Saturday, November 16, 2024

వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..

క్రీ. శ. 1591.. ‘చెంచలం’ అనే పేట వద్ద గోల్కొండ రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మాణానికి పూనుకున్నాడు. నీటిలోని చేపల వలె ఈ నగరంలోని ప్రజలు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని అప్పుడాయన దేవుడిని వేడుకున్నాడు.

ఆయన ఆశ నెరవేరి నగరం విస్తరించింది. ఆయన ప్రార్థన ఫలించింది. కోటి మందిని కడుపులో దాచుకున్న నగరం హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఐటీ, రాజకీయాలు, కొలువులు చదువులే కాదు, రోజూ వార్తల్లో వినిపించని ఎన్నోవిశేషాలుంటాయి.

నాలుగు వందల ఏళ్ల చరిత్రలో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో జాతుల వాళ్లు బతకడానికొచ్చారు. అన్ని మతాలను అక్కున చేర్చుకుని చరిత్రలో సమతకు పెట్టినిల్లుగా నిలిచింది. వేర్వేరు వేషభాషల ప్రజలందరినీ ఒక్కటి చేసిన చరిత్ర పేరు హైదరాబాద్, చరిత్రకారుడు ట్రావెర్నియర్తో ‘భాగ్నగర్’ అని ప్రశంసలందుకున్న ఉద్యాన వనాల నగరం ఇప్పుడు ఉద్యోగాల నగరమయింది. గోల్కొండ వజ్రాలు, ముత్యాల మార్కెట్లతో మొదలైన హైదరాబాద్ వైభవం నేటి ఐటీ అభివృద్ధితో ముందడుగిస్తూనే ఉంది.

1: ఉజ్జయినీ మహంకాళి ఆలయం

సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో శ్రీ ఉజ్జయినిమహంకాళి ఆలయం ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ నాటిది. ఈ గుడిలో శక్తికి,అధికారానికి దేవత అయిన మహంకాళి మాత జరిగే జాతరప్పుడు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

2 : ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్

ఉన్నత విద్యాభివృద్ధి కోసం వందేళ్ల క్రితం ఏడో నిజాం ప్రారంభించిన ఉస్మా నియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన కళాశాల ఇది. ఒకప్పుడు ఈ ఒక్క భవనంలోనే అన్ని కోర్సులు నిర్వహించారు. ఆ తర్వాత పలు కళాశాలలు నిర్మించారు. అజంతా, అరబిక్, రాజస్థానీ నిర్మాణ శైలితోపాటు ఇతర దేశాలకు చెందిన నిర్మాణ అంశాలను కూడా జోడించారు.

3: బేగంపేట విమానాశ్రయం

ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్ర యం. బేగంపేట విమానాశ్రయాన్ని 1930లో నిజాం రాజు ప్రారంభించిండు. 1937 లో టెర్మినల్ భవనం నిర్మించారు. 1972 లో క్రొత్త టెర్మినల్ భవనం నిర్మిం చారు. ఇందులో విమానయానం, విమాననిర్మాణాల ను వివరించే మ్యూజియం కూడా ఉంది.

4: బిర్లా ప్లానిటేరియం

విశ్వం ఎలా పుట్టింది. నక్షత్రాలు ఎలా లెక్కిస్తారు, నక్షత్ర మండలాలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకోవాలంటే ఈ ప్లానిటేరియంలో కూర్చుంటే చాలు ఆకాశాన్ని కళ్లకు కట్టేస్తారు. ఈ ప్రానిటేరియం పక్కనే ఆర్కియాలజీ మ్యూజియం ఉంది. ఇందులో ఆదిలాబాద్ అడవుల్లో సేకరించిన డైనోసార్ అవశేషాలతో డైనోసారియం’ అనే మ్యూజియం నిర్వహిస్తున్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని సైన్స్ మ్యూజియంలో చూడొచ్చు. సైన్స్ పాఠ్యపుస్తకాల్లో చదివే పలు భౌతిక ప్రయోగాలను ఈ మ్యూజియంలో చేసి వైజ్ఞానిక విశేషాలను తెలుసుకోవచ్చు.

5 : కింగ్ కోరి ప్యాలెస్

కమల్ ఖాన్ అనే సంపన్నుడు దీన్ని నిర్మించాడు. నిజాం తన పాలనను దర్బార్ హాల్ (పబ్లిక్ గార్డెన్)కు మార్చిన తర్వాత సౌకర్యం కోసం దీనిని కొనుగోలు చేశాడు. 1911లో ఇందులోకి అడుగుపెట్టారు. పరదా కప్పి ఉండే గేట్ ఈ ప్యాలెస్ లోని ప్రత్యేకతలలో ఒకటి. ఇందులో నిజాం కోసం ఏర్పాటు చేసిన విశాలమైన గ్రంథాలయం, విలాసవంతమైన గదులున్నాయి. ఏదో నిజాం భార్యలు, వాళ్ల పిల్లలు కూడా కూడా ఈవిశాలమైన ప్యాలెస్ లోనే నివసించేలా ఏర్పాట్లు చేశారు. ఆయన మరణానంతరం దీనిలోని కొంత భాగాన్ని వైద్యశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. ఈ ప్యాలెస్ వల్ల ఆ ప్రాంతానికి కింగ్ కోరి అనే పేరు స్థిరపడింది.

6 : బ్రిటీష్ రెసిడెన్సీ

నిజాం పాలకులకు, బ్రిటీష్ వారికి సైనిక సహకార ఒప్పందం కుదిరిన తర్వాత బ్రిటీష్ పాలకుల కోసం దీనిని నిర్మించాడు. ఇది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను పోలీ ఉంటుంది. 1857లో జరిగిన ప్రథమ స్వతంత్య్ర సంగ్రామ ప్రభావంతో ప్రజలు దీనిపై కూడా దాడి చేశారు. ఆ దాడి జ్ఞాపకాలు, త్యాగాల గుర్తులు ఇప్పటికీ అక్కడ పదిలంగా ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించిన తర్వాత అందులో మహిళా కళాశాల నిర్వహిస్తున్నారు.

7: సాలార్జంగ్ మ్యూజియం

సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతి పెద్ద మ్యూజి యం. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాల కళాత్మక వస్తువుల భాండాగారం, నిజాం నవాబుల వద్ద పరిపాలకులుగా ఉన్న ‘సాలార్ జంగ్ కుటుంబం” ప్రపంచం నలు మూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించిం ది.

ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులు, నగలు, నగిషీలు, యుద్ధసామగ్రి, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణల్లో మూడో సాలార్ జంగ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే. ఎక్కువ. కొన్ని అతని తండ్రి, తాత సేకరించినవి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశ విదేశాల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించిండు. నలభై సంవత్సరాల కాలంలో అతను సేకరించిన విలువైన, అరుదైన కళాఖండాలన్నీ సాలార్ఆంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదేశం: నయాపూల్, ఫోన్: 040 2457 6443, టికెట్: రూ. 20, సెలవు శుక్రవారం

8 : చార్మినార్

హైదరాబాద్ నగర చరిత్రలో ఇదో మైలురాయి. కుతుబ్ షాహీల పాలనకు ఇది సూచిక, కుతుబ్ షాహీలు నిర్మించిన అతి ప్రాచీనమైన కట్టడం ఇది. దీని కేంద్రంగానే నాలుగు వందల ఏళ్లలో హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. నాలుగు ఎత్తయిన (160 అడుగులు) మినార్లు ఉన్నాయి కాబట్టే దీనిని చార్మినార్ అన్నారు. ఇది రెండంతస్తులు కట్టడం. రెండో అంతస్తులో మసీదు నిర్మాణం ఉంది. అనాటి ఫౌంటెన్ ఇప్పటికీ ఉంది. 840 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉంది. ప్రతి మినార్లో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో ఏక రీతిలో ఉండే ఆరు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీనికి సమీపంలోనే ఉన్న లాడ్ బజార్ లక్క గాజులు), యునానీ దవాఖాన, మహబూబ్ చౌక్ కూడా చూడదగినవి

సెలవు: లేదు
టికెట్: రూ. 5

9: చౌమహల్లా ప్యాలెస్

నాలుగు సౌధాలు ఉన్న ప్యాలెస్ ఇది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. పర్షియాను పాలించిన ఖజర్ పాలకులు ప్యాలెస్ నిర్మాణ శైలిలో నాలుగో నిజాం సలాబాద్ జంగ్ పాలనా కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైంది. 1880లో నిర్మాణం పూర్తయింది. ఈ ప్యాలెస్ లోని ఖిల్వత్లో దర్బార్ నిర్వహించేవారు. ఈ చౌమహల్లాలో ఖరీదైన విదేశీ ఝూమర్లు ఫొటోలు, పెయింటింగ్స్, ఫర్నీచర్, ఆయుధాలను కూడా చూడొచ్చు. నిజాం కుటుంబ సభ్యులు ఉపయోగించిన వంట పాత్రలు. మొదలైనవెన్నో ఇందులోప్రదర్శనకు ఉంచారు.

సెలవు : శుక్రవారం,
ఫోన్: 040 4522032
టికెట్: 50 రూ. 1012 ఏళ్లలోపు పిల్లలకు ఫొటో కెమెరాకు రూ. 50, వీడియో కెమెరా రూ. 100

10 : పబ్లిక్ గార్డెన్

ఇది నిజాం కాలంలో జంతు ప్రదర్శనశాల. ఈ జంతు ప్రదర్శన శాలను తర్వాత బహదూర్పురాకు తరలించి పబ్లిక్ గార్డెన్ నిర్మించారు. ఇందులో శాసనసభా భవనం, శాసన మండల భవనం (జూబ్లీహాల్), బాలభవన్, హెల్త్ మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని నిజాం నవాబు తన మనుమరాలు బొమ్మలు దాచుకునేందుకు ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దీనిని పురావస్తు మ్యూజియంగా అభివృద్ధి చేశారు. అత్యధిక సంఖ్యలో నాణేలు ఉన్న మ్యూజియాల లో ఇది ఒకటి. బాలభవన్లో నిజాం కాలంలో ఇండస్ట్రీయ ల్ మ్యూజియం నిర్వహించారు. జూబ్లీహాల్ ఏడో నిజాం దర్బార్ నిర్వహించేవాడు. ఆయనకు పట్టాభిషేకం అయిన ప్పుడు నిర్వహించిన జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కొత్త దర్బార్ హాల్ నిర్వహించారు. అందుకే దానికి జూబ్లీ హాల్ అనే పేరు వచ్చింది..

