Saturday, November 16, 2024

సాహస వీరుల కోసం సూపర్ బైక్‌లు.. అవి కూడా అందుబాటు ధరలోనే

మంచి మైలేజీ ఇచ్చే అడ్వెంచర్ బైక్ లలో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.1.47 లక్షలు, కాగా ప్రో వేరియంట్ కోసం రూ.1.54 లక్షలు ఖర్చుచేయాలి.

199.6సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 18.9 హెచ్ పీ, 17.35 టార్క్ విడుదలవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్కు బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు. దాదాపు 52 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ ధర రూ.2.85 లక్షల నుంచి రూ.2.98 లక్షల వరకూ పలుకుతోంది. దీనిలోని 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 39.47 హెచ్ పీ, 40 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్, ముందు 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 320, 270 ఎంఎం డిస్కు బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఇతర ప్రత్యేకతలు. ఈ బండి సుమారు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

హోండా సీబీ 200ఎక్స్ బైక్ దాదాపు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఐదు స్పీడ్ ట్రాన్స్ మిషన్, ముందు భాగంలో యూఎస్ డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని 184.4 సీసీ సింగిల్ ఇంజిన్ నుంచి 17.03 హెచ్ పీ, 15.9 ఎన్ ఎం టార్కు విడుదలవుతుంది. ఈ బైక్ రూ.1.48 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ లో 249 సీసీ సింగిల్ సిలిండర్ ఏర్పాటు చేశారు. ఇది 26.11 హెచ్ పీ, 22.2 ఎన్ ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముందు స్ప్రింగ్ లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక స్వింగ్ ఆర్మ్ టైప్ కాయిల్ స్ప్రింగ్ సెటప్ అమర్చారు. 300, 220 ఎంఎం డిస్కులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఇతర ప్రత్యేకతలు. 36 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ ధర రూ.2.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

యెజ్జీ అడ్వెంచర్ బైకు పేరుకు తగిన సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని ధర రూ.2.09 లక్షల నుంచి రూ.2.19 లక్షల వరకూ ఉంది. దీనిలో 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 29.89 హెచ్ పీ, 29.84 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ టాన్స్ మిషన్, ముందు 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక సర్దుబాటు చేయగల మోనోషాక్ సెటప్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలు. యెజ్డీ అడ్వెంచర్ బైక్ దాదాపు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఈ లోపం లేకపోతే వందేళ్లు వచ్చినా నడుము నొప్పి రాదు

శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అత్యవసరం. శరీరానికి అతి ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. బాడీలో క్యాల్షియం సరిపడా ఉంటే.. ఎముకల సమస్యలు, దంతాల సమస్య రాకుండా ఉంటాయి.

క్యాల్షియం లోపం కారణంగా బాడీ పెయిన్స్, ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, చేయి నొప్పులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా క్యాల్షియం అవసరం పడుతుంది. వారిలో కండరాలు, ఎముకలు బలంగా, దృఢంగా పెరగాలంటే క్యాల్షియం చాలా అవసరం. కొందరు కొందరు క్యాల్షియం లోపంతో బాధ పడుతూ ఉంటారు. ఈ లోపంతో బాధ పడుతున్నట్లు వారికి కూడా తెలీదు. మరి క్యాల్షియం లోపం ఉంటే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తోయో ఇప్పుడు చూద్దాం.

కండరాలు పట్టేయడం:

శరీరంలో క్యాల్షియం లోపం ఉంటే పదే పదే కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు త్వరగా తగ్గుతాయి. మరీ ఎక్కువ కాలం కండరాల నొప్పి, పట్టేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. అదే విధంగా నడుము నొప్పి కూడా విపరీతంగా వస్తుంది.

చేతి వేళ్లలో నొప్పులు:

క్యాల్షియం లోపం ఉన్నట్లయితే చేతి వేళ్లలో పిన్ను పెట్టి గుచ్చినట్టు నొప్పులు వస్తాయి. అలాగే స్పర్శ లేనట్లు, మొద్దు బారిపోయినట్టు అనిపిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోయినా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.

రక్త పోటు పెరగడం:

క్యాల్షియం లోపం ఉన్నా కూడా రక్త పోటు అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అదే విధంగా సడెన్‌గా బరువు తగ్గి.. సన్నగా మారినా కూడా క్యాల్షియం లోపం ఉన్నట్లే.

ఎముకలు విరిగి పోవడం:

చిన్ని దెబ్బలకు కూడా ఎముకలు విరిగిపోవడం, బెణకడం వంటి సమస్యలు ఉన్నా కూడా క్యాల్షియం లోపంతో బాధ పడుతున్నారని అర్థం. చేతి, కాలి గోళ్లు తరచూ విరిగిపోతూ ఉన్నా కూడా క్యాల్షియం లోపం ఉన్నట్టే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మీరు జున్ను తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే

న్ను గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. జున్ను గురించి తెలుసు రాష్ట్రాల్లోని అందరికీ తెలుసు. జున్నును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్‌లో కూడా వడ్డిస్తున్నారు.

జున్ను తినడం వల్ల రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జున్ను పాలు అనేవి.. గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలు. వీటిల్లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. వీటిని బాగా మరగ కాచితే జున్ను తయారవుతుంది. ఇందులో అధిక మోతాదులో మనకు పోషకాలు అనేవి లభిస్తాయి. జున్నులో.. విటమిన్లు డి, కె, బి12, క్యాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మరి జున్ను తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

జున్ను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల.. శరీరం త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. ఒక వేళ పడినా త్వరగా కోలుకునే శక్తి లభిస్తుంది.

బీపీ కంట్రోల్:

ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు జున్ను తినడం వల్ల రక్త పోటు అనేది కంట్రోల్ అవుతుంది. ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం లేదు.

జీర్ణ సమస్యలు మాయం:

జున్ను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను కూడా మెరుగు పడుస్తుంది.

ఒత్తిడి తగ్గుతుంది:

జున్ను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి కూడా తగ్గుతాయి. జున్ను తినడం వల్ల మనసు అనేది మారిపోతుంది. సంతోషకరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి.

ఎముకలు బలం:

జున్నులో క్యాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి జున్ను తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు జున్ను తినడం వల్ల.. పుట్టే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

చికెన్‌ తిన్న తర్వాత ఇవీ తాగుతున్నారా? హెల్త్‌కు చాలా డేంజర్‌..

చాలా మంది చికెన్‌ను ఇష్టంగా తింటారు. కొంతమందికి చికెన్ లేనిదే ముద్దదిగదు. ఇక, ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు.

చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అంటున్నారు. మద్యపాన ప్రియులు మంచింగ్‌కు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అయితే, చికెన్ తిన్న వెంటనే లేదా చికెన్‌తో పాటు తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి ప్రమాదం. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్‌కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్‌ జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణప్రక్రయకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్‌ ఎక్కువకాలం తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ సీఎంతో కపిల్ దేవ్ భేటీ.. ఆ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు.

కాగా, కపిల్ దేవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. కాగా, ప్రస్తుతం విశాఖపట్నంలో ముడసర్లోవలో ఓ గోల్ప్ కోర్టు ఉందనే సంగతి తెలిసిందే. అమరావతిలో మరో గోల్ప్ కోర్ట్ ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్నాయి.

చంద్రబాబు హయంలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. జగన్ ప్రభుత్వంలో ఈ గోల్ఫ్ కోర్ట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయిచలేదు. దీంతో మరోసారి చంద్రబాబు సీఎం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీలో మందుబాబులకు గుడ్​న్యూస్ – రేట్లు తగ్గింపు

ఇప్పటికే క్వాలిటీతో పాటు తక్కువ ధరకే లిక్కర్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, మద్యం ప్రియులకు శుభ చెప్పింది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్స్ అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

మద్యం రేట్లు కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కమిటీ సైతం వేశామన్నారు. త్వరలోనే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని.. ఆ మేరకు రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. అలానే ఏపీలోని లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ చేసేందుకు అనుమతులు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. జీపీఎస్​ పెట్టి సరుకు పంపుతున్నట్లు వివరించారు. అనుమతి లేకుండా పబ్బుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ చేస్తున్నామన్నారు. కూటమి సర్కార్ మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదన్నారు.

ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ విక్రయాలు జరపగా.. కూటమి సర్కార్ మద్యాన్ని గతంలో ఉన్న విధంగా ప్రవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ క్రమంలోనే 2019కి ముందున్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను చూసి మందుబాబులు ఆనందంలో తేలియాడుతున్నారు. అయితే 99 రూపాయల క్వార్టర్ అందుబాటులోకి వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మరోవైపు లిక్కర్‌ షాపుల విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ, అమ్మకాల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీలో ఎవరు వేలు పెట్టిన ఊరుకోమని హెచ్చరించారు.

