Sunday, November 17, 2024

ఎర్రుపాలెం టూ నంబూర్.. వయా అమరావతి.. రాజధానికి రైలొచ్చేస్తోందోచ్

అమరావతి పునర్నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అందుకోసం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. దీంతో అమరావతిపై కాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రాజధాని అమరావతి విషయంలో మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టుకు ఓకే చెప్పింది మోదీ సర్కార్. నేషనల్ రైల్‌ కనెక్టివిటీ పెంచే ఈ రైల్వే లైన్.. అమరావతి అభివృద్ధిలో పడ్డ కీలక అడుగు. కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వెయ్యడంతో త్వరలో ఈ రైల్వే లైను నిర్మాణం షురూ కాబోతోంది.

–రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం

–రైల్వేలైన్‌లో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ. వంతెన

–ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌

–చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు.. ఢిల్లీ నగరాలతో అమరావతి రైల్వే లైన్‌ అనుసంధానం

— ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది.

— అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లేవారికి సులువైన మార్గంగా ఈ రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తారు.

— మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ కూడా ఈ రైల్వేలైన్‌ ఏర్పాటు కానుంది.

అమరావతికి రైల్వేలైన్‌ మంజూరు కావడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అమరావతి నగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనుకున్న మన కల సాకారం కాబోతోందని చెప్పారు.

సినిమాల్లో సెంటిమెంట్‌ సీన్లు చూసి ఏడ్చేవారికి పెనుముప్పు.. ఊహించని షాకిచ్చిన సైంటిస్టులు

మన జీవితంలోని ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌ సోర్స్‌లలో లు ఒకటి. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపలా టీవీ ముందు కూర్చుని నచ్చిన చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు.

అయితే కొందరు లను చూసే సమయంలో అందులోని సెంటిమెంటల్‌ సీన్స్‌ చూసి ఏడ్చేవారు కూడా ఉన్నారు. అది కేవలం నటన అయినప్పటికీ లోని సీన్‌కి తీవ్ర భావోధ్వేగానికి గురై కన్నీరు కారుస్తుంటారు. తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని వీరి పరిశోధనల్లో తేలింది.

న్యూరోటిసిజం సమస్యతో బాధపడువారిలో భయం, విచారం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. అలాగే ఒంటరితనం, ఆందోళన, చిరాకు వంటి వివిధ వివిధ భావోద్వేగాలు మనస్సు, శరీర ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. శాస్త్రవేత్తలు ఒంటరితనాన్ని అకాల మరణానికి బలమైన అంచనాగా గుర్తించారు. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారు స్వీయ-హాని, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థ వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూరోటిసిజంతో బాధపడేవారిలోని మానసిక కల్లోలం, విసుగు చెందడం వంటివి కూడా అధిక మరణాల ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. మొత్తంమీద, ఈ వ్యాధి పురుషులలో అధికంగా ఉంటుందని, 54 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో, కనీస డిగ్రీ లేనివారిలో కనిపిస్తుందని పరిశోధన బృందం కనుగొంది.

ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం యూకే బయోబ్యాంక్‌ డాటాలో ఉన్న ఐదు లక్షల మందికి చెందిన 17 ఏండ్ల జీవితాన్ని ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇది బయోలాజికల్ శాంపిల్స్, జన్యు, జీవనశైలి, అర మిలియన్ల ప్రజల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారంతో కూడిన భారీ డేటాబేస్.

బయోబ్యాంక్‌లో భద్రపరచబడిన దాదాపు 500,000 మంది వ్యక్తులను 2006 నుంచి 2010 మధ్య అధ్యయనం చేసి న్యూరోటిసిజం మూల్యాంకనాన్ని సేకరించారు. అప్పటి నుంచి 17 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఈ వ్యక్తులు జీవించారా లేదా మరణించారా అనే విషయాన్ని ట్రాక్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ 17 సంవత్సరాల కాలంలో దాదాపు 500,000 మందిలో 43,400 మంది మరణించినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరి మరణానికి ప్రధాన కారణం క్యాన్సర్‌, ఆ తర్వాత నాడీ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ వ్యాధులతో మరణించినట్లు డేటా చూపించింది. ముఖ్యంగా చనిపోయిన వారందరూ అపరాధ భావన, మానసిక కల్లోలం అనుభవించారని, వారి జీవితంలో నిరంతరం ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. న్యూరోటిసిజంలోని ఇతర సమస్యల కంటే ఒంటరితనం అనేది ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని ప్రొఫెసర్‌ ఆంటోనియో టెర్రాసియానో తెలిపారు.

భారత్‌లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. ప్రారంభ లక్షణాలు ఎలాఉంటాయంటే

మన దేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య ప్రతీయేట గణనీయంగా పెరుగుతున్నాయి. WHO ప్రకారం..2022 సంవత్సరంలో మన దేశంలో 1.27 లక్షలకు పైగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

సర్వైకల్ క్యాన్సర్ కారణంగా సంభవించే మొత్తం మరణాలలో 25 శాతం ఒక భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో చాలా వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అడ్వాన్స్‌డ్ అంటే చివరి దశలో గుర్తించడమే. ఈ క్యాన్సర్ లక్షణాల గురించి మహిళలకు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీని కారణంగా వ్యాధి ఆలస్యంగా గుర్తించబడుతుంది. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మహిళలు సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.

ముందుగా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం..

ఈ క్యాన్సర్ మహిళల్లో గర్భాశయ ముఖద్వారంలో మొదలవుతుంది. సెర్విక్స్ అంటే స్త్రీల ప్రైవేట్ పార్ట్‌లలో ఉండే భాగం. ఇది గర్భం దిగువ భాగంలో ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారంలో ప్రారంభమవుతుంది. దానిని సకాలంలో గుర్తించకపోతే, అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. మహిళల్లో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ సంక్రమణం. ఈ వైరస్ స్త్రీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ నాశనం అవదు. ఫలితంగా సంవత్సరాల తరబడి గర్భాశయంలో పెరుగుతూనే ఉంటుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కణాలు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. కణాల అనియంత్రిత పెరుగుదల క్యాన్సర్‌కు దారితీస్తుంది. చాలా సందర్భాలలో మహిళలకు ఈ క్యాన్సర్ గురించి ప్రారంభదశలో తెలియదు.

చికిత్స ఎలా జరుగుతుంది?

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని ఓంకో గైనకాలజీ విభాగంలో డాక్టర్ సలోని చద్దా మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేస్తాం. ఇతర చికిత్సలలో క్యాన్సర్ కణాలను చంపే మందులు ఉండవచ్చు. ఇందులో రోగికి కీమోథెరపీ ఇస్తారు. రోగికి రేడియోథెరపీతో కూడా చికిత్స చేస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే సులువుగా నివారించవచ్చు. అయితే చాలా వరకు ఆలస్యంగా గుర్తిస్తారని డాక్టర్ సలోని చెప్పారు. లక్షణాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో మహిళల్లో ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే, సులభంగా చికిత్స చేయవచ్చు. ఇది క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు ఇవే

పీరియడ్స్‌ రాకపోవడం
లైంగిక సంపర్కం తర్వాత కటి ప్రాంతంలో అంటే పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి
ప్రైవేట్ పార్ట్ నుంచి వైట్‌ డిశ్చార్జ్
బరువు తగ్గడం

గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించవచ్చు?

AIIMSలోని గైనకాలజీ విభాగంలో డాక్టర్ స్వాతి మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సహాయంతో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 9 ఏళ్లు దాటిన బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. 9 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాక్సిన్ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి స్త్రీ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పొందాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే లైంగికంగా చురుకుగా మారిన తర్వాత గర్భాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

ఏ పరీక్షలు చేయాలి

రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించవచ్చని డాక్టర్ స్వాతి చెప్పారు. ఈ క్యాన్సర్‌ను టెస్ట్ చేయడానికి, పాప్ స్మెర్ లేదా HRHPV పరీక్ష ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. దీంతో ఇది క్యాన్సర్‌గా మారకముందే నయం చేసుకోవచ్చు. ఇది కాకుండా మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.

వాయుకాలుష్యంతో పెరుగుతున్న గుండె జబ్బులు.. ధూమపానం చేయకున్నా పెను ముప్పు

ఎన్‌సీఆర్‌తో సహా పలు రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చాలా నగరాల్లో AQI ప్రమాదకరంగా 300 దాటింది. ఈ విషపూరితమైన గాలిలో నివస్తే జనాల ఆరోగ్యానికి భారీ హాని కలిగిస్తుంది.

