Tuesday, September 17, 2024

బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..

ప్రస్తుతం డయాబటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకే క్రమంతప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ను చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ ఎప్పుడు చేసుకోవాలి.? ఏ సమయంలో చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి ఆహారం తీసుకోక ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడాన్ని ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతుంటారు. ఉదయం నిద్ర మేల్కొన్న తర్వాత మొదట రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

* అలాగే భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సరైన ఫలితం తెలుస్తుంది.

* ఇక ఆహారం తీసుకునే ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడం బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్‌ మోతాదు తీసుకోవడంలో సహాయపడుతుంది.
* * అధిక దాహం, అలసట, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక వ్యాయామం చేసే ముందు తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్‌ చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సరిగ్గా అంచనా వేయొచ్చు.

* ఇక తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి 80-130 mg/dL ఉండాలి అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో, ఆహారం తిన్న 1-2 గంటల తర్వాత 180 mg/dL కంటే తక్కువగా ఉండాలి.

Walking Mistake: రోజూ నడిచినా షుగర్, బరువు తగ్గలేదా? ఈ 5 తప్పులు చేయకండి!

చెమట పట్టకుండా బరువు తగ్గడానికి మార్గం లేదు. జిమ్‌లో అయినా లేదా ఇంట్లో అయినా కనీసం కొంచెం వ్యాయామం చేయండి. కానీ చాలా మందికి వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయడం కష్టంగా ఉంటుంది. అతనికి ఎక్కువసేపు వ్యాయామం చేసే అలవాటు లేకపోతే అదనంగా, వయస్సుతో పాటు వ్యాధి-బాధలు కూడా పెరుగుతాయి. అక్కడ వ్యాయామం ప్రతికూలంగా ఉంటుంది. అలాంటప్పుడు చెమటను వ్యాప్తి చేయడానికి ఏకైక మార్గం నడక. రోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కానీ సరైన మార్గంలో నడవడం చాలా ముఖ్యం. లేదంటే ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. గుండెకు ఉత్తమమైన వ్యాయామం నడక. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ని కూడా పెంచుతుంది. అలాగే అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దాంతో ఒత్తిడిని దూరం చేస్తుంది. రోజుకు కనీసం 30-45 నిమిషాలు నడవడం వల్ల మీ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. అయితే నడక కోసం కొన్ని నియమాలు పాటించాలి. రోజురోజుకూ తప్పుడు మార్గంలో నడిచినా ప్రయోజనం లేకుంటే ప్రమాదమే. నడుము, కాలు, వెన్ను సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి సరైన నడక నియమాలను తెలుసుకోండి.

నడుస్తున్నప్పుడు పాదాలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. దీని కారణంగా, ఎముకలు, కండరాలు తమ విధులను నిర్వహించడానికి తగినంత సమయం లభించవు. నెమ్మదిగా నడవండి.
సరైన నడక భంగిమను నిర్వహించండి. వెన్ను నిటారుగా, భుజాలు సడలించి వేగంగా నడవండి. రిలాక్స్డ్ మూడ్‌లో నడవండి.
నడవడానికి తగిన బూట్లు ఎంచుకోండి. సరికాని బూట్లు పాదాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. పాదాల సమస్యలను నివారించడానికి, నడవడానికి ఇబ్బంది పడటానికి, సౌకర్యవంతమైన బూట్లు కొనండి. మార్కెట్లో వివిధ రకాల వాకింగ్, రన్నింగ్ షూలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించవచ్చు.
ఈ వేడిలో నడుస్తున్నప్పుడు మీకు చెమట పడుతుంది. అయితే మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం మీ బాధ్యత. లేదంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గి అలసట ఏర్పడవచ్చు. వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ని వెంట తీసుకెళ్లండి. మీరు వీధికి వెళ్లి క్యాన్డ్ వాటర్ తాగవచ్చు.
ఒత్తిడితో నడవకండి. మీ ఆలోచనలను పక్కన పెట్టండి. నడక కోసం వెళ్ళండి.
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ లోనే 108MP కెమెరాతో..

స్మార్ట్ ఫోన్ అనేది అవసరం నుంచి అత్యవసరంగా మారిపోయింది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే లైఫే లేదు అనే పరిస్థితి వచ్చేసింది. కొన్ని కొన్ని జాబ్స్ కి కూడా స్మార్ట్ ఫోన్ తప్పకుండా కావాల్సిన పరిస్థితి అయిపోయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్ అంటే 5జీ అనే పరిస్థతి ఉంది. అయితే 5జీ స్మార్ట్ ఫోన్ అంటే కచ్చితంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈమధ్య కొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నా కూడా వాటిలో అన్నీ ఫీచర్స్ ఉండటం లేదు. ముఖ్యంగా కెమెరా చాలా తక్కువ ఉంటోంది. కానీ, ఇప్పుడు ఒక కంపెనీ ఏకంగా 108 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ రేంజ్ లోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది ఇన్ఫినిక్స్ కంపెనీ. వాళ్లు తాజాగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ అనే స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు. ఆ ఫోన్ 108 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో మొత్తం రెండు వేరియంట్స్ ని తీసుకొస్తున్నారు. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.78 ఫుల్ హెచ్ డీ+ కర్వ్డ్ డిస్ ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. అంటే ఎండలో ఇబ్బంది లేకుండానే ఉంటుంది. ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్ లో హైలెట్ ఫీచర్ 108 ఎంపీ మెయిన్ కెమెరా, 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ తో 2కేలో వీడియో రికార్డింగ్ చేయచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ రూ.27,999 కాగా రూ.6 వేలు డిస్కౌంట్ తో రూ.21,999కే అందిస్తున్నారు.

దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ ఛేంజ్ బోనస్లు కూడా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులు కలిగి ఉంటే అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ని మీరు కేవలం రూ.19,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ స్పెసిఫికేషన్స్, ఈ ధరలో 108 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఫోన్ అంటే బెస్ట్ ఆప్షన్ గా టెక్ నిపుణులు కూడా చెప్తున్నారు

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్..

TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను అతి త్వరగా వెల్లడించాలని బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇక మిగతా మూడు దశల వాల్యుయేషన్ ప్రక్రియను బోర్డు ఈనెలాఖరులోపు పూర్తి చేయనుంది. ఇది పూర్తి చేయడానికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.