ఎవరూ పట్టించుకోకున్నాపెరిగే అద్భుత మొక్క ఇది..! ఆరోగ్యానికి అమృతంతో సమానం

తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను, వ్యాధిని కలిగించే క్రిములను అరికట్టడంలో సహాయపడతాయి.

తిప్పతీగ రసం తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు తిప్పతీగ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.

తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యూటీఐ సమస్యలను దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ సహాయపడుతుంది. తిప్పతీగతో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల్ని ఇట్టే దూరం చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తిప్పతీగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచుతాయి. దీంతో డయాబెటిస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతాయి. తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే దగ్గు, జలుబు, ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్‌గా ఉపయోగించవచ్చు. తిప్పతీగ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కంట్రోల్‌ చేస్తుంది. ఆందోళనను దూరం చేస్తుంది. తిప్పతీగ రసం తాగడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కంట్రోల్‌ అవుతాయి. దీంత గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసేందుకు తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను బయటకు తరిమేస్తుంది.

45 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనంగా మారుతాయి. తిప్పతీగ రసం తాగితే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం దాదాపు తొలగుతుంది. తిప్ప తీగను రసం రూపంలో తీసుకోవడంతో పలు అరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ తీసుకోవడం వల్ల క్రాంప్స్ నొప్పులు తగ్గుతాయి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం తిప్పతీగ రసం మంచి ఎంపిక.

ఆస్తుల వివాదంపై స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ.. కీలక అంశాలతో లేఖ

జగన్, షర్మిల మధ్య ఆస్తులు వివాదంపై వైఎస్ అభిమానులకు కీలక లేఖ రాశారు.. వారి తల్లి విజయమ్మ. ఆ రాసిన లేఖ యథావిధిగా దిగువన చూడండి…

“రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన.

ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం.

నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అబద్దాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్ధరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా… ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఎంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.

మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా లో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. Blood is thicker than water. వాళ్ళు ఇద్దరు సమాధాన పడతారు. మీరెవరు రెచ్చ గొట్టవద్ధని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధాన కర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.

ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ… వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే YSR గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. YSR గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. YSR గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి, కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. YSR గారు బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. YSR చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.

విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా… మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్న.వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, YSR గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న YSR గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. YSR గారి చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట ” నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని ” అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది “నాలో నాతో YSR అనే పుస్తకం”లో ఎప్పుడో రాశా.

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డి కి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు.

రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOU కు ముందు…సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు.. ఎందుకంటే పాపకు సమాన వాట ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని.

2019 లో సిఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే… “పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు..నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

ఆ తర్వాత విజయవాడలో, నా సమక్షంలో , ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి పాప కి అని అనుకున్నారు. 2019 లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే పాప కి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే MOU రాసుకున్నారు. అఫిషియల్ గా రాసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, YSR గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.

జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే… అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు.

రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.

మరొక్కసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ…

ఇట్లు
ప్రేమతో

వైఎస్. విజయ రాజశేఖర్ రెడ్డి

మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..

సాధారణంగా మోచేతులు, మోకాళ్లపై నలుపుదనం ఉంటూ ఉంటుంది. శరీరం అంతా ఒక రంగులో ఉండే ఇవి కాస్త డార్క్ కలర్‌లో ఉంటాయి. ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు ట్రై చేస్తే..

మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపును ఈజీగా పోగొట్టుకోవచ్చు.

నిమ్మ – పంచదార సహాయంతో నలుపును తగ్గించుకోవచ్చు. మోచేతులు లేదా మోకాళ్లపై స్క్రబ్ చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. నిమ్మ చెక్కపై కొద్దిగా పంచదార వేసి సున్నితంగా స్క్రబ్ చేయాలి. టమాటా ముక్క – పంచదారతో కూడా ఇలా చేయవచ్చు.

కొబ్బరి నూనెతో కూడా మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు తగ్గించవచ్చు. రెగ్యులర్‌గా కొబ్బరి నూనెతో మర్దనా చేస్తే నలుపు తగ్గుతుంది. అలాగే రఫ్‌గా కాకుండా మృదువుగా మారతాయి. ఇలా చాలా ఈజీ చిట్కా.

పెరుగు – ఓట్స్ కాంబినేషన్‌తో కూడా మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపును పోగొట్టవచ్చు. కొద్దిగా పెరుగులో ఓట్స్ మిక్స్ చేసి.. పావు గంట సేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

శనగ పిండి – టమాటా కలిపి కూడా మోచేతులు, మో కాళ్లపై ఉండే నలుపు దనాన్ని పోగొట్టవచ్చు. టమాటా రసం శనగ పిండిలో కలిపి.. మర్దనా చేయాలి. ఆ తర్వాత ఓ పావుగంట సేపు ఉంచి.. కడిగేయాలి. ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది.

రోజూ పరగడుపునే ఈ ఆకు నమిలి తినండి.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

జామ ఆకులను నేరుగా బాగా శుభ్రం చేసి తినాలి. పరగడుపున తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఆకులను తినడం వల్ల జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకుల టీ తాగడం వల్ల డయేరియాను తగ్గించుకోవచ్చు. డయేరియాతో బాధపడేవారు రోజూ ఈ టీ తాగితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

జామ ఆకుల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు ప్రొటీన్, విటమిన్ సి, గల్లిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి.

జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో సేవిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జామ ఆకుల టీ తాగడం వలన బీపీ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దాంతో పాటు శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. జామ ఆకులు గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు తీసుకోకూడదు.

జామ ఆకుల్లో యాంటీ మైక్రోబ్రియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. జామ ఆకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మకాయ, తేనె వేసి తీసుకోవాలి

జామ ఆకుల టీ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ ఆకుల్లో ముఖంపై ఉండే మచ్చలు పోగొట్టే విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ టీ తాగడంతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయాలి. దీంతో కుదుళ్లు బలంగా మారుతాయి.

ముంబైలో ప్రపంచ రికార్డ్ లిఖించనున్న కింగ్ కోహ్లీ.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో..

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో 199 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే, అతను వన్డే క్రికెట్‌లో 283 ఇన్నింగ్స్‌లు, టీ20 క్రికెట్‌లో 117 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
దీంతో 600 ఇన్నింగ్స్‌ల బాట పట్టిన కింగ్ కోహ్లి.. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ద్వారా సరికొత్త చరిత్రను లిఖించనున్నాడు.

విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అది కూడా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డును లిఖించనుంది. అంటే, న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో 600 ఇన్నింగ్స్‌లు ఆడిన అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు అవుతాడు.

కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 599 ఇన్నింగ్స్‌లు ఆడాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరగనున్న 3వ టెస్టు మ్యాచ్‌లో ఆడితే 600 ఇన్నింగ్స్‌లు ఆడిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 782 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి మొత్తం 34357 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

భారత్ తరపున అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. 509 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్ మొత్తం 605 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 24208 పరుగులు చేశాడు.

537 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 599 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఆడి సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. దీంతో భారత్ తరపున 600 ఇన్నింగ్స్‌లు ఆడిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

నవంబర్ 1 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా కీలకం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నందున, ఇప్పుడు భారత్ క్లీన్ స్వీప్ ఓటమిని తప్పించుకోవడానికి మూడవ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. దీంతో వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఆలసించినా ఆశాబంగం.. రానున్నవన్నీ గోల్డెన్ డేస్.

బంగారం ఇప్పుడు ఎంత లెవల్‌కు పోతోంది అంటే.. ఒకప్పుడు ప్లాటినం గోల్డ్‌ను చూసి ఎక్కిరించేది..కానీ ఇప్పుడు గోల్డ్ ప్లాటినాన్ని చూసి జాలి పడుతోంది..

