Saturday, November 16, 2024

ఆ మహీంద్రా కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.2.2 లక్షల వరకూ తగ్గింపు

భారతదేశంలో మహీంద్రా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల మహీంద్రా కార్లు అమ్మకాల్లో ఎప్పకప్పుడు రికార్డులను సెట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మోడల్స్ కార్లపై ఇటీవల మహీంద్రా కంపెనీ ఆఫర్లను ఇస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు రిలీజ్ చేసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మహీంద్రా & మహీంద్రా ఆ కారుపై రూ. 2.2 లక్షల వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. అయితే ఈ  తగ్గింపు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రేంజ్ టాపింగ్ ఏఎక్స్-7 వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మహీంద్రా ఏఎక్స్-7  శ్రేణి రూ. 21.44 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమైంది. ఇప్పుడు తగ్గింపుతో ఈ కారు ధర రూ. 19.69 లక్షలకు లభిస్తుంది. టాప్- స్పెక్స్‌తో వచ్చే ఏఎక్స్-7 లగ్జరీ ఏడబ్ల్యూడీ వేరియంట్ తగ్గింపు ధరతో రూ. 24.99 లక్షలు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

తాజాగా తగ్గింపులతో బెంగళూరులో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్-ఆఫ్-ది-లైన్ ఏఎక్స్-7 ఏడబ్ల్యూడీ డీజిల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 31.5 లక్షలుగా ఉంటే ఢిల్లీలో మైక్రో ఎస్‌యూవీ ధర 29.62గా ఉంది. ముంబైలో రూ.30.2 లక్షలు, చెన్నైలో రూ.31.5 లక్షలు, హైదరాబాద్‌లో ఈ ఎస్‌యూవీ తగ్గింపుల అనంతరం రూ.31 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే కోల్‌కత్తాలో రూ.27.87 లక్షలు, లక్నోలో 28.97 లక్షలు, జైపూర్లో రూ.29.92 లక్షలు, అహ్మదాబాద్‌లో రూ.28 లక్షలు, ఇండోర్‌లో రూ.30.87 లక్షలుగా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే టాప్-ఆఫ్-లైన్ ఏఎక్స్7 మోడల్ లెవెల్-1 ఏడీఏఎస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ట్విన్ డిజిటల్ స్క్రీన్లు, పనోరమిక్ సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

వెంటిలేటెడ్ సీట్లు, ఏడు ఎయిర్‌బ్యాగ్లు, లెథెరెట్ సీట్ అష్టోల్బరీ, 12 స్పీకర్లతో 3డీ సౌండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ 200 హెచ్‌పీ శక్తిని, 380ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. గేర్బాక్స్ ఎంపికల విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. మరో ఇంజిన్ విషయానికి వస్తే 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది రెండు స్టేట్స్ ఆఫ్ ట్యూన్‌తో వస్తుంది. పెట్రోల్ మాదిరిగానే, డీజిల్ ఇంజన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది.

నెలకు రూ. 500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ. 4.12 లక్షలు.. ఎలాగంటే

మీరు డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి అవసరం. ఏయే రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి లాభాలు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు..? ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి, దానిని సురక్షితంగా ఉంచినట్లయితే, వచ్చే ఆదాయం మరింతగా పెరుగుతుంది.

ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో ఇటువంటి అనేక పథకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో మీరు రూ. 500 కంటే తక్కువ పెట్టుబడిని ప్రారంభించి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న మొత్తంతో ప్రారంభించండి, ఆపై మీ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచుకోండి. డబ్బు సంపాదించడానికి ఇదే మార్గం. మీరు రూ. 500 లోపు పెట్టుబడిని ప్రారంభించగల పోస్టాఫీసులో ఉన్న కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.

పీపీఎఫ్‌:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అనేది దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత మరో 5 సంవత్సరాల మెచ్యూరిటీని పొడిగించవచ్చు. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఏటా రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. 5-5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, అదే 25 ఏళ్లలో రూ.4,12,321 జోడించవచ్చు.

సుకన్య సమృద్ది యోజన:

మీరు మీ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో ఏటా కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దానిపై 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. మీరు ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 21 సంవత్సరాల తర్వాత పథకం మెచ్యూర్ అవుతుంది. ఇందులో నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ.90,000 ఇన్వెస్ట్ చేస్తే 8.2 శాతం వడ్డీతో 21 ఏళ్ల తర్వాత రూ.2,77,103 పొందుతారు.

రికరింగ్‌ డిపాజిట్‌:

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. అనేది పిగ్గీ బ్యాంక్ లాంటిది. దీనిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం చిన్న పెట్టుబడిదారులకు వారి భవిష్యత్ అవసరాలను తీర్చడానికి కార్పస్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 100తో కూడా ప్రారంభించవచ్చు. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లపాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 6.7%. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే, మీరు 5 సంవత్సరాలలో రూ. 30,000, ఐదు సంవత్సరాల తర్వాత మీకు 6.7 శాతం చొప్పున రూ. 35,681 అంటే వడ్డీగా రూ. 5,681 పొందుతారు.

సన్‌రూఫ్‌ కారులో తల బయట పెట్టడం నేరం.. మరెందకు ఇచ్చారనేగా.?

సన్‌రూఫ్‌ కారులో నుంచి తల బయటపెట్టడం, ఆ ఫొటోలను.. వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్‌. సన్‌రూఫ్‌ కార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. చాలా మంది కేవలం ఇలాంటి వీడియోలు, ఫొటోల కోసమే సన్‌రూఫ్‌ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా తల బయటపెట్టడం నేరమని మీలో ఎంత మందికి తెలుసు. సన్‌రూఫ్‌ పై నుంచి బయటకు వస్తే ట్రాఫిన్‌ పోలీసులు చలానా విధిస్తారని మీకు తెలుసా.? అలాంటప్పుడు అసలు కారుకు సన్‌రూఫ్‌ ఎందుకు ఇస్తారనేగా మీ సందేహం. అయితే దీని వెనకాల ఉన్న అసలు కారణం వేరే ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో సన్‌రూఫ్‌ కార్ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని టాప్‌ వేరియంట్స్‌లో ఈ ఫీచర్‌ కామన్‌గా మారింది. కొన్ని లగ్జరీ కార్లలో అయితే వాయిస్‌ కమాండ్‌ ఆధారంగా సన్‌రూఫ్‌ను ఓపెన్‌, క్లోజ్‌ చేసుకునే అవకాశం సైతం కల్పించారు. కొంతమంది కారుతో రాకపోయినా ప్రత్యేకంగా మాడిఫికేషన్‌ చేయించుకొని మరీ వీటిని ఏర్పాటు చేస్తుకుంటున్నారు. అయితే సన్‌రూఫ్‌ చట్ట విరుద్దమైనప్పటికీ కార్ల తయారీ సంస్థలు వీటిని ఎందుకు ఇస్తాయనే సందేహం రావడం కామన్‌.

అయితే సన్‌రూఫ్‌ అనేది కేవలం కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు అనుసరిస్తోన్న ఒక స్ట్రాటజీ మాత్రమే. దీనికి ప్రత్యేకమైన ఉపయోగం అంటూ ఏం లేదు. అయితే కారు ఆగు ఉన్న సమయంలో తల బయటకు పెడితే ఎలాంటి నేరం ఉండదు కానీ, ప్రయాణిస్తున్న సమయంలో తల బయటికి పెడితే మాత్రం జరిమానా చెల్లించాల్సిందే. అయితే కారులోకి నేరుగా సూర్యరశ్మిని అందించడానికి సన్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. అలాగే సహజంగా గాలి రావాలనుకుంటే ఉపయోగించడానికి మాత్రమే సన్‌రూఫ్‌ను ఇచ్చారు. కాబట్టి కార్లకు సన్‌రూఫ్‌ ఇవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం తల బయట పెట్టడం కాదు. ఇలా చేయడాన్ని పోలీసులు ప్రమాదకరమైన స్టంట్‌గా పరిగణించి, ఫైన్‌ వేస్తారు.

 

ఏపీ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్.. ఇకపై ఆ మూడు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగవు.!

ఏపీ ప్రజలకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇప్పటిదాకా ఉన్న స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఆ రైళ్లు ఏంటి.? ఎప్పటి నుంచి ఈ ఆదేశాలకు అమలులోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ నుంచి వయా మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు మీదుగా నడిచే నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జూలై 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా సమయంలో ఆయా స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లను నిలపకూడదని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు.

ఇక అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులతో చర్చలు జరిపి.. ఏడాది క్రితం ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆయా స్టేషన్లను స్టాప్‌లుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏడాది పాటు ఈ రైళ్లను ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు ఇవ్వగా.. ఆ సమయం ఈ నెల 19న ముగియనుంది. అలాగే జూలై 19 నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు ఐఆర్‌టీసీ మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లకు రిజర్వేషన్లు నిలిపివేసింది. అటు విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేశారు.

 

కియా మోడల్ కార్లలో సాంకేతిక లోపం.. రీకాల్ ప్రకటించిన కంపెనీ..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ 1138 ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కియా ఇండియా ఆటోమొబైల్ కంపెనీ స్వచ్చందంగా రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. కియా ఈవీ6 మోడల్ కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సంభావ్య లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీని వల్ల 12 వోల్ట్స్ ఆగ్జిలరీ బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుందని అందుకే రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రీకాల్ కి సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని.. త్వరలోనే లోపం ఉన్న వాహనాల యజమానులను సంప్రదిస్తామని కియా కంపెనీ తెలిపింది. సంప్రదించిన తర్వాత అపాయింట్మెంట్ షెడ్యూల్ కోసం వాహన యజమానులు కియా డీలర్స్ ని సంప్రదించాల్సి వస్తుందని కంపెనీ వెల్లడించింది.