తెలుగు పంచాంగం ,నేడు శుభ , అశుభ ముహుర్తాలివే…నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (13/04/24)

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని పంచమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని పంచమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…


మిధునంలో చంద్రుడి సంచారం..
రాష్ట్రీయ మితి ఛైత్ర 24, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 03, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 13 ఏప్రిల్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు పంచమి తిథి మధ్యాహ్నం 12:05 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్టి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:49 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున
రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:28 గంటల నుంచి ఉదయం 5:13 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:21 గంటల వరకు
నిశిత కాలం : రాత్రి 11:59 గంటల నుంచి రాత్రి 12:44 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:45 గంటల నుంచి సాయంత్రం 7:07 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 7:33 గంటల నుంచి ఉదయం 9:09 గంటల వరకు
సూర్యోదయం సమయం 13 ఏప్రిల్ 2024 : ఉదయం 5:58 గంటలకు
సూర్యాస్తమయం సమయం 13 ఏప్రిల్ 2024: సాయంత్రం 6:45 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 5:58 గంటల నుంచి ఉదయం 6:49 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు కోతులకు నల్ల శనగలు తినిపించాలి.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (13/04/24)

 

మేషం

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం పఠించాలి.

వృషభం
జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

మిథునం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొంత మంది వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

కర్కాటకం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో ఆత్మస్థైర్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.

కన్య
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

తుల
మీ కృషి ఫలిస్తుంది. మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవి స్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధనుస్సు
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగడానికి విష్ణు ధ్యానం శుభప్రదం.

మకరం
చేపట్టే పనుల్లో అలసత్యం ఉండకూడదు. ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

కుంభం
ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవనామాన్ని జపించడం మేలు చేస్తుంది.

మీనం
మానసిక సౌఖ్యం ఉంటుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. గోసేవ చేయాలి.

CCE Marks Entry | SA 2 Marks Entry Link Enabled SA 2 మార్కులు నమోదు చేయడానికి లింక్ ఎనేబుల్ చేశారు….

HOW TO ENTER SA- 2 MARKS OPNLINE

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు లో స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి
CSE మర్క్స్ ఆన్లైన్ ట్యాబు ఎంచుకుని దానిలో కల SA-2 మర్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి
క్లాస్ మరియు అకాడమిక్ ఇయర్ ఎంచుకోవాలి
లాంగ్వేజ్ మరియు subject ఎంచుకోవాలి
తరగతి వారి విద్యార్థుల లిస్ట్ కనబడుతుంది.
ఒక్కక్కరి మర్క్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి

Direct link to enter SA -2 marks

https://studentinfo.ap.gov.in/

Rain In AP: ఏపీలో జిల్లాల్లో భారీ వానలు..!

ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో మాడు పగిలే ఎండలతో జనాలు విలవిల్లాడుతున్నారు. మండే ఎండలకు తోడు.. వడగాలులు వీస్తుండటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏసీ, ఫ్రిజ్జులు కూడా వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. మరో రెండు నెలల పాటు ఎండలను ఎలా భరించాలా అని జనాలు భయపడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రెండు రోజుల క్రితం వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు కురిశాయి.

గత రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా సూర్యుడు తన ఓ రేంజ్ లో తన ప్రతాపం చూపించారు. నిన్నటి నుంచి కాస్తా వాతావరణం చల్లబడింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే గుంటూరు జిల్లాలో శుక్రవారం అకాస వర్షం సంభవించింది. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా భారీ వానాలు కురిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

ఈ క్రమంలో 13వ రోజు బస్సుయాత్రలో భాగంగా ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం చేరుకున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా వాన కురిసి.. ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారటంతో ప్రజలు కాసేపు ఇబ్బంది పడ్డారు. కాగా, గత కొంత కాలంగా విపరీతమైన ఎండలు, వేడి గాలుల వల్ల ఇబ్బందిపడుతున్న జనానికి ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే ఇదే సమయంలో అకస్మాత్తుగా వానాలు కురవడంతో మిర్చి రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లోని మిరప పంట వర్షానికి తడిసింది. మొత్తంగా చాలా రోజులుగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరో రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది.

నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారట. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. అలా

ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా పొందారట. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

కోల్‌క‌తా నుంచి లండ‌న్‌కు బ‌స్సు ప్ర‌యాణం.. టిక్కెట్ ధ‌ర ఎంతో తెలుసా..?

ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్ర‌యాణించాలంటే క‌చ్చితంగా విమానాల్లో వెళ్లాల్సిందే. మ‌రొక ప్ర‌త్యామ్నాయం లేదు. కానీ స‌ముద్ర తీర ప్రాంతం ఉండే దేశాల‌కు అయితే షిప్‌లలోనూ వెళ్ల‌వ‌చ్చు. గ‌తంలో విమానాలు లేని స‌మ‌యంలో పెద్ద పెద్ద ఓడ‌ల ద్వారానే రోజుల త‌ర‌బ‌డి ఒక దేశం నుంచి మ‌రొక దేశానికి ప్ర‌యాణం చేసేవారు. అయితే మీకు తెలుసా..? 1950ల‌లో లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు బ‌స్సుల‌ను న‌డిపారు. అవును నిజ‌మే. మ‌రి ఆ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1957లో ఆల్బ‌ర్ట్ ట్రావెల్స్ అనేక కంపెనీ వారు లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు, ఆస్ట్రేలియాకు బ‌స్సుల‌ను న‌డిపారు. అయితే 1957వ సంవ‌త్స‌రం ఏప్రిల్ 15వ తేదీన లండ‌న్ నుంచి తొలిసారిగా కోల్‌క‌తాకు ఓ బ‌స్సు బ‌య‌ల్దేరింది. అందులో 20 మంది ప్ర‌యాణించారు. లండ‌న్‌లోని విక్టోరియా కోచ్ స్టేష‌న్ వ‌ద్ద వారు ఆ బ‌స్సు ఎక్కారు. టిక్కెట్ ధ‌ర అప్ప‌ట్లో 145 పౌండ్లు (దాదాపుగా రూ.13,644) ఉండేది. 5 రోజుల పాటు ఆ బ‌స్సు ప్ర‌యాణం చేసి లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆ రూట్‌లో అప్ప‌ట్లో మొత్తం 15 బ‌స్సుల‌ను ఆల్బ‌ర్ట్ ట్రావెల్స్ కంపెనీ న‌డిపింది.

ఇక లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చే బ‌స్సులు లండ‌న్‌, బెల్జియం, ప‌శ్చిమ జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బ‌ల్గేరియా, ట‌ర్కీ, ఇరాన్‌, ఆఫ్గ‌నిస్థాన్‌, వెస్ట్ పాకిస్థాన్ ల మీదుగా ఇండియాకు చేరుకునేవి. ఇండియాలో బ‌స్సులు ఢిల్లీ, ఆగ్రా, అల‌హాబాద్‌, బ‌నార‌స్ మీదుగా ప్ర‌యాణించి కోల్‌క‌తాకు చేరుకునేవి. అయితే అప్ప‌ట్లో తొలిసారిగా ఆ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసిన వారి ఫొటోలు ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు నిజ‌మా, కాదా అని వెరిఫై చేస్తే.. అవి నిజ‌మేన‌ని తేలింది. కాగా త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అదే త‌ర‌హాలో లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు బ‌స్సుల‌ను తిప్పుతార‌ని ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌చారం అవుతోంది. టిక్కెట్ ధ‌ర రూ.15 ల‌క్ష‌లు ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లు నిజం అవుతాయో, కావో చూడాలి.

