Saturday, November 16, 2024

Diwali celebrations: శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు, బాణసంచా పేలుళ్లతో యావత్‌ దేశం ఘనంగా దీపావళి (Diwali celebrations) చేసుకుంటోంది. చీకటిని పారదోలి వెలుగులు నింపే ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఊరు మాత్రం ఈ పర్వదినానికి దూరంగా ఉంది. గతంలో సతీసహగమనానికి గురైన ఓ మహిళ శాపం కారణంగా దీపావళిని జరుపుకోకూడదనే ఆచారాన్ని కొనసాగిస్తోంది.

స్థానిక కథనాల ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండగ కోసం పుట్టింటికి బయలుదేరింది. ఆలోపు రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆమె ఈ వార్తతో షాక్‌కు గురయ్యింది. ఆ బాధను భరించలేక.. భర్త చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళి చేసుకోవద్దని శాపం పెట్టిందట. దాంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడం లేదు.

ఒకవేళ దీపావళి చేసుకుంటే ఏదో అపశకునం జరుగుతుందనే భయం ఊరి ప్రజల్లో నెలకొంది. ఆ గ్రామానికి చెందిన వారు ఇతర ప్రదేశాల్లో ఉన్నా.. పండగ చేసుకోరు. కనీసం ప్రత్యేక వంటలు కూడా చేయరు. ఓ కుటుంబం ప్రయత్నించగా.. వారి ఇల్లు అగ్నికి ఆహుతయ్యిందట. శాపం నుంచి బయటపడేందుకు గ్రామస్థులు అనేక పూజలు, యజ్ఞాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఊరు మొత్తం దీపావళి దూరంగా ఉంటోంది. కానీ, ఇక్కడి యువత మాత్రం ఏదో ఒకరోజు దీపావళిని చేసుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

70 ఏళ్లుగా ఆ ఊరంతా దీపావళికి దూరం

రావికమతం, న్యూస్‌టుడే: హిమాచల్‌ ప్రదేశ్‌లోనే కాదు, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని ఓ గ్రామం ఏడు దశాబ్దాలుగా దీపావళికి దూరంగా ఉంటోంది. ఎందుకని ఆరా తీస్తే గ్రామస్థులు పలు విషయాలు వెల్లడించారు. కిత్తంపేట.. రావికమతం మండలం జడ్‌.బెన్నవరం పంచాయతీలో ఉందీ గ్రామం. 450 ఇళ్లు.. 1500 జనాభా. శివారు గ్రామమైనా.. జనాభాపరంగా జడ్‌.బెన్నవరం కంటే పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ ఊరి వారే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఊరి వారంతా దీపావళి పండగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ‘మా చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ టపాసులు కాల్చలేద’ని జాజిమొగ్గల మాణిక్యం, ముచ్చకర్ల నూకునాయుడు, జంపా ఈశ్వరరావు పేర్కొన్నారు.

‘గతంలో అందరిలాగే మా ఊర్లోనూ దీపావళి పండగను ఘనంగా జరుపుకొనే వారం. 70 ఏళ్ల కిందట ఊరంతా పాకలే. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇంటి ఆవరణలోనే ఉండేవి. దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ కాలిపోయాయి. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అప్పట్నుంచి అన్నీ అపశకునాలే. ఎన్నడూ లేనివిధంగా దీపావళి సమయంలోనే మరణాలు ఎక్కువగా సంభవించేవి. దివ్వెల పండగ అచ్చిరాలేదు. కీడు జరుగుతోందని నాటి పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం, దివ్వెలు కొట్టడం మానేశారు. ఎవరూ పండగ చేసుకోవద్దని నిర్ణయించారు. అదే ఆనవాయితీగా వస్తోంది. నాగులచవితి రోజున పుట్టలో పాలు పోసి టపాసులు కాలుస్తా’మని మాజీ సర్పంచి కర్రి అర్జున పేర్కొన్నారు.

డిబిటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు 3.36 లక్షల కోట్లు ఆదా : నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా వివిధ పథకాల లబ్ధిదారులకు రూ.38 లక్షల కోట్లను బదిలీ చేసింది. ప్రభుత్వ ఖజానాకు 3.36 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

దీని నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 10% డబ్బు ఆదా అయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మాట్లాడుతూ.. మధ్యవర్తుల అవసరం లేకుండా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బు బదిలీ చేయబడుతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 40 బిలియన్ డాలర్లు (రూ. 3.36 లక్షల కోట్లు) ఆదా అయ్యాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ”డబ్బు వృథాను అరికట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్న ఆర్థిక మంత్రిగా పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా సక్రమంగా ఖర్చు అయ్యేలా చూడాలి. మనీ వృథాని అరికట్టడమే అతిపెద్ద సవాల్ అని నిర్మల అన్నారు.

డిజిటల్ టెక్నాలజీ రక్షణ

“భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీని అవలంబించడం వల్ల డబ్బు వృథా తగ్గిందని.. మోసపూరిత లావాదేవీలు మరియు నకిలీ ఖాతాదారులను తొలగించడం సులభతరం అయిందన్నారు. సబ్సిడీ, పెన్షన్, స్కాలర్‌షిప్‌తో సహా అనేక పథకాల లబ్ధిదారులకు DBT ద్వారా నిధులు చెల్లిస్తారు. పీఎం కిసాన్ యోజన కింద 11 కోట్ల మంది రైతులకు 3.04 లక్షల కోట్లు. నగదు బదిలీ చేయబడింది. మా ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు మరియు వాటి పరిధిలోని శాఖలు డిబిటి పరిధిలోకి వచ్చాయి” అని ఆర్థిక మంత్రి వివరించారు.

”వివిధ పథకాల లబ్ధిదారులకే కాదు, కేంద్రం, రాష్ట్రాల మధ్య లావాదేవీలు కూడా డిజిటల్‌గా జరుగుతాయి. రాష్ట్రాలకు చెందిన వివిధ పథకాలకు కేంద్ర వాటాను అందించడానికి ఒకే మోడల్ ఖాతా వ్యవస్థ ఉంది. దీని ద్వారా రాష్ట్రాలకు నగదు బదిలీ అవుతుంది” అని చెప్పారు.

చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో.

సంక్రాంతికి కొన్ని ల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి.. కొన్ని వస్తున్నాయి.. కొన్ని పోతున్నాయి కానీ ఒక్క హీరో మాత్రం నేను పక్కా అంటున్నాడు.. పైగా అది చిన్న .
అయినా కూడా నో ఇష్యూ.. నేను రంగంలోకి దిగుతా అంటున్నాడు ఆ హీరో. మరి 2025 పండక్కి స్టార్ హీరోల మధ్య రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు..?

సంక్రాంతికి కొన్ని ల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి.. కొన్ని వస్తున్నాయి.. కొన్ని పోతున్నాయి కానీ ఒక్క హీరో మాత్రం నేను పక్కా అంటున్నాడు.. పైగా అది చిన్న . అయినా కూడా నో ఇష్యూ.. నేను రంగంలోకి దిగుతా అంటున్నాడు ఆ హీరో. మరి 2025 పండక్కి స్టార్ హీరోల మధ్య రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు..?

సంక్రాంతి అంటేనే పండగ. ఆ సీజన్‌లో ఒకేసారి మూడు నాలుగు లు కూడా వస్తుంటాయి. 2025లోనూ ఇదే జరగబోతుంది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకుంది చిరంజీవి విశ్వంభర. గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. దాంతో జనవరి 10న గేమ్ ఛేంజర్ రాబోతుంది. మే 9న విశ్వంభర విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి సైతం సంక్రాంతి పండక్కి రానుంది. వెంకీ, అనిల్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. గేమ్ ఛేంజర్‌తో పాటు ఈ ను కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు. మరోవైపు NBK 109 కూడా సంక్రాంతికే రానుంది. ఈ ముగ్గురు సీనియర్ హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సంక్రాంతికి వస్తున్న ఆ చిన్న హీరో ఎవరో కాదు.. సందీప్ కిషన్. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న తో ఈయన పొంగల్ బరిలో దిగుతున్నారు. సంక్రాంతికి ఎప్పుడూ చిన్న లకు ఎడ్జ్ ఉంటుంది. శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సంక్రాంతికే భారీ ల మధ్యలో వచ్చి విజయం సాధించాయి.

2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి ల మధ్య దుమ్ము దులిపేసింది ఎఫ్ 2. 2024లోనూ హనుమాన్ ఇలాగే రప్ఫాడించింది. మరి ఈసారి కూడా వెంకీ, రామ్ చరణ్, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక.