ఈ విషపూరిత గాలి ఊపిరితిత్తులను అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇది మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుంది. ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులు పెరుగుతుండగా, హృద్రోగులు కూడా దీని బారిన పడుతున్నారు. గత దశాబ్ద కాలంలో వాయుకాలుష్యం వల్ల గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య నిర్వహించిన పరిశోధనలో తేలింది. దీని కారణంగా ప్రతి సంవత్సరం 1.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు కేవలం వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో వాయుకాలుష్యం కారణంగా గుండె జబ్బుల వల్ల మరణాలు 27 శాతం పెరిగాయి.

వాయుకాలుష్యంలో ఉండే మైక్రోస్కోపిక్ అదృశ్య కణాలు గుండె కొట్టుకోవడం, రక్తం గడ్డకట్టడం, ధమనులలో ఫలకం ఏర్పడటం, రక్తపోటుపై ప్రభావం చూపుతాయని, అలాగే శ్వాసకోశ వ్యాధులు, శరీరంలోని ఇతర పరిస్థితులపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరుణ్ బన్సల్ వివరించారు. దీని కారణంగా, పెరుగుతున్న కాలుష్యం దగ్గు అతిపెద్ద సమస్యను కలిగిస్తుంది. కాలుష్యంలో జీవించడం అంటే రోజంతా ధూమపానం చేయడం, ఇందులో నికోటిన్ ఉండకపోయినా అనేక ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి. దీని కారణంగా ఇది ఊపిరితిత్తులతో పాటు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయంలో రక్తపోటుతో బాధపడేవారికి రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్లీన గుండె సమస్యలు ఉన్నవారు కూడా సమస్యలను ఎదుర్కొంటారు.

ఎలా రక్షణ పొందాలి?

కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వాకింగ్ మానుకోవాలి. వ్యాయామం చేయాలంటే మూసి ఉన్న వాతావరణంలో ఉండాలి. జిమ్‌లో మాత్రమే వ్యాయామం చేయాలి.
మీరు నడక కోసం బయటకు వెళ్లాలనుకుంటే, ట్రాఫిక్ పెరగడానికి ముందు ఉదయం లేదా సాయంత్రం ఆలస్యంగా బయటకు వెళ్లండి.
బయటకు వెళ్లే బదులు ఇంట్లోనే ఉంటూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయొచ్చు.
శారీరకంగా చురుకుగా ఉండాలి.
పండుగల సమయంలో మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా కొవ్వు, జిడ్డైన ఆహారాలు, అధిక కేలరీల ఆహారం తీసుకోవద్దు.
మీ ఆహారంలో ఆకు కూరలు, సలాడ్, మొలకలు, బీన్స్, పప్పులు, చీజ్, పాలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.
వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి.
బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ .. దిమ్మ తిరిగే ట్విస్టులతో మైండ్ బ్లాక్

బిచ్చగాడు తో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని. గతంలో ఎక్కువగా డిఫరెంట్ కథలతో లు తీసిన అతను ఈ మధ్యన ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ లను తెరకెక్కిస్తున్నాడు.

అలా విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం హిట్లర్. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ మూవీ రిలీజైంది. అయితే ఎన్టీఆర్ దేవర బరిలో ఉండడంతో తెలుగులో ఈ ను రిలీజ్ చేయలేదు. తమిళంలోనూ ఈ కు నెగెటివ్ టాక్ వచ్చింది. అయతే కథ, కథనాలు, టేకింగ్ పరంగా విజయ్ ఆంటోని కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో హిట్లర్ ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. హిట్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుంచి విజయ్ ఆంటోని ను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అలాగే హిట్లర్ కు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా పంచుకుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే హిట్లర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ వాసుదేవమీనన్‌, చరణ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హిట్లర్ కు ధన దర్శకత్వం వహించారు. ఈయన మరెవరో కాదు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు ప్రియ శిష్యుడు. ఇక కథ విషయానికి వస్తే.. మినిస్టర్ మైఖేల్ కు చెందిన మనుషులు ఒక్కొక్కరు దారుణ హత్యకు గురవుతుంటారు. అలాగే మినిస్టర్‌కు చెందిన కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఓ అపరిచిత వ్యక్తి అత్యంత చాక చక్యంతో అపహరించుకుపోతాడు. మరి మినిస్టర్ పై పగ బట్టిన ఆ వ్యక్తి ఎవరు?ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారు అన్నది హిట్లర్ స్టోరీ. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ లు బాగా చూసే వారికి హిట్లర్ కూడా ఒక టైమ్ పాస్ మూవీగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు రానున్న హిట్లర్..

కమర్షియల్ జోలికి వెళ్లని అనుష్క.. ఎందుకు.? దేవసేన ప్లానే వేరు

అనుష్క కావాలనే కమర్షియల్ లకు దూరంగా ఉన్నారా..? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్సయ్యారా..? అందుకే లేడీ ఓరియెంటెడ్ లు మాత్రమే చేస్తున్నారా..?
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్‌గా ఎందుకున్నారు..? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అసలు సమస్య ఎక్కడుంది..? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ లతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి.

అనుష్క కావాలనే కమర్షియల్ లకు దూరంగా ఉన్నారా..? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్సయ్యారా..? అందుకే లేడీ ఓరియెంటెడ్ లు మాత్రమే చేస్తున్నారా..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్‌గా ఎందుకున్నారు..?

జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అసలు సమస్య ఎక్కడుంది..? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ లతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి.

అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. మూడు నాలుగేళ్లకో చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండటానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్నా.. అనుష్క శెట్టి మాత్రం మునపట్లా హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.

అనుష్క ఓకే అనాలే గానీ.. ఇప్పటికీ కమర్షియల్ ల్లో ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. కానీ జేజమ్మ ఆప్షన్ మరోలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ హీరోయిన్ కారెక్టర్స్ వైపు అనుష్క చూడట్లేదు.

ఎప్పట్లాగే లేడీ ఓరియెంటెడ్ కథల వైపు ఆసక్తిగా ఉన్నారు అనుష్క. ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా.. వాటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు జేజమ్మ. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క చేస్తున్నారు.. అదే ఘాతీ.

అది కూడా ఓటిటి . క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఇక మలయాళంలో కథనార్ చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తుంది. పీరియడ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు.

మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ళ తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. ఆ మధ్య భాగమతి 2పై ప్రచారం జరిగింది కానీ దానిపై క్లారిటీ అయితే రాలేదు. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై విజయం సాధించింది.

దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. కానీ అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయిప్పుడు.

ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. అమరావతి రైల్వే లైన్‌కు కేబినెట్ ఆమోదం

అమరావతి 2.O వర్షన్‌ నడుస్తోందిప్పుడు. రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద 160 కోట్ల రూపాయలతో సీఆర్‌డీఏ కోసం జీ+7 బిల్డింగ్‌ పనులను 2017లో ప్రారంభించారు.

దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను మళ్లీ ప్రారంభించారు. ఈసారి పనులు ఆగడం కాదు.. టార్గెట్‌ లోపు పూర్తిచేయాలనే టార్గెట్ కూడా పెట్టారు.

ఈ క్రమంలోనే అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రగతికి రైల్వే ద్వారా పనుల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అమరావతికి వెళ్లే రైలు మార్గాన్ని రూపొందించేందుకు భారతీయ రైల్వే సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య ప్రాంతాలలో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలని ఇప్పటికే రైల్వే శాఖ కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 97 గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటంతో భూసేకరణలో వేగం పుంజుకోనుంది. కొత్త రైల్వే లైన్ ద్వారా ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని నగరం అమరావతికి సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.

కొత్త రైల్వే లైన్ay భాగంగా కృష్ణా నదిపై కృష్ణా నదిపై 3.233 కి.మీ పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ కారణంగా అమరావతికి చెన్నై, కొలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ నగరాలతో అనుసంధానం చేయనున్నారు. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల మీదుగా కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు దాదాపు 450 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించటం కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని రైల్వే శాఖ ఇది వరకే అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ లో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి. పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఈ రైల్వే లైన్ లో ఉంటాయి. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి రైల్వే నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి అమరావతి నగరాన్ని AI నగరంగా సుందరంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు. వచ్చే మూడేళ్లలో అమరావతికి రైల్వే ట్రాక్ పూర్తి చేసేందుకు రైలు శాఖ కసరత్తు చేస్తోంది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ లోన్స్‌పై వడ్డీ రేటు తగ్గింపు

భారతదేశపు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక నెల కాల వ్యవధిలో నిధుల ఆధారిత రుణ రేటుకు సంబంధించిన వ్యయంపై 25 బేసిస్ పాయింట్లు తగ్గింపును ప్రకటించింది.

