Friday, November 15, 2024

Recharge: తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌..

Recharge: తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌..

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చితంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. అయితే తాజాగా పెరిగిన రీఛార్జ్‌ ప్లాన్స్‌తో మొబైల్ యూజర్లు రీఛార్జ్‌ అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌ ఉపయోగించే వారికి పెరిగిన రీఛార్జ్‌ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ లభించే రీఛార్జ్‌ ప్లాన్స్‌ లేవా.? అంటే అవి కూడా ఉన్నాయి. దేశంలో ఉన్న మూడు ప్రధాన టెలికాం సంస్థలకు సంబంధించిన బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

జియో రూ. 189 ప్లాన్‌..
అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో రూ. 189 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. నెలకు 1000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో టీవీతో పాటు, జియో సినిమాకు ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ. 199..
ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఎయిర్‌టెల్‌లో రూ. 155 ప్లాన్‌ కూడా లభిస్తోంది. ఇది 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

వొడాఫోన్ ఐడియా రూ. 199
రూ. 199 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిడెట్‌ కాల్స్‌ పొందొచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా కాల్స్‌ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు సుమారు రూ. 7 చెల్లించాల్సి ఉంటుంది.

Indian Railways: అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?

అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఆ అత్యవసర సమయంలో మీరు ప్రయాణించవలసి ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో ట్రైన్‌ ప్రయాణం చేయాలంటే టికెట్స్‌ లభించడం కష్టమే. రైలులో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. మరి అత్యవసర సమయాల్లో టికెట్స్‌ బుక్‌ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇలాంటి సమయాల్లో కొన్ని మార్గాల ద్వారా టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లు:

అనేక టిక్కెట్ రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇ-టికెట్‌లను అందిస్తున్నాయి. ఇది ఎక్కువ టికెట్స్‌ పొందడానికి టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి వేగవంతమైన మార్గాలలో ఒకటి. ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్) వంటి వెబ్‌సైట్‌లు సరైన రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ మీరు రైళ్ల కోసం సెర్చ్‌ చేయవచ్చు. సీట్ల లభ్యతను తనిఖీ చేయవచ్చు. అలాగే తక్షణమే బుకింగ్‌లు చేయవచ్చు. మీ లాగిన్ ఆధారాలను సిద్ధంగా ఉంచుకోండి. మీరు అందుబాటులో ఉన్న సీటును కనుగొన్న తర్వాత మీ బుకింగ్‌ను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

కోటాలు :

భారతీయ రైల్వేలు సాధారణ కోటా కాకుండా తత్కాల్, ప్రీమియం తత్కాల్, సీనియర్ సిటిజన్లు, లేడీస్ వంటి అనేక కోటాలను కూడా అందిస్తాయి. తత్కాల్ కోటా కేవలం ఒక రోజు ముందు ఓపెన్‌ అవుతుంది. అధిక ఛార్జీలతో పరిమిత సంఖ్యలో సీట్లను అందిస్తుంది. కొన్ని రైళ్ల కోసం ప్రవేశపెట్టిన ప్రీమియం తత్కాల్, మరింత సౌకర్యవంతమైన ఛార్జీల ఎంపికలను అందిస్తుంది. అయితే ప్రయాణం రోజున తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. ఈ కోటాలు, వాటి బుకింగ్ సమయాలను అర్థం చేసుకోవడం వల్ల టిక్కెట్‌ను పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

ప్రత్యామ్నాయ మార్గాలు, సమయాలు:

అత్యవసర సమయాల్లో, ప్రత్యామ్నాయ మార్గాలు లేదా కొంచెం సౌకర్యవంతమైన ప్రయాణ సమయాలను పరిగణించండి. కొన్ని రైళ్లు నిర్దిష్ట రోజులలో లేదా మీ ప్రారంభ ప్రాధాన్యత కంటే వేర్వేరు మార్గాల్లో లభ్యతను కలిగి ఉండవచ్చు. తక్షణ ప్రయాణం అవసరమైనప్పుడు ఈ ఎంపికలు అందుబాటులో ఉండటం వల్ల కొన్నిసార్లు ధృవీకరించిన టిక్కెట్‌ను పొందడానికి కీలకం.

చివరి నిమిషంలో రద్దు చేయడంపై రెగ్యులర్ చెక్:

కొందరు ఏదైనా కారణంగా చివరి నిమిషంలో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి వారి స్థానంలో టికెట్స్‌ లభించవచ్చు. రద్దు చేయడం వల్ల టిక్కెట్లు తరచుగా అందుబాటులో ఉంటాయి. మీరు ఇష్టపడే రైలులో విడుదలైన సీట్ల కోసం క్రమం తప్పకుండా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని తనిఖీ చేయండి. మీరు కోరుకున్న మార్గం కోసం నోటిఫికేషన్‌లను సెటప్ చేయడం వలన మీరు సీటు అందుబాటులోకి వచ్చినప్పుడు త్వరగా పని చేయడంలో సహాయపడుతుంది.

సౌలభ్యం కోసం మొబైల్ యాప్‌లను ఉపయోగించండి:

IRCTC, ఇతర థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మొబైల్ యాప్‌లు సౌలభ్యం, నిజ-సమయ అప్‌డేట్‌లను అందిస్తాయి. ఈ యాప్‌లు మీరు లభ్యతను తనిఖీ చేయడానికి, టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, ప్రయాణంలో మీ ప్రయాణ వివరాలను నిర్వహించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి. బుకింగ్ ప్రక్రియలో లావాదేవీ వైఫల్యాలను నివారించడానికి మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి.

ఏజెంట్ల సహాయం తీసుకోండి:

అత్యవసర పరిస్థితుల్లో మీరు బుకింగ్ ఏజెంట్ల నుండి సహాయం పొందవచ్చు. ఈ ఏజెంట్లు రిజర్వేషన్ సిస్టమ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. అత్యవసర సమయాల్లో టిక్కెట్ బుకింగ్ సంక్లిష్టతలను నావిగేట్ చేయడంలో సహాయపడగలరు.

ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అంశం ప్రధాని నిర్ణయాన్ని, తాను ఎలాంటి హామీలు ఇవ్వలేనని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్ర పెద్దలు చెప్పారని శ్రీనివాసవర్మ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఫైనాన్స్ మిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. అందువల్లే హోదా స్థానంలో ప్యాకేజీ ప్రకటించారని చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

కాగా ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదన చేసింది. ఇందుకు బీజీపీ పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఆ తర్వా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడంతో ప్రత్యేక హోదాకు బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుండి. కొన్ని నిధులను రాష్ట్రానికి వినియోగించుకుంది. అయితే నాటి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాల్సందేనని రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ జగన్ , కేంద్రంలో మోడీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ వినిపించలేదు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు

ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది.

ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. అప్పటినుంచి ఓ ఏడాది అద్దె ఇంట్లో, తరువాత ఓ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో తరగతులు నిర్వహించారు.