వైదిస్ ఓన్లీ బంగారం. అంటే..ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా బిజినెస్ జరగడమే. ప్లాటినం ఇప్పుడు 10గ్రాములు తిప్పికొడితే 30 వేలుండదు. కానీ బంగారం ధర.. వారం వారం వేలకు వేలు పెరుగుతూ..లకారం..అంటే లక్షమార్కును టచ్ చేసేందుకు పరుగులు తీస్తోంది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజు డాలర్‌కు కూడా లేదు. దాని అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతికి చుక్కలు కనిపిస్తున్నాయి..దాని రేంజ్‌ ఏలెవల్లో పెరుగుతోందంటే…2024లోనే ఏకంగా 31శాతం పెరిగింది. 2005నుంచి 2024వరకు దాని పెరుగదలశాతం 455. ఈరేంజ్‌లో పెరుగుతుందని ఎవరూ ఊహించలే.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే… 24క్యారెట్స్ 10గ్రాముల ధర రూ. 80450…. 22క్యారెట్స్ 10గ్రాముల ధర రూ.70375…
పసిడి ప్రియులు చాలా కాలంగా బంగారం ధరలు తగ్గుతాయని ఆశిస్తూ.. కొనేందుకు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. పైగా పండుగరోజులు కావడం.,.ధన త్రయోదశి, దీపావళి కావడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంలేదు. లాస్ట్ త్రీడేస్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే..ఆదివారం నాడు 24క్యారెట్స్ 10గ్రాముల ధర 80వేల 290 ఉండగా..అది సోమవారం నాటికి 79800కు తగ్గింది. అంటే ఒక్కరోజుకు 490తగ్గింది. ఇంకా తగ్గుతుందని సంబరపడేలోపు మరుసటిరోజుకు అది ఏకంగా 650పెరిగింది.

బంగారం అమాంతంగా పెరగడానికి కారణాలు చూస్తే…ఉక్రెయిన్ రష్యా వార్, మిడిల్‌ ఈస్ట్‌లో ఇంకా చల్లారని యుద్ధ మంటలు, మేజర్ ఎకనామిస్ అయిన చైనా, అమెరికా, రష్యా..డౌన్ ఫాల్ కావడం.. అమెరికా ఎలక్షన్స్ ప్రభావం బులియన్ మార్కెట్‌పై విపరీతంగా ఉండటం…ఇవన్నీ ఓకారణమైతే.. మరో మేజర్ రీజన్..ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు..అంటే మన దగ్గరుండే ఆర్బీఐ లాంటి బ్యాంకులు..బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుపోతున్నాయి. మాములుగా ప్రపంచంలో బంగారంపై మోజున్న దేశాల్లో నంబర్‌ వన్ మనదేశమే. ఎందుకంటే మన ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యాలకు, పండుగలు పబ్బాలకు బంగారం లేనిదే పొద్దు గడవదు. ప్రస్తుతం నడుస్తున్నది పెళ్లిళ్ల సీజన్, ఫెస్టివల్ సీజన్ కావడంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉంది. పైగా మన దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ చాలా అంటే చాలా తక్కువ. అంతా దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాము. గతేడాది మన దేశంలో మైన్స్ ద్వారా వచ్చిన బంగారం కేవలం 1341 కిలోలు మాత్రమే. కానీ దేశీయ అవసరాలకు అది సరిపోదు. అందుకే మనం ఆఫ్రికాలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒకసారి 2010నుంచి 2024వరకు భారత్ ఇంపోర్ట్ చేసుకున్న బంగారం నిల్వలు చూడండి…

2010లో అత్యధికంగా మనం దిగుమతి చేసుకున్న బంగారం వెయ్యి టన్నులు… అలా 2010నుంచి 2023వరకు మన దిగుమతి చేసుకున్న బంగారం..సగటున ఏడాదికి 700నుంచి 800 టన్నులు. చాలా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు సేఫ్టీ నెట్ కింద బంగారం నిల్వలను కొని పెట్టుకుంటున్నాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర 846 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈఏడాది 43 టన్నుల బంగారం కొనిపెట్టుకుంది. 2018-24వరకు రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్‌ను 200 శాతం పెంచుకుంది. ఇక అమెరికా దగ్గర ఏకంగా 8 వేల టన్నులు నిల్వ ఉంచుకుని ఉంది…ఇలా సెంట్రల్ బ్యాంక్స్ బంగారం నిల్వలు పెంచుకుంటుంటే…దాని మూలంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. గతవారం ఔన్స్ బంగారం 2600 డాలర్లు…ఔన్స్ బంగారం అంటే 28గ్రాములు..ఇంచుమించు మూడు తులాలు..మన కరెన్సీలో దాని విలువ 2లక్షల 31వేల 500రూపాయలు. దానికి 6శాతం ఇంపోర్ట్ డ్యూటీ వేసుకుంటే 2లక్షల 53వేల90రూపాయలు. అంటే ఒక గ్రాము 8763రూపాయలు పడుతోంది. అంటే రాబోయే రోజుల్లో బంగారం పదిగ్రాములు ధర ఈజీగా లక్ష మార్క్‌ను టచ్ చేసే చాన్సుంది. ఈ గణాంకాలు చూసిన కొందరు ఇప్పుడే బంగారం కొనిపెట్టేందుకు అప్పులు చేసి మరీ షాపులకు క్యూకడుతున్నారు.

ప్రస్తుతం ధర భవిష్యత్‌లో ఇంతమేరకు పెరుగుతుందనేది చెప్పలేము.. కానీ 50వేలు మార్క్ టచ్ అయినప్పుడే వామ్మో అనుకున్న జనం.. 80వేల మార్కును దాటుతుందని ఊహించలేదు.కానీ దాటింది. ఇంతలా బంగారంరేట్లు పెరగడానికి మరో ప్రధాన కారణం..సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ప్రపంచం బంగారాన్ని చూస్తోంది. దేశం ఎంత సంక్షోభంలో చిక్కుకున్నా బంగారానికి వన్నె తరగని గిరాకీ ఉంది. ఓరకంగా ఇప్పుడు బంగారం నిత్యావసర సరుకైంది. రూపాయి మన దగ్గరే చెల్లుబాటు..అదే గోల్డ్..ప్రపంచం మొత్తం చెల్లుబాటులో ఉంది. బంగారానికి ఉన్న రీసేల్ వాల్యూ ఏ మెటల్‌కు లేదు. ప్లాటినం కొనడం తప్ప అమ్మడానికి పనికిరాదు. ఇక వజ్రం కొనేటప్పుడు భారీగా ఉన్నా తిరిగి అమ్మాలంటే సగానికి సగం ధర పడిపోతుంది. కానీ బంగారం అలా కాదు..ఇవాళ ధర ఎంతుందో..అంతే ధరతో బంగారం అమ్మవచ్చు. అందుకే వినియోగదారులు, పెట్టుబడిదారులు బంగారాన్ని సెక్యూర్డ్ ఇన్విస్ట్‌మెంట్‌గా చూస్తున్నారిప్పుడు. సో..డబ్బుంటే ఇప్పుడే కొనిపెట్టేసుకోండి అన్నది నిపుణుల సూచన….బంగారం ఎప్పటికీ బంగారమే.

ఊహకు అందని రేంజ్ లో నాని సినిమాల బడ్జెట్.. ఇక దుమ్ము దుమారమే

ప్రతి కు అంచెలంచెలుగా కల్లెక్షన్స్ పెరుగుతున్నపుడు వారికి ఉండే కాన్ఫిడెన్స్ అదే విధంగా పెరుగుతుంది.. అయితే ప్రస్తుతం నాని విషయం లో కూడా ఇదే జరిగింది..
మొన్నటివరకు కథ డిమాండ్ చేసినా తన మార్కెట్ గురించి ఆలోచించి నిర్మాతలు బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసేవారు.. అయితే ప్రస్తుతం ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ ల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి..? కలెక్షన్లు పెరుగుతున్నపుడు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. నిన్నమొన్నటి వరకు కథ డిమాండ్ చేసినా.. మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ ల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి..?

నాని రేంజ్ పెరుగుతుంది. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల హీరోగా మారిపోతున్నారు న్యాచురల్ స్టార్. గతేడాది దసరాతో తొలిసారి సెంచరీ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో 75 కోట్ల మార్క్ అందుకున్నారు. మొన్న సరిపోదా శనివారంతో మరోసారి సెంచరీ కొట్టారు నాని. దాంతో నిర్మాతల్లో బడ్జెట్ భయాలు మెల్లగా తగ్గిపోతున్నాయి.

రెండేళ్ళ కింది వరకు కూడా నానితో భారీ బడ్జెట్ అంటే.. కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందేమో అనే భయం ఉండేది నిర్మాతల్లో. కానీ దసరా, సరిపోదా లాంటి విజయాలతో నాని రేంజ్ 100 కోట్లకు చేరింది. ప్రస్తుతం తనే నిర్మాతగా వస్తున్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. శైలేష్ కొలను ఈ కు దర్శకుడు.

నాని తర్వాతి ల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ మధ్యే గ్రాండ్‌గా ను ఓపెన్ చేసారు. పాన్ ఇండియన్ స్థాయిలోనే నాని ఓదెల రాబోతుంది.

నాని లైనప్ చాలా బలంగా ఉంది. ఈయన తర్వాతి సుజీత్‌తో ఉండబోతుంది.. అలాగే శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను లు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ఏ కు బడ్జెట్ లిమిటేషన్స్ లేవు. మొత్తానికి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు న్యాచురల్ స్టార్. మినిమమ్ గ్యారెంటీ కావడంతో నిర్మాతలు కూడా సై అంటున్నారు.