దీంతో ఎస్‌బీఐ రుణాలైన వ్యక్తిగత రుణాలు, కారు రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ల వంటి స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు గణనీయంగా తగ్గుతుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం అక్టోబర్ 15, 2024 నుంచి ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించబడింది. అయితే ఇతర పదవీకాలాలపై ఎంసీఎల్ఆర్ అలాగే ఉంటుంది.

ఎంసీఎల్ రేటు ఓవర్‌నైట్‌కు 8.2 శాతం, మూడు నెలల కాలవ్యవధికి 8.50 శాతం, ఆరు నెలలకు 8.85 శాతం, బెంచ్‌మార్క్ ఒక సంవత్సరం కాలవ్యవధికి 8.95 శాతం, రెండేళ్లకు 9.05 శాతం, మూడేళ్లకు 9.10 శాతం. సెప్టెంబర్‌లో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన 3 నెలల ఎంసీఎల్ఆర్‌ను తగ్గించిన వారాల తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 2024 లేదా ఫిబ్రవరి 2025 నుండి భారతదేశంలో రేట్ కట్ సైకిల్‌ను ప్రారంభించనుంది.

ఇప్పటి వరకు డిసెంబర్ 2024 నుండి రేటు తగ్గింపులు ప్రారంభమవుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే సెప్టెంబరులో తాజా సీపీఐ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల గరిష్ట స్థాయి 5.49 రేటు తగ్గింపు సమయంపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను పునఃసమీక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత్ బెంచ్ మార్క్ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు, బ్యాంకులు సాధారణంగా కస్టమర్‌లకు రుణం ఇవ్వలేని కనీస వడ్డీ రేటు వంటివి రుణగ్రహీతలు రుణాలపై ఎంత వడ్డీని చెల్లించాలో నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ తగ్గినప్పుడు రుణ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.

టెన్త్‌ అర్హతతో.. యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ఉద్యోగాలు.. నో ఎగ్జాం, నో ఇంటర్వ్యూ

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని యంత్ర ఇండియా లిమిటెడ్ భారీగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలు ఉండగా.. వీటన్నింటినీ అర్హులైన అభ్యర్ధుల ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 2498 ఖాళీలు, నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యంత్ర ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యార్హతల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- అంబర్‌నాథ్‌ తదితర ఫ్యాక్టరీలలో మొత్తం అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేస్తారు.

మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో అప్రెంటీస్‌లను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత ఐటీఐ కేటగిరీలో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో పాసై ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 21, 2024వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

గోంగూర చికెన్ బిర్యానీ అంటే ప్రాణమా.? ఇంట్లోనే తయారుచేసుకోండిలా..

కావాల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ – 1/2 కేజీ, ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో – ప్యూరీ, గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు), కారం – 2 టీస్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – తయారీకి సరిపడా, నీరు – ఒక కప్పు, మసాలా పొడి

ఈ బిర్యానీ కోసం ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ గా చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీయించి టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంటలో వేయించాలి.

బోన్ లెస్ చికెన్ పీసెస్ వేసి తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత కొంచెం కారం, పసుపు వేయండి. తర్వాత కాస్త నీరు ఆడ్ చేసి పాన్ మీద మూత పెట్టండి. సుమారు 10-15 నిమిషాలు ఉడికించి మూత తెరిచి మసాలా పొడి వేసి బాగా కలపండి. ఉప్పు వేసి గోంగూర చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు: బాస్మతి రైస్ – 750 గ్రాములు, వేయించిన నిలువగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు, జీడిపప్పు, కుంకుమపువ్వు – కొంచెం ,రోజ్ వాటర్ ,పచ్చిమిర్చి – 8 నుంచి 10, పుదీనా ఆకులు – 1 టీస్పూన్, కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా

ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమన్నీ అందులో వేసుకోవాలి. తర్వాత నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మూత పెట్టండి. చివరిగా తక్కువ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధం.

గోధుమ నూక vs ఓట్స్‌.. వీటిల్లో ఏది తింటే వెయిట్ లాస్ అవుతారు

ఈ మధ్య కాలంలో అందరూ ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

బరువు ఎక్కువగా ఉంటే.. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటివి ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది డైటీషయన్స్‌ సలహాలు తీసుకుంటే.. మరికొంత మంది ఇంట్లో సొంతంగా బరువు తగ్గేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో ఏం తింటే మంచిదో తెలీక తిక మక పడుతూ ఉంటారు. ఓట్స్ తింటే బరువు తగ్గుతారని చాలా మంచికి తెలిసిన విషయమే. కానీ గోధుమ నూక కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చని మరికొంత మంది అంటున్నారు. మరి వీటిల్లో ఏది బరువు తగ్గేందుకు ఎక్కువగా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ నూక:

గోధుమ నూక అనేది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. గోధుమ నూకతో చాలా మంది ఉప్మా, జావ, అన్నం లాంటివి చేసుకుంటూ ఉంటారు. పూర్వం వీటిని ఎక్కువగా తీసుకునేవారు. ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ గోధుమ నూక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు ఇతర ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఈ నూకతో చేసిన పదార్థాలు తక్కువగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఇతర పదార్థాలను కూడా తీసుకోలేం. ఆకలి తక్కువగా ఉంటుంది. ఉదయం గోధుమ నూక తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. తక్షణమే శక్తి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.

ఓట్స్:

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓట్స్. చాలా మంది ఇప్పడు వీటిని జోరుగా ఉపయోగిస్తున్నారు. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్‌తో ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్‌ని పోషకాలకు పవర్ హౌస్‌గా చెప్పొచ్చు. ఇందులో కూడా ఫైబర్, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కూడా ఓట్స్ ఎంతో చక్కగా సహయ పడతాయి.

ఏది బెటర్..

గోధుమ నూక, ఓట్స్ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి ఈ రెండూ కూడా చక్కగా హెల్ప్ చేస్తాయి. అయితే ఓట్స్‌తో పోల్చితే గోధుమ నూకలో క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఓట్స్ బదులు గోధుమ నూక తీసుకుంటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఈ స్మార్ట్ వాచ్‌లు తోడుంటే నో టెన్షన్..ఆకట్టుకుంటున్న ఫీచర్లు.

మింత్రా దీపావళి సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు అందుబాటు ధరలలో ఉన్నాయి. ముఖ్యంగా మునుపెన్నడూ లేని తగ్గింపు ధరలు స్మార్ట్‌వాచ్‌లపై అందిస్తున్నారు.

అలాగే ఎంపిక చేసిన బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో పదిశాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరిగిన దృష్ట్యా యువత ప్రస్తుతం ఈ సేల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏ సేల్‌లో లేని మోడల్స్‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్‌లు అందించడంతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా దీపావళి సేల్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల గురించి వివరాలను తెలుసుకుందాం.

పెబుల్ హైవ్

ఉత్తమ టెక్నాలజీ, సొగసైన డిజైన్ తో రూపొందించిన పెబుల్ హైవ్ స్మార్ట్ వాచ్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో వైబ్రెంట్ 1.39 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్యూచరిస్టిక్ ఆక్టా డిజైన్, బ్లూటూత్ కాలింగ్ ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. హార్ట్ బీట్, ఎస్వీఓ2 స్థాయిలను పర్యవేక్షించుకోవచ్చు. వ్యాయామం చేసుకోవడానికి వివిధ మోడ్ లు, డీఐవై వాచ్ ఫేసెస్, ఇన్ బిల్ట్ గేమ్ లు, ఇంటర్నేషనల్ టైమింగ్, అలారం, క్యాలెండర్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ వాచ్ పై ఒక ఏడాది వారంటీ కూడా లభిస్తుంది. మింత్రా దీపావళి సేల్ లో రూ.1,699కి ఈ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ కలర్ ఫిట్

నిత్యం మీకు ఉపయోగపడే వివిధ ఫీచర్లు ఈ వాచ్ లో ఉన్నాయి. 1.69 అంగుళాల డిస్ ప్లే, ట్రూ సింక్ టెక్నాలజీ ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణ సమయంలో బ్లూటూత్ కాలింగ్ తో చాలా ఉపయోగం ఉంటుంది. హ్యాండ్ వాష్ రిమైండర్లు, వాతావరణ హెచ్చరికలు, అలారం తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు హార్ట్ బీట్, బ్లడ్, ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర, ఒత్తిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. 150కి పైగా వాచ్ ఫేస్లు, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ అదనపు ప్రత్యేకతలు. ఏడాది వారంటీ కలిగిన నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్ మింత్రా లో రూ.1,749కి అందుబాటులో ఉంది.