ఇది ఐపీఎల్లా?.. కర్రా బిల్లా?.. దినేష్ కార్తీక్ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు… దినేష్ షాట్స్ చూడండి….

ఐపీఎల్ అంటే దూకుడుకు పర్యాయపదం. వేగానికి ప్రతిపదార్థం.. ఎంత ధాటిగా ఆడితే జట్టుకు అంత స్కోరు లభిస్తుంది. ఎంత స్కోరు లభిస్తే విజయానికి అంత దగ్గరవుతుంది.
అందుకే టి20ల్లో ఆటగాళ్లు ధనా ధన్ ఇన్నింగ్స్ కు ప్రాధాన్యమిస్తారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, గేల్, రోహిత్ శర్మ వంటి వారు పంచ్ హిట్టర్లు గా పేరు పొందారంటే కారణం వారి దూకుడైన ఆట తీరే. ఈ జాబితాలో బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ పూర్తి విభిన్నం. ఒళ్ళును విల్లులాగా ఉంచి ఆడతాడు. 360 డిగ్రీలు కాదు.. 720 డిగ్రీల్లోనూ బ్యాటింగ్ చేస్తాడు. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అలాంటి ఆట తీరు ప్రదర్శించి అలరించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షాట్లు అలానే ఆడి పరుగులు పిండుకున్నాడు.

ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా తొలి వికెట్ కు మెరుపు ఆరంభం లభించలేదు. జాక్స్ (8), మాక్స్ వెల్(0) , లామ్రోర్(0), సౌరవ్ చౌహన్ (9) వంటి వారు పూర్తిగా నిరాశపరిచారు.. కెప్టెన్ డూ ప్లెసిస్(61), రజత్ పాటిదార్(50), దినేష్ కార్తీక్ (55 ) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 196 రన్స్ స్కోర్ చేయగలిగింది.

అయితే ఈ మ్యాచ్లో మాక్స్ వెల్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనదైన ఆట తీరుతో అలరించాడు. దూకుడుకు అసలు సిసలైన పర్యాయపదంలాగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 55 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ తీరుతో బెంగళూరు 196 పరుగుల స్కోర్ చేసింది. ముఖ్యంగా 16 ఓవర్లో అతడు ఆడిన ఆట ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్.

16 వ ఓవర్ ను ఆకాష్ వేశాడు..తొలి బంతి వైడ్ గా వెళ్ళింది. మరుసటి బంతిని డూ ప్లెసిస్ సింగిల్ తీసి దినేష్ కార్తీక్ స్ట్రైక్ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైంది దినేష్ కార్తీక్ మాయాజాలం. రెండో బంతిని ఆకాష్ ఫుల్ టాస్ వేయగా.. జస్ట్ బ్యాట్ వంచి దినేష్ ఆడాడు.. ఆ బంతి నేరుగా ఒక స్టెప్ తీసుకొని బౌండరీ దాటింది. మరుసటి బంతిని ఆకాష్ డాట్ బాల్ గా వేశాడు. ఇంకో బంతిని ఫుల్ టాస్ వేయగా దినేష్ కార్తీక్ సేమ్ అలానే బ్యాట్ వంచి ఆడాడు. అది కూడా బౌండరీ దాటింది. మరుసటి బంతిని కూడా అలాగే వేయడంతో దినేష్ కార్తీక్ ఈసారి మరింత విభిన్నంగా బ్యాట్ తిప్పి కొట్టాడు. ఫలితంగా బంతి ఫోర్ వెళ్లింది. ఒత్తిడిలో ఆకాష్ ఆరో బంతిని వేసే క్రమంలో అది వైడ్ వెళ్ళింది. ఆ తర్వాత బంతిని నేరుగా యార్కర్ వేస్తే.. దానిని కూడా దినేష్ ఫోర్ గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో బెంగళూరు జట్టుకు 19 పరుగులు లభించాయి. చివరి ఓవర్ లోనూ దినేష్ కార్తీక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 19 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ కూడా ఆకాశ్ వేయడం విశేషం.

PF Account: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం..ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ​​ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో ​​బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది.

చాలా సార్లు ఈపీఎఫ్‌వో ​​బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ​​ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు మాన్యువల్‌గా పీఎఫ్‌ అకౌంట్‌ బదిలీ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో ఆటోమేటిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ కోసం ఉద్యోగులు రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉండగా ఇప్పుడు అలాంటిదేమి లేదు. దీంతో ఉద్యోగులకు మరింత సులభతరమైంది.

ఇప్పుడు ఉద్యోగస్తులు ఈ ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన అవసరం ఉండకుండా కొత్త ఉద్యోగం కోసం వెతకవచ్చు. కొత్త ఉద్యోగం మారినప్పుడు EPF ఖాతాలోని డబ్బు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి. పీఎఫ్‌ అకౌంట్‌ బదిలీ కావాలంటే ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌లో ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, యజమాని కూడా ఉద్యోగి తరపున సమాన మొత్తాన్ని ఈపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్ చేయాలి.

పీఎఫ్‌ ఆన్‌లైన్ బదిలీకి యూఏఎన్‌ ఎందుకు అవసరం?

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది ఒక వ్యక్తికి పీఎఫ్‌ నుంచి ఇచ్చే అకౌంట్‌ నంబర్‌. ఈ ఐడీ ఒకసారి తీసుకుంటే ఎన్ని ఉద్యోగాలు మారినా ఇదే ఉంటుంది. ఎక్కువ ఈపీఎఫ్‌ ఖాతాలను ఒకే సభ్యునికి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.

UAN అనేక రకాల సేవలు:

యూఏఎన్‌ నంబర్‌ వివిధ రకాల సేవలను అందిస్తుంది. ఇందులో UAN కార్డ్, అన్ని బదిలీ-ఇన్ వివరాలతో అప్‌డేట్‌ అయిన పీఎఫ్‌ పాస్‌బుక్, మునుపటి సభ్యుల పీఎఫ్‌ ఐడీని ప్రస్తుత పీఎఫ్‌ ఐడీతో లింక్ అయి ఉంటుంది. ​సహకారాల క్రెడిట్‌కు సంబంధించి నెలవారీ SMS నోటిఫికేషన్‌లు ఉంటాయి.