11: నెహ్రూ జంతు ప్రదర్శనశాల

భారత దేశంలోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలో ఇది ఒకటి. 1963లో బహదూరులో దీనిని ప్రారంభిం చారు. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతు ప్రదర్శన లశాలలో సఫారీ చేస్తూ కీకారణ్యాలలోని కౄరమృగాల జీ వితాన్నిచూసిరావచ్చు. ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’లో జీవ వైవిధ్యాన్ని, జీవ పరిణామం తెలుసుకోవచ్చు. యాంఫీ థియేటర్లోని ప్రకృతి పాఠశాల ఎన్నో వైజ్ఞానిక విశేషాల ను వివరిస్తుంది. ‘జూ ఎడ్యుకేషన్’లో చెప్పే జంతు శాస్త్ర పారాలను సందర్శకులు ఎప్పటికీ మర్చిపోరు. పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు, చింపాజీలు పలు సర్ప జాతులు (పాములు), పాలిచ్చే జంతువులు (క్షీరదాలు). వందల రకాల పక్షి జాతులు ఈ జూలో ఉన్నాయి.

సెలవు: సోమవారం
టికెట్: రూ.20, రూ.15 పిల్లలకు), ఫొటో కెమెరా రూ. 20, వీడియో కెమెరా రూ. 100

12 : గోల్కొండ కోట

ఇది దక్కను పాలించిన కుతుబ్ షాహీల పాలనా కేంద్రం. గోల్కొండ నగరం కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన వల్లరాతి కొండమీద కట్టారు. కోట చుట్టూ ఉన్న రక్షణ గోడ ఎత్తయిన బురుజులతో ఉంటుంది. పెద్ద పెద్ద ద్వారాలు, వాటి అలంకరణలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అయిదు శతాబ్దాల క్రితం కోట నిర్మాణంలో మనవాళ్ల సామర్థ్యానికి ఈ కోట నిదర్శనం. కోటలో మూడు అంతస్తులలో నిర్మించిన సభామండపాన్ని ‘బరాదరి’ అంటారు. దీని నుండి గోషామహల్ బరాదరికి సొరంగ మార్గం ఉంది. చరిత్రలో పజ్రాల వేటకు, ముత్యాల వ్యాపారానికి గోల్కొండ ప్రసిద్ధిగాంచింది. ఆ సంపద పరిరక్షణ కోసం ఈ కోట పటిష్టంగా నిర్మించారు. ఈ కోటకు ఎనిమిది సింహ ద్వారాలున్నాయి. కోటలోపల నాలుగు వంతెనలు ఉన్నాయి. ప్యాలెస్లు, మసీదులు, కుతుబ్షాహీల సెక్రటేరియట్, ఉద్యానవనం, బావులు, బడీ బౌలి నుంచి అంతఃపురానికి, ఉద్యాన వనానికి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపైన్ ఇప్పటికీ ఉన్నాయి. 1200 గ్యాలన్ల నూనె నిల్వ చేసే భాండాగారము, కొత్త వారి ప్రవేశాన్ని పసిగట్టేలా నిర్మించిన క్లాప్ ఏరియా మొదలైన ప్రత్యేకతలెన్నో ఉన్న కోట ఇది. ఆషాఢంలో బోనాల జాతర మొదలయ్యేది ఈ కోటలోని ఎల్లమ్మ ఆలయంలోనే

ప్రవేశం: టికెట్ రూ. 15, ఫొటో కెమెరా రూ. 25, వీడియో కెమెరా రూ. 130
ఫోన్: 04023512401
సౌండ్ అండ్ లైట్ షో: రూ. 60 రూ. 140

13 : హరిణి వనస్థలి పార్క్

హైదరాబాద్ శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆటోనగర్ వద్ద ఈ పార్క్ ఉన్నది. 3,800 ఎకరాల స్థలంలో ఈ పార్క్ విస్తరించి ఉంది. హైదరాబాద్ స్టేట్ చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేట కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. 1994వ సంవత్సరంలో ‘మహావీర్ హరిణ వనస్థలి’ పేరుతో జాతీయవనం ఏర్పాటు చేశారు. ఇందులో కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, వివిధ రకాల పాములు, పక్షులు, సీతా కోక చిలుకలు ఉన్నాయి. ఇందులోనే.. చిలుకల కోసం ప్రత్యేకంగా ఒక హక్కు ఉంది. అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇందులోని వృక్షాలు దట్టమైన కారడవులను తలపిస్తాయి. పర్యాటకుల కోసం ఈ పార్కులో వసతి గృహాలు కూడా ఉన్నాయి.

పొన్: 040 2428 6523
సెలవు: సోమవారం
టికెట్: రూ. 20, పిల్లలకు రూ. 15 కెమెరా అనుమతించరు.

14 : స్పానిష్ మసీద్

చూపులకు చక్రలాగా ఉంటుంది.. కానీ ఇది మసీదు. దీనిని బేగంపేటలో వందేళ్లకు పూర్వం పాయిగా ప్రభువు ఇక్బాల్ ఉద్దేలా . దీనిని నిర్మించాడు. స్పెయిన్లోని
నిర్మాణ శైలిలో దీని నిర్మాణంఉంటుంది.

కాచిగూడ రైల్వే స్టేషన్

దక్షిణ మధ్య రైల్వేలో అందమైన స్టేషన్ ఇది. పెద్ద గుమ్మటము, దానికి రెండు వైపులా గుమ్మటాలు, మినార్లతో ఉన్న ఈ స్టేషన్ని చూడగానే ప్యాలెస్ అనిపిస్తుంది. ఎంతైనా నవాబులు నిర్మించినది. కదా! అంతేనా? ఇది నవాబుల కుటుంబ సభ్యులు రైలు ఎక్కేందుకు నిర్మించారట. నిజాం స్టేట్ గ్యారంటీడ్ రైల్వేడు ఇది ప్రధాన కేంద్రం. 1916లో నిర్మించారు.

లాల్ దర్వాజ సింహవాహిని ఆలయం

పాతబస్తీ బోనాలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఈ ఆలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన మహారాజా కిషన్ పర్షద్ 1907లో దీనిని నిర్మించాడు. ఎర్రని దర్వాజాలు ఉండటం వల్ల దీనిని లాల్ దర్వాజా అని ఉర్దూలో పిలిచేవారు. శ్రీ సింహవాహినీ మహంకాళి ఆలయం ఇది. చార్మినార్కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రవేశం ఉచితం

పురానీ హవేలీ

యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ప్యాలెస్ ను మెమెన్ సామ్రాజ్యం నుంచి వచ్చిన రుకుండల్లా నిర్మించాడు. 1717లో రెండవ నిజాం రాజు మీర్ నిజాం ఆలీ ఖాన్ దీనిని కొనుగోలు చేశాడు.. చౌమహల్లా ప్యాలెస్ కు ముందు రోజుల్లో నిజాంల అధికారిక నివాసం ఇది. అందుకే దీనిని ‘పురానీ హవేలీ’ అని పిలుస్తారు. ‘పాత భవనం’ అని దీని అర్థం. ఇందులో ఇప్పుడు నిజాంల పాలనా విశేషాలు, వైభవం, విలాసాలు తెలిపేందుకు నిజాం మ్యూజియం’ నిర్వహిస్తున్నారు. ఇందులో నిజాం
రాజుల చిత్రాలు, దుస్తులు, ఆయుధాలు, వాహనాలు, ఆభరణాలు, వాళ్ల రాజముద్రలు,
ఫర్మానాలు ప్రదర్శనకు ఉన్నాయి.

ఫోన్: 040 2452 1029, టికెట్: రూ. 80, పిల్లలకు రూ. 15, కెమెరా: 150-500
సెలవు: శుక్రవారం

దక్షిణ తాజ్ మహల్.. పాయిగా టూంబ్స్

పాయిగా రాజు కుటుంబానికి చెందిన ఎనిమిది తరాల సమాధులున్నాయిక్కడ. 32 మంది రాజులు, రాజు కుటుంబీకుల సమాధులతోపాటు, చక్కని నిర్మాణ కళను ఇకడ చూడొచ్చు. మూడు వందల సంవత్సరాల చరిత్ర చెప్పే సమాధులివి. మొఘల్, గ్రీక్, పర్షియన్, అసఫ్ జాహీ, రాజస్తానీ, దక్కనీ నిర్మాణ శైలి సమ్మేళనం ఈ పాలరాతి కట్టడాలు, అందుకే దీనిని దక్షిణ తాజ్మహల్ ‘ అని చరిత్రకారులు అభివర్ణించారు.

సమాధిపై వేలాడే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు, వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పును బట్టి రంగులు మారే మార్బుల్స్ ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి. పర్షియన్ నిర్మాణ కళలో గోదల అలంకరణలో ఉండే స్టతో కళను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ తలుపులు తయారు చేశారు. ప్రకో కళతో తలుపులు, అడ్డు తెరలున్న నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు..ప్రవేశం ఉచితం. అన్ని రోజులూ సందర్శనకు అనుమతిస్తారు.

స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

ఈ గ్రంథాలయం మూసీ నది తీరంలో అల్గాంజ్లో ఉంది. ఈగ్రంథాలయం స్వాతంత్య్రానికి ముందు అసాఫియా లైబ్రరీగా ప్రసిద్ధి. ఈ గ్రంథాలయం ప్రస్తుతమున్న భవనాన్ని1891లో నవాబ్ ఇమాముల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ కట్టించాడు. ఈ భవనం అపూర్వ కళాఖండం. ఇంటాక్ హైద్రాబాద్ సంస్థ ఈ భవనాన్ని సంప్రదాయపారంపరిక వారసత్వంగా 1998లో ప్రకటించింది. గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు ఐదు లక్షల పుస్తకాలు, పత్రికలు, తాళ పత్ర గ్రంథాలు ఉన్నాయిక్కడ.