బోట్ లునార్ ఫిట్

ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు, వివిధ స్పోర్ట్ మోడ్ లు కలిగిన బోట్ లునార్ ఫిట్ స్మార్ట్ వాచ్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, 400 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని వివిధ స్టోర్ట్ మోడ్ లలో మీ ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవచ్చు. దుమ్ము, చెమట తదితర వాటి నుంచి ఐపీ 67 రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కాపాడుతుంది. పైన మాదిరిగానే ఒక ఏడాది వారంటీ అందిస్తున్నారు. మింత్రా దీపావళి సేల్ లో ఈ స్టార్ట్ వాచ్ ను రూ.2,199కి కొనుగోలు చేసుకోవచ్చు.

రియల్ మీ ఎస్ 2

స్టైల్, టెక్నాలజీ ని కొరుకునే వారికి రియల్ మీ ఎస్ 2 స్టార్మ్ వాచ్ చక్కగా సరిపోతుంది. 1.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే తో స్క్రీన్ లో స్పష్టత ఉంటుంది. చాట్ జీపీటీ 3.5 మద్దతుతో మీరు కాల్స్ కు సమాధానాలు ఇవ్వవచ్చు. దాదాపు 8 నుంచి 13 రోజుల వరకూ బ్యాటరీ పని చేస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణకు ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ తో పాటు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీ తో ఫిట్ నెస్ ను పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్టార్మ్ వాచ్ కు ఒక ఏడాది వారంటీ ఇస్తున్నారు. మింత్రా దీపావళి సేల్ లో రూ.4,499కి సొంతం చేసుకోవచ్చు.

సీఎన్‌జీ కారు కొనాలనుకుంటున్నారా..?మార్కెట్‌లో లభిస్తున్న బెస్ట్ కార్లు ఇవే

మారుతీ సుజుకి ఆల్టో కె10 పిట్టకొంచెం కూతఘనం అన్నట్టు ఈ చిన్నకారు ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. ఈ కారు సీఎన్ జీ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ ఐ (ఓ) ధర రూ.5.73 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకూ ఉంటుంది.

దీనిలోని 1.0 లీటర్ ఇంజిన్ నుంచి 56 హెచ్ పీ, 82.1 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేశారు. సుమారు 33.85 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

సీఎన్ జీ కారు కొరుకునేవారికి మారుతీ సుజుకి విడుదల చేసిన సెలెరియో మంచి చాయిస్. వీటిలో వీఎక్స్ఐ ట్రిమ్ లో మాత్రమే బయో ఫ్యూయల్ ఎంపిక అందుబాటులో ఉంది. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ తో పనిచేస్తుంది. సీఎన్ జీపై నడుస్తున్నప్పుడు 56 హెచ్ పీ, 82.1 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. ఐదు స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వచ్చిన సెలెరియా కారు రూ.6.73 లక్షలకు అందుబాటులో ఉంది. సీఎన్ జీ వెర్షన్ 34.43 మైలేజీ ఇస్తాయి.

సీఎన్ జీ వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి హ్యుందాయ్ ఎక్స్ టర్ బాగుంటుంది. సీఎన్ జీ ఎంపికలో ఈ కారు రెండు రకాల ట్రిమ్ లలో వచ్చింది. ఎక్స్ టర్ ఎస్ రూ.8.50 లక్షలు, నైట్ ఎడిషన్ ప్యాకేజీతో ఎక్స్ టర్ ఎస్ ఎక్స్ రూ.9.38 లక్షలుగా ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ బయో ఫ్యూయల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. 67 హెచ్ పీ, 95.2 గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ జతచేశారు. సుమారు 27 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

టాటా పంచ్ సీఎన్ జీ కారు రూ.7.22 లక్షల నుంచి రూ.9.89 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీనిలోని 1.2 లీటర్ ఇంజిన్ నుంచి సీఎన్ జీపై నడుస్తున్నప్పుడు 72 హెచ్ పీ, 103 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కు ఇంజిన్ కు అమర్చారు. ఈ కారు సుమారు 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

టయోటా నుంచి విడుదలైన గ్లాంజా వినియోగదారులకు మంచి ఎంపిక. ఈ కారు రెండు ట్రిమ్ లలో బయో ఫ్యూయల్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. గ్లాంజా సీఎన్ జీ ఎస్ ట్రిమ్ రూ.8.65 లక్షలు, జీ ట్రిమ్ రూ.9.68 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతున్నాయి. సీఎన్జీ 1.2 లీటర్ బయో ఫ్యూయల్ ఇంజిన్ తో నడుస్తుంది. దాని నుంచి 76 హెచ్ పీ, 98.5 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. గేర్ బాక్స్ కు ఐదు రకాల స్పీడ్ మాన్యువల్స్ తో అమర్చారు. ఈ కారు సుమారు 30.61 మైలేజీ అందిస్తుంది.

ఆ మిక్సీలపై భారీ డిస్కౌంట్..ఫ్లిప్ కార్ట్ సేల్‌లో అద్భుత ఆఫర్

వంటింటికి అవసరమైన వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులలో మిక్సర్ గ్రైండర్ ఒకటి. ఇది లేకపోతే వంటి పని పూర్తి కాదు. కూరలకు రుచిని తీసుకువచ్చే సుగంధాలను పొడి చేయాలన్నా, టిఫిన్ కోసం పూరీలు తయారు చేయడానికి పిండిని కలపాలన్నా, ఇంకా అనేక అవసరాలకు చాలా అవసరం.

ఇలా మిక్సర్ గ్రైండర్లు వంటింట్లో మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి. దీపావళి పండగ త్వరలో రాబోతోంది. ఈ సందర్భంగా ఇంటిలోని మహిళలకు మిక్సర్ గ్రైండర్ బహుమతిగా ఇస్తే ఎంతో బాగుంటుంది. అయితే దాని ధర గురించి భయపడవద్దు. ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.2 వేల కంటే తక్కువ ధరకే వివిధ కంపెనీల మిక్సర్ గ్రైండర్లు అందుబాటులో ఉన్నాయి.

సాన్సుయ్ ప్లస్

నలుపు, నీలం రంగులో లభిస్తున్న సాన్సుయ్ ప్లస్ 500 వాట్స్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనికి సుమారు 43 వేల మంది వినియోగదారులు 4.1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. కంపెనీ నుంచి రెండేళ్ల వారంటీ లభిస్తుంది. మిక్సర్ గ్రౌండింగ్ కోసం మూడు జార్ లను అందిస్తారు. వాటితో మసాలా దినుసులను గ్రైండ్ చేసుకోవచ్చు. పండ్ల నుంచి జ్యూస్ లు కూడా తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 63 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1,299కి అందుబాటులో ఉంది.

పీజియన్

స్టెయిన్ లెస్ స్టీల్ జాడీ, బ్లేడ్ లతో పీజియన్ 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్ ఆకట్టుకుంటోంది. దీనికి ధృడమైన ఏబీఎస్ బాడీ ఉండడం అందనపు ప్రత్యేకత. దీనివల్ల తుప్పు పట్టకుండా, విద్యుత్ షాక్ కొట్టకుండా ఉంటుంది. దీనిలోని 500 వాట్స్ మోటారుతో 19 వేల ఆర్పీఎం వేగంతో మిక్సర్ పనిచేస్తుంది. ఎలాంటి మసాలా దినుసులనైనా చాలా సులభంగా రుబ్బుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీనిపై 65 శాతం తగ్గింపు అందిస్తున్నారు. కేవలం రూ.1,699కి కొనుగోలు చేసుకోవచ్చు.

బజాజ్ జీఎక్స్ 1

మసాల దినుసులను పొడి చేసుకోవడానికి, పూరీ పిండి వంటిని కలుపుకోవటానికి బజాజ్ జీఎక్స్ 1 మిక్సర్ గ్రౌండర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనితోపాటు అందించే మూడు రకాల జాడీలతో వివిధ పదార్థాలను గ్రౌండ్ చేసుకోవచ్చు. ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం. ఈ మిక్సర్ గ్రైండర్ వోల్టేజ్ పరిధిలో పనిచేస్తుంది. సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. ఫ్లిప్ కార్డులో రూ.1,899కు అందుబాటులో ఉంది.

