Sunday, November 17, 2024

నడకదారిలో తిరుమలకు వెళుతున్నారా..? అయితే ఈ సూచనలు పాటించాల్సిందే

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు. ఆ కలియుగ దైవాన్ని రెప్ప పాటే దర్శించుకుంటే చాలనుకుంటారు. ఇందుకు వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటారు.

అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల నుంచి శ్రీహరి దర్శనం కోసం తిరుమలకు కాలి నడకన వెళ్ళాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది తిరుమల ది. ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంపై టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదంటోంది టీటీడీ. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని టీటీడీ చెబుతోంది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ప్రకటన లో పేర్కొంది టీటీడీ.

భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టీటీడీ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చని టీటీడీ చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గం లోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని టీటీడీ సూచిస్తోంది. తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చన్న టీటీడీ భక్తులకు తెలియజేస్తోంది. దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది టీటీడీ. తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు తప్పనిసరిగా సూచనలు పాటించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

ఈ పండు ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి.. ఎందుకో తెలుసా.?

చాలా కొద్ది మందికి తెలిసే మాంగోస్టీన్ ఫ్రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ పండును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫొటోలో కనిపిస్తోన్న ఈ పండు పేరు మాంగోస్టీన్‌. చాలా తక్కువ మందికి తెలిసే ఈ పండుతో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? కొద్దిగా తీపి, పుల్లగా ఉండే ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పండుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మాంగోస్టీన్‌ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌, గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యలను దూరం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

* మాంగోస్టీన్ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోకి యాంటీఆక్సిడెంట్స్‌ కారణంగా వ్యాధుల బారిన తక్కువగా పడుతుంటారు.

* గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మాంగోస్టీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మంచి కొలెస్టాల్‌ పెరగడంతో దోహదపడుతుంది.

* మాంగోస్టీన్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ ఫ్రూట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏంజింగ్ ఎలిమెంట్స్‌లా పనిచేస్తాయి.

* డయాబెటిస్‌ బాధితులకు కూడా ఈ పండు సహాయపడుతుంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఫైబర్ కంటెంట్‌ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్‌ఫ్రూట్‌గా చేస్తాయి.

* మాంగోస్టీన్‌లోని మంచి గుణాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఒత్తిడిని దూరం చేయడంలో ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. మూడ్‌ స్వింగ్స్‌ సమస్యను అధిగమించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

కొత్త శిఖరాలకు భారత విమానయాన రంగం! ఐదేళ్లలో మరో 50 కొత్త విమానాశ్రయాలు

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగి 157కు చేరుకుంది. రానున్న 20 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

దేశంలోని విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగాల కల్పనను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 50 అదనపు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం (అక్టోబర్ 24) ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని చెప్పారు. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 200 అదనపు విమానాశ్రయాలకు పెరుగుతుందని అంచనా వేశారు.

రాబోయే కాలంలో 50 అదనపు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, ఈ నిర్ణయం ఉపాధి కల్పనను కూడా పెంచుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగి 157కు చేరుకుందన్నారు, రానున్న 20 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఎయిర్‌బస్ ఇండియా మరియు సౌత్ ఏషియా హెడ్‌క్వార్టర్స్, ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థను విస్తరించడం ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. ఇది ఉద్యోగ అవకాశాలు, వాణిజ్య వృద్ధి రెండింటినీ ప్రేరేపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వుమ్లున్‌మాంగ్ వుల్నామ్ కూడా విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యిందన్నారు. గత ఏడాది నమోదైన ప్రస్తుత 220 మిలియన్ల నుండి వచ్చే ఐదేళ్లలో ప్రయాణీకుల రద్దీ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (RCS) – UDAN, 2016లో ప్రారంభించడం జరిగింది. దాని 8వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసింది. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అసంగ్బా చుబా ఏవో ఆదివారం ఈ పథకం అద్భుతమైన విజయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 601 ​​రూట్‌లు ఇప్పుడు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు దాదాపు 1.44 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని ఆయన తెలిపారు.

ఇక UDAN ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఇప్పటికి దాదాపు 1.44 కోట్ల మంది ప్రజలు RCS కింద ప్రయాణించారు. ఇది ఏ కొలతతో చూసినా భారీ సంఖ్య. ఈ పథకం కింద ఇప్పటివరకు 601 రూట్‌లలో నడిపారని జాయింట్ సెక్రటరీ తెలిపారు.

ఇదొక్కటి తీసుకుంటే చాలు.. చికెన్, మటన్ కంటే మూడురెట్ల పోషకాలు..

ఆరోగ్యంగా ఉండాలి.. బలంగా ఉండాలి అంటే చికెన్, మటన్ ఒక్కటి తింటే సరిపోతుంది అనుకుంటారు. కానీ చికెన్, మటన్ కంటే బలవర్థకమైన పదార్థాలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ తీసుకోవడం లేదు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తిని జబ్బుల బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా.. ఎలాంటి రోగాలు త్వరగా ఎటాక్ చేయకుండా జీవించాలంటే.. పోషకాలు నిండిన ఆహారాలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటూ.. వ్యాయమం చేస్తే.. మనిషి ఫిట్‌గా ఉంటాడు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు త్వరగా ఎటాక్ చేయవు. చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు నిండి ఆహారాల్లో.. తవుడు కూడా ఒకటి. తవుడు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువగా పశువులకు దాణాగా వేస్తారు. అలాంటి తవుడు రోజూ కొద్దిగా తీసుకున్నా.. మీకు అందాల్సిన పోషకాలు అందుతాయి. చికెన్, మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఈ తవుడులో నిండి ఉన్నాయి. మరి ఈ తవుడుతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు:

క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, మంచి కొవ్వులు, కేలరీలు, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ డి, ప్రోటీన్, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి.
రోగ నిరోధక శక్తి:

ఈ తవుడు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే.. శరీరానికి రక్షణగా నిలుస్తుంది. ఎలాంటి రోగాలు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.

వెయిట్ లాస్:

తవుడు తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ప్రోటీన్, డైటరీ ఫైబర్ ఉండటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. పేగులు శుభ్ర పడతాయి. కొద్దిగా తిన్నా పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఆకలి కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చపాతీ పండిలో తవుడు కలిపి తీసుకోవచ్చు.
బీపీ – షుగర్ తగ్గుతాయి:

తవుడు తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటివి కూడా కంట్రోల్ అవుతాయి. తవుడు కొద్దిగా తీసుకున్నా.. కడుపు త్వరగా నిండుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేం. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. అదే విధంగా ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్త పోటు కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

డిగ్రీ అర్హతతో ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కొలువు సొంతం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతలతో బ్యాంకు ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌.. రాష్ట్రంలోని గుంటూరు, చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అర్హత ప్రమాణాలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 28వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు..

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీల సంఖ్య: 17
గుంటూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 7
చిత్తూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 1

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాంకింగ్/ కామర్స్/ అకౌంటింగ్ అండ్ ఆడిట్/ అగ్రికల్చర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థికి తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో చదవటం, రాయడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయోపరిమితి సెప్టెంబర్‌ 01, 2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు తప్పనిసరిగా సెప్టెంబర్‌ 1, 1996 నుంచి సెప్టెంబర్‌ 1, 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 28, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అప్రెంటీస్‌ శిక్షణ కాలం ఏడాది ఉంటుంది. ఈ ఏడాది కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌, డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలక్షన్‌ ప్రాసెస్‌లో భాగంగా నిర్వహించే లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్‌లలో తెలుగు మీడియంలో చదివిన వారు లోకల్‌ ల్వాంగ్వేజ్‌ టెస్ట్‌కి అర్హులు కాదు. ఈ టెస్ట్‌లో అర్హత సాధించని వారిని అప్రెంటీస్‌గా ఎంపిక చేయబోమని APCOB తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అసక్తి కలిగాన వారు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ఈ కింది అడ్రస్‌కు పంపించవచ్చు.