మరోవైపు 2023 ఆగస్టులో నాడు-నేడు నిబంధనలను ప్రభుత్వం మార్చడంతో పిల్లర్లు, స్లాబ్‌స్థాయిలోనే బడి నిర్మాణం నిలిచిపోయింది. గత్యంతరం లేక అందులోనే ఇప్పుడు తరగతులు నిర్వహిస్తున్నారు.

అంతా ఆరుబయటే కావడంతో కుర్చీలు, నల్లబల్లలను ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు. దీంతో పిల్లర్లపైనే సుద్దముక్కతో రాసి బోధిస్తున్నారు. ఇక్కడ సుమారు 90 మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచాయని, సమస్యను డీఈవో ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంఈవో కిశోర్‌బాబు వివరణ ఇచ్చారు.

బాలికతో అసభ్య ప్రవర్తన.. వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

వైకాపాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కర్నూలు: వైకాపాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు కర్నూలులోని నివాసంలో సుధాకర్‌ ఉండగా రెండో పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

AP High Court: వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

AP High Court Interim Orders on YCP Offices Demolition : వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల వివరాలను 2 నెలల్లోగా అధికారుల ముందు ఉంచాలని వైసీపీని ఆదేశించింది. అలాగే అధికారులు తొందరపాటు చర్యలకు ఉపక్రమించొద్దని, వైసీపీ ఇచ్చే వివరణను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది.

కార్యాలయాల్లో కూల్చివేతల విషయంలో ఖచ్చితంగా చట్ట నిబంధనలను పాటించాలని తెలిపింది. తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్నారంటూ.. కొందరు వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. వాటిపై జూన్ 26న విచారణ చేసిన న్యాయస్థానం స్టేటస్ కో విధించింది.

ఎలాంటి అనుమతులు లేకుండా.. వైసీపీ తన ఇష్టారాజ్యంగా ఈ కార్యాలయాలను నిర్మించిందని ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం. గతనెలలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో వైసీపీ భవనాలను నిర్మించిందన్న విషయం బయటికొచ్చింది. వాటిలో కొన్ని పూర్తవ్వగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాల కోసం వందల కోట్ల రూపాయల్ని ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

జగన్ రెడ్డి అధికార దాహానికి అంతులేకుండా పోయిందని నారా లోకేశ్ అప్పుడే ఫైరయ్యారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వైసీపీ కార్యాలయాలను నిర్మించారో పూసగుచ్చినట్లు వివరించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ప్రజల సొమ్మును జగన్ ఇలా జిల్లాల ప్యాలెస్ ల నిర్మాణాలకు తగలేశాడని విమర్శించారు. పేద ప్రజలకు ఇళ్లు కట్టించేందుకు మనసొప్పని జగన్.. తన స్వార్థం కోసం ఇలా జిల్లా కార్యాలయాలను నిర్మించుకోవడం దారుణమన్నారు.

Success: ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదా.. అయితే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ఇతరులకు సహాయం చేసే గుణం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.. ఎందుకంటే దానగుణం కలిగిన వ్యక్తి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి జీవితం కూడా సంతోషకరంగానే ఉంటుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.

గొప్ప గొప్పగా దానధర్మాలు చేయకపోయినా ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేసిన కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అని పెద్దలు చెబుతుంటారు. న్యాయపరమైన సంపాదనతో చేసి ఎలాంటి కార్యమైనా సరే అది మంచి ఫలితాలను ఇస్తుంది. మన చేతులతో మనం ఎంత దానం అయితే ఇస్తామో అంతకు రెట్టింపు ఫలితాలను మనం పొందుతాము.

అయితే మనం కొన్ని కొన్ని సార్లు ఎంత కష్టపడినప్పటికి సక్సెస్ రాగా ఫలితం లేక చాలామంది తెగ కష్టాలు పడుతూ ఉంటారు. ఇలా మీకు కూడా జరుగుతూ ఉంటే వెంటనే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదంటే ఆవనూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు యొక్క వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు చేస్తూ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అని స్మరిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేస్తే కష్టాల నుంచి విముక్తి పొందవచ్చట.

అలాగే వారంలో మీకు ఎన్నిసార్లు వీలు అయితే అన్నిసార్లు గోమాతకు గ్రాసం లాంటిది పెట్టి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శుభకార్యాలకు వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఓం శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించాలి. వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకొని పని మీద బయటకు వెళితే మీరు వెళ్లిన పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఎటువంటి పని చేపట్టినా కూడా జరగడం లేదని బాధపడుతున్న వారు ప్రతి ఆదివారం రోజు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో ఆరోగ్యం సమర్పించే నమస్కారం చేసుకోవాలి. అయితే ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు.

కేవలం ఆదివారం రోజు అని మాత్రమే కాకుండా ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే నలుపు రంగు దారాన్ని కొనుగోలు చేసి ఏమీ వయసుకు సమానమైన ముడులను దానిపై కట్టి అనంతరం అరటి తులసి ఆకుల రసాన్ని మీరు వేసిన ప్రతి ఒక్క ముడి పై వేసి, ఆ తర్వాత పసుపు సింధూరాన్ని కలిపి ఆ దారానికి రాయాలి. ఆ తరువాత ఆధారాన్ని కుడి చేతి కింద గా ఉండేటట్లు ధరించాలి. ఆ ధారాన్ని 21 రోజుల పాటు ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న నిరాశ తొలగి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పక్షులకు మూగ జంతువులకు ఆహార పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఉదయం ఈ తలనొప్పితో పాటు ఈ లక్షణాలు కనబడితే మీ షుగర్ లెవల్స్ తగ్గాయని ..

మధుమేహం నయం చేయలేని వ్యాధి. అయితే, ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. షుగర్ పెరగడమే కాకుండా షుగర్ తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ వ్యాధి గురించి మనం మరింత అవగాహన కలిగి ఉండాలి.

దాని లక్షణాలు అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే, డాక్టర్ వెంటనే చికిత్స చేయాలి.

మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువ మాత్రమే కాదు తరచూ తక్కువగా సూచిస్తాయి. అయితే షుగర్ లెవల్స్ ఎక్కువైనా ప్రమాధమే..తక్కువైన ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. ఉదయం సమయంలో షుగర్ లెవల్స్ తక్కువ అవ్వడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కొన్ని సందర్భాల్లో, ఇది ప్రాణాంతకం కావచ్చు.

కానీ అదే చక్కెర స్థాయి 70mg/dL చుట్టూ లేదా అంతకంటే తక్కువకు పడిపోవడం ప్రారంభించినప్పుడు, అది రక్తంలో చక్కెర స్థాయి వర్గంలో పరిగణించబడుతుంది.

హైపోగ్లైసీమియా యొక్క లక్షణాలను గుర్తించిన తర్వాత, వ్యక్తికి వెంటనే తినడానికి ఏదైనా తియ్యటి పదార్థాన్ని ఇవ్వాలి. ఆపై లక్షణాలు కొద్దిగా తగ్గుముఖం పట్టిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంటే ప్రమాదకర పరిస్థితి నుండి బయటపడవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి కొన్ని కారణాలు మరియు లక్షణాలు క్రింద ఉన్నాయి.

1) రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి కారణాలు

ఆహారంలో లోపం అంటే అవసరానికి మించి తినడం

శారీరక శ్రమలో ఆకస్మిక పెరుగుదల

ఔషధం మొత్తాన్ని పెంచడం

అనారోగ్యం కారణంగా చక్కెర కోల్పోవడం

2) ఉదయం లక్షణాలు

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడం అనేది ఒక్కొక్కో వ్యక్తిలో ఒక్కోరకంగా సూచిస్తుంది. అయితే ఈ లక్షణాలు ఉదయం మాత్రమే కాదు రోజులో ఏ సమయంలో అయినా కనడుతాయి. కాబట్టి ఈ విషయం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అప్పుడు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు. అందుకోసం మధుమేహ వ్యాధిగ్రస్తులుకు ఉదయం కనబడే లోషుగర్ లక్షణాలను ఏంటో క్రింది వాటిని గుర్తుపెట్టుకోండి.

ఉదయం లేవగానే భయంకరమైన తలనొప్పి
ఒళ్లంతా చెమటలు పట్టడం
ఉదయం నిద్రలేచిన తర్వాత నోరు పొడిబారడం
తలతిరగడం, అలసట, నీరసం
కళ్ల ముందు చీకట్లు, రోజంతా కళ్లలో చీకటి
ఉదయం లేవగానే చెమటలు పట్టడం
ఉదయం లేదా రోజులో ఎప్పుడైనా దురద
రాత్రి పడుకున్నా కూడా ఉదయం అలసటగా అనిపిస్తుంది
ఏదైనా పని చేసిన తర్వాత బలహీనంగా అనిపిస్తుంది
విపరీతమైన ఆకలి, దాహం, రాత్రిపూట కూడా ఈ సమస్య రావచ్చు
జననేంద్రియాలలో ఆకస్మిక దురద
శరీరంపై గాయాలు త్వరగా మానవు
ఆకస్మిక బరువు తగ్గడం
మధుమేహం సైలెంట్ కిల్లర్ వ్యాధి. ఈ వ్యాధి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, దాని లక్షణాలు మరియు కారణాలను సకాలంలో గమనించాలి. దానికి చికిత్స చేయాలి.

Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే..

పోషకాలు:

మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియ:

మొలకలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

బరువు తగ్గడం:

మొలకలు తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి. దాంతో ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇంకా అతిగా తినడాన్ని నివారిస్తాయి.

గుండె ఆరోగ్యం:

మొలకలలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అవి రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మం మరియు జుట్టు ఆరోగ్యం:

మొలకలలోని విటమిన్లు మన శరీరంలో యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవి ముడతలను తగ్గించడంలో, చర్మాన్ని మృదువుగా చేయడంలో అలాగే జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.

డయాబెటిస్:

మొలకలలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.

క్యాన్సర్:

మొలకలలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

Mobile Addict: మీ పిల్లలు ఫోన్‌కు బానిసవుతున్నారా? వ్యసనాన్ని వదిలించండిలా!

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం గురించి ఆందోళన చెందుతున్నారు. మొబైల్ వ్యసనం తక్కువ ఏకాగ్రత, నిద్రలేమి, సామాజిక పరస్పర చర్య లేకపోవడం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.

ఈ రోజుల్లో పిల్లలో మొబైళ్లకు బానిసై మానసికంగా దెబ్బతింటున్నారు. చిన్నప్పటి నుంచి ఫోన్లకు బానిసలుగా మారడంతో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయం తెలిసిందే. పిల్లలకు మొబైల్స్ ఇవ్వడంపై కూడా నిపుణులు కూడా పదేపదే హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులుగా మీ పిల్లలలో మొబైల్ వ్యసనాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మేము మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తాము. దీని ద్వారా మీరు మీ పిల్లల ఫోన్ వ్యసనాన్ని సులభంగా వదిలించుకోవచ్చు.

ఫోన్ వ్యసనాన్ని ఎలా వదిలించాలి?

స్క్రీన్ సమయం సెట్ చేయండి: మొబైల్ వ్యసనాన్ని అరికట్టడానికి మొదటి దశ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం. మొబైల్ ఫోన్‌ను ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో ఖచ్చితంగా తెలుసుకోండి. ఉదాహరణకు, తినేటప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోమ్‌ని ఉపయోగించడం మానేయండి. మీ పిల్లలు ఫోన్‌లో ఎంత సమయం గడపాలనే దానిపై పరిమితులను సెట్ చేయండి. మొబైల్ ఫోన్‌లతో సంబంధం లేని ఇతర కార్యకలాపాలలో పాల్గొనేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. కుటుంబం, స్నేహితులతో బహిరంగ కార్యకలాపాలు, చదవడం, డ్రాయింగ్ లేదా ఆటలు ఆడటం వంటివి ఇందులో ఉంటాయి.

రోల్ మోడల్‌గా ఉండండి:

పిల్లలు ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుంటారు. మీ పిల్లల ముందు మీ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండండి. బోర్డ్ గేమ్‌లు ఆడటం లేదా నడవడం వంటి మొబైల్ ఫోన్‌లతో సంబంధం లేని కార్యకలాపాలలో మీ పిల్లలతో పాల్గొనండి. మీరు మీ బిడ్డకు మంచి అలవాట్లను పెంపొందించుకోవడంలో సహాయపడవచ్చు.

టెక్ ఫ్రీ జోన్‌ను కలిగి ఉండండి:

డైనింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్ వంటి మీ ఇంటిలోని కొన్ని ప్రాంతాలను టాక్-ఫ్రీగా ఉంచండి. ఇది మీ బిడ్డ సౌకర్యం, సామాజిక పరస్పర చర్యతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.

Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం

Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం

టీమిండియా స్వదేశానికి చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.

ప్రపంచ కప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.

భారత క్రికెటర్లు షెడ్యూల్‌ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ తుపాను వల్ల బార్బడోస్‌ విమానాశ్రయాన్ని మూసి వేయడంతో అక్కడే హోటల్‌లో ఉన్నారు. ఇప్పుడు తుపాను కాస్త తగ్గడంతో భారత ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, తీసుకొచ్చింది.

ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం భారత క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని, తమ సొంత నగరాలకు వెళ్తారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.

10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, పోస్టాఫీసు నుంచి బంపర్ రిక్రూట్‌మెంట్, 35 వేల వరకు.

ఉద్యోగార్ధులు వెంటనే రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఇండియా పోస్ట్ అమలు చేస్తోంది. ఆసక్తికరంగా, దాదాపు 35 వేల పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కూడా ఈ సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం వయస్సు షరతు వర్తించబడింది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం 100 రూపాయల ఫీజు చెల్లించాలి.

Water Fasting: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..

Water Fasting: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..