గత నెలలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ కూడా ఐయోనిక్ 5 మోడల్స్ పై రీకాల్ ప్రకటించింది. అందులో కూడా కియా మోటార్స్ లానే ఐసీసీయూలో లోపం ఉంది. తాజాగా కియా కంపెనీ కూడా ఈవీ6 ఎలక్ట్రిక్ వాహనాలపై రీకాల్ ప్రకటించింది. 1138 కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన ఈవీ6 మోడల్ కార్లలో మాత్రమే ఈ లోపం తలెత్తే అవకాశం ఉందని.. అందుకే వాటిని మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఆ లోపాన్ని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నామని.. అందుకోసం సాఫ్ట్ వేర్ ని అప్డేట్ చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే దీని కోసం కస్టమర్లు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉచితంగానే లోపాన్ని సరిచేసి ఇస్తామని.. చేసే ముందు కష్టమర్ కి సందేశాన్ని పంపిస్తామని పేర్కొంది.

ఇక కియా ఈవీ6 విషయానికొస్తే.. 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ మోటార్ రేర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ రెండు వెర్షన్స్ తో వస్తుంది. సింగిల్ మోటార్ వెర్షన్ 229 హార్స్ పవర్, 350 ఎన్ఎం టార్క్ తో రాగా.. డ్యూయల్ మోటార్ వెర్షన్ 325 హార్స్ పవర్, 605 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం ఈ కియా ఈవీ6 కారు 708 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. ఇది బీఎండబ్ల్యూ ఐఎక్స్1, వోల్వో ఎక్స్సీ 40 రీఛార్జ్, వోల్వో సీ40 రీఛార్జ్, కొత్తగా లాంఛ్ అయిన మెర్సిడిస్ ఈక్యూఏ వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీలతో పోటీ పడుతుంది.అంతేకాదు సొంత దేశమైన సౌత్ కొరియాకి చెందిన హ్యుందాయ్ అయోనిక్ 5తో కూడా పోటీ పడుతుంది. ఇక దీని ఎక్స్ షోరూం ధర రూ. 64.11 లక్షల నుంచి రూ. 69.35 లక్షల మధ్యలో ఉంది.

పెద్ద పెద్ద సినిమాలు ఎడిట్ చేసే సాఫ్ట్‌వేర్.. మీ వీడియోస్ కోసం ఫ్రీగా వాడుకోవచ్చు!

ఈ మధ్య కాలంలో వీడియోలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ లో వీడియోలు ఎడిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. పోనీ సిస్టంలో ఎడిటింగ్ చేద్దామంటే ఫ్రీగా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లు ఉండవు. డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో వంటి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లు కొనాలంటే ముప్పై వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రీమియర్ ప్రో సాఫ్ట్ వేర్ కైతే నెల నెలా కనీసం రెండు మూడు వేలైనా పెట్టాల్సిందే. అయితే ఈ సాఫ్ట్ వేర్స్ ని మించిన తోపు సాఫ్ట్ వేర్ ని మీరు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ని పెద్ద పెద్ద సినిమాలను ఎడిటింగ్ చేసేందుకు వాడతారు. హాలీవుడ్ లో చాలా సినిమాలను ఈ సాఫ్ట్ వేర్ తోనే ఎడిటింగ్ చేస్తారు. కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. మీ వీడియోలు ప్రొఫెషనల్ గా రావాలంటే కనుక ఈ సాఫ్ట్ వేర్ ని ట్రై చేయాల్సిందే.

డావిన్సీ రిజాల్వ్:

దాని పేరు డావిన్సీ రిజాల్వ్. ప్రస్తుతం మార్కెట్లో డావిన్సీ రిజాల్వ్ 19 వెర్షన్ నడుస్తోంది. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ట్రాన్సిషన్స్, ఆడియో ట్రాన్సిషన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఫిల్మ్ ఎఫెక్ట్స్, గ్రీన్ స్క్రీన్ కీయింగ్ వంటివి చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని వాడడం చాలా సులువు. వీడియో ఎక్స్ పోర్ట్ అవ్వడం కూడా ఫాస్ట్ గా అవుతుంది. మీ కంప్యూటర్ మంచి కాన్ఫిగరేషన్ ఉంటే కనుక మీకు ఇది బాగా సూట్ అవుతుంది. మీరు యాపిల్ మ్యాక్ సిస్టం లేదా మ్యాక్ ల్యాప్ టాప్ వాడుతున్నట్లైతే కనుక ఈ డావిన్సీ సాఫ్ట్ వేర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

సిస్టం రిక్వైర్మెంట్స్:

విండోస్:

విండోస్ సిస్టం వాడుతున్నట్లైతే కనుక కనీసం 2 జీబీ గ్రాఫిక్ కార్డు, 16 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఏఎండీ రైజన్ 7 ప్రాసెసర్ ఉండాలి. అలానే ఎస్ఎస్డీ హార్డ్ డ్రైవ్ ఉండాలి. స్టోరేజ్ స్పేస్ 250 జీబీ నుంచి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

మ్యాక్:

పిక్సెల్ లేదా ఆ తరువాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. 8 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఎం1 చిప్ లేదా అంతకంటే ఎక్కువ ప్రాసెసర్ ఉండాలి. కనీసం 2 జీబీ గ్రాఫిక్ కార్డు ఉండాలి.

లైనక్స్:

సెంట్ ఓఎస్ 7.3 ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. 32 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఏఎండీ రైజన్ 7 ప్రాసెసర్ ఉండాలి.

హెచ్డీ వీడియోలు ఎడిటింగ్ చేసేందుకు అయితే 16 జీబీ ర్యామ్ సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక 4కే, 8కే రిజల్యూషన్ వీడియోలు ఎడిటింగ్ చేస్తే కనుక మీ కంప్యూటర్ లేదా మ్యాక్ సిస్టంకి 32 జీబీ నుంచి 64 జీబీ ర్యామ్ అయితే ఖచ్చితంగా ఉండాలి.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?:

వెబ్ బ్రౌజర్ లో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ డాట్ కామ్ (blackmagicdesign.com)అని టైప్ చేయాలి. లేదా డావిన్సీ రిజాల్వ్ (DaVinci Resolve) అని టైప్ చేస్తే స్టార్టింగ్ లోనే మీకు ఒక వెబ్ సైట్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి లోపలకు వెళ్ళాలి. లోపలకు వెళ్ళగానే ఒక వీడియో ప్లే అవుతుంది. దాని కింద ఫ్రీ డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నాలుగు రకాల సాఫ్ట్ వేర్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని బట్టి.. మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంని బట్టి ఎంచుకోవాలి. ఒక అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. రిజిస్టర్ అండ్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీగా వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు.

JIO, AIRTEL రేట్లు పెంచినా.. ప్రజలు BSNLకి మారకపోవడానికి కారణం? ఇదే సమస్య!

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత.. ఇంటర్నెట్‌ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు డేటా కోసం రీఛార్జ్‌ చేసుకోవాలంటే.. భారీ ఎత్తున చెల్లించాలి. అయితే ఎప్పుడైతే జియో రంగంలోకి దిగిందో.. అప్పటి వరకు టెలికాం రంగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌.. జియో దెబ్బకు దిగి వచ్చింది. అంబానీ టెలికాం రంగంలోకి అడుగుపెడుతూనే.. చాలా తక్కువ ధరకే.. ఇంకా చెప్పాలంటే.. ఉచితంగా  అపరిమిత డేటా, కాలింగ్‌ ప్యాక్‌లను తీసుకువచ్చింది. దాంతో అప్పటి వరకు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ వాడిన వారు.. జియోకు మారారు. భారీ ఎత్తున కస్టమర్లకు జియోకు వలస వెళ్లారు. ఈ దెబ్బతో ఎయిర్‌టెల్‌, మిగతా కంపెనీలు దిగి రాక తప్పలేదు. అవి కూడా రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్నాయి.

ఇక జియో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ నెల వరకు అనగా జూలై 3, 2024 వరకు కూడా అన్ని టెలికాం కంపెనీలు ఒకే ధరకు రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అమలు చేశాయి. కానీ జూలై 4 నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను భారీగా పెంచుతూ.. జియో నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ పయనించాయి. ఒక్కో ప్లాన్‌ మీద 12-25 శాతం వరకు పెంచాయి. ఈ నిర్ణయం వల్ల ప్రతి కంపెనీ కోట్ల రూపాయల్లో లాభం పొందబోతున్నాయి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. టెలికాం రంగంలో భారీ ఎత్తున పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో.. అందరి చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ మీదకు మళ్లింది. ఎందుకంటే.. జియో, ఎయిర్‌టెల్‌ వంటి కంపెనీలు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచినా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం రేట్లను పెంచలేదు. పైగా మిగతా కంపెనీల కన్నా.. చాలా తక్కువ ధరకు.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్‌ను అందిస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్‌.

అతి తక్కువ ధరకే ప్లాన్స్‌..

వంద రూపాయల లోపు.. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ ఇతర ఏ టెలికాం కంపెనీలో అందుబాటులో లేవు ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌లో తప్ప. దీనిలో ఉన్న 94 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. పైగా ఉచిత కాలింగ్‌, డేటా అందిస్తుంది. అలానే ఏడాది పాటు వ్యాలిడిటీ కలిగి ఉన్న ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 1999లకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 600 జీబీ డేటాను, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలు కల్పిస్తోంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌లో రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్‌.. అది కూడా ఏడాది వ్యాలిడిటీ ఉండే ప్యాక్‌ ధర 2395 రూపాయలు ఉండగా.. ఇదే ప్లాన్‌ ఎయిర్‌టెల్‌లో 3599 రూపాయలు తీసుకుంటుంది. మిగతా వాటితో పోలిస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో చాలా తక్కువ ధరకే మంచి ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రధాన లోపం ఇదే..

