Saturday, November 16, 2024

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ..!

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ..!

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తిరస్కరించారు.

శుక్రవారం తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఎంవీవీ వ్యాపార పరంగా ప్రభుత్వం నుంచి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కేసుల విచారణల నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎంపిక కావడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సీట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ ఆర్థికంగా బలవంతుడైన ఎంవీవీ అయితే బాగుంటుందని జగన్ భావించారు. తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని, పలు కేసులు నమోదు చేసిందని ఈ సమయంలో తాను పోటీ చేయలేదని ఎంవీవీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది.

హయగ్రీవకు స్టాప్ వర్క్ ఆర్డర్..

ఎంవీవీ చేపట్టిన వివాదాస్పద హయగ్రీవ ప్రాజెక్టుకు కూడా జీవీఎంసీ పనుల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎంసీ స్థలంలో పనులు నిలిపివేయాల్సిందిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. హయగ్రీవ విషయంలో జగదీశ్వరుడు ఎంవీవీ సత్యనారాయణపై ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆయన సహచరుడు జీవీ కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ శుక్రవారం జగన్‌ను కలిసి కొంతకాలం పాటు పార్టీ పరంగా తమకు ఎటువంటి బాధ్యతలు అప్పగించొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

బీజేపీ వైపు చూపు

మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ద్వారా బీజేపీలో చేరే అవకాశాలను వీరు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు తిరస్కరించడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు వీరు చూస్తున్నారని సమాచారం.

Worst oils for cooking: వంటకోసం వాడకూడని చెత్త నూనెలు ఇవే.. వీటి జోలికి పోవద్దు

Worst oils for cooking: వంటకోసం వాడకూడని చెత్త నూనెలు ఇవే.. వీటి జోలికి పోవద్దు

వంటలో దాంట్లో వేసే పదార్థాలతో పాటూ, దానికోసం వాడే నూనె కూడా ముఖ్యమే. వంట కోసం వాడే నూనె వల్ల దాని రుచి మారడంతో పాటూ ఆరోగ్యం మీదా ప్రభావం ఉంటుంది.

ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు దొరుకుతున్నాయి. అవి వాడితే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారమూ జరుగుతోంది. దాంతో మనమూ వాడిచూద్దాం అని కొన్ని నూనెల్ని ప్రయత్నిస్తాం. కానీ అది అవాస్తవం. ఈ వంట నూనెలను వంటకు ఉపయోగించడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు సహా అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించే అలాంటి 5 వంట నూనెలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యానికి హానిచేసే వంటనూనెలు:

పామాయిల్:

పామాయిల్ లో శ్యాచ్యురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇందులో 50 శాతం సంతృప్త కొవ్వు ఉంటుంది. ఈ శ్యాచ్యురేటెడ్ కొవ్వు “చెడు” కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయుల కారణంగా, ధమనులలో అడ్డంకాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సోయాబీన్ ఆయిల్:

సోయాబీన్ నూనెలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండే నూనెను అధిక మోతాదులో తీసుకుంటే అది కీళ్ల నొప్పులు, వాపును పెంచుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ నూనెను డ్రెస్సింగ్ లేదా డిప్స్ చేయడానికి ఉపయోగించవచ్చు. సలాడ్లు, చట్నీలు, పాస్తా, పిజ్జా, పాస్తాలలో అలాగే నేరుగా వాడుకోవచ్చు. కానీ ఈ నూనె అధిక వేడి వద్ద వంట చేయడానికి అనుకూలంగా ఉండదు. అధిక మంటపై వండటం వల్ల డయేరియా సమస్యలు రావడమే కాకుండా చర్మంపై మొటిమలు, ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి. వంట చేయడానికి ఆలివ్ నూనె వాడటం సరికాదు.

వెజిటబుల్ ఆయిల్:

మీరు వంట కోసం కూరగాయల నూనెను కూడా ఉపయోగిస్తుంటే, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్ మిశ్రమం నుండి తయారైన ఈ నూనెలో అధిక మొత్తంలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. ఈ నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది.

పత్తి గింజల నూనె:

పత్తి గింజల నూనెలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే మంట, అలెర్జీలు, చర్మ దద్దుర్లు, దురద, కంటి చికాకు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాదు, ఆహారంలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు

Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన హయాంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతిగా వ్యవహరించిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. 2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీసీఐడీ అధికారులు.. రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారంటూ ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేశారు. అప్పట్లో సీఐడీ అదనపు ఎస్పీగా పనిచేసిన ఆర్‌.విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ ప్రభావతితో పాటు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఐపీసీలోని 120బీ (నేరపూరిత కుట్ర), 166 (వ్యక్తిని గాయపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించడం), 167 (ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంట్‌ తయారీ), 197 (తప్పుడు సర్టిఫికెట్‌ జారీ), 307 (హత్యాయత్నం), 326 (ప్రమాదకర ఆయుధంతో గాయాల పాలయ్యేలా దాడి), 465 (ఫోర్జరీ), 506 (నేరపూరిత బెదిరింపు) తదితర సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదైంది.

చంపేస్తానని సునీల్‌కుమార్‌ బెదిరించారు
‘వైకాపా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను బయటపెడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేసినందుకు అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్న నాపై మూడేళ్ల కిందట సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో హైదరాబాద్‌లోని ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం అక్కడి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని రావాల్సి ఉండగా ఆ నిబంధన పాటించలేదు. వైద్య పరీక్షలు చేయించలేదు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి హైదరాబాద్‌ నుంచి నేరుగా గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రాత్రి 9.30కు తరలించారు. ఆ రాత్రంతా అక్కడే ఓ గదిలో నిర్బంధించారు. సునీల్‌కుమార్, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. రబ్బరు బెల్ట్, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. అప్పటికి నేను బైపాస్‌ సర్జరీ చేయించుకుని కొద్దిరోజులే అయ్యింది. ఆ మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేందుకు యత్నించారు. నా ఫోన్‌ తీసుకుని దాని పాస్‌వర్డ్‌ చెప్పేంత వరకూ తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని బెదిరించారు. జగన్‌ ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింద’ని రఘురామ ఇటీవల గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, దానిపై న్యాయ సలహా తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.

కొత్త ప్రభుత్వంలో జగన్‌పై తొలి కేసు
ముఖ్యమంత్రిగా జగన్‌ చేసిన అరాచకాలపై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన తొలి కేసు ఇదే. సీఐడీ కస్టడీలో తనను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు మూడేళ్లుగా అనేక వేదికలపై చెబుతున్నారు. సంబంధిత ఆధారాలు, నివేదికలన్నీ బయటపెట్టారు. నాడు వైకాపా అధికారంలో ఉండటంతో ఆయన వేదన అరణ్య రోదనే అయ్యింది. కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో రఘురామ అప్పట్లో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్, హత్యాయత్నం ఘటనలపై గుంటూరు పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. హత్యకు యత్నించిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు యత్నించిన వారిని కూడా బాధ్యులుగా చేయాలని కోరారు. తీవ్ర రక్తగాయాలయ్యేలా చితక్కొట్టినా వైద్య పరీక్షల తర్వాత అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట ప్రభావతి ‘రిమాండ్‌కు ఫిట్‌’ అనేలా తప్పుడు నివేదిక ఇచ్చారని రఘురామ ఆరోపించారు. సీఐడీ అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారని, అందుకే ఆమెనూ ఈ కేసులో బాధ్యురాలిగా చేయాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రభావతిని ఐదో నిందితురాలిగా చూపారు. నగరంపాలెం సీఐ మధుసూదనరావు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఆరోజు తనపై దాడికి పాల్పడిన సీఐడీ అధికారులతోపాటు మరికొందరి ఫోన్‌ డేటా భద్రపరచాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వైద్యుల తప్పుడు నివేదిక
సీఐడీ అధికారులు తనను రాత్రంతా తీవ్రంగా కొట్టారని, దారుణంగా హింసించారని పేర్కొంటూ రఘురామ అప్పట్లో న్యాయమూర్తి ఎదుట తన గాయాలు చూపించి వాంగ్మూలమిచ్చారు. ఆయన అరికాళ్లపై కమిలిన గాయాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆయన్ను రమేష్‌ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశించగా, పోలీసులు గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షలు చేయించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రభావతి ఆయనకు గాయాలు లేవని నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు చేయగా, ఆయనకు గాయాలైనట్లు నివేదిక వచ్చింది.

