Saturday, November 16, 2024

రూ.30,000 లోపు అద్భుతమైన ల్యాప్‌టాప్‌లు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల్లో భారీ డిస్కౌంట్‌

ల్యాప్‌టాప్ అనేది పాఠశాల, కళాశాల విద్యార్థులకు, కార్యాలయ ఉద్యోగులకు అవసరంగా మారిపోయింది. మీరు కూడా ఇంట్లో లేదా కార్యాలయంలో ప్రాథమిక పని కోసం ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటే, బడ్జెట్ రూ.30 వేల కంటే తక్కువ ఉంటే ఈ ల్యాప్‌టాప్‌ ఉపయోగకరంంగా ఉంటుంది.

ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

Acer Chromebook CB315-4H: ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే మీరు ఇందులో సిల్వర్ కలర్ ఆప్షన్‌ను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.36,999 అయినప్పటికీ, మీరు దీన్ని 59 శాతం తగ్గింపుతో రూ. 14,990కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు దీన్ని మరింత చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌పై రూ. 2000 వరకు తగ్గింపు పొందవచ్చు.
asus x515: మీరు చాలా తక్కువ ధరలో 15.6 అంగుళాల డిస్‌ప్లేతో స్లిమ్ ల్యాప్‌టాప్‌ని పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 42,990 అయినప్పటికీ, మీరు దీన్ని 44 శాతం తగ్గింపుతో కేవలం రూ. 23,990కే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ Asus ల్యాప్‌టాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
Lenovo V15 G4: 34 శాతం తగ్గింపుతో వచ్చే ల్యాప్‌టాప్ రూ.24,990కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా మీరు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపుపై రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మీరు ఈ ల్యాప్‌టాప్‌ని Amazon-Flipkart ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. మీరు Amazonలో 7 రోజుల రీప్లేస్‌మెంట్ ఆప్షన్‌ కూడా ఉంటుంది.
డెల్ ఇన్‌స్పిరాన్ 3535: Dell ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 38,747 అయితే మీరు దానిని కేవలం రూ. 29,990కే డిస్కౌంట్‌తో పొందుతున్నారు. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు ఈ ల్యాప్‌టాప్‌ను చౌక ధరలో పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లు కాకుండా, మీరు తక్కువ ధరలకు కొనుగోలు చేయగల ఇతర ఎంపికలను పొందవచ్చు. మీరు Amazon, Flipkart, Croma Vision సేల్స్ మొదలైన వాటిలో గొప్ప డీల్‌లను పొందవచ్చు.

భారీ శబ్ధాలతో చెవులకే కాదు.. ఈ అనారోగ్య సమస్యలు కూడా.

ప్రస్తుతం పారిశ్రామిక పెరిగింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటి కారణంగా పెద్ద ఎత్తున శబ్ధకాలుష్యం ఎక్కువవుతోంది. సాధారణంగా కాలుష్యం అంటే వాయు కాలుష్యమనే ఆలోచననే ఉంటుంది.

అయితే రోజురోజుకీ శబ్ధకాలుష్యం కూడా ఓ రేంజ్‌లో పెరుగుతోంది. వాయు కాలుష్యంతో సమానంగా శబ్ధ కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శబ్ధకాలుష్యానికి ప్రభావితమైన వారిలో తీవ్ర సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే శబ్ధ కాలుష్యం కేవలం చెవుల ఆరోగ్యంపైనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద శబ్ధాల మధ్య ఎక్కువ సమయం గడిపేవారు పలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పెద్ధ శబ్ధాలను ఎక్కువ కాలం వినడం వల్ల చెవి లైనింగ్ దెబ్బతింటుంది. దీని కారణంగా వినే సామర్థ్యం తగ్గిపోతుంది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా కోల్పోవచ్చు కూడా. అధిక శబ్ధంతో నిత్యం మ్యూజిక్‌ వినే వారిలో ఈ సమస్య త్వరగా వస్తుంది.

అలాగే పెద్ద శబ్ధాలు నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది అలసట, చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి ఎన్నో మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే దీర్ఘకాలం శబ్ధ కాలుష్యంకు గురైన వారిలో అధిక రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో వేగం పెరగడం వంటి ప్రమాద పరిస్థితులకు కూడా దాఇ తీస్తుంది అంటన్నారు.

ఇక పెద్ధ శబ్ధాలకు ఎక్స్‌పోజ్‌ అయ్యే వారిలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీరిలో డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు శబ్దాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా హెడ్‌సెట్స్‌లో పెద్ద ఎత్తున వాల్యూమ్‌ పెట్టుకొని వినడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

వణుకుపుట్టించే సీన్స్.. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే హారర్ మిస్టరీ సినిమా..

హారర్ మూవీ లవర్స్ కోసం ఇప్పుడు ఓటీటీ మేకర్స్ ఎక్కువగా హారర్ థ్రిల్లర్ మూవీస్ తీసుకువస్తున్నారు. నిజానికి ఈ జానర్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

సస్పెన్స్ థ్రిల్లింగ్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో మిస్టరీస్, ఊహించని ట్విస్టులతో సాగే సస్పెన్స్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. నెల తిరక్కుండానే ఇటు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందులో ఓ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. అదే ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. 2021 జూలై 14న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ కు రాబర్డ్ డెఫియో, పాలో స్ట్రిప్పోలి ఇద్దరు దర్శకత్వం వహించారు.

నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుండగా దారిలో ఓ చెట్టుకుని వారి కారు ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ఆ పక్కనే వారికి ఒక ఇల్లు కనిపించడంతో అందులోకి వెళ్లిపోతారు. అక్కడ కళ్లు, చెవులు, నోరు లేని బొమ్మల ముందు కొందరు మనుషుల అవయాలు పెట్టి.. పూజలు చేసినట్లుగా కనిపిస్తాయి. బొమ్మలకు మనుషుల అవయవాలు పెట్టి పూజలు చేసి వారిని తిరిగి బతికించేందుకు చేసే పూజలు అని.. అందుకు మూల్యం చె్లలించుకోవాల్సి ఉంటుందని అక్కడ రాసి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న సీన్స్ చూసి ఆ నలుగురు వణికిపోతారు. ఆ తర్వాత వారిలో నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతుంటారు.

ఆ నలుగురిని కొందరు ముసుగేసుకున్న వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్.. ఆద్యంతం ఆసక్తిని కలిగించే ఈ హారర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటాలియన్ తోపాటు మరికొన్ని విదేశీభాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.

ప్రపంచంలో మహిళలకు అత్యంత సురక్షితమైన దేశాలు ఏంటో తెలుసా.?

ఏ దేశంలో అయితే మహిళలు సురక్షితంగా ఉంటారో. ఆ దేశం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అంటుంటారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో అసలు ప్రపంచంలోని ఏ దేశాలు మహిళలకు అత్యంత సురక్షితమైన దేశం ఏంటి..?

అసలు మహిళలకు దేశాలు సురక్షితమా.? కాదా అన్న విసాలను ఎలా పరిగణిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళలకు సురక్షితమైన దేశాన్ని పరిగణించడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు . మహిళలపై హింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉండాలి అలాగే వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి . అంతే కాకుండా విద్య, ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాలు దక్కాలి. అలాగే మహిళలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి . అలాగే సమాజంలో మహిళలకు సమాన హోదా రావాలి, వారి అభిప్రాయాలను గౌరవించాలి . అంతే కాకుండా దేశంలో లింగ సమానత్వం కోసం కృషి చేయాలి ఇవన్నీ ఉంటే ఆ దేశం మహిళలకు సురక్షితమైన దేశంగా చెప్పొచ్చు.

ఇక అనేక అధ్యయనాలు, సర్వేల అనంతరం ఉత్తర ఐరోపా దేశాలను ప్రపంచంలోని సురక్షితమైన దేశాల జాబితాలో చేర్చారు. చేర్చబడతాయి. ఇందులో ఐస్‌లాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలకు రాజకీయాలు , వ్యాపారం ఇలా సమాజంలోని అన్ని రంగాలలో సమాన అవకాశాలు లభిస్తాయి.

నార్వే కూడా మహిళలకు అత్యంత సురక్షితమైన దేశంగా చెబుతుంటారు. ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక ఫిన్‌లాండ్‌లో విద్య, ఉపాధి మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ మహిళల రాజకీయ భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. స్వీడన్‌లో మహిళల కోసం అనేక రకాల సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలకు ప్రసూతి సెలవులు, శిశు సంరక్షణ సౌకర్యాలు అందిస్తారు. డెన్మార్క్‌లో, లింగ సమానత్వం కోసం మహిళలకు అనేక చట్టపరమైన రక్షణలు అందించారు.

సోయాబీన్స్‌ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ అద్భుతమైన మూలం. సోయాబీన్స్‌లో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

సోయాబీన్స్‌లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది.

సోయాబీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే వివిధ రకాల పోషకాలను అందిస్తాయి. సోయాబీన్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఈ టైంలో సోయా ఉత్పత్తులు తినడం మంచిది.