Home Loan తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోపోతే భారీగా నష్టపోతారు?

చాలా మంది కూడా రక రకాల లోన్లు తీసుకుంటారు. వ్యాపారం కోసమో, కార్ కొనడానికో లేదా ఇల్లు కొనేందుకో లోన్లు తీసుకుంటారు. అయితే అన్నిటికంటే కూడా ఎక్కువగా హోమ్ లోన్ తీసుకుంటారు చాలా మంది. సొంతగా ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కల సాకారం కావాలంటే వారికి ఈజీగా దొరికే మార్గం బ్యాంక్ లోన్. కాబట్టి అందువల్ల చాలా మంది కూడా బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తారు. లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ లోన్ ని తిరిగి కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. మనం సంపాదించే సంపాదనలో సగం అంతా బ్యాంక్ EMI లకే పోతుంది. మనం తీసుకునే లోన్ పై వడ్డీతో కలిపి రెట్టింపు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. నెల నెల సులభంగా వాయిదాలు కట్టుకోవచ్చులే.. టెన్యూర్ ఎక్కువగా ఉంది కదా అని అనుకోని.. ఈజీగా హోమ్ లోన్ తీసుకుంటారు. కానీ తరువాత రెట్టింపు నష్టాలు ఎదురుకుంటారు. మనలో చాలా మంది కూడా హోమ్ లోన్ తీసుకొని లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి? లేదంటే చాలా దారుణంగా నష్టపోతారు? అసలు ఇంతకీ ఆ విషయాలు ఏంటి ? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రూల్ నెంబర్ 1.. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఇల్లు కొనాలన్నా లేదా కట్టుకోవాలన్నా ఆ ఇంటికి తీసుకోవలసిన లోన్ మన సంవత్సర ఆదాయం కంటే 5 రెట్లు మాత్రమే ఎక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ దాటకూడదు. ఉదాహరణకు మీ సంవత్సర ఆదాయం 7 లక్షలు అనుకుందాం. అప్పుడు మీరు తీసుకోవాల్సిన లోన్ మీ ఆదాయం మీద 5 టైమ్స్ అంటే 7 లక్షలు*5 రెట్లు = 35 లక్షలు మాత్రమే ఉండాలి. అంతకంటే తక్కువున్నా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. అంటే మీరు సంవత్సరానికి 7 లక్షల ఆదాయం సంపాదిస్తే 35 లక్షల దాకా మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి. అలా మీ సంవత్సర ఆదాయం ఎంతైనా కానీ దానికి 5 టైమ్స్ మించి హోమ్ లోన్ తీసుకోకూడదు.

రూల్ నెంబర్ 2.. మీరెప్పుడైనా కూడా హోమ్ లోన్ తీసుకునేముందు మీ మిగతా EMI లు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. లేదా మీ నెల జీతంలో కేవలం 50 పర్సెంట్ కంటే తక్కువ EMI లు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు మీ జీతం లక్ష అయితే అందులో హోమ్ లోన్ తో కలిపి మీ EMI ఖర్చులన్నీ కూడా 50 వేలు దాటకూడదు. అంటే EMI లన్నీ పోగా మీకు మీ సగం జీతం మిగలాలి. అంత సంపాదన ఉంటే మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి. బ్యాంకులు కూడా మీ మిగతా EMI లు తక్కువుంటే మాత్రమే మీకు హోమ్ లోన్ ఇస్తాయి. కాబట్టి మీ మిగతా లోన్ లు క్లియర్ చేసుకొని హోమ్ లోన్ తీసుకుంటే చాలా బెటర్.

రూల్ నెంబర్ 3.. మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ తీసుకోండి. సిబిల్ స్కోర్ 750 పైగా ఉంటేనే లోన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు మీరు తీసుకునే లోన్ పై వడ్డీ తక్కువ పడుతుంది. 800, 900 అలా సిబిల్ స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది. హోమ్ లోన్ 1 పర్సెంట్ తగ్గినా కూడా మీరు లక్షలు ఆదా చేసుకోవచ్చు.

రూల్ నెంబర్ 4.. చాలా మంది కూడా నెలకు EMI తక్కువ పడుతుందని లోన్ టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటారు. మీరు హోమ్ లోన్ ని 10 సంవత్సరాల లోపు తీర్చుకునే ఆదాయం ఉంటే మాత్రమే తీసుకోండి. చాలా మంది 20 సంవత్సరాలకు పైగా లోన్ టెన్యూర్ పెట్టుకుంటారు. కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలా లోన్ టెన్యూర్ పెట్టుకుంటారు. ఇలా అయితే మీ జీవితం మొత్తం మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా లోన్ కే పోతుంది. ఎక్కువ సంవత్సరాలు EMI కట్టడం వల్ల మీరు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. తక్కువ సంవత్సరాలు కట్టడం వల్ల తక్కువ వడ్డీ పడుతుంది. కాబట్టి లోన్ టెన్యూర్ తక్కువ వుండేలా ప్లాన్ చేసుకోండి. కాకుంటే లోన్ టెన్యూర్ తక్కువ ఉన్నప్పుడు మీరు నెలకు ఎక్కువ EMI కట్టాల్సి వస్తుంది. అలా కట్టే సంపాదన ఉంటే మాత్రమే హోమ్ లోన్ కి అప్లై చేసుకోండి.

రూల్ నెంబర్ 5.. మీరు హోమ్ తీసుకోవాలనుకుంటే అందులో కచ్చితంగా 20 పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకునేలా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకుంటే అందులో 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టగలగాలి. అది కూడా మీరు ఎక్కడా అప్పు చేయకుండా మీ సొంత సేవింగ్స్ తో కట్టుకునేలా ఉండాలి. ఇలా మీరు లోన్ తీసుకునేముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీకు హోమ్ లోన్ తీర్చుకోవడం ఈజీ అవుతుంది. చాలా తక్కువ వడ్డీతో హోమ్ లోన్ క్లియర్ అవుతుంది.

బయట ఫుడ్ తినే ముందు ఇవి గుర్తుంచుకోండి

షవర్మ తిన్నారో చచ్చారే.. ఓ హోటల్ లో షవర్మ తిని 17 మంది అస్వస్థత. షవర్మ తింటే చావేనా దిక్కు? అంటూ మొన్నటివరకు దీని గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తునే వస్తున్నారు. అయినా సరే ప్రజలు ఏ మాత్రం భయపడడం లేదు. తింటే ఏమైందిలే అనుకుంటున్నారో.. లేదా చెప్పేవాళ్ళు అలానే చెప్తారనుకుంటున్నారో.. తెలియదు కానీ స్ట్రీట్ ఫుడ్స్ తినే విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదు. ఆ షవర్మ ఘటన మరువక ముందే.. రీసెంట్ గా.. ‘ప్రాణం తీసిన మోమోస్, మోమోస్ తిని మహిళ మృతి.. మరో యాభై మందికి అస్వస్థత’ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తకు ప్రజలు కాస్త జంకారు. ఏకంగా యాభై మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన అందరిలో కలకలం రేపింది.

షవర్మ, మోమోస్ మాత్రమే కాదు.. గతంలో పానీ పూరి తిని కూడా ఎంతో మంది అస్వస్థకు గురైన ఘటనలు ఎన్నో చూశాము. ఇలాంటి ఘటనలు జరిగిన కొన్ని రోజులు మాత్రమే భయంగా ఉంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత యధావిధిగా స్ట్రీట్ ఫుడ్స్ ను లాగించేస్తూ ఉంటారు ప్రజలు. తరచూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఇలా జరగడంతో.. ప్రజలంతా ఈ విషయంలో అపప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మోమోస్, షవర్మాస్ తయారు చేసిన మూడు గంటల లోపే తినాలని అంటున్నారు. ఒకవేళ మూడు గంటల తర్వాత తింటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధ్యమైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ ను మానేయడం మంచిదని హెచ్చరిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతూనే ఉన్నాయ్ కాబట్టి.. స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం దీపావళి కి భారీ మొత్తంలో స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు.. కాబట్టి స్వీట్స్ షాప్స్ లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు.