శిల్పారామం

గ్రామీణ, జానపద కళల ప్రదర్శన, హస్త కళా ప్రదర్శనతో నిత్యం సందర్శకులను ఆకట్టుకునే పట్నంలోని పల్లె శిల్పారామం మాదాపూర్లో సైబర్ టవర్ కు దగ్గర్లో ఉంటుంది శిల్పారామం. భారత దేశంలోని ప్రాచీన హస్త కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఏడాది పొడవునా సంప్రదాయ పండుగలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల హస్త కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులు అమ్ముతారు.

సంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కిన ఫర్నిచర్ మొదలైనవి ఇక్కడ కొనవచ్చు. పల్లె అందాల్ని తలపించే కోనసీమ, ఆధునిక శిల్పకళతో ఆలోచింపజేసే పార్క్, రాక్ గార్డెన్, గ్రామాలలోని చేతి వృత్తులను వివరించే రూరల్ మ్యూజియం, వినోదంతోపాటు పసందైన విందులు కూడా ఉండే నైట్ బజార్లో విహారం మరచిపోని అనుభూతి.

ఫోన్: 08886652004
టికెట్: రూ. 40, పిల్లలకు రూ. 20, బోటింగ్ రూ. 30, బ్యాటరీ కార్ ప్రయాణం రూ. 15

టోలి మసీదు

కుతుబ్ షాహీ నిర్మాణాలలో ఇది ప్రముఖమైనది. టోని మసీద్ నాలుగు వందల ఏళ్ల నాటి మసీదు ఇది. దీనిని స్థానికులు డత్రి మసీద్ అని కూడా పిలుస్తారు. గోల్కొండ కోట నుంచి చార్మినార్కు పోయే దారిలో కార్వాన్ వద్ద ఉంటుంది. హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి మసీదు మక్కా తర్వాత నిర్మించినది ఈ మసీదునే. పైభాగంలోని పిట్టగోడల ఆర్ట్స్ పైన ఉన్న శిల్పకళ అద్బుతమైనది. ఈ పిట్టగోడలపై మొత్తం ఐదు ఆర్ట్స్లు ఉన్నాయి. ప్రతి ఆర్కే, దానిని ఆవరించన దీర్ఘచతురస్రాల మధ్య అందమైన పద్యాలు చెక్కారు. మధ్యభాగంలోని ఆర్చి మిగిలిన నాలుగింటికన్నా పెద్దగా, ఎక్కువ శిల్పకళతో అలంకరించారు.

Virat Kohli: వీడియో: చిరుత కూడా ఇంత వేగంగా పరిగెత్తదేమో? కోహ్లీ చేసిన మెరుపు రనౌట్ చూసి తీరాల్సిందే!

విరాట్ కోహ్లీ.. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు. ఆ పేరు చెప్పగానే అందరి మదిలో మెదిలేవి ఇవే. తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ కు ఏకఛత్రాదిపత్యంగా ఏలుతూ వస్తున్నాడు ఈ రన్ మెషిన్.

ఇక ఇతడు మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు చమటలు పట్టాల్సిందే. బ్యాటింగ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో.. ఫీల్డింగ్ లో అంతకంటే అగ్రెసివ్ గా దూసుకెళ్తాడన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చిరుత కంటే వేగంగా పరిగెత్తి అతడు చేసిన మెరుపు రనౌట్ ను చూసితీరాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది.

పంజాబ్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో చెలరేగిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. ఆర్సీబీ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు తొలి ఓవర్లోనే భారీ షాకిచ్చాడు స్వప్నిల్ సింగ్. ఓపెనర్ ప్రబ్ సిమ్రన్ సింగ్(6) కు ఎల్బీగా అవుట్ చేశాడు. అనంతరం జానీ బెయిర్ స్టోతో జతకలిసిన రొసోవ్.. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బెయిర్ స్టో(27) అవుట్ అయ్యే సమయానికి పంజాబ్ 5.5 ఓవర్లో 71 పరుగులు చేసింది. అతడు పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నయా సంచలనం శశాంక్ సింగ్ తో కలిసి రోసోవ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలోనే 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న శశాంక్ సింగ్ ను చిరుత కంటే మెరుపువేగంతో పరిగెత్తుకొచ్చి రనౌట్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఈ సంఘటన పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో పెర్గ్యూసన్ వేసిన 4వ బంతిని డిఫెన్స్ ఆడి.. ఒక రన్ తీసి, రెండో రన్ కు ప్రయత్నించారు. ఈలోగా బౌండరీ లైన్ దగ్గర నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా చిరుత కంటే స్పీడ్ గా పరిగెత్తుకొచ్చి.. డైవ్ చేస్తూ త్రో విసిరాడు. ఆ బాల్ కాస్త డైరెక్ట్ గా వికెట్లను గిరాటేసింది. అప్పటికి శశాంక్ ఇంకా క్రీజ్ లోకి రాలేదు. దాంతో అతడు రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ కోహ్లీ చేసిన రనౌట్ చూసి బిత్తరపోతున్నాడు. కాళ్లలో స్పింగ్స్ ఉన్నాయా? కోహ్లీ భాయ్.. అలా పరిగెత్తావ్ ఏంటి? నువ్వు ఒలింపిక్స్ కు వెళ్తే ఇండియాకు గోల్డ్ మెడల్ ఖాయం.. అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

యూట్యూబ్ నే మోసం చేశాడు.. 3.5 కోట్లు కొట్టేశాడు..!

ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.

మీరు ఆకట్టుకునే విధంగా కంటెంట్ క్రియేట్ చేయగలిగితే చాలు మీరు లక్షలు సంపాదించవచ్చు. అందుకు యూట్యూబ్ ఎంతో ప్రోత్సాహకం అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది క్రియేటర్స్ మిలియన్స్ కొద్దీ సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుని తమ టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ఒకడు మాత్రం తన టాలెంట్ చూపించి ఏకంగా యూట్యూబ్ నే బురిడీ కొట్టించేశాడు. ఏకంగా కోట్లలో సంపాదించుకున్నాడు.

ఈ ఘటన చైనాలో జరిగింది. అక్కడి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ విషయం వెలుగు చూసింది. ఆ వ్యక్తి నేరుగా యూట్యూబ్ ని మోసం చేయలేదు. కానీ, తన సర్వీస్ తో విక్రయదారులను పొంది ఏకంగా కోట్లలో సంపాదించుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. చైనాలో వాంగ్ అనే వ్యక్తి ఏకంగా 4,600 మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అన్నీ ఫోన్లని ఆపరేట్ చేసేందుకు ఒక సాఫ్ట్ వేర్ తీసుకున్నాడు. అలాగే కొన్ని వీపీఎన్ సర్వీసులను కూడా కొనుగోలు చేశాడు. దీనివల్ల వాంగ్ కేవలం ఒక్క క్లిక్ తో ఆ 4,600 ఫోన్లను ఆపరేట్ చేయగలడు. అలా అన్ని ఫోన్స్ తో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, ఫేక్ వ్యూవర్స్ ని సృష్టించేవాడు.

ఈ సర్వీస్ ద్వారా వాంగ్ తనకు నచ్చిన వీడియో లైవ్ స్ట్రీమింగ్ చూడటం, షేర్స్ చేయడం వంటివి చేసేవాడు. అలా కేవలం 4 నెలల వ్యవధిలో ఏకంగా రూ.3.4(4,15,000 డాలర్లు) కోట్లు సంపాదించుకున్నాడు. ఇతను ఈ సర్వీస్ ని యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ స్ట్రీమ్ చేసే వారికి అందించేవాడు. అలా చేయడం వల్ల వారికి లైవ్ స్ట్రీమింగ్ లో ఫేక్ బూస్టింగ్ లభిస్తుంది. అలా తాను డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అక్కడి ప్రభుత్వం చట్టాల ప్రకారం దీనిని ఒక స్కామ్ గానే పరిగణించారు. ఇది డైరెక్ట్ స్కామ్ కాకపోయినా.. ఆ ఫోన్స్ ద్వారా మరో కుంభకోణం చేసే అవకాశం ఉందంటూ తెలిపారు.

ఈ వాంగ్ అనే వ్యక్తికి ఏకంగా 15 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే 7 వేల డాలర్ల జరిమానా కూడా వేశారు. నిజానికి వాంగ్ చేసిన ఆలోచనకు అంతా పిచ్చోళ్లైపోయారు. ఎందుకంటే ఇలాంటి ఒక సర్వీస్ ని స్టార్ట్ చేసి డబ్బు సంపాదిచవచ్చు అని అతను కనుగొనడాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోన్లను వాడేందుకు వాంగ్ కు కేవలం రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు. అది కూడా ఆ ఫోన్ ఎంతసేపు ఆన్ లో ఉంటుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి యూట్యూబ్ ని కూడా బాగానే బురిడీ కొట్టించి.. కోట్లు అయితే సంపాదించాడు. కానీ, తప్పును ఎక్కువ రోజులు దాచలేరు కాబట్టి అతను జైలు పాలయ్యాడు.

YS Sharmila Emotional : అంత మాట అంటావా అన్నా – కంటతడి పెట్టుకున్న షర్మిల !

Elections 2024 : వైఎస్ కుటుంబంలో రాజకీయాలు వీధికెక్కుతున్నాయి. షర్మిలపై జగన్ చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ చానల్ ఇంటర్యూలో కుటుంబంలో విబేధాలకు షర్మిల రాజకీయ కాంక్షే కారణం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

దీనిపై షర్మిల మీడియా ఎదుట స్పందించారు. ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు.

నన్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డే – వైసీపీ కోసం పని చేయలేదా ?

జగన్మోహన్ రెడ్డి అరెస్టు టైంలో , 19 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగిందని ఎవరని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని ప్రశఅనించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ కాంక్ష ఉంటే పాదయాత్ర చేసినప్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకునే ఉంటే అడిగేది ఎవరని మండిపడ్డారు.

