు NCRB నమోదు చేసింది. అయితే ఈ అధ్యయనం ఎత్తి చూపినట్లుగా.. జనాభా లెక్కల అంచనాల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఒక కేస్ స్టడీ అస్సాం

అయితే గత 3 సంవత్సరాలలో ఈ బాల్య వివాహాలు జరగడంలో తగ్గుదల కనిపిస్తోంది. 81% తగ్గుదలని చూపిస్తోంది. బాల్య వివాహాలను అరికట్టడంలో అస్సాం ఒక కేస్ స్టడీగా NCRB సంస్థ ఎన్నుకుంది. NFHS-5 అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 23.3% స్త్రీలు 18 సంవత్సరాల వయసు కంటే ముందే వివాహం చేసుకున్నారు.
NFHS నివేదిక ప్రకారం, 2021-22 మరియు 2023-24 మధ్య అస్సాం రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,132 గ్రామాల్లో బాల్య వివాహాలు 81% మేర తగ్గాయి. 2021-20 22 ఏడాదిలో బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు 3,225 నమోదు కాగా.. 2023 – 2024లో ఈ బాల్య వివాహాల సంఖ్య 627లుగా నమోదయింది. గత ఏడాది బాల్య వివాహం జరిపించిన నేరానికి సంబంధించి 3,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ గ్రామాలలో నిర్వహించిన ఒక సర్వేలో 98% మంది ప్రజలు బాల్య వివాహాల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలోని కఠినమైన చట్టాల అమలు చేయడం అని అభిప్రాయపడ్డారు.

బాల్య వివాహాలపై ఎప్పటి నుంచి నిషేధం అంటే..

భారతదేశంలో బాల్య వివాహాలు మొదటిసారిగా 1929లో నిషేధించబడ్డాయి. అనేక సందర్భాల్లో ఈ చట్టం మరింత మెరుగు పడుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ డేటా ఆధారంగా చూస్తే నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది జాతీయ అవమానంగా కొంతమంది భావించడమే కాదు.. తీవ్ర ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం వలన మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, లింగ సమానత్వాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006ను సవరించేందుకు ఉద్దేశించిన 2021 బిల్లును మళ్ళీ కొత్తగా చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అయితే దీనిని వాస్తవ దృష్టితో చూస్తే.. నిజం ఏమిటంటే సామాజిక అనుమతి లేకుండా ఎటువంటి చట్టాలు మనుగడ సాగించలేవు. అందుకే ప్రజలకు అవగాన కలిగేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలను అరికట్టే మిషన్‌లో పనిచేయాలి

దేశంలో వివిధ ప్రాంతాల్లో బాల్య వివాహాలకు గల కారణాలు భిన్నంగా ఉన్నాయి. అదే విధంగా కేసు విచారణ విషయంలో కూడా కోర్టు పని తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది.
2022లో బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కోర్టుల్లో విచారణ కోసం మొత్తం 3,563 కేసులు కోర్టు మెట్లు ఎక్కాగా.. వీటిల్లో కేవలం 181 కేసుల విచారణను మాత్రమే కోర్టు విజయవంతంగా పూర్తి చేసింది. అంటే కేసు పెండెన్సీ రేటు 92% ఉండగా నేరారోపణ రేటు 11%. ఉంది.

వివిధ NGO సంస్థలు బాల్య వివాహాల డేటాను విశ్లేషిస్తూ “బాల్య వివాహాలలో ఎక్కువ భాగం ఆడపిల్లల దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సందర్భాలు ఎక్కువ అని చెప్పాయి. అంతేకాదు వృద్ధులు తమ అధికారాన్ని అమ్మాయిల దుర్బలత్వాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించాయి.

బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! కంటెస్టెంట్స్ ఎవరంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది.

గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగస్ట్ నెలాఖరలోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపికచేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ స్టార్స్‌తో పాటు కొందరు నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గా తీసుకురానున్నారని టాక్. ఇటీవలే శశి మధనం తెలుగు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఇక గత బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒక్కరు కూడా హౌజ్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్‌బాస్‌లో కనిపించనున్నారట. పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్కర్‌ల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బంచిక్ బబ్లూ, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రిత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా , బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణు స్వామి, ఏక్‌నాథ్‌, హారిక జోడి బిగ్‌బాస్‌లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే యాంకర్స్ వర్ణిణి, విష్ణుప్రియ తో పాటు హేమ, రాజ్‌తరుణ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే షో లాంఛింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్ యాజమాన్యం.

‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా’.. ఇన్‌స్టాలో విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపారు.

సోషల్ మీడియాలోనే ఆమె ట్రిపుల్ తలాక్‌ చెప్పి భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భర్త ఇలా సామాజిక మాధ్యమం వేదికగా తలాక్‌ చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

డియర్‌ హస్బెండ్‌.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్‌ యూ.. ఐ డైవర్స్‌ యూ అండ్‌ ఐ డైవర్స్‌ యూ’. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య’ అని షైకా మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇస్లామిక్‌ చట్టం ప్రకారం దీనిని ‘తలాక్-ఎ-బిద్దత్’ అని పిలుస్తారు. దీని ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఒకే సిట్టింగ్‌లో మూడు సార్లు తలాక్‌ చెబితే సరిపోతుంది. అంతటితో వీరి వివాహ బంధం ముగిసిపోతుంది. సాధారణంగా వీరి మతాచారం ప్రకారం పురుషులు మాత్రమే తలాక్‌ చెబుతుంటారు. కానీ మహిళలు మాత్రం ‘ఖులా’ అనే ప్రక్రియ ద్వారా విడాకులు కోరేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలకు కూడా తలాక్‌ ఉచ్ఛరించే నిబంధనలు ఇస్లాం మతాచారాల్లో ఉన్నాయి. ఇకపోతే యువరాణి భర్తకు తలాక్‌ చెప్పిన తర్వాత దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్‌ చేయడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

కాగా 2023 మేలో ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ బిన్‌ మనా అల్‌ మక్తూమ్‌ను యువరాణి షైఖా మహారా వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత ఈ జంట కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో షైఖా మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోతోపాటు ‘మేమిద్దరం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసింది. ఇక జులై 16న తన భర్తపై నమ్మకం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలిస్తోంది. ఈ క్రమంలో విడాకుల గురించి యువరాణి బహిరంగంగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. యువరాణి నిర్ణయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

కాగా యువరాణి షైఖా మహర్రా మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ ప్రస్తుత దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. ఆమె మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు.