అయితే ఇలా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ.. ఇంకా చాలా చోట్ల కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రజలు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా.. స్ట్రీట్ ఫుడ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్ద వారు వరకు ఎవరూ కూడా కనీసం ఆలోచించడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఫుడ్ కు సంబంధించిన వీడియోస్ ఏ ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనితో వాటి పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఇలా ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా.. తినే వారు మాత్రం తినకుండా ఆగడం లేదు. కాబట్టి ఏ ఆహార పదార్ధాలనైనా సరే వండిన మూడు నుంచి నాలుగు గంటల లోపు తినడం మంచిదని. ఇలా స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత అపప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

Digital Arrest అంటే ఏమిటి? ప్రధాని మోడి చెప్పిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు

డిజిటల్ అరెస్ట్…సామాన్యులను వణికిస్తున్న కొత్త భయం. ప్రస్తుతం దీని పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. డిజిటల్ అరెస్ట్ కారణంగా కొంతకాలం క్రితం ఆగ్రాకి చెందిన ఒక మహిళా గుండె పోటుతో చనిపోయింది. తన కూతురు వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని జైల్లో ఉందని తమకు కావాల్సిన డబ్బు పంపిస్తే వదిలేస్తామని పోలీస్ వేషంలో ఓ మోసగాడు ఆ మహిళకు వాట్స్ యాప్ వీడియో కాల్ చేశాడు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశాడు. ఆ తరువాత ఆ మహిళా గుండె పోటుతో చనిపోయింది. అప్పటి నుంచి ఈ డిజిటల్ అరెస్ట్ సంచలనంగా మారింది. చాలా మంది సామాన్యులు ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని… ఇదంతా మోసగాళ్ల పనేనని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగటం భారతీయ చట్టాల్లో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అసలు ఇంతకీ ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి… దీని ద్వారా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు డిజిటల్ అరెస్ట్ అంటే.. కొంతమంది మోసగాళ్లు పోలీస్, ఇన్కమ్ టాక్స్, సిబిఐ ఆఫీసర్స్ అంటూ కాల్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని రాబడుతున్నారు. వీడియో కాల్స్ చేసి మీపై కేసులు పెట్టామంటూ బెదిరించి లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు. మీపై కేసు బుక్ చేశామ్.. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి.. ఎక్కడికి కదలొద్దు.. ఎవరికీ కాల్ చేయొద్దు అంటూ ఎలాంటి డౌట్ రాకుండా నిజమైన పోలీసుల లాగే మాట్లాడతారు. వారిలానే ఆదేశాలు జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటివి బ్యాగ్రౌండ్ లో సెటప్ చేసుకొని… అవి వీడియో కాల్ లో కనిపించేలా మాట్లాడతారు. ఇలా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజమైన యూనిఫామ్స్ వేసుకొని నకిలీ ఐడి కార్డులు కూడా చూపిస్తున్నారు. దీంతో చాలా మంది చదువుకోని వారు, టెక్నాలజీ మీద అంత అవగాహన లేని వారు .. వీళ్ళు నిజమైన పోలీసులేమో అని నమ్మేస్తున్నారు. మీరు పంపిన పార్సిల్స్ లో డ్రగ్స్ ఉన్నాయని, ఫోన్ ద్వారా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని మోసగాళ్ళు బెదిరిస్తున్నారు. ఇక కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్టు వారెంట్లను కూడా చూపించి బెంబేలెత్తిస్తున్నారు.ఇలాంటి కేసుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోయారు. ఇటీవల ఓ వ్యక్తి రూ. 20 లక్షలు నష్టపోయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డ్రగ్స్ సీజ్ చేసినట్టు మోసగాళ్లు నమ్మించి, సెటిల్ చేసుకోకపోతే కఠిన చర్యలు ఖాయమని బెదిరించడంతో చేసేదేం లేక వారు అడిగిన రూ. 20 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా డిజిటల్ అరెస్ట్ బారిన పడిపోతున్నారు సామాన్యులు.

బాగా పెరిగిపోతున్న ఈ డిజిటెల్ అరెస్ట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మోసాల బారిన పడొద్దని సూచించారు. ఈ పరిస్థితి ఎదురైతే వెంటనే కొన్ని స్టెప్స్ పాటించాలని అన్నారు. కాల్ వచ్చినప్పుడు ముందుగా భయపడుతున్నట్లు కనపడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ కాల్ ను స్క్రీన్ రికార్డ్ చేయాలి. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలుసుకోవాలి. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‌లైన్ ద్వారా కాంటాక్ట్ అవ్వదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి వాటి బారిన పడ్డప్పుడు కచ్చితంగా నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు కాల్ చేయాలి. లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలా ఈ విషయాలు తెలుసుకొని నేరస్తులను పట్టించే ప్రయత్నం చేయాలని.. భయపడుతూ నేరస్థులకు లొంగకూడదని ప్రధాని తెలిపారు. ధైర్యంగా ఉంటూ ఇలాంటి సైబర్ నేరాలను ప్రతీ ఒక్కరూ ఎదురుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఇదీ సంగతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

AP Municipal Teachers Promotions 2024 Schedule, Guidelines

AP Municipal Teachers Promotions 2024 Schedule, Guidelines Municipal Teachers SGT to SA, SA to HM Promotions for SAs School Assistants, High School HMs, Posts Guidelines, Schedule School Education Department – Municipal Teachers Establishment Promotions to the posts of School Assistants from Secondary Grade Teachers, and to the posts of Head Masters Gr-ll from the School Assistants in Municipal Management Schools on Adhoc basis Communication of Schedule

AP Municipal Teachers Promotions 2024 for SA, HM Posts Guidelines, Schedule

మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్ వివరాలు:

HM ప్రమోషన్స్:

28/10/2024: తాత్కాలిక సీనియారిటీ లిస్ట్ విడుదల.

28/10/2024  to 01/11/2024: అభ్యంతరాల స్వీకరణ

04/11/2024: ఫైనల్ సీనియార్టీ లిస్టు ప్రదర్శన

06/11/2024: ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు & కౌన్సిలింగ్

SA పదోన్నతులు:

28/10/2024: తాత్కాలిక సీనియారిటీ లిస్టులు విడుదల.

28/10/2024 to 01/11/2024: అభ్యంతరాల స్వీకరణ

04/11/2024: ఫైనల్ సీనియార్టీ లిస్టు విడుదల

08/11/2024: స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ & కౌన్సిలింగ్

School Education Department – Municipal Teachers Establishment – Promotions to the posts of School Assistants from Secondary Grade Teachers, and to the posts of Head Masters Gr-ll from the School Assistants in Municipal Management Schools on Adhoc basis – Communication of Schedule – Regarding Rc.No.ESE02- 14028/1/2022-E-VI  Dated:26/10/2024

Read:

1. G.O.Ms.No.84, Municipal Administration and Urban Development (D1) Department, Dated: 24-06-2022.

2. G.O.Ms.No.7, School Education (Services. II) Department, Dated: 09-02-2024 (Municipalities).

3. G.O.Ms.No.8, School Education (Services. II) Department, Dated: 09-02-2024 (Municipal Corporations).

4. G.O.Ms.No.9, School Education (Services. II) Department, Dated: 09-02-2024 (GVMC).

5. G.O.Ms.No.10, School Education (Services. II) Department, Dated: 09-02-2024 (VMC).

The attention of all the Regional Joint Directors of School Education and District Educational Officers in the state is invited to the references cited, wherein, in the reference 1st read above, the Government transferred the supervision and administrative responsibilities of Municipal Schools, including service matters of the Municipal Teachers, to the School Education Department on par with the system being followed in the respect of Government and Panchayat Raj Schools. Following this, the Government adopted the existing four (4) types of Municipal Teachers Service Rules and issued amendments to them on par with Government and Panchayat Raj Headmasters I Teachers Service Rules, vide references 2nd to 5th read above.

 

In this context, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are informed that, it has been decided to take up promotions in Municipal Management Schools to the posts of School Assistants from Secondary Grade Teachers, and to the posts of Head Masters Gr-ll from the School Assistants on adhoc basis in the State.

 

The schedule for these promotions is as follows:

 

To the post of Head Master Gr.II
1 Display Tentative Seniority list to the post of Head Master Gr.II 28.10.2024
2 Call for objections 28.10.2024 to

01.11.2024

3 Display of Final Seniority lists 04.11.2024
4 Promotion counselling to the post of Head Master Gr.II 06.11.2024
To the post of School Assistant
1 Display Tentative Seniority list to the post of School Assistant from SGT and equivalent posts 28.10.2024
 2 Call for objections 28.10.2024 to

01.11.2024

 3 Display of Final Seniority lists 04.11.2024
 4 Promotion counselling to the post of School Assistant 08.11.2024

Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are requested to take up the promotions as per the above schedule to the posts of Head Masters Gr-II and School Assistants in Municipal Management Schools in the state, duly following the guidelines and instructions issued from time to time in this regard. Any deviation found in implementing the guidelines and instructions will be taken into task and initiate the suitable disciplinary action against the responsible officer.

