Sunday, November 17, 2024

రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170 కి.మీ. పూర్తి వివరాలు ఇవి..

లక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు చాలా వేగంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ వాహనాల స్థానాన్ని ఆక్రమించేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి.

లోకల్ అవసరాలకు సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కంపెనీల మధ్య కూడా పోటీ వాతావరణ ఏర్పడుతోంది. టాప్ బ్రాండ్లతో పాటు చాలా స్టార్టప్స్ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఐవూమి(iVoomi) బ్రాండ్ ఓ కొత్త ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఐవూమి జీత్ ఎక్స్ జెడ్ఈ(iVoomi JeetX ZE). దీని ధర రూ. 99,999 ఎక్స్-షోరూమ్. దీనిలో బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 170 కిమీ రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్థానిక రిజి స్ట్రేషన్లతో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో మొదటగా విక్రయాలు జరుపుతోంది. ఈ కొత్త వేరియంట్ డెలివరీలు జూలై చివరిలో లేదా ఆగస్టులో రెండో వారంలో ప్రారంభమవుతాయి.

ఐవూమి జీత్ ఎక్స్ జెడ్ఈ స్పెసిఫికేషన్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో, రైడర్, స్పీడ్ వంటివి ఉన్నాయి. ఈ రైడింగ్ మోడ్లలో వరుసగా 170 కిమీ, 140 కిమీ,130 కిమీ రైడింగ్ రేంజ్ ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. ముందు భాగంలో ఉన్న టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటాయి. బ్రాండ్ బ్యాటరీ ప్యాక్ పై ఐదేళ్ల వారంటీని అందిస్తోంది.

ఐవూమి సీఈఓ, వ్యవస్థాపకుడు అశ్విన్ భండారి మాట్లాడుతూ జీట్ ఎక్స్ జెడ్ 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ను పరిచయం చేయడం ద్వారా ఆవిష్కరణ, కస్టమర్ అవసరాలను తీర్చడంపై తమ దృష్టిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాము అధునాతన సాంకేతికత, అత్యుత్తమ పనితీరు, గొప్ప విలువను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఈ కొత్త మోడల్ ఆధునికతను ఇష్టపడే ప్రస్తుత జనరేషన్ కు నచ్చే విధంగా స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుందని చెప్పారు.

ఐవూమి ఎస్1 ఎలక్ట్రిక్..

జీత్ ఎక్స్ జెడ్ఈ స్కూటర్ కన్నా ముందు ఐవూమి ఎస్1 పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఏకంగా 240 కిలమీటర్ల రేంజ్ ను క్లయిమ్ చేస్తోంది. అలాగే ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో ఉంది. ఇది 85 కిమీ పరిధిని అందిస్తుంది. దీని ధర రూ. 54,999 ఎక్స్-షోరూమ్. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ పై ఆధారపడి స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్లు లేదా 55 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇవి గ్రాఫేన్ బ్యాటరీ ప్యాక్, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లతో వస్తాయి.

రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం

ప్రస్తుత తరం సోషల్ మీడియా అనేది ఒక ట్రెండ్‌గా మారిపోతుంది. లైక్‌లు, షేర్లు, వ్యూస్‌ కోసం రకరకాల వీడియోలు పోస్టు చేస్తున్నారు. కాని కొన్ని సార్లు సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది.

తమ ప్రాణాలను పణంగా పెట్టినా పట్టించుకోరు. అయితే రైల్లో ఇలాంటి స్టంట్ చేయాలంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు రైలులో లేదా స్టేషన్‌లో సోషల్‌ మీడియా కోసం ఏవైనా స్టంట్స్‌ చేసినట్లయితే మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇందు కోసం భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటుంది.

కదులుతున్న రైలులోనో, స్టేషన్‌లోనో నిలబడి రకరకాల విన్యాసాలు చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే వస్తున్నాయి. ఈ రకమైన వీడియో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వీడియోలు తీసిన వారిపై కేసు నమోదు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా ఆర్పీఎఫ్‌ని ఆదేశించింది.

ముంబైలోని సెవ్రీ స్టేషన్‌లో ఓ యువకుడు లోకల్ ట్రైన్ డోర్‌కు వేలాడుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే కఠిన చర్యలకు ఆదేశించింది. వీడియోలో స్టంట్ చేస్తున్న యువకుడి కోసం గాలిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

ప్రయాణికులు తమ ప్రాణాలకు లేదా ఇతరులకు హాని కలిగించే ఇలాంటి కార్యకలాపాలను మానుకోవాలని సెంట్రల్ రైల్వే పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇలాంటి వీడియోలో సోషల్‌ మీడియాలో ఇటీవల చాలానే వస్తున్నాయి. దీంతో రైల్వే నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది.

ప్రభాస్‏కు ఇలాంటి సినిమాలు చాలా కామన్.. కానీ నాకు మాత్రం కాదు.. అమితాబ్ బచ్చన్..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయగా..

మొదటిరోజే రూ.195.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కాశీ, శంబలా, కంప్లెక్స్ అంటూ మూడు ప్రపంచాలను సృష్టించి.. అద్భుతమైన విజువల్ వండర్ అందించారు నాగ్ అశ్విన్. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కల్కి నార్త్ ఇండస్ట్రీలోనూ దూసుకుపోతుంది. ఈ లో అత్యంత ముఖ్యమైన అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటించాడు. ఇందులో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. కల్కి రూ.1000 కోట్లు రాబట్టడంపై అమితాబ్ స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఒక్క కు రూ. 1000 కోట్లు రావడం ప్రభాస్‏కు చాలా కామన్.. కానీ నాకు మాత్రం చాలా అరుదు అని అన్నారు.

‘ఈ మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి చేయడంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సక్సెస్ మాములు విషయం కాదు. ప్రభాస్ కు ఇది రొటినే కావచ్చు.. ఎందుకంటే అతడి లు రూ.1000 కోట్లు మార్క్ అందుకున్నాయి. కానీ నాకు మాత్రం ఈ కల్కి అనే ఆ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ను ఇప్పటికే నాలుగుసార్లు చూశాను. ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం ఈ లో నేను కనుగొన్నాను’ అని అన్నారు అమితాబ్.

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..

వర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్..

కొన్నాళ్లపాటు తన లకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ లు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రాల్లో వన్ ఆఫ్ ది మూవీ గబ్బర్ సింగ్. ఈ ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ ను రీరిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు అనుశ్రీ ఫిలిమ్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్లు పవన్ ల విడుదలకై ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పక్కా స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. 2012లో రిలీజ్ అయిన ఈ అప్పట్లో రూ.150 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పరమేశ్వర్ ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేశ్ ఈ ను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. పవన్ మేనరిజమ్, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ లో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ పై మరింత క్యూరియాసిటి కలిగించింది.

పాదాలకు ఉన్న రెండో వేలుకే ఎందుకు మెట్టెలు పెడతారు..

పెళ్లి అయిన ప్రతీ మహిళల కాలి వేళ్లకు మెట్టెలు ఉండటం సహజం. సాధారణంగా అయితే కాలి బొటన వేలు పక్కన మూడు వేళ్లకు కూడా మెట్టెలను ఉంచుతారు. కానీ ఇప్పుడున్న కాలంలో కేవలం బొటన వేలు పక్కన ఉన్న వేలుకి మాత్రమే ఉంచుకుంటున్నారు.

అయితే చాలా మంది మహిళలకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఎందుకు పెడతారు? అని ఆలోచించే ఉంటారు. మరి కాలి వేళ్లకే ఎందుకు మెట్టెలను పెడతారు? ఇందుకు కారణం కూడా ఉంది. పూర్వం పెద్దలు ఏం చేసినా అన్నీ ఆలోచించే చేసేవారు కదా. కాలి బొటన వేలు పక్కన ఉన్న కాలికి ఎందుకు మెట్టెలు పెడతారో శాస్త్రీయ పరంగానే కాకుండా.. సైన్స్ పరంగా కూడా కారణాలు ఉన్నాయి.