నీరు మాత్రమే తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా. అవును ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఉపవాసంలోని ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాటర్ ఫాస్టింగ్ ఎలా చేయవచ్చు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు స్థూలకాయం బారిన పడుతున్నారు. తర్వాత భారీకాయాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు అనేక రకాల ఆహార ప్రణాళికలు, వ్యాయామాలు,యోగాలను అవలంబిస్తారు. ఇవన్నీ కొందరికి మేలు చేస్తాయి.. అయితే వీటితో పాటు నీరు మాత్రమే తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు అని మీరు ఎప్పుడైనా విన్నారా. అవును ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఉపవాసంలోని ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాటర్ ఫాస్టింగ్ ఎలా చేయవచ్చు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిని చేసే సరైన పద్ధతి మీకు తెలియకపోతే వాటర్ ఫాస్టింగ్ ప్రయోజనాలు అందవు. అందుచేత నీటి ఉపవాసం ఎలా చేయాలి.. దాని ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

వాటర్ ఫాస్టింగ్ ద్వారా రోజుల్లోనే 15 కిలోల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. 21 రోజుల పాటు వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుందని ప్రజలు అంటున్నారు. అప్పటి నుండి వాటర్ ఫాస్టింగ్ గురించి చర్చ ప్రతిచోటా జరగడం మొదలైంది. నీటి ఉపవాసానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే

నీటి ఉపవాసం అంటే ఏమిటి?
నీటి ఉపవాసం అనేది బరువు తగ్గేందుకు చేసే ఒక ప్రక్రియ. దీనిలో ఒక వ్యక్తి దాదాపు 24 గంటల పాటు నీరు మాత్రమే తాగుతాడు. ఈ కాలంలో అతను నీరు తప్ప ఎలాంటి పానీయం, రసం లేదా మరే ఇతర ద్రవాన్ని తీసుకోడు. ఈ రకమైన ఉపవాస సమయంలో కాలేయం, కండరాల కణజాలాలలో నిల్వ చేయబడిన గ్లైకోజెన్‌ను కలిగి ఉన్న శరీరంలోని రిజర్వ్ శక్తిని ఉపయోగిస్తుంది.

నీటి ఉపవాసం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఇవే

నీటి ఉపవాస ప్రక్రియ మీ శరీరాన్ని కీటోసిస్ వైపు తీసుకువెళుతుంది. దీనిలో శరీరం శక్తి కోసం శరీరంలో ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. నీటి ఉపవాసం చేయడం వల్ల శరీర నిర్విషీకరణ, బరువు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నీటి ఉపవాసం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అనేక నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం.

నీటి ఉపవాసం వలన నష్టాలు:

పోషకాల తగ్గింపు: నీటి ఉపవాసం కారణంగా చాలా మంది తమ శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాల లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనపడతాయి. దీంతో పాటు త్వరగా రక్తహీనతతో పాటు అనేక ఇతర వ్యాధుల బారిన పడవచ్చు.

డీహైడ్రేషన్ సమస్య: శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు తాగడమే కాదు.. సరైన మోతాదులో ఆహారం కూడా తీసుకోవాలి. ఒకవేళ ఆహారం సరైన సమయంలో తీసుకోకపోతే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, అలసట, మూత్రపిండాల సమస్యలతో బాధపడవచ్చు.

పేలవమైన జీర్ణ వ్యవస్థ: ఎక్కువసేపు వాటర్ ఫాస్టింగ్ చేసి.. వెంటనే ఆహారం తీసుకుంటే. అది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. అదే సమయంలో వాంతులు, కడుపు నొప్పి, వాపు వంటి సమస్యల బారిన కూడా పడవచ్చు.

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులు వారే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు..!

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూలై 3న ఈ ఘటనకు సంబంధించి 5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూలై 3న ఈ ఘటనకు సంబంధించి 5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని గుంటూరుకు చెందిన బత్తుల దేవానంద్, వెంకటరెడ్డి, గిరి రాము, ఖాజా మొయినుద్దీన్, మస్తాన్ వలిగా గుర్తించారు. CC ఫుటేజ్‌, ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు పోలీసులు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం (సత్యనారాయణ), అంబేద్కర్‎తో సహా మరి కొందరిని గుర్తించించామన్నారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత మూడు, నాలుగు రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైఎస్ఆర్సీపీ కౌంటర్ చేస్తోంది. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్‌ చేశామని చెప్తున్నారని.. అక్రమ అరెస్ట్‌లపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే నిర్ణయం

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. కొత్త డయాఫ్రం వాల్‌ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు. పోలవరం ప్రాజెక్టులో నాలుగు రోజులుగా పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు కుష్విందర్‌ ఓహ్రా బుధవారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్, రిచర్డ్‌ డొన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌ బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలసంఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

నిపుణుల నివేదిక ఆధారంగానే..
కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఇప్పటికే ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా సమావేశం నిర్వహించారు. విదేశీ నిపుణులు నలుగురు తమ అభిప్రాయాలు తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని.. వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఛైర్మన్‌ వెల్లడించారు. ఆ నివేదికలను ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్‌ నిపుణులు ఆఫ్రి పోలవరంలో పని చేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి సమర్పించి, డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ నిపుణుల సమీక్షలో పాల్గొన్న మంత్రి రామానాయుడు

ఎగువ కాఫర్‌ డ్యాం గట్టిగా ఉన్నా సీపేజీ తప్పదేమో!
విదేశీ నిపుణులు మాట్లాడుతూ ఎగువ కాఫర్‌ డ్యాంలో నిర్మాణపరంగా ఎలాంటి భద్రతా లోపాలూ కనిపించడం లేదని పేర్కొన్నారు. సీపేజీ విషయంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయేమో చూస్తామన్నారు. కానిపక్షంలో సీపేజీని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నిర్మాణం కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇది కేవలం తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం అక్కడ నాలుగు బోరు గుంతలు (బోర్‌ హోల్స్‌) తవ్వించి, తాము చెప్పిన పద్ధతిలో సమాచారం సేకరించాలన్నారు. ప్రస్తుతం రెండు బోరు గుంతల సమాచారం మాత్రమే వచ్చింది. మొత్తం 18 బోర్‌ హోల్స్‌ తవ్వి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. అయితే ఇందుకు సమయం పడుతుందని, ఈలోపు కొంత సమాచారం వచ్చినా తమ అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వివరించారు. కట్టడం నుంచి మాత్రమే సీపేజీ ఉంటే ఒకరకంగా ఉంటుందని, దిగువన ఉన్న కటాఫ్‌ నుంచి కూడా సీపేజీ వస్తుంటే మరో తరహాలో ఉంటుందని పేర్కొన్నారు. మధ్యంతర నివేదికలో దీనిపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వెల్లడించారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులకు సంబంధించి కొన్నిచోట్ల ఒక స్థాయికి మించి దిగువకు ఇసుకను నింపలేకపోవడం, సాంద్రత పెంచలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అది పర్వాలేదని వారు అభిప్రాయపడ్డారు. కొన్ని మార్పులు సూచిస్తామన్నారు. పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Free Sand: అందరికీ ఉచిత ఇసుక … 8 నుంచి అమలు. మార్గదర్శకాలు సిద్దం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని రూ.వేల కోట్లు దోచుకున్నారు. వైకాపా దోపిడీని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు.. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల వరకు ఉన్న గుత్తేదారులు రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వచేశారు. ఇప్పుడు తొలుత మూడు నెలలపాటు దీనిని ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తవ్వకాలకు, నిల్వ కేంద్రాలకు తరలించేందుకు అయిన ఖర్చును మాత్రమే తీసుకోనున్నారు. ఆ ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నిర్ణయిస్తారు. సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఇసుక అందజేయనున్నారు.