అయితే జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌లు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను ఎంత భారీగా పెంచిన.. జనాలు ఎందుకు వాటికే అతుక్కుపోతున్నారు.. తక్కువ ధరకే ప్లాన్స్‌ అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎందుకు మారడం లేదు అంటే.. ముఖ్య కారణం.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో డేటా సర్వీసులు చాలా స్లోగా ఉంటాయి. జియో రావడం రావడమే ఉచితంగా 4జీ డేటాను ఇవ్వగా.. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 2జీ దగ్గర తచ్చాడుతుంది. ప్రస్తుతం మిగతా కంపెనీలు అన్ని.. 5జీ సర్వీసులు దిశగా పరుగులు తీస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా 3జీ డేటా దగ్గరే ఉంది. అయితే 2025 నాటికి 5జీకి అప్‌గ్రేడ్‌ అవుతుందని చెప్పుకొస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకుంటే.. కనెక్టీవిటీకి ఢోకా ఉండదు కానీ.. డేటా విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు అందుబాటులోకి తేవడమే కాక.. 6జీ దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయానికి వస్తే.. దీనిలో 5జీ అనేది ఇప్పట్లో సాకారం కాదు.. ఇప్పుడిప్పుడే 4జీకి అప్‌గ్రేడ్‌ అవుతుంది. అయితే 2025 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ అప్‌గ్రేడ్‌ అవుతామని చెబుతుంది. అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌.. టీసీఎస్‌తో జత కట్టింది. దేశమంతటా 1000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అయితే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ పుంజుకుంటుందని.. అది జియో, ఎయిర్‌టెల్‌కు భారీ షాకే అని అంటున్నారు.

నెలకు లక్షన్నర జీతంతో Bank జాబ్స్.. ఇంకొన్ని రోజులే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

బ్యాంక్ జాబ్స్ కోసం యువత ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బ్యాంక్ ఉద్యోగాలకు కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. ఇటీవల వేల సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఇటీవల ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలను అందుకోవచ్చు. ఈ జాబ్స్ కు అప్లై చేసుకునేందుకు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 195 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాబ్స్ ను నియమించుకోనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 195

పోస్టులు వివరాలు:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్.

విభాగాలు:

  • ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్
  • ఫారెక్స్ అండ్ ట్రెజరీ
  • ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ
  • క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

అర్హత:

  • అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 64 వేల నుంచి లక్షన్నర వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. ఇతరులకు రూ. 1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్ మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం:

  • 11-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 26-07-2024

చంద్రునిపై గుహ కనుగొన్న శాస్త్రవేత్తలు.. మనుషులు కూడా ఉండవచ్చట!

దశాబ్ద కాలం నుంచి చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు అనేవి ప్రారంభమైయ్యాయి. అయితే ఈ ప్రయోగాల్లో భాగంగానే ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి పోటత పొడుతున్నాయి. ఇకపోతే వాటిలో అమెరికా, చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు చంద్రుడిపై ఇప్పటికి ఎన్నో ప్రయోగాలు చేస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై అనేక శాటిలైట్లను పంపిస్తున్నారు. అలాగే జాబిల్లిపై మానవులు జీవిస్తారా.. అందుకు అనువైన వాతావరణం ఉందా. అక్కడి పరిస్థితులు ఏంటి ఇళ్లు, రోడ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చా అనే విషయాలను పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడ మట్టి, వాయువులు, ఖనిజాలు సేకరించి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రునిపై భూగర్భ గుహను కనుగొన్నారు. పైగా ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. మరి, ఆ వివరాళ్లేంటో చూద్దాం.

ఇప్పటి వరకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలైనా అమెరికా, చైనా రష్యా వంటి దేశాలు చంద్రుడిపై ఎన్న పరిశోధనలు చేస్తున్నాయి. ఎందుకంటే.. భవిష్యత్తులో జాబిల్లి పై మానవులు నివాసానికి అనుకూలమైన వాతవరణం ఉంటుదా అనే విషయాలను తెలుసుకోనేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జాబిల్లి ఎన్నో శాటిలైట్స్ ను పంపిస్తూ.. అక్కడ మట్టి, వాయువులు, ఖనిజాలు సేకరించి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శాస్త్రవేత్తలు చంద్రునిపై భూగర్భ గుహను కనుగొన్నారు. కాగా, ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇక ఈ గుహ చంద్రునిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఉన్న ఒక భారీ గొయ్యి లోపల ఉందని, పైగా ఈ గొయ్యి చంద్రునిపై తెలిసిన లోతైన ప్రాంతమని పేర్కొన్నారు. అలాగే ఇది నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రునిపైకి తీసుకువచ్చిన అంతరిక్ష నౌక అపోలో 11 ల్యాండింగ్ అయిన సైట్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే చంద్రునిపై ఈ గుహను ఇటలీలోని ట్రెంటో యూనివర్సిటీకి చెందిన లోరెంజో బ్రూజోన్, లియోనార్డో క్యారెర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. ఇక వారు తమ పరిశీలనలను సైంటిఫిక్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. ఇందులో శాస్త్రవేత్తలు రాడార్‌ను ఉపయోగించి గొయ్యి తెరవడం ద్వారా లోపలికి వెళ్లేలా చేశారు. కాగా, అందులో మిలియన్ల సంవత్సరాల క్రితం చంద్రుని ఉపరితలం క్రింద ప్రవహించిన లావా కారణంగా.. ఈ  గొయ్యి లోపల గుహ ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ గొయ్యి మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి  అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్స్ ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్!

చదువుకునే వారికి అనేక అవకాశాలు లభిస్తుంటాయి. ఆర్థికంగా వెనుబడిన వారికి వివిధ రకాల స్కాలర్ షిప్ లు అందుబాటులో ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తాయి. కొందరు పరీక్షలు నిర్వహించి.. విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త వచ్చింది. ప్రముఖ టెలీకాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసే దిశగా అడుగులు వేస్తుంది. మరి.. ఎయిర్ టెల్ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే రీఛార్జ్ ధరలు పెంచిన సంగతి తెలిసింది. అంతేకాక తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతి ఎయిర్టెల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది.  ఈ ఫౌండేషన్ బిటెక్ విద్యార్థుల కోసం ఈ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ కి ఎంపికైన వారికి…పలు రకాల బెనిఫిట్స్ అందుతున్నాయి. ఈ స్కాలర్ షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ల్యాప్ టాప్, మెస్ ఫీ వంటి ఇతర అందించనున్నాయి.

భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛారిటీ విభాగమైన ఎయిర్ టెల్ ఫౌండేషన్ తన 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకుంది. ఈ నేపథ్యంలోనే ‘భారతీ ఎయిర్టెల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ స్కాలర్ షిప్ అనేది విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  విద్యార్థులకు ఆర్థిక మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుందని ఫౌండేషన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇందులో ముఖ్యంగా చదువుకనే ప్రాధాన్యత ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాక ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హతలను కూడా తెలిపింది.

సాంకేతికత ఆధారిత బిటెక్ చదువుతున్న యూజీ విద్యార్థులు, టాప్-50 ఎన్ ఐఆర్ఎఫ్ కాలేజీల్లో  ఐదేళ్లు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్  ఈ స్కాలర్ పిష్ ను పొందేందుకు అర్హులు. అదే విధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8.5 లక్షలు కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ కి అర్హులు. ఇక ఈ స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు తమ చదువు పూర్తయ్యేంత వరకు  కాలేజీ ఫీజులో 100 శాతం పొందుతారు. అలానే వారికి ల్యాప్ టాప్, హాస్టల్, మెస్ ఫీజులు కూడా ఈ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సంవత్సరం 250 మంది అర్హులైన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందజేస్తామని భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రతిఏటా ఈ స్కాలర్ షిప్ పొందే విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తామని తెలిపింది. స్కాలర్ షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ bhartifoundation.org/bharti-airtel-scholarship ను సందర్శించండి.

 

సామాన్యులకు షాక్..మళ్లీ పెరిగిన టమోటా ధర.. ఎంతంటే..!

ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఎలా జీవనం సాగించాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే వివిధ నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటికి పోటీగా తామున్నామంటూ..కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి.  ఇటీవల కాలంలో కూరగాయల ధరలను పరిశీలిస్తే..పై పైకి వెళ్తున్నాయే తప్ప నేల వైపు చూడటం లేదు. ముఖ్యంగా టమాట ధర మరోసారి పేద, మధ్యతరగతి వారికి షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా కాస్తా తగ్గుముఖం పట్టిన టమాట ధర..మళ్లీ పెరిగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈమధ్యకాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధర విషయంలో చికెన్‌, మటన్‌తో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం భారీగా టామాటా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. అయితే ఇటీవల కాస్తా తగ్గు ముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో రూ.50 నుంచి రూ.60 కి లభిస్తున్నాయి. ఇక కాస్తా ధర తగ్గిందని సామాన్యులు  సంతోష పడుతున్న వేళ మరోసారి టామాట షాకిచ్చింది.  ఇప్పుడు మరోసారి  రూ.80లకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే గ్రేడ్-ఏ రకం టమాటాలు అయితే రూ.100కు కూడా చేరాయి. వర్షాలకు దెబ్బతినడం, సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో కిలో టమాట రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. మరోవైపు ఇతర కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. టమాటా ధరలు ఒక్కసారిగా దూసుకుపోతుండటంతో.. దాన్ని సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సామాన్యులు, పేద, మధ్య తరగతి జనాలు టమాటా కొనాలంటేనే అమ్మో అంటున్నారు. మళ్లీ గతేడాది పరిస్థితులే వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోలానే ఈ ఏడాది కూడా టమాటా సాగు, దిగుబడి తగ్గడంతో.. ధరలు పెరిగాయి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలానే ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా రేటుతో పాటు ఇతర కూరగాయాల ధరలు కూడా మండిపోతున్నాయి.

