Friday, November 15, 2024

Google Lookup Feature: రాంగ్ కాల్స్ ఇక రమ్మన్నా రావు.. ఈ లుకప్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి..

మన ఫోన్‌కు నిరంతరం అనేక కాల్స్ వస్తుంటాయి. వాటినన్నింటికీ మనం సమాధానాలు చెబుతూ ఉంటాం. ఫోన్ చేసిన వారిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, కోలిగ్స్ ఉంటారు.

అయితే కొన్నిసార్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ముఖ్యమైన పనిలో ఉంటాం. హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అది ఏ వ్యాపార సంస్థతో కావచ్చు. దీనివల్ల మనకు చిరాకు అనిపిస్తుంది.

లుకప్ ఫీచర్..

అన్‌నోన్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. దీనికోసం లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే వీలుంటుంది.

మరింత సౌలభ్యం..

పిక్సెల్ ఫోన్ వినియోగించేవారు అన్‌నోన్ కాల్స్‌ను గుర్తించడం చాలా తేలికైంది. గూగుల్ విడుదల చేసిన లుకప్ ఫీచర్ తో వారికి మరింత సౌలభ్యం లభించింది. అన్ నోన్ కాల్స్ కు సమాచారం ఇవ్వాలా, వద్దా అనే విషయాన్ని వారు సులువుగా నిర్ణయించుకోవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..

లుకప్ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించవచ్చు. దీనిని గతంలో జపాన్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తున్నారు. మన కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు జాబితాలో కనిపిస్తుంది. దానిని నొక్కగానే సాధారణంగా యాడ్ నంబర్, మెసేజ్, హిస్టరీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. గూగుల్ కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్ తో వీటితో పాటు నాలుగో ఆప్షన్ గా లుకప్ అని కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకులు తదితర వాణిజ్య సంస్థల నుంచి వచ్చే కాల్స్ ను గుర్తించే అవకాశం ఉంటుంది.

అదనపు యాప్ అవసరం లేదు..

గతంలో అన్ నోన్ కాల్స్ ను గుర్తించాలంటే వేరే యాప్ ను ఉపయోగించాల్సి వచ్చేది. అప్పుడే తెలియని నంబర్ వివరాలను గుర్తించే అవకాశం ఉండేది. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో వచ్చిన కొత్త ఫీచర్ అదనపు యాప్ అవసరాన్ని తొలగిస్తుంది. అన్ లోన్ కాల్స్ వివరాలను వెంటనే గుర్తించే అవకాశం ఉండడంతో మీ విలువైన సమయం ఆదా అవుతుంది. వాటికి సమాధానం ఇవ్వాలో, లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. ఆ నంబర్ ను ట్యాబ్ (నొక్కడం) చేయడం ద్వారా ఆ కాల్‌కు సమాధానం ఇవ్వాలా, లేదా బ్లాక్ చేయాలా అనేది నిర్ణయం తీసుకోవచ్చు.

సర్వర్ సైడ్ అప్ డేట్..

గూగుల్ తీసుకువచ్చిన లుకప్ ఫీచర్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది సర్వర్ సైడ్ అప్ డేట్. అంటే ఫోన్ యాప్ కు సంబంధించిన కొత్త వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకునే అవసరం ఉండదు.

Anganwadi: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి!

Anganwadi: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి!

AP News: ఏపీ అంగన్వాడీలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భారీ ఊరటనిచ్చే వార్త చెప్పారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు విజయనగరం సాలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. గిరిజన స్కూళ్లలో డ్రాప్ అవుట్లను త్వరగా నివారించేందుకు కృషి చేస్తాం.

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తాం. ఐటీడీఏ, ఐసీడీఎస్‌లోనూ ప్రక్షాళన చేపడతామంటూ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపు… వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుల సంబరాలు

ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు…పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు.

అమరావతి: ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు…పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. వాషింగ్టన్‌ డీసీలో తెదేపా జెండాలు ప్రదర్శిస్తూ భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. సీఎం బాబు…జై తెదేపా…జై ఎన్టీఆర్‌ నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా ఎమ్మెల్యే సుజనాచౌదరి, తెదేపా ఎమ్మెల్యే సొంగా రోషన్‌ తదితరులు మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు పలువురు ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చి..ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. జన్మభూమి రుణం తీర్చుకున్నారు’’ అని పెమ్మసాని అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలది కీలకపాత్ర అని సుజనాచౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులు, హంతకులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడానికి ఎన్నారైలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు వాషింగ్టన్‌ డీసీలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుందరపు విజయ్‌కుమార్, జయరాం కోమటి, సతీష్‌ వేమన, భాను మాగులూరి, యశ్‌ బొద్దులూరి తదితరులు పాల్గొన్నారు.


వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుల కార్ల ర్యాలీ

కాలిఫోర్నియాలో…

అమెరికాలోని బే ఏరియాకు చెందిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమోంట్‌ నగరం సెంట్రల్‌ పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేసు కోసి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 250 కార్లతో మూడు పార్టీల జెండాల్ని ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జై చంద్రబాబు, జై పవన్‌కల్యాణ్‌ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పాలనా దక్షత, పవన్‌కల్యాణ్‌ నిబద్ధత, మోదీ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోనుందని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 900 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ..పెమ్మసాని చంద్రశేఖర్, సుజనాచౌదరి, లోకం మాధవి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు. కోగంటి వెంకట్, శ్రీనివాస్‌ తాడపనేని, గాంధీ పాపినేని, జగదీశ్‌ గింజుపల్లి తదితరులు పాల్గొన్నారు.


వాషింగ్టన్‌ డీసీలో కేకు కోస్తున్న మన్నవ సుబ్బారావు, సతీష్‌ వేమన, యశ్, భాను మాగులూరి, సుధీర్‌ కొమ్మి తదితరులు

T20 World Cup: 4 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. 3 వికెట్లు

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఘనత సాధించాడు.

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఘనత సాధించాడు. పసికూన పాపువా న్యూగినీతో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి 78 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే సూపర్‌-8కు దూరమైన న్యూజిలాండ్‌ ఘనవిజయంతో టోర్నీని ముగించింది.

