Saturday, November 16, 2024

పెద్ద కల కనటం తప్పా అంటున్న సూర్య.! 2000 కోట్ల క్లబ్ కామెంట్స్

ప్రజెంట్ పాన్ ఇండియా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు.
కంగువతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కోలీవుడ్ స్టార్‌ హీరో.. సౌత్‌లో రేర్ రికార్డ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.

ప్రజెంట్ పాన్ ఇండియా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు.

కంగువతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కోలీవుడ్ స్టార్‌ హీరో.. సౌత్‌లో రేర్ రికార్డ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.

టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విషయంలో చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఫస్ట్ టైమ్ సూర్య పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుండటంతో వసూళ్లు విషయంలోనూ బిగ్ నెంబర్స్‌ను టార్గెట్ చేస్తోంది.

ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పుడే కంగువ 2000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. తనకు కంగువ కంటెంట్ మీద అంత నమ్మకం ఉందన్నారు.

అయితే ఈ కామెంట్స్ మీద తమిళ మీడియాలోనూ విమర్శలు వినిపించాయి. ఇప్పటి వరకు వెయ్యి కోట్లు కూడా లేని కోలీవుడ్‌లో రెండు వేల కోట్ల కలెక్షన్స్ అయ్యే పనేనా అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

2000 కోట్ల కామెంట్స్ మీద వస్తున్న విమర్శలపై స్పందించారు సూర్య. పెద్ద కలలు కనటం నేరమా అంటూ… నిర్మాత చేసిన కామెంట్స్‌కు మద్దతు పలికారు. అలా జరగాలని కోరకుందాం అన్నారు సూర్య.

మరి కంగువ టీమ్ కల నిజమవుతుందా..? ఈ 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 14న రిలీజ్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

మార్కెట్లో రచ్చ చేస్తున్న కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ బడ్జెట్‌లో ఇలాంటి ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది ఒప్పో ఏ3ఎక్స్‌ పేరుతో 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.

తక్కువ బడ్జట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఒప్పో ఏ3ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

కెమెరా పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌కు సపోర్ట్‌ చేసే రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999గా నిర్ణయించారు.

మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.

గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌

దీపావళి, ఛత్ వంటి పెద్ద పండుగలలో రైలు ప్రయాణం అంటే పెద్ద సవాలే. ఎందుకంటే టికెట్స్‌ దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పండగలకు ముందస్తుగానే బుక్‌ చేసుకుంటే తప్ప టికెట్‌లు కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి.

మీరు కూడా ఈ దీపావళి లేదా ఛత్ ఇంటికి వెళ్లాలని భావిస్తే, కన్ఫర్మ్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ప్రయాణీకులకు ఉపశమనం కలిగించడానికి కన్ఫర్మ్‌ టికెట్స్‌ పొందడానికి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే (IRCTC) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. దీనికి వికల్ప్ స్కీమ్ అని పేరు పెట్టారు. రైలు టికెట్‌ బుక్‌ చేసుకుని వెయిట్‌లిస్ట్‌లో ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం టికెట్స్‌ కన్ఫర్మ్ అయ్యేలా ఈ పథకం ఉపయోగపడుతుంది.

వికల్ప్ పథకం అంటే ఏమిటి?

వికల్ప్ స్కీమ్ అనేది IRCTC తీసుకువచ్చింది. ఇది వారు ప్రయాణించే రైలులో కన్ఫర్మ్‌ అయ్యే సీటును పొందలేని ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ రైళ్ల ఆప్షన్‌ను అందించడానికి రూపొందించారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను అదే మార్గంలో అందుబాటులో ఉన్న సీట్లతో ప్రత్యామ్నాయ రైళ్లకు బదిలీ చేయడానికి ఈ పథకం సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ఆప్షన్‌ మీ సీటును కన్ఫర్మ్‌ చేయదు. కానీ కన్ఫర్మ్ సీటు పొందే అవకాశాలను మాత్రమే పెంచుతుంది.

వికల్ప్ పథకం ఎలా పని చేస్తుంది?

ఒక ప్రయాణికుడు వికల్ప్ స్కీమ్‌ను ఎంచుకున్నప్పుడు అతని వెయిట్‌లిస్ట్ టిక్కెట్టు సీట్లు అందుబాటులో ఉన్న మరొక రైలుకు మారుస్తుంది. అంటే అదే మార్గంలో నడిచే మరో రైలులో టికెట్లు కర్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయన్నట్లు. దీపావళి, ఛత్ వంటి అత్యంత రద్దీగా ఉండే పండుగల సమయంలో ప్రజలు చివరి నిమిషంలో టిక్కెట్ కన్ఫర్మ్‌ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ రైలులో సీట్లు అందుబాటులో ఉంటే అందులో ప్రయాణికుల టిక్కెట్ ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్‌ అవుతాయి. అయితే, టికెట్ కన్ఫర్మ్ అయి, తర్వాత క్యాన్సిల్ అయినట్లయితే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.

వికల్ప్ పథకాన్ని ఎలా ఉపయోగించాలి?

IRCTC రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు వికల్ప్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి దశల వారీ ప్రక్రియ ఉంటుంది.:

1. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించి లాగిన్ చేయండి.

2. మీ ప్రయాణ తేదీ, గమ్యం, కేటగిరిని ఎంచుకోండి.

3. మీ బుకింగ్‌ని నిర్ధారించడానికి ప్రయాణికుల వివరాలను నమోదు చేసి చెల్లింపు చేయండి.

4. ప్రాంప్ట్ చేసినప్పుడు ఎంపిక పథకం ఆప్షన్‌ను ఎంచుకోండి.

5. ప్రత్యామ్నాయ రైళ్ల జాబితా ఇక్కడ కనిపిస్తుంది. మీకు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ రైలును ఎంచుకోండి.

6. చార్ట్ సిద్ధమైన తర్వాత ప్రత్యామ్నాయ రైలులో మీ బుకింగ్ కన్ఫర్మ్‌ అయ్యిందో లేదో చూడటానికి మీ PNR ద్వారా చెక్‌ చేసుకోండి.

వికల్ప్ పథకం ప్రత్యేక లక్షణాలు:

1. ఇది మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2. వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికులకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

3. ఈ స్కీమ్‌లో చేరడానికి ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

4. ఆప్షన్‌ను ఎంచుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్ల కోసం స్వయంచాలకంగా పరిగణిస్తారు.

5. ఒకసారి ప్రత్యామ్నాయ రైలుకు మారిన తర్వాత, ప్రయాణికులు ముందుగా వెళ్లాలనుకున్న రైలులో ఎక్కలేరని గుర్తించుకోండి.

6. ఈ సదుపాయం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టికెట్లకు కన్ఫర్మ్‌ అయ్యేలా ఉపాయోగపడుతుంది.

రూ.181 ప్లాన్‌తో 22 కంటే ఎక్కువ OTTలు.. అదనపు డేటా

భారతి ఎయిర్‌టెల్‌కు పెద్ద ప్రీపెయిడ్ యూజర్ బేస్ ఉంది. కంపెనీ తన సబ్‌స్క్రైబర్‌లకు అనేక ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే వినియోగదారులు ఎంచుకున్న ప్లాన్‌లతో మాత్రమే ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాన్ని పొందుతున్నారు.

వినియోగదారులు రూ.200 కంటే తక్కువ ధరకు 22 కంటే ఎక్కువ OTT సేవల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ వినియోగదారులు అనేక ఓటీటీ సర్వీస్‌లకు సభ్యత్వాన్ని పొందేందుకు, Airtel Xstream Playతో ఒకే యాప్‌లో కంటెంట్‌ను చూసే ఆప్షన్‌ను పొందుతారు. దీని కోసం Xstream Play ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. విశేషమేమిటంటే, ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లు రూ. 200 కంటే తక్కువ ధరతో ప్రారంభమవుతాయి.

ఉచిత OTTలతో Airtel చౌక ప్లాన్

మీరు ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్ అయితే, అదనపు డేటాతో ఉచిత ఓటీటీలను పొందాలనుకుంటే మీరు కేవలం రూ.181 విలువైన ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 15GB అదనపు డేటా ఇందులో వస్తుంది. డేటా మాత్రమే ప్లాన్ అయినందున, ఇది కాలింగ్ లేదా SMS వంటి ప్రయోజనాలను అందించదు. అదనపు ప్రయోజనంగా ఈ ప్లాన్ పూర్తి 30 రోజుల పాటు Airtel Xstream Play ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీనితో మీరు 22 కంటే ఎక్కువ ఓటీటీ సేవల ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే వాటి కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఓటీటీ సేవల జాబితాలో SonyLIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt మొదలైనవి ఉన్నాయి.

ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే ఎంపిక

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌తో 22 కంటే ఎక్కువ ఓటీటీ సేవలకు యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు రూ.149 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ కేవలం 1GB అదనపు డేటాను మాత్రమే అందిస్తోంది. దీని చెల్లుబాటు ఇప్పటికే ఉన్న యాక్టివ్ ప్లాన్‌కు సమానంగా ఉంటుంది. అయితే ఓటీటీ ప్రయోజనాలు మునుపటి ప్లాన్ లాగా 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

పర్యాటకులకు గుడ్ న్యూస్.. సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం షురూ.. ఎప్పుడంటే

పర్యాటకుకు గుడ్ న్యూస్.. ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడాన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కోరుకుంటారు.

నాగార్జున సాగర్‌ – శ్రీశైలం ప్రయాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. అలాంటి మధురానుభూతిని పర్యాటకులకు కల్పించేందుకు తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను పర్యాటకశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ నవంబర్ 2, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా 9848540371 లేదా 9848306435 నెంబర్లను సంప్రదించాలి. marketing@tgtdc.in కు మెయిల్ కూడా చేయవచ్చని పర్యాటకశాఖ పేర్కొంది.

దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య.. ఎస్‌బీఐ కీలక రిపోర్ట్‌!

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2013 ఆర్థిక సంవత్సరంలో మిలియనీర్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 44 వేలు మాత్రమే కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.2 లక్షలకు చేరుకుంది.

కేవలం 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ధనికులపై సంపదను కురిపించింది. ఎస్‌బీఐ ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికలో అసెస్‌మెంట్ సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించిన వ్యక్తులందరూ ఉన్నారు.

SBI ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, పన్ను వ్యవస్థలో నిరంతర మెరుగుదలల కారణంగా ప్రత్యక్ష పన్ను వాటా మొత్తం పన్ను ఆదాయంలో 56.7 శాతానికి పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 54.6 శాతంగా ఉంది. అలాగే ఈ సంఖ్య 14 ఏళ్లలో అత్యధికం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ పన్ను వసూళ్లను అధిగమించాయి. అంతేకాకుండా, ఒక దశాబ్దంలో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా 2.3 రెట్లు పెరిగింది. 2024 మదింపు సంవత్సరంలో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8.62 కోట్లకు పెరిగింది. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికే అత్యధికంగా పెంపుదల ఉంది.

దేశంలో మధ్యతరగతి విభాగం వేగంగా వృద్ధి చెందుతోందని నివేదికలో పేర్కొన్నారు. 2014 అసెస్‌మెంట్ సంవత్సరంలో రూ. 1.5 నుండి 5 లక్షల ఆదాయం ఉన్నవారు 2024 అసెస్‌మెంట్ సంవత్సరంలో రూ.2.5 నుండి 10 లక్షల ఆదాయ సమూహంలోకి వచ్చారు. అంతేకాకుండా మొత్తం పన్ను చెల్లింపుదారులలో మహిళా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 15 శాతానికి పెరిగింది. ఐటిఆర్ ఫైలింగ్‌ల సంఖ్య ఏటా పెరుగుతోందని ఎస్‌బిఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. అట్టడుగు ఆదాయ వర్గాల వారి కోసం పథకాలు రూపొందించి వారి ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసింది.

దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు:

ఇటీవల విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. 2023 సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్యకు 75 కొత్త బిలియనీర్లు చేరారు. ఈ జాబితాలో మొత్తం 97 మంది నగర ప్రజలు ఉన్నారు. ఈ సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఈ ఏడాది 7.3 కోట్ల మంది ఐటీఆర్‌ దాఖలు చేశారు. మార్చి 2025 నాటికి ఈ సంఖ్య 9 కోట్లు దాటవచ్చు.

జియో దీపావళి కానుక.. రూ.101కే అపరిమిత 5G డేటా

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దీపావళి ఆఫర్‌గా ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతకుముందు సెప్టెంబర్‌లోనే కంపెనీ ఎయిర్‌ఫైబర్‌తో 1 సంవత్సరానికి ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

అదే సమయంలో దీపావళికి ముందు జియో అనేక ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో వినియోగదారులకు అపరిమిత డేటా ప్లాన్‌ను అందించే ప్లాన్ కూడా ఉంది. కస్టమర్‌లు ఇంటర్నెట్‌ను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

రిలయన్స్ జియో యొక్క రూ.101 ప్లాన్: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలకు పోటీని ఇస్తుంది. ఈ రూ.101 ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందవచ్చు. అయితే దాని అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని Jio 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్న వినియోగదారులు మాత్రమే పొందవచ్చు. ప్లాన్‌తో 4G కనెక్టివిటీతో 6GB డేటా రూ. 101కి అందిస్తోంది. ఇది అపరిమిత అప్‌గ్రేడ్ ప్లాన్ కాబట్టి, ఈ ప్లాన్‌ని ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లతో ఉపయోగించవచ్చు.

ప్రతిరోజూ 1 నుంచి 1.5 జీబీ డేటాను ఉపయోగించడం చాలా సులభం అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. రూ. 101 ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా అదనపు డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ ప్యాక్ బెనిఫిట్స్ అందుకోవాలంటే ముందుగా డైలీ 1GB, 28 రోజుల వ్యాలిడిటీ అందించే ఒక బేస్ ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకోవాలి. లేదంటే డైలీ 1.5GB డేటా, 28-56 రోజుల వ్యాలిడిటీ అందించే యాక్టివ్ ప్లాన్లు ఉండాలి. ఈ మూడింటిలో ఏ వ్యాలిడిటీ ప్లాన్ యాక్టివ్‌లో ఉన్నా వారు రూ.101 ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ + 6GB ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

బేస్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ ఉంటుంది. గరిష్టంగా రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ డేటా అందించడమే దీని ప్రత్యేకత. ఇది 6GB 4g డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటా అందిస్తుంది.

అరచేతితో చెల్లింపులు

ఇక నుంచి పేమెంట్‌ చేయడానికి ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఏంలతో పని లేదు. జస్ట్‌ హ్యాండ్‌ స్కాన్‌తో పనైపోతుంది. యస్‌..! మీరు ఇప్పటి వరకు చూసిన టెక్నాలజీ అంతా ఒక ఎత్తు..

ఇప్పుడు మనం మాట్లాడుకునే టెక్నాలజీ మరో ఎత్తు. డిజిటల్‌ పేమెంట్‌లో ఇది నెక్ట్స్‌ లెవల్‌. ఇక నుంచి బిల్‌ పేమెంట్‌ చేయడానికి మీ అరచేతిని ఉపయోగిస్తే చాలు. పేమెంట్‌ అయిపోతుంది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా… ఇది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. ప్రస్తుతం టెండ్ర్‌ అవుతున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి డీటెల్‌గా తెలుసుకుందాం.. మారుతున్న టెక్నాలజీతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం చాలా ఈజీ అయిపోయింది. గతంలో డబ్బులు, చెక్‌ల ద్వారా నగదు చెల్లింపు జరిగేది. ఆ తర్వాత డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. డిబిట్‌ కార్డులతో డబ్బులు పే చేశాం. ఇప్పుడు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఏంల హవా నడుస్తోంది. ఇప్పుడు అరచేతితో చెల్లింపులు జరుగుతున్నాయి.

షాపింగికి వెళ్తే… డబ్బులు చెల్లించడానికి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుతోనో, యూపీఐ యాప్స్‌ల అవసరం ఉండదు. కేవలం అరచేతితో చెల్లింపులు చేయవచ్చు. స్కానర్‌ ముందు అరచేతిని ఉంచితే చాలు. రెండు మూడు సెకన్లలోనే పేమెంట్ అయిపోతుంది. ఈ న్యూ టెక్నాలజీ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. అక్కడి జనాలంతా అరచేతితో చెల్లింపులు చేస్తున్నారు. ఏ షాపింగ్‌కి వెళ్లినా హాండ్‌ స్కాన్‌ చేసి బిల్‌ పే చేస్తున్నారు. షాపింగ్‌ మాల్‌లోని బిల్‌ కౌంటర్స్‌ దగ్గర క్యూ తగ్గింది. వేయిటింగ్‌ లేదు. జస్ట్‌ అరచేతిని చూపించి వెళ్లిపోతున్నారు. పామ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ అందరికి అందుబాటులోకి వస్తే యూపీఐ చెల్లింపులకు కూడా కాలం చెల్లినట్లే.