వెండి మెట్టెలే ఎందుకు?

పెళ్లి అయిన ప్రతీ స్త్రీ కాలికి వెండి మెట్టెలను పెడుతూ ఉంటారు. కాలికి వెండి మెట్టెలే ఎందుకు పెట్టాలి? అనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది. వెండిని ధరించడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. శక్తిని ఇస్తుంది.

ఈ కారణం చేతనే మెట్టెలను ధరిస్తారు..

పెళ్లైన ప్రతీ మహిళ కాలి వేళ్లకు మెట్టెలు ఉండటం సర్వ సాధారణం. కాలి వేళ్లను బట్టే మహిళకు పెళ్లి అయ్యిందో.. లేదో.. చెప్పొచ్చు. ఇది ఒక కారణం అయితే.. పాదంలోని రెండో వేలు నేరుగా గుండె, గర్భాశయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ వేలుకు మెట్టె ధరించడం వల్ల స్త్రీలలో రక్త పోటు అనేది సక్రమంగా జరుగుతుంది. అంతే కాకుండా పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయని సైన్స్ కూడా వివరిస్తోంది. అలాగే మహిళ పునరుత్పత్తి అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

మనసు ప్రశాంతంగా ఉంటుంది:

కాలి రెండో వేలుకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ కూడా చక్కగా ప్రసరిస్తుంది. అలాగే మహిళలు లైంగిక ప్రక్రియ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగించడం కోసం ఈ మెట్టెలను పెడతారు.

నాడీ కేంద్రాలు చక్కగా పని చేస్తాయి:

కాలి రెండో వేలుకు మెట్టెలను పెట్టడం వల్ల నాడీ కేంద్రాలు యాక్టివ్ అవుతాయి. చేతిలో ఉన్నట్టే కాళ్లలో కూడా నాడీ కేంద్రాలు ఉంటాయి. ఇవి కాలి వేలుకు మెట్టెలు పెట్టడం వల్ల.. నడిచేటప్పుడు నొక్కుతాయి. దీని వల్ల నాడీ కేంద్రాలు ప్రభావితం అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

వృద్ధులకూ బీమా ధీమా.. పాలసీ ఎలా ఉండాలంటే..

బీమా అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. జీవితంలో ఎదురయ్యే అనుకోని ఇబ్బందులను అధిగమించడానికి, ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండటానికి ఇది చాలా అవసరం. పాలసీలలో అనేక రకాలు ఉన్నాయి.

సాధారణంగా జీవిత బీమా పాలసీలను చాలామంది ఎక్కువగా తీసుకుంటారు. వీటితో పాటు ఆరోగ్య పాలసీలు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్స్యూరెన్స్) పాలసీలు చేయించడం చాలా అవసరం.

పెరుగుతున్న వృద్ధులు..

ప్రస్తుతం మన దేశం జనాభాలో మొదటి స్థానంలో ఉంది. దానికి అనుగుణంగానే వృద్ధులు కూడా పెరుగుతున్నారు. రాబోయే రోజులలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. వృద్ధ్యాప్యంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు కలుగుతాయి. వారి ఆరోగ్య సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆరోగ్య పాలసీలు ఎంతో ఆదుకుంటాయి. కానీ దేశంలో చాలామంది సీనియర్ సిటిజన్లకు హెల్త్ పాలసీలు లేవు.

అనేక పాలసీలు..

హెల్త్ పాలసీలలో అనేక రకాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి మనకు ఉపయోగపడే దానిని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యం పాలసీలోని అంశాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్.. ఈ పాలసీ కుటుంబమంతటికీ బీమా కవరేజ్ అందజేస్తుంది. సీనియర్లతో సహా మొత్తం కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది.

వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళిక.. సీనియర్ల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల కోసం తీసుకునే పాలసీ. వ్యక్తిగతంగా ఇది కవరేజ్ ఇస్తుంది.

సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్‌.. ప్రత్యేకంగా వృద్ధుల కోసం ఈ పాలసీని రూపొందించారు.

క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌.. క్యాన్సర్, గుండెపోటు వంటివి సంభవించినప్పుడు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట, క్లిష్టమైన అనారోగ్యాల కోసం ఒకేసారి చెల్లింపు చేస్తారు.

వ్యక్తిగత ప్రమాద బీమా.. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణం, గాయాలు, వైకల్యం తదితర వాటికి బీమా అందిస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.

ప్రసూతి ప్రణాళిక.. ప్రసూతి వయసు కలిగిన మహిళల కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులకు కవరేజ్ లభిస్తుంది.

గమనించాల్సిన అంశాలు..

  • సహ చెల్లింపులు లేని పాలసీలు సీనియర్లకు ఉపయోగంగా ఉంటాయి. వైద్య ఖర్చులను కవర్ జేస్తాయి. ఆరోగ్యం కోసం మనం ఖర్చు చేసే అదనపు వ్యయాన్ని తగ్గిస్తాయి.
  • మీరు పాలసీ తీసుకునే బీమా కంపెనీ నెట్ వర్క్ చాలా బాగుండాలి. మీకు సమీపంలోని ఆసుపత్రులను కలిగి ఉండే ఉపయోగంగా ఉంటుంది.
  • ప్రీమియం-టు-కవరేజ్ నిష్పత్తిని అంచనా వేయడం చాలా అవసరం. అతి తక్కువ ధరతో కవరేజీని పెంచుకోండి.
  • ఇప్పటికే ఉన్న అనారోగ్యాలకు తిరస్కరణ లేకుండా మీ పాలసీ కవర్ చేయాలి.
  • వృద్ధులకు టైలర్డ్ ప్లాన్‌ తో ప్రత్యేక కవరేజీ, ప్రయోజనాలు కలుగుతాయి.

అనేక సంస్కరణలు..

వృద్ధులకు ఆరోగ్య బీమా సౌలభ్యం, ప్రయోజనాలను మెరుగుపరచడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా 2024 నుంచి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడానికి 65 ఏళ్ల పరిమితిని తొలగించింది. వేచి ఉండే వ్యవధిని నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. అవసరమైన చికిత్సలకు త్వరితగతిన యాక్సెస్ చేయడానికి వీలుగా నిబంధనలను రూపొందించింది. అలాగే సీనియర్ సిటిజన్ల క్లెయిమ్‌లు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక ఛానెళ్లను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది.

పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా.? కారణం ఇదేనట..! ఇలా మాన్పించండి..

పిల్లలు తమ బొటన వేలిని నోట్లో పెట్టుకోవడం సర్వ సాధారణం. ఈ అలవాటు చాలా మంది పిల్లలకు ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న వయస్సులో అంటే 4 నుండి 5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలను ఈ అలవాటు నుండి ఆపడానికి ప్రయత్నించడం మంచిది.

