Saturday, November 16, 2024

పదవీ విరమణ పొందే ఆ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీ అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. అలాగే 200 యూనిట్లకు ఉచిత కరెంట్, 500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి హామీ ఇచ్చారు.  తాజాగా అంగన్ వాడీ ఉద్యోగస్తులకు తెలంగాణ సర్కర్ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రాథమిక విద్యాను ప్రోత్సహించేందుకు ‘అమ్మ మాట.. అంగన్‌వాడి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిన్నటి నుంచి ప్రారంభంమైన ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగించేందుకు ఐసీడీఎస్ సిబ్బంది సిద్దమయ్యారు. దీనికి సంబంధించి అంగన్ వాడీ టీచర్లకు విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తారు. ఇదిలా ఉంటే.. అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఓ గొప్ప శుభవార్త చెప్పారు.తెలంగాణ‌లో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

మంగళవారం రహమత్ నగర్ లో జరిగిన ‘అమ్మ పాట- అంగన్‌వాడి బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లకు తొలి ఒడి అమ్మ అయితే.. మలి ఒడి అంగన్ వాడీ కేంద్రాలే అని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్దితో పాటు క్రమ శిక్షణ నేర్పిస్తూ భావి భారత పౌరులకు గా తీర్చి దిద్దిదేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఇకపై రిటైర్‌మెంట్ తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నాను. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేర్చుతుందని అన్నారు.

బడ్జెట్ ధరలో మరో కొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 170KM రేంజ్

వరల్డ్ వైడ్ గా విద్యుత్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభ్యమవ్వడం.. డ్రైవ్ చేసేందుకు కూడా ఈజీగా ఉండడంతో ఈవీల కొనుగోలుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఈవీలు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈవీ ప్రియుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. ఐవూమీ ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త జీత్‌ ఎక్స్ జడ్‌ఈ స్కూటర్ ను 3కేడబ్య్లూహెచ్ ఆప్షన్ లో లాంఛ్ చేసింది.

ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు, పెట్రోల్ ఖర్చులు అధికమవుతున్న తరుణంలో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా తక్కువ ఖర్చుతోనే 100కి.మీలకుపైగానే ప్రయాణించే వీలుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఐవూమీ రిలీజ్ చేసిన జీత్‌ ఎక్స్ జడ్‌ఈ సింగిల్ ఛార్జ్ తో 170 కి.మీ దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కళ్లు చెదిరే డిజైన్, సూపర్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షిస్తోంది. ఈ ఈవీకి మార్కెట్ లో మంచి స్పందన లభిస్తోంది.

ఈ స్కూటర్‌ని మొబైల్ యాప్ కనెక్టివిటీతో స్మార్ట్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ రూట్ సమాచారాన్ని అందించే నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో నావిగేట్‌ చేయవచ్చు. వీటితో పాటు స్కూటర్ స్క్రీన్‌లో కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను పొందవచ్చు, ట్రావెల్ డేటా, ఎస్ఓసీ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయి. ఇది గంటకు 63 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎక్, రైడర్, స్పీడ్ మోడ్స్‌ని అందించారు. ఎకో మోడ్‌లో 170 కి.మీలు, రైడర్ మోడ్‌లో 140 కి.మీలు, స్పీడ్ మోడ్‌లో 130 కి.మీల రేంజ్ ను కలిగి ఉంది.

గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నాతాధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుతో లింక్ చేయకుండా సేవలు అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ మెయిన్ టైన్ చేయాలని సూచించారు. అలాగే  గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూరల్ ఏరియాలో వైద్యులకు మెరుగైన పారితోషికం అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో చేపట్టిన సదస్సులో ఈ మేరకు ఆదేశాలు చేశారు రేవంత్ రెడ్డి.

ప్రజాహితమే ధ్యేయంగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ.. ఇది ప్రజా ప్రభుత్వం అనే మార్కు కనిపించేలా పాలన సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పారు.  ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజాపాలన సహా ఇతర రూపాల్లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.  ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఆర్ఎంపీ, పీఎంపీల ఇబ్బందులు తొలగిపోయేలా చర్యలు తీసుకోెవాలని తెలిపారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు.  ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై సీఎం అధికారులతో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి..  కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించే తీరుగా కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని, ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లాంటి అధికారులు చూపిన ఆదర్శాలను పాటించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

Viral News: పనికి రాని బట్టలతో లక్షలు సంపాదిస్తోంది.. వాటే ఐడియా..

ప్పుడైనా ఒక కొత్త ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అందరికంటే వినూత్నంగా ఆలోచిస్తే.. బిజినెస్‌లో మీరే టాప్ ఉంటారు. దీంతో పాటే డబ్బు కూడా మీ సొంతం అవుతుంది.

సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించడానికి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎందులో సక్సెస్ అవ్వాలన్నా కాస్త ఓపిక ఉండాలి. ఈ ప్రయత్నాల్లో చాలా మంది ఫెయిల్ అయి నష్టాలను చవి చూస్తూ ఉంటారు. కానీ అధైర్య పడకుండా ఉన్నవాటిల్లో కొత్తగా ఆలోచిస్తే.. పోయిన డబ్బు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మహిళ కూడా ఎవరి ఊహకు అందకుండా వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. యూకేకి చెందని ఈ మహిళ పేరు హన్నా. వాడి పడేసే దుస్తులను అమ్మి డబ్బు సంపాదిస్తుంది. అంతే కాకుండా ఈమె ఓ పాపులర్ టెక్‌టాకర్. ఈ క్రమంలోనే ఆమె బిజినెస్ గురించి చెప్తూ టిప్స్ షేర్ చేస్తూ ఉంది. దీంతో ఈ విషయం కాస్తా వైరల్ అయింది. చాలా మందిని ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది. వాడి పడేసిన బట్టలతో డబ్బులు ఎలా సంపాదించాలో కొన్ని వీడియోల ద్వారా షేర్ చేసుకుంది.

హన్నా తాను వాడిన దుస్తులను నగలను, బూట్లను ఆన్‌లైన్‌లో ప్లేస్ వింటెడ్‌లో తక్కువ ధరకు అమ్మడం మొదలు పెట్టింది. చాలా మంది చవకైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొంటూ ఉంటారు. ఇలా ఆమెకు ప్రాఫిట్ రావడం మొదలయ్యింది. దీంతో మరి కొందరి దగ్గర.. వాడేసిన దుస్తులు, నగలు, చెప్పులు వంటివి కొని.. ఆన్‌లైన్‌లో అమ్మడం స్టార్ట్ చేసింది.

ఈ ఫ్లాట్ ఫామ్‌లో సెల్లార్స్‌కి ఎలాంటి ఫీజు లేదు. కానీ బయ్యర్స్‌కి మాత్రం కొంత ఛార్జ్ చెల్లించాలి. ఈ బిజినెస్‌తో హన్నా ఏకంగా రూ.6,44,330 సంపాదించినట్టు వెల్లడించింది. హన్నాకు వచ్చిన ఈ ఐడియా తెలుసుకుని చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు. తెలివి ఉండాలే కానీ.. ఎలా అయినా మనం బిజినెస్ స్టార్ట్ చేసి.. ట్రెండ్ అవ్వొచ్చని హన్నానే నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

PAN Card: పాన్ కార్డును పూర్తిగా రద్దు చేయడం సాధ్యమేనా? ఆదాయ పన్ను శాఖ ఏం చెబుతోందంటే..

న దేశంలో పాన్ కార్డు అనేది చాలా కీలకమైన పత్రం. ఆర్థిక లావాదేవీలు, ట్యాక్స్ సంబంధిత అంశాలలో ఇదే అత్యంత ప్రధానమైనది. పాన్ కార్డు ఆధారంగానే ఈ కార్యకలాపాలు జరుగుతుంటాయి.

