Saturday, November 16, 2024

రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 40 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 40 పోస్టుల భ‌ర్తీకి ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు న‌వంబ‌ర్ 4 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

ఏపీ రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 40 పోస్టుల భ‌ర్తీకి ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు న‌వంబ‌ర్ 4 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, భూప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ 40 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ఆదేశించారు. అందులో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు-13 కాగా, ఈ-డివిజనల్ మేనేజర్లు-27 ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా ఏర్ప‌డిన‌ రెవెన్యూ డివిజన్లకు ఆ పోస్టుల‌ను కేటాయించారు. ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు సంబంధిత జిల్లా కలెక్టర్ నియంత్రణలో, రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నియంత్రణలో ఉంటారు. ఈ-డిస్ట్రిక్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అమ‌లు కోసం, దానివల్ల ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం వీరు ప‌ని చేస్తార‌ని పేర్కొంది.

ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు పోస్టుల‌ను డిస్ట్రిక్ట్‌ క‌మిటీ ప్ర‌తిపాద‌న మేర‌కు క‌లెక్ట‌ర్ అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ క‌మిటీకి క‌లెక్ట‌ర్ చైర్మ‌న్‌గా, జాయింట్ కలెక్ట‌ర్‌, డిస్ట్రిక్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ స‌భ్యులుగా ఉంటాయి.

అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఈ-డివిజ‌నల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. విశాఖ జిల్లాలోని కొత్త‌గా ఏర్ప‌డిన భీమునిప‌ట్నం రెవెన్యూ డివిజ‌న్‌లో ఈ-డివిజ‌న‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్ అసిస్టెంట్ కేట‌గిరీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.
నెల‌వారీ జీతం…వ‌యో ప‌రిమితి

ఈ పోస్టుకు నెల‌వారీ వేత‌నం రూ.22,500 ఉంటుంది. 2022 జూలై 1 నాటికి 21 నుంచి 35 మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి.
విద్యార్హ‌త

ద‌రఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు గ్రాడ్యూష‌న్ (బీసీఏ, బీఎస్సీ, బీటెక్), మాస్ట‌ర్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. మంచి ఇంగ్లీష్ క‌మ్యూనికేష‌న్ నైపుణ్యం క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థి విద్యార్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీక‌రించాలి.
ఎంపిక ప్ర‌క్రియ

రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష అర్హ‌త సాధించిన త‌రువాత, డిస్ట్రిక్ క‌మిటీ ఇంటర్వ్యూ నిర్వ‌హిస్తుంది. ఐటీ సెక్ట‌ర్‌లో క‌నీసం రెండేళ్ల‌ అనుభవం ఉండే స‌ర్టిఫికేట్ ఉంటే, ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో 5 శాతం వెయిటేజ్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ క‌మిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తుంది. ఈ ఉద్యోగ ప‌ద‌వీకాలం జాయిన్ అయిన రోజు నుంచి ఏడాది పాటు ఉంటుంది. ప్ర‌భుత్వ సూచన‌, అలాగే ఉద్యోగి ప‌నితీరును బ‌ట్టీ పొడిగించ‌వచ్చు. అలాగే త‌ప్పుడు స‌మాచారం పొందుప‌రిస్తే ఆ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తారు. నియామ‌కం త‌రువాత ఏవైనా లోపాటు ఉంటే, ఏ నోటీసు లేకుండానే ఉద్యోగిని తొల‌గిస్తారు. భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన కమిష‌న‌ర్‌కు టెర్మినేట్ చేసే అధికారం ఉంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి

అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌ https://visakhapatnam.ap.gov.in/ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు కూడా అందులో ఉంటాయి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన త‌రువాత‌, ద‌ర‌ఖాస్తుదారు దాని ప్రింటెండ్ కాఫీతో పాటు సంబంధిత విద్యార్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి అంద‌జేయాలి.

ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ లిస్ట్ సచివాలయాల్లో

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలండర్ పథకం గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పొందాలంటే లబ్దిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి.

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) బుకింగ్ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి లబ్దిదారులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు బంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో గ్యాస్ డీలర్ ను సంప్రదించి ఈ-కేవైసీ చేయించుకోవాలి. అనతరం గ్యాస్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. దీంతో మీరు ఉచిత గ్యాస్ పథకానికి అర్హులుగా నిర్థారించుకోవచ్చు. అయితే లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో డబ్బును ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులకు ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి ఫోన్ చేయవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్‌ను మార్చి31వ తేదీలోపు, రెండోది జులై 31, మూడోది నవంబర్ 30లోపు సిలిండర్లను పొందవచ్చు.

ఈ-కేవైసీ ఎలా చేయించాలి?

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించాలి. అందుకుగాను లబ్దిదారులు తమ గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ కనెక్షన్ బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు(బియ్యం కార్డు)తో ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారి డేటా 24 నుంచి 48 గంటలలో అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీ అప్డేట్ అయిన తర్వాత లబ్దిదారుడి మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అనంతరం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ-కేవైసీ చేసినప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరిట ఉంటే వాళ్లే గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాలి. దీంతో పాటు లబ్దిదారుడు బ్యాంక్ ఖాతాకి NPCI లింక్ చేసుకోవాలి. అంటే గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలి. ఎన్పీసీఐ లింక్ బ్యాంకుల్లో చేస్తారు.

బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ తప్పనిసరి

అలాగే గ్రామాల వారీగా ఎన్పీసీఐ లింక్(బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్) చేసుకోవాల్సిన వారి వివరాలు సచివాలయాల్లో ఉందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదిస్తే వారు బ్యాంకు ఖాతా లింక్ కానీ వారి వివరాలు తెలియజేస్తారు. ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటే ఈ-కేవైసీతో పాటు ఎన్పీసీఐ కూడా పూర్తి చేసుకుంటే…గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో మీ ఖాతాల్లో రూ.851 సబ్సిడీ నగదు జమ అవుతుంది.
నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దీపం-2 పథకం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కూటమి పార్టీల ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఈదులపురంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబంలోని మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా! అయితే ఈ పోటీలు మీ కోసమే.. కౌశల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం భారతీయ విజ్ఞానమండలి, సైన్స్‌ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో కౌశల్ 2024 పేరుతో రాష్ట్రస్థాయి సైన్స్‌ ప్రతిభాన్వేషణ పోటీలను నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందిస్తారు.

భారతీయ విజ్ఞాన మండలి మరియు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్ 2024 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలను నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 విద్యార్థులకు క్విజ్, పోస్టర్ మరియు రీల్స్ విభాగాల్లో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాల నుండి క్విజ్ కు తరగతికి ముగ్గురు చొప్పున 9 మంది విద్యార్థులు, పోస్టరు, రీల్స్ కు తరగతికి ఇద్దరు చొప్పున ఆరుగురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు.

ఒక్కొక్క పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనుటకు అవకాశం ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు నవంబర్ 15వ తేదీలోగా https://bvmap.org/koushalRegistration.aspx ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.

పాఠశాల స్థాయి పరీక్ష ఆన్లైన్‌లో నవంబర్ 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు.జిల్లా స్థాయి పోటీ పరీక్ష ఆన్లైన్‌లో డిసెంబర్ 6వ తేదీన, రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబర్ 30వ తేదీన నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు రూ.1500, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం పొందిన విద్యార్థులకు రూ.5000,ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.3000, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు రూ.2000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. వీటితో పాటు ప్రశంసా పత్రం,జ్ఞాపికలను అందజేస్తారు.

నగరాల్లో పార్టీ కల్చర్.. రేవ్ పార్టీకి.. మందు పార్టీకి తేడాలు ఏంటో తెలుసా?

ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ పెరిగిపోతున్నది. వీకెండ్ లో పబ్బుల్లో చేరి ఎంజాయ్ చేస్తున్నారు. పాశ్చత్య దేశాల సంస్కృతి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సెలబ్రిటీలు, డబ్బున్న వ్యక్తులు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడి కల్చర్ కు అలవాటుపడి స్వదేశానికి వచ్చిన తర్వాత అదే కల్చర్ ను ఇక్కడ కొనసాగించేందుకు అలవాటు పడుతున్నారు. దీనిలో భాగంగా వచ్చిందే రేవ్ పార్టీ. రేవ్ పార్టీలకు బానిసలుగా మారుతున్నారు. సందర్భం ఏదైనా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రేవ్ పార్టీ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పోలీసుల రైడ్ తో రేవ్ పార్టీల ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రేవ్ పార్టీలో పట్టుబడుతుండడంతో తీవ్ర కలకలంరేపుతోంది.

ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడి బంధువుకు చెందిన ఫాం హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ రాష్ట్రంలో అలజడి సృష్టించింది. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేయడంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఫాం హౌస్ లో విదేశీ మద్యం బాటిళ్లు, క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. డ్రగ్స్ పార్టీ జరిగిందనే సమాచారంతో టెస్ట్ నిర్వహించగా పార్టీలో పాల్గొన్న వారు అందుకు సహకరించలేదు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనతో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ? రేవ్ పార్టీలో ఏం చేస్తారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇదే సమయంలో మందు పార్టీ అంటే ఏంటీ అని ఆరా తీస్తున్నారు. మరి రేవ్ పార్టీకి, మందు పార్టీకి తేడాలేంటీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రేవ్ పార్టీ ఎప్పుడు మొదలైందంటే.. రేవ్ పార్టీ కల్చర్ ఇంగ్లండ్ దేశంలో 1950లో మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా ఈ కల్చర్ విస్తరించింది. ఓ క్లోజ్డ్ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకుంటుంటారు. బడాబాబుల ఫాం హౌస్ లలో లేదా గెస్ట్ హౌస్ లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారు. అసలు మొదట్లో రేవ్ పార్టీలో మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేసేవారు. రేవ్ పార్టీలో ఒళ్లు మరిచి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం సేవిస్తూ.. డ్రగ్స్ తీసుకుంటూ అశ్లీల నృత్యాలతో నానా రచ్చ చేస్తుంటారు. రాను రాను రేవ్ పార్టీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను రహస్యంగా వాడడం మొదలైంది. రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మొదలు మూడు రోజుల పాటుగా నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకుంటారు.

