Friday, November 15, 2024

BREAKING: రైతు భరోసా పథకంపై సర్కార్ సంచలన నిర్ణయం

రైతు భరోసా (రైతు బంధు పాత పేరు) పథకంపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల సూచనలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ ఖరారు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.

జూలై 15వ తేదీ లోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంతో పేరుతో ఎకరాకు రెండు దఫాల్లో రూ.15 వేలు ఆర్థిక సహయం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ సర్కార్ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది

ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యి శివాలయాల దర్శన పుణ్యం

ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యి శివాలయాల దర్శన పుణ్యం

బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలను ఒకేసారి దర్శించిన పుణ్యఫలాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. అటువంటి శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?..

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్లు, జలుమూరు నుంచి 12 కిలోమీటర్లు, ఆముదాలవలస నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ విశిష్ట క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఉన్న సోమేశ్వరస్వామి దేవాలయ విశిష్టత తెలుసుకుంటేనే విశేష పుణ్యఫలం దక్కుతుంది.

అదే ఇక్కడి ప్రత్యేకత

ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కొలువుదీరినా అది తూర్పు ముఖంగా ఉంటుంది. ఎక్కడన్నా కొన్ని దక్షిణాభి ముఖంగా ఉంటాయి. అయితే సోమేశ్వరాలయం మాత్రం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. సాయంత్రం సూర్య కిరణాలు, రాత్రి చంద్రకిరణాలు సోమేశ్వరస్వామి దేవాలయం లోపల గల శివలింగంపైన పడతాయి. ఇదే ఇక్కడి విశిష్టత.

వంశధారలో స్నానం చేయగానే..

పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 64 మంది కుమార్తెలు ఉంటారు. వారిలో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు మాత్రం తార, రోహిణి అనే ఇద్దరితో బాగా సఖ్యంగా ఉంటాడు. మిగిలినవారితో సఖ్యతగా ఉండటంలేదని వారంతా దక్షుడికి చెప్పడంతో ఆయన చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. అయినప్పటికీ చంద్రుడు మారడు. అప్పుడు దక్షుడు చంద్రుడికి కుష్టురోగం వస్తుందంటూ శపిస్తాడు. వ్యాధి నివారణ కోసం చంద్రుడు ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినప్పటికీ తగ్గదు. చివరకు వంశధార నదిలో స్నానం చేయగానే కుష్టు వ్యాధి నయమవుతుంది.

రోగాలన్నీ తగ్గిపోతాయి

దీనికి గుర్తుగా చంద్రుడు తన స్వహస్తాలతో బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాన్ని పశ్చిమాభిముఖంగా ప్రతిష్టిస్తాడు. ఈ లింగాన్ని దర్శిస్తే వెయ్యి శివలింగాలను దర్శించిన ప్రయోజనం దక్కుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ లింగాన్ని దర్శించుకొని అభిషేకం చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! ఈ లక్కీ ఛాన్స్ మళ్ళీ రాదు!

నేటి కాలంలో ఉద్యోగం రావాలంటే కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే.. డిగ్రీతో పాటు మరి కొన్ని ఇతర కోర్సులు కూడా నేర్చుకుని ఉండాలి.

ఇవన్ని ఉన్నా ఉద్యోగం వస్తుందా అంటే.. కష్టమే అని చెప్పవచ్చు. ఇక చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే కొన్ని జాబులకు మాత్రం పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హత ఉన్నా సరిపోతుంది. అలాంటి ఓ జాబ్‌ నోటిఫికేషన్‌ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. పదో తరగతి పాస్‌ అయితే చాలు గవర్నమెంట్‌ జాబ్‌.. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చు. నాలుగు గంటలు మాత్రమే పని.. పైగా దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. మరి ఇంతకు ఆ ఉద్యోగం ఏంటి అంటే..

పోస్టల్‌ శాఖ.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో.. జీడీఎస్‌ నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాదికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. జీడీఎస్‌ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత. టెన్త్‌ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారనే సంగతి తెలిసిందే.

ఇక ఈ పోస్టులకు సంబంధించి భర్తీ విషయంలో.. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం) అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి ఈ ఉద్యోగాలకు వేతనం రూ.10-రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది.

ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత రోజుకు కేవలం నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు భర్తి చేస్తారు.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వీటికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ వంటి వివరాలు తెలియాలంటే.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక ఆలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక ఆలయాల్లో నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలున్నాయి.

అలాంటి ఒకటి ఆలయాల్లో ఒకటి జగన్నాథ్ ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న బెహతా గ్రామంలో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏ ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుందో అది కూడా ఓ ప్రత్యేక పద్ధతిలో అంచనా వేస్తుంది. అందుకనే ఈ ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని కూడా అంటారు. వర్షం లేదా రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభిస్తాయి.

ఇలా గర్భ గుడి పై కప్పు నుంచి జారుతున్న చుక్కలు వాన చినుకుల ఆకారంలో ఉండడం గొప్ప వింత. ఈ చుక్కల సైజును బట్టి ఆ ఏడాది రుతుపవనాలు బలంగా ఉండి ఎక్కువగా వర్షాలు కురుస్తాయో లేక బలహీనంగా ఉండి తక్కువ వర్షాలు కురవనున్నాయో అంచనా వేస్తారు.

జూన్ మొదటి పక్షం రోజుల్లో చుక్కలు పడటం ప్రారంభమవుతాయని దేవకాయ పూజారి కుధా ప్రసాద్ శుక్లా తెలిపారు. గోపురం మీద ఉన్న రాయి నుంచి మంచి పరిమాణంలో చుక్కలు పడుతున్నాయని.. ఈ చుక్కలు నాలుగైదు రోజుల క్రితం వరకు ఎక్కువగానే ఉన్నాయన్నారు.

బండపై పడిన నీటి చుక్కలు ఆరిన వెంటనే వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం బండ పై పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదు. అయితే క్రమంగా నీటి చుక్కలు ఆరిపోవడం క్రమంగా జరుగుతోంది.. కనుక రుతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే చుక్కల పరిమాణం బట్టి ఈ సంవత్సరం మంచి రుతుపవనాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ రహస్యం తెలుసుకుని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఆలయంలో దాదాపు 15 అడుగుల ఎత్తులో నల్లరాతితో చేసిన జగన్నాథుని విగ్రహం ప్రతిష్టించబడింది. దీనితో పాటు సుభద్ర, బలరామ విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం చుట్టూ 10 అవతారాల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.

