Saturday, November 16, 2024

Discount: ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 7వేలు తగ్గింపు..

ఈ కామర్స్‌ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. సేల్స్‌తో సంబంధం లేకుండా గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ఓ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ ఆ ఫోన్‌ ఏంటి.? అమెజాన్‌ అందిస్తోన్న ఆ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కెట్లోకి ఇటీవల వన్‌ప్లస్‌ 12 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 64,999కాగా ఐసీఐసీ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 7 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను మీరు రూ. 57,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఫోన్‌పై మరింత డిస్కౌంట్ పొందొచ్చు.

వన్‌ప్లస్‌ 12 ఫీచర్లు..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+2కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని ఇచ్చారు. కలర్స్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌ను ఎమరాల్డ్, గ్లేసియల్ వైట్, సిల్కీ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. గేమింగ్ అనుభూతి కోసం ఈ ఫోన్‌లో క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీంతో ఫోన్‌ తరచూ వేడెక్కకుండా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 ఎంపీ, 50 ఎంపీ, 48 ఎంపీతో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అదించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఫేస్ బుక్‎లో నకిలీ అకౌంట్.. అమ్మాయి పేరుతో పరిచయం.. కట్ చేస్తే..

ఫేస్ బుక్‎లో పరిచయం ఒక యువకుడి ప్రాణాలు తీసింది. అతని పేరు భాను ప్రకాష్.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వలస వచ్చాడు. అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన కొంతమందితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే గోవిందు అనే యువకుడితో భాను ప్రకాష్ స్నేహం చేయడం మొదలు పెట్టాడు. ఫేస్ బుక్ లో మౌనిక పేరుతో భాను ప్రకాష్ ఖాతా తెరిచాడు. ప్రెండ్ రిక్వెస్ట్ ద్వారా గోవిందుకు పరిచయం అయ్యాడు. గోవింద్ తరుచూ ఫేస్ బుక్‎లో ఉండటాన్ని గమనించే యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ ఖాతా ద్వారా గోవింద్‎తో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దీ కాలం తర్వాత అవసరం ఉందంటూ డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకుంటూ మొత్తం ముప్పై వేల వరకూ దోచేశాడు.

అయితే ఆ విషయం అప్పట్లో గోవిందుకు తెలియదు. కొద్ది రోజులు పోయిన తర్వాత తనను భాను ప్రకాష్ మోసం చేస్తున్నట్లు గోవిందుకు అర్ధం అయింది. అమ్మాయి పేరుతో ఖాతా తెరిచి తన వద్ద డబ్బులు తీసుకున్నది కూడా భాను ప్రకాష్ అని గోవిందు నిర్ధారణకు వచ్చాడు. ఇదే విషయంపై భానును నిలదీశాడు. అయితే తనకేమి తెలియదని మొదట బుకాయించినా.. చివరికి ఇద్దరి కామన్ ప్రెండ్స్ ద్వారా మోసం తెలిసిపోయింది. దీంతో గోవిందు భాను ప్రకాష్‎ను మందలించాడు. తన డబ్బులు తనకి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన భాను ప్రకాష్ రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం జిజిహెచ్‎లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై భాను ప్రకాష్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం చేసిన భాను ప్రకాష్‎పై బెదిరింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!

ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ రైలుకు 8 బదులుగా 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తోంది. అటు తిరుపతి-నిజామాబాద్ మధ్య నడుస్తోన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. ఇకపై బోధన్ వరకు వెళ్లనుంది. అంతేకాకుండా సికింద్రాబాద్-రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగిస్తోన్న రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను కచ్ జిల్లా వరకు పొడిగించాలని.. ఆ ప్రాంత వాసులు కోరగా.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ ప్రతిపాదనపై కూడా పరిశీలన జరుగుతోందని వివరించారు.

Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? ఏ బ్యాంక్‌ బెస్ట్‌ అంటే..

ప్రతీ ఒక్కరికీ ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను తీర్చుకునే క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటారు, మరికొందరు స్థలం కాగితాలతో లోన్‌ తీసుకుంటారు. అయితే ఇవేవి లేకుండా రుణం పొందే ఆప్షన్‌ పర్సనల్ లోన్‌. మీరు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే చాలు, మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంటే చాలు. వెంటనే మీకు బ్యాంకులు ఎలాంటి పూచికత్తు లేకుండా లోన్స్‌ ఇస్తాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క యాప్‌లో క్షణాల్లో మీ అకౌంట్‌లోకి లక్షల్లో రుణం వచ్చి పడే పరిస్థితి వచ్చింది. అయితే ఏ బ్యాంకులో రుణం తీసుకోవాలనే ఒక ప్రశ్న సాధారణంగానే వస్తుంది. ఇది ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం భారత్‌లో ఉన్న పలు ప్రధాన బ్యాంకులు పర్సనల్‌ లోన్‌కి ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో వ్యక్తిగత రుణాలకు 12.30 శాతం నుంచి 14.30% వరకు వసూలు చేస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి 11.30% నుంచి 13.80 శాతం వరకు, రక్షణ రంగంలో పనిచేసే వారికి 11.15 నుంచి 12.65% వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రుణాన్ని తీసుకునే వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా 13.75% నుంచి 17.25% వరకు వడ్డీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12.75 నుంచి 15.25% వరకు వసూలు చేస్తారు.

* ఇక దేశంలో అదిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్‌కు గాను వినియోగదారుల నుంచి 10.65 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తారు.

* మరో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వ్యక్తిగత రుణాలపై 10.5 నుంచి 24% వరకు వడ్డీ రూపంలో వసులు చేస్తుంది. తీసుకున్న రుణం ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజు అదనంగా ఉంటుంది.

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పర్సనల్ లోన్ పై 13.15 నుంచి 16.75% వరకు వడ్డీలు వసూలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 12.40% నుంచి 16.75% వరకు రుణాలు అందిస్తుంది.

* దేశంలో మరో ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌లో పర్సనల్ లోన్‌ తీసుకోవాలంటే 10.65 శాతం నుంచి 22 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

* కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ విషయానికొస్తే ఈ బ్యాంకులో పర్సనల లోన్‌ తీసుకున్న వారు వడ్డీ రూపంలో 11 శాతం నుంచి 13 శాత వరకు చెల్లించాల్సి ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ఆయా బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో పేర్కొన్న సమాచారం మేరకు అందించినవి. వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునే వారు నేరుగా బ్యాంకును సందర్శించే మరింత స్పష్టత వస్తుంది.

Bharateeyudu 2 : భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. మరీ ఇంత త్వరగానా..!

కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇండియన్’కి సీక్వెల్ గా వచ్చిన ‘ఇండియన్ 2’ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ తోపాటు మరికొంతమంది స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శంకర్ అంతఃకు దర్శకత్వం వహించారు కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ సినిమా విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయ్యింది. జులై 12న విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మొదటి రోజునే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలిరోజు ‘ఇండియన్ 2’ సినిమాకు అన్ని చోట్ల నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో సినిమా ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు శంకర్ సినిమాను ఎలాగైనా కాపాడాలని ప్రయతినిస్తున్నారని తెలుస్తోంది. అనవసరం అని భావించిన షాట్స్ ను దాదాపు 20 నిమిషాల సినిమాని కటౌట్ చేశాడట శంకర్.. అయినా కూడా ‘ఇండియన్ 2’ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. 1996లో విడుదలైన ‘ఇండియన్‌’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ‘ఇండియన్‌’ సినిమా అమెజాన్‌లో విడుదలైంది. ‘ఇండియన్ 2’ థియేటర్లలో విడుదలైంది కాబట్టి.. దాని ముందు వచ్చిన ‘ఇండియన్’ OTTలో విడుదల చేశారు. ‘

కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి అనే వృద్ధుడి కథ. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక జనరల్ తన యుద్ధ కళలను ఎలా ఉపయోగిస్తాడు. వారందరినీ ఎలా సమం చేసాడు అనేది సినిమా కథ. 1996లో విడుదలైన ‘ఇండియన్‌’ సినిమా కూడా ఇదే కథాంశంతో రూపొందింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘భారతీయుడు 2’ సినిమా విడుదల రోజే ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో భారతీయుడు 2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు కాబట్టి త్వరగానే ఓటీటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడాలి . ఇక ‘ఇండియన్ 2’ సినిమాకు సీక్వెల్ అంటే ‘ఇండియన్ 3’ కూడా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ‘ఇండియన్ 2’ సినిమా విడుదలకు ముందే ‘ఇండియన్ 3’ సినిమా ప్రకటించారు.

