Thursday, November 14, 2024

వాటర్‌ ట్యాంక్‌లో మృత‌దేహం.. అవే నీళ్ల‌ను పదిరోజులుగా వాడుతున్న జనం!

నల్లగొండలో దారుణ ఘ‌ట‌న‌
మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహం ల‌భ్యం
మృతుడిని ఆవుల వంశీగా గుర్తించిన‌ అధికారులు
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం
ఈ ఉదంతం మరువకముందే ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న‌
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో దారుణం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. నల్లగొండ మున్సిపాలిటీలోని 11వ‌ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం క‌నిపించింది. వాటర్ ట్యాంకులో నీళ్ల‌ను చెక్ చేయగా అందులో శ‌వం క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని బ‌య‌ట‌కు తీశారు.

కాగా, ఆ మృత‌దేహాన్ని హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు అధికారులు. అతడు పది రోజుల క్రితం అదృశ్యం కావ‌డంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. ఈ క్ర‌మంలో తాజాగా వాట‌ర్ ట్యాంకులో అత‌ని శ‌వం దొరికింది. అయితే, అతడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ‌డా ? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, ఇలా మృత‌దేహం ఉన్న‌ ఇవే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ జ‌నాలు తాగుతున్నారు. దాంతో శ‌వం ఉన్న‌ నీటిని ప‌ది రోజుల నుంచి వాడిన‌ట్లు తెలుసుకున్న‌ స్థానికులు త‌మ‌కు ఏం అవుతుందోన‌ని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

Hema: సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

హేమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సీసీబీ పోలీసులు
మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ
ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు
సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు.

నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు… రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

EPFO: 7.5 కోట్ల మందికి గుడ్‌న్యూస్‌ – పీఎఫ్‌ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు

How To Update Name KYC Details In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఖాతాదార్ల సౌలభ్యం కోసం EPFO చాలా సేవలను ఆన్‌లైన్‌ చేసింది. దీనివల్ల, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే చాలా పనులు పూర్తి చేయవచ్చు.

కొన్నిసార్లు, ఈపీఎఫ్ ఖాతా తెరిచేటప్పుడు పేరు, వయస్సు వంటి వివరాలు తప్పుగా నమోదు చేస్తుంటారు. ఈ వివరాలను ఆఫ్‌లైన్‌ ద్వారానే కాదు, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేయవచ్చు. గతంలో, దీనికోసం ఉద్యోగి జాయింట్ డిక్లరేషన్ ఫారాన్ని కంపెనీ యజమాని పూరించాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా EPF ఖాతాల్లో 11 మార్పులు చేయవచ్చు:
EPF చందాదార్లు ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 11 విషయాలను అప్‌డేట్‌ చేయవచ్చు. సభ్యుని పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, తల్లి/తండ్రి పేరు, సంబంధం, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం మానేసిన తేదీ, పౌరసత్వం, ఆధార్ వివరాలు వంటివాటిలో తప్పులను సరిచేయవచ్చు. అప్లికేషన్‌తో పాటు, ఆ అభ్యర్థనకు సంబంధించిన అవసరమైన రుజువు పత్రాలను ‍‌(Proof documents) కూడా అప్‌లోడ్ చేయాలి.

ఈపీఎఫ్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి? ‍‌(How to update EPF profile online?)
1. EPFOలో ఏవైనా వివరాలను అప్‌డేట్ చేయడానికి, ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్, epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి.
2. తర్వాత, ‘For Employees’ విభాగంలోకి వెళ్లి, Services’ ఆప్షన్‌ ఎంచుకోండి.
3. తర్వాత ‘Member UAN/ Online Service’ ఆప్షన్‌ ఎంచుకోండి.
4. ఇప్పుడు మరో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
5. తర్వాత, మీ EPF ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ, ‘Manage’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై ‘Joint Declaration’ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.
6. మార్పులు చేయాలనుకుంటున్న మెంబర్ IDని ఎంచుకోండి.
7. వివరాలలో మార్పులు చేసేందుకు కొన్ని పత్రాల జాబితా కనిపిస్తుంది. మీ అవసరాన్ని బట్టి వాటి నుంచి ఎంచుకోవాలి.
8. వివరాల్లో మార్పులు చేసిన తర్వాత అవసరమైన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
9. ఈ అభ్యర్థన మీ సంస్థ యాజమాన్యానికి వెళ్తుంది.

అభ్యర్థనను స్వీకరించిన కంపెనీ యాజమాన్యం, ఆ ఉద్యోగి రికార్డులను తనిఖీ చేస్తుంది. ఉద్యోగి అభ్యర్థన సరైనదే అని గుర్తిస్తేనే ఆ అప్లికేషన్‌ను ఆమోదిస్తుంది. దరఖాస్తు పట్ల సంస్థ సంతృప్తి చెందకపోతే తిరస్కరిస్తుంది. యాజమాన్యం ఆమోదం పొందిన అప్లికేషన్‌ సంబంధిత PF ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తుంది. ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించి సభ్యులు తమ అభ్యర్థనలను సమర్పిస్తున్నారు. EPFO లెక్క ప్రకారం, ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 40,000 అప్లికేషన్లను ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికే పరిష్కరించాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌పై సీఈవో మీనా కీలక ప్రకటన

అమరాతి: మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు.

ఓటేసిన 3.33 కోట్ల మంది..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని చెప్పారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని, మరో 26,721 మంది సర్వీసు ఓటర్‌లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని చెప్పారు.

119 మంది అబ్జర్వర్లను నియమించిన ఈసీ

అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల లోక్‌సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రత్యేకంగా జరుగుతుందని, వేరే హాల్‌లో అక్కడ 8 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలు అవుతుందని వివరించారుు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 119 మంది అబ్జర్వర్లను నియమించిందని పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్లు 102 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1 నుంచి 2 రౌండ్‌లలో లెక్కిస్తారని, 48 నియోజకవర్గాలలో 3 రౌండ్‌లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్‌లలో లెక్కిస్తారని చెప్పారు. ఇక ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం రూ.483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.170 కోట్లు నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్, రూ.36 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186 కోట్ల విలువైన వస్తువులు, రూ.29 కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఉన్నాయని తెలిపారు.

అమలాపురం పార్లమెంట్‌కు 27 రౌండ్‌లు
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ లెక్కింపునకు మొత్తం 27 రౌండ్‌లు పడుతుందని ముకేశ్ కుమార్ మీనా వివరించారు. ఫలితానికి దాదాపు 9 గంటల సమయం పట్టొచ్చని అన్నారు. ఇక రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలలో 13 రౌండ్‌లు ఉంటాయని, ఇందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలలో 26 రౌండ్‌ల లెక్కింపు జరుగుతుందని, కొవ్వూరు, నరసాపురంలలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.

పటిష్ట భద్రత ఏర్పాటు
అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చని, కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రమే నిర్దేశించిన సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లవచ్చునని పేర్కొన్నారు.

మద్యం ఎక్కడా దొరకదు..
కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు ముసివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగబోవని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
67 కంపెనీల సాయుధ భద్రతా బలగాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో రెడ్‌ జోన్‌గా ప్రకటించామని వివరించారు. కౌంటింగ్ రోజు జరిగిన హింస జరగకుండా చర్యలు చేపట్టామని, 185 హింస జరిగే ప్రాంతాల్లో గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.
12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశామని చెప్పారు. అలాగే పోలీసు పికెట్‌లు పెట్టామని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. ఇక క్యూఆర్టి టీమ్‌లు, కార్డెన్ సెర్చ్ చేస్తున్నామని వివరించారు. పోలింగ్ తర్వాత 1,400 చోట్ల కర్డెన్ సెర్చ్ చేశామని అన్నారు.