ఈ ఆలయం లోపల, గర్భ గుడి చుట్టూ అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో సర్వేలు చేసినా ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో నేటికీ తెలియదు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని MannamWeb ధృవీకరించడం లేదు.

ఒక్క వెల్లుల్లి చాలు; దోమలు ఇంట్లోకి రావు

ఒక్క వెల్లుల్లి చాలు; దోమలు ఇంట్లోకి రావు

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్య దోమల బెడద . దోమలు గుడ్లు పెట్టవచ్చు మరియు దోమలు ఏ నీటిలోనైనా పెరుగుతాయి.

అందువల్ల, వర్షాకాలంలో, దోమలు డెంగ్యూ జ్వరం, వెస్ట్ నైల్ జ్వరం మరియు ఫుట్ మరియు నోటి వ్యాధితో సహా ఇతర ప్రాణాంతక వైరల్ వ్యాధులకు కారణమవుతాయి.

ఇంటి లోపల దోమలను వదిలించుకోవడానికి, మనం సాధారణంగా చాపలు మరియు దోమతెరలను ఉపయోగిస్తాము మరియు శరీరానికి చాలా మందులు వేస్తాము. ఈ పదార్ధాలను పీల్చినా లేదా ఇతర మార్గాల్లో వాడినా ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. దోమల బారిన పడకుండా వదిలించుకోగలిగితే? అది మంచి విషయమే. అందుకోసం ఒక్క పౌడర్ ట్రై చేద్దాం.

ఇది హానికరం కాదు, ఎందుకంటే దీనికి పూర్తిగా సహజ పదార్థాలు అవసరం మరియు ఇంట్లో వాతావరణాన్ని శుద్ధి చేయడంలో మీకు కావలసిందల్లా ఒక వెల్లుల్లి, కొద్దిగా సోపు మరియు కొంచెం కొబ్బరి నూనె. వంటగదిలో కొబ్బరి నూనె కూడా వాడితే సరిపోతుంది. ముందుగా వెల్లుల్లిని తొక్క తీసి లవంగాలుగా కోయాలి.

ఇప్పుడు పూర్తిగా నలగగొట్టండి. బాగా మెత్తగా అయ్యాక, దీన్ని ఒక గిన్నెలోకి మార్చండి. ఇప్పుడు సోపు గింజలను ఇలా రుబ్బుకోవాలి. ఈ రెండింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కాస్త కొబ్బరినూనె వేసి మరిగించాలి. సువాసన ఎప్పుడు వస్తుందో మనం చెప్పగలం. ఇప్పుడు ఓవెన్ నుంచి దించి చిన్న గిన్నెలో వడకట్టాలి. కర్పూరములను గ్రైండ్ చేసి దీంట్లో కలపాలి. ఇప్పుడు కొవ్వొత్తిని తీసుకుని బాగా డిప్ చేసి కుండపై వేలాడదీయండి.

దోమల బెడద ఎక్కువగా ఉన్న గదిలో ఉంచిన తర్వాత ఆ గది సువాసనతో కూడుకున్నదని, కొద్దిసేపటికే దోమల బెడద పోయిందని తెలుసుకుంటారు. ఎందుకంటే కర్పూరం, వెల్లుల్లి వాసన దోమలకు నచ్చవు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల క్రమంగా ఇంట్లోని దోమల బెడద అంతరించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

Medical Services : అమెరికాలో వైద్యం నరకం.. భారత్ లో ఎంత సులభం.. ఈ ఘటన కళ్లు తెరిపించింది

Medical Services : ఏదైనా వస్తువులు విలువ లేదా.. వ‍‍్యక్తి విలువ తెలియాలంటే.. అవి మనకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. నిత్యం మనతో ఉంది వస్తువైనా, మనిషైనా దానిని గుర్తించం.

అవి లేనప్పుడు ఇబ్బంది కలిగితే వాటి విలువ తెలుస్తుంది. అమెరికా వెళ్లిన భారతీయ వృద్ధ దంపతులకు ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. అమెరికా అంటే అగ్రరాజ్యమని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని చాలా మంది బావిస్తుంటారు. కానీ, వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందటున్నారు వృద‍్ధ దంపతులు. వైద్య సేవల విషయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులత విదేశాల్లో ఉండే సౌకర్యాలను గొప్పగా భావించేవాళ్లకు తమ బాధ తెలియజేస్తున్నారు.

ఏం జరిగిందంటే..
అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు ఇటీవల ఓ భారతీయ వృద్ధ దంపతులు వెళ్లారు. అతడి భార్యకి శ్వాసకోశ సమస్య ఉండడంతో ఇక్కడి నుంచే మందులు తీసుకెళ్లారు. కానీ, అక్కడికి వెళ్లాక అవి అయిపోయాయి. వాతావరణం కూడా మారిన నేపథ్యంలో ఒకసారి ఊపిరితిత్తుల వైద్యుడిని సంప్రదించాలనుకున్నాడు. ఈ విషయం కూతురుకు చెప్పారు. దీంతో ఆమె డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది.

వారానికి అపాయింట్‌మెంట్‌.. మందులకు..
డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ వారం తర్వాత దొరికింది. దీంతో ఆ దంపతులు అప్పటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. సరే అపాయింట్‌మెంట్‌ దొరికిన తర్వాత చికిత్స అయినా త్వరగా అందుతుందని భావించారు. కానీ సదరు డాక్టర్‌ వీడియోకాల్‌లో సమస్య తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలు తెలుసుకున్నారు. వాటికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇచ్చాడు. ఇక ఈ ప్రిస్క్రిప్షన్‌తో మందుల కోసం మెడికల్‌ స్టోర్‌లో ఆరా తీస్తే.. ఆ మందులు అందుబాటులో లేవని చెప్పారు. నాలుగు లేదా ఐదు రోజుల్లో వస్తాయని తెలిపారు. దీంతో మరో ఐదు రోజులు వేచిఉన్నారు.