ఈ పార్టీకి కేవలం పరిచయస్తులనే ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే పరిచయం లేని వారిని పిలిస్తే సమాచారం బయటకు పొక్కుతుందని కొత్త వారిని పిలవరు. రేవ్ పార్టీలు గోప్యంగా జరుగుతుంటాయి. ఈ పార్టీల్లో సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొంటుంటారు. ఎందుకంటే రేవ్ పార్టీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రేవ్ పార్టీకి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. రేవ్ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే యవ్వారం జరుగుతుందని సమాచారం. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి గుట్టును రట్టు చేస్తున్నారు. రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంతటి వ్యక్తులనైనా అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపిస్తున్నారు.

ఇక మందు పార్టీ విషయానికి వస్తే.. బర్త్ డేలు, వివాహాది కార్యక్రమాల్లో మందు పార్టీలు చేసుకుంటుంటారు. ఇలాంటి పార్టీల్లో ఎక్కువమంది పాల్గొంటుంటారు. ఆ సమయాల్లో పెద్ద మొత్తంలో మద్యం వినియోగిస్తుంటారు. మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్స్, ఇళ్లలో కూడా మందు పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి పార్టీలను మందు పార్టీలు అని పిలుస్తారు. అయితే సాధారణంగా అనుమతి లేని పార్టీలకు పోలీసులు అంగీకరించరు. వ్యక్తిగత పార్టీల్లో భారీ ఎత్తున లిక్కర్ కావాల్సివచ్చినపుడు తప్పనిసరిగా ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. విందు ఏర్పాటు చేస్తూ, అక్కడ పెద్ద మొత్తంలో మద్యం సేవించే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. అనుమతి లేకుండా మందు పార్టీ నిర్వహిస్తే నిర్వాహుకులపై చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా ఇళ్లల్లో చేసుకునే మందు పార్టీలకు 6 బాటిళ్ల వరకు అనుమతి పొందనవసరం లేదు.

నో కాస్ట్ EMIతో లాభమా? నష్టమా? అసలు విషయం ఏంటంటే

దేశంలో బ్యాంక్ లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి.పండగల సీజన్ వేళ ఇ-కామర్స్ సంస్థలతో పాటు షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సంస్థల్లో భారీ ఎత్తున డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ప్రకటిస్తుంటారు. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ గూడ్స్, గృహోపకరణాలు, దుస్తులలై ప్రత్యేక ఆఫర్లు లభిస్తుంటాయి. తమకు కావాల్సిన వస్తువులపై ఒకేసారి మొత్తం చెల్లించాల్సిన పని ఉండదు కనుక ఈఎంఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే నో కాస్ట్ ఈఎంఐ లో వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లకు లాభమా? నష్టమా? అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

పండుగల సందర్భంగా చాలా మంది కస్టమర్లు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే మార్కెట్ లో పలు వస్తువులపై భారీ ఆపర్లు కూడా ఉంటాయి.ఇటీవల చాలా మంది జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ బడ్జెట్ కి సరిపడ ఎక్కువ వస్తువులు తీసుకొని ఈఎంఐ పద్దతుల్లో చెల్లిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే మనం కొనుగోలు చేసే వస్తువు ధర మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవొచ్చు. జీరో వడ్డీతో నిర్ణీత వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి పలు కంపెనీలు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ వస్తువపై వడ్డీ భారాన్ని మాత్రం రద్దు చేయరు.

పండగ సమాయాల్లో తయారీదారులు లేదా అమ్మకందారులు తమ వస్తువల అమ్మకాలు పెంచుకునేందుకు రక రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు.అయితే.. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్న వారికి ఈ ప్రయోజనాలు ఉండవు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లో కొంటే ఆ వస్తువు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.. ఆఫర్ ధర వర్తించదు. కొన్ని సందర్బాల్లో వడ్డీని సైతం వస్తువు ధరలో కలిపి ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తారు. కనుక నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే సమయంలో ఈ విషయాలు గమనించాలి. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువు కొంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? లేదా అన్న విషయం తెలుసుకోవాలి. కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ కాల వ్యవధి తక్కువగా ఉంటుంది.. ఆ సమయంలో కట్టే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సమయానికి వాయిదాలు చెల్లించలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అనవసరంగా పెనాల్టీలు, వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే ముందు మన బడ్జెట్ ఎంత? సరైన సమయానికి వాయిదాలు చెల్లించగలమా? అనేది చూసుకోవాలి.

నెల వారీ చెల్లింపే కదా అని ఈజీగా తీసుకొని అనవసరమైన వస్తువులు కొని తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు.అలా చేస్తే నెల నెల చెల్లించే ఈఎంఐ భారం పెరిగి అప్పుల పాలవుతారు. అందుకే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తుంటాయి..వడ్డీ భారాన్ని కూడా భరిస్తాయి. అలాంటి కంపెనీలు గురించి తెలుసుకొని వాటిని ఎంపిక చేసుకుంటే బెటర్ అంటున్నారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు లోన్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజ్, డౌన్‌పేమెంట్ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. అది దాదాపు వస్తువుపై వడ్డీ రాబట్టడం లాంటిదే అంటున్నారు. వస్తువు కొనుగోలు చేసే సమయంలో ధరను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో సరిపోల్చుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ వస్తువు కొనుగోలు చేయడానికి నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుందని భావిస్తే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Insurance డబ్బులు లేట్ అవుతున్నాయా? ఇలా చేస్తే వెంటనే మీ సమస్య తీరుతుంది

ప్రస్తుతం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక భవిష్యత్తుకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అనేది కచ్చితంగా చాలా అవసరం. ఈ పాలసీ అనుకోని ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. మన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుంది. చాలా కంపెనీలు కూడా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పొలసీలు అందిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సకాలంలో డబ్బులు ఇవ్వవు. ఇలాంటి సమస్య సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎదురు కుంటూ ఉంటాము. మరి దీనికి పరిష్కారం లేదా అంటే చక్కటి పరిష్కారం ఉంది? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దారులు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక సమస్య ఎదురుకుంటారు. అదేంటంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు లేట్ అవుతాయి. కొన్ని కంపెనీలు అయితే ముందు మీరు మీ డబ్బులు కట్టుకోండి .. ఆ తరువాత మేము ఆ డబ్బుని మీకు మీ అకౌంట్ లో వేస్తాము అని చెబుతాయి. కొంత మందికి ఓకే అయినా దీని వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. సమయానికి హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు అందక బయట అప్పు చేసి మరీ హాస్పిటల్ లో బిల్లు కడతారు. అయితే ఇక నుంచి మీకు ఆ ఇబ్బంది ఉండదు. మీరు ఈ ఒక్క పని చేస్తే బీమా కంపెనీలు కిందకి దిగి వస్తాయి. సకాలంలో మీ డబ్బులను మీకు అందజేస్తాయి.

Insurance Regulatory and Development Authority of India(IRDAI) రూల్స్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి హాస్పిటల్ ఖర్చుని గంట లోపే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేయాలి. లేదంటే ఆ కంపెనీలపై చర్యలు తప్పవు. ఒకవేళ మీకు మీ ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేట్ అయినా లేక బీమా కంపెనీలు మీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా మీరు https://bimabharosa.irdai.gov.in/ వెబ్ సైట్ లో కంప్లయింట్ చేయవచ్చు. లేదా మీ కంప్లైంట్ ని complaints@irdai.gov.in.కి ఈమైల్ చేయవచ్చు. అలాగే 155255 లేదా 1800 4254 732 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు. దీంతో నిర్లక్ష్యంగా ఉన్న బీమా కంపెనీలకు ఫైన్ పడుతుంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ రూల్స్ ప్రకారం మీ సమస్య 30 రోజుల్లోపు తీరకపోతే బీమా కంపెనీలు కచ్చితంగా రోజుకి మీకు 5000 రూపాయల పెనాల్టీ కట్టాలి. కాబట్టి ఈ రూల్స్ ని గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి బీమా కంపెనీలు నిర్లక్ష్యం చేస్తే ఈ విధంగా కంప్లైంట్ చేస్తామని చెప్పండి. దాంతో వెంటనే మీ డబ్బును బీమా కంపెనీలు సకాలంలో చెల్లిస్తాయి.

గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం.. షరతులు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. మహిళల కోసం కేంద్రం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కొన్ని పథకాల గురించి తెలియక పోవడం వల్ల వాటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు మహిళలు. ఓ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.5లక్షలు రుణం పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ పథకం పేరు ఏంటీ? దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గత ఏడాది మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ‘లఖపతి దీదీ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహిళలు పరిశ్రమల ఏర్పాటు చేయాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం లఖపతి దీదీ యోజన పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. అయితే ఈ లోను కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు కొన్ని పత్రాలపై వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఎవరైనా మహిళలు దరఖాస్తు చేసుకుంటే.. వారి ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. సదరు మహిళ తప్పనిసరిగా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు అంతకు మించి ఉంటే అర్హులు కాదు. ఈ పథకం స్వయం సహాయక బృందంలోని మహిళలకే వర్తిస్తుంది. వ్యాపార ప్రణాళిక రూపొందించిన తర్వాత ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపబడుతుంది. ప్రభుత్వ అధికారులు దరఖాస్తును సమీక్షిస్తారు.

దరఖాస్తు ఆమోదించినట్లయితే.. ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందానికి రూ.5 లక్షల రుణం ఇవ్వబడుతుంది. అర్హులైన స్వయం సహాయక బృందంలోని మహిళలకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత సొంత వ్యాపారం చేసుకునేందుక వీలుగా రుణం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ యోజన పథకంతో అనుసంధానం చేయాలని.లఖపతి దీదీ పథకం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్లంబింగ్, డ్రోన్ రిపేర్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీ తదితర రంగాల్లో శిక్షణ పొందేందుకు వీలుగా మహిళలను స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశారు. దరఖాస్తు కోసం నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతాతో పాటే ఆధార్ కార్డు కి అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. మీరు ఇప్పటికే స్వయం సహాయక బృందంలో సభ్యులు కాకుంటే వెంటనే జాయిన్ కావాల్సి ఉంటుంది.