అడ్రస్..

ది డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ-520002.

జైలు జీవితాన్ని నేర్పించింది.. విడుదలైన జానీ మాస్టర్

చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. సెప్టెంబర్ 19 న అరెస్ట్ అయినా జానీ మాస్టర్. 36 రోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ గత కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో జానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ జైలు జీవితాన్ని నేర్పించింది అని అన్నారు.

‘ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్‌ జరపాలి’ హైకోర్టులో పిటిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్‌తోపాటు ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన విద్యార్థి తల్లి పలగర అనసూర్య..

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సుమారు 25 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశాలకు అర్హులున్నప్పుడు సీట్లను వృథా చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌ సమయంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, వరదల కారణంగా తన కుమారుడితోపాటు, పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారని, నచ్చిన బ్రాంచ్‌ల్లో సీట్లు పొందలేకపోయారని ఆమె పేర్కొన్నారు. అందుకే మిగిలి పోయిన సీట్లను నాలుగో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోలేదని, అందుకే కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాల తుది మెరిట్‌ జాబితా విడుదల.. ప్రకటన వెలువరించిన కాళోజీ హెల్త్‌ వర్సిటీ

తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది మెరిట్‌ జాబితాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024లో వచ్చిన స్కోరు ఆధారంగా బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం మార్కులతో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు.

సేల్స్‌లో బడ్జెట్ బైక్స్ సరికొత్త రికార్డు.. ఆ కంపెనీదే మొదటి స్థానం

హీరో స్ల్పెండర్ బైక్ కు వినియోగదారుల ఆదరణ లభించింది. సెప్టెంబర్ లో 26,318 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. గతంలో పోల్చితే 3.16 శాతం పెరిగింది.

హీరో స్ల్పెండర్ 125 సీసీ బైక్ ధర రూ.75,441 నుంచి రూ.78,286 వరకూ ఉంది.

హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ రూ.95 వేల నుంచి రూ.99,500 ధరలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ లో 37,520 ఎక్స్ ట్రీమ్ బైక్ యూనిట్లను కంపెనీ విక్రయించింది. అమ్మకాలలో హీరో ఎక్స్ ట్రీమ్ 125 బైక్ నాలుగో స్థానంలో నిలిచింది.

హోండా కంపెనీ నుంచి విడుదలైన ఎస్పీ 125/ షైన్ 125 సీసీ మోటారు సైకిళ్లు సెప్టెంబర్ లో జరిగిన అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచాయి. హోండా ఎస్పీ, షైన్ మోాటారు సైకిళ్ల యూనిట్లను ఆ కంపెనీ 1,53,476 విక్రయించింది. గతేడాదిలో పోల్చితే దాదాపు 13.40 శాతం ఎక్కువ. హోండా షైన్ రూ.81,251 నుంచి రూ.85,251 ధరకు, హోండ్ ఎస్పీ రూ.87,468 నుంచి రూ.91,468 ధరకు అందుబాటులో ఉన్నాయి.

అమ్మకాలలో రెండో స్థానంలో బజాజ్ కంపెనీ బైక్ లు నిలిచాయి. పల్సర్ 125/ ఎన్ఎస్ 125 బైక్ ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆ కంపెనీ సెప్టెంబర్ నెలలో 67,256 యూనిట్లను విక్రయించింది. బజాజ్ పల్సర్ 125 రూ.92,883, ఎన్ ఎస్ 125 బైక్ రూ.1.01 లక్షలకు అందుబాటులో ఉంది. పైవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు

టీవీఎస్ నుంచి విడుదలైన రైడర్ బైక్ అమ్మకాలలో మూడో స్థానం సాధించింది. టీవీఎస్ రైడర్ కు చెందిన 43,274 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. ఈ మోటారు సైకిల్ రూ.84,869 నుంచి రూ.1.04 లక్షల ధరలో అందుబాటులో ఉంది. అయితే గతేడాది 48,753 రైడర్ బైక్ అమ్ముడయ్యాయి. వాటితో పోల్చితే ఈ సారి తగ్గుముఖం పట్టినట్టే.

చెవి పోటు సమస్య వేధిస్తోందా.. ఇలా చేశారంటే వెంటనే తగ్గాల్సిందే

అకస్మాత్తుగా వచ్చే సమస్యల్లో చెవి పోటు కూడా ఒకటి. చెవి పోటు వచ్చిందంటే కూర్చోలేం.. నిద్రపోలేం. ఈ చెవి పోటు ఎక్కువగా అర్థరాత్రలు సమయంలోనే వస్తుంది.

ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. మెడికల్ షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఇలాంటి సమయంలో కూడా త్వరగా చెవి పోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చిట్కాలతో తక్షణమే చెవి పోటు నుంచి రిలీఫ్ అవ్వొచ్చు. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ టిప్స్ వారికి కూడా ఉపయోగించవచ్చు. నేచురల్‌గానే మనం చెవి పోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా వరకు ఇంట్లో ఉండే వాటితోనే మనం వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్స్:

ఇప్పుడంటే డ్రాప్స్ వచ్చాక చాలా మంది వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ ఇంతకు ముందు మాత్రం చెవి పోటు వచ్చిందంటే.. ఇంట్లో ఏ నూనె ఉంటే అది వేడి చేసి చెవిలో వేసేవారు. ఇది వలన చెవి శుభ్ర పడటమే కాకుండా.. చెవి నొప్పి కూడా తగ్గేది. కాబట్టి ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది.

తులసి ఆకులు:

తులసి ఔషధ గుణాలు నిండిన మొక్క. కాబట్టి తులసి ఆకులను నలిపి.. ఆ రసాన్ని చెవిలో వేయడం వల్ల తక్షణమే ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చెవి నొప్పి త్వరగా తగ్గుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లితో కూడా చెవి నొప్పి, వాపులను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను దంచి.. వేడి చేసి.. అనంతరం వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న చోట కాపుడం పట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

అల్లం:

ఎవరి ఇంట్లో అయినా అల్లం ఖచ్చితంగా ఉంటుంది. చెవి నొప్పితో ఇబ్బంది పడేవారు అల్లాన్ని దంచి రసం తీయాలి. ఈ రసాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో వేసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్:

నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్స్‌తో కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వీటిల్లో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా వేడి చెవిలో వేయాలి. నొప్పి తగ్గడంలో పాటు చెవి కూడా క్లీన్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

రోజూ చిన్న ముక్క తిన్నా.. కనిపెట్టలేనన్ని ఉపయోగాలు..

ఇప్పుడంటే పచ్చి కొబ్బరి తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ ఇంతకు ముందు పచ్చి కొబ్బరి, బెల్లం ముక్కలను కలిపి స్నాక్స్‌గా తినేవారు.

ఇవి ఎంతో రుచిగా ఉండేవి. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరి తినడం వల్ల ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు రెట్టింపు పచ్చి కొబ్బరి తినడం వల్ల ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్ గుణాలు బోలెడన్ని ఉన్నాయి. పలు రకాల వ్యాధుల్ని నయం చేయగల శక్తి పచ్చి కొబ్బరికి ఉంది. కాబట్టి పచ్చి కొబ్బరి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ కంట్రోల్:

పచ్చి కొబ్బరి తినడం వల్ల షుగర్ వ్యాధి పెరుగుతుంది అనుకుంటారు. కానీ కేవలం ఇది అపోహ మాత్రమే. కొబ్బరితో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటీస్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కొబ్బరి తినడం వల్ల ఆకలి కూడా మందగిస్తుంది.