నిందితులు వీరే..

ఏ1: పీవీ సునీల్‌కుమార్, సీఐడీ విభాగం మాజీ అధిపతి
ఏ2: పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, నిఘా విభాగం మాజీ అధిపతి
ఏ3. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాటి ముఖ్యమంత్రి
ఏ4. ఆరన్‌ విజయ్‌పాల్, అదనపు ఎస్పీ, సీఐడీ
ఏ5. డాక్టర్‌ ప్రభావతి (నాటి గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌), ఇతరులు

YS Sharmila: అమ్మకు వందనం పథకం- చంద్రబాబు సంగతి సరే.. మరి మీరేం చేశారు జగన్‌

YS Sharmila: వైకాపాకు వైఎస్‌కు సంబంధం లేదు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను జగన్‌ తుంగలో తొక్కడంతోనే ప్రజలు వైకాపాను గొయ్యి తీసి పాతిపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ‘వైకాపా ప్రభుత్వం వైఎస్‌ మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించింది. ఆయనకు ఇష్టమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో రూ.4వేల కోట్లు బకాయిలు పెండింగులో ఉంచింది. చిక్కీలు, కోడిగుడ్లు, ఆఖరికి యూనిఫాంలకు కూడా డబ్బులు చెల్లించలేదు. వైకాపా నాయకులు హత్యారాజకీయాలు, గూండాయిజం చేసి ఉండొచ్చు. దానిని కాదనట్లేదు. కానీ దానికీ వైఎస్‌కు ఏం సంబంధం? ఆయన విగ్రహాలను ధ్వసం చేయడం న్యాయమా?’ అని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ విగ్రహాలను ధ్వసం చేస్తే అక్కడికెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో వైఎస్‌ షర్మిల శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘రాజశేఖరరెడ్డికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇష్టమైన ప్రాజెక్టని తెలిసి కూడా అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ ఆ సంస్థని కాపాడటానికి ప్రయత్నించలేదు. పైగా అది నష్టాల్లో ఉందా అని తెలియనట్లు అడిగారు’ అని మండిపడ్డారు. ‘వైకాపా తోకపార్టీ. భాజపాకు ఊడిగం చేసి, ప్రతి బిల్లుకూ మద్దతిచ్చింది. భాజపాకు సంబంధించిన వ్యాపారులు, నాయకులకు రాజ్యసభ.. తితిదేలో.. ఏది అడిగితే ఆ పదవులు ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును వైకాపా తాకట్టుపెట్టింది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలోనూ జగన్‌ భాజపాకు మద్దతిచ్చారు. మణిపుర్‌ ఘటనతో సహా ఏది చూసినా జగన్‌ భాజపాతోనే ఉన్నారు. భాజపాకు తొత్తుగా, తోకపార్టీగా ఉన్నది వైకాపానే’ అని షర్మిల ధ్వజమెత్తారు. తెదేపాకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

చంద్రబాబు సంగతి సరే.. మరి మీరేం చేశారు జగన్‌

‘అమ్మకు వందనం పథకంలో ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం ఒక తల్లికి రూ.15వేలు మాత్రమే అని పేర్కొన్నారని సాక్షి పత్రికలో ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇవ్వాలి. అలాగే సాక్షి పత్రిక యజమాని జగన్‌ కూడా అమ్మఒడి పథకాన్ని ఎలా అమలు చేశారో చెప్పాలి. 2019 ఎన్నికల్లో ప్రతి బిడ్డకూ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాతో కూడా చెప్పించారు. అధికారంలోకి వచ్చాక మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. జగన్‌ చేసింది మర్చిపోయారేమో. అందుకే చంద్రబాబు గురించి రాస్తున్నారు’ అని షర్మిల విమర్శించారు.

Andhra New: పోతూపోతూ ‘జీపీఎస్‌’ నోటిఫికేషన్‌పై సంతకం

Andhra New: పోతూపోతూ ‘జీపీఎస్‌’ నోటిఫికేషన్‌పై సంతకం

వైకాపా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌)కు సంబంధించిన దస్త్రంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సంతకం చేశారు.

అమరావతి: వైకాపా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌)కు సంబంధించిన దస్త్రంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సంతకం చేశారు. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్‌ దస్త్రాలన్నింటిపైనా సంతకాలు పెట్టారు. వాటిలో జీపీఎస్‌ దస్త్రం కూడా ఉంది. జూన్‌ 12న జీవో 54ను విడుదల చేయగా.. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్‌ను తాజాగా శుక్రవారం గెజిట్‌లో అప్‌లోడ్‌ చేశారు. జీపీఎస్‌ గతేడాది అక్టోబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చి.. గతేడాది అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్‌ అమలుకు ,నాడు విధివిధానాలు రూపొందించకుండా.. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

జీపీఎస్‌ను వ్యతిరేకించిన ఉద్యోగులు
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ పథకం (ఓపీఎస్‌) తీసుకొస్తానని 2019 ఎన్నికల ముందు జగన్‌ పదేపదే వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం పేరుతో సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తెచ్చారు. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఏకంగా చట్టం చేసేసింది. ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రహస్యంగా జీపీఎస్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బయటకు రాకుండా చేశారు. కొత్త ప్రభుత్వంలో పాత జీఓకు అనుగుణంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం, జీపీఎస్‌ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం గమనార్హం.

Breaking: హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ

Breaking: హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ అయ్యారు. ఆయనను లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ధీరజ్ సింగ్ బదిలీ కావడంతో కొత్త చీఫ్ జస్టిస్ ఎవరు నియామకం అవుతారో చూడాలి.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పలువురు అధికారులు బదిలీ అవుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో పలు శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం సైతం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు. దీనిలో బోలెడు లాభాలు.!

Oil : ఈ నూనె దొరికితే అసలు వదలొద్దు. దీనిలో బోలెడు లాభాలు.!

మునగ చెట్టు ఉపయోగాలు గురించి ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అయితే మునగ ఆకులు మరియు కాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే మునగ నూనె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.

లేదు కదా. మునగ నూనెను మునగ కాయల విత్తనాల నుండి తీస్తారు. ఈ నూనెలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. దీనిలో విటమిన్ ఏ, ఇ, సి,బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె ఆరోగ్యంతో పాటు జుట్టు సమస్యలకు కూడా మేలు చేస్తుంది. ఈ నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

మునగాకు నూనెలో ఉన్న పోషకాలు జుట్టు ఫోలికల్స్ కు బలన్ని ఇస్తాయి. జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే స్కాల్ఫ్ కు రక్త ప్రసరణకు కూడా మేలు చేస్తుంది. అంతేకాక జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు ఈ మునగ నూనెను వాడడం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మునగ నూనెలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేవి చుండ్రు కలిగించే శిలీంద్రాలను నాశనం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఈ మునగా నునే లో ఉన్న ప్రోటీన్లు జుట్టును ఎంతో బలంగా చేస్తాయి. దీనిలో ఉన్న పోషకాలు అనేవి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.ఈ నూనెను వాడడం వలన జుట్టు ను హైడ్రేట్ చేస్తుంది. అలాగే దీనిని బలంగా మరియు దృఢంగా కూడా చేస్తుంది. అయితే తలలో దురద మరియు చికాకుగా ఉన్నవారికి ఈ మునగ నూనె దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

మునగ నూనెను తలకు అప్లై చేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఆ తరువాత షాంపూ తో మీ జుట్టును క్లీన్ చేసుకోండి. అయితే జుట్టుకు మునగ నూనెను రాసిన తర్వాత 30 నిమిషాలు లేక రాత్రంతా అలా వదిలేసి మరునాడు ఉదయాన్నే జుట్టును క్లీన్ చేసుకోండి. మీ జుట్టును షాంపూ తో క్లీన్ చేసిన తర్వాత మునగ నూనెను కండీషనర్ గా కూడా వాడవచ్చు. ఇలా చేయటం వలన మునగ నూనె అనేది జుట్టుకు ఎంతో తేమను ఇస్తుంది. అలాగే జుట్టును కూడా మెరిసేలా చేస్తుంది. మునగ వంట నూనెలో స్థిరాల్స్ అనేవి ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా సహాయం చేస్తాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉండడం వలన చర్మానికి అప్లై చేసి మర్దన చేయటం వలన చర్మం యాక్నె సమస్య అనేది తొందరగా తగ్గుతుంది…

భారతీయుడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

భారతీయుడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

విడుదల తేదీ : జూలై 12, 2024.