మరి ఇది ఎలా పని చేస్తుంది..? స్కానర్‌కి అరచేతికి లింక్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అరచేతి ద్వారా చెల్లింపులు చేయాలంటే… దీని ప్రాసెస్‌ అంతా యూపీఐ యాప్స్‌ తరహాలోనే ఉంది. ఏం లేదు… జస్ట్‌ పామ్‌ ప్రింట్‌ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్‌ చేసి రిజిస్టర్‌ అవ్వాలి.ఆ తర్వాత దాన్ని మన పేమెంట్‌ ఇన్ఫర్మేషన్‌కి లింక్‌ అప్‌ చేస్తే చాలు. థంబ్‌ సిస్టమ్‌ ఎలా ఉంటుందో సేమ్‌ అలాగే. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుతో ఎలా అయితే మన ఫింగర్‌ ప్రింట్స్‌ లింక్‌ అయి ఉంటాయో.. అలాగే మన అరచేతి నకలు మన బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయిపోతుంది.ఒకసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయితే.. ఎక్కడైనా కేవలం అరచేతిని ఉపయోగించి నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు.

మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా బ్యాంకు రుణం పొందవచ్చు

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. ఓ ఫారంలో పూర్తి వివరాలు బ్యాంకులో సబ్మిట్‌ చేస్తే పూర్తి ప్రాసెస్‌ అయిన తర్వాతే కార్డు అందేది.

కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. కేవలం ఫోన్‌ల ద్వారా వివరాలు అందించి కార్డును సులభంగా పొందే వెసులుబాటు వచ్చేసింది.
ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలన్నా , కొనాలన్నా, లేదా ఇతర ఆర్థిక అవసరాలకు బ్యాంకు లోన్‌ కోసం సంప్రదిస్తుంటాము. ఈ రోజుల్లో సులభంగా రుణాలు అందించే ఫైనాన్షియల్‌ సంస్థలు ఉన్నాయి. రుణం పొందాలంటే ముఖ్యంగా సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. ఇది లేకుంటే ఏ బ్యాంకు కూడా మీకు లోన్‌ అందించదు. మరిత సిబిల్‌ తక్కువగా ఉన్నప్పటికీ లోన్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది. మరి అదేలాగో చూద్దాం. సిబిల్ స్కోర్ అనేది రుణాల విషయంలో ప్రముఖ కీలక పాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా మెరుగ్గా ఉంటే లోన్ అనేది త్వరగా వస్తుంది. తక్కువగా ఉంటే మాత్రం మనకు ఎంత జీతం ఉన్నా కానీ లోన్ వచ్చే అవకాశం ఉండదనే చెప్పాలి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇక లోన్ అప్లై చేసుకోవచ్చు.

సిబిల్ స్కోర్ తక్కువున్నా కానీ రుణం పొందడానికి Co – Signer అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ తో మనం సిబిల్ స్కోర్ తక్కువున్నా కూడా లోన్ పొందవచ్చు. ఎలాగంటే మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వారు కానీ లోన్లు తీసుకొని సకాలంలో కట్టిన వారు ఉంటారు. అందువల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. వాళ్ళ హామీతో మీరు బ్యాంకు రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మీ లోన్‌ పేపర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. మీ గురించి బ్యాంక్ వాళ్ళకు హామీ ఇస్తూ వారు సంతకం చేస్తే మీకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

కానీ మీరు సకాలంలో లోన్ తీర్చకపోతే ఆ ప్రభావం వారిపై పడుతుందనే విషయం గుర్తించుకోండి. అందువల్ల వారికి నష్టం కలుగుతుంది. దీంతో తప్పకుండా రుణం సకాలంలో చెల్లించుకోవాలనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందవచ్చు.

నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు..

హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే పిల్లలకు కూడా ఇష్టం. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకోవాలని అనుకుంటారు.

దీపావళి ఐదు రోజుల పాటు చేస్తారు. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.

కార్తీక మాసంలో కూడా నెల అంతా సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలు వెలిగించడం పక్కన పెడితే.. అందులో ఉపయోగించే నూనెలు కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏదీ కొనలేని పరిస్థితి నెలకొంది. నూనెలు ధరలు కూడా బాగా పెరిగాయి.

కేవలం నూనెతోనే కాకుండా దీపాలను నీటితో కూడా వెలిగించుకోవచ్చు. నీటితో వెలిగించిన దీపాలు ఎంతో ప్రకాశ వంతంగా కూడా వెలుగుతాయి. దీంతో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. డబ్బు ఆదా అవుతుంది. మరి వీటిని ఎలా వెలిగిస్తారు.

నీటితో వెలిగించిన దీపాలు కూడా ఎక్కువు సేపు వెలుగుతూ ఉంటాయి. చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే కొద్దిగా నూనెతో దీపాలను వెలిగించవచ్చు. ముందుగా మీకు కావాల్సిన వత్తులను ఆయిల్‌లో నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత వీటిని దీపాల్లో పెట్టాలి. ప్రమిదలో నీరు 80 శాతం వరకు వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని.. ఆ నీటిలో వేయండి. ఆ తర్వాత దీపం వెలిగించండి. ఇలా చేస్తే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఈ ట్రిక్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది.

ఆ రుణాలతో దీపావళి సెలబ్రేషన్స్ మరింత ఈజీ.. ఆ లోన్ వల్ల ప్రయోజనాలివే

దీపావళి సమీపిస్తున్న కొద్దీ యువత ఉత్సాహంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. చాలామంది తమ ఇళ్లను డెకరేట్ చేసుకోవడంతో పాటు నచ్చిన వారికి బహుమతులు కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో తమ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే ఈ పండుగను నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్న చాలా మంది వినియోగదారులకు వ్యక్తిగత రుణాలు ఆచరణీయమైన ఎంపికగా ఉన్నాయి. నెలవారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా కాలానుగుణ ఖర్చులను నావిగేట్ చేయడంలో పర్సనల్ లోన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పండుగ సమయంలో పర్సనల్ లోన్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు చెప్పే విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఖర్చు చేయడం

వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు ఖర్చు విషయంలో మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తాయి. మీరు మీ ఇంటిని బాగు చేయించుకోవాలనుకున్నా, కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, అయిన వారికి బహుమతులు ఇవ్వాలనుకున్నా వ్యక్తిగత రుణాలు తీసుకుంటే ఆ ఖర్చులను సింపుల్‌గా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తలతో పాటు రీపేమెంట్ చేసేటప్పుడు మన ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసుకుని ఈ రుణాలను తీసుకోవాలి.

డాక్యుమెంటేషన్

పర్సనల్ లోన్స్ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. అలాగే లోన్ అప్రూవ్ అయిన నిమిషాల్లోనే సొమ్ము మన ఖాతాకు జమ అవుతుంది. ఈ సదుపాయం పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు పరిమిత-సమయ ఆఫర్‌లు లేదా అత్యవసర కొనుగోళ్ల కోసం సొమ్ము అవసరమైనప్పుడు పర్సనల్ లోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

రీపేమెంట్ ఎంపికలు

అయితే నెలవారీ చెల్లింపులను నిర్వహించడం అనేది రుణగ్రహీతలకు తరచుగా ఆందోళన కలిగిస్తుంది అయితే వ్యక్తిగత రుణాలు ఈ విషయంలో కూడా ఈ ఇబ్బంది ఉండదు. చాలా వ్యక్తిగత రుణాలు అనువైన రీపేమెంట్ కాలపరిమితితో వస్తాయి. రుణగ్రహీతలు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ఈఎంఐ ఎంపికలను ఎంచుకునే సదుపాయం ఉంటుంది.

ష్యూరిటీ

వ్యక్తిగత రుణాలు పొందడానికి ఎలాంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అత్యవసరంగా నిధులు అవసరమైనప్పుడు తాకట్టు పెట్టడానికి ఆస్తులు లేని వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర స్వల్పకాలిక రుణ ఎంపికలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు సాధారణంగా పెద్ద మొత్తాలను అందజేస్తాయి. వాహనానికి ఫైనాన్సింగ్ చేసినా ఖరీదైన గాడ్జెట్‌లను కొనుగోలు చేసినా లేదా మీ ఇంటిని పునర్నిర్మించినా, వ్యక్తిగత రుణాలు పెద్ద మొత్తాలకు యాక్సెస్‌ను అందిస్తాయి.