వెయిట్ లాస్:

బరువు తగ్గాలి అనుకునేవారు కొబ్బరిని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. కొబ్బరిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా లభిస్తుది. కాబట్టి ఇది చిన్న ముక్క తిన్నా కడుపు నిండుగా ఉండి ఆకలి మందగిస్తుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

క్యాన్సర్‌కు చెక్:

పచ్చి కొబ్బరి తినడం వల్ల క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పచ్చి కొబ్బరికి వస్తుంది. కాబట్టి పచ్చి కొబ్బరి తింటే క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చు.

రోగ నిరోధక శక్తి:

పచ్చి కొబ్బరి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అలసట, నీరసం రాకుండా ఉంటాయి.

చర్మం – జుట్టు ఆరోగ్యం:

పచ్చి కొబ్బరి తినంటే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం సాఫ్ట్‌గా మారి మచ్చలు పోయి హైడ్రేట్‌గా తయారై కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు కూడా బలంగా, దృఢంగా మారతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

దీపావళి వేళ వ్యాపారులకు మోదీ సర్కార్ భారీ కానుక.. ఇకపై రెట్టింపు ప్రయోజనం!

దీపావళికి ముందు, తమ వ్యాపారాన్ని విస్తరించాలని మరియు విస్తరించాలని యోచిస్తున్న పారిశ్రామికవేత్తలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద బహుమతిని అందించింది.

ఇప్పుడు వారు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద గతంలో కంటే రెట్టింపు రుణాన్ని పొందగలుగుతారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ముద్ర లోన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23, 2024న సమర్పిస్తూ, ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు . ఇప్పుడు ఈ ప్రకటన అమలులోకి వచ్చింది. ఈ పరిమితిని పెంచడం వల్ల ముద్రా పథకం లక్ష్యాన్ని చేరుకోవడంలో దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిధులు అవసరమయ్యే కొత్త పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు వారి వ్యాపార వృద్ధి, విస్తరణకు నిధులు అందించవచ్చు.

ప్రస్తుతం ప్రధాన మంత్రి ముద్రా యోజనలో శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు కేటగిరీల కింద రుణాలు అందజేస్తున్నారు. ఇప్పుడు తరుణ్ ప్లస్ పేరుతో కొత్త కేటగిరీని ప్రారంభించారు. ముద్రా యోజన కింద రూ.50,000 వరకు రుణం ఇవ్వాలనే నిబంధన ఉంది. కిషోర్ పథకం కింద, వ్యాపారం చేసే వారు రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు ముద్ర రుణం తీసుకోవచ్చు. తరుణ్ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వాలనే నిబంధన ఉంది. తరుణ్ యోజన కింద తీసుకున్న రుణాన్ని విజయవంతంగా తిరిగి ఇచ్చిన వ్యాపారవేత్తలు ఇప్పుడు తమ వ్యాపార వృద్ధి, విస్తరణ కోసం తరుణ్ ప్లస్ కేటగిరీ కింద రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు రుణాలు పొందగలుగుతారు.

ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద, మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కింద రూ. 20 లక్షల వరకు రుణాలపై హామీ కవరేజీ ఇవ్వడం జరుగుతుంది.

ఈ పద్దతులు ఫాలో చేస్తే.. హాయిగా నిద్ర పడుతుంది.

ప్రస్తుత కాలంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువై నిద్ర మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. సరిగా నిద్రపోకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరి గాఢ నిద్రలోకి చేరుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం

చక్కగా నిద్ర పట్టాలంటే ముందుగా భోజనం అనేది త్వరగా ముగించాలి. చాలా మంది పడుకునే ముందు తింటారు. దీని వలన జీర్ణ సమస్యలు వచ్చి సరిగా నిద్ర పట్టదు. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలి. చాలా తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి.

పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. కాబట్టి త్వరగా నిద్ర అనేది పడుతుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి దూరం అవుతుంది.

ఎంత సేపు అయినా మీకు నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉంటే.. కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల గాఢ నిద్రలోకి చేరుకుంటారు. అదే విధంగా మీరు నిద్రించే గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

గాఢ నిద్రలోకి చేరుకోవాలంటే.. పాలు కూడా హెల్ప్ చేస్తాయి. పడుకునే ముందు గోరు వెచ్చటి పాలను తాగండి. పాలు నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. ఏదన్నా బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల కూడా నిద్రలోకి జారుకుంటారు.

ఐకాన్ స్టార్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న న్యాయస్థానం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యాలనీ సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆయనతో పాటు మాజీఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు లో వాదనలు ముగిసాయి. ఇరు వైపులా వాదనలు ముగియడంతో నవంబర్ 8 న నిర్ణయం వెల్లడిస్తామని హై కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎఫ్ ఐ ఆర్ అధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నవంబర్ 8 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అలాగే ఈ కేసుపై నవంబర్ 8న తదుపరి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.

కాగా ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సయమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కార్యకర్తలు అనుచరులు భారీగా అక్కడకు చేరుకున్నారు. శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్ తో అల్లు అర్జున్ వచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆ సమయంలో అల్లు అర్జున్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మీద నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక అల్లు అర్జున్ ల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్ 5న ఈ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మొదటి భాగం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వచ్చే నెలలోనే లాంచింగ్‌.. ఈ ఫీచర్‌తో వస్తోన్న తొలి ఫోన్‌ ఇదే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. రియల్‌మీ జీటీ సిరీస్‌ 7 ప్రో పేరుతో ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న తరుణంలో తాజాగా కంపెనీ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.

వచ్చే నెలలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే తేదీ ఎప్పుడన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న ప్రపంచంలోనే తొలి ఫోన్‌గా రియ్‌మీ జీటీ 7 ప్రో నిలవనుంది.

ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసర్‌ను అందించనున్నారు. Realme GT 7 Pro ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం అందుబటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సను అందిపుచ్చుకునే క్రమంలో దీని చిప్‌లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్‌ను అందించను్నారు. కెమెరా విసయానికొస్తే ఇందులో ఏకంగా 320 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300, 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి ఫీచర్లను ఇందులో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోన్లో 16 జీబీ ర్యామ్ను అందించారు. అందించనున్నారు. ఓఎల్‌ఈడీ ప్యానెల్‌, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ పింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు.

రోజ్ వాటరే కదా అని తీసి పారేయకండి.. దీంతో ఉండే లాభాలే వేరు!

రోజ్ వాటర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా లేడీస్ అందాన్ని పెంచడంలో రోజ్ వాటర్ ఎంతో ఎక్కువగా ఉపయోగ పడుతుంది.

కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచడానికే కాకుండా రోజ్ వాటర్‌తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

గులాబీ నీటిని కేవలం అందానికే కాకుండా పలు రకాల సమస్యలను తగ్గించడంలో, వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్‌ అయి చక్కగా మెరుస్తుంది. చర్మంపై ఉండే చికాకులు, మంట తగ్గుతాయి.

గులాబీ నీరుని క్లెన్సర్ లేదా టోనర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్లు రోజ్ వాటర్‌ను స్ప్రే చేసి ఉపయోగించుకోవచ్చు. చంకల్లో, మణి కట్టుపై రోజ్ వాటర్ రాస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది.