పాన్ కార్డు అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్. దీనిని ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇది వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి, ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇది 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను కలిగి ఉంటుంది. పన్ను చట్టాలను పాటించడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, పన్ను బాధ్యతలను కచ్చితంగా అంచనా వేయడానికి ఇది అవసరం. అయితే కొన్ని సందర్భాల్లో ఆదాయ పన్ను శాఖకు మీ పాన్ కార్డును సరెండర్ చేయాల్సి ఉంటుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. మీ పాన్ కార్డును తిరిగి ఆదాయ పన్ను శాఖకు వెనక్కి ఇవ్వొచ్చు. అది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది? ఒకవేళ మీరు పాన్ కార్డును సరెండర్ చేయాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఈ సందర్భాల్లో..

ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉండటం, పాన్ కార్డ్‌పై తప్పు వివరాలు లేదా ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన ఇతర చెల్లుబాటు అయ్యే పరిపాలనా లేదా చట్టపరమైన కారణాలు ఉంటే మీ పాన్‌ను అధికారుల ముందు సరెండర్ చేయాల్సి ఉంటుంది.

పాన్ సరెండర్ చేయాలంటే..

అభ్యర్థన లేఖను సిద్ధం చేయండి.. మీ పాన్ రద్దు లేదా సరెండర్ కోసం అభ్యర్థిస్తూ మీ స్థానిక ఆదాయపు పన్ను మదింపు అధికారికి అధికారిక లేఖ రాయండి. ఆ లేఖలో పాన్ నంబర్, రద్దు/సరెండర్‌కు కారణం, మీరు కోరుతున్న ఏదైనా నిర్దిష్ట అభ్యర్థన లేదా చర్య (ఉదా, నకిలీ పాన్ రద్దు, తప్పు వివరాలు మొదలైనవి)

లోకల్ ఇన్ కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్(ఐటీఏఓ)ను సందర్శించండి.. మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌తో పాటు మీ అభ్యర్థన లేఖను స్థానిక ఆదాయపు పన్ను మదింపు అధికారి (ఐటీఏఓ) లేదా మీ అధికార పరిధిలోని పాన్ సెల్‌కు తీసుకెళ్లండి. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో లేదా వారి హెల్ప్‌లైన్‌ను సంప్రదించడం ద్వారా మీ ఐటీఏఓ చిరునామా, ఇతర వివరాలను కనుగొనవచ్చు.

పత్రాలను సమర్పించండి.. మీరు ఐటీఏఓ/పాన్ సెల్‌ని సందర్శించినప్పుడు పాన్ రద్దు/సరెండర్ కోసం అభ్యర్థన లేఖ, మీరు సరెండర్ చేయాలనుకుంటున్న ఒరిజినల్ పాన్ కార్డ్, ధ్రువీకరణ లేదా ప్రాసెసింగ్ కోసం ఐటీఏఓ అడిగిన ఇతర పత్రాలు.

ధ్రువీకరణ, రసీదు.. ఐటీఏఓ/పాన్ సెల్ కు సమర్పించిన వివరాలు, పత్రాలను ధృవీకరించవచ్చు. సంతృప్తి చెందిన తర్వాత, వారు మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత, మీరు మీ పాన్ రద్దు/సరెండర్ నిర్ధారణ లేదా రసీదుని అందుకోవాలి. ఇది లేఖ లేదా రసీదు రూపంలో ఉండవచ్చు.

సరెండర్ చేసిన పాన్ కార్డ్‌ను ధ్వంసం చేయండి.. మీ పాన్ రద్దు/సరెండర్ అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత, మీరు సరెండర్ చేసిన పాన్ కార్డ్‌ను వికర్ణంగా కత్తిరించడం ద్వారా లేదా దుర్వినియోగాన్ని నిరోధించడానికి దానిని ముక్కలు చేయడం ద్వారా ధ్వంసం చేయాలి.

ఇది గుర్తుంచుకోండి..

పాన్ రద్దు/సరెండర్ సాధారణంగా డూప్లికేట్ పాన్‌లు జారీ అయినప్పుడు, తప్పు వివరాలు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే కారణాలతో మాత్రమే జరుగుతుంది. ప్రక్రియను సులభతరం చేయడానికి మీ అభ్యర్థన లేఖలో మీకు స్పష్టమైన కారణాలను ప్రస్తావించాలి.

Viral News: వందేళ్ల తర్వాత ఢిల్లీ ఇలానే ఉండబోతోందట.. ఏఐ ఫొటోలు వైరల్..

ఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఏఐని ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు అప్ లోడ్ చేస్తూ ఉంటున్నారు.

అదే విధంగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని డబ్బులను కూడా దోచుకుంటున్నారు.

అయితే అన్నీ నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వందేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉండబోతోందో చూస్తే మీకు ఖచ్చితంగా మతి పోవడం ఖాయం.

చాలా మంది ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగించి తాము ఎలా ఉండబోతామో తెలుసుకుని.. కొన్ని రకాల ఫొటోలను నెట్టింట అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.

వందేళ్ల తర్వాత ఢిల్లీ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఫొటోగ్రఫీలో ఈ టెక్నాలజీ మరింత అద్భుతంగా ఉంది.

భవిష్యత్తు కాలంలో ఢిల్లీ ఎలా ఉండబోతోందో చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

మినరల్ వాటర్ ప్రపంచంలో సరికొత్త రికార్డ్.. ది క్లియర్ ప్రీమియం వాటర్ బాటిల్..

దేశప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపంపిణీ వ్యవస్థలో ఒక గేమ్ ఛేంజర్‎గా ఆవిర్భవించింది ది క్లియర్ ప్రీమియం వాటర్. ఎనర్జీ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకదూర దృష్టి విధానంతో ఈ క్లియర్ ప్రీమియం వాటర్ ప్రారంభించింది.

2005లోఒక చిన్న వాటర్ బాటిల్‎తో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం ఉన్నత శిఖరాలకు ఎదిగింది. 2005లో ఎదుర్కొన్న తాగునీటి ఇబ్బందుల గురించి పరిశోధనలు చేసి అనేక విషయాలను గుర్తించింది. దీంతో ది క్లియర్ ప్రీమియం వాటర్ ను స్థాపించేందుకు నడుము బిగించింది. ప్రజల దాహాన్ని తీర్చడమేకాకుండా తనవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు తననిబద్ధతను కలిగి ఉంది ఈ సంస్థ. అందులోభాగంగా 2010లో విన్నూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టింది.

వాటర్ బాటిళ్ల తయారీలో 40 శాతం తక్కువ ప్లాస్టిక్‎ను ఉపయోగించి సరికొత్త విధానాన్ని రూపొందించి. భారతదేశంలోనే ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థగా పేరుగణించింది. బాటిల్ నాణ్యత, నీటి శుద్ది, బ్రాండింగ్ లో నిబద్దతను కలిగి ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80వేలకుపైగా వాటర్ బాటిల్ ప్రీమియం అవుట్ లేట్లు కలిగి ఉన్నట్లు తెలిపింది. 1000కి పైగా డిస్ట్రిబ్యూటర్లతో పాటూ ఐదు ప్రధాన విమానాశ్రయాలతో భాగస్వామ్యం అయి విక్రయిస్తున్నట్లు తెలిపింది. క్లియర్ వాటర్ ప్రీమియం సంస్థ ఇంతటి గొప్ప పేరు గణించేందుకు మంచి నాణ్యతను కలిగి ఉండటమే అంటున్నారు సంస్థ ప్రతినిధులు. ఈ వాటర్ బాటిల్ లో నీరు నింపే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా 11 దశల్లో శుద్ది చేయబడుతుందని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా 121 నాణ్యతా తనిఖీ కేంద్రాల్లో పరీక్షించబడుతుందని చెబుతున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా బాటిళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు చెబుతోంది ది క్లియర్ ప్రీమియం వాటర్. భారతదేశ వ్యాప్తంగా 2 అతి పెద్ద విశాలమైన ప్లాంట్లు, 40 కంటే ఎక్కువ కో-ప్యాకింగ్ యూనిట్లను కలిగి ఉంది. ది క్లియర్ ప్రీమియం వాటర్ మార్కెట్లో ఇంతటి గొప్ప విజయం సాధించడానికి అనేక కారణాలున్నాయన్నారు సంస్థ సీఈవో & ఫౌండర్ నాయన్షా. ఈ వాటర్ బాటిల్ ఉత్పత్తి చేసే ముందు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిపారు. వ్యాపారం లాభాపేక్షకోసం కాకుండా ప్రజలకు మంచి రక్షిత, సురక్షితమైన తాగునీరును అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగామన్నారు.