Gratuity Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏ పెంపు తర్వాత గ్రాట్యుటీ పరిమితి పెంపు

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో కానుక అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4 శాతం పెంచిన తర్వాత గ్రాట్యుటీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పదవీ విరమణ, మరణాల గ్రాట్యుటీ పరిమితిని 25 శాతం పెంచారు. దీంతో పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త గ్రాట్యుటీ పరిమితి జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఇటీవల కీల నిర్ణయాన్ని ప్రకటించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) రూల్స్, 2021 ప్రకారం పదవీ విరమణ,మరణాల గ్రాట్యుటీకి గరిష్ట పరిమితి ఇప్పుడు రూ. 25 లక్షలుగా ఉంది. వాస్తవానికి ఈ నిర్ణయం ఏప్రిల్ 30న తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం.

గ్రాట్యుటీ అనేది చాలా కాలం పాటు పనిచేసిన ఉద్యోగికి కంపెనీ ఇచ్చే బహుమతి. ఇది జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)కి అదనంగా ఇవ్వబడుతుంది. కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేసినప్పుడే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. మార్చి 7న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) కూడా ఆమోదించబడింది. బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 46 శాతం రేటు కంటే ఈ 4 శాతం పెరుగుదల ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ఉద్దేశించి ఈ మేరకు లాభాన్ని ఉద్యోగులకు అందించనున్నారు.

డీఏ పెంపుతో రవాణా భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యూటేషన్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్సులు కూడా 25 శాతం పెరిగాయి. డీఏ, డీఆర్‌ల పెరుగుదల వల్ల ఖజానాపై ఏడాదికి రూ. 12,868.72 కోట్ల ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. గ్రాట్యుటీ, అలవెన్సుల పెంపుదల ఆర్థిక భద్రతను అందించడంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..

Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..

ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్న యువతీ, యువకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. పలువురు విద్యార్థులు ప్రమాదాల్లో మరణించడం, మరికొందరిపై దాడులు జరగడం.. ఇంకొందరు అదృశ్యమవడం.. ఆందోళన కలిగిస్తోంది.

వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబాలు.. మనోవేదనకు గురవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగు విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ హైదరాబాద్ కు చెందిన యువతి.. అదృశ్యమైంది.. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల అమెరికాలో అదృశ్యమైంది.. నితీషా కందుల కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది.. ఆమె మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

నితీషా కందుల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు.

93 ఏండ్ల వయస్సులో ఐదో పెండ్లి చేసుకున్న మీడియా టైకూన్‌ మర్దోక్

Rupert Murdoch | 93 ఏండ్ల వయస్సులో ఐదో పెండ్లి చేసుకున్న మీడియా టైకూన్‌ మర్దోక్

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 93 ఏండ్ల వయసులో ఐదో పెండ్లి చేసుకున్నారు.

తన కంటే వయసులో 26 ఏండ్ల చిన్నవారైన రిటైర్డ్‌ జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వీళ్లిద్దరు గత ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వివాహానికి అమెరికా ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘న్యూ ఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌’ యజమాని రోబెర్ట్‌ క్రాఫ్ట్‌, ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్‌ హాజరయ్యారు.

మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్‌ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్‌ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేండ్లకే విడాకులు తీసుకున్నారు. తన రెండో భార్య అన్నా మరియా మన్‌ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.

కాగా, 2023, మార్చిలో 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ను ప్రేమ పెండ్లి చేసుకోబోతున్నట్లు మార్దోక్‌ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో వారి ఎంగేజ్‌మెంట్‌ రద్దయింది. ఈ క్రమంలో తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో వివాహమైంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలను కలిగి ఉన్న మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ 2023లో లెక్కకట్టింది. ఇక గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు మర్దోక్. ప్రస్తుతం రూపర్ట్​ మర్దోక్​ తన సంస్థలకు గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

YCP: సుప్రీం కోర్టులో వైసీపీకి చుక్కెదురు..

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) సుప్రీంలో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై (Postal Ballot) హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్లపై జూన్ 1న (శనివారం) హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్ (Justice Arvind Kumar), జస్టిస్ సందీప్ మెహతా (Justice Sandeep Mehta) ధర్మాసనం వైసీపీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతానేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటికే టీడీపీ ఏమ్మెల్యే వెలగపూడి (TDP MLA Velagapuei) సుప్రీం కోర్టులో కేవియట్ (Caveat) దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసింది.

అయితే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్‌లో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల కౌంటింగ్ తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది.

కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వైసీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

Green Chilli Chutney Recipe: పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేస్తే రుచి అదుర్స్‌!

Green Chilli Chutney: పచ్చిమిర్చి పచ్చడి కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. పచ్చిమిర్చి పచ్చడి ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, దీనిని వేడి అన్నం, ఇడ్లీ, దోసె లేదా ఉప్మాతో తింటారు.

పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగపప్పు, పెరుగు, ఉప్పు, మసాలాలతో తయారు చేయబడిన ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది.

వాటిలో కొన్ని:

1. జీర్ణక్రియ మెరుగుదల:

పచ్చిమిర్చి పచ్చడిలోని క్యాప్సాయిసిన్ అనే పదార్థం జీర్ణక్రియ రసాల పెంచుతుంది, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

2. రోగనిరోధక శక్తి పెరుగుదల:

పచ్చిమిర్చి పచ్చడిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

పచ్చిమిర్చి పచ్చడిలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు, జీవక్రియను పెంచుతుంది, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

4. హృదయ ఆరోగ్యానికి మంచిది:

పచ్చిమిర్చి పచ్చడిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

పచ్చిమిర్చి పచ్చడిలోని విటమిన్ సి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది, ముడతలు, మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.

6. కళ్ళకు మంచిది:

పచ్చిమిర్చి పచ్చడిలోని విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది, దృష్టిని మెరుగుపరుస్తుంది, రాత్రి కురుబును నివారించడంలో సహాయపడుతుంది.

7. జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

పచ్చిమిర్చి పచ్చడిలోని ఐరన్ జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

8. నొప్పి నివారణ:

పచ్చిమిర్చి పచ్చడిలోని క్యాప్సాయిసిన్ నొప్పి నివారణ లక్షణాలను కలిగి ఉంటుంది, తలనొప్పి, కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది.

తయారీ విధానం:

పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, నీటిని తుడిచివేయండి. ఒక పాత్రలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేయించి, తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత, వేరుశెనగపప్పు, పచ్చి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. అన్ని కూరగాయలు బాగా వేగిన తర్వాత, ఉప్పు, పులుపు వేసి కలపాలి. చివరగా, కొత్తిమీర తుప్పను వేసి కలపి, స్టవ్ ఆఫ్ చేయాలి.

చిట్కాలు:

పచ్చిమిర్చి పచ్చడిని మరింత రుచిగా చేయడానికి, వేయించేటప్పుడు కొద్దిగా ఇంగువ వేయవచ్చు.
పచ్చిమిర్చి పచ్చడిని వేడి అన్నం, దోసెలు, ఇడ్లీలతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది.
పచ్చిమిర్చి పచ్చడిని ఎక్కువసేపు నిలువ చేయడానికి, గాజు సీసాలో నిల్వ చేయండి.

Telangana Polycet Results 2024

Telangana Polycet Results 2024

The State Board of Technical Education and Training (SBTET), Hyderabad is all set to declare the results of the Telangana Polytechnic Common Entrance Test (TS POLYCET) 2024 today, on June 3. Candidates eagerly awaiting their results from the entrance exam can access them through the official website, polycet.sbtet.telangana.gov.in.