తరౌబా (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో): న్యూజిలాండ్‌ జట్టు విజయంతో టీ20 ప్రపంచకప్‌ను ముగించింది. సూపర్‌-8కు చేరలేకపోయిన ఆ జట్టు సోమవారం నామమాత్రమైన తన ఆఖరి మ్యాచ్‌ (గ్రూప్‌-సి)లో 7 వికెట్ల తేడాతో పసికూన పాపువా న్యూగినీని చిత్తు చేసింది. కివీస్‌ బౌలర్ల ధాటికి మొదట న్యూగినీ 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది.

ఫెర్గూసన్‌ (4-4-0-3) సంచలన ప్రదర్శన చేశాడు. టీ20 చరిత్రలో.. కెనడా కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జాఫర్‌ (4-0-4-2) తర్వాత నాలుగుకు నాలుగు ఓవర్లూ మెయిడెన్లు వేసిన రెండో బౌలర్‌గా అతడు నిలిచాడు. ఫెర్గూసన్‌తో పాటు బౌల్ట్‌ (2/14), సౌథీ (2/11) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూగినీ బ్యాటర్లు మ్యాచ్‌ ఆసాంతం పరుగుల కోసం చాలా కష్టపడ్డారు. 17 పరుగులు చేసిన అమిని టాప్‌ స్కోరర్‌. ఇష్‌ సోధి రెండు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ బౌలర్లు 83 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాన్వే (35) టాప్‌ స్కోరర్‌. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై మిచెల్‌ (19 నాటౌట్‌), విలియమ్సన్‌ (18 నాటౌట్‌) అభేద్యమైన నాలుగో వికెట్‌కు 25 పరుగులు జోడించారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌కు ఇదే చివరి మ్యాచ్‌.

పాపువా న్యూగినీ: 78 (అమిని 17, నార్మన్‌ వనౌ 14, సెసె 12; ఫెర్గూసన్‌ 3/0, బౌల్ట్‌ 2/14, సౌథీ 2/11, ఇష్‌ సోధి 2/29);
న్యూజిలాండ్‌: 79/3 (కాన్వే 35, మిచెల్‌ 19 నాటౌట్, విలియమ్సన్‌ 18 నాటౌట్‌; మోరియా 2/4)

Rushikonda: ఒక్కో కమోడ్‌ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!

విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు!

అమరావతి: విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించిన విలాసవంతమైన భవనాల్లో అత్యంత ఖరీదైన టోటో బ్రాండ్‌ కమోడ్‌లు అమర్చారు.

వాటి ధర మోడల్‌ను బట్టి రూ.9 లక్షల నుంచి రూ. 15.95 లక్షల వరకు ఉంది. రుషికొండ ప్యాలెస్‌లలో అత్యంత ఖరీదైన మోడల్‌ టాయిలెట్‌లనే అమర్చారు. వాటి ధర తక్కువలో తక్కువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా..! రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి వెచ్చించిన మొత్తం రూ.1.80 లక్షలు. అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అంటే రుషికొండ ప్యాలెస్‌లలో అమర్చిన ఒక్కో కమోడ్‌ ధరతో పేదలకు కనీసం ఆరు ఇళ్లు కట్టొచ్చన్న మాట!

ఇక్కడి ఒక్కో స్నానపు గదిని 480 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో కట్టుకునే ఇల్లు విస్తీర్ణం 340 చదరపు అడుగులు మాత్రమే. ఈ ప్యాలెస్‌లలో అమర్చిన టాయిలెట్‌ కమోడ్‌లకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. చలికాలంలో టాయిలెట్‌ షీట్‌ని వేడిగా ఉంచుకునే వెసులుబాటు, ఆటోమేటిక్‌ ఎయిర్‌ ఫ్యూరిఫైయింగ్‌ సిస్టమ్‌ వంటివి దీని ప్రత్యేకతలు. కమోడ్‌ మూత తెరుచుకోవడం, మూతపడటం, ఫ్లష్‌ చేయడం వంటివి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

జగన్‌ ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు స్థలంలో కట్టే ఇల్లు కంటే.. విశాలంగా కట్టుకున్న స్నానపు గదుల ఫొటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు! వాటిలో అమర్చిన వస్తువుల ధరలు గురించి తెలిసేకొద్దీ సామాన్యుల కళ్లు మరింత బైర్లు కమ్ముతున్నాయి.

Rahul Gandhi: ఎన్నిక అయిన రెంటిలో ఏ లోక్ సభ స్తానాన్ని వదులుకున్నారో తెలుసా

Rahul Gandhi:ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు.

ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్‌ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఎంపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచే ఇకపై కొనసాగుతారు. ఈ క్రమంలో వాయనాడ్‌ స్థానాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోమవారం ఖర్గే నివాసంలో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే వాయనాడ్‌ స్థానం నుంచి ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు.

పురుషులు వారానికి ఎన్నిసార్లు గడ్డం తీయాలో తెలుసా?

ఈ రోజుల్లో పురుషులు గడ్డం లుక్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది వారికి గొప్ప శైలి అంశం. అందుకే పెద్ద పెద్ద గడ్డాలు ఉన్న యువకులను ఎక్కువగా చూస్తుంటాం.

