Saturday, November 16, 2024

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నే కాల్చిన 20 ఏళ్ల కుర్రాడు ఇతనే- నేపథ్యమిదీ..!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నే కాల్చిన 20 ఏళ్ల కుర్రాడు ఇతనే- నేపథ్యమిదీ..!

అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై గన్ తో కాల్పులు జరిపి, అనంతరం సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల కాల్పుల్లో చనిపోయిన నిందితుడి వివరాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విడుదల చేసింది.

నిందితుడి ఫొటోతో పాటు నేపథ్యం, ఇతర వివరాలు ఇందులో ఉన్నాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

నిన్నపెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లిన ఘటనపై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అని ఇప్పటికే ప్రకటించిన దర్యాప్తు సంస్ధ.. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అతని ఫొటోను విడుదల చేసింది. అతను కళ్లజోడు ధరించి కెమెరాలో నవ్వుతున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది.

ట్రంప్ ప్రసంగిస్తున్న వేదిక సమీపంలోని రూఫ్‌టాప్ నుండి సభలో పలుసార్లు కాల్పులు జరిపిన తర్వాత క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ స్నిపర్లు కాల్చి చంపారు. ఒక వ్యక్తి సమీపంలోని పైకప్పు నుండి పైకప్పుకు కదులుతున్నట్లు, ర్యాలీలో తుపాకీతో అతని కడుపుపై ​​పడుకోవడం గురించి భద్రతా అధికారులను హెచ్చరించడానికి వారు ప్రయత్నించారని సాక్షులు పేర్కొన్నారు. అతని మృతదేహం దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఏఆర్-15 దొరికింది.

విచారణలో దర్యాప్తు సంస్ధ ట్రంప్ పై దాడి చేసిన నిందితుడు క్రూక్స్ ను సైలెంట్ గా ఉండే విద్యార్ధిగా గుర్తించారు. అలాగే అతను స్కూల్లోనూ ఒంటరిగా ఉండే వాడని తేలింది. 2022లో బెతెల్ పార్క్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లు తేల్చారు. అలాగే నేషనల్ మ్యాథ్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ నుండి 500 డాలర్ల “స్టార్ అవార్డు” కూడా అందుకున్నట్లు గుర్తించారు. అలాగే రిజిస్టర్డ్ రిపబ్లికన్ అని, రాబోయే నవంబర్ 5 ఎన్నికలలో అతను అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ఇదే మొదటిసారి అయ్యేదని కూడా తెలుసుకున్నారు.

క్రూక్స్ సామాజికంగా రిజర్వ్‌డ్ అని విచారణలో దర్యాప్తు అధికారులకు తెలిపారు. అలాగే ఎప్పుడూ రాజకీయాలు లేదా ట్రంప్ గురించి చర్చించలేదని కూడా తెలిపారు. స్కూల్లో మాత్రం తరచుగా అతనికి బెదిరింపులు ఎదురైనట్లు వారు తెలిపారు. అవి ఎవరి నుంచో మాత్రం తెలియలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత నిందితుడు క్రూక్స్ నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. దాడి తరువాత అతని కారులో ఓ అనుమానాస్పద పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దానిని బాంబు సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అధికారులు అతని ఫోన్ డేటాను తీసుకుని గుర్తించే పనిలో ఉన్నారు.

ఈవారం OTTల్లోకి 26 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరికి ఆసక్తి.. ఏవంటే

ఈవారం OTTల్లోకి 26 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరికి ఆసక్తి.. ఏవంటే

ఎప్పటిలానే మరో వీకెండ్ రకరకాల సినిమాలు వెబ్ సీరిస్ తో ముగిసింది. ఇప్పుడు మరో కొత్తవారం ప్రారంభమైంది. ఇక మూవీ లవర్స్ కు కొత్తవారం వస్తే చాలు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్ కోసం తెగ ఎదురు చూస్తుంటారు.

ఇక మొన్నటి వరకు థియేటర్ లో కల్కి ఫివర్ కొనసాగడంతో.. అందరూ థియేటర్ల బారున పడ్డారు. ఇక ఈ వారం కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది కానీ, ఈ మూవీకి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ప్రేక్షకులకు కాస్త నీరసగానే ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరిన్ని కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ అందించడంలో సినిమాల కొరత అనేది ఎప్పుడు ఉండదు. కాబట్టి ఈ వీకెండ్ లో అనగా శుక్రవారం థియేటర్లలో ‘డార్లింగ్’, ‘పేకమేడలు’, ‘బ్యాడ్ న్యూజ్'(హిందీ) సినిమాలు రిలీజ్ కానున్నాయి. కానీ, వీటిపై అంతగా బజ్ లేదు. దీంతో అందరీ దృష్టి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ మీద పడింది.

అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్స్ లోని కొత్త సినిమాలు,వెబ్ సిరీస్ అనేవి అందుబాటులోనే తీసుకొస్తుంటాయి. ఇకపోతే ఈవారం ఓటీటీలో ఏ కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ వస్తున్నయా అని మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే వారిని అలరించడం కోసం ఓటీటీలో మొత్తం 26 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అందుబాటులో వస్తున్నాయి. అయితే ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ‘ఆడు జీవితం’ సినిమా ఆసక్తి రేపుతుండగా.. ‘బహిష్కరణ’, ‘నాగేంద్రన్స్ హనిమూన్’ అనే వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. దీంతో పాటు హాట్ స్పాట్ అనే మరో డబ్బింగ్ మూవీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుది. మరి ఇవి కాక ఇంకా ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ రాబోతున్నయో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్‌స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 19
జీ5

బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 19
బర్జాక్ (హిందీ సిరీస్) – జూలై 19
ఆహా

హాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 17
నెట్‌ఫ్లిక్స్

భారతీయుడు (తెలుగు సినిమా) – జూలై 15
వాండరుస్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 15
టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – జూలై 17
ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) – జూలై 17
కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) – జూలై 18
త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) – జూలై 18
ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 19
ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19
స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 19
స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) – జూలై 19
అమెజాన్ ప్రైమ్

మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) – జూలై 19
జియో సినిమా

కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) – జూలై 15
మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19
బుక్ మై షో

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లీష్ మూవీ) – జూలై 16
ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 19
డిస్కవరీ ప్లస్

ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
లయన్స్ గేట్ ప్లే
అర్కాడియన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19
ఆపిల్ ప్లస్ టీవీ

లేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 19
హోయ్ చోయ్ టీవీ
ధర్మజుద్దా (బెంగాలీ సినిమా) – జూలై 19

గుడ్ న్యూస్… ఏపీలో నిరుద్యోగులకు కొత్త పథకం!!

నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువ నేస్తం పథకాన్ని అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారని, దీని ప్రకారం ప్రతీ నిరుద్యోగికి 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

ఏపీలో నిరుద్యోగ భృతి… అభ్యర్థుల అర్హతలు

అయితే ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువనేస్తం పథకంలో నిరుద్యోగ భృతి పొందాలంటే వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ఇంటర్ మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హతగా ఉండాలి. ఏపీ పౌరుడై ఉండాలి.