లఖపతి దీదీ యోజనకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించండి. వారు ఈ పథకానికి సంబంధించిన వివరాలు వివరణాత్మకంగా అందిస్తారు. ఇందుకు సంబందించిన దరఖాస్తు ఫారాలు తీసుకొని అవసరమైన అన్ని పత్రాలు సమర్పించండి. మీ పత్రాలను అధికారులు తనిఖీ చేసిన తర్వాత పథకానికి మీరు అర్హులు అనుకుంటే ఓ లెటర్ ఈ మెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ వస్తుంది. మీకు లోన్ మంజూరు అయిన తర్వాత వర్క్ షాప్, ఇతర శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మీరు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంటే లఖపతి దీదీ యోజన యొక్క ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. రాజస్థాన్ లో దాదాపు 11.24 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మీ డబ్బుని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు?

సంపాదించిన డబ్బులను ఎక్కువ లాభాలు వచ్చే మార్గాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల పొదుపు చేశామంటే నష్టపోతాము. చాలా మంది కూడా రిస్క్ లేకుండా ఎక్కువ రాబడి రావాలనుకుంటారు. అయితే, సాధారణంగానే రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల్లోనే ఎక్కువ లాభాలు వస్తుంటాయి. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్స్ డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి సురక్షితమైన మార్గాలు. ఇవి మీకు కొన్ని మంచి ఆప్షన్స్ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంక్ లలో ఫిక్సెడ్ డిపాజిట్లపై ఎక్కువ లాభాలు వస్తాయి. ఇక పోస్ట్ ఆఫీసులో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. పెద్దగా రిస్క్ అనేది లేకుండా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. అయితే కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎందులో ఇన్వెస్ట్ చేయాలా? అని చాలా మంది కూడా తేల్చుకోలేని స్థితిలో ఉంటారు? ఇక ఈ రెండింటిలో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ రెండు మంచివే అయినా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే పోస్టాఫీసు పొదుపు పథకాలు మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. పైగా వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ వంటి స్కీమ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంటాయి. అయితే, ఈ వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్ల గురించి సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. మరోవైపు.. పెద్ద పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7 శాతం నుంచి 7.50 శాతం దాకా వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. అయితే, పోస్టాఫీసు పథకాలు, రిటైర్మెంట్ పథకాల్లో గరిష్ఠంగా 8 శాతానికిపైగా వడ్డీ వస్తుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మంచిది.

ఒక్కో స్కీమ్ కి ఒక్కో టెన్యూర్, లాకిన్ పీరియడ్ అనేవి ఉండాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కి 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. వీటిలో మీకు ఏది అనుగుణంగానే ఉంటే దానిలో పొదుపు చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో పోస్టాఫీసు పథకాల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు కావాల్సినప్పుడు డబ్బులు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇక పోస్టాఫీసు పథకాల్లో మంచి అంశం ఏంటంటే మీకు చాలా వరకు కూడా టాక్స్ బెనిఫిట్ అంటే.. పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, బ్యాంక్ డిపాజిట్లలో 5 ఏళ్ల పీరియడ్ గల ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లు మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తాయి. ఇదీ సంగతి. ఎలాంటి రిస్క్ లేకుండా హై రిటర్న్స్ కోరుకునేవారికి బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఎక్కువ లాభాలు ఇస్తాయి.

LLB చేసి ఖాళీగా ఉన్నారా.. ఈ కోర్టు జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

కొందరికి న్యాయవాద వృత్తి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. లాయర్ అవ్వాలని కలలుకంటుంటారు. ఇందుకోసం లా కోర్సులు అభ్యసిస్తుంటారు. కోర్సులు పూర్తైన తర్వాత కోర్టుల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. మరికొంత మంది కోర్ట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు ఎల్ ఎల్బీ గ్రాడ్యుయేట్స్. జూనియర్ సివిల్ జడ్జ్, క్లర్క్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మరి మీరు కూడా కోర్టు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? కోర్టు జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? మీరు ఎల్ ఎల్ బీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి.

తెలంగాణహైకోర్టులో పనిచేసేందుకు 31 లా క్లర్క్‌లు, సికింద్రాబాద్ లోని స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో పనిచేసేందుకు 2 లా క్లర్క్‌ల పోస్టులు భర్తీకానున్నాయి. క్లర్క్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10+2 పూర్తి చేసిన తర్వాత 5 ఏళ్లు రెగ్యులర్ లా అభ్యసించాలి. లేదా 10+2 పాఠశాల విద్య తర్వాత మూడేళ్ల డిగ్రీ కోర్సు, ఆ తర్వాత 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పూర్తిచేయాలి. లా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, పని అనుభవం కలిగి ఉండాలి. లా క్లర్క్ నోటిఫికేషన్ విడుదల తేదీకి రెండేళ్ల ముందుగా అభ్యర్థి న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 23వ తేదీ వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ దరఖాస్తులను “ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్” చిరునామాకు పంపించాలి. వయస్సు, విద్యార్హత పత్రాల కాపీలు జోడించాలి. అర్హతలు, అక్నాలెడ్జ్‌మెంట్ తో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా హైకోర్టు అడ్రస్ కు నవంబర్ 23 సాయంత్రం 5.00 గంటల లోపు పోస్టు చేయాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం tshc.gov.in వెబ్‌సైట్‌ పరిశీలించాల్సి ఉంటుంది.

ఇది కదా పండగ ఆఫర్ అంటే.. రూ.12000 లోపే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు.. డబుల్ ఫీచర్స్

దీపావళి వచ్చేసింది.. ఆఫర్‌లు తెచ్చేసింది.. మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ డీల్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రూ.12 వేల లోపే అద్భుతమైన ఫీచర్లు కలిగిన మంచి స్మార్ట్ ఫోన్‌లను పొందవచ్చు.. ప్రస్తుతం 12 వేల రూపాయల లోపు ఏయే స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.

ఆధునిక ప్రపంచం.. అంతా అరచేతిలోనే.. కుటుంబ యోగక్షేమాలైనా.. వార్తలైనా.. సినిమాలైనా.. డబ్బు చెల్లింపులైనా.. ఏదైనా ఒక్క స్మార్ట్‌ఫోన్ తోనే.. ఇలా నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం మారింది.. అయితే.. కొంతమంది ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు.. మరికొందరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఎదురు చూస్తుంటారు.. ముఖ్యంగా, పండుగ సీజన్లలో బడ్జెట్ లో మంచి మొబైల్స్ వస్తుంటాయి.. ఆఫర్లలో ఎన్నో కంపెనీల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.. దీపావళీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు తక్కువ బడ్జెట్ లో ఉందుబాటులో ఉన్నాయి.. ఈ రోజు మనం అలాంటి కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.12,000 ధర లోపు అందుబాటులో ఉండటంతోపాటు.. మంచి ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి.. ఇందులో Realme, Samsung, Motorola, Lenovo, Infinix వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కెయండి..

Realme Narzo N65

Realme నార్జో N65 స్మార్ట్‌ఫోన్‌లో మీరు 2 కలర్ ఆప్షన్లను పొందవచ్చు.. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 14,999.. అయితే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు దీన్ని 12 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,657కే పొందవచ్చు.. Realme Narzo N65 మొబైల్ 6 GB RAM, 128 GB ROM, 6.67 అంగుళాల డిస్ప్లే తో అందుబాటులో ఉంది. ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, ఫోటో-వీడియోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Motorola G34 5G

Motorola G34 5G చార్‌కోల్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను 15 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లో కేవలం రూ. 11,848కే పొందవచ్చు.. ఫోటో-వీడియో కోసం, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను పొందవచ్చు.. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ఉంది.. ఇది కాకుండా, మీరు స్మార్ట్‌ఫోన్‌లో 6.50 అంగుళాల డిస్‌ప్లేతోపాటు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను అమర్చారు.

Poco M3 Cool Black Color

Poco M3 Cool Black Color మీరు ఈ ఫోన్‌ని 23 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే పొందవచ్చు.. ఈ ఫోన్ వెనుక వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.. ఇందులో ప్రైమరీ కెమెరా 48MP + 2MP + 2MP, 8MP Front Camera ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. Qualcomm Snapdragon 662 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
Samsung Galaxy M15

Samsung Galaxy M15 ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి కెమెరాతోపాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999.. కానీ మీరు అమెజాన్ నుంచి 29 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు.

ఈ తగ్గింపు ధరలతోపాటు.. పలు రకాల క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్ లను పొందవచ్చు.. ఇంకా తక్కువ బడ్జెట్ లోనే ఫోన్లను సొంత చేసుకోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి..

(నోట్: ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం ఆఫర్లు ఉన్న వరికే.. తర్వాత రేట్లల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి.)

పటాకుల వలన చర్మం కాలితే టూత్‌పేస్ట్ అప్లై చేయవచ్చా.. లేదా నిపుణుల సలహా ఏమిటంటే

దీపావళి రోజున పటాకులు కాల్చే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వెంటనే గాయాలకు కొంతమంది వెంటనే టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తారు. ఇలా చేయడం సరైనదేనా కాదా అనేది నిపుణుల నుండి తెలుసుకోండి.

వెలుగుల పండుగ దీపావళి వస్తుందంటే చాలు ఎంతో సందడి నెలకొంటుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే దీపావళి పండగ రానే వచ్చేసింది. ప్రజలు తమ ఇళ్లను పువ్వులు, దీపాలతో అలంకరించారు. దీపావళి పండగ రోజున లక్ష్మి గణపతులను పూజించిన తరువాత ఇంటిని దీపాల వెలుగులతో నింపేస్తారు. అంతేకాదు ఈ రోజున పిల్లలు, పెద్దలు బాణాసంచా, క్రాకర్లు కూడా కాలుస్తారు. దీపావళి సందర్భంగా పటాకులు కాలుస్తారు. అయితే ఒకొక్కసారి బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పటాకులు కాల్చే సమయంలో చర్మం కాలిపోవడం చాలా సాధారణ సంఘటనగా చెప్పవచ్చు. కనుక బాణాసంచా కాల్చే సమయంలో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా బాణాసంచా కాల్చే సమయంలో చర్మం కాలితే వెంటనే టూత్ పేస్టుని అప్లై చేస్తారు. అయితే ఇలా బాణాసంచా కాలిన సమయంలో కూడా టూత్ పేస్టు అప్లై చేయడం సరైన చర్య ఏనా తెలుసుకుందాం..