 

Amazon Prime: ఉచితంగా అమెజాన్ మెంబర్‌షిప్.. ఇలా చేస్తే బోలెడు ప్రయోజనాలు..

ఓటీటీలో అందుబాటులో ఉండే అమెజాన్ ప్రైమ్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, వినోద కార్యక్రమాలతో ఇది దూసుకుపోతోంది. ప్రస్తుతం మిర్జాపూర్, ది బాయ్స్ తదితర సిరీస్ లు విజయవంతంగా సాగుతున్నాయి. వీటిని చూడాలంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ కోసం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి. వీటికి ప్రత్యేకమైన ట్యారిఫ్ ఉంటుంది. అయితే కొన్ని టెలికాం కంపెనీలు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (వీఐ) తదితర కంపెనీలు అమెజాన్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్‌ను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీరు రెగ్యులర్ గా చేసుకునే రీచార్జులతో మొబైల్ సేవలు పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో మీకు నచ్చిన కార్యక్రమాలను వీక్షించవచ్చు. అలాంటి రీచార్జ్ ప్లాన్లను మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..

రిలయన్స్ జియో తన ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోతో కూడిన ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. స్టాండర్డ్ డెఫినిషన్‌లో సింగిల్ డివైస్, మొబైల్ స్ట్రీమింగ్ కోసం మాత్రమే దీన్ని రూపొందించారు.

జియో రూ.1,029 ప్లాన్.. రిలయన్స్ జియో రూ.1,029 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ లో మొత్తం 168 జీబీ డేటా అందజేస్తారు. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. దీనికి అదనంగా 56 రోజుల ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను పొందవచ్చు. ఇది స్టాండర్డ్ డెఫినిషన్ స్ట్రీమింగ్‌ను అందించే సింగిల్ డివైస్, మొబైల్ ప్లాన్. ఈ ప్లాన్ లో అపరిమిత 5 జీ డేటా కూడా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో మీ మొబైల్ పరికరంలో ప్రైమ్ వీడియోను వీక్షించవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్ కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రెండు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ప్రైమ్ వీడియో, ఉచిత వన్ డే డెలివరీతో సహా అన్ని ప్రైమ్ ప్రయోజనాలను వీటిలో లభిస్తాయి. ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే ద్వారా విస్తృత డేటా, అదనపు ఓటీటీ యాప్ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్.. ఈ ప్లాన్ 56 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. వీటితో పాటు 84 రోజుల పూర్తి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. సోనీ ఎల్ఐవీ, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, ఈరోస్ నౌ, హోయ్ చోయ్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే లో మనోరమమాక్స్‌తో సహా ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎయిర్ టెల్ రూ.1,199 ప్లాన్.. ఈ ప్లాన్ లో రోజుకు 2.5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. 84 రోజుల పాటు మొత్తం 210 జీబీ డేటా అందజేస్తారు. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. 84 రోజుల పూర్తి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5జీ యాక్సెస్‌ను లభిస్తుంది. సోనీ ఎల్ఐవీ, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, ఈరోస్ నౌ, హోయ్ చోయ్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే లో మనోరమమాక్స్‌తో సహా ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

వొడాఫోన్ ఐడియా..

వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రైమ్ లైట్‌తో కూడిన ప్లాన్లను అందిస్తోంది. ఇది హెచ్ డీ (720p)లో రెండు పరికరాల్లో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే ఉచిత వన్ డే డెలివరీని కలిగి ఉంది.

వోడాఫోన్ ఐడియా రూ.996 ప్లాన్.. ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లబాటులో ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అలాగే 90 రోజుల ప్రైమ్ లైట్‌ను అందుకుంటారు. హెచ్ డీ కంటెంట్‌ను ఇష్టపడే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. వీటితో పాటు ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ అపరిమిత డేటా లభిస్తుంది. రాత్రి డేటా, వారాంతాల్లో ఉపయోగించని వారాంతపు డేటాను రోల్ చేసే ఎంపిక, అదనపు ఖర్చు లేకుండా నెలవారీ 2జీబీ బ్యాకప్ డేటా అలవెన్స్ ఉన్నాయి.

ఉద్యోగ హెచ్చరిక: HALలో వివిధ ఖాళీలు; బెంగళూరులో ఉద్యోగార్థులకు మంచి అవకాశం

బెంగళూరులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? కాబట్టి ఇదిగో శుభవార్త. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) వివిధ ఖాళీల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది (HAL ఇండియా రిక్రూట్‌మెంట్ 2024).

 

టెక్నీషియన్, అసిస్టెంట్, ఫిట్టర్ సహా 28 పోస్టులను భర్తీ చేస్తున్నామని, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి మరియు చివరి తేదీ జూలై 18

పోస్ట్ వివరాలు మరియు అర్హత

డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) – 9 పోస్టులు, అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 2 పోస్టులు, అర్హత: డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ (సివిల్) – 1 పోస్ట్, అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా –
టెక్నీషియన్ (ఫిట్టర్) 7 పోస్ట్, అర్హత: ఐటీఐ
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 5 పోస్టులు, అర్హత: ఎలక్ట్రీషియన్
టెక్నీషియన్ (మెషినిస్ట్)లో ఐటీఐ -2 పోస్టులు, అర్హత: మెషినిస్ట్
టర్నర్ ఇన్ టెక్నీషియన్ (ఫిట్టర్) -1 పోస్టు, అర్హత: ఐటీఐ
టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్)-మెకానిక్స్- – 1 పోస్ట్, అర్హత: ఎలక్ట్రానిక్స్-మెకానిక్స్‌లో ఐటీఐ

వయో పరిమితి

అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. రిజర్వేషన్‌కు లోబడి వయో సడలింపు అందుబాటులో ఉంటుంది. OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWBD (జనరల్)-10 సంవత్సరాలు, PWBD (OBC)-13 సంవత్సరాలు, PWBD (SC/ST)-15 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం మరియు నెలవారీ జీతం

అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ పోస్టులను బట్టి రూ.22,000-రూ.46,511. నెలవారీ జీతం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. ఉద్యోగ స్థలం: బెంగళూరు.

HAL ఇండియా రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు విధానం

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి (https://halardc.formflix.com/apply-online)
అవసరమైన సమాచారం, ఇమెయిల్ చిరునామా మరియు నమోదు పేరు నమోదు చేయండి.
పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి.
పేరు, చిరునామా, విద్యా నెల ఇవ్వండి మరియు దరఖాస్తు ఫారమ్ నింపండి.
అవసరమైన పత్రం, ఫోటోను అప్‌లోడ్ చేయండి.
ప్రతిదీ సరిగ్గా ఉంటే వివరాలను మళ్లీ తనిఖీ చేయండి సమర్పించు బటన్‌ను క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చిరునామా: https://www.hal-india.co.in/ని సందర్శించండి.

పది పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.8000 పొందే ఛాన్స్!

దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో యూత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పీఎం కౌశల్ వికాస్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా పదో తరగతి అర్హతతో సులువుగా 8000 రూపాయలు వేతనంగా పొందవచ్చు.

ఈ స్కీమ్ ద్వారా యువతకు వేర్వేరు రంగాలలో శిక్షణ అందించి వాళ్లలో నైపుణ్యాన్ని పెంచనున్నారు.

యువతకు ఉపాధి సులభతరం చేసే విషయంలో ఈ స్కీమ్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. మన దేశానికి చెందిన పౌరులు పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 40 విభాగాలలో ట్రైనింగ్ ఇస్తుండగా ఇంట్లో ఉండి ఆన్ లైన్ లో ట్రైనింగ్ తీసుకుంటూ కూడా శిక్షణను సులభంగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేసిన యువతీ యువకులు నెలకు 8000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా కోర్సు పూర్తి చేసిన వాళ్లు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. (https://www.pmkvyofficial.org/home-page) వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Business Idea: దూద్‌ కప్స్‌ తయారీతో మంచి ఆదాయం.. ఇల్లు కదలకుండానే సంపాదన..

మారిన ఆర్థిక అవసరలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం రెండు చేతులా సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అదంఉకే చాలా మంది ఇతర ఆదాయల కోసం అన్వేషిస్తున్నారు.

ఇందుకోసం వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు.

