Saturday, November 16, 2024

సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్.. టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీ

భారతదేశంలోని ఆటోమొబైల్ రంగాన్ని ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు శాసిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమంది ప్రజలకు ఈవీ వాహనాలపై అంతగా నమ్మకం ఉండట్లేదు.

ముఖ్యంగా కార్లు కొనుగోలు చేయాలని అనుకునేవారు కచ్చితంగా ఈవీలకు ప్రత్యామ్నాయ ఎంపికల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారికి సీఎన్‌జీ వాహనాలు ఈవీలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా తమ కారు మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఎక్స్టర్ సీఎన్‌జీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ వాహనాల ధరలు రూ.8.50 లక్షల నుంచి రూ.9.38 లక్షల వరకు ఉంటాయని అంచనా. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీకి గురించి వివరాలను తెలుసుకుందాం.

హ్యూందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లతో వస్తుంది. ముఖ్యంగా కారు డిక్కీలో సామగ్రి పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే ఈ కారు 1.21 బై ఫ్యూయల్ టెక్నాలజీతో వస్తుంది. అయితే ఈ వెర్షన్‌లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండదు.హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కారు 27.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని అంచనా. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి అధునాత ఫీచర్లు ఈ కారు సొంతం. 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా లక్షణాలతో ఈ కారు అమితంగా ఆకర్షిస్తుంది.

హ్యుందాయ్ ఇటీవల 93,000 ఎక్స్‌టర్ యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వారు ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేశారు. ఎక్స్‌టర్ హై-సీఎన్జీ డ్యూయో పరిచయం గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మిస్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ అధిక ఇంధన సామర్థ్యం, విస్తారమైన బూట్ స్పేస్‌తో ఈ కారు భారతీయ రోడ్లకు అనువుగా డిజైన్ చేసినట్టు వివరించారు. ఈ కారు కచ్చితంగా వినియోగదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందని చెప్పారు.

ఎల్‌ఐసీలో బెస్ట్‌ ప్లాన్‌.. ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతినెల రూ.12000 పెన్షన్‌

ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేస్తారు. వారి డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా గొప్ప రాబడిని కూడా పొందే ప్రదేశంలో పెట్టుబడి పెడతారు.

కొంతమంది రిటైర్మెంట్ ప్లాన్‌గా స్కీమ్‌లను ఎంచుకుంటారు. అందులో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందుతారు. వారు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రతి వయస్సు వారికి సంబంధించిన పాలసీలను తీసుకువస్తోంది. వీటిలో ఒకటి ఎల్‌ఐసి సరళ్ పెన్షన్ ప్లాన్. ఇది మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెలా పెన్షన్‌కు హామీ ఇస్తుంది.

పదవీ విరమణ ప్రణాళికగా ప్రసిద్ధి:

ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఒక్కసారి మాత్రమే పెట్టుబడి అవసరం. జీవితాంతం పెన్షన్ ఏర్పాటు వస్తుంది. ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ రిటైర్మెంట్ ప్లాన్‌గా బాగా పాపులర్ కావడానికి ఇదే కారణం. ప్రతి నెలా ఫిక్స్‌డ్ పెన్షన్ ఇచ్చే ఈ పథకం పదవీ విరమణ తర్వాత పెట్టుబడి ప్రణాళికలో సరిగ్గా సరిపోతుంది. ఎవరైనా ఇటీవల పదవీ విరమణ చేశారనుకుందాం. పదవీ విరమణ సమయంలో పిఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ నుండి పొందిన డబ్బును అందులో పెట్టుబడి పెట్టగలిగితే, అతను జీవితాంతం ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనం పొందుతూనే ఉంటారు.

ఇలా ప్రతి నెలా మీకు రూ.12,000 పెన్షన్

ఎల్‌ఐసి సరళ పెన్షన్ ప్లాన్‌లో మీరు సంవత్సరానికి కనీసం రూ. 12,000 యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. అంటే, మీరు మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడి ప్రకారం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో, ఏ వ్యక్తి అయినా ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఈ మొత్తం పెట్టుబడితో అతను యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం.. ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల వార్షికాన్ని కొనుగోలు చేస్తే, అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. అయితే వివరాలకు ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది.

ఓలాకి బిగ్ షాక్.. రూ. 1.94లక్షలు ఫైన్ కట్టాలంటే ఆదేశాలు.. ఏం జరిగిందంటే..

న దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఓలా బ్రాండ్ స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఓలా ఎలక్ట్రిక్ నుంచి అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది.

దానిలోని ఫీచర్స్, అత్యాధునిక సాంకేతిక, ఈజీ రైడింగ్ వంటివి వినియోగదారులను అమితంగా ఆకర్షస్తుంటాయి. అటువంటి కంపెనీకి అనుకోసి షాక్ తగిలింది. ఓ వినియోగదారుడు చేసిన ఫిర్యాదుతో ఏకంగా రూ. 1.94లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బెంగళూరులో జరిగిన ఘటన..

ఇటీవల బెంగళూరులోని వినియోగదారుల కోర్టు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 1.94 లక్షల జరిమానా విధించింది. లోపభూయిష్ట ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయడం, సమస్యను పరిష్కరించడంలో కంపెనీ వైఫల్యం కారణంగా ఈ జరిమానా విధించినట్లు కోర్టు పేర్కొంది. ఫుల్ పేమెంట్ చేసిన తేది నుంచి 6 శాతం వార్షిక వడ్డీతో బాధితుడికి రూ. 1.62 లక్షలను తిరిగి చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఓలా ఎలక్ట్రిక్‌ని ఆదేశించింది. అదనంగా బాధితుడి మానసిక వేదనకు పరిహారంగా రూ. 20,000, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

వినియోగదారుడి ఫిర్యాదు ఇది..

బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన దుర్గేష్ నిషాద్ అనే వ్యక్తి ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌ను డిసెంబరు 12, 2023న కొనుగోలు చేశాడు, పలు తగ్గింపులతో బండిని రూ. 1.47 లక్షలు, రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీల కోసం రూ. 16,000 చెల్లించాడు. జనవరి 2024లో స్కూటర్‌ను స్వీకరించిన తర్వాత, అతను వెనుక ఎగువ ప్యానెల్ దెబ్బతిన్నట్లు గమనించి , దానిని ఓలా ఎలక్ట్రిక్‌కి నివేదించాడు. అది సమస్యను రికార్డ్ చేసింది. ప్యానెల్ రీప్లేస్‌మెంట్ అవసరమని పేర్కొంది. అంతేకాక హారన్ కూడా పనిచేయడం లేదని, ప్యానెల్ బోర్డ్ డిస్‌ప్లేతో సహా లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఈ సమస్యలను జనవరి 23న ఓలా షోరూమ్‌కు నివేదించాడు. అయితే వాటిపై ఓలా కంపెనీ సానుకూలంగా స్పందించలేదు. తన ఎలక్ట్రిక్ వాహన సమస్యలను పరిష్కరించలేదు. దీంతో దీంతో నిషాద్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

కంపెనీ నిర్లక్ష్యంపై కోర్టు స్పందన..

వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో ఓలా ఎలక్ట్రిక్ నిర్లక్ష్యాన్ని కోర్టు నొక్కి చెప్పింది. లోపభూయిష్ట స్కూటర్‌ను రిపేర్ చేయడంలో లేదా కొత్తది భర్తీ చేయడంలో కంపెనీ విఫలమైనందున, నిషాద్‌కు కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించాలని, ఆర్థిక నష్టాన్ని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. నాణ్యత నియంత్రణ, కస్టమర్ సేవకు ప్రాధాన్యత ఇవ్వడానికి కంపెనీలకు ఈ తీర్పు కీలకమైన రిమైండర్‌గా పనిచేస్తుందని వెల్లడించింది.

బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ సొమ్ముకు సమాధానం చెప్పాల్సిందేనా..? పరిమితి దాటితే ఆ బాధ్యత మనదే..!