మహిళలకు షాక్.. గోల్ట్ దారిలోనే సిల్వర్ కూడా.. రూ. లక్ష దాటేసిందిగా

ఆడవాళ్లు అలంకార ప్రియులు. అందంగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా శారీస్, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా జ్యువెలరీ లేనిదే ఏ ఫంక్షన్‌కు వెళ్లరు.  ఒంటి నిండా దగదగలాడే నగలతో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కావాలని అనుకుంటారు. అలాగే బంగారాన్ని స్టేటస్ సింబల్ అని భావిస్తుంటారు. అందుకే భర్తలతో పోరు పెట్టి మరీ కొనుగోలు చేసేలా పంతం పడుతుంటారు. భర్తలు కూడా ఆర్థికంగా అక్కరకు వస్తాయని, భార్య ముచ్చట తీరుతుందని భావించడంతో వీటిని పర్చేస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గోల్ట్ ధరలు కొండ నెక్కి కూర్చుంటున్నాయి. దీంతో సామాన్యులు సిల్వర్ జ్యువెలరీతో సరిపెట్టుకుంటున్నారు.

బంగారం నగలకు ధీటుగా.. మంచి మంచి డిజైన్లలో తక్కువ ధరకే ఆభరణాలు లభిస్తుండటంతో వెండి నగల వైపు మక్కువ పెంచుకుంటున్నారు మగువలు. కానీ ఇప్పుడు సిల్వర్ ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. మధ్య తరగతి కుటుంబీలను భయపెడుతోంది. సుమారు ఏడాది నుండి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 7,500 మార్క్‌ను దాటింది. అలాగే 22 క్యారెట్స్ బంగారం గ్రాము ధర సుమారు 7వేలకు చేరువౌతుంది. దీంతో సామాన్యలు ఛాయిస్ సిల్వర్ అయ్యింది. కాస్త మెయిన్ నెస్స్ సరిగ్గా చేస్తే.. తళతళ మెరుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. ఏడాది గ్యాప్‌లో సిల్వర్ రేటు డబుల్ అయ్యింది. ఇప్పుడు కిలో వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటిసింది. ఏడాది క్రితం కిలో సిల్వర్ ధర రూ. 50వేలు పలుకుతుండేది. కానీ ఇప్పుడు రెండింతలై కూర్చుంది.

జులై 17న వెండి ధర పెరిగింది. గ్రాముకే రూపాయే పెరిగినప్పటికీ.. కిలోపై రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ.1, 00, 500గా ఉంది. ఇటీవల బంగారం ధరలు హెచ్చు తగ్గుల నమోదు చేస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో గోల్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయి సామాన్యులకు ముఖ్యంగా మహిళలను బెంబేలెత్తిస్తుంది. ఆర్నమెంట్ గోల్ట్ 22 క్యారెట్ గతంలో రూ. 5800 ఉండగా.. ఇప్పుడు.. రూ. 6900లకు దగ్గరైంది. ఈ రోజు బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ. 980 పెరగ్గా.. 22 క్యారెట్ గోల్ట్ రూ. 900లు పెరిగింది. దీంతో ప్యూర్ గోల్ట్ రూ. 75000 వేలు పలుకుతుండగా.. ఆభరణాల బంగారమైన 91.6 గోల్ట్ (22 క్యారెట్స్) 10 గ్రాముల ధర రూ.68, 750గా చూపిస్తుంది. ధరలు పెరుగుదలతో బంగారం దుకాణాల వైపు చూడలేని పరిస్థితి. ఆషాడ మాసంలోనే ఇలా ఉంటే.. శ్రావణ మాసంలో ధరలు మరింత పెరగవచ్చునని తెలుస్తుంది.

 

కోట్ల మంది ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ఎట్టకేలకు భారత మార్కెట్లో..

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీన్నో స్టేటస్ సింబల్ గా భావిస్తారు. మిడిల్ క్లాస్ వారి నుంచి హై క్లాస్ పీపుల్ వరకూ అందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద రైడ్ చేయాలని ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మోడల్స్ అన్నీ ఆదరణ పొందాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో కొత్త బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది? ఫీచర్స్ ఏంటి? వంటి వివరాలు మీ కోసం.

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్.. 452 సీసీ లిక్విడ్ కూలింగ్ సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజిన్ తో వస్తుంది. 39.4 బీహెచ్పీ, 40 ఎన్ఎం పీక్ టార్క్ ని కలిగి ఉంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ని ఇచ్చారు. ఇది అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ ఆప్షన్ తో నడుస్తోంది. ఇందులో రెండు రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి పెర్ఫార్మెన్స్ మోడ్, రెండు ఎకో రైడ్ మోడ్. ఇది ఫ్లాష్, డ్యాష్, అనలాగ్ వేరియంట్స్ లో వస్తుంది. అయితే టాప్ (ఫ్లాష్) వేరియంట్ లో మాత్రమే 4 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. కానీ బేస్ (అనలాగ్) వేరియంట్ లో మాత్రం సింపుల్ డిజిటల్ అనలాగ్ డిస్ప్లే ఇచ్చారు. టాప్ మోడల్ గూగుల్ మ్యాప్స్ తో పని చేసేలా టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. అలానే ఇందులో బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. మ్యూజిక్ వినచ్చు, అలానే మెసేజ్ అలర్ట్ లు పొందవచ్చు.