ఇక గృహిణిలు కూడా ఇంట్లో ఉంటూనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్నో వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం దూద్‌ కప్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. చాలా మంది ఇళ్లలో ప్రతీ రోజూ దూప్‌ కప్స్‌ను ఉపయోగిస్తున్నారు. పూజ గదిలో కచ్చితంగా దూప్‌ కప్స్‌ ఉండే పరిస్థితి ఉంది. మరి డిమాండ్‌ ఉన్న ఈ దూద్ కప్స్‌ తయారి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ దూప్‌ కప్స్‌ తయారీని ఎలా ప్రారంభించాలి.? ఇందులో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దూప్‌ కప్స్‌ తయారీకి ఒక చిన్న మిషన్‌తో పాటు మూడి సరుకు అవసరపడుతుంది. పొడిలా ఉండే ముడి సరుకును మిషిన్‌లో వేసి నొక్కితే దూప్‌ కప్స్‌ తయారవుతాయి. అనంతరం అందులో కప్స్‌లో వేసే దూప్‌ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దూప్‌ కప్స్‌లో వదూప్‌ను వేసిన తర్వాత వాటిని మంచి ప్యాకేజీ చేసి విక్రయించుకోవచ్చు. మీ సొంత బ్రాండింగ్‌తో వీటిని ప్యాక్‌ చేసి అమ్ముకోవచ్చు. ఈ మిషిన్‌కు ఎలాంటి పవర్‌ కూడా అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో దూప్ కప్స్‌ ప్యాకేట్‌ తక్కువలో తక్కువ రూ. 50గా ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

CM Chandrababu: ‘ఐదేళ్లలో అడవులు, భూములు, ఖనిజ సంపదను దోచేశారు’ – మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Released White Paper On Natural Resources And Land Grabbing: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో సహజ వనరులు, అడవులు, ఖనిజ సంపద వింధ్వంసానికి గురైందని..

వైసీపీ నేతలు అన్నింటినీ దోచేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో అటవీ, సహజ వనరులు, భూమి, గనుల వ్యవహారంపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు. కాగా, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలో వరుసగా మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా నాలుగో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వైసీపీ హయాంలో నూతన విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని.. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలు చేశారని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములను అప్పగించారని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని చెప్పారు.

మాజీ ఎంపీపై..

మాజీ ఎంపీపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించారు. ఒంగోలులో (Ongole) నకిలీ పత్రాలతో రూ.101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని అన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ‘విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారు. వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను సైతం కొట్టేశారు. దస్పల్లా భూములను కాజేసి ఇళ్లు కట్టారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు. తిరుపతి జిల్లాలో 22 – ఏ పెట్టి భూ అక్రమాలు చేశారు. పేదవారి అసైన్డ్ భూములు లాక్కున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు యత్నించారు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించి.. నివాసయోగ్యం కాని ఆవ భూములను ఇళ్లకు కేటాయించారు. అక్రమంగా భవనాలు కట్టేసి.. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 13,800 ఎకరాలను ఆ పార్టీ నేతలకు ఇచ్చింది. ఆ పార్టీ నేతలు తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘భూ కబ్జా అంటేనే భయపడాలి’

వైసీపీ హయాంలో భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారని.. భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతో అహంకారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని మండిపడ్డారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారని అన్నారు. ‘రాష్ట్రంలో భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తాం. ప్రజలు ఒకసారి భూములు చెక్ చేసుకోవాలి. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయాలి. గుజరాత్లోని ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఇక్కడ తీసుకొస్తాం. తాము భూ యజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి.’ అని సీఎం స్పష్టం చేశారు.

అటు, మైనింగ్, క్వారీ లీజుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని.. నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చి.. అక్రమంగా భారీ యంత్రాలు వాడారని చెప్పారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయని.. ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.9,750 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు.

‘అడవులనూ వదల్లేదు’

ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనులశాఖలను సాధారణంగా ఓ వ్యక్తికి ఇవ్వరని.. కానీ వైసీపీ హయాంలో మాత్రం ఆ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారని చంద్రబాబు అన్నారు. తూ.గో జిల్లాలో లేటరైట్ గనులు, ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. ప్రకృతి సంపద, అడవులను దోచేశారని.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా ధ్వంసం చేశారు. గనుల బాధితులు ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అడవులను దోచుకున్న వారిని శిక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు.

కెమెరా, మనుషులు అవసరం లేదు.. నిమిషంలో ఫ్రీగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు

చాలా మంది దగ్గర కంటెంట్ ఉంది.. కానీ మ్యాన్ పవర్ లేక ఆగిపోతున్నారు. కెమెరా ఉండదు, ఫోన్ కెమెరా క్వాలిటీ ఉండదు. గ్రీన్ స్క్రీన్ ఎక్విప్ మెంట్, లైట్స్ వంటి సెటప్ ఉండదు.

ఇవన్నీ ఉన్నా కానీ కంటెంట్ ని ప్రెజెంట్ చేసే మనుషులు ఉండాలి. చాలా మంది ఆగిపోయేది ఇక్కడే.. మనుషులు లేక. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలకి రీచ్ ఉండాలంటే కంటెంట్ ఎంత ముఖ్యమో.. కంటెంట్ ప్రెజెంటర్ కూడా అంతే ముఖ్యం. చాలా మంది దగ్గర కంటెంట్ ఉన్నా కూడా కంటెంట్ ని ప్రెజెంట్ చేయడానికి ఆ స్కిల్స్ ఉండవు. వేరే వాళ్ళ మీద ఆధారపడదామన్నా డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కుదరదు. అలాంటి వారి కోసమే ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది.

మీరు కేవలం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే దానికి తగ్గట్టు వీడియో రెడీ అవుతుంది. మీ స్క్రిప్ట్ కి మీరు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసినా దాన్ని ఏఐ అవతార్ చదువుతుంది. అంటే మీ కంటెంట్ కి, వాయిస్ కి మ్యాచ్ అయ్యే ఏఐ ఆర్టిస్ట్ ని ఎంచుకోవచ్చు. న్యూస్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్, యాంకర్ వీడియోలు వంటివి చేసేవారికి ఈ వెబ్ సైట్ బాగా హెల్ప్ అవుతుంది. సింగిల్ పర్సన్ మాత్రమే కాకుండా ఇద్దరు వ్యక్తులు చర్చించుకునేలా కూడా ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు షార్ట్స్ కోసం వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ 16:9 రేషియోలో ల్యాండ్ స్కేప్ మోడ్ లో కూడా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే చాలు. కంప్యూటర్ లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు. ఈజీగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.

వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి?:

  • ముందు మీరు విడ్నోజ్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
  • క్రియేట్ ఫ్రీ వీడియో నవ్ మీద క్లిక్ చేయాలి.
  • గూగుల్, ఫేస్ బుక్, లింక్డిన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ లతో లాగిన్ అవ్వాలి. లేదా ఈమెయిల్ తో సైనప్ అవ్వచ్చు.
  • లాగిన్ అయ్యాక బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ ప్లెయినర్, సోషల్ మీడియా ఇలా కొన్ని కేటగిరీలు ఉంటాయి. వీటిలో మీరు ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.
  • కొన్ని డీఫాల్ట్ టెంప్లేట్స్ ఉంటాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
  • ల్యాండ్ స్కేప్, పోర్ట్రైట్ మోడ్ లో ఎలా కావాలంటే అలా వీడియోలు చేసుకోవచ్చు.
  • ఏఐ అమ్మాయిలు, ఏఐ అబ్బాయిలతో ఏఐ అవతార్స్ ఉంటాయి.
  • వీటిలో ఒక అవతార్ ని ఎంచుకోవాలి. ఈ అవతార్ ని ఎడిట్ చేసుకోవచ్చు.
  • క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే స్పీచ్ టెక్స్ట్, కాన్వర్సేషన్, అప్లోడ్ వాయిస్, నో స్పీచ్ అనే ఆప్షన్స్ కనబడతాయి.
  • స్పీచ్ టెక్స్ట్ లో మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష కంటెంట్ ని అయినా పేస్ట్ చేస్తే ఆ ఏఐ అవతార్ మాట్లాడుతుంది.
  • ఆ తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో రెడీ అవుతుంది.