దీపావళి పండుగను రేపు అంటే అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. ఈ సమయంలో సాధారణంగా పటాకులు, క్రాకర్లు వంటివి కాలుస్తారు. ఈ సమయంలో చర్మం కాలడం సర్వసాధారణమైన సంఘటనలలో ఒకటి. కనుక దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది కాలిన గాయాలకు టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా హాని చేస్తుందో తెలుసా..

టూత్‌పేస్ట్‌ను ఎందుకు అప్లై చేస్తారంటే

వాస్తవానికి చాలా టూత్‌పేస్ట్‌లు చర్మానికి చల్లదనం అనుభూతిని ఇస్తాయి. కాలిన సమయంలో తీవ్రమైన మంట ఉంటుంది. దీని కారణంగా ప్రజలు ఉపశమనం కోసం టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తారు. ఎందుకంటే కాలిన గాయంపై టూత్ పేస్ట్ రాయడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే దీపావళి టపాసుల వలన కాలిన గాయం పై టూత్‌పేస్ట్ వేయాలా వద్దా అని తెలుసుకుందాం.

నిపుణుల సలహా ఏమిటంటే..

GTB హాస్పిటల్‌కు చెందిన వైద్యుడు అంకిత్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చర్మం కాలితే దానిపై టూత్‌పేస్ట్ వేయడం సరికాదన్నారు. ఇలా చేయడం ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుందని చెప్పారు. ఎందుకంటే చాలా టూత్‌పేస్ట్‌లలో సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మం కాలిన గాయాలపై యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవడం మంచిది. గాయం అయిన వెంటనే గాయం తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించి.. తగిన చర్యలు తీసుకోవాలి.

బాణా సంచా కాలితే ఏమి చేయాలంటే

బాణసంచా కాల్చడం వల్ల చర్మం కాలిపోయినట్లయితే మొదట సమస్య తీవ్రమైనదా కాదా అని తనిఖీ చేయాలి. చర్మం తక్కువగా కాలినట్లయితే.. మొదట కలిగిన గాయం ఉన్న ప్రాంతాన్ని నీటి కింద ఉంచండి.ఇలా చేయడం వలన గాలిన గాయం మీద ఏమైనా గన్‌పౌడర్‌ అంటుకుంటే అది శుభ్రం చేయబడుతుంది. మంట కూడా తగ్గుతుంది. దీని తర్వాత యాంటిసెప్టిక్ లిక్విడ్‌తో గాయాన్ని శుభ్రం చేయాలి. ఇప్పటికే ఇంట్లో స్కిన్ బర్న్ హీలింగ్ క్రీమ్ ఉంటే.. వెంటనే దానిని అప్లై చేయండి. ఒకవేళ బర్న్ హీలింగ్ క్రీమ్ లేకపోతే కొబ్బరి నూనెను అప్లై చేయవచ్చు.

ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే

దీపావళి రోజున క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా పొరపాటున ఎవరికైనా ఎక్కడైనా కాలితే వెంటనే ప్రభావిత ప్రాంతంలో నేరుగా ఐస్ ముక్కను అప్లై చేయాలి. బొబ్బలు కనిపించినట్లయితే.. వాటిని పగిలిపోయేలా పొరపాటు కూడా ఎటువంటి చికిత్సను చేయవద్దు. బొబ్బలు పగిలితే అక్కడ గాయం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

యువతను భయపెడుతున్న బ్రెయిన్ స్ట్రోక్.. నివారణ మన చేతుల్లోనే..! ఏం చేయాలంటే

నేటి కాలంలో అధికమంది జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు వంటి వాటిల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఒకప్పుడు వృద్ధులకు వచ్చే ఈ భయానక వ్యాధి.. ప్రస్తుతం యువతకు కూడా సంభవిస్తుంది. దీని నివారణకు ప్రముఖ నిపుణులు కొన్ని నివారణ మార్గాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గత కొన్నేళ్లుగా మన దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గత 10 ఏళ్లలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 20 శాతం పెరిగాయి. నేటి కాలంలో యువత కూడా బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. దీనిని యంగ్-ఆన్సెట్ స్ట్రోక్ అంటారు. ఇందులో 45 ఏళ్లలోపు వారు కూడా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. అన్ని స్ట్రోక్ కేసులలో 10 నుండి 15% వరకు యంగ్-ఆన్‌సెట్ స్ట్రోక్‌లు ఉన్నాయి. పేలవమైన జీవనశైలి అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే అధికమంది స్ట్రోక్ బారీన పడుతున్నారు.

చెడు జీవనశైలి కారణంగా.. వచ్చ ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు, మధుమేహం ముఖ్యమైనవి. ధూమపానం, వర్క్‌ సంబంధిత మానసిక ఒత్తిడి వంటి చెడు జీవనశైలి అలవాట్లు కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవుతున్నాయి. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. యువతలో స్ట్రోక్‌కు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే యాంటీ క్లాటింగ్ మెకానిజం సమస్య. ఇది హైపర్‌కోగ్యులబుల్ కండిషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టినప్పుడు, స్ట్రోక్ సంభవిస్తుంది. చెడు జీవనశైలి వల్ల యువతలో కూడా మెదడులో గడ్డలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
స్ట్రోక్ ప్రాణాంతకమా..?

స్ట్రోక్‌కు సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారుతుందని మణిపాల్ ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో డాక్టర్ సంతోష్ ఎన్‌ఎస్ చెబుతున్నారు. అస్పష్టమైన దృష్టి, మైకం, తీవ్రమైన తలనొప్పి వంటివి స్ట్రోక్ లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఈ విషయంలో అజాగ్రత్త తగదు. బ్రెయిన్ స్ట్రోక్ సమస్య సకాలంలో చికిత్స అందించదం ద్వారా అదుపులో ఉంచవచ్చు.

స్ట్రోక్‌ను ఎలా నివారించాలి?

స్ట్రోక్‌ రాకుండా ఉండాలంటే మధుమేహం, హైబీపీ వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. షుగర్ లెవెల్, బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు తలనొప్పి సమస్య ఉంటే దానిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పి కొన్ని సందర్భాల్లో స్ట్రోక్ ప్రారంభ సంకేతంగా ఉంటుంది.

ఎట్టకేలకు బయటకు.. కన్నడ హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్

దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ ఆరోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

రేణుకాస్వామి హత్యకేసులో ఐదు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్‌. ఎట్టకేలకు అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ ఆరోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు మధ్యంతర బెయిల్‌కు తగిన షరతులను న్యాయస్థానం విధించింది.

అంతకుముందు కింది కోర్టులో దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. అనంతరం దర్శన్ తరపు న్యాయవాది సీవీ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ ఆరోగ్య సమస్య బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో అభ్యర్థించారు. దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉంది.. అలాగే శస్త్రచికిత్స అవసరం. చికిత్స ఆలస్యమైతే పక్షవాతం వస్తుందేమోనని అనుమానం ఉందని డాక్టర్ ఇచ్చిన నివేదికను దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

దర్శన్ ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇచ్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్టు ముందు వాదించారు. అలాగే ఇప్పుడు సమర్పించిన డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్ ఇప్పుడు ‘విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని’ అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇది ఆరు వారాల మధ్యంతర బెయిల్.

జేఈఈ మెయిన్ 2025 పరీక్ష విధానంలో కీలక మార్పులు ఇవే.. ఛాయిస్‌ ప్రశ్నలు ఎత్తివేత

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తొలి విడత జేఈఈ మెయిన్‌ సెషన్ 1 పరీక్ష జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఇక గతేడాది జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా, ఈసారి 2 రోజులు ముందుకు పరీక్ష తేదీ జరిపారు. ఈసారి పరీక్షల ఫలితాల ప్రకటన తేదీలను కూడా ఎన్టీయే ప్రకటించడం విశేషం. ఇక ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే NTA స్పష్టం చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైనా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు 3 రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేస్తారు. జనవరి 22 నుంచి జనవరి 31 వరకు తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12న ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు.

ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షలో కీలక మార్పు..

జేఈఈ మెయిన్‌ పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్‌ 1 పరీక్ష 300, పేపర్‌ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. ఇక్కడి వరకు ఎప్పటి మాదిరిగానే జరుగుతుంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను మాత్రం ఈసారి కొనసాగించరు. అంటే ఈ విభాగంలో ఛాయిస్‌ విభాగాన్ని పూర్తిగా తొలగించి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. గతంలో జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు వచ్చేవి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వడం ప్రారంభించారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు మూడేళ్ల నుంచి ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. అయితే సెక్షన్‌ బీలో మాత్రం 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. మిగతా 5 ఛాయిస్‌ ఇచ్చేవారు. అంటే సెక్షన్‌-బిలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారన్నమాట. గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్‌ ఉండదు. రెండు సెక్షన్లలో మైనస్‌ మార్కులుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే 1 మార్కు చొప్పున మైనస్‌ చేస్తారు. ఎన్‌టీఏ స్కోర్‌ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకు మించి విద్యార్థులకు సమాన స్కోర్‌ వస్తే తక్కువ మైనస్‌ మార్కులను చూస్తారు.

కొత్తగా నాలుగు వందేభారత్‌లు.. సికింద్రాబాద్ నుంచి మరొకటి.. ఏ రూట్‌లోనంటే.?

మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రోజురోజుకూ జనాల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో సుమారు 66 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కగా..

వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా వంద శాతం ఉంటోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ ధరలు అధికమే అయినప్పటికీ.. గమ్యస్థానానికి త్వరగా చేరేందుకు ప్రయాణీకులు వీటి వైపే మొగ్గు చూపడం విశేషం.

ఇదిలా ఉంటే.. ప్రయాణీకుల ఆదరణ, రూట్ రద్దీ దృష్ట్యా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పూణే స్టేషన్ నుంచి మరో నాలుగు రైళ్లను వివిధ మార్గాల్లో పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ యోచిస్తోందట. అందులో ఒకటి మన సికింద్రాబాద్‌కు కూడా నడపనున్నారు.

పూణే-సికింద్రాబాద్, పూణే-షెగావ్, పూణే-వడోదర, పూణే-బెళగావి రూట్ల మధ్య ఈ రైళ్లను నడపనున్నారు. అయితే ఈ రైళ్ల టైమింగ్స్, షెడ్యూల్, ఆగే స్టేషన్ల వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఎలక్షన్స్ పూర్తి కాగానే వీటిని ప్రధానమంత్రి ప్రారంభించే అవకాశం ఉందట.

ఇక ప్రస్తుతం పూణే-కొల్హాపూర్ మధ్య ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. అలాగే సోలాపూర్ నుంచి ముంబై మధ్య నడిచే మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు పూణే స్టాప్ ఉంది. ఈ రెండింటితో పాటు ఆ నాలుగు వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నారట.

అటు వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ రైలు ట్రయిల్ రన్ నవంబర్ 15 నుంచి రెండు నెలల పాటు సాగుతుందని సమాచారం. తొలి విడతలో సికింద్రాబాద్ నుంచి వందేభారత్ స్లీపర్ రైలు నడుపుతారని తెలుస్తోంది.

దీపావళి వేళ.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే గులాబ్ జామున్.. పాల పొడితో తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ

పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే పండగ దీపావళి. దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు, టపాకాయ చప్పుళ్ళు మాత్రమే కాదు నోరూరించే రకరకాల ఆహార పదార్ధాలు.

ముఖ్యంగా దీపావళికి స్వీట్ తినే సంప్రదాయం చాలా ప్రాంతాలల్లో ఉంది. ఇప్పటికీ దీపావళి పండగ కోసం ఆంధ్రప్రదేశ్ లో అరిసెలు, మినప సున్ని వంటి స్వీట్స్ కు తయారు చేస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు దీపావళి పండగ వస్తే చాలు సింపుల్ గా రెడీ చేసుకునే గులాబ్ జామున్ తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు పాల పొడితో గులాబ్ జామున్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

పాల పొడి -ఒక కప్పు
ఆల్ పర్పస్ పౌడర్ – పావు కప్పు
నెయ్యి లేదా వెన్న -పావు కప్పు
బేకింగ్ షోడా – అర టీ స్పూన్
పాలు లేదా నీరు -అర కప్పు
నూనే – వేయించడానికి సరిపడా
చక్కర – ఒక కప్పు
నీరు – ఒక కప్పు
రోజ వాటర్ – ఒక టీ స్పూన్
యాలకుల పొడి – చిటికెడు

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని పాల పొడి, ఆల్ పర్పస్ పౌడర్ , నెయ్యి తో పాటు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఇప్పుడు పాలను పొస్తూ మెత్తగా చపాతీ పిండిలా కలపండి. ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేలా కలిపి.. దాని మీద ఒక క్లాత్ వేసి పక్కకు పెట్టండి. కొంచెం సమయం తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ గా స్మూత్ గా చుట్టుకొండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనే పోసుకుని వేడి చేయండి. నూనే వేడి ఎక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ ను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకూ వేయించండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో చక్కర, నీరు పోసి సిరప్ ని తయారు చేసుకోండి. ఈ సిరప్ లో కొంచెం రోజ్ వాటర్, యాలకుల పొడిని వేసి చక్కర కరిగే వరకూ వేడి చేయండి. ఇప్పుడు ఈ సిరప్ లో వేయించిన బాల్స్ వేసి ఒక అర గంట నానబెట్టాలి. అంతే రుచికరమైన గులాబ్ జామున్ రెడీ..

టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరుగుతాయో.. లేదో..? విద్యార్ధుల్లో అయోమయం

రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇప్పుడు మరో కొత్త సందేహం పట్టుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగు మాధ్యమంలో పరీక్షలు జరుగుతాయా? లేదా అనేది సందేహంగా మారింది. దీనిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం విద్యార్ధుల్లో గుబులు రేపుతుంది. ఇప్పటి వరకూ విద్యాశాఖ తెలుగు మాధ్యమంలో పరీక్షలు నిర్వహణపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లోనూ అయోమయం ఏర్పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పదో తరగతి విద్యార్ధులందరికీ ఒకే మాధ్యమం అమలు చేయాలని 2021 డిసెంబరు 15న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

2020-21లో ఒకేసారి 1 నుంచి 6 తరగతులకు తెలుగుమాధ్యమాన్ని ఒకేసారి రద్దుచేసి.. ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పాఠ్యాపుస్తకాలు ముద్రించి, ఆంగ్ల మాద్యమంలోనే పాఠ్యాంశాలను కూడా బోధిస్తూ వచ్చారు. వీటిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ జీఓను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..
దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు. అప్పటి నుంచి తెలుగు మాధ్యమం రద్దు అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయింది.

అయితే 2021 డిసెంబరులో ఒకే మాధ్యమం ఉంటుందంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అది ఆంగ్ల మాధ్యమం అని ప్రత్యేకంగా పేర్కొనకుండానే ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ పాఠశాలల్లో క్రమబద్ధీకరణ జరిపి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించింది కూడా. ఏ మాధ్యమం అమలు చేయాలన్నదానిని ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించకపోవడంతో చాలా చోట్ల ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటినీ కొనసాగించారు. ఇలా కొనసాగుతూ వచ్చిన విద్యార్థులు ప్రస్తుతం పదోతరగతిలోకి చేరారు. వీరికి తెలుగు మాధ్యమంలోనే పరీక్షలు నిర్వహించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. గత సర్కార్‌ హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏదైనా ఒక్కటే మాధ్యమం ఉండాలని, రెండు మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తే ఎలా అని ప్రధానోపాధ్యాయులను కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఒక్కటే నిర్వహించకుండా రెండింటిని ఎలా కొనసాగించారంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల తెలుగు, ఆంగ్ల మాధ్యమాల అమలు కావడంతో పదో తరగతి పరీక్షలు ఆంగ్లంలోనే ఉంటాయా? లేదంటే రెండు మాధ్యమాల్లోనూ నిర్వహిస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

వైఎస్ విజయమ్మ లేఖకు వైసీపీ కౌంటర్.. కీలక అంశాల ప్రస్తావన

వైఎస్సార్‌ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదంపై లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్‌ విజయలక్ష్మి లేఖకు కౌంటర్‌గా వైసీపీ బహిరంగ లేఖ విడుదల చేసింది.

కుట్రపూరితంగా షేర్ల బదిలీ వాస్తవమే కదా? అని ప్రశ్నించింది. చంద్రబాబుకు మేలు చేసేలా షర్మిల వ్యవహరించడం ధర్మమేనా? అని వైసీపీ లేఖలో పేర్కొంది. వైసీపీ రాసిన లేఖను యథాతధంగా దిగువన చూడండి…

1. దివంగత మహానేత వైయస్సార్‌గారి భార్యగా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారి తల్లిగా శ్రీమతి విజయమ్మగారిని అమితంగా గౌరవిస్తాం. వైయస్సార్‌గారి కుటుంబ వ్యవహారంపై విజయమ్మగారు బహిరంగ లేఖ విడుదలచేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం.

2. విజయమ్మగారు రాసిన లేఖలో, శ్రీ జగన్‌గారిని లీగల్‌గా ఇబ్బందిపెట్టేందుకు, తద్వారా బెయిల్‌ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్‌-కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యబదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్‌మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీచేసిన మాట వాస్తమే కదా? షర్మిలగారి భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై శ్రీ జగన్‌గారికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి, తెలిసి కూడా విజయమ్మగారు ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా? విజయమ్మగారి లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైయస్సార్‌గారి అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?

3. 2024 ఎన్నికల్లో శ్రీ జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబుగారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయస్సార్‌గారిని ఎఫ్ఐఆర్‌లో పెట్టిన, తన కుమారుడ్ని అన్యాయంగా 16నెలలు జైల్లోపెట్టిన కాంగ్రెస్‌కు ఓటు వేయండంటూ, వైయస్సార్‌సీపీని ఇబ్బందిపడుతూ వీడియో విడుదలచేసి విజయమ్మగారు షర్మిలగారివైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగాచెప్పారు. దివంగత మహానేత, వైయస్సార్‌గారి రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మగారు మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనంచూసి వైయస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలతచెందారు, బాధపడ్డారు.

4. ఇప్పుడు షర్మిలగారి భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో, సరస్వతీ కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి, స్వయంగా ఆమె కుమారుడి బెయిల్‌ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసికూడా మోసపూరితంగా, షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి, ఒరిజనల్‌ షేర్‌ సర్టిఫికెట్‌ లేకుండా, శ్రీ జగన్‌గారి సంతకాలు లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా షేర్లను బదిలీచేసి, షర్మిలగారితోనే విజయమ్మగారు ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు.

5. అంతేకాకుండా శ్రీ జగన్‌గారికి, షర్మిలగారు వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్‌ మీడియా అక్కౌంట్‌లో ప్రత్యక్షం కావడం, విజయమ్మగారు కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీవారు విడుదలచేయడం, పలు సందర్భాల్లో శ్రీ జగన్‌గారిపై షర్మిలగారు అనుచిత వ్యాఖ్యలు చేసినా, జగన్‌గారు ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకపోయినా విజయమ్మగారు ఏరోజూ సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం, ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.