Download CSE Proceedings

 

AP SSC March 2025 Online Application, Nominal Rolls

SSC Public Examinations 2025 ఆన్ లైన్ అప్లికేషన్ కొరకు:

1) https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

2) “Online Application of SSC Public Examinations – 2025 For Regular Candidates Only” పై క్లిక్ చేయాలి.

3) Enter User ID వద్ద SSC కోడ్ ఇవ్వండి.

4) Enter Password వద్ద  Password ఎంటర్ చేయాలి.

5) Enter the code shown above box కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి

6) పాఠశాల డైస్ కోడ్, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, పిన్ కోడ్ సరి చూసుకొని “Confirm School U-DISE Code” పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజీ మొత్తం కాళీగా కనిపిస్తుంది.

7) విద్యార్థుల పేర్లు కొరకు “Service Data” పై క్లిక్ చేయాలి. మన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అందరు విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఏ విద్యార్థికి నామినల్ రోల్ సబ్మిట్ చేస్తామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న “check” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

8) “check” ఆప్షన్ పై క్లిక్ చేసిన విద్యార్థి పేరు మాత్రమే “Child Info Data” లో కనిపిస్తుంది. ఇక్కడ “edit” ఆప్షన్ ద్వారా విద్యార్థి వివరాలు నమోదు చేయాలి.

S.S.C Public Exams 2025 Online Registration Link

Download Online Apply User Manual

SSC MNR FORMAT A3 Size pdf download

Download DGE detailed Guidelines to HMs

 

AP TET Final Key 2024 with Question Papers

AP TET Final Key 2024 with Question Papers aptet 2024 final key, AP TET July 2024 Final key aptet.apcfss.in AP TET final key 2024 answer key, AP TET final key 2024 pdf download, AP TET final key 2024 release date, AP TET final key 2024 official website APTET Paper 1A, 1B, 2A, 2B Final Answer Keys 2024, APTET Keys APTET 2024 Question Papers, Session wise, Shift wise, Paper wise, Subject Wise Answer Keys with Question Papers AP TET 2024 Answer Keys at https://aptet.apcfss.in/ AP TET 2024 Question Paper with answers PDF Free download

APTET July 2024 Final Key Papers How to download APTET 2024 Key AP TET Key 2024 Paper 1 & 2 AP Teacher Eligibility Test 2024 Key

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జులై-2024) ఫైనల్ కీ విడుదలైంది. ఈ మేరకు అక్టోబర్ 3, నుండి 21 వరకు నిర్వహించిన పరీక్షల తుది  ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది.

 

కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. నెలకు 80 వేల జీతం

టెన్త్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఇలా ఏదో ఒక విద్యార్హత కలిగి ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తుంటారు. జాబ్ దొరకలేదన్న టెన్షన్, ఇంట్లో వాళ్ల నుంచి చివాట్లు నిరుద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదైనా మంచి జాబ్ దొరికితే బాగున్ను అని భావిస్తుంటారు. జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో కాంపిటీషన్ హెవీగా ఉంది. ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా లక్షల్లో పోటీపడుతున్నారు. పోటీ ఎంతున్న గట్టిగ ప్రయత్నిస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ వేతనంతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ ప్రాతిపదికన 188 జాబ్స్ ను భర్తీ చేయనున్నది. విభాగాల వారీగా డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, అసిస్టెంట్ మేనేజర్ 01, మేనేజ్‌మెంట్ ట్రైనీ 05, సీనియర్ ట్రైనీ 02, డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, ట్రైనీ 179 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30, మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1 లక్ష 41 వేల 260.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.80 వేల 720.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.57 వేల 920.. సీనియర్ ట్రైనీ పోస్టులకు రూ.31 వేల 856.. ట్రైనీ పోస్టులకు రూ.24 వేల 616 జీతం ఉంటుంది. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం www.indiaseeds.com ను సందర్శించాల్సి ఉంటుంది.

ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతో తెలుసా

కొన్ని రోజుల కిందట రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే టారిఫ్‌ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. కస్టమర్లు వెళ్లకుండా ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది..
Airtel: ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతో తెలుసా?

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు వైద్య బీమాను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి ICICI లాంబార్డ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ బీమా ప్లాన్‌లను దాని 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌లోని ప్రత్యేకతలు ఏమిటి ? ఏ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఈ బీమా అందించనుందో తెలుసుకుందాం.

ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలు:

కొన్ని రోజుల క్రితం జియోతో సహా టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. టెలికాం కంపెనీలు ఊహించని విధంగా ధరలు పెంచడంతో యూజర్లు షాక్ కు గురయ్యారు. దీని కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNLకి మారడం ప్రారంభించారు. ఈ పరిస్థితిలో వినియోగదారులను నిలుపుకోవడం కోసం జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలుప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ఆ విధంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు అద్భుతమైన ప్రత్యేక ఫీచర్‌ను అందించడానికి ప్లాన్ చేస్తోంది.

ఎయిర్‌టెల్ తన 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వైద్య బీమాను అందించాలని యోచిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రకారం.. ఈ బీమా పథకం ద్వారా ప్రమాదంలో మరణించిన వారికి రూ.1 లక్ష, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.25,000 అందనుంది.

బీమాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

ఎయిర్‌టెల్ రూ.239, రూ.399, రూ.969 ప్లాన్‌లలో ప్రమాద బీమా ప్రయోజనాలు చేర్చింది ఎయిర్‌టెల్‌. ఈ 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు తమ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పంచుకోవడానికి ఎయిర్‌టెల్‌ టెలికామ్‌కు అధికారం ఇస్తారు. ఇది వారి బీమాను నిర్ధారిస్తుంది.

బీమా పథకం నిబంధనలు, షరతులు:

పైన ఇచ్చిన బీమా ప్లాన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందేందుకు కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి.

ఈ ఎయిర్‌టెల్ పాలసీ కేవలం 18 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఈ స్కీమ్‌లోని సభ్యుడు ఒక్కో పాలసీకి ఒక క్లెయిమ్ మాత్రమే చేయగలరు.
వినియోగదారులు పాలసీ వ్యవధిలో గరిష్టంగా 3 క్లెయిమ్‌లు చేయవచ్చు.
వినియోగదారులు బహుళ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ సిమ్‌కార్డులను కలిగి ఉంటే, వారు గరిష్టంగా రూ.5,00,000 వరకు కవరేజీని పొందవచ్చు.
రూ.239, రూ.399, రూ.969 ప్లాన్‌ల కింద లభించే ఈ బీమా రీఛార్జ్ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం అవుతుందని గమనించాలి.

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం నుండి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు, ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అనేక ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు..

భారతదేశం అంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 13,352 ఆధార్ నమోదు, అప్‌డేట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడంలో ప్రజలు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నందున సమస్య నుండి బయటపడేందుకు పోస్టాఫీసులలో కూడా ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చని ఇండియా పోస్ట్ తన ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేసింది.

ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రజలు పెద్ద క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ శాఖ కూడా ఆధార్ సంబంధిత సేవలను అందించడం ప్రారంభించిందని తపాలా శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

నోటిఫికేషన్ ప్రకారం.. పోస్టాఫీసులలో రెండు రకాల ఆధార్ నమోదు, అప్‌డేట్‌ సేవలను అందుబాటులో ఉంటాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌లో వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా నమోదు చేయడం ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. ఆధార్ అప్‌డేట్‌లో ఎవరైనా తమ పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో, ఐరిస్ ఏదైనా పొరపాటు లేదా గడువు ముగిసినట్లయితే అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఈ సేవ భారతదేశంలోని 13,352 కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఈ సేవ కోసం ఏ తపాలా కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి https://www.indiapost.gov.in/లో ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.

గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్‌ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సిఫార్సు చేస్తోంది. ఆధార్ సంబంధిత స్కామ్‌లను నివారించడానికి గత 10 సంవత్సరాలుగా తమ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆధార్ హోల్డర్‌లను కోరుతోంది.

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. నెలకు రూ.2,000 డిపాజిట్‌తో రూ.1.42 లక్షల బెనిఫిట్‌

పోస్ట్‌ ఆఫీస్‌లో రకరకాల పొదుపు పథకాలు ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. పోస్టాఫీసులు అందించే వివిధ పొదుపు పథకాలలో డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి.

ప్రతి ఒక్కరికీ ఆర్థికశాస్త్రం చాలా ముఖ్యం. మీకు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ లేకపోతే, మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పొదుపు పథకాలను అమలు చేస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సురక్షితమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో పోస్టల్ సేవింగ్స్ స్కీమ్‌లో నెలకు రూ.2,000 పెట్టుబడి పెట్టడం ద్వారా ఐదేళ్లలో మీకు ఎంత లాభం వస్తుందో వివరంగా చూద్దాం.