నటీనటులు : కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని తదితరులు..

దర్శకుడు : శంకర్

నిర్మాత : సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్..

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : రవి వర్మన్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఈ సినిమా 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాకు కూడా శంకరే దర్శకత్వం వహించారు. మరీ ఈ సినిమా అంచనాలను అందుకుందా.. అసలు సినిమా ఎలా ఉందో మన రివ్యూలో (Bharateeyudu 2 Review) చూద్దాం..

కథ విషయానికి వస్తే :

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) తన ఫ్రెండ్స్‌తో ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆ యూట్యూబ్ ఛానల్‌లో చిత్ర అరవిందన్.. తన చుట్టూ జరిగే అవినీతిని స్కిట్స్ రూపంలో వీడియోలను చేసి తన ఛానల్‌లో అప్ లోడ్ చేస్తుంటాడు. అంతేకాదు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.. ఈ వీడియోలకు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మరోసారి ఎంట్రీ ఇవ్వాలంటూ #ComeBackIndian అంటూ ఓ యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు. ఆ య్యాష్ ట్యాగ్ దేశమంతా ట్రెండింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తైపీ (తైవాన్)’ లో ఉంటున్న భారతీయుడు ఇండియాకు తిరిగి వస్తాడు. అంతేకాదు రావడం రావడంతోనే అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్నవారిని భారతీయుడు వరుసగా చంపేస్తుంటాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియో పోస్ట్‌లు చేస్తూ.. యువకులను మోటివేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) జీవితంతో పాటు పలువురి జీవితాల్లో విషాదం వస్తుంది. దీనికి కేవలం కారణం భారతీయుడే అంటూ ఇటూ వీరు, అటు ప్రజలు కూడా నిందిస్తారు. అంతేకాదు అసలు భారతీయుడుని వదలొద్దు అంటూ వెంటపడుతారు.. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది ?, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడు పై కోపం పెంచుకున్నారు ?, ఇంతకీ, భారతీయుడు టార్గెట్ ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికి వస్తే..

భారతీయుడులో ఓ సోల్ ఉంటుంది.. అది వెంటాడుతుంది. అయితే ఈ సినిమాలో మాత్రం భారీగా సన్నివేశాలు, ఖర్చు చేసినప్పటికీ.. ఓ పాట, లేక ఓ సన్నివేశం వావ్ అనిపించేలా లేవు. అయితే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. ఇక కమల్ హాసన్, సేనాపతిగా ఎప్పటిలాగే తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. విజువల్ బాగున్నప్పటికీ సినిమా ఎక్కడా కనెక్ట్ కాదు. డ్రైగా సాగుతుందనిపిస్తుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. ఎలాంటి కొత్తదనం కనిపించదు. కొన్ని సన్నివేశాలు బోర్‌గా అనిపిస్తాయి. అనిరుధ్ సంగీతం కూడా గొప్పగా లేదనిపిస్తుంది. సమాజంలోని చిన్న మొత్తాల్లో లంచాలు తీసుకునే వారినుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునే వారి వరకు దర్శకుడు శంకర్ చూపించారు. అయితే ఓవరాల్‌గా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. ట్విస్ట్ ఏమంటే.. మూడో పార్ట్ కూడా వస్తుందని దర్శకుడు చెప్పడం కొసమెరుపు.

సినిమా టెక్నికల్‌గా సూపర్ అనిపిస్తుంది. కానీ సన్నివేశాలే ఫ్లాట్‌గా ఉంటాయి. దీనకితోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ అని చెప్పోచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీ నటుల విషయానికి వస్తే :

ఈ సినిమాలో చిత్ర అరవిందన్‌ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడని చెప్పోచ్చు. చెప్పాలంటే ఈ సినిమాలో కమల్ హాసన్ కంటే.. సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక మరో పాత్రలో సకలకళ వల్లభుడుగా SJ సూర్య తన పాత్ర మెప్పిస్తుంది. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా కూడా అదరగొట్టాడు. ఇక దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓకే అనిపించింది. మరో పాత్రలో యువ నటి ప్రియా భవానీ శంకర్ కూడా మెప్పిస్తుంది. సముద్రఖని వివేక్, గుల్షన్ గ్రోవర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫ్లస్ పాయింట్స్..

కమల్ యాక్టింగ్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కథ, కథనం

కొన్ని ల్యాగింగ్ సీన్స్..

రేటింగ్ : 2.5/5

PM Kisan: పీఎం కిసాన్‌ 18వ విడత ఎప్పుడో తెలుసా? ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు రావు

PM Kisan: పీఎం కిసాన్‌ 18వ విడత ఎప్పుడో తెలుసా? ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు రావు

దేశంలోని పౌరుల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. భారతదేశం వ్యవసాయ దేశం. అందువల్ల, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా పథకాలను అమలు చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయి. రైతులకు వివిధ రకాలుగా మేలు చేస్తుంది. ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించే పథకం ఉంది. 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా రూ.6000 అందజేస్తారు.

ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 వాయిదాలను భారత ప్రభుత్వం విడుదల చేసింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు పథకం తదుపరి అంటే 18వ విడత రావాల్సి ఉంది. కిసాన్ యోజన 18వ విడతను అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వం విడుదల చేయవచ్చు. అయితే ఇన్‌స్టాల్‌మెంట్‌ వచ్చే ముందు రైతులు కొంత పని చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి వాయిదాల సొమ్ము నిలిచిపోవచ్చు.

దీనిపై ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సమాచారం అందించింది. పథకం కోసం, లబ్ధిదారులైన రైతులు ఇ-కెవైసి, భూమి ధృవీకరణను పొందడం అవసరం. ఇప్పటి వరకు ఈ పనులు చేపట్టని రైతులు వెంటనే చేసుకోవడం బెట్టర్‌. లేకుంటే తదుపరి వచ్చే విడుత నిలిచిపోవచ్చు.

James Anderson: 7880 రోజులు.. 991 వికెట్లు.. విజయంతో జేమ్స్ అండర్సన్‌కు వీడ్కోలు

James Anderson: 7880 రోజులు.. 991 వికెట్లు.. విజయంతో జేమ్స్ అండర్సన్‌కు వీడ్కోలు

ENG vs WI: ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.

దీంతో పాటు ఆ జట్టు లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కు ఇంగ్లండ్ వీడ్కోలు పలికింది. నిజానికి వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ అని అండర్సన్‌ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఏకపక్ష విజయాన్ని నమోదు చేయడం ద్వారా ఇంగ్లండ్ జట్టు దిగ్గజ బౌలర్‌కు తగిన వీడ్కోలు పలికింది.

చివరి గేమ్‌లోనూ వికెట్ల వేట..

2002లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన జేమ్స్ అండర్సన్ 2003లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దాదాపు 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన జేమ్స్ అండర్సన్ ఎన్నో గొప్ప రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఎప్పటిలాగే తన చివరి మ్యాచ్ లోనూ వికెట్ల వేట సాగించిన అండర్సన్.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ 1 వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.

టెస్ట్ బాస్ జేమ్స్..
జేమ్స్ అండర్సన్ ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. ఇప్పుడు టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన జేమ్స్ అండర్సన్ టెస్టు ఫార్మాట్‌లో విజయ శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అతను మొత్తం 188 టెస్టు మ్యాచ్‌లు ఆడి మొత్తం 704 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా కూడా జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు టెస్టు క్రికెట్‌లో 32 సార్లు ఐదు వికెట్లు, మూడు సార్లు 10 వికెట్లు తీశాడు.

గత మ్యాచ్‌లోనూ రెండు రికార్డులు నమోదయ్యాయి..

జేమ్స్ అండర్సన్ తన టెస్ట్ కెరీర్‌లో 40,000 బంతులు వేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తన చివరి టెస్టు మ్యాచ్‌లో 40,000 బంతుల మార్క్‌ను దాటిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 50000 బంతులు వేసిన ప్రపంచంలోని ఏకైక ఫాస్ట్ బౌలర్ అయ్యాడు.

పరిమిత ఎడిషన్‌లో కెరీర్ ఎలా ఉంది?