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం.. చివరి తేదీ ఇదే

రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు రానున్న పబ్లిక్‌ పరీక్షల కోసం ఫీజు చెల్లింపులు సోమవారం (అక్టోబర్‌ 28) నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. పరీక్ష ఫీజుల చెల్లింపులు నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించాలని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ఈలోపు కట్టలేకపోతే ఆలస్య రుసుముతో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 12వ తేదీ నుంచి నవంబరు 18 వరకు ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్‌ 19 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్‌ 26 నుంచి నవంబరు 30 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ వివరించింది.

ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయులూ చెల్లించొచ్చని సూచించారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు రూ.300, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అవసరమయ్యే వారు రూ.80 చెల్లించాలని సూచించారు.

‘డీఎస్సీ కొత్త టీచర్ల జాయినింగ్‌ను నవంబర్‌10వ తేదీగా పరిగణించాలి’

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన డీఎస్సీ టీచర్ల జాయినింగ్‌ తేదీని నవంబర్‌ 10గా పరిగణించాలని ట్రెజరీస్‌ డైరెక్టర్‌ కేఎస్‌ఆర్‌ మూర్తిని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి కోరారు. ఈ మేరకు ట్రెజరీస్‌ డైరెక్టర్‌కు టీఎస్‌యూటీఎఫ్‌ వినతిపత్రం అందజేశారు. కొత్త టీచర్లకు నియామకపు తేదీలో ఇచ్చినట్లుగానే సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవచ్చని, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి లేఖ వస్తే ఆవిధంగా వేతనాలు కూడా చెల్లించేలా ట్రెజరీలకు ఆదేశాలు ఇస్తామని డైరెక్టర్‌ చెప్పారన్నారు. ఇక గతంలో బదిలీ అయి, ఇటీవల రిలీవ్‌ అయిన ఉపాధ్యాయులకు అక్టోబరు నెల పూర్తి వేతనం కొత్త స్టేషన్‌లో అనుమతించాలని ట్రెజరీ అధికారులకు సూచించామని చెప్పినట్లు డైరెక్టర్‌ చెప్పారని రవి తెలిపారు.

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.?

దీపావళికి ముందుగా గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ వచ్చేసింది. భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయ్.

గత రెండు రోజులుగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరిగ్గా.. 22 క్యారెట్ల బంగారం రూ. 750 మేరకు పెరిగింది. ఇక ఆదివారంతో పోలిస్తే.. సోమవారం బంగారం ధరల్లో వ్యత్సాసం కనిపిస్తోంది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీపావళికి ముందు ఇలా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో.. గోల్డ్ లవర్స్ కొనుగోలు సిద్దమయ్యారనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తున్నాయ్. సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.73,590

విజయవాడ – రూ.73,590

బెంగళూరు – రూ.73,590

ముంబై – రూ.73,590

కోల్‌కతా – రూ.73,590

ఢిల్లీ – రూ.73,740

చెన్నై – రూ.73,590

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.80,280

విజయవాడ – రూ.80,280

బెంగళూరు – రూ.80,280

ముంబై – రూ.80,280

కోల్‌కతా – రూ.80,280

ఢిల్లీ – రూ.80,430

చెన్నై – రూ.80,280

వెండి ధరల్లో..

బంగారం ధరలు బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. సోమవారం వెండి కేజీకి రూ. 100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1.06.900 ఉండగా.. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి రూ. 97,900గా.. బెంగళూరులో కేజీ వెండి రూ. 96,900గా ఉంది.

‘బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తాం..’ మంత్రి సవిత వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆమె అన్నారు. త్వరలో జరగబోయే మెగా డీఎస్సీకి సంబంధించి 26 జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. అలాగే ఉచిత డీఎస్సీ శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి స్టైఫండ్‌ కింద రూ.1500లతోపాటు స్టడీ మెటీరియల్‌ కొనుగోలుకు రూ.1000 అదనంగా అందిస్తామని అన్నారు. అయితే కొన్ని జిల్లాల పరిధిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయలేదని, వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసి డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏపీఈఏపీ సెట్, నీట్‌ ర్యాంకులేకున్నా ఇంటర్‌తో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు.. దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు తదుపరి చర్యలు చేపట్టింది విద్యాశాఖ. మిగిలి పోయిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్‌ ర్యాంకులతో నిమిత్తం లేకుండా కేవలం ఇంటర్‌ మార్కులతో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. 2025-26 నుంచి ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సెల్‌ మార్గదర్శకాలు అనుసరించి ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నర్సింగ్‌ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

పలు కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో బీడీఎస్‌ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించింది. బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకూ ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఆయుష్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కన్వీనర్‌ కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్ధులకు సూచించింది. ఈ మేరకు అక్టోబరు 28 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

‘ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీ ఈఏపీసెట్‌ నాలుగో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఓ విద్యార్ధి తల్లి హైకోర్టులో పిటిషనర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా దీనిని విచారించిన హైకోర్టు ఈ వినతిపై పది రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీఈఏపీ సెట్‌-2024 కన్వీనర్‌తోపాటు ఇతర అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి రాజశేఖరరావు ఉత్తర్వులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.

మిగిలిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి పలగర అనసూర్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీని విచారన సమయంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు కోర్టుకు వినిపించారు. ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సుమారు 25 వేల సీట్లు మిగిలిపోయాయని కోర్టుకు తెలిపారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదలు సంభవించాయని, వీటి కారణంగా పిటిషనర్‌తోపాటు పలువురు విద్యార్థులు గతంలో ఈఏపీసెట్‌ మూడు కౌన్సెలింగ్‌ ప్రక్రియలకు హాజరుకాలేకపోయారని, అందువల్లనే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. మిగిలిన సీట్లను నాలుగో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 11న ఇచ్చిన వినతిపై అధికారులు నిర్ణయం తీసుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. 4వ విడత కౌన్సెలింగ్‌ వినతిపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్‌ తరపు లాయర్‌ కోర్టును కోరారు. లాయర్‌ వాదనలతో ఏకీభవించి న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్‌ 30న సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ 2024 పరీక్షల ఫలితాలు.. ఐసీఏఐ ప్రకటన

ఐసీఏఐ సీఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్ పరీక్ష 2024 ఫలితాలు అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు ఐసీఏఐ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. కాగా సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.

పండగ సీజన్ ఈ 3 రంగాలకు లైఫ్ సేవర్.. పెరుగుతున్న వ్యాపారంతో 2 లక్షల కొత్త ఉద్యోగాలు..

దీపావళి దగ్గర పడింది. షాపింగ్‌ కారణంగా మార్కెట్‌లో రద్దీ కనిపిస్తోంది. పండుగ కారణంగా ఏర్పడిన డిమాండ్ అనేక ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. ఈ పండుగల సీజన్‌లో లాజిస్టిక్స్, ఆపరేషన్స్, ఈ-కామర్స్ , టూరిజం రంగాలలో ఉద్యోగాల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగింది.

ఈ సమయంలో మొత్తం 2.16 లక్షల అవకాశాలు నమోదయ్యాయని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘అప్నా.కో’ ఈ సమాచారాన్ని తెలియజేసింది. వినియోగదారుల వ్యయం మందగించిన తర్వాత పుంజుకోవాలని చూస్తున్న వ్యాపారాలకు ఈ సంవత్సరం పండుగ సీజన్ చాలా ముఖ్యమైనది.

70 శాతం పెరిగింది

అంతేకాదు వస్తువులను వేగంగా డెలివరీ చేసే తక్షణ వాణిజ్య పరిశ్రమ విస్తరణ కూడా రిక్రూట్‌మెంట్‌కు దోహదపడింది. ఈ సమయంలో లాజిస్టిక్స్, ఆపరేషన్స్ రంగంలో అవకాశాలు వార్షిక ప్రాతిపదికన 70 శాతం పెరిగాయి. మరోవైపు రిటైల్, ఈ-కామర్స్ 30 శాతం వృద్ధి చెందగా రెస్టారెంట్, హాస్పిటాలిటీ రంగం 25 శాతం పెరిగింది.

Rapido, Delhivery, eCart , Shiprocket వంటి కంపెనీలు వివిధ పోస్టుల కోసం 30,000 కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేశాయి. Apna.co వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిర్తత్ పారిఖ్ మాట్లాడుతూ యజమాని భాగస్వాములకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని… వినియోగదారుల డిమాండ్‌లో 20-25 శాతం వృద్ధిని చూస్తామని భావిస్తున్నామని చెప్పారు.