ఇండియా కంపెనీ మందులే..
ఇక మందులు వచ్చిన తర్వాత చూస్తే.. అవి మేడిన్‌ ఇండియా కంపెనీ సిప్లా తయారు చేసినవే. అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఇవే మందులు మన ఇండియాలో అయితే ఏ మెడికల్‌ స్టోర్‌కు వెళ్లినా దొరుకుతాయని తెలిపారు. ఇక మందుల ధరల విషయానికి వస్తే.. 50 శాతం డిస్కౌంట్‌లో ఆ మందుల ధర మన కరెన్సీలో రూ.21 వేలు అయింది. అంటే పూర్తి ధర రూ.42 వేలు అన్నమాట. ఇవే మందులు మన ఇండియాలో కేవలం రూ.2,500. అగ్రరాజ్యంలో మందుల ధరలు కూడా ఆ పేరుకు తగ్గట్లే ఉన్నాయని ఆశ్చర్యపోయారు.

మన దేశమే బెస్ట్‌..
అంతా అయ్యాక.. వారికి అర్థమైంది ఏమిటంటే.. వైద్య సేవల్లో మన భారత దేశమే బెస్ట్‌ అని. అగ్రరాజ్యంలో ఏ వ్యాధికైనా డాక్టర్‌ అందుబాటులో ఉంటారు. ఏ ట్రీట్‌మెంట్‌ అయినా క్షణాల్లో అందుతుంది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేస్తారని, కానీ తమ అనుభవం ప్రకారం చూస్తే.. వైద్య సేవల్లో మన దేశమే ఉత్తమమని అమెరికా వచ్చాక తెలుసుకున్నామని పేర్కొన్నారు.

ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

టీ20 వరల్డ్ కప్​లో భారత్​ హవా నడుస్తోంది. ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది టీమిండియా. లీగ్ స్టేజ్​లో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన రోహిత్ సేన..

సూపర్-8ను కూడా సక్సెస్​ఫుల్​గా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన సూపర్ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. కరీబియన్ పిచెస్​పై ఎలా ఆడుతుందో అనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన భారత్.. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో దుమ్మురేపింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32), విరాట్ కోహ్లీ (24) బ్యాట్లతో చెలరేగారు. ఆ తర్వాత జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచారు.

భారతబౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా ఫామ్​లోకి రావడం, డేంజరస్ టీమ్​ను చిత్తుగా ఓడించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇలా ఆడితే ఏ టీమ్ కూడా మనల్ని ఆపలేదని, కప్ టీమిండియాదేనని ఫ్యాన్స్ అంటున్నారు. తదుపరి మ్యాచుల్లో బంగ్లాదేశ్​, ఆస్ట్రేలియాను కూడా రోహిత్ సేన చిత్తుగా ఓడించడం ఖాయమని చెబుతున్నారు. ఈ తరుణంలో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఆఫ్ఘాన్​ను మట్టికరిపించిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్​లో బంగ్లాను ఢీకొట్టనుంది. అంటిగ్వా వేదికగా జూన్ 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది.

బంగ్లాదేశ్ కూడా మన జట్టుకు షాక్ ఇచ్చి నాకౌట్ ఛాన్సుల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-బంగ్లా మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అంటిగ్వాలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అంటిగ్వాలో వాన పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని వెదర్ వెబ్​సైట్స్ అంటున్నాయి. మ్యాచ్ జరిగే రోజు ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ పొద్దున 10.30 గంటలకు మొదలవనుంది. దీంతో మ్యాచ్​ జరిగే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్-బంగ్లా మ్యాచ్ రద్దయితే ఇరు టీమ్స్​కు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు లాస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఇదేం కర్మరా బాబు అంటున్నారు. బంగ్లాతో మ్యాచ్​లో భారత్ ఈజీగా నెగ్గుతుందని, సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. వరుణుడు మ్యాచ్​కు ఆటంకం కలిగించొద్దని కోరుకుంటున్నారు.

Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

Bapatla: బాపట్ల జిల్లా చీరాల (Chirala) మండలం ఈపూరుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

డెడ్ బాడీని చూసిన స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున మృతురాలు కుటుంబానికి అండగా ఉండాలన్న సీఎం.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా..జాప్యం జరగకుండా చూడాలని హెచ్చరించారు. సిఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరు పాలెం హోంమంత్రి అనిత బయలు దేరారు.

viral స్టూడెంట్ రాక్, టీచర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే

స్టూడెంట్ రాక్, టీచర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే

ఇంటర్నెట్‌, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.

గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.

ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్‌మేట్ అని పేర్కొన్నాడు.

ఆ సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,

విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా… ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు.

MLA Somireddy: జగన్ జైలుకు వెళ్లక తప్పదు: సోమిరెడ్డి చంద్రమోహన్

MLA Somireddy Chandra Mohan Reddy: ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

ఇక జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పుపై జగన్ మదన పడుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు అడ్డాగా మారింది అన్నారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

వైసీపీ నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేతిలో పెట్టారని తెలిపారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని వైసీపీ నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలోనే అనుభవించి తీరుతారన్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో కోట్టు మెట్లేక్కుందుకు జగన్ సిద్ధంగా ఉండాలన్నారు. లిక్కర్‌లోనే రూ. లక్షల కోట్లు దోపిడీ చేశారని.. ల్యాండ్, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.

సర్వేపల్లిలోనే దాదాపు వెయ్యి ఎకరాల భూమిని కాజేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రయివేటు ఎస్టేట్‌గా మార్చుకోవాలని కుట్రలు చేశారని అన్నారు. అందుకోమే రాష్ట్రానికి జగన్ ఐదేళ్లలో చాలా నష్టం చేశారని అన్నారు. దుర్మార్గాలు చేసిన వారిని ప్రజలు సహించరని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని అన్నారు.

Andhra News: పేరు మార్చుకున్నారు.. ఆలోచనా విధానమే మారలేదు: ముద్రగడ కుమార్తె క్రాంతి

‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం: ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా క్రాంతి స్పందిస్తూ.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

Pencil drawing selected choice on answer sheets. hand fill in Exam carbon paper computer sheet and pencil.