టెస్టులతో పాటు ఇంగ్లండ్ తరపున వన్డేల్లోనూ జేమ్స్ అండర్సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ తరపున 194 వన్డేలు ఆడి 29.22 సగటుతో 269 వికెట్లు తీశాడు. వన్డేల్లో రెండుసార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఇది కాకుండా, అండర్సన్ ఇంగ్లండ్ తరపున 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 7.84 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టాడు.

BREAKING: చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

చేనేత కార్మికులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ చెప్పారు. నేతన్నలకు సబ్సిడిపై ముడి సరుకు పనిముట్లు ఇస్తామని తెలిపారు. సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఆప్కో, చేనేతలో భారీగా కుంభకోణాలు జరిగాయని.. వాటన్నింటిపై విచారణ జరిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆప్కో, చేనేత కార్మికులను స్వలాభం కోసం వైసీపీ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు.

జగన్ తీరుతో చేనేత కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని.. ఏపీలో వైసీపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. నేతన్న పేరుతో కేవలం వైసీపీ కార్యకర్తలకే నేతన్న హస్తం ఇచ్చారని ఆమె మండిపడ్డారు. ఆప్కో, చేనేత రంగాల్లోని అవినీతిని ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ హయంలో జరిగిన కుంభకోణాలపై కచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు.

Thalliki Vandanam scheme: తల్లికి వందనం పథకంపై వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం స్పష్టత

Thalliki Vandanam scheme: తల్లికి వందనం పథకంపై వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం స్పష్టత

Thalliki Vandanam scheme: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ లాంటి హామిలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.

ఇప్పటికే రూ 4 వేల పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థలు తల్లిదండ్రులకు రూ. 15 వేల చొప్పున తల్లికి వందనం పేరుతో ప్రకటించారు. అయితే ఆ పథకానికి అర్హత సాధించాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఇంటిలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది అని పలు రకాల వార్తలు చెక్కర్లు కొడతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ మార్గదర్శకాలపై స్పందించింది.

ఇప్పటి వరకు తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వార్తలను ఎవరు నమ్మొద్దని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వమే అన్ని విషయాలను వెల్లడిస్తుందని, ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో నగదును తల్లుల ఖాతాలో జమ చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్న ఒక్కరికి మాత్రమే అది నిర్వాహణ ఖర్చుల పేరుతో వెయ్యి రూపాలను కట్ చేసి మొత్తం 14 లక్షలు ఖాతాలో వేసింది. ఎన్నికల హామీలో ఎన్డీయే కూటమి ప్రతీ విద్యార్థికి తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ సైతం స్పష్టం చేశారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 29 జీవోలో ఒక తల్లికి 15 వేలు అని ఉంది. దీంతో ఈ గందరగోలం ప్రారంభం అయింది. దీనిపై త్వరలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనుంది.

Diabetes Medicine: షుగర్, కొలెస్ట్రాల్‌కు పరిష్కారం వచ్చేసింది, చిటికెడు పౌడర్ చాలు అద్భుత ప్రయోజనాలు

Diabetes Medicine: షుగర్, కొలెస్ట్రాల్‌కు పరిష్కారం వచ్చేసింది, చిటికెడు పౌడర్ చాలు అద్భుత ప్రయోజనాలు

Diabetes Medicine: మధుమేహం, కొలెస్ట్రాల్ రెండూ ప్రమాదకరమైనవే. మధుమేహం కారణంగా రక్త నాళికలు దెబ్బతినడంతో కొలెస్ట్రాల్ అక్కడ పేరుకుపోతుంటుంది. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది.

అందుకే డయాబెటిస్, కొలెస్ట్రాల్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమౌతుంది. ఈ రెండింటినీ నియంత్రించేందుకు వివిధ రకాల మందులు వాడి అలసిపోతుంటారు. అటు మధుమేహానికి కూడా ఇప్పటి వరకూ పూర్తి చికిత్స లేదు. మందులు వాడుతున్నంతవరకూ అదుపులో ఉంటుంది. ఇప్పుడిక పరిశోధకులు మధుమేహానికి కొత్త మందు కనిపెట్టేశారు. ఆయుర్వేద పరిధిలో వచ్చే ఈ మందుతో అటు డయాబెటిస్ ఇటు కొలెస్ట్రాల్ రెండింటికీ చెక్ చెప్పవచ్చు.

ఈ అద్భుతమైన మందు అందరి ఇళ్లలో లభంచేదే. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ రెండింటినీ సులభంగా తగ్గిస్తుంది. ఆదే దాల్చిన చెక్క పౌడర్. డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కేవలం 40 రోజుల్లో డయాబెటిస్, కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు.

దీనికి సంబంధించిన అధ్యయనం బ్రిటన్‌లో జరిగింది. మధ్య వయస్సుకు చెంంది 60 మందికి 40 రోజులపాటు రోజుకు 3-6 గ్రాముల దాల్చిన చెక్క పౌడర్ తిన్పించి చూసినపపుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ 24 శాతం తగ్గిపోయింది. కొలెస్ట్రాల్ లెవెల్స్ 18 శాతం తగ్గింది. ఈ 40 రోజులు వేరే ఏ మందులు ఇవ్వలేదు. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే రెండు వారాల్లో ప్రీ డయాబెటిక్ పరిస్థితులు తొలగిపోవడాన్ని గమనించారు.

రోజూ కేవలం 1 గ్రాము దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అద్భుతంగా పెరగడాన్ని పరిశీలించారు. దాల్చిన చెక్క పౌడర్‌తో ఆరోగ్యపరంగా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

KCR : కేంద్రమంత్రిగా కేసీఆర్ ! బీజేపీతో BRS దోస్తీ ?

KCR : కేంద్రమంత్రిగా కేసీఆర్ ! బీజేపీతో BRS దోస్తీ ?

తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది.

రాబోయే రోజుల్లో ఏదో జరగబోతోందన్న టెన్షన్… పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని రక్షించుకోడానికి, కవితను జైలు నుంచి బయటకు తేవడానికి కేసీఆర్ ఏ చేయబోతున్నారని పార్టీ శ్రేణులు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాయి.

BRSలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే ఏడుగురు జాయిన్ అయ్యారు… మరో పది మంది రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం 26 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని BRSLPని విలీనం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అటు ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల లోపు brsలో ఎవరు ఉంటారు… ఎవరు పోతారో తెలియట్లేదు. ఇప్పుడే ఇలాగ ఉంటే… వచ్చే నాలుగున్నరేళ్ళు పార్టీ ఎలా బతుకుతుందనే బెంగ కేసీఆర్ లో కూడా మొదలైంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో సెంచరీ కొట్టేసింది. కుటుంబ సభ్యులు పరామర్శకు వెళ్ళినప్పుడల్లా… ఏం అన్నా… నన్ను బయటకు తీసుకుపోరా అని అడుగుతున్నారట. కవితను ఎలాగైనా జైలు నుంచి బయటకు తేవాలని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. కవితను కేసు నుంచి తప్పిస్తే… అవసరమైతే BRSను మీ పార్టీలో కలిపేస్తాం అని కమలం పార్టీకి ఆఫర్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలోనే ఆరు రోజులుగా మకాం పెట్టారు కేటీఆర్, హరీశ్ రావు. అక్కడ బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. హస్తినలో ఎవర్ని కలిశారు… ఆరు రోజులు ఎందుకున్నారు అన్నది మాత్రం సీక్రెట్. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరూ…. డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కెళ్ళి kcr తో జరిగిందంతా చెప్పారట. అయితే BRSతో పొత్తుకు ఒకరిద్దరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ, అమిత్ షాని ఘోరంగా తిట్టిపోసి… ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎలా కుదురుతుందని అభ్యంతరం చెప్పారట. బీఆర్ఎస్ మాత్రం… రాబోయే సంక్షోభం నుంచి బయటపడాలంటే కమలంతో పొత్తు తప్పదని డిసైడ్ అయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే… కనీసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలకు అయినా చెక్ పడుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభ ద్వారా ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ ని ఎదురించడానికి అసెంబ్లీలో కేటీఆర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతారని అంటున్నారు.

కాళేశ్వరంలో అవినీతి, ఛత్తీస్ గఢ్ కరెంట్ కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రిలో అక్రమాలు… ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత… ఈ కేసులు అన్నింటి నుంచీ బయటపడాలంటే బీజేపీతో దోస్తీయే బెటర్ అని brs డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజం చేయాలని గులాబీ పార్టీ చూస్తోంది. ఏం జరుగుతుందో… మరో నాలుగు రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు!