అయ్యబాబోయ్.! దూసుకొస్తున్న తుఫాన్ గండం.. ఈ జిల్లాల్లో నాన్‌స్టాప్ వానలే వానలు

తీవ్ర తుఫాను ‘దానా’ వాయువ్య, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో గడిచిన 6 గంటల్లో.. గంటకు 12 కిమీ వేగంతో వాయువ్య దిశగా కదులుతూ.. ఈరోజు, అక్టోబర్ 24, ఉదయం 08.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో 18.9° ఉత్తర అక్షాంశం, 88.0° తూర్పు రేఖాంశం, దాదాపు పారాదీప్(ఒడిశా)కి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో, ధమరకి(ఒడిశా) దక్షిణ-ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్) దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

ఈ తీవ్ర తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య ఉన్న పూరీ, సాగర్ ద్వీపం మధ్య భితార్కనికా, ధమర(ఒడిశా) దగ్గరగా 24 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 25, 2024 ఉదయం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు గంటకు 100-110 కిలోమీటర్లు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర దిశగా గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
——————————–

ఈరోజు , రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
—————————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

——————–

రాయలసీమ:-
———–

ఈరోజు:-

రేపు, ఎల్లుండి:-

బెయిల్ వచ్చినా నిరాశే.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్స్

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ కు గురువారం (అక్టోబర్ 24) కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది.

తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం (అక్టోబర్ 25)న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు పుష్ప 2 నిర్మాతలు. కాగా ఈ ఘటన జరగక ముందే పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. అయితే అనూహ్యంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో పుష్ప 2లో ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గురువారం పుష్ప 2 నేషనల్ ప్రెస్ మీట్ జరిగింది. అదే సమయంలో జానీ మాస్టర్ కి కూడా బెయిల్ మంజూరు కావడంతో రిపోర్టర్లు ఈ అంశంపై పుష్ఫ 2 నిర్మాతలను ప్రశ్నించారు. జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారా అని మీడియా అడిగింది. దీనికి నిర్మాత సమాధానమిస్తూ.. ‘ మేం ఆల్రెడీ కొరియోగ్రాఫర్ ను మార్చేశాం. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాం. నవంబర్ 4 నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. అంటే పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం జానీ మాస్టర్ కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు.

కాగా గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక అమ్మాయి జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పాడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ మీద పోక్సో కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన 35 రోజుల తర్వాత జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది.

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెబుతుంటే.. మరోవైపు వీఆర్‌ఎస్‌పై సర్వే జరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది.

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదన ఉండగానే .. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్ పై యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయటం వివాదంగా మారింది. వీఆర్ఎస్‌ పేరుతో మరో పెద్దకుట్ర జరుగుతోందని కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. 2500 మందిని వీఆర్ఎస్‌ ద్వారా ఇంటికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇటు కార్మిక సంఘాలు సైతం వీఆర్ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. యాజమాన్యం వీఆర్ఎస్‌ స్కీమ్‌ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులందరూ వీఆర్ఎస్‌ స్కీమ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల పోరాట ఫలితంగా రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ తెరుస్తున్న సమయంలో ఈ చర్య ఉత్పత్తిని దెబ్బకొడుతుందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

గత మూడేళ్ల నుంచి ఉత్పత్తి తగ్గించారని.. రెండేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నష్టాలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జరగాల్సిన రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదని, పైగా వి.ఆర్‌.ఎస్‌.తో బలవంతంగా కార్మికులను బయటకు నెట్టే ప్రయత్నం చేయడం దారణమైన చర్య అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎస్ చర్యలను విరమింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు.

అయ్యో.. మీ ఫోన్‌ నీటిలో పడిపోయిందా? మరి ఎలా? నో టెన్షన్‌.. ఇలా చేయండి

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొన్ని సమయాల్లో ఫోన్‌ నీటిలతో పడుతుంటుంది. అలాగే వర్షంలో కూడా తడుస్తుంటుంది. సెల్ ఫోన్ వర్షంలో లేదా నీటిలో తడిస్తే వెంటనే ఏం చేయాలి?

వర్షంలో తడిసిన తర్వాత కూడా మన ఫోన్‌ని భద్రంగా ఉంచుకోవడం ఎలా..? వీటి గురించి తెలుసుకుందాం.

కొన్నిసార్లు మొబైల్‌ వర్షం వల్ల తడిసిపోతుంది లేదా నీటిలో పడిపోతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్‌గా మారాయి. ఫోన్‌లోకి వాటర్‌ పోయాయంటే అంతే సంగతి. వెంటనే రిపేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్ని సమయాల్లో ఫోన్‌ నీటిలో పడిపోవడం, వర్షంలో తడవడం వంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది.

చాలా మంది ఫోన్‌ను ఎండలో ఆరబెట్టి, ఛార్జింగ్ పెట్టడం లేదా స్టవ్ దగ్గర పెట్టి ఫోన్‌ను వేడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం వల్ల ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్, మైక్‌లో దుమ్ము ప్రవేశించి దెబ్బతినవచ్చు. ఇలాంటివి అస్సలు చేయకండి. వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల నీరు ఆవిరైపోతుంది. అయినప్పటికీ మదర్‌బోర్డు, ఇతర పార్ట్స్‌లోకి నీరు చేరి మరింత డ్యామెజ్‌ అవుతుంది. తడిసిన ఫోన్‌ నీరు ఆవిరి అయ్యేందుకు వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల స్క్రీన్ టచ్, స్పీకర్ బ్యాటరీ మొదలైనవి దెబ్బతింటాయి.

నీటిలో పడిన తర్వాత బ్యాటరీ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీని తర్వాత ఆ ఫోన్‌ను రిపేర్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ నీటిలో పడినా.. తడిసినా వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. ఎక్కువ నీరు ఉంటే ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. మొబైల్‌లో నీరు వెళ్లితే గూగుల్‌కి వెళ్లి, FIX MY SPEAKER పేజీని ఓపెన్‌ చేసి అక్కడ కనిపించే సింబల్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మీకు సౌండ్‌ అవస్తుంది. అది ఫోన్‌ను వైబ్రేట్ చేసి నీటిని బయటకు పంపుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్‌ కవర్‌ కేసు, కవర్లు, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ ఏదైనా ఉంటే వాటిని తీసివేయడం. ఈరోజు కొన్ని ఫోన్‌లలో తొలగించగల బ్యాటరీలు లేవు. ఒకవేళ మీ ఫోన్‌లో ఉంటే, వెంటనే బ్యాటరీ తీసివేయండి. ఇలా చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌ని తీసుకుని బ్యాటరీ కంపార్ట్‌మెంట్, స్క్రీన్, కనెక్టివిటీ పోర్ట్‌లు మొదలైన వాటితో సహా తేమ, నీరు ఉన్న చోట తుడిచివేయండి.

ఫోన్‌ నీటిలో పడితే బియ్యంలో పెట్టడం వల్ల తేమ ఆవిరైపోతుంది. సాధారణంగా ఉపయోగించే సాంకేతికత ఇది. ఎందుకంటే బియ్యానికి నీటి తేమను గ్రహించే గుణం ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. బియ్యం బ్యాగులో ఉంచడం వల్ల మీ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది.

ఫోన్‌లో తడి ఆరిపోవడానికికనీసం ఒక రోజు పడుతుంది. ఆపై దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నించండి. నష్టం తక్కువగా ఉంటే, ఫోన్‌ మళ్లీ పని చేస్తుంది. అయినప్పటికీ పని చేయకపోతే సర్వీస్‌ సెంటర్‌ తీసుకెళ్లడం ఉత్తమం. మీ ఫోన్ అలా పని చేయకపోతే, వెంటనే సమీపంలోని సెల్ ఫోన్ సర్వీస్ షాప్‌కు వెళ్లండి. అక్కడ మీ ఫోన్ పూర్తిగా విడదీసి నీరు లేకుండా శుభ్రం చేస్తారు. ఇది మీ మొబైల్ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ బ్యాక్ కవర్లను కొనుగోలు చేసి వాటిని మీ మొబైల్ ఫోన్‌లో పెట్టుకోవడం మంచిది.

లాభాల పంట.. మ్యాజిక్‌ చేసిన టాటా స్కీమ్‌.. రూ.10 వేలతో చేతికి 14 లక్షలు

మంచి ఆదాయం పొందేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. మంచి ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అదిరిపోయే లాభాలు పొందవచ్చు. చాలా మంది మంచి లాభాలు పొందేందుకు మ్యూచువల్ ఫండ్ల మీరు పెట్టుబడులు పెడుతుంటారా?

ఇందులో మంచి రాబడి ఇచ్చే పథకాలను ఎంచుకుంటే లక్షలాదికారి కావచ్చు. మరి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్ని ఎంచుకుంటారనేది చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్, లార్జ్ క్యాప్, కాంట్రా, ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇలా ఎన్నో రకాల ఫండ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇలా రకరకాల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ స్టాక్స్‌ నుంచి రిటర్న్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే దీర్ఘకాలంలో పెట్టుబడులపై మాత్రం మంచి రాబడి ఆశించవచ్చు.

ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేయడంతో.. లాంగ్ రన్‌లో మంచి రాబడి వస్తుంది. ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ ఫండ్లలో రాబడి గురించి ఇక్కడ గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లు మంచి లాభాలు పొందారు. గత ఐదేళ్లలో 5 స్మాల్ క్యాప్ స్కీమ్స్.. సంపదను 2.25 రెట్లకు పైగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్:

గత ఐదు సంవత్సరాల కాలంలో వార్షిక ప్రాతిపదికన 43.50 శాతం మేర రిటర్న్స్ అందించింది. నెలకు రూ.10 వేల చొప్పున సిప్ చేసిన వారికి.. 5 సంవత్సరాల్లో రూ.17 లక్షలు అందుకున్నారు. ఇక్కడ 2.83 రెట్ల మేర రిటర్న్స్ అందుకున్నారు. ఇక నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లాభాలు 2.53 రెట్ల వరకు పెరిగింది. వార్షికంగా చూస్తే 38.57 శాతం రిటర్న్స్ అందాయి. దీంతో నెలకు రూ. 10 వేలు పెడితే.. ఐదేళ్లకు అది రూ. 15.20 లక్షలు.

టాటా స్కీమ్‌:

ఇందులో భాగంగా టాటా స్కీమ్ కూడా ఒకటి ఉంది. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరానికి సగటున 35.66 శాతం మేర లాభాలు ఇచ్చింది. దీనిలో ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టిన వారికి ఐదు సంవత్సరాలలో రూ.14.21 లక్షల రాబడి పొందారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ పేర్కొన్న కాలంలో SIP పెట్టుబడులను 2.33 రెట్లతో 34.90 శాతం XIRR(Extended Internal Rate of Return)తో రూ.13.97 లక్షలకు చేరుకుంది.

టాటా స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ అదే SIP పెట్టుబడులను వరుసగా 2.37 రెట్లు, 2.36 రెట్లు పెంచాయి. పథకాలు వరుసగా 35.66 శాతం, 35.42 శాతం అందించాయి.

ఇవి ఏం చేస్తాయిలే అనుకునేరు.. పవర్‌ఫుల్ ఔషధం లాంటివి

ఎన్నో సమస్యలు.. మరెన్నో రోగాలు.. ఇలా ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది.. అందుకే.. మంచి జీవనశైలితోపాటు.. ఆరోగ్యకరమైన డైట్‌ను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో మెంతులు, మెంతికూర ఒకటి.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతి గింజలు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.. సుగంధ ద్రవ్యాలైన మెంతి గింజలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.. ఇది మన ఆరోగ్యంపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మెంతి గింజలు కొంచెం చేదుగా ఉన్నప్పటికీ.. సువాసన, రుచి పరంగా సాటిలేనివి.. అంతేకాకుండా లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు, మెంతి కూరలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పీచు, ప్రొటీన్, పిండి పదార్థాలు, కొవ్వు, ఐరన్ వంటి పోషకాలకు ఇది మంచి మూలం. అందుకే.. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెంతి గింజల ప్రయోజనాలు..

డయాబెటిస్ నిర్వహణ: మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ స్రావానికి సహాయపడే మోమోర్డిసిన్ అనే ప్రత్యేకమైన క్రియాశీల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది.
బరువు తగ్గుతుంది: మెంతి గింజలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి.. తద్వారా మనం ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: మెంతులు యాంటీఆక్సిడెంట్లు – ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మెంతి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. తద్వారా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
బ్లడ్ ప్రెజర్ కంట్రోల్: మెంతి గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.. కాబట్టి అధిక బిపి ఉన్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి.
జుట్టుకు బలం: మెంతులు పేస్ట్‌ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల వెంట్రుకలు బలపడతాయి.. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
రొమ్ము క్యాన్సర్ ను నివారిస్తాయి: రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మహిళలు తప్పనిసరిగా మెంతి గింజలను తినాలి.. ఎందుకంటే వాటిలో ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి.. ఇవి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మానికి మేలు: మెంతి గింజల పేస్ట్ చర్మానికి మేలు చేస్తుంది.. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. మచ్చలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

సామాన్యులకు ప్రభుత్వం దీపావళి కానుక.. చౌక ధరల్లో బియ్యం, పప్పులు

పప్పుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం సబ్సిడీలో పప్పులను అందించే కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.

దీంతో వినియోగదారులకు సహకార రిటైల్ నెట్‌వర్క్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ పప్పు రకాలైన శనగ, కంది, పెసర, కంది, ఎర్ర పప్పులను తగ్గింపు ధరలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు బియ్యం, పిండిని కూడా తక్కువ ధరల్లో విక్రయించనుంది.

పప్పు దినుసులలో ధర స్థిరత్వాన్ని కొనసాగించడానికి బఫర్ నుండి ఆఫ్‌లోడ్ చేస్తున్నామని దీపావళి పండగకు భారత్ దాల్ ఫేస్‌- II ప్రాజెక్టును ప్రారంభించినట్లు జోషి చెప్పారు. ప్రభుత్వం రిటైల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపిణీ చేయడానికి 0.3 మిలియన్ టన్నుల (MT) శనగలు, పెసర 68,000 టన్నుల కేటాయించింది.

శనగ ఇప్పుడు కిలో 58, శనగ స్ప్లిట్ రూ.70 ఉంది. అలాగే ఎర్రపప్పు రూ.89 ఉంది. ఇది నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ వంటి సహకార సంస్థల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ధరలు మార్కెట్ ధరల కంటే కనీసం 20% నుండి 25% వరకు తక్కువగా ఉన్నాయి.

బఫర్ స్టాక్‌ను విడుదల చేయడం ద్వారా తక్కువ ధరకు అందుకోవచ్చు. భారత్ దాల్ విక్రయాలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత పండుగ సీజన్‌లో వినియోగదారులకు సరఫరాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ వంటి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి గత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాన్ని పంపిణీ చేశాయని, కంది, మినుము, పెసర వంటి పప్పు దినుసులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేయడానికి హామీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ సంవత్సరం ఖరీఫ్ పప్పుల మెరుగైన ప్రాంతాల్లో సాగు జరిగిందని, జూలై, 2024 నుండి చాలా పప్పుల ధరలలో తగ్గుదల ధోరణికి దారితీసిందన్నారు. దీంతో పప్పుల ధరలు తగ్గాయన్నారు. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 113% నుండి సెప్టెంబర్‌లో 9.8% పెరిగింది. ఖరీఫ్ పంటలు, దిగుమతులు బలంగా ఉండే అవకాశాల కారణంగా ధరలు తగ్గాయి.

గత ఏడాది అక్టోబర్‌లో భారత్ బ్రాండ్ కింద గోధుమలు, బియ్యం, పప్పు వంటి నిత్యావసర వస్తువుల అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది జూన్ వరకు కొనసాగింది. అదనంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉల్లిపాయలకు రూ.35కేజీకి, టమోటాలకు కిలో రూ. 65 ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. సహకార సంఘాలు, ఇతర ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు నేరుగా పంపిణీ చేస్తోందన్నారు.

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే

పండుగల సీజన్ సమీపిస్తున్న కొద్దీ, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుంది. భారీ-స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కొనుగోలుదారుల-స్నేహపూర్వక ప్రోత్సాహకాలు, ప్రీమియం ప్రాపర్టీలు పెరుగుతున్నా నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పరుగులు పెరుగుతుంది.

ఇది గృహనిర్మాణ రంగాన్ని మార్చడమే కాకుండా ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, గృహాలంకరణ వంటి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలలో వృద్ధిని కూడా పెంచుతుంది.

విలాసవంతమైన నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో, పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, పెరిగిన గృహ కొనుగోలు కార్యకలాపాలలో మార్కెట్ పండుగ బూస్ట్ వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా మ్యాజిక్‌బ్రిక్స్ ఫైనాన్స్ హెడ్ హితేష్ ఉప్పల్ మాట్లాడుతూ, “భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన పరివర్తనకు లోనవుతోంది, విస్తృతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెరుగుతుండడంతో కొనుగోలుదారుల ఆసక్తి చూపుతున్నారు. గృహ కొనుగోలు కార్యకలాపాలు పెరిగాయి, గత ఏడాదితో పోలిస్తే ప్రాపర్టీ ధరలు 20 శాతం పెరిగాయి. ప్రీమియం మరియు నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.” అని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంపైన షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ (SPRE) చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ పి రాజేంద్రన్ స్పందించారు. “పండుగలు సమీపిస్తున్నందున, రియల్ ఎస్టేట్ మార్కెట్ సాంప్రదాయకంగా కార్యకలాపాలు పెరుగుతోంది, చాలా మంది కొనుగోలుదారులు ఈ శుభ సమయంలో కొత్త ఇళ్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. .” అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ ప్రస్తుతం వింటర్ సీజన్ ప్రారంభమైంది.