చంద్రబాబు కీలక ఆదేశాలు
ఉచిత ఇసుక విధానం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. ఆయన తొలుత మంగళవారం సచివాలయంలో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ కార్యదర్శి యువరాజ్, సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌లతో సమావేశం నిర్వహించి, ఉచిత ఇసుక విధానం అమలుకు మరిన్ని వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర సమాచారంతో బుధవారం సీఎం వద్ద జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 8 నుంచే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షించడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలా ఇసుక అందజేయాలి.. తదితరాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు.

రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశం అనంతరం.. ఆ శాఖ సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌.. అన్ని జిల్లాల గనులశాఖ డీడీలు, ఏడీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాలను వెంటనే పరిశీలించి, ఎంత ఇసుక ఉందో లెక్కలు వేసి, గురువారం సాయంత్రానికి నివేదిక పంపాలని కోరారు. అన్ని నిల్వ కేంద్రాల్లోనూ కలిపి తొలుత 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నట్లు భావించినప్పటికీ.. తాజాగా ఎంత ఉందనేది లెక్క తేల్చనున్నారు. అలాగే వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల పరిధిలో 70-75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక పూడిక రూపంలో ఉన్నట్లు గుర్తించారు. దీనిని వెలికితీసి ఈ మూడు నెలలు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుత గుత్తేదారులైన జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల ప్రతినిధులతో ప్రవీణ్‌కుమార్‌ గురువారం సమావేశం నిర్వహించనున్నారు.

ఐదేళ్లలో కనీవినీ ఎరగని దోపిడీ
జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ కనీవినీ ఎరుగనది. గత ప్రభుత్వం తొలుత టన్ను ఇసుక రూ.375, తర్వాత రూ.475 చొప్పున విక్రయించింది. ఊరూపేరులేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి, వాటిపేరిట ‘ముఖ్య’నేతలే నేరుగా ఇసుక వ్యాపారంచేసి రూ.వేల కోట్లు పోగేసుకున్నారు. ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే రూ.10 వేలు, లారీ లోడు కావాలంటే రూ.25-30 వేలు వెచ్చించాల్సినంతలా ధరలు పెంచేశారు. దీంతో గత ఐదేళ్లూ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. నదుల్లో తవ్వకాలకు అనుమతులు లేకపోయినా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్‌జీటీ హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగించారు. దీనికి అప్పటి గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి సంపూర్ణ సహకారం అందించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా గనులశాఖ అధికారులను వాటి జోలికి వెళ్లనివ్వకుండా వెంకటరెడ్డి హుకుం జారీచేశారు. నేరుగా సీఎం కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఉండటంతో అన్ని శాఖల అధికారులూ మిన్నకుండిపోయారు.

Students: గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు

Students: గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. అయితే, బదిలీపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితోపాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్‌ 2012 జులై 13న చేరారు. అప్పుడు అక్కడ ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది.ఆయన ఈ నెల 1న ఇదే మండలంలో మూడు కి.మీ. దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టారున్న పాఠశాలలోనే చేరతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు.  దాంతో జూన్‌ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది.  ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.

రైతులకు CM చంద్రబాబు భారీ గుడ్ న్యూస్..

రైతులకు CM చంద్రబాబు భారీ గుడ్ న్యూస్..

రైతులకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ, జలవనరుల శాఖలపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక, సాగునీటి విడుదలపై రెండు శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని.. వ్యవస్థలు అన్నీ మళ్లీ గాడిన పడాలని సూచించారు.

ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే.. పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్ధిక సహయం అందిస్తోంది. ఈ విధానాన్నే మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని తాజాగా చంద్రబాబు అనౌన్స్ చేశారు. సీఎం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని భారత విద్యార్థుల.. ఇంటర్న్‌షిప్‌ కష్టాలకు చెక్‌!

ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించిన భారత రాయబార కార్యాలయం
న్యూయార్క్‌: ఇంటర్న్‌షిప్‌ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్‌ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది.

దీని ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలతోపాటు న్యాయ, వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించనున్నది.

అమెరికాలోని ఈశాన్య రాష్ర్టాలైన కనెక్టికట్‌, మైనె, మాసాచుసెట్స్‌, న్యూహ్యాంప్‌షైర్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, ఒహియో, పెన్సిల్వేనియా, రోడ్‌ ఐలండ్స్‌, వెర్మాంట్‌లలో ఈ సేవలు అందిస్తుంది. ఇంటర్న్‌షిప్‌ విషయంలో అర్హులైన భారతీయ విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు అనేక భారతీయ, అమెరికన్‌ కంపెనీలు, సంస్థలు అంగీకరించినట్టు భారత కాన్సులేట్‌ ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించింది.

విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీలు, బహుళజాతి సంస్థలు, టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫార్మా, టాటాసన్స్‌ సహా అనేక రంగాల్లోని కంపెనీలలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేసుకునే అవకాశాలకు సంబంధించిన జాబితాను పోర్టల్‌ సిద్ధం చేస్తుంది.

వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం? పార్టీ నేతలతో జగన్‌

అమరావతి: ‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు.

బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇబ్బందేమీ లేదు’ అని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయి’ అని ఇటీవల పార్టీ నేతలతో జగన్‌ అన్న మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. జగన్‌ స్పందిస్తూ..

‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా.. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.

క్షమించండి.. నెలలో తిరిగిస్తా …ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ

ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు.

ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. పోతుపోతూ లేఖ రాసి పెట్టాడు. మళ్లీ నెలరోజుల్లో తిరిగిచ్చేస్తానని అందులో రాయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పోలీసుల వివరాల మేరకు… జిల్లాలోని తిరుచ్చెందూర్‌ వద్ద మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్‌ విశ్రాంత ఉపాధ్యాయుడు. కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహమై వేరే ఊళ్లలో ఉంటున్నారు. ఆయన గతనెల 17న భార్యతో కలిసి చెన్నై వెళ్లాడు. అప్పుడు వారి ఇంటిని సెల్వి అనే మహిళ చూసుకునేది. ఆమె ఈనెల 1న ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా తాళాలు పగులగొట్టి కనిపించాయి. విషయం చిత్తిరై సెల్వన్‌కి తెలియజేయడంతో ఆయన వచ్చి చూసేసరికి బీరువాలోని రూ.60 వేల నగదు, ఒకటిన్నర సవర్ల బంగారు కమ్మలు, వెండి గొలుసులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా దొంగ రాసిన ఉత్తరం కనిపించింది. అందులో.. ‘నన్ను క్షమించండి. నేను నెలలో తిరిగిస్తాను. ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, అందుకే దొంగతనం చేశా’నని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అందులో రాసి ఉన్న ప్రకారం తిరిగిస్తాడా లేదా అన్నది తెలియాలంటే నెలరోజులు నిరీక్షించాల్సిందే. ఈ లేఖ స్థానికంగా కలకలం సృష్టించింది.