6. కోర్టుల్లో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మలగారి ప్రవర్తన, చర్యలు ఉన్నా, ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించినా, తప్పుడు కేసులపై శ్రీ జగన్‌గారు చేస్తున్న పోరాటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆమెకు ఎలాంటి ఆందోళన లేనట్లు ప్రవర్తించినా, శ్రీ జగన్‌ గారిని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు, బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా ఆమె నడుచుకున్నా, షర్మిలగారు వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేలానే ఉన్నా, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను శ్రీ జగన్‌గారు అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా శ్రీమతి విజయమ్మగారి బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

7. రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీ జగన్‌గారిని షర్మిలగారు ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై, రాజశేఖరరెడ్డిగారిని ఎఫ్ఐఆర్‌లోపెట్టిన పార్టీకి, అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు. పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా, ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా శ్రీ జగన్‌గారిని షర్మిలగారు అనరాని మాటలు అన్నారు. ఎన్నికల సమయంలో శ్రీ జగన్‌గారిపై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడింది షర్మిలగారు కాదా? వీటన్నింటినీ శ్రీ జగన్‌గారు ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువుతీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? శ్రీ జగన్‌గారు బాధితులు కాదంటారా?

8. కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మగారు న్యాయ అన్యాయాల విచక్షణను విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణివల్ల, సరస్వతీ కంపెనీల విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మగారు దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే.

9. వైయస్సార్‌గారు జీవించి ఉన్నపుడే జగన్‌గారూ కంపెనీలు నడిపారు, అలాగే షర్మిలగారు తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైయస్సార్‌గారి మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తనకుమార్తెకు వైయస్సార్‌గారు తన పూర్వీకుల ఆస్తులతో పాటు, తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చాడు. శ్రీ జగన్‌గారి ఆస్తులు తనవికాదు కాబట్టి, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ శ్రీ జగన్‌గారి స్వార్జితం కాబట్టి.

10. వైయస్సార్‌గారు బ్రతికి ఉండగానే షర్మిలగారికి పెళ్లై 10 ఏళ్లు, వైయస్సార్‌గారు మరణించి మరో 1౦ ఏళ్లు గడిచిన తర్వాత, అంటే 20 ఏళ్లు తర్వాత జగన్‌గారు తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కోర్టుకేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లకాలంలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు వివిధకాలాల్లో షర్మిలగారు శ్రీ జగన్‌గారి ద్వారా పొందినా తన సోదరుడిపట్ల ఆమె ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు.

11. తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తులను, లవ్‌ అండ్‌ అఫెక్షన్‌తో షర్మిలకు ఇస్తున్నాని శ్రీ జగన్‌గారు ఎంఓయూ రాస్తే,. దానిపై విజయమ్మగారూ, షర్మిలగారూ ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్‌గారి స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించనట్టే. నిజంగా ఉమ్మడి ఆస్తులు అయితే, వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని, చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతికుటుంబానికి తెలుసు.

12. ఇంత యాగీ చేస్తున్న షర్మిలగారు ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? లేక రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర ఆమె పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా?

13. పైగా ఈ కంపెనీల మీద, జగన్‌గారి మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వారిని బలపరుస్తూ, కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే, ఇలా చేస్తారా? ఇలా శ్రీ జగన్‌గారిని, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా?

14. ఇప్పుడు వైయస్సార్‌ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.

15. శ్రీ జగన్‌ గారి స్వార్జితమైన ఆస్తిలో, ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిలగారు ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? అందులోని లేఖను టీడీపీ విడుదలచేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి, ఆమె తన ప్రేమానురాగాలు చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏమి చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని శ్రీ జగన్‌గారు ఇదివరకే స్పష్టంచేశారు.

16. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టంచేసింది.

ఇట్లు
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

రేపట్నుంచి లైబ్రరీ సైన్సు కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం.. ఎవరు అర్హులంటే?

రాష్ట్రంలోని పలు కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి లైబ్రరీ సైన్సు సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ ఓ ప్రకనలో తెలిపారు.

దరఖాస్తు ప్రక్రియ నవంబరు ఒకటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్‌ 18న సాయంత్రం 5గంటలలోపు సమర్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం 40 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. పీఎన్‌ స్కూల్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్సు-విజయవాడ, రాయలసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్సు, గాంధీనగర్, కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్సు, అరండల్‌పేట, గుంటూరులలో ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కలిసి 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఏదైనా యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన వారికి 5 మార్కులు, పీజీ అర్హతకి 10 మార్కులు అదనంగా ఇస్తారు. ప్రతి మాధ్యమంలో 10 శాతం సీట్లు జిల్లా గ్రంథాలయ సంస్థలు, ప్రభుత్వ గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయ సంచాలకుల కార్యాలయాల్లో పని చేసే అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

టీజీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, హిస్టరీ ఉర్దూ మీడియం, ఫిజిక్స్, ఫిజిక్స్‌ ఉర్దూ మీడియం, సంస్కృతం బోధించే జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అయోధ్య రామమందిరం మొదటి దీపావళికి సిద్ధం.. 28 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలనే లక్ష్యం

దేశవ్యాప్తంగా దీపావళికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం.. రామ జన్మ భూమి అయోధ్యలో కూడా దీపావళికి ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రోజు సరయూ నదీ తీరంలో ఘనంగా దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. సరయూ నదీ తీరంలోని సుమారు 55 ఘాట్లలో 30 వేల మంది వాలంటీర్లు 28 లక్షల 500 వందల దీపాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం 1500 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఎల్‌అండ్‌టి, టాటా ఉద్యోగులతో పాటు సోన్‌పూర్ గ్రూపుకి చెందిన వారు జన్మభూమి కాంప్లెక్స్‌లో జరిగే దీపోత్సవ్ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ముఖ్య అతిథి కూడా ఈ రోజు జరిగే (అక్టోబర్ 30న) రామ్ కథా పార్క్‌లోని టాబ్లా కార్యక్రమంలో హాజరుకానున్నారు. సుమారు 500 ఏళ్ల తర్వాత బాల రామయ్య మొదటి దీపావళిని చాలా ప్రత్యేకంగా జరుపుకోనున్నాడు.

ఈ రోజు సరయు నదీ తీరంతో పాటు రామ మందిర సముదాయం లక్షల మెరిసే దీపాలతో వెలిగిపోతుంది. దీపోత్సవాన్ని పురష్కరించుకుని రామ మందరి సముదాయంలో ఆవుపేడతో చేసిన దీపాలను వెలిగించేందుకు సన్నాహాలు చేశారు. దీపావళి సందర్భంగా బాల రామయ్య కోసం ప్రత్యేక దుస్తులను సిద్ధం చేశారు. అంతేకాదు రామయ్యకు దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆహారాన్ని అందజేయనున్నారు.

పట్టికలు నిర్వహించారు
ఈ రోజు అయోధ్యలో అందమైన టేబుల్‌లాక్స్ కూడా చూడవచ్చు. ఉదయం 9 గంటలకు సాకేత్ మహావిద్యాలయం నుండి రామ్‌కథా పార్కు వరకు మొత్తం 18 టేబులాక్స్ బయటకు తీయబడతాయి. 11 సమాచార శాఖలు మరియు 7 పర్యాటక శాఖలు రూపొందించిన పట్టికలను తెస్తారు. రామాయణంలోని వివిధ ఇతివృత్తాలపై ఈ పట్టికలు తయారు చేయబడ్డాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు తమ ప్రదర్శనలను టేబుల్‌లాక్స్‌లో ప్రదర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామ్‌ కథా పార్క్‌కు చేరుకుంటారు.

పుష్పక విమానం ద్వారా వచ్చే సీతారాములు

రామ్ కథా పార్క్ వద్ద పుష్పక విమానంలో హనుమంతుడితో కలిసి సీతారాములు, లక్ష్మణుడితో వస్తారు. హెలిప్యాడ్ వద్ద సీఎం యోగి, గవర్నర్‌తో సహా కేంద్రమంత్రులు శ్రీరాముడికి రామ్‌నగరిలోకి రమ్మన మని స్వాగతం పలుకుతారు. రామ్ కథా పార్కులో రాముడి రథాన్ని లాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. శ్రీరాముని పట్టాభిషేకం ఇక్కడే నిర్వహించనున్నారు.

దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే వ్యక్తీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ముఖ్యమంత్రి యోగి రామ్‌కథా పార్కు నుంచి సర్జూ ఘాట్‌కు చేరుకుంటారు. అనంతరం సరయూ నదికి పాలతో అభిషేకం నిర్వహించి.. ఆ తర్వాత సరయు మహా హారతిలో పాల్గొంటారు. దాదాపు 1100 మంది ఇక్కడికి వస్తారని అంచనా వేసి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

రామ్‌కి పైడితో సహా సరయూలోని 55 ఘాట్‌లలో 30 వేల మంది వాలంటీర్లు 28 లక్షల 500 వందల దీపాలను ఏర్పాటు చేశారు. ఈ 25 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ కీ పౌరిలో అద్భుతమైన లేజర్ షో తో పాటు, సౌండ్ షో కూడా ప్రదర్శించనున్నారు. కళాకారులు అయోధ్య రామ్ కి పౌరి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

రాష్ట్రంలో 5 జిల్లాల్లో. 54 మండలాల్లో కరువు పరిస్థితులు

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో రాయలసీమ పరిధిలోని 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నైరుతి ఋతుపవనాలు సీజన్లో (జూన్ -సెప్టెంబర్) రాష్ట్ర సాధారణ వర్షపాతం 574.7మిమీ ఉండగా 681.6మిమీ వర్షపాతం నమోదైందన్నారు. అయినప్పటికి కొన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, డ్రై స్పెల్ నమోదైందన్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ ప్రకారం రెండు మ్యాన్డేటరీ సూచికలు ( వర్షపాతం, డ్రై స్పెల్), నాలుగు ఇంపాక్ట్ సూచికలు ( వ్యవసాయ క్రాప్ ఏరియా, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిస్చర్, హైడ్రాలజీ), క్షేత్రస్థాయిలో వాస్తవాలతో కూడిన జిల్లా కలెక్టర్ నివేదిక (పంట నష్టం 33%…. అంతకంటే ఎక్కువ) నియమాల ప్రకారం… ఖరీఫ్-2024లో 27 మండలాల్లో తీవ్ర కరువు, 27 మండలాల్లో మధ్యస్థ కరువు ప్రకటించినట్లు తెలిపారు.