Breaking:చంద్రబాబు,లోకేష్‌కు కొత్త టెన్షన్..హైకోర్టు కీలక నిర్ణయం?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నామినేషన్ తేదీలు కూడా వెల్లడించారు. ఈసారి ఎన్నికలు ఏపీలో కొత్త చరిత్రను సృష్టించబోతాయా అన్నట్టు పోటీపోటీగా ఉంది. సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా ప్రచారం జోరు పెంచారు. వైసీపీని ఎలాగైనా ఓడించే లక్ష్యంతో అటు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణకు టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే..నామినేషన్‌కు సమయం దగ్గరపడుతోంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కచ్చితంగా నామినేషన్‌లో భాగంగా తమపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైనా తేడా వచ్చినా, తమకు తెలిసి, తెలియక ఎక్కడైనా కేసులు నమోదైన ఆ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేకపోతే పరిశీలనలో వారి నామినేషన్లు తిరస్కరిస్తారు. అయితే ఈ విషయంలో వారిపై రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని కోరుతున్నా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వీరు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రాకపోవడంతో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు వీరికి కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది.

OnePlus Mobiles: దేశంలో One Plus ఫోన్ల్ అమ్మకాలు బంద్.. మే 1 నుంచే.. ఎందుకంటే..

భారతదేశంలోని రిటైల్ చైన్‌లు మే 1 నుంచి చైనాకు చెందిన ప్రసిద్ధ వన్‌ప్లస్ బ్రాండ్ మెుబైల్ పరికరాల అమ్మకాలను నిలిపివేయనున్నాయి. కంపెనీకి, రిటైలర్లకు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలోని OnePlus ఉత్పత్తులపై స్థిరంగా తక్కువ లాభాల మార్జిన్‌లు రిటైలర్‌లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం సవాలుగా మార్చాయని చెబుతున్నారు.
వీటికి తోడు వారంటీ, సర్వీస్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో నిరంతరం జాప్యంతో పాటు సంక్లిష్టతల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ పేర్కొంది. వీటిని వాటిని పరిష్కరించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ వారి భారం పెరిగిందని వారు చెబుతున్నారు. దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొన్ని ప్రధాన ఫలిత మార్కెట్లలో నిషేధం వర్తిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి ప్రభావవంతమైన, ఆర్థికంగా పెద్ద రాష్ట్రాలు కావటం గమనార్హం. అందువల్ల మొబైల్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని OnePlus పరికరాలు ఈ రాష్ట్రాల్లోని మొత్తం 4,500 స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఇది కంపెనీకి నిజంగా పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.

33 ఏళ్ల సర్వీసు, 61 సంవత్సరాల వయో పరిమితి పూర్తైన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు సీఎంవోకు పంపారు. అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.

భారతదేశంలో చివరి గ్రామం ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశం, చైనా సరిహద్దు నుండి వచ్చిన చివరి భారతీయ గ్రామం “మా నా” గ్రామం. ఇది చమోలి జిల్లాలో ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ గ్రామాన్ని టూరిజం విలేజ్ గా నియమించింది. మన గ్రామం బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది బద్రీనాథ్ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో సరస్వతీ నది ఒడ్డున ఉంది. ఇది సుమారు 3219 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామం చుట్టూ హిమాలయ కొండలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

హిందూ పురాణాల ప్రకారం మహాభారతం యొక్క ఆనవాళ్ళు మానా గ్రామంలో కనిపిస్తాయి. పాండవులు స్వర్గానికి వెళ్లేటప్పుడు మానా గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. భీమ్ పూల్ అని పిలువబడే రాతి వంతెన ప్రసిద్ధిచెందినది. ఇది సరస్వతి నదికి వంతెనగా ఏర్పడిన భారీ శిల. బద్రీనాథ్ ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో వసుధర అనే ఒక జలపాతం ఉంది. ఈ ప్రదేశంలో పాండవులు బహిష్కరణ సమయంలో తాత్కాలిక బస చేశారని నమ్ముతారు.

నాలుగు వేదాల గురించి రాసేటప్పుడు వేద వ్యాసుడు ఇక్కడ నివసించారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం వేదవ్యాసుడు తన పవిత్ర పుస్తకాల సేకరణ లో పేజీ లను పోలి ఉండే పైకప్పు ఈ గుహలో 5,000 సంవత్సరాలు పురాతనమైన చిన్న మందిరం ఉంది. అక్కడ నివసించే ప్రజలను బోటియాస్ అని పిలుస్తారు. మానా నుండి వసు దార వరకు ట్రెక్కింగ్ కు రెండు గంటల సమయం పడుతుంది. ఈ వంపు తిరిగిన ట్రెక్ సమయంలో వాసు ధర నది లోయ అద్భుతమైన అందాలను చూడవచ్చు.

Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు – సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?

Inter Supplementary Exams Dates 2024: ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు (Inter Results) విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా.?, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా.? వంటివి మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని.. విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.

ఇంటర్ పరీక్షల్లో కవల అక్కాచెల్లెళ్ల అరుదైన ఘనత! ఇది ఆల్ టైమ్ రికార్డు!

సాధారణంగా కవలల పిల్లలు అంటే.. నిమిషాల తేడాతో పుడతారు.. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు.. పోలికలు మాత్రమే కాక అలవాట్లు కూడా సేమ్ ఉంటాయి అంటారు. ఇక సినిమాల్లో అయితే కవలల గురించి కాస్త అతిగానే చూపిస్తారు. ఒకరిని కొడితే మరొకరికి దెబ్బ తగలడం.. ఇద్దరూ ఒకేసారి అనారోగ్యం పాలవ్వడం వంటి ఘటనలు చూపిస్తారు. కొందరి విషయంలో ఇలానే జరుగుతుందట. అదలా ఉంచితే ఇప్పుడు మేం మాత్రం ఓ ఆసక్తికర అంశాన్ని చెప్పబోతున్నాం. ఇద్దరూ కవల అక్కాచెల్లెళ్లు సాధించిన అరుదైన ఘనత గురించి ఇక్కడ వివరించబోతున్నాం.

సాధారణంగా కవలలు అంటే చూడ్డానికి ఇద్దరూ సేమ్ ఉంటారు. కానీ వారి అలవాట్లు, అభిరుచులు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఏవో కొన్ని విషయాల్లో మాత్రమే వారికి పోలికలు ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే కవలలు అన్ని విషయాల్లో ఒకేలా ఆలోచిస్తారు. ఆఖరికి చదువు, మార్కుల విషయంలో కూడా. తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షల్లో వీరిద్దరూ ఒకేలా మార్కులు తెచ్చుకుని.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా టాప్ మార్కులు కావడం విశేషం.

కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ఈ ఘనత సాధించారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్‌ చుక్కి, ఇబ్బని ఒకే పోలికతో ఉండటమే కాక తాజాగా రిలీజైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషం. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది అంటున్నారు వీరి తల్లిదండ్రులు. పదో తరగతిలో ఇద్దరూ 625 మార్కులకు గాను 620 మార్కులు తెచ్చు కున్నారని తెలిపారు.