రౌండ్ హెడ్ లాంప్, ముందు వెనుక స్ప్లిట్ సైడ్ ఇండికేటర్స్ తో వస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లుగా ఉంది. ఈ బైక్ ముందు వైపు 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు 140 ఎంఎం, లింకేజ్ టైప్ మోనోషాక్ తో వస్తుంది. అన్ని రకాల రోడ్ల మీద ప్రయాణించేలా సియట్ కంపెనీతో ప్రత్యేకంగా ట్యూబ్ లెస్ అలాయ్ వీల్స్ ని తయారు చేయించింది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. అనలాగ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 2.39 లక్షలు ఉండగా.. డ్యాష్ వేరియంట్ రూ. 2.49 లక్షలు, ఫ్లాష్ వేరియంట్ ధర రూ. 2.54 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది ఐదు రకాల కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. బ్రావా బ్లూ, ఎల్లో రిబ్బన్, ప్లాయా బ్లాక్, గోల్డ్ డిప్, స్మోక్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. కలర్స్ ని బట్టి బైక్ ధర కూడా  మారుతుంది. ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ విక్రయాలు ఆగస్టు 1 నుంచి మొదలు కానున్నాయి.

 

రెడ్ మీ నుంచి అదిరిపోయే బడ్స్.. ఈ సేల్ లో అస్సలు మిస్ కావొద్దు!

ఇయర్ బడ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, వాటి ధర వింటేనే కాస్త కంగారు పుడుతుంది. కానీ, బడ్జెట్ లో ఉండే ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో అంత మంచి క్వాలిటీ, ఫీచర్స ఉండవు. ఇప్పుడు క్వాలిటీ ప్లస్ ఫీచర్స్ ఉన్న ఇయర్ బడ్స్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి. అది కూడా ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ తీసుకొస్తున్న సేల్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు వాటి ఫీచర్స్ ని రివీల్ చేశారు. అవి తెలుసుకున్న వినియోగదారులు కచ్చితంగా ఈ ఇయర్ బడ్స్ కొనాల్సిందే అంటూ అవుతున్నారు. పైగా అవి ఎంతో స్టైలిష్ గా కూడా ఉన్నాయి. మరి.. ఆ బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఇయర్ బడ్స్ మరేవో కాదు.. రెడ్ మీకి చెందిన 5సీ బడ్స్. వీటి లుక్స్ కి ఇప్పుడు అంతా ఫిదా అయిపోతున్నారు. లుక్స్ పరంగా మాత్రం బడ్స్ యాపిల్ ఎయిర్ పోడ్స్ తరహాలో ఉంటాయి. ఇంక ఫీచర్స్ చూస్తే నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఇందులో కంపెనీ ముఖ్యంగా నాయిస్ క్యాన్స్ లేషన్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రెడ్ మీ 5సీ బడ్స్ కి ట్యాగ్ లైన్ కూడా.. నాయిస్ అవుట్- మ్యూజిక్ ఇన్ అనే ట్యాగ్ పెట్టడం విశేషం. ఇందులో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. అది ఏకంగా 40 డెసిబిల్స్ వరకు అవుట్ సైడ్ నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది. మీకు కేవరం మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది అనమాట. అందుకే వాళ్లు ఈ బడ్స్ కి అలాంటి ట్యాగ్ ని సెలక్ట్ చేసుకున్నారు.

ఇంక ఈ 5సీ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాడ్ మైక్ ఏఐ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. షావోమీ ఇయర్ బడ్స్ యాప్ కి మీరు ఈ 5సీ బడ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి 12.4ఎంఎం టైటేనియం డ్రైవర్స్ తో వస్తున్నాయి. మీకు అద్భుతమైన మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అంతేకాకుండా వీటిలో 5 సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. స్టాండర్డ్, ఎన్ హ్యాన్స్ ట్రెబుల్, ఎన్ హ్యాన్స్ వాయిస్, ఎన్ హ్యాన్స్ బేస్, కస్టమ్ అనే 5 సౌండ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఒక్కసారి కేస్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 36 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. అలాగే సింగిల్ ఛార్జ్ తో మీరు 7 గంటల వరకు ప్లే టైమ్ ని పొందవచ్చ. మీరు కేవలం 10 నిమిషాల్లో ఛార్జ్ చేసి.. 2 గంటల ప్లే టైమ్ ని పొందవచ్చు.

ఇంకా ఈ రెడ్ మీ 5సీ ఇయర్ బడ్స్ ఐపీ 54 రేటింగ్ తో వస్తున్నాయి. అంటే మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫాస్ట్ పెయిరింగ్, లో లేటెన్సిలో గేమింగ్ ఎక్స్ పీరియన్స్ వంటి ఎక్స్ ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మీరు రెండు పెయిర్స్ ఇయర్ బడ్స్ ఒకే ఫోన్ కి కనెక్ట్ చేసి మూవీస్ చూడచ్చు. అయితే సెలక్టివ్ రెడ్ మి/ షావోమీ ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. ఇంక వీటి ధర రూ.1,999గా ఉండచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రైమ్ డే సేల్ లో జులై 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ట్యాబ్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్స్.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు!

ఒకప్పుడు అంటే ట్యాబ్స్ వాడకం విపరీతంగా ఉండేది. కానీ, ఇప్పుడు కాస్త వాటి ప్రభావం తగ్గింది అనే చెప్పాలి. అలాగని ఎవరూ ట్యాబ్స్ కొనడం లేదు అని కాదు. మార్కెట్ లో చాలానే ట్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఒక సేల్ ని తీసుకొచ్చింది. అది జులై 20- జులై 21న నడుస్తుంది. అయితే ఈ సేల్ లో చాలానే ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై అదిరిపోయే డీల్స్ తీసుకొచ్చారు. వాటిలో ది బెస్ట్ డీల్స్, ది బెస్ట్ ట్యాబ్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి.. మీరు గనుక ట్యాబ్స్ కొనాలి అనుకుంటే వీటిని కచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. మీకు కావాల్సిన ట్యాబ్ తక్కువ ధరలో, మంచి ఆఫర్లో ఉండి ఉండచ్చు.

రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ:

రెడ్ మీ ప్యాడ్ ఎస్ ఈ ఎమ్మార్పీ రూ.14,999కాగా 13 శాతం డిస్కౌంట్ తో రూ.12,999కే అందిస్తున్నారు. ఇది 4 జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇందులో డాల్బీ అట్మాస్, క్వాడ్ స్వీపకర్స్ ఉన్నాయి.

హానర్ ప్యాడ్ ఎక్స్ 8:

ఈ డీల్స్ లో హానర్ ఎక్స్ 8 మీద క్రేజీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.20.999కాగా కేవలం రూ.8,999కే అందిస్తున్నారు. ఈ ట్యాబ్ 14 గంటల బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది. ఇందులో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఇది జులై 20, 21 తేదీల్లో అందుబాటులో ఉండే ధర.