న దేశంలోని చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా బ్యాంకులు సేవలను విస్తరించడంతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తెరుస్తున్నారు. మన సొమ్మును దొంగల బారిన పడకుండా బ్యాంకు ఖాతాలో ఉంచుకోవడం అనేది అనుకూలమైన మార్గంగా మారింది. అయితే ఇలా బ్యాంకు ఖాతాలో సొమ్ము ఉంచుకోవడం వల్ల ఆ మొత్తంపై కొంత వడ్డీని కూడా పొందుతారు. భారతీయ పౌరుడికి పొదుపు ఖాతాలను తెరిచేందుకు ఎలాంటి పరిమితి లేదు. అయితే ఓ బ్యాంకు అకౌంట్ ఎంత వరకూ సొమ్ము జమ చేయవచ్చనే విషయంలో సగటు వినియోగదారుడికి అనుమానంగా ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ రేటుతో పన్ను బాధ్యతల వల్ల కొంత మంది బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో సొమ్మును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడరు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఆదాయపు పన్ను శాఖ పన్ను విధిస్తుందా? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒకరు తమ సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని ఉంచాలి. అంటే అది జీరో బ్యాలెన్స్‌లో ఉండకూడదు. మీరు మీకు వీలైనంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు. అయితే సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్స్‌పై ఎలాంటి పరిమితి లేదు. కానీ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌కు తెలియజేస్తుంది. ఇదే నియమం నగదు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్‌లలో పెట్టుబడులు వంటి ఇతర రకాల ఫైనాన్సింగ్‌లకు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం లేదా బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి పరిమితి లేదు. ఇంకా సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తం ద్వారా వచ్చే వడ్డీపై బ్యాంక్ ఖాతాదారుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ వడ్డీపై బ్యాంక్ 10 శాతం టీడీఎస్ తీసేస్తుంది వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ పన్ను మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం పౌరులు తమ పన్ను మొత్తాలను రూ.10,000 వరకు రాయితీ పొందవచ్చు. వడ్డీ మొత్తం రూ. 10,000 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తికి పన్ను విధించరు. అలాగే ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్లు దాటి ఉంటే రూ. 50,000 వరకు వడ్డీపై వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ జమ అయితే దాని మూలం గురించి అడిగే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు సరైన సమాచారం ఇవ్వకపోతే ఆ మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌చార్జి, 4 శాతం సెస్ విధిస్తారు.

‘గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండువారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు.

విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా అమిత్‌ షాతో భేటీకి సంబంధించిన విషయాలు వెల్లడించారు చంద్రబాబు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదుపు తప్పిన అస్థిరమైన అప్పుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలపైనా అమిత్‌షాతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. పునరుద్ధరణ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడతాయన్నారు. కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీంతోపాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు ప్రధాని మోదీతోపాటు .. కేంద్రమంత్రులతో భేటీ అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది..

ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్దికి కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఙప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేకంగా కేంద్రపెద్దలను చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరనున్నట్లు సమాచారం. దీంతో పాటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఢిల్లీపెద్దలను బాబు కోరనున్నారు.

సీఎం అయ్యాక మొదటిసారి జూలై 3న ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు… దాదాపు మూడు రోజుల పాటూ అక్కడే ఉన్నారు. వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌పై భారీ దాడికి చైనా ప్లాన్.. POK సమీపంలో 13,000 అడుగుల ఎత్తులో సైనిక స్థావరం..!

తూర్పు లడఖ్‌లో విజయం సాధించలేకపోయిన చైనా ఇప్పుడు పీఓకేపై కన్నేసింది. కజకిస్థాన్‌లో 13 వేల అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ప్రదేశం PoK కి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించి అక్కడ ఫిరంగిని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను చైనా పూర్తిగా తోసిపుచ్చింది.

చైనాకు ఎప్పుడూ విస్తరణవాద ఆలోచనే ఉంది. పొరుగు దేశాల భూభాగాన్ని కబ్జా చేసేందుకు చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తోంది. ఈసారి కజకిస్థాన్‌లో పీఓకే పక్కనే చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని, దశాబ్దాలుగా ఈ పని కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. కజకిస్తాన్‌లో దాదాపు దశాబ్ద కాలంగా చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని, శాటిలైట్ చిత్రాల ద్వారా ది టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడైంది. ఇది 13 వేల అడుగుల ఎత్తులో ఉంది. సోవియట్ యూనియన్ రష్యా నుండి విడిపోయిన తరువాత కజకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

ఇలాంటి మీడియాలో రావడంతో చైనా స్పందించింది. కజకిస్థాన్‌లోని చైనా సైనిక స్థావరంపై మీడియాలో వస్తున్న పూర్తిగా తప్పు, నిరాధారమైనవని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. వాస్తవానికి, మాక్సర్ టెక్నాలజీస్ ఉపగ్రహం నుండి తీసిన కొన్ని చిత్రాలను పంచుకుంది. దీనికి సంబంధించి చైనా రహస్య సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని పేర్కొంది. సైనిక స్థావరం గోడలు, యాక్సెస్ రోడ్లు చిత్రాలలో స్పష్టం కనిపిస్తాయి.

కౌంటర్ టెర్రర్ బేస్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఈ సైనిక స్థావరంపై రెండు దేశాలు నిఘా టవర్లను ఏర్పాటు చేసినట్లు మీడియా నివేదికలలో కూడా పేర్కొంది. సైనిక స్థావరం నిర్మించిన స్థలం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఎందకంటే ఇది ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంది. ఇది దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో పర్వతంపై నిర్మించారు. రెండు దేశాలు దీనిని 2021 సంవత్సరంలో నిర్మించాయి. దీనికి కౌంటర్ టెర్రర్ బేస్ అని పేరు పెట్టారు. ఈ సైనిక స్థావరం ద్వారా మధ్య ఆసియాలో చైనా తన పట్టును బలపరుస్తోంది.

ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ దుమ్మురేపుతోంది. ఈ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది. ఈ తో ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఆ అంచనాలను అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటూ ఇప్పటికి కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. జూన్ 27న విడుదలైన కల్కి ప్రభాస్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ ను థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ రిపీట్ గా చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఓటీటీలోకి ఇప్పట్లో రానట్టే అని తెలుస్తోంది.

‘కల్కి 2898 ఏడీ’ భారీ బడ్జెట్ . ఈ కోసం వైజయంతీ మూవీస్ 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఇంత భారీ మొత్తంతో తీసినప్పుడు భారీగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే థియేటర్‌లో ఎక్కువ రోజులు నడవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఒకవేళ ఈ ఓటీటీ రిలీజ్ అయితే ఈ రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

కొన్ని లు థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతాయి. థియేటర్‌లో బిజినెస్ లేనప్పుడు ఓటీటీలో ఇలా రిలీజ్ చేస్తారు. అయితే, ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో అలా కాదు. రెండు నెలల తర్వాత నిర్మాతలు ‘కల్కి 2898ఏడీ’ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ లో మహాభారతం కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ ను పార్టులుగా తీసుకురానున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటికే కల్కి పార్ట్ 2 షూటింగ్ చాలా వరకు అయ్యిందని తెలుస్తోంది.

జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తేదీ ఇదే

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు జవహార్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు సెప్టెంబరు 16, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద దేశంలోని మొత్తం 653 విద్యాలయాల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 చొప్పున విద్యాలయాలున్నాయి.

01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. ఈ పరీక్ష రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. ఏప్రిల్‌ 12, 2025 (శనివారం) ఉదయం 11 గంటలకు ఒక సెషన్‌ పరీక్ష జరుగుతుంది. మిగిలిన విద్యార్ధులకు జనవరి 18, 2025వ తేదీ ఉదయం 11.30 గంటలకు పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ, పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష ఆయా తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 3 విభాగాల నుంచి 80 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెంటల్‌ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, అర్ధమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు, ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఓఎమ్మార్‌ షీట్‌పై సరైన సమాధానాలను గుర్తించవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1.25 మార్కుల చొప్పున కోత ఉంటుంది.

నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..

హిందూ పండుగలలో ఎంతో విశిష్టత ఉన్న పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాడం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు.