చాలా మంది నెలల తరబడి గడ్డం పెంచుకుంటారు మరియు ఎప్పుడూ షేవ్ చేయరు. అయితే, చాలా మంది రోజూ గడ్డం గీస్తారు.షేవ్ చేయాలా వద్దా అనేది వ్యక్తిగత ఎంపిక కావచ్చు, కానీ ఇది చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. రోజూ షేవింగ్ చేయడం వల్ల చర్మానికి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా లేదా వారానికి ఒకసారి షేవింగ్ చేస్తే సరిపోతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ (AAD) ప్రకారం, రోజంతా బయట తిరగడం వల్ల మన ముఖం, గడ్డంపై దుమ్ము, నూనె, క్రిములు చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. ఈ విషయాలను వదిలించుకోవడానికి, ప్రజలు ప్రతిరోజూ తమ ముఖం గడ్డాన్ని ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో కడగాలి.ఇలా చేయడం వల్ల చర్మం, గడ్డం శుభ్రంగా ఉంటాయి. గడ్డం పెద్దగా ఉండి, రోజూ సరిగా జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మం చికాకుకు గురవుతుంది. ఇలా ఎక్కువ సేపు చేయడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పురుషుల గడ్డాలు ఎక్కువగా సూక్ష్మక్రిములకు గురవుతాయని కూడా ఒక అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజు మీ ముఖం మరియు గడ్డాన్ని బాగా కడుక్కోవడం మరియు మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం అని చర్మ నిపుణులు అంటున్నారు. ప్రజలు వారి చర్మ రకాన్ని బట్టి సబ్బు, ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌ని ఉపయోగించవచ్చు. దీని కోసం గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. దీని ద్వారా మన చర్మంలోని మురికి, క్రిములు, మృతకణాలు తొలగిపోతాయి. మీకు పెద్ద గడ్డం ఉన్నా లేదా లేకపోయినా, రెగ్యులర్ ఫేషియల్ క్లెన్సింగ్ చాలా ముఖ్యం. దాని గురించి అజాగ్రత్తగా ఉండకండి, లేకుంటే చర్మ సమస్యలు సంభవించవచ్చు.

అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా మందికి ప్రతిరోజూ షేవింగ్ అవసరం లేదు. రేజర్‌లు మీ గడ్డాన్ని కత్తిరించడమే కాకుండా, మీరు మీ చర్మంపై బ్లేడ్‌ని నడిపిన ప్రతిసారీ, ఇది చర్మ కణాల పొరను కూడా తొలగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, చర్మం నయం కావడానికి సమయం ఇవ్వాలి మరియు ప్రతిరోజూ షేవింగ్ చేయడానికి బదులుగా, ఒకటి లేదా రెండు రోజుల తర్వాత షేవ్ చేయడం మంచిది.

చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తే చాలు.. నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!!

నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఆయుర్వేద వైద్యులు. దగ్గు, జలుబు, జీర్ణ సంబంధిత సమస్యలున్నప్పుడు మిరియాల వాడకం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, అధిక రక్తపోటు రోగులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. అయితే నల్ల మిరియాలు జుట్టుకు కూడా మంచిదని మీకు తెలుసా? తలలో చుండ్రు, నెరిసిన జుట్టు, ఎక్కువ జుట్టు రాలడం వంటి సమస్యలకు నల్ల మిరియాలతో చక్కటి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు చిటికెడు ఎండుమిర్చి పెరుగులో కలిపి రాసుకుంటే మంచిది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో రాగి ఉంటుంది. పెరుగు జుట్టుకు తేమను అందించడమే కాకుండా అందులో విటమిన్ సి లోపాన్ని కూడా నయం చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకోండి. దానికి 1-2 స్పూన్ల నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని గ్రే హెయిర్‌పై అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి.

వాతావరణం మారిన వెంటనే చుండ్రు సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో నల్ల మిరియాలు, ఆలివ్ నూనెతో తలపై మసాజ్ చేయండి. చుండ్రు నుండి బయటపడటానికి వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి. ఇందుకోసం ఒక చెంచా నల్ల మిరియాలు, ఆలివ్ నూనెను బాగా కలపండి. దానికి 2 చెంచాల నిమ్మరసం కలపండి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించి 1 గంట లేదా రాత్రిపూట అలాగే ఉంచాలి. మరుసటి రోజు మీ జుట్టును కడగాలి. ఇది తలలో చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

Pushpa 2: ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప-2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప -2 చిత్రం నుంచి ఏ అప్‌డేట్‌ వచ్చినా.. ఎలాంటి ప్రమోషన్‌ కంటెంట్‌ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది.

టీజర్‌తో పాటు ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప పుష్పరాజ్‌, టైటిల్‌ సాంగ్‌, కపుల్‌ సాంగ్‌గా విడుదలైన రెండో లిరికల్‌ సాంగ్‌ సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ.. ఎంతటి రికార్డులు క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. షూటింగ్‌ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు తెలిపారు మేకర్స్‌.

ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో త‌న న‌ట‌న‌తో.. మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడ‌మ్ టుసార్ట్స్‌లో ద‌క్షిణ భార‌తదేశ న‌టుడి స్టాట్యూని, గ్యాల‌రీ‌ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ‘పుష్ప’ చిత్రంతోనే సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లో ‘పుష్ఫ 2: ది రూల్’తో మ‌రోసారి ప్ర‌పంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాల తెలుగు సినిమా చ‌రిత్రలో మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

AP Assembly: 24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: 24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకూ.. మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది.

26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత.. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది

Tirumala: ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనుంది.

మరోవైపు, మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు తితిదే అవకాశం కల్పించింది. ఆ రోజున మరిన్ని టికెట్లు విడుదల చేయనుంది.

ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లు విడుదల
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల
ఈ నెల 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల
ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల
ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

YS Jagan: జగన్‌ ఇంటి వద్ద భారీగా ప్రవేట్ సెక్యూరిటీ.. ఎంతమంది అంటే..?

తాడేపల్లి తలుపులు తెరుచుకున్నాయి. మూడంచెల భద్రతకు బై బై చెప్పింది ప్రభుత్వం. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి మార్గం తెరచుకోవడంతో.. తాడేపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు. మరోవైపు.. తన ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు జగన్.

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా ఉపయోగించుకోవడంతో ఇక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడం.. ఎన్డీఏ సర్కార్ ఏర్పడటంతో.. తాడేపల్లి జగన్‌ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. దీంతో.. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఇన్నిరోజులు ఆంక్షలు ఉండటంతో.. ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు స్థానిక ప్రజలు. ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు సడలించడటంతో.. జగన్ ఇంటి ముందు నుంచే ప్రయాణాలు సాగిస్తున్నారు.

2019 నుంచి మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లి నుంచి అన్ని కార్యక్రమాలు సాగించారు. పార్టీ పరంగా రివ్యూలు, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల వ్యూహాలు కూడా ఇదే ఇంటి నుంచి రచించారు. కానీ.. ఎన్నికల్లో ఘోరంగా ఓడటం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. జగన్ ఇంటి దగ్గర భద్రతను భారీగా తగ్గించారు. సాధారణ సెక్యూరిటీని మాత్రమే ఉంచారు.