కమ్యూనిటీ డెవలప్మెంట్ లో కూడా తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ విలువలే తమ సంస్థను సుదీర్ఘకాలం విజయవంతంగా ముందుకు నడిపించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్లియర్ ప్రీమియం వాటర్ 2027 నాటికి ప్లాస్టిక్ – న్యూట్రల్ అవ్వడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలు, వాటర్ పాజిటివిటీని పొందడమే తమ లక్ష్యమన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఐఎస్ఓ 22000:2005, ఐఎస్ఓ 9001:2015, హెఎస్ఎసిపి, ఎఫ్ఎస్ఎస్ఏఐ, సీజిడబ్ల్యూ, బిఐఎస్, సిసిఎ, జిపిసిబి, నెఫ్రా, ఇపిఆర్సహా అనేక సర్టిఫికేషన్ కలిగి ఉన్నట్లు చెప్పారు.

Katrina Kaif: బాబోయ్.. సినిమాల్లో నటించకపోయిన భారీగా సంపాదిస్తున్న కత్రినా.. మల్లీశ్వరి ఆస్తుల గురించి తెలిస్తే షాకే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అలాగే మల్లీశ్వరి తో తెలుగు తెరకు పరిచయమైంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ లతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‏ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి తో తెలుగు తెరకు పరిచయమైంది.

హిందీలో బ్యాక్ టూ బ్యాక్ లతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‏ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు లకు దూరంగా ఉన్న కత్రినా.. ఇటీవలే మెర్రీ క్రిస్మస్ లో నటించింది. ప్రస్తుతం కత్రినా ఒక్కో కు రూ.15 నుంచి రూ.20 కోట్లు తీసుకుంటుంది.

అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్‌కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం
అలాగే ఒక్క ప్రకటనకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక ఈవెంట్స్‌లో పెర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా రూ.3.5 కోట్లు తీసుకుంటుంది. కత్రినా కైఫ్‌కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది. 2019 సంవత్సరంలో ప్రారంభించింది. దాని పేరు ‘కె బ్యూటీ’.
ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రూ.224 కోట్లు ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రీనా.. ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి సందడి చేసింది.

Viral: 2 రోజులుగా ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. ఆస్పత్రికి వెళ్లిన సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.

ఎన్నిసార్లు హెల్ప్.. హెల్ప్.. అంటూ అరిచినా.. అతడి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు. అతడు ఆస్పత్రికి వెళ్లింది శనివారం కావడంతో చాలామంది సిబ్బంది సెలవులో ఉన్నారు. దీంతో బాధితుడు లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయం ఆస్పత్రిలో ఎవరికి తెలియలేదు. 2 రోజులుగా లిఫ్ట్‌లో అల్లాడిన వ్యక్తి ఎట్టకేలకు సోమవారం ఉదయం లిఫ్ట్‌ నుంచి బయటపడ్డాడు. సోమవారం ఉదయం తమ రోజువారీ పనుల నిమిత్తం వచ్చిన సిబ్బందికి లిఫ్ట్‌లో ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ను ఆపరేట్‌ చేసి వారిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్(59) శనివారం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. “అతడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్ట్ మధ్యలోనే డౌన్ అయింది. ఆ తర్వాత తెరుచుకోబడలేదు.దీంతో భయాందోళనకు గురైన సదరు వ్యక్తి సాయం కోసం కేకలు వేశాడు. అయితే అది ఎవ్వరికీ వినబడలేదు. అలాగే ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది” అని పోలీసులు తెలిపారు.

సోమవారం తెల్లవారుజామున లిఫ్ట్‌ ఆపరేటర్లు రోజూవారి పనులు ప్రారంభించడానికి వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ వ్యక్తి ఆసుపత్రికి వచ్చి.. ఆ తర్వాత కనిపించకుండాపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి చెందిన ఆపరేటర్‌ లిఫ్ట్‌ తెరిచి చూడగా అందులో అపస్మారక స్థితిలో సదరు వ్యక్తి కనిపించాడు. వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. షాక్‌కు గురై 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నునొప్పికి చికిత్స చేయించుకునేందుకు రవీంద్రన్ శనివారం ఉదయం ఎంసీహెచ్‌లోని ఆర్థోపెడిక్ విభాగానికి వచ్చారు. డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత కొన్ని వైద్య రికార్డులను తీసుకుని ఇంటికి వెళ్లాడు.

శనివారం మధ్యాహ్నం రవీంద్రన్ తిరిగి వచ్చి ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో, రవీంద్రన్ మొబైల్ ఫోన్ విరిగిపోయింది. దీంతో అతడు ఎవరిని సంప్రదించలేకపోయారు. “నేను అలారం బటన్‌ని నొక్కాను, కానీ ఎవరూ రాలేదు. నేను ఎమర్జెన్సీ ఫోన్‌ను కూడా లిఫ్ట్‌లో ప్రయత్నించాను, కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు,” అని బాధితుడు పేర్కొన్నాడు.

Vastu Tips: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటున్నారా.? ఈ వాస్తు నియమాలు పాటించండి..

ఇంటి కొనుగోలు సమయంలో వాస్తును చూసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత మారుతోన్నా వాస్తును విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తింటి నిర్మాణం విషయంలో కాకుండా అప్పటికే నిర్మించిన ఇంటి విషయంలో కూడా వాస్తును చూస్తున్నారు.

భూముల ధరలు ఆకాశన్నంటిన ప్రస్తుత తరుణంలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే అపార్ట్‌మెంట్‌ల విషయంలో కూడా వాస్తును పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేసే సమయంలో కూడా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి ప్రధాన ద్వారం ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో డైనింగ్ టేబుల్‌ ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి చూస్తే డైనింగ్ టేబుల్ కనిపించకూడదని సూచిస్తున్నారు.

* మీరు కొనుగోలు చేయాలనుకునే ఫ్లాట్‌లో వంట గది తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే వంట గదిలో స్టౌవ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

* ఇక ఫ్లాట్‌లో మాస్టర్‌ బెడ్ రూమ్‌ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్‌రూమ్‌పై వాటర్‌ ట్యాంక్‌ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఈశాన్యం దిశలో ఎక్కు ఖాళీ స్థలం ఉండడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యం దిశ ఇరుకుగా ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుందని అంటున్నారు.

* ఇక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే విషయంలో చూడాల్సిన అంశం. ఎల్లప్పుడూ మెయిన్‌ డోర్‌ ఉత్తరం లేదు తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం లేవగానే వెంటిలేషన్‌ వచ్చేలా ఉండడం బెటర్‌.

* అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ విషయంలో తీసుకోవాల్సిన మరో జాగ్రత్త లివింగ్ రూమ్‌. ఫ్లాట్‌లో హాల్‌ ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి.

* టాయిలెట్స్‌ వాయువ్యం లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో టాయిలెట్స్‌ ఉండకూడదని గుర్తు పెట్టుకోండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

Motorola Edge 50 Neo: మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే..

మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్5o ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

మోటోరాలో ఎడ్జ్‌ 50 నియో ఫోన్‌ను 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999 కాగా, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించినట్లు సమాచారం.

ఈ ఫోన్‌ను గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్ కలర్స్‌లో లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన పీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ను అందించనున్నారు.

అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.

CMF Buds Pro 2: చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌.. ఫీచర్స్‌ కూడా సూపర్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ తయారీ సంస్థ సీఎమ్‌ఎఫ్‌ తాజాగా మార్కెట్లోకి ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశాయి. సీఎమ్‌ఎఫ్‌ బడ్స్‌ ప్రో 2 పేరుతో కొత్త ఇయబర్‌ బడ్స్‌ను తీసుకొచ్చింది.