తొలి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో తలనీలాలు, మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు, కంపార్ట్మెంట్లో వేచి ఉండే చంటి బిడ్డల కోసం పాలు బిస్కెట్లు అందుబాటులో ఉంచారు.

ఏడాదికి 24 ఏకాదశలు ఉంటే అందులో ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశినే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం. తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు తొలి ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించి, నాలుగు నెలల తరువాత క్షీరాబ్ది ద్వాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో పలువురు ఏకాదశి అంటే 11 అని అర్థం. మనుకున్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటన్నింటినీ పనిచేయించే అంతరెంద్రియమైన మనసు కలిసి మొత్తం 11. ఇవన్నీ ఏకోన్ ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై శయనిస్తారు. అందుకే శయన ఏకాదశి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ ఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సూచికగా చెబుతుంటారు.

ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. నేటి నుంచి పలువురు చాతుర్మాష దీక్షను ఆరంభిస్తారు. అదేవిధంగా చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూదానం, అశ్వమేదయాగం, 60 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి పండుగను రైతులు ఎక్కువగా జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఏకాదశి నాడు రైతులు తమ జీవనాధారమైన పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ, అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ శ్రీమహావిష్ణువుని తొలి ఏకాదశి నాడు నమస్కారం చేసుకుని మొక్కజొన్న పేలాలను వేయించి, వాటిని మెత్తగా పొడిలా చేసి అందులో బెల్లాన్ని కలుపుకొని దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతం ప్రసాదంగా స్వీకరిస్తారు.

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలిసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో మొదటిసారి డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతి రోజూ రెండు విడుతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి విడుత ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో విడుత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. పీఈటీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. దివ్యాంగ అభ్యర్థులకు (సదరం సర్టిఫికెట్‌ ఉన్న వారికి మాత్రమే) అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిరోజు 26 వేల మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. కాగా ఇప్పటి వరకు 2.2 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకోవాలి. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే పరీక్ష సమయానికంటే పది నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమతోపాటు హాల్‌ టికెట్‌, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, బాల్‌ పాయింట్‌ పెన్ను తమ వెంట తెచ్చుకోవాలి. గడియారాలు, మెటల్‌ వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లో అనుమతించరు.

డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

మరోవైపు డీఎస్సీ పరీక్షను వాయిదే వేయాలంటూ అభ్యర్ధులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లో కోరారు. రేపు (గురువారం) ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనున్నది. పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వలేదని, సిలబస్‌ అధికంగా ఉండటంతో వల్ల సరిగ్గా సన్నద్ధంకాలేకపోయామని, అందుకే పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జులై 18 నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సరిగ్గా అదేరోజు హైకోర్టు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ శైవ క్షేత్రాలకు వెళ్తున్నారా.. ఆ సమీపంలో ఉన్న అందమైన ప్రదేశాలపై కూడా ఓ లుక్ వేయండి..

చాలా మందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నట్లయితే శివయ్య దర్శనంతో పాటు ఇతర యాత్ర స్థలాను సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు.

అంటే దర్శనంతో పాటు సందర్శనా స్థలాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఆయా స్థలాలు ఏమిటో తెలుసుకుందాం.

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి. శ్రావణ మాసంలో భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. మీరు కాశికి వెళ్తున్నట్లు అయితే కాశీ విశ్వనాథ్‌తో పాటు అందమైన గంగా ఘాట్ వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రసిద్ధ స్ట్రీట్ ఆహారాలను రుచి చూడడమే కాదు రామ్‌నగర్ కోట, కొత్త కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు.

మధ్యప్రదేశ్: శ్రావణ మాసంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌కు వెళుతున్నట్లయితే.. ఖజురహో, చందేరి (ఈ కొండ పట్టణం ప్రకృతి అందాలతో నిండి ఉంది), రానే జలపాతం (ఈ జలపాతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, ఇక్కడ సందర్శన చిరస్మరణీయమైనది)ను సందర్శించవచ్చు. పంచమర్హికి వెళ్ళవచ్చు ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంది.

హరిద్వార్: శ్రావణ మాసంలో హరిద్వార్ వెళ్లాలనుకుని శివ భక్తులు భావిస్తారు. ఇక్కడ హర్ కి పౌరీ గంగా ఘాట్ ను సందర్శించవచ్చు. జ్వాలా దేవి, మానసా దేవి ఆలయాలను సందర్శించవచ్చు. అంతేకాదు కంఖాల్, శాంతికుంజ్, సప్తఋషి ఆశ్రమం సందర్శించవచ్చు. రిషికేశ్‌ ను సందర్శించడం పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు రామ్-లక్ష్మణ్ జూలా, నీలకంఠ మహాదేవ ఆలయన్ని, త్రివేణి ఘాట్, బీటిల్స్ ఆశ్రమం, 13 మంజిల్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

మహారాష్ట్ర: 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రావణ మాసంలో ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే దానితో పాటు మహాబలేశ్వర్ కూడా వెళ్లవచ్చు. అంతేకాదు లోనావాలా, అజంతా, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

తమిళనాడు: రామనాథస్వామి శివునికి చెందిన ప్రసిద్ధి దేవాలయం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించబడింది. ఇక్కడికి వెళితే మహాబలిపురం వెళ్లవచ్చు. ఈ ప్రదేశం UNESCO వరల్డ్ హెరిటేజ్‌లో చేర్చబడింది. ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు, శిల్పాలు ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అంతేకాదు వెయ్యి దేవాలయాల నగరంగా పిలువబడే కాంచీపురం వెళ్ళవచ్చు. కూర్గ్ ఇక్కడ అత్యంత అందమైన హిల్ స్టేషన్.

ఒడిశా: లింగరాజ్ ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్మించబడింది. ఇది శివుని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. వాస్తుశిల్పం చూడదగ్గది. శ్రావణ మాసంలో ఇక్కడకు వెళ్ళడం ఒక గొప్ప అనుభవం. ఇక్కడ కోణార్క్ టెంపుల్, చిలుక సరస్సు, నందన్ కన్హా జూ, హిరాకుడ్ డ్యామ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

రొట్టెల పండగకు సర్వం సిద్ధం.. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా..

త సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భార షాహిద్ దర్గా రొట్టెల పండుగ మంగళవారం నుంచి మొదలు కానుంది. ఇప్పటికె రొట్టెల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

ప్రతి సంవత్సరం మోహరం తరువాత రోజు రొట్టెల పండుగను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేటి నుంచి ఈనెల 21 వరకు ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగ నుంది. రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన గంధం ఈనెల 18 న జరుగనుంది. గంధంకి సంభందించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు..

బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. మాములుగా మొహారం తరువాత రోజు నుంచి రొట్టెల పండుగ ప్రారంభం అవుతుంది. అయితే ప్రతి ఏడాది ఒక రోజు ముందు నుంచే భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది సైతం రొట్టెల పండుగకు ఒక రోజు ముందు నుంచే వేలాది మంది భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలి వస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులు కునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు.

కోర్కెల రొట్టెలు ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే రొట్టెల పండుగ పద్ధతి. రొట్టెల పండుగ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిసేలా స్వర్ణాల చెరువులో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగురు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్టు గానే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిగా ఉన్న సమయంలో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం నారాయణ మంత్రిగా, శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండడంతో మరోసారి రొట్టెల పండుగను విజయ వంతం చేసేందుకు ఆధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రొట్టల పండుగకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఆ దిశగా ఏర్పాట్లు చేశారు అధికారులు..అధికార యంత్రాంగం తో పాటు టీడీపీ నేతలు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై హత్యాయత్నం.. మూడు కత్తి పోట్లు.. అసలు ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. రాజ్ తనను ప్రేమంచి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాము 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని అందులో తెలిపింది. అలాగే రాజ్ తనకు అబార్షన్ కూడా చేయించాడంటూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఫొటోలను పోలీసులకు సమర్పించింది. ఇక హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే రాజ్ తనన దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన నటి మాల్వీ కూడా తిరిగి లావణ్యపై కేసు పెట్టింది. దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణన లోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు జరుగుతుండగానే మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మాల్వీ తన కుమారుడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని, తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఒక మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే.. గతంలో నటి మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం జరిగింది. మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారు. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన. 2020 అక్టోబర్‌లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్వీపై ఒత్తిడి తెచ్చారట. అయితే అందుకు ఆమె అంగీకరించలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేశ్.. మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడట. అయితే ఈ దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగిందట. దీనికి సంబంధించి మాల్వీ యోగేశ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసులో యోగేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి

ఈ ఆలయం తాంత్రిక విశ్వవిద్యాలయం.. 64 గదుల్లో 64 శివలింగాలు, 64 యోగినీలు..

చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఉంది. ఈ ఆలయం పురాతనమైనది, రహస్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం తంత్ర సాధన, యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణించబడుతుంది.

భారతదేశంలో మొత్తం నాలుగు అరవై నాలుగు యోగిని ఆలయాలు ఉన్నాయి. వాటిలో రెండు ఒడిషాలో, రెండు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు దేవాలయాలలో మొరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలోని దేవాలయం అత్యంత ప్రముఖమైనది. పురాతనమైనది. ఈ ఆలయం ముఖ్యంగా తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అంటారు

చౌసత్ యోగిని ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చౌసత్ యోగిని ఆలయం తాంత్రిక సాధన, యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారట. అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారని స్థల పురాణం. తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. పూర్వం తంత్ర-మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారని స్థానికులు చెబుతారు.

ఆలయంలోని 64 గదుల్లో 64 శివలింగాలు, 64 యోగినిలు

చౌసత్ యోగిని ఆలయం క్రీ.శ. 1323లో నిర్మించబడిందని.. ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయంలో 64 గదులు ఉన్నాయి. ఈ 64 గదులలో 64 శివలింగాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంది. ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ మంటపం చుట్టూ 64 గదులు నిర్మించారు. ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి. అంటే ఇక్కడ 64 శివలింగాలతో పాటు 64 యోగిని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి. తంత్ర సాధన కోసం 64 మంది యోగినిల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు.

ఇక్కడ సాధన చేయడం ద్వారా అద్భుతమైన శక్తులను పొందవచ్చు.

చౌసత్ యోగిని ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మకం. ఈ ఆధ్యాత్మిక శక్తి సాధకులకు ధ్యానం, సాధనలో సహాయపడుతుంది. ఇక్కడి స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉంది. రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అనుమతి లేదు. ఎవరైనా నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం దాటిన తర్వాత ఉంటేవ వారు తమ జీవితాన్ని కోల్పోవలసి ఉంటుందని చెబుతున్నారు. దీని కారణం ఈ ఆలయంలో శివుని యోగినిలు రాత్రి సమయంలో మేల్కొంటారని నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో మంత్రాల పఠనం, యంత్రాల స్థాపన, హవనం నిర్వహించేవారు. యోగినిలను ప్రత్యేక మంత్రాలతో పూజించారు. ఈ సాధనల ద్వారా భక్తుడు అద్భుతమైన శక్తులను పొందేవారని చెబుతారు.

ఈ ఆలయం కాళీమాతకి సంబంధించినదని నమ్మకం
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం కాళీ మాతకు సంబంధించినది. ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళీకా దేవి అవతారం. పురాణ మత గ్రంథాల ప్రకారం ఘోర అనే రాక్షసుడిని సంహరించడానికి కాళికా దేవి యోగిని అవతారం దాల్చినట్లు తెలుస్తోంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.

నిర్మలమ్మ పద్దుపైనే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల ఆశలు.. ఆ రాయితీలను పెంచే అవకాశం

కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ మూడో సారి కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.

సాధారణంగా బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సర ముగింపులో ప్రవేశపెడతారు. ఎన్నికల ఏడాది మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. తర్వాత కేంద్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అన్ని రంగాల ప్రజలు ప్రత్యేక ఆసక్తిని చూపుతూ ఉంటారు. ప్రజలకు మేలు చేసే చాలా నిర్ణయాలు ఎన్నికల అనంతరం బడ్జెట్‌లో ప్రకటిస్తూ ఉంటారు. అయితే 2024-25కు సంబంధించిన బడ్జెట్‌పై దేశంలోని పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుల్లో రాయితీలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొనడం ఈ బడ్జెట్‌ గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ పరిమితిని పెంచుతున్నారనే అంచనాల మధ్య కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? చూస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పరిమితి దశాబ్ద కాలంగా పెంచలేదు. ఆ పరిమితి విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మధ్యతరగతి పన్ను చెల్లింపులు అంచనాల ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను స్లాబ్ లో రాయితీ

కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబ్స్‌లో మినహాయింపును కోరుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో వర్తించని కొన్ని మినహాయింపులను కూడా అందించాలని పేర్కొంటున్నారు.

సెక్షన్ 80సీ పరిమితి పెంపు

ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉన్న సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిని పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. దశాబ్ద కాలంగా ఈ పరిమితిని పెంచలేదని పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచాలని అంటున్నారు. హెూమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ల కోసం ప్రత్యేక తగ్గింపును గృహ కొనుగోలుదారులు ఎక్కువగా కోరుతున్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్లు, హెూమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్లతో సహా వివిధ ఖర్చుల కోసం రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. అయితే ఈ పరిమితిని పెంచడం ద్వారా గృహ కొనుగోలుదారులకు కూడా మేలు జరగనుంది.

స్టాండర్డ్ డిడక్షన్‌లో పెంపు

ఇటీవల కాలంలో వైద్య ఖర్చులు, ఇంధన ఖర్చులతో విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ సర్దుబాటు వల్ల ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గతుంది. తద్వారా మధ్యతరగతి ఉద్యోగులు ఖర్చుల నుంచి కాస్త ఉపశమనం పొందుతారు

సెక్షన్ 80డి తగ్గింపు పరిమితి పెంపు

సెక్షన్ 80డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల తగ్గింపు పరిమితిని పెంచాలని మధ్యతరగతి ఉద్యోగులు కోరుతున్నారు. ఈ పరిమితిని రూ. 25,000 నుండి రూ. 50,000కి సీనియర్ సిటిజన్లకు రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం వల్ల పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి మెరుగైన ఆర్థిక రక్షణ లభిస్తుందని అంటున్నారు.

రక్తంలో షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంచే స్పెషల్ హెర్బల్‌ టీ.. ఒక్క కప్పుతాగినా చాలు!

రీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంది. ఫలితంగా మధుమేహం వస్తుంది. మధుమేహం వల్ల కళ్ళు, గుండె, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.

మధుమేహాన్ని నియంత్రించడానికి బంగాళదుంపలు, స్వీట్లు సహా అనేక రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా చేదు కూరగాయలతోపోటు వైద్యులు సూచించిన మందులు వినియోగించాలి.

అయితే ఈ కింది హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయాబెటిస్‌ను నియంత్రించడానికి రోజూ మెంతి టీ తాగాలి. ఇందులో ఫైబర్, అమైనో ఆమ్లాలను అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మెంతుల టీ శరీర బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చాలా మంది గ్రీన్ టీ తాగేందుకు ఇష్టపడతారు. ఇది శరీర బరువును తగ్గించడం, జీవక్రియను మెరుగుపరచడం మాత్రమే కాకుండా, మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాటెచిన్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలో అల్లం టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని పెంచడంలోనూ సహాయపడుతుంది. మధుమేహం అదుపులో ఉండాలంటే రోజూ దాల్చిన చెక్క టీ తాగవచ్చు. ఇందులో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పైగా ఇన్సులిన్ హార్మోన్ను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

ఈ హెర్బల్ టీలను తీసుకోవడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.

తగ్గేదేలే.. ఎక్కడైనా మేకప్ చేసుకోవచ్చు.. మెట్రో రైల్‌లో హ్యాపీగా మేకప్ చేసుకుంటున్న యువతులు..