సోయాబీన్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. సోయాను తీసుకోవడంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీంతో చర్మం ముడతలు తగ్గిపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ పానీయాల్లో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సోయాబీన్ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.

సోయాలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరి పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలను ఇది రెగ్యులేట్‌ చేస్తాయి.

గోరుచిక్కుడు అంటే ఇష్టంలేదా..? ఈ గొప్ప బెనిఫిట్స్ మిస్‌ చేసుకున్నట్టే..!

గోరుచిక్కుడు.. సాధారణంగా ఇది చిక్కుడు జాతికి చెందిన మొక్క. ఇంగ్లీషులో దీన్ని క్లస్టర్ బీన్స్ అంటారు. గోరుచిక్కుడులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

తక్కువ కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి లభిస్తుంది.

గోరుచిక్కుడులోని గుణాలు ఆస్తమాకి చక్కని పరిష్కారంగా ఉంటుంది. కాబట్టి, ఆస్తమా ఉన్నవారు గోరుచిక్కుడుని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. ఐరన్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

గోరుచిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గోరుచిక్కుడులో ఎన్నో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాల్మొనెల్లో సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గోక్కుడుతో ఒంట్లోని హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ గోరుచిక్కుడు మంచి కొలెస్ట్రాల్‌ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే ఫోలెట్‌ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది. గోరు చిక్కుడు విటమిన్లు, ఖనిజాలకు మూలం. ఇది విటమిన్లు A, C, E, K, B6, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తుంది.

ముఖ్యంగా చాలామంది మహిళలు ఐరన్‌ లేమితో బాధపడుతుంటారు. దీంతో వారు బలహీన సమస్యతో బాధపడుతుంటారు. అందుకే గోరుచిక్కుడు మహిళలకు వరం. వారానికి ఒకసారైనా తినాలి. డయాబెటీస్‌, బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు కూడా గోరుచిక్కుడు తినాలి.

వాట్సాప్‌లో ‘కస్టమ్‌ లిస్ట్’ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటో తెలుసా.?

ఓవైపు యూజర్ల ప్రైవేసీకి పెద్ద పీట వేస్తూనే, మరోవైపు వారి అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

‘కస్టమ్‌ లిస్ట్‌’ పేరుతో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుుకుందాం. సాధారణంగా వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే గ్రూప్స్‌, వ్యక్తిగత ఛాట్స్‌ ఇలా రకరకాల కాంటాక్ట్‌ల నుంచి వచ్చిన మెసేజ్‌లు కనిపిస్తాయి.

దీంతో మీకు కావాల్సిన కాంటాక్ట్‌ను వెతకడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. సెర్చ్‌ బాక్స్‌లో పేరు టైప్‌ చేసి చూడాల్సి ఉంటుంది. అయితే ఆ సమస్యు చెక్‌ పెట్టేందుకే వాట్సాప్‌ ఈ ‘కస్టమ్‌ లిస్ట్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో కాంటాక్ట్‌లను ఫిల్టర్‌ చేయొచ్చు. ఫ్యామిలీ, ఆఫీస్‌, ఫ్రెండ్స్‌.. మీకు నచ్చిన లిస్ట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. దీంతో మీ కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగువుతుంది. ఇంతకీ ఈ ఆప్షన్‌ ఎలా ఉపయోగించుకోవాలనేగా.

ఇందుకోసం వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే.. ఆల్‌, అన్‌రీడ్‌, ఫేవరెట్స్‌, గ్రూప్స్ ఇలా ఫిల్టర్లు కనిపిస్తాయి. అయితే దీని పక్కనే ‘+’ ఐకాన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఐకాన్‌ను క్లిక్‌ చేసి మీకు నచ్చినట్లు కాంటాట్స్‌కు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడిట్‌ కూడా చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

కీలక మార్పులు చేయనున్న యూట్యూబ్‌.. ఇకపై ఆ ఆప్షన్‌ ఉండదా

యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోలకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కీలక మార్పు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఇంటర్‌ఫేస్‌ని పరీక్షిస్తోంది.

ప్రస్తుతం యూట్యూబ్‌ షార్ట్స్‌కి డిజ్‌లైక్‌ ఆప్షన్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తొలగించనున్నారని తెలుస్తోంది. ఇందుకు బదులుగా సేవ్‌ బటన్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. యూట్యూబ్‌లో ఇకపై డిజ్‌లైక్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అమలు చేయనున్నారు.

దీంతో షార్ట్స్‌ను సులభంగా సేవ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సేవ్‌ ఆప్షన్‌ నొక్కగానే మీరు దీన్ని ఇప్పటికే ఉన్న ప్లేజాబితాకు సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త ప్లేజాబితాని సృష్టించాలనుకుంటున్నారా అని యూట్యూబ్‌ అడుగుతుంది.

ఇదిలా ఉంటే షార్ట్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 60 సెకండ్ల నిడివి ఉన్న షార్ట్స్‌ లిమిట్‌ను 3 నిమిషాలకు పెంచిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ క్రియేటర్లకు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుందని మేకర్స్‌ తీసుకొచ్చారు.

ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్‌ 13.. ధర ఎంతో తెలుసా

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్ల్‌ ఎట్టకేలకు మార్కెట్లోకి వ్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గురువారం చైనా మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌ను 24 జీబీ ర్యామ్, వన్‌ టిగా బైట్ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1440 x 3168 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు స్క్రీన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ట్యూన్డ్ బై హేసిల్ బ్లాడ్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారి ఓఎస్ 15 వర్షన్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలోకి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 15 తో తీసుకొస్తామని వన్‌ప్లస్‌ తెలిపింది.

ధర పరంగా చూస్తే.. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.53,100, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.57,900, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.62,200, 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.70,900 ఉండనుంది.

చంబల్ దేవీ తర్వాత అత్యధిక కేసులు జగన్‌పైనే

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

దీపావళి అంటే చెడుపైన మంచి విజయం అని.. వైసీపీపై కూటమి విజయం అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈరోజు (శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Cm Pawan Kalyan) పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్స్ ఇవ్వగలిగామని.. గతంలో దీన్ని వైసీపీ రాజకీయం చేసిందని విమర్శించారు.

తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. విజయమ్మ లేఖతో పార్టీ పూర్తిగా మునిగిపోయిందని.. ఆ పార్టీలో జగన్ (Former CM YS Jaganmohan Reddy) తప్పితే ఎవరు మిగలరన్నారు. అన్ని వ్యవస్థలు నాశనం చేసిన ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ పాజిటివ్ దృక్పథంగా వెళుతున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. 2004 లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 92 లక్షల రూపాయలు ఉన్నాయి..2009 నాటికి రూ.370 కోట్లకు వెళ్లారని తెలిపారు.

జగన్ మీద 47 కేసులు ఉన్నాయని.. చంబల్ దేవి తర్వాత అత్యధిక కేసులు ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీదనే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు అన్న క్యాంటీన్లు మూసివేశారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రారంభించామన్నారు. భీమిలి నియోజకవర్గ నాయకులు, శుభకార్యాల రోజు నాడు ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తున్నాన్నామన్నారు. జిల్లా సమీక్షలో భీమిలికి సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి.. ఇచ్చిన హామీలు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటుపరం జరగదని. అవసరమైతే ఢిల్లీ వెళ్లి మాట్లాడతామని వెల్లడించారు. రుషి కొండ విషయంలో ఏం చేయాలనే దానిపైన త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నరాల బలం కోసం తినాల్సిన ఐదు సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే ఏ ఢోకా ఉండదు..

మానవ శరీరంలో నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. బ్రెయిన్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలు పంపించడానికి నరాలు కీలకం. వీటి వల్ల నాడీవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు తీసుకెళ్లడంలో నరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన సమయానికి అందకపోతే రకరకాల వ్యాధులు వస్తాయి. అందులో నరాల బలహీనత కూడా ఒకటి.

దీర్ఘకాలిక తలనొప్పి, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చేతుల కాళ్ల తిమ్మిరి, కండరాల బలం కోల్పోవడం వంటి లక్షణాలు ఎంత మాత్రం మంచిది కాదు. నరాల బలహీనత ఉంటే ఈ లక్షణాలు మీలో కనిపిస్తాయి. చెడు అలవాట్లు, ఒత్తిడి కారణంగా నరాల్లో రక్తా సరఫరా సరిగ్గా జరగదు. దీంతో ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సమస్య ఎదుర్కోనే వారు చాలా బాధ, నొప్పి భరిస్తూ ఉంటారు. అయితే, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ సూపర్ ఫుడ్స్‌తో నరాల బలం పెరుగుతుంది. ఇంతకీ ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆకుకూరలు
ఆకుకూరలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా రోజూ తింటే నరాల బలహీనత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

సిట్రస్ ఫ్రూట్స్

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు కాల్షియం, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫోలెట్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌ లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ నరాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ బి-15 ఉంటుంది. ఇవి కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ గింజలు రోజూ తింటే.. నరాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

బ్లూ బెర్రీ పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బ్లూబ్రెరీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదుడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జ్ఞాపక శక్తి మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ నరాలు దెబ్బ తినకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.

సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లను సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. నిమ్మ, నారింజ, బత్తాయి, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. సిట్రస్ ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు నరాలు దెబ్బ తినకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్వినోవాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్వినోవాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. క్వినోవాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బీ6, జింక్, ఫోలెట్, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటివి మెండుగా ఉంటాయి. రోజువారి ప్రోటీన్ అందించడంలో క్వినోవా కీలక పాత్ర పోషిస్తుంది. క్వినోవాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోషకాలన్నీ నరాల ఆరోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఇండియన్ బ్యాంక్ 2 స్పెషల్ స్కీమ్స్.. ఈనెల 30 వరకే ఛాన్స్.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అలాగే ప్రత్యేక టెన్యూర్‌తో రూపొందించిన స్పెషల్ ఎఫ్‌డీ పథకాల ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా తక్కువ టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే, ప్రత్యేకంగా రూపొందించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వల్ప కాలిక టెన్యూర్ ఉన్నప్పటికీ మంచి వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. మీరు కూడా మీ స్వల్ప కాలిక లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకుంటే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంకును పరిశీలించవచ్చు. ఈ బ్యాంకులో ఏడాది, ఆలోపు టెన్యూర్ గల రెండు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. అవే ఇండ్ సూపర్ 300 డేస్ ఎఫ్‌డీ స్కీమ్, ఇండ్ సూపర్ 400 డేస్ స్కీమ్.

అయితే, ఈ రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గడువు దగ్గరపడుతోంది. ఈ నెలాఖరు అంటే నవంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఈ స్పెషల్ స్క్సీమ్ గడువును పలుమార్లు పెంచింది బ్యాంక్. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు సెప్టెంబర్ 30తో గడువు ముగియగా.. దానిని నవంబర్ 30, 2024కు పెంచింది. మరి రెండు స్కీమ్స్‌లో రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది? ఇందులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం.

ఇండ్ సూపర్ 300 డేస్ స్కీమ్..
ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం ఇండ్ సూపర్ 300 డేస్ స్కీమ్ ద్వారా ఒక సాధారణ కస్టమర్‌కి 7.05 శాతం వడ్డీ ఇస్తోంది. అతను రూ.5 లక్షలు జమ చేసే మెచ్యూరిటీ నాటికి రూ.5,29,700 వరకు అందుతాయి. అదే ఒక సీనియర్ సిటిజన్ అయితే 7.55 శాతం మేర వడ్డీ లభిస్తోంది. 60 ఏళ్లు దాటిన వ్యక్తులు రూ.5 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే వారికి 300 రోజుల తర్వాత అసలు, వడ్డీ కలిపి రు.5,31,800 వరకు లభిస్తాయి. ఇక 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లకు అయితే 7.80 శాతం వడ్డీ ఇస్తోంది. వారికి రూ.5 లక్షలపై రూ.32,850 మేర వడ్డీ వస్తుంది.

ఇండ్ సూపర్ 400 డేస్ స్కీమ్..
ఈ స్కీమ్ ద్వారా ఒక సాధారణ పౌరుడికి 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. ఇందులో అతను రూ.5 లక్షలు జమ చేస్తే 400 రోజుల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ. 5,39,700 వరకు లభిస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్‌కు 7.80 శాతం వడ్డీ ఇస్తోంది. వారికి రూ.5 లక్షలపై వడ్డీ రూ.42,700 వరకు వస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ 8 శాతం మేర ఇస్తోంది. వారు రూ.5 లక్షలను జమ చేసినట్లయితే 400 రోజుల తర్వాత చేతికి రూ.5,43,800 మేర లభిస్తాయి.

నవంబర్ మొత్తం సినిమాల జాతరే.. ఏ సినిమా ఏ రోజు రిలీజంటే?

దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఏకంగా నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీటిలో అన్ని సినిమాలకీ పాజిటివ్ టాక్ రావడం విశేషం. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ అమరన్, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మూడింటికీ మంచి రివ్యూలు వచ్చాయి. ఇక వీటి సందడి కొనసాగుతుండగానే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు మరో డజను సినిమాలు రాబోతున్నాయి. కంగువ, మెకానిక్ రాకీ, మట్కా సహా ఈ నవంబర్‌లో రిలీజ్ అవుతున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్ సీక్వెల్స్
నవంబరు సందడి ఈరోజే మొదలైపోయింది. ఈ నెల ఫస్ట్ ఫ్రైడే అయిన నవంబర్ 1న రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండూ సీక్వెల్స్ కావడం విశేషం. హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ అయిన భూల్‌ భులయ్యా 3 ఈరోజు రిలీజ్ అయింది. కార్తిక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. అలానే మరో హిట్ ఫ్రాంచైజీ అయిన సింగం నుంచి సింగం అగైన్ చిత్రం కూడా ఈరోజు సందడి చేస్తుంది. ఇందులో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోకాగా అక్షయ్‌కుమార్‌, అర్జున్‌ కపూర్‌, జాకీష్రాఫ్‌, దీపిక పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.

ఆ తర్వాత రెండో శుక్రవారం (నవంబర్ 8)న చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. హీరో నిఖిల్‌-రుక్మిణి వసంత్ జంటగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. అలానే సతీష్ బాబు రాటకొండ ‘జాతర’ సినిమా కూడా ఇదే రోజు రాబోతుంది. మరోవైపు రాకేశ్‌ వర్రే హీరోగా దర్శకుడు విరించి వర్మ రూపొందించిన ‘జితేందర్‌ రెడ్డి’ కూడా నవంబర్ 8న రిలీజ్ కానుంది.

వీటితో పాటు చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా రూపొందిన ‘ధూం ధాం’, స్వీయ దర్శకత్వంలో విప్లవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఈసారైనా’ చిత్రాలు కూడా నవంబర్ 8నే రానున్నాయి. అలానే సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్‌’ కూడా రెండో శుక్రవారమే సందడి చేయనుంది.

సూర్యతో వరుణ్ తేజ్ పోటీ
ఇక హీరో సూర్య భారీ బడ్జెట్ చిత్రం కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ నటించిన ‘మట్కా’ కూడా ఇదే రోజు రాబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ లుక్ కొత్తగా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు అశోక్‌ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్‌ కానుంది.

ఆ తర్వాతి రోజు అంటే నవంబర్ 15న నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘లెవన్‌’ రాబోతుంది. హిందీ మూవీ ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ కూడా ఈ నెల 15న రానుంది. ఇక నెలాఖరుతో మరోసారి యంగ్ హీరోలు ఢీ కొట్టబోతున్నారు. విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్‌ రాకీ’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో పాటు సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ ఈ నెల 22న రానుంది. అలానే ‘రోటి కపడా రొమాన్స్‌’ అనే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కూడా అదే రోజు రానుంది.

అద్భుతం చేసిన HDFC స్కీమ్.. 10 వేల పొదుపుతో.. 5 ఏళ్లకే చేతికి రూ.13 లక్షలు!

ఈక్విటీ పెట్టుబడుల్లో హైరిటర్న్స్ వస్తాయని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే, తాము ఎంచుకునే పెట్టుబడి మార్గం, స్కీమ్‌పై అది ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా బలమైన ఫోర్ట్ ఫోలియో ఉంటేనే హైరిటర్న్స్ అందుకోవచ్చు. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫండ్స్‌లో పెట్టుబడులు అంటే తాము ఎంచుకునే స్కీమ్ గత చరిత్రను పరిశీలించాలని నిపుణులు చెబుతుంటారు. దాని ఆధారంగా భవిష్యత్తులో రిటర్న్స్ అంచనా వేయొచ్చని సూచిస్తుంటారు. కొన్ని స్కీమ్స్ గత కొన్నేళ్లలో హైరిటర్న్స్ అందించాయి. అందులో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఒకటి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ చాలా రకాల ఈక్విటీ ఫండ్ స్కీమ్స్ అందిస్తోంది. గత 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ ఫండ్లలో ఓ స్కీమ్ హైరిటర్న్స్ అందించింది. అదే హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ (HDFC Mid-cap Opportunities Fund). ఈ స్కీమ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి హైరిటర్న్స్ అందాయి. సగటు వార్షిక రాబడితో పోలిస్తే రెండింతలకు పైగా లాభాలు అందించింది.

రూ.10 వేల పొదుపుతో రూ.13 లక్షలు
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ గత ఐదేళ్లలో తమ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది ఈ స్కీమ్ వార్షిక సగటు రాబడి (XIRR) 32.94 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిపై ప్రతి ఏడాది 32.94 శాతం లాభాలు వచ్చాయి. 5 ఏళ్ల క్రితం నెలకు రూ.10 వేల చొప్పున ఈ హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్‌లో క్రమానుగత పెట్టుబడని ప్రారంభించిన వారికి ఇప్పుడు వారి యూనిట్ల విలువ రూ.13,42,340 గా ఉంటుంది.