ఈ సమయంలో రోగాలు ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. వచ్చినా వాటితో పోరాడే శక్తి ఉండాలి. దీని వల్ల ఎక్కువగా బాడీ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? ఇమ్యునిటీ వ్యవస్థను బల పరిచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయలు:

నిమ్మ రసం, నిమ్మకాయ పచ్చడి వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తాయి. త్వరగా ఎలాంటి సమస్యలు ఎటాక్ కాకుండా ఉంటాయి.

బాదం:

ప్రతి రోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. బాదం పప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండండి.

పెరుగు – పాలు:

పెరుగు, పాలు తీసుకోవడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పెరుగులో ముఖ్యంగా యాంటీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, చెడు బ్యాక్టిరియాను బయటకు పంపిస్తాయి. పాలు తాగడం వల్ల నీరసం, అలసట అనేది తగ్గి.. తక్షణమే శక్తి వస్తుంది.

పసుపు:

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మందికి తెలిసిన విషయమే. పసుపు తరచూ మీ వంటల్లో ఉపయోగించడం వల్ల.. శరీరం త్వరగా ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉంటుంది.

తేనె:

పోషకాలు నిండిన పదార్థాల్లో తేనె కూడా ఒకటి. తేనె తరచూ ఒక స్పూన్ తీసుకున్నా.. రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఉత్సాహంగా ఉంటారు.

పండ్లు – కూరగాయలు:

తరచూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. దీంత త్వరగా జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

సీబీఎస్సీ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల హెడ్యూల్‌ విడుదల.. పూర్తి టైం టేబుల్ ఇదే

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి.

ఈ మేరకు సీబీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తరగతులకు సంబంధించిన CBSE ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఏడాది (2025) జనవరిలో ప్రారంభం కానున్నాయి. ఇక CBSE 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన థియరీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

పదో తరగతి, 11వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి 1 నుంచి, థియరీ పరీక్షలు 2025, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటనలో వెలువరించింది. ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి మార్కులను అప్‌లోడ్ చేసేటప్పుడు పాఠశాలలు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాయని, ఈ సారి ఈ విధమైన తప్పులు చోటు చేసుకోకుండా.. ఆయా పాఠశాలలకు ప్రాక్టికల్/ప్రాజెక్ట్/అంతర్గత మూల్యాంకనం, థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో సహాయపడటానికి సబ్జెక్టుల జాబితా సమాచారం వివరాలను కూడా సర్క్యులర్‌కు జతచేసినట్లు బోర్డు వెల్లడించింది.

సీబీఎస్సీ బోర్డు పరీక్షల మార్కుల నమోదు జాబితా..

తరగతి
సబ్జెక్ట్ కోడ్
విషయం పేరు
థియరీ పరీక్షలో గరిష్ట మార్కులు
ప్రాక్టికల్ పరీక్షలో గరిష్ట మార్కులు
గరిష్ట మార్కుల ప్రాజెక్ట్ అంచనా
గరిష్ట మార్కుల అంతర్గత మూల్యాంకనం (|A)
ప్రాక్టికల్/ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ కోసం ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌ని నియమిస్తారా?
బోర్డు ద్వారా ఆచరణాత్మక సమాధానపుస్తకం అందించబడుతుందా
థియరీ పరీక్షలలో ఉపయోగించే జవాబు పుస్తకం రకం

ఈ జాబితాలో ఇచ్చిన వివరాల ప్రకారం థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్, IA భాగాల మధ్య మార్కుల పంపిణీతో ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. CBSE వింటర్-బౌండ్ పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 మధ్య జరుగుతాయి. ఈ పాఠశాలల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లను నిర్వహించడానికి బోర్డు SOPలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

పళ్లు ఎంత గారబట్టి నల్లగా మారినా ఈ టిప్స్‌తో ముత్యంలా మెరవాల్సిందే

శరీర అందంపై పెట్టిన శ్రద్ధ చాలా మంది ఆరోగ్యంపై కూడా పెట్టరు. పై మెరిసే చర్మం ఎంత ముఖ్యమో.. లోపలి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇలా చాలా మంది పళ్లను కూడా పట్టించుకోరు.

అవి పాడైపోయి.. గారబట్టి నల్లగా మారితే తప్ప.. వీటి కోసం జాగ్రత్తలు తీసుకోరు.

దంతాలు నల్లగా, పసుపు రంగులోకి మారడానికి చాలా కారణాలు ఉంటాయి. సరిగా బ్రష్ చేయకపోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తినడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం, మధ్య పానం, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

దంతాలు పసుపు రంగులోకి మారడం, గారబట్టి నల్లగా ఉన్నప్పుడు.. నలుగురిలో తిరగాలన్నా.. మాట్లాడాలన్నా.. నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సమస్యను మన ఇంట్లో ఉండే వాటితోనే పరిష్కరించుకోవచ్చు.

అందరి ఇళ్లలో కూడా వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఈ వెల్లుల్లికి ఉండే పొట్టు దీసేసి.. వీటిని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర చెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు కూడా కలపండి. ఇప్పుడు పేస్ట్ రెడీ అవుతుంది.

ఈ పేస్టుతో ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బ్రెష్ చేయండి. ఇలా కొద్ది రోజుల్లోనే పళ్లపై ఉండే గార, పసుపు రంగు పోతుంది. పళ్లు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా, దుర్వాసన కూడా పోతుంది. ఇతర నోటి సమస్యలు కూడా తగ్గుతాయి.

రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే

పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.

కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. తనదైన నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగులో టాప్ నటుల్లో ఒకరిగా ఎదిగారు. ల్లో నటించడమే కాకుండా, రామ్ చరణ్ మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ రూ.7.50 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌లో ఇంత భారీ లగ్జరీ కారు మరెవరికీ లేదు. ఇంతకీ ఈ కారు ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

రామ్ చరణ్ కొనుగోలు చేసిన కారు రోల్స్ రాయిస్. ఇప్పటికే చాలా మంది నటుల సొంతం చేసుకున్న కారు ఇది. ఇది చాలా ఖరీదైనది.. అలాగే వినూత్నమైన సాంకేతికతలు.. భద్రతా ఫీచర్స్ కలిగి ఉన్నది. రామ్ చరణ్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారును కొనుగోలు చేసాడు, ఈ కారు ధర 7.50 కోట్ల రూపాయలు. రోల్స్ రాయిస్ ఇతర కార్ల కంటే స్పెక్టర్ కారు డిజైన్, టెక్నాలజీలో చాలా మార్పులు కలిగి ఉంటుంది. ఈ కారులో రెండు డోర్లు, నలుగురు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ కారు లోపలి భాగాన్ని అత్యుత్తమ నాణ్యత కలిగిన కార్బన్ ఫైబర్, నాణ్యమైన లెదర్ ఉపయోగించి రూపొందించారు. ఇది ప్రయాణీకులకు పూర్తి భద్రతను అందిస్తుంది. అందుకే ఈ కారు ధర చాలా ఎక్కువ.

ఇప్పటికే చరణ్ గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు.. ప్రైవేట్ జెట్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ పరిశ్రమలో రామ్ చరణ్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రామ్ చరణ్ నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు.

దివ్యౌషధం.. రోజూ తింటే డయాబెటిస్‌ దెబ్బకు రోగం పరార్

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం ఉత్తమం..

ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వ్యాధులకు దివ్యౌషధం మారేడు ఆకు (బిల్వపత్రం).. దీనిని పూజలో ఉపయోగిస్తారు.. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. మధుమేహం – కొలెస్ట్రాల్ తగ్గించడానికి దీనిని తినవచ్చు. బిల్వపత్రాన్ని డైలీ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయి.

బిల్వపత్రంను మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శరీర దుర్వాసనను, డయాబెటిస్ ను తగ్గిస్తుంది. అందుకే.. అనేక ఔషధాల తయారీలో మారేడును ఉపయోగిస్తారు.

పూజలో ఉపయోగించే బిల్వపత్రంను తీసుకోవడం వల్ల మధుమేహం కొలెస్ట్రాల్‌ని నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బిల్వపత్రం వల్ల కలిగే లాభాలు – దానిని సరైన పద్ధతిలో తీసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకోండి..