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

దిల్లీ: వరుస పేపర్‌ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు.

గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను ప్రశ్నించగా… న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

Jasprit Bumrah: బుమ్రాకు ఫ్రీహ్యాండ్‌..బౌలింగ్‌ కోచ్‌ కూడా జోక్యం చేసుకోడు

టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్న బౌలర్‌ బుమ్రా(Jasprit Bumrah). ప్రతి మ్యాచ్‌లో భారత్‌కు వెన్నెముకలా ఉండి విజయాన్ని అందిస్తున్నాడు. జట్టులో కూడా అతడి ప్రణాళికలకు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చేశారు. ఈ విషయాన్ని సహచరుడు అక్షర్‌ పటేల్‌ స్వయంగా వెల్లడించాడు. వాస్తవానికి బుమ్రా విషయంలో బౌలింగ్‌ కోచ్‌ కూడా పెద్దగా జోక్యం చేసుకోడంట.. స్వేచ్ఛగా ఈ పేసర్‌ తన వ్యూహాలను అమలుచేస్తాడట.

అఫ్గాన్‌తో మ్యాచ్‌ అనంతరం అక్షర్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా విషయంలో జట్టు ఓ ప్రత్యేక వైఖరిని అవలంభిస్తోందని పేర్కొన్నారు. అతడికి మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని పేర్కొన్నాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ గురించి జట్టులో ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఎప్పుడు ఏం చేయాలో.. ఏం చేయకూడదో అతడికి బాగా తెలుసు. బౌలింగ్‌ కోచ్‌ కూడా ఎక్కువ ఇన్‌పుట్‌లు ఇచ్చి అతడిని అనవసరమైన గందరగోళానికి గురిచేయడు. బాగా ఆడుతున్నావు అని మాత్రమే చెబుతాడు. ప్లానింగ్‌ సమయంలో కూడా నీ వ్యూహాలు విజయవంతమవుతున్నాయి.. అనుకున్నట్లు బౌలింగ్‌ చేయమని చెబుతాడు’’ అని అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

బుమ్రా తర్వాత బౌలింగ్‌కు వచ్చీ రావడంతోనే వికెట్‌ తీయడంపై అక్షర్‌ స్పందిస్తూ.. ‘‘జస్ప్రిత్‌ బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎలాంటి కఠిన పరిస్థితినైనా ఎదుర్కోగల బౌలింగ్‌ దళం మాకుంది. అలాంటి సమయంలో మా శక్తి సామర్థ్యాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలిసిఉండాలి. ఏ బౌలర్‌తోనూ పోల్చుకోకూడదు. ఆ వికెట్‌ నాకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాను.. రెండు బంతులు వేశాక అవగాహన వచ్చింది. ఆ తర్వాత నా పేస్‌, లెంగ్త్‌ను మార్చాను. ఫలితం వచ్చింది. అవతల ఎండ్‌ నుంచి అత్యుత్తమ బౌలింగ్‌ వేస్తుండటంతో నేను అలానే చేయాలని అనుకోను. ఆ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ఎలా ఆడగలనో ఆలోచించాను. అదే నా ప్లాన్‌’’ అని అక్షర్‌ పేర్కొన్నాడు.

సూపర్‌-8ను మాత్రం ఘనవిజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్‌సేన 47 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ ఉత్తర్వులపై స్టే

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు (Delhi High Court) నిలిపివేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ (Delhi CM Kejriwal)కు గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే నేడు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సిఉండగా.. ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘‘బెయిల్‌ (Kejriwal Bail)ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.

AP Assembly: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణం చేశారు.

పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

YS Jagan: అసెంబ్లీకి వెనుక గేటు నుంచి వచ్చిన జగన్‌

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ (YS Jagan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

అమరావతి: వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ (YS Jagan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్‌ సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు.

అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్‌ వచ్చారు. గతంలో ఆయన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు.

అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో జగన్‌ అడుగుపెట్టారు.

Delhi liquor scam : అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన రాజకీయ నాయకుల‌లో బెయిల్ పొందిన రెండో వ్యక్తి కేజ్రీవాల్. గతంలో ఎంపీ సంజయ్ సింగ్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.

రెండు రోజుల పాటు కేజ్రీవాల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు విన్న తర్వాత వెకేషన్ జడ్జి నియా బిందు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జ‌డ్జి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. వాద‌న‌లు ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని జ‌డ్జి మొన్ననే స్పష్టం చేశారు.

కోర్టు గురువారం సాయంత్రం బెయిల్ ప్రకటించిన తర్వాత.. బెయిల్ బాండ్‌పై సంతకం 48 గంటల పాటు వాయిదా వేయవచ్చా అని ED అభ్యర్థించింది, తద్వారా ఈ ఆర్డర్‌ను అప్పీలేట్ కోర్టు ముందు సవాలు చేయవచ్చు. ఈడీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ బాండ్‌ను రేపు డ్యూటీ జడ్జి ముందు హాజరుపరచాలని తెలిపింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌ బెయిల్‌ను కోర్టు ఆమోదించింది.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ట్రయల్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ED శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న లొంగిపోయారు.

ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. చౌదరి వాదిస్తూ ED ఒక స్వతంత్ర సంస్థా లేక కొందరు రాజకీయ నాయకుల చేతుల్లో ఆడుతుందా? ED తన అన్ని నిర్ధారణలను పరికల్పన ఆధారంగా తీసుకుంటుంది ఒకవేళ వారు ఇప్పటికీ ఆధారాల‌ను సేకరిస్తున్నట్లయితే అది అంతులేని పరిశోధన. ఆప్ జాతీయ కన్వీనర్‌ని నేనేనని, అందుకే పార్టీ చేసే ప్రతి పనికి నాదే బాధ్యత అని అంటున్నారు. వారు ఎప్పుడో 45 కోట్లు అందుకున్నారని చూపించడానికి ఏమీ లేదు. ఇదంతా ఊహాగానాలు, పక్షపాతాలు, ఊహల పరిధిలో ఉంది. ఇంకా అరెస్టులు, అంచనాలు వేస్తూనే ఉన్నారు.. రూ.100 కోట్ల లంచం దొరికినట్లు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఇతర వ్యక్తుల మాదిరిగానే కేజ్రీవాల్‌కు కూడా స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన కోరుతున్నారని ఆయ‌న కోర్టులో వాద‌న‌లు వినిపించారు.