ఇక మిడ్ క్యాప్ ఫండ్లలో గత ఐదేళ్లలో 30 శాతానికిపైగా వార్షిక రిటర్న్స్ అందించిన వాటిలో పలు దిగ్గజ కంపెనీల స్కీమ్స్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఏకంగా 39.83 శాతం రాబడితో రూ.10 వేల సిప్ పెట్టుబడని రూ. 15.74 లక్షలకపైగా చేసింది. ఆ తర్వాత నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 33.35 శాతం రిటర్న్స్‌తో రూ. 10 వేల సిప్‌ను రూ. 13.55 లక్షలు చేసింది. ఇక ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30.26 శాతం వార్షిక రాబడి అందించింది. ఆ తర్వాత కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ 30.09 శాతం మేర లాభాలు అందించింది.

షుగర్ ఉన్నవారు జీడిపప్పు తినే ముందు ఇలా చేయాల్సిందే

జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది. అదే విధంగా, ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, అందులో రక్తంలో చక్కెర స్థాయిలను ఎఫెక్ట్ చేసే కార్బోహైడ్రేట్స్, కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి, షుగర్ ఉన్నవారు జీడిపప్పు తినొచ్చా లేదా అనేది చాలా మందిని కన్ఫ్యూజన్ పెట్టే విషయం. జీడిపప్పులో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, షుగర్ ఉన్నవారు ఈ జీడిపప్పు తినొచ్చా.. లేదా అనే విషయాలను తెలుసుకోండి.

షుగర్ ఉన్నవారికి..
షుగర్ ఉన్నవారు జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. అమి మీ రక్త నాళాలకి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. గుండెజబ్బు అనేది షుగర్ ఉన్నవారికి వచ్చే సాధారణ సమస్య. కాబట్టి, జీడిపప్పులు తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

షుగర్ ఉన్నవారు జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. అమి మీ రక్త నాళాలకి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. గుండెజబ్బు అనేది షుగర్ ఉన్నవారికి వచ్చే సాధారణ సమస్య. కాబట్టి, జీడిపప్పులు తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

షుగర్ పేషెంట్స్‌కి బెస్ట్ నట్స్..
జీడిపప్పులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, స్పైక్స్‌ని నిరోధిస్తాయి. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇందులోని ఫైబర్ కారణంగా కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ, శోషణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో రక్తంలో ఒకేసారిగా స్పైక్స్ పెరగవు. ఫైబర్ ఎక్కువసేపు కడుపుని నిండుగా ఉంచడంలో హెల్ప్ ఆకలి, క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది. దీంతో బరువు పెరగడం వంటి సమస్యలు కూడా ఉండవు.

కార్బోహైడ్రేట్స్ ఎక్కువ..
అయితే, జీడిపప్పులో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మిగతా నట్స్ కంటే చాలా ఎక్కువ. మీరు జీడిపప్పులు తింటే రోజువారీ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ అవసరాలను తీర్చినట్టే. అయితే, వీటిని తక్కువగా తినాలి. అదే విధంగా, వీటిని ప్లెయిన్‌గానే తీసుకోవాలి. అంతేకానీ, ఉప్పు, చక్కెర వేసి ఫ్రై చేసినవి తీసుకోకూడదు. దీని వల్ల హైబీపి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, మీరు నేచురల్‌గా తినాలి.

ఎలా తినొచ్చు..
వీటిని మీరు నేరుగానే తినాలి. తక్కువ మోతాదులో తినాలి. సలాడ్స్, స్టిర్ ఫ్రైస్, సూప్స్, ఓట్స్, పెరుగు, స్మూతీలలో తీసుకోవచ్చు. వీటిని తీసుకున్నప్పుడు మీ రోజువారీ డైట్‌లో కేలరీలు, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించండి. వీటిని మీరు ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం మూలికలు, సుగంధద్రవ్యాలు, నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు.

తినేముందు..
వీటిని తినేముందు మీ షుగర్ లెవల్స్ చెక్ చేయండి. జీడిపప్పు రక్తంలో చక్కెర స్థాయిలని ఎలా పెంచుతుందో తెలుసుకోండి. తిన్న తర్వాత షుగర్ లెవల్స్ చెక్ చేయండి. తేడా గమనిస్తే షుగర్ లెవల్స్ పెరిగితే వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. PF సెటిల్మెంట్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అలా జరిగితే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. పెన్షన్స్, పెన్షనర్ల సంక్షేమ విభాగం (DoPPW) తాజాగా ఓ మెమోరండం జారీ చేసింది. పదవీ విరమణ పొందనున్న ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) చెల్లింపులపై క్లారిటీ ఇచ్చింది. జీపీఎఫ్ సెటిల్మెంట్ రిటైర్మెంట్ అయిన వెంటనే కుదరక జాప్యం జరిగినట్లయితే వడ్డీ చెల్లిస్తారా? లేదా? అనే అంశంపై ప్రశ్నలు ఎదురవుతున్న క్రమంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగ విమరణ చేయబోతున్న వారందరూ ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

‘రిటైర్మెంట్ తర్వాత జీపీఎఫ్ చెల్లింపులు జాప్యం జరిగినట్లయితే వడ్డీ చెల్లించాలా? వద్దా? అనే విషయంపై క్లారిటీ కోసం ఇటీవల మాకు కొన్ని సూచనలు వచ్చాయి. ‘ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ తన మెమోరండంలో పేర్కొంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అందించిన గత వివరణలను మెమోరండంలో పేర్కొంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ తుది మొత్తాన్ని సకాలంలో చెల్లించడం చాలా కీలకమని నొక్కి చెప్పింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జనవరి, 2017లో జారీ చేసిన మెమోరండంలో వివరించడం జరిగిందని స్పష్టం చేసింది.

జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 1960లోని రూల్ 34 ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగులకు సరైన సమయానికి జీపీఎఫ్ సెటిల్మెంట్ పూర్తి చేయడం అనేది అకౌంట్స్ ఆఫీర్ బాధ్యత. ఈ చెల్లింపులను సమర్థవంతంగా ప్రాసెస్ చేయాల్సిన అధికారుల బాధ్యతను ఇది నొక్కి చెబుతోంది. జీపీఎఫ్ అకౌంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తిగత ప్రాపర్టీగా తాజాగా విడుదల చేసిన మెమోరండంలో పేర్కొంది కేంద్రం. ఈ నేపథ్యంలో పెనాల్టీలు, ఇతర సమస్యలు సకాలంలో జీపీఎఫ్ చెల్లింపులపై ప్రభావం చూపకూడదని తెలిపింది. రూల్ 11(4) ప్రకారం రిటైర్మెంట్ సమయంలో జీపీఎఫ్ బ్యాలెన్స్ చెల్లించనట్లియతే.. రిటైర్మెంట్ తేదీ తర్వాత నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెబుతోంది.

ఉద్యోగులు, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇందులో పొదుపు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత మాత్రమే కాదు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైన అత్యవసరం ఏర్పడిన సందర్భంలోనూ ఈ జీపీఎఫ్ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

ఏపీలో మహిళలకు మరో శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి శ్రీకారం చుట్టగా.. మిగిలిన పథకాలపైనా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని ఆగస్టు 15కి ప్రారంభిస్తారని భావించారు.. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు మంత్రి. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో మహిళలు ఆనందంలో ఉన్నారన్నారు.

తల్లికి చెల్లికి న్యాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు బీసీ జనార్థన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చింది. ఈ పథకం అమలుపై ఫోకస్ పెట్టి.. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి క్లారిటీ లేదు.. దసరా, దీపావళి అని చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు సంక్రాంతికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో ఆర్టీసీ అధికారులు పర్యటించారు.. అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ మేరకు నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అయితే ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తోంది.. అన్ని డిపోల్లో అవసరం మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట.

సేఫ్టీతో పాటు మైలేజ్​ కూడా! ఈ టాటా పెట్రోల్​, సీఎన్జీ, ఈవీ లిస్ట్​ చెక్​ చేయండి

టాటా కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నరా? అయితే ధరతో పటు మైలేజ్​, రేంజ్​ని కూడా చూడటం చాలా ముఖ్యం. అందుకే, టాటా మోటార్స్​కి చెందిన మోడళ్లు- వాటి మైలేజ్​/ రేంజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..​

ఇండియాలో లీడింగ్​ ఆటోమొబైల్​ కంపెనీల్లో టాటా మోటార్స్​ ఒకటి. ఈ కంపెనీకి చెందిన అనేక హ్యాచ్​బ్యాక్​, ఎస్​యూవీ మోడల్స్​ రోడ్డు మీద తిరుగుతున్నాయి. టాటా మోటార్స్​ పేరు వినిగానే ముందుగా ‘సేఫ్టీ’ గుర్తొస్తుంది. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది టాటా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇతర సంస్థలతో పోల్చుకుంటే టాటా మోటార్స్​ వాహనాల్లో సేఫ్టీతో పాటు మైలేజ్​ కూడా మెరుగ్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మార్కెట్​లో ఉన్న వివిధ టాటా మోటార్స్​ వాహనాలు, వాటి పెట్రోల్​/డీజిల్​- సీఎన్జీ- ఈవీకి సంబంధించిన మైలేజ్​/ రేంజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది..