రోజ్ వాటర్‌ను మిస్ట్‌గా కూడా యూజ్ చేయవచ్చు. రోజ్ వాటర్‌ను బాటిల్ లో వేసి.. ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని క్లాత్ లేదంటే కాటన్ ప్యాడ్‌తో ఫేస్‌ని తుడిస్తే.. మురికి, క్రిములు, దుమ్మ, ధూళి వంటివి తొలగుతాయి. రోజ్ వాటర్ వాసన చూస్తే తలనొప్పి తగ్గుతుంది.

రోజ్ వాటర్‌ను తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. చలి కాలంలో పొడి బారే జుట్టుతో బాధ పడేవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారడమే కాకుండా మంచి సువాసన వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

యూజర్లకు జియో దీపావళి ఆఫర్‌.. ఈ రీఛార్జ్‌లతో అదిరిపోయే బెనిఫిట్స్‌

ప్రముఖ టెలికాం సంస్థ యూజర్ల సంఖ్యను పెంచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇంటర్నెట్‌ ఛార్జీలను ఆశాకం నుంచి నేలకు దించిన జియో.. తాజాగా మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు కొనసాగిస్తూనే ఉంది.

ఇప్పటికే రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన జియో.. తాజాగా దీపాపవళి పండుగను పురస్కరించుకొని కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

జియో ట్రూ 5జీ దివాళి ధమాకా పేరుతో రెండు రీ ఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 899, రూ. 3599 రిఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అదనంగా రూ. 3350 విలువైన బెనిఫిట్స్‌ పొందే అవకాశం కల్పించారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లకు రూ.

ఈజీమై ట్రిప్‌కు సంబంధించి రూ. 3000 వోచర్‌ లభించనుంది. ఈ వోచర్‌ను హోటల్స్‌, ఎయిర్‌ ట్రావెల్‌కు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అజియో షాపింగ్‌కు సంబంధించి రూ. 200 కూపన్‌ పొందొచ్చు. ఈ ఆఫర్‌ అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్‌ 5వతేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ. 899తో రీఛార్జ్‌ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు 20 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. అదే విధంగా రూ. 3599తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా 365 రోజులతో లభిస్తుంది.

రూ. 999 అంత కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారురూ. 200 డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఫుడ్‌ డెలివరీకి సంబంధించి రూ. 150 వోచర్‌ లభిస్తోంది. దీంతో స్విగ్గీలో చేసే ఆర్డర్లపై రూ. 150 డస్కౌంట్ పొందొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్లను ఎలా రీడిమ్‌ చేసుకోవాలనేగా మీ సందేహం. రీఛార్జ్‌ చేసుకున్న వెంటనే బెనిఫిట్స్‌ మీ మైజియో అకౌంట్‌లోకి క్రెడిట్‌ అవుతాయి. వీటిని రీడిమ్‌ చేసుకోవడానికి కింది స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

* ముందుగా మైజియోలోని ‘ఆఫర్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

* అనంతరం మై విన్నింగ్స్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇందులో మీరు ఏ కూపన్‌ను రీడీమ్‌ చేయాలనుకుంటున్నారో దానిని సెలక్ట్‌ చేసుకోవాలి.

* కూపన్‌ కోడ్‌ను కాపీ చేసి మీరు కొనుగోలు చేసే పేమెంట్‌ గేట్‌ వే దగ్గర కోడ్‌ను పేస్ట్ చేస్తే సరిపోతుంది

ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌….గురువారం ఆన్‌లైన్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, బీజేపీ ఎంపీ, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరితో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అమరావతి రైలుమార్గం కోసం అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అశ్వినీ వైష్ణవ్‌కు హామీఇచ్చారు. ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. దీని దృష్ట్యా ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేయగలిగితే అందరికీ మేలు జరుగుతుందని చంద్రబాబు సూచించారు.

అలానే నవంబరు/డిసెంబరు నెలల్లో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రిని హాజరయ్యేలా చూడాలని కేంద్ర రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు. రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్నీ రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి అన్ని విధాలా సహకరించిందని ఎంపీ పురందేశ్వరి అన్నారు. అమరావతికి కనెక్టివిటీ పెంచడం ద్వారా ఇక్కడ ఆర్థిక వృద్ధికి అవకాశాలు పెరుగుతాయని ఆమె అన్నారు.

దారుణం.. బ్రతికున్న వృద్ధురాలిని శ్మశానంలో పడేసిన కుటుంబ సభ్యులు

మానవత్వం మంట కలిసిపోతుంది. మనుషులు మృగాళ్లా తయారవుతున్నారు. తమ స్వార్ధం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సాటి మనిషికి సాయం చేసే రోజులు వెళ్లిపోయాయి. కనీసం సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోట్లేదు. దారుణంగా రోడ్డున పడేసి రోజులు వచ్చేశాయి. జాలి,ప్రేమ,దయ,కరుణ అనే పదాలు కనుమరుగవుతున్నాయి. మనిషి తన సుఖాల కోసం ఎంతకైనా దిగజారే రోజులు వచ్చేశాయి. స్వచ్ఛమైన మనిషి మాయమైపోతున్నాడు. మనిషన్న వాడు అనే వాక్యం రోజురోజుకి సాధారణ వాఖ్యంగా మారిపోతుంది. బంధాలు, బంధుత్వాలు అర్ధాలు పూర్తిగా మారిపోయాయి. స్వార్ధం రాజ్యమేలుతుంది.. ఈ వ్యాఖ్యలకు తాజాగా జరిగిన విషాద సంఘటన ఉదాహరణగా మారింది. బతికుండగానే ఓ వృద్దురాలిని బంధువులు శ్మశానంలో పడేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ దారుణాతి దారుణమైన ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల నుంచి తెలుస్తున్న ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కూకట్ల రాజవ్వ అనే 75 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె గతంలో శానిటేషన్ కార్మికురాలిగా పని చేసింది. అయితే సాఫీగా సాగుతున్న తన జీవితంలో ఓ మలుపు చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోయారు. ఆయన మరణం నేడు రాజవ్వని దిక్కులేని వృద్ధురాలిగా మార్చింది. తన భర్త చనిపోయాక పిల్లలు లేకపోవడంతో ఆమె తన అన్న ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల కిందట రాజవ్వకు తీవ్ర అనారోగ్యం కలిగింది. దాంతో ఆమె మంచం పట్టింది. దీంతో ఆమె మేనల్లుడు తిరుపతి.. ఆడ మనిషి పైగా వృద్ధురాలు అనే కనీస కనికరం లేకుండా ఆమెను తీసుకుని వెళ్లి శ్మశానంలో పడేసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు రాజవ్వ పరిస్థితి తెలుసుకుని చాలా జాలి పడ్డారు. ఆగ్రహంతో మంగళవారం తిరుపతిని నిలదీశారు. కానీ ఆమె సోదరి పిల్లలు తాము చూసుకుంటామని తీసుకెళ్లారని…కానీ ఇలా శ్మశానంలో పడేశారని తిరుపతి చెప్పాడు.

ఏది ఏమైనా ఇలా బతికున్న మనిషిని సొంత అన్న, సోదరి పిల్లలు శ్మశానంలో పడేయటం చాలా దారుణం. ఈ దారుణమైన ఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. ఈ విషయం గురించి తెలిసిన వారు ఊరుకోలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని రాజవ్వ బంధువులను ఆరా తీశారు. రాజవ్వ బంధువులతో మాట్లాడి ఆమె బాగోగులు చూసుకునేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆమె బంధువులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంత దారుణం.. ఇలా సొంత కుటుంబీకులే వృద్ధురాలు అనే కనికరం లేకుండా బ్రతికుండాగానే శ్మశానంలో పడేశారు.