ఇందులో డ్యూయల్‌ డ్రైవర్‌ సిస్టమ్‌ను అందించారు.

ఈ ఇయర్‌ బడ్స్‌ 50డీబీ హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సలైజేషన్‌ను అందించారు. దీంతో ఈ నాణ్యతతో కూడిన కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ఇయర్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 43 గంటలపాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

ఇయర్‌ బడ్స్‌ను నేరుగా చాట్‌ జీపీటీతో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బడ్స్‌లో 60 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 460 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ కేస్‌తో తీసుకొచ్చారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేయడానికి 70 నిమిషాలు పడుతాయి.

ఇక ఈ ఇయర్‌ బడ్స్‌ బరువు విషయానికొస్తే ఒక్కో బడ్‌ 4.9 గ్రాములుగా ఉంటుంది. రెండింటితోపాటు, ఛార్జింగ్ కేసు మొత్తం కలిపి 55.8 గ్రాముల బరువు ఉంటుంది.

ధర విషయానికొస్తే సీఎమ్‌ఎఫ్‌ బడ్స్‌ ప్రో2 రూ. 4299గా నిర్ణయించారు. జులై 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

 

India Post GDS Recruitment 2024: తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే.. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీలను కూడా వెబ్‌సైట్లో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల వరకు ఉన్నాయి.

పోస్టుల వివరాలు ఇవే..

  • బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)
  • డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు.. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అధికారులు అలర్ట్‌

రాగల ఐదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా మేఘాలు విరిగిపడ్డాయా.. వరుణుడు దండెత్తాడా.. కారుమబ్బులన్నీ ధారపోస్తున్నాయా.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొన్నటి వరకు కనిపించకుండాపోయిన వరుణుడు.. గత మూడు రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.

తెలంగాణలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. ఇక సోమవారం జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. భారీ వర్షానికి హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది అధికారులు. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపారు. అటు కోస్తాంధ్ర వ్యాప్తంగానూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని… మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు.

ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు దగ్గర వరద ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాలెం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెంన్సీ గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అలర్ట్‌ అయ్యారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ… గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

One Nation One Rate: త్వరలో వన్‌ నేషన్‌.. వన్ రేట్ పాలసీ.. దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా..?

Gold Prices: దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా?. దేశమంతా ఒకే రేటు విధానం అమల్లోకి రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గోల్డ్ వ్యాపారులు ఈ ప్రపోజల్‌కు సూత్రప్రాయంగా ప్రస్తుతానికి అంగీకరించినా, సెప్టెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

వన్‌ నేషన్-వన్ ఎలక్షన్, వన్ నేషన్‌-వన్ రేషన్‌లా దేశంలో ఇప్పుడు మరో కొత్త స్లోగన్ వినిపిస్తోంది. అదే వన్ నేషన్‌ వన్ రేట్. దేశంలోని గోల్డ్ వ్యాపారులందరూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ONOR విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. బంగారం ధరలు స్థిరీకరించేందుకు, వన్ నేషన్‌ వన్ రేట్ విధానంపై జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వ్యాపారుల అభిప్రాయం కోరింది. దేశంలో మెజారిటీ బంగారు వ్యాపారులందరూ ONOR పాలసీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే GJC మీటింగ్‌లో వన్‌ నేషన్, వన్ రేట్ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం బంగారం రేట్లు రాష్ట్రానికో విధంగా ఉంటాయి. ఢిల్లీలో ఒక రేటు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లలో మరో రేటు ఉంటుంది. వన్ నేషన్‌ వన్ రేట్‌తో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వినియోగదారులు అందరికీ బంగారం ఒకే రేటుకు లభించనుంది. ONOR అమలైతే.. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ అనే భేదం లేకుండా అన్నిచోట్ల ఆభరణాలు ఒకే రేటుకు లభిస్తాయి. ఒక రేటు విధానంతో గోల్డ్ మార్కెట్ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుందని వ్యాపారులు అంటున్నారు. ONORతో కస్టమర్లకు దళారుల బెడద లేకుండా.. పారదర్శకమైన విధానం తెచ్చినట్లు అవుతుందని, ఎక్కడా అక్రమాలకు చోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

వన్‌ నేషన్‌, వన్ రేట్‌ విధానంతో బంగారం ధరలు కూడా కొంత తగ్గుతాయని, వినియోగదారులకు కాస్త ఊరట లభిస్తుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Jageshwar Mandir: శివలింగాన్ని పూజించడం ఎక్కడ నుంచి మొదలైందో తెలుసా..! ఆ ఆలయ విశిష్టత, విశేషాలు ఏమిటంటే?

దేవభూమిని ఉత్తరాఖండ్ ను సాంస్కృతిక నగరంగా కూడా పిలుస్తారు. హిందూ మతపరంగా ముఖ్యమైన అల్మోరా జిల్లాలో అనేక పౌరాణిక , చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జగేశ్వర్ ధామ్ ఆలయం.

ఇక్కడ నుంచి శివలింగ ఆరాధన ప్రారంభమైనదిగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో జగేశ్వర ఆలయం విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆలయం పేరు చరిత్రలో నమోదు చేయబడింది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల నాటిది.

ఇక్కడి నుంచి శివలింగ పూజ ప్రారంభమైంది
జగేశ్వర ధామ్ శివుని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటి. జగేశ్వర ధామ్ శివుని తపస్సు చేసే ప్రదేశంగా పరిగణించబడుతుంది. లింగ రూపంలో శివుడిని ఆరాధించే సంప్రదాయం భూమి మీద మొదట ప్రారంభమైన మొదటి ఆలయం ఇదేనని పురాణాల కథనం. జగేశ్వర్‌ను ఉత్తరాఖండ్‌లోని ఐదవ ధామ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. దీనిని యోగేశ్వర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పురాణాలలో కూడా ప్రస్తావించబడింది.

కాంప్లెక్స్‌లో మొత్తం 124 దేవాలయాలు
పార్వతి, హనుమంతుడు, మృత్యుంజయ మహాదేవుడు, భైరవ, కేదార్నాథుడు, దుర్గ వంటి మొత్తం 124 ఆలయాలు ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో నేటికీ పూజలు జరుగుతాయి. నమ్మకం ప్రకారం శివుడు, సప్తఋషులు ఇక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ ప్రదేశం నుండే శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక విశేషమేమిటంటే.. ఎవరైనా ఈ ఆలయ నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. దీని నిర్మాణం సరిగ్గా కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

శివుని పాదముద్రలు
అల్మోరాలోని జగేశ్వర్ దేవాలయం కొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో భీమా దేవాలయం సమీపంలో శివుని పాదముద్రలు ఉన్నాయి. పాండవులకు కనపడకుండా ఉండేందుకు పరమశివుడు ఒక పాదాన్ని ఇక్కడ, మరో కాలు కైలాసంపై ఉంచాడని చెబుతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట లభించింది. రెండు రోజుల స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరల్లో మార్పు కనిపించింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 120 మేరకు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా ఆ ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. మంగళవారం దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా మార్పు కనిపిస్తోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.67,490

విజయవాడ – రూ.67,490

బెంగళూరు – రూ.67,490

ముంబై – రూ.67,490

కోల్‌కతా – రూ.67,490

ఢిల్లీ – రూ.67,640

చెన్నై – రూ.67,840

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.73,630

విజయవాడ – రూ.73,630

బెంగళూరు – రూ.73,630

ముంబై – రూ.73,630

కోల్‌కతా – రూ.73,630

ఢిల్లీ – రూ.73,780

చెన్నై – రూ.74,010

వెండి ధరల్లో మార్పులు..

బంగారం బాటలోనే వెండి కూడా రూ. 400 మేరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 99,600 ఉండగా.. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి రూ. 95,100గా.. బెంగళూరులో కేజీ వెండి రూ. 95,300గా ఉంది.