కొంతమంది మద్యం విక్రయదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో రూపొందించిన‌ కుట్రలో భాగంగా కేజ్రీవాల్‌ను మార్చి 21న ED అరెస్టు చేసింది. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు మద్యం విక్రేతల నుంచి అందిన లంచాలను ఉపయోగించారని.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌గా ఉన్న కేజ్రీవాల్ మనీలాండరింగ్ నేరంలో వ్యక్తిగతంగా, పరోక్షంగా పాలుపంచుకున్నారని ED ఆరోపించింది. కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించారు. ED దోపిడీ రాకెట్‌ను నడుపుతోందని ఆరోపించారు.

YS Jagan: 2029లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ సీట్లే

అమరావతి: ‘ఇప్పుడొచ్చిన ఫలితాలు శకుని పాచికల్లాంటివి.. వారికి కావాల్సినట్లుగా పడ్డాయి. ఇది ఇంటర్వెల్‌ మాత్రమే’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌ వ్యాఖ్యానించారు. ‘తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికైనా ధర్మం, నిజమే గెలుస్తాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌లోనే సీట్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు.

ప్రజలపై కోప్పడాల్సిన పని లేదు
‘ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి మోసపోతారు. అలా మోసపోయిన వారందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది. ఆ మోసాలు తేటతెల్లమవగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులోంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకుని మనం ప్రతి ఇంటికీ వెళ్లగలం’ అన్నారు. ‘మనకు వచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు.

ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం. మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు అండగా నిలవండి. మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్లండి, మీ తరఫు నుంచి సాయం చేయండి. పార్టీ నుంచి ఇచ్చే సాయాన్నీ అందించండి. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉండి, భరోసా ఇద్దాం’ అని నేతలకు చెప్పారు.

Andhra News: జగన్‌ భక్త ఐపీఎస్‌ అధికారులపై వేటు

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథరెడ్డి
పీవీ సునీల్‌కుమార్, రిషాంత్‌ రెడ్డిలకు పోస్టింగే లేదు
వైకాపా నాయకుల అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులు

అమరావతి: జగన్‌ ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది.

సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించారనే ఫిర్యాదులున్న ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు పోస్టింగే ఇవ్వలేదు. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా ఉంటూ చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకుల దాష్టీకాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రస్తుత కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ రిషాంత్‌రెడ్డికీ ఏ పోస్టింగూ ఇవ్వలేదు. ఆయన్ను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీఎస్పీ బెటాలియన్స్‌ అదనపు డీజీ అతుల్‌సింగ్‌కు ఏసీబీ డీజీగా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Praveen Prakash: కావాలని ఎవర్నీ అవమానించలేదు: ప్రవీణ్‌ప్రకాష్‌ పశ్చాత్తాపం

Praveen Prakash: కావాలని ఎవర్నీ అవమానించలేదు: ప్రవీణ్‌ప్రకాష్‌ పశ్చాత్తాపం

వైకాపా ప్రభుత్వంలో అధికార పక్షంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.

సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్‌కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్‌ ప్రకాష్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ‘గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’ అని తెలిపారు.

AP Schools Vocational Education Implementation Guidelines 2024

AP Schools Vocational Education Implementation Guidelines 2024 Renewal of Vocational Training Partners Guidelines for implementation of Vocational Education in Secondary and Higher secondary schools – Orders Issued

Samagra Shiksha – Renewal of Vocational Training Partners Guidelines for implementation of Vocational Education in Secondary and Higher secondary schools – Orders Issued – Reg R.C.No.SS-21024/7/2024-GCDO,  Dated: 18/06/2024

All the District Educational Officers and Additional Project Coordinators in the State are informed that, the Samagra Shiksha, Andhra Pradesh has implementing the Centrally Sponsored Scheme for Vocationalisation of Secondary and Higher Secondary Education (CSSVSHSE) in 539 Schools with 818 Vocational Trainers under Samagra Shiksha for the academic year 2024-25 across the state from 9th class to 12th class in 11 Sectors.

In this regard, all District Educational Officers and APCs in the State are hereby informed that to communicate the enclosed guidelines to all the concerned Head Masters/Principals for the implementation of vocational education in the schools listed (enclosed). If any Head Master/Principal fails to comply with the guidelines, appropriate actions will be taken.

Download SS Proceedings | Schools List

 

International Yoga Day 2024 Celebrations in AP Schools

International Yoga Day 2024 Celebration in AP Schools Observation of 10th International Day of Yoga i.e IDY 2024 will be held on 21.06.2024 Certain instructions Issued

Samagra Shiksha, AP- SIEMAT-Observation of 10th International Day of Yoga i.e IDY-2024 will be held on 21.06.2024 Certain instructions – Issued Rc.No. SSA-15024/76/2019-SAMO-SSA Dated: 12/06/2024.

Ref: F.N.13-2/2024-IS.4, dt.04.06.2024 of the Government of India, Ministry of Education, Department of School Education & Literacy, New Delhi.

As per the reference cited above, all the District Educational Officers and Additional Project Coordinators, Samagra Shiksha in the state are informed that the Department of School Education & Literacy has stated that they are aware that 21st June is celebrated as International Day of Yoga (IDY) every year. The 10th International Day of Yoga will be celebrated on 21.06.2024. In this regard, M/o AYUSH has planned to celebrate 10th IDY all across the country through various activities related to yoga. In this regard, M/o AYUSH has requested this Ministry to organize Mass Yoga Demonstration by students, teachers etc., on the IDY and also requested to arrange Yoga workshops/seminars for teachers, students in schools.

Hence, all the District Educational Officers and Additional Project Coordinators, Samagra Shiksha in the State are requested to organize Yoga camps in each school of all management under their jurisdiction and encourage students and faculty for participating in the celebration of 10th International Day of Yoga and other yoga related activities in their schools.