పదవే కావాలనుకుంటే.. మొండిగా పొందగలను !

పొందాలనుకున్న పదవి మొండిగానైనా పొందగలనని షర్మిల స్పష్టం చేశారు. వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చేయాలని అనుకున్నారు. మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. మీతో ఉన్నంత కాలం సీఎంగా అయ్యే వరకు నాకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. నేను నా అన్న కోసం చేశాను. వైఎస్ సంక్షేమ పాలన తీసుకొస్తానని నమ్మానని చెప్పుకొచ్చారు. బైబిల్ ఒట్టేసి చెబుతున్నాు… నాకు ఎలాంటి రాజకీయ కాంక్ష లేదు. మిమ్మల్ని ఎప్పుడు పదవులు అడగలేదు.. దీని గురించి బైబిల్ పై ప్రమాణఁ చేస్తాను మీరు చేస్తారా అని షర్మిల ఎమోషనల్ అయి కంట తడి పెట్టారు.

ఆర్థిక సాయం అడిగినట్లుగా నిరూపించగలరా ?

కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లో ఉండకూడదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. అవినాష్ రెడ్డి బంధువు కాదా అని ప్రశ్నించారు. కమలాపురంలో పోటీ చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి బందువ కాదా అని ప్రశ్నించారు. పైగా తనపై నిందలు వేస్తున్నారని ఏదో ఆర్థిక సాయం, పనులు అడిగారని.. వాటిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించినందునే తాను బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పైసా సాయం అడిగినట్టు నిరూపించగలరా అని వైఎస్ జగన్ కు షర్మిల సవాల్ చేశారు. రాజశేఖర్ కొడుకు అనే మాట మర్చిపోయారని విలువల్లేకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ ఔట్.. కొత్తగా వచ్చేది ఎవరంటే?

Team India Head Coach: టీమిండియా కొత్త కోచ్ నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా ధ్రువీకరించారు. 2021 నవంబర్ నుంచి టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతని కాంట్రాక్ట్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ, ద్రవిడ్‌కు మరోసారి పొడిగింపు ఇచ్చేలా కనిపించడం లేదు. బోర్డు త్వరలో కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేస్తుంది. భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ప్రస్తుత బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం జూన్‌లో ముగుస్తుంది. అప్పుడు భారత జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ ప్రచారంలో పాల్గొంటుంది.

2023 నవంబర్లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ తన సహాయక సిబ్బందితో కలిసి రంగంలోకి దిగాడు. కానీ, కొత్త కాంట్రాక్ట్ 2024 జూన్ చివరి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాగా, ద్రవిడ్ కోరుకుంటే ఈ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మునుపటిలా ఆటోమేటిక్ పొడిగింపు ఉండదని జయ్ షా ధృవీకరించారు.

రాహుల్ పదవీకాలం జూన్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి, అతను దరఖాస్తు చేయాలనుకుంటే, చేయవచ్చు” అని బీసీసీఐ కార్యదర్శి క్రిక్ బజ్‌కు తెలిపారు. అయితే, విదేశీ కోచ్‌ను నియమించే అంశాన్ని తోసిపుచ్చారు.

బటన్‌ నొక్కి చాలా రోజులైనా నిధులెందుకు జమ చేయలేదు?: ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ

అమరావతి: నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది. బటన్‌ నొక్కి చాలా రోజులైనా.. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్‌ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది.

ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికల కోడ్‌ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని.. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్‌ లభించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్‌ 1 వరకు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Loksabha Election 2024 : సార్ నేను ప్రెగ్నెంట్.. ఎలక్షన్ డ్యూటీ వద్దని లీవ్ అప్లై చేసిన ఉపాధ్యాయుడు

Loksabha Election 2024 : ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హర్యానాలోని జింద్‌లోని విద్యాశాఖలో ఓ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ ఓ మగ టీచర్ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించుకునేందుకు గర్భిణిలా నటించాడు. జింద్‌లోని దహౌలా గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ జిల్లా పరిపాలనకు పంపిన ఉద్యోగుల డేటాలో, పీజీటీ హిందీ పోస్ట్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సతీష్ కుమార్‌ను మహిళా ఉద్యోగిగా మాత్రమే చూపించలేదు. గర్భిణిగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ విధించడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్ మహిళ గర్భవతిగా ఉన్నట్లయితే డేటాను క్యాప్చర్ చేయదు. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ కుమార్‌ను ఎక్కడా డ్యూటీలో పెట్టలేదు.

ఈ విషయం జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇమ్రాన్ రజా దృష్టికి రావడంతో అతను షాక్ అయ్యాడు. అతను వెంటనే అమలులోకి వచ్చే మొత్తం విషయంపై దర్యాప్తు ప్రారంభించాడు. ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న పీజీటీ సతీష్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, పాఠశాల కంప్యూటర్ ఆపరేటర్ మంజీత్‌లను డీసీ తన కార్యాలయానికి పిలిపించి ఇదంతా ఎలా జరిగిందని ప్రశ్నించారు. కానీ అందులో ఎలాంటి సమాచారం లేదని ముగ్గురూ చెప్పారు. డీసీ కార్యాలయంలో ఉన్న డీఈవో సుష్మా దేశ్వాల్, కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చి ఈ కేసు గురించి సమాచారం ఇచ్చారని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారని, ఆ తర్వాత డేటాను తనిఖీ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల సంఘం, విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా పంపనున్నారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికలను నిర్వహించడానికి, జిల్లా యంత్రాంగం అధికారులు, ఉద్యోగుల విధిని విధిస్తుంది. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల నుండి ఒకటో తరగతి వరకు అధికారులు ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు, వీడియో సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో సహా చాలా చోట్ల ఉద్యోగులను విధుల్లో ఉంచారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి, జిల్లా యంత్రాంగం అధికారులు, ఉద్యోగుల కోసం అనేక వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. ఇందులో ఉద్యోగులకు ఈవీఎంల గురించి సవివరమైన సమాచారం అందించబడుతుంది. తద్వారా ఏ స్థాయిలోనూ తప్పులు జరగలేదు. కొంతమంది అధికారులు, ఉద్యోగులను ఎన్నికల విధుల నుండి రిలీవ్ చేయడానికి నేరుగా లేదా పరోక్షంగా జిల్లా పరిపాలనకు సిఫార్సులు అందుతాయి. జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వవచ్చు.

BREAKING: వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు

BREAKING: వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు అయింది. వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హై కోర్టు.

వివేకా నందారెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు.

వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారని కృష్టారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే… పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్. దీంతో వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హై కోర్టు. ఈ తరుణంలోనే.. వైఎస్ సునీతకు ఏపీ హై కోర్టులో చుక్కెదురు అయింది.

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌..!

బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) అభ్యంతరక వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించిందని జాతీయ మహిళా కమిషన్‌ తెలిపింది. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు.(Karnataka Sex Scandal)

పత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సిట్ అధికారులు ఆ మహిళలను బెదిరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే.. వ్యభిచారం కేసు నమోదు చేస్తామని భయపెట్టినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కిడ్నాప్‌నకు గురైన మహిళను మీరు ఎక్కడ ఉంచారు..? ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు..?’’ అని ప్రశ్నించారు. కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర స్పందించారు. జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హాసనకు చెందిన జేడీఎస్‌ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోయారు. అతడిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. వారికి తెలియకుండా నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలో అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని చెప్పారు.

ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్లకే గుండెపోటు ఎక్కువగా వస్తుంది! ఎందుకంటే?

ఎక్కువగా గుండెపోట్లుమగవారికే వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అయితే మగాళ్లకే ఎందుకు గుండెపోటు వస్తుంది? ఆడవారికి ఎందుకు తక్కువగా వస్తుంది అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఆడవాళ్ళకి హార్ట్ ఉండదు కాబట్టి వారికి గుండెపోటు రాదు అని అంటారు. ఇంకొందరైతే ఆడవాళ్లు మగాళ్ల గుండెల్లో ఉంటారు కాబట్టి మగాళ్లకే గుండెపోటు వస్తుంది అని అంటారు. ఈ జోకులు ఎప్పుడూ ఉండేవే. అయితే శాస్త్రీయంగా ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. గుండెపోటు వచ్చిన 50 శాతం మగాళ్లలో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారు. గుండెపోటు ఉన్న 25 శాతం మగాళ్లలో 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే ఉన్నారట. విదేశీ వారితో పోలిస్తే.. మన దేశంలో ఉన్న మగాళ్లు రెండు రెట్లు ఎక్కువగా గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా మగవారికి గుండెపోటు రావడానికి సిగరెట్ స్మోకింగ్, మద్యపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక కొవ్వు, ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇనాక్టివిటీ, మధుమేహం, ఒత్తిడి వంటివి కారణమవుతాయి. అయితే మగాళ్ళతో పోలిస్తే ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.

స్త్రీలలో మోనోపాజ్ దశకు ముందు, ఈస్ట్రోజన్ స్థాయి అధికంగా ఉంటుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ కారణంగా ఆడవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే మోనోపాజ్ దశ తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని కారణంగా మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మోనోపాజ్ దశ అనేది 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుంది. అంటే ఆడవారిలో 45 ఏళ్లు దాటిన తర్వాత గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 30 ఏళ్ల లోపు ఉన్న మగవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. మళ్ళీ దీనికి ఒత్తిడి, మధుమేహం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత జబ్బులు ఉంటే ఆ అమ్మాయికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

కాబట్టి డైట్, జీవన విధానాన్ని సరిగా మెయింటెయిన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఇంట్లో ఎవరికైనా కార్డియోవాస్క్యులర్ డిసీస్ ఉంటే 50 ఏళ్ల పైబడిన మహిళలకు గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే మగాళ్లతో పాటు మాకూ సమాన హక్కులు కావాలని కోరుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. మందు, చిందు, సిగరెట్, డ్రగ్స్ వంటివి తమ హక్కు అని చెప్పి అలవాటు చేసుకునే అమ్మాయిలకి సాధారణ స్త్రీలతో పోలిస్తే.. ఎక్కువ శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. ఓవరాల్ గా సైంటిఫిక్ గా ఆడవారితో పోలిస్తే మగాళ్లకే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

First Class Students: ఈనెల 10లోగా ఉచిత సీట్లలో విద్యార్థులను చేర్పించాలి..!

విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఉచిత అడ్మిషన్లు లభించిన విద్యార్థులను ఈ నెల 10లోపు ఎంపికైన స్కూల్లో చేర్పించాల్సి ఉంటుందని సమగ్రశిక్ష శ్రీకాకుళం జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ రోణంకి జయప్రకాష్ తెలిపారు. మంగళవారం సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం 3,185 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.

మొదటి దశలో 796 మందిని పాఠశాల విద్య ఉన్నతాధికారులు తగు అర్హతలు ఆధారంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సమాచారాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చేరవేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో కూడా పొందుపర్చినట్టు చెప్పారు. ఈ నెల 10లోపు విద్యార్థులను పాఠశాలల్లో చేర్చాలని కోరారు. సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్లు పూర్తిచేసిన విద్యార్థుల వివరాలతో రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్‌ ఖరారు

ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది రెమ్యూనరేషన్‌ ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు రోజుకు రూ.350 చొప్పున ఆరు రోజులకు రూ.2100 చెల్లిస్తారు. పోలింగ్‌ ఆఫీసర్లు 1, 2, 3, 4కు రోజుకు రూ.250 చొప్పున మూడు రోజులకు ఒక్కొక్కరికి రూ.750 చెల్లిస్తారు. మైక్రో అబ్జర్వర్‌కు ఏకమొత్తంగా వెయ్యిరూపాయలు చెల్లిస్తారు. సిబ్బంది, అధికారులకు భోజనం, అల్పాహారం సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాటు చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది పారితోషికం లంచ్‌ ప్యాక్‌కు సంబంధించి విధులను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు జమ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విధులకు హాజరైన వారికి కూడా పైన పేర్కొన్న రేట్ల ప్రకారం పారితోషికం చెల్లిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన వారికి సంబంధిత సెక్టోరల్‌ అధికారుల ద్వారా చెల్లిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల సిబ్బంది రెమ్యూనేషన్ పై ప్రకాశం కలెక్టర్ ఉత్తర్వులు
ఎన్నికల సిబ్బంది రెమ్యూనేషన్ పై ప్రకాశం కలెక్టర్ ఉత్తర్వులు

Healthy Diet: 56 శాతం రోగాలు అలాంటి ఆహారం వల్లే – ఈ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యం: ICMR

ICMR Guidelines: ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవాలి. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంతే ఆరోగ్యంగా ఉంటారు. సమతుల ఆహారంతో అందరూ హెల్దీగా ఉంటారు. లేదంటే, రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సుమారు 17 రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలంటూ లిస్టు విడుదల చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ అందుతుందని, అన్ని వయసుల వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది.

ఇండియాలో 56 శాతం రోగాలు ఆహార లోపాల వల్లే వస్తున్నాయని ICMR పేర్కొంది. ప్రోటీన్ సప్లిమెంట్ల వాడకాన్ని అదుపు చేయాలని పేర్కొంది. ప్రొటీన్ పౌడర్‌లను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి, ICMR సూచించినట్లు ప్రోటీన్ సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండండి.

ICMR మార్గదర్శకాలివే..
తాజాగా ప్రజలు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన బుక్ లెట్ ను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ‘మై ప్లేట్ ఆఫ్ ది డే’ కోసం కనీసం 8 రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన మాక్రోన్యూట్రియెంట్లు, సూక్ష్మపోషకాలను అందేలా చూసుకోవాలని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ డెరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, వేర్లు, దుంపలు రోజువారీ ఆహారంలో సగానికిపైగా ఉండాలని సూచించారు. వీటితో పాటు మిల్లెట్లను తీసుకోవాలన్నారు. పప్పులు, మాంసం, గుడ్లు, గింజలు, నూనె గింజలు, పాలు, పెరుగును రోజూ తప్పకుండా తీసుకోవాలన్నారు. రోజూ మనం తీసుకునే ఆహారంలో 45 శాతం మిల్లెట్లు, 15 శాతం వరకు పప్పులు, గుడ్లు, మాంసం ఉండేలా చూసుకోవాలన్నారు. మనం తీసుకునే ఆహారం మొత్తంలో కొవ్వు పదార్థాలను 30 శాతం వరకు ఉండాలన్నారు. గింజలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు 10 శాతం వరకు ఉంటే సరిపోతుందన్నారు.

ఆహారం తీసుకోవడమే కాదు, వ్యాయామం తప్పనిసరి!
మనం తీసుకునే ఆహారంలో శరీరానికి తృణధాన్యాల ద్వారా 50 శాతం నుంచి 70 శాతం వరకు శక్తి అందుతుందని తెలిపారు. పప్పులు, మాంసం, పాలు, చేపలు కలిసి మొత్తం 6 శాతం నుంచి 9 శాతం వరకు శక్తిని అందిస్తాయన్నారు. చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని వెల్లడించారు. సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. శారీరక శ్రమ తప్పనిసరి అన్నారు.

దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే మార్గదర్శకాలు- డాక్టర్ రాజీవ్
ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ మార్గదర్శకత్వంలోని నిపుణుల బృందం 17 సమగ్ర సిఫార్సులను చేసింది. ఈ బుక్ లెట్ విడుదల సందర్భంగా ICMR చీఫ్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ కీలక విషయాలు వెల్లడించారు. “గత కొన్ని దశాబ్దాలుగా దేశ ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు పలు వ్యాధుల వ్యాప్తికి కారణం అయ్యింది. ఇప్పటికీ పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఆహార మార్గదర్శకాలను విడుదల చేశాం” అని వెల్లడించారు.

Green Tea : గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. తెలిస్తే తాగకుండా వదలరు..!

Green Tea : ఉదయాన్నే టీ తాగకుంటే ఆ రోజు మనకు మొదలు కాదు కదా. మరీ ముఖ్యంగా మన ఇండియాలో చాయ్ ఎక్కువగా తాగుతుంటారు. ఇక టీ అలవాటు లేని వారు కొందరు పాలు, డికాక్షన్, లెమన్ టీ తాగుతుంటారు.

ఇంకొందరు అయితే గ్రీన్ తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తాగేవారి సంఖ్య చాలాతక్కువ. కానీ గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. కానీ ఎక్కువ సార్లు కంటిన్యూగా గ్రీన్ టీ తాగితే మోషన్స్ అవుతాయని కొందరు భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇంకొందరు అయితే గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటారు.కానీ అందులో నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీని ఏ కాలంలో అయినా తాగొచ్చని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. గ్రీన్ టీ తాగడం ద్వారా కడుపు ఎప్పటి కప్పుడు శుభ్రంగా మారడం వల్ల, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే గ్రీన్ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Green Tea : జీర్ణక్రియ ఆరోగ్యం కోసం..

ఎండాకాలంలో జీర్ణక్రియ సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో గ్రీన్ టీని గనక తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ గ్రీన్ బాడీ నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో కూడా రోజుకు రెండు సార్లు గ్రీన్ తాగితే నష్టమేం ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక కప్పు గ్రీన్ తాగొచ్చు. ఇక రెండో కప్పును సాయంత్ర సమయంలో తాగితే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. యాసిడిటీ సమస్యలను తొలగిస్తుంది.

Green Tea గ్రీన్ టీ ప్రయోజనాలు..

గ్రీన్ టీ తాగితే అన్నింటికన్నా ఎక్కువగా కలిగే ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గడం. పొట్టలోని కొవ్వును మొత్తం గ్రీన్ కరిగిస్తుంది. ఎందుకంటే ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. మన కడుపు క్లీన్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కానీ కడుపు క్లీన్ గా ఉండకుంటే మాత్రం కచ్చితంగా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు గ్రీన్ టీ తాగితే కచ్చితంగా కడుపు క్లీన్ గా ఉంటుంది. దాని వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. గ్రీన్ టీని తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ ఉష్ణోగ్రతలు సమతుల్యం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Nail Moon:మీ గోర్లపై అర్థ చంద్రాకారం ఉందా.దీని అర్ధం ఏమిటో తెలుసా?

Nail Moon :మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు గోళ్లను చూసి మనకు ఏ ఆరోగ్య సమస్య ఉందో చెప్పటం చూస్తూ ఉంటాం. ఏ ఇద్దరి వ్యక్తుల యొక్క చేతి గోర్లు ఒకేలా ఉండవు.

వేలి గోర్లపై అర్ధచంద్రాకారం లో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను ‘లునులా’ అని అంటారు. ‘లునులా’ అంటే లాటిన్ భాషలో ‘స్మాల్ మూన్’ అని అర్ధం..

అయితే గోరు మీద ఉండే ఈ లునులా ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుందట. గోరు రంగు.. లునులా తీరు ను బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చట.

చేతి గోర్లపై లునులా లేకపోతే.. వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్ధం…

లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించ వచ్చట..

లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లు గా ఉంటే.. వారు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారని.. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు ఉన్నాయని తెలుసుకోవచ్చట…

లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని అర్ధం చేసుకోవాలి…

మన ఆరోగ్యం గురించి తెలిపే గోరు.. లునులా ని నిర్లక్షం చేయకుండా ఒక్క సారి.. మీ చేతి గోర్ల ను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇప్పుడు గోళ్ళ రంగును బట్టి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం.

గోళ్లు పాలిపోయి ఉంటే ఐరన్ శాతం తక్కువైందని అర్థం. దీని కారణంగా రక్తహీనత, గుండెజబ్బులు మరియు లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. అందువల్ల ఐరన్ సమృద్ధిగా లభించే పచ్చని ఆకుకూరలు, పాలకూర, బెల్లం, ఫ్రూట్ జ్యూస్ లు బాగా సేవించాలి.