తాత , మనవడి క్యారెక్టర్ లో ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు తీయగానే.. ఇప్పుడు అంతా రాజాసాబ్ అనే అంటున్నారు. బర్త్ డే సంధర్బంగా ఫాన్స్ కు ట్రీట్ ఇస్తూ కాస్త ముందుగానే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. మరి మామూలుగా ఉందా ఆ పోస్టర్.. వేల కోట్ల కట్ అవుట్ అది. ప్రభాస్ అన్నట్లు నిజంగానే కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మి తీరాల్సిందే. ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. బర్త్ డే ట్రీట్ గా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభాస్ సినిమాలను రీరిలీజ్ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈసారి ప్రభాస్ బర్త్ డే గుర్తిండిపోయేలా బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ రీరిలీజ్ లు, రాజాసాబ్ నుంచి వచ్చిన పోస్టర్ తో పిచ్చెక్కిపోతున్నారంటే.. ఇంతలోనే రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నిమిషాల్లో ఆ మోషన్ పోస్టర్ మీడియా , సోషల్ మీడియాను ఆక్రమించేసింది. అభిమానుల వాట్సాప్ స్టేటస్ లు , ఇంస్టా స్టోరీలుగా మారిపోయింది. అయితే ఈ మోషన్ పోస్టర్ తో సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు. అసలు ప్రభాస్ కెరీర్ లోనే ఇలాంటి కథ కనీ వినీ ఉండరు. పైగా పోస్టర్ ను హర్రర్ ఈజ్ న్యూ హ్యూమర్ అంటూ ఎండ్ చేశారు. గతంలో రాజాసాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని.. ఇదొక హర్రర్ మూవీ అని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్న మోషన్ పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ , పోస్టర్ లో ప్రభాస్ యంగ్ లుక్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ముసలి గెటప్ లో కనిపించాడు. దీనితో ప్రభాస్ ఈ మూవీలో తాత, మనవడు గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాత పాత్ర దెయ్యంగా.. మనవడి పాత్ర హీరో అని అర్ధమౌతుంది . ఆల్రెడీ ఇప్పటికే బిల్లా , బాహుబలి లాంటి సినిమాలలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. కానీ ఇలా ఓల్డ్ గెటప్ లో కనిపించడం మాత్రం ప్రభాస్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్.

ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను 2025 ఏప్రిల్ కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఎంత చెప్పినా తక్కువే. బాక్స్ ఆఫీస్ రికార్డ్ లను కొల్లగొట్టాలన్నా, కోట్లు దానం చేయాలన్నా ప్రభాస్ తర్వాతే ఎవరైనా.. మనసున్న మహారాజు ప్రభాస్.. అంటూ ఇలా సోషల్ మీడియా అంతా కూడా ప్రభాస్ కట్ ఔట్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ప్రభాస్ లైన్ అప్స్ అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నుంచి వచ్చే అప్డేట్స్ కు.. ‘పోతారు హైప్ తో మొత్తం పోతారు’ అనే డైలాగ్ వాడడం ఒక్కటే తక్కువవుతుందేమో. ఇక ప్రభాస్ ప్రభంజనం ఎక్కడి వరకు కొనసాగుతుందో చూడాలి.

కల్కి 2 గురించి నవీన్ పోలిశెట్టి హింట్.. అదే నిజమయ్యేలా ఉంది

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన ,విజయ్ దేవర కొండ, రామ్ గోపాల్ వర్మ , రాజమౌళి. ఇంత మంది స్టార్స్ పేర్లు సడెన్ గా ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారా. మరి ఒకరా ఇద్దరా ఏకంగా ప్రభాస్ తో పాటు అంత మంది స్టార్స్ ను పెట్టి.. నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు. కల్కి విడుదల సమయంలో.. వరల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతున్న కల్కి , చరిత్ర సృష్టించబోతున్న కల్కి 2898 AD , ఆగని ఊచకోత వారం తిరగకముందే కల్కి భారీ రికార్డ్స్ అంటూ ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. నిజంగానే నాగ్ అశ్విన్ అన్నంత పని చేశాడు. ఎవరు ఊహించని విధంగా కథను అద్భుతంగా తెరపై చూపించాడు. కలలో కూడా జరగవేమో అనుకున్న క్యామియోలను స్క్రీన్ షేర్ చేసుకునేలా చేశాడు. కల్కితో ఏకంగా వేల కోట్ల రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ హిస్టరీలో సరికొత్త చాప్టర్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయిందేమో అనిపించేలా చేశాడు.

కల్కి సినిమా తర్వాత సినిమాలోని పాత్రల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. నిజంగానే కల్కి తో ఓ కొత్త అధ్యయనానికి నాంది పలికారు . కల్కి పార్ట్ 2 కూడా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా రావడానికి చాలానే సమయం పడుతుందని కూడా తెలియనిది కాదు. ప్రభాస్ కూడా ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ మధ్యలో కల్కి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 లో నవీన్ పోలిశెట్టి , నాని నటించబోతున్నారంటూ కొన్ని వార్తలు వినిపించాయి. మొదటి పార్ట్ లో చాలా మంది క్యామియోలను దింపాడు. ఆ సమయంలో వీరిద్దరిని తీసుకోలేకపోవడంతో.. ఎలా అయినా సరే సెకండ్ పార్ట్ కు తీసుకుంటానని చెప్పాడు నాగ్ అశ్విన్. అయితే వీరిలో నాని సంగతి తెలియదు కానీ, నవీన్ పోలిశెట్టి మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.

ఎందుకంటే, రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా చాలా మంది సెలెబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. ఈ క్రమంలో నవీన్ పోలిశెట్టి కూడా డార్లింగ్ ను విష్ చేస్తూ.. ఆఖరిలో ‘లెట్స్ పార్టీ ఇన్ శంబలా’ అని అన్నాడు. దీనితో ఇక దాదాపు నవీన్ పోలిశెట్టి కల్కి పార్ట్ 2 లో కన్ఫర్మ్ అయినట్లే. దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మాత్రమే బ్యాలెన్స్. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయిన వెంటనే హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కేస్తుంది. ఇక స్పిరిట్ మూవీ మొదలు పెట్టాడంటే మరో మూవీ చేయడానికి లేదని.. సందీప్ కండిషన్ పెట్టాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ చేస్తూనే వచ్చే ఏడాది చివరిలో కల్కి 2 గురించి అనౌన్స్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తాడో.. నాగ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Job చేస్తున్నారా? అయితే కచ్చితంగా ఈ పని చెయ్యండి. లేదంటే నష్టపోతారు