Flies In Home : ఇంట్లో ఈగల గోల ఎక్కువైందా..? ఈ టిప్స్‌ ఫాలో అయితే.. మళ్లీ చూద్దామన్నా కనిపించవు..

వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో ఈగల మోత మొదలవుతుంది. వంటగది, బాత్రూమ్, హాలు ప్రతిచోటా ఈగలే కనిపిస్తాయి. అవి ఆహారం మీద కూర్చుని చికాకు కలిగిస్తాయి.. ఈగలు వాలిన ఆహారాన్ని తినడం వల్ల కలరా, విరేచనాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఈగలను తరిమికొట్టేందుకు కొందరు మార్కెట్ లో లభించే కెమికల్ స్ప్రేలను వాడుతుంటారు. కానీ, గుర్తుంచుకోండి..మితిమీరిన కెమికల్ స్ప్రేని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. కాబట్టి, ఇంట్లో లభించే సహజసిద్ధమైన ఉత్పత్తులతో ఈగలు, దోమలను సులభంగా వదిలించుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు నీరు: స్ప్రే బాటిల్‌లో నీటిని నింపి దానికి రెండు టేబుల్‌స్పూన్ల ఉప్పు వేయండి. ఈగలు ఉన్న చోట ఈ ద్రవాన్ని పిచికారీ చేయండి. నేలను శుభ్రపరిచేటప్పుడు ఉప్పునీటితో నేలను తుడిచినా మంచి ఫలితాలు వస్తాయి.

కర్పూరం పొడి: హారతికి వాడే కర్పూరం బాల్స్ తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని నీళ్లతో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈగలు కనిపించే చోట పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఒక్క ఈగ కూడా కనిపించదు.. 2013లో ‘జర్నల్ ఆఫ్ ఎంటమాలజీ’లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈగలను తరిమికొట్టడంలో కర్పూరం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే కర్పూరం పొడి చల్లిన ప్రదేశంలో ఈగల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది. ఈ పరిశోధనలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన జువాలజీ ప్రొఫెసర్ కూడా పాల్గొన్నారు.

తులసి ఆకు పేస్ట్: కొన్ని తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను నీళ్లతో కలపండి. స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో రోజుకు రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఈగలు రావు.

దాల్చిన చెక్క పొడి: దాల్చిన చెక్క ఈగలను తరిమికొట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. ముందుగా కొన్ని దాల్చిన చెక్కలను తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ పొడిని కొద్దిగా చల్లండి. ఈగలు దాల్చిన చెక్కతో ఇంట్లోకి ప్రవేశించవు.

పాలు, మిరియాలు: ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నల్లమిరియాలు, 2 చెంచాల పంచదార వేసి బాగా కలపండి. ఒక చిన్న పాత్రలో ఉంచండి. ఈగలు ఉన్న చోట ఆ కంటైనర్‌ను ఉంచండి. అంతే ఆ కుండలో ఈగలు పడి చనిపోతాయి.

వెనిగర్: ఒక గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కాస్త యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. తర్వాత ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఈగలు ఎక్కువగా ఉండే చోట స్ప్రే చేయండి. రోజుకు రెండుసార్లు పిచికారీ చేయడం వల్ల ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

బిర్యానీ ఆకులు: ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. ఈ ఆకుల పొగ నుండి ఈగలు కూడా పారిపోతాయి.

Hair Care Tips: ఈ నూనె 3 నెలలు వాడితే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది..! ఎలా వాడాలంటే..

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో నూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. అయితే అన్ని నూనెలు అన్ని రకాల చర్మానికి ఉపయోగపడవు. చర్మ రకాన్ని బట్టి సరిపోయే నూనె వాడాలి. చర్మంపై ముడతల సమస్య వస్తే ప్రింరోజ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వినియోగించాలి..

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో నూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. అయితే అన్ని నూనెలు అన్ని రకాల చర్మానికి ఉపయోగపడవు. చర్మ రకాన్ని బట్టి సరిపోయే నూనె వాడాలి. చర్మంపై ముడతల సమస్య వస్తే ప్రింరోజ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వినియోగించాలి.

చర్మం చాలా గరుకుగా, పొడిగా ఉండే వారికి కొబ్బరి నూనె ఉత్తమం. చర్మంతోపాటు, జుట్టును మృదువుగా మార్చడంలో కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం లేదు.

మొటిమలతో సమస్యలు ఉంటే కామెల్లియా నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దురద లేదా చికాకు కలిగించే చర్మానికి చికిత్స చేయడానికి టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఏ విధమైన చర్మ సమ్యలను తొలగించడంలోనూ సహాయపడుతుంది.

లావెండర్ ఆయిల్ చర్మంపై మచ్చలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఎండలోకి వెళ్లిన తర్వాత టాన్ వస్తే.. ఈ నూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రోజ్మేరీ ఆయిల్ కఠినమైన జుట్టు, చుండ్రు నివారణకు బలేగా పనిచేస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌ను తలకు పట్టించే నూనెతో కలిపి రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జుట్టు పల్చబడటానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆముదం నూనె ఉపయోగించవచ్చు. దీనిని మూడు నెలలు వాడితే ప్రయోజనం మీరే చూస్తారు.

Panipuri: పానీపూరీ తింటే క్యాన్సర్ ఖాయం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం!

ఏం తినాలన్నా భయమేస్తోంది.. ఏది తిన్నా క్యాన్సర్ అంటున్నారు.. ఏ పదార్థం గురించి తనిఖీ చేసినా క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటున్నారు. ఈ కెమికల్స్‌, రసాయానాల సంగతి అటు ఉంచితే హోటల్‌, రెస్టారెంట్‌ నుంచి ఏం కొనాలన్నా చెమటలు పడుతున్నాయి.

ఎందుకంటే చికెన్ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే అందులో బొద్దింకలను కలిపి కీటకాల బిర్యానీ అందిస్తున్నారు. నల్లీ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే బల్లి బిర్యానీ ఇస్తున్నారు. సరే ఈ బిర్యానీలన్ని కాస్త ఖర్చుతో కూడుకున్నవి.. డబ్బులు ఉంటే కొనుకొవచ్చు లేదంటే లేదు.. అయితే పేద, మద్యతరగతి నుంచి ధనికులు వరకు ఎక్కువగా కుమ్మేసే పానీపూరీలను కూడా తినలేని దుస్థితి దాపరించడం దుర్మార్గం. సామాన్యులకు అత్యంత ఇష్టమైన పానీపూరీలోనూ క్యాన్సర్ కారకాలు ఉండడం బాధాకరం!