అలా అయితే నిరుద్యోగ భృతి రాదు

నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు రూ. 10,000కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1500చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.అంతేకాదు అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారై ఉండరాదు. అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుండి లబ్ధి పొందకుండా ఉండాలి.

అర్హులు వీరే

ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు ఖాతా వివరాలు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయం సమాచారం, రేషన్ కార్డుతదితర పత్రాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అప్లై చెయ్యాలి. [AP Yuva Nestham] (https://yuvanestham.ap.gov.in/) వెబ్‌సైట్ లోకి వెళ్లి అందులో ఉండే నమోదు ఫారం భర్తీ చెయ్యాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.

ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తు

అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్, అప్లికేషన్ ఐడీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాలలో ఆఫ్ లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్, ఆఫ్ లైన్ డాక్యుమెంట్స్ ను అధికారులు వెరిఫై చేసి, వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత, ప్రతీ నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ చేస్తారు.

సోషల్ మీడియా ప్రచారం.. ప్రకటన చెయ్యని టీడీపీ కూటమి సర్కార్

ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, ప్రభుత్వం అందించిన హెల్ప్‌లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే, అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పథకం వివరాలు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రకటన చెయ్యలేదు. యువనేస్తం వెబ్ సైట్ కూడా ప్రారంభించలేదు. అయితే ఇది నిజమైతే బాగుండు అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Budget 2024: బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. హెచ్‌ఆర్‌ఏ పరిమితి పెంపునకు డిమాండ్‌!

Budget 2024: బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. హెచ్‌ఆర్‌ఏ పరిమితి పెంపునకు డిమాండ్‌!

Budget 2024: భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా ముందుకు నడిపించడమే ఈసారి తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌పై అనేక వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

Budget 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(13A) ప్రకారం వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును (HRA Exemption) కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్‌ఆర్‌ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు. ఆదాయపు పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుత హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని చాలాకాలం క్రితం నిర్ణయించారు. మెట్రో, మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపును ఈసారి కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారు.

ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబయి, కోల్‌కతా, దిల్లీలో మూల వేతనంలో 50 శాతంపై హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు (HRA Exemption) కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40 శాతంగా కొనసాగుతోంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50 శాతం పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూలవేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపునకు పరిగణిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును అనుమతించాలని కోరుతున్నారు.

ఇతర డిమాండ్లు..
తాత్కాలిక స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుత రూ.50,000 నుంచి రూ.1,00,000కు పెంచాలి.
ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు చేయాలి.
కొత్త/డిఫాల్ట్ పన్ను విధానంలోనూ సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80E, సెక్షన్ 80EEB వంటి వివిధ పన్ను మినహాయింపులను అనుమతించాలి.
వైద్య ఖర్చులు పెరగడం వల్ల సెక్షన్ 80డి కింద కవర్ అయ్యే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మినహాయింపు పరిమితిని మరో రూ.25,000 పెంచాలి.
సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతాల వడ్డీ ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచాలి. టర్మ్ డిపాజిట్లు/రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఈ సెక్షన్‌ను వర్తింపజేయాలి.
పాత పన్ను విధానంలో హోం లోన్‌పై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు, గృహ రుణ వ్యయాల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. అలాగే కొత్త పన్ను విధానంలోనూ పన్ను చెల్లింపుదారులకు ఈ మినహాయింపును ఇవ్వాలి.
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత్‌ను ప్రపంచదేశాలతో పోటీపడేలా ముందుకునడిపించడమే ఈసారి తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కొత్త బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కేంద్రం గుడ్ న్యూస్! పది పాసైతే.. నెలకు రూ.8 వేలు! వివరాలు ఇవే..

కేంద్రం గుడ్ న్యూస్! పది పాసైతే.. నెలకు రూ.8 వేలు! వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అంతేకాక రైతులకు, మహిళకు, అలానే విద్యార్థులకు కూడా ఎన్నో స్కీమ్స్ ను అందిస్తుంది.

అలానే యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ ఉపాధిని కల్పిస్తుంది. తాజాగా యువతకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఉపాధి కల్పన అందించే లక్ష్యంగా పలు ప్రణాళికలు అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి పొందుతున్నారు. ఓ స్కీమ్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.8 వేలు సంపాదించ వచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.ఈ స్కీమ్ ఇండియాలోని యువత కోసం ఒక ప్రధానమైనది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఓ మార్గంగా పని చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారి నైపుణ్యాలతో ఉపాధిని పొందవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధికి కల్పించేందుకు కేంద్రంలో శిక్షణ ఇస్తోంది.

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హతలు ఉంటారు. వారు భారత పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు హిందీ, ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇది కోర్సును త్వరగా, సులభంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది యువత ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతున్నారు.

దీని కోసం స్కిల్ ఇండియా డిజిటల్‌పై ప్రాక్టికల్ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో ఒక్కోక్క యువతకు నెలకు రూ.8 వేలు ఇస్తారు. అలానే ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో శిక్షణ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం తర్వాత సర్టిఫికేట్ కూడా జారీ చేస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చేయవచ్చు. ఈ సర్టిఫికేట్ దేశంలో ఎక్కడైనా చెల్లుతుంది, తద్వారా యువత ఏ రాష్ట్రంలోనైనా జాబ్ సంపాదించవచ్చు. దీని కోసం యువత ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇల్లు లేని వారికీ రేవంత్ సర్కార్ తీపి కబురు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థికసాయం అందజేయనుందట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు రూ. 5లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రజాపాలనలో 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Moong Sprouts: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!

సాధారణంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, వడ, దోశ ఇలాంటి ఆహారాలే తీసుకుంటారు. కానీ ఆరోగ్య రిత్యా ఉదయం ఫలహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన పెసర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. రోజువారీగా మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సహా ఎన్నెన్నో ఈ మొలకెత్తిన పెసర్లను తినడం ద్వారా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ అలసటను పోగొట్టేందుకు, మెరుగైన నిద్రకు తోడ్పడతాయని చెప్పారు. మొలకెత్తిన పెసర్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తినడం ద్వారా జీర్ణవ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు.

ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుందని, తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తోడ్పడి, రక్తం గడ్డకట్టే ముప్పును తప్పించుకునేందుకు దోహదం చేస్తాయట. మొలకెత్తిన పెసర్లలోని ఫైబర్ కంటెంట్ ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పుల వంటి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయని వివరించారు. చర్మ సంరక్షణకు తోడ్పడి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవని తెలిపారు. కంటిచూపు కూడా పెరుగుతుందట. మధుమేహ బాధితులకు మొలకెత్తిన పెసర్లు దివ్యౌషధంగా పనిచేస్తాయట. రక్తంలో చక్కెర స్థాయులను సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసర్లకు ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ గుప్పెడు గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని వివరించారు. సంతానోత్పత్తికి, గర్భిణీలకు మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యాన్నిస్తాయని, అధిక బరువును తగ్గించుకోవడానికి తోడ్పడతాయని తెలిపారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.