Conducted on May 24, the TS POLYCET 2024 exam was held for candidates aspiring to pursue polytechnic courses. Upon the declaration of results, candidates will be able to download their TS POLYCET 2024 rank card directly from the official website. To access the rank card, candidates will need to use their TS POLYCET 2024 hall ticket number and password for login.

The TS POLYCET 2024 rank card will have vital information such as the candidate’s name, roll number, registration number, date of birth, gender, category, hall ticket number, aggregate marks, subject-wise marks, qualifying status, and state rank.

Successful candidates will subsequently need to engage in the TS POLYCET 2024 counselling process, which will be organized based on their ranks in the examination. This counselling process is integral for completing further admission procedures.

The registration window for TS POLYCET 2024 counselling will open on June 20, according to the SBTET, Hyderabad. To participate in the counselling session, candidates must first pay a processing fee and then schedule an offline slot for document verification.

Telangana Polycet Results 2024

mPassport సేవ: 5 రోజుల్లో పాస్‌పోర్ట్ మీ చేతికి చేరుతుంది: ఎలా దరఖాస్తు చేయాలి?

మీకు ఇంకా పాస్‌పోర్ట్ రాలేదా? అలా అయితే, ఎక్కువగా చింతించకండి. పాస్‌పోర్ట్‌ను వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో పొందండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మొబైల్ అప్లికేషన్ mPassport సేవను ఉపయోగించి కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం.

ఇది మీ పాస్‌పోర్ట్‌ను ఒక వారం లేదా 10 రోజుల్లో పొందుతుంది. mPassport సర్వీస్ అప్లికేషన్ ఎలా ఉపయోగించాలి? మరియు ఎలా దరఖాస్తు చేయాలి? మేము దాని గురించి మీకు తెలియజేస్తాము.

పాస్‌పోర్ట్ చాలా ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలలో ఒకటి. ఇది విదేశీ ప్రయాణానికి మాత్రమే కాకుండా దేశంలో కూడా అధికారిక గుర్తింపు రుజువుగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు పాస్‌పోర్ట్‌లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసింది. ఇప్పుడు, మొబైల్ యాప్‌లలో పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం, mPassport సర్వీస్ అప్లికేషన్‌ను తెరవడం ద్వారా పాస్‌పోర్ట్ చాలా సులభంగా పొందవచ్చు.

mPassport సర్వీస్ అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలి?

దశ 1: మీ మొబైల్, కంప్యూటర్ లేదా టాబ్లెట్‌ని ఉపయోగించి mPassport సర్వీస్ సౌకర్యాన్ని ఉపయోగించండి. ముందుగా mPassport సర్వీస్ అప్లికేషన్‌లో నమోదు చేసుకోవాలి. (మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో mPassport సేవా యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు)
దశ 2: దీని తర్వాత మీరు ‘లాగిన్’ చేయాలి. మరియు ‘పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు’ లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 3: తర్వాత మీరు మీ వివరాలను పూరించాలి. మరియు ‘పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేయండి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి మీరు ముందుగానే రుసుము చెల్లించవచ్చు.
దశ 4: ఫీజు చెల్లింపు విజయవంతం అయిన తర్వాత వినియోగదారు ‘ప్రింట్ అప్లికేషన్ రసీదు’ లింక్‌పై క్లిక్ చేయాలి లేదా వారు చూపించగల రసీదు సందేశం (SMS) కోసం వేచి ఉండాలి.
దశ 5: దీని తర్వాత వారు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయబడిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. మీరు (వినియోగదారు) అక్కడ అవసరమైన అన్ని పత్రాలను తీసుకోవాలి.
పాస్‌పోర్ట్ దరఖాస్తు స్థితిని ‘ట్రాక్’ చేయడం ఎలా?

పైన పేర్కొన్న దశలను ఉపయోగించడం కోసం కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత, మీరు మీ మొబైల్ లేదా Google Chromeలో డౌన్‌లోడ్ చేసిన mPassport సేవా యాప్‌ని ఉపయోగించి అప్లికేషన్ యొక్క స్థితిని ట్రాక్ చేయవచ్చు. mPassport సేవా యాప్‌లోని ‘స్టేటస్ ట్రాకర్’ ఐకాన్‌పై క్లిక్ చేసి, ‘అప్లికేషన్ స్టేటస్’ ఎంచుకోండి. ఆపై పైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, ‘ట్రాక్’పై క్లిక్ చేయండి. మీరు గందరగోళంగా ఉంటే, దిగువ సాధారణ దశలను అనుసరించండి.

మీ మొబైల్‌లో Google Chromeని తెరవండి
భారత ప్రభుత్వం యొక్క ‘పాస్‌పోర్ట్ సేవ’ (www.passportindia.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అక్కడ, ‘ట్రాక్ యువర్ అప్లికేషన్’ లింక్‌ని ఎంచుకోండి.
డ్రాప్-డౌన్ మెనులో అందుబాటులో ఉన్న ఎంపికల నుండి మీ పాస్‌పోర్ట్ రకాన్ని ఎంచుకోండి.
అక్కడ మీ పుట్టిన తేదీ మరియు మీ ఫైల్ నంబర్ (15 అంకెల సంఖ్య) నమోదు చేయండి.
మీరు ‘ట్రాక్ స్టేటస్’ని ఎంచుకున్నప్పుడు మీ అప్లికేషన్ యొక్క ప్రస్తుత స్థితిని వివరిస్తూ ఆన్-స్క్రీన్ సందేశం కనిపిస్తుంది.
పాస్పోర్ట్ పొందేందుకు అవసరమైన పత్రాలు

mPassport సేవా అప్లికేషన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు చాలా పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, ప్రస్తుత చిరునామా పత్రం తదితర పత్రాలు అవసరం. ఈ పాస్‌పోర్ట్‌లో పేరు, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జాతీయత, పాస్‌పోర్ట్ గడువు తేదీ, పాస్‌పోర్ట్ నంబర్, వ్యక్తి యొక్క పోర్ట్రెయిట్, సంతకం మొదలైనవి ఉంటాయి.

రోజుకు కొన్ని గంటలు సరిపోతుంది

మొత్తంమీద, సాంకేతికత చాలా వేగంగా మరియు సులభం. కేంద్ర ప్రభుత్వం మొబైల్ (mPassport సేవా) అప్లికేషన్‌లలో పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను అందించింది. మీరు పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పాస్‌పోర్ట్ పొందడానికి షెడ్యూల్ చేసిన రోజున కార్యాలయాన్ని సందర్శించవచ్చు. ఇప్పుడు పాస్‌పోర్టు పొందడం కొన్నేళ్ల క్రితం అంత కష్టం కాదు. దరఖాస్తు చేసి కొత్త పాస్‌పోర్ట్ పొందండి. దీనికి రోజుకు కొన్ని గంటలు సరిపోతాయి.

BRS MLC Kavitha: కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్

BRS MLC Kavitha: కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్

BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాలం కల్సి రావడం లేదు. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత ఈరోజైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురు చూశారు.

కానీ కోర్టు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత విషయంలో సానుభూతి చూపించొద్దని కోర్టులో ఈడీ,సీబీఐ తరుఫు లాయర్లు వాదించారు. ఈకేసులో ఇవాళ నిందితులంతా..సీబీఐ కోర్టు ముందుకు హాజరుకావాలని అంతకు ముందే న్యాయస్థానం చెప్పింది. నిందితులందరికీ ఇప్పటికే సమన్లు జారీ కూడా చేసింది. దాంతో పాటూ
ఇవాళ అనుబంధ ఛార్జ్‌షీట్‌పై కోర్టు విచారణ చేయనుంది. గత నెల 10న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రతోపాటు..మరో నలుగురిపై ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.లిక్కర్ స్కాంలో కవిత నేరాభియోగాలపై అదనపు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. స్కాం డబ్బు గోవా ఎన్నికలకు..ఏ విధంగా చేరిందో ఛార్జ్‌షీట్‌లో ఈడీ వివరించింది.