ఎందుకంటే పదే పదే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల దంతాల నిర్మాణం సమస్యలు తలెత్తుతాయి. ముఖం ఆకారం కూడా మారే అవకాశం ఉంది. ఈ అలవాటు వల్ల నోటిలోకి బ్యాక్టీరియా చేరి వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోకుండా వారి అలవాటు మానేయించాలి. పిల్లల్లో ఈ అలవాటు వెనుక కారణం కూడా వైద్యులు వెల్లడించారు. పిల్లలు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు.. కానీ, తల్లిదండ్రులు దీనిని చాలా సాధారణ విషయంగా భావిస్తారు. ఇలా చేస్తే అది మీ చిన్నారికి ఎంత నష్టం చేస్తుందో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుంటే వారికి ఆకలివేయకుండా ఉంటుంది. దాంతో పిల్లలు పాలు కానీ, భోజనం కాని అడగరు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. అలాగే, పిల్లలు ఆడుకునే క్రమంలో చేతుల్లో మురికితోబాటు దుమ్ము, క్రిమి-కీటకాలు చేరుతుంటాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవటం వల్ల మురికి వాడి చేతి ద్వారా నోట్లోకి చేరుకుంటాయి. వారు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉంది అంటున్నారు ప్రముఖ వైద్యులు. పిల్లలు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడంవలన వారి పళ్ల వరుస కూడా దెబ్బతింటుంది. దంతాలు బయటికి చొచ్చుకు వస్తాయి. పెదాలు కూడా లావుగా మారే అవకాశం ఉంది.

అంతేకాదు.. బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి వేలు సన్నగా పేలగా మారుతుంది. దీని ప్రభావం వారి చదువుపైకూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న పిల్లలు బలహీనంగా, అలసత్వ ధోరణి కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగని పిల్లలకు ఉన్న ఈ అలవాటును మాన్పించేందుకు కొందరు తల్లిదండ్రులు.. చిన్నారుల చేతికి కలబంద రసం, వేప ఆకుల రసం, కాకరరసం, మిర్చి లాంటివి పెడుతుంటారు. ఇలా చేయటం సరికాదంటున్నారు వైద్యులు. ఇలా చేస్తే పిల్లలను ఒకేసారి ఆందోళనకు గుర్తుచేస్తాయని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ అలవాటు మాన్పించలేరు. ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఓపిక అవసరం అంటున్నారు నిపుణులు.

డ్రై ఆప్రికాట్‌ని తక్కువ అంచనా వేయకండి.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రికాట్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఈ మధ్య దీన్ని కూడా చాలా మంది డ్రై ఫ్రైట్స్‌లో ఒక భాగం చేసుకుంటున్నారు. ఆప్రికాట్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.

విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఎన్నో లభిస్తాయి. దీని ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు.

ఆప్రికాట్స్‌లో ప్రోటీన్లు, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతే కాకుండా కెరోటినాయిడ్స్ వంటి ఫైటో కెమికల్స్ కూడా ఉన్నాయి.

బరువు తగ్గడంలో ఆప్రికాట్స్ చక్కగా సహాయ పడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల అతిగా తినే అలవాటును కూడా నిరోధిస్తుంది. దీని ద్వారా సులభంగా మీరు వెయిట్ లాస్ అవ్వొచ్చు.

ఆప్రికాట్‌లో గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పోషకాలు ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు వీటిని తింటే చాలా మంచిది. డ్రై ఆప్రికాట్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది.

 

బీరు తాగే వారికి దోమలు ఎక్కువగా కుడుతాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..

దోమ కాటు ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మనిషిని కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా చేరు వేసే సంఘటనలు ఉన్నాయి.

అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాయిల్స్‌ మొదలు లిక్విడ్స్‌ వరకు దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగిస్తుంటారు.

అయితే దోమకాటులో కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా.? డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తే దోమలను ఎవరిని పడితే వారికి కుట్టవు. ఒక దోమ మనల్ని కుడుతుంది అంటే అందుకు ఒక రిజన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇలాంటి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీరు సేవించే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ ఖుబ్‌చందానీ ఈ విషయమై మాట్లాడుతూ.. దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు. ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్‌ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఓ బ్లెడ్‌ గ్రూప్‌ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి. అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేలకిపైగా తగ్గింపు.

ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు సేల్స్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి.

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీకి చెందిన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఎంత తగ్గింపు ధర లభిస్తోంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ 14పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 79,999గా లాంచ్‌ చేశారు. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో సూపర్‌ ఫీచర్లను తీసుకొచ్చారు. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 13 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 69,998కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను ఏకంగా రూ. 20 వేల తగ్గింపు ధరకే పొందొచ్చు. వీటితోపాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 54,900 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

షావోమీ 14 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయాకొస్తే ఇందులో 6.36 ఇంచెస్‌తో కూడిన 1.5కే రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీంతో స్క్రీన్‌ను సన్‌ లైట్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3, 4ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ ఫోన్‌లో 50 వాట్స్‌ ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో పాటు, 120 వాట్స్‌ హైపర్‌ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే 4610 బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. మొత్తం మూడు 50 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. అయితే ఈ ఆఫర్‌ ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మీకు పోస్టాఫీసులో పొదుపు పథకాలు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

నందరి జీవితాల్లో పొదుపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్యాంకు పొదుపు, నగదు పొదుపు, చిరు పొదుపు వంటివి చాలా ముఖ్యం. వసూలు చేసే అలవాటు ఉండి, మన పిల్లలకు అలవాటు చేయడం.

ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోస్టాఫీసుల్లో ప్రాజెక్టులు అమలవుతున్నాయి. పోస్టాఫీసులో ఖాతా ఉంటే ప్రతినెలా నేరుగా వెళ్లి చెల్లించవచ్చు. అంతేకాదు 15వ తేదీని లెక్కిస్తే, మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రాజెక్ట్‌లకు ఖాతా తెరిస్తే, మొదటి 15 రోజులలో, రెండవ సగంలో ప్రారంభిస్తే, ద్వితీయార్థంలో చెల్లింపు చేసే పద్ధతి ఉంది. అయితే మనం వాడే స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే ఈజీగా చేసుకోవచ్చు.

ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ యాప్ నుండి IPPB అనే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళితే ‘ఓపెన్ యువర్ అకౌంట్ నౌ’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. మీరు ఇప్పటికే పోస్టాఫీసులో ఇచ్చిన నంబర్‌ను ఇవ్వడం ద్వారా మీకు ఓటీపీ నంబర్ వస్తుంది. దీన్ని సబ్‌మిట్ చేసిన తర్వాత డిజిటల్ యాప్‌కు సంబంధించిన కస్టమర్ ఐడీ, అకౌంట్ నంబర్ వస్తాయి. మీరు దీన్ని సరిగ్గా నమోదు చేస్తే, డిజిటల్ యాప్ కోసం ఖాతా తెరవబడుతుంది. ఇది మీ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయబడుతుంది.

ఇప్పుడు యాప్‌లో దిగువన చూపిన ఎంపికపై క్లిక్ చేయండి. అది PSOB స్వీప్ ఎంపికను చూపుతుంది. అందులో మీరు పొదుపు ఖాతా నుండి డిజిటల్ ఖాతాకు అవసరమైన డబ్బును బదిలీ చేయవచ్చు. దీని తరువాత, “పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్” అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఉపయోగిస్తున్న ప్రోగ్రామ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఖాతా నంబర్, డబ్బు మొత్తం, ఎన్ని వాయిదాలు నమోదు చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఇది సరిగ్గా ఇస్తే, డబ్బును సులభంగా మార్చుకోవచ్చు.

 

బీ అలెర్ట్.! ఏపీలో ఈ ప్రాంతాలకు పిడుగులు పడే ఛాన్స్.. తాజా వెదర్ రిపోర్ట్

ఎండీ సూచనల ప్రకారం మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. జూలై 17న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44.2మిమీ, ఇచ్చాపురంలో 23మిమీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 20.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు..వాతావరణ శాఖ అధికారులు.

తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

దయం లేవగానే మనం చేసే పని దంతాలను శుభ్రం చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుండాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలని తెలిసిందే. అందుకే కచ్చితంగా ఉదయాన్నే బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు సైతం చూసిస్తుంటారు.

దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిగుళ్ల సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే దీర్ఘకాలంగా చిగుళ్ల సమస్యలు గుండె జబ్బులకు, డయాబెటిస్‌కు కూడా దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఇదిలా ఉంటే బ్రషింగ్‌ విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి.? అలాంటి కొన్ని అపోలు ఏంటి.? వాటిలో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

* రోజులో రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. దీంతో రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది భోజనం చేస్తుంటారు. అయితే తిన్న వెంటనే భోజనం చేసుకోవడం మాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది. లాలా జలం ప్రభావం తగ్గడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే బ్రష్‌ చేసుకోవాలి.

* ఇక బ్రషింగ్‌ ఎక్కువసేపు చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం లేదు. ఎక్కువగా సేపు బ్రష్‌ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ తొలిగిపోయి బలహీనపడి పడుతుంది. అందుకే ఎక్కువసేపు కాకుండా రెండు నిమిషాలు బ్రష్‌ చేసుకోవడం ఉత్తమం.

* ఇక బ్రష్‌ బ్రిజల్స్‌ హార్డ్‌గా ఉంటే పళ్లు మెరుస్తాయని కొందరు భావిస్తుంటారు. అయితే కఠినమైన బ్రిజల్స్‌ దంతాలను, చిగుళ్లను గాయపరుస్తాయి. రక్తం కారేలా చేస్తాయి.

* బ్రష్‌ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలన్న దానిపై కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా మంది నెలలకు తరబడి బ్రష్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా బ్రష్‌లను మార్చాలని వైద్యులు చెబుతున్నారు.

* మనలో చాలా మంది ఎక్కువగా పేస్ట్‌ను వాడితే మంచిదనే అపోహలో ఉంటారు. అయితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక పెద్ద బటానీ గింజ పరిమాణంలో పేస్ట్‌ సరిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

ఈ దేశాల్లో భారతీయ రూపాయి విలువ ఎక్కువ.. అవి ఏవో తెలుసా?

ప్రతి దేశం దాని స్వంత కరెన్సీ నోట్లను కలిగి ఉంటుంది. దీని విలువ ఇతర దేశపు డబ్బు విలువ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. దీని ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత విలువైనది కువైట్ దినార్.

ఒక కువైట్ దినార్ భారతీయ రూపాయిలలో రూ.271కి సమానం. అదేవిధంగా, యునైటెడ్ స్టేట్స్, చైనాతో సహా దేశాల కరెన్సీ కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారత రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో భారత రూపాయి విలువ చాలా రెట్లు ఎక్కువ. అవి ఏయే దేశాలు, అక్కడి భారత రూపాయి విలువ ఎంత అనేది వివరంగా తెలుసుకుందాం.

వియత్నాం: వియత్నాం డబ్బును డాంగ్ అంటారు. అక్కడ భారత రూపాయి 303.62 వియత్నామీస్ డాంగ్‌తో సమానం. ఇక్కడే భారత రూపాయి విలువ ఎక్కువగా ఉంది.

లావోస్: లావోస్ కరెన్సీని కిప్ అంటారు. దీని ప్రకారం, ఇక్కడ భారతీయ రూపాయి విలువ 265.47 లావో కిప్‌కి సమానం. భారత రూపాయి విలువ ఎక్కువగా ఉన్న రెండో దేశం ఇది.

ఇండోనేషియా: ఇండోనేషియా కరెన్సీని రుపియా అంటారు. ఇక్కడ భారత రూపాయి 193.92 ఇండోనేషియా రూపాయికి సమానం.

పరాగ్వే: పరాగ్వే కరెన్సీని గురానీ అంటారు. ఇక్కడ భారత రూపాయి 90.31 పరాగ్వే గ్వారానీకి సమానం.

కంబోడియా: కంబోడియా కరెన్సీని రియాల్ అంటారు. ఇక్కడ భారత రూపాయి 49.21 కంబోడియా రీల్‌కి సమానం.

ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..! ఇలా కూడా జరగొచ్చు..

ర్షాకాలంలో పాముల బెడద పెరుగుతుంది. ఈ సమయంలో పాములు, కప్పలు తరచూ ఇళ్ల చుట్టుపక్కల కనిపిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. వర్షాలు, వరదల కారణంగా పాములు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి.

అందుకే వర్షాకాలంలో షూస్, బట్టలను మళ్లీ మళ్లీ చెక్ చేసుకోవాలని తరచూ వింటుంటాం.. వర్షాకాలంలో పాములు తరచుగా ఇళ్ల మూలల్లో, బాత్రూమ్ కాలువలు, బూట్ల లోపల నక్కి కనిపిస్తుంటాయి.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ షూ లోపల ముడుచుకుని విషపూరితమైన నాగుపాము నక్కి ఉంది.. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగవిప్పి పైకి లేచిన వీడియో భయానకంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా బూట్లలో పాదాలు పెట్టి ఉంటే..పెద్ద ప్రమాదమే ఎదురయ్యేది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్‌క్యాచర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో, అతను షూ లోపల నుండి నాగుపామును బయటకు తీస్తున్నాడు. షూ రాక్‌లో వరుసగా షూలు పేర్చి ఉండగా,వాటిలోని ఒక షూలోపల భారీ నాగుపాము నక్కిఉంది. అది గమనించిన ఆ ఇంటి యాజమాని స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను పాము పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు షులో కర్రను చొప్పించిన వెంటనే ఆ పాము కోపంతో పడగ విప్పి పైకి లేచింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వీడియోలో విష సర్పం చాలా భయానకంగా పడగవిప్పి బుసలు కొడుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు.. వర్షాకాలంలో మీ బూట్లను ఎప్పుడూ చెక్ చేసుకోండి. అని సూచించారు.

ఆ రోజు రానే వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి డబ్బు..

తొలి ఏకాదశి రోజున.. తెలంగాణ రైతులకు నిజమైన పండగ లాంటి వార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీకి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది.

మరికొన్ని గంటల్లో నిధుల విడుదల ప్రక్రియ మొదలు కాబోతోంది. రైతుల ఫోన్లు టింగు.. టింగు మని మోగబోతున్నాయి. ఈ రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రమంతా పండుగలా జరపబోతోంది హస్తం పార్టీ. ఇంతకీ ఎప్పటిలోపూ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. 2లక్షల రుణమాపీకి ఎన్ని నిధులు అవసరం అవుతాయి?

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో ముఖ్యమైన హామీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. గురువారం సాయంత్రానికి రూ. లక్ష లోపు రుణాల మాఫీ కోసం 7వేల కోట్లు విడుదల చేయనున్నారు. కాగా ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నామని, ఆగస్టు 15 నాటికి 2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తవుతోందని కాంగ్రెస్ ధీమాగా చెప్తోంది. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాటను గౌరవిస్తూ రుణమాఫీ చేస్తున్నామన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే చేసి తీరుతారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని రేవంత్ అన్నారు.

ఇక బీఆర్‌ఎస్‌పై కూడా ఈ సందర్భంగా రేవంత్ విమర్శలు కురిపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు. కానీ ఈ ప్రభుత్వం 7 నెలల్లోనే 31వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా రైతులకు మేలు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో దేశానికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదే కాకుండా ఈ ఏడు నెలల్లోనే సంక్షేమానికి 30వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. ఆర్ధిక నిపుణులు కష్టమని చెప్పినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ నిధుల విడుదలకు ప్రక్రియ కూడా మొదలైపోయిందన్నారు.