FD చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ప్రభుత్వ బ్యాంక్

మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆ బ్యాంక్ ప్రకటించింది. అలాగే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద స్పెషల్ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ఈ బ్యాంక్ లాంఛ్ చేసింది. 2024, అక్టోబర్ 21 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. వడ్డీ రేట్లపై మార్పులు చేసింది.. ఇక పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో ఇప్పుడు వడ్డీ రేట్లు.. కాలెబుల్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.45 శాతం దాకా ఉన్నాయి. నాన్ కాలెబుల్ డిపాజిట్లపై 555 రోజుల టెన్యూర్‌పై 7.50 శాతం వడ్డీని ఇవ్వనుంది ఈ బ్యాంక్. ఇక్కడ కాలెబుల్ డిపాజిట్లు అంటే.. మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉండే డిపాజిట్లు. ఇక నాన్ కాలెబుల్ డిపాజిట్లు అంటే.. మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు ఉండని డిపాజిట్లు.

సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు ఎక్స్ ట్రాగా మరో 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ వస్తుంది. రూ. 3 కోట్ల కంటే తక్కువ చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఇది అప్లై అవుతుంది. వీరికి కాలెబుల్ డిపాజిట్లపై మినిమమ్ 4 శాతం నుంచి మాక్సిమం 7.95 శాతం దాకా వడ్డీ వస్తుంది. ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు నాన్ కాలెబుల్ డిపాజిట్ లో 555 రోజుల టెన్యూర్ పై ఏకంగా 8 శాతం అందస్తోంది బ్యాంక్. సూపర్ సీనియర్ సిటిజెన్లకు అయితే బ్యాంక్ ఇంకా ఎక్కువ వడ్డీనే ఆఫర్ చేస్తోంది. వీరికి సీనియర్ సిటిజెన్ల కంటే మరో 0.15 శాతం వడ్డీ ఎక్కువగా ఇస్తుంది బ్యాంక్. 222 రోజులు, 333 రోజులు, 444 రోజులు, 555 రోజులు, 777 రోజులు, 999 రోజులు ఇలా స్పెషల్ డిపాజిట్లపై వడ్డీ వీరికి ఎక్కువగా ఉంటుంది.

ఇక 555 రోజుల నాన్ కాలెబుల్ డిపాజిట్‌పై వీరికి 8.15 శాతం వడ్డీ రేటు ఉంటుంది. కాలెబుల్ డిపాజిట్లపై అయితే 8.10 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు 2024, డిసెంబర్ 31 దాకా ఛాన్స్ ఉంది. ఒకవేళ 555 రోజుల డిపాజిట్‌పై రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. సాధారణ ప్రజలకు 7.50 శాతం వడ్డీ రేటు లెక్కన రూ. 57,209 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 8 శాతం లెక్కన 5 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ టైమ్ కి చేతికి రూ. 61,020 వడ్డీ వస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజెన్లకు అయితే 8.15 శాతం లెక్కన రూ. 62,166 వడ్డీ వడ్డీ వస్తుంది.

పరీక్ష రాయకుండానే సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్.. నెలకు 1,60,000 జీతం

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. నిరుద్యోగులకు జాబ్ కొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్. జాబ్ లేదని వర్రీ అవుతున్న వారు సీరియస్ గా ట్రై చేస్తే.. జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. రైల్వే, త్రివిద దళాలు, విద్యుత్ సంస్థల్లో వందల్లో పోస్టులు భర్తీ అవుతున్నాయి. గవర్నమెంట్ జాబ్ సాధించడం కష్టంతో కూడుకున్న పని. పోటీపరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా జాబ్ వరించదు. రాత పరీక్ష, ఇంటర్య్వూలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని స్టెప్స్ దాటితేనే ఉద్యోగం సొంతమవుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఎలాంటి పరీక్ష రాయకుండానే సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. కోల్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎల్‌ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో మైనింగ్- 263, సివిల్- 91, ఎలక్ట్రికల్- 102, మెకానికల్- 104, సిస్టమ్- 41, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్- 39 ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 అర్హత సాధించి ఉండాలి.

వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఈ పోస్టులకు గేట్-2024 స్కోర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష 60 వేల వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్‌ 28వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.coalindia.in వెబ్‌సైట్‌ ను సందర్శించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్లీ రాదు. వెంటనే అప్లై చేసుకోండి.

నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే

మరికొన్ని రోజుల్లో నవంబర్ నెల ఆరంభానికి సమయం దగ్గరపడింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో లాంగ్ వీకెండ్‌లు, రాబోయే సెలవుల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అలాంటి వారికి ఈ వార్త తప్పనిసరి..నవంబర్‌ నెలలో సాధారణ వారాంతాలు సహా మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో బ్యాంక్ సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది.

ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ఇకపోతే, ముందుగా దీపావళి సందర్భంగా మన దేశంలో ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వరుసగా 3 రోజులు బంద్‌ ఉండనున్నాయి. నవంబర్ 1న దీపావళి అమావాస్య చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే ప్రకటించాయి. త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్ 2 తేదీన దీపావళి పండగను పురస్కరించుకుని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి. నవంబర్ 3న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, కొన్ని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థలు కూడా బంద్‌ ఉంటాయి. నవంబర్ 7, 8 వ తేదీన ఛత్ పూజ సందర్బంగా అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 8 వంగల పండుగ సందర్భంగా మేఘాలయల్లో బ్యాంకు కార్యకలాపాలకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 9న రెండవ శనివారం దేశవ్యాప్తంగా బంద్.. బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించారు. పొరపాటున మర్చిపోయి వెళ్లినా కూడా గేట్లకు తాళాలు దర్శనమివ్వటం ఖాయం.

కాలుష్యాన్ని నివారించడానికి సర్జికల్ మాస్క్ ధరిస్తున్నారా? ఏ మాస్క్ మంచిదో తెలుసా?

ఉదయం పూట నడవడం లేదా వ్యాయామం చేయడం బయట కాకుండా ఇంట్లోనే చేయాలని డాక్టర్ కుమార్ చెప్పారు. కాలుష్యాన్ని పెంచే పనులేవీ చేయకుండా ప్రయత్నించండి. మీరు ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు..

దేశంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్యం స్థాయి పెరిగింది. రాజధాని ఢిల్లీలో AQI స్థాయి పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం అనేక రకాల శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. ఇప్పటికే సీఓపీడీ, ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, ఈ కాలుష్యం కారణంగా వారి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా మాస్క్‌లు ధరిస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు సర్జికల్ మాస్క్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కాలుష్యం నుండి రక్షించడంలో ఈ ముసుగు ప్రయోజనకరంగా ఉందా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. కాలుష్యం ఎక్కువగా ఉంటే మాస్క్ ధరించడం మంచిదని, అయితే సర్జికల్ మాస్క్‌కు బదులుగా ఎన్-95 మాస్క్ ధరించడానికి ప్రయత్నించండి. సర్జికల్ మాస్క్ ముక్కు, నోటిని పూర్తిగా కవర్ చేయకపోవడమే దీనికి కారణం. దీని కారణంగా శ్వాస ద్వారా చిన్న చిన్న ధూళి కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. కానీ N-95 మాస్క్‌లలో ఇది జరిగే అవకాశం తక్కువ. అటువంటి పరిస్థితిలో N-95 మాస్క్ ధరించడానికి ప్రయత్నించండి. ఈ మాస్క్ అన్ని వైపుల నుండి కవర్ చేస్తుంది. అలాగే దానిలోని ఫిల్టర్ ద్వారా దుమ్ము కణాలను శుభ్రపరుస్తుంది. దీని వల్ల మురికి కణాలు శరీరంలోకి చేరవు. N-95 మాస్క్ దుమ్ము చిన్న కణాల నుండి కూడా రక్షణను అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో సర్జికల్ మాస్క్ కంటే ఇది ఉత్తమం. ఈ మాస్క్ ముక్కు, నోటిని బాగా కవర్ చేస్తుంది. ఇది కాలుష్యాన్ని నివారిస్తుంది.

N-95 మాస్క్ ధరించడం వల్ల ప్రయోజనం ఏమిటి?
ఢిల్లీలోని ఆర్‌ఎమ్‌ఎల్ హాస్పిటల్‌లోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అభినవ్ కుమార్, సర్జికల్ మాస్క్‌ల కంటే 95% కంటే ఎక్కువ వాయు కాలుష్యాన్ని నిరోధించే ప్రత్యేక ఫిల్టర్‌లు ఉన్నాయి సర్జికల్ మాస్క్‌లో ఫిల్టర్ లేదు. మీ చుట్టూ N-95 మాస్క్‌లు అందుబాటులో లేకుంటే, దానిని చాలా రోజుల పాటు ఉపయోగించకండి. ఇది చాలా ఖరీదైనది కాదు కాబట్టి మీరు కొత్త ముసుగును సులభంగా కొనుగోలు చేయవచ్చు .

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఉదయం పూట నడవడం లేదా వ్యాయామం చేయడం బయట కాకుండా ఇంట్లోనే చేయాలని డాక్టర్ కుమార్ చెప్పారు. కాలుష్యాన్ని పెంచే పనులేవీ చేయకుండా ప్రయత్నించండి. మీరు ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు. కాలుష్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దు. ఎక్కడైనా దుమ్ము, పొగ లేదా బురద ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్లకుండా ఉండండి.

డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్

ఢిల్లీ, ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చలికాలం సమీపించేకొద్దీ, అనేక రాష్ట్రాల్లో దీపావళి పటాసులు కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కాలుష్యం వల్ల వృద్ధులతో పాటు చిన్న పిల్లలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.

కాలుష్యం కారణంగా డ్రై ఐ సిండ్రోమ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డ్రై ఐ సిండ్రోమ్ ఒకప్పుడు పిల్లల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇది యువత, వృద్ధులలో కూడా కనిపిస్తోంది. స్క్రీన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం, ఇండోర్ ఎయిర్ కండిషన్‌లో ఎక్కువ కాలం ఉండటం వంటి కారణాలు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. కళ్లు పొడిబారడంతోపాటు కళ్లల్లో తగినంతగా కన్నీళ్లు పుట్టకపోవడాన్నే డ్రై ఐ సిండ్రోమ్‌ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా, కళ్ళు ఎర్రబడటం, కళ్ళు మండడం, కళ్ళు మసకబారడం వంటివి సంభవిస్తాయి. ఎక్కువగా స్క్రీన్‌లను చూడటం దీనికి కారణమని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, చెడు గాలి కూడా దీనికి కారణమవుతున్నాయి. దీంతో పాటు ఎప్పుడూ ఎయిర్‌ కండిషన్‌తో మూసి ఉన్న గదుల్లో ఉండడం కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో ఎక్కువసేపు ఉండడం వల్ల కళ్లు పొడిబారడంతోపాటు తేమ ఆరిపోతుంది. ప్రజలలో డ్రై ఐ సిండ్రోమ్ పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు.

దీపావళి టపాసులతో వచ్చే పొగ అంత ప్రమాదమా..? నిపుణులు మాట ఇదే

పటాకుల నుండి దూరంగా ఉండండి. పటాకుల నుండి విడుదలయ్యే పొగ, రసాయనాలు ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులను మరింత తీవ్రం చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు.

దీపావళి సమయంలో వాయు కాలుష్యం కారణంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధుల రోగులకు వాయు కాలుష్యం పెద్ద సమస్య. కాలుష్యం కారణంగా, గాలిలో ఉండే హానికరమైన కణాలు, వాయువులు శ్వాసకోశాన్ని దెబ్బతీస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఈ రోగులకు కాలుష్యం నుండి రక్షణ చాలా ముఖ్యం. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల గాలిలో కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి ఈ పండుగ సమయంలో ఆస్తమా లేదా మరేదైనా శ్వాసకోశ వ్యాధితో బాధపడే రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

దీపావళి టపాసులతో వచ్చే పొగతో డేంజర్ అంటున్నారు వైద్యులు. టపాసుల పొగలో సల్ఫర్, నైట్రెయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రసాయనాల వల్ల ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం అని పలమనాలజిస్ట్ తపస్వి తెలిపారు. ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చే సమయం లో మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఆస్తమా రోగులకు కాలుష్యం మరింత తీవ్రతరం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఊపిరితిత్తుల పనితీరు క్షీణించడం, కాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయంటున్నారు వైద్యులు. వ్యాధి సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. కాలుష్యం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు.

పటాకుల నుండి దూరంగా ఉండండి. పటాకుల నుండి విడుదలయ్యే పొగ, రసాయనాలు ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులను మరింత తీవ్రం చేస్తాయి. అందువల్ల, పటాకులు పేలుతున్న లేదా విపరీతమైన పొగ వచ్చే ప్రదేశాలకు దూరంగా ఉండండి. దీపావళిని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో జరుపుకోవడానికి ప్రయత్నించండి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లకండి. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. బయటకు వెళ్లే ముందు N95 మాస్క్ ధరించండి. ఇది బయటి దుమ్ము, పొగను ఫిల్టర్ చేస్తుంది. కాలుష్యం వల్ల మీకు తక్కువ హాని కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా సమస్య ఉంటే, ఇన్హేలర్‌ను మీతో ఉంచుకోవడం ఆ పరిస్థితిలో సహాయపడుతుంది. అలాగే హైడ్రేటెడ్ గా ఉండండి – పుష్కలంగా నీరు త్రాగండి. నీరు శ్వాసకోశాన్ని తేమగా ఉంచుతుంది. తద్వారా శ్లేష్మ పొర చాలా మందంగా మారదు. ఇది దుమ్ము, పొగ కారణంగా తక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది.

కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి గొప్ప హాని కలిగిస్తుంది. కాబట్టి టపాసులు కాల్చే సమయంలో బయటకు వెళ్లడం మానుకోండి. ఇంటి లోపల తేలికపాటి వ్యాయామం చేయండి. ఇంటి గాలిని శుద్ధి చేయండి. ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి. సాయంత్రం, ఉదయం కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. ఇంటి లోపల ఇండోర్ మొక్కలు నాటండి. ఇది మీ ఇంటి లోపల తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫైబర్‌ ఫుడ్‌తో మతిమరపు కూడా దూరం.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం జీర్ణ సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా.. మెదడు ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి..

తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవ్వాలంటే కచ్చితంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండాలని అంటుంటారు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పీచు పదార్థం ఉండాలని సూచిస్తుంటారు.

బరురు తగ్గాలనుకునే వారు కూడా ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలని అంటారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గడంలో కూడా ఫైబర్‌ కంటెంట్‌ ఉపయోగపడుతుంది. అయితే ఫైబర్‌ ఫుడ్‌తో కేవలం ఇవే కాకుండా మరో లాభం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. మతిమరుపు సమస్యను కూడా దూరం చేయడంలో ఫైబర్‌ ఫుడ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో భాగంగా 40-60 ఏళ్ల వయసువారి ఆహార అలవాట్లను పరిశీలించారు. ఏకంగా 16 ఏళ్లపాటు ఆహార సర్వేను నిర్వహించారు. వీరిలో ఎవరెవరు డిమెన్షియా బారినపడ్డారో గుర్తించి వారు తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్‌ కంటెంట్‌ గురించి ఆరా తీశారు. ఆహారంలో ఎక్కువ పీచు తీసుకున్నవారికి డిమెన్షియా తక్కువ ముప్పు ఉంటున్నట్టు కనుగొన్నారు.

రోజులో సగటున 20 గ్రాముల పీచు తీసుకున్న వారికి డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే 8 గ్రాములే తీసుకున్న వారికి ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. బరువు, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఆలోచన శక్తిని సన్నగిల్లజేసే వ్యాస్కులర్‌ డిమెన్షియా బారినపడకుండా కాపాడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.

ఇక ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. మెదడు-పేగుల అనుసంధానం ద్వారా మెదడులో వాపుప్రక్రియను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి పరోక్షంగా ఫైబర్‌ ఫుడ్‌ జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

హనుమాన్ పాత్రలో ఆ స్టార్ హీరో.. కొత్త పోస్టర్ అదిరిపోయింది

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు దీపావళి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. చిన్నా, పెద్ద ఈ చిత్రానికి అడిక్ట్ అయిపోయారు. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటీ ? అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ మూవీని తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించడంతో సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట వైరలయ్యింది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదల చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా రానున్న జై హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రను స్టార్ హీరో పోషిస్తారని వర్మ చెప్పిన క్షణం నుంచి అడియన్స్ మదిలో ఎన్నో అంచనాలు పెరిగాయి. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు హనుమాన్ పాత్రపై క్లారిటీ ఇచ్చింది.

శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ మూవీ సీక్వెల్ లో కీలకాంశం. ఇక ఇందులోనూ తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే. ఈ చిత్రంతోపాటు అధీర, మహాకాళి చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నారు.

లడాయి లడఖ్‌లో సాధారణ పరిస్థితులు.. దీపావళికి స్వీట్లు తినిపించుకున్న చైనా-భారత సైన్యం

తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది.

సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే దిశలో భారత్‌-చైనా ముందడుగు వేశాయి. LAC దగ్గర గస్తీపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లో ఇప్పుడు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 30) ఇరు సేనల నుంచి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఆర్మీ నుండి అందిన సమాచారం ప్రకారం, భారత్ – చైనా మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం తర్వాత ఇది ప్రారంభమైంది.

తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఈ పాయింట్ల వద్ద సైన్యం పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఇరుపక్షాల మధ్య మిఠాయిలు పంచుకోనున్నట్లు సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

సైన్యం ఉపసంహరణ తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. రెండు సైన్యాల గ్రౌండ్ కమాండర్ల మధ్య పెట్రోలింగ్ విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదు. చర్చల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్థానిక కమాండర్ స్థాయిలో చర్చలు ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. మొదట దౌత్య స్థాయిలో ఇరుపక్షాలు సంతకం చేశాయి. తరువాత చైనా – భారత్ సైనిక అధికారుల మధ్య సైనిక స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. గత వారం కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రెండు దేశాల ఒప్పందం ప్రత్యేకతలు ఖరారు చేశారు.

ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఉపసంహరణ ప్రక్రియను ఇరువర్గాలు ప్రారంభించాయి. భారత సైనికులు తమ పరికరాలను తిరిగి తీసుకురావడం ప్రారంభించారు. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)పై ఒప్పందం తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పెట్రోలింగ్, బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ ఒప్పందం తర్వాత, ప్రతిష్టంభనను ముగించడంలో పెద్ద విజయం సాధించాయి.

2020 జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా – భారతదేశ సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గాల్వన్‌లో ఇరుపక్షాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలు ఇటీవలి కాలంలో అత్యంత తీవ్రమైనవి. ఆర్మీ అధికారి ప్రకారం, రెండు దేశాల సైన్యాల మధ్య ప్రాంతాల పరిస్థితి, పెట్రోలింగ్ ఏప్రిల్ 2025 లోపు సాధారణ పరిస్థితికి తిరిగి వస్తుందని భావిస్తున్నారు.

టీడీపీ సభలలో నవ్వులు పూయించే నర్సిరెడ్డికి టీటీడీ బోర్డులో చోటు.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. ఏపీలో టీడీపీ-జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగు నెలల తర్వాత చైర్మన్‌తో సహా 24 మంది సభ్యులతో టీటీడీ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసింది.

టీటీడీ కొత్త చైర్మన్‌గా చిత్తూరు జిల్లాకు చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు) నియమించింది. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం కల్పించారు. అందులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి పేరు కూడా ఉంది. అయితే నర్సిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో అవకాశం కల్పించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పార్టీ కోసం నిస్వార్దంగా పనిచేసిన నర్సిరెడ్డికి మంచి అవకాశం కల్పించారని వారు పేర్కొంటున్నారు.

అయితే టీడీపీ సభలలో తన డైలాగ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే నన్నూరి నర్సిరెడ్డి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించేవారిలో నన్నూరి నర్సిరెడ్డి ఒకరు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఒక్కొక్కరికి దూరం అయినప్పటికీ.. నర్సిరెడ్డి వంటి నేతలు పార్టీని నమ్ముకుని ఉన్నారు. మంచి వక్త కూడా అయిన నర్సిరెడ్డి అప్పటి అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తన వాయిస్‌ను బలంగా వినిపించేవారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో మంచి గుర్తింపు సొంతం చేసుకన్నారు.

అయితే ఏపీలో కూడా నర్సిరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సభలలో పాల్గొనే నర్సిరెడ్డి ప్రత్యర్థి పార్టీలపై తనదైన సెటైర్లు వేసేవారు. ముఖ్యంగా కేసీఆర్, వైఎస్ జగన్‌లను లక్ష్యంగా చేసుకుని నర్సిరెడ్డి చెప్పే కథలు టీడీపీ క్యాడర్‌లో మంచి జోష్ నింపేవి. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాలలో కూడా నర్సిరెడ్డి ప్రసంగాలకు టీడీపీ క్యాడర్ నుంచి విశేషమైన స్పందన వచ్చేది. పలు సందర్భాల్లో నర్సిరెడ్డి తన స్పీచ్‌తో టీడీపీ శ్రేణుల్లో కాకుండా.. చంద్రబాబు ముఖంలో కూడా నవ్వులు పూయించారు.

అయితే తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న నర్సిరెడ్డిని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ దిశలో అడుగులు పడలేదు. అయితే చివరకు చంద్రబాబు మాత్రం..టీడీపీకి విధేయుడుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డులో సభ్యునిగా అవకాశం కల్పించడం ద్వారా పార్టీ కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించారని అంటున్నారు. ఈ క్రమంలోనే నర్సిరెడ్డి శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్‌ సీఈవో ప్రకటన

గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్‌ కాల్ సందర్భంగా ఆయన గూగుల్‌ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

దీని వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కోడర్‌లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్‌లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్‌లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.

నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..
ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్‌లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగానికి గూగుల్‌ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.

“గూగుల్‌ కొత్త కోడ్‌లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది” అని గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్‌ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్‌ పిచాయ్ చెప్పారు.

టీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..

24 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రభుత్వం.. మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే..

సాంబశివరావు (జాస్తి శివ)

శ్రీసదాశివరావు నన్నపనేని

ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)

పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

బురగపు ఆనందసాయి

సుచిత్ర ఎల్లా

నరేశ్‌కుమార్‌

డా.అదిత్‌ దేశాయ్‌

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

కృష్ణమూర్తి

కోటేశ్వరరావు

దర్శన్‌. ఆర్‌.ఎన్‌

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

శాంతారామ్‌

పి.రామ్మూర్తి

జానకీ దేవి తమ్మిశెట్టి

బూంగునూరు మహేందర్‌ రెడ్డి

అనుగోలు రంగశ్రీ

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమను నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కొత్త సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిచండం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జ్యోతుల నెహ్రు. టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామన్నారు.

యూఎస్ ఎన్నికలు 2024: ట్రంప్, హారిస్‌లలో ఎవరిది ముందంజ? సర్వేలు ఏం చెబుతున్నాయి?

అమెరికాకు కాబోయే అధ్యక్షుడి కోసం ఆ దేశ ఓటర్లు నవంబర్ 5న ఓటింగ్‌లో పాల్గొంటారు. మొదట్లో ఈ ఎన్నికలు 2020 నాటి పోటీని పునరావృతం చేస్తాయని అనుకున్నారు.
కానీ, జూలైలో అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్ధిగా బలపరచడంతో కథ మారిపోయింది. అమెరికా తన తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటుందా ? లేదా రెండోసారి ట్రంప్‌కు అవకాశమిస్తుందా ? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. ఎన్నికల రోజు సమీపిస్తున్న వేళ సర్వేల అంచనాలు, వైట్‌హౌస్ రేసుపై ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

జాతీయ సర్వేల్లో ఎవరు ముందున్నారు..?

జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేసులో హారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పై చేయిగా ఉంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4 శాతం పాయింట్ల ఆధిక్యతను సాధించారు. సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య ఏకైక డిబేట్‌ జరిగినప్పటికీ, ఈ నంబర్లు సెప్టెంబర్ నెలాఖరుకు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఆ డిబేట్‌ను 7 కోట్ల మంది వీక్షించారు. అయితే, గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతోంది. కింద ఉన్న పోల్ ట్రాకర్ చార్ట్ ను పరిశీలిస్తే ట్రెండ్ లైన్లు సగటును సూచిస్తే, డాట్స్ (చుక్కలు) ప్రతి అభ్యర్థి వ్యక్తిగత సర్వే ఫలితాలను చూపిస్తున్నాయి.

ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందారో తెలుసుకోవడానికి ఈ జాతీయ సర్వేలు ఒక గైడ్‌లా ఉపయోగపడతాయి. అంతేకానీ, ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికం కాదు. ఎందుకంటే, ఎన్నికలలో అమెరికా ఎలక్టోరల్ కాలేజ్‌ అనే పద్ధతిని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా యూఎస్‌లో ప్రతి రాష్ట్రానికి దాని జనాభా ఆధారంగా ఓట్ల సంఖ్య ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 538 ఓట్లు ఉంటాయి. వాటిలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీవైపు మొగ్గుచూపుతాయి. ఇరువురూ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉన్న రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు.

స్వింగ్ స్టేట్స్‌లో గెలిచేది ఎవరు…?

సర్వేల సగటు ఆధారంగా చూస్తే… ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత లేదు. హారిస్ పోటీలోకి వచ్చినప్పటి నుంచి ట్రెండ్‌లను గమనిస్తే… రాష్ట్రాల మధ్య కొన్ని తేడాలను హైలైట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. కానీ, జాతీయ సర్వేలతో పోల్చితే రాష్ట్రాల సర్వేలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రతి సర్వేలో ఎంతో కొంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. అంటే, వాళ్లు ప్రకటించిన నంబర్లు వాస్తవానికి కాస్త అటో, ఇటో ఉండొచ్చు.

ఆగస్టు ప్రారంభం నుంచి చూసుకుంటే అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినాలో కొన్నిసార్లు ఆధిక్యం చేతులు మారింది. అయినప్పటికీ, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఆగస్టు ప్రారంభం నుంచి హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. కొన్ని సార్లు ఆ ఆధిక్యం మధ్య తేడా రెండు-మూడు పాయింట్లుగానే ఉంది. ఈ మధ్యకాలంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా గెలుపొందేవరకు కూడా ఈ మూడు రాష్ట్రాలు డెమొక్రటిక్ పార్టీకి కంచు కోటలుగా ఉండేవి. 2020లో జో బైడెన్ వాటిని మళ్లీ డెమొక్రటిక్ పార్టీ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు హారిస్ కూడా అదే పని చేస్తే, ఆమె గెలుపులో ఈ రాష్ట్రాలు కీలకంగా మారుతాయి. జో బైడెన్ పోటీ నుంచి తప్పుకునే సమయానికి ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ సుమారు 5 శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ అధ్యక్ష బరిలోకి వచ్చిన తరువాత పోరు ఎలా మారిపోయిందో ఈ సర్వే ఫలితాలను ఓ సంకేతంగా భావించవచ్చు. జో బైడెన్ పోటీ నుంచి తప్పుకునే సయమానికి పెన్సిల్వేనియాలో 4.5 శాతం పాయింట్ల వెనుకంజలో ఉన్నారు. దీనిని మనం కింది చార్ట్‌లో చూడొచ్చు. ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో అత్యధిక ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రం పెన్సిల్వేనియా. అందుకే రెండు పార్టీలకు ఈ రాష్ట్రం ఎంతో కీలకం. ఇక్కడ ఆధిక్యత కనబరిస్తే మ్యాజిక్ ఫిగర్ 270 సాధించడం సులువు అవుతుంది.