దీపావళికి రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా

ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దీపావళి సహా దీని సంబంధిత పండుగల కోసం దేశ రాజధాని డిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో సన్నాహాలు జోరందుకున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీపావళి పండుగ సీజన్ కోసం ఢిల్లీ మార్కెట్లలో, దేశవ్యాప్తంగా భారీ సన్నాహాలు జరుగుతున్నాయని చాందినీ చౌక్ MP, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. రాఖీ పండగ, నవరాత్రి వంటి సందర్భంగా విక్రయాలు పెరగడంతో ఈ దీపావళి సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారని, ఇందులో ఒక్క ఢిల్లీలోనే రూ.75,000 కోట్ల వ్యాపారం జరుగుతుందనే అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

అలెర్ట్.. తిరుమలలో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..

తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠నవంబరు 1న కేదారగౌరీ వ్రతం

•⁠ ⁠నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.

•⁠ ⁠నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ

•⁠ ⁠నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర

•⁠ ⁠10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం

•⁠ ⁠నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

•⁠ ⁠నవంబరు 12న ప్రబోధన ఏకాదశి

•⁠ ⁠నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి

•⁠ ⁠నవంబరు 15న కార్తీక పౌర్ణమి

•⁠ ⁠28న ధన్వంతరి జయంతి

•⁠ ⁠29న మాస శివరాత్రి

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి మొబిక్విక్ గుడ్‌న్యూస్.. అదిరిపడే వడ్డీ రేటు ప్రకటన

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్ల కోసం చూస్తున్నవారికి మొబిక్విక్ శుభవార్త చెప్పింది. ఫైనాన్షియల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మొబిక్విక్ తన మొబైల్ యాప్‌లో ఆర్థిక సేవల సంస్థల భాగస్వామ్యంతో ఇన్‌స్టంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీని అందిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా తమ వినియోగదారులను పొదుపు మార్గం వైపు తిప్పడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మొబిక్విక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగదారులకు రూ. 1,000 నుంచి పెట్టుబడిని ప్రారంభించి, కొత్త బ్యాంక్ ఖాతాను తెరవకుండానే సంవత్సరానికి 9.5 శాతం వరకు రాబడిని పొందవచ్చని పేర్కొంటున్నారు. వినియోగదారులు ఏడు రోజుల నుంచి 60 నెలల వరకు డిపాజిట్ వ్యవధిని ఎంచుకోవచ్చు.

మొబిక్విక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీలను అందించడానికి మహీంద్రా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మొబిక్విక్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇతర నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో కలిపి ఈ ఎఫ్‌డీలను అందిస్తుంది. భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఉన్న ఆదరణ నేపథ్యంలో వారికి మెరుగైన వడ్డీ రేటును అందించేలా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు మొబిక్విక్ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ద్వారానే ఎఫ్‌డీ చేసే సదుపాయం ఉండడంతో మారుమూల ప్రాంత ప్రజలు కూడా బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా ఎఫ్‌డీ చేయవచ్చని చెబుతున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రయోజనలు

పెట్టుబడి పెట్టడం లేదా పొదుపు చేయడం ప్రారంభించడానికి మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడం ద్వారా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
మొబిక్విక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు 9.5 శాతం వరకు ఉంటాయి. ఇది చాలా బ్యాంకుల కంటే చాలా ఎక్కువ, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది.
మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎఫ్‌డీకు సంబంధించిన పదవీకాలాన్ని ఎంచుకునే ఎంపిక కూడా ఉంది. ఇది పొదుపును అనువైనదిగా చేస్తుంది.

అతి తక్కువ డౌన్ పేమెంట్‌కే యమహా వాహనాలు.. ఆ మోడళ్లపై దీపావళి స్పెషల్ ఆఫర్

జపాన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా ఇండియా మోటార్స్ దీపావళి సందర్భంగా వివిధ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. ఎఫ్ జెడ్ సిరీస్, ఫాస్కినో, రే జెడ్ఆర్ మోడళ్లకు వీటిని వర్తింపజేసింది.

అయితే ఇవి ఎప్పటి వరకూ కొనసాగుతాయో స్పష్టం చెప్పలేదు. అయితే దీపావళి సందర్భంగా పరిమితి కాలం వరకూ ఉండే అవకాశం ఉంది. వీటిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు తక్కువ డౌన్ పేమెంట్ కు అందజేస్తుంది. పండగ సందర్భంగా ఖాతాదారులు ఎఫ్ జెడ్ వెర్ 4.0, ఎఫ్ జెడ్ – ఎస్ వెర్ 3.0, ఎఫ్ జెడ్ ఎఫ్ఐ మోడళ్లపై రూ.7 వేల వరకూ క్యాష్ బ్యాక్ పొందుతారు. కేవలం రూ.7,999 డౌన్ పేమెంట్ గా చెల్లించి వాహనం తీసుకువెళ్లవచ్చు. అలాగే ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రే జెడ్ ఆర్ 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ మోడళ్లపై రూ.4 వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు. వీటికి డౌన్ పేమెంట్ గా కేవలం రూ.2,999 చెల్లిస్తే చాలు.

యమహాకు చెందిన అన్ని మోడళ్లపై దీపావళి ఆఫర్ ఇవ్వడం లేదు. పైన తెలిపిన వాటికి మాత్రమే అమలు చేస్తున్నారు. మిగిలిన వైజెడ్ఎఫ్ – ఆర్ 3, ఎంపీ-03, వైజెడ్ఎఫ్- ఆర్15ఎం, వైజెడ్ఎఫ్- ఆర్15వీ4, వైజెడ్ఎఫ్- ఆర్15ఎస్ వీ3, ఎంటీ-15 వీ2, ఏరోక్స్ 155 తదితర వాటిపై ఎలాంటి ఆఫర్లు లేవు. అప్ డేట్ చేసిన యమహా ఆర్3 మోటారు సైకిల్ ను ఇటీవలే ఆ కంపెనీ ఆవిష్కరించింది. ముందు వెర్షన్ కంటే ఎక్కువ దూకుడుతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టెయిల్ సెక్షన్ లో స్వల్ప మార్పు చేశారు. మొత్తానికి స్పోర్టివ్ లుక్ లో సూపర్ గా కనిపిస్తోంది.

యమహా ఆర్3 మోటారు సైకిల్ లో అదనపు ఫీచర్లను ఏర్పాటు చేశారు. గత మోడల్ కు సంబంధించి కస్టమర్లు చెప్పిన సమస్యలను పరిష్కరించారు. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ తదితర వాటిని అప్ గ్రేడ్ చేశారు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఆర్3 లో స్పెసిఫికేషన్ మార్చలేదు. దీనిలోని 321 సీసీ ట్విన్ ఇంజిన్ నుంచి 41.4 బీహెచ్ పీ, 29.5 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో పాటు మోటారు సైకిల్ ముందు వైపు కేవైబీ యూఎస్ డీ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి.

సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? నష్టాలు ఏంటో తెలుసుకోండి

సాధారణంగా చాలా మంది సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటారు. ఇటీవలి కాలంలో కూడా యువతలో ఇలాంటి ఫ్యాషన్‌ ఎక్కువగా ఉంది. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల పాదాల్లో దుర్వాసన రావడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో చెమట ఎక్కువగా ఉండే భాగాలలో పాదాలు ఒకటి. అలాగే రోజంతా షూస్ వేసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే దీనిని వదిలించుకోవడానికి, వాసనను నివారించడానికి, పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్ ఉత్తమం. వీటన్నింటితో పాటు, ఇది తరచుగా పాదాలకు చెమట పట్టడాన్ని నివారిస్తుంది. అందుకే సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? సాక్స్ మన పాదాలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతుంది? దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వేసవికి మాత్రమే కాకుండా శీతాకాలానికి కూడా మంచిది:

సాక్స్ ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక రకాల బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే వీటిని ధరించడం వల్ల ఎలాంటి ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దరిచేరవు. సాక్స్ వేసవిలో చెమట పట్టకుండా నిరోధించడమే కాకుండా శీతాకాలానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో సాక్స్ వేసుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇవి మీ పాదాలను వెచ్చగా ఉంచుతాయి.