ఈ వార్త తెలిసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం నిజంగా విశేషమే అంటున్నారు. ప్రస్తుతం చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డీఆర్కే పీయూ కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం వీరిద్దరు నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్‌ ఫలితాన్ని బట్టి ఇంజనీరింగా, మెడిసినా అనేది నిర్ణయించుకుంటారట. ఇక ఈ కవల అక్కాచెల్లెళ్లు కేవలం చదువులో మాత్రమే కాకుండా సంగీతం, డ్యాన్స్, ఆటల్లో కూడా ఇలానే ముందుంటారట.

వీరి తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై చాలా సంతోషంగా ఉన్నారు. తన బిడ్డలు సాధించిన మార్కులు తనకు గర్వకారణమని చెప్పారు. ఇబ్బాని లాంగ్వేజ్ లలో తన సోదరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంన్నారు. సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఇద్దరికి ఒకటి నుండి రెండు మార్కులే తేడా అన్నారు. వాళ్లిద్దరూ కలిసే పనులు చేసుకుంటారని.. కలిసే చదువుకుంటారని.. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని గర్వంగా చెప్పుకొచ్చాడు.

AP Inter Results 2024 : BIEAP to declare 1st, 2nd year results today Here’s how to check

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.

అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP Inter Results 2024 Live Updates: BIEAP to declare 1st, 2nd year results today at bie.ap.gov.in. Here’s how to check

AP Inter Results 2024 Live: How to check results?
To check your scores for AP Intermediate Results 2024, follow these steps: Visit the official website at bie.ap.gov.in.

Click on the link provided for AP Inter Results 2024 on the homepage.

Log in by entering your credentials.

Your AP Intermediate Result score will be displayed on the screen.

Download the AP Inter Results mark sheet. Keep a hard copy of the mark sheet for future reference.

12/4/2024 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల!

AP Inter Board Website

INTERMEDIATE PUBLIC REGULAR EXAMINATIONS RESULTS-2024
1st Year General Results Click Here
1st Year Vocational Results Click Here
2nd Year General Results Click Here
2nd Year Vocational Results Click Here

https://resultsbie.ap.gov.in/

 

Eenadu Website

JUNIOR INTER General Vocational
SENIOR INTER General Vocational

sakshi education results

 

Mana Badi Results 

AP Inter 1st Year Results …..click here

AP Inter 2nd Year Results …..click here

Janasena: గ్లాసు గుర్తును పోలిన బకెట్‌.. జనసేనపై ప్రభావం ఎంత..

జనసేన పార్టీలో బకెట్‌ సింబల్‌ చిచ్చు రేపుతోంది. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదంటున్నారు కొందరు పరిశీలకులు. అంతేకాదు.. జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఒక వైపు సీఎం జగన్ మేమంతా సిద్దం అంటూ జిల్లాల వారిగా బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన తరువాత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాగళం పేరుతో తణుకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నారు ఇరుపార్టీల అధ్యక్షులు. అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ చీఫ్‌ జలీల్‌ ఆరోపించారు.

ఎలక్షన్స్‌ అంటే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు. అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులేమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాంటి చిక్కే వచ్చిపడింది. జనసేన పొలిటికల్‌ స్టోరీలోకి నవరంగ్‌ కాంగ్రెస్‌ అనే ఓ సీజనల్‌ పార్టీ తేరంగేట్రం చేసింది. ఇది ప్రస్తుతం జనసేనకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో.. నవరంగ్‌ కాంగ్రెస్‌కు బకెట్‌ గుర్తు లభించింది. దీంతో ఆ పార్టీ పండగచేసుకుంటుంటే.. అదే సమయంలో గాజుగ్లాసు గుర్తును సంపాదించుకున్న జనసేన నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. తమ గుర్తును పోలిఉన్న బకెట్‌తో పెద్ద థ్రెట్‌ ఉందని భావిస్తున్నారు. అంతేకాదు.. నవరంగ్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థులతో మ్యాచ్‌ అవుతున్నాయి.

పిఠాపురంలో బకెట్ గుర్తు అభ్యర్థి కె.పవన్‌కల్యాణ్‌, తెనాలిలో బకెట్ గుర్తు అభ్యర్థి ఎన్‌.మనోహర్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని నిలబెట్టామంటున్నారు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ జలీల్‌ఖాన్‌. అవి యాధృచ్చికంగా వచ్చాయని చెబుతున్నారాయన. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. మరోవైపు నవరంగ్‌ పార్టీ చీఫ్‌ను పిలిపించి మాట్లాడిన జనసేన నేత బాలశౌరి.. ఆయన దగ్గరున్న బీఫామ్స్‌ మొత్తం తీసుకుపోయారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలశౌరి తన తలపై గన్ను గురిపెట్టి.. బెదిరించి.. బీఫామ్స్‌ మొత్తం కాజేశారంటున్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా తేల్చుకోవాలి గాని.. బెదిరించడం దారుణమంటున్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్‎కు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. కారు గుర్తుని పోలిఉన్న రోడ్డురోలర్‌, చపాతీ కర్ర, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. మరి నవరంగ్‌ పార్టీ అధ్యక్షుడి డిమాండ్లకు తలొగ్గుతారో.. లేదో.. చూడాలి.

Dakshinamurthy sthotram: దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

Dakshinamurthy sthotram: సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తి భావిస్తారు. మర్రి చెట్టు కింద కూర్చొని రుషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది.

త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వరపరచిన దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఈ శ్లోకం శివుడికి సంబంధించినది. క్రమం తప్పకుండా జపిస్తే జీవితంలోనే అడ్డంకులు, సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తి శ్లోకాన్ని పట్టించడం వల్ల అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి.

ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయమవుతుంది. గురు గ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు. విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు. జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు.

దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన. అంతిమ అవగాహన, జ్ఞానం కలిగిన వ్యక్తిగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు. అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెప్తారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణామూర్తికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి.

సర్వోన్నత గురువుగా ఆయనను పూజిస్తారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వరపరిచారు. పది శ్లోకాలతో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతారు. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ సూత్రాలు వివరిస్తాయి.

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరోవోద్భూతం యథా నిద్రయా

యః సాక్షాత్కుఋతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..||

బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యంచిత్రీకృతం

మాయావీయ విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్చయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..|||

యస్వైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్తవ్యమసీతి వేదవచసా యో బోధయత్యాశితాన్

యత్శాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||

నానాచ్చిద్రఘటో దరస్థితమహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే

జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||

దేహం ప్రాణమా పీంద్రియాణ్యాపి చలాం బుద్ధిః చ శూన్యం విదుః

స్త్రీబాలాంఢజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః|

మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాఛ్ఛాదనాత్

సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్

ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభి జ్ఞాయతే

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషొ మాయాపరిభ్రామితః

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

భూరంభాంస్యనలో నిలో మ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యవ మూర్త్వష్టకం

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్య శ్రావణాత్తదర్థమననాద్ధానాచ్చ సంకీర్తనాత్

సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః

సిద్ద్ధ్యేత్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం||

బ్రిటిష్ వారికి సైతం అప్పులు ఇచ్చిన భారతీయుడు ఎవరో తెలుసా..?