అయితే ఫ్రీగా వాడుకోవాలంటే రోజుకు ఒక నిమిషం వీడియోనే చేసుకోవడానికి కుదురుతుంది. వెయ్యికి పైగా ఏఐ అవతార్స్ ని, వెయ్యికి పైగా టెంప్లేట్స్ ని, 170కి పైగా వాయిస్ లను ఫ్రీగా వాడుకోవచ్చు. అలానే 720 పిక్సెల్ వీడియో, ఒక సీన్ కి 2 వేల క్యారెక్టర్స్ ని, 20 ఏఐ స్క్రిప్ట్ లు వంటి ఫీచర్స్ ని ఫ్రీగా వాడుకోవచ్చు. కమర్షియల్ గా కూడా ఈ వీడియోస్ ని వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ నిముషాలు కావాలంటే కనుక స్టార్టర్, బిజినెస్, ఎంటర్ప్రైజ్ వంటి ప్లాన్స్ లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. డైలీ ఒక నిమిషం షార్ట్ వీడియో పెట్టుకునేవారు అయితే ఫ్రీగా వాడుకోవచ్చు.

Prabhas : ప్రభాస్ హను మూవీ టైటిల్ అదేనా..!

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebalstar Prabhas) రీసెంట్ గా కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కల్కి 1 తో మరోసారి 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన ప్రభాస్ కల్కి 2 తో దాన్ని మించే వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు.

ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైన్ లో స్పిరిట్ ఉంది. ఆ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారు. హను రాఘవపుడి (Hanu Raghavapudi) ఈ సినిమాను కూడా పీరియాడికల్ కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ మరో భారీ సినిమాతో ఇది చేస్తున్నారు. ప్రభాస్ హను కాంబో సినిమాకు టైటిల్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రభాస్ కోసం ఫౌజీ (Prabhas Fauji) అనే టైటిల్ ని లాక్ చేశాడట డైరెక్టర్. ఫౌజీ అంటే సైనికుడు అని అర్ధం. సో ఈ సినిమా ఇండిపెండన్స్ కు ముందు ఒక సోల్జర్ కథతో వస్తుంది. సీతారామం లాంటి సినిమా తర్వాత మరోసారి హను సోల్జర్ కథతో వస్తున్నాడు. ఈ సినిమా కథ ప్రభాస్ ఇమేజ్ కి తగినట్టుగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ప్రభాస్ సినిమాల లిస్ట్ చూస్తే సలార్ 2 (Salar 2), కల్కి 2 తో పాటుగా స్పిరిట్ హను రాఘవపుడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ప్రభాస్ హను మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. సో ప్రభాస్ తో కొత్త సినిమా చేయాలని అనుకుంటే మాత్రం ఎలా లేదన్నా మరో మూడు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం తను లైన్ లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసే సరికి అంత టైం పడుతుంది.

warts: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌గా తొలగించుకోండి..

ముఖమంతా అందంగా ఉండి అక్కడక్కడ కనిపించే పులిపిర్ల వల్ల అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే పులిపిర్లను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మెడ, కనురెప్పలు, చంకల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే పులిపిర్ల సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది చర్మ సంబధిత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే పులిపిర్లను సహజంగా కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకీ పులిపిర్లను సహజంగా తొలగించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిని మెత్తగా చేసి పులిపిర్లపై అప్లై చేయాలి. రాత్రంతా అలానే ఉంచి, ఉదయం కడిగేయాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే పులిపిర్లు తగ్గుతాయి.

* యాపిల్ సైడర్‌ వెనిగర్‌తో కూడా పులిపిర్లను తొలగించుకోవచ్చు. పులిపిర్లు ఉన్న చోట వెనిగర్‌ను అప్లై చేయాలి. ఇందుకోసం ఒక బౌల్‌లో వెనిగర్‌ను తీసుకొని, కాటన్‌ను అందులో ముంచాలి. అనంతరం పులిపిరి ఉ్న చోట 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే సమస్య తగ్గుతుంది.

* టీట్రీ ఆయిల్‌ కూడా పులిపిర్లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దూదిని ఆయిల్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేస్తే పులిపిర్ల సమస్య తగ్గుతుంది.

* కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద జిగురును తీసి పులిపిర్లపై రాస్తే సమస్య తగ్గుతుంది.

* ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్‌ వేసి వాడినా పులిపిర్లు తగ్గుతాయి. ఈ లిక్విడ్‌ను పులిపిర్లపై రాసి బ్యాండేజ్‌ వేయాలి అలా రాత్రంతా పెట్టాలి. ఇలా చేస్తే పులిపిర్లు తగ్గిపోతాయి.

* అరటిపండు తొక్కతో కూడా పులిపిర్ల సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అరటిపండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగవుతుందని.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.

Spinach for Diabetes: షుగర్ పేషెంట్స్ పాలకూర తింటే జరిగేది ఇదే..

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది. డయాబెటీస్‌కు రాజధానిగా భారత దేశం మారిందంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే షుగర్ ఉన్నవారి సంఖ్య ఎక్కువ.

షుగర్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ మరింత ఎక్కువై ప్రాణాల మీదకు వచ్చింది. షుగర్ వ్యాధిని తగ్గించే ఆహార నియమాల గురించి ఇప్పటికే చాలా సార్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే డయాబెటీస్ ఉన్నవారు పాల కూర తినవచ్చా? తింటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సులిన్‌ని మెరుగు పరుస్తుంది:

షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో పాలకూర చక్కగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. పాల కూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగు పరుస్తుంది. అదే విధంగా పాలకూరలో ఉండే ఫైబర్‌తో కూడా షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి:

పాలకూరలో లుటిన్, జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను రక్షించడంలో సహాయ పడతాయి. అదే విధంగా డయాబెటీస్‌తో సంబంధం ఉన్న కాంప్లికేషన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తి ఎక్కువ:

పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించడంలో హెల్ప్ చేస్తాయి. షుగర్ పేషెంట్స్‌ త్వరగా అలిసిపోతూ ఉంటారు. కాబట్టి వీరికి శక్తిని ఇచ్చేందుకు ఇమ్యూనిటీ సహాయ పడతాయి.

రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి:

పాలకూరలో విటమిన్లు ఎ, సిలు ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా షుగర్‌తో సంబంధం ఉన్న కాంప్లికేషన్స్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎలాంటి సందేహం, భయం లేకుండా పాలకూర తీసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Crop Loan Waiver Scheme: బిగ్ అలర్ట్.. రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ.. కొత్త మార్గదర్శకాలివే..

Crop Loan Waiver Scheme: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీకి సిద్ధమైంది.. ఆగస్టు 15 నాటికి కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను జారీ చేసింది.. ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.. రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని.. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికంగా రైతు రుణమాఫీ ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంక్‌కు ఒక నోడల్ అధికారిని నియమించి.. రైతు రుణ మాఫీ పేర్లను సెలక్ట్ చేయనున్నారు.

ఇదిలాఉంటే.. రైతు భరోసా పథకం అమలుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.. ఇప్పటికే.. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ చేస్తోంది.. రైతు భరోసా లిమిట్‌పై జూలై 23 వరకు జిల్లాల కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి.. దీనిపై కూడా మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. కేబినెట్‌ సబ్‌కమిటీ ఛైర్మన్‌ భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు.

 

Supreme Court : సుప్రీం కోర్ట్ న్యూ రూల్. తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా.

Supreme Court : ప్రస్తుతం మనమున్న ఈ రోజులలో కోర్టులో భూములు లేక స్థిరాస్తికి సంబంధించిన భూమి వివాదాల కేసులు అధికంగా కోర్టులో నమోదవుతున్నాయి.