కౌంటింగ్ ముందే జగన్ సంచలన నిర్ణయం – ముఖ్య నేతలకు పిలుపు..!!

కౌంటింగ్ ముందే జగన్ సంచలన నిర్ణయం – ముఖ్య నేతలకు పిలుపు..!!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలు జగన్ తో చర్చించారు.

జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేసారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేసారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు..భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది.

జగన్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా రెండు రోజులు సమీక్ష చేసారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐప్యాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని…ఖచ్చితంగా భారీ విజయం నమోదు రాబోతోందని జగన్ విశ్వాసం వ్యక్తం చేసారు.

పార్టీ శాసనసభా పక్షభేటీ

ఇదే సమయంలో జగన్ పార్టీ నేతలకు కీలక సూచన చేసారు. రేపు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో…గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ తరువాత ప్రతీ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని..ఎంపీ అభ్యర్దులతో సహా అందరూ తాడేపల్లిలో అందబాటులో ఉండాలని సూచించారు. అదే విధంగా ఇప్పటికే జూన్ 9న జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కేటాయించారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్స్ లో వేదిక ఖరారు చేసారు.

పూర్తి ధీమాతో జగన్

ఎగ్జిట్ పోల్స్..ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా…తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని జగన్ ధీమాగా చెబుతున్నారు. పోలింగ్ సరళి..ఎగ్జిట్ పోల్స్ తరువాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనే టెన్షన్ పార్టీ ముఖ్యుల్లో కనిపిస్తోంది. కానీ, జగన్ లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమ లాంఛనం పూర్తి చేయటానికి ముహూర్తం కూడా సిద్దం చేసారు. దీంతో..అటు జగన్ విశ్వాసం..ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

School Admissions: ఆరేళ్ల నిబంధన అవసరమా?

ఇంతవరకు అయిదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఇక నుంచి ఆరేళ్లు నిండిన తరవాతే చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది. ఇది ఎంతవరకు అభిలషణీయమనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మారుతున్న కాలమిది. ప్రజల ఆశలూ ఆకాంక్షలను బట్టి చదువులూ మారాలి. అందుకు అనుగుణంగానే 2020లో జాతీయ విద్యావిధానాన్ని వెలువరించారు. ప్రస్తుత విజ్ఞానాధారిత ప్రపంచంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించి భారతదేశాన్ని విజ్ఞానపరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని ఈ విధానం ఉద్దేశిస్తోంది. 1986లో వెలువడిన జాతీయ విద్యావిధానం, 1992లో దానికి చేసిన సవరణ కూడా ఆశించిన ప్రయోజనాలను సాధించలేకపోయాయి. ఆ లోటును భర్తీ చేయడానికి 2020 విద్యావిధానం పూనుకొంది. 10+2 విధానానికి బదులు 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం విద్యార్థులకు చదువులో పునాది వేయడానికి అయిదేళ్లపాటు ‘ఫౌండేషనల్‌’ దశ ఉంటుంది. మూడేళ్లు సన్నాహక దశలో, మూడేళ్లు మాధ్యమిక దశలో, చివరి నాలుగేళ్లు సెకండరీ దశలో విద్యాభ్యాసం సాగుతుంది.

భవిష్యత్తుకు పునాది
విద్యాభ్యాసం పిల్లల నడవడికను మారుస్తుంది. సరైన విద్య బాలల మానసిక, శారీరక, భావోద్వేగ, నైతిక, సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. తార్కికంగా ఆలోచించడం, వివేచన జ్ఞానం నేర్పుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోపాటు సృజనాత్మకతనూ అది పాదుగొల్పుతుంది. బాలలు మొదట్లో తమ అవసరాల కోసమే మారాం చేస్తారు. వారిని ఇంటి నుంచి బడికి తీసుకువచ్చిన తరవాత నలుగురితో కలసిమెలసి ఉండటం నేర్చుకుంటారు. ఉత్తరోత్రా సమాజంలో బాధ్యతాయుత సభ్యుడిగా మెలగడానికి అక్కడే పునాది పడుతుంది. బాలబాలికలు ఎదిగేకొద్దీ ప్రతి దశలో వారి నడవడికలో మార్పులు వస్తాయి. ఇవి సరిగ్గా ఉండేలా చూడటానికి విద్య తోడ్పడుతుంది. పిల్లల ప్రవర్తనలో అభిలషణీయమైన మార్పులు రావడానికి కీలక సాధనమవుతుంది.

ఇక్కడ ప్రాథమిక దశ విద్యకు సంబంధించి డాక్టర్‌ కె.కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ పాఠ్యప్రణాళికా పథకాన్ని పరిశీలించాలి. దీని ప్రకారం, ఒకటో తరగతిలో చేరే బాలుడు లేదా బాలిక పరిశుభ్రతను నేర్చుకుని ఉండాలి. ఆహారాన్ని వృథా చేయకూడదు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రంగులు, ఆకృతులను గుర్తించడం, వివిధ గుర్తులను జ్ఞాపకం పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో ఏర్పడాలి. శారీరక చలనాలపై అదుపు, సమతూకం ఉండాలి. సొంత భావోద్వేగాలను గుర్తించగలగాలి. ఇతరుల భావాలను గౌరవించాలి. తాను కుటుంబంలో, సమాజంలో సభ్యుడిననే గ్రహింపుతో తోటి పిల్లలు, పెద్దవారితో చక్కగా మెలగాలి. చుట్టూ ఉన్న వస్తువులను, వాటి మధ్య సంబంధాలనూ గమనించగలగాలి. గణితాన్ని అర్థం చేసుకోవాలి. అంకెలను సరిగ్గా లెక్కపెట్టాలి. వివిధ వస్తువులను పోలికలను బట్టి సరైన గ్రూపులుగా, ఉప బృందాలుగా విభజించగలగాలి. వర్ణమాలలో అన్ని అక్షరాలను నేర్చుకోవాలి. రాయడం, చదవడంలో పట్టు సాధించాలి. అంతేకాదు, భాషాపరమైన నైపుణ్యాలను సంపాదించి అందరితో చక్కగా సంభాషించగలగాలి. చెప్పిన పనిని అర్థం చేసుకుని పూర్తిచేయగలగాలి. చిన్నచిన్న పాటలు, కవితలను పఠించడం, ఆలపించడం చేయాలి. తమ భావాలను చిత్ర రచన ద్వారా వ్యక్తం చేస్తుండాలి. ప్రభుత్వ ప్రమేయం లేని పాఠశాల పూర్వ దశలోనే బాలబాలికలు ఈ అంశాలన్నింటినీ నేర్చుకుంటున్నారు. దీనికి మూడేళ్లు అక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను అయిదేళ్లు రాకముందే ప్రీస్కూల్‌ విద్యలో చేరుస్తున్నారు. దీన్ని రెండు లేదా రెండున్నరేళ్లలోనే పూర్తిచేయిస్తున్నారు. చదువుకు వయసుతో నిమిత్తం లేదని అందరూ ఒప్పుకొంటారు. గతంలోకంటే ఇప్పుడు నేర్చుకోవడం చాలా సులభమైంది.