ఈ సగటులను ఎలా లెక్కిస్తారు?

మేము చూపిస్తున్న గ్రాఫికల్ చిత్రాలలోని సరాసరి గణాంకాలను అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ (ఏబీసీ న్యూస్) పోలింగ్ అనాలసిస్ వెబ్‌సైట్ 538 లెక్కగట్టింది. ఈ సరాసరి లెక్కలు తీయడానికి… జాతీయ స్థాయిలో, స్వింగ్ స్టేట్స్‌లో అనేక సర్వే సంస్థలు చేపట్టిన డాటాను వీరు తీసుకుంటారు.

అయితే, ఏ సర్వే సంస్థ అంటే ఆ సర్వే సంస్థ నుంచి వీళ్లు డాటా తీసుకోరు. ఆయా సంస్థలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో తెలుసుకోవడానికి…వారు ఎంత మందితో సర్వే నిర్వహించారు? ఏ సమయంలో సర్వే చేశారు? సర్వేలు ఆన్‌లైన్‌లో చేశారా లేదా ఆఫ్‌లైన్ లో చేశారా? వంటి అంశాలను 538 వైబ్‌సైట్ పరిగణలోకి తీసుకుంటుంది.

ఈ సర్వేలను ఎంత వరకు నమ్మొచ్చు?

ప్రస్తుతానికైతే, స్వింగ్ స్టేట్స్‌లో కేవలం 2-3 శాతం పాయింట్ల తేడాతో కమలా హారిస్, ట్రంప్‌లు ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. దీనిని బట్టే పోటీ ఎంత రసవత్తరంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం కష్టం.

2016, 2020 ఎన్నికల్లో ట్రంప్‌కున్న ప్రజా మద్దతును సర్వేలు తక్కువగా అంచనా వేశాయి.

దీంతో, ఎన్నికల్లో వచ్చే ఫలితాలు తమ అంచనాలు దగ్గరగా ఉండేందుకు ఆయా సర్వే సంస్థలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేస్తారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

2024 మార్చి 31నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఈ డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే, డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లిస్తారు.

ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త.. కొత్తగా కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌.. ఎలాగంటే

ఆపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం iOS 18.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్ వినియోగదారుల కోసం ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఈ అప్‌డేట్‌లో చేర్చింది.

ఇప్పటి వరకు ఐఫోన్ వినియోగదారులు ఫోన్‌లో కాల్ రికార్డింగ్ సౌకర్యం పొందలేదు. కానీ ఇప్పుడు ఈ కొత్త అప్‌డేట్‌తో కంపెనీ వినియోగదారుల సౌకర్యార్థం ఈ ఫీచర్‌ను కూడా జోడించింది.

ఈ తాజా అప్‌డేట్‌తో ఐఫోన్ వినియోగదారులు ఇప్పుడు ఈ ఫీచర్‌ని ఉపయోగించి కాల్‌లను చాలా సులభంగా రికార్డ్ చేయవచ్చు. ఏ ఐఫోన్ వినియోగదారులు ఈ ఫీచర్ ప్రయోజనాన్ని పొందుతారో, మీరు ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

iOS 18.1 డౌన్‌లోడ్:

మీరు iPhoneలో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకుంటే, ముందుగా మీరు మీ డివైజ్‌లో తాజా iOS 18.1 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి, సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎంపికపై క్లిక్ చేయండి.

ఫోన్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు ఎవరి నుండి కాల్ చేసినా లేదా స్వీకరించిన వెంటనే, మీకు ఫోన్ ఎడమ వైపున చిన్న చిహ్నం కనిపించడం ప్రారంభమవుతుంది. ఐకాన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు కొనసాగించుపై నొక్కాలి. కాల్ ముగిసిన తర్వాత, మీరు పాప్-అప్‌ని చూస్తారు, దానిపై మీరు క్లిక్ చేసి రికార్డింగ్‌ని వినగలరు. మీరు కాల్ రికార్డింగ్‌ని తర్వాత వినాలనుకుంటే, వాయిస్ నోట్స్‌లో ఈ ఫీచర్‌లు కనిపించడం ప్రారంభిస్తాయి.

మీ ఫోన్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంటే, మీరు రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఫీచర్ కాల్‌ల సమయంలో నిజ-సమయ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, జర్మన్, మాండరిన్, పోర్చుగీస్, కాంటోనీస్ భాషలకు మద్దతు ఇస్తుంది.

ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి, మీరు ముందుగా ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. సెట్టింగ్‌లకు వెళ్లిన తర్వాత, సెర్చ్ బార్‌లో లైవ్ వాయిస్‌మెయిల్ ఆప్షన్‌ను ఆన్ చేయండి. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ ప్రస్తుతం iPhone 16 ఉపయోగించే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని గమనించండి.

‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..’ అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఓ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ పెట్టారు.

బ్యాంకు ఖాతాలో నుంచి ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన రైల్వే ఉద్యోగికి నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం… ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ళలో నువ్వెందుకు ఉన్నావు’ అంటూ అవతలి వైపు నుంచి గద్గద స్వరంతో రైల్వే ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ బ్యాక్ గ్రౌండ్ లో అచ్చం ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసు ఎలా ఉంటుందో.. అలాగే వీడియో కాల్ లో హడావుడి సృష్టించారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు రైల్వే ఉద్యోగిని దబాయించారు.

అంతటితో ఆగని కేటుగాళ్లు, ‘పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం’ అంటూ బెదిరించారు. అదేవిధంగా కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగి మొదట రూ.12 లక్షలు, ఆ తర్వాత రూ. 60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆఖరికి ఫిక్సిడ్ డిపాజిట్ లో ఉన్న రూ. 22 లక్షల రూపాయలను డబ్బును.., ఎఫ్డీలు రద్దు చేసుకుని సైబర్ మోసగాళ్లకు సమర్పించుకున్నాడు.

అయితే, నాలుగు రోజుల నుంచి ముభావంగా ఉన్న రైల్వే ఉద్యోగి మహ్మమద్ వలీని సహచరులు ఏమైందని ప్రశ్నించగా, జరిగిన విషయం అంతా చెప్పారు. స్నేహితుల సూచన మేరకు బాధితుడు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లలో ఒకటి జమ్మూ కశ్మీర్ నుంచి, మరొకటి కోల్‌కతా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు రైల్వే ఉద్యోగి మహమ్మద్ వలి పోలీసులను ఆశ్రయించడం ఆలస్యం అవ్వడంతో.. 72 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుత్తి పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు.

చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేసిన సంస్థకు 3 నెలల్లో 3400 కోట్ల లాభం

చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాదు. ఈ మిషన్‌ను పూర్తి చేయడంలో ముఖ్యమైన సహకారం అందించిన కొందరు ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఆ కంపెనీలలో ఒకదాని పేరు లార్సెన్ & టూబ్రో అంటే ఎల్‌అండ్‌టీ. బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో కంపెనీ దాదాపు రూ.3400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ ఎలాంటి ఆదాయాల గణాంకాలను అందించిందో చూద్దాం.

కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది:

దేశంలోని అతిపెద్ద ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఒకటైన ఎల్‌అండ్‌టీ (L&T), సెప్టెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 5 శాతం పెరిగి రూ.3,395 కోట్లకు చేరుకుంది. ఆదాయం పెరగడం వల్ల కంపెనీ లాభాలు పెరిగాయి. ఎల్ అండ్ టీ ఈ సమాచారాన్ని స్టాక్ మార్కెట్లకు అందించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ.3,223 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో కంపెనీ ఏకీకృత ఆదాయం ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.52,157.02 కోట్ల నుంచి రూ.62,655.85 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు రూ.47,165.95 కోట్లతో పోలిస్తే రూ.57,100.76 కోట్లకు పెరిగాయి.

కంపెనీ నిరంతరం మంచి పనితీరు:

ప్రపంచ స్థూల ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసుకున్నామని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ తెలిపారు. కంపెనీ ప్రాజెక్ట్ మరియు తయారీ వ్యాపారం మంచి పనితీరును కొనసాగిస్తోంది. ఇంజినీరింగ్, నిర్మాణం, తయారీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రంగాలలో మా నిరూపితమైన సామర్థ్యానికి నిదర్శనంగా మా వద్ద రూ. 5 లక్షల కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉంది.