Sarfira Movie: ‘ ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం.. మా సినిమాకు రండి’.. ఆడియెన్స్‌కు మల్టీప్లెక్స్‌ల ఆఫర్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల పరంగా ఈ మధ్యన వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. అలా తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబడుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అసలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్‌లు ఉచితంగా టీ, సమోసాలు అందించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా మొదటి రోజు స్టార్ సినిమాలు బాగా కలెక్ట్ చేయాలి. కానీ ‘సర్ఫిరా’ సినిమా తొలిరోజు (జూలై 12న) కేవలం రూ.2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు రూ.4.50 కోట్లు రాబట్టింది. ఎలాగైనా ఆదివారం (జూలై 14) సినిమా కలెక్షన్లను మరింత పెంచాలన్నది చిత్ర బృందం లక్ష్యం. అందుకోసం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సర్ఫిరా సినిమా చూసేందుకు వచ్చే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు అందులో ప్రకటించింది.

సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్ఫిరా’. కాగా ఇది తమిళ చిత్రం ‘సురారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే హద్దురా)కి హిందీ రీమేక్‌. ఆ తమిళ సినిమా గతంలో హిందీలోకి డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్లీ హిందీలో రీమేక్ చేయడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కథ అందరికి తెలిసిపోవడంతో ‘సర్ఫిరా’ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపడం లేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కెప్టెన్ గోపీనాథ్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించాడు. పరేష్ రావల్, దిశా మదన్, ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. కోలీవుడ్ నటుడు సూర్య అతిథి పాత్రలో కనిపించారు. అయినా కూడా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.

పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ… ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని …!

8 గ్రామాలు…1365 ఎకరాలు.. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందే కనిపించేవి. కానీ ఇవాళ లేవు. ఇప్పుడున్న ఊళ్లు రేపు ఉంటాయో.. లేదో కూడా అనుమానమే. ప్రభుత్వాలు చేస్తున్న అరకొర ప్రయత్నాలు.. అసంపూర్ణ ఆలోచనలు.. ఆ ఊళ్లను.. ఊళ్లోని జనాలను, వారి ఆస్తుల్ని ఇప్పటి వరకు ఏ మాత్రం ఆదుకోలేకపోయాయి. సముద్రపు అలల ధాటికి ఊళ్లు కొట్టుకుపోతుంటే .. ఆ జనం కన్నీళ్లు కూడా అందులో కలిసిపోతున్నాయి. వారి ఘోష… సముద్రపు ఘోషలో కలిసిపోయి… ఇన్నాళ్లూ పాలకులకు వినిపించకుండా పోయింది.

ఎలా ఉండాలి..? ఎలా ఉంది..?

అందమైన చీరలపై అలవోకగా జాంధానీ డిజైన్లు అద్దే చేతులు… ఓ వైపు మనోహరమైన సముద్రపు అలల సవ్వడి… ఎటు చూసినా పచ్చదనం… నిజానికి ఆ ఊరి దృశ్యాలు ప్రకృతి గీసిన చిత్రంలా ఉండాలి. ఒకప్పుడు ఉండేది కూడా. కానీ గడిచిన 6 దశాబ్దాలుగా వారి రాత రోజు రోజుకీ మారిపోతోంది. ఎగసి పడే ప్రతి అల.. తమను, తమ ఇళ్లను, తమ ఊరిని మింగేస్తుంటే… తమ బాధ ప్రభుత్వాల ముందు కంఠ శోషగానే మిగిలిపోతూ ఉంటే.. దిక్కు తోచక.. ఆ అలలకు దూరంగా పరిగెడుతునే ఉన్నారు. కానీ విచిత్రమేంటే.. వాళ్లెంత వేగంగా పరిగెడుతుంటే.. ఆ సంద్రం అలలు కూడా అంతే వేగంగా వారిని వెంటబడుతున్నాయి. అలాగని ఊరొదొలి వెళ్లేంత ధైర్యం ఆ జనాలకు లేదు. అదే ఇప్పుడు ఈ తీరానికి లోకువయ్యింది.

సముద్రం చొచ్చుకు వస్తున్న కొద్దీ తాము వెనక్కి జరగడమే తప్ప మరో దారి లేకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళనలో ఉన్నారు. దశాబ్ధిన్నర కిందట, కోత నివారణ కోసం నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసమయ్యింది.

సముద్రం కూల్చేస్తున్న ఊరు

పైన చూస్తున్న చిత్రంలో కూలిపోయిన ఇళ్లు కావవి. పక్కనే కనిపిస్తున్న ఆ సమద్రం కూల్చేసిన ఇళ్లు. ఇప్పటి వరకు 6కి పైగా ఆలయాలు, 3 పాఠశాలలు, రెండు ట్రావెలర్ బంగ్లాలను సముద్రం తనలో కలిపేసుకుంది. ఇక ఇళ్ల లెక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అలల ధాటికి కూలిపోయినవి ఇళ్లు కావు.. ఈ ఊరి జనం జీవితాలు. వానికి 20 ఏళ్ల క్రితం సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఇళ్లు కట్టుకున్న వారికి కూడా ఇప్పుడు తమ ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే కొన్ని సముద్రం పాలయ్యాయి కూడా.

2011 జనాభా లెక్కల ప్రకారమే 12వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

కాకినాడ పోర్ట్ నుంచి సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న ఉప్పాడ మధ్య తీరం చాలాకాలంగా కోతకు గురవుతోంది. దాని కారణంగా బీచ్ రోడ్డు కూడా అనేకమార్లు దెబ్బతింది. పదే పదే రోడ్లు నిర్మించాల్సి వస్తోంది.

ఆనవాళ్లు కనపించని జియో ట్యూబు!

సముద్రతీరాన్ని కోత నుంచి కాపాడేందుకంటూ జియో ట్యూబ్ పేరుతో ఏర్పాట్లు చేశారు. భారీ బండరాళ్లను సముద్రపు ఒడ్డున వేసి కెరటాల తాకిడి తీరాన్ని తాకకుండా అడ్డుకట్టగా మార్చారు. ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని రాళ్లను పెద్ద వలల్లో వేసి అవి అలల తీవ్రతను నివారించేలా ఏర్పాట్లు చేశారు.