గోళ్లు పసుపు రంగులో ఉంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కారణం. అని అర్ధం. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య మరియు మధుమేహంతో బాధపడేవారిలో ఇలా ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

గోర్లు నీలం రంగులో కనిపిస్తే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగా అందటం లేదని అర్ధం. అంతేకాక ఇన్సూలిన్ లోపంగా గుర్తించాలి. గుండె జబ్బులు మరియు ఊపిరి తిత్తుల సమస్య కారణంగా గోర్లు నీలం రంగులోకి మారుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గోర్లపై తెల్లని చారలు ఉంటే కాలేయ సంబంధిత సమస్యలు లేదా కిడ్నీ సమస్యల ప్రభావం అని అర్ధం. శరీరానికి ప్రోటీన్ సరిపడా స్థాయిలో అందకపోవడమే కారణం. అందుకని ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Kedarnath Temple: నేడు తెరుచుకోనున్న కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాలు

Kedarnath Temple: ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ ఆలయాలు నేడు తెరుచుకోనున్నాయి. చలికాలంలో మూసివేసిన ఈ ఆలయాలు ఇప్పుడు తెరవబోతున్నట్లు ఆఫీసర్స్ పేర్కొన్నారు.

నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి వాలంటీర్లు చెప్పులు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకువచ్చారని కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా చార్ ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు.

కేదార్ నాథ్ దేవాలయం.. పరమేశ్వరుడి పవిత్ర ఆలయంగా భావిస్తుంటారు. భారతదేశంలోని ఉత్తరాఖండ్ స్టేట్ లోని మందాకిని నదికి దగ్గరలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంటుంది. అతి పురాతనమైన శివలింగాలలో ఇది ఒకటి అని చెబుతుంటారు. దీనిని శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొంటారు. గౌరికుండ్ నుంచి డోలీలు, గుర్రాల ద్వారా లేదా కాలినడక మాత్రమే ఈ గుడికి భక్తులు చేరుకుంటారు.

రిషికేశ్ నుంచి పూర్తిగా కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం దాదాపు 16 గంటలపాటు సాగుతుంది. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లుగా విశ్వసిస్తుంటారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతిఏటా శీతాకాలంలో ఆరు నెలలపాటు మూసివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం మొత్తం పూర్తిగా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని శీతాకాలంలో మూసివేసి, తిరిగి వేసవిలో తెరుస్తారు.

నేడు ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో కేదార్ నాథ్ ఆలయాన్ని ముస్తాబు చేశారు. పూలతో ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేదార్ నాథ్ ఆలయం యొక్క తలుపులు తెరుచుకోనున్నాయి. కాగా, 2013 జూన్ లో కేదార్ నాథ్ లో అకస్మాత్తుగా భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. దేశంలోని 100 రైల్వే స్టేషన్లలో..

ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వే స్టేషన్లలో 100 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (PMBJK) ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది . లైసెన్స్ పొందిన వారిచే నిర్వహించబడే ఈ కేంద్రాలు నాణ్యమైన మందులు, ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తాయి. ఆగస్ట్ 2023 నుండి, భారతీయ రైల్వేలు ప్రయాణీకుల శ్రేయస్సును పెంచడానికి దీనిపై పని చేయడం ప్రారంభించింది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ కోసం మొదట 50 స్టేషన్లను ఎంపిక చేశారు. బిజినెస్ టుడే ప్రకారం, ఒక సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ.. “మేము దేశవ్యాప్తంగా అదనంగా 61 PMBJKలను కేటాయిస్తున్నామని, ఒక్కోదానికి రూ. 12.53 లక్షలు, ప్రీ-ఫ్యాబ్రికేషన్ నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు.

లక్షలాది మంది రోజువారీ సందర్శకుల వైద్య అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ పథకం జనౌషధి ఉత్పత్తులను సులభంగా యాక్సెస్ చేయడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. పథకం కింద పీఎంబీజేకేలు ముఖ్యమైన ప్రయాణీకుల సౌకర్యంగా పరిగణించబడతాయి. రైల్వేలు స్టేషన్‌లలో సౌకర్యవంతమైన ప్రదేశాలలో ఫ్యాబ్రికేటెడ్ అవుట్‌లెట్‌లను అందిస్తాయి. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ అవుట్‌లెట్‌లను నిర్వహించడానికి విజయవంతమైన బిడ్డర్లు తప్పనిసరిగా ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నుండి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లను పొందాలి. అలాగే ఔషధ నిల్వ కోసం చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నారు. కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు PMBJK అవుట్‌లెట్ యజమానులు జనౌషధి పథకం నోడల్ ఏజెన్సీ, అధీకృత పంపిణీదారులతో ఒప్పందాలపై సంతకం చేస్తారని అన్నారు.

IPPB: నిరుద్యోగులకు శుభవార్త.. ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఏడాదికి రూ.25 లక్షల వేతనం!

IPPB: నిరుద్యోగులకు పోస్టల్‌ శాఖ శుభవార్త చెప్పింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఐపీపీబీ) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు అర్హులైనవారు మే 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బీటెక్‌ / బీఎస్సీ/ ఎంసీఏ తదితర విద్యార్హతల ఆధారంగా పోస్టులకు ఎంపికైన వారికి హోదా ఆధారంగా వేతనం రూ.25 లక్షల వరకు ఉంటుందని వివరించింది.

పోస్టుల వివరాలు..
మొత్తం 54 పోస్టులు. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌) 28 పోస్టులు, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌) పోస్టులు 21, ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టులు 5 చొప్పున ఉన్నాయి.

విద్యార్హతలు..
బీఈ/బీటెక్‌ లేదా బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.

వేతనం వివరాలు..
ఎగ్జిక్యూటివ్‌ (అసోసియేట్‌ కన్సల్టెంట్‌) పోస్టుకు ఏడాదికి రూ.10,00,000, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌) పోస్టులకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్‌ (సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టుకు రూ.25,00,000 చొప్పున వేతనం చెల్లించనున్నారు.

దరఖాస్తు రుసుం..
ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.150 మాత్రమే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..
అభ్యుర్థుల ఎంపిక అసెస్మెంట్, ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కర్షన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మొదట ఢిల్లీ/ముంబై/చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

వయో పరిమితి..
అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 22 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 40 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు దరఖాస్తు చేసేవారి వయసు 22 నుంచి 45 ఏళ్లుగా నిర్ణయించారు.

చలో థాయిలాండ్.. మరో ఆరు నెలలు వీసా ఫ్రీ..

వేసవి కాలంలో పిల్లలకు సుదీర్ఘ సెలవులు వస్తాయి. అంతేకాదు వేసవి తాపం నుంచి ఉపసమనం కోసం దేశ విదేశాల్లోని ప్రకృతి అందాలతో నిండి ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అయితే ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటె విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపించే వారి సంఖ్యకూడా తక్కువేం కాదు.

అలా విదేశాలలో పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు థాయిలాండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా తర్వాత కుదేలైన పర్యాటక రంగాన్ని గాడిన పెట్టె ప్రయత్నంలో.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తమ దేశానికి వచ్చే పర్యాటక భారతీయులకు ఇస్తున్న వీసా ఫ్రీ నిబంధనను పొడిగిస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పర్యాటక వీసా మినహాయింపుని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో థాయిలాండ్ వెళ్లాలనుకునే పర్యాటకులకు వీసా అవసరం ఉండదు. పాస్‌పోర్టు ఉన్నవారు ఆ దేశంలో నెల రోజుల పాటు పర్యటించవచ్చు. వాస్తవానికి భారత దేశం, తైవాన్‌ ల నుంచి తమ దేశంలో వచ్చే పర్యాటకులకు వీసాఫ్రీ నిబంధనను గత ఏడాది2023 నవంబరు 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ గడువు నేటితో (మే10 వ తేదీ) ముగుస్తుంది. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుండడంతో ఈ వీసా నిబంధనను మరో ఆరు నెలల పాటు భారీయులకు సడలింపు ఇచ్చింది. ఈ మేరకు రాయల్‌ థాయ్‌ క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ నిబంధన నవంబరు 11, 2024 వరకు అమల్లో ఉండనున్నది.

అయితే భారతదేశం నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. దీని ప్రకృతి అందాలతో అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ దేశాన్ని ది ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని పిలుస్తారు. థాయిలాండ్ ఒక ఉష్ణమండల దేశం. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత ఉంటుంది. థాయిలాండ్ సందర్శించడానికి వసంతకాలం అంటే మార్చి నుండి మే వరకు ఉత్తమ సమయం. ఈ సమయంలో ఆ దేశంలో ఉష్ణోగ్రతలు 29°C-34°C మధ్య ఉంటాయి.

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? ఇక నుంచి కఠిన నియమాలు.. ఆర్బీఐ కీలక నిర్ణయం

మీరు కూడా ఏదైనా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఎణ్‌బీఎఫ్‌సీలకు కఠినమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం బంగారు రుణం ఇచ్చే సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు చెల్లించవద్దని ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీలను కోరింది. ఈ వారం ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్, బంగారాన్ని అందించే ఫైనాన్షియర్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఇచ్చిన సలహాలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SSని అనుసరించాలని వారిని కోరింది.

నియమం ఏమిటి?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS, నిర్దిష్ట చెల్లింపు విధానాల ద్వారా కాకుండా మరే వ్యక్తి చేసిన డిపాజిట్లు లేదా రుణాలను ఒక వ్యక్తి ఆమోదించలేరని అందిస్తుంది. ఈ విభాగంలో నగదు పరిమితి రూ.20,000. ఈ సలహా ఇవ్వడానికి కొన్ని వారాల ముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన తనిఖీ సమయంలో కొన్ని ఆందోళనలను గుర్తించిన తర్వాత IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్‌లను ఆమోదించకుండా లేదా పంపిణీ చేయకుండా నిలిపివేసింది.