Viral: డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.! ఈమె సంపాదన ఎంతో తెలిస్తే

బ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించాలో చెప్పడమే ఆమె ఉద్యోగం.. ఇక ఇలా పాఠాలు చెప్పినందుకు గానూ ఆమెకు వచ్చేది కోట్లలో జీతం. నమ్మలేకపోతున్నారు కదూ.!

ఇది ముమ్మాటికీ నిజమండీ బాబూ.. సోషల్ మీడియాలో సంచలనానికి కేరాఫ్ అయిన ఈ యువతి ఉండే దేశం చైనా. ఇంతకీ మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..

చైనాలో లీచువాంకూ అనే మహిళ చాలా ఫేమస్. అక్కడ ఈమే చాలా పెద్ద సోషల్ ఇన్ఫ్లూయెన్సర్. ప్రతీ బంధమూ మన అవసరాలు తీర్చేందుకే.. పైగా పెళ్ళంటేనే ఆర్ధికంగా మనం స్థిరపడేందుకు ఓ మార్గం అని నమ్మి.. ఇతరులకు పాఠాలు బోధిస్తోంది లీచువాంకూ. డబ్బు, బట్టలు, బియ్యం.. ఇలా అన్ని కూడా పెళ్లి చేసుకుంటే దొరుకుతాయి.. మన అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఇక ఆమె చెప్పే ఒక్కో సెషన్‌కు రూ. 13 వేల నుంచి రూ.1.16 లక్షల వరకూ వసూలు చేస్తోంది. ఇక ఇలాంటి పాఠాలు నేర్పిస్తే.. సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా.. ఆమెపై బ్యాన్ విధించింది.

అయితేనేం సదరు మహిళ తగ్గేదేలే అన్నట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ.. తన ఫాలోవర్స్‌కు అందుబాటులో ఉంటూ కోట్లు కొల్లగొడుతోంది. ఇక చైనాలో ఈమెపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలను తమను తాము లైంగిక వస్తువులా మారేందుకు ఆమె ప్రేరేపిస్తోందని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మగాళ్లను డబ్బులు తెచ్చే యంత్రాల మాదిరి చూస్తోందని మండిపడ్డారు. ఏదైతేనేం ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య ఆమె మాత్రం చైనాలో సంచలనానికి కేరాఫ్‌గా మారింది.

Leftover Idli Recipes: ఇడ్లీలు మిగిలిపోయాయా..! ఇలా టేస్టీగా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం..

టిఫిన్ అనగానే అందరి మదిలో ముందుగా గుర్తుకోచ్చేంది ఇడ్లి. దక్షిణాదిలో ఫేమస్ టిఫిన్ నేడు ఉత్తరాదిన మాత్రమే కాదు.. ప్రపచం వ్యాప్తంగా అడుగు పెట్టింది.

తెల్లగా చూడగానే ఆకర్షించే ఇడ్లి రుచిగా ఉంటుంది. దీనిని తినడం వలన బరువు అదుపు లో ఉంటుంది. తేలికగా జీర్ణం అవుతుంది. అందుకనే ఇడ్లీని చాలా మంది ఇష్టంగా తింటారు. దీని తయారీ కోసం ఉపయోగించే పదార్ధాలు మినపప్పు, వరి నూక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవిరి మీద ఉడికించి తయారు చేసే ఇడ్లీని ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా సహాయకారి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఇడ్లీని సాంబారు, చట్నీ,కారం పొడి, నెయ్యి వేసుకుని ఎక్కువగా తింటారు. అయితే ఇడ్లీ తయారీ కోసం బయట తయారు చేసిన పిండికి బదులుగా ఇంట్లోనే ఇడ్లీ బ్యాటర్ ను రెడీ చేసుకోవచ్చు.

ఒక కప్పు మినప పప్పు తీసుకుని రాత్రి అంతా నానబెట్టాలి. మర్నాడు ఉదయం మినప పప్పుని శుభ్రం చేసి గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి. ఇపుడు ఆ మినప పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంతలో ఇడ్లి రవ్వను (బియ్యం నూక) తీసుకుని రెండు కప్పులు ఒక గిన్నెలో వేసుకుని నీరు వేసి శుభ్రం చేసుకుని ఇప్పుడు ఆ నూకలో నీరు లేకుండా గట్టిగా పిండి మినప పిండిలో వేసి కలుపుకోవాలి. అంతె ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఈ పిండితో ఇడ్లీ, ఊతప్ప, లేదా మినప రొట్టె వంటి ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు.

అయితే ఇడ్లీని టిఫిన్ గా తయరు చేసుకున్న తర్వాత కొన్ని సార్లు ఇంట్లో అందరూ తిన్నా ఇడ్లీలు మిగిలిపోతాయి. లేకా ఒకొక్కసారి చట్నీ లేదా సాంబారు అయిపోయి ఇడ్లీలు మిగిలిపోతాయి. అప్పుడు అలా మిగిలిన ఇడ్లీని ఎలా తినాలో అర్థం కాక కొంతమంది వాటిని పడేస్తారు. అయితే ఇలా మిగిలిపోయిన ఇడ్లీని మరింత రుచికరంగా చేసుకోవచ్చు. మిగిలిన ఇడ్లీతో రుచికరమైన వంటకం

కావాల్సిన పదార్ధాలు

జీలకర్ర
ఆవాలు
ఎండు మిర్చి
కరివేపాకు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కాప్సికమ్
క్యారెట్
టమాటాలు
పసుపు
ఉప్పు
నెయ్యి
సాంబార్ మసాలా పొడి
కొత్తిమీర

తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ వేసి కాసేపు వేగనివ్వాలి. దీని తరువాత టమోటా ముక్కలు వేసి బాగా కలపాలి.. ఆపై ఉప్పు, పసుపు, తరువాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. బాగా వేయించిన తర్వాత మసాలా మిశ్రమానికి కొంచెం నీరు జోడించండి. కొంచెం సేపు ఈ మిశ్రమం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇడ్లీలపై తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఇడ్లీ రెడీ.

మీ కారు వర్షపు నీటిలో చిక్కుకుందా? ఈ పొరపాటు చేయకండి.. బీమా వర్తించదు!

ప్రతి నాణేనికి రెండు వైపులుంటాయి. ఇది వాతావరణానికి కూడా వర్తిస్తుంది. వర్షాకాలంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నా కొన్నిసార్లు వరదల కారణంగా వాహనాలు నీట మునిగి లక్షల్లో నష్టపోతున్నారు.

ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాము. ఈ కాలంలో వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కార్లు వర్షపు నీటితో ఎన్నో మునిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీరు కారు ఇంజిన్‌లోకి వెళ్తాయి. దీని కారణంగా కారు దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తి కారుకు బీమా చేసినట్లయితే, అతను పూర్తి మొత్తాన్ని పొందుతాడా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి?

అయితే, మీ పాలసీని బట్టి పరిస్థితులు మారవచ్చు. ఒకవేళ మీ వాహనం నీటిలో చిక్కుకుపోయినట్లయితే, మీరు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. వాహనం నీటిలో ఉన్నప్పుడు దాన్ని స్టార్ట్ చేయకూడదు అంటే ఇంజిన్ స్విచ్ ఆఫ్‌లో ఉండాలి. ఇంజిన్‌లోకి నీరు చేరినట్లయితే, వాహనాన్ని నడపకండి. బదులుగా వాహనాన్ని బయటకు నెట్టండి. దాని ఫోటో, వీడియోను తప్పకుండా రికార్డ్ చేయండి. ఇది కాకుండా, బీమా కంపెనీ డిమాండ్ చేసిన పత్రాలను కూడా సిద్ధం చేయండి. ఆ తర్వాత మీ క్లెయిమ్ వివిధ షరతుల ఆధారంగా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆమోదిస్తుంది.

ఈ సందర్భంలో, బీమా కంపెనీ ముందుగా మీ కారు రిపేర్ కండిషన్‌లో ఉందా లేదా వంటి కొన్ని విషయాలను పరిశీలిస్తుంది. కారును సరిచేయగలిగితే, దాన్ని సరిచేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ వాహనం ప్రస్తుత ఐబీవీ విలువ కంటే వాహనాన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటే ఈ సందర్భంలో కంపెనీ వాహనాన్ని మొత్తం నష్టంగా ప్రకటిస్తుంది. మీకు ఐడీవీ విలువ ఇస్తారు.