నవంతులు అనగానే మనకు అంబానీ, ఆదానీ పేర్లు గుర్తుకువస్తాయి.. బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని పాలిస్తున్న కాలంలో అంబానీ కంటే గొప్ప ధనవంతుడు, బ్రిటిష్ వారికి అప్పులిచ్చే వ్యక్తి మన దేశంలో ఉన్నాడని మీకు తెలుసా?

అలాంటి ధనవంతులలో ఒకరు సేథ్ ఫతే చంద్ అలియాస్ ‘జగత్ సేథ్’. అతను 18వ శతాబ్దపు అతిపెద్ద అంతర్జాతీయ బ్యాంకర్. బ్రిటిష్ వారు కూడా అతని నుండి డబ్బు తీసుకుంటున్నందున అతన్ని జగత్ సేథ్ అని పిలిచేవారు. ఆ సమయంలో, అతని నికర విలువ నేటి భారీ సంపదకు సమానం.

గతంలో భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలిచేవారు, బ్రిటిష్ వారు కూడా ఈ సౌభాగ్యాన్ని చూసి భారతదేశానికి వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడ పాలించారు. బ్రిటిష్ పాలనలో, భారతదేశం ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. జగత్ సేథ్ బ్రిటిష్ కాలంలో గొప్ప వ్యాపారవేత్త మరియు బ్యాంకర్, అతను వడ్డీకి డబ్బు ఇచ్చేవాడు. అప్పట్లో ఆయన సంపద నేటి కరెన్సీలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని పలు మీడియా కథనాలు ప్రచురించాయి.

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక చరిత్రకారుడు రాబిన్ ఓర్మే, జగత్ సేథ్‌ను ఆ సమయంలో ప్రపంచంలోనే గొప్ప బ్యాంకర్ మరియు డబ్బు మార్చే వ్యక్తిగా పేర్కొన్నాడు. నేడు, పశ్చిమ బెంగాల్‌లోని జగత్ సేథ్ ఇంటిని మ్యూజియంగా మార్చారు.

మరొక చరిత్రకారుడు, గులాం హుస్సేన్ ఖాన్, జగత్ సేథ్ తన వ్యాపారాన్ని 17వ శతాబ్దం చివరి త్రైమాసికంలో ప్రారంభించాడు. 18వ శతాబ్దం నాటికి, ఇది బహుశా దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా మారింది. జగత్ సేథ్ బెంగాల్ ఆర్థిక వ్యవహారాలలో చాలా ప్రభావం చూపాడు. అక్కడ నాణేలను ముద్రించే గుత్తాధిపత్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆ సమయంలో, దేశంలోని అనేక ప్రాంతాలలో జగత్ సేథ్ కార్యాలయాలు ఉన్నాయి, అక్కడ నుండి డబ్బు ఇచ్చే పని నిర్వహించబడింది. జగత్ సేథ్ నిరుపేదలకు డబ్బు ఇచ్చేవాడు.

నేడు బ్యాంకుల వ్యాపారం చేసే విధానం, కొంతమేరకు జగత్ సేథ్ కూడా వ్యాపారం చేశాడు. దేశంలోని వివిధ నగరాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, వారు దూతలను సంప్రదించే మంచి అంతర్గత కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించారు. అతని బ్యాంకింగ్ నెట్‌వర్క్ కోల్‌కతా, ఢాకా, ఢిల్లీ మరియు పాట్నాలో విస్తరించింది. తన పుస్తకం ‘ప్లాసీ: ది బ్యాటిల్ దట్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’లో, సుదీప్ చక్రవర్తి జగత్ సెథ్‌ను తన కాలపు అంబానీ అని కొనియాడారు.

జగత్ సేథ్ లేదా అతని కుటుంబం గుర్తించి పుస్తకాలు ఉన్నాయి. కానీ ధనవంతుల విషయానికి వస్తే, వారు ప్రస్తావించబడలేదు. దీనికి ప్రధాన కారణం జగత్ సేథ్ కుటుంబానికి చెందిన ఆస్తులు పూర్తిగా ధ్వంసం కావడమే. బ్రిటీష్ వారి ఆధిపత్యం కారణంగా కుటుంబం తన పట్టును కోల్పోయింది. అంతే కాదు, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ జగత్ సేథ్ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. సియార్-ఉల్-ముతాఖేరిన్ ప్రకారం, సిరాజ్‌పై ప్రచారం కోసం జగత్ సేథ్ బ్రిటిష్ వారికి రూ.3 కోట్లు ఇచ్చాడు. రూ.లక్ష ఇచ్చారని, బ్రిటీష్ వారు తిరిగి చెల్లించలేదన్నారు.

20వ శతాబ్దం ప్రారంభంలో, జగత్ సేథ్ కుటుంబం పేరు ఎక్కడా వినబడలేదు. ముఖ్యంగా, మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా 1723లో ఫతే చంద్‌కు జగత్ సేథ్ అనే బిరుదును ప్రదానం చేశాడు, దీని అర్థం ‘ప్రపంచ బ్యాంకర్’. అతని ఇల్లు ఈరోజు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉంది. ఇది ఇప్పుడు మ్యూజియం.

వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!

వాతావరణ నిపుణుల అంచనా

అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదే

2003 మే 28న 49.9 డిగ్రీలతో రెంటచింతల టాప్‌

ఏప్రిల్‌ చరిత్రలో తిరుపతిలో అత్యధికంగా 45.7 డిగ్రీలు

ఆదివారం 46 డిగ్రీలతో ఆ రికార్డును తుడిచేసిన మార్కాపురం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్‌ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఇలా..
ఏప్రిల్‌ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్‌ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.

కోట్ల రూపాయలతో అపార్ట్ మెంట్స్ కొన్నాం.. నీళ్లు ఇవ్వండి ప్లీజ్ : రోడ్డెక్కిన ధనవంతులు

కర్ణాటకలో గత కొన్నిరోజులుగా నీళ్ల సమస్య ఏవిధంగా ఉందో మనం చూస్తున్నాం. చేతులు కడుక్కోవడానికి కూడా టిష్యూలు వాడుతున్నారంటే నీటి సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సమస్య ఇపుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర రాజధాని బెంగళూరు సిటీలో వ్యాపారులు మూతపడ్డాయి. బిజినెస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలా చిన్నాచితక హోటళ్లు నీటి కొరతతో మూసేసారు. చాలా మంది ఇప్పటికే తమ సొంతూళ్లకు వెళ్లారు.