వాటాలో పెరుగుదల:

కంపెనీ షేర్ల గురించి మాట్లాడినట్లయితే, పెరుగుదల ఉంది. బిఎస్‌ఇ డేటా ప్రకారం.. కంపెనీ షేర్లు బుధవారం 0.77 శాతం లాభంతో రూ.3407.10 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు రోజు గరిష్ఠ స్థాయి రూ.3438కి చేరాయి. జూన్ 3న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.3,948.60కి చేరాయి. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,68,474.51 కోట్లుగా ఉంది.

తిరుమలలో భక్తులు స్వయంగా ఒక్క రోజు అన్నదానం చేయాలంటే ఎంతో తెలుసా?

తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం మీ చేతులతో జరగాలని భావిస్తున్నారా..? అయితే టీటీడీ ఆ అవకాశం భక్తులకు కనిపిస్తోంది.

రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం కల్పించింది. దాతలు స్వయంగా వడ్డించేలా నిర్ణయం తీసుకుంది. దాతల పేరును ప్రదర్శించనుంది.

తిరుమల, తిరుపతి లో కలిపి రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేసేందుకు వీలు కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ఇప్పటికే అమల్లో ఉంది. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను ప్రకటించిన టిటిడి. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించ వచ్చంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్షించనుంది. అదే విధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, అన్నప్రసాదం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా టిటిడి అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలను టిటిడి అందిస్తోంది. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తోంది. ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల మరియు తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తున్నది. ఇందుకు గాను అయ్యే ఖర్చును ఒక రోజు ఆన్న ప్రసాద వితరణగా భక్తులు విరాళంగా ఇంచ్చేందుకు ఈ మేరకు అవకాశం కల్పించింది.

ఫేక్‌ ఫొటోలకు చెక్‌.. గూగుల్‌ ఫొటోస్‌లో సరికొత్త ఏఐ ఫీచర్‌..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకొని ఫేక్‌ ఫొటోలను, వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా నెట్టింట ఇలాంటి ఫేక్‌ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా సెలబ్రిటీల ఫేక్‌ ఫొటోలను తెగ వైరల్‌ చేస్తున్నారు.

దీంతో అసలు ఫొటో ఏది, నకిలీ ఫొటో ఏదన్న ప్రశ్న చాలా మందిలో ఎదురువుతోంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్‌ ఫొటోలు, వీడియోలను ఇట్టే గుర్తించేందుకు గూగుల్‌ ఫొటోస్‌లో సరికొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఏఐ ఇన్పో పేరుతో గూగుల్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్టులో తెలిపింది. అయితే ఎడిట్ చేసిన ఫొటోలను మాత్రమే ఇది గుర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనేగా.. ఇందుకోసం ముందుగా గూగుల్ ఫోటోస్ యాప్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఏదైన ఫోటోను సెలెక్ట్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే డీటీయల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

ఒకవేళ సదరు ఫొటో ఏఐతో క్రియేట్ చేసిందయితే.. అందులో ‘ఎడిటెడ్ విత్ గూగుల్ ఏఐ’ అని సూచిస్తుంది. దీంతో ఆ ఫోటో నిజమైందా కాదా అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. దీంతో పాటు గూగుల్‌ మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను తీసుకొచ్చింది.

దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై క్రేజీ డీల్స్‌..

CMF Phone 1: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ డైమెన్షన్‌ 7300 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

Google Pixel 8: గూగుల్ పిక్సెల్‌8పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 47 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 75,999కాగా సేల్‌లో భాగంగా రూ. 39,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, 10 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Motorola Edge 50 Neo: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 29,999కాగా సేల్‌లో భాగంగా రూ. 23,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన సూపర్ హెచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

Oppo F27 Pro+: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్‌ డీల్‌లో ఇది ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 32,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియా టెక్‌ డైమెన్షన్‌ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

Samsung Galaxy S23: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 95,999కాగా ఏకంగా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,999కే లభిస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులోక్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో ఏఐ ఫీచర్లను అందించారు. ఇందులో 50 ఎంపీ, 10 ఎంపీ, 12 ఎంపీతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించార. 3900 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

ఆయిల్ కంపెనీల కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి సవరణలు జరగలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ఇంధన వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆయిల్ రవాణాకు సంబంధించిన అంతర్-రాష్ట్ర ఛార్జీలను కంపెనీలు హేతుబద్ధీకరించాయి.

అంతర్-రాష్ట్ర రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించడంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. విక్రయించే ప్రాంతాన్ని బట్టి డీలర్ కమీషన్లు మారుతూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ప్రస్తుతం డీలర్‌లకు కిలోలీటర్‌కు రూ.1,868.14 ఛార్జీ, కమీషన్‌గా 0.875 శాతం చెల్లిస్తున్నారు. ఇక డీజిల్‌ విషయానికి వస్తే కిలోలీటర్‌కు రూ.1389.35 రవాణా ఛార్జీ, 0.28 శాతం కమీషన్‌గా అందిస్తున్నారు.

స్వాగతించిన కేంద్రం

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్ వేదికగా స్పందించారు. “పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించాల్సిన డీలర్ కమిషన్‌ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను. మారుమూల ప్రాంతాలలో (ఆయిల్ కంపెనీల పెట్రోలు, డీజిల్ డిపోలకు దూరంగా) వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా అంతర్-రాష్ట్ర సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో తగ్గుదలకు దోహదపడుతుంది’’ అని రాసుకొచ్చారు. కాగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, నియోజకవర్గాలలో ఈ నిర్ణయాన్ని తర్వాత అమలు చేస్తాయని ఆయన చెప్పారు.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న కూనన్‌పల్లి, కలిమెల ప్రాంతాలను హర్దీప్ సింగ్ పూరీ ఉదాహరణను చెప్పారు. ఇక్కడ పెట్రోల్ ధర వరుసగా రూ. 4.69, రూ.4.55 చొప్పున తగ్గుతుంది. డీజిల్ ధరలు వరుసగా రూ.4.45, రూ.4.32 చొప్పున తగ్గుతాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో పెట్రోల్ ధర రూ.2.09, డీజిల్‌ రూ.2.02 మేర తగ్గనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజాపూర్, బైలాడిలా, కాటేకల్యాణ్, బచేలి, దంతేవాడలో కూడా రేట్లు దిగివస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం రాష్ట్రాలలోని అనేక చోట్ల ధరలు తగ్గుతాయని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.

డీలర్ కమీషన్ పెంపుతో దేశంలోని ఇంధన రిటైల్ అవుట్‌లెట్‌లను ప్రతిరోజూ సందర్శించే సుమారు 7 కోట్ల మంది పౌరులు ప్రయోజనం పొందుతారని అన్నారు. ఇంధన ధరలు పెరగకుండా మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. గత 7 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చడంతో దేశవ్యాప్తంగా 83,000 పెట్రోల్ పంపుల్లో పనిచేస్తున్న పెట్రోల్ పంప్ డీలర్లు, సుమారు 10 లక్షల మంది సిబ్బంది జీవితాల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయని అన్నారు. అయితే ఏపీ, తెలంగాణలోని ఏయే ప్రాంతాల్లో ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందో తెలియాల్సి ఉంది.

సీఐడీ విచారణ ప్రారంభం

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈకేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ (Actress Kadambari Jethwani) కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈరోజు విచారణకు జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న (మంగళవారం) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి రికార్డులు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విద్యాసాగర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో మరోసారి జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

కాగా.. నటి జెత్వానీ కేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇతర నిందితుల్లో డీజీపీ ర్యాంకు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఐజీ ర్యాంకు అధికారి కాంతి రాణా తాతా, డీఐజీ ర్యాంకు అధికారి విశాల్‌ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, మరో న్యాయవాది ఉన్నారు. ఈ క్రమంలో వీరందరినీ విచారించి కేసు నిలబెట్టాలంటే సీఐడీకి అప్పగించడమే సమంజసమని సర్కారు భావించింది. అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి చీఫ్‌గా ఉన్న సీఐడీలో ఐజీ వరకు విచారించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కేసులో పోలీసులు ఉన్నతాధికారులు ఉన్నందున సీఐడీకి అప్పగిస్తూ సర్కార్ ఉత్వర్వలు జారీ చేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌ను కస్టడీకీ అప్పగించాలని కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. కుక్కల విద్యాసాగర్‌ను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని నిన్న (మంగళవారం) కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిందితుడి తరపున కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే కోర్టులో విద్యాసాగర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సెప్టెంబరు 20న విద్యాసాగర్‌ అరెస్టు సమయంలో ఆయన అరెస్ట్‌కు గల కారణాలు వివరించి పోలీసులు చట్టనిబంధనలు అనుసరించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదన్న వాదనతో ఏకీభవించలేమన్నారు. విజయవాడ 4వ అదనపు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ సెప్టెంబరు 23న ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేసేందుకు ఎలాంటి కారణాలు లేవని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.