ప్రభుత్వం భద్రతను తగ్గించడం, ఆంక్షలు సండలించడటంతో.. ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు మాజీ సీఎం జగన్. మాజీమంత్రులు, వైసీపీ నాయకులు, కార్యాలయాల మీద దాడులు జరుగుతుండటంతో.. తాడేపల్లి నివాసం, క్యాంప్ ఆఫీస్‌ దగ్గర 30మంది సెక్యూరిటీని నియమించారు. జగన్ ఇంటి ముందు కొంతమంది, ఇంటి లోపల మరికొంతమంది సెక్యూరిటీగా ఉంటారు. 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే.. జగన్ ఇంట్లోకి పంపారు. వీరంతా ప్రతిరోజు జగన్ ఇంటి దగ్గర కాపలాగా ఉండనున్నారు.

ఇక తమ అధినేత ఇంటి దగ్గర ఆంక్షలు తొలగిపోవడంతో.. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తాడేపల్లి నివాసానికి భారీగా వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు పార్టీ ముఖ్యనేతలు తప్ప.. ఎవ్వరికీ నేరుగా ఎంట్రీ ఉండేది కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అంతా అపాయింట్‌మెంట్ ఉంటేనే ఇక్కడికి రావాల్సి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మరోవైపు మాజీ సీఎం ఇంటి దగ్గర భద్రతను తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు వైసీపీ నాయకులు.

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

కూటమి గెలుపులో కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్‌‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన.. పలు కీలక మంత్రిత్వశాఖలు కూడా కట్టబెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, అలాగే ఆఫీసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను.. జగన్‌ను గెలవనిన్వను అని శపథం చేసిన పవన్.. అలుపెరగని పోరాటం చేశారు. ఊరూ, ఉడా వెళ్లి.. ఉద్వేగభరిత ప్రసంగాలతో జనాల ఓట్లు రాబట్టారు. ఫలితంగా ఎన్డీఏ కూటమి 164 సీట్లతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇంతటి ఘనవిజయం వెనక పవన్ శ్రమ, పట్టుదల, పోరాటానికి విలువనిచ్చిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు కేటాయించారు. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఇకపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రుల ఛాంబర్లలోనూ చంద్రబాబు, పవన్‌ ఫొటోలు పెడుతున్నారు. అలానే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా, ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలని చంద్రబాబు ఆదేశించారట. డిప్యూటీ సీఎం ప్రొటోకాల్‌ విషయంలోనూ మార్పులు చేసింది ఏపీ సర్కారు. ఆయనకు అదనపు భద్రతను కలిపించింది.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చాంబర్‌ కేటాయించారు. సెక్రటేరియట్‌ రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జనసేన మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్‌కు ఇదే అంతస్తులో చాంబర్లు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. పక్క పక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జూన్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్.

ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో నెగ్గిన జనసేన.. చంద్రబాబు క్యాబినెట్‌లో 3 మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు ఇంపార్టెన్స్ ఉన్న శాఖలు ఇవ్వగా.. ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు సైతం ప్రాధాన్య శాఖలు దక్కాయి. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక , పర్యాటకశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

YSRCP: వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..

వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు

అమరావతి: వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపినా వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు.

ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదోఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Income tax: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు..?

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలుస్తోంది.

Budget 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను (Inccome tax) విషయంలో ఊరట కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేతన జీవుల నిరీక్షణకు తెరపడనుందా? త్వరలో వెలువడే బడ్జెట్‌లో (Budget 2024) ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. రాబోయే బడ్జెట్‌లో కొన్ని వర్గాల ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందట! తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్స్‌ సహా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు భాజపా ఆశించినట్లు సొంతంగా విజయం సాధించకపోగా.. ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని పోస్ట్‌ పోల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు.. వారికి ఊరటనిచ్చే విషయంలో ఆలోచన చేస్తోందని సమాచారం. మధ్యతరగతి ఆదాయాలు, వారి జీవనశైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ సైతం ఇటీవల చెప్పారు.

ముఖ్యంగా మధ్యతరగతికి ఊరటనివ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రూ.15 లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఊరట ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను పడుతుండగా.. రూ.15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్‌ పడుతోంది. అలాగే, రూ.10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల గురించీ చర్చ జరుగుతోందని పేర్కొన్నాయి.

పన్ను రేట్లు తగ్గింపు వల్ల వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరిగి ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల జీఎస్టీ వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. మరోవైపు బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్‌ 20 నుంచి బడ్జెట్‌ ముందస్తు చర్చలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.

Sim Cards: ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చో తెలుసా.?

ప్రస్తుతం చేతిలో ఫోన్‌ లేని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టెలికం కంపెనీలు పెరగడం రకరకాల ఆఫర్లను అందిస్తుండడంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ సిమ్‌కార్డులను తీసుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా డ్యూయల్‌ సిమ్‌ ఫీచర్‌తో ఫోన్‌లు రావడంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌ కార్డులను కలిగి ఉండవచ్చు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం..

ఉచితంగా లభిస్తుండడంతో చాలా మంది సిమ్‌ కార్డులను వాడేసి వాటిని బ్లాక్‌ చేయకుండానే పక్కన పడేస్తుంటారు. అలాగే ఆధార్‌ కార్డులను దుర్వినియోగం చేస్తూ కొందరు మనకు తెలియకుండానే మన ఆధార్‌తో సిమ్‌ కార్డులు తీసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఒక ఆధార్‌ కార్డుతో గరిష్టంగా 9 సిమ్‌కార్డులు తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేరాలు జరిగే అవకాశాలను తగ్గించేందుకు, బల్క్‌లో సిమ్‌ కార్డలు తీసుకోవడాన్ని నిషేధించారు.

ఇంతకీ మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా సందేహం వచ్చిందా.? అయితే దీనికోసం కూడా ఒక మార్గం ఉంది. మీ ఐడి కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి డాట్‌.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో మీ ఆధార్‌ కార్డ్‌పై ఎన్ని సిమ్‌ కార్డులు జారీ చేశారో తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌ను ఎవరైనా దొంగలించినట్లయితే.. దాన్ని బ్లాక్‌ చేసుకునేలా అవకాశం ఉంది.