మొత్తంగా పెరిగిన నిత్యవసర వస్తువలకు తోడు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరైతే టామాటలను కొనేందుకు కూడా వెనుకడుకు వేస్తున్నారు. కొన్ని రోజులు టమాటాలను కొనకుండా ఉంటే మేలు అనే భావనలో ఉన్నారు. మొత్తంగా పెరిగిన టామాటా ధరలతో సామాన్యులకు మరోసారి షాక్ తగిలినట్లు అయింది. మరి..టమాటా ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగాలన్ని స్థానికులకే..

ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్న వాదన ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇప్పటి పలు రాష్ట్రాల్లో దీనిపై చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసకుంది. ప్రవేయిట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మేనేజ్ మెంట్ ఉద్యోగాలలో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరిలో 75 శాతం రిజర్వేషన్‌లను తప్పనిసరి చేసింది. ఈ బిల్లు ఐటీ సెక్టార్‌తో సహా మొత్తం ప్రైవేట్ రంగాలకు వర్తిస్తుంది. ఇంతకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందంటే.. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయి.

కన్నడిగులకు ప్రాధ్యాన్యతనిచ్చే విధంగా పరిశ్రమలు, కర్మాగాలతో పాటు ఇతర సంస్థల్లో స్థానికులకు 75 శాతం కోటా బిల్లుకు కర్ణాటక క్యాబినేట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బిల్లు అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు 50శాతం నుంచి 75 శాతం వరకు రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే సీఎం సిద్దరామయ్య కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని, తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారను. అదేవిధంగా రాష్ట్ర వాసులకు ప్రాధాన్యత ఇవ్వని కంపెనీలకు జరిమానాలు కూడా విధించనుంది. బిల్లులో పొందుపరిచిన నిబంధనలను పాటించని కంపెనీలకు రూ. 10 వేల నుండి రూ. 25 వేల వరకు జరిమానా విధించబడుతుంది.

ఇక ఈ బిల్లును గురువారం శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు చుక్కెదురైనట్లే. ఎందుకంటే.. ఇక్కడ ఐటీ కంపెనీల్లో వర్క్ చేసే వారంతా ఎక్కువగా తెలంగాణ, ఏపీ వాసులే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇందులో మరో ట్విస్ట్ ఉంది. ఇక్కడ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే..కొన్నిప్రమాణాలను కూడా బిల్లులో పొందుపరిచారు. కేవలం కన్నడ మాట్లాడితే కన్నడిగ అయిపోరు. ఓ వ్యక్తి రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో నివాసం ఉండి.. రాష్టర్ నోడల్ ఏజెన్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వారినే స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఆయా సంస్థలకు కూడా మినహాయింపులు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. కొన్ని సడలింపులకు అనుమతినిస్తుంది. అన్ని ప్రైవేట్ సంస్థలు గ్రూప్ సి,డి బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం 100 శాతం కన్నడిగులను మాత్రమే నియమించుకోవాల్సి ఉంటుంది.

రూ. 500లకే కిలో మటన్.. ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే..?

ముక్కలేనిదే ముద్ద నోట్లోకి దిగదు మాంసాహారులకు. నిత్యం వండాలే కానీ తిని పెడుతుంటారు. రోజూ తింటున్నా మొహం మొత్తదు నాన్ వెజ్ ప్రియులకు. చికెన్, మటన్ ఎట్ లీస్ట్ ఎగ్ అయినా ఉండాల్సిందే. సోమవారం, శుక్రవారం, శనివారాలు వంటి వారాలు, వర్జ్యాలతో పని లేదు. ఎప్పుడు తినాలనుకుంటే.. అప్పుడు షాపుకు వెళ్లిన తెచ్చుకుని వండుకుని తినడమో, వండించుకోవడమో చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చికెన్, మటన్ వంటి ధరలు పెరిగిపోవడంతో కొని కొనలేక, తిని తినలేకపోతున్నారు నాన్ వెజ్ లవర్స్. కిలో చికెన్ రూ. 300లు పలుకుతుంటే.. మటన్ వెయ్యి రూపాయలకు చేరువైంది. అలాంటిది సగం రేటుకు మటన్ ఇస్తున్నామని ప్రకటన చేస్తే ఊరుకుంటారా.. లగెత్తరూ. అదే జరిగింది ఇక్కడ కూడా.

కడప జిల్లాలోని మైదుకూరులో ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగిన కాంపిటీషన్.. మాంసాహార ప్రియులకు కలిసొచ్చింది. ఒకరి మీద ఒకరు పంతంతో సుమారు వెయ్యి రూపాయలు పలుకుతున్న వేట మాంసాన్ని రూ. 497కు ఇస్తామని ప్రకటించారు. అంతేనా మటన్ కొన్న వారికి ఫ్రీ గిప్ట్ కూడా ప్రకటించారు. మంచి తరుణం మించిపోతే రాదు అనుకున్న ప్రజలు సైతం భారీ ఎత్తున చేరుకుని కొనుగోలు చేశారు. దీంతో ఆ రెండు షాపులు కస్టమర్లతో కిటకిటలాడాయి. పంతానికి పోయి ఇద్దరు వ్యాపారులు చేసిన పనికి.. మటన్ ప్రియులు లాభపడ్డారు. మైదకూరులో మటన్ షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యాపారులకు మాటామాటా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరింది. ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు వారి కొంపకే ఎసరు తెచ్చాయి.

ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తమ వ్యాపారాన్ని కూల్చుకున్నారు. పందానికి పోయి తమ కంటిని తామే పొడుచుకున్నారు. ఓ షాపు యజమాని రూ. 498 కిలో మటన్ అని ప్రకటించడంతో పాటు గిఫ్ట్ ఫ్రీ అని తెలిపాడు. కిలో మటన్‌తో పాటు రెండు చాక్లెట్లు అందించాడు. నువ్వు రూ. 498 పెడితే.. నేను అంతకన్నా తక్కువకే అమ్ముతానంటూ మరో మటన్ షాపు యజమాని రూ. 497కే కిలో మటన్ ఇవ్వడంతో పాటు మాసాల ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన మైదుకూరే కాదు.. చుట్టు పక్కల ఉన్న ప్రజలు సైతం షాపుకు క్యూ కట్టారు. రూ. 500 లోపే కిలో మటన్ రావడంతో కొంత మంది ఎగబడి మరీ.. కిలోల కొద్దీ మటన్ కొనుగోలు చేశారు. ఇక సాయంత్రానికి ఇద్దరి దగ్గర.. మటన్ అయిపోయింది. ఇద్దరి మటన్ షాపు యజమానుల మధ్య గొడవ.. మాంసాహార ప్రియులకు లాభం చేకూర్చినట్లు అయ్యింది.

ఈ అర్హతలుంటే చాలు.. CRPFలో ఉద్యోగాలు రెడీ.. నెలకు 75 వేల జీతం

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలు, బ్యాంక్ జాబ్స్, ఇతర ఉద్యోగాలు వేల సంఖ్యలో భర్తీకానున్నాయి. ఇటీవల పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి కూడా 40 వేలకు పైగా జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం పొందొచ్చు. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మీరు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 31న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 70 ఏళ్లకు మించకూడదు. ఆసక్తి ఉన్న మహిళా, పురుష అభ్యర్థులు పోటీపడొచ్చు.

ముఖ్యమైన సమాచారం:

  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 22

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం అందిస్తారు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 70 ఏళ్లుకు మించకూడదు.

ఇంటర్య్వూ తేదీ:

  • 31-07-2024

వేదిక:

  • హైదరాబాద్, పూణె, శ్రీనగర్, ఇంఫాల్, గుహవటి, గాంధీనగర్ లోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో ఉంటుంది.

యూనియన్ బ్యాంకులో మేనేజర్ భారీ మోసం! ఏకంగా రూ.5 కోట్ల కొట్టేశాడు!

నేటి సమాజంలో ఎవర్ని నమ్మాల్లో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో తెలియకుండా ఉంది. ముఖ్యంగా కొందరు ఈజీగా డబ్బులను సంపాదించేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎంతగానో నమ్మే బ్యాకింగ్ రంగంలో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ, ఆమె భర్తతో కలిసి 200కోట్ల మోసానికి పాల్పడింది. తాజాగా మరో బ్యాంక్ మేనేజర్ కూడా ఖాతాదారులను మోసం చేస్తూ..రూ.5 కోట్లు స్వాహా చేశాడు. ఈఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

నిజామాబాద్ పట్టణంలో అజయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పట్టణంలోని శివాజీ నగర్ లో ఉండే యూనియన్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిమంది ఖాతాదారులకు 8 నెలల క్రితం టర్మ్ లోన్ తో పాటు క్రెడిట్ ఆన్ కరెంటు(సీసీ) రుణాలను కూడా మంజూరు చేశాడు. ఈ క్రమంలోనే 40 మంది అకౌంట్లలో మొదట టర్మ్‌ లోన్‌ కు సంబంధించిన డబ్బులను ఖాతాల్లో జమ చేశాడు. అదే సమయంలో మరో సీసీ రుణం అప్లయ్ చేసేందుకు వినియోదారుల నుంచి అవసమైన బ్యాంకు చెక్కులను, ప్రాపర్టీ డాక్యూమెంట్స్ ను తీసుకున్నాడు. ఆ తరువాత రెండో సీసీ లోన్‌ మంజూరు కాలేదని  ఖాతాదారులను నమ్మించాడు. వారికి మంజురైన లోన్‌ డబ్బు రూ. 5 కోట్లను తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ లావాదేవీలు మొత్తం గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగాయి. అయితే ఇటీవల బ్యాంకు ఉన్నాతాధికారులు తనిఖీలకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఆ బ్యాంకులో రుణాల మంజూరులో, లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వినియోదారులను పిలిచి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో రుణాల స్వాహా వ్యవహారం బయటపడింది. ఈ రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ మంగళవారం రాత్రి పోలీసులను కలిశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు బ్యాంకు మేనేజర్ అజయ్‌ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా  హైదరాబాద్ కు చెందిన ఓ దంపతులు… 200కోట్ల రూపాయాలు మోసం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటన మరువక ముందే..తాజాగా నిజామాబాద్ లో మరో ఘరాన మోసం బయటపడింది.