నేటికీ బీచ్ రోడ్డులో వేసిన పెద్ద రాళ్లే కోత వేగవంతం కాకుండా నివారించేందుకు దోహదపడుతున్నాయి. కానీ ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని వేసిన ట్యూబ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆనవాళ్లు కూడా మిగలలేదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నీటి పారుదల శాఖ నిధులతో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు ఆ జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో రూ. 12.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేశారు. వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది. తాత్కాలికంగా ఫలితాన్నిచ్చిన ట్యూబ్ ఇప్పుడు ఆనవాళ్లే లేకుండా పోయింది. మొత్తంగా తీరంలో సుమారు 1463 మీటర్ల మేర జియో సింథటిక్ ట్యూబులు, బ్యాగులు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇది ప్రయోగాత్మక ప్రాజెక్టే అయినప్పటికీ తర్వాత దీన్ని మొత్తం ఉప్పాడ గ్రామంలోని తీరమంతటికీ విస్తరించాలన్నది అప్పటి ఆలోచన. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు కోసం 135 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే ఆనవాలు లేకుండా పోయేసరికి… మిగిలిన బడ్జెట్ కేటాయించి.. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేంత ధైర్యం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చెయ్యలేదు.

నిజానికి మొదట్లో ఆ జియోట్యూబులు కొంత మేర ఫలితాన్నిచ్చాయి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఏటా సుమారు 1.98 మీటర్ల నుంచి 7.98 మీటర్ల మేర కోతకు గురయ్యే తీర ప్రాంతం.. జియో ట్యూబులు ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 6 మీటర్లకు పరిమితం అయ్యింది. కానీ 2014-15 నాటికి మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి. 2016లో వచ్చిన వర్ధా తుపాను ధాటికి కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన జియో ట్యూబులు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన ఫని తుపాను దెబ్బకు సముద్రానికి అడ్డంగా కట్టిన రక్షణ గోడలు బలహీనపడ్డాయి.

అయితే దేశంలో ఇతర తీర ప్రాంతాల్లో కూడా ఈ జియో ట్యూబుల ప్రయోగం పెద్దగా ఫలితాన్నివ్వలేదన్న విషయం తర్వాత పరిశోధనల్లో వెల్లడయ్యింది. పశ్చిమ బెంగాల్లోని శంకరపూర్, మహారాష్ట్రలోని దేవ్‌బగ్ అలాగే ధను ప్రాంతాల్లోనూ, గుజరాత్‌లోని అదానీ పోర్టులో, గోవాలోని కండోలిమ్ బీచ్‌లో జియో ట్యూబులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి వల్ల పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలు లేవు. బలమైన సముద్రపు అలల తాకిడికి అవి తాళలేవన్న విషయం కేవలం ఉప్పాడలోనే కాదు, దేశ వ్యాప్తంగా చేపట్టిన చాలా ప్రయోగాల్లో తేలింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించారు. తీర ప్రాంతం పదే పదే మునకకు గురికావడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటానని హామీ ఇచ్చారు.

మీకు నేనున్నా…

“ఉప్పాడ ప్రాంతాన్ని వెళ్లి చూసొచ్చా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ విషయమై మాట్లాడాను. సరిగ్గా 18 నెలల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ పరిసర ప్రాంతాలకు భవిష్యత్తులో ఆ సమస్య ఇక రానివ్వను. కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు అందమైన కోస్టల్ రోడ్‌ను నిర్మిస్తా. అలాగే ఆ ప్రాంతంలో పర్యటకంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా.” ఇవి ఆయన ఉప్పాడలో 2024 జూలై 3న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇచ్చిన హామీలు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై స్థానికులు చాలా నమ్మకం పెట్టుకున్నట్టు వారి మాటల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసిపోతూ ఉన్నా… ఏ ప్రభుత్వమూ తమకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదని, నిత్యం సముద్రపు కోతకు గురయ్యే రోడ్డు బాగు పడితే చుట్టు పక్కల ఊళ్లలో ప్రజల జీవితాలు మారిపోతాయని స్థానికులు చెబుతున్నారు.

“నిత్యం సముద్రపు కోతకు గురయ్యే ఈ రోడ్డు బాగుపడితే మా జీవితాలు బాగుపడతాయి. మా జీవనోపాధికి ఈ రోడ్డే ముఖ్యం. నిజంగా ఈ కోస్టల్ రోడ్ ఏర్పాటై.. పర్యటకంగా అభివృద్ధి చెందితే.. వైజాగ్‌లా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.” అన్నది స్థానిక ఆటో డ్రైవర్ మాట.

మా నమ్మకం నువ్వేనయ్యా!

అయితే అధికారంలోకొచ్చే ప్రతి ప్రభుత్వమూ ఇదే తీరున హామీలిస్తూ వచ్చిందని,  అయితే ఏ ఒక్కరూ తమ సమస్యను పూర్తిగా తీర్చలేకపోయారన్నది మరి కొందరు స్థానికుల వాదన. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వంపై నమ్మకం వారి మాటల్లో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన హామీలను కచ్చితంగా వెరవేరుస్తారన్న నమ్మకం తమకు ఉందని అంటున్నారు .

దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం కల్గిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుమారు 947 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించింది. 1990 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 289.36 కిలోమీటర్ల మేర తీర్ ప్రాంతం కోతకు గురయ్యందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ NCCR పరిశోధనలో తేలింది. కేవలం ఉప్పాడలోనే ఏటా 1.23 మీటర్ల మేర సముద్రం కోతకు గురవుతూ వస్తోంది. ఇప్పటి వరకు కాకినాడ తీర ప్రాంతంలో సుమారు 600 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది.

ఏమిటి పరిష్కారం?

మానవుడు నిర్మించే కృత్రిమ నిర్మాణాలేవీ సముద్రపు కోత నుంచి తప్పించలేవని, కేవలం సహజసిద్ధంగా ఏర్పాట్లు మాత్రమే తప్పిస్తాయన్నది నిపుణుల మాట. ఎక్కడెక్కడయితే తీరం కోతకు గురవుతుందో ఆయా ప్రాంతాలలో సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.  ముఖ్యంగా మడ అడవుల పెంపకం అందుకు చక్కని పరిష్కారం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇండోనేషియా, కెన్యా, పాపువా న్యూ గినియా, కాంబోడియా, నైజీరియా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఈ తరహా ప్రయోగాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్నాయి. మన దేశంలో కర్నాటకలో కూడా సుమారు 300 ఎకరాల్లో మడ అడవుల్ని పెంచడం ద్వారా సముద్రపు కోతను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మడ అడవులు కేవలం సముద్రపు కోత నుంచి తీర ప్రాంతాలను రక్షించడం మాత్రమే కాదు ఉప్పెనలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా కాపాడతాయి. అనేక వందల జీవరాశులకు ఆశ్రయం ఇస్తాయి కూడా. మరి ఏపీ ప్రభుత్వం ఉప్పాడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని స్థానిక ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నారు.