చాలా మంది యువత కూడా చదువుకున్నాక ఏదోక ఉద్యోగం సంపాదిస్తారు. కొంత మందికి చిన్న ఉద్యోగం వస్తుంది. కొంతమందికి పెద్ద ఉద్యోగం వస్తుంది. ఒకవేళ పెద్ద ఉద్యోగం వస్తే ఎక్కువ జీతం వస్తుంది. ఎక్కువ జీతం రావడం వల్ల ఎలాంటి ఢోకా ఉండదు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కానీ చిన్న ఉద్యోగులకి మాత్రం తక్కువ జీతం వస్తుంది. తక్కువ జీతంతో ఖర్చులను పెద్దగా మ్యానేజ్ చేయలేము. అందువల్ల సంపాదించిన డబ్బంతా కూడా ఇంటి ఖర్చులకే అయిపోతుంది. కానీ చిన్న ఉద్యోగులు కూడా డబ్బులు మిగుల్చుకునే మార్గాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఫాలో అయితే తక్కువ జీతం వచ్చినా డబ్బులు మిగిల్చుకోవచ్చు. మీ కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవచ్చు. చిన్న ఉద్యోగం చేస్తున్నా పెద్ద ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నా ఇప్పుడు చెప్పే పని తప్పకుండా చెయ్యండి. ఇంతకీ ఆ పనేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సపోజ్ మీ జీతం తక్కువలో తక్కువగా 20 వేలు అనుకుందాం. ఆ 20 వేలలో నెలకు ఒక 1000 నుంచి 1500 వందలు తీసి పక్కన పెట్టండి. ఆ డబ్బులే మీకు ఎక్కువ డబ్బులు మిగిలేలా చేస్తాయి. మనకు అందుబాటులో చాలా రకాల బీమా కంపెనీలు ఉన్నాయి. అందులో చాలా తక్కువ ధరకే మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. అలాంటి ప్లాన్స్ లలో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ ఈ రెండు ప్లాన్స్ తీసుకోవడం వలన వారి లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం హెల్త్ బాగలేక,లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కి వెళ్తే బిల్లు ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి లక్షల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. పెద్ద ఉద్యోగస్తులకి అయితే ఇబ్బంది ఉండదు. కానీ చిన్న ఉద్యోగాలు చేసే వారికి చాలా ఇబ్బంది. ఆ బిల్లు కట్టాలంటే అప్పులు చేయాలి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. మీ హాస్పిటల్ బిల్ ని బీమా కంపెనీలే చెల్లిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీరు పెద్దగా చెల్లించాల్సిన పని లేదు. నెలకు 300 నుంచి 400 రూపాయలు కట్టుకుంటే చాలు. అలాంటి బీమా కంపెనీలు మార్కెట్లో ఉంటాయి. వాటిలో ఏది మంచిదో కనుక్కొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది.

అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ .. ఈ ప్లాన్ తీసుకుంటే మీకు, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్లాన్ లో మీరు నెలకు 500 నుంచి 700 కట్టుకుంటే చాలు మీకు 2 కోట్ల దాకా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అలాంటి కంపెనీలు కూడా చాలానే ఉంటాయి. అవేంటో జాగ్రత్తగా తెలుసుకొని ఈ ప్లాన్ తీసుకోండి. ఇలా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ రెండు పనులు చేస్తే వారి లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు Policybazaar అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తే ఇలాంటి ప్లాన్స్ ఇచ్చే కంపెనీలు చాలా ఉంటాయి. వాటిలో మంచి కంపెనీని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇందులో 51 పైగా కంపెనీలు ఉంటాయి. అందులో బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఈ రెండు ప్లాన్స్ తీసుకోండి.

వేల కోట్ల భారం మోస్తున్న డైరెక్టర్స్.. TFIలో సునామి గ్యారెంటీ

మా హీరో పాన్ ఇండియా స్టార్ , మా హీరో గ్లోబల్ స్టార్.. బడా దర్శకుడు లేకపోయినా మా హీరోకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. నిజమే అభిమానులు చెప్పినట్లుగా హీరోలంతా అదే రేంజ్ లో ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, సౌత్ ఇండియన్ హీరోలు ఎవరు లేరు. అందరు పాన్ ఇండియ హీరోలే ఉన్నారు. సినిమాల మార్కెట్ హీరోల ఇమేజ్ ను బట్టి ఉంటుందనేది వాస్తవం. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు. వీరంతా పాన్ ఇండియా లెవెల్ లో హిట్స్ కొట్టడం వెనుక డైరెక్టర్స్ పాత్ర చాలా ఉంటుంది. ఒకసారి కోట్లలో వసూళ్లు వచ్చాయంటే.. ఇక తర్వాత సినిమా మీద కూడా అదే అంచనాలు కొనసాగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ , చరణ్, బన్నీ ముందు వేల కోట్ల టార్గెట్స్ ఉన్నాయి. అయితే వీరిపై ఎంత భారం ఉందో.. అంతకుమించిన భారం ఇప్పుడు దర్శకుల మీద పడుతుంది.

పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు దర్శకులు. ఒకరికి మించి ఒకరు బడ్జెట్ ను పెంచేస్తున్నారు. మరి అంత బడ్జెట్ కేటాయించినప్పుడు.. ఆ రేంజ్ వసూళ్లను సాధించాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంది. అలా వేల కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్నారు తెలుగు డైరెక్టర్స్ . తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సునామి సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అసలు భారీ బడ్జెట్ సినిమా అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది రాజమౌళి. బాహుబలితో రికార్డ్స్ బ్రేక్ చేసి.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకుని.. ఇప్పుడు ఒక్కో సినిమాకు మెరుగులు దిద్దుతూ.. బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అలా ఇప్పుడు మహేష్ తో ఓ ప్రాజెక్ట్ కు ఏకంగా 2000 కోట్ల భారీ బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. సో దానికి తగినట్లు రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనే మీదే ఉంది. ఇక ఆ తర్వాత ఇదే రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అది కాకుండా ఈ దర్శకుడి చేతిలో ప్రభాస్ సలార్ 2 సినిమా బాధ్యత కూడా ఉంది. ఈ రెండు దాదాపు 1000 కోట్ల మార్కెట్ ఉన్న ప్రాజెక్ట్స్. కాబట్టి ప్రశాంత్ నీల్ కూడా ఈ భారం మోస్తున్నట్లే.

ఇక ఈ రెండు సినిమాల అంత కాకపోయినా.. ప్రస్తుతం లెక్కల మాస్టారు సుకుమార్ కూడా వేల కోట్ల భారాన్ని మోస్తున్నాడు. రిలీజ్ కు చాలా దగ్గరిలో ఉన్న మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీసం 1200 నుంచి 1300 కోట్ల టార్గెట్ సుకుమార్ కళ్ళ ముందు ఉంది. ఇక వీరు కాకుండా సందీప్ రెడ్డి వంగ , ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే సౌత్ లో ఇంతమంది పేర్లు మోత మోగిపోతుంటే.. నార్త్ లో మాత్రం కేవలం అయాన్ ముఖర్జీ పేరు మాత్రమే వినిపిస్తుంది. వారి ఆశలన్నీ కూడా ఈ దర్శకుడిపైనే ఉన్నాయి. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. బాలీవుడ్ కాస్త నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటాల్సిందే. ఏమౌతుందో చూడాలి.

CIBIL స్కోర్ తక్కువుగా ఉన్నా బ్యాంక్ లోన్ పొందవచ్చు? ఎలా అంటే?