హానర్ ప్యాడ్ ఎక్స్9:

మరో సూపర్ డీల్ కూడా హానర్ ట్యాబ్ మీదే ఉంది. అది ప్యాడ్ ఎక్స్ 9. దీని ఎమ్మార్పీ రూ.25,999 కాగా కేవలం రూ.16,999కే అందిస్తున్నారు. అయితే ఈ డీల్ కూడా జులై 20, 21న మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇది 11.5 ఇంచెస్ డిస్ ప్లేతో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్, 7 జీబీ ర్యామ్ తో వస్తోంది.

లెనోవో ట్యాబ్ ఎం 11:

లెనోవో నుంచి ఉన్న అద్భుతమైన ఎం11 ట్యాబ్ మీద 42 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.31 వేలు కాగా.. కేవలం రూ.17,999కే అందిస్తున్నారు. ఈ ఎం11 ట్యాబ్ 11 ఇంచెస్ డిస్ ప్లే, 400 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది. 8 జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

రియల్ మీ ప్యాడ్ 2:

రియల్ మీ నంచి ప్యాడ్ 2 మీద క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.28,999 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.17,999కే అందిస్తున్నారు. ఈ ట్యాబ్ 11.5 ఇంచెస్ డిస్ ప్లేతో వస్తోంది. ఇది 6 జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది.

మన దేశంలో కాఫీ మార్కెట్ ఎంత? అరకు కాఫీ బిజినెస్ పెరగడానికి కారణాలేంటి?

కాఫీ.. ఈ పేరు వినే లోపే దాని ఘుమఘుమలు మనల్ని చేరిపోతాయి. ఆ అరోమాకే..ఆ సువాసనకే ఆహా అనిపిస్తుంది. ఒక్క సిప్ అలా నోట్లోకి వెళ్లి.. గొంతు దిగగానే.. ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. దాని రుచి అమోఘం. అందుకే అలాంటి కాఫీకి మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి మార్కెట్ ఉంది. కొన్నాళ్లుగా ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో మన కాఫీకి ఉన్న డిమాండ్ తక్కువేమీ కాదు.

2022లో ఇండియా కాఫీ మార్కెట్ విలువ 478 మిలియన్ల డాలర్లు. 2023లో మన కాఫీ మార్కె ట్ విలువ 552.9 మిలియన్ డాలర్లు. 2024-2033 అంచనా చూస్తే.. 9.87% CAGR వద్ద.. 2032 నాటికి 1,227.47 మిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. మన దేశంలో కాఫీ అనేది ఓ ముఖ్యమైన పంట. దేశంలోని పశ్చిమ కనుమలు ప్రధాన కేంద్రంగా సాగయ్యే దీనికి ఎగుమతి సామర్థ్యం కూడా అధికంగానే ఉంది. 2028 నాటికి కాఫీ మార్కెట్ 600 మిలియన్ డాలర్లను చేరుకుంటుంది. మన దేశంలో ఎక్కువమంది తాగే కాఫీ రకాలను చూస్తే.. ఇన్ స్టంట్ కాఫీతో పాటు రోస్ట్ కాఫీ ఈ లిస్టులో ఉంటాయి. ఇక 2023, 2024లో దేశంలో కాఫీ వినియోగాన్ని చూస్తే.. 60 కిలోల బరువున్న పదిలక్షలకు పైగా బ్యాగుల కాఫీని తాగేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువ. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 60 కేజీలున్న 170 మిలియన్లకు పైగా బ్యాగుల కాఫీని తాగేశారు. ఇందులో అమెరికాతో పాటు యూరప్ దేశాల వాటాయే ఎక్కువ.

మన దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం కర్ణాటకదే. ఆ తరువాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీలో 70% కంటే ఎక్కువ కర్ణాటక నుంచే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రం 2.33 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసింది. మన దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మూడు. అవి కర్ణాటక, కేరళ, తమిళనాడు. దేశ కాఫీ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 97 శాతం. దేశంలో అరబికా, రోబోస్తా వెరైటీలు ఎక్కువగా తయారవుతాయి. రోబస్టాతో పోలిస్తే.. అరబికాకు ఉన్న అరోమేటిక్ ఫ్లేవర్ వల్ల మార్కెట్ వేల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రోబస్టా స్ట్రాంగ్ ఫ్లేవర్ వల్ల దానిని అనేక రకాల మిశ్రమాల్లో ఉపయోగిస్తారు.

గత కొన్నేళ్లుగా మన దేశంలో కాఫీ వినియోగం పెరుగుతోంది. మిడిల్ క్లాస్ లోనూ కాఫీ కల్చర్ పెరిగింది. అందుకే కాఫీ తాగేవారి సంఖ్యా పెరుగుతోంది. దేశంలో ఏడాదికి సగటున ఒకరు 30 కప్పుల కాపీని తాగుతున్నారు. అదే ప్రపంచంలో చూస్తే.. ఏడాదికి 200 కప్పులు తాగుతున్నారు. అంటే మన దేశంలో కాఫీ మార్కెట్ విస్తరణకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. కాఫీ షాపుల సంఖ్య పెరగడం.. అలాగే అలాంటి షాపులకెళ్లి కాఫీ తాగే అలవాటూ పెరిగింది. పైగా చాలా ఆఫీసుల్లో కాఫీ వెండింగ్ మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా కాఫీ తాగే అలవాటు పెరగడానికి కారణమవుతున్నాయనే చెప్పాలి. అందుకే దీని మార్కెట్ కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది.