ఇందుకోసం ముందుగా sancharsaathi వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘Citizen Centric Services’ కింద కనిపించే ఆప్షన్‌లో ‘Know your mobile connections’క్లిక్‌ చేయాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే ఆ యూజర్‌ పేరిట ఉన్న మొబైల్‌ నంబర్ల జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో ఉన్న ఫోన్‌ నంబర్లు మీవేనా? కాదా? చెక్‌ చేసుకోండి. ఒకవేళ మీవి కాకపోతే వెంటనే అక్కడే బ్లాక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..! ఇలా చేయండి

కరివేపాకులు కూరల్లో వేస్తే దాని రుచే వేరు. కరివేపాకుతో పెట్టే పోపు దగ్గర నుంచి పులుసులు వరకు అది ఉంటే ఏ రెసిపీ అయినా ఘమఘమలాడిపోవాల్సిందే. అలాంటి కరివేపాకుని నిల్వ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది.

ఎలా అయినా కనీసం నాలుగు రోజులు అవ్వంగానే నెమ్మదిగా గోధుమ వర్ణంలోకి వచ్చి వాసన పోయి..క్రమేణ ఆకుపచ్చదనం కూడా తగ్గిపోతుంది. ఎలా అయినా.. అబ్బా..! వీటిని నిల్వ చేయడం కష్టం రా బాబు అనుకుంటారు చాలామంది గృహిణులు. అందుకే చాలమంది వీటిని డ్రైగా చేసి పొడిరూపంలోనూ లేదా ఇతర విధాలుగా నిల్వ చేసుకుని కూరల్లో ఆ ఫ్లేవర్‌ వచ్చేలా చేస్తారు. అయితే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాజాగా నిల్వ చేసుకునే సరికొత్త ట్రిక్‌ నెట్టింట తెగ వైరల్‌​ అవుతోంది. అదేంటంటే..

కరివేపాకులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రిక్‌ ఫాలో అయితే ఆకులు కలర్‌ మారకుండా, వాటి వాసన కూడా ఏ మాత్రం పోకుండా చక్కగా తాజాగా ఉంచుకోవచ్చు. ఏకంగా ఇలా ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చట. అదేంటంటే..ఒక ఖాళీ ఐస్‌ ట్రైని తీసుకుని అందులో కరివేపాకు కొమ్మలు నుంచి వేరు చేసిన ఆకులను మూడు లేదా నాలుగు చొప్పున ఆకులను ట్రైలో పెట్టుకుంటూ వచ్చి దానిలో నీళ్లు పోయాలి.

ఆ ట్రైని డీప్‌ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంతే అవన్నీ గడ్డకట్టేసిన క్యూబ్‌లు మాదిరిగా అయిన తర్వాత బయటకు తీసి జిప్‌ లాక్‌ బ్యాగ్‌లో ఆ క్యూబ్‌లు వేసుకుని ఫ్రిడ్జ్‌లో భద్రపర్చుకోవాలి. కావాల్సినప్పడు ఆ బ్యాగ్‌ ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఆ క్యూబ్‌లను ఓ గిన్నెలో వేసి దానిలో కొద్దిగా గోరు వెచ్చిని నీళ్లు వేసి కాసేపటి తరువాత చూస్తే తాజా కరివేపాకులు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అవి జస్ట్‌ ఇప్పుడే చెట్టునుంచి తెంపిన ఆకుల్లా తాజాగా కనిపిస్తాయి. వాటి వాసన కూడా పోదు.

ఇలా ఆరునెలలపాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చట. ఇది ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగపడుతుందట. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇలాంటి ట్రిక్‌ విదేశాల్లో ఉండే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపుడుతుందని అంటున్నారు. అంతేగాదు జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పుదీనా, కొత్తిమీర, పార్స్లీ ఆకులు ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయని చెబుతున్నారు.

Vastu Tips: మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉన్నాయా? వెంటనే తీసేయండి.. లేదంటే ఆర్థిక కష్టాలు తప్పవు

Vastu Tips: మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. కొందరు డబ్బు సంపాదించలేక నానా కష్టాలు పడుతుంటారు. మరికొందరు మాత్రం ఎంత డబ్బు సంపాదించినా పేదవారిగానే మిగిలిపోతారు.

నెల తిరిగే సరికి చేతలో చిల్లిగవ్వ కూడా మిగలక ఇబ్బంది పడుతారు. దీనికి వాస్తు దోషం కూడా ఒక కారణమేనని చెప్పవచ్చు. అందుకే ఈ విషయంలో చిన్న పొరపాటు చేసినా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొవల్సి వస్తుంది. మన ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను ఉంచుతుంటాం. అయితే వీటిలో కొన్ని వాస్తు దోషాలకు కారణం అవుతాయని మీకు తెలుసా? అప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు ఆ వస్తువులను ఇంట్లోనుంచి బయటకు విసిరివేయాలి. మీ విజయానికి అడ్డుగా ఇంట్లో ఉంచకూడని ఆ 5 వస్తువులు ఏంటో ఇప్పుడూ చూద్దాం.

ఇంట్లో ఉంచకూడని 5 దురదృష్టకర వస్తువులు ఇవే:

1. పాత క్యాలెండర్:

మీరు ఇంట్లో ఉండకూడని అశుభకరమైన వాటిలో పాత క్యాలెండర్ ఒకటి. మీ ఇంట్లో పాత క్యాలెండర్ ఉంటే దురదృష్టం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది చెడు శక్తిని ఆకర్షించి ప్రతికూలతను కలిగిస్తుంది. ఈ రెండూ మీ జీవితంలో దురదృష్టాన్ని తెస్తాయి. కాబట్టి పాత క్యాలెండర్ ను ఇంట్లో నుంచి తొలగించి కొత్త క్యాలెండర్ ను ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ ఏడాది క్యాలెండర్ను ఉంచడం వలన మీరు వృత్తిపరంగా ముందుకు సాగడానికి, ఆర్థిక విజయాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుంది.