కర్ణాటకలోని పానీపూరీ షాప్‌లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పానీపూరీ శాంపిల్స్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. కర్ణాటకలో అమ్ముడవుతున్న పానీపూరీలు ఆరోగ్యానికి హానికరమైనవని ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. సేకరించిన 260 శాంపిల్స్‌లో 41 శాంపిల్స్‌లో ఆర్టిఫిషియల్‌ కలర్స్‌, క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 18 శాంపిల్స్ అయితే అసలు మనుషులు తినడానికి పనికిరావని తేలింది.

పానీపూరీ సాస్, స్వీట్ చిల్లీ పౌడర్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. చాలా శాంపిళ్లలో సన్ సెట్ యెల్లో , బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు గుర్తించారు. ఇక 19 శాంపిళ్లలో సింథటిక్ కలర్స్ ఉన్నాయి. దీంతో కర్ణాటక సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. పానీపూరీ తయారీలో ఆర్టిఫిషియల్‌ కలర్స్‌తో తయారు చేసే సాస్‌లు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది.

నిజానికి కర్ణాటకలో 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫుడ్‌ సేఫ్టిపై బాగా ఫోకస్ చేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న గోబీ మంచూరియన్‌ను ముందుగా బ్యాన్ చేసింది. ఆ తర్వాత కబాబ్‌లు, చికెన్, చేపలు, శాఖాహార వంటకాలతో సహా వివిధ ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులను ఉపయోగించడాన్ని నిషేధించింది.

తెలంగాణ ప్రభుత్వం సైతం ఇటీవల హోటల్స్, రెస్టారెంట్లపై వరుసగా దాడులు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఫుడ్ కలర్స్ వాడేవారిపై చర్యలు తీసుకుంటుంది. పరిశుభ్రత పాటించని వారిపై సైతం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సైతం ఇలాంటి పదార్థాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ సాగుతోంది.

Electricity Bill: కరెంట్ బిల్ కోసం మారిన రూల్స్.. ఆన్లైన్లో ఎలా కట్టాలో తెలుసుకోండి.!

Electricity Bill: ఇప్పటివరకు గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా పెమెంట్స్ చెల్లించే అవకాశం ఉండేది. అయితే, కొత్తగా RBI నిర్ధేశించిన రూల్స్ ప్రకారం, UPI ద్వారా నేరుగా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం ఉండదు.

అంటే, ఇక నుండి గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా మీ కరెంట్ బిల్లులు చెల్లించలేరు. దీనికి కొత్త మార్గదర్శకాలు మరియు మార్గాలు అందించింది. అయితే, ఆన్లైన్ లోనే చాలా ఈజీగా మీ కరెంట్ బిల్లు చెల్లించాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

ఆన్లైన్ లో Electricity Bill ఎలా కట్టాలి?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆన్లైన్ లో కరెంట్ బిల్లులు కట్టడానికి UPI యాప్స్ కు బదులుగా helpdesk ను ఉపయోగిస్తుంది. దీనికోసం, తెలంగాణ రాష్ట్ర కరెంట్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా అధికారిక సైట్ https://tgsouthernpower.org ద్వారా నేరుగా బిల్స్ ను పే చేయవచ్చు. ఈ సైట్ నుండి లేదా యాప్ నుంచి యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి కరెంట్ బిల్ ను పే చేయవచ్చు.

Electricity Billఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ వినియోగదారుల విషయానికి వస్తే, APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లు ను పే చేయవచ్చు. దీనికోసం, సైట్ లేదా యాప్ లో పే యువర్ బిల్ ఆప్షన్ ను ఎంచుకొని మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి బిల్ ను పే చెయ్యాలి. అయితే, వెబ్సైట్ నుండి పే చేయాలంటే Billdesk ఆప్షన్ ఎంచుకోండి మరియు ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయగానే మీ బిల్ వివరాలు వస్తాయి. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్ మరియు UPI యాప్ ద్వారా కూడా అమౌంట్ ను పే చేయవచ్చు.

 Electricity Billజూలై 1 వ తేదీ నుండి ఈ కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. కాబట్టి, ఇక నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ బిల్లు కట్టడానికి ఇదే పద్ధతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

 

 

 

ఉపాధ్యాయుల పై యాప్స్ భారం తగ్గించండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS )

ఉపాధ్యాయుల పై యాప్స్ భారం తగ్గించండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS )

విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు ఉపాధ్యాయుల పై యాప్ ల భారం ని తగ్గించండి అని ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా అధికారులు స్పందించి యాప్స్ భారం తగ్గించలేదని అన్ని యాప్స్ అలానే ఉన్నాయి అని ప్రతి రోజు ఏదో ఒక గూగుల్ ఫారం ఇవ్వడం దానిని సాయంత్రం లోగా పూర్తి చేసి పంపండి.. అతి జరుర్ అంటూ వాట్సప్ లలో రాష్ట్ర, జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు సందేశాలు పంపుతూ ఉన్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఒక ప్రకటన లో తెలిపింది.

విద్యా శాఖ చేపడుతున్న కార్యక్రమాలు లో కూడా గందరగోళం ఉందని బడికి పోతా, విద్యా ప్రవేశ్ అనే రెండు కార్యక్రమాలు ఒకే లక్ష్యం తో ఏర్పాటు చేసారని నెలల పాటు ఉన్నాయని ఇది బోధన పై ప్రభావం చూపుతుందని , టీచ్ టూల్ ప్రోగ్రాం పేరిట శిక్షణలు, పాఠశాల ల విజిట్స్ తో ఉపాధ్యాయులు బోధన కు దూరం అయ్యే పరిస్థితి ఉందని అలానే
ఆన్లైన్ వర్క్స్ ఉపాధ్యాయులకు లేకుండా చేయాలనీ, బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు యం. రజిని బాబు నాయుడు, ఆర్ధిక కార్యదర్శి పినాకపాణి ఒక ప్రకటన లో విద్యా శాఖ అధికారులను కోరారు.
TNUS -Telugu Nadu Upadhyaya Sangham- TNUS - TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS- #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu NTA AP - Noble Teachers Association - Nobel Trachers Association

 

  • Beta

Beta feature

LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

LK Advani Admitted In Apollo Hospital: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

మథుర రోడ్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో అద్వానీని ఎమర్జెన్సీకి తరలించారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్ యూరాలజీ విభాగంలో చేరారు. అద్వానీ పరిస్థితి మెరుగుపడడంతో, మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అద్వానీకి ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డు లభించింది. 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా, శక్తివంతమైన వక్తలలో అద్వానీ కూడా ఉన్నారు. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పని చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.