అయితే కొంత మంది ఇతరుల ఆస్తిపై తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలి. పూర్వీకుల ఆస్తుకి ఎవరికి హక్కు ఉంది.హక్కు లేని వారి అందరి చట్టాన్ని రూపొందించారు. ఇలాంటి టైమ్ లో మనవడికి తమ తాత ఆస్తిలో ఎంత హక్కు ఉంటుంది.తాత ఆస్తిలో మనవడికి ఎంత ఆస్తి అనేది వస్తుంది.దీని గురించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం…

పూర్వికుల ఆస్తి మరియు సంపాదించిన ఆస్తికి మధ్య తేడా ఏమిటి : ఒక వ్యక్తికి తన పూర్వీకుల నుండి ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి లేక వంశపారపర్యంగా వచ్చే ఆస్తి అని అంటుంటారు. అయితే కుటుంబ సభ్యుల అందరికీ ఈ ఆస్తిపై హక్కు ఉంటుంది.దీని ప్రకారం చూస్తే, ఒక వ్యక్తి తన సొంత సంపాదనతో ఒక ఆస్తిని కొన్నాడు.అలాంటి ఆస్తిని ఆర్జిత ఆస్తి అని అంటారు. అయితే ఈ ఆస్తిపై యజమానికి తప్పితే మరి ఎవరికీ హక్కు ఉండదు…

సంపాదించిన ఆస్తిలో మనవడికి ఎంత వాటా వస్తుంది : సుప్రీంకోర్టు నిబ్బందరుల ప్రకారం చూసినట్లయితే, తాత తన సొంత సంపాదనతో ఆస్తి కొన్నట్లయితే మనవడికి దానిపై ఎలాంటి హక్కు ఉండదు. అయితే తాతయ్య బతికున్నంత వరకు ఆస్తి తానే అనుభవించవచ్చు.తర్వాత తాత ఆస్తిరి ఎవరికీ ఇవ్వాలి అనుకుంటే వారికి ఇవ్వొచ్చు. తాతా మరణించిన తర్వాత చట్టపరమైన హక్కుల ప్రకారం, తాత రాసినటువంటి వీలునామా ఆధారంగా ఆ అస్థికి సంబంధించిన వారసుడ్ని నిర్ణయిస్తారు. తాతా ఆస్తి అనేది ఎప్పటికీ కూడా మనవడికి డైరెక్ట్ గా చేరదు.కానీ ఆ ఆస్తి అనేది ముందు తండ్రి కి చేరుతుంది. అప్పుడే తండ్రి నుండి మనవడు భూమిని పొందవచ్చు…

Supreme Court : సుప్రీం కోర్ట్ న్యూ రూల్… తాత ఆస్తిలో మనవడికి హక్కు ఉంటుందా…

ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి చట్టపరమైన పరిష్కారాలు : ఏదైనా ఆస్తి తగాదాల విషయంలో,చట్టపరమైన హక్కులను గౌరవించాల్సి ఉంటుంది. మీ పేరు మీద నమోదైన భూమిని వేరే ఒకరికి దస్తవేజి చేసినప్పుడు, మీరు మీ కోరికను క్లియర్ గా చెప్పాలి. అలాగే మీ కుటుంబంలో సీనియర్ సభ్యులు తగిన టైం లో భూమిని ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు…..

తల దగ్గర ఫోన్ పెట్టుకుని పడుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? పరిశోధనలో తేలిన నిజం ఇదీ.!

మొబైల్ ఫోన్‌లను అతిగా వాడటం ప్రమాదకరమని అందరికీ తెలిసిందే . ఫోన్‌ని దగ్గరగా పెట్టుకుని పడుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం ఇంటర్నెట్‌లో కూడా హల్‌చల్ చేస్తోంది.

క్యాన్సర్ గురించి ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి.

చాలా గందరగోళ ప్రశ్నలు ఉన్నాయి. ఫోన్‌ను తలకు దగ్గరగా ఉంచుకోవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయని చెబుతున్నారు.

కొంతమంది తమ ఫోన్‌ని దగ్గర పెట్టుకుని పడుకుంటారు. మరికొందరికి చార్జింగ్ పెట్టుకుని నిద్రపోవడం అలవాటు. శారీరకంగా మొబైల్ ఫోన్‌ను దగ్గరగా ఉంచుకోవడం, ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు, మెదడు కణితుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. కొన్ని అధ్యయనాలు దీనిని ఖండించలేదు. ఫోన్ వినియోగం మరియు బ్రెయిన్ ట్యూమర్ మధ్య సాధ్యమయ్యే లింక్ సూచించబడింది.

కానీ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్‌ను చెవి లేదా తల దగ్గర ఉంచుకోవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్‌లు వస్తాయని ఇంతవరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. మొబైల్ ఫోన్‌లు ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఒక రకమైన అయోనైజింగ్ కాని రేడియేషన్. X- కిరణాల అయోనైజింగ్ రేడియేషన్ వలె కాకుండా, ఇది DNA ను దెబ్బతీస్తుంది మరియు క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

కానీ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ కణితులకు కారణమవుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. మెనింగియోమా వంటి నిరపాయమైన కణితులు మరియు గ్లియోమా వంటి క్యాన్సర్ కణితులు ఉండవచ్చు. కొన్ని అధ్యయనాలు మొబైల్ ఫోన్ వాడకం వల్ల క్యాన్సర్ రిస్క్ కొద్దిగా పెరుగుతుందని సూచించాయి. అయితే దీనికి బలమైన ఆధారాలు లేవు.

మొబైల్ ఫోన్ వినియోగం మరియు మెదడు కణితుల మధ్య సంబంధాన్ని పరిశోధించడానికి పరిశోధకులు అనేక విస్తృతమైన అధ్యయనాలను నిర్వహించారు. అయితే పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్‌ని తల దగ్గర లేదా బెడ్‌పై పెట్టుకోవడం ప్రమాదకరం.

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ముఖ్యంగా ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌ కన్నప్ప మీద మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు విశేషాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఇక ఎప్పుడూ కన్నప్ప నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ సినిమాలో శరత్ కుమార్ నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ ఈ ఫస్ట్ లుక్ లో కనిపించి మెప్పించారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ సినిమాని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది.

మోహన్ లాల్, అక్షయ్ కుమార్,బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ

IQOO Z9 Lite | ఇంటర్నెట్‌ డెస్క్: ఐకూ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఐకూ జెడ్‌9 లైట్‌ పేరిట దీన్ని తీసుకొచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో వస్తోంది.

భారత్‌లో రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొన్ని 5జీ ఫోన్లలో ఇదొకటి. ఇతర ఫీచర్లు, వేరియంట్లు, ధర వంటి వివరాలు చూద్దాం.

ఐకూ జెడ్‌9 లైట్‌ ఫీచర్లు..

ఐకూ జెడ్‌9 లైట్‌ (iQOO Z9 Lite) 5జీ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో వస్తోంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ రంగుల్లో లభిస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేటు, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 6.57 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. వెనక f/1.8 అపెర్చర్‌తో కూడిన 50MP + 2 MP ప్రధాన కెమెరా, ముందుభాగంలో 8MPతో సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌- సి యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సిలరోమీటర్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, ఈ-కంపాస్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఆప్షన్లూ ఉన్నాయి. 15W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఫొటో ఎడిటింగ్‌లో కొన్ని ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఐకూ జెడ్‌9 లైట్‌ ధర..

ఐకూ జెడ్‌9 లైట్‌ (iQOO Z9 Lite) 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4 GB+ 128 GB ధర రూ.10,499. 6 GB+ 128 GB ధర రూ.11,499. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.500 తక్షణ రాయితీ లభిస్తుంది. జులై 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌తో పాటు ఐకూ ఈస్టోర్‌, ప్రధాన రిటైల్ ఔట్‌లెట్ల నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు

కొత్త ఛానెల్ ప్రారంభిస్తా.. ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన!

పీలో రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వివాహేతర సంబంధం ఆరోపణలు గట్టిగానే కాకరేపుతున్నాయి. దీనిపై ప్రెస్ మీట్ ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఆయన..

చివరకు కొత్త ఛానెల్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడో తీసుకున్నారు. అప్పట్లో జగన్ బ్రేక్ వెయ్యడంతో, వెనక్కి తగ్గారు. ఇప్పుడు తగ్గేదే లేదు అంటున్నారు. అందువల్ల త్వరలోనే ఓ కొత్త వార్తా ఛానెల్ రాబోతోంది అని మనం అనుకోవచ్చు. మరి ఆయన ప్రెస్‌మీట్‌లో ఇంకా ఏం చెప్పారో చూద్దాం.

“నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి ఎవరో బెదిరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే వ్యక్తిని కాను. నా పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎవరైతే ఇప్పుడు తొక ఆడిస్తున్నారో త్వరలోనే వాటిని కత్తిరిస్తా. వైసీపీకి సహకరించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు. వైసీపీకి మద్దతిచ్చిన కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి పోతున్నాయి. నెలరోజుల పాలనను ప్రజలు గమనిస్తున్నారు” అని విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో అన్నారు.

“వైసీపీ నేతలపై బురదజల్లుతున్నారు. చివరికి మా పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై నాపై అనేక ఆరోపణలు చేశారు. నా వ్యక్తిత్వం ఏంటి అన్న విషయం నాకు తెలుసు. రామోజీ రావు లాంటి వ్యక్తులను సైతం ఎదురించాను. సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వారిని వదిలిపెట్టను. చట్టరీత్య చర్యలు తీసుకుంటాను” అని ఎంపీ హెచ్చరించారు.