సరే.. పొద్దున్నే లేచి ఓ కప్పు కాఫీ పొట్టలో పడనిదే రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. అలాగని మన దేశంలో కాఫీ శతాబ్దాల తరబడి ఉందని అనుకోవడానికి లేదు. ఓసారి దీని హిస్టరీ తిరగేస్తే.. ఇది మనకు పరిచయం అయ్యింది.. 17వ శతాబ్దంలోనే. ఇథియోపియాలో దీని వినియోగం బాగా ఉండేది. తరువాత అరబ్ దేశాలకు అది కాస్తా పాకింది. అక్కడి నుంచి నెమ్మదిగా మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో అక్కడి నుంచి కొన్ని కాఫీ గింజల్ని తెచ్చి కర్ణాటకలోని చిక్ మంగుళూరులో నాటడం.. అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడుతో పాటు కేరళకు అది వెళ్లడం.. చూస్తుండగానే.. అలా దాని సాగు పెరిగిపోయింది. ఒకటా రెండా.. ఎన్నో చోట్ల ఇది సాగవుతోంది. ఒకరా ఇద్దరా ఎంతోమంది ఇప్పుడీ బిజినెస్ లో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అరకు లోయలో ఇది సాగవుతోంది. అలాంటి ఈ కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ ని తీసుకువచ్చారు. దీనివల్ల అరకు కాఫీ అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఆ ఆదాయమంతా గిరిజనులకే వెళుతుంది. దానివల్ల వాళ్లకు సాధికారత వస్తుంది. అందుకే ఏపీ ప్రభుత్వం దీనిపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. 2018లో పారిస్‌లో జరిగిన పోటీలో అరకు కాఫీకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అందుకే మరికొన్ని దేశాల్లో కూడా అవుట్ లెట్లను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి అరకు కాఫీ రుచి అమోఘం. మన దేశ ప్రధానిని కూడా ఇది ఆకట్టుకుంది. మొత్తం 2.36 లక్షల మంది రైతులు.. 2,72,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. కానీ వీటిలో 1.52 లక్షల ఎకరాల్లో దిగుబడి వస్తోంది. అది సుమారు 71 వేల టన్నులు ఉంటుంది. అటు ఆదాయం పరంగా చూస్తే.. ఎకరా కాఫీ తోటకు ఎలా లేదన్నా 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం ఉంటుంది. అందుకే గిరిజన రైతులు కూడా ఇప్పుడు ఈ పంట వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలా ఈ కాఫీ తోటల సాగు గిరిజనులకు ఆర్థిక ఆసరాను ఇస్తోంది.

ఏజెన్సీలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరముంది. ఎందుకంటే.. వారు కాఫీ పండ్లను అమ్మడానికే ఇష్టపడుతున్నారు. అంతకుముందు అయితే.. ఆ పండ్లను పప్పుగా చేసి… దీనినే పార్చిమెంట్ అనేవారు. ఈ పద్దతిలో అమ్మేవారు. కానీ దీని రేటు తక్కువ. దీంతో.. పండ్ల అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ ఓ లెక్కను చూస్తే.. 6 కేజీల కాఫీ పండ్లు తీసుకుని దానిని బాగా శుద్ధి చేసి చూస్తే.. ఒక కేజీ పార్చిమెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. కానీ దీనికోసం నాలుగు రోజుల పాటు ఇద్దరు కష్టపడాల్సి ఉంటుంది. అయినా వారికి వచ్చేది కేజీకి 280 రూపాయిలే. అదే పండ్లను అమ్మితే.. కేజీకి రూ.50 వస్తాయి. అదీ కాఫీ పండ్ల అమ్మకాల వెనుక ఉన్న కథ. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తంలో కాఫీలో.. 70 శాతం ఎగుమతి అవుతోంది. అందుకే ప్రపంచంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే దేశాలో జాబితాలో మన దేశానిది ఐదో స్థానం.

కాఫీలో చాలా రకాలున్నాయి. అవి ఎన్నున్నా… రెండు గుణాలను బట్టి దాని రకాన్ని చెప్పచ్చు. వాటిలో ఒకటి డికాక్షన్ తీసే పద్దతి. మరొకటి.. కాఫీ తయారీలో ఎంత నీరు కలుపుతారు.. ఎంత మేర పాలు కలుపుతారో తెలిపే పద్దతి. సో.. ఈ రెండింటిని బట్టి కాఫీని చాలా రకాలుగా తయారుచేయవచ్చు. వాటిలో చూస్తే.. క్యాపచీనో, మచియాటో, లాటె, ఎస్ ప్రెసో, ప్రెపచీనో.. ఇలా చాలా రకాలున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్ నచ్చుతోంది. ఇంకొక్క సిప్ అంటూ కప్పులకు కప్పులు తాగిస్తుంది. నిన్నమొన్నటి వరకు ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలకు పడిపోనివారు లేరు. కానీ అది చేయడం పెద్ద ప్రాసెస్. అయితే ఇప్పుడు అంతా రెడీ మేడ్ పద్దతులు వచ్చేశాయి. రోజూ బయట షాప్ కు వెళ్లి కాఫీ తాగే అవకాశం ఉండదు. అలాగని రకరకాల కాఫీ టేస్ట్ ను చూడకుండా చాలామంది ఉండలేరు. అలాంటివారికోసం.. ఇంట్లోనే వాటన్నింటినీ చేసుకునేలా.. రెడీ మేడ్ ఫ్లేవర్లు మార్కెట్ లోకి వచ్చాయి. వీటి సాయంతో.. నచ్చిన టైమ్ లో.. నచ్చిన ఫ్లేవర్ తో కాఫీ టేస్ట్ ను మనసారా ఆస్వాదించవచ్చు. వావ్ అని హ్యాపీగా అనవచ్చు. ఈ ఫీలింగే.. ఈ మార్కెట్ ను క్రమంగా పెంచుతోంది.

అప్పట్లో అయితే.. టీ స్టాల్ కు వెళ్లి.. కాఫీ కావాలి అని ప్రత్యేకంగా అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాఫీ అమ్మకాల కోసమే రిటైల్ అవుట్ లెట్లు వచ్చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందల, వేల కోట్ల రూపాయిల వ్యాపారం చేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ టీ కి ఉన్న మార్కెట్టే ఎక్కువని చెప్పాలి. అలాగే ఉత్తరభారతంలోనూ కాఫీ వినియోగం పెరగాల్సి ఉంది. ఇక వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా కాఫీ తోటల విస్తరణకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ అడ్డంకులను అధిగమించి దేశీయంగా, అంతర్జాతీయంగా కాఫీ మార్కెట్ ను పెంచుకోవాల్సి ఉంది. కాఫీ తోటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. హెక్టార్ కు 2500 నుంచి 3000 డాలర్లను సబ్సిడీగా ఇస్తోంది. ఇది వారికి ఆర్థికంగా తోడ్పడుతోంది.