పోస్టల్ సేవింగ్స్ పథకం:

ప్రతి ఒక్కరి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన అంశం. మారుతున్న ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వంటి వివిధ కారణాల వల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలి. ఈ పరిస్థితిలో ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. ఆ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. అలాంటి ఒక పథకం పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి.

ఈ పథకంలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీములు నేరుగా ప్రభుత్వ నియంత్రణలో ఉండటం వలన మరింత సురక్షితమైనవి. దీని కారణంగా చాలా మంది పోస్టల్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.

5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ పథకం:

పోస్టాఫీసుల ద్వారా కొనసాగుతున్న పొదుపు పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందినది 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. ఈ పోస్టల్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 6.7 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ సందర్భంలో మీరు ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల పాటు నెలకు రూ.2,000 పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీపై మీకు రాబడి వస్తుంది.

5 సంవత్సరాల పెట్టుబడి:

మీరు ఈ ప్రభుత్వ పోస్టల్ రికరింగ్ డిపాజిట్ పథకంలో 5 సంవత్సరాల పాటు నెలకు రూ.2,000 పెట్టుబడి పెట్టండి. ఈ పథకం మొత్తం వ్యవధిలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.1,20,000 అవుతుంది. మీరు ఈ స్కీమ్‌ వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో రూ.1,42,732 పొందుతారు. దీని ప్రకారం, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 5 సంవత్సరాలకు మాత్రమే వడ్డీ రూ.22,732 వస్తుంది.

విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!

దసరా సెలవుల్లో ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు దీపావళి పండగ సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళి పండగకు వరుస సెలవులు రానున్నాయి. ఈ పండగను అక్టోబర్‌ 31న నిర్వహించనున్నారు..

ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 31న, ధన్‌తేరస్ అక్టోబర్ 29న జరుపుకోనున్నారు. దీపావళి తరువాత ఛత్ పూజ పండుగ కూడా ఉంది. పిల్లలు సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి నుండి ఛత్ పూజ వరకు యుపి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో సహా ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు ఎన్ని రోజులు మూసివేయబడతాయో తెలుసుకుందాం. అయితే దీపావళి పండగను కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు జరుపుకోనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకొంటారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీపావళి పండుగ సందడి మొదలైంది. పిల్లలు పెద్దలు టపాసులు కొంటూ.. మార్కెట్ అంతా సందడి చేస్తున్నారు. ఇక దీవాళి పండగ గురువారం రోజు వస్తుంది. గురువారంతోపాటు… శుక్రవారం కూడా స్కూళ్లకు రెండు రోజులు హాలిడేస్ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

దీంతో దీపావళి సందర్భంగా ఏకంగా 4 రోజులు సెలవులు రానున్నాయి. అందులో ప్రభుత్వం 2 రోజులు సెలవులు అందిస్తుండగా.. ఒక రోజు రెండవ శనివారం… 1 రోజు ఆదివారం కలిసొచ్చింది. ఇప్పటికే మన పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు నాలుగు రోజుల సెలవులు ప్రకటించేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతే మిగిలుంది. ఇక్కడ కూడా ప్రకటిస్తే నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు పాఠశాలలకు సెలవులకు సంబంధించి సర్క్యులర్ వచ్చినట్లు సమాచారం. అయితే దీపావళి తర్వాత సెలవులకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

పొరుగు రాష్ట్రాల్లో..

దీపావళి పండుగ ముగిసిన వెంటనే, ఛత్ యుపి, బీహార్, జార్ఖండ్‌లలో అతిపెద్ద పండుగ. ఛత్ పూజ 2024 నవంబర్ 7,8 తేదీలలో జరుపుకుంటారు. ఛత్ పూజ సందర్భంగా బీహార్ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. చాలా పాఠశాలల్లో దీపావళి నుండి ఛత్ పూజ వరకు నిరంతర సెలవులు ఉంటాయి.

మొత్తం నాలుగు రోజుల సెలవులు:

దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న పాఠశాలలు మూసి వేయనున్నారు. ఆపై నవంబర్ 2న గోవర్ధన్ పూజ, నవంబర్ 3న భాయ్ దూజ్ జరుపుకుంటారు. మధ్యలో ఒకరోజు ఆదివారం. మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 4 రోజులు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. కాగా బీహార్‌లో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం ఛత్ పూజ నవంబర్ 7, 8 తేదీలలో జరుపుకుంటారు. ఛత్ పూజ కోసం బీహార్‌లో నవంబర్ 6 నుండి నవంబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

నవంబర్‌ 7 వరకు స్కూల్స్‌ బంద్‌:

రాజస్థాన్‌లోని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి నవంబర్ 7 వరకు దీపావళి సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోనూ దీపావళి సందర్భంగా 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. దీపావళి అక్టోబర్ 31న, ప్రభుత్వ సెలవుదినం నవంబర్ 1న. ఆ తర్వాత శని, ఆదివారాల్లో ప్రభుత్వ సెలవులు ఉంటాయి.

దక్షిణాధి రాష్ట్రాల్లో..

దక్షిణాది రాష్ట్రాల్లోని పాఠశాలలు దీపావళి నాడు అక్టోబర్ 31న మూసి ఉంటాయి. అధికారిక ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం దీపావళి తర్వాత ఇంటికి తిరిగి వచ్చే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 1, 2024ని సెలవు దినంగా ప్రకటించింది. కర్ణాటకలో అక్టోబర్ 31న దీపావళి జరుపుకోనుండగా, నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

శుభవార్త.. కొత్త హెల్త్‌ స్కీమ్‌ ప్రకటించిన నీతా అంబానీ.. మహిళలకు, పిల్లలకు ఉచిత చికిత్స

సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది పిల్లలు, మహిళలకు సహాయం చేయడానికి కొత్త ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించారు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త. అతని భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా సామాజిక కార్యక్రమాల కోసం ముఖ్యమైన పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నీతా అంబానీ ద్వారా ఒక పెద్ద సామాజిక కార్యక్రమం చేపట్టారు. పిల్లలు, యువకులు, మహిళలకు ఉచిత పరీక్షలు, చికిత్స సౌకర్యాలు అందించనున్నారు. సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నీతా అంబానీ లక్ష మందికి పైగా మహిళలకు ఉచిత పరీక్షలు, చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చారు.

సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఆరోగ్య సేవా పథకంలో భాగంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో లక్ష మంది మహిళలకు అందించే ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా దీని కింద ఏ సేవలు అందించనున్నారో తెలుసుకుందాం.

నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, అధునాతన చికిత్సలతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఒక దశాబ్దాన్ని జరుపుకుంటామని, ఎందుకంటే భారతదేశానికి ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిని ప్రపంచ స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో మేము మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచామని అన్నారు.

• పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న 50,000 మంది పిల్లలకు ఉచిత పరీక్షలు, చికిత్స.

• 50,000 మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్, చికిత్స.

• 10,000 మంది యుక్తవయస్సులో ఉన్న బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా.

రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన

రతన్ టాటా కృషి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ యూనివర్సిటీ భారతీయులందరి హృదయాలను గెలుచుకుంది. ఈ భవనం విద్యకు దీటుగా నిలుస్తుంది. భారతీయ పరిశ్రమ ప్రపంచంలో ఒక లెజెండ్ రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలో కన్నుమూశారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో టాటా గ్రూప్ సామాజిక కార్యక్రమాల పని జరుగుతోంది. అందుకే టాటా అనే పేరు భారతీయుల మదిలో మెదులుతోంది. ఇప్పుడు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రతన్ టాటాను గౌరవించాలని నిర్ణయించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించనుంది. ఈ భవనాన్ని టాటా గ్రూప్, సోమర్‌విల్లే కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్మించనున్నాయి. విశ్వవిద్యాలయంలో బోధన, విద్యా కార్యకలాపాల నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం.

2025లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ భవనం ఫిబ్రవరి-మార్చి నెలలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ‘రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్’లో నిర్మించనున్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్‌విల్లే కళాశాలతో ఈ భాగస్వామ్యం టాటా విలువలకు నివాళి అని అన్నారు. రతన్‌ టాటా పేరు మీద నిర్మించిన భవనం భారతదేశానికి ఒక ముఖ్యమైన పరిశోధనా కేంద్రం అవుతుందన్నారు. మానవాళి సంక్షేమం కోసం రతన్ టాటా చేస్తున్న కృషికి ఇది నివాళి అని పేర్కొన్నారు.