విద్యాహక్కు చట్టం-2009, సరికొత్త 5+3+3+4 విద్యావిధానం ప్రకారం ఒకటో తరగతిలో చేరే బాలబాలికలకు ఆరేళ్ల వయోపరిమితిని విధిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వివరిస్తోంది. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులు అయిదేళ్లు నిండిన పిల్లలనే ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు.

ప్రభుత్వాలు పునరాలోచించాలి…
బాలలకు ఆరేళ్లు నిండిన తరవాతే ఒకటో తరగతిలో చేర్పించాలనే ప్రభుత్వ ఆదేశం శాస్త్రీయంగానూ లేదు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగానూ లేదు. అయిదేళ్ల వయసులో చదువుసంధ్యలు నేర్చుకోవడానికి అడ్డుపడేదేమీ లేదు. ఆ వయసులో కూడా పిల్లలు తమ చుట్టూ ఉన్నదాన్ని నిశితంగా గమనించి విషయ పరిజ్ఞానం సంపాదించగలరు. కొన్ని సమయాల్లో వారి ఊహాచాతుర్యం పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రెండు నుంచి అయిదేళ్ల వయసులో పిల్లలు నర్సరీ స్కూళ్లలో చేరుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా కొత్తవారి మధ్య మసలుతూ లోకజ్ఞానం సంపాదిస్తున్నారు. అక్షరాలు, బొమ్మలు, తోటివారి సాంగత్యం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వారికి ఎంతగానో తోడ్పడుతోంది. ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమైన ఈ రోజుల్లో భార్యాభర్తలు పట్టణాలు, నగరాల్లో వృత్తిఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందువల్ల ఇదివరకటిలా పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి తల్లిదండ్రులు, తాతయ్య నాయనమ్మలు అందుబాటులో ఉండటం లేదు. లేటు వయసు వివాహాలవల్ల తాము పదవీ విరమణ పొందే లోపే పిల్లలను ఒక దారిలో పెట్టాలని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. వీరికి ప్రతి సంవత్సరమూ విలువైనదే. అందుకే ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరిమితి విధించడం వారికి మింగుడుపడటం లేదు. వాస్తవానికి ఈ నిబంధన తల్లిదండ్రులకు వరంగా కాక శాపంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు పునరాలోచన చేయాలి.

విద్య కోసం ఉన్నదంతా ఊడ్చి…

వృత్తి లేదా ఉద్యోగంలో స్థిరపడిన తరవాతే వివాహం చేసుకోవాలన్న భావన నేటి యువతలో ఉంది. దాంతో చాలామంది 30 ఏళ్ల తరవాతే పిల్లల్ని కంటున్నారు. వారి చదువులు పూర్తికాకముందే చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఆ తరవాత కూడా పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చుచేసే వారెందరో! ఏతావతా ఈనాటి తల్లిదండ్రులకు పిల్లల చదువు విషయంలో ఒక్క సంవత్సరం ఆలస్యమైనా భరించలేని స్థితి నెలకొన్నది. అందువల్ల పిల్లల్ని బడిలో చేర్చడానికి ఆరేళ్ల వరకు ఆగడం వారికి కష్టమే. కాబట్టి, పాఠశాలలో చేర్పించే అంశంపై ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించడం అవసరం. దిల్లీలో పాఠశాల పూర్వవిద్య, ప్రాథమిక విద్యపై నియమించిన అశోక్‌ గంగూలీ కమిటీ- ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు అయిదేళ్లు నిండాలని సిఫార్సు చేసింది.

డాక్టర్‌ జి.జగన్మోహనరావు
(ఉమ్మడి ఏపీలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి విశ్రాంత ఆచార్యులు)

ఐపీఎల్ తెలివితేటలు ప్రదర్శించకండి.. రోహిత్, హార్దిక్ లకు వార్నింగ్ ఇచ్చిన ద్రావిడ్

Rahul Dravid Warned on Handling Hardik Pandya-Rohit Sharma Situation: ఇది నిజమా? అంటే అవునని ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై ఇండియన్స్ అట్టడుగు ప్లేస్ కి వెళ్లిపోయింది.

ఈ జట్టులో నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అయినా సరే, కెప్టెన్సీ మధ్య వచ్చిన విభేదాలతో జట్టు మొత్తం రెండు గ్రూప్ లుగా విడిపోయింది. దీంతో ఎవరికి వారు ఒక మ్యాచ్ బాగా ఆడి, ఒక మ్యాచ్ చెడగొట్టారు. మొత్తానికి ముంబై జట్టు పేరంతా పోగొట్టారు.

ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చేశాడంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరిని పిలిచి..’ఐపీఎల్ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి’.. అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ చెప్పడం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

‘ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో’తో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. కోచ్ ద్రావిడ్ ఏం కోరుకుంటాడో దానిపైనే పాండ్యా నుంచి ఇతర ఆటగాళ్లు అందరూ దృష్టి పెట్టాలని సూచించాడు. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ కారణంగా అంతా జరిగిందనే భ్రాంతితో.. టీమ్ ఇండియాలో గ్రూపులు చేయవద్దని చెప్పినట్టు సమాచారం.

ఇక్కడ రోహిత్ శర్మ పాత్ర కన్నా ఫ్రాంచైజీ పాత్రే ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. హార్దిక్ పాండ్యా కూడా అత్యుత్సాహంతో గుజరాత్ ను వదిలి, ముంబై రావడం కూడా వ్యూహాత్మక తప్పిదమే అంటున్నారు. వస్తే తప్పు లేదు. 2025 జట్టుకి తను కాబోయే కెప్టెన్ గా చెప్పి, రోహిత్ శర్మని కొనసాగించి ఉంటే బాగుండేది. ఆ డీల్ సరిగా లేకపోవడంతో ఇంత పెంట జరిగింది తప్ప.. రోహిత్ తప్పు లేదని అంటున్నారు.

ఇదే షోలో పాల్గొన్న మ్యాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇర్ఫాన్ చెప్పింది నిజమేనని అన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏం జరిగిందనేది ఇక్కడ మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇప్పుడు కేవలం టీ 20 ప్రపంచకప్ ఎలా గెలవాలని మాత్రమేనని అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ అయిపోయిన చరిత్ర అన్నాడు. టీ 20 ప్రపంచకప్ ప్రస్తుత భవిష్యత్ అని తేల్చి చెప్పాడు.

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్‌లివే!

OTT upcoming movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్‌లివే!

ఫీల్‌ గుడ్‌ మూవీ ‘మనమే’
వైవిధ్యమైన కథలతో అలరించే కథానాయకుడు శర్వానంద్‌. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వా నటించిన తాజా చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. మనలో చాలా మందికి కనెక్ట్‌ అయ్యే కథతో రూపొందించిన చిత్రమని, కొత్తదనమున్న స్టోరీ, ఫ్రెష్‌ స్క్రిప్ట్‌ అని చెప్పలేను కానీ, ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌ అని నమ్మకంగా చెప్పగలనని శర్వానంద్‌ అంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ చిత్రానికి వెళ్తే మూడు తరాల వాళ్లు ఈ కథతో కనెక్ట్‌ అవుతారని అంటున్నారు.