దేశ బడ్జెట్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? సామాన్యులకు తెలియని నిజాలు!

బడ్జెట్.. ప్రతి ఏడాది వినిపించే పదం. ఇంట్లో ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఓ అంచానా వేసుకుంటుంటారు. దాని ప్రకారం దాదాపు అన్ని అవసరాలను తీర్చుకోవచ్చు. ఇదే విధంగా దేశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందిస్తుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వచ్చే ఆదాయం, వ్యయాలను అంచానా వేసుకుని బడ్జెట్ ను రూపొందించి పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంటారు ఆర్థిక మంత్రులు. మరి దేశ బడ్జెట్ ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఏయే అంశాలపై కేంద్రం దృష్టిపెడుతంది? ఆ వివరాల్లోకి వెళ్తే..

బడ్జెట్:

ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది. జులై 23న ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక ప్రకటన అని పిలువబడుతుంది. కేంద్ర బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచానాల ప్రకటన. బడ్జెట్ ప్రకారంగానే ప్రభుత్వం వివిధ రంగాలపై, సంక్షేమం కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. లోక్ సభలోచర్చల అనంతరం బడ్జెట్ ఆమోదం పొందుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఎన్నికల సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టి, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే దీన్ని 2016లో ఫిబ్రవరి 01కి మార్చారు.

దేశ బడ్జెట్ ను ఎలా తయారు చేస్తారు?

ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్ధాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ పలు మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులతో చర్చలు నిర్వహించి బడ్జెట్ ను రూపొందిస్తారు. సంప్రదాయం ప్రకారం హల్వా వేడుకను నిర్వహించి బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుడతారు. ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందుగానే బడ్జెట్ తయారీ ప్రారంభమవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం బడ్జెట్ ను సిద్ధం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ ద్వారా, వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడం, ఆదాయ వనరులను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అదనంగా ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రణాళికలు చేస్తుంది.

బడ్జెట్ రూపకల్పనలో మొదటగా ఖర్చులను అంచనా వేస్తారు. ఏయే రంగాలపై ఎంత ఖర్చు చేయాలనే అంచనాను తయారు చేస్తారు. రెండవ దశలో ఆదాయానికి సంబంధించిన విభాగాలు వ్యాపారస్తులు, ఆర్థిక వేత్తలు, ఇతరులతో చర్చలు జరిపి ఆయా వర్గాల అవసరాలను అంచనా వేస్తారు. మూడో దశలో, బడ్జెట్‌ను రూపొందించే శాఖల నుంచి ఆదాయ, వ్యయాల వివరాలను సేకరిస్తారు. దీని ఆధారంగా, రాబోయే సంవత్సరంలో అంచనా ఆదాయాలు – ఖర్చుల వివరాలను తయారు చేస్తారు. దీని తరువాత, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థికవేత్తలు, బ్యాంకర్లతో మాట్లాడి పన్ను మినహాయింపు అలాగే, ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ ను రూపొందించి సిద్ధం చేస్తుంది. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

ఇక నో టెన్షన్.. గూగుల్ ఫోటోలని ఐక్లౌడ్‌లోకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు!

ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు అన్నీ గూగుల్ ఫోటోస్ యాప్ లో స్టోర్ అవుతాయి. ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ని మార్చినా గానీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయితే గూగుల్ ఫోటోలు, వీడియోలు చూసుకోవచ్చు. అయితే కొత్తగా యాపిల్ ఫోన్ కి షిఫ్ట్ అయితే కనుక గూగుల్ ఫోటోస్ లో స్టోర్ అయిన ఫోటోలను ఐక్లౌడ్ లో చూడడం అనేది కుదరదు. దాని కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఐక్లౌడ్ లోకి అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇదంతా పెద్ద ప్రక్రియ. అయితే గూగుల్ టేకవుట్ అప్గ్రేడ్ తో యాపిల్ యూజర్లు ఇప్పుడు సులువుగా గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను, వీడియోలను ఐక్లౌడ్ లోకి ఫోటోస్ లోకి ట్రాన్స్ఫర్ లేదా బ్యాకప్ చేసుకోవచ్చు. గూగుల్, యాపిల్ కంపెనీలు కొత్త టూల్ ని పరిచయం చేశాయి. గూగుల్ ఫోటోస్ నుంచి మీడియా ఫైల్స్ ని ఐక్లౌడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కొత్త టూల్ నైతే తీసుకొచ్చాయి.

గూగుల్ ఫోటోస్ నుంచి ఐక్లౌడ్ లోకి డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి?:

  • ముందు ఐక్లౌడ్ స్టోరేజ్ సరిపడా ఉందో లేదో చూసుకోవాలి. గూగుల్ ఫోటోస్ స్టోరేజ్ ఫ్రీగా 15 జీబీ ఉంటుంది. ఐక్లౌడ్ కి వచ్చేసరికి 5 జీబీ ఫ్రీ ఉంటుంది. కాబట్టి స్టోరేజ్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
  • యాపిల్ డివైజ్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి మీ పేరు ఉన్న దాని మీద క్లిక్ చేసి ఐక్లౌడ్ లోకి వెళ్ళాలి. ఐక్లౌడ్ ఫోటోస్, ఐక్లౌడ్ డ్రైవ్ రెండిటినీ ఎనేబుల్ చేయాలి.
  • వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ టేకవుట్ అని టైప్ చేయాలి. లేదా టేకవుట్.గూగుల్.కామ్ లోకి వెళ్ళాలి. ఇది మీ గూగుల్ ఫోటోస్ సహా వివిధ గూగుల్ సర్వీసుల్లో ఉన్న డేటాను వేరే వాటిలోకి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
  • గూగుల్ టేకవుట్ లో గూగుల్ ఫోటోస్ ఫర్ ఎక్స్ పోర్ట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు ఎక్స్ పోర్ట్ అవుతాయి.
  • ఆ తర్వాత ‘యాపిల్-ఐక్లౌడ్ ఫోటోస్’ ఆప్షన్ ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్ ఫోటోస్ లో ఉన్న డేటా ఐక్లౌడ్ లోకి వచ్చే వీలు ఉంటుంది.
  • అయితే ఏ అకౌంట్ ఐక్లౌడ్ ఫోటోస్ లో గూగుల్ ఫోటోస్ రావాలి అనే దాని కోసం మీరు యాపిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది.
  • గూగుల్ ఫోటోస్ లో ఉన్న డేటా ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు కావాల్సిన అనుమతులు ఇస్తే అప్పుడు ఎక్స్ పోర్ట్ ప్రక్రియ మొదలవుతుంది. అలా మీ గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు అన్ని ఫోటోలు, వీడియోలు ఒకే చోట ఉంటాయి.

ఈ పానియాలు తాగితే గుండె జబ్బులను ఆహ్వానించినట్లే.. వీటికి దూరంగా ఉంటేనే సేఫ్‌!

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి కాలంలో యువత కూడా అనేక రకాల గుండె జబ్బుల బారీన పడుతున్నారు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో అధిక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా పలురకాల పానీయాలు గుండె ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మీరు ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తాగితే మాత్రం ఆయుర్దాయం తగ్గిపోతుంది. సమయాభావం వల్ల చాలా మంది పండ్ల రసాలను కొని తాగుతుంటారు. ఈ తప్పు చేయవద్దు.

అందుకే ఇంట్లోనే పండ్ల రసాన్ని తయారు చేసుకోవడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో చక్కెర అధికంగా ఉండటంతోపాటు ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానికరం.

మార్కెట్లో వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. కొందరైతే తక్కువ క్యాలరీలు కలిగిన ఉంటాయని, వాటిలో చక్కెర ఉండదని చెబుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎనర్జీ డ్రింక్స్ ఎప్పుడూ పోషకమైనవి కావు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలేవీ ఉండవు.

అలాగే శీతల పానీయాలు రుచికి సంతృప్తికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం. ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది గుండెకు కూడా హానికరం. అలాగేమద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.

అమ్మాయిలూ జరభద్రం..! డేటింగ్ యాప్‌లో మాయలోడు.. ఇది మామూలు స్టోరీ కాదు..

వీడు మాడూలు కేటుగాడు కాదు.. పలు డేటింగ్ యాప్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో మాట్లాడి..

పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.. చివరకు రకరకాల కారణాలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. ఈ షాకింగ్ ఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి పలు డేటింగ్ యాప్ లను కేంద్రంగా చేసుకొని పలువురు యువతులను మోసం చేశాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో లాంటి డేటింగ్ యాప్ లలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా గూగుల్‌లో పనిచేస్తున్నానని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. కొంతమంది యువతలను టార్గెట్ చేసి వారి ప్రొఫైల్స్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావటంతో సాధారణంగానే పలువురు యువతులు శ్రీనాథ్ ప్రొఫైల్ ను లైక్ చేశారు. అలా లైక్ చేసిన వారితో శ్రీనాధ్ రెడ్డి చాటింగ్ చేసేవాడు.. అలా టచ్ లోకి వచ్చిన యువతులతో మాటలు కలుపుతూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.. ఈ క్రమంలోనే యువతులు ఎవరైనా కలుద్దాం.. అని చెప్పగానే.. షూర్ అంటూ నిమ్మించేవాడు.. తీరా కలిసే సమయానికి తన కుటుంబం సమస్యల్లో ఉందని, తన తల్లికి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడిందని.. ఆర్థిక ఇబ్బందులని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి బాధిత యువతుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

తీరా అసలు నిజం తెలుసుకున్న యువతులు తామ మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసే క్రమంలో పలువురు యువతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ తరహాలో మోసం చేయడం పట్ల యువతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమనుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని యువతులు పోలీసులకు మొరపెట్టుకున్నారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. శ్రీనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. శ్రీనాథ్ రెడ్డి ఇలా తీసుకున్న డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని.. ఆన్లైన్ గేమ్స్ ఆడటంతోపాటు.. ఆన్లైన్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

కిచెన్ సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

కిచెన్ నుంచి దుర్వాసన రావడానికి సింక్ కూడా ఒక కారణం. సింక్ సరిగ్గా శుభ్రం చేయకపోతే చెడు వాసన వస్తుంది. అంతే కాకుండా అక్కడే ఎక్కువగా క్రిములు, బ్యాక్టీరియా వంటివి చేరతాయి.