Samagra Shiksha, A.P – SIEMAT – Observation of 10th International Day of Yoga i.e IDY- 2024, on 21.06.2024 – Nomination of State Nodal Officer and District Coordinators – Orders – Issued  Rc. No. SSA- SS-15022/2/2024-SAMO Dt: 19/06/2024

Ref: D.O.No. 13-2/2024-IS.4, dt: 13.06.2024 of the Secretary, Government of India, Ministry of Education, Department of School Education & Literacy, New Delhi.

All the District Educational Officers and Additional Project Coordinators in the state are informed that the Department of School Education & Literacy, Ministry of Education, Government of India, New Delhi has stated that 10th International Day of Yoga (IDY) with the theme Yoga for Self and Society is to be celebrated across the world on 21.06.2024. After the initiative of the Hon’ble Prime Minister at the United Nations General Assembly (UNGA), in 2014, the world has been celebrating the International Day of Yoga (IDY) on the 21st, June every year, since the last nine years. It has helped India to spread the message and benefits of Yoga which is widely acknowledged across the world. The Ministry of Ayush, being the Nodal Ministry for observation of International Day of Yoga’, organizes various events for spreading awareness about the practice of Yoga for holistic well-being and sustainable living.

In this connection, it is requested to make this event a grand success among school children and issue necessary instructions to encourage the students for participating in the celebration of 10th International Day of Yoga and other yoga related activities in schools. In this regard refer to YouTube videos on common Yoga Protocol in Hindi, English and in 21 regional languages;. The following two web-links of Surya Namaskar Asanas may also be shown to the children, where ever possible, during such yoga activities:

https://www.youtube.com/watch?v=USs5FUwjXLM

https://www.youtube.com/watch?v=LE-BL7WvUfk

Sri A.Subba Reddy, Additional Director, SAMO of Samagra Shiksha is appointed as Nodal Officer for IDY, 2024 and he is requested to follow up the IDY events and upload the same on DoSEL Google spreadsheet- Google link given below .

https://docs.google.com/spreadsheets/d/1tCoo9v0fm3Std6TmU7neW3BwuCooH2cnS-Ycjg8AeHk_mOk/edit#gid=0 

Keeping this in view, all the District Educational Officers, Additional Project Coordinators of Samagra Shiksha are requested disseminate information to all schools and collect the photos & videos and to upload the same in State google tracker. State google tracker link will be shared.

Hence, all the District Educational Officers & Additional Project Coordinators, Samagra Shiksha are requested to monitor the celebration of 10th International Day of Yoga and other yoga related activities and upload the Photographs of Events in the below google spread sheets.

https://drive.google.com/drive/folders/1un71ZvJGYS92j6Nho1b5Db4MXcgrBraE?usp=sharing

Encl:

1. Write-up containing information about Yoga & IDY.

2. Copy of Digital Resources (CYP) for Yoga is annexed

Download SS Proceedings 19-06-24

Download AP SS Proceedings

Morning Foods : రోజూ ఉదయం ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే రోజంతా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు..!

Morning Foods : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే, రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెబుతారు. పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు.

కానీ మీరు అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రజలు తక్షణ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ మాట్లాడుతూ, చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. కానీ అది రోజు ఆరోగ్యకరమైన ప్రారంభం అని పిలవబడదు. రోజంతా శక్తివంతంగా మరియు శక్తివంతంగా ఉండటానికి, మీకు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్‌తో సహా అన్ని పోషకాలు అవసరం. మీ రోజును దేనితో ప్రారంభించాలో నిపుణుల నుండి తెలుసుకుందాం.

ఉదయం లేచిన తర్వాత ఉసిరి రసం తాగాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. కలబందను శతాబ్దాలుగా మన ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. అందరి ఇళ్లలో కలబంద మొక్క ఉంటుంది. దీని జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది మరియు డైజేషన్ కూడా బాగుంటుంది. విటమిన్ ఎ, ఫైబర్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్‌లు బొప్పాయిలో ఉంటాయి. రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే పేగుల ఆరోగ్యానికి మంచిది. ఇది తింటే పొట్ట కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.

Morning Foods
ఉదయం మీరు బాదం, వాల్‌నట్స్ మరియు పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సరిపోతాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. కొబ్బరి నీళ్ళు అమృతం అనే చెప్పాలి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అందువల్ల ఉదయం కొబ్బరినీళ్లను తాగవచ్చు.

Life Style: కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా ..? జాగ్రత్త..!

Life Style: సాధారణంగా చాలా మంది కారులో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొదటగా చేసే పని పని ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేయడం. మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు ఆన్ చేస్తుంటారు.

కానీ కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేయడం ఆరోగ్యానికి హానీ అని చెబుతున్నారు నిపుణులు.

డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి మరింత ప్రమాదం

డస్ట్ ఎలర్జీతో బాధపడేవారికి ఇది అతి పెద్ద ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. కారులో ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. ముందుగా కారు కిటికీలను క్రిందికి తిప్పి లోపలి ఉష్ణోగ్రత చల్లబడి సాధారణ స్థితికి వచ్చే వరకు 5 నిముషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఏసీని ఆన్ చేయాలి. లేదంటే కారు లోపల గాలి పొడిగా ఉండటమే కాకుండా దుమ్ము కూడా నిండి ఉంది. ఇలాంటి గాలిని పీల్చడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతే కాదు ఏసీ వెంట్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, దుమ్ము పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది. ఇటువంటి కలుషితమైన గాలికి ఎక్కువసేపు గురికావడం వల్ల తుమ్ములు, అలెర్జీలు, ముక్కు, గొంతులో పొడిబారడం, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

వాహనంలోని గాలి నాణ్యత కూడా మీరు వాడుతున్న కారు బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. “ప్రీమియం వాహనాలు క్లీనర్ వెంట్స్, డస్ట్-రెసిస్టెంట్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. అయితే సాధారణ కారు మోడల్‌లలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి కారు ఉన్నవారు కారు వెంటిలేషన్ నాళాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. పది పాసైతే చాలు..పరీక్ష లేకుండానే నియామకం

Post Office GDS Recruitment: నిరుద్యోగులకు భారీ శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (GDS)పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఇండియన్‌ పోస్ట్‌ రెడీ అవుతోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది.

రాత పరీక్ష లేకుండానే కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ , ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైనవాళ్లు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైనవాళ్లు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. పోస్టును బట్టి రూ.10-12 వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు.

ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేసేది ఎవరు? విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు తెలియకుండానే ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆదేశాలు

తానే ప్రభుత్వంలా వ్యవహరిస్తున్న సురేష్‌ కుమార్‌
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు తెలియకుండానే ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆదేశాలు
ఒక్కో పోస్టుకు రూ.40 లక్షల వసూలు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టులను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పోస్టుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని.. తనకే సర్వాధికారాలు ఉన్నట్లుగా భావిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం మారినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కూడా మారిపోతాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా మెమోలు జారీచేసేస్తున్నారు. ఒకరకంగా తానే ప్రభుత్వం అన్నట్లుగా సురేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఒక్కో ఎయిడెడ్‌ పోస్టు రూ.40 లక్షలకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో 109 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 307 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే మంత్రి లోకేశ్‌కు సమాచారం ఇవ్వాలి. కానీ, ఆయనకు చెప్పకుండానే నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మెమో జారీచేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసినందున నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయ పోస్టులంటే ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగాలే. వీటికి జీతాలు ప్రభుత్వ గ్రాంటు నుంచే చెల్లిస్తారు. ఇలాంటి ఉద్యోగాలను విద్యాశాఖ మంత్రికి తెలియకుండా రహస్యంగా భర్తీచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్షల్లో వసూలు.. అందరికీ వాటాలు

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయ పోస్టును రూ.40 లక్షలకు అమ్మేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కొందరు కరస్పాండెంట్లు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు పొందుతున్నారు. రాష్ట్రంలో 846 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 109 పాఠశాలలు టీచర్‌ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టుల భర్తీకి అనుమతించారు. వీటిలో 307 పోస్టులు ఉండగా.. ఇప్పటికే 266 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇంకా 41 పోస్టులు భర్తీచేయాలి. ఈ పోస్టుల భర్తీకి టెట్, డీఎస్సీ లాంటి పోటీపరీక్షలు లేకుండా తూతూమంత్రంగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ముందుగానే లీక్‌ చేసి, కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చేలా అమ్మేస్తున్నారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ పోస్టులు కమీషన్లు తెచ్చిపెడుతుండడంతో ఈ నియామక విధానం మార్పునకు ఎవ్వరూ గట్టి చర్యలు తీసుకోవట్లేదు. అవినీతిని అరికట్టాలంటే ఎంపిక విధానాన్ని మార్చాలని, అవసరమైతే ఎయిడెడ్‌ చట్టానికి సవరణ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ఎంపిక విధానం ఇలా..

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఐదుగురు సభ్యుల కమిటీ ఉంటుంది. ఆయా పాఠశాలల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖ తరఫున డిప్యూటీ డీఈఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి, ఇద్దరు సబ్జెక్టు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఈ సబ్జెక్టు నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్‌ పాఠశాల కరస్పాండెంట్‌కు ఉంటుంది. టెట్‌ అర్హత ఉన్నా.. మెరిట్‌కు ప్రాధాన్యం లేదు. అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నపత్రం రూపకల్పనే అక్రమాలకు నిలయంగా మారుతోంది. రాతపరీక్షకు 95 మార్కులు, ఇంటర్వ్యూకు 5 మార్కులు ఇస్తున్నారు.

ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జీటీ టీచర్ల దస్త్రానికి డీఈఓ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులైతే ఆర్జేడీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయితే ఎంపికైనవారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. పైగా ఇక్కడ అప్రెంటిస్‌ విధానం కూడా లేదు. నేరుగా స్కేల్‌ ఇచ్చేస్తారు.

పకడ్బందీ వ్యవస్థ ఉండాలి

ఎయిడెడ్‌లో టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని యాజమాన్యాలు ఒక్కొక్కటిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. భవిష్యత్తులో మిగిలిన 737 పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి.

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డీఎస్సీ తరహాలో పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొంది. పోస్టుల భర్తీకి మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ పద్ధతి పాటించాలని, ఏటా సెప్టెంబరు 30 నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా అక్టోబరులో హేతుబద్ధీకరణ నిర్వహించాలని సూచించింది. ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీఓను కోర్టు రద్దుచేసింది.
ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుతో జీతాలిచ్చే పోస్టులు కావడంతో ఎయిడెడ్‌లోని టీచర్, బోధనేతర పోస్టులకు ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నియామకాల్లో అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేయాలి

ఆడపిల్లల కోసం LICలో ఈ పాలసీలు చాలా బెటర్‌.. రూ.75 చెల్లించి 14 లక్షలు పొందండి

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను వారి అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే అనేక రకాల ప్లాన్లు ఉన్నాయి.

ఇందులో భాగంగానే ఎల్ఐసీ ఆధార్ శీలా పేరుతో మరో అద్భుతమైన పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి రోజుకు కేవలం రూ. 87 పొదుపు చేసినట్లయితే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ.11 లక్షలు అందుకోవచ్చు. ఈ పాలసీ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

LIC ఆధార్ శీలా పథకం అనేది ఆడపిల్లల భవిష్యత్తు సంక్షేమం కోసం LIC అందించే అత్యుత్తమ పథకం. ఈ ప్రత్యేకమైన బీమా పథకం ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఆధార్ శీలా పథకం కింద, మీరు చేయాల్సిందల్లా రోజుకు 87 రూపాయల పెట్టుబడి. చివరికి మీరు మెచ్యూరిటీ మొత్తంగా రూ.11 లక్షల వరకు పొందుతారు. మీరు 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే, హామీ మొత్తం రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య ఉంటుంది.

పాలసీ వ్యవధి పూర్తిగా పూర్తయిన తర్వాత, మెచ్యూరిటీ మొత్తం చెల్లించబడుతుంది. ఈ పాలసీతో మీరు 90% వరకు లోన్ పొందవచ్చు. ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

LIC ఆధార్ శీలా స్కీమ్ అనేది మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన పథకం. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఇందులో చేరవచ్చు. మీరు 10 నుండి 20 సంవత్సరాల వరకు పాలసీ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్లు, రేషన్ కార్డ్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ తదితరాలను ఆధార్ షీలా బీమా ప్లాన్‌లో నమోదు చేసుకోవడానికి సమర్పించవచ్చు.