సూపర్‌ హ్యూమన్‌ కథే ‘వెపన్‌’
సత్యరాజ్‌, వసంత్‌ రవి కీలక పాత్రల్లో గుహన్‌ సెన్నియ్యప్పన్‌ రూపొందించిన చిత్రం ‘వెపన్‌’. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం. దర్శకుడు గుహన్‌ సరికొత్త విజన్‌తో దీన్ని ఆవిష్కరించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. దీంట్లో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌తో పాయల్‌
పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ‘ఒక పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో పాయల్‌ శక్తిమంతమైన పోలీసుగా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుంది’ అని చిత్ర బృందం తెలిపింది.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు /వెబ్‌ సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)- జూన్‌ 03
హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05
హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05
బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06

స్వీట్‌ టూత్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 06
హిట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)- జూన్‌ 07
పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07
అమెజాన్‌ ప్రైమ్‌

మైదాన్‌ (హిందీ)- జూన్‌ 05
డిస్నీ+హాట్‌స్టార్‌

గునాహ్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05
క్లిప్ప్‌డ్‌- (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04
ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05

సోనీలివ్‌

గుల్లక్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 07
వర్షన్గల్కు శేషం (మలయాళం)- జూన్‌ 07
ఆహా

బూమర్‌ అంకుల్‌ (తమిళ)- జూన్‌07
బుక్‌ మై షో

ఎబిగైల్‌ (హాలీవుడ్)- జూన్‌ 07
జియో సినిమా

బ్లాక్‌ అవుట్‌ (హిందీ)- జూన్‌ 07

‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’ ఎగ్జిట్‌ పోల్‌పై సజ్జల అసహనం

Sajjala: ‘మాకు దయతో రెండు స్థానాలిచ్చారేమో..!’ ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌పై సజ్జల అసహనం

అమరావతి: ‘ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు.. నవ్వొచ్చింది. ఆ ఫలితాల్లో వైకాపాకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు. అవి కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదు. మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదు అనుకున్నారేమో’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్‌ పోల్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో భాజపా పెట్టుకున్న 400 సీట్ల లక్ష్యం కోసం నంబర్లను సర్దుకుంటూ వెళ్లారేమోనని మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈసీ ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లుంది
‘పోస్టల్‌ బ్యాలట్లకు సంబంధించి తన మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా ఈసీ జారీచేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయి. ఈ ఆదేశాలు తికమక పెట్టడానికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్, ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది. సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుంది? ఈసీ నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారు. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు. కానీ అధికారులు మాత్రం సీల్‌అవసరం లేదని చెప్పారు. అదీ మన రాష్ట్రంలోనే. అందుకే దీన్ని సవాలు చేశాం. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు. సుప్రీంకోర్టులో వేశాం. ఏం వస్తుందనేది నేడో, రేపో తెలుస్తుంది’ అని తెలిపారు.

ఏపీలో పిడుగుపాటుకు నలుగురి మృతి

ఏపీలో పిడుగుపాటుకు నలుగురి మృతి

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి.

సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు.

మరోవైపు ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది.

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది

శునకానికి అరుదైన గుండె శస్త్రచికిత్స

సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి దిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి.

దిల్లీ: సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి దిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఏడేళ్ల వయసున్న జూలియట్‌ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్‌ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కుక్కల్లో వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80 శాతంగా ఉంది. దీనివల్ల గుండె ఎడమ ఎగువ గదిలో రక్తప్రవాహం వెనక్కి మళ్లుతుంది. ఈ వ్యాధి ముదిరేకొద్దీ ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగిపోతుంది. క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమస్య ఉన్న జూలియట్‌కు దిల్లీలోని మ్యాక్స్‌ పెట్జ్‌ ఆసుపత్రి నిపుణులు.. ట్రాన్స్‌కెథతర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపెయిర్‌ (టీఈఈఆర్‌) అనే ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు.

శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి దీన్ని చేపట్టారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను పూర్తిచేశారు. గత నెల 30న ఈ శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

డాక్టరేట్ పొందిన చేతులతోనే…సపోటాలు అమ్ముతూ…

డాక్టరేట్ పొందిన చేతులతోనే…సపోటాలు అమ్ముతూ…

తిరువూరు టౌన్ (ఎన్. టీ. ఆర్ జిల్లా )

పట్టణంలోని మధిర రోడ్ సమీపంలో తాజాగా ఉన్న సపోటాలు కొందామని బండి దగ్గరకు వెళ్ళా.వాటిని కొనే ముందు సపోటాలు అమ్మే వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడాను.

ఎటువంటి రసాయన పదార్దాలు కలపకుండా, సహజ పద్ధతిలో తనకున్న కొద్దిపాటి పొలంలో కొన్ని రకాల పండ్లను, మరికొన్ని రకాల కూరగాయలను పండిస్తూ, వాటిపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తున్నాని ఆయన చెప్పాడు. అతనితో మాట్లాడిన తర్వాత సమాజంపట్ల అతనికి బాగా అవగాహన ఉందనిపించింది.

మా మాటల మధ్యలో రమేష్ అనే మిత్రుడు అక్కడికి వచ్చాడు. సపోటాలు అమ్ముకునే వ్యక్తి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నాకు చెప్పాడు.అతని పేరు బి.దుర్గారావు అని, తనకు మంచి మిత్రుడు అని చెప్పాడు.

మిత్రుడు రమేష్ మాటల్లో దుర్గారావు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

దుర్గారావు ఏ. కొండూరు మండలంలోని కొండూరు తండాలో జన్మించారు. చిన్న తనం నుంచి ఆయనకు చదువంటే ఇష్టం. కంభంపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి, అదే గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. పాల్వంచలో డిగ్రీ చేశాడు.అంతటితో చదువు ఆపితే, అతనో సాధారణ వ్యక్తిగా మిగిలేవాడు.

ఒకవైపు పేదరికం అతన్ని వెంబడిస్తున్నా, పట్టు వదలకుండా హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ లో పీ.జి పొంది ఎం. ఏ (హిందీ )పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా ఆదే యూనివర్సిటీలో ఎం ఫిల్ చేశాడు. అంతే ఉత్సాహంతో సెంట్రల్ యూనివర్సిటీలోనే “ఆదివాసీల స్థితిగతులు -వారి అభివృద్ధి “అనే అంశంపై పి. హెచ్ డి చేసి 2016లో డాక్టరేట్ పొందాడు.అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో దుర్గారావు అనారోగ్యం పాలయ్యాడు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన జీవనోపాధి కోసం తన దృష్టిని కొంతకాలం వ్యవసాయం వైపు మరల్చాడు.సేంద్రియ పద్ధతి లో సాగు చేస్తూ, జీవనం గడుపుతున్నాడు.ఒకవైపు సపోటాలను అమ్ముతూనే,విష రసాయన పదార్ధాలతో పండించిన పండ్లు, కూరగాయలు తింటే వచ్చే నష్టాలని ప్రజలకు వివరిస్తున్నాడు దుర్గారావు.ఏదో ఒక రోజు తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతానని ఆయన ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు.

రమేష్ చెప్పిన తర్వాత దుర్గా రావు పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది. ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని దుర్గారావును కలిసిన రచయిత, జెవివి ప్రతినిధి యం. రాం ప్రదీప్ అన్నారు.

ఓ సామాన్య గిరిజన కుటుంబం లో పుట్టిన దుర్గారావు ఎంచుకున్న గమ్యం ఎందరికో స్ఫూర్తి అని చెప్పవచ్చు.

మందడపు రాంప్రదీప్
తిరువూరు

Toll Tax Hike: టోల్‌ ఫీజుల మోత మొదలు.. నేటి నుంచి 5% పెంపు

అమరావతి: రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో ఫీజుల పెంపు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత.. అంటే ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల పెంపు అమలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జూన్‌ ఒకటిన చివరి విడత పోలింగ్‌ ముగిసేవరకు టోల్‌ ఫీజుల పెంపు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీంతో ఆదివారం నుంచి ఫీజుల పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 70 టోల్‌ ప్లాజాలు ఉండగా వీటిలో ఐదు మినహా, మిగిలిన అన్నింటా ఆయా వాహనాలకు ప్రస్తుతమున్న టోల్‌ ఫీజుల్లో సగటున 5% వరకు పెంపు అమల్లోకి వచ్చినట్లు అయింది. ఇది వచ్చే ఏడాది మార్చి చివరి వరకు కొనసాగుతుంది. మరోవైపు నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న ఐదు టోల్‌ప్లాజాల్లో మాత్రం ఫీజులను జులై, ఆగస్టు మాసాల్లో సవరిస్తారు.