Pawan Kalyan: సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

పిఠాపురం: సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. మూడు నెలలపాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటానని తెలిపారు. వీలున్నప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‌కు కేటాయిస్తానని చెప్పారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘సినిమాలు చేసే టైమ్‌ ఉందంటారా..? కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే ‘నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా? క్యాజీ’ అంటే నేనేం సమాధానం చెప్పాలి. షూటింగ్‌ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానన్నా. ‘ఓజీ’ సినిమా బాగుంటుంది’’ అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తించారు.

ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల షూటింగ్‌ను పవన్‌ కల్యాణ్‌ పూర్తి చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్‌ వాయిదా పడింది. ఈ మూడు సినిమాల కోసం పవన్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్‌ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Children Food : ఇదొక్కటి పెడితే చాలు పిల్లలు బలంగా ఉంటారు..

Children Food: ఇదొక్కటి పెడితే చాలు పిల్లలు బలంగా ఉంటారు..

Children Food: పిల్లలకు పౌష్టిక ఆహారం అదించడం అంటే పెద్ద టాస్కే కదా. వీరికి మంచి ఆహారం అందించాలి. బయట తయరు చేసిన వాటిని పిల్లలకు పెట్టడం మంచిది కాదు.

ఎన్నో రకాల పదార్థాలు కల్తీ అవుతున్న ఈ కాలంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వీరికి పౌష్టికాహారం ఎలా అందించాలి అనుకుంటున్నారా? ఇప్పుడు మంచి పోషకాలు కలిగిన ఓ ఆహారం గురించి తెలుసుకుందాం. అదే ఉగ్గు.

ఉగ్గులో చాలా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని ఆరు నెలల పిల్లలకు మాత్రమే తినిపించాలి. బయట నుంచి తీసుకొని వచ్చే సెర్లాక్ లకు బదులు పిల్లలకు ఉగ్గు అందివవ్వడే ఉత్తమం అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ ఉగ్గు ద్వారా పిల్లలకు అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందించవచ్చు. దీన్ని బియ్యం, పప్పులతో తయారుచేస్తారు. మరి మీ పిల్లలకు దీన్ని పెట్టాలి అనుకుంటున్నారా?

ఉగ్గు తయారీకి కావలసిన పదార్థాలు:
బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బాదం, క్యాష్ నట్స్ . బియ్యం తీసుకున్న దానిలో పావు వంతు ఈ పప్పులు తీసుకోవాలి.

ఉగ్గు తయారీ విధానం :-
బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడికి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అలాగే పప్పులను కూడా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బియ్యని దొరగా వేయించాలి. వాటిని పక్కకి పెట్టి, పప్పులు కూడా కొంచెం నెయ్యి వేసి దొరగా వేయించుకోవాలి. వేడి చల్లారిన తరువాత వీటిని వేరువేరుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని జల్లడ పట్టాలి. అంతే ఉగ్గు పౌడర్ రెడీ అయినట్టే.

ఉగ్గు తయారు చేసే విధానం: ఒక గిన్నె లో టీ గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నీటిని బాగా మరగించాలి. మరొక గ్లాస్ లో టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ను కొన్ని వాటర్ లో కలిపి ఆ మరిగే నీటిలో పోసి బాగా కలపాలి. లేకపోతే ఉండలు కడుతాయి. మెత్తగా జారుడుగా అవ్వాలి. అప్పుడు ఉగ్గు తయారు అయినట్టూ. చల్లారిన తర్వాత తినిపిస్తే సరిపోతుంది. ఈ ఉగ్గు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారుచేసి పిల్లలకు పెట్టాలి.

Phone Charging: మొబైల్‌ ఛార్జింగ్‌లో 80:20 నియమం అంటే ఏమిటో మీకు తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో జీవితం కూడా స్మార్ట్‌గా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లపై ప్రజల్లో క్రేజ్ పెరుగుతోంది. అన్ని పనులు ఈ ఫోన్ ద్వారానే జరుగుతాయి.

ఫోన్‌లో పెరుగుతున్న బిజీ కారణంగా, దానిని ఛార్జ్ చేయడం చాలా ముఖ్యం. ఇది ఛార్జ్ చేయకపోతే మీ స్మార్ట్ ఫోన్ కేవలం బాక్స్‌గా మిగిలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఛార్జ్ చేయాలో చాలామందికి తెలియదా? మీరు ఫోన్ బ్యాటరీని సరిగ్గా ఛార్జ్ చేస్తే, అది బ్యాటరీ జీవితాన్ని పెంచుతుంది. దీని కోసం మీరు ఎల్లప్పుడూ 80-20 నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ బ్యాటరీ చాలా ముఖ్యమైనది. కాలక్రమేణా బ్యాటరీ చెడిపోవడం ప్రారంభిస్తే, ఫోన్ కూడా పాడైపోతుందని అర్థం. అందువల్ల, ఫోన్ ఛార్జింగ్ కోసం కొన్ని నియమాలను అనుసరించడం చాలా ముఖ్యం. తద్వారా ఫోన్ త్వరగా పాడైపోదు.

వాస్తవానికి ఫోన్ బ్యాటరీ 0 శాతానికి చేరుకున్నప్పుడు మాత్రమే ఛార్జ్ చేయాలని చాలా భావిస్తుంటారు. కానీ అది సరైంది కాదంటున్నారు టెక్‌ నిపుణులు. అదే సమయంలో అది 100 శాతం చేయాలనుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తే పొరపాటు చేస్తున్నట్లేనని అంటున్నారు. ఫోన్ బ్యాటరీని పూర్తిగా డిస్చార్జ్ చేయకూడదని లేదా పూర్తిగా ఛార్జ్ చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎప్పుడైనా సరే ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేటప్పుడు 20:80 నిష్పత్తిని గుర్తుంచుకోవాలంటున్నారు. దీని అర్థం బ్యాటరీ 20 శాతం వద్ద ఉన్నప్పుడు దానిని ఛార్జ్ చేయాలి. అలాగే ఛార్జింగ్‌ 80 శాతానికి రాగానే డిస్‌ఛార్జ్‌ చేయాలి. దీనినే 20:80 నిష్పత్తి అంటారు. కొంతమంది నిపుణులు బ్యాటరీని 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని చెబుతుంటారు. మీరు ఈ నియమాన్ని పాటిస్తే మీ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

ఫోన్‌ను ఛార్జ్‌లో పెట్టి ఉపయోగించడం ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు. ఇది అస్సలు చేయకూడదు. ఫోన్ ప్రాసెసర్‌పై ఒత్తిడి పెంచడమే దీనికి కారణం. ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, మీరు కంపెనీ నుండి అందుకున్న ఛార్జర్‌ని ఉపయోగించండి. ఇది కాకుండా, మీ ఛార్జర్ దెబ్బతిన్నట్లయితే, మీరు కంపెనీ ఛార్జర్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. కంపెనీ ఛార్జర్‌ కాకుండా ఇతర ఛార్జర్లను వాడినట్లయితే ఫోన్‌ త్వరగా పాడైపోయే అవకాశం ఉందంటున్నారు.

Health

సినిమా