2. విరిగిన/ఆగిపోయిన గడియారాలు:

ఆగిపోయిన లేదా విరిగిన గడియారాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. కాలంతో పాటు ప్రతిదీ మారుతుందనే అవగాహన చాలా ముఖ్యం. మీ ఇంట్లో ఆగిపోయిన లేదా పగిలిపోయిన గడియారాన్ని ఉంచడం దురదృష్టాన్ని, సమస్యలను ఆహ్వానిస్తుంది. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే విరిగిన గడియారాన్ని మీతో తీసుకెళ్లడం వల్ల మీ కొత్త నివాసంలోకి దురదృష్టాన్ని ఆహ్వానించినట్లవుతుంది.

3. రాకింగ్ కుర్చీ :

కొంతమంది రాకింగ్ కుర్చీలు దురదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. ఇంట్లో రాకింగ్ కుర్చీ ఉంటే దురదృష్టం లేదా ఆర్థిక నష్టాలను తెస్తుందనే నమ్ముతారు. రాకింగ్ కుర్చీలు ముందుకు వెనుకకు కదలుతుంటాయి. ఇది చెడు శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుందని నమ్ముతుంటారు.

4. మీ బెడ్ కింద వస్తువులను ఉంచడం:

మీ మంచం కింద ఎలాంటి వస్తువులను ఉంచకూడదు. ఇది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను మంచం క్రింద ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది. ఇది చెడు శక్తిని కూడా ఆకర్షించడంతోపాటు శక్తి స్తబ్దతకు కారణం కావచ్చు. అందువల్ల, మీరు మీ మంచం కింద ఎలాంటి వస్తువులను కూడా ఉంచకూడదు. మీరు పుస్తకాలు, బట్టలు, చెప్పులు శక్తిని అడ్డుకునే వస్తువులను మీ మంచం పక్కన ఉంచకూడదు.

5. చనిపోయిన, వాడిపోయిన మొక్కలు :

మీరు ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడని దురదృష్టకరమైన వాటిలో చనిపోయిన లేదా పొడి మొక్కలు కూడా ఉన్నాయి. వాస్తు ప్రకారం, ఒక మొక్క వాడిపోవడం లేదా ఎండిపోవడం అది జీవించి ఉన్నప్పుడు కలిగి ఉన్న సానుకూల శక్తిని తొలగిస్తుంది. అందువల్ల, ఎండిన లేదా చనిపోయిన మొక్కను ఇంట్లో ఉంచడం దురదృష్టకరం. ఈ మొక్కలు కూడా ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు. మీకు వీలైనంత త్వరగా వాటిని తీసేయడం మంచిది. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచడం మంచిది. అది మీ ఇంటికి అదృష్టాన్ని, ఆహ్లాదకరమైన శక్తిని తీసుకువస్తుంది.

రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 7 సీటర్‌ కారు అనగానే ఎక్కువ బడ్జెట్‌ ఉంటుందనే విషయం తెలిసిందే.

పెద్ద కారు కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కు రూ. 8 లక్షలైనా పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఓ 7 సీటర్‌ కారు అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా కారు.? అందులోని ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రెంచ్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌ నుంచి వచ్చి 7 సీటర్‌ ట్రైబర్‌ కారుకు మంచి ఆదరణ లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ బేసిక్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 5.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక టాప్‌ ఎండ్ విషయానికొస్తే ఈ కారు ధర సుమారు రూ. 8.12 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌తో లభిస్తోంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ వేరియంట్‌తో ఈ కారును తీసుకొచ్చారు.

ఈ ఇంజన్‌ 96ఎన్‌ఎమ్‌ టార్క్‌, 72పీఎస్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ కారు లీటర్‌కు 18.9 నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. 5 స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ కారులో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను అందించారు.

అలాగే ఇందులో ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, LED DRLలతో ప్రొజెక్టర్ హ్యాండ్‌ల్యాప్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ కూల్డ్ స్టోరేజ్, 182mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో అందించారు. ఇక భద్రత విషయానికొస్తే ఈ కారులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు (2 ముందు, 2 వైపు) ఉన్నాయి. గ్లోబల్ NCAP ఈ కారుకు పెద్దలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది.

AP Govt: ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఘలక్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ(AP Finance Secretary Satyanarayana)కు రాష్ట్ర ప్రభుత్వం(AP government) ఘలక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్( CS Nirab Kumar ) ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడడంతో మూడ్రోజుల కిందట సత్యనారాయణ నేరుగా వెళ్లి నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో జాయిన్ అయ్యారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలంటే సత్యనారాయణకు రిలీవింగ్ ఆర్డర్ కావాలి. ఈలోపే విషయం తెలుసుకున్న సీఎస్ నీరబ్ కుమార్ రిలీవ్ కావొద్దంటూ ఆదేశించారు.

గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అందులోనూ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ సిక్ లీవ్‌లో ఉండటంతో ఈనెల 18న రిలీవ్ కావాల్సిన అవసరం లేదంటూ సీఎస్ స్పష్టం చేశారు. దీంతో సత్యనారాయణ ఎస్కేప్ ప్రయత్నాలకు చెక్ పడినట్లయ్యింది.

2017లో రైల్వే నుంచి వచ్చి ఏపీ ఆర్థిక శాఖలో సెక్రెటరీగా ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆ శాఖలో ఆయన అరాచకం సృష్టించారు. అనేక అవకతవకలకు ఆయనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ నేతల అనుచరులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా వారిని పక్కన పెట్టారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బిల్లుల కోసం హైకోర్ట్‌లో వేల సంఖ్యలో కేసులు, కోర్టు ధిక్కార కేసులు నమోదయ్యాయి. భవిష్యత్ ఆదాయాన్ని సైతం తాకట్టుపెట్టి అప్పు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే చాలు ఎవరికి బిల్లులు చెల్లించమంటే వారికి చెల్లించారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే భయంతో ఆయన రిలీవ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఎస్ ఆయనకు చెక్ పెట్టారు.

ఏపీలో తెల్లరేషన్ కార్డు దారులకు శుభవార్త

ఏపీలో తెల్లరేషన్ కార్డు దారులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెలిసింది. రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు. ఖచ్చితంగా కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపారు. ఈనెల 20 నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది.

పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్
పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో అంతే రంగంలోకి దిగిపోయారు. దుకాణాలను తనిఖీలు చేపట్టారు. అనంతరం కందిపప్పు రావడం లేదని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

Ayyannapatrudu: ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

Ayyannapatrudu: ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

Ayyannapatrudu: మంత్రివర్గంలో చోటు దక్కని చింతకాయల అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఏపీ స్పీకర్‌గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు సమాచారం.

అలాగే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలి బుద్ధప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, లోకం మాధవి పేర్ల చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించే అవకాశం ఉంది. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో చీప్‌విఫ్‌గా దూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలనలో ఉంది. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Hair Care Tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఈ నూనె రాస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా, చాలా స్పీడ్ గా పెరుగుతుంది

Hair Fall And Hair Growth Tips : మనలో చాలామంది జుట్టు రాలిపోయి జుట్టు చాలా పల్చగా ఉందని బాధపడుతూ ఉంటారు. దీని. కోసం రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు.

అయినా పెద్దగా ఫలితం రాక నిరాశ చెందుతూ మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటారు. దీనికోసం వేల కొద్ది డబ్బును ఖర్చుపెట్టిన పెద్దగా ఫలితం ఉండదు.

మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి నూనె తయారు చేసుకుని వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఒక గిన్నెలో 300 ml కొబ్బరి నూనె తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, నాలుగు లవంగాలు, ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత పది తులసి ఆకులు, గుప్పెడు గోరింటాకు, గుప్పెడు మందారాకులు, గుప్పెడు కరివేపాకు, ఐదు మందార పువ్వులు, మూడు స్పూన్ల ఎండు ఉసిరికాయ ముక్కలు, గుప్పెడు గరిక ఆకులు వేసి పొయ్యి మీద పెట్టి నూనె రంగు మారేవరకు బాగా మరిగించాలి. ఇలా మరిగిన నూనెను వేడిగా ఉండగానే మరొక గిన్నెలోకి వడగట్టాలి.

ఈ నూనెను ప్రతిరోజు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి ఈ విధంగా 15 రోజులపాటు రాస్తే కచ్చితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. వారంలో రెండు సార్లు కుంకుడుకాయలతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ప్రోత్సహిస్తాయి.

జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ నూనెను తప్పనిసరిగా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Nellore: కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన!

వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

మర్రిపాడు: వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబయి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండటంతో పులిని కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్‌ శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్‌ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.

ఊహించని ఈ ఘటనతో కారులోని ఐదుగురూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

 

Chandrababu: పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..
‘‘పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి’’

రాష్ట్రానికి శాపంగా జగన్‌..
‘‘రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు’’

‘‘ఈ ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్సీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.

T20 WC 2024-Super8: రెండు గ్రూప్‌లుగా సూపర్‌-8.. ఆ టీమ్‌లు ఇవే

టీ20 ప్రపంచ కప్‌లో టాప్-8 టీమ్‌లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

టీ20 ప్రపంచ కప్‌ గ్రూప్‌ స్టేజ్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్‌ లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇక కీలకమైన రెండో దశకు తెరలేవనుంది. ఇవాళ్టితో లీగ్‌ స్టేజ్ ముగిసి.. బుధవారం నుంచి సూపర్‌-8 పోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ ఎనిమిది జట్లేవో తెలిసిపోయింది. ఇవి కూడా రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. మరి ఆ గ్రూప్‌లు ఏంటి? మ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయో చూద్దాం..

ఏ గ్రూప్‌లో ఎవరంటే?
ఐసీసీ ర్యాంకుల ప్రకారం జట్లకు సీడింగ్‌ల కేటాయింపు జరిగింది. గ్రూప్‌-A నుంచి భారత్, యూఎస్‌ఏ అర్హత సాధించాయి. గ్రూప్‌-B నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్‌-C నుంచి అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్‌.. గ్రూప్‌-D నుంచి దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌ అర్హత దక్కించుకున్నాయి.

లీగ్‌ స్టేజ్లో A1, B2, C1, D2గా ఉన్న టీమ్‌లు సూపర్-8లో గ్రూప్‌-1గా ఉంటాయి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో A2, B1, C2, D1 అయిన యూఎస్‌ఏ, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడతాయి. ఇందులో ఒక్కో జట్టు ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. ఆయా గ్రూపుల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి.

భారత్‌ మ్యాచ్‌లు ఇవే..
బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జూన్ 20న మ్యాచ్‌
ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జూన్ 22న పోరు
సెయింట్‌ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జూన్ 24న మ్యాచ్‌
టీమ్‌ఇండియా మ్యాచులన్నీ మన కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం
ఇతర జట్ల మ్యాచ్‌లు ఇలా..
జూన్ 19: యూఎస్‌ఏ-దక్షిణాఫ్రికా
జూన్ 19: ఇంగ్లాండ్-వెస్టిండీస్
జూన్ 20: ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌
జూన్ 21: ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా
జూన్ 21: యూఎస్ఏ-వెస్టిండీస్
జూన్ 22: అఫ్గానిస్థాన్‌ – ఆస్ట్రేలియా
జూన్ 23: యూఎస్‌ఏ-ఇంగ్లాండ్
జూన్ 23: వెస్టిండీస్-దక్షిణాఫ్రికా
జూన్ 24: అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌

Vangalapudi Anitha: జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత

రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

సింహాచలం: రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు. ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతిభద్రతల విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు.

Train Accident : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి.. 200 మందికి గాయాలు

Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..

దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కతిహార్ డివిజన్‌లోని రంగపాణి-నిజ్‌బారి స్టేషన్‌ల మధ్య స్టేషన్‌లో నిలబడిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. తోపు బలంగా ఉండడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఈ ఘటన సమాచారంతో కతిహార్ రైల్వే డివిజన్‌లో కలకలం రేగింది. రైల్వే అధికారులు సహాయ రైలు, మెడికల్ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంకెంత మంది చనిపోయారో అధికారికంగా ధృవీకరించలేదు. కాని సంఘటన స్థలం నుండి వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య స్పష్టంగా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కంజన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొన్నట్లు సమాచారం. జిల్లా మేజిస్ట్రేట్, వైద్యులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Personal Loan Benefits: పర్సనల్‌ లోన్‌పైనా ఆదాయ పన్ను మినహాయింపు – ఈ విషయం చాలామందికి తెలీదు

Income Tax Benefits Of Personal Loan: ఆర్థిక అత్యవసర సమయాల్లో ఆదుకునే కల్పవృక్షం.. ‘వ్యక్తిగత రుణం’. పర్సనల్ లోన్ పొందడం చాలా ఈజీ. మీకు “ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్” ఆఫర్ ఉంటే, ఆ రుణం పొందడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు.