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు!

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.

కాగా ఇదే కేసులో కవితపై సీబీఐ మరో ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇరువురి తరఫున లాయర్ల వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నెల 22న విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి తెలిపారు. కాగా ఈడీ కేసులోసీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో తమ నాయకురాలు కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే మిగిలింది.

Samsung Watch Ultra: యాపిల్‌కి పోటీగా శామ్సంగ్ కొత్త స్మార్ట్ వాచ్‌.. ఫీచర్లు మామూలుగా లేవుగా..

శామ్సంగ్ అత్యంత శక్తివంతమైన స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా పేరుతో ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన అన్ ప్యాక్డ్ ఈవెంట్-2024లో ఆవిష్కరించింది.

ఇది శామ్సంగ్ నుంచి వస్తున్న రిచ్ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ వాచ్ గా చెబుతున్నారు. అలాగే బిల్ట్ క్వాలిటీ కూడా చాలా అధికంగా ఉంటుందని, టైటానియం గ్రేడ్ 4 ఫ్రేమ్ తో వస్తుందని వివరిస్తున్నారు. అంతేకా ఇది ఎంఐఎల్-ఎస్టీడీ-810 రేటెడ్ 10ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ తో కలిసి వస్తుందని శామ్సంగ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా..

గేలాక్సీ వాచ్ అల్ట్రా జూలై 10 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. జూలై 24 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీని ధర 649డాలర్లు ఉంటుంది. మన కరెన్సీలో రూ. 54,000కు పైగానే ఉంటుంది.

శామ్సంగ్ గేలాక్సీ వాచ్ అల్ట్రా ఫీచర్స్..

ఈ వాచ్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. డైనమిక్ లగ్ సిస్టమ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది మల్టీ స్పోర్ట్స్ టైల్ ట్రాక్స్ ట్రైత్లాన్ వర్క్ అవుట్ల కోసం సరిగ్గా సరిపోతుంది. దీనిలో ఏఐ ఆధారిత ఫీచర్లు ఉంటాయి. అలాగే దీనిలో పర్సనలైజ్ హెచ్ఆర్ జోన్ ద్వారా యూజర్ల వర్క్ అవుట్లను పర్యవేక్షించవచ్చు. అలాగే ఇన్ స్టంట్ ఇనిషియేషన్ కోసం కొత్తగా క్విక్ బటన్ వస్తోంది. దీని సాయంతో వర్క్ అవుట్ సమయానికి ఎమర్జెన్సీ సైరన్ వస్తుంది.

దీనిలో డిస్ ప్లే 1.5 అంగుళాల సూపర్ అమోల్డ్ ఆల్ వేస్ ఆన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది పగటి పూట కూడా క్లియర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 590ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్లో అదనంగా 48 గంటల పాటు బ్యాటరీ వస్తుంది. దీనిలో డయల్ 47ఎంఎం ఉంటుంది. టైటానియం గ్రే, టైటానియం వైట్, టైటానియం సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది వేర్ ఓఎస్ 5 ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎక్సినోస్ డబ్ల్యూ1000 చిప్ ఆధారంగా రన్ అవుతుంది.

దీనిలో బాడీ కంపోజిషన్ టూల్, స్లీప్ అనాలిసిస్, ఎఫ్డీఏ అథరైజ్డ్ స్లీప్ అప్నీయా ట్రాకింగ్, రియల్ టైం హార్ట్ రేట్ మోనిటరింగ్, హార్ట్ సరిగా లేకపోతే గుర్తించడానికి ఐహెచ్ఆర్ఎన్, ఈసీజీ, బీపీ మోనిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది యాపిల్ వాచ్ అల్ట్రాకు పోటీగా శామ్సంగ్ దీనిని తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Monsoon Train Journeys: వర్షాకాలంలో చిల్ అవ్వాలంటే ఆ రూట్స్‌లో ప్రయాణం మస్ట్.. టాప్ ఫైవ్ ఇవే మరి

భారతదేశంలో చవకైన ప్రయాణ సాధనంగా రైలు ప్రయాణాలు మారాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సౌకర్యవంతమైన ప్రయాణమంటే ముందుగా గుర్తుకు వచ్చేది రైలు ప్రయాణమే.

అయితే ఆహ్లాదకర రైలు ప్రయాణం అంటే వర్షాకాలంలోనే చేయాలి. భారతదేశంలో పర్వతాలు, సరస్సులు, జలపాతాలు, సముద్రాలు, నదుల గుండా అనేక రైల్వే మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల్లో కరెక్ట్‌గా వర్షాకాలంలో ప్రయాణిస్తే ప్రకృతి రమణీయతను ఎంతగానో ఆశ్వాదించవచ్చు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ప్రయాణించడానికి అనువుగా ఉండే టాప్-5 రైలు మార్గాల గురించి వివరాలను తెలుసుకుందాం.

కల్కా-సిమ్లా

దేశంలోని అత్యంత అందమైన, మనోహరమైన రైలు మార్గాల విషయానికి వస్తే చాలా మంది కల్కా-సిమ్లా రైలు మార్గం పేరును మొదట చెబుతూ ఉంటారు. ఈ రైలు మార్గం హిమాచల్ రాజధాని సిమ్లా నుండి కల్కాను కలుపుతుంది. ఈ రైలు మార్గాన్ని టాయ్ ట్రైన్ అంటారు . సుమారు 96 కి.మీ కల్కా-సిమ్లా రైలు మార్గంలో ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ మార్గంలో రైలు సొరంగాల గుండా కూడా వెళుతుంది. వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణిస్తే వచ్చే అనుభూతి వేరు. అలాగే చలి కాలంలో ఈ రైలు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

బెంగళూరు-గోవా

వర్షాకాలంలో బెంగళూరు-గోవా రైలు ప్రయాణం కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటుంది. బెంగళూరు-గోవా రైలు మార్గం దాదాపు 500 కి.మీగా ఉంది. ఈ రైలు మార్గంలో పర్వతాలు, నదులు, ఎత్తైన వంతెనల గుండా వెళుతున్నప్పుడు మన ఆనందం వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఈ రైలు ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడతారు.

భువనేశ్వర్-బెర్హంపూర్

జగన్నాథ రథయాత్రకు వెళ్లాలను కునే భువనేశ్వర్-బ్రహ్మాపూర్ మార్గంలో రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది. భువనేశ్వర్-బ్రహ్మాపూర్ రైలు ప్రయాణం విభిన్న ప్రపంచాన్ని అందిస్తుంది. ఈ మార్గం తూర్పు కనుమల గుండా ప్రసిద్ధ చిల్కా సరస్సు మీదుగా ప్రయాణిస్తాం. చిల్కా సరస్సు అందాలు మనల్ని కట్టి పడేస్తాయి.

జల్పైగురి-డార్జిలింగ్

హిల్ స్టేషన్స్ రైలు ప్రయాణం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది డార్జిలింగ్ రైలు మార్గం. డార్జిలింగ్- జల్పైగురి మధ్య టాయ్ ట్రైన్ మీదుగా వెళ్తుగా ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ ప్రయాణంలో, సరస్సులు, లపాతాలతో పాటు తేయాకు తోటలను చూడవచ్చు.

మండపం-రామేశ్వరం

మండపం-రామేశ్వరం రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ మార్గం రామేశ్వరాన్ని తమిళనాడులోని మండపం నగరానికి కలుపుతుంది. మండపం-రామేశ్వరం రైలు మార్గం దేశంలోనే రెండవ అతి పొడవైన వంతెన అయిన పాంబన్ వంతెన గుండా వెళుతుంది.

Business Idea: ఇంట్లోనే కర్పూరం తయారీ వ్యాపారం.. రూ. వేలల్లో ఆదాయం..

మారుతోన్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న అభిప్రాయంతో ఉంటారు.

కానీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయం పొందొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

కర్పూరం వినియోగం ఎంత అనివార్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవాలయాలు మొదుల ఇళ్ల వరకు ప్రతీ రోజూ కర్పూరం ఉండాల్సిందే. హిందువులు ప్రతీ రోజూ కర్పూరంను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలాంటి నిత్యవసర వస్తువు తయారీని మీ వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ కర్పూరం తయారీకి అవసరమయ్యే మిషిన్స్‌ ఏంటి.? ఎంత పెట్టుబడి కావాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కర్పూరం తయారీకి కావాల్సిందల్లా తయారీ మిషన్‌తో పాటు ముడి సరుకు. ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఈ మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్‌ ధర విషయానికొస్తే ఫుల్లీ ఆటోమెటెడ్‌ మిషన్‌ ధర రూ. 1 లక్ష నుంచి ప్రారంభంలో ఉంటాయి. వీటితో పాటు ముడి సరుకును కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ కోసం కవర్‌ కూడా అవసరపడుతుంది. ఇలా తయారు చేసిన కర్పూరాన్ని మీ సొంత బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసుకొని విక్రయిస్తే మంచి ఆదాయం పొందొచ్చు.

కర్పూరం తయారీ మిషన్స్‌కు సంబంధించి యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉన్నాయి. వీటిలో పేర్కొన్న నెంబర్లను సంప్రదించడం ద్వారా మిషిన్స్‌తో పాటు ముడి సరుకులను పొందొచ్చు. అయితే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకుండా. నేరుగా వెళ్లి మిషిన్‌ను చూసి, తయారీ విధానాన్ని తెలుసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాల్సి. అడ్వాన్స్‌గా ఎలాంటి డబ్బు చెల్లించడకపోవడమే ఉత్తమం.

Amitabh Bachchan: 55 ఏళ్లలో లేని ఘనతను కల్కి సినిమాతో సాధించిన అమితాబ్.. అదేంటంటే..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 27న విడుదలైన ఈ పాన్ ఇండియా లెవల్లో విజయవంతంగా దూసుకుపోతుంది.

14వ రోజు ఈ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో రూ.536.75 కోట్లు రాబట్టింది. వారం రోజులు కావడంతో వసూళ్లు బాగా తగ్గాయి. వీకెండ్‌కి కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ‘కల్కి 2898 AD’ తెలుగు . తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. బాహుబలి తో నార్త్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి మూవీతో మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కల్కి చిత్రానికి నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

అలాగే ఈ కల్కిలో అమితాబ్ నటించడం మరో కారణం అని కూడా చెప్పొచ్చు. ఇందులో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నటించి మెప్పించారు. కేవలం చివర్లో మాత్రమే ప్రభాస్ పాత్ర హైలెట్ కాగా.. మొత్తం అమితాబ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ హిందీలో రికార్డ్స్ సృష్టిస్తుంది. రూ.500+ కోట్లలో హిందీ రూ.229.05 కోట్లు, తెలుగులో రూ.252 కోట్లు రాబట్టింది. దీంతో హిందీలో కు మరింత డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు రాబట్టినట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రాన్ని అధిగమించింది. ఈ చిత్రం 915 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతోంది.

అమితాబ్ బచ్చన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన లేవీ ఇంత భారీ వసూళ్లను రాబట్టలేకపోయాయి. భారీ విజయం సాధించడం ఇదే తొలిసారి. అమితాబ్ అశ్వత్థామగా కనిపించి మెప్పించాడు.

Health: రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. ఏం జరుగుతుందంటే

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మీకు తెలుసా.? ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రిండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు రాలుడు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతీ రోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

* డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

* ప్రతీరోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

* వర్షాకాలం వచ్చే సీజనల్‌ వ్యాధులైన జలుబు ,దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

* కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు ధనియాల నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Sleep on Stomach: మీరు బోర్లా తిరిగి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది.

కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బోర్లా తిరిగి పడుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. చాలా నస్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇలా పడుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల వెన్నెముక, మెడపై ఎఫెక్ట్ పడుతుంది. ఇతర శరీర భాగాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఇవి దీర్ఘకాలిక నొప్పులకు దారి తీస్తుంది.

2. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల ముందు పొట్టపై ప్రభావం పడుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థకు ఆటంకంగా మారుతుంది. తిన్న ఆహారం త్వరగా అరగదు.

3. పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముకపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. సహజంగా ఉండే షేప్ పోతుంది. వక్రత ఏర్పడవచ్చు. బాడీ పెయిన్స్ ఎక్కువగా పడతాయి.

4. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల మీ తలను ఒక వైపు తిప్పి పడుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మెడకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ తరచూ పడుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

5. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల శరీర భాగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల ఉదయం మీరు లేచేసరికి నొప్పులు అధికంగా వస్తాయి.

ఈ చిట్కాలు ట్రై చేయండి:

మీరు బోర్లా పడుకోకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలు ట్రై చేయండి. దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీ తల కింద దిండును వేసుకోకండి. దీని వలన బోర్లా పడుకునే అలవాటు తగ్గిపోతుంది. తలదిండు వేసుకోవడం వల్ల మెడ నరాలు ఇబ్బంది పెడతాయి. మీ వెన్నెముక సరిగా ఉండాలంటే.. మీ కటి ప్రాంతం కింద దిండును ఉంచండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Galaxy Buds 3: సామ్‌సంగ్ నుంచి కొత్త ఇయర్‌ బడ్స్‌.. ఏఐ ఫీచర్లతో..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ని లాంచ్‌ చేసింది. గ్యాలక్స్‌ బడ్స్‌ 3పేరుతో అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్‌ బడ్స్‌ని తాజాగా జరిగిన గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా బడ్స్‌ 3, గ్యాలక్సీ బడ్స్‌ 3 ప్రోలను లాంచ్‌ చేసింది.

గ్యాలక్సీ బడ్స్‌ ఇయర్‌ బడ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను జోడించారు. ఇందులో మెరుగైన 2-వే స్పీకర్ సిస్టమ్‌గా పనిచేసే ‘కెనాల్ టైప్’ స్టెమ్ డిజైన్‌ను ఇచ్చారు. ఇందులో క్రిస్టల్-క్లియర్ సౌండ్ అనుభూతి కోసం డ్యూయల్ యాంప్లిఫైయర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ఇయర్‌బడ్‌లు IP57 రేటింగ్‌తో తీసుకొచ్చారు.

ఇక గ్యాలక్సీ బడ్స్‌ 3 బరువు 4.7 గ్రాములుగా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 48 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు. అలాగే ఛార్జింగ్‌ కేస్‌ బ్యాటరీ సామర్థ్యం 515 ఎమ్‌ఏహెచ్‌గా ఉంటుంది. స్పష్టమైన సౌండ్ క్వాలిటీ కోసం ఇందులో 11ఎమ్‌ఎమ్ డైమనిక్‌ డ్రైవర్‌లను అందించారు.

వీటితో 360 డిగ్రీస్‌ ఆడియో సరౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. ఈ ఇబయ్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేసే 24 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వినొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్‌ బడ్స్‌ను వైట్‌, సిల్వర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే గ్యాలక్సీ బడ్స్‌ 3 ధర రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే గ్యాలక్సీ బడ్స్‌ 3 ప్రో ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ ఆర్డర్స్‌ ప్రారంభంకాగా జులై 24 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Bharateeyudu 2: తొలగిన అడ్డంకులు భారతీయుడు-2 సినిమాకు కోర్ట్ గ్రీన్‌సిగ్నల్..

భారతీయుడు వస్తూనే ఉంటాడు.. అవినీతిని అంతం చేసేదాకా! యస్‌. భారతీయుడు-2 మూవీలో అసలు ట్విస్ట్‌ ఏంటో మరి కొద్ది గంటల్లో తెరపై కనిపించనుంది. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తోంది అంటే భారతీయుడు టాపిక్‌ ఒక్కటే నడుస్తోంది.

దేశమంతా భారతీయుడు -2 హవా కనిపిస్తోంది. భారతీయుడు మూవీ వచ్చిన దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సీక్వెల్ రావడం, ఆసక్తిని రేపుతోంది. అయితే అది 3గంటల పైగా నిడివి ఉన్న కావడంతో ఇప్పటి జనరేషన్‌ని ఆకట్టుకోగలుగుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. ఈమధ్య కాలంలో దిగ్గజ దర్శకుడు శంకర్‌ అంత ఫామ్‌లో లేడు. అయితే లోక నాయకుడు కమల్‌ హాసన్‌ మాత్రం, విక్రమ్‌ సూపర్‌ హిట్‌ తర్వాత మాంచి జోరు మీదున్నారు. కమల్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రేపు విడుదల అవుతున్న భారతీయుడు-2 మూవీ మీద అంచనాలు భారీ గానే ఉన్నాయి.