విదేశాలకు డబ్బు పంపుతున్నారా? అయితే జాగ్రత్త.. ఈ లిమిట్ దాటితే IT నోటీసులొస్తాయ్

విద్య, వైద్య, విహార యాత్రల వంటి వాటి కోసం భారతీయులు విదేశాలకు డబ్బులు పంపిస్తుంటారు. ప్రతి ఏడాది 10 బిలియన్ డాలర్లకుపైగా భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నట్లు అంచనా. ఇది ప్రతి ఏటా 20 శాతం మేర పెరుగుతోందటా. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్ఠ స్థాయి రూ.84ను తాకింది. ఇది విదేశాలకు డబ్బులు పంపించే వారిపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపించాల్సి వస్తోంది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బులు పంపే వారికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. రూ.6 లక్షలు దాటిన ఫారెన్ రెమిటెన్స్‌లపై సమగ్ర సమీక్ష చేపట్టాలని నిర్ణయించింది.

ఒక వ్యక్తి లేదా కంపెనీ ఒక దేశం నుంచి మరో దేశానికి నగదు బదిలీ చేయడం, పేమెంట్లు చేసే ప్రక్రియను ఫారెన్ రెమిటెన్స్ అంటారు. అయితే, విదేశీ చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించిన క్రమంలో వాటిని అరికట్టేందుకు ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెమిటెన్స్ డేలా వ్యత్యాసాలు, ట్యాక్స్ ఎగవేతలు గుర్తించేందుకు ఆయా ట్రాన్సాక్షన్లను సమగ్రంగా పరిశీలించాలని సీబీడీటీ కొద్ది రోజుల క్రితమే నిర్ణయించింది. కొంత మంది ఐటీ శాఖ వద్ద సమర్పించిన ఆదాయ లెక్కలు, విదేశీ చెల్లింపులకు పొంతన ఉండడం లేదని గుర్తించినట్లు తెలిపింది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్‌లో లోపాలు ఉన్నాయని తెలిపింది. ఈ కారణంగానే ఫారం 15సీసీ వెరిఫికేషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. 2020-21 నుంచి డేటా పరిశీలన ఆధారంగా హైరిస్క్ కేసుల లిస్ట్‌ సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా రూ.6 లక్షలకు మించి విదేశీ చెల్లింపులు చేసిన వారికి డిసెంబర్ 31వ తేదీ వరకు ఐటీ నోటీసులు పంపించనుంది.

లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా ఒక ఆర్థిక ఏడాదిలో 2.50 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపించవచ్చు. కరెంట్ లేదా క్యాపిటల్ ఖాతాల్లో డబ్బు పంపవచ్చు. విదేశీ విద్య, వైద్యం వంటి వాటి కోసం పంపిస్తారు. 2.50 లక్షల డాలర్లకు మించి సైతం పంపించవచ్చు. అయితే, అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అయితే తక్కువ ఖర్చులో విదేశాలకు డబ్బులు పంపేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు వైర్ ట్రాన్స్‌ఫర్, నెట్ బ్యాంకింగ్, ఫారెన్ కరెన్సీ చెక్స్, డీడీల ద్వారా డబ్బు పంపిస్తాయి. విదేశాల్లోని అనుబంధ బ్యాంకుల ద్వారా బదిలీ చేస్తుంటాయి. దీంతో విశ్వసనీయత, భద్రత ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు బ్యాంకులే ఉత్తమమని చెబుతున్నారు.

విదేశాలకు డబ్బు పంపడం ఖర్చుతో కూడుకున్న పని. ఇందులో మూడు రకాల ఖర్చులు ఉంటాయి. బదిలీ రుసుము, ఎక్స్చేంజ్ రేటు, ఫారెక్స్ రేటుపై మార్క్ ఆప్. బ్యాంకుల్లో ఈ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. అందులోనూ ప్రైవేట్ బ్యాంకుల్లో మరింత ఎక్కువే ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఎక్స్చేంజ్ రేటునపై 1-2 శాతం మార్క్ అప్ వసూలు చేస్తాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో దేశాన్ని బట్టి ఈ ఖర్చులు మారతాయి. కొన్ని నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. తరుచూ విదేశాలకు డబ్బు పంపాల్సిన వారు ఎక్స్చేంజ్ రేటును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. తక్కువగా ఉన్నప్పుడు డబ్బు పంపితే చాలా ఆదా అవుతుంది. పెద్ద మొత్తంలో పంపాల్సి వచ్చినప్పుడు చాలా ఆదా చేసుకోవచ్చు. రెమిటెన్స్ పత్రాలను నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఫెమా చట్టం కింద చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది.

సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ

: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ను బెదిరించడం గమనార్హం.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్, మెసేజెస్ ఆగడం లేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడైతే అతని వెంట పడిందో.. అప్పటి నుంచీ ఇవి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ల ద్వారా రూ.2 కోట్లు ఇవ్వాలని సల్మాన్ ను డిమాండ్ చేసినట్లు ముంబై పోలీస్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ కు సందేశం వచ్చింది.

ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తాం

తాము డిమాండ్ చేసినట్లు రూ.2 కోట్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ గుర్తు తెలియని వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు వెంటనే వర్లీ పోలీస్ కు సమాచారం అందించారు. వాళ్ల ఆ గుర్తు తెలియని వ్యక్తిని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.

ఈ మధ్యే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన 20 ఏళ్ల వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ తో పాటు ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీని చంపుతానని అతడు హెచ్చరించాడు. అతన్ని సోమవారం (అక్టోబర్ 28) అరెస్ట్ చేశారు.

గత శుక్రవారం అతడు ఎన్సీపీ ఎమ్మెల్యే జీషాన్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు సందేశం పంపించి.. తర్వాత వాయిస్ కాల్ కూడా చేసినట్లు పోలీసులు చెప్పారు. జీషాన్ తోపాటు సల్మాన్ ఖాన్ ను కూడా చంపేస్తానని అతడు బెదిరించాడు. ఆ తర్వాత ఆ కాల్ ట్రాక్ చేయగా.. నోయిడా నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ కోసం తీసుకొచ్చారు.
సల్మాన్‌కు బెదిరింపులు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సల్మాన్ ఖాన్ కు కొన్నాళ్లుగా బెదిరింపు కాల్స్, మెసేజీలు వస్తున్నాయి. ఆ మధ్య అతని ఇంటిపై కాల్పులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతని సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు భద్రతను పెంచారు. గత వారం కూడా లారెన్స్ బిష్ణోయ్ పేరు మీద సల్మాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది.

అందులో రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ కాల్ చేసిన వ్యక్తిని జంషెడ్‌పూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ సందేశం రావడం గమనార్హం. ఎప్పుడో 26 ఏళ్ల కిందట రాజస్థాన్ లో కృష్ణ జింకను చంపిన కేసుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఇప్పటికీ సల్మాన్ వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య అతడు తన షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

రేపే దీపావళి- శుభ సమయం, పూజా సామాగ్రి జాబితా, పూజా విధానం తెలుసుకోండి

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ మరి కొన్ని గంటల్లో జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు పూజకు శుభ సమయం ఎప్పుడు? పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఐదు రోజుల దీపాల పండుగ ధన త్రయోదశి నుండి ప్రారంభమైంది. దీపావళి పండుగ హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఈ వేడుకలో అయోధ్యలోని ప్రజలందరూ శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు దీపాలు వెలిగించారు. దీపావళిని ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం క్యాలెండర్ తేడాల కారణంగా చాలా చోట్ల దీపావళిని అక్టోబర్ 31 న జరుపుకుంటారు. నవంబర్ 1 న కూడా జరుపుకుంటారు. దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు ఇంటిని రంగోలి, దీపాలు, పూలతో అలంకరించారు. దీపావళి ఖచ్చితమైన తేదీ, పూజకు కావాల్సిన సామాగ్రి జాబితా, పూజ సమయం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
దీపావళి ఎప్పుడు?

దీపావళి పండుగ ఐదు రోజులు ఉంటుంది. అయితే ఈ పండుగను 6 రోజులు జరుపుకుంటారు. ధన త్రయోదశి అక్టోబర్ 29న జరిగింది. ఛోటీ దీపావళి అక్టోబర్ 31న. క్యాలెండర్‌లో వ్యత్యాసం కారణంగా, దీపావళిని అక్టోబర్ 31 మరియు నవంబర్ 1 న రెండు రోజుల పాటు జరుపుకుంటారు. కాగా నవంబర్ 2వ తేదీన గోవర్ధన్ పూజ జరుపుకోనున్నారు. దీని తరువాత నవంబర్ 3న భాయ్ దూజ్‌తో ముగుస్తుంది.