ఢిల్లీ మెట్రో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు రద్దీ కారణంగా , కొన్నిసార్లు మెట్రో లోపల తగాదాలు .. ఒకరిపై ఒకరు దాడి కారణంగా..

మెట్రో లోపల అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇలా రకరకాల సంఘటనలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు కొంతమంది పాటలు పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్ని సార్లు ప్రయాణీకులు ఆటపాటలను మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఆనందిస్తారు. అయితే ఢిల్లీ మెట్రో రైలు లోపల ఎవరైనా మేకప్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును, అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇందులో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీలోపల కూర్చున్నారు. అక్కడ ఏదో బ్యూటీ పార్లర్‌లో కూర్చున్నట్లు గా కూర్చుని మేకప్ చేసుకుంటున్నారు.

వైరల్ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీలోపల కూర్చున్నారు. ఆ బోగీ చాలా ఖాళీగా కనిపిస్తోంది. ఆ ఇద్దరు యువతుల పక్కన ఏ ప్రయాణీకుడు లేడు. అటువంటి పరిస్థితిలో ఆ ఇద్దరు యువతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మేకప్ చేసుకోవడం ప్రారంభించారు. అమ్మాయిలిద్దరూ ముఖానికి క్రీమ్ రాసుకోవడం.. మేకప్ వేసుకోవడం కోసం కూర్చున్న విధానం కూడా అద్భుతంగా ఉంది. ఒక అమ్మాయి కాళ్లను ముడిచి ఇంట్లో కూర్చున్నట్లు కూర్చోగా, మరో అమ్మాయి మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. వేరిద్దరూ ఢిల్లీకి చెందిన బాలికలేనని చెబుతున్నారు. మెట్రో లోపల ఇలాంటి దృశ్యాన్ని చూడడం చాలా అరుదు అని అంటున్నారు.

రికార్డు బద్దలు కొడుతున్న తిరుమల వెంకన్న ఆదాయం.. 6 నెలల్లో ఎన్ని కోట్లో తెలుసా..?

తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది.

ఆపదమొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ. 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి.

ఇక, ఏడు నెలల క్రితం ఏడుకొండలవాడికి ఉన్న ఆస్తులు వివరాలను కూడా టిటిడి ప్రకటించింది. ఈ మేరకు 24 బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయట పెట్టింది. ఈ లెక్కల ప్రకారం.. 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 17,816.15 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి.

టిటిడి గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టిటిడి 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్ లుగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల గోల్డ్ ను టిటిడి డిపాజిట్ చేసింది.

కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. ఈరోజు బుధవారం, తొలి ఏకాదశి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రూ.300 దర్శనానికి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్! పుష్ప 2 రిలీజ్ మళ్లీ వాయిదా! కారణమిదే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ క్రేజీ మూవీ విడుదలై మూడేళ్లు గడుస్తోంది.

దీంతో ఈ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. దీంతో పుష్ప 2 రిలీజ్ పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ వల్ల అల్లు అర్జున్ వేరే లు కూడా చేయడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగస్ట్ 15న పుష్ప 2 విడుదలయ్యేది. అయితే ఈ విడుదల తేదీని డిసెంబర్‌కి మార్చారు. అయితే ఇప్పుడు డిసెంబర్ లో పుష్ప సీక్వెల్ రావడం కష్టమని వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదే పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ పడింది. అల్లు అర్జున్ కూడా క్లీన్ షేవ్ చేసుకుని తన కుటుంబంతో కలిసి యూరప్‌కు విహారయాత్రకు వెళ్లాడు. మరోవైపు దర్శకుడు సుకుమార్ అమెరికా వెళ్లిపోయాడు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

పుష్ప 2’లో , అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.ఇక పుష్ప 2 నుంచి ఇప్పటికే రెండు పాటలు, ఒక టీజర్ ను విడుదల చేశారు. వీటికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక పుష్ప 2 పాటలు యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే డిసెంబర్ 6నే పుష్ప 2 రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాదికి వాయిదా పడనుందా? అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుష్ప 2 ను నిర్మిస్తున్నారు.

 

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

AP News:ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇటీవల ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు.

అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాదు బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు. కొత్త మంత్రులు తమ శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, లోటు బడ్జెట్ ఉందని గ్రహించి పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.

గోపీచంద్- శ్రీనువైట్ల విశ్వం మూవీలో ప్రభాస్!

ప్రస్తుతం ప్రభాస్ నామ సంవత్సరం నడుస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత థియేటర్స్ దగ్గర సందడి మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించి ఒక క్రేజీ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. అటు మ్యాచోమ్యాన్ గోపీచంద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న విశ్వం అనే యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ప్రభాస్ ఏం చేయబోతున్నాడు అంటూ లీకుల మీద లీకులు వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ ఇద్దరు మిత్రుల గురించే చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరు ఆఫ్ ది స్క్రీన్ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. వీళ్లు ఒక దగ్గర ఉంటే రచ్చ రచ్చ అవుతుంది. అయితే వీళ్లిద్దరినీ స్క్రీన్ మీద కలిపి చూడాలి అనేది ఫ్యాన్స్ కోరిక. వర్షం తర్వాత మళ్లీ ఆ కలయిక సాధ్యం కాలేదు. అయితే ఒకసారి వీళ్ల కాంబోలో ఒక క్రేజీ మల్టీ స్టారర్ రాబోతోంది అని చెప్పారు. కానీ, అది వార్తలాగే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం గోపీచంద్- శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న విశ్వం సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మెలిక ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వం సినిమాలో ప్రభాస్ ఉన్న మాట వాస్తవమే కానీ.. పాత్ర కాదంట. హీరో గోపీచంద్ క్యారెక్టర్ ని పరిచయం చేసేందుకు వాయిస్ ఓవర్ ఇస్తాడట. ప్రస్తుతం ఈ వార్త మాత్రం టాలీవుడ్ వర్గాల్లో బాగానే వైరల్ అవుతోంది. దాదాపుగా విశ్వం సినిమా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది అంటున్నారు. అయితే ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఇంక విశ్వం సినిమా విషయానికి వస్తే.. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న అప్ డేట్స్ చూస్తే ఆ విషయంపై క్లారిటీ ఉంది. ఇంక శ్రీనువైట్ల ఎంత కొత్తగా చూపిస్తాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభాస్ వాయిస్ ఓవర్ అనే వార్త రాగానే.. విశ్వం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది అంటున్నారు. గోపీచంద్ కి కూడా ఒక సరైన హిట్టు పడబోతోంది అంటూ అప్పుడే టాక్ స్టార్ట్ అయిపోయింది.

భయపెడుతూ నవ్వించిని హరర్ కామెడీ మూవీ.. ఓటీటీలో రికార్డు వ్యూస్ సొంతం!

ప్రస్తుతం జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో మూవీస్ ఒకటి. వారం వారం..థియేటర్లలో, ఓటీటీలో చాలా సినిమాలు విడుదలై సందడి చేస్తుంటాయి. అన్ని జోనర్ల మూవీస్ థియేటర్లలో, ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇదే సమయంలో చాలా మంది హరర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అవి ఎంత భయపెడుతున్న తిరిగి అలాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో కొన్ని హరర్ మూవీస్ భయపెడుతూనే..కడుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి ఓ సినిమా ఓటీటీలో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఆ మూవీ చేసుకుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మరి.. ఆ సినిమా ఏమిటి, ఎందురు స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం..

ప్రతి వారం ఓటీటీలో అనేక సినిమాలు రిలీజ్ అవుతాయి. కొన్ని మూవీలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హారర్ తో వణుకు పుట్టిస్తాయి. కాకుడ అనే బాలీవుడ్ మూవీ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తూనే నవ్విస్తోంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది.  ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించిన ‘కాకుడ’ జులై 12న ఓటీటీలోకి విడుదలైంది. అయితే అలా ఓటీటీలోకి వచ్చిన మూడు రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును సొంతం చేసుకుంది.