ఈ రోజుల్లో క్లైమాక్స్ లేని లైనా వస్తున్నాయేమో కానీ.. సీక్వెల్‌ లేని భారీ లు మాత్రం రావట్లేదు. ప్రతి కు క్లైమాక్స్‌లో పార్ట్ 2 అని వేస్తున్నారు. అది తీస్తారో తీయరో తర్వాతి విషయం. ముందైతే ఓ ప్రకటనే కదా అని చేస్తున్నారు. మరి ఇండియన్-2లోనూ అదే చేయబోతున్నారా..? క్లైమాక్స్‌లో పార్ట్ 3కి సంబంధించిన అప్‌డేట్ ఎలా ఉండబోతుంది..?

ఆరేళ్ళ కింద మొదలైంది.. ఐదేళ్లుగా సెట్స్‌పైనే ఉంది.. రెండేళ్లు ఆగిపోయింది.. ఏడాదిన్నర కింద హడావిడిగా తిరిగి మొదలైంది.. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది ఇండియన్ 2. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులోనూ భారీగానే వస్తున్నాడు భారతీయుడు – 2. ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. కమల్ హాసన్ అయితే ఓ అడుగు ముందుకేసి భారతీయుడు 3 కోసమే తాను 2 చేశానంటూ, పై హైప్‌ని మరింత పెంచేశారు. అంతగా ఆ లో ఏముంటుందబ్బా అంటూ ఆడియన్స్ కూడా బాగానే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ ఎగ్జైట్‌మెంట్ మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు శంకర్.

ఇదిలా ఉంటే భారతీయుడు-2 కు మదురై కోర్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది మదురై కోర్టు. అయితే ఈ లోని మర్మకళ సన్నివేశాలపై రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారని రాజేంద్రన్ ఆరోపించారు. అయితే భారతీయుడు పార్ట్‌-1లోని సన్నివేశాలు కొనసాగించమని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దాంతో రాజేంద్రన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది కోర్టు.

Lava: కొత్త ఫోన్‌ కొనే వారికి పండగే.. రూ. 15 వేలలో కర్వ్డ్‌ డిస్‌ప్లేతో పాటు మరెన్నో ఫీచర్స్‌

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. చైనాకు కంపెనీలకు ధీటుగా పోటీనిచ్చే క్రమంలో లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

జులై 20వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

లావా బ్లేజ్‌ ఎక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంకచెస్‌తో కూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెజ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1080×2400 రిజల్యూషన్‌, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999, 6 జీబీ ర్యామ్‌ ధర రూ. 15,999కాగా 8 జీబీ ర్యామ్‌ ధర రూ. 16,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి.

బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

లావా బ్లేజ్‌ ఎక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమతో పనిచేస్తుంది. రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే ఆండ్రాయిడ్‌ 15కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

 

Indian Wedding Industry: అంబానీల ఇంట దాదాపు రూ.2,000 కోట్ల ఖరీదైన పెళ్లి.. రూ.10 లక్షల కోట్ల వెడ్డింగ్ మార్కెట్ ను ఎలా పెంచనుంది?

పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా అయితే ఐదు లక్షలో, పది లక్షలో, కోటో, పది కోట్లో అంటారు. వ్యక్తిగత ఆర్థిక స్థాయిని బట్టి ఈ ఖర్చు ఆధారపడి ఉంటుంది.

కానీ వందలు, వేల కోట్లతో ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అని ఊహిస్తారా? అది కొద్ది మంది శ్రీమంతులకు మాత్రమే చెల్లుతుంది. అలాంటి పెళ్లి చూడాలంటే అంబానీ ఇంట కల్యాణ వేడుకను కనులారా చూడాల్సిందే. అందుకే మన దేశంలో పెళ్లిళ్ల
మార్కెట్ 10 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఒక్క పెళ్లికి దాదాపు రూ.2000 కోట్ల ఖర్చు. అది కూడా మన దేశంలోనే. విందు భోజనంలో 2 వేలకు పైగా వెరైటీ వంటకాలు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో స్టేజ్ షోలు. వాళ్లకు రెమ్యునరేషన్ గా పదుల కోట్ల రూపాయిలు. ఈ వివాహ వేడుక ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.

అదే అంబానీల ఇంట వివాహం. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి
అంగరంగవైభవంగా చేయడం కోసం.. అంబానీల కుటుంబం కొన్ని నెలలుగా వేడుకలు నిర్వహించింది. దానికి తగ్గట్టుగానే మార్చిలో మొదలుపెట్టి.. జూలై వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను చేసింది. ఖరీదైన వెడ్డింగ్ కార్డులతో పాటు గిఫ్టులు ఇచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులను పెళ్లి మండపానికి తరలించడానికి దాదాపు పదులుకొద్దీ విమానాలను అద్దెకు తీసుకుంది. దీనిని బట్టి ఈ పెళ్లికి ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారో మీకు అర్థమై ఉంటుంది. ఇలా భారీ స్థాయిలో జరిగే వివాహాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. దేశంలో అన్ని పెళ్లిళ్లూ ఈ స్థాయిలో కాకపోయినా.. ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేస్తున్నారు.

TG DSC 2024 Hall Tickets: తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్‌ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత గ్రూపు 2 పరీక్షలు కూడా ఉన్నాయని, కనీసం నెలపాటు డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు చేస్తున్నారు. అయితే అభ్యర్ధుల విన్నాపాలను పట్టించుకోని తన పంథాన తాను తాజాగా హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసింది. హాల్‌టికెట్లను విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఇక ఉండదని తేల్చినట్లైంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. డీఎస్సీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఇక పరీక్షలు ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున జరగనున్నాయి. 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టుల వరకు ఉన్నాయి.

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..

  • జులై 18వ తేదీన మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌
  • జులై 18వ తేదీన సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
  • జులై 19వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్
  • జులై 20వ తేదీన ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్
  • జులై 22వ తేదీన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
  • జులై 23వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్
  • జులై 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌
  • జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్
  • జులై 30వ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్

Jeevan Jyothi Bhima: ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

విష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే పొదుపు చేయడం చాలా అవసరం. పొదుపు లేకపోతే భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రజలు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు.

ప్రైవేట్ పొదుపు పథకాలు దుర్వినియోగం కావడంతో ప్రజలు ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అందులో ఒకటి కేంద్ర ప్రభుత్వ జీవన్ జ్యోతి బీమా యోజన పథకం. ఈ పథకం ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేయాలో వివరంగా తెలుసుకుందాం.

జీవన్ జ్యోతి బీమా యోజన ప్రత్యేక ఫీచర్లు:

ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్య బీమా కల్పించేందుకు జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.2 లక్షల వరకు వైద్య బీమాను ఈ పథకం అందిస్తుంది. మీరు ఈ ప్లాన్ నుండి ప్రయోజనం పొందాలనుకుంటే, మీరు సంవత్సరానికి రూ.436 ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. అంటే నెలకు రూ.40లోపు పెట్టుబడి పెడితే రూ.2 లక్షల బీమా లభిస్తుంది. బహుశా పాలసీదారు మరణిస్తే, డబ్బు అతని నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందజేయబడుతుంది.

జీవన్ జ్యోతి బీమా యోజన పథకం జూన్ 1 నుండి మే 31 వరకు పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం మే 31న డబ్బు డెబిట్ అవుతుంది. ఈ బీమా పథకం ఒక సంవత్సరానికి మాత్రమే బీమా కవరేజీని అందిస్తుంది. అందుకే పాలసీని ఏటా రెన్యూవల్ చేసుకోవడం అవసరం.

వయోపరిమితి, పత్రాలు

దరఖాస్తుదారులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఈ బీమా ప్లాన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలి. లేదంటే ఈ స్కీమ్‌ పొందలేరు.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే

రెండు రోజులు తగ్గితే.. మరో మూడు రోజులు భారీగా పెరుగుతోంది బంగారం ధర. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేట్స్‌ పైపైకి ఎగబాకాయి.

గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోందన్న లెక్క. పెరిగిన గోల్డ్ రేట్‌తో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరల్లో తేడా కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇక ఇలా భారీగా పెరుగుతోన్న బంగారం ధరలు చూసి.. పసిడిని కొనాలంటేనే జంకుతున్నారు పసిడిప్రియులు.

సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 6,731గా ఉంటే.. 10 గ్రాములు(తులం) రూ. 67,310 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే.. గ్రాము ధర రూ. 7343గా ఉంది. 10 గ్రాములు(తులం) రూ.73 వేల 430 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

షాకిచ్చిన వెండి..

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా షాకిస్తున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 1100 మేరకు పెరిగి కిలో వెండి రూ. 95,600 వద్ద కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ. లక్ష మార్క్ దాటింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ప్రస్తుతం రూ. 1 లక్షా 100 పలుకుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి రూ. 95,600 ఉండగా.. బెంగళూరులో కిలో వెండి రూ. 95,100గా ఉంది.

Bihar Special Status: ఈ బడ్జెట్‌లో బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రావడానికి పెద్ద కారణాలు ఇవే!

నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ నుండి ఈసారి బీహార్‌కు ఏమి లభిస్తుందనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్ర హోదాపై అతిపెద్ద ప్రశ్న. గత 18 ఏళ్లుగా బీహార్ రాజకీయాల్లో ప్రత్యేక రాష్ట్ర అంశం ఆధిపత్యం చెలాయిస్తోంది.

ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌లో దీని గురించి చర్చిస్తారు. కానీ ఈసారి 3 పెద్ద కారణాల వల్ల 2024 బడ్జెట్‌లో బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తుందని చెబుతున్నారు.

బీహార్ ఈ హోదాను ఎందుకు అడుగుతోంది? దాని వల్ల ప్రయోజనం ఏమిటి?

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ డిమాండ్ కనీసం 3 ఎన్నికలను ప్రభావితం చేసింది. ప్రత్యేక హోదా డిమాండ్ వెనుక నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి:

  • బీహార్‌లో 96 హోల్డింగ్స్ భూమి సన్నకారు, చిన్న రైతులకు చెందినవి. చాలా వరకు భూమి వరదల్లో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 38 జిల్లాల్లో 15 జిల్లాలు వరదల బారిన పడుతున్నాయి.
  • 2000 సంవత్సరంలో జార్ఖండ్ విడిపోయిన తర్వాత బీహార్ నుండి సహజ వనరులు, పరిశ్రమలు తుడిచిపెట్టుకుపోయాయి. కొత్త పెట్టుబడికి ఈ స్థితి చాలా ముఖ్యం. పరిశ్రమల కొరత కారణంగా బీహార్‌లో ఉపాధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
  • గత రెండు దశాబ్దాలలో బీహార్‌లో నిర్మాణం, రవాణా, కమ్యూనికేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ రంగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాయి. అయితే ఇది పెద్దగా ఉపాధిని సృష్టించలేదు. దీంతో బీహార్ నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి.
  • బీహార్ కుటుంబాల్లో మూడింట ఒక వంతు ఇప్పటికీ దారిద్య్రరేఖలోనే ఉన్నారు. వారికి మంచి ఇల్లు లేదా కనీస సౌకర్యాలు లేవు. ఈ ప్రాతిపదిక తలసరి ఆదాయం చట్రంలో సరిపోతుంది. అందుకే బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
  • ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంలో 90% గ్రాంట్‌గా, 10% వడ్డీ లేకుండా రుణంగా పొందుతుంది. ఇది కాకుండా, ప్రత్యేక రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రానికి ఎక్సైజ్, కస్టమ్, కార్పొరేట్, ఆదాయపు పన్ను మొదలైన వాటిలో కూడా రాయితీ లభిస్తుంది. ఇది కాకుండా, ప్రత్యేక రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయంలో 30% పొందుతాయి.

బీహార్ ఈసారి ఆశ ఎందుకు పుట్టింది? 3 కారణాలు

  1. ఎన్నికల ప్రభావం: 14 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అంటే 2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిపాదించారు. ఎన్నికల శంఖారావానికి ఇక 14 నెలలు మాత్రమే సమయం ఉంది. కేంద్రం ఇప్పటికిప్పుడు బీహార్‌కు ఈ హోదా ఇస్తే ఎన్నికల వరకు దాని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కింద పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రయోజనం ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లభిస్తుంది. గస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీహార్‌లో బీజేపీ, జేడీయూలు అధికారంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2025 ఎన్నికల్లో ప్రత్యేక హోదా, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించకపోతే రెండు పార్టీలు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో ఇరు పార్టీల కూటమి గట్టి పోటీలో విజయం సాధించింది.
  2. కేంద్రంలో నితీష్ పార్టీ పాత్ర ముఖ్యం: 2005లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2010లో నితీష్ కుమార్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ డిమాండ్‌కు సంబంధించి జేడీయూ బీహార్‌ నుంచి లక్షలాది మంది నుంచి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపగా, నితీశ్‌ డిమాండ్‌లను కేంద్రం అప్పట్లో ఆమోదించలేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ పెద్ద పాత్ర పోషిస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ మద్దతుతో నడుస్తోంది. అధికారానికి సంబంధించి నితీశ్ ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ పార్టీ దృష్టి మొత్తం ప్రత్యేక రాష్ట్ర హోదాపైనే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ డిమాండ్‌కు సంబంధించి జేడీయూ తీర్మానం కూడా చేసింది.
  3. ప్రత్యేక ప్యాకేజీతో కూడా పరిస్థితి మెరుగుపడలేదు: 2015లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా బీహార్‌లో పరిస్థితి మెరుగుపడలేదు. ఇటీవలి ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం బీహార్‌లో మూడింట ఒక వంతు కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి.

అదే నివేదిక ప్రకారం రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు నెలవారీ ఆదాయం ఆరు వేల రూపాయల లోపు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 1.57 శాతం మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 6.9 శాతానికి పైగా ఉంది.

ప్రత్యేక హోదా అనేది ఆర్థికంగా ఇచ్చే హోదా. ఆర్థికవేత్త గాడ్గిల్‌ కమిటీ సిఫార్సు మేరకు భారతదేశంలో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశంలోని 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. వీటిలో తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు ఉన్నాయి.

గాడ్గిల్ కమిటీ నివేదికలో, ఈ పారామితులపై ప్రమాదంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేయబడింది.

1. భూమి పర్వతాలు లేదా ప్రవేశించలేని ప్రాంతంగా ఉండాలి.

2. అది తక్కువ జనాభా లేదా గిరిజన ప్రాంతం కలిగి ఉండాలి

3. రాష్ట్రం చుట్టూ అంతర్జాతీయ సరిహద్దు ఉండాలి

4. రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉండాలి.

2014 నుంచి కేంద్రం ప్రత్యేక హోదాను నిలిపివేసింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక రాష్ట్ర హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని సిఫారసు చేసిందని, అందుకే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాదని కేంద్రం చెబుతోంది. అయితే ఫైనాన్స్ కమిషన్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కూడా రాజకీయ సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం, దేశంలో కనీసం 5 రాష్ట్రాలు (ఆంధ్రా, బీహార్, ఒడిశా, రాజస్థాన్, గోవా) ఉన్నాయి. అక్కడ దీనికి డిమాండ్ గట్టిగా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.

AP News: రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు.. అప్పటి నుంచే అందుబాటులోకి..

పేదలకు మూడు పూటలా అన్నం పెట్టి ఆదుకునే అన్న క్యాంటీన్లను వచ్చే నెలలో పునః ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు క్యాంటీన్లను ఓపెన్‌ చేసే విషయాన్ని ఏపీ సర్కార్‌ పరిశీలిస్తోంది.

తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీలో 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15కి పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్‌ నడుం బిగించింది. రూ.20 కోట్లతో అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు. క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ. 65 కోట్లను కూడా విడుదల చేశారు.

అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం కోసం కార్మికులు, రిక్షావాలాలు, ఆటో డ్రైవర్లు, ఆసుపత్రుల వద్ద పేషెంట్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణీకులు.. ఇలా అనేక మంది ఎదురు చూస్తున్నారు. పూట గడవక.. చాలీచాలని తిండి తిని జీవనం సాగిస్తున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుళ్లుగోపురాల్లో, బయట ఏర్పాటు చేసే నిత్యాన్నదానాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని కడుపు నింపుకుంటున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ఓపెనింగ్‌ కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు నిరుపేదలు. 5 రూపాయలకే కడుపు నిండా మూడు పూటలా టిఫిన్‌, భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల ఓపెనింగ్‌ కోసం పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Health

సినిమా