యూనివర్సిటీలోని ఈ భాగంలోనే భవనం:

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో రతన్ టాటా పేరుతో ఉన్న భవనం ఆక్స్‌ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (OICSD)కి శాశ్వత నివాసంగా మారుతుంది. ఈ కేంద్రం బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఎదురుగా ఉంటుంది. కొత్త భవనాన్ని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌లు మోరిస్ కో డిజైన్ చేయనున్నారు. ఈ సంస్థ మొదటి ప్రాజెక్ట్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ భవనం 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

రతన్ టాటా చేసిన కృషి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ యూనివర్సిటీ భారతీయులందరి హృదయాలను గెలుచుకుంది. ఈ భవనం విద్యకు దీటుగా నిలుస్తుంది.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 (జనవరి) పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెం2 సెషన్ల (జనవరి, ఏప్రిల్‌) చొప్పున జేఈఈ మెయిన్స్‌ నిర్వహించనుంది. ఇందులో మొదటి సెషన్‌ పరీక్షలు జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 28 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తుంది. పరీక్షకు 3 రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదలవుతాయి.

జేఈఈ మెయిన్‌ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని, యథావిథంగా ఉంటుందని వెల్లడించింది. జనవరి 22 నుంచి 31వరకు జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడిస్తారు. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) షెడ్యూల్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా షెడ్యూల్‌ విడుదలైందని చెప్పవచ్చు. గతేడాది జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా, ఈసారి 2 రోజులు ముందుకు జరిపారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1, 2లకు కలిపి గత ఏడాది 12.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్‌ సీట్లున్నాయి. వీటిల్లో ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 షెడ్యూల్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 28 నుంచి నవంబరు 22 వరకు కొనసాగుతాయి
హాల్‌టికెట్లు విడుదల తేదీ: పరీక్షకు 3 రోజుల ముందు
పరీక్ష తేదీ: జనవరి 22 నుంచి జనవరి 31 వరకు
ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి 12

జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 షెడ్యూల్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతాయి
హాల్‌టికెట్లు విడుదల తేదీ: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు
ఫలితాల ప్రకటన తేదీ: ఏప్రిల్‌ 17

జయశంకర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో 465 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలో భర్తీ చేయనున్న 465 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబరు 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం సీట్లలో బీఎస్సీ వ్యవసాయం కోర్సులో 401 సీట్లు, బీఎస్సీ ఉద్యానంలో 54 సీట్లు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో 5 సీట్లు, బీటెక్‌ ఆహార సాంకేతిక కోర్సులో 5 సీట్ల చొప్పున ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కన్వీనర్‌ సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రవేశాలకు సంబంధించిన ఇతర పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in లో చెక్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చేరే గడువు పెంపు.. ఎప్పటి వరకంటే

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి మూడో విడత కన్వీనర్‌ కోటా కింద రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పలువురు విద్యార్ధులు ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు. ఆయా కాలేజీల్లో చేరే గడువును పెంచుతున్నట్లు తాజాగా విజయవాడని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వెల్లడించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు అభ్యర్థులు అక్టోబరు 28వ తేదీలోగా చేరాలని తెలిపారు. తాజాగా ఆ గడువును ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్‌ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా చేరొచ్చని వర్సిటీ పేర్కొంది.

20 లక్షల ఉద్యోగాలు.. లోకేశ్‌ ఛైర్మన్‌గా మంత్రుల కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి తగు సూచనలు చేసేందుకు మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఛైర్మన్‌గా మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించింది. కూటమి సర్కార్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్‌ సిక్స్‌లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దశల వారీగా చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీపై తాజాగా ప్రభుత్వం దృష్టి సారించింది. భిన్నరంగాల్లో ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల బృందం అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ఏడాదిలో దీపావళి రోజున తెరచుకునే అమ్మవారి ఆలయం.. ఏడాది పొడవునా వెలిగే దీపం, తాజాగా ఉండే పువ్వులు..

భారతదేశాన్ని దేవాలయాల దేశం అంటారు. ఇక్కడ అనేక అద్భుతమైనం, రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు.

ఈ ఆలయాలు వాటి రహస్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అన్త్కాడు ఇక్కడ జరిగే అద్భుతాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ రోజు అలాంటి ఒక రహస్యాన్ని దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం తలపులు దీపావళి సమయంలో మాత్రమే తెరచుకుంటాయి. దేవుడి ముందు వెలిగించిన దీపం, ఆలయంలో దేవుడికి సమర్పించిన పువ్వులు కూడా ఒక సంవత్సరం తర్వాత దీపం వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు కూడా తాజాగా ఉంటాయి.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో బెంగుళూరు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని హాసనాంబ దేవాలయం అంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. పూర్వం దీనిని సిహమసన్‌పురి అని పిలిచేవారు. ఇది చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది.

ఏడాది పొడవునా వెలిగే దీపం

దీపావళి సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీపావళి సందర్భంగా 7 రోజులు మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరుస్తారని చెబుతారు. ఆలయ తలుపులు తెరిచినప్పుడు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జగదంబను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఈ దేవాలయం తలుపులు మూసిన రోజున ఆలయ గర్భగుడిలో స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగిస్తారు. అలాగే ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించి బియ్యంతో చేసిన వంటలను ప్రసాదంగా సమర్పిస్తారు. ఏడాది తర్వాత మళ్లీ దీపావళి రోజున గుడి తలుపులు తెరిస్తే దీపాలు వెలుగుతూనే ఉంటాయని, పువ్వులు కూడా వాడిపోవని స్థానికులు చెబుతున్నారు.

7 రోజుల పాటు జరిగే పండుగ

దీపావళి సందర్భంగా హాసనాంబ గుడి తలుపులు తెరుస్తారు. ఈ సమయంలో భక్తులందరూ జగదాంబ దర్శనం చేసుకుంటారు. హస్నాంబ దేవిని ఒక వారం రోజుల పాటు పూజిస్తారు. చివరి రోజున ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ తర్వాత ఈ ఆలయ తలుపులు మళ్ళీ వచ్చే ఏడాది దీపావళి రోజున మాత్రమే తెరవబడతాయి.

ఆలయానికి సంబంధించిన కథ ప్రాచుర్యంలో ఉంది

హాసనాంబ ఆలయానికి సంబంధించిన అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని అదృశ్యమయ్యే వరం పొందాడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తరువాత అంధకాసురుడు మానవులను, ఋషులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితిలో, ఆ రాక్షసుడిని సంహరించే బాధ్యతను శివుడు తీసుకున్నాడు. ఆ రాక్షసుడి రక్తంలోని ప్రతి చుక్క రాక్షసుడిగా మారుతుంది. అప్పుడు అతన్ని సంహరించడానికి శివుడు తపస్సు ద్వారా యోగేశ్వరి దేవిని సృష్టించాడు, ఆమె అంధకాసురుడిని సంహరించింది.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అత్తిపండ్లు లేదా ఖర్జూరం, ఏది పాలలో కలిపి తాగడం మంచిది? నిపుణుల సలహా ఏమిటంటే

వర్షాకాలం ముగిసి శీతాకాలంలో అడుగు పెడుతున్నాం.. ఈ సీజన్‌లో ప్రజలు తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చలికాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు.

ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచేలా పని చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. శరీరానికి సరిపడా పోషకాహారాన్ని అందించడంతో పాటు, శక్తిని కూడా నింపుతాయి. డ్రై ఫ్రూట్స్‌ను పాలతో కలిపి తినడానికి కొంతమంది ఇష్టపడతారని ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ ఆసుపత్రి చీఫ్ డైటీషియన్ పాయల్ శర్మ చెప్పారు. చాలా మంది అంజీర పండ్లను, ఖర్జూరాలను పాలలో వేసి మరిగించి తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో అత్యంత శక్తివంతమైన కలయిక ఏది అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. నిపుణుల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

రెండు ఆరోగ్యకరమైన ఎంపికలు

అత్తిపండ్లు, ఖర్జూరం రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లని డైటీషియన్ పాయల్ శర్మ చెబుతున్నారు. వీటిని పాలలో కలుపుకుని తింటే.. వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. మరోవైపు, ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది.. ఇది తాజాదనం, శక్తికి మూలం.

ఎముకలు-చర్మం కోసం

అత్తి పండ్లను లేదా ఖర్జూరాలను పాలలో కలిపి తాగితే అది పోషక పానీయంగా మారుతుంది. ఇది ఎముకలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియం.. అత్తి పండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మెరుపును ఇస్తుంది.

అలసట దూరమవుతుంది

అంజీర్ లేదా ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే అంజీర్ లేదా ఖర్జూర కలిపిన పాలు తాగవచ్చు. ఇలా చేస్తే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అత్తి పండ్లను, ఖర్జూరంతో పాలు తాగడం చాలా ఆరోగ్యకరమైనది. వీటిని కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Health

సినిమా