కాఫీ వినియోగం పెరగడానికి టెక్నాలజీ కూడా తోడ్పడుతోంది. పూర్వం కాఫీ తాగాలంటే షాప్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాఫీ వెండింగ్ మెషీన్స్ వచ్చేశాయి. పైగా వాటిని ఫోన్లతో కూడా ఆపరేట్ చేయవచ్చు. అందుకే వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోవచ్చు. ఎంత కాఫీనైనా ఉత్పత్తి చేయవచ్చు. దీంతో హోటళ్లు, సాఫ్ట్ వేర్ సంస్థలు, పరిశ్రమలు, క్యాంటీన్లు, మార్కెట్లు… ఇలా చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆపరేట్ చేయవచ్చు. అలాగని క్వాలిటీలో రాజీపడాల్సిన పనే లేదు. టేస్ట్ కు టేస్ట్.. క్వాలిటీకి క్వాలిటీ.. రెండూ లభిస్తాయి. ఇదే మన దేశంలో కాఫీ వినియోగం పెరగడానికి బూస్ట్ ఇస్తోంది.

అంతర్జాతీయంగా కాఫీ ఎగుమతులను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల అంతర్జాతీయంగా ఎక్కువ షేర్ ను సొంతం చేసుకోవడానికి వీలవుతుంది. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా దీనిని అమలు చేస్తోంది. అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణకొరియా, ఫిన్ లాండ్ వంటి అత్యధిక విలువ ఉన్న మార్కెట్లలో బిజినెస్ చేయడానికి వీలుగా.. కేజీకి రూ.2 ల చొప్పున ఎక్స్ పోర్ట్ ఇన్సెంటివ్ ను ఇస్తోంది. దీనివల్ల హైవేల్యూ మార్కెట్లలో హైవేల్యూ గ్రీన్ కాఫీస్ ని ఎగుమతి చేయడానికి వీలవుతుంది. కాఫీ సాగును, వినియోగాన్ని పెంచే ఇలాంటి పాలసీల వల్ల దేశంలోనూ కాఫీ మార్కెట్ పెరగడానికి వీలవుతుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాఫీ అమ్మకాల కోసం ప్రముఖ సంస్థలు ఉన్నాయి. కేవలం కాఫీ తాగడం కోసమే ప్రత్యేకంగా కెఫేలను డిజైన్ చేశారు. సో.. ఈ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది.

 

నిరుద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త స్కీం.. డిగ్రీ పూర్తైతే నెలకు 10 వేలు

ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నాయి. పలు పథకాలతో నిరుద్యోగులకు సాయమందిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది ఓ ప్రభుత్వం. డిగ్రీ పూర్తైన వారికి నెలకు రూ. 10 వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చి ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.

మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారం చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు తీపికబురును అందిస్తోంది. సీఎం ఏక్ నాథ్ షిండే లాడ్లా భాయ్ యోజన పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన యువకులకు ప్రతి నెల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని పండార్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ ప్రకటన చేశారు.

లాడ్లా భాయ్ యోజన పథకం కింద అర్హతలను బట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపారు. 12వ తరగతి పూర్తి చేసిన వారికి నెలకు రూ.6 వేలు, డిప్లొమా పూర్తి చేసిన యువకులకు నెలకు రూ.8 వేలు, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన యువకులకు నెలకు రూ.10 వేలు అందించనున్నట్లు తెలిపారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహిళల కోసం లాడ్లీ బెహన్ స్కీమ్ ను ప్రారంభించి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. పురుషులకు కూడా ఆర్థిక సాయం అందించాలన్నా డిమాండ్ ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు.

ఈ పురుగుని జపాన్‌ వాళ్ళు 75 లక్షలకి కొంటారు.. ఎందుకంత పిచ్చో తెలుసా?

స్టాగ్ బీటిల్.. దీన్ని పేడ పురుగు అంటారు. చెత్త చెదారం ఉన్న చోట పెరుగుతుంది. ఇలాంటి పురుగు మన ఇంట్లో తిరిగితే ఏ దోమల బ్యాటో పుచ్చుకుని కొట్టి చంపేస్తాం. కానీ జపాన్ వాళ్ళు మాత్రం అలా కాదు. ఇలాంటి పురుగుని తెచ్చి ఇస్తే లక్షలు పెట్టి కొంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్లతో సమానంగా వీటిని ట్రీట్ చేస్తారు. అంతలా ఈ పేడ పురుగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలు ఇందులో ఏముంది అంత గొప్ప?

ఈ స్టాగ్ బీటిల్ ఇంట్లో ఉంటే అదృష్టం, సంపద కలిసి వస్తాయని నమ్ముతారు. అలానే ఈ స్టాగ్ బీటిల్ ఆయిల్ ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఒక మగ పేడ పురుగు 4 సెంటీమీటర్ల నుండి 9 సెంటీమీటర్ల పొడవు వరకూ పెరిగితే.. ఆడ పేడ పురుగు 3 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది. వీటి జీవిత కాలం మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది. వీటిలో మొత్తం 1200 రకాల జాతులు ఉన్నాయి. ఇవి రెండు పొడవైన కొమ్ములను కలిగి ఉంటాయి. చూడ్డానికి ఒక సైనికుడు ధరించిన ఆయుధంలా ఉంటాయి. ఈ పురుగులను తలకు ధరిస్తే చెడు ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీ వంటి వాటిని దరిచేరనీయకుండా రక్షిస్తుందని నమ్ముతారు.