చేస్తున్న ఈ మంచిని ప్రజలకు వివరించాలి. వాడవాడలా ఇదో పండగలా జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో బైక్ ర్యాలీలు చేపట్టి.. పండగలా వేడుకలు నిర్వహించి.. హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇక గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చామని పార్లమెంట్‌లోనూ ఎంపీలు ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గత ప్రభుత్వంలాగా మాటలతో మభ్యపెట్టకుండా.. రైతును రుణ విముక్తి చేసిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

రుణమాఫీని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా 25వేల చొప్పున ఇచ్చారు. కానీ ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. రెండు లక్షల రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని సగర్వంగా చెప్పుకునే సందర్భం ఇదన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

రెండు ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

కొందరు అగంతకులు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అగంతకులు మెయిల్‌ ద్వారానో, లేక గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తూ కూడా ఈ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

తాజాగా చెన్నైలోని పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు తదితర ప్రాంతాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో దీనికి సంబంధించి 5కి పైగా కేసులు ఉన్నాయని, మెయిల్స్ పంపడానికి వీపీఎన్‌ని ఉపయోగిస్తున్నందున వాటిని కనుగొనడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని రెండు ప్రైవేట్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

చెన్నైలోని పట్టినప్పక్కం ప్రాంతంలో ఉన్న చెట్టినాడు విద్యాశ్రమ పాఠశాలకు అర్ధరాత్రి సమయంలో ఒక ఇమెయిల్ వచ్చింది. పట్టినంబాక్కంలోని చెట్టినాడు విద్యాశ్రమం, విద్యా మందిర్ అనే రెండు పాఠశాలల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఈమెయిల్ పేర్కొంది. ముఖ్యంగా ఓవియా ఉదయనిధి పేరుతో ఈమెయిల్ వచ్చింది.

పట్టినపాక్కం పోలీసులు వెంటనే మోప్పనై యూనిట్, బాంబు నిపుణులతో సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా విచారణ చేయగా అది బూటకమని తేలింది. బాంబు ఈమెయిల్ పంపిన సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా పట్టినంబాక్కం పోలీసులు ఘటనపై సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. ఓవియా దురైసామి పేరుతో 5 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడైంది. అలాగే తమిళనాడులో శాంతిభద్రతలు, సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు పాఠశాలల్లో బాంబులు పెట్టారని తెలుస్తోంది.

ఈ సింగర్ మనసు బంగారం.. 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ ల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ హీరో.. అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు.

ఇప్పటివరకు ఎంతో మంది చిన్నారులకు హార్డ్ ఆపరేషన్స్ చేయించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి మరో జన్మను అందించారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు..మరో సింగర్ కూడా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను నిలిపేందుకు పోరాడుతుంది. ఇప్పటివరకు మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ సింగర్ మంచి మనసు తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇంతకీ ఆమె ఎవరంటే సింగర్ పాలక్ ముచ్చల్. ల్లో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయడమే కాదు.. చిన్నారుల పాలిట దైవంలా మారింది. చిన్నారుల గుండె ఆగిపోకుండా తన సొంతంగా చికిత్స చేయిస్తుంది.

ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది నిరుపేద చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. తన పాటలు ప్రాచూర్యం పొందడంతో ఆదాయం పెరిగిందని.. ఒక్క కాన్సార్ట్ తో 13- 14 ఆపరేషన్లకు సరిపడా నిధిలు సేకరిస్తున్నానని సింగర్ పాలక్ ముచ్చల్ వెల్లడించారు. మరో 400 మంది కంటే ఎక్కువ చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరగాల్సి ఉందని.. తన సంపాదిన వారికోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. చిన్నారుల ప్రాణాలను కాపాడడంలోనే తనకు అసలైన ఆనందముందని అంటోంది. పాలక్ ముచ్చల్.. ఇప్పుడిప్పుడే సినీరంగంలో గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాలక్ ముచ్చల్.. చిన్నవయసు నుంచి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు తనవంతుగా నిధులు సేకరిస్తుంది. ఇందుకోసం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ స్టేజ్ షోలను ఇస్తూ నిధులు సేకరిస్తుంది. ఆ డబ్బుతోనే చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తుంది. పాలక్ ముచ్చల్ హిందీలో అనేక ల్లో పాటలు పాడింది. ఏక్ థా టైగర్, ఆషికి 2, కిక్, యాక్షన్ జాక్సన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎంఎస్ ధోని, కాబిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడింది. ఇక ఇప్పుడు పాలక్ ముచ్చల్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

శ్వేతపత్రాల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు.. పార్టీల మధ్య కొనసాగుతోన్న యుద్ధం

‘ఏపీలో ఇసుక, రాళ్లు, గనులు సహా సర్వం దోచేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారంటూ’ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగుతోంది.

గత ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో పెద్ద తిక మక ఉందంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తోంది. ఈ వైట్ పేపర్ల చుట్టూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైట్స్‌ నడుస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని టీడీపీ అంటోంది. కానీ అవి శ్వేతపత్రాలు కాదు జెలసీ పత్రాలని వైసీపీ అంటోంది. మొత్తంగా ఏపీలో వైసీపీ, టీటీడీ నేతల మధ్య శ్వేత యుద్ధమే నడుస్తోంది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి.. గత ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగింది ఇదే.. ప్రస్తుతం ఇదీ ఏపీ పరిస్థితి అంటూ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తోంది. ఒక్కో అంశం మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై మొదట వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేసిన బాబు.. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అలాగే బాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అమరావతిపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అమరావతి గత ఐదేళ్లుగా ఎలా నిర్లక్ష్యానికి గురైందో వివరిస్తూనే అమరావతి పునరవైభవానికి కేంద్ర సహకారం గురించి తెలియచేశారు. వీటితో పాటు విద్యుత్, సహజవనరుల దోపిడీ పైనా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలియచేసే ఉద్దేశంతోనే తాను రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నా అంటున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర స్థితిగతులను పరిశీలించే కొద్దీ ప్రతి రంగంలోనూ ఎన్నెన్నో అవకతవకలు బయటపడుతున్నాయని, ఏ శాఖను చూసినా ఘోరమైన పరిస్థితులే ఉన్నాయని సీఎం వివరించారు. అధికారంలో ఉన్నాం కదా అన్ని ఎన్నో తప్పులు, తప్పుడు నిర్ణయాలు జరిగాయి. భూములు, ఇసుక, అడవులు, క్వారీలు.. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత దోపిడీకి వైసీపీ పాల్పడిందనేది చంద్రబాబు వైట్ పేపర్ల సారాంశం.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహంకారంగా వ్యవహరించారని, చివరకు సహజ వనరులను సైతం వదలకుండా దోచేసుకున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా నాలుగు శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇంకా మరికొన్ని అంశాలపైనా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తామని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చబెడతామంటున్నారు. ఈ శ్వేతపత్రాలే కాదు. టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవమే అంటోంది వైసీపీ. ఎన్నికల్లో ప్రజలకు అలవిగాని హామీలిచ్చి.. వాటిని అమలుచేయలేక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పథకాలు ఎలా అమలు చేయాలి.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాన్ని పక్కనబెట్టి తమపై బురదజల్లడమే ఎన్డీఏ సర్కార్ పనిగా పెట్టుకుందనేది వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న వాదన.

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టే ఆలోచనలో ఉంది చంద్రబాబు సర్కార్. అయితే శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఇన్ని ఆరోపణలు చేస్తున్న టీడీపీ.. ఏ ఒక్క అధికారి గానీ లేదంటే మంత్రి గానీ తప్పుచేసినట్టు తేల్చారా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. దానికి టీడీపీ సైతం ధీటుగానే బదులిస్తోంది. ఇక బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలోనూ పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్‌నే తీసుకొచ్చే ఆలోచనలో కూటమి సర్కార్ ఉంది. దీన్ని కూడా వైసీపీ తప్పుబడుతోంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో చిత్తశుద్ది ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. అలా చేయడం లేదంటే ఏమిటి దానికి అర్థం అని ప్రశ్నిస్తోంది.