నిపుణులు ఏమి చెబుతారు

రిజర్వ్ బ్యాంక్ ఈ సలహాపై వ్యాఖ్యానిస్తూ, మణప్పురం ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్, CEO VP నందకుమార్ మాట్లాడుతూ, ఇందులో నగదు రుణం ఇవ్వడానికి 20,000 రూపాయల పరిమితిని పునరుద్ఘాటించారు. మణప్పురం ఫైనాన్స్‌లో సగం రుణాలు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా పంపిణీ చేయబడతాయని, బ్రాంచ్ నుండి పొందిన రుణాలకు కూడా చాలా మంది వినియోగదారులు నేరుగా బదిలీకి ఇష్టపడతారని ఆయన అన్నారు.

పారదర్శకత పెరుగుతుంది

ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ, పారదర్శకత, మెరుగైన సమ్మతిని తీసుకురావడంలో ఆదేశం సహాయపడుతుందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది వ్యక్తులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కానందున ప్రభావం చూపవచ్చని అన్నారు. ఈ ఆదేశం అట్టడుగు వర్గాలను అత్యవసర పరిస్థితుల్లో కూడా గోల్డ్ లోన్‌లను పొందకుండా అనుకోకుండా నిరోధించవచ్చని, తద్వారా ఆర్థిక ప్రాప్యతను పరిమితం చేయవచ్చని మోహనన్ అన్నారు.

AP Elections 2024: హిందూపూర్‌లో పరిపూర్ణానంద స్వామిజీ బంపరాఫర్‌.. ఇంటికో లక్ష..!

ఎన్నికల వేళ నేతలు అలవికాని హామీలు ఇస్తూ.. ప్రజలను మభ్య పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అర చేతిలోనే వైకుంఠం చూపించి.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. బడా బడా రాజకీయ పార్టీలు మాత్రమే కాక స్వతంత్రంగా బరిలో నిలిబడే అభ్యర్థులు సైతం ఇలా ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తారు. ఇక కొన్ని చోట్ల అభ్యర్థులే తమ కోసం వ్యక్తిగతంగా ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ స్వామిజీ ఇచ్చిన హామీ.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏకంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తాను అంటున్నారు సదరు స్వామిజీ. ఆ వివరాలు..

పరిపూర్ణానంద స్వామీజీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆధ్యాత్మిక గురువుగా, శ్రీపీఠం వ్యవస్థాపకులుగా.. జనాలకు ఆయన తెలుసు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే పరిపూర్ణానంద స్వామి.. తొలిసారి 2018 తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఇక ఈ ఏడాది అనగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ బరిలో నిలిచారు. ఎంపీ సీటు సైతం టీడీపీ నేత బీకే పార్థసారథికి దక్కింది. దీంతో అసంతృప్తికి గురైన పరిపూర్ణానంద స్వామి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పరిపూర్ణానంద స్వామీజీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పరిపూర్ణానంద స్వామీజీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో హిందు అనే పేరుతో ఉన్న నగరం ఇదేనని.. అందుకే ఇక్కడే బరిలోకి దిగుతానంటూ పట్టుబట్టి పోటీలో నిలిచాను అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం.. హిందూపురం ఓటర్లపై హామీలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే పరిపూర్ణానంద స్వామి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి, తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ లక్ష రూపాయల లబ్ధిని కలిగిస్తామని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వ్యక్తిగతంగా తాను ఇచ్చిన హామీలతో పాటుగా ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

చెల్లెళ్ల కంటే భార్య బంధువులే ఎక్కువయ్యారా జగనన్నా

వేంపల్లె : ‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్‌రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్‌ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల ప్రశ్నించారు. గురువారం ఆమె వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె, వేముల, లింగాల మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. పులివెందుల రోడ్‌షోలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీతతో కలిసి పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెలు ఒకవైపు, జగన్‌ భార్య, బంధువులు మరోవైపు ఉన్నారు. వివేకాకు కుమారులు లేరని జగన్‌ను కుమారుడిలా చూసుకున్నారు. కానీ బాబాయ్‌ని చంపిన నిందితులనే జగన్‌ కాపాడుతున్నారు. అవినాష్‌ నిర్దోషి అని జగన్‌ నమ్ముతున్నారట. ఆయన నమ్మితే ప్రపంచమంతా నమ్మాలా? పులివెందుల ప్రజలు ఓటుతో పాటు తమ ప్రేమను కురుపిస్తారని నమ్ముతున్నాను. ఒకప్పుడు నేను అన్న కోసం ఇల్లు, వాకిలి వదిలిపెట్టి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. కడప ఎన్నికల్లో వైఎస్సార్‌ బిడ్డ ఒక వైపు, వివేకా హత్య కేసు నిందితుడు మరోవైపు పోటీ పడుతున్నారు. వివేకా హత్యకేసులో ప్రజాకోర్టులో న్యాయం కోసం కొంగుచాచి అడుగుతున్నా. ఈ కేసులో ఎంపీని కాపాడడమే కాకుండా, ఆయనకే టికెట్ ఇచ్చారు’’ అని మండిపడ్డారు.

పులివెందుల ఆడబిడ్డలకు న్యాయం చేయండి
షర్మిల, సునీత పులివెందుల ఆడబిడ్డలని, వారికి న్యాయం చేయాలని మాజీమంత్రి వివేకా భార్య సౌభాగ్యమ్మ కోరారు. ‘ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది. ప్రజలందరూ షర్మిలమ్మకు ఓటువేసి ఆమె కొంగు నింపాలి. ఓట్ల ద్వారా షర్మిలమ్మ కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై దిల్లీ వేదికగా పోరాటం చేస్తుంది. షర్మిలను ఎంపీగా చూడాలన్నది వివేకా కోరిక. పార్టీలకతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలనను చూడవచ్చు’ అని ఆమె తెలిపారు.

న్యాయం కోసమే పోరాటం
సునీత మాట్లాడుతూ.. ‘వివేకా హత్య విషయంలో న్యాయం కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చు. కానీ ప్రజాతీర్పు చాలా పెద్దది. ప్రజాతీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవినాష్‌రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు. ఆయన రేపో, మాపో జైలుకు వెళతారు. ఇలాంటివారికి ఓటు వేయడం అవసరమా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ మీడియా సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్‌ అంకిత!

పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.

బెంగళూరు: ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 599/600 మార్కులతో ప్రశంసలు అందుకోగా.. తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి అదరహో అనిపించింది. బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు. తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి. ముధోల్‌ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న బాలిక.. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్జరమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.

ఈసందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ఈ విజయం అంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనన్నారు. ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారన్నారు. ఈ విజయంతో తనకన్నా వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రీ-యూనివర్సిటీలో సైన్స్‌ను అభ్యసించాలని, ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేశాక.. ఆపై ఐఏఎస్‌ అధికారిగా దేశానికి సేవ చేయాలని కోరుకొంటున్నట్లు అంకిత తెలిపారు. ఫలితాల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన బాలికకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బాలాకోట్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎం జానకి, జిల్లా పంచాయత్‌ సీఈవో శశిధర్‌ అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆమె కుటుంబాన్ని త్వరలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో రెండో ర్యాంకులో నిలవడం విశేషం. కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు మార్చిలో జరగ్గా.. దాదాపు 8.6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6.31 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

AP ప్రజలకు శుభవార్త.. ఇవాళ వారందరి ఖాతాల్లో డబ్బులు జమ! హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోఫికేషన్ జారీ అయిన వెంటనే ఏపీలో కోడ్ ఉల్లంఘన అమల్లోకి వచ్చింది. దీంతో వివిధ పథకాల అమలుకు బ్రేక్ పడింది. తాజాగా ఏపీ ప్రజలకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నేడు సంక్షేమ పథకాల నిధులు జమకానున్నాయి. అయితే ఈ నిధులు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్త. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నేడు (శుక్రవారం 10) సంక్షేమ పథకాల నిధులు జమ కానున్నాయి. ఆసరా, ఈ బీసీ నేస్తం, విద్యా దీవెన, ఇన్ఫూట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయకూడదని ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై హై కోర్టు స్టే విధించింది. ఈ ఒక్క రోజు నిధులు విడుదలకు వెసులు బాటు కల్పించింది ఏపీ హైకోర్టు. ఇందుకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 11 నుంచి 13 వరకు పథకాల నిధులను లబ్దిదారుల అకౌంట్ లలో జమ చేయవొద్దని ఆదేశించింది. అంతే కాదు పోలింగ్ తర్వాత పథకాల నిధుల్ని విడుదల చేయాలన్న ఈసీ ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు తాత్కాలికంగా పక్కన పెట్టడంతో లబ్దిదారులు సంతోషం ప్రకటించారు.

ఇక నిధుల విడుదల విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించరాదని. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవొద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. నిధుల పంపిణీ సమయంలో రాజకీయ నేతల ప్రమేయం ఉండకూడదని, సంబంరాలు ఎలాంటి ఆర్భాలు, ప్రచారాలు లాంటివి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచాచణ జూన్ 27 కు వాయిదా వేసింది

Body Fat : అధికంగా కొవ్వు ఉందా? అయితే వీటికి దూరంగా ఉండండి..

Body Fat : ఈ మధ్య చాలా మందిలో కొవ్వు సమస్య విపరీతంగా పెరుగుతుంది. దాన్ని నివారించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. జిమ్, వాకింగ్, వ్యాయామం, డైట్ లు అంటూ అష్టకష్టాలు పడుతున్నారు. కానీ కొందరు సీరియస్ గా చేస్తే మరికొందరు గ్యాప్ లు తీసుకుంటూ చేస్తుంటారు. దీని వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. ఇక మీరు కూడా కొవ్వుతో బాధ పడుతున్నారా? మరి మీ శరీరంలో ఉన్న కొవ్వు ఇట్టే కరగాలి అంటే ఏం చేయాలో ఓ సారి చూడండి.

కొన్ని ఆహారాలను పరిగడుపున అసలు తినకూడదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక శరీరంలో పేరుకున్న కొవ్వు వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ పని చేస్తే కచ్చితంగా కొవ్వు పెరుగుతుంటుంది. ఈ అధిక కొవ్వు కారణంగా రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండె పోటు వచ్చే సమస్య కూడా ఉంటుంది. అంతేకాదు ఈ కొవ్వు వల్ల జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యలు వస్తుంటాయి.