ఈ విషయాన్నిజీ5 సంస్థతో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేసింది. ‘చిల్లింగ్ వీకెండ్లో..చిల్లింగ్ టేకోవర్’ అంటూ జీ5 పోస్టుచ సింది. ఈ హరర్ మూవీలో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్, ఆసిఫ్ ఖాన్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీమ్ కీలక పాత్రలో నటించారు. ఇక హరర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన కాకుడ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ సినిమా కథ చాలా వెరైటీగా ఉంది. ప్రతి క్షణం ఉత్కంఠ భరింతంగా సాగుతోంది.

ఇక కాకుడ కథ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలో రథోడి అనే ఊరు శాపగ్రమై ఉంటుంది. అలానే ఆ గ్రామంలోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు దెయ్యం వస్తుంది. ఆ గ్రామంలోని వారు ఆ దెయ్యాని కాకుడ అనే బూతంగా చూస్తారు. అలానే ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు ప్రతి ఇంటికి ఉండే ఓ చిన్న తలుపును ఓపెన్ చేసి ఉంచాల్సిందే. అలా ఎవరైన తెరవకుండా ఉంటే.. వారిని 13 రోజుల టైమ్ ఇచ్చి మరీ ఆ ఇంటి మనిషిని కాకుడ దెయ్యం చంపేస్తుంది. ఈ విషయం తెలియని  సోనాక్షి భర్త ఆ చిన్న డోరును తెరిచి ఉంచడు. దీంతో అతడు కాకుడ దెయ్యానికి దొరికిపోతాడు.

ఇక రోజు ఆ దెయ్యం వస్తుందని..చంపేస్తుందని భయంతో వణికిపోతుంటాడు. ఇదే సమయంలో దెయ్యాలను వేటాడే వ్యక్తిగా (రితేష్ దేశ్‌ముఖ్) ఆ గ్రామంలోకి వెళ్తాడు. దెయ్యాలు, భూతాలు ఏమిలేవని, అదంతా మూఢనమ్మకమంటూను ధైర్యం చెబుతుంటాడు. ఇదే సమయంలో ఆ దెయ్యం అంతు చూడాలని రితేష్ నిర్ణయించుకుంటాడు. చివరికి వారిద్దరూ కలిసి ఆ కాకుదాను పట్టుకుంటారా? ఆ గ్రామం వాళ్లను ఎలా కాపాడతారు అన్నదే సినిమా స్టోరీ. ఎవరైనా ఈ సినిమాను చూడటం మిస్సై ఉంటే తప్పకుండా చూడండి.

రూ.3 వేల ఇయర్ బడ్స్ కేవలం 999 రూపాయలే! బెస్ట్ డీల్.. అస్సలు మిస్ అవ్వకండి

ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇయర్ బడ్స్ పై భారీ ఆఫర్ ఉంది. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. బెస్ట్ డీల్ మిస్ అయితే తర్వాత ఇంత తక్కువ ధరకు దొరకడం కష్టం అవ్వచ్చు. బౌల్ట్ ఆడియో జడ్ 60 ఇయర్ బడ్స్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 60 గంటల బ్యాటరీ సామర్థ్యంతో, క్లియర్ కాలింగ్ 4 మైక్స్ ఫీచర్ తో వస్తుంది. 50 ఎంఎస్ లో లేటెన్సీ గేమింగ్, 13 ఎంఎం బాస్ డ్రైవర్ సపోర్ట్ తో వస్తుంది. టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో, ఐపీ ఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బ్లూటూత్ 5.3 టీడబ్ల్యూఎస్ తో వస్తుంది.

దూరపు ప్రయాణాలు చేసేవారికి, ట్రిప్స్ కి వెళ్లేవారికి, గేమ్స్ ఆడేవారికి ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. 60 గంటల ప్లే టైంతో వస్తున్నందున అస్తమానూ ఛార్జ్ చేయాల్సిన పని లేదు. రెండున్నర రోజుల పాటు కంటిన్యూగా పాటలు వినచ్చు. 4 ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ని ఇందులో ఇచ్చారు. క్రిస్టల్ క్లియర్ కాల్స్ ని ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. చుట్టూ సౌండ్స్ వస్తున్నా గానీ క్లియర్ ఆడియో ఔట్ పుట్ అయితే ఇస్తుంది. హై క్వాలిటీ సౌండ్ అవుట్ పుట్ అయితే వస్తుంది. స్మూత్ గేమ్ ప్లే కోసం 50 ఎంఎస్ లో లెటెన్సీ ఫీచర్ ని ఇందులో ఉంచారు. గేమర్స్ కిది చాలా బాగా సెట్ అవుతుంది. ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ నిస్తుంది. గేమింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ లో ఉన్న 13 ఎంఎం డ్రైవర్స్ ఆడియో ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరచడమే కాకుండా సుపీరియర్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. హై క్వాలిటీ సౌండ్ ని కోరుకునే మ్యూజిక్ లవర్స్ కి కూడా ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఏడాది వారంటీ కూడా ఇస్తున్నారు. లక్ష మందికి పైగా దీన్ని కొన్నారు. అందులో 79 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. బ్యాటరీ బ్యాకప్ బాగుందని, ఇయర్ బడ్స్ లుక్ బాగుందని, డిజైన్ బాగుందని కస్టమర్స్ రివ్యూ ఇచ్చారు. బౌల్ట్ ఆడియో కంపెనీ దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో రూ. 999కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైం డీల్ కాబట్టి ఏ సమయంలో అయినా ఆఫర్ క్లోజ్ అవ్వచ్చు. కాబట్టి కొనాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయండి.

ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేస్తే దీంతో పాటు వచ్చేవి:

  • ఇయర్ బడ్స్
  • కేబుల్
  • ఇయర్ టిప్
  • వైర్ లెస్ ఛార్జింగ్ కేస్
  • యూజర్ మ్యాన్యువల్

48 వేల ల్యాప్‌ట్యాప్ కేవలం 28 వేలే.. ఇప్పుడు మిస్సైతే మళ్ళీ దొరకడం కష్టం!

ఒక మంచి ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. యాసర్ కంపెనీకి చెందిన యాసర్ స్మార్ట్ ఛాయిస్ ఆస్పైర్ లైట్ ఏఎండీ రైజన్ 3 5300యు ప్రీమియం థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ పై ఇప్పుడు భారీ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 20 వేలు తగ్గింపు లభిస్తుంది. ఏఎండీ రైజన్ 3 500యు క్వాడ్ కోర్ మొబైల్ ప్రాసెసర్ తో వస్తుంది. ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ తో వస్తుంది. 65 వాట్ మ్యాగ్జిమమ్ పవర్ సప్లైతో వస్తుంది. 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో.. అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ డీడీఆర్4 8 జీబీ ర్యామ్ తో, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ తో వస్తుంది. స్టోరేజ్ ని 1 టీబీ వరకూ విస్తరించుకునేలా అవకాశం ఉంది. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది.

మెటల్ బాడీతో స్టీల్ గ్రే కలర్ లో లభిస్తుంది. ఇది 1.6 కేజీ బరువు కలిగి ఉంది. యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్ ఒకటి, యూఎస్బీ 2.0 పోర్ట్స్ రెండు, యూఎస్బీ 3.2 జెన్ 2 పోర్ట్ ఒకటి, ఒక డీసీ జాక్ తో వస్తుంది. 36 వాట్ హవర్స్ సామర్థ్యంతో లిథియం బ్యాటరీతో వస్తుంది.  50 వేలకు పైగా ఈ ల్యాప్ టాప్ ని కొన్నవారిలో 86 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. గేమ్స్ ఆడేందుకు బెస్ట్ ల్యాప్ టాప్ అని, ర్యామ్ బాగుందని, పెట్టిన డబ్బుకు తగ్గా ల్యాప్ టాప్ అని రేటింగ్ ఇచ్చారు. అప్పీరెన్స్, పెర్ఫార్మెన్స్ బాగున్నాయని యూజర్స్ రేటింగ్ ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తే దీంతో పాటు పవర్ కార్డు, అడాప్టర్, యూజర్ మ్యాన్యువల్ వస్తాయి.

ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 47,990 కాగా ఆఫర్ లో రూ. 27,990కే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 20 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. 42 శాతం తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల మీద రూ. 1750 వరకూ అదనంగా తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ల్యాప్ టాప్ ని రూ. 26,240కే ఈ ల్యాప్ టాప్ ని పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది. కాబట్టి కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం.

Health Tips : చెడు కొలెస్ట్రాల్ సమస్య వెంటాడుతోందా.. పరగడుపున ఈ జ్యూస్ తాగితే చాలు? అన్ని రోగాలు నయం!

కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు కొత్తిమీరతో పాటు జీలకర్ర, టీఆకులు, పంచదార వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్న మహిళలు, సమయానికి పీరియడ్స్ రాని వారు, లేదా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర నీళ్లలో పంచదార కలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకోవడానికి కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఉప్పు, తగినన్నీ నీళ్లు అవసరం. కొత్తమీర జ్యూస్‌ కోసం ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి, దానిని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకుని తాగితే సరిపోతుంది. దీనిని ప్రతీరోజూ పరిగడుపున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! టాయిలెట్‌కి వాడుతామంటున్న నెటిజన్లు..స్పెషల్ ఏంటంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది.? 200 నుంచి ఓ 500 వరకు ఉంటుంది. ఇక ధనవంతులు ధరించే చెప్పుల ఖరీదు వెయ్యి, రెండు,మూడు వేలు కూడా ఉండోచ్చు. కొంతమంది ఇంకా ఖరీదైనవి ధరింస్తారు. కానీ, కువైట్‌లోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు. ఆ చెప్పుల్ని చూస్తే మాత్రం మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చెప్పులు మన దేశం చాలా మంది ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు లేదా టాయిలెట్‌లో ఉపయోగించేటప్పుడు ధరించే స్లిప్పర్‌లతో సమానంగా ఉంటాయి.

ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చెప్పుల అమ్మకానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో చెప్పుల నాణ్యత, దాని ధరను ప్రస్తావించారు. అయితే మన దగ్గర సాధారణంగా కనిపించే ఈ చెప్పుల ధర విని భారతీయులు ఆశ్చర్యపోయారు. వీడియోలో కనిపించినట్టుగా ఈ చెప్పుల ధర 4500 Saudi Riyalsగా ప్రకటించారు. అంటే సుమారు రూ. 1 లక్ష రూపాయలకు సమానం. ఇంట్లో వాడే స్లిప్పర్స్ లా ఉండే ఈ చెప్పుల ధర లక్ష రూపాయలు అని వినగానే భారతీయ జనాలు దానిపై ఫన్నీగా చర్చించుకుంటున్నారు. నేను టాయిలెట్‌కి వెళ్లడానికి ఇలాంటి స్లీపర్స్‌ని మాత్రమే ఉపయోగిస్తానని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ చెప్పులు నేను 60 రూపాయలకే కొంటానని ఒకరు రాశారు.

ఈ స్లిప్పర్ గరిష్ట ధర 250 రూపాయలు అని చాలా మంది నెటిజన్లు రాశారు. ఇంతకంటే ఎక్కువ చెల్లించడం వ్యర్థం అంటున్నారు. ఈ స్లిప్పర్‌ను ఇండియా నుండి కువైట్‌కి ఎగుమతి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకరు రాశారు. కేవలం 200 రూపాయలకే ఇక్కడ కొనుగోలు చేసుకుని అక్కడ 500-1000 రూపాయల వరకు అమ్ముకోవచ్చునని చెబుతున్నారు. ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తుందని మరొకరు అంటున్నారు కేవలం రూ.100 లోపు విలువ చేసే చెప్పులు రూ.లక్షకు అమ్ముతున్నారని మరొకరు రాశారు.

Amazon Offers: రూ. 20వేలకే ఐఫోన్! బంపర్ ఆఫర్.. మళ్లీ మళ్లీ రాదు..

ఆపిల్ ఐఫోన్లకు ప్రజల నుంచి ఉన్న ఆదరణ, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేయాలని ఎంతో ఆశపడతారు. అలాగే తమ స్టేటస్ కు సింబల్ గా కూడా వీటిని భావిస్తారు. ఐఫోన్లలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ఆపిల్ కంపెనీ అప్ డేట్ చేస్తూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందజేస్తోంది.

అందుబాటు ధర..

సాధారణంగా ఐఫోన్ల ధర సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా ఉంటుంది. దాన్ని కొనుగోలు చేయాలన్నా ఎంత ఆశ ఉన్నా అంత సొమ్ము వెచ్చించడం కష్టంగా మారుతుంది. అయితే ఐఫోన్ 15 అత్యంత తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ విడుదలైన నాటి నుంచి వినియోగదారుల ఆదరణ పొందుతోంది. దీనిపై తరచూ తగ్గింపు ఆఫర్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ లో కేవలం రూ.20,150కు ఈ ఫోన్ లభిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

బంపర్ ఆఫర్..

ఈ రోజుల్లో అన్ని ప్రత్యేకతలు ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం రూ.20 వేలు పెట్టుబడి పెట్టాలి. ఒక్కోసారి దీనికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అదే ధరకు ఐఫోన్ లభించడం నిజంగా బంపర్ ఆఫర్. కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ, ఐఫోన్ ను ఉపయోగించాలనే కోరిక ఉన్నవారికి ఇదే మంచి అవకాశం.

నిబంధనలు..

అమెజాన్ లో ప్రస్తుతం ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్)ను కేవలం రూ. 20,150కు సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం. అయితే ఈ ధరలో ఫోన్ ను పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా ఆఫర్ నిబంధనలను తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఢీల్..

అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్) ప్రస్తుతం రూ.79,900కు అందుబాటులో ఉంది. దీనిపై 11 శాతం తగ్గింపును ప్రకటించారు. దీంతో రూ.70,999కు ధర తగ్గింది. అలాగే వినియోగదారులు తమ పాత ఫోన్‌ను మంచి స్థితిలో ట్రేడింగ్ చేయడం ద్వారా 44,925 వరకూ ఆదా చేసుకోవచ్చు. దానితో ఐఫోన్ 15ను రూ. 26,074కి తగ్గించే అవకాశం కలుగుతుంది. అదనంగా అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి రూ.5,924 వరకూ తగ్గింపు అందిస్తున్నారు. దీంతో ఐఫోన్ 15ను చివరకూ రూ.20,150 సొంతం చేసుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్ ప్రత్యేకతలు..
  • ఐఫోన్ 15లోని 6.1 అంగుళాల డిస్ ప్లే ఎంతో ఆకట్టుకుంటుంది. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు తదితర ఆకర్షణీయమైన రంగులలో ఫోన్ లభిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్ లోని డైనమిక్ ఐలాండ్ నాచ్‌ని దీనిలో పరిచయం చేసింది.
  • కెమెరా విషయానికి వస్తే 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ అమర్చారు. దీంతో అన్ని సమయాలలోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది.
  • బ్యాటరీ పనితీరు చాలా మెరుగుగా ఉంది. దాదాపు 9 గంటలపైగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుంది. తరచూ చార్జింగ్ చేసుకునే అవసరం ఉండదు.
  • ఏ16 బయోనిక్ చిప్ ఆధారిత ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో వినియోగించిన ఏ15 చిప్ నుంచి దీనిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రో మోడళ్లలో కూడా ఏ16 రకం చిప్ లు ఉపయోగించారు. ఐఫోన్ 15 లో యూఎస్ బీ టైప్- సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు.

Best Smart Watches: ఆ వాచ్‌ల్లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు.. తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే మరి

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో నాణ్యమైన స్మార్ట్‌వాచ్‌ల కోసం వెతుకుతుతుకుతున్న స్మార్ట్ వాచ్ ప్రియులకు చాలా మంచి ఎంపిక 1.39 అంగుళాల డిస్‌ప్లేతో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. వివిధ ఆరోగ్య ఫీచర్లతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 120 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ ద్వారా పని చేస్తుంది. విభిన్నమైన రంగులు, ప్రత్యే స్టైల్స్‌లో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ లుక్స్ పరంగా ప్రీమియం లుక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1499గా ఉంది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 5 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ 1.96 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు పోస్ట్-ట్రైనింగ్ వర్కౌట్ విశ్లేషణతో రావడం వల్ల ఫిట్‌నెస్ ఔత్సాహికులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.4299గా ఉంది. అయితే ప్రత్యేక సేల్స్ సమయంలో ఈ వాచ్‌ను ప్రత్యేక ఆఫర్ కింద రూ.1500 కంటే తక్కువకు వస్తుంది.