ప్రస్తుతం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడం అందరికీ చాలా అవసరంగా మారిపోయింది. మనకు ఎంత సేవింగ్స్ ఉన్నా కానీ ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. అంత చిన్న విషయం కాదు. ఈజీగా బ్యాంక్ లోన్ రాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక్కోసారి మీరు తీసుకునే లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్నో నెలలు తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు సంపాదన ఎక్కువున్నా లోన్ కావాలంటే ముందుగా బ్యాంకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీ సిబిల్ స్కోర్ ఎంత? అని. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టే మీ లోన్ శాంక్షన్ అయ్యే ప్రాసెస్ ముందు వెళుతుంది. ఇలా సిబిల్ స్కోర్ అనేది లోన్స్ విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా మెరుగ్గా ఉంటే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. తక్కువగా ఉంటే మాత్రం మనకు ఎంత జీతం ఉన్నా కానీ లోన్ వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ సమస్యకు వేరే మార్గం లేదా? సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇక లోన్ అప్లై చేసుకోలేమా? అని బాధ పడేవారికి ఇప్పుడు చెప్పబోయే విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందే మార్గం ఒకటి ఉంది? ఇక మార్గం ఏంటి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ తక్కువున్నా కానీ లోన్ పొందడానికి Co – Signer అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ తో మనం సిబిల్ స్కోర్ తక్కువున్నా కూడా లోన్ పొందవచ్చు. ఎలాగంటే మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వారు కానీ లోన్లు తీసుకొని సకాలంలో కట్టిన వారు ఉంటారు. అందువల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. వాళ్ళ హామీతో మీరు లోన్ పొందవచ్చు. అందుకు వారు మీతో పాటు బ్యాంకుకి వచ్చి మీ లోన్ పేపర్లపై సైన్ చేయాలి. మీ గురించి బ్యాంక్ వాళ్ళకు హామీ ఇస్తూ వారు సైన్ చేస్తే మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

కానీ మీరు సకాలంలో లోన్ తీర్చకపోతే ఆ ఎఫెక్ట్ మీ కో సైనర్లపై పడుతుంది. అందువల్ల వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు కచ్చితంగా లోన్ సకాలంలో కట్టగలిగితేనే కో సైనర్ సాయంతో లోన్ తీసుకోండి. ఈ విధంగా మీరు మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందవచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తక్కువ ఉండి లోన్ అవసరం ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

ఈ ప్రభుత్వ APP తో మీ ప్రాణాలు సేఫ్! ఆ యాప్ ఏంటి? దాని వల్ల ఉపయోగాలేంటి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా క్రైమ్స్ ఎలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజుకి ఏదో ఒక క్రైమ్ సీన్ వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అఘాయిత్యాలు ఆగట్లేదు. దేశంలో ప్రస్తుతం మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పని ప్రదేశాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఇతర ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్‌ వల్ల సకాలంలో ఆపద కాలంలో మహిళలకు సాయం అందుతుంది. ఎందుకంటే ఈ యాప్ హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంతకీ ఆ యాప్ ఏంటి? అదెలా పని చేస్తుంది? దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆ యాప్ పేరు 112 India యాప్. ఈ యాప్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ అందిస్తుంది. ఇది ప్రమాదంలో ఉన్నవారికి, లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర సమయాల్లో సాయం అందేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల సేఫ్టీకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇందులో సింగిల్‌ బటన్‌ నొక్కితే చాలు మీరు సేఫ్ ఐపోతారు. ఈ యాప్ లో చాలా కేటగిరీలు ఉంటాయి. సపోజ్ మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఏమైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈ యాప్ లో పోలీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని నొక్కారంటే చాలు 5 నుంచి 10 నిమిషాల్లో పోలీసులు మీరు ఉన్న లొకేషన్ కి వచ్చేస్తారు. ఇందులో హెల్ప్ అని మీరు ఒక్క బటన్ నొక్కడం ద్వారా మీ సమాచారం మీ లొకేషన్ తో సహా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కి వెళ్ళిపోతుంది. దాంతో వారు మీ సమాచారాన్ని లొకేషన్ ని దగ్గరలో ఉన్న పోలీసులకు అందిస్తారు. దాంతో వెంటనే పోలీసులు మీ వద్దకు వస్తారు మిమ్మల్ని సేవ్ చేస్తారు.

ఒకవేళ మీకు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినా ఎమర్జెన్సీ టీం వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా లేదా ఇంకేమైనా ప్రమాదాలు జరిగినా ఈ యాప్ సాయంతో సమాచారం ఇవ్వవచ్చు. దాంతోపాటు 112 నంబర్‌కు కూడా ఎమర్జెన్సీ కాల్‌ చేయవచ్చు. ఇలా ఈ యాప్ తో మీకు కావాల్సిన సాయం అందుతుంది. ఈ యాప్‌ లో వాయిస్‌ కాల్‌, SOS బటన్‌, SMS, ప్యానిక్‌ బటన్‌ ద్వారా అత్యవసర సాయం కోరవచ్చు. ఈ 112 ఇండియా యాప్ ఆండ్రాయిడ్‌, iOS యాప్‌లలో అందుబాటులో ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

ఆసక్తి రేపుతోన్న BSNL కొత్త సర్వీసులు! వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే?

BSNL రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటూ పోతుంది. తాజాగా కొన్ని కొత్త సర్వీసులని తీసుకు రాగా అవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. యూజర్లకు సేఫ్ గా మొబైల్ సర్వీసెస్ ని అందించేందుకు స్పామ్ కాల్స్ ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది BSNL. దీని ద్వారా యూజర్లకు అనవసరమైన కాల్స్ రాకుండా ఉంటాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ 500 కి పైగా లైవ్ ఛానల్స్, పే టీవీ ఆప్షన్‌లతో కూడిన కొత్త ఫైబర్ టీవీ సర్వీసును తీసుకొచ్చింది. ఈ సర్విస్ లో ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్కైబర్లు అందరూ కూడా తక్కువ ఖర్చుతో ఏకంగా 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే టీవీ స్ట్రీమింగ్ కోసం వాడే డేటా నెలవారీ ఇంటర్నెట్ డేటా కిందకి రాదు. అంటే టీవి స్ట్రీమింగ్ డేటా సపరేట్ గా వస్తుంది.

అలాగే ఫైబర్ ఇంటర్నెట్ యూజర్స్ కోసం ఫ్రీ Wi-Fi రోమింగ్ సర్వీస్ ని తీసుకొచ్చింది BSNL. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా BSNL హాట్‌స్పాట్ తో ఫ్రీగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అందువల్ల యూజర్లకు డేటా ఖర్చులు తగ్గుతాయి. ఇది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక వీటితో పాటు యూజర్స్ సిమ్ కార్డ్‌ల మెయిన్టెనెన్స్ ల కోసం ఆటోమేటెడ్ కియోస్క్‌ (KIOSK)లను స్టార్ట్ చేయనుంది. ఈ కియోస్క్‌లతో కస్టమర్లు BSNL సిమ్ కార్డ్‌లను చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. BSNL సిమ్‌ కొనాలనుకునే యూజర్లకు 24 అవర్స్ అందుబాటులో ఉండేలా ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే సిమ్‌లను ఈజీగా అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే C-DAC సహాయంతో మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ ని సింపుల్ చేసేందుకు డీ2డీ టెక్నాలజీ, 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తుంది BSNL.

అలాగే దేశంలో ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ (D2D) కనెక్టివిటీని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సర్వీస్ శాటిలైట్, మొబైల్ నెట్వర్క్ లను ఇంటర్కనెక్ట్ చేస్తుంది. ఈ అప్డెటెడ్ కనెక్టివిటీ ఎమర్జెన్సీ కాల్స్, కనెక్ట్ లేని ప్రాంతాల్లో డిజిటల్ సర్వీస్ లని సులభంగా అందించగలదు. ఇక BSNL సబ్‌స్క్రైబర్‌ల కోసం అద్భుతమైన e-auction ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌లను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ నంబర్లను మనం e-auction లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆక్షన్ చెన్నై, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో జరుగుతోంది. ఈ సర్వీస్ త్వరలో మరిన్ని ప్రాంతాల్లోకి రానుంది.