మధుమేహంలో మేలు చేస్తుంది..

మధుమేహంలో బిల్వపత్రం చాలా మేలు చేస్తుంది. బిల్వపత్రం (మారేడు) కషాయాలను తాగడం ద్వారా లేదా నమలడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గుండె సమస్యలు..

ఈరోజుల్లో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారికి బిల్వపత్రం చాలా మంచిది.. మారేడు తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

చర్మ సమస్యలు దూరం..

మారేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది.. వాస్తవానికి మారేడు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇవి చర్మ సమస్యలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.. మారేడు తీసుకోవడం వల్ల చర్మం మంట తగ్గుతుంది – ఇంకా మొటిమలను నయం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఏపీ ‘టెట్‌’ ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో ఘోర తప్పిదం.. వారికి 30 మార్కులు హుష్?

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది.

అయితే టెట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (2ఏ) ఇంగ్లిష్‌ సబ్జెక్టులో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. ఈ పేపర్ రెండో సెక్షన్‌లో మాతృ భాషగా తెలుగు సబ్జెక్టు రాయాల్సి ఉండగా, చాలామందికి ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ రావడం వివాదంగా మారింది. నిజానికి, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఎస్‌ఏ వారికి దరఖాస్తు సమయంలోనే మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఎస్‌ఏ ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు టెట్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాజీ, మాతృభాష, జనరల్‌ ఆంగ్లం, సబ్జెక్టు కంటెంట్‌-మెథడాలజీ ఉంటాయి. రెండో సెక్షన్‌లో సాధారణంగా మాతృభాషగా తెలుగు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కానీ చాలా మంది మళ్లీ ఆ విభాగంలో తెలుగుకు బదులుగా మళ్లీ ఇంగ్లిష్‌నే ఎంపిక చేసుకున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన టెట్‌ ప్రకారం మాతృభాషను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. కొందరు తెలుగు ఎంపిక చేసుకోవడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్లం ఎంపిక చేసుకోవడంతో మార్కుల్లో వ్యత్యాసం వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌ రాసే వారిలో తమిళ్, కన్నడ, ఒడియావారు కూడా ఉన్నారు. దీంతో మాతృభాషగా అన్ని సబ్జెక్టులూ వచ్చేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసే సమయంలో రెండో సెక్షన్‌ మాతృభాషకు సంబంధించి ఎవరికి వారు ఆయా భాషలను ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాయాల్సిన వారు తెలుగుకు బదులు మళ్లీ ఆంగ్లాన్నే ఎంచుకోవడంతో సమస్య తలెత్తింది. నిజానికి, టెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుప్పటికీ ఆంగ్ల సబ్జెక్టే వచ్చింది. దీనిపై అప్పట్లో అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా ఇలా జరిగిందనీ, పరీక్ష సమయంలో మార్పు చేస్తామని పేర్కొన్నారు. కానీ, తాజాగా జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలో మాత్రం అభ్యర్థుల మాతృభాషగా తెలుగుకు బదులు ఇంగ్లిష్‌ ఓపెన్‌ అయ్యింది. దీంతో అభ్యర్థులు తెలుగు పరీక్ష రాయలేదు.

టెట్‌ నిబంధనల ప్రకారం నాలుగు విభాగాలకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి. సబ్జెక్టు కంటెంట్‌-పెడగాజీకి 90మార్కులు మిగతా మూడు సెక్షన్లకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇప్పుడు మాతృభాష సబ్జెక్టు ఎంపికలో జరిగిన మార్పు కారణంగా 30 మార్కుల్లో తేడాలు వస్తే తమకు ర్యాంకులు మారిపోతాయని అభ్యర్థులు వాపోతున్నారు.

నిద్ర సమయంలో వెన్నునొప్పి ఉందా.? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

అధిక ప్రొటీన్లు: ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరగడం మొదలవుతుంది. కాల్షియం టాయిలెట్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల, పరిమిత పరిమాణంలో ప్రోటీన్ తినండి, అధిక ప్రోటీన్ ఎముకలను దెబ్బతీస్తుంది.

కార్బొనేటెడ్ డ్రింక్స్: దీర్ఘకాలంలో ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే శీతల పానీయాలు, షాంపైన్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం చాలా తక్కువగా ఉండాలి. ఈ రకమైన పానీయంలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంను తగ్గించడం ద్వారా ఎముకలను బలహీనం చేస్తుంది.

గ్యాస్‌కు సంబంధించిన మందులు: అసిడిటీ మందుల వాడకాన్ని తగ్గించండి. ఇది కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం శరీరానికి కష్టతరం చేస్తుంది.

కెఫిన్ తీసుకోవడం: ఎముకలు దృఢంగా ఉండటానికి కెఫిన్‌ను నివారించండి. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలపై ప్రభావం చూపుతుంది. అలాంటి వారికి కాల్షియం కూడా ఎక్కువగా అవసరం.

విటమిన్ డి లోపం: ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి ఎముకలకు కాల్షియం రవాణా చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, విటమిన్ డి అధికంగా ఉండే వాటిని కూడా తినండి.

పోషక లోపాలు: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్,టెస్టోస్టెరాన్ అవసరం. పెరుగుతున్న వయస్సుతో శరీరానికి అవసరమైన హార్మోన్లు, పోషకాలపై శ్రద్ధ వహించండి.

టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. భారీ మార్పులు

జూలై నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచాయి. అప్పటి నుండి దేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ పుంజుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లలో నిరంతర పెరుగుదల ఉంది.

ఇప్పుడు సరికొత్త మార్పులు చేయబోతోంది ప్రభుత్వం. రానున్న నెలల్లో టారిఫ్‌లను పెంచబోమని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. మరోవైపు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాదిలో 5G టెక్నాలజీ రానుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ మార్పు టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కష్టాల్లో పడనున్నాయి. మార్పు గురించి టెలికాం మంత్రి ఏం చెప్పారో చూద్దాం.

పెరుగుతున్న కస్టమర్లు:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత రెండేళ్లలో లాభాలను నమోదు చేసిన తర్వాత మార్పుల తీసుకువస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గత త్రైమాసికంలో కంపెనీ ప్రతి నెలా కస్టమర్లను చేర్చుకుంది. అలాగే దాని కస్టమర్ల సంఖ్య 50-60 లక్షలు పెరిగింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, మారుమూల గ్రామాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ సేవలను అందిస్తోందని, నెట్‌వర్క్‌ను అధునాతనంగా మార్చడం ద్వారా దాని సేవను మెరుగుపరుస్తోందని అన్నారు.

యూజర్ల కోసం నేషనల్‌ వైఫై రోమింగ్‌ సర్వీలను ప్రారంభించింది. ఎనీ టైమ్ సిమ్ (ATS) కియోస్క్‌లతో కొత్త BSNL SIM కార్డ్‌లను కొనుగోలు చేయడం కూడా సులభతరం చేస్తోంది. యూజర్లు అదనపు ఛార్జీలు లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ హాట్‌స్పాట్స్‌లలో హైస్పీడ్‌ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. మైనింగ్‌ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్‌ ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు సీ-డీఏసీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగోలో కూడా మార్పులు చేసింది. లోగోను సరికొత్తగా రంగుల్లో సృష్టిచింది. 4జీ,5జీ నెట్‌వర్క్‌కు త్వరగా తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తోంది. 4జీ నెట్‌వర్క్‌ ఈ ఏడాది చివరి వరకు పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, 5జీ వచ్చే ఏడాది మార్చి వరకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

89 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ:

గత ఏడాది జూన్‌లో నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్‌ఎల్‌ 4G, 5G నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు రూ.89,047 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గత 12 సంవత్సరాలుగా నష్టాలను చవిచూస్తోంది. ఆర్థిక స్థితి పరంగా చూస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ గత రెండేళ్లలో పన్నుకు ముందు ఆదాయాలు (EBITDA- Earnings before interest, taxes, deprecia) సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అంటే EBITDA పరంగా మనకు నష్టం లేదు. కంపెనీ ఎప్పుడు లాభదాయకంగా మారుతుందో మంత్రి చెప్పలేదు. నేటికీ టెలికాం సేవల పరంగా మన దేశంలోని చిట్టచివరి గ్రామాలకు సేవలందిస్తున్నది బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమేనని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కి చాలా పేరు ఉందని నేను నమ్ముతున్నాను.. దానికి ఊపందుకోవాల్సిన అవసరం ఉందని సింధియా చెప్పారు.

Health

సినిమా