అలర్జీ సమస్య:

సాక్స్ ధరించకుండా షూస్ వేసుకునే వారికి అలర్జీ సమస్య రావచ్చు. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. అందుకే అబ్బాయిలు, సాక్స్ లేకుండా బూట్లు ధరించవద్దు. లేకపోతే చాలా మందికి పాదాలకు చెమట పట్టడం, వారి పాదాలకు అనేక రకాల సమస్యలు వస్తాయి. చెమట బూట్ల లోపల తేమను మరింత పెంచుతుంది. ఇది వివిధ రకాల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కొందరికి సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల పాదాలకు పొక్కులు వస్తాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే బూట్లు వేసుకునే వారు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగం చేయాలంటే ఈ నగరమే బెస్ట్.. ముంబై, ఢిల్లీలో కంటే ఎక్కువ వేతనం

ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరిన వారికి ముందుగా కనీస వేతనాలను అందిస్తారు. ఆ తర్వాత పనితీరు, సంస్థ నిబంధనల మేరకు జీతం పెరుగుదల ఉంటుంది. అయితే దేశంలోని ఏ నగరాల్లో కనీస వేతనాలు బాగున్నాయో, ఏఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ఉద్యోగ అవకాశాలు, జీతాల పెరుగుదల విషయంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాదికి 9.3 శాతం చొప్పున పెరుగుదల కనిపిస్తోంది. సాంకేతికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల కల్పనలోనూ దూసుకుపోతోంది. ఈ నగరంలో కనీస వేతనంగా రూ.29,500 అందిస్తున్నారు. దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు అందించే నగరంలో బెంగళూరు ప్రసిద్ధి చెందింది.

ఉద్యోగాల విషయంలో చెన్నై 7.50 శాతం, ఢిల్లీ 7.30 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. చెన్నైలో 24,500, ఢిల్లీలో 27,800ను నెలవారీ కనీస వేతనంగా అందిస్తున్నారు. అలాగే ముంబై, పూణేలు కూడా స్థిరమైన జీతాల పెరుగుదల కనిపిస్తోంది. ముంబై లో రూ.25,100, పూణేలో రూ.24,700ను సగటు జీతంగా చెల్లిస్తున్నారు. ఈ నగరాల్లో వృద్ధి రేటు 4 నుంచి 10 శాతం వరకూ ఉంది. రిటైల్ రంగంలో జీతాల పెరుగుదల వేగంగా జరుగుతోంది. దాదాపు 8.4 శాతంలో అత్యధికంగా నమోదు అవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఫార్మా, కన్ స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు పయనిస్తున్నాయి. వీటిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు ఎంతో డిమాండ్ ఉంది.

అత్యధిక కనీస జీతాలు చెల్లించే పరిశ్రమలలో టెలికమ్యూనికేషన్స్ తయారీ (రూ.29,200), ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫాస్ట్రక్చర్ (రూ.28,200), హెల్త్ కేర్ అండ్ ఫార్మా (రూ.27,600), కన్ స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ (రూ.27 వేలు) వరుస స్థానాలలో నిలిచాయి. గత ఐదేళ్లలో జీతాల పెరుగుదల స్థిరంగా ఉన్న ఉద్యోగాలను కూడా నివేదికలో వివరించారు. వీటిలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ముందంజలో ఉంది. ట్రైనీ అసోసియేట్లు 9.5, పైలట్ ఆఫీసర్లు 8, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ లు 7.9, సేల్స్ మేనేజర్లు 6.6 శాతం వృద్ధిని నమోదు చేశారు. దేశంలో పెరుగుతున్న ఉద్యోగాల కల్పనకు ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. ఆయా పరిశ్రమలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన వారికి కనీస వేతనంగా గరిష్ట మొత్తాలను అందిస్తుండడం విశేషం.

కారు ఏసీ ఆన్‌లో ఉంటే ఎంత ఇంధనం అవసరం? మైలేజీ ఎంత ఇస్తుంది

కార్ డ్రైవర్లు సాధారణంగా వేసవిలో ఏసీని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది దీనిని వర్షాకాలం, చలికాలంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఒక గంట పాటు ఏసీ వాడితే కారులో ఎంత ఇంధనం ఖర్చవుతుందో తెలుసా?.

ఈ రోజుల్లో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కారు ఏసీ ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారు ఏసీని ఎక్కువ సేపు నడపడం వల్ల కారు మైలేజీపై కూడా ప్రభావం పడుతుంది.

మీరు కారు మైలేజీ గురించి ఆందోళన చెందుతుంటే, అది కారు రకాన్ని బట్టి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల ఇంజన్‌లు సాధారణంగా చిన్నవి. తక్కువ శక్తివంతంగా ఉంటాయి.

ఏసీ ఆన్‌లో ఉంటే ఎంత ఇంధనం అవసరం?:

హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారులో గంటసేపు ఏసీని ఉపయోగిస్తే, ఇంధన వినియోగం గంటకు 0.2 నుంచి 0.4 లీటర్లు. అదే సమయంలో ఎస్‌యూవీలో ఒక గంట పాటు ఏసీని నడపడానికి గంటకు 0.5 నుండి 0.7 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. అలాగే, కారు AC ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కారు చిన్నగా ఉంటే కారు ఇంజిన్ తక్కువ శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు AC నడుస్తున్నప్పుడు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కారు పరిమాణం పెద్దగా ఉంటే, అంటే మీరు SUVలో AC నడుపుతున్నట్లయితే ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది.

బయట ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటే ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది మైలేజీపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ఏసీ ఆన్ చేసి తరచూ కిటికీలు తెరిస్తే కారు చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది తక్కువ మైలేజీకి ప్రధాన కారణం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏసీ ఎంత మైలేజీని ప్రభావితం చేస్తుంది అనేది మీరు కారును ఎక్కడ నడుపుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ట్రాఫిక్‌లో తరచుగా స్టాప్‌లు అవసరం. అప్పుడు ఇంజన్ ఎక్కువ కష్టపడి మైలేజీ కూడా పడిపోతుంది.

స్లైలిష్ బైక్ కోసం చూస్తున్నారా..?మార్కెట్‌లో ది బెస్ట్ ఇవే

టీవీఎస్ విడుదల చేసిన అపాచీ ఆర్ టీఆర్ 160 బైక్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్, వెనుక భాగంలో మోనోషాక్ ఫోర్కుల సెటప్ అమర్చారు.

ఐదు స్పీడ్ గేర్ బాక్స్, 270, 130 ఎంఎం డిస్కు బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బండి సుమారు 42 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలోని 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 17.30 హెచ్ పీ, 14.73 టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ మోటారు సైకిల్ ప్రారంభ ధర రూ.1.24 లక్షలు, టాప్ ట్రిమ్ వేరియంట్ కోసం రూ.1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఖర్చవుతుంది.

దేశ ప్రజలందరికీ సుపరిచితమైన హీరో కంపెనీ విడుదల చేసిన ఎక్స్ట్రీమ్ 160 ఆర్ వీ స్లైలిష్ లుక్ తో కనిపిస్తోంది. దీనిలో 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 16.6 హెచ్ పీ, 14.6 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, ముందు యూఎస్ డీ, వెనుక మోనోషాక్ ఫోర్కులు, 276, 220 డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలు. లీటర్ కు 48 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ రూ.1.38 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.

హోండా ఎస్పీ 160 మోటారు సైకిల్ దాాదాపు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సింగిల్ చానల్ ఏబీఎస్, 276, 220 ఎంఎం డిస్కు బ్రేకులు, టెలిస్కోపిక్ , మోనోషాక్ ఫోర్కులు, ఐదు స్పీడ్ గేర్ బాక్స్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని 162.71 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 13.27 హెచ్ పీ, 14.58 టార్క్ ఉత్పత్తి అవుతుంది. హోండా ఎస్పీ 160 మోటారు సైకిల్ ధర రూ.1.18 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.23 లక్షల వరకూ ఉంది.

స్లైలిష్ లుక్ తో ఆకట్టుకునే వాహనాల్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ఒకటి. దీనిలోని 160.3 సీసి సింగిల్ సిలిండర్ నుంచి 17.03 హెచ్ పీ, 14.6 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, వెనుక నైట్రోక్స్ మోనోషాక్, ముందు టెలిస్కోలిప్ ఫోర్కులు, 260 ఎంఎం, 230 ఎంఎం డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలున్నాయి. లీటర్ కు 52.2 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మోటారు సైకిల్ రూ.1.47 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

యమహా ఎఫ్ జెడ్ – ఎస్ ఎఫ్ఐ వెర్ 4.0 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 149 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 12.2 హెచ్ పీ, 13.3 టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ టాన్స్ మిషన్, సస్పెన్షన్ డ్యూటీలు, అడ్జస్టబుల్ మోనోషాక్, టెలిస్కోపిక్ ఫోర్కులు, 282, 200 ఎంఎం డిస్కులు, సింగిల్ చానల్ ఏబీఎస్ దీని ప్రత్యేకతలు. ఈ మోటారు సైకిల్ రూ.1.30 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.