HP నుంచి AI ల్యాప్ టాప్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు

ఫేమస్ లాప్ టాప్ కంపెనీ HP ఇండియాలో తన ఫస్ట్ 2 ఇన్ 1 ఏఐ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త ల్యాప్ పేరు ‘ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్’. ఇది హెచ్ పీ నుంచి వస్తున్న ఫస్ట్ Artificial intelligence ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ ఫీచర్ల గురించి తెలిస్తే కచ్చితంగా అదిరిపోయాయని అంటారు. ఇక ఈ ల్యాప్ టాప్ ఫీచర్లు ఏంటి? దీని ధర ఎంత ? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ల్యాప్ టాప్ లో ఇంటెల్ లూనార్ లేక్ ప్రాసెసర్స్, సెకనుకు 48 ట్రిలియన్ పనులను చేయగల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ లో క్వాలిటీ వీడియోలను ఆస్వాదించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ అనే చెప్పాలి.ఇది ఒక్క చార్జ్ కు ఏకంగా 21 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇందులో 2.8K ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇంకా దీనిని మనం కేవలం ల్యాప్‌టాప్‌గానే కాకుండా టాబ్లెట్‌ లాగా కూడా వాడుకోవచ్చు.

ఈ ల్యాప్ టాప్ లో HP వోల్ఫ్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ సైబర్ అటాక్ నుండి ల్యాప్ టాప్ ని అందులో ఉండే మన డేటాను కాపాడుతుంది. అలాగే.. డీప్‌ఫేక్ డిటెక్టర్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫీచర్లు మన డేటాను సేఫ్ గా ఉంచుతాయి. ల్యాప్ టాప్ ని ఎవరు హ్యాక్ చేయకుండా ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి. ఈ ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్ టాప్ ఫ్రీలాన్సర్ లు, కంటెంట్ క్రియేటర్లకు ఇంకా ఏ జాబ్ చేసే వారికైనా చాలా బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఈ ల్యాప్ టాప్ లో 9 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, పాలీ ఆడియో ఉన్నాయి. అలాగే స్పాట్ర లైట్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ వంటి AI పాలీ కెమెరా ప్రో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ AI కంపానియన్ కంటెంట్ ఎనాలసిస్, PC ఆప్టిమైజేషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో క్రియేటివ్ వర్క్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కోపైలట్ + పీసీతో ఇంటిగ్రేట్ అవుతుంది.

ఈ ల్యాప్ టాప్ లో 32 జీబీ ర్యామ్ ఉంటుంది, 64 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో రెండు వేరియనట్లు ఉంటాయి. HP ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్ట్స్‌ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 రూ.1,81,999 ఉంటుంది. ఇక HP ఓమ్నీబుక్‌ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 అయితే రూ.1,91,999 ఉంటుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను అక్టోబర్ 31వ తేదీ లోపు కొంటే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ ఫ్రీగా వస్తాయి. దీన్ని బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

కేంద్రం మతిపోగొట్టే స్కీం.. నెలకు రూ. 55 పొదుపుతో.. ప్రతి నెల 3000 పొందే ఛాన్స్

కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నది. ఆర్థిక సాయం అందించే స్కీమ్స్ ను ప్రవేశపెడుతోంది. బాలికలు, మహిళలు, వృద్ధుల కోసం మంచి ప్రయోజనాలు అందించే పథకాలను అందుబాటులో ఉంచుతున్నది. ఆర్థికంగా వెనకబడిన వారికి కేంద్ర పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ పథకాల పట్ల అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారు. కేంద్రం అందించే పథకాల్లో తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టి అధిక లాభాలను అందుకోవచ్చు. కాగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్రేజీ స్కీమ్స్ ను అమలు చేస్తోంది.

ఉద్యోగులకు అయితే రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆ సదుపాయం ఉండదు కదా. అందుకే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సూపర్ స్కీమ్ ను అందుబాటులో ఉంచింది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన స్కీం. దీని ద్వారా అసంఘటిత రంగంలోని వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా పుల్లర్లు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు తదితరులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకంలో చేరితే నెలకు రూ. 55 పొదుపుతో ఏకంగా ప్రతి నెల 3 వేల పెన్షన్ అందుకోవచ్చు. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి. ఆ విషయాలు మీకోసం..

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన స్కీంలో కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్‌ అందుకుంటారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం 15 వేలకు మించకూడదు. కేంద్రం అందించే ఇతర పెన్షన్ పథకాల నుంచి లబ్ధి పొందని వారు అర్హులు. కార్మికుడు కనీసం 20 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పథకానికి కాంట్రిబ్యూట్‌ చేయాలి.

ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ ఉండాలి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టొచ్చు. పెట్టుబడి అనేది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55 ఇన్వెస్ట్ చేయాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ పథకంలో చేరాలనుకునే అసంఘటిత రంగ కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తి సమాచారం కోసం maandhan.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

జాబ్ సెర్చ్ లో ఉన్నారా? నెలకు 62 వేల జీతంతో 500 జాబ్స్ రెడీ

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అందరికీ ఉంటుంది. జాబ్ కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మంచి ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. కానీ అది కొందరికే సాధ్యమవుతుంటుంది. వందల్లో ఖాళీ పోస్టులుంటే వేలల్లో అభ్యర్థులుంటున్నారు. అందులో డెడికేషన్ తో ప్రిపేర్ అయి ప్రయత్నించిన వారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కొలువులకు మొదట్లో శాలరీలు తక్కువగా ఉన్నా ఎక్స్ పీరియన్స్ పెరిగే కొద్ది హైక్ అవుతుంటాయి. ప్రభుత్వం పలు రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ ను వదలకండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్‌ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రెడీ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 12 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.22 వేల 405 నుంచి రూ.62 వేల265 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 11 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు nationalinsurance.nic.co.in అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాల్సి ఉంటుంది.

ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. ఆమె ఎవరో తెలుసా

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ (ఏపీపీఎస్సీ)ను ఎట్టకేలకు నియమించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ ఏపీపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ఏపీ సర్కార్‌ ఆ బాధ్యతల్ని సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టి ఎట్టకేలకు ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను నియమించింది. ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందారు. ఆమె సర్వీస్‌లో డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పని చేశారు.

ఎవరీ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ అనురాధ?

1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాండర్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త కూడా ఐపీఎస్ ఆఫీసరే. ఆయన ఎవరో కాదు నిమ్మగడ్డ సురేంద్రబాబు. ఈయన కూడా ఐపీఎస్ అధికారిగా పలు బాధ్యతలు నిర్వహించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయం మేరకు సీనియర్‌ ఐపీఎస్‌ అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం దక్కించుకున్న కూటమి సర్కార్‌.. అధికారంలోకి రాగానే అప్పటి వరకూ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగుతున్న గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.

ఇక గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అప్పటి ప్రతిపక్ష నేతలు ఓ రేంజ్‌లో ఆరోపణలు చేశారు. ఇక గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మాత్రమే ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేసి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్నప్పటికీ గౌతతమ్‌ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలగారు.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం.. ఇక మీదట ఎవరి దారి వారిదే.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూనే కొన్ని కీలక షరతులను విధించింది

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 35 రోజులపాటు జైల్లో ఉన్న తర్వాత జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 18న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్ కు గురువారం కండిషనల్ బెయిల్ కు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు ఈ కేస్ కారణంగా వచ్చిన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు సైతం మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు

దీంతో జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు . సుదీర్ఘ వాదన తర్వాత జానీ మాస్టర్ వేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది

జైలు నుండి విడుదల అయ్యి బయటికి వచ్చిన తర్వాత బాధితురాలితో జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కానీ ఆమె వ్యవహారాల్లో తలదూర్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలితో జానీ మాస్టర్ సంప్రదించకుండా ఉండాలని జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతు విధించింది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం జానీ మాస్టర్ చెంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Health

సినిమా