IDV విలువ కంటే మరమ్మతు ఖర్చు తక్కువగా ఉంటే కంపెనీ మీ కారును రిపేర్ చేస్తుంది. IDV విలువ అనేది మీ కారు మంచి కండిషన్‌లో లేనప్పుడు కంపెనీ మీకు ఇచ్చే మొత్తం. ప్రతి సంవత్సరం వాహనం ఐడీవీ విలువ 10 శాతం తగ్గుతుంది.

ఎలాంటి బీమా అవసరం?

మనీ9 నివేదిక ప్రకారం.. మీరు మీ కారు సమగ్ర బీమాను పొందినట్లయితే, అటువంటి పరిస్థితిలో మీరు బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. మీరు సమగ్ర పాలసీని కలిగి ఉంటే, వర్షాకాలంలో చెట్లు పడిపోవడం లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల మీ వాహనానికి జరిగిన నష్టానికి మీరు పరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను సమగ్ర పాలసీలో మాత్రమే భర్తీ చేయవచ్చు.. కానీ థర్డ్ పార్టీ బీమాలో ఇలాంటివి వర్తించవని గుర్తించుకోండి.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లాభదాయకం కాదా?

అయితే, ఇప్పుడు ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి చేయడంతోపాటు థర్డ్ పార్టీ బీమా కూడా ఇందులో చట్టబద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది థర్డ్ పార్టీ బీమా తీసుకుంటారు. కానీ, మీరు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయే అవకాశం ఉన్న చోటికి వెళుతున్నట్లయితే, మీకు సమగ్ర కవరేజ్ అవసరం. ఈ బీమా నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు మీరు క్లెయిమ్ చేయలేరు.

Kalki 2898 AD: 1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. భాజా భజంత్రీలతో సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.

అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో కల్కి కు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గానూ కల్కి కు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం బరిలో పెద్ద లేవీ లేకపోవడంతో ప్రభాస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. ఎక్కడ చూసినా కల్కి థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. దీంతో చిత్ర బృందం ఫుల్‌ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి మూవీ సక్సెస్‌ వేడుకను చిత్రబృంద సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ భాజా భజంత్రీలతో ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కల్కి లో లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు.

వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి ను నిర్మించింది. ఈ కు సీక్వెల్ కూడా రానుంది. దీనిపై నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ కూడా క్లారిటీ ఇచ్చారు.

An Apple A Day: రోజుకో యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తినడానికి కూడా సమయం ఉందని తెలుసా..

వరైనా సరే దినచర్యలో భాగంగా తినే ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవాలనుకుంటే.. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత ఆపిల్ తినడానికి ఉత్తమ సమయం లేదా పగటిపూట తినాలి.

వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వలన కొన్నిసార్లు జీర్ణం అవ్వడం కష్టమవుతుంది. అయితే ఈ రోజు రోజూ ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా: రోజూ యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాస్తవానికి యాపిల్ లో పొటాషియం ఉంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని తినడం వలన చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. యాపిల్స్‌లో ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడే అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

జీర్ణక్రియ మెరుగు: మలబద్ధకంతో బాధపడేవారికి కూడా యాపిల్ తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాపిల్ శక్తిని ఇస్తుంది: యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. యాపిల్‌లో ఫ్రక్టోజ్ కూడా ఉంది. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కనుక ఆపిల్‌ను ఆఫీసులో అల్పాహారంగా తీసుకోవచ్చు లేదా అల్పాహారం తర్వాత తినవచ్చు. యాపిల్ ను ఎప్పుడూ పైన తొక్కతోనే తినాలని గుర్తుంచుకోవాలి.

యాపిల్ చర్మానికి మేలు: రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొద్ది రోజుల్లోనే దీని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తినడం వల్ల, చర్మం లోపల నుండి ఆరోగ్యంగా మారుతుంది. ముఖంపై సహజమైన పింక్ గ్లో కనిపిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు: యాపిల్ తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది చాలా తీపిని కలిగి ఉన్నప్పటికీ.. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై తక్కువ ప్రభావాన్ని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇతర పోషకాలు ఉన్నాయి. దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

Petrol Price Hike: వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. ఎక్కడో తెలుసా?

ద్రవ్యోల్బణం ఇప్పటికే పాకిస్థాన్ వెన్ను విరిచింది. కరెంటు రేట్ల భారీ పెంపు తర్వాత కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలపై ద్రవ్యోల్బణం ‘పెట్రోల్’ బాంబు మరోసారి పేలింది.

ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ ప్రజలపై ఖరీదైన పెట్రోల్ భారం మరింత పెరిగింది. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచేసింది. ఈ పెంపుతో పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.300కి చేరువైంది.

పాకిస్థాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.9.99 పెంచింది. దీని తర్వాత పెట్రోల్ ధర రూ.275.60కి పెరిగింది. అదే సమయంలో డీజిల్ ధర 6.18 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత డీజిల్ లీటరుకు 283.63 రూపాయలుగా మారింది. అంతకుముందు జూలై 2న ధరలు పెరిగాయి. దీనికి 14 రోజుల ముందు జూలై 1న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.7, రూ.9 పెంచారు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తన నివేదికలలో ఒకదానిలో పెట్రోలు ధరలను లీటరుకు రూ. 7.45 పెంచినట్లు, హై-స్పీడ్ డీజిల్ ధర రూ.9.56 (హెచ్‌ఎస్‌డి) పెంచినట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నివేదించింది.

పన్నును పెంచే అవకాశం:

నివేదికల ప్రకారం.. ఫైనాన్స్ బిల్లు 2024లో పెట్రోలియం పన్ను గరిష్ట పరిమితిని లీటరుకు రూ.80గా ప్రతిపాదించారు. అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం పన్నులు పెంచనుంది. ఇది పెట్రోల్, డిజీల్‌ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది.

Treasure Hunt: శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపద నిక్షిప్తం.. నాటి బ్రిటిష్ పాలకుల ప్రయత్నాలు ఫలించని వైనం..

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక పురాతన ఆలయాలు, ప్రసిద్ది క్షేత్రాలు ఉన్నాయి. నేటికీ సైన్ చేధించని మిస్టరీలను దాచుకున్న ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.

ఇక హిందూ దేవాలయాలు వాటి సంపద గురించి తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ప్రముఖ దేవాలయాలలోని విలువైన సంపదను దోచుకుని వెళ్ళడానికి అనేక మంది రాజులు విదేశీయులు అలయపై దండయాత్ర చేసినట్లు చరిత్ర పేర్కొంది. తిరుమల తిరపతి వెంకన్న, కేరళ అనంత పద్మనాభ స్వామీ,. పురీ జగన్నాథుడు, సోమనాథ ఆలయం ఇలా అనేక ఆలయాలు విలువైన సంపదతో అత్యంత ధనిక ఆలయాలుగా ప్రపంచ ఖ్యాతిగాంచాయి. ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి ఏడవ నేలమాళిగ రహస్యం అపరిష్కృతంగా మిలిగిపోయింది. ఇక తాజాగా పురీ జగన్నాథుడు సంపాదను లెక్కించే పనిని అధికారులు చేపట్టారు. ఇప్పటికే శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో మూడవ రత్న భాండాగారం తలపులు తెరచిన సంగతి తెలిసిందే. అయితే జగన్నాథుడు బహుదా యాత్రతో పాటు ఏకాదశి, ద్వాదశి రోజున జరగనున్న ఉత్సవాలను పురష్కరించి రత్న భాండాగారాల సంపద లెక్కింపుని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం అడుగున ఒక రహస్య గది ఉందని.. దీనిలో అపార సంపద ఉందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని.. ఈ గదిలో అంతులేని విలువైన సంపద దాచినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రహస్య గదిలోకి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం కూడా ఉందని అంటున్నారు. ఎన్నికల హామీలో ఇచ్చినట్లు రత్న భాండాగారం తెరచి సంపద లెక్కింపు చేపట్టిన నేపధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ రహస్య గదిని గుర్తించే విధంగా ప్రయత్నాలు చేయాలనీ సూచిస్తున్నారు. జగన్నాథుడు సంపదపై కన్నేసిన అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రహస్య గదిని వెళ్ళడానికి ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. 902లో బ్రిటిష్ వారి పాలనలో ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసి.. చివరకు విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు చరిత్ర కారులు.