బ్యాంక్కు కూడా వెళ్లక్కర్లేకుండా కూర్చున్న చోటు నుంచే ఈ లోన్ తరహా రుణం తీసుకోవచ్చు.

ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ లేకపోతే, లోన్ కోసం ఆన్లైన్/బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి అప్లై చేయాలి. ఒకవేళ మీరు జీతం తీసుకునే వ్యక్తి (Salaried Person) అయితే, ఈ విధానంలోనూ పెద్ద తతంగం లేకుండానే పని పూర్తవుతుంది. గంటల వ్యవధిలోనే మీ అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది. మీకు జీతం లేకపోయినా, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటే చాలు. ఈ కేస్లో కూడా మీకు లోన్కు అర్హత ఉన్నట్లే.

జీతం ఉన్నా/లేకపోయినా, పర్సనల్ లోన్ ఇచ్చే ముందు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ను (Credit Score) బ్యాంక్లు చూస్తాయి. మంచి నంబర్ ఉన్న వ్యక్తికి సులభంగా, తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం దొరుకుతుంది.

చాలామందికి తెలీని విషయం ఏంటంటే, ఆదాయ పన్ను చట్టంలోని (Income Tax Act) సెక్షన్ 24(B) ప్రకారం, పర్సనల్ లోన్పై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. అయితే.. మీరు ఆ లోన్ను ఎలా ఉపయోగించారు అన్నదానిపై ఆధారపడి టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. లోన్ తీసుకుని విహార యాత్రకు వెళ్లడం, ఇంట్లో వస్తువులు కొనడం, వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడం వంటి పనులు చేస్తే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు.

ఎలాంటి సందర్భాల్లో పర్సనల్ లోన్పై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు?

— పర్సనల్ లోన్ను మీ ఇంటి రిపేర్ల కోసం ఉపయోగిస్తే, లోన్పై చెల్లించిన వడ్డీపై ఏడాదికి రూ. 30,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. అంటే.. ITR ఫైలింగ్ సమయంలో, పర్సనల్ లోన్పై చెల్లించిన వడ్డీని మీ మొత్తం ఆదాయం నుంచి తగ్గించి చూపొచ్చు. తద్వారా మీపై పన్ను భారం తగ్గుతుంది.

— విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లోన్ డబ్బును ఉపయోగిస్తే, ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం వడ్డీపై మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ కేస్లో, చెల్లించిన వడ్డీని క్లెయిమ్ చేయడంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.

— ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 36(1) (iii) ప్రకారం, వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణాన్ని ఉపయోగిస్తే, చెల్లించిన పూర్తి వడ్డీని క్లెయిమ్ చేయవచ్చు. వ్యాపారం కోసం పరికరాలు కొనడం, వస్తువులను నిల్వ చేయడానికి రుణాన్ని ఉపయోగించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ కేస్లో కూడా చెల్లించిన వడ్డీపై మినహాయింపు పొందడంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. తద్వారా, మీ వ్యాపార ఆదాయం నుంచి వడ్డీ మొత్తాన్ని తగ్గించి ITRలో చూపొచ్చు.

— ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం, ఒక ఆస్తిని పునరుద్ధరించడానికి (Renovation of property) లేదా కొనుగోలు చేయడానికి (Purchase a property) పర్సనల్ లోన్ మొత్తాన్ని ఉపయోగిస్తే, వడ్డీ చెల్లింపుపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ ఇంటి ఆవరణలో కొత్తగా ఒక గది లేదా గ్యారేజ్ నిర్మించాలనుకుంటే వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పొందొచ్చు. ఈ సెక్షన్ కింద సంవత్సరానికి రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు.

–మీరు అద్దె ఇంట్లో ఉంటూ, ఆ ఇంటిని పునరుద్ధరించడానికి పర్సనల్ లోన్ను ఉపయోగించినా కూడా, సెక్షన్ 24(బి) ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు వడ్డీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

Sasikala: సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు

Sasikala: తమిళనాడు రాజకీయాల్లోకి తన ప్రవేశం ప్రారంభమైందని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. అన్నాడీఎంకేను ఏకతాటిపైకి తీసుకొస్తానని ప్రకటించారు.

చెన్నై: తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే (AIADMK) పనైపోయిందని భావించొద్దని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ (Sasikala) అన్నారు. పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ‘అమ్మ పాలన’ను తిరిగి తీసుకొస్తామంటూ ఆదివారం ఆమె కీలక ప్రకటన చేశారు.

ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి.. ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని శశికళ (Sasikala) ఆరోపించారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. పార్టీపై పట్టు కోసం గతంలో ఆమె విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. తిరిగి ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైందని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తాజాగా ఆమె వ్యాఖ్యానించారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘తమిళ ప్రజలు మనతో ఉన్నారు. నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నా ప్రవేశం ప్రారంభమైంది. నేను ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన సమయం వచ్చేసింది. అన్నాడీఎంకే పనైపోయిందనుకోవద్దు’’ అని అన్నారు.

త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టి డీఎంకే పాలనను ఎండగడతానని శశికళ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మూడు, నాలుగు స్థానాలకు పడిపోవడంపై విచారం వ్యక్తంచేశారు. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని వాపోయారు. త్వరలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తంచేశారు. తద్వారా అధికారాన్ని సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు.

జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. దీంతో పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి ద్వంద్వ నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్‌ అధికమైంది. ఈ తరుణంలో శశికళ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పార్టీకి దూరమైన ఆమె.. సమీప బంధువు టీటీవీ దినకరణ్‌తో కలిసి ‘అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం (AMMK)’ పార్టీని స్థాపించారు. ఈనేపథ్యంలో ఏఎంఎంకేతో పాటు శశికళ తిరిగి పార్టీలో చేరితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Health

సినిమా