వైసీపీ రివర్స్‌ కౌంటర్‌..

దోపిడీ జరిగింది. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడమే కానీ.. ఎవరు తిన్నారు, ప్రభుత్వ ఆదాయానికి ఎవరు గండికొట్టారో చంద్రబాబు చెప్పగలరా అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పేదల కోసం పనిచేసిన తమకు అవినీతి మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే తొందరపడితే ఎలా అంటోంది టీడీపీ. త్వరలోనే అన్నీ బయటకి వస్తాయ్.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది. మొత్తంగా శ్వేతపత్రాల పేరుతో వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుంటే.. వైసీపీ నేతలు దీనిని తప్పుబడుతున్నారు. ఈ రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్.. తాజా సర్వేతో సంచలన విషయాలు..

క్యాన్సర్ మహమ్మారి.. ప్రపంచాన్ని భయపడుతున్న వ్యాధుల్లో ఒకటి. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ క్యాన్సర్ బారిన పడటం చాలా కామన్ గా కనిపిస్తుంది.

మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన క్యాన్సర్ కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ కి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముందుగా గుర్తించడమే ప్రధాన సమస్యగా మారింది. కానీ ఈ క్యాన్సర్ పై జరుగుతున్న కొన్ని అధ్యాయానల ద్వారా అందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. జనరల్ గా బరువు తగ్గడానికి, లేదా పండగ సమయంలో ఆచరించే ఒక నియమం ద్వారా క్యాన్సర్ కణతిని మనం తగ్గించుకోవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గడం కోసం, ఫిట్ గా ఉండడం కోసం, పండుగ సమయాల్లో చేసే ఉపవాసం వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కష్టం లెక్కలపై చేసిన ఈ పరిశోధనలు సక్సెస్ అవడంతో మనుషులపై కూడా సక్సెస్ అవుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపవాసం చేయడం వల్ల శరీరం యొక్క సహజమైన రక్షణ స్థాయి మెరుగుపడుతుందని దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎలకలపై చేసిన పరిశోధనలో ఉపవాసం వల్ల క్యాన్సర్కు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ శక్తివంతం చేస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. ఉపవాసం వల్ల సహజ కిల్లర్ కణాల పనితీరు మెరుగుపడుతుందని ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేసే రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన భాగం అని వారు గుర్తించారు.

ఇది నిజం ఉపవాసం ఉండటం వల్ల శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ బలోపేతం ఔతుంది. అది అన్ని మాటలలో ఉన్న సత్యం. కొంచెం ఆలోచిస్తే ఇస్లామ్ మతంలో ఉపవాసం కొంచెం ఎక్కువ అంటే 30 రోజులు ఉంటుంది. దానివల్ల 12 గంటలకంటే ఎక్కువ పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా వుండటం వల్ల అనేక రకాలైన భయంకర రోగాల నుండి మనకు తెలియకుండానే రక్షణ లభిస్తుంది. ఇప్పుడు ఇది సాయింటిఫికల్ గా ప్రూవ్ ఐనది.

దానికి ఇంక ఒక ప్రూఫ్ జంతు, పక్షి జాతులు అన్ని వాళ్లకు ఏమైనా అనారోగ్యం కలిగితే ముందు గా అస్సలు ఆహారాన్ని ముత్తవు, పచ్చి మంచినీళ్ళు తాగవు, అలా 10 రోజుల వరకు కదల కుండా ఒకేచోట నిద్రాణంగా పది వుంటాయి ఆ 10 రోజులలో వారి యొక్క. అంతర్శక్తి బలపడి 10 రోజులలో ఎటువంటి రోగమైన తగ్గి పోతుంది. మనకూడ అలాంటి వ్యవస్థ మన శరీరం లో ఉంది.
మన ఇస్లామ్ లో చెప్పిన విధంగా ఇప్పుడు అది పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రయోగాలు చేసి చెప్తున్నారు.

నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త..వెంటనే తెలిసిపోతుంది..ఎలాగంటే!

Fake Rent Rent Receipts: ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు అనేక అధికారిక మార్గాలు ఉన్నాయి. అయితే నకిలీ సర్టిఫికెట్లు, పత్రాలు ఇచ్చి పన్ను ఆదా చేసుకునేందుకు ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు.

ఒక నివేదిక ప్రకారం, పన్నును ఆదా చేయడానికి ప్రజలు తరచుగా నకిలీ పత్రాలను సృష్టిస్తుంటారు. వీటిని తరచుగా అద్దె రసీదులు అంటారు. డూప్లికేట్ అద్దె రసీదు పత్రాలను సమర్పించడం ద్వారా కొంత పన్ను ఆదా అవుతుంది. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అలాంటి వాటిని గుర్తించే కొత్త సాంకేతిక శక్తిని కలిగి ఉంది. నకిలీ పత్రాలను ఇప్పుడు సులభంగా గుర్తించవచ్చు.

మీకు అద్దె రసీదు ఎందుకు అవసరం?

ఉద్యోగి జీతంలో హెచ్‌ఆర్‌ఏ లేదా ఇంటి అద్దె అలవెన్స్ ఉంటే, అతను ఇంటి అద్దె చెల్లింపు రికార్డును కంపెనీ హెచ్‌ఆర్‌కి సమర్పించాలి. ఆదాయపు పన్నులో ఈ ఇంటి అద్దెకు పన్ను మినహాయింపు ఉంది. HRకి సమర్పించకుంటే, పన్ను కట్‌ అవుతుంది. ఐటీ రిటర్న్‌ల దాఖలుతో పాటు అద్దె రసీదులను అప్‌లోడ్ చేయవచ్చు. తీసివేయబడిన పన్ను తిరిగి చెల్లింపు ఉంటుంది.

నకిలీ అద్దె రసీదుని ఎలా గుర్తించాలి?

అద్దె సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, వారు తమ ఇంటి యజమాని పాన్ నంబర్‌ను అందించాలి. ఈ విధంగా మీ ఇంటి అద్దె చెల్లింపు ఏఐఎస్‌ లేదా వార్షిక సమాచార ప్రకటన అనే డాక్యుమెంట్‌లో నమోదు చేస్తారు.

మీరు ఎక్కువ ఇంటి అద్దెను చూపించి, అద్దె రసీదును రూపొందించి, ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు అందించారని అనుకుందాం. అప్పుడు దాని సమాచారం, ఏఐఎస్‌లోని సమాచారం మధ్య వ్యత్యాసం హైలైట్ అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ అమలు చేస్తున్న AI సాంకేతికత ఈ వ్యత్యాసాన్ని గుర్తించగలదు. అప్పుడు మీకు ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. అయితే, రూ. 1 లక్ష వరకు ఇంటి అద్దెకు మీరు యజమాని యొక్క పాన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ కూడా పత్రాలను సరిచూసుకునే విధంగా ఉండదు. అయితే ఏడాదికి లక్ష రూపాయలకు మించి అద్దె చెల్లించినప్పుడే అది శాఖ దృష్టికి వస్తుంది.

మందార పువ్వులతో అందం రెట్టింపు.. ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి మెరుపుఖాయం..!

ప్రతి ఒక్కరూ పువ్వులను ఇష్టపడతారు. పూలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పూలు చర్మ సౌందర్యాన్ని సైతం మెరుగుపరుస్తాయి. పూలను రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.

అందులో మందారం జుట్టు రాలడాన్ని ఆపడానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. మందారంలో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేసవిలో చర్మానికి ఎన్నో లభాలను చేకూర్చుతాయి. ముఖం తెల్లగా, అందంగా మెరిసేలా చేస్తుంది.

మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో చర్మం మెరుస్తుంది. మందార పువ్వును బాగా ఎండబెట్టి పొడిగా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోండి.

ముల్తానీ పేస్ట్‌తో ఎర్రని మందార పూలను రుబ్బి, పెరుగు వేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది. మీరు నిద్రపోయే ముందు ఇలా చేయడం ఉత్తమం. ముఖంపై ఉన్న మురికిని తొలగించి ముఖం తెల్లగా మారాలంటే మందార పొడిని పంచదార, శనగపిండి, పచ్చి పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి.

మందార పువ్వును గ్రైండ్ చేసి అందులో కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి. మీ ముఖం మెరుస్తుంది. టమాటా రసాన్ని మందార పొడిలో వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి. మీ ముఖం మెరిసిపోతుంది.

2 టీస్పూన్ల మందారం పూల పొడిలో సరిపడ పచ్చి పాలు పోసి ఫేస్ ప్యాక్‌ తయారు చేయాలి..దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకుంటే సరి. బాగా ఆరిన మందార పూలా పొడి, గ్రీన్ టీ సమానంగా వేసి ప్రత్యేకమైన టీ తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.

మందారం – అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ కూడా అద్భతం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రాణంలేని నరాలకు జీవం పోసే ‘మ్యాజిక్’ మసాలా! వంటింటి పోపుల పెట్టెలో దాగివున్న దివ్యౌషధం..

మీరు నరాల సమస్యల నుండి బయటపడటానికి స్టార్ సోంపు నీటిని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి ఒక గ్లాసు నీటిలో 1 నుండి 2 స్టార్ సోంపు వేసి, సుమారు 10 నిమిషాలు మరిగించాలి..

ఆ తర్వాత వడకట్టి తేనె వేసుకుని తాగేయాలి.. ఇది నరాల వాపు, బలహీనత నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నరాల బలహీనత నుండి ఉపశమనం పొందడానికి స్టార్ సోంపును పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, మొదట 50 గ్రాముల నుండి 100 గ్రాముల స్టార్ సోంపు తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీ సాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సలాడ్లు, పప్పులు, కూరగాయలు మొదలైన వాటిపై చల్లుకుని వాడుకొవచ్చు.

నరాల సమస్యల నుండి బయటపడటానికి మీరు తేనెతో పాటు స్టార్ సోంపును ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి, 1 చెంచా తేనెను తీసుకుని అందులో స్టార్ సోంపు పొడిని కలిపి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది. శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు..స్టార్ సోంపు టీతో జలుబు, ఫ్లూ, గొంతునొప్పి అన్నింటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు, స్టార్ సోంపులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి సహజంగా విషాన్ని తొలగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఇది గొంతుకు సంక్రమించే సూక్ష్మక్రిములను తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను చూపించింది.

చచ్చుబడిపోయిన నరాలకు ప్రాణం పోయడానికి స్టార్ సోంపును ఉపయోగించడం చాలా ఆరోగ్యకరమైనది. అయితే, సమస్య మరింత తీవ్రంగా ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

 

క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి సమస్యలున్న వారికి దివ్యౌషధం..!

క్రాన్‌బెర్రీస్ చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో కాస్త వగరుగా, పులుపుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి.

క్రాన్‌బెర్రీస్ హీథర్ కుటుంబానికి చెందినవి.. బ్లూబెర్రీస్, లింగన్‌బెర్రీలకు సంబంధించినవి.ఫైటో-న్యూట్రీయంట్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆల్‌రౌండ్ వెల్‌నెస్‌కు ఎంతో అవసరం అంటున్నారు ఆరోగ్ నిపుణులు. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మానికి నిర్మాణం, స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్. దృఢమైన, మృదువుగా ఉండే చర్మాన్ని నిర్వహించడానికి తగినంత కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం.

క్రాన్ బెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మంచిది. ఎరుపు రంగు క్రాన్బెర్రీ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. క్రాన్‌బెర్రీ మొటిమలను నివారించడంలో, మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. క్రాన్‌బెర్రీస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మానికి నిర్మాణం, స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్. దృఢమైన, మృదువుగా ఉండే చర్మాన్ని నిర్వహించడానికి తగినంత కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం. కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచడం ద్వారా, క్రాన్బెర్రీస్ చర్మం స్థితిస్థాపకత, మృదువైన ఛాయకు దోహదం చేస్తాయి.

క్రాన్బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి. ఇవి దంతాల కావిటీస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. ఎండిన క్రాన్బెర్రీస్ చాలా విటమిన్లను కలిగి ఉంటాయి. అవి కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. క్రాన్‌బెర్రీలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పలువురు ఆరోగ్య నిపుణులు.

క్రాన్‌బెర్రీస్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. హైడ్రేటెడ్ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. క్రాన్బెర్రీస్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మొటిమలు, విరేచనాలను నిరోధించడంలో సహాయపడతాయి. చర్మం ఉపరితలంపై ఉండే బాక్టీరియా చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో మొటిమలకు దారి తీస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే క్రాన్ బెర్రీ సీడ్ ఆయిల్ ను నేరుగా చర్మానికి అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి, ఫైన్ లైన్లను తగ్గించడానికి, సహజమైన మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.. మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది..!

గ్యాస్‌ స్టౌవ్‌ వాడే ముందు.. గ్యాస్ బర్నర్‌ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే, పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్‌లో గ్యాస్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

కనీసం రెండు వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవటం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే…నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుందని మీకు తెలుసా? అవును… వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై ఉంచినట్లయితే, డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది. చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్‎పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా గ్యాస్‌ను వృధా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్‌ ఆదా అవుతుంది. చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ ను వాడకపోవడమే మంచిది. అలా వాడటం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా

ల్కి హిట్ అయిన ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్‌కు చాలా కంప్లయింట్స్‌ ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేసిన ఒకటి రెండు ఈవెంట్స్‌ తప్ప ఈ కోసం డార్లింగ్ అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయలేదు.
ఇప్పుడు మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారా అన్న డౌట్స్ రెయిజ్‌ అవుతున్నాయి.ప్రభాస్‌ పెద్దగా బయటకు రాకపోయినా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి” వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది.

ప్రభాస్‌ పెద్దగా బయటకు రాకపోయినా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ అన్నిసార్లు ఇలాగే అవుతుందన్న గ్యారెంటీ లేదు. సక్సెస్‌ విషయంలో ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా స్టార్స్‌… ఆడియన్స్ ముందుకు వస్తేనే మీద బజ్‌ క్రియేట్ అవుతుంది. ఈ విషయాన్ని అందరు హీరోలు లైట్‌ తీసుకుంటున్నారు.

దేవర రిలీజ్ డేట్‌ లాక్ అయ్యింది. ఆల్రెడీ టీజర్‌తో పాటు ఓ సాంగ్‌ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఆ బజ్‌ను కంటిన్యూ చేయటంలో మాత్రం మేకర్స్ వెనకబడ్డారు. ఇప్పటి వరకు కు సంబంధించి తారక్ సైడ్ నుంచి ఒక్క అప్‌డేట్‌ కూడా లేదు. దీంతో కనీసం ఒక్క ప్రెస్‌మీట్‌లో అయినా ఎన్టీఆర్‌ కనిపిస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్‌.

రామ్‌ చరణ్ పరిస్థితైతే మరింత విచిత్రంగా ఉంది. చరణ్ నెక్ట్స్‌ మూవీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందన్న విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. దీంతో షూటింగ్స్, పర్సనల్‌ ట్రిప్స్‌ తప్ప మీడియాతో, ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడమే మానేశారు చరణ్‌. గేమ్ చేంజర్‌ రిలీజ్ డేట్‌ విషయంలో క్లారిటీ వస్తే తప్ప చరణ్ ఆడియన్స్‌తో టచ్‌లోకి వచ్చే పరిస్థితి లేదు.