 

India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టల్‌ శాఖలో భారీగా కొలువులు! పది పాసైతే చాలు.. నో ఎగ్జాం

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో యేటా వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీగా జీడీఎస్‌ ఖాళీల భర్తీకి పోస్టల్‌ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది జనవరిలో 40 వేల జీడీఎస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది కూడా సుమారుగా 40 వేలకు పైగా పోస్టులకు ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ నియామకాలు చేపడతారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో ఆయా బ్రాంచుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక జీతభత్యాల విషయానికొస్తే పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. వీరికి పనివేళలు కూడా తక్కువే. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది.

వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన అదనంగా సేవలు అందిస్తే.. అందుకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. రానున్న నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.

తెలంగాణ దోస్త్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

తెలంగాణ దోస్త్‌ ద్వారా మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన తర్వాత ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుంది. ఇందుకు గడువు జులై 12తో ముగిసింది. ఈ క్రమంలో గడువును మరికొన్ని రోజులకు పెంచాలని విద్యార్థులు ఉన్నత విద్యామండలికి విజ్ఞప్తులు చేశారు. దీంతో జులై 18 వరకు గడువు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. కాగా ఇప్పటివరకు 1,17,057 మంది విద్యార్ధులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

 

మామిడితో సహా ఈ పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి ఓ వరం.. ఎలా ఉపయోగించుకోవాలంటే..

సీజన్ లో దొరికే మామిడి పండ్లు, నేరేడు వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడి పండ్లను తినడమే కాదు.. పచ్చి మామిడికాయలతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. మామిడి కాయ చట్నీ, మామిడికాయ పన్నా , మామిడికాయ పప్పు వంటి వాటితో పాటు పండిన మామిడిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మామిడి పండ్లను తిని వాటి టెంకలను (విత్తనాలను)  పడేస్తారు. మామిడి పండు మాత్రమే కాకుండా దాని విత్తనం అంటే మామిడి టెంక కూడా చాలా ఉపయోగకరం. మామిడి టెంకతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఇలా మామిడి విత్తనం మాత్రమే కాదు ఇంకా రకరకాల పండ్ల విత్తనాలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు ఆ పండ్లు ఏమిటి? వాటి గింజల వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం..

మామిడి టెంకలు: మామిడి పండు తిన్న తర్వాత దాని టెంకలను కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత టెంకకు ఉన్న పెంకును వేరు చేసి.. దాని లోపల ఉన్న జీడిని తీసి, ఎండబెట్టి పొడిని తయారు చేసుకోవాలి. ఈ చుర్నాన్ని తేనెతో కలిపి సేవించవచ్చు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

నేరేడు పండు గింజలు: ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ పండ్ల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నేరేడు పండ్లతో పాటు దీని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేరేడు పండ్ల నుంచి విత్తనాలను తీసి వాటిని కడగాలి. ఎండబెట్టి ఆ విత్తనాలను పొడి చేయండి. ఈ చూర్ణం డయాబెటిస్‌ బాధితులకు ఓ వరం. షుగర్ పేషెంట్స్ లోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో ఈ పొడి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ పొడిని ఉదయాన్నే నీటితో కలిపి తీసుకోవచ్చు. అయితే షుగర్ కంట్రోల్ కోసం ఏదైనా ఔషధం తీసుకుంటే.. ఈ పొడిని తీసుకోవద్దు.

అవోకాడో సీడ్ అవోకాడో శారీరక ఆరోగ్యంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్ల నిధి. అయితే దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తాయి. అదే సమయంలో.. ఈ విత్తనాల చూర్ణంతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయవచ్చు.

జాజికాయ మసాలాగా ఉపయోగించే జాజికాయ.. ఇది పండు కెర్నల్ లేదా విత్తనం. ఇది ఫిల్ మిరిస్టికా అనే చెట్టు పండు నుంచి లభిస్తుంది. చెట్టు నుంచి పండిన పండు నుంచి జాజికాయ వేరు చేయబడుతుంది. ఈ పండు నుంచి జాపత్రి కూడా లభిస్తుంది. ఇది విత్తనం అంటే జాజికాయపై ఒక కవర్ లాగా చుట్టబడి ఉంటుంది.

చింత గింజలు పుల్లని రుచిని కలిగి ఉన్న చింతపండు రుచితో పాటు పోషకాహారం కూడా. అయితే చింత గింజలను కూడా ఆరోగ్య సంబంధిత సమస్యల నివారణకు కూడా ఉపయోగిస్తారు. దీని పొడిని తయారు చేసి తీసుకుంటారు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ రకమైన విత్తనాలనైనా ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.)

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 25కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్ల దగ్గర కల్కి హంగామానే కనిపిస్తోంది. గత వారం రిలీజైన భారతీయుడు 2 కు నెగెటివ్ టాక్ రావడంతో కొత్త మూవీస్ కోసం సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ వారం డార్లింగ్, పేక మేడలు వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో సినిమా లవర్స్ ఓటీటీ రిలీజుపై దృష్టి సారించారు. ఈ వారం సుమారు 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆడు జీవితం ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్, నాగేంద్రన్స్ హనీమూన్ అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జూన్ 3 వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాల లిస్ట్ పై ఒక లుక్కేద్దాం రండి.

ఆహా ఓటీటీ

  • హాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 17

ఈటీవీ విన్

  • హరోం హర- తెలుగు సినిమా- జులై 18

నెట్‌ఫ్లిక్స్

  • భారతీయుడు (తెలుగు సినిమా) – జూలై 15
  • వాండరుస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 15
  • టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 17
  • ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 17
  • కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూలై 18
  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) – జూలై 18
  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ వెబ్ సిరీస్) – జూలై 18
  • ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 19
  • ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 19
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 19
  • స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ వెబ్ సిరీస్) – జూలై 19

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 18
  • బెట్టీ లా ఫీ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూలై 19

జీ5

  • బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 19
  • బర్జాక్ (హిందీ వెబ్ సిరీస్) – జూలై 19
  • జియో సినిమా

    • కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లిష్ సినిమా) – జూలై 15
    • మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లిష్ సిరీస్) – జూలై 18
    • ఐఎస్ఎస్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 19

    బుక్ మై షో

    • జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లిష్ మూవీ) – జూలై 16
    • ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 19

    డిస్కవరీ ప్లస్

    • ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లిష్ సిరీస్) – జూలై 18

    లయన్స్ గేట్ ప్లే

    • అర్కాడియన్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 19

    ఆపిల్ ప్లస్ టీవీ

    • లేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 19

    హోయ్ చోయ్ టీవీ

    • ధర్మజుద్దా (బెంగాలీ సినిమా) – జూలై 19

    Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

Rains Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 18వరకూ ఏపీ, తెలంగాణాలో జోరు వానలు

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.

ఆంధ్రపదేశ్ లో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఏపీకి భారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతరామరాజు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

తెలంగాణాకు భారీ వర్ష సూచన

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ చెప్పింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

హైదరాబాద్‌కు వర్ష సూచన

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని , హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

AP:పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పశువుల పెంపకం దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది. యూనిట్‌కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పెంపకందారులు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘గోకులం’ పేరుతో దీన్ని అమలు చేయనుంది.

Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అంబానీ ఇంట పెళ్లికి వెళ్లిన ఏపీ యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

డబ్బు కలిగినోళ్లు, బలం కలిగినోళ్లు, నోరుగల్లోళ్లు ఏం చేసినా చెల్లుతుందని ఊరికే అనలేదు పెద్దలు. డబ్బున్నోళ్ల ఇళ్లల్లో ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచ మంతటా మారుమ్రోగేలా చాటింపువేస్తారు.

ఇక పెళ్లిళ్లు, బర్తడే పార్టీలు, శీమంతాలు, పురుళ్లు, బారసారలు.. వీటికి సంగతి సరేసరి. చేవిలో మైకులు పెట్టి ప్రచారం చేస్తారు. అయితే తాజాగా జరిగిన అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక కూడా ఇలాగే పండలా చేశారు. మూడు రోజులు, 5 రోజులు, 7 రోజులు కాకుండా ఏకంగా 7 నెలలుగా వీరింట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచమంతా చెప్పుకునేలా కనీవినని రీతిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో కలిగినోళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లు కనీసం దూరం నుంచైనా ఎలా ఉంటాయో చూద్దాం అని సామాన్యుల నుంచి పెద్దొళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరినోళ్లే. అయితే అందరికీ ఈ ఛాన్స్‌ లేదు. ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్‌ కార్డులను పంపిన సెలబ్రెటీలకు మాత్రమే అంబానీల ఇంట పెళ్లి వీక్షించేందుకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం లేనివారికి నిర్మొహమాటంగా ప్రవేశం లేనట్లే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎలాగైనా అంబానీల పెళ్లి చూడాలని తెగ ఉబలాటపడ్డారు. అంతే.. పెళ్లి మండపానికి సరాసరి వెళ్లిపోయారు. దీంతో అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఏం జరిగిందంటే..

రిరిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, అపార కుబేరుడు ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక శనివారం (జులై 13) అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబానికి చెందిన ముంబైలోని సెంటర్ జియో వరల్డ్ డ్రైవ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సినీ తాలరు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, క్రికెటర్లు పాల్గొన్నారు. దేశ దేశాల నుంచి అతిరథ మహారధులు విచ్చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో సహా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే రియాలిటీ టీవీ దిగ్గజాలు కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే, నైజీరియా సింగర్‌ రేమా, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సౌదీ అరామ్‌కో సీఈఓ అమీన్ నాజర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఎటు చూసినా ఖరీదైన మనుషులే.

అయితే, ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా ఏపీకి చెందిన యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య అల్లూరి (26), స్థానిక వ్యాపారి లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్ (28) అనే ఇద్దరు వ్యక్తులు అనంత్ అంబానీ హై-ప్రొఫైల్ పెళ్లి మండపంలోకి ప్రవేశించారు. అలా వెళ్లిన వీరిని నిమిషాల వ్యవధిలోనే ముంబై పోలీసులు పట్టుకుని, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ప్రోటోకాల్‌ విధివిధానాల తర్వాత వారి చర్యకు అధికారులు నోటీసులు జారీ చేసి, అనంతరం విడుదల చేశారు.

Gas Cylinder: మీరు ఇలా చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ రద్దు అవుతుంది!

జ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. దీని ప్రకారం జులై 27లోగా వంటగ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ సహా కేవైసీ వివరాలను నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చని ప్రకటించారు.

దీనికి సంబంధించి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు ఎస్ఎంఎస్ పంపింది. భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పొందారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు.

గ్యాస్ సిలిండర్ రూ.500:

అఖిల భారత ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ అనుసంధానం చేసుకున్న వారికి రూ.372 సబ్సిడీని అందజేస్తున్నారు. అదేవిధంగా ఇతరులకు రూ.47 సబ్సిడీ ఇస్తారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద ఉన్న వారికి రూ.500కే సిలిండర్ అందజేస్తారు. ఉజ్వల పథకంలో లేని వారికి రూ.800కే సిలిండర్ ఇస్తున్నారు.

కేవైసీ వివరాలను నమోదు చేయండి

ఈ సందర్భంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినియోగదారులకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎల్‌పీజీ సిలిండర్ హోల్డర్లు 2 వారాల్లో కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలి. దీని ప్రకారం.. భారత్ గ్యాస్, ఇండేన్, IOC సహా ప్రభుత్వ రంగ సంస్థలతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ప్రామాణికతను ధృవీకరించడానికి కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా కేసు ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నంబర్, వేలిముద్ర నమోదు చేయాలని ఆదేశించారు. అలా నమోదు చేసుకోకుంటే వంటగ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా : Mukesh Ambani: కోడలు రాధికకు వీడ్కోలు.. ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్‌

జూలై 27 చివరి తేదీ:

ఏజెన్సీలకు రాలేని సీనియర్‌ సిటిజన్‌లకు సహాయంగా డెలివరీ వర్కర్‌లు వారి ఇళ్లకు వెళ్లి మొబైల్‌ ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ను తీసుకుంటున్నారు. కాగా, ఉండగా, మే 30లోగా ఆధార్, వేలిముద్ర నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు జూలై 27 వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌కు కేవైసీ చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. కొందరేమో గడువు ఉందని, గడువులోగా కేవైసీ చేసుకోకుండా కనెక్షన్‌ రద్దు అవుతుందని చెబుతున్నారు. అయితే గడువు ఉన్నా.. లేకున్నా.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కేవైసీ చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని గుర్తించుకోండి.

MECON Recruitment: డిప్లొమా అర్హతతో ‘మెకాన్’ లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..

MECON Recruitment: డిప్లొమా అర్హతతో ‘మెకాన్’ లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..

Mecon India Ltd Recruitment Notification 2024: మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 309 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) అభ్యర్థులు 10 జూలై 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది. మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. MECON Ltd యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం meconlimited.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

* డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు

* ఇంజినీర్: 01 పోస్టు

* అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు

* జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు

* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు

* జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు

* డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు

* ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

మొత్తంగా 309 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సంబంధిత విభాగలలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్: ఎందుకంటే?

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన సమన్లపై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషన్‌ సమన్లపై హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కేసీఆర్‌ వెళ్లారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

కాగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో మాజీ సీఎం కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది.

ఈ క్రమంలో తనను విచారణకు పిలవకూడదంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) తెలంగాణ హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు. అయితే కేసీఆర్‌కు ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది.

నేడు బెంగళూరుకు జగన్‌.. రెండు వారాల వ్యవధిలో రెండోసారి పయనం

నేడు బెంగళూరుకు జగన్‌.. రెండు వారాల వ్యవధిలో రెండోసారి పయనం

ప్రారంభం కాకుండానే ప్రజాదర్బార్‌ వాయిదా

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం బెంగళూరు వెళ్లనున్నారు.

ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉంటారు. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్‌.. ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల, బెంగళూరులోనే జగన్‌ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా.. లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ హాజరుపై వైకాపా నుంచి కానీ.. ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ స్పష్టత రాలేదు.

సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. ఇందులో పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్‌ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రారంభానికి ముందే అది వాయిదా పడింది. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన ‘స్పందన’ ప్రారంభం కాకుండా వాయిదాలతోనే ఐదేళ్లు గడిపేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాల్ని వాయిదాలు వేస్తున్నారు.

ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3వేలు!

ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3వేలు!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. ఇప్పటి పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, సహా మరిన్ని హామీలను అమలు చేస్తోంది.

అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, యువతకు గుడ్‌న్యూస్‌ అందనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పథకానికి అర్హులైన వారు ఏఏ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలనే దానిపై ప్రచారం జరుగుతోంది.

కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అర్హతలు, ఏ డాక్యుమెంట్లు కావాలి.? దరఖాస్తుల వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే పథకం అమలు కాబోతుందని.. అర్హులైన వారు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తారని చెబుతున్నారు.

22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి అర్హులని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నలకు రూ.10వేలు కన్న ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం, గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి. సదరు అభ్యర్థి, కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పొందకూడదు. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీ, బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. AP Yuva Nestham వెబ్‌సైట్ మరిన్ని వివరాలకు సంప్రదించాలని చెబుతున్నారు. కానీ.. ఈ వెబ్‌సైట్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం అవుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా?

Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా?

అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టనున్నారట. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు నేటి(సోమవారం) నుంచి తాడేపల్లిలో తన క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.

కాగా, మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇవాళ (జులై 15వ తేదీ) బెంగళూరు వెళ్లనున్నారు. ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత నెల 24వ తేదీన జగన్ బెంగళూరు వెళ్లి.. ఈ నెల 1వ తేదీ వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఇక ఈరోజు నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించాలని జగన్‌ నిర్ణయించి.. ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు.

సముద్రగర్భంలో రామసేతు నిజమే: ఇస్రో

సముద్రగర్భంలో రామసేతు నిజమే: ఇస్రో

భారత్, శ్రీలంకల మధ్య రామ సేతు వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక వ్యాఖ్యలు చేసింది. రామ సేతు కాల్పనికం కాదని..

నిజమేనని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ.

మేర ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉందని వివరించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రో ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

‘త్వరలో కశ్మిర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్’..టీడీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నేడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాల పై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

విశాఖ భూ ఆక్రమణలో సీఎస్ స్థాయిలో పని చేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు.

రోజూ చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Health benefits of clapping: రోజూ చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఉదయాన్నే పార్కులో ఒక మూలన వృత్తాకారంలో కూర్చున్న పెద్దలను మీరు తప్పక చూసి ఉంటారు. వారు గట్టిగా చప్పట్లు కొట్టడం చూసి, మీ మనస్సులో ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఈ వ్యక్తులు ఎందుకు ఇలా చేస్తారు? చదవడానికి ఎంత వింతగా అనిపించినా.. చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది ఒక రకమైన చికిత్సగా పరిగణిస్తున్నారు. రోజూ చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం… మానసిక స్థితిని మెరుగుపరచడానికి చప్పట్లు కొట్టడం కూడా మంచిది. ఇది శరీరం మరియు మనస్సు రెండింటినీ బలపరుస్తుంది.

చప్పట్లు కొట్టడం వల్ల కండరాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ముఖ్యంగా మెడ మరియు వెనుకకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, రక్తపోటు, ఊబకాయం లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని నుంచి చాలా ప్రయోజనాలను పొందుతారు. రోజుకు 300-400 సార్లు చప్పట్లు కొట్టడం వల్ల సిరల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది. చప్పట్లు కొట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. ఇది రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. కాలేయం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. కానీ చెప్పట్లు కొట్టడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. దీన్ని క్లాప్పింగ్ థెరపీ అంటారు. నడుము నిటారుగా ఉంచి, మీ శరీరాన్ని పైకి లాగి చప్పట్లు కొట్టాలి. ఈ సమయంలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం మధ్యలో కొన్ని విరామాలు కూడా తీసుకోవచ్చు. అలాగే.. చప్పట్లు కొట్టే ముందు, మీరు మీ అరచేతులపై కొంచెం నూనెను పూయవచ్చ., ఇది మనస్సును రిలాక్స్ చేయడంలో చాలా సహాయపడుతుంది.

Roasted Chana: రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా?

Roasted Chana: రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా?

వేయించిన శనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణం, మరమ్మత్తు, కణాల పెరుగుదలకు, కండరాల ఆరోగ్యానికి, కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ గుప్పెడు వేయించిన శనగలు తీసుకుంటే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

వేయించిన శనగలు పోషకాల పవర్ హౌస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. వేయించిన శనగలలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, పిండి పదార్థాలు మొదలైనవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.

వేయించిన శనగల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పు తగ్గుతుంది.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం ఎంతో అవసరం. వేయించిన శనగలు సమతుల ఆహారంలో ఒక భాగమే అంటున్నారు నిపుణులు. సమతుల ఆహారంలో రోజుకు 100గ్రాముల వరకు వేయించిన శనగలను తీసుకోవచ్చునని చెబుతున్నారు.

వేయించిన శనగల గురించి మరొక షాకింగ్ నిజం ఏమిటంటే వీటిని తినడం వల్ల మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. శనగలలో ఉండే పోషకాలు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. వేయించిన శనగల్లో రాగి, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక ఫైబర్‌ కంటెంట్‌.. మిమ్మల్ని ఎక్కువకాలం సంతృప్తిగా ఉంచుతుంది. అంతేకాదు, వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు ఆకలి కోరికలు నియంత్రించుకోవాలంటే స్నాక్స్ లో భాగంగా వేయించిన శనగలు తీసుకోవచ్చు. అధిక ఫైబర్‌ కంటెంట్‌ గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

Railway Knowledge: ట్రైన్ రిజర్వేషన్ టిక్కెన్ ను మరొకరి ట్రాన్స్ ఫర్ చేయడం ఎలాగో తెలుసా!

ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు చాలామంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే దూర ప్రయాణాల కోసం చాలామంది ముందుగానే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.

అయితే ఆకస్మిక పని లేదా మరేదైనా కారణంతో కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాలతో రిజర్వేషన్ ఉండి కూడా కొంతమంది ప్రయాణం చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు వేరే మార్గం లేదని భావిస్తున్నారు. కానీ టిక్కెట్‌ను రద్దు చేయడమే కాకుండా, మీరు మీ టిక్కెట్‌ను మరొకరికి ట్రాన్స్ ఫర్ లేదా బదిలీ చేయవచ్చు. రిజర్వ్డ్ ట్రైన్ టిక్కెట్లను బదిలీ చేయడానికి రైల్వే ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ప్రతి రైల్వే ప్రయాణీకుడు ఈ నిబంధనల గురించి తెలుసుకోవాలి.

రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయకపోతే మీ కన్ఫర్మ్ టిక్కెట్‌ను ఎవరికి పడితే వాళ్లకు ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదు. కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే టిక్కెట్ ను బదిలీ చేయవచ్చు. అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్యకు మాత్రమే టిక్కెట్ ని ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. టిక్కెట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీ(Cancellation charge) కూడా ఉండదు.

టిక్కెట్లు ఇలా ట్రాన్స్ ఫర్ చేయబడతాయి

రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు మాత్రమే ప్రయాణికుల పేరును రిజర్వేషన్ కౌంటర్ నుండి మార్చవచ్చు. టికెట్‌ను కౌంటర్‌లో కొనుగోలు చేసినా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా పేరు మార్చడానికి టికెట్ కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్ ప్రింట్ అవుట్, టికెట్ బదిలీ చేయబోయే వ్యక్తి యొక్క గుర్తింపు కార్డు జిరాక్స్ ని రిజర్వేషన్ కౌంటర్‌లో సమర్పించాలి. దీని తర్వాత ఆన్‌లైన్‌లో లేదా కౌంటర్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌పై పేరు మారుతుంది.

వెయిటింగ్ లేదా RACలో ఈ సదుపాయం

టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే బదిలీ చేయవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వెయిటింగ్ లేదా RAC టిక్కెట్‌లను బదిలీ చేయలేరు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలో డబ్బులు పడుతున్నాయ్.. చెక్ చేసుకోండి..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలో డబ్బులు పడుతున్నాయ్.. చెక్ చేసుకోండి..

ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాని అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ప్రారంభించింది.

ఈ కాలానికి వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%గా నిర్ణయించింది. ఇప్పటివరకు, ఈపీఎఫ్ఓ ​​23.04 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. సభ్యులకు రూ. 9,260 కోట్లను చెల్లించింది. ఇందులో తాజా వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%గా ఉంది. ఈ సమాచారాన్న పెన్షన్ ఫండ్ బాడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ‘ఎక్స్’ లో షేర్ చేసింది. ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి 2024, 10న 2023-24కి వడ్డీ రేటును 8.25%గా నిర్ణయించింది. అంతకుముందు సంవత్సరం (2022-23) వడ్డీ రేటు 8.15% కాగా, 2021-22కి ఈ రేటు 8.10%గా ఉంది. ఈ వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ప్రస్తుత, అవుట్‌గోయింగ్ సభ్యులకు వారి చివరి ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్‌లలో భాగంగా 23,04,516 క్లెయిమ్‌లకు గానూ మొత్తం రూ. 9,260,40,35,488 మేర సవరించిన రేట్ల కిందవడ్డీని చెల్లిస్తోంది.

వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు?

ఫిబ్రవరి 10, 2024న జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ః 8.25% వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖకు పంపింది. అది ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. 2024, మే 6న ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.25% రేటును ఆమోదించింది. తాజా రేటును 2024, మే 24నాటి లేఖ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలియజేసింది. ఇది క్లెయిమ్‌ల పరిష్కారం, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో వడ్డీని జమ చేయడం కోసం ఫీల్డ్ ఆఫీసులకు కూడా తెలియజేసింది. రుణ సాధనాలపై వడ్డీ ఆదాయం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంచనా వేస్తారు. అయితే ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ విముక్తి తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ ఈ సమాచారాన్ని ‘ఎక్స్’ ప్లాట్‌ఫారమ్‌లో పంచుకుంది. ఏడాది చివర్లో వడ్డీ రేటును ప్రకటించడం వల్ల సభ్యులకు నష్టం లేదు. డిక్లేర్డ్ రేటు మునుపటి సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే, వడ్డీ రేట్లలో వ్యత్యాసం వారికి చెల్లించబడుతుంది.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ ఇలా..

ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలను ఉద్యోగులు నాలుగు పద్ధతులను ఉపయోగించి వారి ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. అవి ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ వెబ్ సైట్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం..

ఉమాంగ్ యాప్..

ఉమాంగ్ యాప్ ఉపయోగించి సబ్‌స్క్రైబర్‌లు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని ఇంట్లో నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు.
అందుకోసం మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ పీఎఫ్ అకౌంట్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ను ఉపయోగించి నమోదు చేసుకోండి. తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధర్యంలో నడిచే అనేక స్కీమ్లు కనిపిస్తాయి. వాటిల్లో ఈపీఎఫ్ఓను ఎంచుకోవాలి. అనంతరం వ్యూ పాస్ బుక్ పై క్లిక్ చేయాలి. యూఏఎస్ ని నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ స్క్రీన్ పై చూపుతుంది.

ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ద్వారా..

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఉద్యోగి విభాగాన్ని సందర్శించి, “సభ్యుని పాస్‌బుక్”పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా, మీరు పీఎఫ్ పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఇది ఉద్యోగి, యజమాని విరాళాలు, అలాగే ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌లను వివరిస్తుంది. ఏదైనా పీఎఫ్ బదిలీల మొత్తం, ఉత్పత్తి చేయబడిన పీఎఫ్ వడ్డీ మొత్తం కూడా చూపుతుంది.

ఎస్ఎంఎస్ పంపడం ద్వారా..

మీ ఎఫ్ అకౌంట్ లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయొచ్చు. అందుకోసం UAN EPFOHO అభ్యర్థించిన భాషలోని మొదటి మూడు అక్షరాలు “ENG.” చేసి 7738299899కి ఎస్ఎంఎస్ చేయాలి. ఉదాహరణకు మీకు తెలుగులో సందేశాన్ని స్వీకరించాలనుకుంటే.. అందుకోసం EPFOHO UAN TEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

అయితే మీ బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్ మీ యూఏఎన్ కి లింక్ చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

AP | నాలుగు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

AP | నాలుగు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో రేపు (సోమవారం) పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో..

ఇవ్వాల (ఆదివారం) పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక సోమవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రొణమకి కూర్మనాథ్‌ సూచించారు.

ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Crime News: ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్‌

Crime News: ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్‌

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

ముంబయి: రిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్‌ వెంకటేశ్‌ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకొంటున్న షఫీ షేక్‌గా గుర్తించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయినా, చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Shanthi: విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం

Shanthi: విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం

అమరావతి: మదన్‌మోహన్‌ మానిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్‌ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్‌తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరేవారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్‌మోహన్‌ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్‌మోహన్‌ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై జారీచేసిన అభియోగపత్రంలో 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని చెప్పారు. 2013లో మదన్‌మోహన్‌తో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని వివరించారు.

Health

సినిమా