కాబట్టి ఎప్పటికప్పుడు సింక్ శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడూ సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. పాత్రలు కడిగినప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ సింక్‌లో ఇరుక్కుని బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీని వల్ల అందులో నుంచి నీరు బయటకు రాదు. మీ కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉన్నా.. దుర్వాసన వస్తూ ఉన్నా కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – వెనిగర్:

ఇంటిని శుభ్రంగా, క్లీన్‌గా ఉంచడంలో బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తాయి. ఎలాంటి వాటిని అయినా బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతో శుభ్రంగా క్లీన్ చేస్తాయి. మురికిని తొలగించడంలో బేకింగ్ సోడా చక్కగా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా అందులో చెత్త పేరుకు పోతే శుభ్రం చేయడానికి కూడా ఇవి సహాయ పడతాయి.

బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ కలిపి మిశ్రమంలా తయారు చేసి.. సింక్‌ రంధ్రంలో పోయాలి. ఇలా చేయడం వల్ల సింక్‌లో ఉండే మురికే కాకుండా గొట్టంలో ఉండే నాచు కూడా వెళ్తుంది. ఈ మిశ్రమంతో సింక్‌ శుభ్రం చేసినా కూడా తెల్లగా మిలమిలా మెరుస్తుంది. ఆ తర్వాత చీపురు పుల్లతో సింగ్ రంధ్రంలోకి పోనిచ్చి.. కదిలించడం వల్ల కూడా పైపులో మురికి పోతుంది.

నిమ్మకాయ – ఈనో:

వంట గదిని శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఈనో కూడా చక్కగా పని చేస్తాయి. నిమ్మకాయ రసం, ఈనో కలపడం వల్ల ఒక యాసిడ్‌లా తయారవుతుంది. అంతే కాకుండా దుమ్ము, జిడ్డు, మురికిని వదుల్చుతాయి. నిమ్మకాయ – ఈనోతో సింక్‌ గొట్టంలోని మురికినే కాకుండా. సింక్‌ని కూడా తెల్లగా మార్చుతుంది. ఈ మిశ్రమం వాడటం వల్ల దుర్వాసన కూడా దూరమవుతుంది.

ఈనో పౌడర్‌లో నిమ్మకాయ రసం పిండి.. ఆ తర్వాత ఒక్క స్క్రబ్బర్ సహాయంతో సింక్‌ మొత్తాన్ని రుద్దండి. ఒక నిమిషం ఆగి.. మొత్తం క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల సింక్ కొత్తదానిలా మెరిసి పోతుంది. అంతే కాకుండా దుర్వాసన కూడా దూరమవుతుంది. నిమ్మరసంలో ఉప్పు లేదా సాల్ట్ కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో క్లీన్ చేసినా కూడా చెడు వాసన పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే.. ఈ మూవీ ఎక్కడుందంటే

టీటీలో వణికించే లు చాలానే ఉన్నాయి. హారర్ లు చూడటానికి నెటిజన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ లు కూడా తెలుగులో డబ్ ఆయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది. ఇప్పటికీ ఈ ట్రెండింగ్ లో ఉంది. ఇంతకు ఈ కథ ఏంటంటే.. అంతగా ఈ లో బయపడటానికి ఏముందంటే..

ఈ లో.. ఆశ (రేవతి) ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. భర్త చనిపోవడంతో కొడుకు వినును, పెంచుతుంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే విను ఎంబీబీఎస్ చదవాలని ఆశపడుతుంటాడు. కానీ తల్లి ఆశ బలవంతంగా అతడిని బీఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంతఊరు వదిలి మరో ప్లేస్ కు వెళ్లి జాబ్ చేయాలని అనుకుంటాడు. కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆతర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది.

ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను అమ్మమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వింత శబ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. ఇదే విషయం చెప్తే ఎవరూ అతన్ని నమ్మరు. అయితే విను ఫ్యామిలిలో చాలా మంది మానసిక సమస్యతో బాధపడుతుంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు. ఆతర్వాత కొన్ని సంఘటనలతో వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉందనే నిజం తెలుసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది.? అక్కడ ఉన్నది ఏంటి.? వీరి కంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది.? విను.. ఆశ ప్రాణాలతో బయటపడ్డారా.? లేదా.? అన్నదే లోనే చూడాలి. ఈ పేరు భూతకాలం. మలయాళంలో తెరకెక్కిన ఈ తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఐఫా-2024 ఉత్సవంలో మెరిసిన సినీ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్ ఇదిగో

క్షిణాదిలోనే అది పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ) అవార్డ్స్‌ 2024’కు రంగం సిద్ధమైంది. యూఏఈ అబుదాబిలోని యస్‌ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండగ జరగనుంది.
ఈ మేరకు తాజాగా హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.దక్షిణాదిలోనే అది పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ) అవార్డ్స్‌ 2024’కు రంగం సిద్ధమైంది. యూఏఈ అబుదాబిలోని యస్‌ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండగ జరగనుంది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన ఈ ప్రారంభ వేడుకల్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు.

అలాగే అబుదాబి కల్చరల్‌ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్‌ మొహమ్మద్, ఫెస్టివల్‌ యూనిట్‌ హెడ్‌ డీటీసీ- నవాఫ్‌ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు ఈ ప్రోగ్రామ్ లో సందడి చేశారు

దగ్గుబాటి రానా, సుశాంత్‌, దేవిశ్రీ ప్రసాద్‌, తేజ సజ్జా, శ్రీలీల, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్‌, సిమ్రాన్‌, ఖుష్బూ తదితర స్టార్ నటీనటులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

అలాగే నవదీప్, అక్షర హాసన్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు ఐఫా ఉత్సవంలో సందడి చేశారు.

ప్రస్తుతం ఐఫా -2024 కర్టెన్ రైజర్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఈ వేడుకల్లో యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

భారత పోస్‌పోర్టులు సరెండ్ చేస్తున్న గోవా వాసులు.. కారణమేంటంటే?

ప్రపంచ చిత్రపటంపై భారతీయ వృత్తి నిపుణులు వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అమెరికా, కెనడా, యూకే వంటి ఆంగ్లం మాట్లాడే దేశాలకే ఎక్కువగా మన నిపుణులు వలస పోయేవారు.

ఇప్పుడు ప్రపంచంలో ఏ ఖండంలో, ఏ దేశంలో చూసినా భారతీయ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర సాంకేతిక నిపుణులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయా దేశాల్లో కొన్నాళ్లు పనిచేసి, సంపాదించుకుని స్వదేశానికి తిరిగొస్తుంటే.. మరికొందరు అక్కడే శాశ్వతంగా సెటిలైపోతున్నారు. కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నప్పటికీ, చాలావరకు విదేశీ పౌరసత్వం పొందితే భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే.

ఇలా భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య దేశంలో ఓ పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా ఓ చిన్న రాష్ట్రంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్నవారి సంఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదేళ్ల కాలంలో ఏకంగా 26 వేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే 2014 జనవరి 1 నుంచి 2024 మార్చి 31 నాటికి 25,939 మంది గోవా వాసులు తమ భారత పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) వెల్లడించిన ఈ గణాంకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూకే వంటి ఇంగ్లిష్ దేశాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వలస వెళ్తుంటారు. కెనడా, యూకే దేశాలకు వలసవెళ్లే వారిలో పంజాబీలు ఎక్కువగా ఉంటారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారిలో కేరళ రాష్ట్రానిదే సింహభాగం. అయితే ఈ గోవా వాసుల విషయానికొచ్చేసరికి.. వీరిలో అత్యధికులు పోర్చుగల్ దేశానికి వలస వెళ్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుక్కారణం ఏంటంటే..

గోవా వాసులకు పోర్చుగల్ స్పెషల్ ఆఫర్

గోవా పోర్చుగీసు పాలనలో ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. 1961 డిసెంబర్ 19న ఆ దేశం నుంచి విముక్తి పొంది, భారత్‌లో విలీనమైంది. ఈ సమయంలో ఆ తేదీ నాటికి గోవాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పోర్చుగల్ తమ దేశ పౌరసత్వాన్ని ఆఫర్ చేసింది. ఆ తర్వాతి కాలంలో వారి వారసులకు కూడా ఈ ఆఫర్‌ను పొడిగించింది. పోర్చుగీస్ పాస్‌పోర్ట్ కల్గినవారు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాలతో పాటు యూకేలో సైతం వీసా అవసరం లేకుండా తిరగొచ్చు. యూరప్‌ దేశాల్లో చిన్న చిన్న దేశాల వీసా పొందడమే కష్టతరంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా పౌరసత్వమే అందించే అవకాశం ఉంటే ఎవరు మాత్రం వదులుకుంటారు? గోవాలో అదే జరిగింది. ఇంకా జరుగుతోంది. పోర్చుగల్ పౌరసత్వం కోసం అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు. ఏటా సగటున 2 వేల మందికి పైగా పోర్చుగీసు పౌరసత్వం తీసుకుంటున్నారు.