బెంగళూరులోని మామూలు ప్రాంతాల్లోనే కాదు..ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొన్న రెసిడెన్సియల్ కాలనీల్లోనూ,సొసైటీల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. అపార్ట్ మెంట్ ,రెసిడెన్షియల్ వాసులు నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. కోట్టు పెట్టి ఫ్లాట్లు కొన్నా నీళ్లు లేవని ఆందోళన చేస్తున్నారు.

నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు (BWSSB) రోజుకు 40 లక్షల నుండి 2 కోట్ల లీటర్ల మధ్య వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు, సొసైటీలకు నీటి సరఫరాలో 10 శాతం కోత విధించారు. దీంతో సెంట్రల్ బెంగళూరులోని షాపూర్జీ పల్లోంజీ పార్క్‌వెస్ట్‌లో కూడా నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ రెసిడెన్షియల్ లో ఒక్కో ఫ్లాట్‌ ధర దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంది. అయితే కోట్లు పెట్టి కొన్నా నీటి కష్టాలేంటని బిల్డర్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు నివాసితులు. నిరసన చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని కోట్టు పెట్టి ఫ్లాట్టు కొన్నా నీటి ఇబ్బందులేంటి..మాకు నీళ్లు కావాలి అంటూ బిల్డర్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

అయితే నివాసితుల నీటి సమస్యలు తీర్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రకటించింది. నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని సొసైటీ ఆఫీస్ బేరర్లతో మాట్లాడుతున్నామని షాపూర్జీ పల్లోంజి అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నీటి ట్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చినా వంద శాతం సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు.

దడ పుట్టిస్తున్న పుత్తడి.. తులం 80 వేలకు చేరనుందా? ఈ రోజు ధర ఎంతంటే?

ప్రస్తుతం దేశంలో పసిడి ధరలు వరుసగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది పసిడి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కొంత కాలంగా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో పలు మార్పుల ప్రభావం బంగారం, వెండి పై తీవ్రంగా పడుతుందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పసిడి ధరలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. రికార్డు మోత మోగిస్తూ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఒకటీ రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టినా… మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి ధరలు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం. అందుకే పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. ఆపద సమయంలో పనికి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తుంటారు. ఈ కారణం చేతనే గత కొంత కాలంగా పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. దీంతో పసిడి, వెండి కొనుగోలు బాగా పెరిగిపోవడంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,230 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.88,400వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,760లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,740 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,370 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.84,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,900వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.88,400 లు ఉండగా, ఢిల్లీ లో రూ.84,900 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

Eye Vision Exercises: కంటి చూపుకు పదును పెట్టే ఎక్సర్‌సైజ్‌లు.. రోజుకు రెండు సార్లు చేశారంటే..

వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగింజడం సహజం. అయితే అతి చిన్న వయసులోనే కంటి పవర్ రోజురోజుకు తరిగిపోతుంటే మాత్రం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నేటి కాలంలో ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్ కారణంగా చాలా మందికి అనేక రకాల కంటి సమస్యలు వస్తున్నాయి.

రోజంతా ల్యాప్‌టాప్, ఫోన్‌తో కూర్చోవడమే అందుకు కారణం. అయితే ఈ కింది కంటి వ్యాయామాలు చేస్తే కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

గతితప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి కంటి చూపు మందగిస్తుంది. అటువంటి పరిస్థితులలో ప్రత్యేక కంటి సంరక్షణ అవసరం. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.

కొన్ని నిమిషాల పాటు వేళ్లతో కనురెప్పను తేలికగా నొక్కాలి. తర్వాత కనురెప్పపై వేలితో ఒకసారి సవ్యదిశలో, మరోసారి అపసవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి కళ్ళు నొప్పిగా ఉంటాయి. ఆ నొప్పి క్రమంగా తలనొప్పిగా మారుతుంది. కొన్ని నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కళ్లకు ఫోకస్ చేయడం, రొటేషన్, పైకి క్రిందికి చూడటం వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది.

ఈ వ్యాయామం రోజుకు రెండుసార్లు లేదా మీకు సమయం దొరికినప్పుడల్లా చేయవచ్చు. అయితే కంటి చూపు మెరుగుపడాలంటే రాత్రి పూట ఫోన్ వాడకాన్ని నివారించాలి.

అధిక చెమటను ఈ చిట్కాలతో నివారించండి

ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది చెమటను తగ్గిస్తుంది. అంతేకాదు వీట్ గ్రాస్ జ్యూస్ లో విటమిన్ బి 6, ప్రోటీన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 బాగా లభిస్తాయి. చెమటను తగ్గించే ఇంకో సులభమైన చిట్కా కార్న్ ఫ్లార్, బేకింగ్ సోడా కాంబినేషన్. 1/2 కప్పు కార్న్‌స్టార్చ్, 1/2 కప్పు బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని అండర్ అర్మ్స్ కు పట్టించండి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా ఎండాకాలంలో వదులుగా ఉండే సౌకర్యవంతమైన బట్టలు చెమటను నివారించడంలో సహాయపడతాయి. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే కాఫీ, టీలు కొంచం తక్కువగా తాగండి. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది.

CMSS: సెంట్రల్‌ మెడికల్ సర్వీసెస్‌ సొసైటీలో మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్): 01 పోస్టు

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ఫైనాన్స్‌): 01 పోస్టు

3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌): ఒక పోస్టు

5. మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

6. మేనేజర్ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్): 02 పోస్టులు

7. మేనేజర్ (ఫైనాన్స్‌): 02 పోస్టులు

8. మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్‌): 02 పోస్టులు

9. ఆఫీస్‌ అసిస్టెంట్: 01 పోస్టు

10. వేర్‌ హౌస్‌ మేనేజర్ (ఫార్మాసిస్ట్‌): 01 పోస్టు

మొత్తం పోస్టులు: 15.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: మేనేజర్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,00,000; మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000; ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 20-05-2024.

Loan Rules: గడువు ముందే రుణం చెల్లిచేస్తున్నారా..?? దీనికి ఆర్బీఐ నియమాలేంటో తెలుసా..

Loan Foreclosure: చాలా మంది నేటి కాలంలో తమ ఆర్థిక అవసరాలు, ఇతర కోరికల కలలను తీర్చుకునేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీటి చెల్లింపులకు సంబంధించిన విషయంలో రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన నియమ నిబంధనలు చాలా తక్కువ మందికి ఇప్పటికీ తెలియవు.