కర్నూలు -2, అనంతపురం-7, శ్రీసత్యసాయి-10, అన్నమయ్య-19, చిత్తూరు-16 మండలాల్లో కరువు ప్రకంటించడం జరిగిందన్నారు. క్రింది మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.

1. కర్నూలు(02) :- కౌతాళం, పెద్దకడుబూరు (02 మధ్యస్థ కరువు మండలాలు)

2. అనంతపురం(07) :- నార్పల, అనంతపురం(02 తీవ్ర), విడపనకల్లు, యాడికి,గార్లెదిన్నె,బీకే సముద్రం,రాప్తాడు ( 05 మధ్యస్థ కరువు మండలాలు)

3. శ్రీసత్యసాయి(10) :- తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల(3 తీవ్ర), కనగానిపల్లి, ధర్మవరం, నంబులపూలకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి ( 07 మధ్యస్థ కరువు మండలాలు)

4. అన్నమయ్య (19):- గాలివీడు,చిన్నమండె, సంబేపల్లి,టి.సుందరపల్లె,రాయచోటి,లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకాడ, పీలేరు,కలికిరి, వాల్మీకిపురం,కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె( 19 తీవ్ర కరువు మండలాలు)

5. చిత్తూరు(16) :- పెనుమూరు,యాదమరి, గుడిపాల(3 తీవ్ర), శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం( 13 మధ్యస్థ కరువు మండలాలు)

యంగ్ హీరో సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కోసం రెడీ అవుతున్నాడు. మహేష్ చివరిగా గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీగా ఈ ను తీసుకురానున్నారు. ఈ కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ ను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ ఉండనుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు కోసం లోకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి కెన్యాలో పార్క్ లను సందర్శించారు.

ఇదిలా ఉంటే ఈ లో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో అదరగొట్టారు మహేష్ బాబు. అయితే ఈ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఏళ్ళు పట్టేలా కనిపిస్తుంది. అయితే ఈ లోగ మహేష్ బాబు.. మరో లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో లో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్.

హీరో అనే తో ఈ కుర్ర హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆతర్వాత ఈ యంగ్ హీరో నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ లో మహేష్ బాబు కృష్ణుడుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబును కృష్ణుడుగా చూడాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు దేవకీ నందన వాసుదేవ లో మహేష్ కృష్ణుడిగా కనిపించనున్నాడు అని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీని పై అశోక గల్లా క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు తన లో నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చారు.

తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్రం.. రథయాత్ర ప్రారంభం.. 1800 కి.మీ. మేర సాగే రథయాత్ర

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు రథయాత్ర ప్రారంభం అయ్యింది. హిందూ ప్రచార రథయాత్రను కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పూజలు చేసి ప్రారంభించారు.

తరవాత అనుగ్రహాభాషణం చేశారు. పురాతనమైన కంచిమఠంలో శ్రీరాముడి మూల యంత్రం ఉందని ఈ మహా యంత్రం లాగానే యాత్రాన్ని తయారు చేయించి అయోధ్యకు పంపుతున్నట్లు విజయేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. కంచి తరహాలో 150 కిలోల బంగారు పూత పూసిన శ్రీరామ యంత్రంతో భారీ ఆధ్యాత్మిక ఊరేగింపు నిర్వహిస్తూ అయోధ్యకు చేరుకోనున్నారు. అక్కడ రామాలయ సన్నిధిలో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్టిస్తారన్నారు. ఇప్పటికే రామాలయంలోని గర్భ గుడిలో బాల రాముడి మూల విరాట్ కింద విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బంగారు రామ యంత్రాన్ని ఉంచారని చెప్పారు. కంచిలో మహా శక్తివంతమైన శ్రీచక్ర యంత్రం ఉందన్నారు విజయేంద్ర సరస్వతి.

ఆలయాలు చైతన్య వంతంగా ఉండాలని, ఆలయాల నిర్మాణాలు చేపట్టడమే కాదు ఆ ఆలయాల ధూపదీప నైవేద్యాలు కూడా కొనసాగాలని తెలిపారు. టీటీడీ ఈ విషయంలో ఆదర్శంగా ఉందన్నారు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. ఆలయాల్లో భక్తి చైతన్యం, వికాసం ఉండాలని, యజ్ఞం, దానం, తపస్సు చేయాలన్నారు. ఇది మన దేశం ధర్మం, ఆచారం అన్నారు. భారతదేశం మౌనంగా ధర్మాన్ని ఆచరిస్తోందన్నారు విజయేంద్ర సరస్వతి.

ఈ నెల 27 నుంచి 17 వరకు పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి అయోధ్య వరకు 1800 కిలోమీటర్లు మేర రథయాత్ర సాగుతుందన్నారు. 45 రోజులు మండల దీక్ష అనంతరం అయోధ్యలో జనవరి 1న లక్ష చండీ యాగం జరుగుతుందని చెప్పారు. శ్రీవారి క్షేత్రం నుంచి రథయాత్ర ప్రారంభం కావడం శుభపరిణామన్నారు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.

ఏపీలోని దేవాలయాల్లో కీలక మార్పులు.. ప్రతి ఆలయంలో ఫిర్యాదుల బాక్స్‌

తిరుమల లడ్డూ కల్తీ వివాదం తర్వాత ఏపీలోని ఆలయాల్లో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేవాలయాల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధానంగా.. ఆలయాల్లో నెయ్యి వాడకంపై ఉన్నత కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి డిపార్ట్‌మెంట్‌ నుండి అధికారులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. 15 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా నెయ్యి వాడకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఆనం.

అలాగే.. ప్రతి ఆలయంలో ఫిర్యాదుల కోసం బాక్స్‌తో పాటు, భక్తులు మొబైల్‌ నెంబర్లకు కూడా ఫిర్యాదు చేసేలా కీలక మార్పులు చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ప్రముఖ ఆలయాల్లో కచ్చితమైన నిబంధనల, నియమాలు అనుసరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఆలయంలో వేద సభలు జరపాలని.. సామాన్యులకు కూడా హిందూ ధర్మం, పాండిత్యం తెలిసేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా.. కొన్ని జిల్లాల్లో వేద సభలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు మంత్రి ఆనం.

రామ్ చరణ్ క్రేజ్ అలాంటిది మరి.. హిందీలో భారీ రేటుకు గేమ్ ఛేంజర్ హక్కులు

ప్రఖ్యాత దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్, ట్రైలర్, మిలిగిలిన పాటలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయబోతోన్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఇక నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు. ‘గేమ్ ఛేంజర్’ లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్‌తో సహా విభిన్న ప్రదేశాలలో షూట్ చేసిన ‘గేమ్ ఛేంజర్’ విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన పవర్ ఫుల్ స్టోరీకి శంకర్ తన విజన్‌ను జోడించి భారీ ఎత్తున తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు సమకూర్చారు. ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఈ కు పనిచేస్తున్నారు.

భారతీయులైనా సరే మన దేశంలో ఈ ప్రదేశాలను సందర్శించాలంటే అనుమతి తప్పని సరి.

భారతదేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విదేశీయులు మాత్రమే కాదు భారతీయులైనా సరే అక్కడ ప్రవేశించడానికి అనుమతి అవసరం.

వీటిలో కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులతో అనుసంధానించబడి ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు సాంస్కృతిక వారసత్వం మొదలైన వాటిని సంరక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. కనుక ఈ రోజు భారతీయులైనా సరే అనుమతి తప్పని సరిగా తీసుకోవలసిన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం..

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే.. భారతీయులైనా సరే ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. ఇక్కడ పర్వతాలు, అందమైన పచ్చని లోయలు, సరస్సులు, బౌద్ధ దేవాలయాలు మొదలైన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు వందలాది రకాల పక్షులను వీక్షించవచ్చు. అంతేకాదు ఇక్కడ మూడు పులుల అభయారణ్యాలు ఉన్నాయి, ఇక్కడ జంగిల్ సఫారీని ఆనందించవచ్చు.

నాగాలాండ్ విదేశీయులే కాకుండా భారతీయులు కూడా సందర్శించడానికి అనుమతి అవసరమైన ప్రదేశాలలో భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం కూడా ఒకటి. అనేక తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గొప్ప భాషా సంప్రదాయాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ అనేక రకాల పక్షులు ఉండటమే కాదు.. భౌగోళిక పరంగా కూడా ఈ ప్రదేశం మన దేశానికి చాలా ముఖ్యమైనది.

మిజోరం నీలి పర్వతాల భూమిగా ప్రసిద్ధి చెందిన మిజోరాం భారతదేశంలో కూడా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ యాత్రను ప్లాన్ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే భారతీయులకైనా సరే తప్పనిసరిగా అనుమతి పత్రం కావాల్సిందే. ఇక్కడి ప్రకృతి అందాలే కాకుండా సంస్కృతి కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది.

లడఖ్ భారత రాష్ట్రమైన లడఖ్‌లోని పర్వత మార్గాలు, నదులు, సరస్సులు, లోతైన లోయ, బౌద్ధ విహారాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ నిర్మించిన ఏటవాలు చెక్క ఇళ్ళు కూడా చాలా అందంగా కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

సిక్కిం భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న సిక్కిం రాష్ట్రం భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటి. అయితే సిక్కిం అనేక అంశాల దృష్ట్యా చాలా ముఖ్యమైన ప్రదేశం. కనుక ఇక్కడకు వెళ్లడానికి ఎవరికైనా అనుమతి అవసరం. ఇక్కడ ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా ఉంది. అంతేకాదు గ్యాంగ్‌టక్‌కు వెళ్లవచ్చు. అక్కడ మీరు ప్రశాంతమైన సమయాన్ని గడపడంతోపాటు షాపింగ్‌ను ఆనందించవచ్చు. అంతేకాదు సిక్కిలో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేయవచ్చు.