జగన్నాథుడు విలువైన సంపద విషయంపై ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్‌ మిశ్ర మాట్లాడుతూ.. పూరీని పాలించిన రాజు కపిలేంద్రదేవ్‌ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో లెక్క లేనంత సంపదను తీసుకుని వచ్చి జగన్నాథునికి భక్తీ శ్రద్దలతో సమర్పించినట్లు చరిత్రలో ఉందన్నారు. కాలక్రమంలో పూరీని పాలించే పురుషోత్తందేవ్‌ హయాంలోనూ పురుషోత్తముడికి భారీగా నగలు, నాణేలు వంటి అపార సంపద సమకూరిందని తెలిపారు.

స్వామివారికి చెందిన ఈ అపార సంపదను భద్ర పరచడానికి పూరీ క్షేత్రంలోని రత్న భాండాగారం దిగువన ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరచి.. ఒక రహస్య గది నిర్మించారని వెల్లడించారు. ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి దేవికి సంబంధించిన వడ్డాణాలు, సుభద్రాదేవి ఆభరణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని తెలిపారు. అసలు ఈ రహస్య గదిలో రాజులు దాచిన సంపద వెలకట్టలేనిదని చెప్పారు. ఇందుకు తగిన ఆధారాలు.. పట్టాభిషేకంలో భాగంగా జగన్నాథుని గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు కొలువుదీరిన దేవతా విగ్రహాలు అని చెబుతున్నారు నరేంద్రకుమార్‌ మిశ్ర.

లోక రక్షకుడు జగన్నాథుడు సంపద విషయంపై మరో చరిత్ర కారుడు డాక్టర్‌ నరేశ్‌చంద్ర దాస్‌ మాట్లాడుతూ.. ఉత్కళ సామ్రాజ్యంపై అనేక సార్లు ముస్లింలు దండయాత్ర చేశారు. దాడులు చేసి దోచుకున్నారు. ఈ ముస్లిం దాడులనుంచి స్వామివారి సంపదను రక్షించేందుకు జగన్నాథుడు సంపదను ముస్లిం రాజులు దోచుకోకుండా అప్పటి రాజులు తగిన చర్యలు తీసుకున్నారు. స్వామి క్షేత్రంలో
రహస్య గదులు నిర్మించి.. ఆ గదుల్లో జగన్నాథుడికి రాజులు, భక్తులు ఇచ్చిన అపార సంపదను దాచినట్లు నరేశ్‌చంద్ర దాస్‌ పేర్కొన్నారు. మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఆ అపార సంపదపై కన్ను పడింది. దీంతో రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల ద్వారా 1902లో ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా రహస్య గదిలోపలకు పంపించినట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తీ ఆచూకీ మళ్ళీ బ్రిటిష్ పాలకులకు లభించలేదు. దీంతో తమ ప్రయత్నాలను విరమించుకున్నారని తెలిపారు. ఇంకా ఈ విషయంపై డాక్టర్‌ నరేశ్‌చంద్ర దాస్‌ మాట్లాడుతూ శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు.. వారిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నాయి. అయినప్పటికీ ఆ రహస్య గదుల్లోకి నేటికీ ఎవరూ అడుగు పెట్టలేక పోయారని దాస్ చెప్పారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.

Shah Rukh Khan: షారుఖ్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైన అభిషేక్..’కింగ్’ ఖాన్ సినిమాలో విలన్‌గా జూనియర్ బచ్చన్

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ చాలా ల్లో హీరోగా మెరిశాడు. అయితే ఇటీవల అతను నటించిన లన్నీ వరుసగా బోల్తా కొడుతున్నాయి.

దీంతో కొత్త తరహా పాత్రలు అంగీకరించేందుకు రెడీ అవుతున్నాడు జూనియర్ బచ్చన్. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లో విలన్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ తదుపరి చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న పేరు). ఈ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ లోనే అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం.

అభిషేక్‌కి ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తాడట. విలన్ పాత్ర ఇచ్చినా సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేస్తున్నాడు. ‘కింగ్’ కు విలన్‌గా నటించాలంటే అద్భుతమైన నటుడు కావాలి. అందుకే అభిషేక్‌కి ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఆ పాత్ర గురించి వినగానే అంగీకరించినట్లు సమాచారం. దీని గురించి టీమ్ నుండి అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ‘కింగ్’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అక్టోబర్ 2023 నుండి సుజయ్ ఘోష్ షారుఖ్ ఖాన్‌ను చాలాసార్లు కలిశాడు. ఇప్పుడు కథ ఫైనల్ అయింది. జవాన్, పఠాన్ లాగానే ఈ లో కూడా భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. కాగా ఈ కు ముందే ‘ది ఆర్చీస్’ లో సుహానా నటించింది. అయితే ఇందులో ఆమె నటనపై విమర్శలు వచ్చాయి. కూడా నిరాశ పర్చింది.. అందుకే సుహానా ఖాన్ ‘కింగ్’ కోసం యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటోందని అంటున్నారు.

షారుక్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెండో తోనే సుహానా హోమ్‌ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చింది. షారుఖ్ ఖాన్ చివరిగా ‘డంకీ’ లో కనిపించాడు. ఆ తర్వాత ఆయన కొత్త ఏదీ అధికారికంగా ప్రకటించలేదు.

AP News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసిందోచ్

పీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది.

ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.. కర్ణాటక, తెలంగాణలో ఈ పధకం అమలవుతున్న తీరుపై నివేదికలు కోరింది. రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు.? ప్రభుత్వంపై ఎంతమేరకు భారం పడుతుంది.? అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి.? అనే అంశాలపై పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలను సిద్దం చేశారు.

Indian Railways: రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చా?

భారతదేశం రవాణా లైఫ్‌లైన్. భారతీయ రైల్వేలు దేశం కనెక్టివిటీకి వెన్నెముకగా పనిచేస్తాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ఒకటి. అదే ప్రపంచంలో భారీ రవాణా వ్యవస్థలో రైల్వే నాలుగో స్థానంలో ఉంది. మీరు మీవాళ్లను రైలులో ఎక్కించేందుకు మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లినా.. లేదా ఇతరులను పికప్‌ చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లినా మీరు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకోవడం తప్పనిసరి. అయితే స్టేషన్‌కు వెళ్లినప్పుడు టికెట్‌ కౌంటర్‌ వద్ద రద్దీగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటి సమయంలో భారతీయ రైల్వేలు యూటీఎస్‌ (UTS) అనే ప్రత్యేక యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ సేవలను పరిచయం చేయడం ద్వారా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించింది.