‘దేవుడు లేడన్న పెరియార్‌ మాటలకు మేం వ్యతిరేకం’.. తొలి బహిరంగ సభలో విజయ్ కామెంట్స్

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేస్తున్నారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు.

తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే ప్రకటించినప్పటికీ..అభిమానాలు మాత్రం ఉదయం నుండి సభా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చారు.

అన్నట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు విజయ్. 800 మీటర్ల పొడవైన ర్యాంప్‌పై సింగిల్‌గా వాక్‌ చేస్తూ..అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు స్టేజ్ మీదకు విసిరిన కండువాలను తన భుజాన వేసుకుని వారిని ఆనంద పర్చారు..ఇళయ దళపతి.

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాపై ఈ మహానాడు వేదికపైనుండి ప్రజలకు స్పష్టత ఇచ్చారు విజయ్.

తమిళనాడు రాజకీయాల్లో తాను ఎవరికీ A టీమ్‌గానీ..B టీమ్‌గానీ కాదని స్పష్టం చేశారు..విజయ్‌. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ చేస్తుందన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీని..రాజకీయంగా డీఎంకేని వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పాట పాడుతూ..ఆ రంగులు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అండర్‌గ్రౌండ్‌ డీలింగ్‌ చేసుకుంటూ..ద్రావిడ మోడల్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

తొలి బహిరంగ సభలో V సెంటిమెంట్‌

టీవీకే తొలి బహిరంగ సభలో..విజయ్‌ అండ్‌ V సెంటిమెంట్‌ కొట్టొచ్చినట్లు కనిపించింది. పార్టీ పేరు తమిళగ వెట్రిక్‌ కళగం. టీవీకే వ్యవస్థాపకుడి పేరు విజయ్. పార్టీ పేరులోని వెట్రిక్ అనేది Vతో ప్రారంభం అవుతుంది. మహానాడు సభ నిర్వహణ విల్లుపురం జిల్లా కేంద్రంలో జరిగింది. అది కూడా V అక్షరంతో మొదలవుతుంది. ఇక విక్రవాండి ప్రాంతంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా V అనే అక్షరంతోనే ప్రారంభమవుతుంది. సభ జరిగే ప్రాంతం V జంక్షన్‌ కావడం మరో విశేషం. V ఫర్‌ విక్టరీ అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. (Spot)

మంచి ప్రభుత్వం, పాలనకు సూచికగా కామరాజ్‌ నాడార్‌

సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కటౌట్ల ద్వారా కూడా తన పార్టీ విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు విజయ్. మంచి ప్రభుత్వాన్ని, పరిపాలనను అందిస్తామంటూ కామరాజ్‌ నాడార్‌ కటౌట్‌ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తమిళనాడులో ద్రవిడ పార్టీల మూల సిద్ధాంతకర్త పెరియార్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన కటౌట్‌ పెట్టడం ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక అంబేద్కర్ చూపిన రాజ్యాంగం బాటలో నడుచుకుంటామని చెప్పడానికి ఆయన కటౌట్‌ను ఏర్పాటు చేశారని భావిస్తున్నారు..పొలిటికల్‌ అనలిస్ట్‌లు.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దళపతిగా పిల్చుకుంటారు అభిమానులు. విజయ్‌ను ఇళయ దళపతి అంటే..యువ దళపతి అని పిల్చుకుంటారు. యూత్‌లో ఆ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్నారు హీరో విజయ్. విజిల్, మెర్సల్ లాంటి లతో యువ ఆడియన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారారు. వందల కోట్ల రెమ్యునరేషన్‌ని, లావిష్ లైఫ్‌ స్టయిల్‌ను వద్దనుకుని, ప్రజాజీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్‌.

విజయ్‌కీ, ఉదయ్‌కీ మధ్యనే పొలిటికల్‌ వార్‌జోన్

వచ్చే ఎన్నికల్లో విజయ్‌కి పోటీ ఇచ్చేది ఎవరు అంటే..డీఎంకె అధినేత స్టాలిన్‌ తనయుడు ఉదయానిధి స్టాలిన్‌ అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీలోనూ, పార్టీ బైటా యూత్ ఐకాన్‌గా చెలామణీ అవుతున్న ఉదయనిధి..ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దీంతో మిగతా ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ.. తమిళనాట నెక్ట్స్ జెన్ పాలిటిక్స్‌లో విజయ్‌కీ, ఉదయ్‌కీ మధ్యనే వార్‌జోన్ క్రియేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

తమిళ రాజకీయాల్లో గట్టిగా ఇంపాక్ట్

తమిళనాడులో లను రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. తమిళనాట గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత.. అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగని.. వాళ్లంతా పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతారనే సిద్ధాంతం లేదు కూడా. శివాజీ గణేషన్‌, విజయ్ కాంత్‌, శరత్‌ కుమార్‌ తమిళనాడు ప్రజా జీవితంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ లాంటి వాళ్లైతే రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దాల తరబడి డైలమాలో ఉండి.. చివరాఖరుకు వెనకడుగు వేశారు. లోకనాయకుడు కమల్‌హాసన్ కూడా రాజకీయాల్లో ఇంకా సక్సెస్‌ కాలేదు. మరి విజయ్‌ ఎంతవరకూ సక్సెస్‌ అవుతారో తెలుసుకోవాలంటే..2026 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిందే. ఏదేమైనా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం తమిళనాడులో ట్రెండ్‌ సృష్టిస్తాయనడంలో సందేహం లేదు.

డెలివరీ బాయ్స్ కష్టాలు ఆ ఈవీతో దూరం.. నయా త్రీవీలర్ ఈవీ లాంచ్

కొమాకీ ఎలక్ట్రిక్ నాయ క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ డెలివరీ బైక్‌ను ఇటీవల విడుదల చేసింది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పరిచయం చేశారు.

క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గ్రాఫేన్, ఎల్ఐపీఓ4 వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈవీ త్రీవీలర్స్ ధరలు రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. గ్రాఫేన్ 180 కిమీ పరిధిని అందిస్తుండగా, ఎల్ఐపీఓ 4 మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ కంటే ఎక్కువ ప్రయాణిస్తుందని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ అనేది యాప్ ఆధారిత బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనమని పేర్కొంటున్నారు.

కొమాకీ ఈ-ఫ్లీట్ మెటల్ బాడీ తయారు చేశారు. అలాగే ఈ త్రీవీలర్ కన్వర్టిబుల్ సీట్లతో వస్తుంది. ఈ ఈవీ వాహనం గరిష్టంగా 500 కిలోల సామర్థ్యంతో కూర్చోవడానికి, లోడ్ మోయడానికి తగినంత స్థలంతో వస్తుంది. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ కన్వర్టిబుల్ స్వభావం మల్టీ లోడ్ కాన్ఫిగరేషన్లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లో అనేక ఫీచర్లు ఉన్నాయని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ త్రీ వీలర్‌లో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఇంక్లైన్ బ్రేక్ లాకింగ్, మూడు చక్రాలపై డిస్క్ బ్రేక్లు, స్పష్టమైన విండ్ షీల్డ్ ఉన్నాయి.

క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ మూడు గేర్ మోడ్లతో వస్తుంది. ఎకో, స్పోర్ట్, టర్బో మోడ్‌లతో వచ్చే ఈ ఈవీ త్రీ వీలర్ డెలివరీ బాయ్స్‌ను ఆకట్టుకుంటుందని కొమాకీ ఎలక్ట్రిక్ డివిజన్ సహ వ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా చెబుతున్నారు. దేశంలోని ప్రతి మూలలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడం కోసం ఈ ఈవీ త్రీ వీలర్‌ను లాంచ్ చేశామని పేర్కొంటున్నారు.

జీర్ణ ఆరోగ్యానికి పచ్చిమిర్చి.. ప్రతి రోజూ తిన్నారంటే మీ ఒళ్లు ఉక్కుమాదిరి తయారవుద్దంతే!

పచ్చి మిర్చిలో విటమిన్ ఎ, సి, బి-1, బి-1, బి-3, బి-5, బి-6, బి-9, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, పచ్చి మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం నొప్పులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పచ్చి మిరపకాయలు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు మన పూర్తికులు. అవును.. నిజంగానే పచ్చి మిర్చి కడుపు సంబంధిత సమస్యలకు బలేగా పనిచేస్తుంది. చాలా మంది వర్షాకాలంలో ఎసిడిటీ, మలబద్ధకం వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. వారు పచ్చి మిరపకాయలను తీసుకోవచ్చు. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పచ్చి మిరపకాయలు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.