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే యూరి అలమావో వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014లో 2,037 మంది తమ భారత పాస్‌పోర్టులను సరెండర్ చేయగా, 2016లో గరిష్టంగా ఆ సంఖ్య 4,121కు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2021లో ఆ సంఖ్య అత్యల్పంగా 954గా నమోదైనప్పటికీ.. 2023లో తిరిగి మళ్లీ 2,094కు చేరుకుంది. మెరుగైన జీవన ప్రమాణాలు, అధునాతన సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో భూలోక స్వర్గంగా పేరొందిన యూరప్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గోవా వాసులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందులోనూ మంచి గ్లోయింగ్ స్కిన్‌ కావాలని.. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. ఇందు కోసం ఎక్కువగా చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్లు, కాస్మెటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయినా ఇన్ని చేసినా కూడా ముఖంపై గులాబీ రంగు రావాలంటే చాలా కష్టం.

రోజ్ గ్లో కోసం చాలా మంది ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీములు ఉపయోగిస్తారు. ఇలాంటివి చర్మానికి కూడా ప్రమాదకరం. వీటితో ఎప్పటికైనా భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. డబ్బులు కూడా వృధా అవుతాయి.

కాస్త సమయం కేటాయిస్తే ఇంట్లోనే ఈజీగా గులాబీ మెరుపు ఇచ్చే జెల్ తయారు చేసుకోవచ్చు. ఇది రాసుకోవడ వల్ల మీ ముఖం రోజ్ గ్లోతో మెరిసి పోతుంది. మరి ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజ్ తయారు చేసుకోవడానికి గులాబీ రేకులు, అలోవెరా జెల్, విటమిన్ సి క్యాప్సూల్స్, రోజ్ వాటర్ కావాలి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి గులాబీ రేకులు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా మిక్సీ పట్టాలి. వీటిని వడకడితే రసం వస్తుంది.

ఈ రసంలో అలోవెరా జెల్, విటమిన్ సి క్యాప్సూల్స్ కలపాలి. అంతే రోజ్ జెల్ సిద్ధం. వీటిని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖం కడిగి రాసుకోవాలి. పది రోజుల్లోనే మీ ముఖంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.

యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. క్రెడిట్ కార్డుదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

సిటీ బ్యాంక్ ప్రస్థానం ఇక గతం కానుంది. ఎందుకంటే సిటీ బ్యాంక్ ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ లో విలీనం కానుంది. దీంతో సిటీ బ్యాంక్ వినియోగదారుల్లో కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి.

మార్పులు ఏముంటాయి? తమ క్రెడిట్ కార్డులు పని చేస్తాయా? కొత్త నిబంధనలు ఏంటి అన్న ప్రశ్నలు చాలా మంది ఉంటాయి. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని పొందుపరిచింది. వారు తరచూ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు తెలుసుకోవాల్సిన అంశాలను మీకు అందిస్తున్నాం..

కొత్త క్రెడిట్ కార్డులు వస్తాయి..

మైగ్రేషన్ పూర్తయినప్పుడు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులను పొందుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త కార్డులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి కొన్ని నెలల పాటు పాత సిటీ బ్యాంక్ కార్డులనే వినియోగించుకోవచ్చు. యాజమాన్య బదిలీ పూర్తయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ తొమ్మిది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను దశలవారీగా తొలగిస్తుంది. వాటి స్థానంలో ఏడు కొత్త కార్డ్ రకాలను యాక్సిస్ బ్యాంక్ అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ మీరు ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయి ఉంటే మీకు ప్రత్యేకమైన బ్యాంక్ కస్టమర్ నంబర్ అందిస్తారు. దానిని సిటీ బ్యాంక్ కనెక్షన్‌కి లింక్ ఈజీగా లింక్ చేస్తారు. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్ ఖాతా లేకపోతే అప్పుడు కొత్త యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ ఐడీ ఇస్తారు. ఇది ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందుతుంది.

లావాదేవీలు, కార్డ్ సమాచారం..

  • ఖాతాదారుల క్రెడిట్ కార్డ్ వినియోగ విధానాలకు సంబంధించిన కొత్త రూల్స్, అప్ డేట్లు మీకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా తెలియజేస్తారు. మీ కార్డు నంబర్, పిన్, గడువు తేదీ సీవీవీ వంటివి మారవు.
  • కార్డ్ వినియోగంపై పరిమితులు (కాంటాక్ట్‌లెస్, ఇ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్, ఏటీఎం విదేశీ లావాదేవీలు వంటివి) కూడా మారవు.
  • బాకీ ఉన్న మొత్తాలు, కొనసాగుతున్న ఈఎంఐలు రెండూ ప్రభావితం కావు.
  • బిల్లింగ్ సైకిల్ మారదు, అలాగే స్టేట్‌మెంట్ క్రియేషన్, చెల్లింపు గడువు తేదీలు మారవు.
  • ఖర్చు ఆధారిత రుసుము మినహాయింపులు, వార్షిక రుసుములు రెండూ మారవు.
  • అయితే, యాక్సిస్ బ్యాంక్ ఛానెల్‌లు సిటీ బ్యాంక్ ఛానెల్‌లను చెల్లింపు ఛానెల్‌లుగా భర్తీ చేస్తాయి. వినియోగదారులు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా తమ డిజిటల్ సేవలను యాక్సెస్ చేస్తారు.

హెచ్చరికలు, కస్టమర్ సేవ..

  • యాక్సిస్ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ సిటీ ఫోన్‌ను ప్రైమరీ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌గా భర్తీ చేస్తుంది.
  • ఇ-కామర్స్ చెల్లింపు ప్రమాణీకరణ, లావాదేవీ నోటిఫికేషన్‌ల కోసం పోర్టల్‌లు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లోగోను కలిగి ఉంటాయి.

రివార్డు పాయింట్లు..

యాజమాన్య బదిలీ నాటికి ఇంకా ఉపయోగించని అన్ని రివార్డ్ పాయింట్‌లు విలువలో ఎటువంటి మార్పు లేకుండా, ఎడ్జ్ మైల్స్ లేదా యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లకు మారుతాయి.

రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు ఇక గట్టిపోటీ

భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో పీఎంవీ స్టార్టప్ ఈవీ కారును రిలీజ్ చేసింది. కేవలం రూ.4 లక్షలకే ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ముంబైకి చెందిన స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ (పీఎంవీ ఎలక్ట్రిక్) దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. పీఎంవీ ఈఏఎస్-ఈ పేరుతో లాంచ్ చేసిన ఈ ఈవీ కారు మైక్రో ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పీఎంవీ ఈవీ ధర దాదాపు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ ఈ-కారు పొడవు 2915 మిమీ మాత్రమే ఉంటుంది. ఈ ఈవీ కారును రూ. 2000 చిన్న మొత్తంతో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును 15 ఏఎంపీ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. ఈ కారును కేవలం దాదాపు 4 గంటల్లో పూర్తిగా చేయవచ్చు.

పీఎంవీ ఈవీ కారు మార్కెట్‌లో ఉన్న కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారు టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కంటే తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ కారును కంపెనీ దీనిని 2022లో ప్రవేశ పెట్టినా డెలివరీ తేదీల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అధికారికంగా పేర్కొనలేదు. అయితే ఈ కారు అందుబాటులోకి వస్తే మాత్రం టాప్ కంపెనీల ఈవీ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ బైక్‌పై అదిరే ఆఫర్.. రూపాయి కట్టకుండా బండిని ఇంటికి తెచ్చుకోవచ్చు.. 1hr

మీరు ఏదైనా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తున్నారా? అయితే అధిక ధర అవుతుందని ఆలోచిస్తున్నారా? కనీసం ఫైనాన్స్ సౌకర్యం పొందాలన్నా.. డౌన్ పేమెంట్ కు కూడా డబ్బు సర్దుబాటు కాక ఇబ్బంది పడుతున్నారా?

అయితే మీకో గుడ్ న్యూస్. జీరో డౌన్ పేమెంట్ సదుపాయంతో ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ రివోల్ట్ మోటార్స్ అందిస్తోంది. రివోల్ట్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆర్వీ400 పై కొత్త ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, ఎవరైనా ఎటువంటి డౌన్ పేమెంట్ చెల్లించకుండానే ఇ-మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాక నెలవారీ ఈఎంఐ కూడా రూ. 4,444 మాత్రమే పడుతుంది. కొనుగోలుదారులు ఆదాయ రుజువును చూపాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ రుసుము లేదా స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సిన పనిలేదు. పూర్తి పేపర్‌లెస్ డిజిటల్ విధానంలో ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు, దాని నిబంధనలు, షరతుల గురించి పూర్తి సమాచారం పొందడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు తప్పనిసరిగా సమీపంలోని రివోల్ట్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.

తగ్గింపు ధరలు..

రివోల్ట్ మోటార్స్ తన అమ్మకాలను పెంచుకోవడానికి, ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగాన్ని పెంచడానికి తరచూ ఇటువంటి పథకాలను విడుదల చేస్తూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అమలు చేసిన ఆఫర్ ప్రకారం ఆర్వీ400 స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లపై రూ.5,000 ధర తగ్గింపును అందించింది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో ఇన్‌పుట్ ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం ద్వారా కంపెనీ ఆ ధరను తగ్గించగలిగింది. దీనికి అదనంగా ఇది రూ. 10,000 అదనపు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ. 5,000 తగ్గింపు లభిస్తోంది.

రివోల్ట్ ఆర్వీ400 స్పెసిఫికేషన్స్..