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు తీసుకోవడం ఎందుకు ముఖ్యం:

  • రైల్వే స్టేషన్‌లలో అధిక జనసమూహాన్ని నిర్వహించడానికి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు చాలా కీలకమైనవి. అధీకృత వ్యక్తులు మాత్రమే ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేస్తారని నిర్ధారిస్తుంది.
  • సాంప్రదాయకంగా ఈ టిక్కెట్లను స్టేషన్ కౌంటర్లలో కొనుగోలు చేస్తారు. ఇది తరచుగా పొడవైన క్యూలు, అనవసరమైన జాప్యాలకు దారి తీస్తుంది. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించి, భారతీయ రైల్వే తన ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి సాంకేతికతను మరింతగా పెంచింది రైల్వే.
  • అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) యాప్ అనేది అవాంతరాలు లేని ప్లాట్‌ఫారమ్ టికెటింగ్ ప్రక్రియ అవసరానికి భారతీయ రైల్వే వినూత్న ప్రతిస్పందన. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ వినియోగదారులను ఆన్‌లైన్‌లో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. టికెట్ కౌంటర్ల వద్ద లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. యూటీఎస్‌ యాప్ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పెరుగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు అతుకులు లేని అనుభవాన్ని అందిస్తుంది.
  • యూటీఎస్‌ యాప్ ఫీచర్స్‌ ఏంటి?
    • ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ల బుకింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా చేయడానికి UTS యాప్ రూపొందించింది రైల్వే. ఈ యాప్‌ వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.
    • సులభమైన రిజిస్ట్రేషన్ : వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి యాప్‌లో త్వరగా నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో లావాదేవీల కోసం సురక్షితమైన ఖాతాను సృష్టించవచ్చు.
    • వినియోగదారు-స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్ : యాప్ సహజమైన డిజైన్ అన్ని వయసుల వినియోగదారులు నావిగేట్ చేయగలరని, దాని ఫీచర్స్‌ ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చని నిర్ధారిస్తుంది.
    • అధిక చెల్లింపు ఆప్షన్లు : UTS యాప్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్‌లతో సహా వివిధ చెల్లింపు పద్ధతులకు మద్దతు ఇస్తుంది. వినియోగదారుల విభిన్న ప్రాధాన్యతలను అందిస్తుంది.
    • తక్షణ బుకింగ్ : ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను తక్షణమే బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ స్టేషన్ సందర్శనలను చివరి నిమిషంలో ఎలాంటి హడావిడి లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు.
    • లావాదేవీ చరిత్ర : యాప్ అన్ని లావాదేవీల రికార్డును నిర్వహిస్తుంది. వినియోగదారులు వారి బుకింగ్‌లు, చెల్లింపులను అప్రయత్నంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

    ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ టికెటింగ్ ప్రయోజనాలు:

    • యూటీఎస్‌ యాప్ పరిచయం భారతీయ రైల్వే ప్రయాణీకులకు ప్లాట్‌ఫారమ్ టికెటింగ్ అనుభవాన్ని మార్చింది:
    • సౌలభ్యం : వినియోగదారులు తమ ఇళ్ళలో నుండి లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
    • సమయం ఆదా: యాప్ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి వెచ్చించే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుంది.
    • పర్యావరణ ప్రభావం : ప్రింటెడ్ టిక్కెట్ల అవసరాన్ని తగ్గించడం ద్వారా, UTS యాప్ పర్యావరణ స్థిరత్వానికి దోహదం చేస్తుంది. కాగితం వ్యర్థాలను తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. బ్యాంకు కీలక నిర్ణయం

కోట్లాది మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పెద్ద వార్త ఉంది. ఎంసీఎల్‌ ఆర్‌ (MCLR -మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) రేటును ఎస్‌బీఐI పెంచింది.

కొత్త రేట్లు జూలై 15, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో ఎస్‌బీఐ కస్టమర్ల EMI పెరుగుతుంది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.10 శాతం పెంచింది.

కొత్త MCLR రేటు ఎంత?

ఎంసీఎల్‌ఆర్‌ పెరుగుదల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ ల్యాండింగ్ రేటు 8.10 శాతం నుండి 9 శాతానికి పెరిగింది. రాత్రిపూట ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.10 శాతానికి చేరుకుంది. 1 నెల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 శాతం, 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.40 శాతం, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.75 శాతం, 1 సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.85 శాతంగా మారింది. అయితే, 1 సంవత్సరానికి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.85 శాతం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు వరుసగా 8.95 శాతం, 9 శాతంగా ఉంది. 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాల రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.10 శాతం పెంచింది.

ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఎంత?

ఎంసీఎల్‌ఆర్‌ రేటు అనేది బ్యాంకు ఎవరికీ రుణం ఇవ్వలేని తక్కువ రేటు. చాలా రిటైల్ రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు ఎంసీఎల్‌ఆర్‌ రేటుతో అనుసంధానించింది. రాబోయే కాలంలో EMIలో పెరుగుదల ఉండవచ్చు.

MCLR అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బ్యాంకులు రుణాలను అందించడానికి ఇది అంతర్గత సూచన రేటు. బ్యాంక్ 30 సెప్టెంబర్ 2019 వరకు ఎంసీఎల్‌ఆర్‌ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్, ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటు లేదా బ్యాంకులకు స్వల్పకాలిక రుణాల రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

Anti-cancer Diet: జీవితంలో క్యాన్సర్ రాకూడదంటే వీటిని ఆహారంలో తీసుకోండి.. నూరేళ్ల హాయిగా బతికేయొచ్చు

క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అనే విషయం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా శాస్త్రవేత్తలకు తెలియ రాలేదు. అయితే రోజురోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

దీని నుంచి బయటపడటానికి వైద్యులు, పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్‌కు ఎక్కువగా జీవనశైలి కారణం. తప్పుడు ఆహారం నుంచి క్రమరహిత జీవనశైలి వరకు.. ప్రతిదీ క్యాన్సర్ వెనుక బాధ్యత వహిస్తుంది.

ఉదాహరణకు.. చక్కెర, మైదా వంటి వాటితో చేసిన ఆహారాలు తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే ఇది ఎక్కువగా ఎందులో ఉంటుంది.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? అనే విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం..

సముద్ర చేపలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో సెలీనియంతో పాటు, సీఫుడ్‌లో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులను కూడా నివారిస్తాయి. అలాగే బ్రోకలీ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలు పెద్దప్రేగు, పొట్ట, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి వివిధ బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లు, చికెన్ తినడం ద్వారా కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. అలాంటి మాంసాహారాల్లో సెలీనియం, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

దాల్చిన చెక్క, పసుపు వంటి మసాలా దినుసులు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఈ మూలికా పదార్ధాలు శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలుగా పనిచేసే అనేక పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Holiday: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే

 

దేశవ్యాప్తంగా ఈ వారంలో సుమారు నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతుండగా.. కొన్ని దేశమంతా బ్యాంకులకు ఒకే రకంగా వర్తిస్తాయి. మరి ఇంతకు ఈ బ్యాంక్‌ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో.. అది కూడా ఏ ప్రాంతాల్లో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వారంలో ఒక పండుగ వచ్చింది. దాంతో దేశంలోని బ్యాంకులన్నింటికి తప్పనిసరిగా సెలవు ఉంటుంది. ఇంతకు ఆ పండుగ ఏదంటే..మొహర్రం. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు.

ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం చూస్తే.. మొహరం అనేది తొలి మాసం. అందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ పండుగ ఎప్పుడు వచ్చిందంటే.. మే 17 బుధవారం నాడు. దాంతో ఈ రోజున అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొహరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందువల్ల జూలై 17, ఆ రోజున బ్యాంకులు పని చేయవు.

అలాగే జూలై 16న కూడా బ్యాంకులు పని చేయవు. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించదు. కేవలం డెహ్రాడూన్‌ ప్రాంతం వరకు మాత్రమే ఈ సెలవు. కారణం..  హరేల సందర్బంగా అక్కడ జూలై 16 బ్యాంకులకు సెలవు. ఇకపోతే జూలై 20న కూడా బ్యాంకులకు హాలీడే ఉంది. అది కూడా కేవలం అగర్తలలో మాత్రమే ఈ హాలిడే. ఖార్చి పూజ కారణంగా జూలై 20న అగర్తాలలో బ్యాంకులు పని చేయవు. ఇక లాస్ట్‌కు జూలై 21న దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. కారణం ఆదివారం.

ఇక ఈ హాలీడేలు దేశమంతా ఒకే విధంగా ఉడవు. ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కనుక మీకు ఈ వారంలో బ్యాంకుల్లో పని ఉంటే.. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుని ఆ మేరకు పనులు ప్లాన్‌ చేసుకుంటే మంచిది. అయితే బ్యాంక్‌లకు సెలవులు ఉన్నా.. ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చు. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎంలు పని చేస్తాయి.

Health

సినిమా