“త్వరలోనే నేను కొత్త ఛానెల్ ప్రారంభిస్తున్నా. గతంలో మా అధ్యక్షులు నిర్ణయం మేరకు ఛానెల్ ప్రారంభాన్ని వెన్నక్కి తీసుకున్నా. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా తగ్గేది లేదు. కుల ఛానెల్స్, కుల పత్రికలను ఎండగడతాను. కులాలకు మతాలకు అతీతంగా ఈ ఛానెల్ ఉంటుంది. ఒక పార్టీకి మాత్రమే పనిచేయడం కాకుండా న్యూట్రల్‌గా ఉంటుంది” అని విజయసాయి రెడ్డి అన్నారు.

శాంతి విషయంలో..:

“పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది. సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా? నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు. మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అంటూ.. విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూపై విజయసాయి రెడ్డి మాట్లాడారు.

“మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టం. దుష్ప్రచారం చేస్తున్నవారు మా పార్టీవాళ్లైనా వదలను. చట్టపరంగా ముందుకువెళతాం. మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తాం. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు” అని విజయసాయిరెడ్డి తెలిపారు.

Monsoon Health Tips: వర్షాకాలంలో ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి.. హెల్త్ అండ్ ఫిట్ గా ఉండండి..

స్క్వాట్ అనేది కేలరీలను బర్న్ చేయడానికి మరియు బరువును అదుపులో ఉంచడానికి ఒక గొప్ప వ్యాయామం. ఇది దిగువ శరీరంలోని కండరాలను కూడా బలపరుస్తుంది. దీంతోపాటు బలం కూడా పెరుగుతుంది.

రోజూ స్క్వాట్‌లు చేయడం వల్ల కాళ్లు, నడుము ఆకారంలో ఉండేందుకు, కండరాలు టోన్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మోకాలి కీళ్లను కూడా బలంగా ఉంచుతుంది.

కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించాలనుకుంటే ప్లాంకింగ్ ఉత్తమ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది బొడ్డు దగ్గర పేరుకున్న కొవ్వును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదర కండరాలను టోన్ చేస్తుంది. ప్రారంభంలో సాధారణ ప్లాంక్ చేయాలి. అయితే ప్లాంకింగ్ చేసే సమయం 20 నుండి 30 సెకన్లు ఉండాలి. దీని తరువాత ప్లాంకింగ్ చేసే సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడం, బలాన్ని పెంచడంతో పాటు స్కిప్పింగ్ కేలరీలను బర్న్ చేయడానికి చాలా మంచి శారీరక శ్రమ. స్కిప్పింగ్ ను ఇంట్లో సులభంగా చేయవచ్చు. రోప్ జంప్ చేయడం రాకపోతే సింపుల్ జంప్, జంప్ అండ్ జాక్, లెగ్ క్రిస్-క్రాస్ జంప్ వంటివి చేయవచ్చు.

బొడ్డు కొవ్వును తగ్గించడానికి ఇంట్లో వ్యాయామాల గురించి మాట్లాడితే క్రంచెస్ చేయవచ్చు. ఇందులో రివర్స్ క్రంచ్ (ఇందులో వెనుకకు నేలపై పడుకుని, చేతులను నడుము క్రింద ఉంచి కాళ్ళను పైకి లేపి వెనుకకు తీసుకుని, ఆపై వాటిని వెనక్కి తీసుకురావాలి). అదేవిధంగా క్రిస్-క్రాస్ క్రంచ్ చేయాలి. దీనిలో కుడి మోచేయిని ఎడమ మోకాలితో తాకాలి.. ఎడమ మోచేయిని కుడి మోకాలితో తాకాలి. ఈ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం చేయాలి.

ఇంట్లోనే స్ట్రెయిట్ లెగ్ గాడిద కిక్ వ్యాయామం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం తుంటిపై పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో పాటు కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. భుజం కండరాలను బలపరుస్తుం. అంతేకాదు శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది.

మీరు బ్యాంకు పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు? భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను నోటీసు వస్తుందా?

బ్యాంకు ఖాతాలో డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా దానిపై వడ్డీ కూడా లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అధిక జనాభా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంది.

విశేషమేమిటంటే భారతదేశంలో పొదుపు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. అంటే ఒక వ్యక్తి ఎన్ని పొదుపు ఖాతాలనైనా తెరవవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. అంటే, మీరు మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బునైనా డిపాజిట్ చేయవచ్చు. జీరో బ్యాలెన్స్ ఖాతా తప్ప, మిగిలిన అన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించడం తప్పనిసరి

పొదుపు ఖాతాలో డబ్బు ఉంచడానికి ఎటువంటి పరిమితి ఉండకపోవచ్చు. కానీ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అప్పుడు బ్యాంకులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)కి తెలియజేస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో నగదు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.

లైవ్ మింట్ నివేదిక ప్రకారం, భారతీయుడు పొదుపు ఖాతాలో ఎంత డబ్బునైనా ఉంచుకోవచ్చని పన్ను, పెట్టుబడి సలహాదారు బల్వంత్ జైన్ అంటున్నారు. వడ్డీపై పన్ను చెల్లించవలసి ఉంటుందని అన్నారు. పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి ఆదాయపు పన్ను చట్టం లేదా బ్యాంకింగ్ నిబంధనలలో ఎటువంటి పరిమితి లేదు. బ్యాంకు ఖాతాదారుడు బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంచిన మొత్తానికి వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాలి.

బ్యాంకు వడ్డీపై 10 శాతం టీడీఎస్‌ తీసివేస్తుంది. వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అయితే దీనిపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చని బల్వంత్ జైన్ చెప్పారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం, వ్యక్తులందరూ రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 10 వేల లోపు వడ్డీ ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 60 ఏళ్లు పైబడిన ఖాతాదారులు రూ.50 వేల వరకు వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒక ఖాతాదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ డబ్బు మూలాన్ని అడగవచ్చు . ఖాతాదారు ప్రతిస్పందనతో సంతృప్తి చెందకపోతే అతనికి నోటీసులు పంపి ఆ డబ్బుపై దర్యాప్తు కూడా చేయవచ్చు. దర్యాప్తులో డబ్బు మూలం తప్పు అని తేలితే, ఆదాయపు పన్ను శాఖ డిపాజిట్ చేసిన మొత్తంపై 60% పన్ను, 25% సర్‌ఛార్జ్, 4% సెస్ విధించవచ్చు.

 

Stomach Ache: మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట..

క్కోసారి అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలవుతుంది. సమయంలో గడిచేకొద్దీ సమస్య పెరుగుతుంది. వేళగాని వేళలో ఇలా కడుపునొప్పి రావడంతో అటు ఆసుపత్రికి గానీ, వైద్యుడి వద్దకు గానీ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది.

ఈ విధమైన కడుపు నొప్పి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా తరచూ రావడం అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, కడుపు నొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కడుపు వివిధ భాగాలలో నొప్పి వస్తుంది.

పెప్టిక్ అల్సర్ కారణంగా నొప్పి సాధారణంగా పొత్తికడుపు పైభాగంలో ఉంటుంది. ఈ నొప్పి కడుపు పై నుండి మధ్య వరకు వస్తుంది. కడుపు ఎడమ వైపు నొప్పి వస్తే.. అది ప్యాంక్రియాస్ లేదా ప్యాంక్రియాస్ సమస్య కావచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.

పిత్తాశయంలో రాళ్లు లేదా వాపు కారణంగా కడుపు కుడి వైపున నొప్పి వస్తుంది. ఇలా మీకెప్పుడైనా అకస్మాత్తుగా కడుపునొప్పి వస్తే.. కొన్ని ఇంటి నివారణలతో నొప్పిని వదిలించుకోవచ్చు. పూర్తిగా కాకపోయినా కనీసం నొప్పిని కొద్దిగా అయినా తగ్గించుకోవచ్చు.

గ్యాస్ నొప్పి ఉంటే గ్యాస్ మందు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కడుపు నొప్పిని తగ్గించడానికి వైద్యులు సూచించిన మందులు కూడా తీసుకోవచ్చు. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోకూడదు. సమయానికి ఇంట్లో మందులు లేకుంటే.. టవల్ తడిపి పొట్టపైన వేసి ఉంచాలి. ఇలా చేస్తే చాలా సౌకర్యంగా, హాయి అనిపిస్తుంది. నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

AP Rains: వరుస అల్పపీడనాలు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

వాయువ్య దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది.

సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, సంబల్పూర్, పూరి గుండా వెళుతూ.. ఆగ్నేయ దిశగా వాయువ్య, ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది.

ఒక షీర్ జోన్ లేదా గాలుల కోత సగటు సముద్రానికి ఎగువన 3.1 & 7.6 కి.మీ మధ్య దాదాపు 20°N వెంబడి విస్తరించి ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. జూలై 19న పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై వేరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నిన్నటి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ & దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్ & ఓడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఈరోజు తక్కువగా గుర్తించబడింది.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటిర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటిర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

రాయలసీమ:-
—————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

 

Watching TV: టీవీని ఎంత డెస్టెన్స్‌లో చూడాలో తెలుసా? పోనీ.. రోజుకు ఎంత సేపు చూడాలో కూడా తెలియదా..

త కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో టీవీ ఒక భాగమై పోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, టీవీ కూడా స్మార్ట్‌గా మారింది.

పరిమాణం, ప్రకాశం, వినోదం వంటి విషయాల్లో టీవీ చాలా రెట్లు స్మార్ట్‌గా తయారైంది.

స్మార్ట్ టీవీ, OTT ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాయి. రోజంతా టీవీ చూస్తూ, అందులో నిమగ్నమై ఉంచడానికి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. అయితే ఎక్కువ సేపు టీవీ చూడటం కళ్లకు అంత మంచిది కాదు. మనలో చాలా మందికి ఇది తెలుసు. కానీ ఎవ్వరూ పాటించరు.

కళ్లను టీవీకి కనీస దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీవీ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి కళ్లకు మంచిది కాదు. అందుకే చాలా సేపు టీవీని చాలా దగ్గరగా చూస్తే, కళ్ళు త్వరగా అలసిపోతాయి.మదీని వల్ల చాలా మందికి తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాంతికి ఎక్కువసేపు బహిర్గతం కావడం రెటీనాపై కూడా ప్రభావం చూపుతుంది.

టీవీని కనీసం 10 అడుగుల దూరం నుంచి చూడాలని నిపుణులు అంటున్నారు. పిల్లల విషయంలో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. లేదంటే చిన్న వయసులోనే కళ్లు మసకబారుతాయి. రోజుకు 1 నుంచి 2 గంటలకు మించి టీవీ చూడకూడదని వైద్యులు చెబుతున్నారు.

నిరంతరం టీవీ చూడకుండా.. మధ్యమధ్యల్లో విరామం తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు చీకటి గదిలో టీవీ చూడటం కూడా ప్రమాదమే.

West Nile Virus: మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ తప్పనిసరి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు..

కోవిడ్ రకరకాల వేరియంట్స్ తో ఓ వైపు భయపెడుతుంటే.. మన దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మరో వైపు పెరుగుతున్నాయి. ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పుని మానవాళికి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా గత కొద్ది రోజుల్లోనే 15 మంది రోగులు మరణింనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వెస్ట్ నైల్ కొత్త వైరస్ కాదు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రోజు వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీనిని ఎలా నిరోధించవచ్చు? దీని గురించి నిపుణుల సలహా సూచనలు ఏమిటో తెలుసుకుందాం..

ఇజ్రాయెల్‌లో వెస్ట్ నైల్ వైరస్ కలకలం..

ఇజ్రాయెల్‌లోని అనేక నగరాల్లో వెస్ట్ నైలు జ్వరం వ్యాపిస్తోంది. మే నుంచి ఈ వైరస్ సోకిన రోగుల సంఖ్య 300 కి చేరుకుంది. 15 మంది రోగులు మృతి చెందగా, 20 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

ఈ ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే ..

యశోద హాస్పిటల్ కౌశాంబి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఛవీ గుప్తా మాట్లాడుతూ.. వెస్ట్ నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందన్నారు. ఈ వైరస్ సోకిన జంతువును దోమ కుట్టినప్పుడు, ఈ వైరస్ దోమ లోకి వెళ్తుంది. ఆ దోమలు మనుషులను కుట్టినప్పుడు వెస్ట్ నైల్ వైరస్ మనుషులకు సోకుతుంది. అటువంటి లక్షణాలు ఈ వైరస్ సంక్రమణ తర్వాత కనిపిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ వైరస్ కేసులు ప్రతి సంవత్సరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి. అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ అవసరం. ఈ జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ గుప్తా సూచించారు.

వెస్ట్ నైల్ వైరస్ వ్యాధి లక్షణాలు

  • అధిక జ్వరం
  • తీవ్రమైన తలనొప్పి
  • బలహీనంగా అనిపించడం
  • తీవ్రంగా కీళ్ళు, కండరాలలో నొప్పి
  • చర్మంపై దద్దుర్లు

వెస్ట్ నైల్ వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలంటే..

  • దోమ కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేలా వాటినిఇంట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి
  • పొడవు చేతులున్న దుస్తులు, కాళ్లు కూడా కవర్ అయ్యేలా పొడవైన ప్యాంటు ధరించాలి
  • సాయంత్రం సమయంలో వీలైనంత వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు
  • ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు
  • కిటికీలు, తలుపులకు తెరలు ఏర్పాటు చేసుకోవాలి

Anant Ambani Wedding: అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా మహేశ్ కూతురు సితార.. సినీ స్టార్లతో పోజులు.. ఫొటోస్

పర కుబేరుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు.అపర కుబేరుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు.

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ రంగాల ప్రముఖులు అనంత్ అంబానీ వేడుకకు హాజరయ్యారు.

ఇక టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, సూపర్ స్టార్ మహేశ్ బాబులు కుటుంబ సమేతంగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు.

ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో మహేశ్ కుటుంబం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశాడు.

ఇక మహేశ్ గారాల పట్టి సితార పలువురు హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కిమ్ కర్దాషియన్, ఐశ్వర్యారాయ్, రేఖ, ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, రణ్ వీర్ సింగ్.. తదితర నటీనటులతో సితార దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Indian Railways: భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? 4 రోజుల ప్రయాణం

భారతీయ రైల్వే ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వరకు నడుస్తుంది. భారతీయ రైల్వే ట్రాక్‌లు పర్వతాల నుండి అడవుల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి మార్గం భారతదేశపు పొడవైన రైలు ప్రయాణం.

మీరు ఈ ప్రయాణాన్ని ఒకసారి ప్రారంభిస్తే 4 రోజుల్లో మీ గమ్యాన్ని చేరుకుంటారు.

రైలు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మీరు ఒకే కోచ్‌లో ఒకే సీటులో 4 రోజులు గడపవచ్చా? భారతదేశంలోని ఈ రైలు ప్రయాణం అస్సాంలోని దిబ్రూఘర్ నుండి ప్రారంభమవుతుంది. 4 రోజులు ప్రయాణించిన తర్వాత ఈ రైలు తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణాన్ని అందించే ఈ రైలు పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు 4 రోజుల్లో 4 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది.

దిబ్రూఘర్ – కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ 2011-12 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ 9 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.

దేశంలోని ఈ సుదూర రైలు అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మధ్య నడుస్తుంది. ఈ పర్యటనను పూర్తి చేయడానికి 4 రోజులు పడుతుంది.

ఈ 19 కోచ్‌ల రైలు ప్రయాణంలో 4,189 కి.మీ. ఈ దూరాన్ని అధిగమించడానికి 75 గంటలు పడుతుంది. ప్రయాణంలో రైలు 59 స్టేషన్లలో ఆగుతుంది.

దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు: ఈ రైలు చాలా దూరం ప్రయాణించే వారానికి రెండు రోజులు మాత్రమే నడుస్తుంది. IRCTC వెబ్‌సైట్ రైలు నంబర్ 15905/15906 ప్రకారం వివేక్ ఎక్స్‌ప్రెస్ మంగళ, శనివారాల్లో నడుస్తుంది. ఈ రైలు డిబ్రూఘర్ నుండి రాత్రి 7.25 గంటలకు బయలుదేరి 75 గంటల పాటు ట్రాక్‌పై నడుస్తుంది. నాల్గవ రోజు రాత్రి 22.00 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది.