వేసవిలో చాలా మంది హీట్ స్ట్రోక్‌తో బాధపడుతుంటారు. కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రోజువారీ ఆహారంలో పచ్చిమిర్చి చేర్చుకోవాలనుకునే వారు రోజుకు 3 నుంచి 4 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. అతిగా తింటే గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. పైల్స్‌తో బాధపడే వారు పచ్చి మిరపకాయలు వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

మీకెప్పుడైనా తీవ్ర భయం, ఆందోళనగా అనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి! 2 నిమిషాల్లో నార్మల్‌ అవుతారు

మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా ప్రశాంతత లేకపోతే జీవన గందరగోళంగా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే దీర్ఘకాలిక రుగ్మతలకు దారి తీస్తుంది.

తద్వారా విపరీత ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది.

మితిమీరిన ఆందోళన, పని ఒత్తిడి, కుటుంబ సమస్యల గురించి అతిగా ఆలోచించడం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ఆందోళన వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.

కండరాల ఒత్తిడిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. దేశంలో దాదాపు 88% మంది ప్రజలు ఏదో ఒక రకమైన ఆందోళనతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి 100 మందిలో 88 మంది ఈ మానసిక రుగ్మతకు గురవుతున్నారన్నమాట. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా పానిక్ అటాక్‌తో బాధపడుతున్నట్లయితే, ఇలా చేయండని మానసిక వైద్యులు సలహా ఇస్తున్నారు. మీరూ పానిక్ అటాక్‌తో బాధపడుతుంటే ఎలా సహాయం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

నీళ్లు తాగడం వల్ల వారిలో కొంత భయం, ఆందోళన తగ్గుతాయి. చల్లటి నీరు తాగడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది వ్యక్తిని శాంతింపజేయడానికి సహాయపడుతుంది. తీవ్ర భయాందోళనకు గురైతే వెంటనే చేతులు, కాళ్ళను చల్లటి నీటితో కడగాలి. అలాగే టవల్‌ను తడిపి మీ ముఖం లేదా మెడపై ఉంచుకోవాలి. ఇది భయం నుండి కొంచెం శాంతపరచడానికి సహాయపడుతుంది.

మీ చుట్టుపక్కల లేదా ఇంట్లో ఎవరైనా భయాందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తే.. మీరు వారి ప్రవర్తనను చూస్తే దూరంగా ఉండకండి. బదులుగా ఆ వ్యక్తిని సౌకర్యవంతమైన కుర్చీ లేదా సోఫాలో కూర్చోబెట్టి.. కాసేపు మీరు వారితో గడపడానికి ప్రయత్నించాలి.

వాట్సాప్‌ వీడియో కాల్ ఇప్పుడు మరింత స్పష్టంగా.. కొత్త అప్‌డేట్

వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్నప్పుడు లైట్ అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారా? లేదా వీడియో స్పష్టంగా లేనందున మీరు ఇకపై వీడియో కాల్ చేయకూడదనుకున్నారా?

వీడియో కాల్‌ని బట్టి కెమెరా లైట్‌ని మార్చడం గురించి చింతించకండి. వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల నుండి వీడియో కాల్‌లు చేయడానికి వినియోగదారులకు సహాయపడే కొత్త సాంకేతికత పరిచయం చేసింది. లో లైట్ మోడ్ అనే కొత్త ఫీచర్ ఇప్పుడు మీకు WhatsApp కాల్స్ చేయడంలో సహాయపడుతుంది.

‘లో లైట్ మోడ్’ అందుబాటులోకి రావడంతో బ్యాడ్ లైట్‌లో కూడా కాల్‌లో ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా ఉంటుందని, కమ్యూనికేషన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని వాట్సాప్ అధికారులు చెబుతున్నారు.

యాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇంటర్‌ఫేస్‌లో కుడివైపు ఎగువన ఉన్న బల్బ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

యాప్ iOS, Android వెర్షన్‌లలో తక్కువ-కాంతి మోడ్ అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వీడియో కాల్ సమయంలోనే మెరుగైన అనుభవాన్ని అందించడానికి యాప్ ఇప్పటికే ఫీచర్లను ప్రవేశపెట్టింది. టచ్ అప్ ఫీచర్, ఫిల్టర్లను జోడించే ఆప్షన్, బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకునే ఫీచర్ తదితరాలు ఇంతకు ముందు వచ్చాయి. అలాగే వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడంతోపాటు ఫిల్టర్‌లను యాడ్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్‌ అవకాశం కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.

నీటిలో తేలియాడుతున్న వింత ఆకారం

సముద్ర గర్భంలో ఎన్నో వింత, అరుదైన జలచరాలు ఆవాసం ఉంటాయి. చిన్న చేపల నుంచి పెద్ద తిమింగలాల వరకు అంతులేని జలచరాలకు ఆవాసం ఈ సముద్రం. అంతటి సముద్రంలో ఒడ్డుకు వచ్చే జలచరాలు కొన్ని ఉంటే..

మరికొన్ని అరుదైన జాతికి చెందినవి సముద్రపు లోతుల్లో తిరుగుతూ.. తేలియాడుతుంటాయి. అయితే అలాంటి అరుదైన జాతికి చెందిన జీవులు.. మనకు తారసపడితే.. భలే బాగుంటుంది కదా ఆ ఊహే.! సరిగ్గా ఓ ఫిషర్‌మ్యాన్‌కు ఇదే జరిగింది. సముద్రంలో చేపల వేట చేస్తోన్న అతడికి ఓ వింత ఆకారం దర్శనమిచ్చింది. దాన్ని పట్టుకుని చూడగా.. వామ్మో.!

వివరాల్లోకి వెళ్తే.. ఆ ఫిషర్‌మ్యాన్‌కు చిక్కింది ఇస్టియోఫోరస్ జాతికి చెందిన సెయిల్ ఫిష్. ఇవి నీలం, బూడిద రంగులో కనిపించే సముద్రపు చేపలు. ఈ చేపలు తరచూ తమ వెనుక భాగాన్ని మొత్తంగా విస్తరిస్తాయి. సెయిల్ ఫిష్ అన్ని మహాసముద్రాలలోని చల్లని పెలాజిక్ నీటిలో నివాసముంటాయి. ఇవి ఇతర జలచరాల కంటే అత్యధిక వేగంగా ఈడుతాయి కూడా.

ఈ చేపలను చాలా మంది శాస్త్రవేత్తలు సముద్రంలో అత్యంత వేగంగా ఈడగలిగే చేపగా పరిగణిస్తారు. ఒకే సంవత్సరంలో సెయిల్ ఫిష్ సుమారు 1.2-1.5 మీ(4-5 అడుగులు) పొడవు పెరుగుతుంది. సాధారణంగా, సెయిల్ ఫిష్ పొడవు 3 మీ(10 అడుగులు) కంటే ఎక్కువ ఉండదు. అలాగే చాలా అరుదుగా 90 కిలోగ్రాముల(200 పౌండ్లు) బరువు ఉంటాయి.

నాగ చైతన్య- శోభిత పెళ్లి ముహూర్తం ఫిక్స్

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టునున్నాడు. సమంతతో విడాకుల అనంతరం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడిన ఈ హ్యాండ్సమ్ హీరో ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

ఈ ఏడాది డిసెంబర్ లోనే నాగ చైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ తొలిసారిగా జంటగా కనిపించారు. ఇక శోభిత ఇంట్లోనూ పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. దీంతో ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్‌గా మారాయి. కాగా సామ్ తో విడాకుల అనంతరం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేశాడు నాగ చైతన్య. తన సోషల్ మీడియా ఖాతాల్లో సామ్ తో కలిసున్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే ఒక్క ఫొటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు 2018లో మజిలీ కు సంబంధించిన పోస్టర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో కూడా ఉంది. దీనికి ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అని క్యాప్షన్‌ ఉంది.

అయితే తాజాగా ఆ ఫోటోను కూడా నాగ చైతన్య తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా ఈ ఫొటోను అలాగే ఉంచడంతో సమంత అభిమానులు ఫీలయ్యారు. వెంటనే ఈ ఫొటోను కూడా డిలీట్ చేయాలంటూ చైతన్యను కోరారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంత ఫొటోను, పోస్ట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

శోభిత ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు..

ఇక ల విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు నాగ చైతన్య. డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ ను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ పై అంచనాలను పెంచేశాయి.

నాగ చైతన్యతో శోభిత..

Health

సినిమా