1500 లోపు మంచి నాణ్యమైన బడ్జెట్ స్మార్ట్‌వాచ్ కోసం వెతుకుతున్న వారికి బోట్ కలర్ వేవ్ కాల్-2 స్మార్ట్ వాచ్ మంచి ఎంపికగా ఉంటుది. 1.83 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లేతో అధునాతన బ్లూటూత్ కాలింగ్‌తో ఈ స్మార్ట్ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. డీఐవై వాచ్ ఫేస్ స్టూడియోతో పాటు 700కి పైగా యాక్టివ్ మోడ్‌లు ఈ వాచ్ ప్రత్యేకత. అలాగే క్రికెట్ ఔత్సాహికులను ఈ వాచ్ అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్‌లో గరిష్టంగా 10 పరిచయాలను కూడా సేవ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ధర ప్రస్తుతం రూ.1299గా ఉంది.

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అద్భుతమైన ఫీచర్లతో యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. అధునాతన అల్ట్రా వీయూహెచ్‌డీ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, అలాగే అనేక వాచ్ ఫేస్‌లతో ఈ వాచ్ అమితంగా ఆకర్షిస్తుంది. ఇన్‌బిల్ట్ గేమ్‌లతో పాటు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లతో వచ్చే ఈ స్మార్ట్ ఆరోగ్యానికి సంబంధించిన అనేక అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1498గా ఉంది.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ త్రీ స్మార్ట్‌వాచ్‌లో 1.96 అంగుళాల డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఆటో స్పోర్ట్ డిటెక్షన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్‌లో 170కి పైగా వాచ్ ఫేస్‌లను కలిగి ఉన్నాయి. కర్వ్డ్ డిస్‌ప్లేతో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా వచ్చే ఈ స్మార్ట్ వాచ్ అధునాతన బ్లూటూత్ కాలింగ్‌తో వస్తుంది. స్మార్ట్ డోంట్ డిస్టర్బ్ మోడ్‌‌తో పాటు డిసేబుల్‌గా సౌండ్ స్లీప్ ఈ వాచ్ ప్రత్యేకత. ఈ స్మార్ట్ వాచ్ ధర ప్రస్తుతం రూ.1299గా ఉంది.

Smart Tv’s: ఆ స్మార్ట్ టీవీలతో మీ ఇల్లు మరింత స్మార్ట్.. మార్కెట్‌లో ఎక్కువగా ఏ టీవీలు అమ్ముడవుతున్నాయంటే..?

హాయర్ 55 అంగుళాల టీవీ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 4కేతో స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్పష్టత, మృదువైన విజువల్స్ కోసం మోషన్ బ్లర్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ గూగుల్ టీవీ 178 వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో కూడా వస్తుంది. ఈ టీవీ అల్ట్రా హై డెఫినిషన్ మోడ్‌లు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ టీవీ ధర రూ. 38,990గా ఉంది.

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ టీవీ 43 అంగుళాల స్టాండింగ్ స్క్రీన్ పరిమాణంతో వస్తుంది. ఈ టీవీ మధ్యస్థ-పరిమాణ బెడ్‌రూమ్‌లకు మంచి ఎంపిక. ఎల్ఈడీ స్క్రీన్‌తో వచ్చే ఈ టీవీ అతి తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మోషన్ బ్లర్‌‌తో పాటు అధిక ఫ్రీక్వెన్సీ సంగీతంతో పాటు నాణ్యతను మెరుగుపరిచే ఏఐ సౌండ్ ప్రోతో వచ్చే ఈ టీవీ ధర రూ. 31,990

ఎంఐ 43 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హై డెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ 4కేకు సపోర్ట్ చేసే ఈ టీవీ సినిమాటిక్ సౌండ్, ఎన్వలపింగ్ అనుభవం కోసం డాల్బీ ఆడియోతో 30 వాట్స్ స్పీకర్లతో వస్తుంది. ముఖ్యంగా ఈ స్పీకర్లు ప్లేబ్యాక్ సౌండ్‌లను కూడా మెరుగుపరుస్తాయి. వైఫై కనెక్ట్ చేసేలా వస్తున్న ఈ టీవీ ధర రూ. 26,499గా ఉంది.

రెడ్‌మీ ఎల్ఈడీ ఫైర్ టీవీ 43 అంగుళాల స్టాండింగ్ స్క్రీన్ సైజుతో వస్తుంది. ఈ టీవీ చిన్న, మధ్యస్థ పరిమాణ గదులకు మంచి ఎంపికగా ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వచ్చే ఈ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ టీవీ ప్రధాన స్ట్రీమింగ్ యాప్‌లను ఆశ్వాదించవచ్చు. స్క్రీన్ కాస్టింగ్ ఫీచర్‌ రావడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయడంతో పాటు ఈ టీవీ గేమ్‌లు ఆడవచ్చు. 24 వాట్స్ స్పీకర్లతో వచ్చే ఈ టీవీ ధర రూ. 23,999గా ఉంది.

టీసీఎల్ స్మార్ట్ గూగుల్ టీవీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌తో వచ్చే ఈ టీవీలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుంచి కంటెంట్‌ను ప్లే చేయవచ్చు. హై పెనెట్రేషన్ స్క్రీన్ డిస్ప్లే‌ ఆధారం పని చేసే టీ- స్క్రీన్‌ ఫీచర్‌తో వచ్చే ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 24,990గా ఉంది.

Washing Machines: మొండి మరకలను మాయం చేసే వాషింగ్ మెషీన్‌లు ఇవే.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ కల్చర్ అధికంగా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా వాషింగ్ మెషీన్ ఉండాల్సి వస్తుంది. అయితే వాషింగ్ మెషీన్‌లో ఉతికిన బట్టలు చేతితో ఉతికనంత తెల్లగా రావని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న టెక్నాలజీకు అనుగునంగా చేతితో ఉతికినంత ఫీల్ ఇచ్చేలా సూపర్ వాషింగ్ మెషీన్లను కంపెనీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా మొండి మరకలను పొగొట్టాలంటే కచ్చితంగా వేడి నీటితో ఉతకాలనే విషయంలో అందరికీ తెలుసు. అయితే ఈ వాషింగ్ మెషీన్స్‌ ఇన్‌బుల్ట్ వాటర్ హీటర్ ఫీచర్‌తో మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ఏయే వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ఎల్‌జీ 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్

వాషింగ్ మెషీన్స్ విభాగంలో ఎల్‌జీ కంపెనీ వాషింగ్ మెషీన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఏడు కేజీల వాషింగ్ మెషీన్ విభాగంలో మధ్య తరగతి ప్రజలకు అనువుగా తక్కువ కరెంట్‌తో పని చేసే 5 స్టార్ రేటింగ్‌ వాషింగ్ మెషీన్ ఇటీవల మహిళలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ 10 వాష్ ప్రోగ్రామ్‌లు, 1200 ఆర్‌పీఎం స్పిన్ స్పీడ్‌తో వస్తుంది. 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషిన్ ధర రూ. 28,990గా ఉంది.

సామ్‌సంగ్ 9 కేజీ ఇన్వర్టర్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

సామ్‌సంగ్ కంపెనీ గృహోపకరణాల విషయంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. 9 వాష్ ప్రోగ్రామ్‌లతో 680 ఆర్‌పీఎం స్పిన్ స్పీడ్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్‌ను వైఫైతో పాటు సామ్‌సంగ్ యాప్‌తో నియంత్రించవచ్చు. ఎకోబబుల్ వాష్ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే 73 శాతం తక్కువ శక్తిని, 19 శాతం తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. ఈ సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్ ధర రూ.24,990గా ఉంది.

Health

సినిమా