ఎక్స్‌ప్రెస్‌ వేలపై 5% పెంపు
దిల్లీ: ఎక్స్‌ప్రెస్‌ వేలను ఉపయోగించే వాహనదారులు ఇకపై 5% అదనంగా టోల్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 3 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారి ఒకరు తెలిపారు. జాతీయ రహదారులపై మొత్తం 855 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 180 ప్లాజాలను గుత్తేదారులు నిర్వహిస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌ టోల్‌ఛార్జీల పెంపు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఛార్జీలను ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ఆదివారం ప్రకటించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ సంస్థ గత ఏడాది 30 ఏళ్ల లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెలుసుబాటు సంస్థకు ఉంది. దీనిలో భాగంగా పెంచిన కొత్త ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

NATS: నాట్స్‌ అధ్యక్షుడిగా మదన్‌ పాములపాటి

నాట్స్‌ (నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ) అధ్యక్షుడిగా మదన్‌ పాములపాటి ఎంపికయ్యారు. 2024-26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్‌ బోర్డు పేర్కొంది.
నాట్స్‌ షికాగో విభాగంలో చురుగ్గా వ్యవహరించే మదన్‌ పాములపాటి.. గతంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. రెండుసార్లు నాట్స్‌ కోశాధికారి, సంబరాల కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడి(సేవలు)గా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో నాట్స్‌ అధ్యక్ష పదవికి బోర్డు ఆయనవైపు మొగ్గు చూపింది.
నాట్స్‌ ఈవీపీగా శ్రీహరి మందాడి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు భీమినేని(ఆపరేషన్స్‌), హేమంత్‌ కొల్లా(ఆర్థికం), భానుప్రకాశ్‌ ధూళిపాళ్ల(మార్కెటింగ్‌), శ్రీనివాస్‌ చిలుకూరి(ప్రోగ్రామ్స్‌), కార్యదర్శిగా రాజేశ్‌ కాండ్రు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మురళి మేడిచర్ల(మీడియా), రవి తుమ్మల(వెబ్‌), ట్రెజరర్‌గా సుధీర్‌ మిక్కిలినేని, సంయుక్త ట్రెజరర్‌గా రవి తాండ్ర నియమితులయ్యారు.
కార్యవర్గంలో శ్రీనివాస్‌ మెంటా, వెంకటరావు దగ్గుబాటి, సుమంత్‌ రామినేని, సత్య శ్రీరామనేని, శ్రీహరీష్‌ జమ్ముల, మనోహర్‌రావు మద్దినేని, భాను లంకా, ఎమ్మాన్యుయెల్, కిశోర్‌ నారె, సంకీర్థ్‌ కటకం, కిరణ్‌ మందాడి, ఆర్‌కే బాలినేని, రాజలక్ష్మి చిలుకూరి, కిశోర్‌ గరికపాటి, వెంకట్‌ మంత్రి, ఫాలాక్ష్‌ అవస్థి వివిధ బాధ్యతలు చేపట్టనున్నారు.

Trump: ‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్‌ పరోక్ష హెచ్చరిక!

వాషింగ్టన్‌: తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ నేత ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో (Trump Hush Money Case) న్యూయార్క్‌ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

ఆవేదనలో మెలానియా..
ట్రంప్‌నకు జైలు శిక్ష పడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దానిపై తొలిసారి స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తనపై నేరారోపణలు, న్యాయపరమైన చిక్కుల వల్ల సతీమణి మెలానియా ట్రంప్‌ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మొత్తం కుటుంబంపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపుతోందని వెల్లడించారు. తన కంటే తన కుటుంబమే ఎక్కువ క్షోభ అనుభవిస్తోందని చెప్పుకొచ్చారు.

స్టార్మీ డానియల్స్‌ తొలి స్పందన..
ట్రంప్ దోషిగా తేలడంపై స్టార్మీ డానియల్స్‌ తొలిసారి స్పందించారు. ఇంత త్వరగా తీర్పు వెలువడటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనకు జైలు శిక్ష విధించాలని కోరారు. పేదవారికి సేవ చేసే బాధ్యతను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ దోషిగా తేలినంత మాత్రాన తనకు ఈ కేసు ముగిసినట్లు కాదని వ్యాఖ్యానించారు. ‘‘ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు. నేను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి’’ అని అన్నారు.

టిక్‌టాక్‌లోకి ట్రంప్‌..
ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌లో ట్రంప్‌ ఖాతా తెరిచారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెవార్క్‌లో జరిగిన ‘‘అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌’’ వేదిక నుంచి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ఆయన తన అభిమానులకు అభివాదం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. శనివారం సాయంత్రం ఈ వీడియోను పోస్ట్‌ చేయగా.. ఆదివారం ఉదయానికల్లా ఆయన టిక్‌టాక్‌లో 1.1 మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ వీడియోకు 1 మిలియన్‌ లైక్స్‌, 24 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లకు చేరువకావడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నట్లు ట్రంప్‌ అధికార ప్రతినిధి స్టీవెన్‌ చెంగ్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్‌టాక్‌ను నిషేధించే దిశగా ట్రంప్‌ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న రాకాసి అల

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న రాకాసి అల

విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని.. అంతలోనే మృత్యువు కెరటం రూపంలో బలి తీసుకుంది. అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణరావు కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తీడకు చెందిన ఎన్‌.కనకదుర్గ (27), మాకవరపాలెం మండలం శెట్టిపాలేనికి చెందిన ఎండపల్లి నూకరత్నం (24) అక్కాచెల్లెళ్లు. వీరితోపాటు ఎలమంచిలి మండలం గొల్లలపాలేనికి చెందిన ద్వారంపూడి శిరీష (23).. తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి-వాడపాలెం తీరంలో గడపడానికి ఆదివారం వచ్చారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపిన కుటుంబ సభ్యులు.. ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లారు.

నూకరత్నం, శిరీష, కనకదుర్గ ఫొటో తీసుకునే సమయంలో రాక్షస కెరటం వీరిపై ఎగిసిపడింది. అల ఉద్ధృతికి వారు నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు వెంటనే పరవాడ ఆసుపత్రికి.. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నూకరత్నం, కనకదుర్గ మృతిచెందారు. శిరీష ప్రాణపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కనకదుర్గకు భర్త గణేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బంపరాఫర్.. 5 వేల ఇయర్ బడ్స్ 800కే.. త్వరపడండి

బంపరాఫర్.. 5 వేల ఇయర్ బడ్స్ 800కే.. త్వరపడండి

మంచి మ్యూజిక్ మనసుకు ఎంతో హాయిని కలుగ చేస్తుంది. ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలల్లో, ఆ తర్వాత టీవీల్లో, టేప్ రికార్డ్స్ వంటి వాటిని వాడుకునే వారు. కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎప్పుడంటే అప్పుడు సాంగ్స్ వినే సౌకర్యం కలిగింది. సంగీతాన్ని మరింత ఎంజాయ్ చేసేందుకు ఇయర్ ఫోన్, ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇయర్ బడ్స్ ను చెవిలో పెట్టుకుని తమక నచ్చిన పాటలు వింటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే బంపరాఫర్ అందుబాటులో ఉంది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ 800కే వచ్చేస్తున్నాయి.