రివోల్ట్ ఆర్వీ400 స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లు రెండూ 3కేడబ్ల్యూ మోటార్ ను కలిగి ఉంటాయి. ఇది మార్చుకోగల 3.24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. క్లెయిమ్ చేయబడిన పరిధి ఎకో మోడ్‌లో 150 కిమీ, సాధారణ మోడ్‌లో 100 కిమీ, స్పోర్ట్స్ మోడ్‌లో 80 కిమీ. ఈ బైక్ లో ఒక డిజిటల్ డిస్‌ప్లే, మూడు రైడ్ మోడ్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా సీబీఎస్ని పొందుతుంది. అయితే దీనిలో పొందే ఫోన్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండదు. ఈ రెండు ఇ-బైక్‌ల బ్యాటరీ ప్యాక్‌పై రివోల్ట్ 5 సంవత్సరాల, 75,000కిమీ వారంటీని అందిస్తుంది. ఈ ఆర్వీ400 బైక్స్ క్రటోస్ ఆర్, ఒబెన్ రోర్, మేటర్ బైక్ లకు పోటీగా మార్కెట్లో నిలబడుతోంది.

ఇవి మనకు వరం లాంటివి.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎంత వేగంగా పెంచుతాయి? పూర్తి వివరాలు..

ర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ డెంగ్యూ ముప్పు కూడా పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి.. అంతేకాకుండా వేగంగా వ్యాపిస్తుంది.. ఒక్కొసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

డెంగ్యూలో అతి పెద్ద ఆందోళన ఏంటంటే.. ప్లేట్‌లెట్స్ పడిపోవడం.. ఇది ఒక్కోసారి అత్యవసర వైద్యపరిస్థితి కావొచ్చు.. అయినా.. ఇలాంటి సందర్భాల్లో అస్సలు భయపడవద్దు.. ప్రకృతి మనకు అద్భుతమైన బహుమతిని ఇచ్చింది.. అవే బొప్పాయి ఆకులు.. వీటిని ఆయుర్వేదంలో గొప్పవిగా పరిగణిస్తారు. అవును, బొప్పాయి ఆకులు మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా డెంగ్యూ చికిత్సలో దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయంటున్నారు. బొప్పాయి ఆకులు మనకు ఎలా ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందాం..

ప్లేట్‌లెట్స్‌ను పెంచుతుంది: బొప్పాయి ఆకుల్లో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్స్ ఏర్పడటాన్ని పెంచుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల, శరీరం బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: బొప్పాయి ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. డెంగ్యూలో, శరీరం రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.

జ్వరాన్ని తగ్గిస్తుంది: బొప్పాయి ఆకుల్లో యాంటీ పైరెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డెంగ్యూలో అధిక జ్వరం సాధారణం.. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులను తీసుకోవడం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

నొప్పిని తగ్గిస్తుంది: బొప్పాయి ఆకులలో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో నొప్పి, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో నొప్పి, కీళ్ల నొప్పులు డెంగ్యూలో సాధారణ లక్షణాలు, అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్లను ఎంత వేగంగా పెంచుతాయి?

బొప్పాయి పండు ఆకులు ఎంత త్వరగా పని చేస్తాయి అనేది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య 24 గంటల్లోనే వేగంగా పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

బొప్పాయి ఆకులను ఎలా తీసుకోవాలి

బొప్పాయి ఆకుల రసం: బొప్పాయి ఆకులను తినడానికి సులభమైన.. అత్యంత ప్రభావవంతమైన మార్గం జ్యూస్ తయారు చేసి త్రాగడం. 2-3 బొప్పాయి ఆకులను బాగా కడిగి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో కొద్దిగా నీరు, నిమ్మకాయ లేదా తేనెను రుచి ప్రకారం కలుపుకుని రోజుకు రెండుసార్లు త్రాగాలి.

బొప్పాయి ఆకుల టీ: మీరు బొప్పాయి ఆకుల టీని కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, 2-3 ఆకులను ఉడికించి, వాటిని వడపోసి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

గమనిక

బొప్పాయి ఆకులను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు తినకూడదని గుర్తుంచుకోండి . ఇది కాకుండా, మీకు ఏదైనా అలెర్జీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఈవీ స్కూటర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి.

ఈవీ స్కూటర్లలో ఓలా కంపెనీకు చెందిన స్కూటర్లు అధిక ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా మొదటి ఆప్షన్‌గా మారింది. మెరుగైన ఫీచర్లతోపాటు స్టైలిష్ లుక్ వినియోగదారులను కట్టి పడేస్తుంది. అయితే ఓలా స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ఆఫర్ కింద ఓలా స్కూటర్ కొనుగోలుపై రూ.20 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఓలాకు సంబంధించిన ఓలా ఎస్1 ప్రో, ఎస్1ఎయిర్, ఎస్ 1 వేరియంట్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ఆఫర్ గురించి వివరాలను తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై రూ.15,000 వరకు తగ్గింపును ఇస్తున్నారు. ఈ స్కూటర్లపై జూలై 17 వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సబ్సిడీ ప్రయోజనాలు ఇస్తున్నట్లు ఓలా తెలిపింది. ఓలా లైనప్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. ఓలా ఎస్1 ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలు. అయితే ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌లో కూడా ఓలా ఈ రెండు స్కూటర్‌లపై ఒకే తరహా ఆఫర్‌ను అందించింది.

ఓలా ప్రారంభ స్కూటర్ అయిన ఓలా ఎస్1పై కూడా బంపర్ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై రూ.12,500 ఆదా అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఓలా ఎస్1 అతి తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో మార్కెట్లో అందుబాటులో ఉంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌లో 190 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఓలా ఎస్1 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ స్కూటర్‌పై గరిష్టంగా రూ.20 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. గత నెలతో పోలిస్తే ఈ ఈవీపై రూ.5,000 తగ్గింపు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.85 వేలుగా ఉంది.

ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!

దాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2024. అటువంటి పరిస్థితిలో పన్ను చెల్లింపుదారులందరూ సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలి.

గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. అయితే గడువు సమీపిస్తున్నందున ప్రజలు ఇప్పుడు తమ రిటర్న్‌లను త్వరగా దాఖలు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు రిటర్న్‌లను వెరిఫై చేసి వాపసు ఇచ్చే ప్రక్రియను కూడా పన్ను శాఖ ప్రారంభించింది. అయితే ఈ మధ్య ఆదాయపు పన్ను పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఆదాయపు పన్ను పేరుతో ఏదైనా సందేశాన్ని కూడా స్వీకరించినట్లయితే భారీ పెనాల్టీ నుండి మిమ్మల్ని రక్షించవచ్చు.

సైబర్ దుండగులు చురుగ్గా మారారు

ఆదాయపు పన్ను శాఖతో పాటు స్కామర్లు కూడా చాలా యాక్టివ్‌గా మారారు. సైబర్ దుండగులు ఇప్పుడు ప్రజల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలించడానికి ఆదాయపు పన్ను రీఫండ్‌ను తమ ఆయుధంగా చేసుకున్నారు. ఈ దుండగులు ఫేక్ మెసేజ్‌లు పంపి కొందరి బ్యాంకు ఖాతాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా అనేక రీఫండ్ ఫ్రాడ్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఒక సలహా ఇవ్వవలసి వచ్చింది.

మీరు కూడా ఐటీఆర్‌ ఫైల్ చేసి, వాపసు కోసం వేచి ఉన్నట్లయితే, ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సైబర్ దుండగులు పంపుతున్న మెసేజ్‌లో మీ పేరుపై రూ.15,490 ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ ఆమోదించినట్లు రాసి ఉంటుంది. ఈ మొత్తం త్వరలో మీ ఖాతాలో జమ చేయబడుతుంది. మీ ఖాతా నంబర్ 5XXXXX6755ని ధృవీకరించండి. అది సరైనది కాకపోతే, దిగువ ఇచ్చిన లింక్‌ని సందర్శించడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయండి అంటూ ఆ సందేశంలో ఉంటుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.

దీనిపై ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇలాంటి సందేశాలపై స్పందించకూడదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ఈ మెసేజ్ చదివిన తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఇచ్చిన లింక్‌కి వెళితే, అక్కడ తన బ్యాంక్ ఖాతా నంబర్ తప్పుగా కనిపిస్తుంది. వాస్తవానికి, లింక్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారున్ని నకిలీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అతను అక్కడ తన ఖాతాను అప్‌డేట్ చేసినప్పుడు అతనికి OTP వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే, స్కామర్లు బ్యాంకు ఖాతాలోకి చొరబడతారు. దీంతో మీరు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

మీరు ఏం చేయాలి?

లింక్ ఇవ్వబడిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి SMS లేదా ఈ-మెయిల్ పంపదు. ITRని ప్రాసెస్ చేసిన తర్వాత, ఆదాయపు పన్ను శాఖ నేరుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారు అదే బ్యాంక్ ఖాతాలో పన్ను వాపసును జమ చేస్తుంది. అతను ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నప్పుడు ఇచ్చిన ఈ సమాచారం రిజిస్టర్డ్ ఇ-మెయిల్ లేదా మొబైల్ నంబర్‌లో సందేశం వస్తుంది. డిపార్ట్‌మెంట్‌కు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరమైతే, అది ఆదాయపు పన్ను చెల్లింపుదారు రిజిస్టర్డ్ ఇమెయిల్‌కు సందేశాన్ని పంపుతుంది.

అందువల్ల మీ మొబైల్‌లో ఆదాయపు పన్ను రీఫండ్‌కు సంబంధించిన ఏదైనా సందేశం వస్తుంటే అందులో ఖాతా నంబర్ లేదా మరేదైనా సమాచారాన్ని ధృవీకరించమని చెబుతున్నట్లయితే, అలాంటి సందేశాల నుండి అప్రమత్తంగా ఉండండి. వీటికి ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు.

Health

సినిమా