లక్షద్వీప్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను సందర్శించడానికి కూడా అనుమతి అవసరం. నీలి సముద్రం, తెల్లని ఇసుక , పచ్చదనం తో సహజ సౌందర్యం ప్రజలను ఆకర్షించడమే కాకుండా, ఈ ప్రదేశం ప్రత్యేక ఆహారపు రుచులతో ప్రసిద్ధి చెందింది. లక్షద్వీప్‌లో జలక్రీడలను కూడా ఆస్వాదించవచ్చు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వాడొచ్చు.. టైమ్ మెషిన్‌లో వెళ్లాల్సిన పన్లేదు.. ఎలాగంటారా

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి మొబైల్ ఫోన్ లేదంటే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలన్నా.. మొబైల్ ఛార్జింగ్ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం మొబైళ్లకు 5,000 లేదా 8,000 mAh బ్యాటరీలు వస్తున్నాయి.

మనం సరిగ్గా వాడితే కొద్దిగంటల్లోనే ఛార్జింగ్ అయిపోతున్నాయి. అయితే మీరు ఒక్కసారి మొబైల్‌కి ఛార్జింగ్‌ పెడితే కనీసం 50 ఏళ్ల పాటు మళ్లీ ఛార్జింగ్‌ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీలు ఉంటే.? ఏంటి.! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. టైం మెషిన్‌లో ఫ్యూచర్‌కి వెళ్లాలని అనుకుంటున్నారా.? లేదండీ.!

ఇప్పుడు బ్యాటరీలన్నీ కూడా లిథియం అయాన్‌తో తయారవుతున్నాయ్. కానీ ఇది అలా కాదు.. రేడియో యాక్టివ్ కాంపౌండ్ నికెల్-63తో తయారు చేయబడింది. ఈ బ్యాటరీ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, ఒకసారి ఛార్జ్ చేస్తే మళ్ళీ 50 ఏళ్లకే.. ఛార్జింగ్ పెట్టాలి. ఈ బ్యాటరీని చైనీస్ స్టార్టప్ కంపెనీ బీటావోల్ట్ అభివృద్ధి చేస్తోంది . లిథియం బ్యాటరీలకు బదులుగా, వారు న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేస్తున్నారు. దాని శక్తి చాలా సంవత్సరాలు బ్యాటరీని నడిపిస్తుంది. ఎనర్జీ కన్వర్షన్‌కి డైమండ్ సెమీకండక్టర్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాదిలోగా ఈ శక్తిని 1 వాట్‌కు పెంచనున్నారట. ఈ బ్యాటరీ పరిమాణంలో లిథియం బ్యాటరీ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. గరిష్ట పొడవు 15 మిమీ వరకు ఉంటుంది. దీనిలో అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ బ్యాటరీ ఎప్పటికీ పగిలిపోదు లేదా బర్న్ కాదు. ఈ బ్యాటరీ మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని తట్టుకోగలదు.

ఈ బ్యాటరీని మొబైల్ ఫోన్లలో ఎప్పుడు వినియోగిస్తారనే దానిపై ఆ కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరికొన్ని ఏళ్లలో ఈ బ్యాటరీని మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, డ్రోన్‌లలో ఉపయోగించాలని కంపెనీ ఆలోచిస్తోందట. ఈ బ్యాటరీలను తర్వాత పేస్‌మేకర్లలో కూడా ఉపయోగిస్తారట.

ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ మరెక్కడైనా చూపిస్తే .. లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్

దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్ర మొదలైంది. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహార యాత్ర స్టార్ట్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు బోట్‌లో షికార్లు చేశారు.

కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య టూరిస్టులు తొలి రోజు పాపికొండల విహార యాత్ర కొనసాగించారు. పర్యాటకులు తరలి రావడంతో గండి పోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహార యాత్రకు వెళ్లింది.

లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత పర్యాటక శాఖ అధికారులు బోట్‌కు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్‌ ఇచ్చారు. పాపికొండల టూర్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతో పాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీలించారు. బోట్ల ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ రికార్డులను వెరిఫై షికారు చేశారు. ఈ సందర్భంగా టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండల టూర్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు ఆమె సూచించారు. ఒకవేళ పర్యాటకుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఆ సమయంలో స్టాక్ కొనడం చాలా మంచిది..దీపావళికి ముహూర్తం ట్రేడింగ్

ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ రోజు ప్రత్యేకంగా ఒక గంట పాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీన్నే ముహూర్తం ట్రేడింగ్ అంటారు. ఈ దీపావళికి కూడా ముమూర్తం ట్రేడింగ్ కు సమయం ఫిక్స్ చేశారు.

దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్ కు సెలవైనప్పటికీ ఇన్వస్టర్ల కోసం ఒక గంట పాటు తెరుస్తారు. ఆ సమయంలో చాలా మంది స్టాక్ లను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన ముహూర్తం ట్రేడింగ్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ ఒక్కగంట పాటు అవకాశం ఉంటుంది. దీనికి ముందుగా సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకూ అవగాహన సెషన్ నడుస్తుంది.

ముహూర్తం ట్రేడింగ్ సమయంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం మంచిదని చాలామంది భావిస్తారు. దానికి అనుగుణంగానే దీపావళికి గంట పాటు ట్రేడింగ్ నిర్వహించనున్నారు. హిందూ మత సంప్రదాయాల ప్రకారం దీపావళి నుంచి నూతన సంవత్సవం ప్రారంభమవుతుంది. దీన్నే సంవత్ అంటారు. ప్రస్తుతం సంవత్ 2080 జరుగుతోంది. దీపావళి నుంచి సంవత్ 2081 మొదలవుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయమని పెద్దలు చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీపూజ తర్వాత షేర్ బ్రోకర్లు ఒక గంట ట్రేడింగ్ చేస్తారు. ఈ సంప్రదాయం 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో, 1992 నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో మొదలైంది.

హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్

హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సంస్థ పెట్టుబడిదారుల కోసం కొన్ని స్టాక్ లను సూచించింది. ముహూర్తం ట్రేడింగ్ లో వీటిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయమని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేకే లక్ష్మి సిమెంట్, జ్యోతీ ల్యాబ్స్ , ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నాల్కో, నవీన్ ఫ్లోరిన్, ఎన్సీసీ లిమిటెడ్ , పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కొనుగోలు చేస్తే బాగుటుందని సూచించింది.

ఆనంద రాఠీ

దేశీయ బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రాఠీ కూడా ఇన్వెస్టర్లకు కొన్ని షేర్లు కొనుగోలు చేయాలని సూచించింది. వీటిలో ఎన్ఎఫ్సీఐ, ఐఆర్బీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, జూపిటర్ వ్యాగన్స్, హింద్ జింక్, టాటా టెక్, గార్డెన్ రీచ్ షిప్ అండ్ ఇంజి, బీఈఎంఎల్ ఉన్నాయి.

సిస్టమాటిక్స్

పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వన్ 91 కమ్యూనికేషన్స్, ప్రోటీన్ ఇగోవ్ టెక్నాలజీస్, జీఎంఆర్ విమానాశ్రయాల మౌలిక సదుపాయాలు, లెమన్ ట్రీ హోటల్స్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, జొమాటో, జాష్ ఇంజినీరింగ్ ఉన్నాయి.

షికా గ్రూప్

ఆషికా బ్రోకరేజీ సంస్థ ఇన్వెస్టర్లకు పలు స్టాక్ లకు సూచించింది. వాటిలో ఓఎన్జీసీ, కేన్స్ టెక్నాలజీ, ఎరిస్ లైఫ్ సైనెన్స్, ఇస్టెక్ హెవీ ఇంజినీరింగ్, నజారా టెక్నాలజీస్, ఈఎంఎస్, యాక్సిస్కేడ్ టెక్నాలజీ ఉన్నాయి.

ధన్‌తేరస్‌ వేళ ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్‌.. కేవలం 10 రూపాయలకే బంగారం

ధన్‌తేరస్‌ సందర్భంగా బంగారం కొనడానికి సెంటిమెంట్‌ రోజుగా భావిస్తుంటారు. మీరు కూడా ధన్‌తేరస్‌లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకోసమే..!

ధన్‌తేరస్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కంపెనీ గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. ఆఫర్ కింద కేవలం 10 రూపాయలకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు, మీ బంగారాన్ని ఇంట్లో కూర్చోని కొనుగోలు చేయొచ్చు..

దీపావళికి ముందు, ధన్‌తేరస్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కంపెనీ జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ తన కొత్త స్కీమ్ “స్మార్ట్ గోల్డ్”ను ప్రారంభించింది. ఈ పథకం కింద, మీరు డిజిటల్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు, తద్వారా మీ బంగారం కూడా సురక్షితంగా ఉంటుంది. SmartGold పథకం కింద, వినియోగదారులు బంగారంపై తమ పెట్టుబడిని ఎప్పుడైనా నగదు, బంగారు నాణేలు లేదా ఆభరణాలుగా మార్చుకోవచ్చు.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీని కోసం వేల లేదా లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు మీరు కేవలం 10 రూపాయలకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ముఖేష్ అంబానీ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా స్మార్ట్ గోల్డ్ స్కీమ్‌లో రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. కస్టమర్లు మొత్తం పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. లేదంటే బంగారం బరువును బట్టి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారం డెలివరీ 0.5 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ హోల్డింగ్‌లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 0.5 గ్రాములు, 1 గ్రాములు, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల విలువలలో అందుబాటులో ఉంటుంది. మీరు నేరుగా బంగారు నాణేలను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. అంతేకాదు హోమ్ డెలివరీ సదుపాయాన్ని కూడా అందిస్తోంది జియో ఫైనాన్స్.

స్మార్ట్ గోల్డ్ పథకం కింద, వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది సురక్షితమైన బీమా వాల్ట్‌లో ఉంటుంది. దీనివల్ల బంగారం భద్రంగా ఉండటమే కాకుండా దొంగతనం భయం కూడా ఉండదు. యాప్ సహాయంతో మీకు కావలసినప్పుడు బంగారం ప్రత్యక్ష ధరను చూడవచ్చు.

Health

సినిమా