బౌల్ట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అధునాతన ఫీచర్లు ఉండడంతో వీటి కొనుగోలుకు ఎక్కువ మంది ఇంట్రస్టు చూపిస్తున్నారు. మరి మీరు కొత్త ఇయర్ బడ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బౌల్డ్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. బౌల్డ్ ఆడియో జెడ్ 20 మోడల్ ఇయర్ బడ్స్ పై 84 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 5499గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు వీటిని రూ. 899కే సొంతం చేసుకోవచ్చు. 51 గంటల ప్లే టైమ్ ను కలిగి ఉంది. ఇది పరిమిత కాలపు ఆఫర్.

51 గంటల ప్లేటైమ్‌తో, ఈ ఇయర్‌బడ్‌లు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ జర్నీ చేసే టైమ్ లో ఉపయోగకరంగా ఉంటాయి. మ్యూజిక్ లవర్స్ కు ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లలో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కాల్ క్వాలిటీ బాగుంటుంది. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ తో ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఇయర్ బడ్స్ ను ట్యాప్ చేస్తూ నియంత్రించొచ్చు. IPX5 వాటర్ రెసిస్టెంట్ ను అందించారు. ఏడాది వారంటీతో వస్తుంది. మరి మీరు ఈ ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తాజాగా మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!

Andhra Pradesh: తాజాగా మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం జరిగే సెక్యూరిటీ వేలంలో పాల్గొననుంది. 18, 20, 22, 25 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సేకరించనుంది. దీంతో కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.25 వేల కోట్లు అప్పులు చేసినట్టు లెక్క. ఈ నిధులు బుధవారం ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.

సొంత గుత్తేదార్లకు చెల్లించేందుకే: జీవీ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తాజాగా సేకరిస్తున్న రూ.4 వేల కోట్ల రుణాన్ని తన అనుకూల గుత్తేదార్లకు చెల్లించాలని యోచిస్తోందని తెదేపా నాయకుడు జీవీ రెడ్డి ఆరోపించారు. ‘సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈ సొమ్మును వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు బదలాయించనుంది’ అని ఆరోపించారు.

ఎస్పీ కార్యాలయంలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఎస్పీ కార్యాలయంలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ వేదవతి (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న గార్డు డ్యూటీ గదిలోనే ఆమె తన గన్‌తో కాల్చుకున్నారు. గార్డు గది నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్యాలయంలో ఉన్న పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే వేదవతి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే ఆమె భర్త దస్తగిరికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. రాయచోటి పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతికి మదనపల్లెకు చెందిన దస్తగిరితో ఏడేళ్ల కిందట ప్రేమ వివాహమైంది. వీరికి అయిదేళ్ల కుమార్తె ఉన్నారు.

దస్తగిరికి వేదవతి రెండో భార్య అని పోలీసులు చెబుతున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో వేదవతి సెల్‌ఫోన్‌లో మాట్లాడారని, ఆ సమయంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ వేదవతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

Sabari : ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ థ్రిల్లర్ శబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Sabari : ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Sabari : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి.అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించారు.సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్‌, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు.
మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన శబరి మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.సినిమాలో వచ్చే ట్విస్ట్స్ కూడా అదిరిపోయినట్లు ప్రేక్షకులు తెలిపారు.

అయితే కథలో కొత్తదనం లేకపోవటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
శబరి మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.శబరి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 14 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
త్వరలోనే శబరి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్?

దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాహనాల వినియోగం గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంత తక్కువగా ఉందనే తెలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్న సమయంలో కొందరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 10 సంవత్సరాల్లో.. డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.

మార్కెట్లో బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర వాహనాలు కూడా తప్పకుండా ఈవీల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ వాహనాల కోసం పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ కార్ల కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. గడ్కరీ హిమాచల్ ప్రదేశ్‌లోని బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెండానికి కేంద్రం ఇప్పటికే సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడ్డాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

కొత్త ఈవీ పాలసీలు ఆమోదం పొందిన తరువాత ఈవీల సేల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మాత్రమే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలు కూడా ఇదే విధాన్ని పాటించడానికి సుముఖత చూపుతున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విరివిగా అందుబాటులో లేదు. ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారు ఛార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా లేదనే కారణంగానే.. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం చెప్పినట్లు 2034 నాటికి డీజిల్, పెట్రోల్ కార్లను తొలగించాలంటే.. కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Shiva Lingam:శివలింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

Shiva Lingam:శివ లింగం విషయానికి వచ్చేసరికి అనేక విశేషార్దాలు ఉన్నాయి. ఈ అర్ధాల్లో అనేక అపార్ధాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు గణిత శాస్త్రం ప్రకారం శివ లింగం ఆకారం గురించి చర్చిద్దాం.

శివ లింగం ఆకారం
మనం సాదారణంగా శివలింగాన్ని ఏ ఆకారంలో చూస్తాం? మనం సాదారణంగా ఏ గుడిలోనైన దీర్ఘవృత్తభం లేదా ఒక గుడ్డు ఆకారంలో చూస్తూ ఉంటాం. మనం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో ఈ విధంగానే చూస్తాం.

గోళాకార శివలింగం
గోళాకార శివలింగం గురించి కొంత ఆసక్తి ఉంది. ఈ ఆకారం దేనితో అయినా సంబంధం ఉందేమో అనే విషయం గురించి మాట్లాడుకుందాం.

గోళం ఆకారంలో ఎందుకు ఉంది
గణితం ప్రకారం ఒక గోళము పరిపూర్ణమైన ఆకారాన్ని సూచిస్తుంది. ఇది గరిష్ట ప్రాంతంలో ఉండుట వలన ఖచ్చితంగా ఉంటుంది.

సాదారణ ఉదాహరణ
ఈ ప్రపంచంలో ప్రతి మూలకం గోళం యొక్క ఆకృతిని పొందటానికి ప్రయత్నిస్తుంది. స్వేచ్చగా పడుతున్న నీటి చుక్కను చూస్తే అది కూడా గోళం ఆకృతిలో ఉంటుంది.

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
గోళాకారం ఆధ్యాత్మికతకు పరిపూర్ణమైన ప్రాతినిత్యాన్ని వహిస్తుంది. అది దేవుని యొక్క నిరాకర అంశమును సూచిస్తుంది. ఇది విశ్వం పుట్టక ముందే ఈ స్థితిలో ఉంది.

ఎలిపిసోడ్ ఆకారం
ఎలిపిసోడ్ ఆకారం అనేది ఒక గోళం యొక్క పరిపూర్ణ ఆకారంలో ఉంటుంది. ఇది రెండు కేంద్రాలను కలిగి ఉంటుందని నమ్మకం.

సాదారణ ఉదాహరణ
ఒక గుడ్డు ఎలిపిసోడ్ యొక్క పరిపూర్ణ ఉదాహరణ అని చెప్పవచ్చు. గుడ్డును టేబుల్ మీద పెట్టినప్పుడు అది సమతుల్యంగా ఉండదు. ఎందుకంటే దానికి అంచులు ఉండవు.

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
కాబట్టి, ఖచ్చితమైన మరియు రూపం లేకుండా ఉండే విధంగా సృష్టి జరిగింది. దాంతో వక్రీకరణ రూపం తలెత్తింది. గోళం నుంచి అది ఒక ఎలిపిసోడ్ రూపంలోకి మార్చబడుతుంది.

శివ లింగం ఆకారం
కాబట్టి, నిజానికి శివ లింగం విశ్వాన్ని సూచిస్తుంది. ఇది రూపం మరియు నిరాకర రూపాన్ని కలిపే గుర్తు. గోళం నుండి ఎలిపిసోడ్ వరకు మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Health

సినిమా