UPI Overpayment Scam: స్కామ్‌ గురూ.. రూ. 200 పంపి.. రూ. 20,000 నొక్కేస్తారు! తస్మాత్‌ జాగ్రత్త

న దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. చిన్న వీధి వ్యాపారి నుంచి పెద్ద మాల్స్‌, స్టార్‌ హోటళ్ల వరకూ అన్ని చోట్ల యాక్సెసబులిటీ పెరిగింది. ఇది వినియోగదారుడికి భద్రతతో పాటు, సౌకర్యాన్ని కూడా అందిస్తుండటంతో అందరూ దీనిని వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలో వీటి సాయంతో మోసాలు చేసే వారు బయలుదేరుతున్నారు. వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తూ వారి కష్టార్జితాన్ని సులభంగా కొట్టేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, 2022-23లో 9,046 మోసాలతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపు మోసాల సంఖ్య 36,075కి పెరిగింది. కాగా ఇటీవల యూపీఐ ద్వారా చేస్తున్న ఓ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. అదే యూపీఐ ఓబర్‌ పేమెంట్‌ స్కామ్‌. ఈ స్కామ్‌ ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

యూపీఐ ఓవర్‌ పేమెంట్‌ స్కామ్‌..

మీరు ఆఫీసులో మంచి బిజిగా ఉన్నారనుకోండి. సరిగ్గా అదే సమయంలో ఓ అన్‌నోన్‌ కాల్‌ మీకు వస్తుంది. అవతలి వ్యక్తి ఆస్పత్రిలో ఉన్నానని.. వేరే వారికి పంపబోయి.. మీకు రూ. 20,000 పంపానని.. తిరిగి ఆ మొత్తాన్ని పంపాలని అభ్యర్థిస్తాడు. అతని కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నందున అతనికి వెంటనే అది తిరిగి కావాలని కోరతాడు. అంతేకాక అతను అప్పటికే మీ యూపీఐ యాప్‌లో డబ్బు సేకరణ అభ్యర్థనను కూడా సెండ్‌ చేసి ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా ఈ సేకరణ అభ్యర్థనపై నొక్కి, చెల్లింపును క్లియర్ చేయడమే. మీరు తర్వాత చేస్తానని చెప్పినా.. వినకుండా ప్రాధేయపడుతూ ఉంటాడు. కాల్ కట్ కూడా చేయనివ్వడు. తప్పు మొబైల్ నంబర్‌కు డబ్బు పంపడం చాలా సాధారణ తప్పు, మీరే చెప్పండి. కావాలంటే మీ ఫోన్‌ కి మేసేజ్‌ కూడా వచ్చి ఉంటుంది చూడండి అంటూ చెబుతాడు. ఒత్తిడిలో మీరు ఫోన్‌ చూస్తే.. నిజంగానే మెసేజ్‌ వచ్చి ఉంటుంది. అయితే దానిని సరిగ్గా చూసుకోకుండా.. అతను అడిగిన అమౌంట్‌ సెండ్‌ చేసేస్తారు. ఇక అంటే ఆ కాల్‌ కట్‌ అవుతుంది. ఆతర్వాత ఎప్పుడో ఖాళీ సమయంలో మీకు వచ్చిన మెసేజ్‌ను క్లిక్‌ చూస్తే.. లేదా మీ బ్యాంక్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసినా.. మీరు షాక్‌ తింటారు. మీకు కేవలం రూ. 200 మాత్రమే పంపి, మీ వద్ద నుంచి రూ. 20,000 కాజేశాడు. మీకు వచ్చిన మెసేజ్‌ చెక్‌ చేస్తే దానిలో ‘రూ. 200.00’ అని ఉంటుంది. కానీ పొరపాటున మీరు రూ. 20,000 అని చదివి, దాన్ని ధ్రువీకరించకుండానే తిరిగి ఇచ్చేశారు. దీంతో మోసపోయారు.

ఏం చేయాలి..

ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. అందుకే డబ్బులు పంపే విషయంలో ఏమాత్రం తొందరపడకూడదు. ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ధ్రువీకరించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే బ్యాంక్‌కి నివేదించాలి. యూపీఐ ప్రొవైడర్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ),సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయాలి.

ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేయండి.. ఏదైనా యూపీఐ అభ్యర్థనను ఆమోదించే ముందు, దాన్ని ఎవరు పంపుతున్నారు అనేది క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏదైనా ఊహించని చెల్లింపు అభ్యర్థనల పట్ల జాగ్రత్తగా ఉండండి.

పంపినవారి వివరాలు తెలుసుకోండి.. మీరు తెలియని వారి నుంచి లేదా ఊహించని మొత్తం కోసం చెల్లింపు అభ్యర్థనను స్వీకరించినట్లయితే, కొనసాగే ముందు పంపినవారి వివరాలను కాల్ లేదా సందేశం ద్వారా ధ్రువీకరించండి.

ఎస్‌ఎంఎస్‌లపై జాగ్రత్త.. స్కామర్‌లు తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు క్లెయిమ్‌లతో అయాచిత సందేశాలను పంపుతారు. పంపినవారి గుర్తింపు, లావాదేవీ ఉద్దేశాన్ని ధ్రువీకరించకుండా ఏ అభ్యర్థులకు ప్రతిస్పందించవద్దు లేదా ఆమోదించవద్దు.

టెన్షన్ వద్దు.. ఫోన్ కాల్‌ల ఆధారంగా, ముఖ్యంగా తెలియని నంబర్‌ల ఆధారంగా డబ్బు బదిలీలలో ఎప్పుడూ తొందరపడకండి. గుర్తుంచుకోండి, స్కామర్లు దోపిడీ చేయడానికి తరచుగా అత్యవసర పరిస్థితిని, భావోద్వేగంతో కూడిన పరిస్థితిని ఉపయోగిస్తారు. అప్రమత్తంగా ఉండండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోండి.

Income Tax: సేవింగ్స్ ఖాతాలపైనా నిఘా! పరిమితికి మించితే అంతే సంగతులు..

టీవల కాలంలో అందరికీ సేవింగ్స్ అకౌంట్ ఉంటోంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో తమ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జీరో బ్యాలెన్స్ ఖాతాలను పెద్ద ఎత్తున ప్రారంభింపజేయడంతో దాదాపు ప్రతి పౌరుడికి సేవింగ్ ఖాతా ఉంది.

అంతేకాక ఆ సేవింగ్స్ ఖాతాను యూపీఐకి కనెక్ట్ చేసుకొని లావాదేవీలను నిర్వహిస్తున్నారు. కొన్ని సార్లు నగదు విత్ డ్రా చేస్తారు. మరికొన్ని సార్లు నగదును డిపాజిట్ చేస్తారు. అయితే ఈ లావాదేవీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి.. మీరు చేసే ప్రతి లావాదేవీపై ఆదాయ పన్ను శాఖ ఓ కన్నేసే ఉంచుతుంది. నిర్ణీత పరిమితి దాటి లావాదేవీ జరిపితే అది ఆదాయ పన్ను శాఖ గుర్తిస్తే.. మీకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అందుకే నగదు డిపాజిట్, విత్ డ్రాలకు సంబంధించి నిబంధనలు పాటించడం ముఖ్యం.

డిపాజిట్ పరిమితి ఎంతంటే..

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్‌పై పరిమితి ఉంది. అంటే, నిర్ణీత వ్యవధిలో బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి నగదు లావాదేవీలపై నిఘా ఉంచేందుకే ఈ పరిమితి విధించారు. తద్వారా, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు వీలుగా దీనిని తీసుకొచ్చారు. ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అప్పుడు ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ మీకు కరెంట్ ఖాతా ఉంటే, ఈ పరిమితి రూ. 50 లక్షలు. అయితే ఈ నగదుపై తక్షణ పన్ను విధించరు. ఈ పరిమితుల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలనేది రూల్.

సెక్షన్ 194ఏ అంటే ఏమిటి..

మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, దానిపై 2% టీడీఎస్ తీసివేస్తారు. గత మూడేళ్లుగా ఐటీఆర్‌ దాఖలు చేయని వారిపై 2% టీడీఎస్‌ మినహాయింపు ఉంటుంది. అది కూడా రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే మాత్రమే ఇది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఈ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి విత్‌డ్రా చేస్తే, అప్పుడు 5% టీడీఎస్ కట్ అవుతుంది. సెక్షన్ 194ఎన్ కింద మినహాయింపు పొందిన టీడీఎస్ ఆదాయంగా వర్గీకరించలేదు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు క్రెడిట్‌గా ఉపయోగించవచ్చు.

సెక్షన్ 269ఎస్టీ అంటే ఏమిటి..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానిపై జరిమానా విధిస్తారు. అయితే, బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేయడంపై ఈ పెనాల్టీ వర్తించదు. అయితే, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ విత్‌డ్రాలపై టీడీఎస్ తగ్గింపు వర్తిస్తుంది.

Health

సినిమా