మనం తినే ఆహారంలో ఎప్పుడు కూడా ఒకే రకమైన నూనెను వాడకూడదు. రెండు రకాల నూనెలను కలిపి ఉపయోగిస్తే అధిక కొవ్వుకు చెక్ పెట్టవచ్చు. ఆయిల్ ఫుడ్ ల కంటే పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి. వీటి వల్ల ఆరోగ్యానికి శక్తితో పాటు కొవ్వు కూడా అదుపులో ఉంటుంది. బయట ఫుడ్ వీలైనంత తగ్గిస్తే కొవ్వుకు దూరంగా ఉండవచ్చు.

రోజు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఉల్లిపాయలు తినడం మంచిది. ఆరోగ్యం కోసమని జీడిపప్పులు, వేరుశనగలను మాత్రం ఎక్కువగా తినవద్దు. కొవ్వు ఉండకూడదు అంటే జంక్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోండి. ఇతర పదార్థాల జోలికి వెళ్లకండి.

Gold Rates Today: అక్షయ తృతీయ పండుగ వేళ తగ్గిన బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం ధరలు తగ్గి గుడ్ న్యూస్ చెప్పాయి. కొన్ని రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తగ్గడంతో ఈరోజు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2310 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 26 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,160 గా ఉంది. మే 9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.100 తగ్గింది . దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,290 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,300 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,150తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,150తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,150తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,150తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.85,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.200 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.85,200గా ఉంది. ముంబైలో రూ.85,200, చెన్నైలో రూ.88,700, బెంగుళూరులో 85,200, హైదరాబాద్ లో రూ.88,700తో విక్రయిస్తున్నారు.

Consuming Less Sodium : మీ ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Less Sodium Benefits : అధిక మొత్తంలో సోడియం తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సోడియం తగ్గించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆహారంలో తక్కువ సోడియం వినియోగంతో ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ప్రతిరోజూ తినే ఆహారంలో తక్కువ మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. లో బీపీ :
సోడియం అధికంగా తీసుకోవడం వల్ల హైబీపీ వస్తుంది. సోడియం తగ్గిస్తే రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. మెరుగైన గుండె ఆరోగ్యం :
అధిక రక్తపోటు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం తీసుకోవడం తగ్గించాలి. దాంతో గుండె పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3. స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది :
హైబీపీ అనేది స్ట్రోక్‌కు ప్రధాన కారణం. సోడియం తీసుకోవడం తగ్గించాలి. తత్ఫలితంగా రక్తపోటును తగ్గించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెరుగైన ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పొందవచ్చు.

4. మూత్రపిండాల పనితీరు :
అధిక సోడియం వినియోగం మూత్రపిండాలపై భారం పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడానికి, కాలక్రమేణా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. సోడియం తీసుకోవడం తగ్గిస్తే ఈ భారాన్ని తగ్గించవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. ఎముకల ఆరోగ్యం :
అధిక సోడియంతో కాల్షియం విసర్జనకు సంబంధం ఉంటుంది. కాలక్రమేణా ఎముకలను బలహీనపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. సోడియం తగ్గించడం ద్వారా కాల్షియం స్టోరింగ్ మెరుగుపడుతుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది. దాంతో ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. కడుపు క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది :
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోడియం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ముఖ్యంగా ఉప్పగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకోవడం తగ్గించాలి. తద్వారా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.

Chanakya Neeti : చాణక్య నీతి : మీరు ధనవంతులుగా మారాలంటే ఈ పనులు చేయాల్సిందే..

Chanakya Neeti: చాణక్యనీతి అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషంగా, విజయవంతమవుతుంది అంటారు. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదనుకునే వారు ఆర్థిక విజయాన్ని సాధించడానికి చాణక్యుడి కొన్ని సూచనలను అనుసరించి ఇతరులకు చెప్పారు. చాణక్యుడి ఆలోచనలు, సూత్రాలతో ఒక వ్యక్తి జీవితంలో అన్ని సవాళ్లను అధిగమించి విజయపథంలో నడవగలరు. ఇక మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడే కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హులకే డబ్బు ఇవ్వండి
మీ డబ్బును అర్హులకు మాత్రమే ఇవ్వాలి అని సూచించారు. అర్హత లేని వారికి ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదు. మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా, అది సద్వినియోగం అయ్యేలా చూసుకోవడం ముఖ్యం. అంతేకాదు మీ సంపద మీరు మీ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. డబ్బు తిరిగి ఇవ్వని వారికి డబ్బులు ఇవ్వకూడదు.

మితిమీరిన దాతృత్వం చేయెుద్దు
మితిమీరిన దాతృత్వం కారణంగా ఎంతో మంది ఇబ్బందుల్లో పడ్డారని పురాణాల్లోనే ఉంది. దీని వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. అలాగే అతిగా ఇతరులకు ఇవ్వడం కూడా మంచిది కాదని తెలుసుకోండి.

సరైన మార్గంలో సంపాదించాలి
డబ్బును సరైన మార్గంలోనే సంపాదించాలి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బు కొంతకాలం మాత్రమే ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన డబ్బు జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.అంతేకాదు ఆ డబ్బు జీవితకాలం నిలవదు. ఇది కేవలం పదేళ్లు మాత్రమే మీతో ఉంటుంది.. ఈ పదేళ్లలో డబ్బు మీ చేతుల్లోంచి నీళ్లలా ప్రవహిస్తుంది. కష్టపడి, నిజాయితీతో డబ్బు సంపాదిస్తే ఎల్లకాలం ఉంటుంది..

సగంలో వదిలేయకూడదు
మీరు ఉద్యోగం ప్రారంభించిన తర్వాత, దానిని సగంలో వదిలివేయకండి. అపజయం, భయం రెండు కూడా మీ దగ్గరకు రావద్దు. కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. నిజాయితీగా పని చేసేవారే అత్యంత సంతోషిస్తారని తెలిపారు చాణక్యుడు.

ఎవరికీ చెప్పకండి
మీ ఆస్తులు ఎవరికీ చెప్పకుండా ఉండటమే బెటర్. భవిష్యత్తులో ఏదైనా లావాదేవీ వల్ల మీకు నష్టం జరిగితే వాటి గురించి కూడా ఎవరికీ చెప్పకండి. మీరు ఎంత సన్నిహితంగా ఉన్నా ఈ విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచడమే బెటర్ అని గుర్తు పెట్టుకోండి. .

ఈ ప్రశ్నలు వేసుకోండి
ఉద్యోగం ప్రారంభించే ముందు, మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడగడం ముఖ్యం. ఉద్యోగం ఎందుకు చేయాలి? ఎలాంటి ఫలితాలు వస్తాయి? అందులో విజయం సాధిస్తామా లేదా? అనే విషయాలను కచ్చితంగా మీరు ఆలోచించాలి.ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కనుగొంటే మాత్రమే పనిలో ముందుకు సాగాలి. మీకు ఒక లక్ష్యం లేకపోతే మీరు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు.

మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసిన ఈ ఏరియాలో గజం రూ.10 వేలే! కొనేందుకు ఇదే మంచి తరుణం!

పెద్ద పెద్ద సంస్థలు తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త కార్యకలాపాలను నిర్వహించడానికి భారీగా భూములను సేకరిస్తుంటాయి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎకరాల్లో భారీ స్థాయిలో భూములుదొరకడం అనేది కష్టం.

పైగా ఒకేచోట పెట్టడం కంటే నగరం చుట్టుపక్కల కూడా పెట్టుబడి పెడితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు డెవలప్ అవుతాయన్న ఉద్దేశంతో నగర శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పైగా భూముల ధరలు కూడా చౌకగా ఉంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ భారీగా భూములను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో దిగ్గజ కంపెనీగా పేరొందింది.

గజం 10 వేలు:

అలాంటి కంపెనీ అతిపెద్ద డేటా సెంటర్ల కోసం హైదరాబాద్ లో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గతంలో హైదరాబాద్ తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఫరూఖ్ నగర్ మండలంలో ఉన్న ఎలికట్ట గ్రామంలో ఎకరానికి రూ. 5.56 కోట్లు చెల్లించి మరీ రూ. 267 కోట్లకు 48 ఎకరాలను కొనుగోలు చేసింది. ఈ మొత్తం భూమిని డేటా సెంటర్ కోసమే కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే షాద్ నగర్ దగ్గర ఒక డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది మైక్రోసాఫ్ట్. ఆ డేటా సెంటర్ విస్తరణ నేపథ్యంలో ఎలికట్టలో కొంత భూమిని కొనుగోలు చేసింది. ఎకరం 5 కోట్లు పెట్టి కొన్నదంటే.. గజం 11,600 పెట్టి కొన్నట్టు. అంటే చదరపు అడుగు రూ. 1290కి కొన్నట్టు. అయితే కమర్షియల్ పర్పస్ కాబట్టి గజం 11 వేల చిల్లరకి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. అదే రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఐతే గజం 10 వేలకే దొరకచ్చు.

షాద్ నగర్ లోనే గజం స్థలం రూ. 13,950 ఉంది. ఎలికట్టలో ఇంకా తక్కువ ఉండచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ఉద్దేశం ఉన్నవారికి ఇదే సరైన అవకాశం. ఇంతకంటే తక్కువ ధరకు ల్యాండ్ అనేది ఫ్యూచర్ లో దొరకడం కష్టం. దొరికినా ఇప్పుడున్న రేట్లకు దొరకడం అనేది కష్టం. డేటా సెంటర్ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇప్పుడు గజం 10 వేలు పెట్టి కొంటే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గజం 10 వేలు అంటే 100 గజాలకు 10 లక్షలు అవుతుంది. ఎలికట్ట నుంచి హైదరాబాద్ 59 కి.మీ. దూరంలో ఉంది. షాద్ నగర్ కి 10 కి.మీ. దూరంలో ఉంది. కాబట్టి స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి తరుణం.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Health

సినిమా