మూర్ఛ, తిమ్మిరి, నొప్పులు, తలనొప్పి, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం కూడా జపాన్ లో ఒక స్టాగ్ బీటిల్ లక్షల రూపాయలు పలికింది. అక్కడ ఈ పురుగులు చాలా వరకూ అంతరించిపోయాయి. ఎక్కువగా కనిపించవు. అరుదైన జాతిగా పరిగణించబడుతున్నాయి. ఇవి ఉంటే అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఎంత ధర ఉన్నా వీటిని కొనేందుకు ముందుకు వస్తారు. వ్యాపారస్తులు కూడా వీటిని ప్రత్యేకంగా పెంచి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. ఈ డిమాండ్ ఒక్కోసారి బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరలను బీట్ చేస్తాయని కూడా అనేక కథనాలు వచ్చాయి. మొత్తానికి పేడ పురుగు అని తీసి పడేస్తున్నాం గానీ దీన్ని లక్షలు పెట్టి మరీ కొంటారంటే ఆశ్చర్యంగానే ఉంది. దీని మీద నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి పేడ పురుగులు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ జపాన్ దేశానికి ఎగుమతి చేస్తే బోలెడన్ని బీఎండబ్ల్యూ కార్లు, ఆడి కార్లు కొనుక్కోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

OTT లో బెస్ట్ 10 మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. వీటిని కానీ మిస్ చేశారా?

ఓటీటీ లో ఉన్నవి ఒకటి రెండు సినిమాలైతే.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఎలా ఉన్నాయో చెప్పేయడం చాలా ఈజీ. కానీ ప్రస్తుతం ఓటీటీ ల పరిస్థితి అలా లేదు. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా వాటిలో ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. అలాగే ఆల్రెడీ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఏమైనా మిస్ చేశారేమో అని.. ఈ మధ్య ఏ సినిమాలు , సిరీస్ లు బావుంటాయి అనే సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటిలో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసే జోనర్స్ ఒకటి హర్రర్, మరొకటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్. వాటిలో క్రైమ్ , మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇలా అనేక రకాలుగా మూవీస్ ఉంటూ ఉంటాయి. మరి వాటిలో బెస్ట్ మర్డర్ మిస్టరీ మూవీస్ ఏంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ తెలుగు సిరీస్ కు శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ లో రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి, చైతన్యకృష్ణ, ఆశ్రిత వేముగంటి, ‘తాగుబోతు’ రమేష్, శరణ్య అంతా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. 2022 లో వచ్చిన ఈ సిరీస్ జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్ చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఈ సినిమాను ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు.. తెలుగు , తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో.. జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది . ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీతో పాటు.. రాజేష్ కుమార్ , అతుల్ తివారి , నారాయణి శాస్తి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా ఒకే బేస్ మీద రన్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో పోలీస్ ఆ కేసును ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకులను చివరి వరకు కదలనివ్వకుండా .. ఈ మూవీ చూసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంటే అందరి ఊహ మలయాళీ, తమిళ చిత్రాలవైపు వెళ్తుంటాయి. కానీ తెలుగులో కూడా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది.

కోల్డ్ కేస్ :

క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందా అనే ట్విస్ట్ తో పాటు.. ఆత్మలు వెంటాడే తీరు ప్రేక్షకులకు భయాన్ని కూడా కలిగిస్తుంది. చివరి వరకు కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఎలా వీజ పూంచిర:

కొన్ని సినిమాలు స్టార్టింగ్ బోర్ కొట్టిన కూడా.. చివరి వరకు చూస్తే మాత్రం.. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎందుకు చూడలేదు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమా కూడా అంతే.. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఏకంగా తన భార్యనే చంపి.. బిర్యానీ వండి పెడతాడు. ఇలాంటి సినిమా అసలు ఇప్పటివరకు చూసి ఉండరు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

రణం:

మర్డర్ మిస్టరీ సినిమాలన్నీ కూడా ఒకటే థీమ్ తో ఉన్నా కూడా.. ఆ కేసులను ఎలా సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చారన్న కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కు.. థ్రిల్లింగ్ ఏపీరియెన్స్ ఇస్తుంది. అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే మూవీస్ లిస్ట్ లో ఇది ఒక మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

తత్సమ తద్భవ:

ఈ సినిమా చూసిన తర్వాత ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా అనే డౌట్ రావడం ఖాయం. ఈ సినిమా ఆఖరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు మిస్ కాకుండ చూడండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి వెంటనే చూసేయండి.

ట్వేన్టీ వన్ గ్రామ్స్:

మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ అంటే మరింత ఇంట్రెస్ట్ వచేస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎలా చేశారు ఇలా ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులను సినిమా చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. ఇది కూడా అంతే ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వారం వరకు ఆ సీన్స్ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఖుఫియా:

ఈ సినిమాలో రీసెర్చ్ అండ్ వింగ్ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది.ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటి మాత్రం అందరికి పరిచయమే. ఆమె మరెవరో కాదు టబు. ఇక ఈ సినిమాలో టబుతో పాటు ఆశిష్ విద్యార్థి, అలీ ఫజల్, వామికా గబ్బీ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

అసుర:

2020 లో అసుర అనే ఓ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. అప్పట్లో ఈ సిరీస్ ఊహించని విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఎవరు టచ్ చేయని… ఓ సరికొత్త పాయింట్ ను టచ్ చేసారు మేకర్స్. దీనిలో ఇప్పటివరకు రెండు సీజన్స్ వచ్చాయి. ఈ రెండు సీజన్స్ కూడా ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు!

ఈ ఏడాది ఎండలు ఎంతగా మండిపోయాయో.. అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఉన్న అల్పపీడనం బుధవారం నాటికి బలహీనపడింది. మరోవైపు పవ్చిమ మద్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంటుందని తెలిపారు. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, సూర్యపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సూర్యపేట జిల్లాల్లో భీరీ వరర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

ఇదిలా ఉంటే కోస్తాంద్రలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19 న మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో రాయలసీమలో తెలికపాటి వర్షాలు పడే ఛాన్సు ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

బోధనేతర భారం తగ్గించండి బాబోయ్‌…వైకాపా తీసుకొచ్చిన యాప్‌లు, ఆన్‌లైన్‌ పనులతో బోధనకు ఆటంకాలు