ప్రభాస్‌ విషయంలో పెద్దగా ప్రమోషన్స్‌ చేయకపోయినా కల్కి సక్సెస్ అయ్యింది. కానీ అందరు హీరోలకు అలా వర్క్ అవుట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ఎన్టీఆర్‌, చరణ్ కాస్త ఆడియన్స్‌తో టచ్‌లో ఉంటే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

4: 28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌. వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌లు ప్రారంభమైన ఈ ఫోన్‌ అమ్మకాలు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్‌4 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 1,240×2,772 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14.1తో పనిచే్సతసుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ పూర్తి ఛార్జ్‌ కావడానికి కేవలం 28 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాతో 4కే వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు.

ధర విషయానికొస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.32,999, 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.35,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి

ప్రపంచంలో 15 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. మందులతో పాటు థైరాయిడ్ సమస్యల కోసం మీరు ఆధారపడే 7 పానీయాలు ఉన్నాయి.

వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి. ఈ పానీయంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉన్నాయి. అంతేకాకుండా, పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం ఈ పానీయం పోషక విలువలను పెంచుతుంది. థైరాయిడ్ సమస్యలకు ఈ పానీయం చాలా ఉపయోగపడుతుంది.

ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఆల్కాలీన్ స్వభావం కలిగిన ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ స్రావాన్ని కూడా నియంత్రిస్తుంది.

రోజువారీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోండి. మజ్జిగ గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపోథైరాయిడిజంలో మంటను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ పానీయంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. బాదం పాలు శరీరంలో మంటను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు బాదం పాలు తాగవచ్చు. స్మూతీస్ కాకుండా, మీరు టీ మరియు కాఫీలో బాదం పాలను తాగవచ్చు.

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఈ పానీయం ఫైటోన్యూట్రియెంట్స్, లైకోపీన్ గొప్ప మూలం. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ డ్రింక్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ చికిత్స కోసం తాజా క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసి తాగండి.

పాలకూర, గరంమసాలా, కొత్తిమీర, పుదీనా ఆకులు వంటి ఆకుపచ్చ కూరగాయలతో చేసిన జ్యూస్‌లను తాగండి. పచ్చి రసంలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయి. మీరు దోసకాయ లేదా నిమ్మరసం తాగవచ్చు.

అశ్వగంధ, శతావరి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ రెండు మూలికలతో చేసిన టీని ఉంచండి. మీరు గ్రీన్ టీ కూడా తాగవచ్చు. మీరు ఖాళీ కడుపుతో హెర్బల్ టీ తాగితే మీరు ప్రయోజనాలను పొందుతారు.

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి అదిరిపోయే వాచ్‌ వచ్చింది.

వాచ్‌ల తయారీకి పెట్టింది పేరైనా టైటాన్‌ కంపెనీ స్మార్ట్‌వాచ్‌ల తయారీలోనూ సత్తా చాటుతోంది. ఓవైపు టాటా సబ్‌ బ్రాండ్‌ అయిన ఫాస్ట్‌ట్రాక్‌ వాచ్‌లను తీసుకొస్తూనే మరోవైపు టైటాన్‌ పేరుతో కూడా స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా టైటాన్‌ సెలెస్టార్‌ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది.

ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 750 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో ఈ వాచ్‌ డిస్‌ప్లే సన్‌లైట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మై ఫిట్‌నెస్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో మీ ఫిట్‌నెస్‌ వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.

ఫిట్‌నెస్‌తో పాటు అన్ని రకాల హెల్త్‌ ఫీచర్లను ఇందులో అందించారు. ఎస్‌పీఓ2, బ్లెడ్ ప్రెజర్‌, స్లీప్‌ ట్రాకింగ్‌తో పాటు మరెన్నో హెల్త్‌ ఫీచర్లను ఈ వాచ్‌లో అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా జీపీఎస్‌ను అందించారు. స్లీక్‌ అల్యూమినియం బాడీతో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు. ఏఐ డ్యాష్‌బోర్డ్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. బ్యాటరీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ఇక ధర విషయానికొస్తే టైటాన్‌ సెలెస్టర్‌ ధర రూ. 9,995గా నిర్ణయించారు. ఈ వాచ్‌ను బ్లాక్‌ ఎక్లిప్స్‌, అరోరా బ్లూ, మూన్‌ లైట్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.టైటాన్‌ షోరూమ్‌తో పాటు, అమెజాన్‌ వేదికగా ఈ వాచ్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈవీ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఆ విషయాలు తెలుసుకోకపోతే ఇక అంతే..!

భారతదేశంలో పెట్రోలు స్కూటర్లు గత కొంతకాలంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్‌లో తమ హవాను చూపుతున్నాయి. ముఖ్యంగా తక్కువ నిర్వహణ కారణంగా ఈవీ స్కూటర్లకు ఫ్యాన్స్ బాగా పెరిగారు. అయితే కొత్తగా స్కూటర్ కొనాలి? అని అనుకునే వారికి పెట్రోల్, ఈవీ రెండు స్కూటర్లలో ఏది కొనాలనే అనుమానం బాగా ఉంటుంది.  అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలనే ఉద్దేశంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పరిగణించాల్సి అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రయాణించే దూరం

ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు రోజూ మనం దూరం ప్రయాణం చేస్తామనే అంశంపై ఓ క్లారిటీ ఉంటారు. ఈవీ స్కూటర్ కచ్చితంగా బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. అందువల్ల చార్జింగ్ అనేది కీలకంగా మారుతుంది. మన ప్రయాణ దూరం బట్టి బ్యాటరీ నిర్వహణ ఉండాలి. పెట్రోల్-ఆధారిత స్కూటర్లతో ఈ సమస్య ఉండదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీలు మంచి ఎంపిక కాదని నిపుణులు వివరిస్తున్నారు.

చార్జింగ్

ఈవీ స్కూటర్లకు ప్రధాన సమస్య చార్జింగ్. అనుకోని సందర్బంలో స్కూటర్ చార్జ్ అయిపోతే తిరిగి చార్జ్ చేయడం పెద్ద ప్రహసనంగా ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ బంకులు ఉన్నంత సంఖ్యలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. అందువల్ల ఈవీ ప్రయాణంలో చార్జింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

రోజువారీ నిర్వహణ  

మీరు వాహనంపై తక్కువ ఎక్కువసార్లు తిరగాల్సి వస్తే నిర్వహణపరంగా ఈవీ స్కూటర్లే బెస్ట్. ఎందుకంటే తరచూ పెట్రోల్ కోసం డబ్బు పెట్టాల్సి అవసరం ఉండదు. తద్వారా నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది.

స్కూటర్ నిర్వహణ

పెట్రోలుతో నడిచే స్కూటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్పులతో పాటు ఎయిర్ ఫిల్టర్ మార్పులు వంటి సాధారణ నిర్వహణ అవసరం. ఎలక్ట్రిక్ స్కూటర్లకు చాలా తక్కువ నిర్వహణ అవసరమవుతుంది. బ్రేక్ ప్యాడ్లు సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువ సేపు ఉంటాయి. ఎందుకంటే అవి బ్రేక్ రీజెనరేషన్ ను ఉపయోగిస్తాయి.

పర్యావరణం

ఈవీ స్కూటర్లు పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ స్కూటర్ల ద్వారా అస్సలు ఉండదు. అందువల్ల చాలా మంది పర్యావరణ ప్రియులు ఏళ్ళుగా ఈవీ స్కూటర్లనే వాడుతున్నారు.

Health

సినిమా