దీపావళి పూజ సామగ్రి జాబితా

నీటి పాత్ర, అర్ఘ్య పాత్ర, ఖీల్-బటాషే, పెన్, కొబ్బరి, తాంబూలం (లవంగాలు కలిగిన తమలపాకులు), మట్టి దీపాలు, ఆవాల నూనె, ధూపం, దీపం, ఎరుపు వస్త్రం (అర మీటరు), తులసి ఆకులు, పెర్ఫ్యూమ్ బాటిల్, మోలీ, లవంగాలు, చిన్న ఏలకులు, స్వీట్లు, చెరకు, సీతాఫలం, పాలు, పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, చక్కెర, తేనె, గంగాజలం, డ్రై ఫ్రూట్స్, దుర్వా , పసుపు ముద్ద, సప్తమృతిక, కొత్తిమీర, తమలపాకులు, దీపం వెలిగించేందుకు వత్తులు, పదహారు అలంకరణ వస్తువులు, వెర్మిలియన్, గులాల్, కుంకుమ, అక్షితలు, కర్పూరం , గంధం, గులాబీ పువ్వులు, తామర పువ్వు, మామిడి ఆకులు, మట్టి లేదా ఇత్తడి పాత్ర, కలశం కప్పడానికి మూత, లక్ష్మీ వినాయకుడి విగ్రహాలు, వెండి నాణెం, కుబేర యంత్రం.
దీపావళి పూజ ముహూర్తం

అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 01న సాయంత్రం 06:16 గంటలకు ముగుస్తుంది. అక్టోబరు 31న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు లక్ష్మీపూజకు అనుకూలమైన సమయం. ఇది కాకుండా, దీపావళి పూజకు శుభ సమయం సాయంత్రం 06:27 నుండి రాత్రి 08:32 వరకు. దీపావళి రోజున నిశిత కాలంలో కూడా పూజలు చేస్తారు. ఈ రోజు రాత్రి 11:39 నుండి 12:31 వరకు నిశిత కాల పూజకు అనుకూలమైన సమయం.

దీపావళి పూజ ఆచారం

దీపావళి రోజున సాయంత్రం శుభ సమయంలో పూజ ప్రారంభించండి. ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఈశాన్య మూలను దేవతల ప్రదేశంగా భావిస్తారు. అందువల్ల ఈ దిశలో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. చెక్క పీట ఏర్పాటు చేసి ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని విస్తరించండి. దాని మీద వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టించండి. లేదంటే లక్ష్మీ, గణేష్ , కుబేరుడితో ఉన్న చిత్రాన్ని కూడా ఉంచండి.

పూజ సమయంలో సూర్యదేవుడు, విష్ణుమూర్తి, శివపార్వతుల చిత్రపటాలు పెట్టుకోవాలి. దేవతల ముందు ధూపం, దీపాలను వెలిగించండి. విగ్రహం, చిత్రాల పటాలపై గంగాజలం చల్లండి. ఆ తర్వాత ఆసనం మీద కూర్చుని షోడశోపచారాలలో మహాలక్ష్మిని పూజించాలి. పూజ స్తంభం వద్ద గణేశుడి ముందు కుడి వైపున నవగ్రహాన్ని ప్రతిష్టించండి. సమీపంలో నీటితో నిండిన కుండను ఉంచండి.

కలశంలో కౌరీలు, నాణేలు, తమలపాకులు, గంగాజలం వేయండి. కలశంపై స్వస్తిక్ చిహ్నాన్ని రోలీతో కట్టి, మొలితో చుట్టండి. తరువాత మామిడి ఆకులను పెట్టాలి. కుండను పెద్ద మట్టి దీపంతో కప్పండి. దీపంలో బియ్యం ఉంచి, కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి దీపంపై ఉంచాలి. ఇప్పుడు 5 కౌరీలు, 5 గోమతి చక్రాలు, పసుపు ముద్దను లక్ష్మీ దేవి ముందు ఎరుపు రంగు సంచిలో ఉంచండి. దీపావళి పూజ తర్వాత దానిని సేఫ్ లేదా లాకర్‌లో ఉంచండి

పండ్లు, పువ్వులు, నెయ్యి, తామరపువ్వు, ఖీల్-బటాషే, పంచామృతం సమర్పించండి. ధంతేరస్ సమయంలో తెచ్చిన వస్తువులను కూడా పూజించండి. దీని తరువాత, గణేశుడు, లక్ష్మీ దేవి, కుబేరుడి ముందు 5 లేదా 11 నెయ్యి దీపాలను వెలిగించండి. దీని తరువాత ఇంటిని అలంకరించడానికి అవసరాన్ని బట్టి ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. ఇంట్లోని అన్ని మూలల్లో ఈ దీపాలను ఉంచండి. తదనుగుణంగా లక్ష్మీ-గణేశుని పూజించండి. మంత్రాలు జపించండి. గణేశ అథర్వశీర్ష, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ సూక్తం పఠించండి. కుబేరుని పూజించండి. పూజ సమయంలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగండి. ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ పూజను ముగించండి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన నారా లోకేష్.. పెప్సీకో సీఈఓతో భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అమెజాన్ డాటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పెప్సీ కో సీఈఓ ఇంద్రనూయితో పాటు రేచీవర్‌, సేల్స్ ఫోర్స్ సీఈఓలతో భేటీ అయ్యారు.

అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల లక్ష్యంగా చేస్తున్న పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఎపిలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.

ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ… క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో మా సంస్థ కీలక పాత్ర వహిస్తోంది. ఎఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నాట్టు తెలిపారు.

ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా అమెజన్ సంస్థ పాత్ర కీలకమైందని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బిఎన్‌బి, 3ఎమ్ వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉందని చెప్పారు.

AWS ప్రపంచవ్యాప్తంగా 32% మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉందని 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వార్షిక ఆదాయం సుమారు $90.8 బిలియన్లుగా ఉండగా, 2024కి $100 బిలియన్లకు చేరుకుందని రేచల్ స్కాఫ్ చెప్పారు.
స్మార్ట్ గవర్నెన్స్ కు క్లౌడ్ సేవలు అందించండి

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎపి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు.

ఎఐ & మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఎపిని ఎఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న మా ఆశయానికి ఊతమిస్తాయి. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి AWS కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉందని చెప్పారు.

స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని. AWS తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు AWS సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్‌ మెరుగుదల, –ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు AWS సహకారాన్ని కోరుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై రేచల్ స్పందిస్తూ ఏపీలో లో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ భేటీ

ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్‌ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలని అన్నారు.

టెక్ స్టార్టఫ్ లకు ఎఐ టూల్స్, మెంటార్ షిప్ అందించండి

మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ డ్రైవెన్ ఎకానమీపై మేం దృష్టిసారించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించండి. మా రాష్ట్రంలో ఎఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కోరారు.

సేల్స్‌ఫోర్స్ AI సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు AI టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాలని కోరారు.
ఐన్ స్టీన్ ఎఐని మా రాష్ట్రంలో పరిచయం చేయండి

ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ (CRM)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ యొక్క ఐన్‌స్టీన్ ఎఐని ఏపీలో పరిచయం చేయాలని కోరారు. ఎఐ – పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు సహకారం అందించాలని కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్‌ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. పరిపాలనలో ఎఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఎపిలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేష్ కోరారు.

బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి

పెప్సికో మాజీ చైర్మన్ & సిఇఓ ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబుగారి నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాలన్నారు.

స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు వివరించారు.

మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారు, నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఇప్పటికే టెట్ పూర్తై ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనుండగా నవంబర్ 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సర్కారు తీపి కబురు అందించింది. డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌కు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే డిఎస్సీ 2024లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేేందుకు రెండోసారి టెట్‌ పరీక్షల్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. టెట్ తుది కీని ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనుంది.

మరోవైపు టెట్‌ ఫలితాలు వెలువరించిన మర్నాడే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం మొదట భావించింది. 3వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్‌ 6వ తేదీన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

నవంబరు 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. డిఎస్సీలో భర్తీ చేసే పోస్టుల రోస్టర్‌ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. నోటిఫికేషన్‌ వెలువడిన మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఏడాది వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ సూళ్ల ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఏపీలో దాదాపు 12వేల పాఠశాలలు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. టీచర్‌ సెలవు పెడితే ఆ రోజు బడి మూసేయాల్సి వస్తోంది. కొత్త డీఎస్సీలో పాఠశాలలకు రెండో టీచర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కూడా తీరుతుంది.

టెట్‌ తుది ‘కీ’ విడుదల

ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల(టెట్‌) తుది ‘కీ’ని విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు మంగళవారం తెలిపారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏపీలో ఇటీవల నిర్వహించిన టెట్‌ పరీక్షలకు 3,68,661 మంది హాజరయ్యారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉంటారో లేదోననే సందేహంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.

మరోవైపు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత న్యాయ వివాదాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ వర్గాలను ఆదేశించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్‌లోగా నియామకాలను భర్తీ చేస్తామని ప్రకటించినా టెట్‌ నిర్వహణతో పరీక్షలు, నోటిఫికేషన్ ఆలస్యమైంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.

పోస్టుల వివరాలు…

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

Health

సినిమా