టాటా పెట్రోల్​, డీజిల్​ కార్లు (కేఎంపీఎల్​):-

టాటా నెక్సాన్​:- పెట్రోల్​ మేన్యువల్​- 17.44, పెట్రోల్​ ఆటోమెటిక్​- 17.18 కేఎంపీఎల్​; డీజిల్​ మేన్యువల్​- 23.23, డీజిల్​ ఆటోమెటిక్​- 24.08;

టాటా పంచ్​:- పెట్రోల్​ మేన్యువల్​- 20.09, ఆటోమెటిక్​- 18.8

టాటా ఆల్ట్రోజ్​:- డీజిల్​ మేన్యువల్​- 23.64; పెట్రోల్​ మేన్యువల్​- 19.33, పెట్రోల్​ ఆటోమెటిక్​- 19.33

టాటా టియాగో:- పెట్రోల్​ మేన్యువల్​- 20.09, పెట్రోల్​ ఆటోమెటిక్​- 19

టాటా టిగోర్​:- పెట్రోల్​ ఆటోమెటిక్​- 19.6, పెట్రోల్​ మేన్యువల్​ 19.28

టాటా హారియర్​:- డీజిల్​ మేన్యువల్​- 16.8, డీజిల్​ ఆటోమెటిక్​- 16.8

టాటా సఫారీ:- డీజిల్​ మేన్యువల్​- 16.3, డీజిల్​ ఆటోమెటిక్​- 16.3
టాటా సీఎన్జీ కార్లు (కేఎం/కేజీ):-

టాటా నెక్సాన్​ సీఎన్జీ:- మేన్యువల్​- 17.44

టాటా పంచ్​ సీఎన్జీ:- మేన్యువల్​- 26.99

టాటా ఆల్ట్రోజ్​ సీఎన్జీ:- మేన్యువల్​- 26.2

టాటా టియాగో సీఎన్జీ:- మేన్యువల్​ 26.49, ఆటోమెటిక్​ 28.06

టాటా టిగోర్​ సీఎన్జీ:- మేన్యువల్​ 26.49, ఆటోమెటిక్​ 28.06
టాటా ఎలక్ట్రిక్​ కార్లు (కి.మీలు):-

టాటా నెక్సాన్​ ఈవీ:- 325- 489

టాటా పంచ్​ ఈవీ:- 315- 421

టట టియాగో ఈవీ:- 250- 315

టాటా కర్వ్​ ఈవీ:- 502- 585

దేశంలో అటు ఐసీఈ/ సీఎన్జీ, ఇటు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో మంచి పోర్ట్​ఫోలియో ఉన్న సంస్థల్లో టాటా మోటార్స్​ అగ్రస్థానంలో ఉంటుంది. కాగా ఇటీవలే లాంచ్​ అవ్వడంతో టాటా కర్వ్​ కూపే ఎస్​యూవీ మైలేజ్​ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

అయితే, ఇవి ఏఆర్​ఏఐ సర్టిఫైడ్​ మైలేజ్​, రేంజ్​ డేటా అని గుర్తుపెట్టుకోవాలి. పలు వాహనాలకు వేరియంట్లు బట్టి మైలేజ్​ కాస్త అటు, ఇటుగా మారొచ్చు. కానీ వాహనం కొనుగోలు చేసే ముందు వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం మీరు మీ స్థానిక డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శించడం ఉత్తమం.

త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్ 3, ఎవరిని వదిలేది లేదన్న లోకేష్‌.. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు మంత్రి నారా లోకేష్‌ అమెరికాలో ప్రకటించారు. అట్లాంటాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్‌ ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసులకు మంత్రి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. …వారికి అండగా నిలచే బాధ్యత తనదన్నారు. అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైనందని ఎన్ఆర్ఐలు కూడా సైకో బాధితులేనని గుర్తు చేశారు.

ప్రపంచమంతా ఆంధ్రా వైపు చూస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడని, ఐటీ మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు చర్చించి టిసిఎస్ తేగలిగానంటే దానికి కారణం సిబిఎన్ అన్నారు. ఒక్క మెయిల్ తో సత్యనాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. జోహార్ అన్న ఎన్ టి ఆర్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వారంరోజుల అమెరికా పర్యటనలో నేను ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా సిబిఎన్ పేరు చెప్పగానే రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్పారన్నారు..

వారికి సినిమా చూపించే బాధ్యత నాది

రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని మూడో చాప్టర్ గురించి ఎమ్మెల్యేలు రాము, వెంకట్రావుని అడగాలని లోకేష్‌ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2నిమిషాల పని అని చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? అన్నారు.

ప్రజలు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలు చేస్తామన్నారు. నేను తగ్గేదే లేదని, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్‌దన్నారు. మేం కూడా మనుషులమేనని విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని అంతమాత్రాన అలిగి పడుకోవద్దని మా దృష్టికి తెస్తే సరి చేసుకుంటామన్నారు.
ఎన్నారైలు వేధింపులకు గురయ్యారు…

కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని వైసీపీ వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని, అడుగడుగునా అవమానించారని అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారని లోకేష్‌ గుర్తు చేశారు. . నేనుకూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నే. నేను యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు.

వారికి సినిమా చూపించే బాధ్యత నాది

రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని మూడో చాప్టర్ గురించి ఎమ్మెల్యేలు రాము, వెంకట్రావుని అడగాలని లోకేష్‌ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2నిమిషాల పని అని చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? అన్నారు.

ప్రజలు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలు చేస్తామన్నారు. నేను తగ్గేదే లేదని, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్‌దన్నారు. మేం కూడా మనుషులమేనని విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని అంతమాత్రాన అలిగి పడుకోవద్దని మా దృష్టికి తెస్తే సరి చేసుకుంటామన్నారు.
ఎన్నారైలు వేధింపులకు గురయ్యారు…

కార్తీకమాసంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. భక్తుల కోసం 4 ప్రత్యేక ప్యాకేజీలు

కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా శైవ క్షేత్రాలకు వెళ్తుంటారు. దీంతో ఆయా రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఆర్టీసీ కార్తీకమాసం సందర్భంగా భక్తుల కోసం 5 స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కార్తీక మాసంలో భ‌క్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నెల్లూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు నుండి ప్రత్యేక బస్సులు న‌డిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది. నెల్లూరు నుంచి ప్ర‌సిద్ధ శైవ‌క్షేత్రాలైన పంచారామాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. క‌ర్నూలు నుంచి పంచ శైవ‌క్షేత్ర ద‌ర్శిని యాత్ర‌, క‌డ‌ప నుంచి శైవ క్షేత్రాల ద‌ర్శిన యాత్ర‌, పౌర్ణ‌మి సంద‌ర్భంగా అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు ఏర్పాటు చేశారు.

1.శ్రీశైలం యాత్ర‌ ప్యాకేజీ..

కార్తీక మాసం సంద‌ర్భంగా కావ‌లి నుంచి శ్రీశైలం ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక సర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ బ‌స్ న‌వంబ‌ర్ 3వ తేదీన ఆదివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు కావ‌లిలో బ‌య‌లుదేరి సాయంత్రం శ్రీశైలం చేరుతుంది. సోమ‌వారం తెల్ల‌వారుజామున శ్రీ‌భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లిఖార్జున స్వామి ద‌ర్శన అనంత‌రం 4వ తేదీన శ్రీశైలంలో బ‌య‌లుదేరి కావ‌లికి చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర ఒక్కొక్క‌రికి రూ.425గా నిర్ణ‌యించారు. ర‌ద్దీ దృష్ట్యా భ‌క్తులు త‌మ సీట్ల‌ను ముందుగానే రిజ‌ర్వేష‌న్ చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
2.నెల్లూరు నుంచి..

కార్తీకమాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు నెల్లూరు మెయిన్ బ‌స్టాండ్ నుండి బస్సులు బయలుదేరతాయి. శైవ క్షేత్రాలైన పంచారామాలు అమ‌రావ‌తి (అమ‌రేశ్వ‌రుడు), భీమ‌వ‌రం (సోమేశ్వ‌రుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వ‌రుడు), ద్రాక్షారామం (భీమేశ్వ‌రుడు), సామ‌ర్ల‌కోట (కొమ‌ర లింగేశ్వ‌రుడు) పుణ్య‌క్షేత్రాల‌ను కార్తిక సోమ‌వారం నాడు ద‌ర్శనం చేసుకోవచ్చు. ఈ ప్ర‌త్యేక స‌ర్వీసులు ప్ర‌తి ఆదివారం అంటే.. న‌వంబ‌ర్ 3, 10,17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్టు ధ‌ర ఒక్కొక్క‌రికి సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుకు రూ.2,500గా నిర్ణ‌యించారు. రిజ‌ర్వేష‌న్ టికెట్ల‌ను నెల్లూరు బ‌స్టాండ్‌, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వ‌ద్ద ముందుగానే రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌చ్చు.

3.క‌ర్నూలు నుంచి..

కార్తీక మాసంలో భ‌క్తుల సౌక‌ర్యార్ధం ఆర్టీసీ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు.. క‌ర్నూలు డిపో మేనేజ‌ర్ స‌ర్దార్ హుసేన్ తెలిపారు. పంచ శైవ‌క్షేత్ర‌ద‌ర్శిని పేరుతో యాగంటి, మ‌హానంది, ఓంకారం, భోగేశ్వ‌రం, కాల్వ‌బుగ్గ క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేలా.. బ‌స్సు స‌ర్వీసును ఏర్పాటు చేశారు. ఈ యాత్ర ప్యాకేజీ పెద్ద‌ల‌కు రూ.650, పిల్లల‌కు రూ.400 టిక్కెట్టు ధ‌ర నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు బ‌స్సు క‌ర్నూలు నుంచి బయలుదేరుకుంది. ఆయా ఆల‌యాల‌ను సంద‌ర్శన అనంత‌రం తిరిగి రాత్రి క‌ర్నూలుకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ టూర్ స‌ర్వీసుల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ సౌకర్యం ఉంది.
4.క‌డ‌ప నుంచి..

కార్తీక మాసం సంద‌ర్బంగా క‌డ‌ప నుంచి శైవ క్షేత్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేశారు. న‌వంబ‌ర్ 4,11,18, 25 తేదీలు (సోమ‌వారాలు)ల్లో ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చారు. పౌర్ణ‌మి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 15న అరుణాచ‌లానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. లంక‌మ‌ల‌, భైర‌వ‌కోట‌, నారాయ‌ణ‌స్వామి మ‌ఠం, సిద్ధేశ్వ‌ర‌మ‌ఠం, బి.మ‌ఠం పెంచ‌ల‌కోన‌, శ్రీ‌కాళ‌హ‌స్తి, మ‌హానంది, ఓంకారం, శ్రీశైలం, నాయినాప్ప‌లకోన‌నం, అగ‌స్తీశ్వ‌ర‌కోన‌, పొల‌త‌ల‌, నిత్య‌పూజ కోన‌, అల్లాడుప‌ల్లె దేవ‌ళాలు, పుష్ప‌గిరి, కాణిపాకం, క‌న్య‌తీర్థం, భానుకోట త‌దిత‌ర శైవ‌క్షేత్రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డుపుతున్న‌ట్లు ఏపీఎస్ఆర్టీసీ రీజ‌న‌ల్ అధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. న‌వంబ‌ర్ 3న బెంగ‌ళూరుకు 20 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుతున్న‌ట్లు తెలిపారు.

రూ. 82వేలకు చేరువలో బంగారం ధర, వెండి రేటు ఎంతంటే

దేశంలో పసిడి, వెండి ధరలు ఆల్​టైమ్​ హైని తాకుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం బంగారం ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 81,340కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 81,330గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,13,400గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 74,560కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,45,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,456గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,710గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,490గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,560 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 81,340గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 74,560గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 81,340గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 74,560గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 81,340గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 74,560గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 81,340గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 74,610గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 81,280గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 74,560గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 81,340గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,990గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 99,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 1,00,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,08,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 99,000.. బెంగళూరులో రూ. 99,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 1050 తగ్గి రూ. 27,220 చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 28,270గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,220గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ‘ఈవీఎక్స్​’

మారుతీ సుజుకీ నుంచి ఇండియాలో ఇంకా ఒక్క ఈవీ కూడా లాంచ్​ అవ్వలేదు. ఇక ఇప్పుడు, మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ వాహనం లాంచ్​ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే..

కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారును కొంత కాలం క్రితం ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. 2025 మార్చ్​- ఏప్రిల్​ నాటికి ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ ప్రొడక్షన్​ ఫేజ్​లోకి అడుగుపెడుతుందని సమాచారం. ఈ ఈవీని మొదట 2023 ఆటో ఎక్స్​పోలో, తరువాత 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. 2024 చివరి నాటికి ఈవీ ఉత్పత్తిని ప్రారంభించాలని ఇంతకు ముందు ప్రణాళిక ఉన్నప్పటికీ, వాహనంలో ఉపయోగించాల్సిన సెల్​తో కొన్ని సమస్యల కారణంగా, ఉత్పత్తి కాలవ్యవధిని మార్చినట్లు తెలిస్తోంది.

ఈవీ బ్యాటరీ సప్లై విషయంలో మారుతీ సుజుకీ, టయోట మోటార్​ కార్పొరేషన్​ మధ్య కొలాబొరేషన్​ జరిగింది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనే హైబ్రిడ్ వాహనాలపై ఇప్పటికే ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి.

మారుతీ సుజుకీ నుంచి మొదటి ఈవీ ఇంకా మాస్​ ప్రొడక్షన్​లోకి ప్రవేశించనప్పటికీ, ఎలక్ట్రిక్​ వాహనానికి సంబంధించిన అనేక స్పై షాట్లు రాబోయే ఈవీ వివరాలను వెల్లడించింది. వాటి వివరాలు..
మారుతీ సుజుకీ ఈవీఎక్స్: స్పెసిఫికేషన్లు (అంచనా)

మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఈవీ పొడవు 4,300 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,600 ఎంఎంగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్​ వాహనం 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందించగలదు. అయితే బ్యాటరీ ప్యాక్, రియల్ వరల్డ్ రేంజ్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే.

అంతేకాకుండా, మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్​తో కూడా అందుబాటులో ఉంటుందని ఇప్పుడు ధృవీకరించారు. అంటే అయితే, ప్రస్తుతానికి, ఎలక్ట్రిక్ మోటార్ల పవర్, టార్క్ అవుట్​పుట్ వివరాలు తెలియదు.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్: ఫీచర్లు (అంచనా)

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​లో ఎల్​ఈడీ హెడ్​లైట్, డీఆర్​ఎల్ యూనిట్లు, ఎల్​ఈడీ లైట్ బార్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రేర్ స్పాయిలర్​తో పాటు షార్క్​ఫిన్ యాంటెనా కూడా ఉండనున్నాయి. అయితే, ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్ మాదిరిగా కాకుండా, ప్రొడక్షన్ మోడల్​లో కాన్సెప్ట్ మోడల్​లో ఉన్న స్టీరింగ్​కు బదులుగా సాధారణ ఓఆర్​వీఎమ్​లు, అల్లాయ్ వీల్స్, సరైన స్టీరింగ్ వీల్​ను పొందొచ్చు.

టోక్యో ఆటో షోలో ప్రదర్శన సందర్భంగా సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వాహనం క్యాబిన్ గురించి అనేక వివరాలను వెల్లడించింది. వైర్​లెస్​ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు అనుకూలమైన పెద్ద టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్​లెస్ ఛార్జర్, ఫ్రెంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ అడ్జెస్ట్​మెంట్​, ఆటో-డిమ్మింగ్ ఐఆర్విఎమ్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారులో రానున్నాయి.

మోటోరోలా నుంచి మరో రెండు బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​

మోటోరోలా నుంచి మరో రెండు బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​కు రెడీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన పలు వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
లాంచ్​కి రెడీ అవుతున్న మోటో జీ15, మోటీ జీ05

మోటోరోలా తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ మోటో జీ15, మోటో జీ05లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ ఫోన్లు, వాటి లాంచ్ తేదీలు, ధరలకు సంబంధించిన కీలక వివరాలను తాజా నివేదికలు హైలైట్ చేశాయి. మోటో జీ15 కూడా ఇటీవల గీక్​బెంచ్​లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్యాడ్జెట్స్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటో జీ15, మోటో జీ05: లాంచ్, ధర (అంచనా)

91మొబైల్స్ నివేదిక ప్రకారం.. ఈ రెండు మోటోరోలా మోడళ్లు ఈ నవంబర్​లో యూరప్​లో లాంచ్ కావచ్చు. మోటో జీ05 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 140 యూరోలు (సుమారు రూ.12,400), 4 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 170 యూరోలు (సుమారు రూ.15,500) ఉండవచ్చు. మోటో జీ15 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 200 యూరోలుగా(సుమారు రూ.18,200) నిర్ణయించారని తెలుస్తోంది.

ఈ మోటో జీ15, మోటో జీ05 స్మార్ట్​ఫోన్స్​.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న మోటీ జీ14, మోటో జీ04కి సక్సెసర్​గా వస్తున్నాయి.

మోటో జీ15 పనితీరు మెట్రిక్స్ ఇటీవల గీక్​బెంచ్ లిస్టింగ్​లో కనిపించాయి. సింగిల్-కోర్ కు 340, మల్టీ-కోర్ పరీక్షలకు 1311 స్కోర్లు ఉన్నాయి. 2.0 గిగాహెర్ట్జ్ వద్ద పనిచేసే రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, 1.7 గిగాహెర్ట్జ్ వద్ద 6 ఎఫిషియెన్సీ కోర్స్​తో పాటు మాలి-జీ52 ఎంసీ2 జీపీయూతో ఆక్టాకోర్ ప్రాసెసర్​ని ఇందులో అందించనున్నారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. పరీక్షించిన పరికరంలో 4 జీబీ ర్యామ్ ఉంది. రిటైల్ వెర్షన్ 8 జీబీని అందిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది మెరుగైన పనితీరును సూచిస్తుంది.