హోమ్ లోన్ నుంచి బిజినెస్ లోన్ వరకు అవసరానికి అనుగుణంగా బ్యాంకులు వ్యక్తులకు సులువుగా లోన్స్ నేటి కాలంలో అందిస్తున్నాయి. అయితే సమయానికి వీటి ఈఎంఐలు చెల్లించటం ఒక పెద్ద బాధ్యతని తెలిసిందే. కొంత మంది హోమ్ లోన్ లాంటి దీర్ఘకాలిక రుణాల విషయంలో వీలైనంత త్వరగా చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. గడువుకు ముందే లోన్ ఫోర్‌క్లోజర్ చేస్తుంటారు. కొన్ని బ్యాంకులు దీనికి అదనపు చార్జీలు వసూలు చేస్తుంటాయి.

చాలా మంది రుణాల విషయంలో బయపడుతుంటారు. సమయానికి చెల్లింపులు చేయగలమా లేదా అని ఆందోళన చెందుతుంటారు. అందుకే గడువుకు ముందే డబ్బు కూడబెట్టి వాటిని తిరిగి చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వాస్తవానికి, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు, బైక్ రుణాలు, కారు రుణాలు వంటి రకాలు కూడా లోన్ ఫోర్‌క్లోజర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. రుణాన్ని ముందుగా చెల్లించినందుకు క్లోజర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాన్ని తీసుకున్నట్లయితే.. RBI వడ్డీ రేటును మార్చడంతో మీ రుణంపై వడ్డీ రేటు మారుతుంది. కాబట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్‌తో మీరు ముందస్తుగా తిరిగి చెల్లించాలనుకుంటే ఎలాంటి ముందస్తు క్లోజర్‌కు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో మీరు టర్మ్‌కు ముందు అంటే ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నప్పుడు దానిని మూసివేయాలనుకుంటే లోన్ క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.

ముందస్తు రుణ చెల్లింపులకు ఎందురు ఛార్జీలు బ్యాంకులు వసూలు చేస్తాయనే అనుమానం మనలో చాలా మందికి ఉంటూనే ఉంటుంది. రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినట్లయితే.. అతనిపై రుణ బాధ్యత తీసివేయబడుతుంది. అయితే దీని వల్ల బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లుతోంది.

కాబట్టి రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, బ్యాంకులు లోన్ ఫోర్క్లోజర్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది మీరు చెల్లించాల్సిన బకాయి బ్యాలెన్స్‌లో 5% వరకు ఉంటుంది. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు దీనికి సంబంధించిన నియమాలను పత్రాల్లో పొందుపరుస్తాయి. అందువల్ల లోన్ తీసుకునే సమయంలోనే ఫోర్ క్లోజర్ రూల్స్ అడిగి తెలుసుకోవటం ఉత్తమం.

ఏడువారాల నగల వెనుక ఇంత చరిత్ర దాగి ఉందా..!!!

ఏడువారాల నగలు అంటే తెలియని వారు ఉండరు. వారం రోజుల్లో రోజుకో రకంగా నగలని ధరిచేవారు. ఏడువారాల నగలకి పూర్వం ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే చాలా మందికి ధర్మ సందేహం ఏమిటంటే. అసలు ఏడువారాల నగలు ఎందుకు వేసుకోవాలి. వాటిని వేసుకోవడం వలన లాభం ఏమిటి..?? వారానికో రకం చప్పున ఎందుకు వీటిని ధరించాలి..??

ఏడువారాల నగల ప్రాముఖ్యత ఏమిటంటే. మన పూర్వీకులు గ్రహాల యొక్క అనుగ్రహం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం ఏడువారాల నగలు ధరించేవారు. ఆదివారం మొదలు శనివారం వరకూ రోజుకో ఆభరణాన్ని ధరించే వారు. గ్రహాలకి అనుకూలంగా ఉండేలా ఈ నగలు ధరించేవారు. మరి ఏ రోజుకి ఏ ఆభరణం ధరిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం.

చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం ఈ రోజున ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకునే వారు.
మంగళవారం కుజుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకుంటే ఎంతో శుభం జరుగుతుందని మన పూర్వీకులు భావించేవారు.

బుధవారం రోజు బుద్ధుడికి ఇష్టమైన పచ్చల హారాలు గాజులు వేసుకుంటే ఎంతో మంచిది అలాగే

గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు, అందుకే గురువారం పుష్పరాగం తో చేసిన చెవి దిద్దులు ఉంగరాలు ధరించటం ఎంతో శుభసూచకం

శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇ ఆరోజు వజ్రాల హారాలు ముక్కుపుడకను ధరించి లక్ష్మీదేవిల అలంకరించుకుని నిండుగా ఉండాలని అంటుంటారు

శనివారం రోజు ఊ శని భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజున ఆయనకు ఇష్టమైన నా నీలమణి నగలు తగ్గించడంతోపాటు నెలలో చేసిన నగలు ముక్కుపుడక పెట్టుకోవటం ఎంతో మంచిది నవరత్నాలతో పాపిడి బిల్ల వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. IPLలో ఏకైక బౌలర్​గా అరుదైన రికార్డు!

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లే తీశాడతను. వికెట్లు పడకపోయినా అతడి ఎకానమీ 6 లోపే ఉంది. బుమ్రా బౌలింగ్​ను జాగ్రత్తగా ఆడుతున్న బ్యాటర్లు.. ఇతర బౌలర్లను అటాక్ చేయబోయి దొరికిపోతున్నారు. దీంతో కసి మీద ఉన్న పేసుగుర్రం తన కోపం మొత్తాన్ని ఆర్సీబీ మీద చూపించాడు. ఆ టీమ్​తో జరుగుతున్న మ్యాచ్​లో బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బెంగళూరు బ్యాటర్లను గడగడలాడించాడు. ఓపెనర్ విరాట్ కోహ్లీతో వికెట్ల వేటను మొదలుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత మరో నలుగురికి పెవిలియన్​ దారి చూపించాడు. ఈ మ్యాచ్​తో అతడు చరిత్ర సృష్టించాడు.

స్టార్ బ్యాటర్​ కోహ్లీ (3)ని మ్యాజికల్ డెలివరీతో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత ఆసీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్ (61)​ను కూడా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మహిపాల్ లోమ్రోర్ (0)​తో పాటు సౌరవ్ చౌహాన్ (9), వైఖాఖ్ విజయ్ కుమార్ (0)ను పెవిలియన్​కు పంపాడు. 5 వికెట్ హాల్​ను పూర్తి చేసుకున్నాడు బుమ్రా. అయితే ఈ మ్యాచ్​తో అతడో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ హిస్టరీలో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు బుమ్రా.

క్యాష్ రిచ్ లీగ్​లో మూడు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 20వ సారి కావడం గమనార్హం. ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్న లసిత్ మలింగ (19 సార్లు)ను అధిగమించాడు. ఈ మ్యాచ్​తో మరో రికార్డును కూడా బుమ్రా తన అకౌంట్​లో వేసుకున్నాడు. ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్​గా అతడు నిలిచాడు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరి..

Health

సినిమా