అమరావతి: విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనే ఉపాధ్యాయుల ప్రధాన విధి. వాళ్లు బాగా చదువుతున్నారా? ఇచ్చిన పని చేస్తున్నారా? మార్కులు ఎలా వస్తున్నాయి? ఇలాంటి అంశాలను పరిశీలించడం వారి బాధ్యత. కానీ, గత వైకాపా ప్రభుత్వం అనేక బోధనేతర పనులను వారిపై మోపింది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదన్న నిబంధనను పట్టించుకోలేదు. ఉదయం నుంచి విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల వివరాలు, మరుగుదొడ్ల ఫొటోలు, భోజనం చిత్రాలు, కోడిగుడ్లు, చిక్కీల నిల్వల నిర్వహణ, స్టూడెంట్‌ కిట్‌ లబ్ధిదారుల వివరాల నమోదు, ‘నాడు-నేడు’ పనులు.. ఇలా అనేక పనులను ఉపాధ్యాయులతో చేయించింది. వీటిని తొలగించి, ఉపాధ్యాయులు బోధనపై దృష్టిపెట్టేలా అవకాశం కల్పించాలని అప్పట్లో ఉపాధ్యాయులు, సంఘాలు కోరినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వమైనా బోధనేతర పనులను తగ్గించి, తమను బోధనకే వినియోగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

యాప్‌లో హాజరు.. ఆపై ఫొటోలు
విద్యార్థుల హాజరును ఉదయం 10.30లోపు యాప్‌లో నమోదు చేయాలి. దీనికి 15-20 నిమిషాలు పడుతోంది. అది పూర్తికాగానే మధ్యాహ్నభోజనం తినే విద్యార్థుల సంఖ్య, కోడిగుడ్లు తీసుకునేవారి సంఖ్యను నమోదు చేయాలి. ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా.. లేవా అని తెలుసుకునేందుకు ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఏఐ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి, ఫొటోలు తీయాలి. ఫొటోలు అప్‌లోడ్‌ చేసేందుకు 20 నిమిషాలు పడుతోంది. మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాలను విడివిడిగాను, అన్నింటినీ కలిపి ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తనిఖీచేసిన ఉపాధ్యాయుడి ఫొటోనూ పెట్టాలి. ఎంతమంది భోజనం, కోడిగుడ్డు తీసుకున్నారనే వివరాలనూ నమోదు చేయాలి.

ఆన్‌లైన్‌ పనులు ఎక్కువే..
పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పర్యవేక్షణ పనులను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. మెటీరియల్‌ కొనుగోలు, బిల్లుల అప్‌లోడ్‌తో పాటు నిర్మాణ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. వీటిని తొలగించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.

పాఠశాలల్లో నిర్వహించే ఫార్మెటివ్, సమ్మెటివ్‌ పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థుల వివరాల నమోదు ఉపాధ్యాయులే చేస్తున్నారు.
విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకునే పనినీ ఉపాధ్యాయులే చేస్తున్నారు.
బోధన కంటే వాటికే ప్రాధాన్యం
బోధనేతర పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. ఇవన్నీ చేయడం భారమని వారు చెప్పడంతో రోజుకో ఉపాధ్యాయుడు చేసేలా మార్చారు. ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటి పరిశీలనే ప్రధానంగా చేస్తున్నారు. బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలోని 12 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులకే ఎక్కువ సమయం పోతోంది. పాఠాలు చెప్పడం తగ్గిపోతోంది.
ఉన్నత పాఠశాలలు గతంలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేవి. గత ప్రభుత్వం ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చింది. దూరప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఆ సమయానికి రాలేకపోతున్నారని, మళ్లీ 9.45కు మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

హార్దిక్ పాండ్యా ఇకపై కెప్టెన్ కాలేడా? బోర్డు అన్నీ గమనించింది!

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను. టైటిల్ ఫైట్ అనే కాదు.. మెగా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్​ టైమ్​లో బ్యాటింగ్, బౌలింగ్​లో ఫెయిలైన పాండ్యా.. పొట్టి కప్పులో మాత్రం తనలోని రియల్ టాలెంట్​ను బయటకు తీశాడు. వరల్డ్ కప్ ముగిశాక స్వదేశానికి వచ్చిన అతడు.. పలు ఈవెంట్స్​లో పాల్గొంటూ బిజీగా గడిపాడు. ఎట్టకేలకు సొంత నగరం వడోదరకు చేరుకున్న స్టార్ ఆల్​రౌండర్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీ20 క్రికెట్​కు కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్​బై చెప్పడంతో కొత్త సారథిని నియమించే పనుల్లో బిజీగా ఉంది బీసీసీఐ. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్​ కోసం ఒకట్రెండు రోజుల్లో టీమ్స్​ను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఇదే అవకాశంగా జట్టుకు పర్మినెంట్ కెప్టెన్​ను అనౌన్స్​ చేయాలని భావిస్తోందట. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను ఆ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయిందట. అయితే టీ20 ప్రపంచ కప్​లో వైస్ కెప్టెన్​గా ఉన్న పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. పొట్టి కప్పులో రాణించినా హార్దిక్​ను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే స్వయం కృతాపరాధమే అతడి కొంపముంచిందని తెలుస్తోంది. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా అతడి ప్రవర్తనను భారత క్రికెట్ బోర్డు గమనించింది. రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్​ సూచనల్ని అతడు పట్టించుకోలేదు. సూర్యకుమార్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లను పాండ్యా కలుపుకొని వెళ్లకపోవడం బోర్డుకు నచ్చలేదట.

ప్లేయర్​గా హార్దిక్ స్కిల్స్​ మీద అనుమానాలు లేకపోయినా బిహేవియర్, యాటిట్యూడ్ పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. ఎంఐ సారథిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన విధంగానే ఇంటర్నేషనల్ టీమ్​లోనూ అదే తీరుతో ఉంటే కష్టమని బీసీసీఐ భావించిందట. పాండ్యా కెప్టెన్​గా అదే యాటిట్యూడ్​ను చూపిస్తే ఆటగాళ్లలో యూనిటీ పోతుందని భయపడిందట. ఇది ఆలోచించే అనూహ్యంగా సూర్యకుమార్ పేరును తీసుకొచ్చారని సమాచారం. టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే కెప్టెన్​గా ఉంచాలని డిసైడ్ అయిందట బోర్డు. ఆ తర్వాత ఎలాగూ శుబ్​మన్ గిల్ వచ్చేస్తాడు. దీంతో ఇక హార్దిక్​కు కెప్టెన్సీ దక్కే స్కోప్ కనిపించడం లేదు. సేమ్ టైమ్ వన్డే, టెస్టులకు కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి..

Health

సినిమా