గతంలో మోటో జీ14, దాని 8 జీబీ ర్యామ్ వేరియంట్​తో, సింగిల్- మల్టీ-కోర్ పరీక్షలలో వరుసగా 447, 1577 స్కోర్లను నమోదు చేసింది. జీ14లో యూనిసోక్ టీ616 చిప్​ను ఉపయోగించారు. ఇందులో 2.0 గిగాహెర్ట్జ్ వద్ద రెండు కార్టెక్స్-ఎ75 పనితీరు కోర్స్​ 1.8 గిగాహెర్ట్జ్ వద్ద 6 కార్టెక్స్-ఎ55 కోర్లు ఉన్నాయి. గీక్​బెంచ్ 6 ఉపయోగించిన జీ14 మాదిరిగా కాకుండా, గీక్​బెంచ్​ 5ను ఉపయోగించి జీ15తక్కువ స్కోర్లను అంచనా వేయడం వల్ల సంభవించవచ్చు. ఈ బెంచ్​మార్క్​ పనితీరును భిన్నంగా అంచనా వేస్తాయి కాబట్టి, రెండింటి మధ్య ప్రత్యక్ష పోలికలు ఖచ్చితత్వం కలిగి ఉండకపోవచ్చు.

మోటో జీ05, మోటో జీ15: ఫీచర్లు (అంచనా)

మోటరోలా రాబోయే బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ కంపెనీ డిజైన్ విలువలను ప్రతిబింబిస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ హార్డ్​వేర్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉంటాయి. మోటో జీ14 ఒక బెంచ్​మార్క్​గా పనిచేస్తే, జీ05- జీ15 క్రమబద్ధీకరించిన ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్, ఫంక్షనల్ కెమెరా వ్యవస్థలు, దీర్ఘకాలిక బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉండవచ్చు. ఇది తక్కువ-మిడ్రేంజ్ మార్కెట్ విభాగంలో విలువను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

షాక్​ ఇచ్చిన బ్యాంక్​లు- ఇక క్రెడిట్​ కార్డులపై మరింత భారం తప్పదా

ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​లు.. తమ క్రెడిట్​ కార్డ్​ కొత్త రూల్స్​ని​ అమల్లోకి తీసుకొచ్చాయి. రివార్డ్​ పాయింట్స్​, ట్రాన్సాక్షన్స్​కి సంబంధించి కీలక మార్పులు వచ్చాయి. ఇవి కస్టమర్​పై మరింత భారం వేసేలా ఉన్నాయి!

నవంబర్​ 1 నుంచి నూతన క్రెడిట్​ కార్డు రూల్స్​ అమల్లోకి వచ్చాయ. పలు బ్యాంకుల రివార్డ్​ పాయింట్స్​, బిల్​ పేమెంట్స్​, వడ్డీ రేట్లల్లో కీలక మార్పులు కనిపిస్తాయి. వీటి గురించి వినియోగదారులకు కచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఎస్​బీఐ కార్డ్స్​లో కొత్త క్రెడిట్​ కార్డ్​ రూల్స్​..

పాయింట్స్​ వాలిడిటీ:- ఎస్​బీఐ కార్డ్​లో రివార్డ్​ పాయింట్స్​ వాలిడిటీ మారింది. ఇక నుంచి ఇవి లిమిటెడ్​ పీరియడ్​ మాత్రమే వాలిడ్​గా ఉంటాయి. సమయానికి ముందే వీటిని ఉపయోగించుకోవాలి.

ఈఎంఐ ట్రాన్సాక్షన్​ ఛార్జీలు:- క్రెడిట్​ కార్డ్​ ద్వారా ఈఎంఐతో కొనుగోళ్లు చేస్తుంటే, ఇక నుంచి అదనపు ఛార్జీలు పడతాయి. అందుకే ఏదైన ప్రాడక్ట్​ కొనుగోలు చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది.

బిల్​ పేమెంట్ ఛార్జీలు:- కొన్ని పేమెంట్​ మోడ్స్​పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఎస్​బీఐ వెల్లడించింది. వీటిని గతంలో చూడలేదు. ఆన్​లైన్​ బిల్​ పేమెంట్స్​, ఆటో డెబిట్​ ట్రాన్సాక్షన్​ వంటిపై ఛార్జీలు పడొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​ రూల్స్​..

ఫ్యూయెల్​ సర్​ఛార్జ్​ వేవర్​:- పలు ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డులపై ఫ్యూయెల్​ సర్​ఛార్జ్​ మాఫీ రూల్స్​ని మార్చడం జరిగింది. కొన్ని కార్డుల్లో దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇంకొన్నిట్లో లిమిట్​ని మార్చడం జరిగింది. వీటిని కచ్చితంగా చెక్​ చేయాలి.

రివార్డ్​ పాయింట్స్​:- క్రెడిట్​ కార్డ్​ ద్వారా లభించిన రివార్డ్​ పాయింట్స్​ రిడీమ్​ చేసుకునే ప్రాసెస్​ని ఐసీఐసీఐ బ్యాంక్​ మార్చింది. గతంతో పోలిస్తే, ఇప్పుడు పలు లిమిటేషన్స్​తో వీటిని రిడీమ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

వడ్డీ రేట్ల మార్పు:- ఈఎంఐల ద్వారా చేసే లావాదేవీలపై వడ్డీ రేట్లను ఐసీఐసీఐ బ్యాంక్​ మార్చింది. కార్డు టైప్​, ట్రాన్సాక్షన్​తో పాటు ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయని గ్రహించాలి.
ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్..!

కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు, వారి క్రెడిట్​ కార్డు స్పెండింగ్​ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ క్రెడిట్​ కార్డులతో కస్టమర్స్​కి మంచి బెనిఫిట్స్​ ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి.. ఈ ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు. దీని ద్వారా వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్​ లేదా డీజిల్​ని ఫ్రీగా పొందొచ్చు.

ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ కావాలా? అయితే ఈ పని చెయ్యండి

ఉద్యోగాలు చేస్తున్న వారికి వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ రావడం తెలిసిన విషయమే. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రావడం వల్ల ఆర్థిక భరోసా ఉంటుంది. కానీ పెన్షన్ అనేది ఉద్యోగాలు చేయని వారికి రావు. అంతేగాక కొన్ని రంగాల్లో పని చేసే కార్మికులకు, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ఎటువంటి పెన్షన్ సౌకర్యాలు ఉండవు. గవర్నమెంట్ నుంచి వచ్చే వృద్ధాప్య ఫించన్లు పెద్దగా సరిపోవు. అందువలన వారు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే .. కచ్చితంగా పరిష్కారం ఉంది. మరి ఉద్యోగం లేకపోయినా పెన్షన్ ఎలా పొందవచ్చు ?దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చిన్న చిన్న రంగాల్లో పని చేసే కార్మికులకు, కూలి పని చేసుకునే వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరే అటల్ పెన్షన్ యోజన. దీనిలో చేరిన వారికి గరిష్ఠంగా నెలకు రూ.5 వేల దాకా పెన్షన్ వస్తుంది. ఇక ఈ అటల్ పెన్షన్ యోజన లో ఎలా చేరాలి? దీనికి అర్హతలేంటి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన పథకంల 18- 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా కూడా చేరొచ్చు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయని వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా సుఖంగా బతికేందుకు ఈ పథకం మీకు ఆదాయాన్ని అందిస్తుంది. దీనిలో మనం నెలకు కట్టుకునే డబ్బు ఆధారంగా, 60 ఏళ్ల తర్వాత రూ. 1,000 – రూ. 5,000 దాకా నెలకు గ్యారెంటెడ్ పెన్షన్ పొందవచ్చు. జీవితాంతం నెలవారీ పెన్షన్​ను పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతడి భార్యకు పెన్షన్ అందుతుంది. ఆమె కూడా మరణిస్తే నామినీకి కార్పస్ ఫండ్ వస్తుంది. పైగా ఈ స్కీమ్ లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు చాలా తక్కువ అమౌంట్ కట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరాక మీరు నెలకు సరిగ్గా డబ్బు కట్టకపోతే జరిమానా పడుతుంది. 24 నెలల పాటు కంట్రిబ్యూషన్‌ చెల్లించకపోతే, మీ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. ఈ స్కీమ్​లో చేరాలంటే పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అక్కడ ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక అటల్ పెన్షల్ యోజన ఫారమ్​ను బ్యాంక్ వెబ్‌ సైట్ల నుంచి ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్​లైన్ ద్వారా కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్​లో చేరవచ్చు. లేదా బ్యాంక్ బ్రాంచ్‌ లోనైనా ఈ ఫారమ్ ని ఫిల్ చేయవచ్చు. మీ ఆధార్ నంబర్, కాంటాక్ట్ వివరాలు, నామినీ వివరాలను అటల్ పెన్షల్ యోజన ఫారమ్‌ లో నింపాలి. మీరు ఈ స్కీమ్ లో ఎంత డబ్బు కట్టాలనుకుంటున్నారో కూడా ఫిల్ చేయాలి.ఆ తర్వాత ఈ స్కీమ్​కు మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అవుతాయి.

తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు మరో ఛాన్స్.. నవోదయ విద్యాలయాల దరఖాస్తు గడువు పెంపు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ..

దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు అక్టోబర్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధుల అభ్యర్ధన మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు నవంబర్‌ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జేఎన్‌వీ లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేవాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 చొప్పున జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా ప్రకటన ప్రకారం నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. యూనివర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు, గతంలో వర్సిటీలో చేరి ఫీజు చెల్లించని విద్యార్థులు కూడా నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని తెలిపారు. వారంతా ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరేందుకు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వర్సిటీ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 7382929570/580, 040-23680222 333/444/555 ద్వారా కూడా సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నం 18005990101లోనూ సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఆ విద్యార్ధులకు 10 మార్కులు వచ్చినా పాసైనట్లే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత మార్కులపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 35 మార్కులు వస్తేనే పాసైనట్లు ప్రకటించే పదో తరగతి పరీక్షల బోర్డు ఇకపై 10 శాతం మార్కులు తెచ్చుకున్నా చాలు.. పాసైనట్లేనని ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు కేవలం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెంటల్‌ రిటార్డేషన్‌ స్థానంలో మేథో వైకల్యంగా పేరు మార్చింది. అంతేకాకుండా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు 35కు బదులుగా 10 మార్కులుగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో పది మార్కులు వస్తే చాలు.. వారిని ఉత్తీర్ణులుగా టెన్త్‌ క్లాస్ బోర్డు పరిగణిస్తుందని పేర్కొంది.

తెలంగాణ ఎల్‌ఎల్‌ఎం చివరి విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ ఎల్‌ఎల్‌ఎం చివరి విడత కౌన్సెలింగ్‌ సీట్లను బుధవారం కేటాయించినట్లు లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ న్యాయ కళాశాలల్లో 272 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటికోసం దాదాపు 1,406 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌లో అన్నీ సీట్లు భర్తీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో నవంబరు 1 నుంచి 5వ తేదీలోపు ఫీజు చెల్లించి, రిపోర్ట్‌ చేయాలని సూచించారు.
6 వేల మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్స్‌ యూనివర్సిటీజజ వచ్చే నెల 6న పనుల ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన హంగులతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పలు నమూనాలను సర్కారు తయారు చేయించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలోని యూనివర్సిటీ స్థలంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌తోపాటు.. అకడమిక్‌ బ్లాక్, వర్క్‌ షాప్‌లు, బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు, డైనింగ్‌ హాల్, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. వీటితోపాటు క్యాంపస్లో ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్‌ ఏరియా కూడా ఉండేలా డిజైన్లు రూపొందించారు. వర్సిటీ ప్రాంగణంలో ఎక్కువ ఖాళీ స్థలం, పచ్చదనం ఉండేలా నమూనాలు తయారు చేయించారు. ఇందులో యేటా ఆరు వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, వసతి సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు.

ఆ గ్రామంలో దీపావళి అంటే పీడ పండుగ.. ఎందుకో తెలుసా?

దీపావళి అంటే అందరూ సందడిగా జరుపుకుంటారు. కానీ ఆ గ్రామం పూర్తిగా దీపావళి పండుగకు దూరంగా ఉంటుంది. అక్కడ టపాసులు పేలవు.. దీపాలు కూడా గ్రామంలో కనిపించవు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? పండుగను ఎందుకు జరుపుకోవడం లేదు?

అనకాపల్లి జిల్లాలో ఓ గ్రామంలో ప్రజలు పూర్తిగా దీపావళి పండగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోంది. అందుకే అక్కడ టపాసులు పేలవు.. దీపాలు కూడా గ్రామంలో కనిపించవు. రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో ఇలా ప్రజలు పండుగకు దూరంగా ఉంటారు. అప్పట్లో ఈ గ్రామంలో కూడా అందరీలాగే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకునేవారు. కానీ ఇలా ఆ గ్రామస్తులు మారడానికి ఓ ఘటన కారణమని చెప్పాలి. దీపావళి రోజు నిప్పు రవ్వలు పడి ఓ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండ్లన్ని కాలిపోయాయి. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు అప్పటి నుంచి దీపావళికి దూరమయ్యారు.

అంతేకాదు.. అప్పట్నుంచి వాళ్ల అనుమానానికి తగ్గట్టుగా దీపావళి నాడు ప్రత్యేక ఏదో ఒకటి కీడు జరుగేదట. దీంతో గ్రామంలో ఎవరు టపాసులు పేల్చడం మానేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అందరూ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైన దీపావళి పండుగ జరుపుకోవాలంటే పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి చేసుకుంటారు. నాగుల చవితికి గ్రామమంతా ఏకమవుతారు. పుట్టలో పాలు పోసి అక్కడ టపాసులు పేల్చి ఆనందంగా జరుపుకుంటారు

తిరుమలకు వెళుతున్నారా ?? భక్తులు ఈ సూచనలు పాటించాల్సిందే

అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల నుంచి శ్రీహరి దర్శనం కోసం తిరుమలకు కాలి నడకన వెళ్ళాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సమస్యల సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంపై టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు పలు కీలక సూచనలు జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది.

60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదంటోంది టీటీడీ. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని సూచించింది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ప్రకటన లో పేర్కొంది టీటీడీ. భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టీటీడీ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చని టీటీడీ చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గం లోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని టీటీడీ సూచిస్తోంది. తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటలు వైద్య సదుపాయం పొందవచ్చన్న టీటీడీ భక్తులకు తెలియజేసింది. దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది టీటీడీ. తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు తప్పనిసరిగా సూచనలు పాటించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు ఎదురుచూపులు.. ఇంకా వెలువడని నోటిఫికేషన్‌

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీలో పీజీ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ కోసం విద్యార్ధులు పడిగాపులు కాస్తున్నారు.

రోజులు గడుస్తున్నా నోటిఫికేషన్‌ విడుదలలో తీవ్ర జాప్యం నెలకొనడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అటు ఏపీలో ఇప్పటికే పీజీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానిక కోటాకు సంబంధించిన ర్యాంకులు కూడా విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి తెలంగాణలో ఏపీ విద్యార్థులకు, ఏపీలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం కోటా నిలిచిపోనుంది. దీంతో ఏ రాష్ట్రం విద్యార్ధులు ఆ రాష్ట్రంలోనే సీట్లు పొందాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది కూడా. త్వరలోనే ఆ రాష్ట్రంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.

ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ విద్యార్థులకు కోటాను ఈ ఏడాది నుంచి తొలగిస్తున్నట్లు జీవో విడుదల చేసింది. అయితే పీజీ ప్రవేశాల్లో మార్గదర్శకాలపై ఇంకా ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించి 2 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. తెలంగాణలో గత ఏడాది వరకు 3 వేల పీజీ సీట్లు ఉండేవి. అయితే మల్లారెడ్డి కళాశాల డీమ్డ్‌ వర్సిటీ కావడంతో 200 సీట్లు ఈ ఏడాది తగ్గాయి. దీంతో మొత్తం 2,800 పీజీ సీట్లు ఉండగా, వాటిల్లో అఖిలభారత కోటా కింద 50 శాతం పోగా.. మిగిలిన సుమారు 1400 సీట్లు మాత్రమే రాష్ట్ర విద్యార్థులకు ఉంటాయి. విభజన హామీల్లో భాగంగా గతఏడాది వరకు స్థానిక కోటాలో 15 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయిస్తూ వచ్చారు. ఈసారి నుంచి ఆ కోటా లేనందున రాష్ట్ర విద్యార్థులకే అన్ని స్థానిక కోటా సీట్లు దక్కాలి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు కాళోజీ వర్సిటీ రాష్ట్ర మెరిట్‌ జాబితా కూడా విడుదల చేయలేదు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ఒక్క అడుగు కూడా రాష్ట్ర సర్కార్ వేయకపోవడంతో విద్యార్థులు తమకు ఏ కళాశాలలో ఏ బ్రాంచిలో సీటు వస్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.

రాష్ట్రంలో సీటు దక్కడం విషయమై స్పష్టతవస్తే.. విద్యార్థులు జాతీయ వైద్య విద్యాసంస్థల్లో పీజీ ప్రవేశాల కోసం నవంబరు 10న జరిగే ‘INI CET’ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధం అయ్యేందుకు వీలుంటుంది. పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో జాప్యం వల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేస్తే.. ఆ వెంటనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇస్తామని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Health

సినిమా