కన్యాథాన్ విధానం:

LIC యొక్క మరొక ముఖ్యమైన పథకం కన్యాథాన్ పాలసీ. ఈ పథకంలో కేవలం 75 రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఈ పాలసీ మెచ్యూరిటీ సమయంలో రూ.14 లక్షలు పొందుతుంది. ఈ పథకం ద్వారా కనీసం రూ.లక్ష బీమాను పొందవచ్చు. పెట్టుబడిపై పరిమితి లేదు. ఆడపిల్ల తండ్రికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. 50 ఏళ్ల లోపు ఉండాలి. ఆడపిల్లకి కూడా కనీసం ఒక సంవత్సరం వయస్సు ఉండాలి.

కన్యాథాన్ పథకం యొక్క పాలసీ వ్యవధి 13 నుండి 25 సంవత్సరాలు. నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక మరియు వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించే ఎంపికలు కూడా ఉన్నాయి. బీమా చేయించుకుని తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణిస్తే వెంటనే రూ.10 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణమైతే తక్షణమే రూ.5 లక్షలు చెల్లిస్తామన్నారు. పాలసీ వ్యవధిలో తండ్రి మరణిస్తే, మిగిలిన కాలానికి బిడ్డ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ప్రీమియం మాఫీ చేయబడుతుంది.

LIC: ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ. 10వేలు రావాలా.? బెస్ట్‌ స్కీమ్‌..!

LIC: ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉద్యోగంలో చేరిన తొలిరోజే పదవి విరమణ తర్వాత జీవితం ఎలా ఆలోచన పెరుగుతోంది. దీంతో రకరకాల పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు రిటర్మైంట్‌ తర్వాత నెలకు ఎంచ్కా రూ. 10వేలకు పైగా ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఈ పథకం పేరు ఏంటి.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి స్కీమ్‌ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ స్కీంలో పాలసీహోల్డర్లకు సింగిల్ లైఫ్ యాన్యుటీ, డిఫర్డ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పథకంలో మీరు ముందుగానే ముందుగానే సింగిల్ ప్రీమియం చెల్లించి.. ఆపైన యాన్యుటీ పేమెంట్స్ రూపంలో రెగ్యులర్ పేమెంట్స్ అందుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగానే ఈ పేమెంట్లను 2 విధాలుగా పొందొచ్చు. సింగిల్ లైఫ్ యాన్యుటీ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లలో ఒకటి సెలక్ట్ చేసుకోవచ్చు.

ఈ పాలసీ తీసుకోవడానికి మీ వయసు కనీసం 30 ఏళ్లు ఉండాలి. 79 ఏళ్లు పైబడిన వారికి ఛాన్స్‌ ఉండదు. ఈ పథకంలో కనీసం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ప్రతినెల వచ్చే పెన్షన్‌ అనేది పాలసీహోల్డర్‌ వయసు, పెట్టుబడిన పెట్టిన మొత్తం, వాయిదా వ్యవధిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్‌ తీసుకొని 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపుల్లి వాయిదా వేస్తే మీకు 13వ సంవత్సరం తర్వాత ఏడాదికి అందే పెన్షన్‌ రూ. 1,32,920 అవుతుంది. ఈ లెక్కన మీకు నెలకు రూ. 10వేలు చేతికి వస్తాయి.

పాలసీ దారుడు జీవించి ఉన్నంత కాలం సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ చేస్తుంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకుంటే.. మీరు, మీ లైఫ్ పార్ట్‌నర్ ఇద్దరిలో ఒకరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు, పాలసీదారులకు ఏమైనా జరిగితే.. నామినీలు పలు ఆప్షన్లతో బెనిఫిట్స్ పొందొచ్చు.

నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, దీన్ని ఒక్క గ్లాస్ తాగండి

మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు ఒకటి. మిల్లెట్లను వివిధ మార్గాల్లో, పలు ఆహార పదార్థాలలో వినియోగిస్తారు.

రాగిపిండితో ఎన్నో ప్రయోజనాలున్నాయి… రాగి ముద్ద, రాగి రోటీ, రాగి గంజి, రాగి అంబలి ఇలా పలు రకాలుగా తయారు చేసుకోని తీసుకుంటారు. మిల్లెట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగులు పిల్లల సరైన అభివృద్ధికి కూడా ఉపయోగపడుతాయి.. వృద్ధులు, మహిళలు ఎముకల బలానికి మిల్లెట్ మాల్ట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రాగి గంజి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిల్లెట్ మాల్ట్ ఎముకల బలానికి మినరల్స్ ఏర్పడటానికి బాగా దోహదపడుతుంది. రాగి మాల్ట్ తాగితే మన శరీరానికి శక్తి వస్తుంది. రాగుల్లోని పోషకాలు ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, మినరల్స్ మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ట్రిప్టోఫాన్, ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీని వినియోగం బరువును అదుపులో ఉంచుతుంది. మిల్లెట్ పిండితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. రాగులు గుండె బలహీనత, ఉబ్బసాన్ని తగ్గిస్తాయి.

రాగులతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల వృద్ధాప్యంలో శరీరానికి బలం చేకూరుతుంది. మిల్లెట్ ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ, మృదువుగా మారుతుంది.. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. గంజి, పాలతో కలిపిన మిల్లెట్ మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ ఉంచవచ్చు..

మిల్లెట్ ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు, ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడేవారికి ఫైబర్ అధికంగా అందుతుంది..

LIVE: Farewell Message from PRINCIPAL SECRETARY (Praveen Prakash)

LIVE: Farewell Message from PRINCIPAL SECRETARY (Praveen Prakash)

Honorable Secretary, School Education, Govt. of Andhra Pradesh Shri Praveen Prakash IAS Sir will address All Head Masters and teachers of all schools, all MEOs, staff of DEOs, RJDs office, staff of all HODs office of School Education Department, secretariat staff of SE department, Village & Ward Welfare & Educational Assistants of all Over State.

Farewell Message from PRINCIPAL SECRETARY

Date: 20/06/2024

Time: 5.30 PM

YouTube Link:

 

 

Health

సినిమా